తెలంగాణ మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబంపై మంత్రి చేసిన వ్యాఖ్యలు తీవ్ర మనోవేదనకు గురి చేశాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు మంత్రికి నోటీసులు జారీ చేసింది. ఈనెల 12న వ్యక్తిగతంగా హాజరవ్వాలని నోటీసుల్లో పేర్కొంది.
అయితే ఇవాళ విచారణకు మంత్రి కొండా సురేఖ హాజరు కాలేదు. పలు కార్యక్రమాల కారణంగా విచారణకు హాజరు కాలేకపోతున్నట్లు ఆమె తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత గడువు కావాలని న్యాయమూర్తిని కోరారు. దీంతో న్యాయస్థానం ఈ నెల 19కి విచారణను వాయిదా వేసింది.
అసలేంటి వివాదం..
గతంలో మంత్రి కొండా సురేఖ నాగార్జున ఫ్యామిలీని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మాజీ మంత్రి కేటీఆర్‌ను విమర్శించే క్రమంలో నాగార్జున ఫ్యామిలీపై కామెంట్స్ చేసింది. దీంతో తమ పరువుకు భంగం కలిగేలా మంత్రి మాట్లాడారని నాగార్జున కోర్టును ఆశ్రయించారు. ఆయన పరువు నష్టం కేసు దాఖలు చేయగా.. న్యాయస్థానం విచారణకు అనుమతించింది.
Comments
Please login to add a commentAdd a comment