
బెట్టింగ్ యాప్ కేసు టాలీవుడ్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఇలాంటి యాప్‌లను కొందరు టాలీవుడ్ బుల్లితెర నటులతో పాటు పలువురు అగ్ర సినీతారల పేర్లు రావడంతో తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో పంజాగుట్ట పోలీసులు ముందు యాంకర్ విష్ణుప్రియ, రీతూ చౌదరి హాజరైన తమ స్టేట్‌మెంట్ ఇచ్చారు. యాప్‌లను ప్రమోట్ చేసినట్లు విచారణలో అంగీకరించారు.
అయితే ఈ బెట్టింగ్ యాప్‌ల వలలో చిక్కుకుని అప్పులపాలైన వారు చాలామందే ఉన్నారు. అలా ఈ బెట్టింగ్ భూతానికి బలైన ఓ సామాన్యుడు పంజాగుట్ట పీఎస్‌కు వచ్చారు. తనకు న్యాయం చేయాలంటూ హైదరాబాద్‌కు వచ్చిన వ్యక్తిని మీడియా ప్రశ్నించింది. తాను ఈ యాప్‌ను ఉపయోగించడానికి కారణం ఆ టాలీవుడ్ షోనే కారణమని బాధితుడు చెప్పారు.
టాలీవుడ్ హీరో బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న షో వల్లే తాను బెట్టింగ్ యాప్‌ను ఉపయోగించానని నెల్లూరు చెందిన రాంబాబు వాపోయారు. బాలయ్య షోకు అతిథులుగా వచ్చిన గోపీచంద్, ప్రభాస్‌కు బాలకృష్ణ కొన్ని బహుమతులిస్తారు.. ఈ గేమ్ ఆడండి.. గిఫ్ట్‌లు గెలుచుకోండి అని చూపించారని అన్నారు. నేను మొదటి నుంచి ప్రభాస్ అన్నకు ఫ్యాన్ అని.. అందువల్లే తాను కూడా ఆ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలిపాడు. ఆ తర్వాత ట్రాప్‌లో పడి దాదాపు రూ.80 లక్షలు కోల్పోయినట్లు సదరు వ్యక్తి వివరించాడు. ఆ యాప్ వాళ్లు మోసం చేయడం వల్లే తాను అప్పుల పాలైనట్లు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల భారంతో ఎనిమిది నెలలుగా ఇంటికి దూరంగా ఉంటున్నట్లు బాధితుడు రాంబాబు చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment