సక్సెస్ ఒక్కరోజులో రాదు. ఎన్నో కష్టనష్టాలకోర్చిన తర్వాతే విజయం చేతికి అందుతుంది. బాలీవుడ్ నటుడు అభయ్ వర్మ విషయంలోనూ ఇదే నిజమైంది. ముంజ్య సినిమాతో ఇప్పుడితడు బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్‌గా నిలిచాడు. తాజాగా అతడు కెరీర్ తొలినాళ్లలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని చెప్పుకొచ్చాడు.
సంబంధం లేకుండా మాట్లాడారు
అవకాశాల కోసం ఎదురుచూస్తున్నరోజుల్లో జరిగిందీ ఘటన.. ముంబై నుంచి పిలుపు రాగానే ఎగిరి గంతేశాను. తీరా అక్కడికి వెళ్లాక నా టాలెంట్ గురించి కాకుండా ఇంకేదేదో మాట్లాడారు. నా ప్రతిభను చూపించుకునే అవకాశం ఇవ్వలేదు. వాళ్లింకేదో ఆశించారు. నా విలువలను నాశనం చేసుకోలేక నో చెప్పాను. తొలి మీటింగ్‌లోనే చేదు అనుభవం ఎదురవడంతో నిరాశచెందాను. ముంబై వదిలేసి నా స్వస్థలమైన పానిపట్(హర్యానా)కు తిరిగి వచ్చేశాను. కానీ నటుడవ్వాలన్న కోరికను అణుచుకోలేకపోయాను.
మళ్లీ అడుగుపెట్టా..
ఎవరికోసమో భయపడి నేనెందుకు వెనకడుగు వేయాలనుకున్నాను. మరింత క్లారిటీతో మళ్లీ ముంబైలో అడుగుపెట్టాను. ఆడిషన్స్ ఇస్తూ పోయాను. అలా నటుడిగా నా కెరీర్ మొదలైంది అని ఎప్పుకొచ్చాడు. కాగా అభయ్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన ముంజ్య మూవీ జూన్ 7న విడుదలైంది. ఆదిత్య సర్పోట్‌దర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లపైనే రాబట్టింది. ఇకపోతే అభయ్ ప్రస్తుతం కింగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment