casting couch
-
ఆ డైరెక్టర్ వల్ల బతకొద్దనుకున్నా.. సింగపూర్‌లో 13 ఏళ్లు టీచర్‌గా..: హిట్లర్ నటి
మలయాళ డైరెక్టర్ తనను ఇబ్బందిపెట్టాడంటోంది నటి అశ్విని నంబియార్ (Ashwini Nambiar). సినిమా గురించి మాట్లాడాలని పిలిపించి దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్నాడని చెప్తోంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆయన ఒక పెద్ద డైరెక్టర్. ఒకరోజు సినిమా గురించి ఏదో మాట్లాడాలని ఆఫీసుకు రమ్మన్నాడు. నిజానికి నేనెక్కడికి వెళ్లినా అమ్మ నా వెంటవచ్చేది. ఆమె తోడుంటే వెయ్యి ఏనుగుల బలం ఉండేది. ఆ రోజు తనకు ఆరోగ్యం బాగోలేదు. హెయిర్ డ్రెస్సర్‌గా పనిచేసే మహిళను తోడు తీసుకెళ్లమంది. అప్పుడు నేనింకా టీనేజర్‌ను.సినిమా గురించి రమ్మని చెప్పి..అతడి ఇల్లు, ఆఫీస్ అంతా ఒకేచోట ఉంటాయి. నాతోవచ్చిన మహిళ కిందే ఆగిపోయింది. నేను ఆడుతూ పాడుతూ పైగదిలోకి వెళ్లాను. అక్కడెవరూ కనిపించలేదు. ఇంతలో బెడ్రూమ్లో నుంచి ఇటురా.. అన్న పిలుపు వినిపించింది. ఆ డైరెక్టర్ (Malayalam Director)తో అంతకుముందు ఓ మలయాళ సినిమా చేశాను. ఆ చనువుతో దగ్గరకు వెళ్లాను. కూతురి వయసున్న నన్ను అసభ్యంగా తాకాడు. అక్కడి నుంచి బయటకు వచ్చేశాక నా పెదాలపై నవ్వు మాయమైంది. సరదాగా ఉండే నేను మూగబోయాను. నేనేమైనా తప్పు చేశానా? ఆయనకు నేనే అవకాశం ఇచ్చానా? అని రకరకాలుగా ఆలోచించాను. అమ్మ ఏడుపు చూసి..నా ముఖం చూడగానే ఏమైందని అమ్మ ఆరా తీసింది. జరిగిందంతా చెప్పడంతో తాను రాకపోవడం వల్లే ఇలా జరిగిందని ఏడ్చేసింది. నా వల్ల అమ్మ బాధపడటం చూసి తట్టుకోలేకపోయాను. ఏంచేయాలో తెలియక ఆ రోజు రాత్రి నిద్రమాత్రలు మింగాను. వెంటనే నన్ను ఆస్పత్రికి తీసుకెళ్లి కాపాడారు. అప్పుడు మా అమ్మ.. జరిగినదాంట్లో నా తప్పు లేదని అర్థమయ్యేలా చెప్పింది. నేను లేకపోతే తను బతకలేనని బాధపడింది. ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి పని చేయొద్దని ప్రాధేయపడింది. ఆ డైరెక్టర్‌కు నా తండ్రి వయసుంటుంది. (చదవండి: మహేశ్ వల్లే సినిమాలకు దూరమైన నమ్రత.. రిలేషన్లో ఉన్నప్పుడు)రీఎంట్రీ..అమ్మ మాటలతో ధైర్యం తెచ్చుకున్నాను. తిరిగి షూటింగ్లో అడుగుపెట్టాను. కొన్నిసార్లు అమ్మ లేకపోయినా సెట్‌కు వెళ్లేదాన్ని. దేన్నైనా ఎదుర్కోగలను అన్న ధైర్యంతోనే ముందడుగు వేశాను అని చెప్పుకొచ్చింది. 18 ఏళ్లపాటు వెండితెరకు దూరంగా ఉన్న అశ్విని ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ సుడల్ 2తో రీఎంట్రీ ఇచ్చింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. పెళ్లవగానే యాక్టింగ్ మానేస్తానని ఎక్కడా చెప్పలేదు. ఎప్పటికైనా మళ్లీ సినిమాల్లోకి వస్తానన్న నమ్మకం నాకుంది. ప్రస్తుతం నా కూతురు కాలేజీలో చదువుతోంది. ఇదే సరైన సమయం అనిపించింది. ఇదే సరైన ఛాన్స్ అని..షూటింగ్స్ కోసం సింగపూర్ నుంచి పదేపదే చెన్నై రావడం అంత ఈజీ కాదు. సింగపూర్‌లో ఉండగా నేను మాస్టర్స్ పూర్తి చేశాను. కాలేజీలో 13 ఏళ్లపాటు టీచర్‌గా పని చేశాను. ప్రోగ్రామ్స్ చేసేదాన్ని. గతేడాది నా కూతురు కాలేజీలో జాయిన్ అయింది. ఇదే సరైన సమయం అనుకున్నాను. సరిగ్గా అప్పుడే సుడల్ 2 సిరీస్ నుంచి పిలుపొచ్చింది. ఈ సిరీస్ రచయితలు పుష్కర్- గాయత్రితో అంతకుముందు పనిచేసిన అనుభవం ఉండటంతో సులువుగా ఒప్పేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. అశ్విని మొదట సీరియల్స్‌లో నటించింది. హిట్లర్ మూవీలో చిరంజీవి చెల్లెలిగా కనిపించింది. ఆంటీ, పెళ్లి చేసుకుందాం, పోలీస్ చిత్రాలతో తెలుగువారిని పలకరించింది. మలయాళ, తమిళ భాషల్లోనూ సినిమాలు చేసింది. -
సినిమా కోసం కాదు.. రూమ్‌కు రమ్మని పిలుస్తారు: సనం శెట్టి
'మమ్మల్ని పిలుస్తోంది సినిమాలో నటించేందుకు కాదు.. వారితో కలిసి రాత్రంతా రూమ్‌లో ఉండేందుకు!' అంటూ ఆగ్రహం, అసహనం ఒకేసారి వ్యక్తం చేసింది నటి సనం శెట్టి (Sanam Shetty). సమానత్వం అంటే ఇదా? అని ప్రశ్నించింది. కూల్ సురేశ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ప్రారంభోత్సవానికి సనం శెట్టి హాజరైంది. ఈ సందర్భంగా ఆమె.. వెట్రిమారన్ డైరెక్ట్ చేసిన బ్యాడ్ గర్ల్ సినిమా టీజర్‌పై విమర్శలు గుప్పించింది.అది సమానత్వమా?సనం శెట్టి మాట్లాడుతూ.. బ్యాడ్‌గర్ల్ టీజర్ బోల్డ్ ఎగ్జాంపుల్ కాదు.. అదొక చెత్త ఉదాహరణ. స్వేచ్ఛ, లింగసమానత్వం అనే అంశాలను చాలా తప్పుగా చూపించారు. అబ్బాయిలతో పోటీపడి సిగరెట్ తాగడం, మందు తాగడం సమానత్వం కాదు. సమానత్వం అంటే అన్నింట్లోనూ మాకు సమాన అవకాశాలివ్వాలి, సమాన గౌరవం దక్కాలి. హీరోను సంప్రదించే విధానం, హీరోయిన్ను సంప్రదించే విధానం ఒకేలా ఉందా? లేదు. నన్నే తీసుకోండి. సినిమాలో నటించమని పిలవడానికి బదులు వారితో కలిసి గదిలో ఉండమని పిలుస్తున్నారు. ఇది సమానత్వమా?ఎందుకు తీస్తారో అర్థం కాదుబ్యాడ్ గర్ల్ టీజర్ ఏమాత్రం బాగోలేదు. ఇది టీనేజీ అమ్మాయిలను చెడగొట్టేలా ఉంది. ఇలాంటి చెత్త మూవీస్ ఎందుకు తీస్తారో అర్థం కాదు. బాధ్యతాయుతమైన ఫిలింమేకర్స్ ఇలాంటి సినిమాలు చేయడం మరింత బాధాకరం అని చెప్పుకొచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసింది. అంబులి 3డీ సినిమాతో తమిళ చిత్రసీమకు పరిచయమైందీ బ్యూటీ. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హీరోయిన్గా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు సినిమాలు చేసింది. శ్రీమంతుడు, సింగం 123, ప్రేమికుడు చిత్రాలతో తెలుగువారికి పరిచయమైంది. ప్రస్తుతం తమిళంలో ఎతిర్ వినైయాత్రు మూవీ చేస్తోంది. #BADGIRL Teaser is NOT a BOLD Example.. ❌It's a #BAD Example! 👎#Freedom of choice and #GenderEquality concepts are wrongly portrayed in case of #Minors here! #Legally, #Ethically and even #Medically it sends a terribly #wrong message to the already influencable adolescent… pic.twitter.com/Dv6pVdXxtG— Sanam Shetty (@ungalsanam) February 18, 2025 చదవండి: కథ బాగోలేదని ఛీ కొట్టిన హీరో.. దర్శకుడు ఏం చేశాడంటే? -
ఆ మాటలతో డిప్రెషన్లోకి వెళ్లాను
‘‘నేను 19 ఏళ్లకే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. అయితే సినిమా రంగంలోని వారు ఎలా ఉంటారనే విషయం అప్పటికి నాకు తెలియదు. ఓ దర్శకుడు నా కాస్ట్యూమ్స్ గురించి అభ్యంతరకరంగా మాట్లాడిన మాటలకి బాధపడి, డిప్రెషన్లోకి వెళ్లాను’’ అని హీరోయిన్ ప్రియాంకా చోప్రా అన్నారు. ఇటీవల జరిగిన ఓ సమ్మిట్‌లో ΄పాల్గొన్న ప్రియాంకా చోప్రా కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన ఘటనల గురించి మాట్లాడారు. ‘‘ఓ సినిమా షూటింగ్ కోసం సెట్‌కి వెళ్లాను.నాకు ఎలాంటి దుస్తులు కావాలో నా కాస్ట్యూమ్ డిజైనర్‌కు చెప్పండి అని డైరెక్టర్‌తో అన్నాను. నా ముందే నా కాస్ట్యూమ్ డిజైనర్‌కి ఫోన్ చేసిన ఆయన... ‘కథానాయిక లోదుస్తులు చూపిస్తేనే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు. అందుకే ప్రియాంక దుస్తులు చాలా చిన్నవిగా ఉండాలి.. తన లోదుస్తులు కనిపించాలి’ అంటూ పలుమార్లు ఆ పదాన్ని ఉపయోగించాడు.ఆ మాటలు విన్నప్పుడు చాలా నీచంగా, బాధగా అనిపించింది. దీంతో నేను డిప్రెషన్లోకి వెళ్లాను. మా అమ్మ దగ్గరకు వెళ్లి ఆ డైరెక్టర్ నన్ను చిన్నచూపు చూస్తే ఆ సినిమా చేయనని చెప్పేశాను. ఆ తర్వాత ఆ మూవీ చేయలేదు. ఇన్నేళ్ల నా కెరీర్లో ఇప్పటివరకు కూడా ఆ దర్శకుడితో పని చేయలేదు’’ అని పేర్కొన్నారు ప్రియాంకా చోప్రా. -
'దేనికైనా సిద్ధమేనా అని అడిగాడు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై దంగల్ నటి షాకింగ్ కామెంట్స్!
అమిర్ ఖాన్ నటించిన దంగల్ మూవీతో గుర్తింపు తెచ్చుకున్న నటి ఫాతిమా సనా షేక్. రెజ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఇండియాలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ దంగల్ రికార్డ్ పదిలంగానే ఉంది. ఫాతిమా సనా షేక్ చివరిసారిగా ఆదిత్యరాయ్ కపూర్ సరసన మెట్రో ఇన్ డైనో చిత్రంలో హీరోయిన్గా నటించింది. అంతకుముందు 2023లో బాలీవుడ్ మూవీ సామ్ బహదూర్లోనూ కనిపించింది.అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ సినీ కెరీర్‌పై ఆసక్తికర కామెంట్స్ చేసింది. కెరీర్ ప్రారంభంలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. కొంతమంది కాస్టింగ్ డైరెక్టర్లు కమిషన్ పేరుతో డబ్బులు దోచుకునేవారని ఆరోపించింది. కష్టపడి సంపాదిస్తున్న నటులను మోసం చేసేవారని తెలిపింది. ఆడిషన్స్ పూర్తయ్యాక క్యాస్టింగ్ డైరెక్టర్ 15 శాతం కమిషన్ తీసుకున్నాకే మాకు పేమేంట్ ఇచ్చేవారని పేర్కొంది. కానీ కొందరు మాత్రం మంచివారు కూడా ఉండేవారని తెలిపింది. సినీ ఇండస్ట్రీకి కొత్త వచ్చిన నటులను దోచుకునే నీచమైన వ్యక్తులు కూడా ఉన్నారని వెల్లడించింది. అంతేకాకుండా తన కెరీర్లో తొలినాళ్లలో ఎదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాలను కూడా ఆమె గుర్తు చేసుకుంది.ఓ డైరెక్టర్‌తో తనకు క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని ఫాతిమా సనా షేక్ తెలిపింది. మీరు ఏదైనా చేయడానికి సిద్ధమేనా? అని ఒక దర్శకుడు నన్ను అడిగారని చెప్పుకొచ్చింది. నేను కష్టపడి పని చేస్తానని.. పాత్రకు అవసరమైనది వందశాతం చేస్తానని అతనితో చెప్పాను.. కానీ అతను అంత దిగజారిపోయి మాట్లాడతారని అనుకోలేదని ఫాతిమా షాకింగ్ కామెంట్స్ చేసింది.అంతేకాకుండా హైదరాబాద్‌లో చిన్నస్థాయి నిర్మాతలను కలుసుకున్న సంఘటనను గుర్తుచేసుకుంది. ఒకప్పుడు బాలీవుడ్లో మంచి పాత్రలు రావడానికి సౌత్ సినిమా మొదటి అడుగు అని తాను నమ్ముతున్నానని వెల్లడించింది. మేము ఒక గదిలో ఉండగా.. కొందరు నిర్మాతలు దాని గురించి చాలా బహిరంగంగా మాట్లాడుతున్నారని.. మేం చెప్పినవాళ్లను మీరు కలవాలని నాతో అన్నారని పేర్కొంది. ఆ విషయాన్ని డైరెక్ట్‌గా చెప్పకపోయినా.. వారు చెప్పినదాని అర్థం ఏమిటో స్పష్టంగా తెలిసిపోయేదని తెలిపింది. అయితే అందరూ అలా ఉండరని కూడా ఫాతిమా సనా షేక్ చెప్పింది. -
పెద్ద హీరోతో సినిమాకు సైన్ చేశా.. ఆ సౌత్ డైరెక్టర్ హోటల్ రూమ్‌కు రమ్మన్నాడు: హీరోయిన్
బాలీవుడ్ నటి ఉపాసన సింగ్ గురించి బీటౌన్‌లో తెలియని వారు ఉండరు. హిందీలో పలు చిత్రాల్లో నటించారామె. బాలీవుడ్ కామెడీ షో ది కపిల్ శర్మ షో ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లో ఉపాసన కనిపించారు. అంతేకాకుండా ఉపాసన పంజాబీ సినిమాల్లో కూడా కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె సౌత్ డైరెక్టర్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. కెరీర్ ప్రారంభంలో తనకెదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. దక్షిణాదికి చెందిన ఓ ప్రముఖ దర్శకుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని తెలిపింది.ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ..'అనిల్ కపూర్ సరసన ఒక పెద్ద సౌత్ ఫిల్మ్ డైరెక్టర్ మూవీకి సైన్ చేశా. నేను డైరెక్టర్ ఆఫీసుకి వెళ్ళినప్పుడల్లా మా అమ్మ, సోదరిని తీసుకెళ్లేదాన్ని. ఒక రోజు అతను నన్ను ఎప్పుడూ ఎందుకు మీ అమ్మను తీసుకొని వస్తావు అని అడిగాడు. ఒక రోజు రాత్రి 11.30 గంటలకు ఫోన్ చేసి సిట్టింగ్ వేద్దామని చెప్పి తన హోటల్‌కు రమ్మని అడిగాడు. నా వద్ద కారు లేదని.. రేపు ఉదయం ఆఫీస్‌కు వచ్చి కథ వింటానని చెప్పా. కానీ దానికి ఆయన.. నీకు సిట్టింగ్‌కు సరైన అర్థం తెలియదా?’ అంటూ నాపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దర్శకుడితో మాట్లాడిన తర్వాత ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదని' అని తెలిపింది.ఆ తర్వాత మాట్లాడుతూ.. "డైరెక్టర్ కార్యాలయం ముంబయిలోని బాంద్రాలో ఉంది. మరుసటి రోజు ఉదయం నేను డైరెక్టర్ ఆఫీస్‌కు వెళ్లా. అక్కడ మరో నలుగురు వ్యక్తులతో ఆయన సమావేశంలో ఉన్నారు. అతని సెక్రటరీ నన్ను బయట వేచి ఉండమని చెప్పాడు. కానీ నేను అలా చేయలేదు. మీటింగ్‌లో ఉండగానే లోపలికి ప్రవేశించా. దాదాపు ఐదు నిమిషాల పాటు పంజాబీలో అతనిని దుర్భాషలాడాను. వాళ్ల ముందే అతన్ని తిట్టి బయటకు వచ్చేశా. కానీ ఆ ప్రాజెక్ట్ నా చేయి జారిపోవడంతో ఎంతో ఏడ్చేశా. ఆ తర్వాత వారంరోజుల పాటు బయటకు రాలేదు. అప్పటికే అనిల్ కపూర్‌తో సినిమా చేస్తున్నానని చాలామందికి తెలియజేశా. ఇప్పుడు వాళ్లకు ఏం చెప్పాలని ఆలోచించా. కానీ ఆ పరిస్థితులే నన్ను మరింత స్ట్రాంగ్‌గా మార్చాయి. ఎన్ని సమస్యలు వచ్చినా ఇండస్ట్రీ వదలకూడదని అప్పుడే నిర్ణయించుకున్నా'అని ఉపాసన ఆ రోజులను గుర్తు చేసుకున్నారు. అయితే ఆ డైరెక్టర్ పేరును మాత్రం రివీల్ చేయలేదు.కాగా.. ఉపాసన సింగ్ తన కెరీర్లో సినిమాలతో పాటు బుల్లితెరపై మెరిసింది. సల్మాన్ ఖాన్‌తో కలిసి జుడ్వా (1997)లో తన పాత్రకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత మెయిన్ ప్రేమ్ కీ దివానీ హూన్ (2003), క్రేజీ 4 (2008) చిత్రాల్లో తనదైన నటనతో మెప్పించింది. కపిల్ శర్మ షో కామెడీ నైట్స్ విత్ కపిల్ షోతో మరింత ఆదరణ దక్కించుకుంది. అంతేకాకుండా డర్, లోఫర్, భీష్మ, బాదల్, హంగామా, హల్చల్, డిస్కో సింగ్, బబ్లీ బౌన్సర్ వంటి చిత్రాల్లో ఉపాసన సింగ్ నటించారు. -
సిగ్గు లేకుండా నన్ను కమిట్మెంట్ అడిగాడు: టాలీవుడ్ హీరోయిన్
రీసెంట్ టైంలో తెలుగులో వరస సినిమాలు చేస్తున్న హీరోయిన్ కావ్య థాపర్. కాకపోతే ఈమె చేసిన మూవీస్ అన్నీ వరసపెట్టి ఫెయిల్ అవుతున్నాయి. ఇదలా ఉంచితే ఈ బ్యూటీ తనకు గతంలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది. సిగ్గులేకుండా ఓ వ్యక్తి తనని కమిట్మెంట్ అడిగాడని చెప్పుకొచ్చింది. కాకపోతే ఇది కెరీర్ ప్రారంభంలో జరిగినట్లు క్లారిటీ ఇచ్చింది.(ఇదీ చదవండి: అల్లు వారి పెళ్లి సందడి.. ఆశీర్వదించిన చిరు, బన్నీ)'ఓ యాడ్‌లో ఆఫర్ ఉందనగానే ఆడిషన్స్ కోసం ఓ ఆఫీస్‌కి వెళ్లాను. అయితే నాలుగు యాడ్స్‌లో ఇస్తాం కానీ నువ్వు సెలెక్ట్ కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని సిగ్గు లేకుండా అడిగాడు. అలాంటివి ఇష్టం ఉండవని ముఖం మీదే చెప్పేశా. కానీ పదేపదే అదే విషయం గురించి అడిగేసరికి వెంటనే అక్కడి నుంచి వచ్చేశా. నన్ను నటిగా చూడాలనేది నాన్న కల. అందుకే డిగ్రీ పూర్తవగానే యాక్టింగ్ వైపు వచ్చేశా. అలా కొన్ని యాడ్స్ చేశా. అలా 'ఈ మాయ పేరిమిటో' సినిమాలో అవకాశం వచ్చింది' అని కావ్య థాపర్ చెప్పుకొచ్చింది.పంజాబీ భామ అయిన కావ్య థాపర్ తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. 'ఏక్ మినీ కథ', డబుల్ ఇస్మార్ట్, విశ్వం, ఈగల్ తదితర చిత్రాల్లో హీరోయిన్గా చేసింది. కాకపోతే ఇవన్నీ కూడా కంటెంట్ వల్ల ఫ్లాప్ అయ్యాయి. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 12 సినిమాలు) -
క్యాస్టింగ్ కౌచ్.. 16 ఏళ్ల వయసులోనే చేదు అనుభవం: నటి
నీకు ఛాన్సిస్తే నాకేంటి? అన్న ధోరణి ఎప్పటినుంచో ఉంది. కెమెరా ముందు నటించాలని కలలు గన్న ఎంతోమందికి ఎప్పుడో ఓసారి ఈ ప్రశ్న ఎదురయ్యే ఉంటుంది. కొందరు అలాంటి డిమాండ్లను నిర్మొహమాటంగా తిరస్కరిస్తే మరికొందరు తమ కల కోసం తల వంచేందుకు మొగ్గుచూపుతారు.16 ఏళ్ల వయసులో చేదు అనుభవంఅయితే 16 ఏళ్ల వయసులో తనకూ ఇంచుమించు ఇలాంటి పరిస్థితే ఎదురైందంటోంది బిగ్‌బాస్ బ్యూటీ రష్మీ దేశాయ్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. క్యాస్టింగ్ కౌచ్.. ఒకానొక సమయంలో నేనూ ఫేస్ చేశాను. అప్పుడు నా వయసు 16 ఏళ్లు. ఆడిషన్ ఉందని పిలిస్తే వెళ్లాను. అక్కడున్న వ్యక్తి నేను స్పృహ కోల్పోయేలా చేయడానికి ప్రయత్నించాడు. ఎలాగోలా తప్పించుకున్నాఅప్పటికే నాకు అక్కడంతా అసౌకర్యంగా అనిపించడంతో ఎలాగోలా ఆ గది నుంచి తప్పించుకుని బయటకు వచ్చేశాను. కొన్ని గంటల తర్వాత జరిగిందంతా అమ్మకు చెప్పాను. ఆ మర్నాడు అమ్మతో కలిసి అతడి దగ్గరకు వెళ్లాను. అమ్మ అతడి చెంప చెళ్లుమనిపించి గుణపాఠం చెప్పింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది నిజంగానే ఉంది. ఇండస్ట్రీ అనే కాదు ఎక్కడైనా మంచీచెడు రెండూ ఉంటాయి అని చెప్పుకొచ్చింది.సీరియల్స్‌తో ఫేమస్కాగా రష్మీ దేశాయ్.. కన్యాదాన్ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. కబ్ హోయ్ గవ్నా హమర్ చిత్రంతో భోజ్‌పురి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఉత్తరన్, దిల్సే దిల్ తక్ సీరియల్స్‌తో ఎక్కువ పాపులారిటీ తెచ్చుకుంది. ఖత్రోన్ కె ఖిలాడీ, నాచ్ బలియే 7, ద ఖత్ర ఖత్ర షో, బిగ్‌బాస్ 13, బిగ్‌బాస్ 15వ సీజన్లలోనూ పాల్గొంది. -
టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్.. అనన్య నాగళ్ల ఏమన్నారంటే?
అనన్య నాగళ్ల ప్రస్తుతం పొట్టేల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది. తంత్ర, డార్లింగ్ సినిమాలతో అలరించిన అనన్య మరోసారి అభిమానులను అలరించనుంది. సాహిత్ మోతూకూరి డైరెక్షన్లో వస్తోన్న పొట్టేల్ మూవీలో అనన్య లీడ్ రోల్లో కనిపించనుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు.అయితే ఈవెంట్‌కు హాజరైన అనన్య నాగళ్లకు ఊహించని ప్రశ్న ఎదురైంది. ఓ జర్నలిస్ట్ క్యాస్టింగ్ కౌచ్ గురించి అడిగింది. తెలుగు అమ్మాయిలు ఇండస్ట్రీలోకి రావాలంటే భయపడతారు? ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వాలంటే కమిట్మెంట్ అడుగుతారని టాక్ ఉంది.. మీకు ఇలాంటి అనుభవం ఎదురైందా? అని అనన్యను ప్రశ్నించింది.(ఇది చదవండి: అనన్య నాగళ్ల పొట్టేల్.. ట్రైలర్ వచ్చేసింది!)దీనిపై అనన్య మాట్లాడుతూ..'నాకైతే ఇలాంటి అనుభవం ఎదురుకాలేదు. మీరు తెలుసుకోకుండా వందశాతం ఉంటుందని ఎలా చెబుతున్నారు. ఇండస్ట్రీలో అలా జరుగుతుంది అని చెప్పడం వందశాతం తప్పు. అవకాశం రావడం కంటే ముందే కమిట్మెంట్ అనేది టాలీవుడ్లో లేదు. ఎక్కడైనా పాజిటివ్, నెగెటివ్ అనేది సమానంగా ఉంటాయి. మీకు అనుభవం లేకపోయినా ఎలా అడుగుతున్నారు.. నటిగా నేను చెబుతున్నా క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులైతే ఇండస్ట్రీలో లేవు' అని అన్నారు. కాగా.. అనన్య నటించిన పొట్టేల్ సినిమా ఈనెల 25న థియేటర్లలో సందడి చేయనుంది. కాస్టింగ్ కౌచ్ గురించి జర్నలిస్ట్ నోరు మూయించిన అనన్య 💥#AnanyaNagalla #Pottel #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/3hlxsVeu4c— Telugu FilmNagar (@telugufilmnagar) October 18, 2024 -
క్యాస్టింగ్ కౌచ్.. ఇండస్ట్రీ వదిలేద్దామనుకున్నా: హీరో
సక్సెస్ ఒక్కరోజులో రాదు. ఎన్నో కష్టనష్టాలకోర్చిన తర్వాతే విజయం చేతికి అందుతుంది. బాలీవుడ్ నటుడు అభయ్ వర్మ విషయంలోనూ ఇదే నిజమైంది. ముంజ్య సినిమాతో ఇప్పుడితడు బాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్‌గా నిలిచాడు. తాజాగా అతడు కెరీర్ తొలినాళ్లలో ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని చెప్పుకొచ్చాడు.సంబంధం లేకుండా మాట్లాడారుఅవకాశాల కోసం ఎదురుచూస్తున్నరోజుల్లో జరిగిందీ ఘటన.. ముంబై నుంచి పిలుపు రాగానే ఎగిరి గంతేశాను. తీరా అక్కడికి వెళ్లాక నా టాలెంట్ గురించి కాకుండా ఇంకేదేదో మాట్లాడారు. నా ప్రతిభను చూపించుకునే అవకాశం ఇవ్వలేదు. వాళ్లింకేదో ఆశించారు. నా విలువలను నాశనం చేసుకోలేక నో చెప్పాను. తొలి మీటింగ్‌లోనే చేదు అనుభవం ఎదురవడంతో నిరాశచెందాను. ముంబై వదిలేసి నా స్వస్థలమైన పానిపట్(హర్యానా)కు తిరిగి వచ్చేశాను. కానీ నటుడవ్వాలన్న కోరికను అణుచుకోలేకపోయాను. మళ్లీ అడుగుపెట్టా..ఎవరికోసమో భయపడి నేనెందుకు వెనకడుగు వేయాలనుకున్నాను. మరింత క్లారిటీతో మళ్లీ ముంబైలో అడుగుపెట్టాను. ఆడిషన్స్ ఇస్తూ పోయాను. అలా నటుడిగా నా కెరీర్ మొదలైంది అని ఎప్పుకొచ్చాడు. కాగా అభయ్ వర్మ ప్రధాన పాత్రలో నటించిన ముంజ్య మూవీ జూన్ 7న విడుదలైంది. ఆదిత్య సర్పోట్దర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వంద కోట్లపైనే రాబట్టింది. ఇకపోతే అభయ్ ప్రస్తుతం కింగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు.బిగ్‌బాస్ ప్రత్యేక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్.. టాలీవుడ్ హీరోయిన్ ఆసక్తికర కామెంట్స్!
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై టాలీవుడ్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. బెంగళూరులో ఓ ఈవెంట్‌కు హాజరైన ముద్దుగుమ్మ మలయాళ ఇండస్ట్రీలో హేమ కమిటీ నివేదికపై స్పందించింది. చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన అనుభవాలను పంచుకుంది. అయితే తనకు మాత్రం ఇలాంటి అనుభవం ఎదురు కాలేదని వెల్లడించింది.శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ..' నా వరకు అయితే ఇండస్ట్రీలో సురక్షితంగా ఉన్నా. అయితే ఇది అందరికీ వర్తిస్తుందని నా ఉద్దేశం కాదు. నేను సేఫ్‌గానే ఉన్నప్పటికీ.. పనిచేసే చోట అభద్రతగానే ఉండొచ్చని నా అభిప్రాయం. గత ఎనిమిదేళ్లుగా నేను సినిమాల్లో ఉన్నా. ఇండస్ట్రీలో నాకు ఎలాంటి ఇబ్బంది కలగకపోవటం నా అదృష్టం. కానీ అందరి విషయాల్లో ఇలా ఉంటుందని మాత్రం చెప్పను. కొందరు ఇండస్ట్రీలో ఇబ్బందులు పడతూనే ఉన్నారని' చెప్పుకొచ్చింది. అయితే ఈ వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి..సెట్లో మహిళలకు భద్రత కల్పించాలని కోరారు.కాగా.. శ్రద్ధా శ్రీనాథ్ 2015లో మలయాళ చిత్రం కోహినూర్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్లో నాని సరసన జెర్సీతో అరంగేట్రం చేసింది. అంతేకాకుండా యు-టర్న్, విక్రమ్ వేద చిత్రాలతో మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది జనవరిలో విడుదలైన వెంకటేష్ నటించిన సైంధవ్ చిత్రంలో చివరిసారిగా కనిపించింది. ప్రస్తుతం తెలుగులో విశ్వక్ సేన్ సరసన మెకానిక్ రాకీలో కనిపించనుంది. అంతేకాకుండా హిందీలో లెటర్స్ టు మిస్టర్ ఖన్నా, కోలీవుడ్‌లో కలియుగం సినిమాల్లో నటిస్తోంది. -
మలయాళమే కాదు.. ఇక్కడ పెద్ద లిస్టే ఉంది: నటి షాకింగ్ కామెంట్స్
మలయాళ సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారిన హేమ కమిటీ నివేదికపై ప్రముఖ కోలీవుడ్ నటి రేఖ నాయర్ ఆసక్తికర కామెంట్స్ చేసింది. క్యాస్టింగ్ కౌచ్ అనేది కేవలం మాలీవుడ్ మాత్రమే కాదు.. ప్రతి ఇండస్ట్రీలోనూ ఉందన్నారు. సినిమా అనేది మొదలైనప్పటి నుంచి లైంగిక వేధింపులు జరుగుతున్నాయని తెలిపారు. మీడియా లేని కాలంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయని.. అప్పట్లో చాలామంది సర్దుకుపోయేవారని కామెంట్ చేశారు. కొంతమంది అడ్జస్ట్మెంట్ కాలేక సినిమాల నుంచి తప్పుకున్నారని రేఖా నాయర్ వెల్లడించారు.కోలీవుడ్‌లోనూ ఇలాంటి వేధింపులు చాలానే జరుగుతున్నాయని రేఖా నాయర్ ఆరోపించారు. మలయాళంలో కేవలం పది నుంచి ఇరవై మంది మాత్రమే ఉంటారని.. తమిళంలో ఆ సంఖ్య భారీగానే ఉంటుందని అన్నారు. ఇక్కడైతే ఏకంగా 500లకు పైగానే ఉంటారని తెలిపారు. ఇవన్నీ బయటికి మాట్లాడితే సినిమా ఛాన్సులు రావని రేఖా నాయర్ వెల్లడించారు. అందుకే హీరోయిన్స్ వాటి గురించి మాట్లాడేందుకు భయపడతారని పేర్కొన్నారు. తమిళంలో సినిమా సంఘాలకు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు లేరన్నారు. కేవలం మలయాళం, తమిళం మాత్రమే అన్ని భాషల్లోనూ ఇలాంటి వేధింపులు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు.కాగా.. తమిళంలో టీవీ సీరియల్స్‌లో నటించి గుర్తింపు తెచుకున్న నటి రేఖ నాయర్. ఆమె వంశం, పగల్ నిలవు, ఆండాళ్ అజగర్, నామ్ ఇరువర్ నమక్కు ఇరువర్, బాల గణపతి లాంటి టీవీ సీరియల్స్‌లో నటించింది. అంతే కాకుండా తమిళంలో బిగ్‌బాస్ సీజన్-7లో కంటెస్టెంట్‌గా పాల్గొంది. అయితే గతంలో మహిళల పట్ల ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిల నడుము మీద అబ్బాయిలు చేయి వేస్తే ఎంజాయ్ చేయాలి కానీ.. ఏదో అయిపోయిందని హంగామా చేయొద్దని కామెంట్స్ చేశారు. -
నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా: బిగ్‌బాస్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్
మాలీవుడ్‌లో హేమ కమిటీ రిపోర్ట్‌పై పలువురు సినీతారులు రియాక్ట్ అవుతున్నారు. ఈ వ్యవహారంపై టాలీవుడ్ హీరోయిన్స్ సైతం స్పందిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ నటి మంచు లక్ష్మి కూడా దీనిపై మాట్లాడారు. మహిళలకు రక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. తాజాగా హేమ కమిటీ ఇచ్చిన నివేదికపై తమిళ బిగ్ బాస్ కంటెస్టెంట్ సనమ్ శెట్టి షాకింగ్ కామెంట్స్ చేశారు. కాస్టింగ్ కౌచ్ కేవలం మలయాళంలో మాత్రమే కాదు.. తమిళ సినిమాల్లో కూడా ఉందని వెల్లడించింది. ఎవరైనా కమిట్ అవ్వాల్సిందే తప్పా.. నో చెప్పడానికి తమిళ ఇండస్ట్రీలో అవకాశం లేదని తెలిపింది.సనమ్ శెట్టి మాట్లాడుతూ..'హేమ కమిటీ నివేదిక వివరాలు నాకు తెలియవు. కానీ నేను ఈ చర్యను స్వాగతిస్తున్నా. ఇలాంటి నివేదికను రూపొందించినందుకు జస్టిస్ హేమకు, కేరళ ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు. తమిళ సినీ ప్రపంచంలోనూ కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వీటి గురించి ఎవరూ బయటికి చెప్పలేరు. నేను నా స్వంత అనుభవంతో దీనిపై మాట్లాడుతున్నా. తాను వ్యక్తిగతంగా కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నా. పురుషులు కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితులే. సినిమాల్లో అవకాశాల కోసం ఇదొక్కటే మార్గం కాకూడదు. టాలెంట్ ఉంటే.. అవకాశాలు అవే వస్తాయని నేను నమ్ముతా" అని అన్నారు. కాగా.. మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న అఘాయిత్యాలపై హేమ కమిటీ ఇచ్చిన నివేదికను కేరళ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.హేమ కమిటీ రిపోర్ట్ ఏంటంటే?మలయాళం ఇండస్ట్రీలో పనిచేస్తున్న మహిళలపై లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో జస్టిస్ హేమ కమిటీ విచారణ జరిపి రిపోర్టు ఇచ్చింది. ఈ నివేదికను ఆగస్ట్ 19న కేరళ ప్రభుత్వం బయట పెట్టింది. ఇండస్ట్రీలో అవకాశాల కోసం చాలా మంది మహిళలు కమిట్ అవ్వాల్సి వచ్చిందని ఆ రిపోర్టులో స్పష్టంగా చెప్పడం సంచలనంగా మారింది. మెరిసేదంతా బంగారం కాదు.. నిజమే! పైకి కనిపించే గ్లామర్ వెనక ఎన్నో చీకటి కోణాలు ఉంటాయని మలయాళ చిత్రపరిశ్రమ నిరూపించింది. -
ఆడిషన్‌కు వెళ్లాకే అసలు విషయం తెలిసింది: క్యాస్టింగ్ కౌచ్‌పై బుల్లితెర నటి
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రారంభంలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు. అయితే కొందరు మాత్రమే ఈ విషయాన్ని బయటకు చెప్పేందుకు సాహసం చేస్తుంటారు. తాజాగా ఈ విషయంపై బాలీవుడ్ బుల్లితెర నటి సనయా ఇరానీ ఓపెన్ అయింది. ఓ బాలీవుడ్ దర్శకుడు తనను సంప్రదించారడని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. దక్షిణాదిలో కూడా కొన్ని చేదు సంఘటనలు ఎదురయ్యాయని తెలిపింది. తనను రిజెక్ట్ చేయడానికి మాత్రమే కలవాలని కొందరు పట్టుబట్టారని తాజా ఇంటర్వ్యూలో సనయ చెప్పింది.సనయా మాట్లాడుతూ.. ' మ్యూజిక్ వీడియో కోసం ఆడిషన్ చేస్తున్నామని మొదట నాతో చెప్పారు. కానీ అక్కడికి వెళ్లాక ఇది ఒక సినిమా కోసమని తెలిసింది. దీంతో నేను అక్కడే ఉన్న సెక్రటరీకి ఆడిషన్ చేయనని చెప్పా. ప్లీజ్ సార్‌కు కోపం వస్తుంది.. ఒక్కసారి ఆయనతో మాట్లాడండి అని ఆమె నాతో చెప్పింది. ఆ తర్వాత అతను మాట్లాడుతూ.. 'నేను ఈ పెద్ద సినిమా చేస్తున్నాను. ఇందులో చాలా మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఇందులో మీరు బికినీ వేసుకోవాలి. మీరు బికినీ ధరించేందుకు సిద్ధమేనా?' అని అడిగాడని చెప్పుకొచ్చింది.ఆ తర్వాత "అతని సెక్రటరీ చెప్పడంతో నేను అతనికి కాల్ చేసాను. నేను మీటింగ్‌లో ఉన్నా.. అరగంట తర్వాత నాకు కాల్ చేయండి అన్నాడు. మరోసారి 45 నిమిషాల తర్వాత కాల్ చేశా. ఇప్పుడు టైం ఎంత? నిన్ను ఏ సమయానికి చేయమని అడిగాను? అని నాపై కోప్పడ్డాడు. దీంతో అతనికి దర్శకుడిగా పనికిరాని వాడని నాకర్థమైంది' అని వివరించింది. కాగా.. 'మిలే జబ్ హమ్ తుమ్', 'ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూన్' వంటి టీవీ షోలతో బాలీవుడ్లో సనయా గుర్తింపు తెచ్చుకుంది. సనయ చివరిగా షార్ట్, బటర్‌ఫ్లైస్ సీజన్ -4లో కనిపించింది. -
తెలుగు డైరెక్టర్ రెండు నెలలు తనతోనే ఉండాలన్నాడు: నటి
ఓ తెలుగు డైరెక్టర్ వల్ల తాను ఇబ్బందిపడ్డానంటోంది నటి మీఠా వశిష్ట్. సినిమాలో హీరోయిన్గా ఛాన్సిస్తానని ఆశ చూపి తనను లొంగదీసుకునేందుకు ప్రయత్నించాడంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆనాటి భయంకర సంఘటనను గుర్తు చేసుకుంది. మీఠా మాట్లాడుతూ.. ఓ తెలుగు దర్శకుడు (పేరు చెప్పడానికి ఇష్టపడలేదు) తన సినిమాలో ప్రధాన పాత్ర ఆఫర్ చేశాడు. కండీషన్అంతకుముందు ఆయన సినిమాలో నటించిన హీరోయిన్‌కు జాతీయ అవార్డు వచ్చింది. అలాంటి ప్రతిభ ఉన్న దర్శకుడు నాకు హీరోయిన్ ఆఫర్ ఇవ్వగానే సంతోషపడ్డాను. కానీ ఆ ఆనందం ఇట్టే ఆవిరైంది. తనతో రెండు నెలలపాటు కలిసుండాలని కండీషన్ పెట్టాడు. సినిమా గురించి కలిసి జర్నీ చేయాలంటున్నాడేమో.. తన ఇంగ్లీష్ అర్థం కాక నేను తప్పుగా అర్థం చేసుకుంటున్నానేమే! అని భ్రమపడ్డాను.ఆఫర్ రిజెక్ట్దీంతో అతడు మరోసారి.. రెండు నెలలదాకా తనతోనే కలసి జీవించాలని స్పష్టంగా చెప్పాడు. అది కుదరదని ముఖం మీదే చెప్పాను. ఆఫర్ రిజెక్ట్ చేసి బయటకు వస్తుంటే గదికి గడియ పెట్టి నన్ను వెళ్లనివ్వకుండా అడ్డుకున్నాడు. అయినా తన నుంచి తప్పించుకుని ఎలాగోలా బయటకు వచ్చేశాను. తర్వాత మళ్లీ ఇలాంటి పరిస్థితులు ఎదురవలేదు. స్పష్టంగా చెప్పేశాఎందుకంటే.. అవకాశాల కోసం దిగజారలేనని అందరికీ స్పష్టంగా చెప్పాను. నా నిర్ణయాన్ని కొందరు దర్శకులు గౌరవించి మూవీ ఆఫర్స్ ఇచ్చారు అని చెప్పుకొచ్చింది. మీఠా వశిష్ట్.. ఇడియట్, ఇంగ్లీష్ ఆగస్ట్, డ్రోహ్కాల్, ల్ సే, తాల్, మాయ, కుచ్ ఖట్టి కుచ్ మీఠి, ఊప్స్, కాగజ్, రహస్య, గంగూభాయ్,గుడ్ లక్ జెర్రీ వంటి హిందీ చిత్రాల్లో నటించింది.చదవండి: నా బిడ్డ ఎంత నరకం అనుభవించిందో.. బోరున విలపించిన గీతూరాయల్ -
ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్.. అది మన చేతుల్లోనే ఉంది: నటి
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం తరచుగా వినిపిస్తూనే ఉంటోంది. ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవం ఎదురైన వారు ఇండస్ట్రీలో చాలామందే ఉంటారు. ఇలాంటి చేదు అనుభవాలను అందరూ ధైర్యంగా బయటికి చెప్పలేరు. మరికొందరు తమ కెరీర్లో ఎదుర్కొన్న ఇలాంటి సంఘటనలపై ఓపెన్ అవుతుంటారు. తాజాగా బాలీవుడ్ నటి ఐశ్వర్య సుస్మిత తనకెదురైన కాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి మాట్లాడింది. ఇటీవల ఆమె 'బాడ్ కాప్' అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది.ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందని ఐశ్వర్య సుస్మిత తెలిపింది. అయితే ఈ విషయాన్ని పెద్దది చేయడం ఒక్కటే మార్గం కాదని ఐశ్వర్య అన్నారు. తాను ఎప్పుడూ ఎలాంటి ఆడిషన్స్‌ను మిస్ చేసుకోలేదని పేర్కొంది. తాను విలువల విషయంలో రాజీ పడేది లేదని.. కష్టపడి పనిచేస్తానని చెప్పుకొచ్చింది.ఐశ్వర్య మాట్లాడుతూ.. "నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొత్తలో ఇలాంటివీ చాలా విన్నా. చాలామంది వ్యక్తులు పలు విధాలుగా కథలు చెప్పేవారు. నేను అప్పటికీ మోడల్‌గానే ఉన్నా ఇంకా నటనలోకి అడుగు పెట్టలేదు. మీరు వారితో పడుకోకపోతే మీకు అవకాశాలు రావని నాకు చెప్పేవారు. కానీ పరిశ్రమలోకి రావడానికి ఇది ఒక్కటే మార్గం కాదు. కానీ ఆ సమయంలో కొందరు డైరెక్టర్స్, క్యాస్టింగ్ డైరెక్టర్స్ నన్ను పర్సనల్‌గా కలవమని చెప్పేవారు. కానీ ఇక్కడ మనల్ని ఎవరూ బలవంతం చేయడం లేదు. వెళ్లాలా? వద్దా? అనేది మన నిర్ణయం. ఇది కేవలం సినీ ఇండస్ట్రీలోనే కాదు.. కార్పొరేట్ రంగంలోనూ ఉంది.' అంటూ తన అనుభవాలను గుర్తు చేసుకుంది.కాగా.. ఐశ్వర్య సుస్మిత మోడల్‌గా తన కెరీర్‌ని ప్రారంభించింది. 2016లో కింగ్‌ఫిషర్ క్యాలెండర్ గర్ల్‌గా తొలిసారి అవకాశం దక్కించుకుంది. ఆమె మోడలింగ్ నుంచి నటన వైపు అడుగులు వేస్తోంది. ప్రస్తుతానికి ఓటీటీలో అరంగేట్రం చేసిన ఐశ్వర్య సుస్మిత త్వరలోనే సినిమాల్లోనూ నటించేందుకు సిద్ధమవుతోంది. -
పేకమేడలు హీరోయిన్ సంచలన కామెంట్స్
-
నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే: యానిమల్ నటుడు షాకింగ్ కామెంట్స్
బాలీవుడ్ నటుడు సిద్దాంత్ కర్నిక్ గతేడాది సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ చిత్రంలో కనిపించారు. 2023 డిసెంబర్లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ మూవీ రూ.900 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన సిద్ధాంత్ కర్నిక్.. ప్రభాస్ ఆదిపురుష్‌లోనూ నటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హజరైన సిద్ధాంత్ తన కెరీర్లో ఎదురైన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా తాను క్యాస్టింగ్ కౌచ్ అనుభవం ఎదురైందని షాకింగ్ కామెంట్స్ చేశారు. అదేంటో తెలుసుకుందాం.సిద్ధాంత్ కర్నిక్ మాట్లాడుతూ.. " అప్పడప్పుడే నా కెరీర్ ప్రారంభించా. 2005లో కేవలం 22 ఏళ్ల వయసులోనే పరిశ్రమలోకి ప్రవేశించా. ఓ సినిమా ఛాన్స్ కోసం కోఆర్డినేటర్ని కలిశా. అతను నా పోర్ట్‌ఫోలియో తీసుకుని రాత్రి 10:30 గంటలకు ఇంటికి రమ్మన్నాడు. ఆ టైమ్‌లో పిలవడం నాకు కాస్తా వింతగా అనిపించింది. అయినా అవకాశం కోసం వెళ్లక తప్పలేదు. ' అని అన్నారు. అనంతరం మాట్లాడుతూ..' అవకాశాల కోసం కొన్ని విషయాల్లో రాజీపడక తప్పదు. లేకపోతే నీకు ఎలాంటి పని ఉండదని అన్నాడు. దీంతో అతని మాటలను నేను వెంటనే గ్రహించా. ఆ సమయంలో అతను నాకు చాలా దగ్గరగా వచ్చాడు. నేను వెంటనే ఇంట్రెస్ట్ లేదని చెప్పి బయటకొచ్చేశా' అని తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత అతను నా సినిమా అవకాశాలను దెబ్బతీస్తాడేమోనని భయపడినట్లు వెల్లడించారు. కానీ కొన్నేళ్ల తర్వాత ఓ ఈవెంట్లో అతనే నన్ను అభినందించాడని తెలిపారు. కాగా.. సిద్ధాంత్ కర్నిక్ యానిమల్, ఆదిపురుష్ వంటి చిత్రాలతో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. అంతే కాకుండా ఫేమస్ వెబ్ సిరీస్ మేడ్ ఇన్ హెవెన్ సీజన్- 2 కీలక పాత్ర పోషించాడు. 2004లో టీవీ షో రీమిక్స్‌తో కర్నిక్ తన కెరీర్ ప్రారంభించాడు. -
స్టార్ హీరో ఒంటరిగా రమ్మని పిలిచాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
సినీ ఇండస్ట్రీ అనగానే కలల ప్రపంచమని మనందరికీ తెలుసు. అంతే కాదు ఈ రంగంలో నిలదొక్కుకోవాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిన పరిస్థితులు కూడా ఎదురవొచ్చు. మరి ముఖ్యంగా హీరోయిన్గా రాణించాలంటే కొన్నిసార్లు ఊహించని పరిస్థితులు కూడా ఎదురవుతుంటాయి. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనే పదం కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్న వారే. తాజాగా మరో హీరోయిన్ తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకుంది. ఇషా కొప్పికర్.. ఈ పేరు తెలుగువారికి కూడా సుపరిచితమే. టాలీవుడ్లో చంద్రలేఖ, ప్రేమతో రా, కేశవ లాంటి సినిమాల్లో నటించింది. బాలీవుడ్‌కు చెందిన బ్యూటీ తెలుగుతో పాటు కన్నడ, తమిళ భాషల్లో కూడా నటించి ఆకట్టుకుంది. చివరిసారిగా శివ కార్తికేయన్ నటించిన అయలాన్ చిత్రంలో మెరిసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ తనకెదురైన షాకింగ్ అనుభవాన్ని వెల్లడించింది. 18 ఏళ్ల వయసులోనే క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినట్లు వివరించింది.ఇషా మాట్లాడుతూ.. "ఒక నటుడు డ్రైవర్ లేకుండా అతన్ని ఒంటరిగా కలవమని అడిగాడు. ఇప్పటికే నాపై చాలా రూమర్స్ ఉన్నాయి. అందుకే ఎవరికైనా తెలిస్తే మరిన్ని రూమర్స్ సృష్టిస్తారని నన్ను రిక్వెస్ట్ చేశాడు. దీంతో నేను వెంటనే అతని విజ్ఞప్తిని తిరస్కరించా. అతనెవరో కాదు.. ఆ టైంలో అతను బాలీవుడ్లో స్టార్ హీరోగా ఉన్నారు.' అని తెలిపింది .అంతే కాదు గతంలో తనను చాలామంది అసభ్యంగా తాకేవారని ఇషా కొప్పికర్ వెల్లడించింది. పని కావాలంటే హీరోలతో స్నేహంగా మెలగాలని కొందరు సలహాలు కూడా ఇచ్చారని తెలిపింది. తాను 18 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టానని నటి తెలిపింది. కాగా.. ఇషా 1998లో ఏక్ థా దిల్ ఏక్ థీ ధడ్కన్ చిత్రంతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2009లో టిమ్మీ నారంగ్‌ను పెళ్లాడిన ఆమె.. 14 ఏళ్ల తర్వాత విడాకులు తీసుకుంది. -
'ఆడిషన్ కోసం వెళ్లి స్వలింగ సంపర్కుడిని కలిశా'.. బిగ్‌బాస్ కంటెస్టెంట్!
బుల్లితెర నటుడు అభిషేక్ కుమార్ ఉదరియాన్ అనే సీరియల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది బిగ్‌బాస్ సీజన్-17 షో ద్వారా మరింత ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఖత్రోన్ కే ఖిలాడీ -14 అనే షో కనిపించనున్నారు. అయితే టీవీ షోలతో బిజీగా ఉన్న అభిషేక్ ముంబయిలో తనకెదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు. కెరీర్ ప్రారంభంలో జరిగిన షాకింగ్ ఘటనను తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినట్లు వివరించారు.అభిషేక్ కుమార్ మాట్లాడుతూ..'నేను 2018లో ముంబయికి వచ్చా. మా ఇంట్లో అబద్ధం చెప్పి వచ్చా. నేను నటుడిని కావాలని వారితో చెప్పినప్పుడు వారికి ఇష్టం లేదన్నారు. దీంతో అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ముంబయిలో జరిగిన ఆడిషన్లో పాల్గొన్నా. నేను చెత్త ప్రదర్శన ఇచ్చినా నన్ను ఎంపిక చేశాడు. అది చూసిన ఆశ్చర్యపోయా. బహుశా నా గ్లామర్ వల్ల అనుకున్నా. కానీ అదంతా ఫేక్ ఆడిషన్ అని తర్వాత తెలిసింది. అయితే అక్కడ ఓ స్వలింగ సంపర్కుడు నన్ను కలిశాడు. అతను నాతో అనుచితంగా ప్రవర్తించాడు. అతని వల్ల భయంతో ఇంటికి పరిగెత్తా. వెంటనే జనరల్ బోగిలో టికెట్ బుక్ చేసుకుని మరీ తిరిగొచ్చా' అని తన అనుభవాన్ని పంచుకున్నారు. -
'మీ రేటు కార్డ్ సిద్ధం చేస్తాం'.. రెడీగా ఉండమని చెప్పాడు: హీరోయిన్
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్. కొత్తగా సినిమాల్లోకి వచ్చేవారికి ఇలాంటి అనుభవం ఎక్కడో ఒకచోట ఎదురై ఉంటుంది. చాలామంది సెలబ్రిటీలు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని ఏదో ఒక సందర్భంలో రివీల్ చేస్తుంటారు. అలా తాజాగా ఓ నటి తనకు ఎదురైన కాస్టింగ్ కౌచ్ సంఘటనను పంచుకుంది. ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ నటి మహి విజ్ ఆ షాకింగ్ సంఘటనను వెల్లడించింది.తాను ఇండస్ట్రీకి వచ్చిన తొలినాళ్లలో సినిమా కోఆర్డినేటర్‌గా చెప్పుకునే వ్యక్తి నుంచి తనకు కాల్ రావడంతో ముంబయిలోని జుహూ వెళ్లానని తెలిపింది. అతని కారులోనే తన సోదరితో కలిసి వెళ్లినట్లు పేర్కొంది. ఆ సమయంలో అతను మాకు ఆల్బమ్‌లోని కొన్ని ఫోటోలు చూపించాడు. ఈ ఆల్బమ్‌లో మీ ఫోటో కూడా ఉంచుతాం.. మీ రేట్ కార్డ్ సిద్ధంగా ఉంటుందని మాతో అన్నాడని తెలిపింది.అయితే దీనిపై మొదట్లోనే నెగెటివ్‌గా ఆలోచించవద్దని.. ఒక్క రోజు షూటింగ్‌కి రేటు కార్డు ఎంత అని అడిగాను.. దానికి అతని బదులిస్తూ.. మేడం మీరు క్రూయిజ్‌కి వెళ్తారా? దయచేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని మాతో అన్నాడు. దీంతో వెంటనే తప్పుడు వ్యక్తిని కలిశానని మాకు అర్థమైంది. కారు వెనకసీట్లో కూర్చున్న మా సోదరి అతన్ని జుట్టు పట్టి లాగింది. దీంతో వెంటనే కారు నుంచి దిగి అక్కడి నుంచి వచ్చేశామని మహి విజ్ తెలిపింది. క్రూయిజ్ షిప్లో అందరిముందు అశ్లీలనృత్యం చేసేందుకు సంప్రదించాడని మాకు అర్థమైందని మహి వెల్లడించింది.కాగా.. బాలికా వధు సీరియల్లో నందినిగా.. లాగీ తుజ్సే లగన్లో నకుషా పాత్రలతో మహి విజ్ మంచి పేరు తెచ్చుకుంది. ఢిల్లీలో జన్మించిన ఆమె 17 ఏళ్ల వయసులోనే బాలీవుడ్లో అవకాశాల కోసం ముంబయి వచ్చింది. అయితే బుల్లితెర ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించే కంటే ముందే మహి తెలుగు, మలయాళం, కన్నడ చిత్రాల్లో కనిపించింది. తెలుగులో సిద్ధార్థ్ నటించిన తపన చిత్రంలో మహి నటించింది. -
సౌత్ ఇండస్ట్రీలో బడా ఆఫర్.. ఒక్కరోజు కాంప్రమైజ్ అని కండీషన్!
క్యాస్టింగ్ కౌచ్.. ఈ భయంతోనే ఎంతోమంది సినిమా ఇండస్ట్రీ అంటేనే భయపడతారు. కొందరు సెలబ్రిటీలు దీనికి లొంగిపోతే మరికొందరేమో వాటిని తిరస్కరిస్తూ ధైర్యంగా ముందడుగు వేశారు. తన కెరీర్లో కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయంటోంది నటి సుచిత్ర పిళ్లై. ఈ మలయాళ నటి ఫ్రెంచ్, హాలీవుడ్ సినిమాలు సైతం చేసింది. ఎక్కువగా బాలీవుడ్ మూవీస్‌లో మెరిసిన ఈమె సింగర్ కూడా! తాజాగా సుచిత్ర క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది.ఏదో ఒక దశలో క్యాస్టింగ్ కౌచ్'కొన్నిసార్లు అవకాశాలు వస్తాయి.. కానీ దానికి బదులుగా మరింకేదో అడుగుతుంటారు. అదే క్యాస్టింగ్ కౌచ్. ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఇలాంటివి ఫేస్ చేసే ఉంటారు. నన్ను చూస్తే గంభీరంగా కనిపిస్తానని అంటుంటారు.. కాబట్టి మరీ అంత ఘోరమైన అనుభవాలైతే ఎదురవలేదు. ఎవరైనా ఏదైనా అడగాలన్నా నా ముఖం చూసి నోరు మూసుకుని ఉంటారని జనాలు జోకులేస్తుంటారు.సౌత్‌లో సినిమాలు చేస్తారా?అయితే దక్షిణాది చిత్రపరిశ్రమ నుంచి నాకు ఓసారి ఫోన్‌కాల్ వచ్చింది. ఇదెప్పుడో ఏళ్లక్రితం జరిగిన ముచ్చట. సౌత్‌లో సినిమాలు చేస్తారా? అని అడిగారు. సరేనన్నాను. అయితే ఒక మంచి సినిమా ఉంది. చాలా పెద్ద హీరో, ప్రముఖ డైరెక్టర్ కాంబినేషన్లో రాబోతోంది. మీరు అందులో హీరోకి సోదరిగా నటిస్తారా? అది చాలా ప్రాధాన్యత ఉన్న రోల్ అని చెప్పగా మంచిదే కదా అనుకున్నాను. కాంప్రమైజ్అప్పుడతడు మా నిర్మాతకు ఇదే మొదటిసారి.. మీరు కాంప్రమైజ్ అవుతారా? అని అడిగాడు. నా రెమ్యునరేషన్ తగ్గించుకోమంటున్నాడేమోనని లేదు, సారీ అని చెప్పేశా.. కానీ అతడు మళ్లీ కాంప్రమైజ్ కావాలి అని నొక్కి చెప్పాడు. నాకు విషయం అర్థమై.. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నాతో మీరిలాగేనా మాట్లాడేది అని కోప్పడ్డాను. ఒక్కసారి వస్తే చాలంటూ..అంటే డైరెక్టర్స్ చాలాకాలంగా ఈ పద్ధతి ఫాలో అవుతున్నారు. నిర్మాత కొత్తవాడు కాబట్టి తను ఓసారి రమ్మని అడుగుతున్నాడు అని పేర్కొన్నాడు. నేను మీ ప్రాజెక్ట్‌కు కరెక్ట్ వ్యక్తిని కాదు, రాంగ్ నెంబర్ అని ఫోన్ పెట్టేశాను. అలాంటి దారిలో వెళ్లడం నాకే మాత్రం నచ్చదు' అని సుచిత్ర చెప్పుకొచ్చింది.చదవండి: డిప్రెషన్లో ఉపాసన.. రామ్‌చరణ్ (ఫోటోలు) -
రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 1990ల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సినిమాల్లో నటిస్తోంది. తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో దాదాపు 200లకు పైగా చిత్రాల్లో నటించింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు సినిమాల్లో రాణించిన రమ్యకృష్ణ నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులు, తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డు, మూడు నంది అవార్డులు అందుకున్నారు.అయితే తాజాగా రమ్యకృష్ణ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె ఆసక్తికర కామెంట్స్ చేశారు. క్యాస్టింగ్ కౌచ్ సమస్య సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. ఇతర రంగాల్లోనూ ఉందన్నారు. అయితే సినీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలే ఎక్కువగా తెరపైకి రావడంతో అందరిదృష్టి సినిమావారిపైనే ఉందని తెలిపారు. కొంతమంది తప్పుడు వార్తలను ప్రచారం చేయడం కూడా నిజమేనని అన్నారు. సినిమాల్లో స్టార్‌గా ఎదగాలంటే హీరోయిన్స్ కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందేనని షాకింగ్ కామెంట్స్ చేసింది. కానీ నా విషయంలో మాత్రం అలా జరగలేదని రమ్యకృష్ణ వెల్లడించింది. కాగా.. రమ్యకృష్ణ 14 ఏళ్ల వయసులో 1948లో వైజీ మహేంద్రతో కలిసి 'వెళ్లి మిందాన' అనే తమిళ చిత్రంలో నటించింది. 1986లో విడుదలైన 'భలే మిత్రులు' ఆమె తొలి తెలుగు చిత్రం. 1990లో సౌందర్య, మీనా, రోజా, నగ్మా లాంటి హీరోయిన్లలో గుర్తింపు సాధించింది. ఎన్టీ రామారావు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్ బాబు, జగపతి బాబు, రాజశేఖర్, రజనీకాంత్ లాంటి స్టార్స్‌తో సినిమాలు చేసింది. కన్నడలో రవిచంద్రన్, పునీత్ రాజ్‌కుమార్, ఉపేంద్ర సరసన నటించారు. -
బుల్లితెర నటికి వేధింపులు.. వాట్సాప్‌లో అసభ్యకర సందేశాలు!
సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్. స్టార్ నటీమణులు సైతం ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొని ఉంటారు. తాజాగా మరో నటి క్యాస్టింగ్ కౌచ్ బారిన పడిన సంఘటన జరిగింది. ఓ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని అసభ్యకరమై సందేశాలు పంపించారని కన్నడ నటి అమూల్య గౌడ బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశారుతనను ఆడిషన్‌కు పిలిచి లైంగిక వేధింపులకు గురి చేసిన సూర్యపై పోలీసులకు నటి ఫిర్యాదు చేసింది . సినిమా పేరుతో అసభ్యకరమైన మెసేజ్‌లు పంపి వేధించారని ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై అతన్ని నిలదీస్తే వెళ్లి పోలీసుకు చెప్పుకోమంటూ దారుణంగా మాట్లాడారని నటి తెలిపింది. కాస్టింగ్ డైరెక్టర్ అంటూ పరిచయం చేసుకుని వేధింపులకు గురి చేశాడంటూ వెల్లడించింది. కాగా.. అమూల్య కన్నడతో పాటు తెలుగు సీరియల్స్‌లోనూ నటిస్తోంది. కన్నడ బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొంది. -
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
గత కొన్నాళ్ల నుంచి క్యాస్టింగ్ కౌచ్, సెట్స్‌లో ఎదురవుతున్న వేధింపుల గురించి పలువురు నటీమణులు బయటపెడుతున్నారు. తమకు ఎదురైన అనుభవాలు చెప్పి షాకిస్తున్నారు. తాజాగా హిందీ సీరియల్ నటి కృష్ణ ముఖర్జీకి ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఓ నిర్మాత ఈమెతో సెట్లోనే వేధిస్తున్నట్లు ఈమె ఆరోపణలు చేసింది. ఇప్పుడు ఈమెకు మద్ధతు తెలిపిన మరో సీరియల్ నటి రిద్ధిమ పండిట్.. గతంలో తనకెదురైన చేదు అనుభవాన్ని రివీల్ చేసింది.(ఇదీ చదవండి: హీరామండి సిరీస్‌లో పెద్ద తప్పులు.. ఇవి కూడా చూసుకోరా?)'ఆమెకు (కృష్ణ ముఖర్జీ) జరిగింది నిజంగా దారుణం. ఇలా ఎవరికీ జరగకూడదు. అయితే జరిగిన ఇబ్బంది గురించి ఆమె బయటకు చెప్పినందుకు హ్యాట్సాఫ్. ఎందుకంటే చాలామంది నిర్మాతలు.. నటీనటుల్ని చాలా వేధిస్తున్నారు. ఒత్తిడికి గురిచేస్తున్నారు. చాలామంది ప్రొడ్యూసర్స్.. మేము వాళ్ల సొంతమైనట్లు శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు. మేం వాళ్లు తీసే సీరియల్స్ కోసం కష్టపడుతున్నామని వాళ్లు గుర్తుంచుకోవాలి''అయితే షూటింగ్స్‌లో ఇలాంటివి జరుగుతున్నప్పటికీ చాలామంది బయటకు చెప్పలేకపోతున్నారు. గతంలో నాకు కూడా ఇలాంటి అనుభవం ఒకటి ఎదురైంది. ఓ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ చాలా వేధించాడు. అది కూడా మా అమ్మకు బాగోలేక ఆస్పత్రిలో చేర్పించిన టైంలో. ఆమె ఐసీయూలో ఉంది. విజిటింగ్ అవర్స్ ఉదయం 7-8 వరకు సాయంత్రం 4-5:30 గంటల వరకు ఉండేవి. నేను అమ్మని పరామర్శించి, షూటింగ్‌కి ఉదయం 9 గంటలకు వస్తానన్నా.. పోని ఉదయం 7 గంటలకు వచ్చి సాయంత్రం త్వరగా వెళ్లిపోతానన్నా సరే అనుమతి ఇచ్చేవాడు కాదు. దీని గురించి బయటకు చెబుదామంటే నాపై లేనిపోని పుకార్లు సృష్టించారు. అయితే చాలామంది వీటి గురించి పెద్దగా మాట్లాడరు. ఎందుకంటే చేస్తున్న పని పోతాదేమోనని భయం' అని రిద్ధిమా పండిట్ చెప్పుకొచ్చింది.(ఇదీ చదవండి: నాలుగుసార్లు అబార్షన్ అయిందా? క్లారిటీ ఇచ్చిన స్టార్ హీరోయిన్) -
అవకాశాల్లేకపోవడంతో డిప్రెషన్.. రాత్రి పెగ్గేశాకే..: నటి
మల్లిక జాగుల.. సీరియల్ కిల్లర్ వంటి కొన్ని చిన్నాచితకా చిత్రాల్లో వ్యాంప్ క్యారెక్టర్లు పోషించింది. సినిమా కంటే కూడా సీరియల్స్ ద్వారానే పేరు, డబ్బులు సంపాదించింది. ఒకప్పుడు బుల్లితెరపై ఫుల్ బిజీగా ఉన్న ఈ నటి తర్వాత మాత్రం సడన్‌గా స్మాల్ స్క్రీన్కు దూరమైంది. ఈ మధ్యే రీఎంట్రీ ఇచ్చిన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన బాధలు చెప్పుకుని ఎమోషనలైంది. 'ఇండస్ట్రీలో తెలుగువారికి అవకాశాలు ఇవ్వరు. బెంగళూరు నుంచి తీసుకొస్తారు. మమ్మల్ని చిన్నచూపు చూస్తారు, ఛాన్సులు కూడా ఇవ్వకపోయేసరికి డిప్రెషన్లోకి వెళ్లిపోయాను. సరిగా తిండి కూడా తినకపోయేసరికి నిల్చున్నచోటే పడిపోయేదాన్ని. ఆస్పత్రికి తీసుకెళ్తే బతకడం కష్టమన్నారు. ఆ స్టేజీ నుంచి మళ్లీ బతికొచ్చాను. చీరలమ్మాను.. 19 ఏళ్ల అనుభవం. కరోనా తర్వాత ఛాన్సులు నిల్.. ఎక్కడి నుంచి మొదలుపెట్టానో మళ్లీ అక్కడికే వచ్చానేంటి? అని ఆలోచించి పిచ్చిదాన్నైపోయాను. మొన్నటివరకు బతుకుదెరువు కోసం చీరలమ్మాను. పెట్రోల్ బంకులో పని చేయడానికి కూడా సిద్ధమయ్యాను. కానీ వాళ్లు చులకనగా మాట్లాడారు. పదేళ్ల క్రితం నా రెమ్యునరేషన్ రోజుకు రూ.1300. అందులో మళ్లీ కటింగ్స్ ఉంటాయి. నాలుగేళ్లు అదే పారితోషికానికి పని చేశాను. ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు డబ్బులు పోగేస్తారనుకుంటారు కానీ అందరి పరిస్థితి అలాగే ఉండదు. కమిట్మెంట్ అడిగారు సినిమా ఆఫర్లు వచ్చాయి. అలా ఓ ఆడిషన్‌కు వెళ్లినప్పుడు కమిట్మెంట్ అడిగారు. నేను నో చెప్పి వచ్చేశాను. నెలరోజులపాటు టార్చర్ పెట్టారు. అందుకే సీరియల్స్ ద్వారా నేనేంటో చూపించాను. ఇకపోతే డబ్బుల కోసం కొన్ని సినిమాల్లో వాంప్ క్యారెక్టర్లు చేయాల్సి వచ్చింది. అయితే నేను ఒళ్లు అమ్ముకోలేదు, ఒళ్లు చూపించుకున్నానంతే! గతంలో నేను ప్రేమించిన వ్యక్తి చనిపోవడంతో ఆయన్ను మర్చిపోయేందుకు మద్యం తాగేదాన్ని. అలా మద్యపానం అలవాటైంది. రాత్రి ఓ పెగ్గేసి పడుకుంటాను. ఇకపోతే నా జీవితంలో ఎవరికీ చోటు లేదు. నేను పెళ్లి చేసుకోను' అని చెప్పుకొచ్చింది. చదవండి: పెళ్లైన ఏడాదికే విడాకులు.. ఒకప్పుడు స్టార్ హీరోలతో జోడీ.. ఇప్పుడేమో! -
సినిమా ఆఫర్ కోసం వెళ్తే.. డైరెక్టర్ అలాంటి పాడు పని: బిగ్ బాస్ బ్యూటీ
క్యాస్టింగ్ కౌచ్ ఈ పదం చాలామంది వినే ఉంటారు. ఎందుకంటే సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. రంగుల ప్రపంచం లాంటి సినిమా రంగంలో ఇది సర్వ సాధారణంగా మారిపోయింది. గతంలో చాలామంది హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడారు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఏదో ఒక సందర్భంలో ఇలాంటి అనుభవం ఎదురైన వాళ్లు చాలామందే ఉన్నారు. తాజాగా ప్రముఖ నటి తనకెదురైన క్యౌస్టింగ్ కౌచ్ అనుభవాన్ని పంచుకుంది. బిగ్ బాస్ -16 కంటెస్టెంట్ శ్రీజిత దే సినీ రంగంలో ఎదుర్కొన్న చేదు అనుభవాన్ని వివరించింది. ఓ సినిమా ఆఫర్ కోసం వెళ్తే డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చింది. తాజాగా ఓ ఛానెల్‌కు ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. శ్రీజిత మాట్లాడుతూ..' నేను 17 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీలో అడుగుపెట్టా. మాది పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా అనే చిన్న పట్టణం. మా అమ్మ ఎల్లప్పుడూ నాకు మద్దతుగా ఉంటూ నాతోనే ఉండేది. మా అమ్మ దగ్గర ఏ విషయాన్ని కూడా దాచేదాన్ని కాదు. కానీ అనుకోకుండా ఇండస్ట్రీలో కొందరు చెత్త వ్యక్తులను కూడా కలిశాను. కొందరు ప్రాజెక్ట్ లేకపోయినా కేవలం మీటింగ్ కోసం పిలిచి టైం పాస్ చేసేవారు. మరికొందరు పెద్ద డైరెక్టర్‌తో సినిమా ఉందంటూ కమిట్మెంట్ అడిగేవారు. అలా రెండుసార్లు ఇలాంటి అనుభవం ఎదురైంది' అని చెప్పుకొచ్చింది. కానీ ఒకసారి చాలా భయంకరమైన పరిస్థితి నుంచి బయపడ్డానని తెలిపింది. శ్రీజిత మాట్లాడుతూ.. "నాకు 19 ఏళ్ల వయస్సులో హిందీ చిత్రం రీమేక్ ఆఫర్ వచ్చింది. డైరెక్టర్ నన్ను సమావేశానికి పిలిచారు. ఆ సమయంలో మా అమ్మ కోల్‌కతాలో ఉంది. నేను ఒంటరిగా డైరెక్టర్ ఆఫీసుకి వెళ్లాను. అతను నా భుజం పట్టుకున్న విధానం, నాతో మాట్లాడే విధానం నాకు నచ్చలేదు. అతను వయసులో చాలా పెద్దవారు. ఎలాంటి వారికైనా ఆయన బుద్ధి ఎలాంటిదో వెంటనే అర్థమైపోతుంది. అతను నన్ను చూస్తున్న తీరు చాలా అసహ్యంగా అనిపించింది. దీంతో వెంటనే నా పర్సు తీసుకుని ఆఫీసు నుంచి బయటికి పరిగెత్తా." అంటూ ఆ షాకింగ్ సంఘటనను వివరించింది. కానీ క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఎప్పుడు మోసపోలేదని తెలిపింది. కాగా.. శ్రీజిత ఉత్తరాన్, తుమ్ హి హో బంధు సఖా తుమ్హీ, లేడీస్ స్పెషల్, లాల్ ఇష్క్, యే జాదూ హై జిన్ కా లాంటి ప్రముఖ టీవీ షోలలో కనిపించింది. బెంగాలీలో తన పాత్రలకు బాగా గుర్తింపు తెచ్చుకుంది. 2007లో కసౌతి జిందగీ కే అనే షోతో తొలిసారిగా ఎంట్రీ ఇచ్చింది. అంతే కాకుండా తషాన్, మాన్సూన్ షూటౌట్, లవ్ కా ది ఎండ్, రెస్క్యూ వంటి చిత్రాలలో కూడా నటించింది. View this post on Instagram A post shared by Sreejita De Blohm-Pape (@sreejita_de) -
19 ఏళ్లకే హీరోయిన్ ఆఫర్.. ఎగిరి గంతేశా! కానీ..: నటి
హిందీ బిగ్‌బాస్ 17వ సీజన్లో బుల్లితెర జంట అంకిత లోఖండే- విక్కీజైన్ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా నిలిచారు. వీరి గొడవలు, కొట్లాటలు, ప్రేమలు, ఆప్యాయతలు, ఈర్ష్య, అసూయలు.. ఇవన్నీ ప్రేక్షకులకు వినోదాన్ని పంచాయి. అయితే ఈ షో వల్ల ఎక్కువ నెగెటివిటీని మూటగట్టుకుంది అంకితనే! తాజాగా ఈ బ్యూటీ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని బయటపెట్టింది. ఓ షోకి హాజరైన ఆమెకు క్యాస్టింగ్ కౌచ్ ఎప్పుడైనా ఫేస్ చేశావా? అన్న ప్రశ్న ఎదురైంది. ఇందుకు ఆమె అవునని తలూపుతూ ఆనాటి ఇబ్బందికర పరిస్థితులను గుర్తు చేసుకుంది. ఎగిరి గంతేశా.. 'దక్షిణాది చిత్రపరిశ్రమలో నేను ఓ ఆడిషన్‌కు వెళ్లాను. తర్వాత వాళ్లు కాల్ చేసి మీరు సెలక్ట్ అయ్యారు, వచ్చి సంతకం చేయండన్నారు. నేను సంతోషంతో ఎగిరిగంతేశాను. ఈ విషయం అమ్మకు చెప్పి సంబరపడ్డాను. అయితే ఇంత తేలికగా ఎలా సెలక్ట్ చేశారబ్బా అన్న అనుమానం కూడా వచ్చింది. నేను సంతకం చేయడానికి వెళ్లినప్పుడు నాతో వచ్చిన వ్యక్తిని బయటే ఉండమన్నారు. లోపలికి వెళ్లాక నన్ను కాంప్రమైజ్ కావాలని అడిగారు. షాకయ్యాను. నేనలాంటిదాన్ని కాదని.. నాకప్పుడు 19 ఏళ్లే. నన్ను హీరోయిన్ చేస్తారేమోనని కాంప్రమైజ్ అంటే ఏంటని అడిగాను. అందుకు వాళ్లు.. నిర్మాతతో ఒక రాత్రి ఉండాలని చెప్పారు. అప్పుడు నేను.. మీ నిర్మాతకు టాలెంట్ అవసరం లేదనుకుంటా.. కేవలం ఒక అమ్మాయి తన పక్కన ఉంటే చాలనుకుంటున్నాడు. నేను అలాంటిదాన్ని కాదని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాను' అని చెప్పుకొచ్చింది. అయితే సౌత్‌లో ఏ భాషా ఇండస్ట్రీలో ఇలాంటి అనుభవం ఫేస్ చేసిందో వివరంగా చెప్పలేదు. చదవండి: ‘భూతద్ధం భాస్కర్ నారాయణ’ మూవీ రివ్యూ -
మాటలు చెప్పడం ఈజీనే.. ఆ పరిస్థితిలో నరకం..: సత్య
అక్క, వదిన పాత్రలతో గుర్తింపు సంపాదించుకుంది సత్య కృష్ణన్. ఆనంద్, బొమ్మరిల్లు వంటి చిత్రాలతో తెలుగువారికి దగ్గరైంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది. 'మా అమ్మానాన్న ఇద్దరూ బ్యాంకు ఉద్యోగులే. అమ్మది రాజమండ్రి, నాన్నది గుంటూరు. నేను పుట్టిపెరిగిందంతా హైదరాబాద్‌లోనే! నాన్న చనిపోయాక మా స్నేహితులు, నాన్న ఫ్రెండ్స్ ఎంతో సపోర్ట్‌గా నిలబడ్డారు. ఆర్థికంగా కూడా సాయం చేశారు. సినిమాల్లోకి అనుకోకుండా వచ్చాను. నాకు ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేదు. ఇన్నేళ్ల కెరీర్లో.. ఆనంద్ సినిమాలో చేసినటువంటి పాత్ర నాకు ఇంతవరకు మళ్లీ రాలేదు. బొమ్మరిల్లు సినిమా హిట్టయింది. కానీ అందులో నా పాత్ర నిడివి ఎక్కువుంటే బాగుండనిపించింది. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉండటం అంటే అంత ఈజీ కాదు. ఇన్నేళ్ల కెరీర్లో నన్ను ఇబ్బంది పెట్టింది ఏమీ లేదు. అలా అని ఇండస్ట్రీ అంటే కేక్ వాక్ కాదు. పని చేసేటప్పుడు ఎవరైనా ఏమైనా అంటే అవి పట్టించుకోవద్దు. విసుక్కోవడం, తిట్టడం.. ఇలాంటివి సర్వసాధారణం. నేను మీతో ఎలా ఉన్నానో.. మీరు నాతో అలా ఉండంటి అని చెప్తూ ఉంటాను. నా లైన్లోకి రానివ్వను క్యాస్టింగ్ కౌచ్ విషయానికి వస్తే ఇది ప్రతిచోటా ఉంది. సముద్రంలో నీటితో పాటు ఉప్పు కూడా ఉంటుంది. ఇదీ అలాగే! నాకైతే అలాంటి అనుభవం ఎదురవలేదు. ఎవరైనా అలాంటి వైబ్స్ ఇచ్చినా నా లైన్లోకి రానివ్వను. ప్రపంచంలో ఎక్కువ అందంగా ఉండేది అమ్మాయిలే కదా.. అందుకే ఆడవాళ్లే ఇలాంటి సమస్యలు ఎక్కువ ఎదుర్కొంటున్నారు. మనం ఎలా ఉన్నాం, మనల్ని మనం ఎలా కాపాడుకున్నామనేదే ముఖ్యం. ఇలాంటి ఒత్తిడికి లొంగిపోతారు ఎవరైనా అతి చేస్తున్నట్లు అనిపిస్తే నీ లిమిట్స్‌లో నువ్వు ఉండు అని ధైర్యంగా చెప్పగలగాలి. ఇలా చెప్తే మనకు పాత్రలు ఇవ్వరేమో అని కెరీర్ గురించి భయపెడటం కరెక్ట్ కాదు. ఇది తప్ప ఇంకో ఛాన్స్ లేదనుకునేవాళ్లు ఇలాంటి ఒత్తిడికి లొంగిపోతారు. ఈ మాటలు చెప్పడం ఈజీనే కానీ ఆ పరిస్థితిలో ఉన్న వాళ్లు ఎంత నరకం చూసుంటారో ఊహించలేం. ఏదేమైనా సరే మాతో వర్కవుట్ కాదని ధైర్యంగా చెప్పగలగాలి' అని చెప్పుకొచ్చింది సత్య. -
రక్తం అమ్ముకుని కడుపు నింపుకున్నా: నటి
బుల్లితెరపై 'బ్రహ్మముడి సీరియల్'లో అప్పు పేరుతో గుర్తింపు తెచ్చుకుంది నటి నైనీషా రాయ్. సినిమాలంటే విపరీతమైన ఇష్టంతో బెంగాలీ నుంచి టాలీవుడ్‌కు వచ్చేసింది. ఇంటర్ మీడియట్ చదువుతున్న సమయంలోనే హైదరాబాద్ వచ్చేసింది. ఇక్కడ అనేక కష్టాలను ఎదుర్కొంటూ పలు సీరియల్స్‌లో ఆఫర్లు దక్కించుకుంది. కలిసి ఉంటే కలదు సుఖం, వంటలక్క, భాగ్య రేఖ, ఇంటిగుట్టు, హంసగీతం వంటి సీరియల్స్లలో ఆమె మెప్పించింది. శ్రీమంతుడు అనే సీరియల్లో లీడ్ రోల్లో కూడా నైమిషా రాయ్ కనిపించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నైనీషా రాయ్ బుల్లితెర గురించి పలు విషయాలు షేర్ చేసింది. ఇక్కడ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన కొత్తలో కనీసం తినడానికి కూడా తిండిలేదని నైనీషా రాయ్ వాపోయింది. ఆకలి తీర్చుకునేందుకు తన రక్తాన్ని కూడా అమ్ముకున్నట్లు ఆమె చెప్పింది. ఇలా ఎన్నో కష్టాలు పడుతున్న సమయంలో ఆఫర్లు వచ్చాయని సంతోషిస్తే నాకేంటి అంటూ తిరిగి అడిగే వారే ఎక్కువగా ఉన్నారని తెలిపింది. ఈ క్రమంలో ఏదో ఆఫర్ వచ్చింది కదా అని షూటింగ్‌కు వెళ్తే.. కమిట్మెంట్ కండీషన్ పెట్టారు. ఒకానొక సమయంలో బలవంతం కూడా పెట్టారు. ఆ సమయంలో వాళ్లను కొట్టి ఏదోలా వచ్చేశానని ఆమె గుర్తు చేసుకుంది. నిజ జీవితంలో కూడా నైనిషా చాలా కష్టాలను చూసింది. బెంగాలీ కుటుంబానికి చెందిన నైనిషా రాయ్ తండ్రి లెక్చరర్ అయితే ఆమె అమ్మగారు హౌస్ వైఫ్. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఆమె తెలుగు పరిశ్రమకు వచ్చింది. ఇంటర్ చదువుతున్న సమయంలోనే తాను ఇంటి నుంచి వచ్చేసినట్లు తెలిపింది. ఇక్కడ తన సొంత కష్టంతో చదువుకుంటూనే చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేసింది. వచ్చిన అవకాశాన్ని తన టాలెంట్‌తో సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తుంది. ఈ క్రమంలో ఆమె తల్లిదండ్రులకు దూరం కావడం జరిగిపోయింది. నైనిషా రాయ్ ఇండస్ట్రీ వైపు రావడం వాళ్లకి ఇష్టం లేకపోవడంతో తనే ఇంటి నుంచి వచ్చేసినట్లు తెలిపింది. కానీ తన తల్లిదండ్రులతో ఎలాంటి గొడవలు లేవని నైనిషా రాయ్ చెప్తూనే.. 'వాళ్ల ఆలోచనలో వాళ్లు కరెక్టేమో కానీ.. నాకు మాత్రం వాళ్లు చేసింది తప్పు' అని చెప్పింది. (ఇదీ చదవండి: ప్రపంచ సుందరి పోటీలు.. నా జెండా గుండెల్లో ఉంది: సినీ శెట్టి) View this post on Instagram A post shared by Nainisha (@nainisha_rai) -
తెలుగు స్టార్ హీరో టార్చర్.. సినిమా ఇండస్ట్రీనే వదిలేశా..: నటి
సీనియర్ నటి విచిత్ర తమిళంలో అనేక సినిమాలు చేసింది. సహాయ నటిగా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. పెళ్లి తర్వాత సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టి బుల్లితెరకు షిఫ్ట్ అయిన ఈ నటి ఇటీవలే తమిళ బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొంది. 21 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న ఆమె బిగ్‌బాస్ షోలో ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టింది. సినిమాలు మానేయడానికి కారణమిదే 'అది 2000వ సంవత్సరం.. ఓ దివంగత నటుడు (పేరు చెప్పడం ఇష్టం లేదు) నాకు తెలుగులో ఓ హీరోతో కలిసి నటించే సినిమా ఆఫర్ ఇచ్చారు. ఆ మూవీ షూటింగ్ కేరళలోని మలంపుళలో జరిగింది. అక్కడే నా భర్త పరిచయమయ్యాడు. అక్కడే నా జీవితంలోనే అత్యంత దారుణమైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ఎదుర్కొన్నాను. పెళ్లి చేసుకున్నాకే సినిమాలకు గుడ్‌బై చెప్పానని చాలామంది అనుకుంటున్నారు. కానీ అసలు కారణం అది కాదు. షూటింగ్లో నేను పడ్డ బాధ, నరకం వల్లే ఇండస్ట్రీకి దూరంగా వెళ్లిపోయాను. అది ఇప్పుడు మీతో పంచుకుంటున్నాను. తెలుగు హీరో తన గదిలోకి రమ్మన్నాడు ఒక తెలుగు హీరోను, నన్ను 3 స్టార్ హోటల్లో ఉండమన్నారు. ఆ హోటల్ జనరల్ మేనేజరే తర్వాత నా భర్తగా మారాడు. ఓ రోజు పార్టీ జరుగుతోంది.. అక్కడే ఆ ఫేమస్ హీరోను కలిశాను. అతడు నా పేరు కూడా అడగలేదు, కానీ డైరెక్ట్‌గా గదికి వచ్చేయమన్నాడు. నేను షాకయ్యాను. అతడి మాటను పట్టించుకోకుండా వెళ్లి నా గదిలో నేను పడుకున్నాను. ఆ తర్వాతి రోజు నుంచి షూటింగ్లో సమస్యలు చుట్టుముట్టాయి. తమిళ ఇండస్ట్రీలో ఇటువంటి సమస్యలు నాకు ఎప్పుడూ ఎదురవలేదు. తాగి వచ్చి న్యూసెన్స్ ఆ హీరో రోజూ తాగి వచ్చి నా గది తలుపు తట్టేవాడు. ఆ గండం నుంచి ఎలా బయటపడాలా అని భయపడిపోయాను. నా రూమ్‌లో ఉన్న ఫోన్‌కు ఎవరి దగ్గరి నుంచి కాల్స్ రాకుండా చూడమని హోటల్ సిబ్బందిని వేడుకున్నాను. హోటల్ మేనేజర్ పరిస్థితి అర్థం చేసుకుని చిత్రయూనిట్‌కు తెలియకుండా రోజుకో గదికి షిఫ్ట్ చేశాడు. నేను పాత రూమ్‌లో ఉన్నాననుకుని అతడు తాగి డోర్ తట్టేవాడు. ఒకరోజు అతడికి సహనం నశించి నాకు గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఓరోజు అడవిలో షూటింగ్ జరుగుతుండగా అతడు నన్ను అసభ్యంగా తాకాడు. అసభ్యంగా తాకాడు.. డైరెక్టర్ రెండో టేక్ తీసుకున్నాడు.. మళ్లీ అలాగే నన్ను అసభ్యంగా తడిమాడు. మూడోసారి కూడా అంతే.. ఇక నా వల్ల కాక అతడి చేయి పట్టుకుని లాగి స్టంట్ మాస్టర్ దగ్గరకు తీసుకెళ్లాను. అతడిని ప్రశ్నించాల్సింది పోయి ఆ స్టంట్ మాస్టర్ రివర్స్‌లో నా చెంప చెళ్లుమనిపించాడు. అందరూ చూస్తూ నిల్చున్నారే తప్ప ఎవరూ మాట్లాడలేదు. కోపం, ఆవేశం, బాధ.. ఏమీ చేయలేకపోయాను. చెంప మీద దెబ్బ తాలూకు అచ్చులతో యూనియన్ దగ్గరకు వెళ్తే ఈ సంఘటనను మర్చిపోమన్నారు. నీకు కనీస గౌరవమర్యాదలు ఇవ్వని చోట ఎందుకు పని చేస్తున్నావు? అని హోటల్ మేనేజర్ అన్నాడు. అతడు నాకోసం కోర్టులో సాక్షిగా నిలబడ్డాడు.. చాలా పోరాడాడు. నన్ను పెళ్లి చేసుకున్నాడు. నాకు ముగ్గురు అందమైన పిల్లల్ని ఇచ్చాడు' అని చెప్పుకొచ్చింది విచిత్ర. Actor Who Harassed : #Balayya (Balakrishna) Telugu Film Name : Bhalevadivi Basu (2001 Release) Stunt Director : A.Vijay Nadigar Sangam Head Who Refused Action: Radha Ravi #Vichithra #MeToo pic.twitter.com/9rrxagpUwV — Analyst (@BoAnalyst) November 22, 2023 చదవండి: త్రిషకు క్షమాపణ చెప్పను.. నేను మాట్లాడితే అగ్నిగోళం బద్దలవుతుంది: మన్సూర్ -
యాడ్ కోసం ఆడిషన్‌కు వెళ్తే కాంప్రమైజ్ అడిగాడు: నటి
క్యాస్టింగ్ కౌచ్.. అన్ని చోట్లా ఉన్నప్పటికీ సినిమా ఇండస్ట్రీలో కాస్త ఎక్కువగా కనిపిస్తూ, వినిపిస్తూ ఉంటుంది. చిన్న తరహా నటుల నుంచి పెద్ద పెద్ద హీరోయిన్ల వరకు చాలామంది ఈ క్యాస్టింగ్ కౌచ్‌ను దాటుకుంటూ వచ్చినవారే! తాను సైతం క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనంటోంది బుల్లితెర నటి మృణాల్ నవేల్. ఒక ప్రకటనలో నటించడానికి తనను కాంప్రమైజ్ అడిగారని వెల్లడించింది. యాడ్ కోసం షార్ట్‌లిస్ట్ తాజా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఏడాది క్రితం జరిగిన సంఘటన ఇది. అప్పటికే నేను టీవీ యాడ్స్ కోసం ఆడిషన్స్‌కు వెళ్తూ ఉన్నాను. ఈ క్రమంలో ఓ వ్యక్తి (క్యాస్టింగ్ ఏజెంట్) ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేశాం.. అందులో మీరు కూడా ఉన్నారు. సెలక్ట్ అయితే కార్తీక్ ఆర్యన్‌తో కలిసి ప్రకటనలో నటించవచ్చని తెలిపాడు. ఆ మరుసటి రోజే నాకో మెసేజ్ వచ్చింది. నాకు ఆ ఆఫర్ రావాలంటే కాంప్రమైజ్ కావాలన్నాడు. నాకు అప్పటికే విషయం అర్థమైంది.. కాంప్రమైజ్ అడిగాడు కానీ అతడు నా నుంచి సరిగ్గా ఏం కోరుకుంటున్నాడో తెలుసుకోవాలనుకున్నాను. ఏం కాంప్రమైజ్ కావాలి? అని అడిగాను. దానికతడు.. మరేం లేదు.. సాధారణంగా కలుసుకుని ఒక రాత్రంతా చిల్ అవడమే.. అక్కడే కాంట్రాక్ట్ మీద సంతకం పెట్టాల్సి ఉంటుందని చెప్పాడు. నాకు ఒళ్లు మండిపోయింది. చెడామడా తిట్టేయడంతో అతడు తన మెసేజ్‌లు డిలీట్ చేసుకున్నాడు. నాకిలా అడ్డదారిలో యాక్ట్ చేయడం అక్కర్లేదని చెప్పేశాను. అతడేమో.. ఇదొక సువర్ణావకాశం, దీన్ని మిస్ చేసుకోకూడదంటూ ఒత్తిడి తెచ్చాడు. సెలక్షన్ ఇలాగే జరుగుతుంది నా సహనాన్ని కోల్పోయి నోటికొచ్చిందనేశాను. దీంతో అతడు.. మీ టీవీ నటులకు సినిమాల్లో సెలక్షన్ ఎలా జరుగుతుందో తెలియదు, ఇక్కడ ప్రక్రియ ఇలాగే ఉంటుంది. అందరూ ఇలాగే చేయాలి. మీరు ఒప్పుకుంటే మేము మీకు సినిమా ఛాన్సులు కూడా ఇస్తాం అని చెప్పాడు. నేను అతడిని బ్లాక్ చేశాను, తన మాటలు వినలేకపోయాను. ప్రతి ఒక్కరూ ఇలా డైరెక్ట్‌గా చెప్పరు, కొందరు పరోక్షంగా హింట్స్ ఇస్తారు. మరికొందరు ఇదిగో ఇలా నేరుగా అడిగేస్తారు. అందుకే నాకు ఈ సంఘటన బాగా గుర్తుండిపోయింది' అని చెప్పుకొచ్చింది మృణాల్ నవేల్. చదవండి: అది నా డీఎన్ఏలోనే ఉంది.. ఎమోషనల్ అయిన సితార ఘట్టమనేని -
'వినయ విధేయ రామ' బ్యూటీపై క్యాస్టింగ్ కౌచ్.. షాకింగ్ కామెంట్స్
సినిమా ఇండస్ట్రీ అనగానే చాలామందికి గ్లామరే కనిపిస్తుంది. కానీ దాని వెనక జరిగే ఘోరాలు మాత్రం అప్పుడప్పుడు బయటకొస్తుంటాయి. చాలామంది హీరోయిన్ల దగ్గర నుంచి లేడీ యాక్టర్స్ వరకు చాలామంది మీటూ, క్యాస్టింగ్ కౌచ్ బారిన పడినవాళ్లే. అలా ఇప్పుడు ఓ బ్యూటీ తనకు ఓ రెండు సినిమాల ఇలాంటి అనుభవం ఎదురైందని భయపడుతూ చెప్పింది. ఎవరా బ్యూటీ? సోషల్ మీడియా యూజర్స్ భాషతో సంబంధం లేకుండా చాలామంది బ్యూటీస్‌ని ఆదరిస్తుంటారు. అలాంటి వాళ్లలో ఈషా గుప్తా ఒకరు. దిల్లీకి చెందిన ఈ భామ.. 'జన్నత్ 2' అనే హిందీ మూవీతో నటిగా మారింది. కెరీర్లో ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ (ఐటమ్) చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులోనూ 'వీడెవడు', 'వినయ విధేయ రామ' చిత్రాల్లో కనిపించింది. ప్రస్తుతం ఓ మూడు చిత్రాలు చేస్తోంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' నుంచి హాట్ బ్యూటీ ఎలిమినేట్!) ఏం జరిగింది? 'ఓ సినిమా విషయంలో ఇద్దరు వ్యక్తులు నన్ను ట్రాప్ చేయాలని చూశారు. అవుట్డోర్ షూటింగ్ అనేసరికి నాకు మొత్తం క్లియర్‌గా అర్థమైపోయింది. అయితే అవుట్డోర్ అనేసరికి వాళ్ల వలలో నేను పడతానని అనుకున్నారు. కానీ నేను వాళ్లకంటే స్మార్ట్‌గా ఆలోచించాను. నాకు ఒంటరిగా నిద్రపోయే అలవాటు లేదని, మేకర్ ఆర్టిస్టు కూడా నాతో పాటు రూంలో ఉంటారని చెప్పా. మేకర్ ఆర్టిస్టుని పిలిచి నిద్రపోయా' మరో సినిమా విషయంలో జరిగిన సంఘటనని కూడా ఈషా గుప్తా బయటపెట్టింది. 'సగం సినిమా పూర్తయింది. వాళ్లు అడిగిన దానికి నో చెప్పాను. దీంతో నేను సెట్లో ఉండటం ఇష్టం లేదని ఓ కో ప్రొడ్యూసర్ దర్శకుడితో చెప్పారు. ఈ సంఘటన తర్వాత నాకు చాలామంది అవకాశాలు ఇవ్వడం మానేశారు. నా గురించి సదరు కో ప్రొడ్యూసర్ బ్యాడ్‌గా చెప్పడమే దీనికి కారణం' అని ఈషా గుప్తా తనకెదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీ.. పెళ్లికి అంతా సెట్!) View this post on Instagram A post shared by Esha Gupta (@egupta) -
సినిమా అగ్రిమెంట్ సంతకం పెట్టాక కాస్టింగ్ కౌచ్‌కు తెరలేపేవారు
బిగ్‌బాస్‌కు ఎందుకు వచ్చానా? అని ఫీలవుతోంది కిరణ్ రాథోడ్. బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో అడుగుపెట్టిన ఆమె తెలుగు రాక అష్టకష్టాలు పడింది. తను మాట్లాడే భాష అర్థం చేసుకోలేక అటు ప్రేక్షకులు సైతం తెగ కష్టపడ్డారు. ఇరువురి బాధను చూడలేకపోయిన బిగ్‌బాస్ ఆమెను మొదటి వారంలోనే అవతలికి పంపించేశాడు. హీరోయిన్ అని కూడా చూడకుండా, తన టాలెంట్ కూడా బయటపెట్టనివ్వకముందే ఫస్ట్ వీక్‌లోనే ఎలా పంపించేస్తారని బాధపడుతోంది కిరణ్ రాథోడ్. తెలుగు బిగ్‌బాస్‌కు బదులు తమిళ, హిందీ బిగ్‌బాస్ షోకి వెళ్లాల్సిందని, అప్పుడు ఈ భాష అనే అడ్డుగోడ ఉండేదే కాదని వాపోయింది. అంత ఈజీ కాదు ఒకప్పుడు హీరోయిన్గా మెప్పించిన కిరణ్ రాథోడ్‌కు గతంలో రెండు సార్లు లవ్ బ్రేకప్ అయింది. అలాగే ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బారిన కూడా పడిందట. తాజా ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టింది. 'దక్షిణాదిన హీరోయిన్గా ఎంత పాపులారిటీ ఉన్నా సరే ముంబైకి వచ్చి కష్టాలు పడాల్సిందే! అప్పటికాలంలో సౌత్‌లో ఎవరు టాప్ హీరోయిన్ అనేది కూడా వారికి తెలియదు. అందుకే నేను బాలీవుడ్‌కు వెళ్లినప్పటికీ సరిగ్గా నిలదొక్కుకోలేక మళ్లీ వెనక్కు వచ్చేశాను. చెన్నైలోనే సెటిలయ్యాను. బాలీవుడ్లో క్రేజ్, ఫేమ్ తెచ్చుకోవడం అంత సులువైన విషయం కాదు. కాంప్రమైజ్ అడిగారు, రిజెక్ట్.. అంతేకాదు అక్కడ ఎన్నో చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. క్యాస్టింగ్ కౌచ్ అనుభవాల వల్ల డిప్రెషన్‌కు వెళ్లిపోయాను. కాంట్రాక్టు మీద సైన్ చేశాక అసలు రంగు బయటపెట్టేవాళ్లు. ఈరోజు రాత్రికి వస్తున్నావ్ కదా.. అని అడిగేవాళ్లు. అప్పుడు నా చేతిలో సౌత్ మూవీలు, బాలీవుడ్ చిత్రాలు.. ఏవీ లేవు. అయినా సరే కాంప్రమైజ్ అడిగేసరికి ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చేసేదాన్ని. నటన మానేసి ఏదైనా సైడ్ బిజినెస్ చేద్దామనుకున్నాను. ప్రస్తుతం అన్ని సమస్యలు తొలగిపోయాయి. ఇప్పుడు ఏ పని గురించి ఎవరినీ అడగాల్సిన పని లేదు. మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. రెండుసార్లు బ్రేకప్.. గతంలో నేనొకరిని ప్రేమించాను. అతడితో నాలుగేళ్లపాటు రిలేషన్లో ఉన్నాను. కానీ అతడు సరైనవాడు కాదని ఆలస్యంగా తెలుసుకున్నాను. అతడిని పెళ్లి చేసుకుని ఉండుంటే కచ్చితంగా నన్ను చంపేసేవాడే! అలాంటివాడి కోసం ఆఫర్లు వదిలేసుకున్నాను. తర్వాత ప్రేమించినవాడు కూడా మంచోడు కాదు. తనతోనూ బ్రేకప్ అయింది. ఆ వయసులో వారు కొట్టినా కూడా మనమీద అతి ప్రేమతో అలా చేశారేమో అనిపించేది. కానీ నెమ్మదిగా అన్నీ అర్థమయ్యాయి. గత ఏడేళ్లుగా ఎవరినీ డేటింగ్ చేయలేదు. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన కూడా లేదు' అని చెప్పుకొచ్చింది కిరణ్ రాథోడ్. చదవండి: శివాజీది కన్నింగ్ గేమ్, ప్రశాంత్ గురించి మాట్లాడటమే వేస్ట్.. -
సినీ ఇండస్ట్రీలో అడ్జస్ట్మెంట్? స్పందించిన హీరోయిన్
సినిమా రంగంలో హీరోయిన్ల గురించి ఎప్పుడూ ఏదో ఒకరకమైన ప్రచారం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా అడ్జెస్ట్మెంట్ అనే పదం ఎక్కువగా వినిపిస్తుంటుంది. అడ్జెస్ట్మెంట్ అన్న విషయం గురించి పలువురు హీరోయిన్లు ప్రస్తావిస్తూ వచ్చారు. తమకు అలాంటి అనుభవం ఎదురు కాలేదనే చాలామంది చెబుతుంటారు. నటి మహిమా నంబియార్ కూడా ఇందుకు అతీతం కాదు. ఈ కేరళ భామ మోడలింగ్ నుంచి చిత్ర రంగ ప్రవేశం చేసింది. 15 ఏళ్ల వయసులోనే అంటే 2010లోనే మాతృభాషలో నటిగా పరిచయం అయ్యింది. ఆ విధంగా ఈమె నట వయస్సు 13 ఏళ్లు. 2012లో సాట్టై చిత్రం ద్వారా కోలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించడంతో ఇక్కడ మహిమ నంబియార్‌కు వరుసగా అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. అలా మలయాళంలో కంటే తమిళంలోనే ఎక్కువ చిత్రాలలో నటిస్తోంది. ప్రస్తుతం ఈమె రాఘవ లారెన్స్‌కు జంటగా నటించిన చంద్రముఖి–2 ఈనెల 28న తెరపైకి రానుంది. అదే విధంగా విజయ్ ఆంటోని సరసన నటించిన రత్తం, ముత్తయ్య మురళీధరన్ బయోపిక్‌గా తెరకెక్కిన '800' చిత్రాలు కూడా అక్టోబర్ 6వ తేదీన విడుదలకు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. క్రికెట్ క్రీడాకారుడు ముత్తయ్య జీవిత చరిత్రతో రూపొందిన 800 చిత్రంలో తాను ఆయన భార్య మదిమలర్గా నటించినట్లు చెప్పింది. ఇందులో తన పాత్ర చిన్నదే అయినా ఈ చిత్రం తనకు చాలా స్పెషల్ అని పేర్కొంది. ముత్తయ్య మురళీధరన్ ఒక క్రికెట్ క్రీడాకారుడిగానే అందరికీ తెలుసని, అయితే ఆయన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించారని, అలా ఆయనలోని రియల్ కోణాన్ని చూపించే చిత్రమే 800 అని చెప్పింది. ఇకపోతే చంద్రముఖి –2 చిత్రంలో రాఘవ లారెన్స్ మాస్టర్‌కు జంటగా నటించడం మంచి అనుభవంగా పేర్కొంది. మలయాళం, తెలుగు భాషల్లో తన సినీ పయనం సాగుతున్నా, ప్రస్తుతానికి మలయాళంలో ఏ చిత్రం చేయడం లేదని చెప్పింది. సినిమా పరిశ్రమలో మహిళలకు రక్షణ ఉందా? అని అడుగుతున్నారని అయితే ఇతరుల గురించి తాను చెప్పలేనని తన వరకైతే మాత్రం ఎలాంటి చేదు అనుభవం ఎదురుకాలేదని ఆమె తెలిపారు. View this post on Instagram A post shared by Mahima Nambiar (@mahima_nambiar) చదవండి: లావణ్య త్రిపాఠి రూట్లో కృతి శెట్టి.. పెళ్లిపై నిజమెంత? -
అప్లికేషన్ ఫామ్‌లో అడ్జస్ట్మెంట్ కాలమ్.. క్యాస్టింగ్ కౌచ్‌పై నటి
సినిమా ఇండస్ట్రీలో అడవాళ్లు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య క్యాస్టింగ్ కౌచ్. నీకు ఛాన్స్ ఇస్తాం సరే, మరి నువ్వు మాకేమిస్తావు?.. కాంప్రమైజ్ కాకపోతే నీకు అవకాశాలే రావు.. ఇలాంటి సూటిపోటి మాటలు అడుగడుగడునా వినిపిస్తూనే ఉంటాయి. ఎందరో నటీనటులు ఇటువంటి అడ్డంకులు దాటుకుని ముందుకు వచ్చినవాళ్లే! అందులో ఒకరు బుల్లితెర నటి రేష్మ ప్రసాద్. తాజాగా ఆమె క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. సినిమాల్లోనే కాకుండా సీరియల్స్‌లోనూ కాంప్రమైజ్ అడుగుతారని చెప్పుకొచ్చింది. గుర్తింపు రాని చిన్న రోల్స్‌కు సైతం కాంప్రమైజ్.. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో అడ్జస్ట్మెంట్ అనేది చాలా సాధారణ విషయమైపోయింది. గదిలోకి రావడానికి అడ్జస్ట్ అవుతావా? అని చాలా సింపుల్‌గా అడిగేస్తారు. కొన్ని అప్లికేషన్ ఫామ్స్‌లో అయితే అడ్జస్ట్‌మెంట్‌కు ఒప్పుకుంటున్నావా? అని ప్రత్యేకంగా ఓ కాలమ్ కూడా ఉంటోంది. ప్రధాన పాత్రలకే కాదు, సైడ్ క్యారెక్టర్లు, అసలు గుర్తింపు రాని చిన్నాచితకా పాత్రలకు కూడా కాంప్రమైజ్ అడుగుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ మహమ్మారి వల్ల నిజమైన ప్రతిభావంతులు భయంతో వెనకడుగు వేస్తున్నారు. ఒప్పుకునేవరకు ఒత్తిడి.. లొంగిపోయా అప్లికేషన్ ఫామ్‌లో అడ్జస్ట్‌మెంట్‌కు ఒప్పుకోవడం లేదని రాసినా సరే మళ్లీ అదే టాపిక్ తీసుకొచ్చి ఒత్తిడి చేస్తారు. మంచి పాత్ర కోసం, ఫేమ్ కోసం, కన్న కలలు సాకారం చేసుకోవడం కోసం ఆ ఒత్తిడికి లొంగిపోతాం. గతంలో నేను కూడా ఓసారి ఒత్తిడి తట్టుకోలేక నా కెరీర్ కోసం అడ్జస్ట్‌మెంట్‌కు ఒప్పుకున్నాను. ఈ విషయం నేనెందుకు చెప్తున్నానంటే ఇండస్ట్రీలో వాస్తవంగా ఏం జరుగుతుందో అందరికీ తెలియాలి. తెరపై తమను తాము చూసుకోవాలని ప్రయత్నాలు చేసేవారికి ఇప్పటికైనా మంచి వాతావరణం కల్పించాలి' అని కోరుతోంది రేష్మ. చదవండి: ఓటీటీలో 13 సినిమాలు, సిరీస్‌ల సందడి.. ఏవేవి ఎక్కడ స్ట్రీమింగ్ అంటే.. -
ఇండస్ట్రీలో నన్నూ అలాంటి కోరికే కోరారు: ఇమ్మానుయేల్
సినీ పరిశ్రమలో సర్దుకుపోవడం (కాస్టింగ్ కౌచ్) అనే పదం ఇటీవల మళ్లీ ఎక్కువగా వినిపిస్తోంది. నటి అను ఇమ్మానుయేల్ కూడా అలాంటి సంఘటనలను ఎదుర్కొన్నాను అని పేర్కొంది. చదువుకునే రోజుల్లోనే బాలనాటిగా సినీ రంగ ప్రవేశం చేసిన ఈ మలయాళీ బ్యూటీ ఆ తర్వాత 2016లో నిఫిన్ బాలికి జంటగా యాక్షన్ హీరో బిజూ అనే మలయాళ చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయం అయింది. ఆ తర్వాత 2016లోనే 'నాని' కథానాయకుడిగా నటించిన 'మజ్ను' చిత్రంలో కిరణ్మై పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ సరసన 'నమ్మవీట్టు పిళ్లై' చిత్రంలో కథానాయకిగా నటించింది. ఈ చిత్రం తర్వాత అక్కడ మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశించింది. అయితే ఆ చిత్రం విజయాన్ని సాధించిన అను ఇమ్మానుయేల్‌ను మాత్రం అక్కడ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో తెలుగు చిత్ర పరిశ్రమపై దృష్టి సారించింది. ఇక్కడ స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వరించాయి. అలా అజ్ఞాతవాసి,నా పేరు సూర్య,గీత గోవిందం వంటి సినిమాలు చేసినా ఈ అమ్మడిని ఎప్పటికీ స్టార్ ఇమేజ్ వరించలేదని చెప్పాలి. తాజాగా కార్తీక్ జంటగా 'జపాన్' చిత్రంలో నటించింది. త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతున్న ఈ చిత్రంపై అను ఇమ్మానుయేల్ చాలా ఆశలు పెట్టుకుందనే చెప్పాలి. కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సర్దుకుపోవడం అనే అంశంపై స్పందిస్తూ. అను ఇమ్మానుయేల్ తనకూ అలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పింది. అయితే ఇలాంటి ఘటనలను కుటుంబ సభ్యుల అండతో ఎదుర్కొన్నానని చెప్పింది. ఇలాంటి సందర్భాల్లో సమస్యను ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యుల అండతో ఎదుర్కోవడం మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
ఆడిషన్ కోసం ఇంటికి రమ్మన్నాడు.. ఉర్ఫీ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ నటి ఉర్ఫీ జావెద్ పరిచయం అక్కర్లేని పేరు. తన విచిత్రమైన ఫ్యాషన్ డ్రెస్సులతో వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటోంది. ఇటీవల ముంబయిలో ఓ ఇంటరాక్షన్ సందర్భంగా పలు ఆసక్తికర కామెంట్స్ చేసింది. ముంబయిలో తొలినాళ్లలో ఎదురైన ఇబ్బందులను గురించి నోరు విప్పింది. సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఉర్ఫీ.. కెరీర్ ఆరంభం ఎదురైన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను వెల్లడించింది. (ఇది చదవండి: నాకున్న జబ్బు ఇదే, ఎక్కువ రోజులు బతకనని చెప్పారు: నటి) ముంబయికి వచ్చిన తర్వాత సినిమాల్లో అవకాశాల కోసం చాలా ఆడిషన్స్‌కు హాజరైనట్లు తెలిపింది. అయితే ఓ దర్శకుడు మాత్రం తనను నీ లవర్‌లా భావించి సన్నిహితంగా మెలగాలని కోరినట్లు ఉర్ఫీ తన అనుభవాన్ని పంచుకుంది. అంతే కాకుండా తనను కౌగిలించుకోవాలని బలవంతం చేశాడని పేర్కొంది. అయితే తాను మాత్రం అయిష్టంకానే కౌగిలించుకుని.. అక్కడే అతనికి గుడ్ బై చెప్పానని తెలిపింది. అయితే ఆ గదిలో కెమెరా లేకపోవడంపై అతన్ని నిలదీస్తే.. నా తలే నా పర్సనల్ కెమెరా అని బదులిచ్చాడని వివరించింది. ఇలాంటి వారి బారిన పడకుండా యువతులను హెచ్చరించడానికి కాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకున్నట్లు వివరించింది. ఆ తర్వాత ముంబయికి చెందిన ఓ దర్శకుడు ఆడిషన్ కోసం ఏకంగా తన ఇంటికి పిలిచాడని ఉర్ఫీ గుర్తు చేసుకుంది. కాగా.. ప్రస్తుతం బిగ్ బాస్-16 ఫేమ్ నిమృత్ కౌర్ అహ్లువాలియా నటిస్తోన్న ఏక్తా కపూర్ చిత్రం 'లవ్, సెక్స్ ఔర్ ధోఖా 2'లో ఉర్ఫీ కనిపించనుంది. ఇటీవలే ముగిసిన బిగ్ బాస్ ఓటీటీ-2 సీజన్లో గెస్ట్‌గా కనిపించింది. అంతేకాకుండా 'బడే భయ్యా కి దుల్హనియా', 'మేరీ దుర్గా', 'బేపన్నా' లాంటి సీరియల్స్‌లో కూడా నటించింది. (ఇది చదవండి: రీఎంట్రీలో చిరంజీవి ఆ తప్పులు చేస్తున్నారా?) -
ఫోన్ చేసి అడ్జస్ట్‌మెంట్‌కు ఓకేనా అని అడిగాడు: రెజీనా
చెన్నై బ్యూటీ రెజీనా తొలుత కోలీవుడ్‌లో నట పయనాన్ని ప్రారంభించి ఆ తరువాత టాలీవుడ్ తదితర దక్షిణాది భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2005లో కండనాళ్ మొదల్ తమిళ చిత్రంతో కథానాయికగా పరిచయం అయ్యింది. ఆ చిత్రం విజయంతో ఇక్కడ మరికొన్ని చిత్రాలు అవకాశాలను రాబట్టుకుంది. కానీ కోలీవుడ్‌లో స్టార్‌డమ్‌ను అందుకోలేకపోయింది. అయితే టాలీవుడ్లో ఈమె యువ కథానాయకులతో జత కట్టి మంచి పేరునే తెచ్చుకుంది. తెలుగులోనే ఎక్కువ చిత్రాలు చేస్తోంది. ఇటీవల అవకాశాలు తగ్గుముఖం పట్టాయని చెప్పాలి. దీంతో ఈ అమ్మడు వెబ్‌సిరీస్‌ల పైన దృష్టి సారిస్తోంది. తాజాగ కోలీవుడ్‌లో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన రెజీనా కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. (ఇదీ చదవండ: ఏపీలో పవన్ పొలిటికల్ భవిష్యత్‌పై మంచు విష్ణు కామెంట్!) రెజీనా తన పదిహేడేళ్ల వయసులో వెండితెరకు పరిచయం అయింది. ఆ సమయంలో చాలా మంది నుంచి చేదు అనుభవాలు ఎదురయ్యాయని తెలిపింది. 'నా సినీ కెరియర్ ప్రారంభంలో అవకాశాల కోసం కొందరిని సంప్రదించాను. దాంతో ఓ వ్యక్తి నాకు ఫోన్ చేసి ఛాన్స్ ఇస్తానని అడ్జస్ట్‌మెంట్‌కి ఓకే చెబితే తర్వాత వెంటనే షూటింగ్ పని చూసుకోవచ్చన్నాడు. ఇది జరిగి ఇప్పటికి సుమారు 10 సంవత్సరాలు అయింది. నా వయసు అప్పుడు కేవలం 20 ఏళ్లు. అతని మాటల పట్ల నాకు సరైన అవగాహన లేదు. అడ్జస్ట్మెంట్ అంటే ఏమిటో కూడా తెలియదు. రెమ్యునరేషన్ విషయంలో అడుగుతున్నారేమోనని, సరే నా మేనేజర్ నీతో మాట్లాడతారని ఫోన్ కట్ చేశాను.' అని రెజీనా తెలిపింది. (ఇదీ చదవండి: టైగర్ కా హుకూం ఈ విషయం తెలుసా.. ? జైలర్ సక్సెస్ సీక్రెట్ ఇదే) తర్వాత మేనేజర్ ద్వారా అసలు విషయం తెలిసింది. ఆ ఫోన్ చేసిన వ్యక్తి వేరే రకమైన కోరిక కోరాడని ఆర్థమైంది. ఆ సంఘటన తర్వాత మళ్లీ అలాంటి అనుభవం ఎదురుకాలేదు. అయితే కొందరు నటీమణులు మాత్రం ఇలాంటి ఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని నిజం కావచ్చు, కొన్ని అబద్ధం కావచ్చు. కొంత మంది నటీమణులు ఫేమ్ కోసం అబద్ధాలు కూడా చెబుతారు. నిజం ఏమిటో వారికి మాత్రమే తెలుసు అని రెజీనా అన్నారు. ప్రస్తుతం రెజినీ వెబ్ సీరిస్‌లతో పాటు పలు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. -
'మీరు చేయకపోతే చాలామంది ఉన్నారని చెప్పాడు'.. క్యాస్టింగ్ కౌచ్‌పై బుల్లితెర నటి!
బాలీవుడ్ బుల్లితెర భామ చారు అసోఫా బీటౌన్‌లో అందరికీ సుపరిచితమే. 'మేరే ఆంగ్నే మే' సీరియల్‌తో ప్రేక్షకుల ఆదరణ తెచ్చుకుంది. ఆ తర్వాత దేవోన్ కే దేవ్...మహాదేవ్, బల్వీర్, జిజి మా, కైసా హై యే రిష్టా అంజనా లాంటి సీరియల్స్‌లో నటించింది. అంతే కాకుండా ఇంపేషంట్ వివేక్, కాల్ ఫర్ ఫన్, యోల్క్, జోహరి లాంటి హిందీ చిత్రాల్లో కనిపించింది. (ఇది చదవండి: ఈ హీరోయిన్ని గుర్తుపట్టారా? జూ.ఎన్టీఆర్‌తో ఆ సినిమాలో ) ఈ ఏడాదిలోనే తన భర్త రాజీవ్ సేన్ నుంచి విడాకులు తీసుకున్న ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైంది. ఈ సందర్భంగా కెరీర్ ప్రారంభంలో ఎదురైన అనుభవాలను పంచుకుంది. తన జీవితంపై తీవ్ర ప్రభావం చూపిన సంఘటనను వివరించింది. తనకు 20 ఏళ్ల వయసులో క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు తన అంచనాలను తారుమారు చేశాయని పేర్కొంది. చారు అసోఫా మాట్లాడుతూ..' నేను సినిమా అవకాశంపై మాట్లాడానికి వెళ్లా. అది చాలా పేరున్న ప్రొడక్షన్ హౌస్. అక్కడు ఓ డైరెక్టర్‌ను కలిశాను. ఆ సమయంలో డైరెక్టర్ నా ముందు ఓ ప్రాజెక్ట్ ఉంచాడు. అది పెద్ద ప్రాజెక్ట్ కావడంతో నేను వెంటనే సంతకం చేశా. ఆ తర్వాత నాకు ఊహించని సంఘటన ఎదురైంది. అతను అడిగిన మాటలకు నాకు మూడు రోజులు జ్వరం తగ్గలేదు. అతని మాటలకు రెండు చేతులు జోడించి.. మీరు అడుగుతున్నది నేను చేయలేనని చెప్పా. దానికి అతను బదులిస్తూ.. నువ్వు చేయకపోతే బయట చాలామంది అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు అంటూ చెప్పాడు. అలా అయితే మీరు వారినే సెలెక్ట్ చేసుకోండి.' అంటూ అక్కడి నుంచి వచ్చేశా అని తెలిపింది. ఆ సమయంలో తాను ధైర్యంగా అతన్ని ఎదిరించినట్లు వెల్లడించింది. అంతే కాకుండా తనకు తెలిసిన కొంతమంది డైరెక్టర్లతో కాంప్రమైజ్ కావాలని కోరినట్లు ఆమె వెల్లడించింది. కాగా.. ప్రస్తుతం చారు అసోపా తన 18 నెలల కూతురు జియానా బాధ్యతలు చూసుకుంటోంది. (ఇది చదవండి: సినిమాని 'దేశభక్తి' కాపాడిందా? లేదంటే..!) -
మీరు ఒక్కరే రండి అనేవారు.. నాకు అర్థమయ్యేది కాదు: ఆమని
తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న నటి ఆమని. తెలుగులో జంబలకిడిపంబ చిత్రం ద్వారా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్‌హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత బాపు దర్శకత్వం వహించిన మిస్టర్ పెళ్లాం సినిమాలో ఆమనికి మంచి పేరు తీసుకొచ్చింది. ఆ సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ ఫిల్మ్ అవార్డు అందుకుంది. తెలుగుతో పాటు తమిళంలో చాలా సినిమాల్లో నటించింది. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన ఆమని.. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ నటనలో అడుగుపెట్టింది. ఈ ఏడాదిలో వినరో భాగ్యము విష్ణుకథ, అల్లంత దూరాన చిత్రాల్లో కీలక పాత్ర పోషించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమని కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ముఖ్యంగా హీరోయిన్స్ క్యాస్టింగ్ కౌచ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. (ఇది చదవండి: చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడెలా ఉంది? ఏం చేస్తుందంటే?) ఆమని మాట్లాడుతూ..'హీరోయిన్లలకు క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎప్పటినుంచో ఉన్నాయి. అప్పుడు సోషల్ మీడియా లేదు. అందుకే ఎవరికీ తెలియకపోయేది. ఏ వృత్తిలోనైనా సరే మంచి, చెడు రెండు ఉంటాయి. హీరోయిన్స్‌గా అది మనం డెసిషన్ తీసుకోవాలి. తమిళంలో ఇలాంటి పరిస్థితి నాకు ఎదురైంది. కొన్ని చిన్న సంస్థల్లో ఇలాంటివీ జరిగేవి. నాకు ఒకసారి స్విమ్మింగ్ పూల్ సీన్ కోసమని డ్రెస్సు తీసి ఏమైనా స్ట్రెచ్ మార్కులు ఉన్నాయేమో చూడాలి అన్నారు. కానీ నేను ఒప్పుకోలేదు. ఇలాంటి వారు కేవలం వాటి కోసమే వస్తారు. నేను వెంటనే అలాంటి క్యారెక్టర్‌ను వద్దనేదాన్ని. ఈ విషయంలో హీరోయిన్స్ వ్యక్తిగత నిర్ణయం. మనం ఎవరినీ తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కొందరు అడ్వాన్స్ ఇచ్చినా వెంటనే ఫోన్ చేసేవారు. డైరెక్టర్ స్టోరీ గురించి మాట్లాడాలన్నారు. మీరు రావాలంటా అని మేనేజర్ ఫోన్ చేసేవారు. కానీ ఈ విషయాలు నాకు చాలా రోజులకు అర్థమయ్యేవి. ' అని అన్నారు. ఆమని ఓ సంఘటనపై మాట్లాడుతూ..' అప్పుడు సెల్‌ఫోన్స్ లేవు కదా. డైరెక్ట్‌గా మేనేజర్ వచ్చి మాట్లాడేవారు. డైరెక్టర్ స్టోరీ గురించి మాట్లాడాలని అన్నారు. అది కూడా ఓ బీచ్ దగ్గర అని చెప్పారు. అక్కడికి మిమ్మల్ని రమ్మంటున్నారు సార్. ఫైనాన్షియర్ వస్తున్నారు మిమ్మల్ని చూడాలంటా అన్నారు. అసలు ఫైనాన్షియర్ నన్ను ఎందుకు చూడాలి? డైరెక్టర్, నిర్మాత చూస్తే చాలు కదా. ఇంకా ఎక్కువ అనుకుంటే హీరో చూడాలి. ఎందుకంటే ఆయన పక్కన నటించేవారు కాబట్టి తప్పదు. కానీ ఫైనాన్షియర్ చూడటమేంటి? అని అనుమానం వచ్చేది. కానీ కొన్ని రోజుల తర్వాత నాకు అర్థమైంది. ఒక్కోసారి మమ్మీ వద్దండీ.. మీరు మాత్రమే రండి అని కారు తీసుకొచ్చే వారు. అక్కడే నాకు వారి మైండ్‌సెట్ అర్థమయ్యేది. ఐ యామ్ సారీ.. నేను రాను అని చెప్పేదాన్ని. ' అంటూ సమామాధానమిచ్చింది. (ఇది చదవండి: భార్యతో స్టార్ హీరో విడాకులు.. కానీ మామతో ప్రత్యేక అనుబంధం!) -
టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్.. డబ్బులిస్తా వచ్చేయన్నాడు: హీరోయిన్
సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపించే పదం క్యాస్టింగ్ కౌచ్.. చాలామంది హీరోయిన్లు ఇటువంటి అడ్డంకులను దాటి వచ్చినవారే! గ్లామర్ ప్రపంచంలో అడుగుపెట్టాలన్న ఎంతోముంది యువతుల కలను తమకు అనుకూలంగా మార్చుకుంటాయి కొన్ని ఏజెన్సీలు. తామడిగిందిస్తే వాళ్లడిగినట్లు అవకాశాలు ఇస్తామంటారు. ఇటువంటివారికి చెంప చెళ్లుమనేలా సమాధానం ఇచ్చినవాళ్లు కొందరైతే కొంత భయం, మరికొంత ఆందోళనతో.. కంటతడి పెట్టుకున్నవాళ్లు మరికొందరు! తాను కూడా ఇటువంటి చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నానంటోంది హీరోయిన్ ప్రాచీ ఠాకర్. రాజుగారి కోడి పులావ్ సినిమాలో హీరోయిన్గా నటించిన ప్రాచీ ఠాకర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే నాకు సినిమాలపై ఆసక్తి ఉంది. చదువుకునే రోజుల్లోనే పటాస్ సినిమా చేశాను. ఆ తర్వాత ఒక యాడ్ ఏజెన్సీ వాళ్లు నన్ను సంప్రదించారు. ఒక యాడ్ చేయమని అడిగితే సరేనన్నాను. కానీ నాకు భాష రాకపోవడంతో తెలుగు స్నేహితుడిని మీడియేటర్‌గా పెట్టుకున్నాను. మీటింగ్స్ అంతా బానే జరిగాయి. అడ్వాన్స్ చెక్ కూడా ఇచ్చారు. ఆ వ్యక్తి నా నెంబర్ తీసుకున్నాడు. అతడు షూటింగ్ ఎప్పుడనేది చెప్తానన్నాడు. మరి కమిట్మెంట్ ఇస్తున్నారు కదా అన్నాడు. నాకర్థం కాలేదు. అడ్వాన్స్ ఇచ్చారు కదా, ఏ రోజు షూట్ ఉంటే ఆరోజే కమిట్మెంట్ ఇస్తానని చెప్పాను. ఆయనుండి అది కాదు, కమిట్మెంట్కు నువ్వు రెడీ కదా? అని అడిగాడు. నువ్వు డేట్ చెప్పు, కచ్చితంగా షూట్‌కు వస్తా అని మళ్లీ చెప్పా. దానికతడు అది కాదు.. నాకు ఒక పార్ట్నర్ ఉన్నాడు. నీకు రెండు లక్షలిస్తా.. అతడితో కాంప్రమైజ్ అవుతావా? అని అడిగాడు. నాకర్థం కాకపోవడంతో ఆ సంభాషణను స్క్రీన్‌షాట్ తీసి నా ఫ్రెండ్‌కు పంపించాను. ఆమె సవివరంగా చెప్పింది. అసలు విషయం అర్థమవడంతో బాధేసింది. ఆ యాడ్ కూడా చేయనని చెప్పాను' అని చెప్పుకొచ్చింది ప్రాచీ ఠాకర్. View this post on Instagram A post shared by Prachi Thaker (@prachithaker_official) చదవండి: వంద కోట్లు దాటిన రజనీకాంత్ రెమ్యునరేషన్ -
ఛాన్సుల కోసం కాంప్రమైజ్ అవమన్నారు.. ఈ నటి మాత్రం!
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్, ప్రలోభపరచడం లాంటివి ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయి. కాకపోతే అప్పట్లో పెద్దగా బయటపెట్టేవారు కాదు గానీ ఇప్పుడు ధైర్యంగా ఆయా విషయాల్ని పంచుకుంటున్నారు. చిన్న యాక్టర్స్ నుంచి స్టార్ హీరోయిన్ల అందరూ ఇలాంటి ఏదో ఓ సందర్భంలో దీని బారిన పడినవాళ్లే. ప్రముఖ నటి నోరా ఫతేహి కూడా ఇందులో మినహాయింపు ఏం కాదు. గతంలో తనకు జరిగిన ఓ షాకింగ్ విషయాన్ని ఇప్పుడు రివీల్ చేసింది. (ఇదీ చదవండి: ఆ నటి దగ్గర ప్రపంచంలోనే ఖరీదైన హ్యాండ్ బ్యాగ్) కాంప్రమైజ్ అవ్వమన్నారు 'కెరీర్ ప్రారంభంలో నన్ను కూడా పదేపదే కాంప్రమైజ్ అవ్వమని చెప్పారు. కొందరు వ్యక్తులతో డేటింగ్ చేయమని బలవంతం చేసేవారు. కానీ నేను ఆరోజు వాటిని తలొగ్గలేదు. నాకున్న దారిలోనే నేను వెళ్లాను. విజయవంతం అయ్యాను. ఇప్పుడు నేను ఇలా ఉన్నానంటే దానికి మరో వ్యక్తితో తిరగడం, ఆ హీరోతో రాసుకుపూసుకు తిరగడం అయితే కారణం కాదు' అని నటి నోరా ఫతేహి చెప్పుకొచ్చింది. నోరా.. తెలుగులోనూ 2014లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నోరా.. ఆ తర్వాత ఏడాది ఎన్టీఆర్ 'టెంపర్'లో స్పెషల్ సాంగ్ చేసి ఎంటర్టైన్ చేసింది. కిక్ 2, షేర్, లోఫర్, ఊపిరి తదితర చిత్రాల్లో తన డ్యాన్సులతో ఆకట్టుకుంది. మళ్లీ ఇన్నాళ్లకు వరుణ్ తేజ్ 'మట్కా'లో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ప్రత్యేక గీతంతో పాటు ఈమె పాత్రకు ప్రాధాన్యం ఉన్నట్లు తెలుస్తోంది. సినిమాలని పక్కనబెడితే ఈమెకు సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ప్రత్యేకించి ఈమె ఫొటోలు, వీడియో పోస్ట్ చేస్తే చాలు కుర్రాళ్లు వెర్రెక్కిపోతుంటారు. View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) View this post on Instagram A post shared by Nora Fatehi (@norafatehi) (ఇదీ చదవండి: సమంత మరోసారి ప్రేమలో పడిందా? మరి ఆ ఫొటోలు!) -
'సినిమా కోసం సెలక్ట్ అయ్యా అనుకునేలోపు డైరెక్టర్ తేడాగా మాట్లాడాడు'
యూట్యూబర్ నుంచి నటిగా, అక్కడి నుంచి హోస్ట్‌గా పలు అవతారాలెత్తింది వీజే దీపిక. ఈ తమిళ బుల్లితెర నటికి ఇన్‌స్టాగ్రామ్‌లో మంచి ఫాలోయింగే ఉంది. పాండియన్ స్టోరీస్ సీరియల్‌తో ఈమెకు ఎక్కడలేని గుర్తింపు వచ్చింది. తాజాగా ఆమె ఓ ఆడిషన్లో ఎదురైన చేదు అనుభవాన్ని వెల్లడించింది. 'రాఘవ లారెన్స్ సినిమాలో అతడి చెల్లెలి పాత్ర కోసం ఆడిషన్‌కు వెళ్లాను. డైరెక్టర్ నన్ను ఓకే చేయడంతో ఎగిరి గంతేశాను. అయితే సినిమాలో ఓ ముద్దు సీన్ ఉంటుందని, ఇప్పుడు దాన్ని ఓసారి రిహార్సల్ చేసి చూపించమని అడిగాడు. ఆ మాటతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను. ఆడిషన్స్‌లో ముద్దు సీన్ చేసి చూపించడమేంటని నేను చేయనన్నాను. కానీ డైరెక్టర్ నాపై ఒత్తిడి తెచ్చాడు. ఇది నీకు మంచి అవకాశం, ఛాన్స్ చేజారుతుంది, నీ ఇష్టం అని మాట్లాడాడు. నాకు అతడి మాటతీరు, ప్రవర్తన ఏమాత్రం నచ్చలేదు. అతడు చెప్పినట్లు చేయకపోతే ఆడిషన్‌కు వచ్చినవారిలో ఎవరో ఒకరిని సెలక్ట్ చేసుకుంటానని దురుసుగా మాట్లాడాడు. ఈ సంఘటన జరిగినప్పుడు నేను ఎంతగానో మధనపడ్డాను' అని చెప్పుకొచ్చింది దీపిక. కాగా 2018లో వచ్చిన పాండియన్ స్టోరీస్ సీరియల్‌తో వీజే దీపిక వార్తల్లో నిలిచింది. ఇందు సుజిత, స్టాలిన్ సహా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇకపోతే సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దీపిక యూట్యూబ్ ఛానల్లో వీడియోలు కూడా చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటోంది. చదవండి: 9వ నెల గర్భంతో లహరి, సీమంతం ఫోటోలు వైరల్ నాకు ప్రెగ్నెంట్ అవాలనుంది: గేమ్ ఛేంజర్ హీరోయిన్ -
డైరెక్టర్ అసభ్య ప్రశ్న.. కౌంటర్ ఇచ్చిన టాప్ హీరోయిన్
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ హీరోయిన్లలో షెర్లిన్ చోప్రా ఒకరు. అక్కడ ఈ బ్యూటీ చేసిన సినిమాలు తక్కువే అయినా.. ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం చాలా ఎక్కువ. 2012లో 'ప్లేబోయ్' అనే శృంగార పత్రికలో పూర్తి నగ్నంగా ఫోజులిచ్చి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది షెర్లిన్ చోప్రా. హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు వివాదస్పద విషయాలపై స్పందిస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. ఈమె పక్కా హైదరాబాదీనే తన చదవు, బాల్యం అంతా ఇక్కడే.. సినిమాలపై ఆసక్తితో తను ముంబయిలో అడుగు పెట్టింది. గతంలో కొంతమంది సినీ దర్శకులు తనను బాడీషేమింగ్ చేశారని తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇలా బయటపెట్టింది. (ఇదీ చదవండి: 'బేబీ' ఫేమ్ వైష్ణవి కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్.. హీరో ఎవరంటే) 'నా వక్షోజాల గురించి చాలా మంది దర్శకులు ఓపెన్‌గానే సర్జరీ చేయించుకున్నావా అని అడిగేవారు. ఇలాంటి వారి లిస్ట్ చాలానే ఉంది. నాకు అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు కాబట్టి అవును.., చేయించుకున్నాననే చెప్పాను. ఎందుకంటే నాపై భాగం ఫ్లాట్‌గా ఉంటడం నాకు నచ్చలేదన్నాను. దీంతో వెంటనే వాళ్లు ఓసారి టచ్ చేయొచ్చా..? సైజ్ ఎంత..? అని అడిగారు. ఆ సమయంలో నాకు చాలా ఆశ్చర్యమేసింది. హీరోయిన్ల కప్ సైజు తెలుసుకున్న తర్వాతే ప్రేక్షకులు థియేటర్లకు వెళ్తారా? అంటూ.. ఆ డైరెక్టర్‌ను ఇలా అడిగాను. నీకు పెళ్లయింది. కాబట్టి స్త్రీ శరీర నిర్మాణ శాస్త్రం గురించి తెలుసుకోవాలంటే ఇంటికి వెళ్లండని చెప్పాను. దానికి అతను తన భార్యతో మాత్రం ఓపెన్‌గా మాట్లడలేడంట. కానీ నాతో మాత్రం ఇలా మాట్లాడుతానంటున్నాడు.' అని పేర్కొంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ షో ఫేక్.. జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు: సరయు) ఇలా సినీ పరిశ్రమలో చాలా మంది దర్శకుల నుంచి కాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది. అలాంటి వారిలో కొందరైతే ఏకంగా డిప్రెషన్ ఎపిసోడ్ల నుంచి బయటపడేందుకు డ్రగ్స్‌లో మునిగిపోవాలని చాలాసార్లు సూచించారని, కానీ అలాంటి వాటికి దూరంగానే ఉండేదానినని చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Sherlyn Chopra (@_sherlynchopra_) -
బాలీవుడ్లోనే కాదు, సౌత్‌లో కూడా.. కాంప్రమైజ్ అడిగారు: సీరియల్ నటి
హిందీ సీరియల్ నటి రతన్ రాజ్‌పుత్ ఇటీవల తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టిన సంగతి తెలిసిందే! ముంబైలో ఆడిషన్‌కు వెళ్తే కూల్‌డ్రింక్‌లో ఏదో మత్తుపదార్థం కలిపారని, దాన్ని తాగితే ఏదో తేడాగా అనిపించిందని చెప్పింది. కాసేపటికి వాళ్లు ఓ అడ్రస్ చెప్పి అక్కడకు రమ్మనడం.. తీరా అక్కడికి వెళ్తే ఆ ప్రదేశం అంతా చెత్తగా, భయంకరంగా ఉండటం.. ఓ అమ్మాయి స్పృహ లేకుండా నేలపై పడి ఉండటంతో పరిస్థితి అర్థం చేసుకున్న రతన్ వెంటనే అక్కడి నుంచి ఎలాగోలా జారుకుంది. బక్కచిక్కారు, బరువు పెరగండి.. అయితే బాలీవుడ్లోనే కాదని, దక్షిణాదిన కూడా తాను క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశానంటోంది రతన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. 'నేను హిందీలో అగ్లె జనం మోహె బిటియా హి కిజో సీరియల్ చేస్తున్నప్పుడు సౌత్ నుంచి చాలా కాల్స్ వచ్చేవి. కొందరు మంచి డైరెక్టర్స్ ఉండేవారు, మరికొందరు మాత్రం వారి వంకరబుద్ధిని బయటపెట్టేవారు. రతన్ గారు, మీరు చాలా సన్నబడ్డారు, కాస్త బరువు పెరిగితే కలిసి ప్రాజెక్ట్ చేద్దాం అనేవారు. నేను వారి కండీషన్‌కు ఓకే చెప్పాను. అప్పుడతడు ఇక్కడ విధివిధానాలు తెలుసుకదా అన్నాడు. అవేంటో ఒకసారి తెలుసుకోవచ్చా? అని అడిగాను. ఎవరితోనైనా కాంప్రమైజ్ కావాల్సిందే! అందుకతడు బదులిస్తూ.. ఇక్కడ హీరో, దర్శకుడు, నిర్మాత, కొన్నిసార్లు సినిమాటోగ్రాఫర్.. ఇలా ఎవరైనా సరే అడిగితే కాదనకూడదు అని సాగదీస్తున్నాడు. మీరేం చెప్పదల్చుకున్నారో సూటిగా చెప్పండన్నాను. అందుకా వ్యక్తి స్పందిస్తూ.. మీకు తెలిసిందేగా! కాంప్రమైజ్ కావాలి అన్నాడు. అంతే.. నేను ఆ ఆఫర్‌ను రిజెక్ట్ చేశాను. అప్పటి నుంచి ఇప్పటివరకు నాకు దక్షిణాది నుంచి ఇంతవరకు ఒక్కటంటే ఒక్క అవకాశం కూడా రాలేదు. చాలా మంది బాలీవుడ్లోనే ఇలాంటివి జరుగుతాయని అంటుంటారు. కానీ సౌత్‌లో కూడా ఇలాంటివి ఉన్నాయి. దక్షిణాదిన ఛాన్స్ మిస్ అయిందని నేనేం బాధపడట్లేదు, అది నాకు పెద్ద విషయం కూడా కాదు' అని చెప్పుకొచ్చింది రతన్. చదవండి: బేబీ సినిమాకు హీరోహీరోయిన్లు ఎంత తీసుకున్నారో తెలుసా? -
ఆడిషన్స్‌కి వెళ్తే డ్రగ్స్ ఇచ్చారు.. ఆ తర్వాత: ప్రముఖ నటి
Ratan Raajputh Casting Couch: ఈ మధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్ అనే మాట ఎక్కువగా వినిపిస్తోంది. వాళ్లు వీళ్లు అని లేకుండా చాలామంది నటీనటుల దీని బారిన పడుతున్నారు. గతంలో తమకు జరిగిన అనుభవాల్ని బయటపెడుతున్నారు. ఎలా ఇబ్బంది పడ్డామో పూసగుచ్చినట్లు చెబుతున్నారు. ప్రముఖ నటి రతన్ రాజ్‌పుత్ గతంలో తను క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డట్లు రివీల్ చేసింది. కూల్‌డ్రింక్ తాగమని 'ఆడిషన్ ఉందంటే ముంబయిలోని ఓషివారా సబర్బ్ హోటల్‌కి వెళ్లాను. ఆడిషన్ పూర్తయిన తర్వాత ఓ కో ఆర్డినేటర్ వచ్చి.. 'డైరెక్టర్‌కి మీ వర్క్ నచ్చింది, మీటింగ్‌కి సిద్ధమవండి' అని చెప్పారు. దీంతో మీటింగ్ కోసం పై అంతస్తుకి వెళ్లాను. వద్దులే అంటున్నా కూల్ డ్రింక్ తాగమని అక్కడ నన్ను బలవంతం చేశారు. ఆ తర్వాత.. 'మరో ఆడిషన్ ఉంది మీకు మళ్లీ ఫోన్ చేస్తాం' అని చెప్పారు. దీంతో నేను నా ఫ్రెండ్ ఇంటికొచ్చేశాం. అయితే మాకు ఇచ్చిన డ్రింక్ తాగాం కానీ అది ఎందుకో తేడాగా అనిపించింది' (ఇదీ చదవండి: 'బేబీ' హీరోయిన్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?) గదంతా బట్టలు 'కొన్ని గంటల తర్వాత ఫోన్ వచ్చింది. ఓ ప్లేస్ చెప్పి, అక్కడికి రమ్మన్నారు. తీరా వెళ్తే అది చాలా భయంకరంగా, చెత్తగా ఉంది. బట్టలన్నీ గదిలో చిందరవందరగా పడున్నాయి. ఓ అమ్మాయి మందు తాగుందో ఏమో స్పృహ లేకుండా నేలపై కనిపించింది. ఓ వ్యక్తి వచ్చి నన్ను తిట్టాడు. ఇతడు ఎవరూ అని నా బాయ్ ఫ్రెండ్ గురించి అడిగాడు. తమ్ముడని అబద్ధం చెప్పాను. ఎందుకో అక్కడి వాతవరణం తేడాగా అనిపించేసరికి వాళ్లకు సారీ చెప్పి, అక్కడి నుంచి బయటపడ్డాం' అని నటి రతన్ రాజ్‌పుత్ చెప్పుకొచ్చింది. 2009లో వచ్చిన 'అగ్లే జనమ్ మోహే బితియా హై కిజో' సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్న రతన్ రాజ్ పుత్.. మహాభారత్, సంతోషి మా సీరియల్స్ తో చాలా క్రేజ్ సంపాదించింది. ప్రస్తుతం యూట్యూబ్ వ్లాగ్స్ చేస్తూ బిజీగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని బయటపెట్టింది. ఇప్పటికీ వీటిని బయటపెట్టకపోతే చాలామంది మోసపోయే అవకాశముందని, అందుకే తనకు జరిగిన దాన్ని రివీల్ చేసినట్లు రతన్ పేర్కొంది. View this post on Instagram A post shared by Ratan Raajputh (@ratanraajputh) (ఇదీ చదవండి: 'బేబీ' కలెక్షన్స్.. రెండు రోజుల్లోనే అన్ని కోట్లు) -
లైంగిక వేధింపులు.. ఎలా బయటపడతానోనని భయమేసింది: నటి
బుల్లితెర నుంచి వెండితెరకు షిఫ్ట్ అయింది నటి మోనా సింగ్. 'జెస్సీ జైస్సీ కోయ్ నహీ' అనే సీరియల్‌తో క్లిక్ అయిన మోనా ఎక్కువగా రియాలిటీ షోలలో మెరిసింది. గతేడాది 'లాల్ సింగ్ చద్దా' సినిమా చేసిన ఈ నటి ఇటీవల 'కఫాస్' అనే వెబ్ సిరీస్‌లో ప్రధాన పాత్రలో నటించింది. కఫాస్ సిరీస్ ప్రస్తుతం సోనీ లివ్‌లో ప్రసారమవుతోంది. సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న లైంగిక వేధింపుల ఆధారంగా ఈ సిరీస్ తెరకెక్కింది. ఈ సిరీస్ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్న మోనా సింగ్ తాజాగా క్యాస్టింగ్ కౌచ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 'నేను కూడా ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల బారిన పడ్డాను. సీరియల్స్‌లో నటించే సమయంలోనే వేధింపులను ఎదుర్కొన్నాను. అప్పుడు నేను ఆడిషన్స్ కోసం పుణె నుంచి ముంబై వచ్చేదాన్ని. ఈ క్రమంలో కొందరు వ్యక్తులను కలిశాను. వాళ్లు చాలా విచిత్రంగా ప్రవర్తించేవారు, నాకు చాలా అసౌకర్యంగా అనిపించేది, కొన్నిసార్లు భయమేసేది కూడా! ఆడవాళ్లు ఎంత అమాయకులైనా, బలహీనులైనా.. అక్కడేం జరుగుతుందనేది ముందే పసిగట్టగలరు. మా అంచనా తప్పు కాదు! కొన్నిసార్లు వాళ్లు ఎంత నీచంగా ప్రవర్తిస్తారంటే.. వీళ్లబారి నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాలిరా దేవుడా.. అని భయంతో వణికిపోయేదాన్ని. ఎలాగోలా తప్పించుకునేదాన్ని. జీవితంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలా అని ఈ సంఘటనల వల్ల మనం నిరాశకు లోనై వెనకడుగు వేయకూడదు, అనుకున్నది సాధించాలి. నేనూ అదే చేశాను. ప్రయత్నం విరమించకుండా నా కల సాకారం చేసుకున్నాను. ఇప్పటికీ ఇదే ఇండస్ట్రీలో ఉన్నాను' అని చెప్పుకొచ్చింది మోనా సింగ్. View this post on Instagram A post shared by Mona Singh (@monajsingh) చదవండి: బ్రెయిన్ స్ట్రోక్.. మాట పడిపోవడంతో ఇంటికే పరిమితం.. స్టార్ హీరో చెప్పిన అనుభవాలు బాలయ్య హీరోయిన్ ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్ -
నాది చాలా చిన్న వయసు.. వారి ఉద్దేశమేంటో గుర్తించలేకపోయా: బుల్లితెర నటి
ప్రముఖ బుల్లితెర నటి రాజశ్రీ ఠాకూర్.. సాత్ ఫేరే: సలోని కా సఫర్ సీరియల్‌తో ఫేమ్ తెచ్చుకుంది. మోడలింగ్‌పై ఆసక్తితో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన భామ కెరీర్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన బాలీవుడ్ భామ.. కాస్టింగ్ కౌచ్ గురించి నోరు విప్పింది. ఇండస్ట్రీలో ప్రారంభ రోజుల్లో క్యాస్టింగ్ కౌచ్‌కు గురయ్యానని తెలిపింది. బాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ జరుగుతుందని.. దానికి ఎవరూ అతీతులు కాదన్నారు. (ఇది చదవండి: నవదీప్‌తో వివాదం.. అందువల్లే తీవ్ర ఒత్తిడికి ఫీలయ్యా: ఎన్టీఆర్ హీరోయిన్) రాజశ్రీ ఠాకూర్ మాట్లాడుతూ..' నాకు మోడలింగ్‌పై చాలా ఆసక్తి ఉండేది. అందుకే టీవీ ప్రకటనలు, ప్రెస్ షూట్లు చేసేదాన్ని. మనల్ని ట్రాప్ చేయడానికి ప్రయత్నించే కొంతమంది వ్యక్తులను నేను చూశా. అప్పుడు నాది చాలా చిన్న వయసు. అవతలి వ్యక్తి ఉద్దేశాలు ఏమిటో గుర్తించలేకపోయా. వాటి నుంచి అప్రమత్తంగా ఉంటే తప్పించుకోవచ్చు. ఎందుకంటే ఈ వృత్తిలో చాలా అలర్ట్‌గా ఉండాలి.. అసలు ఈ రోజుల్లో ఏ వృత్తిలోనైనా మనల్ని వాడుకోవడానికి రెడీగా ఉన్నారు. ప్రస్తుతం ప్రపంచంలో పోటీ చాలా ఎక్కువ. ఒకరినొకరు తొక్కేసేందుకే ప్రయత్నిస్తున్నారు.' అన్నారు. కాగా.. రాజశ్రీ తన షో 2005 సాత్ ఫేరే: సలోని కా సఫర్తో ఫేమ్ తెచ్చుకుంది. అంతకు ముందు ఆమె ఆల్ ఇండియా రేడియోలో మరాఠీ న్యూస్ రీడర్‌గా పనిచేసి.. యాడ్స్ కూడా చేసింది. ఆమె సప్నా బాబుల్ కా...బిదాయి, అగ్లే జనమ్ మోహే బితియా హి కిజో, భారత్ కా వీర్ పుత్ర – మహారాణా ప్రతాప్, షాదీ ముబారక్, అప్నాపన్ - బదల్తే రిష్టన్ కా బంధన్ వంటి ఇతర షోలలో కూడా నటించింది. (ఇది చదవండి: ప్రియుడిని పెళ్లాడిన హీరోయిన్, వీడియో వైరల్) -
హోటల్లో డైరెక్టర్ తనతోపాటే రాత్రి ఉండిపోమన్నాడు: సింగర్
ప్రముఖ సింగర్, చిత్రకారిణి, నటి సుచిత్రా కృష్ణమూర్తి గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తోంది. తన వ్యక్తిగత జీవితం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంటూ వస్తున్న ఆమె తాజాగా సినీపరిశ్రమలో ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని వెల్లడించింది. ఆనాడు జరిగిన సంఘటనను తలుచుకుంటూ.. 'ఆ రోజుల్లో ఆడిషన్స్ హోటల్లోనే జరిగేవి. అలా నేను ఒక డైరెక్టర్‌ను హోటల్లో కలిశాను. అతడు.. నీకు మీ అమ్మ ఎక్కువ క్లోజా? నాన్న ఎక్కువ చనువుగా ఉంటాడా? అని అడిగాడు. నేను.. మా నాన్నతోనే నాకు ఎక్కువ చనువు అని చెప్పాను. ఆ తర్వాత డైరెక్టర్ చెప్పిన మాట విని నేను ఒక్కసారిగా షాకయ్యాను. సరే అయితే మీ నాన్నకు ఫోన్ చేసి నేను రేపు ఉదయం నిన్ను ఇంటి దగ్గర దింపుతానని చెప్పు అన్నాడు. మొదట అతడేం చెప్తున్నాడో నాకు అర్థం కాలేదు. అప్పుడు సమయం సాయంత్రం ఐదు గంటలవుతోంది. రేపు పొద్దునవరకు ఈయనతో ఏం చేయాలి? అనుకున్నాను. కానీ అతడి మాటల వెనుక ఉన్న ఆంతర్యం అర్థమై నా కాళ్లు, చేతులు వణికిపోయాయి. దుఃఖం పొంగుకొచ్చింది. వెంటనే నా బ్యాగు తీసుకుని మళ్లీ వస్తానని చెప్పి అక్కడి నుంచి పరుగుతీశాను. ఇలా చాలాసార్లు జరిగింది. ఇండస్ట్రీలో ఇంతకన్నా దారుణమైన సంఘటనలను చాలామంది ఫేస్ చేశారు. వారితో పోలిస్తే ఇది చాలా చిన్నది' అని చెప్పుకొచ్చింది నటి. కాగా షారుక్ ఖాన్ కబీ హా కబీ నా సినిమాతో పాపులారిటీ సంపాదించుకుంది సుచిత్రా కృష్ణమూర్తి. ఆ తర్వాత ఎన్నో హిందీ చిత్రాల్లో నటించింది. 1999లో దర్శకుడు శేఖర్ కపూర్‌ను పెళ్లాడిన తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పింది. కానీ వీరి వివాహబంధం కూడా ఎంతోకాలం నిలవలేదు. ఇటీవలే సుచిత్ర బ్రేవ్ హార్ట్స్ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. చదవండి: ఇండియాలో ఎక్కువమంది చూసిన సినిమా ఏదో తెలుసా? -
15 ఏళ్లలో 11వ సినిమా.. బెడ్ షేర్ చేసుకుని ఉండుంటే..: నటి
పదిహేడేళ్లకే ఇండస్ట్రీలో అడుగుపెట్టింది పాయల్ ఘోష్. 15 ఏళ్లకు పైగా సినీపరిశ్రమలో ఉన్నప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. తెలుగులో ప్రయాణం, ఊసరవెల్లి, మిస్టర్ రాస్కెల్ చిత్రాలు చేసిన ఆమె కొంతకాలం క్రితం తన 11వ సినిమాను ప్రకటించింది. 'ఫైర్ ఆఫ్ లవ్ రెడ్' సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు వెల్లడించింది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసింది. 'నేను కొందరితో బెడ్ షేర్ చేసుకుని ఉండుంటే ఇది నాకు 30వ సినిమా అయ్యేది. పెద్ద సినిమాలు రావాలంటే బెడ్రూమ్లోకి వెళ్లాల్సిందే! లేదంటే సినిమా ఛాన్సులు రావడం కష్టమే!' అని చెప్పుకొచ్చింది. దీనిపై అభిమానులు స్పందిస్తూ.. 'ఏమైంది? నువ్వు పడ్డ ఇబ్బందులను మాతో షేర్ చేసుకోవచ్చుగా', 'ఎంత కష్టమైనా సరే కానీ నువ్వు నిజాయితీగానే ఉండు, అడ్డదారులు తొక్కవద్దు' అంటూ కామెంట్లు చేస్తున్నారు. తర్వాత కాసేపటికే సదరు పోస్ట్‌ను డిలీట్ చేసింది పాయల్ ఘోష్. కాగా మీటూ ఉద్యమం సమయంలో పాయల్.. బాలీవుడ్ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్‌పై తీవ్ర ఆరోపణలు చేసింది. అతడు తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. మూడో మీటింగ్‌కే తనపై అత్యాచారం చేశాడని ఇటీవల సైతం వరుస ట్వీట్లు చేసింది. దక్షిణాదిన తనకు ఎప్పుడూ అలాంటి చేదు అనుభవాలు ఎదురవలేదని, కానీ బాలీవుడ్లో మాత్రం అనురాగ్ తనను బలత్కారం చేశాడని వాపోయింది. I worked in south film industry with 2 national award winning directors &star directors but nobody even touched me inappropriately but in Bollywood I haven’t even worked with Anurag Kashyap,bt he raped me on our third meeting, now say why I shouldn’t brag about south…!!! — Payal Ghoshॐ (@iampayalghosh) March 18, 2023 View this post on Instagram A post shared by Payal Ghosh (@iampayalghosh) చదవండి: పుష్ప 2లో ఐటం సాంగ్.. ఏంటి సామీ.. అన్ని కోట్లా! -
నేను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే: బాలీవుడ్ నటుడు
సీరియల్ నటుడిగా కెరీర్ ఆరంభించిన రాజీవ్ ఖందేల్వాల్ ఐదేళ్లలోనే పాపులర్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. ఆమిర్ సినిమాతో వెండితెరపై అడుగుపెట్టిన అతడు తొలి చిత్రంతోనే సక్సెస్ రుచి చూశాడు. సైతాన్, సౌండ్ ట్రాక్, టేబుల్ నెంబర్ 21, సామ్రాట్ అండ్ కో సహా బాలీవుడ్లో పలు సినిమాలు చేశాడు. హఖ్ సే వెబ్ సిరీస్‌తో ఓటీటీలోనూ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా సత్తా చాటాడు. నటుడిగా కాకుండా హోస్ట్‌గానూ అదరగొట్టాడు రాజీవ్. పలు రియాలిటీ షోలకు అతడు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. తాజాగా అతడు తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడేనని చెప్పాడు. కేవలం ఆడవాళ్లే కాకుండా మగవాళ్లు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పుకొచ్చాడు. ఓసారి తనకు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైందని, అప్పుడు తాను తడబడకుండా సారీ బాస్, మీరు చెప్పినట్లు నేను చేయలేను అని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేశానన్నాడు. అబ్బాయిలు ఇలాంటి పరిస్థితులను డీల్ చేసినంతగా అమ్మాయిలు డీల్ చేయలేరన్నాడు. కొన్నిసార్లు వాళ్లు పరిస్థితులకు లొంగిపోయి తమలో తామే కుమిలిపోతారని, కానీ మగవాళ్లు వాటికి ఎదురొడ్డి నిలబడి ముందుకు సాగుతారని, కాకపోతే ఆ విషయాలను బయటకు చెప్పరని పేర్కొన్నాడు. అలాగే ఎప్పుడు చూసినా మహిళల రక్షణ కోసమే మాట్లాడతారు కానీ సినీ ఇండస్ట్రీలో మగవాళ్ల రక్షణ గురించి మాత్రం ఎవరూ పట్టించుకోరని తెలిపాడు. పురుషాధిపత్యం వల్ల అమ్మాయిలే ఎక్కువగా నలిగిపోతున్నారు కాబట్టి వారి గురించే ప్రత్యేక శ్రద్ధ, జాగ్రత్త చూపించడంలో తప్పు లేదని అభిప్రాయపడ్డాడు. కానీ ప్రస్తుత చిత్రపరిశ్రమ మునుపటిలా లేదని, చాలా మారిందని చెప్పుకొచ్చాడు రాజీవ్. చదవండి: నేను పాలిచ్చే తల్లిని, వారికోసం ఆ పని చేయలేను: నటి -
నాతో అసభ్యంగా ప్రవర్తించాడు.. జీర్ణించుకోలేకపోయా: ప్రగతి షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ సీనియర్ నటి ప్రగతి పరిచయం అక్కర్లేని పేరు. తెలుగు తెరపై తల్లి పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూనే సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు అభిమానులతో టచ్‌లో ఉంటోంది. యాక్టివ్‌గా ఉంటూ వీడియోలను షేర్ చేస్తూ ఉంటోంది ప్రగతి. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్లో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఓ సినిమా సెట్లో క్యాస్టింగ్ కౌచ్ వేధింపులకు గురైనట్లు తెలిపింది. అందులోనూ ఓ స్టార్ కమెడియన్ చేసిన పనికి ఏం చేయాలో అర్థం కాలేదని చెప్పుకొచ్చారు. (ఇది చదవండి: డబ్బు కోసం ఆ పని కూడా చేయాల్సి వచ్చింది: ప్రముఖ నటి ) ప్రగతి మాట్లాడుతూ..' ఆయన సెట్లో నాతో చాలా బాగా మాట్లాడతారు. చాలా పద్ధతిగా ఉంటారు. అయితే ఒకరోజు నాతో మిస్ బిహేవ్ చేశాడు. ఆ తర్వాత దాన్ని జీర్ణించుకోవడం నా వల్ల కాలేదు. ఆ రోజు నాకు ఏం వర్క్ చేయాలనిపించలేదు. లంచ్ చేయలేకపోయా. ఆఖరికి టీ కూడా తాగాలనిపించలేదు.' అని అన్నారు. ఆ తర్వాత జరిగిన విషయం గురించి మాట్లాడుతూ.. 'ఆయన షూటింగ్ అయిపోయి వెళ్లిపోతుంటే క్యారవాన్‌లోకి తీసుకెళ్లి ప్రశ్నించా. మీతో ఎప్పుడైనా మిస్ బిహేవ్ చేశానా అడిగా. నేను అక్కడే రియాక్ట్ అయితే మీ పరిస్థితి ఏంటని నిలదీశా. మీరు కాబట్టే ఒక్క నిమిషం అలా సైలెంట్‌గా ఉండిపోయా.' అంటూ చెప్పుకొచ్చారు. అయితే ప్రగతి పట్ల మిస్ బిహేవ్ చేసిన స్టార్ కమెడియన్ పేరు మాత్రం ఆమె బయటికి చెప్పలేదు. కాగా.. గతేడాది డీజే టిల్లు, రంగరంగ వైభవంగా, పెళ్లిసందడి చిత్రాల్లో కనిపించింది. (ఇది చదవండి: రెండోపెళ్లిపై ఆసక్తికర కామెంట్స్ చేసిన నటి ప్రగతి ) -
ఆ నిర్మాత ఎంతోమందిని వాడుకుని వదిలేశాడు: ప్రేమమ్ హీరోయిన్
సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ అవకాశాలు రావాలంటే హీరోయిన్లు కమిట్మెంట్ ఇచ్చి తీరాల్సిందే..! ఇది ఒక్కరి మాట కాదు.. చాలామంది హీరోయిన్లు బహిరంగానే చెప్పిన విషయం. అయితే కొందరు బయటపడతారు.. ఇంకొందరు బయటపడరు. స్టార్ హీరోయిన్లు సైతం తమను నిర్మాతలు, హీరోలు కమిట్మెంట్ అడిగినట్లు చెప్పుకొచ్చారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు 'క్యాస్టింగ్ కౌచ్' అనే పదం ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటుంది. (ఇదీ చదవండి: అప్పటినుంచే ప్రేమలో ఉన్నామన్న లావణ్య.. పోస్ట్ వైరల్) తాజాగా ఒడియా ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన నిర్మాత సంజయ్ నాయక్‌పై ఇద్దరు హీరోయిన్లు క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేశారు. ఒడియా 'ప్రేమమ్' సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకున్న ప్రకృతి మిశ్రా అనే హీరోయిన్ మీడియా ముందే నిర్మాతపై ఫైర్ అయింది. తన సినిమాలో అవకాశం ఇస్తానని చెప్పి నిర్మాత సంజయ్ నాయక్ ఎంతోమంది యువతులను లోబరుచుకున్నాడని తెలిపింది. ఆయన అవసరం తీరితే తరువాత ఆ నటి ముఖం కూడా చూడడని సెన్సెషనల్ కామెంట్ చేసింది. ఇలాంటి వారి టార్చర్ వల్ల ప్రస్తుతం రియాలిటీ షోలు చేసుకుంటూ.. వాటి ద్వారా మంచి నటిగా ప్రూవ్ చేసుకుని, ఇప్పుడు తాను ఒక ఉన్నత స్థానానికి చేరుకున్నాని తెలిపింది. ప్రకృతి మిశ్రా వ్యాఖ్యలకు మరో నటి జాస్మిన్ రథ్ మద్ధతు తెలిపింది. తను కూడా సంజయ్ బాధితురాలినే అంటూ కామెంట్ చేసింది. నిర్మాత సంజయ్ నాయక్ కామెంట్: హీరోయిన్ల ఆరోపణలను సంజయ్ నాయక్ తప్పుబట్టాడు. ప్రకృతి మిశ్రా, హీరో బాబు సాన్ మధ్య జరిగిన వివాదం అందరికీ తెలిసిందే.. ఆ సమయంలో బాబు సాన్‌కు మద్దతు ఇచ్చానన్న అక్కసుతో ప్రకృతి మిశ్రా ఇలాంటి నిరాధారమైన నిందలు వేస్తోందన్నాడు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని, ప్రకృతి మిశ్రా చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసిన మీడియా సంస్థలను కోర్టుకు లాగుతానని సంజయ్ తెలిపాడు. (ఇదీ చదవండి: మళ్లీ తెరపైకి మీటూ కేసు.. మరో కొత్త ట్విస్ట్) -
హన్సికను వేధించిన టాలీవుడ్ హీరో? స్పందించిన హీరోయిన్
క్యాస్టింగ్ కౌచ్.. సినీ ఇండస్ట్రీలో తరచూ వినిపించే పేరు. ఎందరో నటీనటులు దీని బారిన పడినవారే.. అయితే అందరూ దానికి లొంగిపోలేదు. అవకాశాల కోసం నీచమైన పనులు చేయడానికి ఎందరో నిరాకరించారు. తమ ప్రతిభతో ఛాన్సులు సంపాదించుకుని మంచి స్థానాలకు వెళ్లారు. అప్పుడప్పుడూ వారి క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలను సైతం అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల హన్సిక మొత్వానీ కూడా క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేసిందంటూ ఓ వార్త వైరల్ అయింది. టాలీవుడ్లో ప్రముఖ హీరో తనను బాగా ఇబ్బంది పెట్టాడని, అస్తమానం డేట్ వెళ్దాం వస్తావా? అంటూ విసిగించేవాడని, చివరికి అతడికి తగిన విధంగా బుద్ధి చెప్పానని హన్సిక పేర్కొన్నట్లు ఓ వార్త కొద్దిరోజులుగా చక్కర్లు కొడుతోంది. దీంతో అందరూ ఆ టాలీవుడ్ హీరో ఎవరా? అని రకరకాలుగా చర్చించుకుంటున్నారు. హాట్ టాపిక్‌గా మారిన ఈ వ్యవహారంపై తాజాగా హన్సిక స్పందించింది. 'టాలీవుడ్లో క్యాస్టింగ్ కౌచ్ ఫేస్ చేశానని నేనెప్పుడు మాట్లాడాను? మీకు తోచింది రాయడం ఆపండి. నిజానిజాలు తెలుసుకోకుండా గుడ్డిగా రాసేయడం ఆపండి. వైరలవుతున్న వార్తలో పేర్కొన్నట్లుగా నేను ఎటువంటి కామెంట్లు చేయలేదు. కాబట్టి దయచేసి పూర్తిగా నిర్ధారించుకున్నతర్వాతే న్యూస్ పబ్లిష్ చేయండి' అని ట్వీట్ చేసింది. Publications urging you to cross check before picking up random news piece ! Never made this comment that's doing the rounds pls fact check before publishing blindly . — Hansika (@ihansika) May 23, 2023 చదవండి: నా ఇద్దరు కూతుళ్లు స్వామి నిత్యానందతో... తట్టుకోలేక భార్య చనిపోయింది: నటుడు -
ఆ నిర్మాతకు అమ్మాయిల పిచ్చి.. ఒంటరిగా ఇంటికి రమ్మన్నాడు: నటి
చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది అందరికి తెలిసిన పచ్చి నిజం. ఈ సమస్య ఇప్పుడే కాదు దశాబ్దాల కాలం నుంచి ఉంది.అయితే ఈ మధ్య కాలంలో పలువురు హీరోయిన్స్ తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి బహిరంగంగా వెళ్లడిస్తున్నారు. చాలా మంది లైగిక వేధింపుల పై పోరాటం కూడా చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి, ‘శుభ్ మంగళ్ మే దంగల్’ ఫేం సంగీతా ఒడ్వాని తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ ఓపెన్ అయింది. ఓ స్టార్ నిర్మాత తనను ఒంటరిగా ఇంటికి పిలిచాడని ఓ ఇంటర్వ్యూలో తెలిసింది. ‘కెరీర్ తొలినాళ్లలో నాకు ఇండస్ట్రీ కల్చర్ గురించి పెద్దగా తెలియదు. అందరితో సరదాగా ఉండేదాన్ని. కొన్నాళ్ల తర్వాత పైకి మంచి వాడిలా నటించే ఓ స్టార్ నిర్మాత నాతో మిస్ బిహేవ్ చేశాడు. ఓ రోజు ఓ ప్రాజెక్ట్ గురించి చర్చించాలని ఇంటికి ఆహ్వానించాడు. ఒంటరిగా మాత్రమే రావాలని పదే పదే చెప్పడంతో నాకు డౌట్ వచ్చింది. (చదవండి: హీరోయిన్ రంభ కూతురిని చూశారా? అచ్చం తల్లిలాగే ఉందిగా! ) ఎందుకైనా మంచిదని నా ఫ్రెండ్స్‌ని తీసుకొని ఆయన ఇంటికి వెళ్లాను.అయితే నేను సింగిల్‌గా వెళ్లకపోవడంతో అతనికి కోపం వచ్చింది. అర్జంట్‌గా వేరే పని పడిందంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ తర్వాత కూడా నన్ను ఒంటరిగా కలిసేందుకు ప్రయత్నించాడు. కానీ నేను దూరం పెట్టేశాను. అతనికి అమ్మాయిలు అంటే పిచ్చి. సినిమాల పేరుతో వారిని లొంగదీసుకుంటాడు’ అని సంగీత చెప్పుకొచ్చింది. -
హన్సికను వేధించిన టాలీవుడ్ టాప్ హీరో.. ఎవరై ఉంటారబ్బా?
దేశముదురు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ హన్సిక మోత్వానీ. తొలి సినిమాతోనే హిట్ అందుకున్న ఈ బ్యూటీ యూత్‌లోనూ మాంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగులో వరుస సినిమా అవకాశాలు దక్కించుకున్న ఈ బ్యూటీ అదే సమయంలో కోలీవుడ్‌లో అడుగుపెట్టి అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా ఎదిగింది. సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే రీసెంట్గా ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ప్రియుడు సోహైల్ కతూరియాను పెళ్లాడింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ సత్తా చాటుతున్న హన్సిక తాజాగా ఓ ఇంటరవ్యూలో షాకింగ్ విషయాలు బయటపెట్టింది. టాలీవుడ్లో ఓ ప్రముఖ హీరో తనని బాగా ఇబ్బంది పెట్టాడని, అస్తమానం డేట్‌కి వెళ్దాం వస్తావా అంటూ విసిగించేవాడని చెప్పుకొచ్చింది.అయితే ఆ హీరోకు తగిని విధంగా బుద్ది చెప్పానంటూ పేర్కొన్న హన్సిక ఆ టాలీవుడ్ హీరో ఎవరన్నది మాత్రం బయటకు రివీల్ చేయలేదు. దీంతో అతను ఎవరై ఉంటారంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు. -
ఆ డైరెక్టర్ నన్ను అసభ్యంగా తాకాడు, అక్కడి నుంచి పారిపోయా: నటుడు
క్యాస్టింగ్ కౌచ్ అన్నిచోట్లా ఉన్నా సినీ ఇండస్ట్రీలో మాత్రం ఈ పేరు తరచూ వినిపిస్తూ ఉంటుంది. క్యాస్టింగ్ కౌచ్ వల్ల తిప్పలు పడ్డ నటులెందరో ఉన్నారు. కొందరు దాన్ని అధిగమించలేక ఆగిపోతే మరికొందరు ఎదురు తిరిగి నిలబడి సక్సెస్ సాధించినవాళ్లున్నారు. ఆడవాళ్లే ఎక్కువగా దీన్ని ఫేస్ చేస్తారనుకుంటారు చాలామంది. కానీ అబ్బాయిలు కూడా అందుకు అతీతం కాదు. తాజాగా బాలీవుడ్ నటుడు జతిన్ సింగ్ జమ్వాల్ తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినేనని చెప్తున్నాడు. తాజాగా జతిన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'దేవుడి దయ వల్ల నాకు వెంటవెంటనే రెండు షోలు వచ్చాయని సంబరపడ్డాను. నా శ్రమకు గుర్తింపు లభించిందని సంతోషించాను. రెండు షోలు చేశాను, ఇక ఆఫర్లు అందుకోవడం చాలా ఈజీ అనుకున్నాను. కానీ నా అంచనా తప్పని రుజవైంది. రెండో షో తర్వాత మూడేళ్లు ఆన్ స్క్రీన్కు దూరమైపోయాను. దానికి గల కారణం ఆడిషన్స్ చేసేవాళ్లు నాలో ఉన్న టాలెంట్‌ను గుర్తించడానికి బదులుగా నాతో కాఫీ తాగాలని, నన్ను కలవాలని దురభిప్రాయాన్ని కలిగి ఉండటమే! నేనేమీ హీరో అవ్వాలని అనుకోలేదు. మంచి పాత్రలు చేయాలనుకున్నాను. కొన్నిసార్లైతే ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు నా ప్రొఫైల్ చూడటం మానేసి బయట కలుద్దామనేవారు. ఒకసారైతే మరీ దారుణ పరిస్థితి ఎదుర్కొన్నాను. ఆయనొక పెద్ద క్యాస్టింగ్ డైరెక్టర్. ఓటీటీ షోల కోసం నటీనటులను ఎంపిక చేస్తుంటాడు. నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండని అడిగాను. ఆయన వాట్సాప్‌లో నన్ను సెల్ఫీ దిగి పంపమన్నాడు. చెప్పినట్లే చేశాను. బాగానే ఉన్నావు, సాయంత్రం కలుద్దామన్నాడు. సరేనని కాఫీ షాప్‌కు వెళ్లాం. మామూలుగా మాట్లాడుతూ ఉంటే సడన్‌గా అతడు నా కాళ్లపై చేతులు వేశాడు. పబ్లిక్‌లో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నాకిలాంటివన్నీ నచ్చవని చెప్పాను. దానికతడు ఇక్కడ ఇలాంటివన్నీ మామూలే అంటూ చేయి కూడా తీయలేదు. వెంటనే ఆలస్యం చేయకుండా అక్కడి నుంచి పారిపోయాను. చాలాకాలం పాటు ఆ షాక్ నుంచి తేరుకోలేకపోయాను. ఈ సంఘటనను తల్చుకుని ఇంట్లో వెక్కి వెక్కి ఏడ్చాను. ఆయన అడిగినదానికి ఓకే చెప్పకపోవడంతో నాకు ఆ ప్రాజెక్ట్‌లో నటించే అవకాశం చేజారింది. తర్వాత ఓసారి మరో క్యాస్టింగ్ డైరెక్టర్ దగ్గరకు వెళ్లాను. ఆయన నన్ను ఒంటి మీద బట్టలు లేకుండా కేవలం అండర్‌వేర్‌తో ఫోటో దిగి పంపించమన్నాడు. నేను షాకయ్యాను. ఆయనిలా చేశాడంటూ నేను మా ఫ్రెండ్స్‌కు, మిగతావాళ్లకు చెప్పడంతో అతడు నాకు మెసేజ్ చేయడం ఆపేశాడు. ఇండస్ట్రీలో ఇలాంటివి అడుగడుగునా ఉంటాయని అప్పుడే తెలిసొచ్చింది. కానీ ఇలాంటివి మానసికంగా మనల్ని కుంగదీస్తాయి' అని చెప్పుకొచ్చాడు జతిన్ సింగ్. చదవండి: అబార్షన్.. తిరిగొస్తానో లేదో అంటూ.. -
ఆడిషన్‌కు వెళ్తే గదిలో నాతో అసభ్యంగా.. ఏడ్చినా వినలేదు: నటి
తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలిననే పేర్కొంది మాళవిక శ్రీనాథ్. మూడేళ్ల క్రితం ఆడిషన్స్‌కు వెళ్లినప్పుడు ఎదురైన చేదు అనుభవాన్ని తాజాగా ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది మలయాళ నటి. 'మూడేళ్ల క్రితం ఇది జరిగింది. మంజు వారియర్ సినిమాలో ఆమె కూతురిగా నటించాలంటూ ఓ ఆఫర్ వచ్చింది. మంజు వారియర్ మూవీ అనగానే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు. అందుకే ఆలస్యం చేయకుండా ఓకే చెప్పాను. త్రిస్సూర్‌లో ఆడిషన్‌కు వెళ్లాం. గాజు గ్లాసుతో ఉన్న గదిలో ఆడిషన్ జరిగింది. ఆ తర్వాత నా జుట్టంతా చిందరవందరగా ఉందని డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లి సరిచేసుకోమని ఓ వ్యక్తి సలహా ఇచ్చాడు. సరేనని నేను ఆ గదిలోకి వెళ్లగానే అతడు నన్ను వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకున్నాడు. ఒక్కసారిగా షాక్ అయిన నేను తన నుంచి విడిపించుకునేందుకు చాలా ప్రయత్నించాను. నువ్వు మంజు వారియర్ కూతురిగా స్క్రీన్‌పై కనిపించాలంటే సైలెంట్‌గా ఉండు అని చెప్పాడు. నేను ఏడుస్తూ తన చేతిలో ఉన్న కెమెరాను పగలగొట్టేందుకు ప్రయత్నించాను. అతడు దాన్ని సరిచేసుకునే క్రమంలో వెంటనే అక్కడి నుంచి పారిపోయాను' అని చెప్పుకొచ్చింది. కాగా మాళవిక.. మధురం, సాటర్డే నైట్ వంటి చిత్రాలు చేసింది. -
రాత్రికి రాకపోతే అవకాశాలు రావని బెదిరించారు: నటుడు
హిందీ బిగ్‌బాస్ 16 సీజన్‌తో ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు శివ ఠాక్రే. ఇప్పుడిప్పుడే అవకాశాలు అందిపుచ్చుకుంటూ కెరీర్లో ఆచితూచి అడుగులు వేస్తున్నాడీ యంగ్ యాక్టర్. అయితే కెరీర్ తొలినాళ్లలో క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు నటుడు. తాజాగా ఇంటర్వ్యూలో శివ ఠాక్రే మాట్లాడుతూ.. 'ముంబైకి వచ్చాక నాకో విషయం అర్థమైంది. సినీఇండస్ట్రీలో అమ్మాయిలే కాదు, అబ్బాయిలకు గండాలు ఎదురవుతాయని తెలిసొచ్చింది. ఒకసారి నేను ఆరమ్ నగర్‌కు ఆడిషన్ కోసం వెళ్లాను. డైరెక్టర్ నన్ను బాత్రూమ్కు తీసుకెళ్లి ఇక్కడ ఒక మసాజ్ సెంటర్ ఉందని చెప్పాడు. ఆడిషన్‌కు వస్తే మసాజ్ సెంటర్ అంటున్నాడేంటి అని తల గోక్కున్నాను. ఆడిషన్ అయిపోయాక మసాజ్ సెంటర్‌కు రా, నీతో పనుంది అని చెప్పాడు. స్క్రీన్‌పై కనించడం కోసం అప్పటికే ఎంతో కష్టపడుతున్నాను. కానీ అందుకోసం అలాంటి పని చేయడం ఇష్టం లేదు, అందుకే అక్కడి నుంచి బయటకు వచ్చేశాను. మరోసారి ఓ మహిళ రాత్రి 11 గంటలకు ఆడిషన్‌కు రమ్మని పిలిచింది. తనకు నాలుగు బంగళాలు ఉన్నాయంట. వాళ్లను, వీళ్లను పెద్ద స్టార్లను చేశాను అని నాదగ్గర గొప్పలు చెప్పుకుంది. రాత్రి 11 గంటలకు ఆడిషన్ ఉంటుంది, సమయానికి రావాలి అని చెప్పగానే నేను కుదరదన్నాను. తన ఉద్దేశం ఏంటో అర్థం చేసుకోలేనంత అమాయకుడిని కాదు. అర్ధరాత్రి ఆడిషన్ ఏంటి? నాకు పని ఉంది, రావడం వీలు కాదని ముఖం మీదే చెప్పేశా. దీనికామె.. నీకు ఇండస్ట్రీలో పని చేయాలని లేదా? నువ్వు రాత్రికి రాకపోతే నీకు పనే దొరకదు అని బెదిరించింది. అయినా సరే ఆమె మాటలను లెక్క చేయకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాను' అని చెప్పుకొచ్చాడు. కాగా బిగ్‌బాస్ 16వ సీజన్ రన్నరప్‌గా నిలిచిన శివ ఠాక్రే ఇటీవలే బిగ్‌బాస్ మరాఠీ, ఎమ్‌టీవీ రోడీస్ రైడింగ్ షోలలో మెరిశాడు. -
రాత్రికి రమ్మంది.. నేనూ క్యాస్టింగ్ కౌచ్ బాధితుడినే: నటుడు
సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తొలినాళ్లలో తానూ క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు ప్రముఖ నటుడు, ఎంపీ రవి కిషన్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'క్యాస్టింగ్ కౌచ్ అనేది సినిమా ఇండస్ట్రీలో ఉంది. కానీ నేను దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించాను. అవకాశాల కోసం అడ్డదారులు తొక్కొద్దని, నీ పనితనాన్ని నిజాయితీగా నిరూపించుకోవాలని మా నాన్న నాకు నేర్పించాడు. నా దగ్గర టాలెంట్ ఉంది, అందుకే షార్ట్‌కర్ట్ నేను ఎంచుకోలేదు. ఇక్కడ ఓ విషయం చెప్పాలి. సినీపరిశ్రమలో ఉన్న ఓ మహిళ కాఫీ తాగడానికి రాత్రి రావాలని పరోక్షంగా తన కోరికను బయటపెట్టింది. ఎవరైనా పొద్దున్నో, సాయంత్రమో కాఫీ తాగుదామంటారు. కానీ తను ప్రత్యేకంగా రాత్రి రావాలని నొక్కి చెప్పడంతో నాకు విషయం అర్థమైంది. వెంటనే నేను నో చెప్పాను. తనిప్పుడు పెద్ద స్థాయిలో ఉంది. ఆమె పేరు వెల్లడించలేను' అని పేర్కొన్నాడు. కాగా రవికిషన్‌కు నటుడు కావాలని చిన్నప్పటినుంచి కోరికగా ఉండేది. తండ్రికి అతడి కోరిక నచ్చలేదు కానీ తల్లి మాత్రం రవికిషన్‌కు మద్దతిచ్చేది. ఓ రోజు ఆమె రవికిషన్‌కు రూ.500 ఇచ్చి ముంబై పంపించేసింది. అలా తల్లి సపోర్ట్‌తో, తన కష్టంతో గొప్ప నటుడిగా ఎదిగాడు. భోజ్‌పురిలో బాగా ఫేమస్ అయిన రవి కిషన్.. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లోనూ పలు చిత్రాలు చేశాడు. రేసుగుర్రం సినిమాలో విలన్‌గా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయాడు. గతేడాది రిలీజైన ఖాఖీ: ద బీహార్ చాప్టర్ వెబ్ సిరీస్‌లోనూ నటించాడు. -
అవకాశాల కోసం అలా చేయాల్సిన అవసరం రాలేదు: హీరోయిన్
కోలీవుడ్‌లో జయాపజయాలకతీతంగా అవకాశాలను అందుకున్న నటి ప్రియా భవానీ శంకర్. కేవలం ఆమె ఐదేళ్లలోనే స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందారు. ఈమె ఓ టీవీ ఛానల్లో యాంకర్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించి.. ఆ తరువాత టీవీ సీరియళ్లలో నటించి బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. అలా 2017లో మేయాదమాన్ చిత్రంలో కథానాయికగా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. వైభవ్ కథానాయకుడిగా నటించిన ఆ చిత్రం అనూహ్య విజయం సాధించింది. అంతే సినిమాలో ప్రియా భవానీ శంకర్ బెర్త్ కన్ఫర్మ్ అయిపోయింది. వరుసగా అవకాశాలు ఈ అమ్మడి తలుపు తడుతున్నాయి. ఈమె నటించిన చిత్రాల్లో ఎక్కవ భాగం విజయాలే. స్టార్ హీరోలతో నటించే అవకాశం వేస్తే పాత్రల గురించి కూడా ఆలోచించకుండా అంగీకరించేస్తోంది. అలా ఆ మధ్య కార్తీతో నటించిన కడైకుట్టి సింగం, అరుణ్ విజయ్‌తో జత కట్టిన తానై, ధనుష్ సరసన నటించి తిరుచిట్రంఫలం వంటి చిత్తాల సక్సెస్‌లు ఈమె ఖాతాలో పడ్డాయి. అయితే ఇటీవల జయం రవితో నటించిన అఖిలన్ చిత్రం మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. తాజాగా శింబు కథానాయకుడిగా నటించిన పత్తు తల చిత్రంలో నటించింది. ఇది ఈ నెల 30వ తేదీన తెరపైకి రానుంది. ప్రస్తుతం లారెన్స్‌కు జంటగా రుద్రన్, అరుళ్ నిధితో డిమాంటీ కాలనీ 2 తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. కాగా ఈ అమ్మడు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు మంచి అవకాశాలు వరుసగా రావడం సంతోషంగా ఉందని పేర్కొంది. సినిమాల్లో అవకాశాలు రావాలంటే అడ్జెస్ట్మెంట్ అవ్వాలనే అంశం గురించి స్పందిస్తూ.. తనకైతే అలాంటి అనుభవం ఎదురుకాలేదని చెప్పింది. కానీ సినీరంగంలో ఆ సమస్య లేదని చెప్పలేనని వ్యాఖ్యానించింది. -
కాఫీకి పిలిచి రూమ్‌కు రమ్మన్నాడు: స్టార్ హీరోయిన్
బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. డర్టీ పిక్చర్, షేర్ని, కహాని’ వంటి సినిమాలతో ఫేమ్ సాధించింది. అయితే బాలీవుడ్ బ్యూటీ ప్రస్తుతం లేడీ ఓరియెంటెండ్ సినిమాలపైనే ఫోకస్ పెట్టింది. అయితే తాజాగా విద్యాబాలన్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరలవుతున్నాయి. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన విద్యా బాలన్ క్యాస్టింగ్ కౌచ్ సంచలన కామెంట్స్ చేసింది. కెరీర్లో తనకెదురైన అనుభవాలను ఈ సందర్భంగా వివరించింది. విద్యాబాలన్ మాట్లాడుతూ.. ' దక్షిణాది సినిమాల్లో పని చేసేందుకు ప్రయత్నిస్తున్నా రోజులవి. ఓ యాడ్ ఫిల్మ్ కోసం డైరెక్టర్‌ను కలిసేందుకు చెన్నై వెళ్లా. అక్కడ కాఫీ షాప్‌లో మాట్లాడుకుందామని దర్శకుడితో చెప్పా. అయితే అతను నన్ను రూముకి వెళ్లి మాట్లాడుకుందామని అడిగాడు. అప్పుడే అతని ఆలోచన నాకర్థమైంది. అప్పుడే నేను గది లాక్ చేయకుండా కొంచెం తెరిచి ఉంచా. దీంతో ఆ దర్శకుడు ఏమీ మాట్లాడకుండా ఐదు మిషాల తర్వాత అక్కడ నుంచి వెళ్లిపోయాడు.' అంటూ చెప్పుకొచ్చింది నటి. ఆ సమయంలో తాను తెలివిగా వ్యవహరించడం వల్లే తప్పించుకున్నానని పేర్కొంది. అయితే ఆ దర్శకుడు ఎవరనేది మాత్రం వెల్లడించలేదు. ఇప్పటికీ ఆ సంఘటనను మర్చిపోలేకపోతున్నానని విద్యా బాలన్ చెబుతోంది. ఆ తర్వాత కూడా ఇలాంటి సంఘటనలు ఎదుర్కొన్నట్లు తెలిపింది. వాటితో మానసికంగా ఇబ్బందులు పడ్డానని.. బయట పడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని వెల్లడించింది. ఆ సంఘటనతో దర్శకుడు సినిమా నుంచి తొలగించి.. బాడీ షేమింగ్ చేశారని వాపోయింది. కాగా.. 2005లో వచ్చిన ‘పరిణీత’ సినిమాతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన భామ.. 2011 లో వచ్చిన ‘డర్టీ పిక్చర్’ సినిమాతో పాపులర్ అయింది. -
డైరెక్టర్ నన్ను ఒంటరిగా రమ్మన్నాడు: ఆమని
కలలు అందరూ కంటారు, కానీ కొందరే అది నెరవేర్చుకునేందుకు కృషి చేస్తారు, అందులో కొందరే సఫలీకృతులవుతారు. ఆ కొద్దిమందిలో నటి ఆమని ఒకరు. నటి అవ్వాలనుకున్న ఆమె ఒడిదుడుకులెదురైనా జంకలేదు. పట్టు వీడకుండా తన ప్రయత్నాలు కొనసాగించింది. చివరకు నటిగా ఛాన్స్ పట్టేయడమే కాదు, తన యాక్టింగ్ స్కిల్స్‌తో అద్భుత నటిగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె కెరీర్ తొలినాళ్లలో ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. 'ఇండస్ట్రీలోకి రావడానికి నేను కూడా ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నాను. ఆడిషన్స్ కోసం కంపెనీలకు వెళ్లేదాన్ని. కొన్ని కంపెనీల్లో సెలక్ట్ అయ్యేదాన్ని. కొన్నింటిలో రిజెక్ట్ చేసేవాళ్లు. అయితే కొందరు చెప్పి పంపిస్తామనేవాళ్లు. అంటే ఏంటో మొదట నాక్కూడా అర్థం కాలేదు. మేడమ్, డైరెక్టర్‌గారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెప్పేవాళ్లు. ఎందుకు? అని అడిగితే మేకప్ టెస్ట్ చేయాలంట అని చెప్పారు. సరే, అమ్మతో కలిసి వస్తా అన్నాను. ఆయన మాత్రం అమ్మగారు వద్దు, మీరు ఒంటరిగా రావాలి అన్నాడు. వెంటనే అమ్మ.. తను ఒంటరిగా రాదు, ఇద్దరం కలిసే వస్తామని చెప్పింది. దీంతో ఆయన వద్దులెండి, డైరెక్టర్ గారు వద్దంటున్నారు అని ఫోన్ కట్ చేసేవాళ్లు. నాకు పోనుపోనూ అర్థమైంది. అమ్మ లేకుండా నన్నొక్కదాన్నే ఎందుకు రమ్మంటున్నారో తర్వాత తెలిసొచ్చింది. ఇలా చాలా జరిగాయి. కానీ ఎక్కడా నేను కాంప్రమైజ్ కాలేదు. అడ్డదారిలో సినిమాల్లోకి రావడం నాకిష్టం లేదు. అందుకే వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికి రెండేళ్లు పట్టింది' అని క్యాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని చెప్పుకొచ్చింది ఆమని. చదవండి: కొన్ని అంగుళాల దూరంలో నా చావు కనిపించింది: ఆమని -
'నన్ను కూడా కమిట్మెంట్ అడిగారు'.. నయనతార సంచలన వ్యాఖ్యలు
ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఇబ్బందుల గురించి ఇప్పటికే చాలామంది మాట్లాడిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరోయిన్ల దగ్గర్నుంచి యంగ్‌స్టర్స్ వరకు ఎంతోమంది హీరోయిన్లు కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేశారు. తాజాగా సౌత్ లేడీ సూపర్‌స్టార్ నయనతార తొలిసారిగా ఈ విషయం గురించి ఓపెన్ అయ్యింది. తమిళంతో పాటు తెలుగులోనూ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసిన నయనతార తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్‌పై కీలక వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందా లేదా అనే విషయంపై నేను మాట్లాడను. మన ప్రవర్తనను బట్టి కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో నన్ను కూడా కమిట్మెంట్ అడిగారు. నాకు ఇష్టం లేదని నిర్మొహమాటంగా చెప్పేశాను. కేవలం నా టాలెంట్‌ను నమ్ముకొని ఈ స్థాయికి వచ్చాను అంటూ చెప్పుకొచ్చొంది. అయితే నయన్ చేసిన ఈ కామెంట్స్‌పై కొందరు భిన్నంగా స్పందిస్తున్నారు. ఇండస్ట్రీలో ఎప్పుడో జరిగితే ఇప్పుడు చెప్పడం ఏంటి? మీటూ మూమెంట్స్ జరిగినప్పుడు కూడా సైలెంట్‌గా ఉంది కదా అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
డైరెక్టుగా అడిగారు.. నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడినే : నటుడు
సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అనేది ఈమధ్యకాలంలో ఎక్కువగా చూస్తున్నాం. అయితే ఇది ఆడవాళ్లనే కాదు.. మగవాళ్లను సైతం వేధించే సమస్య అని నటుడు వర్థన్ పురి సంచలన కామెంట్స్ చేశాడు. ప్రముఖ నటుడు అమ్రిష్ పురి మనవడే వర్థన్ పురి. తాత వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 2019లో ‘యే సాలీ ఆషిఖి’ అనే సినిమాతో తెరంగేట్రం చేశాడు. అయితే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయాడు. దీన్ని అవకాశంగా వాడుకొని బడా సినిమాల్లో ఛాన్సులు ఇప్పిస్తామని, తమ కోరికలు తీర్చాలని డైరెక్టుగానే తనను అడిగారని, దేవుడి దయ వల్ల తప్పించుకున్నానని వర్థన్ తెలిపాడు. రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడినే అని షాకింగ్ విషయం వెల్లడించాడు. ‘‘సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి మనతో దారుణంగా ప్రవర్తిస్తారు. ఇంకొందరైతే డబ్బులు కూడా తీసుకుంటారు. తీరా చూస్తే వాళ్లు మోసం చేసి ఉడాయిస్తారు. చాలామంది నన్ను ఇలాగే వాడుకోవాలని చూశారు..అందుకే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటాను’’ అంటూ వర్థన్ చెప్పుకొచ్చాడు. -
తొలిసారి కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన కీర్తి సురేశ్
'మహానటి' సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ కీర్తిసురేష్. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కీర్తి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఈ ఏడాది మహేష్ సర్కారు వారి పాట సినిమాతో హిట్టు కొట్టిన కీర్తి సురేష్ ప్రస్తుతం నాని సరసన దసరా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమె బిజీ హీరోయిన్గా మారింది. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో కీర్తి కాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కీర్తి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని తనకు తెలుసంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. నాతో పాటు నటిస్తున్న హీరోయిన్లు కూడా దీని గురించి నాకు చెప్పారు. ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటి వరకు నా దగ్గరకు రాలేదు. కాస్టింగ్ కౌచ్ అనేది మన ప్రవర్తన బట్టి కూడా ఉంటుందేమో. అందుకే ఇలాంటి సంఘటన నాకు ఇప్పటి వరకు ఎదురుకాలేదు. ఒకవేళ నిజంగా నన్ను ఎవరైనా కమిట్మెంట్ అడిగితే అసలు దానికి అంగీకరించను. కావాలంటే సినిమాలు మానేసి ఏదైనా జాబ్ చేసుకుంటాను కానీ, అవకాశాలు కోసం కమిట్మెంట్ ఇచ్చే టైప్ నేను కాదు’ అంటూ వ్యాఖ్యానించింది. దీంతో ప్రస్తుతం కీర్తి సురేశ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: కన్నడలో రష్మికపై బ్యాన్! ‘శ్రీవల్లి’ ఏమన్నదంటే.. బిగ్‌బాస్ 6: హాట్‌టాపిక్‌గా ఫైమా రెమ్యునరేషన్! 13 వారాలకు ఎంతంటే? -
కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన బిగ్‌బాస్ దివి..
బిగ్‌బాస్ బ్యూటీ దివి క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్‌బాస్ సీజన్ 4లో హౌజ్‌లో అడుగుపెట్టిన ఆమె తనదైన ఆట తీరు, ముక్కుసూటి తనంతో అందరిని ఆకట్టుకుంది. ఉన్నది కొద్ది రోజులైన హౌజ్‌లో తనదైన మార్క్ వేసుకుంది. హౌజ్ నుంచి బయటకు వచ్చాక దివి వరుస సినిమా ఆఫర్లు అందుకుంటుంది. హీరోయిన్గా ప్రస్తుతం ఆమె ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక బిగ్‌బాస్ 4 సీజన్ ఫినాలేకు అతిథిగా వచ్చిన చిరు.. దివికి తన సినిమాల్లో ఆఫర్ ఇస్తానని మాట ఇచ్చిన సంగతి తెలిసిందే. చదవండి: నయన్ సరోగసీ వివాదం.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం? చెప్పినట్టుగానే దివికి గాడ్‌ఫాదర్‌లో ఓ కీ రోల్ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు చిరు. ఇందులో దివి రేణుకగా నటించి మెప్పించింది. ఈ మూవీ ఇప్పుడు బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈనేపథ్యంలో తాజాగా ఓ యూట్యూబ్‌లో చానల్‌తో దివి ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమెకు కాస్టింగ్ కౌచ్‌పై ప్రశ్న ఎదురైంది. మోడల్‌గా ఎప్పుడో కెరీర్ మొదలు పెట్టిన మీరు ఇప్పుడు నటిగా ఫుల్ బిజీ అయ్యారని, ఈ ప్రయాణంలో ఎప్పుడైన కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నారా? అని యాంకర్ ప్రశ్నించారు. చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకోబోతున్న బిగ్‌బాస్ బ్యూటీ! వరుడు అతడేనా? దీనిపై దివి స్పందిస్తూ.. ‘ఇప్పటివరకు నేను కాస్టింగ్ కౌచ్‌ను ఫేస్ చేయలేదు. మోడలింగ్, షార్ట్ ఫిలిమ్స్.. ఇలా నాకు వచ్చిన అవకాశాలను చేస్తూ వచ్చాను. అందుకే అలాంటి సమస్యలు నాదాకా రాలేదనుకుంటా. మన ప్రవర్తన బట్టి ఎదుటివారు ప్రవర్తిస్తుంటారు. వారెవరికీ నా గురించి కానీ, నాతో మాట్లాడే ఛాన్స్ నేను ఇవ్వలేదు. అయితే ఇద్దరు(ఒక అమ్మాయి-అబ్బాయి) ఒకరినొకరు ఇష్టపడి కమిట్ అవ్వడంలో అభ్యంతరం లేదు. నాకు తెలిసి ఇప్పుడు ఎక్కువగా అదే జరుగుతోంది” అని చెప్పుకొచ్చింది దివి. -
కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన విష్ణుప్రియ, నన్ను కూడా అలా అడిగారు..
యాంకర్ విష్ణుప్రియ.. బుల్లితెర ప్రేక్షక్షులకు, సోషల్ మీడియా యూజర్లకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. షార్ట్స్ ఫిలింస్‌తో కెరీర్ ప్రారంభించిన ఆమె ఆతర్వాత యాంకర్‌గా బుల్లితెర ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు రీసెంట్గా వాంటెడ్ పండుగాడ్ చిత్రంతో హీరోయిన్గా మారింది. ఇటీవల ఆమె జరీ జరీ అనే అల్భం సాంగ్‌తో ఉర్రుతలుగించింది. ఇక నెట్టింట ఆమె చేసే రచ్చ అంతాఇంత కాదు. తరచూ హాట్‌హాట్ ఫొటోలు, డ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ సోషల్ మీడియాలో సైతం ఫాలోవర్స్‌ను అలరిస్తూ ఉంటుంది. బిగ్‌బాస్ ఫేం మానస్‌తో కలిసి ఆమె చేసిన ఈ అల్భమ్ సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న సంగతి తెలిసిందే. చదవండి: గుర్తుపట్టలేనంతగా ‘సీతారామం’ బ్యూటీ.. షాకింగ్ లుక్ వైరల్ ఈ క్రమంలో ఓ యూట్యూబ్ ఛానల్‌తో ముచ్చటించిన ఆమె పలు ఆసక్తిర విషయాలను పంచుకుంది. ఈ సాంగ్ ఆఫర్ తనకు స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ వల్ల వచ్చిందని, ఆపాటకు ఆయన తన పేరును రెఫర్ చేశారని చెప్పింది. ఇక ఇండస్ట్రీలో మేల్ డామినేషన్ ఎక్కువ అంటున్నారు.. మీ అభిప్రాయం ఏంటని అడగ్గా.. ‘అవును పరిశ్రమలో పురుషాధిక్యం ఎక్కువ అనేది నిజమే. అయితే అది పోవడానికి ఇంకా టైం పడుతుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మనకు స్వతంత్య్రం వచ్చింది. ఆడవాళ్లు కూడా ఇప్పడిప్పుడే బయటకు వస్తున్నారు. ఆయా రంగాల్లో మహిళలు రాణించాలంటే ఇంకా టైం పడుతుంది. ఇంకా 15-20 ఏళ్లలో ఆడవాళ్లు కూడా మగవాళ్లకు పోటీగా వస్తారు’ అని చెప్పింది. చదవండి: ‘సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా టార్గెట్ చేశారు, ఆ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టుకున్నా’ ఇక కాస్టింగ్ కౌచ్‌పై అభిప్రాయం అడగ్గా.. కాస్టింగ్ కౌచ్ అనేది కేవలం ఇండస్ట్రీలోనే కాదు ప్రతిచోటా ఉందని చెప్పింది. ‘కాస్టింగ్ కౌచ్ అనేది అన్నిచోట్ల ఉంది. కానీ అది చూస్ చేసుకోవలా? వద్దా? అనేది ఆడవాళ్ల చేతిలో ఉంది. మనకు ఎప్పుడు రెండు ఆప్షన్స్ ఉంటాయి. అందులో ఏది చూస్ చేసుకోవాలన్నది అమ్మాయి వ్యక్తిగతం. అదే నన్ను చూసుకోండి. ఆఫర్స్ కోసం చూస్తున్న సమయంలో నన్ను కూడా చాలా మంది కోరిక తీర్చాలని అడిగారు. దానివల్ల ఎన్నో ఆఫర్లు వదులున్నా’ అని చెప్పుకొచ్చింది. అనంతరం తనకు యాంకర్ అనే ట్యాగ్ వద్దని, అలా పిలిపించుకోవడం ఇష్టం లేదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే ఇక్కడ తన కంటే అందంగా, చాలా బాగా తెలుగు మాట్లాడే యాంకర్స్ ఉన్నారని, వారితో సమానంగా యాంకర్ అని పిలుపించుకుని ఆ పదం విలువ తీయలేనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. -
నిర్మాతలతో అలా ఉంటేనే హీరోయిన్లకు అవకాశాలు: నటి షాకింగ్ కామెంట్స్
సినీ ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. పైకి ఎంతో అందంగా కనపడినా బయటకి కనిపించని మరకలు ఎన్నో ఉంటాయి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ కల్చర్ గురించి ఇప్పటికే చాలామంది నటీమణులు ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఒకవిధంగా సినీ పరిశ్రమలో ఈ లైంగిక వేధింపులపై మీటూ ఉద్యమం కూడా పుట్టుకొచ్చింది. స్టార్ హీరోయిన్స్ నుంచి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదిగే హీరోయిన్స్ వరకు ఎంతో మంది వారి వారి అనుభవాలను చెప్పుకున్నారు. తాజా బాలీవుడ్ నటి షామా సికిందర్ కూడా తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకుంది. చదవండి: అషురెడ్డి బర్త్‌డే.. కాస్ట్లీ కారు బహుమతిగా ఇచ్చిన ఆమె తండ్రి రీసెంట్గా ఓ బాలీవుడ్ మీడియాతో ముచ్చటించిన ఆమె కాస్టింగ్ కౌచ్‌పై పెదవి విప్పింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘గతంలో ఉన్నట్లు ప్రస్తుతం ఇండస్ట్రీ అలా లేదు. ఇప్పుడు ఉన్న యువ డైరెక్టర్లు చాలా ప్రొఫెషనల్‌గా ఉంటున్నారు. నటీనటులకు చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. గతంతో పోలిస్తే ఇప్పుడు ఇండస్ట్రీ చాలా సేఫ్‌గా ఉంది’ అని చెప్పుకొచ్చింది. ఒకప్పుడు దర్శక-నిర్మాతలు హీరోయిన్లను తమతో గడపాలంటూ ఇబ్బంది పెట్టేవారంటూ ఆమె షాకింగ్ కామెంట్స్ చేసింది. ‘అప్పట్లో పేరున్న కొందరు దర్శక-నిర్మాతలు వారితో పని చేయకపోయిన తమతో సన్నిహితంగా ఉండాలని అడిగేవారు. వారి మాటలు నాకు ఆశ్చర్యంగా అనిపించేవి. మీతో కలిసి ఎలాంటి వర్క్ చేయనప్పుడు స్నేహంగా ఎలా ఉంటామని అడిగేదాన్ని. చదవండి: మళ్లీ బుక్కైన తమన్.. ‘ఏంటమ్మా.. ఇది’ అంటూ మెగా ఫ్యాన్స్ ఫైర్ అప్పుడు వారు నీకు పని కావాలంటే మాతో చనువుగా ఉండాలి. మాతో బెడ్ షేర్ చేసుకోవాలి అని చెప్పేవారు. అప్పటి హీరోయిన్లు అంతా ఇండస్ట్రీలో అభద్రతా భావంతో ఉండేవారు. అవకాశాలు కావాలంటే దర్శక-నిర్మాతల కోరికలు తీర్చాల్సిందే. అలా చేస్తేనే అవకాశాలు ఉండేవి. కానీ ఇప్పుడు అలా కాదు. అలా అని ప్రస్తుతం ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని చెప్పను. ఉంది.. కానీ గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా తక్కువ. ఒక్క సినీ ఇండస్ట్రీలోనే కాదు ప్రతిచోటా కాస్టింగ్ కౌచ్ ఉంది’ అని ఆమె పేర్కొంది. కాగా షామా సికిందర్ ‘యే మేరి లేఫ్ హై’, ‘మన్ మే హై విశ్వాస్’ వంటి టీవీ సీరియల్స్‌తో నటిగా మంచి గుర్తింపు పొందింది. అంతేకాదు అమిర్ ఖాన్ ‘మన్’తో వెండితెర ఎంట్రీ ఇచ్చిన ఆమె చివరిగా 2019 ‘బైపాస్ రోడ్’లో నటించింది. -
కాంప్రమైజ్ అయితే మంచి ఛాన్స్ ఇస్తానన్నాడు: నటి
క్యాస్టింగ్ కౌచ్.. సినిమా ఇండస్ట్రీలో తరచూ వినిపించే సమస్య. అనేకమంది తారలు ఎప్పుడో ఒకప్పుడు దీని బారిన పడినవారే. తాజాగా బుల్లితెర నటి శివ పఠానియా సైతం తాను క్యాస్టింగ్ కౌచ్‌ను ఫేస్ చేశానంటోంది. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని చెప్పుకొచ్చింది. 'హమ్ సఫర్ షో ముగిశాక నెక్స్ట్ ఏంటన్నది తోచలేదు. ఎనిమిది నెలల పాటు దిక్కు తోచక ఉండిపోయాను. అలాంటి సమయంలో నన్ను ఆడిషన్‌కు రమ్మంటూ ఫోన్‌కాల్ వచ్చింది. ముంబైలోని శాంతాక్రజ్‌లో ఆడిషన్.. అది చిన్న గది, లోనికి వెళ్లాను. అక్కడున్న వ్యక్తి.. నువ్వు నాతో ఒకరోజుకి కాంప్రమైజ్ అయ్యావంటే పెద్ద స్టార్‌తో యాడ్‌లో నటించేందుకు ఛాన్స్ ఇస్తానన్నాడు. విచిత్రం ఏంటంటే అతడు ల్యాప్‌టాప్‌లో హనుమాన్ చాలీసా వింటున్నాడు. వెంటనే నేను అతడు అడిగిన ప్రశ్నకు గట్టిగా నవ్వేశాను. కొంచెమైనా సిగ్గుందా? భజన పాట వింటూ ఏం అడుగుతున్నావసలు? అని తిట్టేశాను. ఈ విషయాన్ని మా ఫ్రెండ్స్‌కు చెప్పి వాళ్లను జాగ్రత్తపడమన్నాను. కానీ తర్వాత తేలిందేంటంటే అతడసలు నిర్మాతే కాదు, అతడే కాదు అతడి బ్యానర్ కూడా ఫేకే అని తెలిసింది. మరి అతడికి అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కాలేదు' అని పేర్కొది శివ. ఆమె చివరగా హాట్‌స్టార్ స్పెషల్స్.. 'షూర్వీర్' వెబ్‌సిరీస్‌లో నటించింది. చదవండి: పెళ్లి పుకార్లపై స్పందించిన హీరో రామ్ రాజమౌళి మగధీరలో ఆఫర్ ఇచ్చారు, కానీ నేనే.. -
మేనేజర్‌ను ఒంటరిగా కలిస్తే ఎక్కువ డబ్బులిస్తామన్నారు
ఈ మధ్య బుల్లితెర మీద తెగ సందడి చేస్తోంది గీతూ రాయల్. ఆ మధ్య టిక్‌టాక్ వీడియోలతో, తర్వాత బిగ్‌బాస్ రివ్యూలతో బాగా ఫేమస్ అయిందీవిడ. చిత్తూరు యాసలో గలగలా మాట్లాడుతూ గలాటా గీతూగా పేరు తెచ్చుకుంది. తాజాగా ఆమె సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఫేవరెట్ హీరో ఎవరన్న విషయాన్ని బయటపెట్టింది. అల్లు అర్జున్ అంటే చేయి కోసుకుంటానని, అతడే తన అభిమాన హీరో అని చెప్పుకొచ్చింది. ఆమె ఇంకా మాట్లాడుతూ.. 'మాట్లాడటం నాకిష్టం. అందుకే ఆర్జే అవ్వాలనుకున్నాను. పెద్దపెద్ద బ్యానర్వాళ్లు నాకు సినిమా ఛాన్సులిచ్చారు. కానీ నాకు యాక్టింగ్ రాదని నో చెప్పాను. ఆ తర్వాత మాత్రం మహేశ్ విట్టాతో కల్ట్ గ్యాంగ్, సోహైల్‌తో లక్కీ లక్ష్మణ్ మూవీలో చిన్న పాత్రలు చేశాను. ఇక క్యాస్టింగ్ కౌచ్ విషయానికి వస్తే.. ఇటీవలే నాకు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆస్ట్రేలియాలో ఒక ఈవెంట్ ఉంది, దానికి హోస్ట్ చేయాలని అడిగారు. నాకు హోస్టింగ్ అంటే ఇష్టమని సరేనన్నాను. ఆస్ట్రేలియాలో షాపింగ్ చేయొచ్చు. పైగా మూడు రోజుల ఈవెంట్‌కు భారీ రెమ్యునరేషన్ అడిగాను, వాళ్లు కూడా సరేనన్నారు. కరెక్ట్‌గా టికెట్ బుక్ చేసే సమయంలో మేనేజర్ పీఏ ఫోన్ చేసి పర్సనల్‌గా ఓకే కదా అన్నారు.. అంటే నా పనులన్నీ చేయడానికి అసిస్టెంట్‌గా వస్తాడేమో అని ఓకే అన్నాను. దానికతడు కాదు మేడమ్, మీకు, మా మేనేజర్‌కు పర్సనల్‌గా ఓకే అయితే ఇంకా ఎక్కువ డబ్బులిస్తాం అన్నాడు. నాకు మైండ్ బ్లాక్ అయింది, వెంటనే నో చెప్పాను. తర్వాత పర్సనల్‌గా కాకపోయినా హోస్టింగ్ అయినా చేయండి అని ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అయినా సరే నాకు భయం వేసి రానని చెప్పాను' అని పేర్కొంది గీతూ. చదవండి 👇 సంచలన తీర్పు: బోరున ఏడ్చేసిన హీరోయిన్.. భావోద్వేగానికి గురైన జానీ పాటలు పాడడానికే పుట్టాడు.. 'గుర్తుకొస్తున్నాయి.. గుర్తుకొస్తున్నాయి' -
ఆఫర్ల కోసం చాలామంది హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తారు: డైరెక్టర్
Geetha Krishna Shocking Comments On Casting Couch: కాస్టింగ్ కౌచ్.. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు. ఎలాంటి రంగానికి చెందిన మహిళలైన ఈ కమిట్మెంట్ కల్చర్‌కు బాధితులు అవుతున్నారు. ముఖ్యంగా సీని ఇండస్ట్రీలో ఈ పేరు మారుమ్రోగుతుంది. ఇప్పటికే దీనిపై పలువురు నటీమణులు ఈ కాస్టింగ్ కౌచ్ నోరు విప్పుతున్నారు. వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలను ధైర్యంగా బయట పెడుతున్నారు. చదవండి: ‘నా భర్త వల్ల ప్రాణహాని ఉంది’.. పోలీసులను ఆశ్రయించిన నటి ఈ క్రమంలో కాస్టింగ్ కౌచ్‌పై ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. సంకీర్తన, కీచురాళ్లు, కోకిల వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన దర్శకుడు గీతా కృష్ణ. ఈ మధ్య ఆయన పలు యూట్యూబ్ చానళ్లకు వరుసగా ఇంటర్య్వూలు ఇస్తూ హీరోహీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో గతంలో ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన ఆయన పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ గురించి చెప్పకొచ్చారు. ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అప్పుడు.. ఇప్పుడు.. ఎప్పుడు ఉంటుందంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చదవండి: ప్రియుడితో నటి ఎంగేజ్మెంట్! ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్ వార్నింగ్ ‘ఆఫర్ల కోసం చాలా మంది హీరోయిన్లు కమిట్మెంట్ ఇస్తారు. అలా అయితేనే ఇక్కడ అవకాశాలు వస్తాయి. ఈ ఇండస్ట్రీ అమ్మాయిలకు సేఫ్ ప్లేస్ కాదు’ అన్నాడు. సింగర్స్ విషయంలోనూ ఇది జరుగుతుందని, ఈ విషయాలను బయటపెడితే కొత్త ఆఫర్లు రావడం కష్టమవుతుందని ఆయన పేర్కొన్నాడు. అయితే తాను అందరినీ అనడం లేదని ఇలాంటివి వద్దు అని అనుకునే వాళ్లు 10 నుంచి 15 శాతం ఉంటారని గీతాకృష్ణ తెలిపాడు. కాగా ప్రస్తుతం డైరెక్టర్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్‌టాపిక్‌గా మారాయి. -
కాస్టింగ్ కౌచ్ ఎదురైనా పబ్లిసిటీ చేసుకోలేదు : నటి
సీనియర్ నటి రాధా ప్రశాంతి కాస్టింగ్ కౌచ్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు నెట్టింట హాట్‌టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం సినిమాలకు దూరమైన ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో కాస్టింగ్ కౌచ్‌పై స్పందించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ అన్నది ఇంతకు ముందు ఉంది..ఇప్పుడు ఉంది.. ఇక ముందు కూడా ఉంటుంది. అయితే అప్పట్లో ఇలాంటివి ఎదురైనా ఎవరూ పబ్లిసిటీ చేసుకోలేదు. ఇప్పుడు రోడ్డు మీదకి ఎక్కారు. అంతే తేడా. ఇక్కడ ఎవరూ ఎవరిని బలవంతం చేయరు. సినిమా కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాలి అనే పాలసీ ఉందిక్కడ. నాకు కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైంది. ఓ సినిమాలో నన్ను సెకండ్ హీరోయిన్గా పెట్టుకొని ఆ తర్వాత తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. మేనేజర్ని అడిగితే ఈ విషయం తెలిసింది. నా స్థానంలో కమిట్మెంట్ ఇచ్చిన వాళ్లని పెట్టుకున్నారు. అప్పుడు, ఇప్పుడు కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది' అంటూ చెప్పుకొచ్చారు. -
హీరో ఒంటరిగా రమ్మన్నాడు, నో అన్నందుకు పక్కన పెట్టేశారు!
క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఎన్నో బాధలు పడ్డానంటూ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన అనుభవాలను వెల్లడించింది అలనాటి హీరోయిన్ ఇషా కొప్పికర్. క్యాస్టింగ్ కౌచ్ వల్ల తనకు సినిమా అవకాశం కూడా చేజారిపోయిందని చెప్పుకొచ్చింది. తాజాగా బాలీవుడ్ హంగామాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడించింది... 'యాక్టర్స్‌గా ఎలా కనిపిస్తున్నాము? ఎలా నటిస్తున్నామనేదే ముఖ్యమనుకున్నాను. కానీ కొందరు హీరోల కంట్లో కూడా ఉంటామని తర్వాత తెలిసింది. ఆ రోజు జరిగిన సంఘటనతో నా హృదయం ముక్కలైంది. అందరికీ వారికంటూ కొన్ని ప్రాధాన్యతలుంటాయి. అలా నాకు నా వర్క్ కంటే జీవితమే ముఖ్యమైనది. అద్దంలో నన్ను నేను చూసుకున్నప్పుడు తలెత్తుకునేలా ఉండాలి' అని పేర్కొంది. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో ఇషా మాట్లాడుతూ.. 'ఆ ఓ నిర్మాత ఫోన్ చేసి ఓ హీరో రాసుకున్న లిస్టులో మీరు కూడా ఉన్నారని చెప్పాడు. నాకర్థం కాక హీరోకు ఫోన్ చేస్తే అతడు ఒంటరిగా రమ్మన్నాడు. నా స్టాఫ్ ఎవరూ కూడా వెంట రావద్దని మరీ మరీ చెప్పడంతో విషయం అర్థమైంది. అప్పుడు నిర్మాతను పిలిచి నా అందం, పనితనం వల్లే ఇక్కడిదాకా వచ్చాను, అలాంటిది ఇప్పుడు ఓ అవకాశం కోసం దిగజారతానని ఎలా అనుకున్నారని కడిగిపారేశాను. దీంతో అతడు నన్ను సినిమా నుంచి తప్పించాడు' అని చెప్పుకొచ్చింది. ఏక్ థా దిల్ ఏక్ థీ దడ్కన్ సినిమాతో కథానాయికగా 1998లో కెరీర్ ఆరంభించిన ఇషా ఫిజా, ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్, కంపెనీ, పింజర్, దిల్ కా రిష్తా వంటి పలు చిత్రాల్లో నటించింది. అంతేకాకుండా తెలుగులో చంద్రలేఖ, ప్రేమతో రా వంటి సినిమాల్లో హీరోయిన్గా మెప్పించింది.. హిందీ, తమిళంలో పలు సినిమాలు చేసిన ఆమె చివరగా దహనం వెబ్ సిరీస్‌లో కనిపించింది. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1131264712.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి: డైరెక్టర్, హీరో అన్నీ అతడే.. సురాపానం టీజర్ చూశారా? -
ఒంటిపై బట్టలేకుండా ఫొటోలు పంపమనేవారు: బుల్లితెర నటుడు
తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడినే అంటున్నాడు టీవీ నటుడు అంకిత్ సివాచ్. మోడల్‌గా 12 ఏళ్ల క్రితమే కెరీర్ ఆరంభించిన ఈ నటుడు 2017లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. పలు హిందీ సీరియళ్లలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అంకిత్. అయితే ఒకానొక సమయంలో అన్నీ వదిలేసి వెనక్కు వెళ్లిపోవాలనుకున్నానంటూ కాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకున్నాడు. 'అందరూ మంచివాళ్లు అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని. కానీ అలా అనుకోవడమే నా బలహీనతగా మారింది. ఈ వీక్నెస్ను ఎదుటివాళ్లు యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ చెడు కూడా ఉంటుంది. కానీ అది రాక్షసత్వంగా మారి మిమ్మల్ని ముప్పుతిప్పలు పెట్టొచ్చు. మోడలింగ్ చేసేటప్పుడు నేను అలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నాను. ఒంటి మీద బట్టలు లేకుండా ఫొటోలు పంపమనేవారు. నాకు ఇచ్చిన పనితో సంబంధం లేకుండా పార్టీలకు రావాలనేవారు. నన్ను వేధింపులకు గురి చేశారు. చాలాసార్లు మోడలింగ్ మానేద్దామా అనిపించింది. కొంతమందిని చూసినప్పుడు మన కళ్ల ముందు రాబంధులు నిలబడి మనల్ని పీక్కు తినడానికి వస్తున్నాయనిపించేది. అలాంటివారిని చూసినప్పుడు అన్నీ వదిలేసి వెనక్కు వెళ్లిపోదాం అనిపించేది. దీనివల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యా. కుమిలిపోయాను. కానీ అధికారంలో ఉన్నవారు ఇతరులను దగా చేయడం మానవ స్వభావమని నన్ను నేను సంభాలించుకున్నాను. ఇది ప్రతి ఇండస్ట్రీలో ఉంది. వాటినుంచి మనం తప్పించుకోలేము. ఏదో ఒకసారి ఫేస్ చేయాల్సిందే. అలా నాకు ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయి. నీకు ఇష్టమున్నా లేకపోయినా నీ కెరీర్ కోసమైనా ఆ పని చేసి తీరాల్సిందే అని ఒత్తిడి తెచ్చినవాళ్లు కూడా ఉన్నారు. అప్పుడు నేను స్వయంకృషితో ఎదిగిన సెలబ్రిటీల గురించి ఉదాహరణగా చెప్పేవాడిని. మేము చెప్పినదానికి కాంప్రమైజ్ కాకుండా నువ్వు ముందుకు వెళ్లగలననుకుంటున్నావా? అని బెదిరించేవాళ్లు కూడా!' అని చెప్పుకొచ్చాడు అంకిత్ సివాచ్. చదవండి: ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు.. ప్రియుడితో లేచిపోయారంటూ వచ్చిన వార్తలపై రాజశేఖర్ కూతురు ఫైర్ -
ఆఫర్స్ కోసం అలాంటి నీచమైన పనులు చేయను : హీరోయిన్
Noel Ex Wife Ester Noronha: 'భీమవరం బుల్లోడు' సినిమాతో టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఎస్తర్ నోరోన్హ. ఆ తర్వాత వెయ్యి అబద్ధాలు, జయ జానకి నాయిక, గరం వంటి చిత్రాల్లో కనిపించినా పెద్దగా అవకాశాలు రాలేదు. కొన్నాళ్లకు సింగర్ నోయల్‌ను ప్రేమ వివాహం చేసుకున్నప్పటికీ ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. ఆరు నెలల్లోనే వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. విడాకుల అనంతరం అడపాదడపా చిత్రాలు చేస్తున్న ఎస్తర్ తాజాగా ‘69 సంస్కార్ కాలనీ’ మూవీలో నటించింది. ఈ క్రమంలో వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న ఎస్తర్ కాస్టింగ్ కౌచ్‌పై ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. 'ఇండస్ట్రీలో అన్ ప్రొఫెషనల్ ట్రాక్స్ చాలా చూశాను. సినిమా ఆఫర్లతో పాటు ఈ ఆఫర్లు కూడా వచ్చేవి.. వాళ్లని ఇంప్రెస్ చేయమని వీళ్లని ఇంప్రెస్ చేయమని అనేవాళ్లు. ఆఫర్ కోసం ఏం చేయడానికైనా రెడీ అని చెప్పిన హీరోయిన్లు కూడా ఉన్నారు. ఆ సోకాల్డ్ హీరోయిన్స్ చాట్స్ స్క్రీన్ షాట్స్ కూడా నేను చూశాను. కెరీర్ కోసం ఏదైనా చేస్తాం అంటారు. అలా ఆడవాళ్లే స్వయంగా ఆఫర్స్ ఇవ్వడం అనేది కూడా ఇండస్ట్రీలో ఉంది. క్యాస్టింగ్ కౌచ్ నేను కూడా ఎదుర్కొన్నాను. కానీ ఆఫర్స్ కోసం అలాంటి నీచమైన పనులు చేయను' అని చెప్పుకొచ్చింది. -
నేను కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా: మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్
మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్న కాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటూ నోరు విప్పింది. దీంతో విలక్షణ నటుడు మోహన్ బాబు కూతరు సైతం ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తిని సంతరించుకుంది. కాగా మంగళవారం(మార్చి 8) ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భం మంచు లక్ష్మి ఓ జాతీయ మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమె కాస్టింగ్ కౌచ్, బాడి షేమింగ్‌పై స్పందిందించింది. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. ‘అవును ఇవన్ని నేను ఫేస్ చేశాను. సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చిన నాకు ఇలాంటివి ఎదురవ్వవు అనుకున్నాను. చదవండి: రెమ్యునరేషన్లో తగ్గేదే లే.. ఎవరెంత తీసుకుంటున్నారో తెలుసా? కానీ ఇప్పటికీ ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు కష్టపడుతూనే ఉన్నాను. మోహన్ బాబు కూతురిని అయిన నేను సైతం కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాను. అంతేకాదు బాడీ షేమింగ్ ట్రోల్స్ బారిన కూడా పడ్డాను. నా శరీరాకృతి కర్వ్డ్గా ఉండటం వల్ల కూడా బాడీ షేమింగ్‌కు గురయ్యాను’ అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాదు ‘సినీ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చింది కదా తనకు ఇలాంటి ఇబ్బందులు ఉండవని అంతా అనుకుంటారు. కానీ అది తప్పు. ఒక్క సినీ పరిశ్రమలోనే కాదు. ఏ రంగంలో అయిన ప్రతీ మహిళా ఇవన్నీ ఫేస్ చేస్తుంది. మహిళలు పని చేసే ప్రతి చోట కాస్టింగ్ కౌచ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఐటీ, బ్యాంకింగ్ సెక్టార్ ఇలా అన్ని చోట్ల ఉంది. నా స్నేహితుల్లో కొంతమంది ఇలాంటి వాటి గురించి నాకు చెబుతుంటారు. చదవండి: మరో కొత్త బిజినెస్‌లోకి సామ్, ఇది నాగ చైతన్యకు పోటీగానా? ట్రోల్స్, బాడీ షేమింగ్స్ కూడా కేవలం సినీ పరిశ్రమలోనే కాదు అన్నిచోట్లా ఉన్నాయి’ అని పేర్కొంది. కాబట్టి ఇవేవి పట్టించుకోకుండా మహిళలు ముందుకు సాగాలని, మనకు నచ్చినట్టుగా మనం ఉండాలంది. అలాగే ఈ జీవితం చాలా చిన్నదని, దాంట్లో వీటికి స్థానం ఇవ్వకుడదని చెప్పింది. ఇవేవి పట్టించుకోకుండా సంతోషంగా ఉండాలంది. ఈ ట్రోలింగ్, కాస్టింగ్ కౌచ్.. ఇవేవీ కూడా మనల్ని ఆపకూడదని, మనం చేయాలనుకున్నది చేయాలి.. సాధించాలనుకున్నది సాధించాలి అంటూ మంచు లక్ష్మీ సందేశం ఇచ్చింది. కాగా ప్రస్తుతం ఆమె మళయాళం, తమిళ సినిమాల్లో చేస్తోంది. మోహన్ లాల్ మానస్టర్ చిత్రంలో మంచు లక్ష్మి కీ రోల్ పోషిస్తుండగా.. ఇక తమిళంలోని ఓ సినిమాలో లేడి పోలీసు ఆఫీసర్‌గా కనిపించనుంది. -
ఆ హీరో నన్ను ఏకాంతంగా కలవాలి అన్నాడు: ‘చంద్రలేఖ’ హీరోయిన్
కాస్టింగ్ కౌచ్.. సినీ పరిశ్రమలో ఎక్కువగా వినిపించే పేరు ఇది. ఇటివల కాలంలో ఈ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. స్టార్ హీరోయిన్స్ నుంచి క్యారెక్టర్ అర్టిస్ట్‌ల వరకు ఎంతో మంది దీని బాధితులుగా ఉన్నారు. సుచి లీక్స్, సింగర్ చిన్మయ్ శ్రీపాద వివాదం నుంచి కాస్టింగ్ కౌచ్ బాధితులు ఒక్కొరుగా బయటకు వచ్చి నోరు విప్పుతున్నారు. తాజాగా నాగార్జున ‘చంద్రలేఖ’ హీరోయిన్ ఈషా కొప్పికర్ సైతం కాస్టింగ్ కౌచ్‌పై పెదవి విప్పింది. 90లో ఇషా కొప్పికర్ స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీలో రాణించిన సంగతి తెలిసిందే. 2009లో పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైన ఆమె..నిఖిల్ హీరోగా వచ్చిన ‘కేశవ’ సినిమాలో కీ రోల్ పోషించి రీఎంట్రి ఇచ్చింది. చదవండి: 9 ఏళ్ల వయసులోనే షాకిచ్చాడు: వర్మ సోదరి ఆసక్తికర వ్యాఖ్యలు ఆ తర్వాత పలు వెబ్ సిరీస్‌లో నటిస్తూ వస్తున్న ఇషా రీసెంట్ ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో తను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘చదువుకుంటున్న క్రమంలోనే పాకెట్ మనీ కోసం మోడలింగ్ చేశాను. దీంతో నాకు సినిమా అవకాశాలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలో ‘‘ఏక్ థా దిల్ థా ధడ్కన్’ ఆఫర్ రావడంతో హీరోయిన్ అయ్యాను. అయితే ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఓ నిర్మాత ఫోన్ చేసి అవకాశం ఉందని చెప్పాడు. ఇందుకోసం మీరు మొదట హీరోని కలవాలి అని చెప్పాడు. ఆ తర్వాత హీరోకి కాల్ చేస్తే ‘మీరు ఒంటరిగా రండి. ఏకాంతంగా కలుద్దాం. మీతో పాటు మీ స్టాప్ ఎవరు ఉండకూడదు’ అన్నాడని’’ చెప్పుకొచ్చింది. చదవండి: హీరోగా ‘మైనింగ్ కింగ్’ గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు, మూవీ టైటిల్ ఖరారు అలాగే ఆ హీరోతో మాట్లాడాక తనకు అసలు విషయం అర్థమైందని, వెంటనే నిర్మాతకు ‘నా టాలెంట్, లుక్స్‌తో ఇక్కడకు వచ్చాను. అదే విధంగా నాకు అవకాశాలు వస్తే చేస్తాను’ అని తెగేసి చెప్పినట్లు పేర్కొంది. దీంతో సదరు నిర్మాత, హీరో తన మీద కోపంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తొలగించినట్లు ఈషా తెలిపింది. 'ఏక్ థా దిల్ ఏక్ థా ధడ్కన్'తో హీరోయిన్గా బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఇషా కొప్పికర్. ఆ తర్వాత వరస ఆఫర్లు అందుకుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు తెలుగు, కన్నడ, తమిళంలో కూడా అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలో తెలుగులో నాగార్జున చంద్ర లేఖ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె ప్రేమతో రా, కేశవ చిత్రాల్లో నటించింది. చంద్రలేఖ సినిమాలో ఇషా తెలుగు గుర్తింపు పొందింది. -
పెద్ద సినిమాలో అవకాశం.. కమిట్మెంట్ అడిగారు : నటి
Actress Sneha Sharma Open Up On Casting Couch: సినీ ఇండస్ట్రీ ఒక రంగుల ప్రపంచం. పైకి ఎంతో అందంగా కనపడినా బయటకి కనిపించని మరకలు ఎన్నో ఉంటాయి. ఇండస్ట్రీలో కమిట్మెంట్ కల్చర్ గురించి ఇప్పటికే చాలామంది నటీమణులు ఓపెన్ అయిన సంగతి తెలిసిందే. ఒకవిధంగా సినీ పరిశ్రమలో ఈ లైంగిక వేధింపులపై మీటూ ఉద్యమం కూడా పుట్టుకొచ్చింది. స్టార్ హీరోయిన్స్ నుండి ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదిగే హీరోయిన్స్ వరకు ఎంతో మంది వారి వారి అనుభవాలను చెప్పుకున్నారు. తాజాగా నా ప్రేమ నాకు కావాలి ఇండిపెండెంట్ మూవీ హీరోయిన్ స్నేహా శర్మ తనకు ఎదురైన ఇబ్బందుల గురించి ఓపెన్ అప్ అయ్యింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో ఇలాంటివి నేను కూడా ఫేస్ చేశాను. కమిట్మెంట్ అడిగారు. నో చెప్పినందుకు సినిమాలోంచి తీసేశారు. అలా పెద్ద సినిమాల్లో కూడా అవకాశం కోల్పోయాను. అయినప్పటికీ అడుక్కు తిని అయినా బతుకుతా కానీ ఇలాంటి పనులు చేయను అని చెప్పేశాను. అయినా ఇక్కడ బలవంతాలు ఉండవు. మన మీద కూడా ఆధారపడి ఉంటుంది. అడిగేవాళ్లు అడుగుతారు. నిర్ణయం మాత్రం మనదే' అంటూ తనకు ఎదురైన అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. -
కమిట్మెంట్ అడిగారు, నో చెప్తే కెరీర్ ఖతమన్నారు: నోయల్ మాజీ భార్య
Noyel EX Wife Ester Noronha: 'భీమవరం బుల్లోడు' సినిమాలో హీరోయిన్గా మెప్పించింది హీరోయిన్ ఎస్తర్ నోరోన్హ. ఆ తర్వాత 'గరం'లో ఓ సాంగ్, 'జయజయజానకి నాయక'లో ఓ చిన్న పాత్ర చేసిన ఆమెకు టాలీవుడ్లో పెద్దగా అవకాశాలు రాలేదు. సింగర్ నోయల్‌ను ప్రేమించి పెళ్లి చేసుకోగా వీరి బంధం మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. ఆరు నెలల్లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే తనకు తెలుగులో అవకాశాలు తగ్గిపోవడానికి గల కారణాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది ఎస్తర్. 'ఆఫర్స్ రావాలంటే కమిట్మెంట్ అడిగారు. వాటికి ఒప్పుకోకతే కెరీర్ ఇక్కడితోనే ముగిసిపోతుంది, ముందుకు వెళ్లలేరని బెదిరించారు. క్యాస్టింగ్ కౌచ్ నేను ఎదుర్కొన్నాను. వాళ్లు ఇన్‌డైరెక్ట్‌గా అర్థం అయ్యేలా చెప్తారు. నీకంటే వెనుక వచ్చినవాళ్లు ముందుకు వెళ్లిపోతారు. నువ్వు మాట వినకపోతే ఇక్కడే ఆగిపోతావు, గతంలో చాలామందికి ఇలానే అయ్యింది అని! సినిమా అంటే నాకిష్టం కానీ అదే నా జీవితం కాదు. దానికోసం అంత దిగజారడం అవసరం లేదు. అందుకే నో చెప్పాను. ఛాన్స్ రావాలంటే ఇదొక్కటే దారి అంటే నాకవసరమే లేదు. ఇంతలో నాకు కన్నడ ఇండస్ట్రీలో మంచి అవకాశాలు వచ్చాయి. ఈ క్యాస్టింగ్ కౌచ్ విషయంలో ఎవరో ఒక్కరిది తప్పు అని చెప్పలేం. వాళ్లు అడగకపోయినా ఆఫర్ చేసేవాళ్లున్నారు, ఆఫర్ చేసే వాళ్లు లేకపోయినా అడిగేవాళ్లు ఉన్నారు. నాకు కావాలా? వద్దా? అనేది మాత్రమే చెప్తాను. ఎవరినీ బ్లేమ్ చేయలేను' అని చెప్పుకొచ్చింది ఎస్తర్. -
తొలిసారి కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పిన స్వీటీ, అవకాశాల కోసం అలా చేయాల్సిందే..
స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష శెట్టి వెండితెరపై కనిపించి చాలా రోజులు అవుతుంది. భాగమతి తర్వాత ఆమె ఇంతవరకు ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనుష్క టాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తొలిసారి కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పింది. ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ.. ‘అవును టాలీవుడ్లో సైతం క్యాస్టింగ్ కౌచ్ ఉంది. చదవండి: నటి మీరా జాస్మిన్ ఇప్పుడేం చేస్తుంది.. ఎక్కడుందో తెలుసా? అవకాశాలు ఇస్తామని చెప్పి హీరోయిన్లను లోబర్చుకునే సంస్కృతి తెలుగు పరిశ్రమలో కూడా ఉంది. నేను అలాంటివి చూశాను. ఇది కేవలం తెలుగులోనే కాదు.. ప్రతి ఇండస్ట్రీలో ఉన్నాయి. అయితే నేను పరిశ్రమలోకి వచ్చినప్పటి నుంచి చాలా సూటిగా.. నిక్కచ్చిగా మాట్లాడతాను. అందుకే ఇలాంటి పరిస్థితి నాకు ఎదురుకాలేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మహిళలు లైంగిక వేధింపులతో ఇబ్బందులు పడుతున్నారు. చదవండి: ప్రపోజ్ చేస్తే జోక్ చేశాడనుకున్నా: హీరో నిఖిల్ భార్య ఈ విషయాన్ని నేను కూడా అంగీకరిస్తాను.. కానీ నేను దురుసుగా ఉండటం వల్ల నా దగ్గర ఎప్పుడు ఎవరు అలా మాట్లాడలేదు’ అంటూ చెప్పుకొచ్చింది. కాగా అనుష్క సూపర్ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విక్రమార్కుడు, అరుంధతి, మిర్చి వంటి కమర్షియల్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. అరుంధతితో మహిళ ఓరియంటెడ్ సినిమాలకు తీసిన అనుష్క ఆ తర్వాత జీరో సైజ్, భాగమతి వంటి సినిమాల్లో నటించింది. భాగమతి సినిమా తర్వాత స్వీటీ ఇప్పటి వరకు ఏ సినిమాకు కమిట్ అవ్వలేదు. -
స్టార్ హీరో తనతో గడిపితే చాన్స్ ఇస్తానన్నారు.. నటి ప్రగతి షాకింగ్ కామెంట్స్!
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటి ప్రగతి ఎంత పేరు ప్రఖ్యాతలు పొందిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తనదైన సహజ నటనతో అమ్మ, తల్లి, భార్య పాత్రలకు వన్నెతెచ్చింది. ఇటీవల సినిమాల్లో ఎక్కువ కనిపించకున్నా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడూ అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది. ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రగతి..వాటికి సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటుంది. ఆమె షేర్ చేసే వర్కౌట్ వీడియోలు వైరల్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలాగే అప్పుడప్పుడు ఆమె చేసే కొన్ని కామెంట్స్ కూడా నెట్టింట వైరల్ అవుతుంటాయి. ఏ విషయాన్ని అయినా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పే ప్రగతి... ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిందట. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో అందరిలాగే తాను కూడా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నానని, దర్శక, నిర్మాతలే కాకుండా.. ఓ స్టార్ హీరో కూడా తనతో గడిపితే సినిమాలో అవకాశం ఇస్తామని చెప్పినట్లు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఎలాగోలా ఆ హీరో దగ్గరి నుంచి ప్రగతి తప్పించుకుందట. ఆ హీరో ఎవరనేది మాత్రం ఆమె సీక్రెట్‌గా ఉంచిందట. అయితే ఆమె ఏ ఇంటర్వ్యూలో ఈ కామెంట్స్ చేసిందో తెలియదు కానీ.. దానికి సంబంధించిన వార్తలు మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కూడా పలుమార్లు క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రగతి మాట్లాడిన సంగతి తెలిసిందే. -
డబ్బున్నోడు? కష్టపడేటోడు? విశ్వసుందరి ఛాయిస్ ఎవరంటే..
Miss Universe Harnaaz Sandhu About Dating: సుమారు 21 ఏళ్ల తర్వాత 21 ఏళ్ల భారతీయ యువతి హర్నాజ్ సంధు విశ్వసుందరిగా నిలవడంపై యావత్ దేశం హర్షం వ్యక్తం చేసింది. అయితే అంతర్జాతీయ వేదికగా ఆమెకు ఎదురైన ‘ఇబ్బందికర’ అనుభవం గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ నడిచింది. ఆ అనుభవంతో పాటు పలు అంశాగా తాజాగా ఈ ఛండీగఢ్ బ్యూటీ.. ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. బాగా డబ్బున్న ఓ ముసలి వ్యక్తి.. కష్టపడే తత్వం ఉన్న ఓ యువకుడు.. ఇద్దరిలో డేటింగ్ కోసం ఎవరిని ఎంచుకుంటారు? అనే ప్రశ్న ఎదురైంది హర్నాజ్‌కు. దానికి ఆలోచించకుండానే కష్టపడే వ్యక్తి అని సమాధానం ఇచ్చిందామె.‘‘కష్టం విలువేంటో నాకు తెలుసు. గతంలో చాలా కష్టపడ్డా. భవిష్యత్తులోనూ ఆ పరిస్థితి ఎదురుకావొచ్చు. నాకు కష్టం విలువేంటో తెలుసు. అందుకే కష్టం తెలిసిన వ్యక్తినే కోరుకుంటా.. అప్పుడే మా లక్ష్యాల్ని పరస్పరం గౌరవించుకున్నవాళ్లం అవుతాం’’ అని సమాధానమిచ్చింది హర్నాజ్. మిస్ యూనివర్స్ హర్నాజ్ గురించి ఈ విషయాలు తెలుసా? ఇక బాలీవుడ్ ఎంట్రీ, కాస్టింగ్ కౌచ్ అంశాలపై ప్రశ్న ఎదురుకాగా.. వాటిపై స్పందించడం తనకు తొందరపాటే అవుతుందని, ప్రస్తుతం తాను తన విజయాన్ని మాత్రమే ఆస్వాదిస్తున్నానని తెలిపింది హర్నాజ్. ఒకవేళ హాలీవుడ్లో గనుక అవకాశం వస్తే మాత్రం ఉమెన్ ఎంపవర్‌మెంట్‌ను చాటే బలమైన క్యారెక్టర్లకు ప్రాధాన్యం ఇస్తానని తెలిపింది. ఇక మిస్ యూనివర్స్-2021 గ్రాండ్ ఫినాలే సందర్భంగా.. అమెరికన్ టీవీ హోస్ట్ స్టీవ్ హార్వే, హర్నాజ్‌తో వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. జంతువులను అనుకరిస్తూ శబ్దాలు చేయాలంటూ స్టీవ్, హర్నాజ్ను కోరగా ఆమె అలానే చేసింది. ఈ వ్యవహారంపై హర్నాజ్ స్పందిస్తూ.. అది అనవసరమైన ప్రశ్న అని తాను అనుకోవట్లేదని, అంతర్జాతీయ పోటీల తీరు కొందరు అనుకుంటున్నట్లు ఉండదని, ఆయన తీరు తనకేం ఇబ్బంది అనిపించలేమని, పైగా ఆ సంభాషణను తాను ఆస్వాదించానని తెలిపింది. హర్నాజ్ తళుకులకు కారణం ఏంటో తెలుసా? -
పేరున్న వ్యక్తుల నుంచి కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా: నటి
Bigg Boss OTT Fame Urfi Javed Revealed Shocking Details About Her Casting Couch: బాలీవుడ్ నటి ఉర్ఫీ జావేద్.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. నిజానికి నటన కంటే బోల్డ్ డ్రెస్సింగ్‌తోనే ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఇక హిందీ బిగ్‌బాస్ ఓటీటీతో మరింత పాపులారిటీ దక్కించుకుంంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఉర్ఫీ.. ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో చాలా మంది అమ్మాయిల్లాగే నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే. ఒకతను నన్ను బలవంతం చేశాడు. కానీ అదృష్టం కొద్ది బయటపడ్డాను. ఇండస్ట్రీలో పెద్ద మనుషులుగా పేరున్న వ్యక్తుల నుంచే నేను కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాను. వాళ్లు తలుచుకుంటే ఎవరినైనా, ఎప్పుడైనా ఇండస్ట్రీ నుంచి బయటకి నెట్టగలిగే శక్తి ఉంది. అందుకే నేను వాళ్ల పేర్లు బయట పెట్టడం లేదు' అంటూ చెప్పుకొచ్చింది. -
క్యాస్టింగ్ కౌచ్, వాళ్లు ఎక్కడికి వెళ్లినా ఉంటారు: బుల్లితెర నటి
నటి మదాలస శర్మ తెలుగు, తమిళ, పంజాబీ చిత్రాల్లో నటించింది. కానీ ఎన్ని ప్రాజెక్టులు చేసినా తగినంత గుర్తింపు రాకపోవడంతో హిందీ బుల్లితెరపై వాలింది. అక్కడ అనుపమ సీరియల్ ద్వారా కావాల్సినంత క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది. 'ఏ వృత్తిలో అయినా, ఎక్కడికి వెళ్లినా.. ఒక అమ్మాయి ఉందంటే చాలు ఆమె చుట్టూ పురుషులు కూడా ఉంటారు. కొన్నిసార్లు వాళ్లు ఆమె మీద ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే వారి ప్రవర్తనను బట్టి ఎలా మసలుకోవాలనేది మన చేతిలోనే ఉంటుంది.' 'కొందరు మిమ్మల్ని ఇన్ఫ్లూయెన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ప్రభావితం కావడం, కాకపోవడం కూడా మన చేతిలోనే ఉంటుంది. దాన్ని వేరెవరూ మార్చలేరు. నాకైతే ఎవరైనా ఉన్నప్పుడు సౌకర్యంగా అనిపించకపోతే వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోతాను. అప్పుడు నన్నెవరూ ఆపరు కదా! నేను ఒక నటిని, నా ప్రతిభను చాటుకునేందుకు ఇక్కడిదాకా వచ్చాను. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే సత్తా నాకుంది' అని మదాలస చెప్పుకొచ్చింది. కాగా మదాలసకు గతంలో బిగ్‌బాస్ ఆఫర్ వచ్చిందని, కాకపోతే అప్పటికే తనకు చేతినిండా ప్రాజెక్టులు ఉండటంతో ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించిందని తెలిపింది. -
ఒక రోజంతా గడిపితే సినిమా అవకాశం ఇస్తానన్నాడు :నటి
Saath Nibhana Saathiya-2 Sneha Jain Talks About Casting Couch: హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్న పదం `కాస్టింగ్ కౌచ్`. ఇటీవలి కాలంలో ఎంతో మంది నటీనటులు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి పంచుకున్నారు. తాజాగా నటి స్నేహా జైన్ తనకు జరిగిన లైంగిక వేధింపుల గురించి ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించింది. కెరీర్ ఆరంభంలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని, దక్షిణాది పరిశ్రమకు చెందిన ఓ డైరెక్టర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని తెలిపింది. 'కాలేజ్ స్టూడెంట్స్ నేపథ్యంలో సాగే ఓ సినిమాలో నాకు అవకాశం ఇస్తానని ఓ సౌత్ డైరెక్టర్ నుంచి కాల్ వచ్చింది. దాంతో నా ఫోటోలు, వివరాలను ఆయన పంపించాను. మరుసటి రోజు ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మని చెప్పిన ఆయన ఒక రోజంతా తనతోనే గడపాలని, దేనికైనా ఓకే చెప్పాలన్నాడు. ఆ మాటలకు షాక్ అయ్యాను. నేను అలాంటివి చేయనని చెప్పేశాను. అయితే వారం తర్వాత మళ్లీ ఆ డైరెక్టర్ నాకు కాల్ చేసి ఇలాంటివి చాలా కామన్. నువ్వు ఓకే అంటే ఇప్పటికీ ఆ ఆఫర్ ఉందని చెప్పాడు. నాకు కోపం వచ్చి గట్టిగా అరచి ఫోన్ పెట్టేశాను' అని చెప్పుకొచ్చింది. స్నేహా జైన్ ప్రస్తుతం ‘సాత్ నిభానా సాథియా-2’లో నటిస్తుంది. చదవండి : 'మా'ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్: మేనిఫెస్టో ప్రకటించిన కాసేపటికే... కొడుకుతో పార్క్‌కు వెళ్లిన షకీరా.. ఒక్కసారిగా అడవి పందుల దాడి -
దర్శక-నిర్మాతల కోరిక తీర్చకుంటే ఆఫర్లు రావు: నటి
కాస్టింగ్ కౌచ్ పెద్దగా ఈ పేరు పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో ఎక్కడ చూసిన ఈ పేరు బాగా వినిపిస్తోంది. మీ టూ ఉద్యమంలో భాగంగా చాలామంది నటీనటులు, హీరోయిన్లు పరిశ్రమలో తమకు ఎదురైన చేదు అనుభవాలను ధైర్యంగా వెల్లడించారు. సినీ ఇండస్ట్రీ వేధింపులు తప్పవని, అవకాశాలు రావాలంటే కంప్రమైజ్ అవ్వాల్సిందేనని బాలీవుడ్‌తో పాటు దక్షిణాది సినీ పరిశ్రమలకు చెందిన నటీనటులు చెప్పుకొస్తున్నారు. తాజాగా బాలీవుడ్ నటి నర్గీస్ ఫక్రీ కూడా క్యాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పింది. పరిశ్రమలో తను ఎదుర్కొన్న వేధింపులు, తనకు సినిమా అవకాశాలు రాకపోవడానికి గల కారణాలను వెల్లడించింది. కాగా నర్గీస్ రాక్‌స్టార్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతోనే ఆమె బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ విజయంతో ఎన్నో అవార్డులు కూడా అందుకుంది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలు కమర్షియల్ హిట్స్‌గా నిలిచాయి. కానీ ఆమె ఇండస్ట్రీలో ఎక్కువ కాలం రాణించలేకపోయింది. అయితే దానికి కారణం తాను కమిట్మెంట్ ఇవ్వకపోవగడమే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘తొలి సినిమా భారీ విజయం సాధిస్తే ఎక్కడైన హీరోహీరోయిన్లకు ఆఫ్లరు వస్తాయి. కానీ నా విషమంలో అలా జరగలేదు. బాలీవుడ్లో రాణించాలంటే దర్శక-నిర్మాతల కోరికలను తీర్చాల్సిందే. వాళ్లు చెప్పినట్టు చేయాలి, వారికి నగ్నంగా కనిపించాలి. అలా చేయనందుకే నాకు అవకాశాలు తగ్గాయి. కొందరు బడా దర్శక-నిర్మాతలు నన్ను కమిట్మెంట్ అడిగారు. దానికి నేను ఒప్పుకోలేదు. దీంతో అది మనసులో పెట్టుకని నాకు ఆఫర్స్ రాకుండా చేశారు’ అంటూ ఆమె ఆరోపించింది. కాగా నర్గీస్ తన తొలి చిత్రంతోనే బెస్ట్ ఫీమేల్ డెబ్యూగా ఫిల్మ్ ఫేర్ అవార్డుతో పాటు, సూపర్ స్టార్ ఆఫ్ టుమారో-ఫీమేల్ కేటగిరీలో స్టార్ డస్ట్, జీ సినిమా అవార్డులు అందుకుంది. అలాగే ఈ సినిమాతో ఐఫా అవార్డు కూడా అందుకుంది. -
హీరోయిన్స్‌ను హై ప్రొఫైల్ వేశ్యలుగానే చూస్తారు :నటి
Mahika Sharma On Casting Couch : హాలీవుడ్ నుంచి మొదలు టాలీవుడ్ వరకు సినీ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా క్యాస్టింగ్ కౌచ్, మీటూ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ మహిళలకు లైంగిక వేధింపులు తప్పవని.. ఆయా నిర్మాతలు, దర్శకులతో మానసికంగా ఇబ్బంది పెట్టారని పలువురు తారలు బహిరంగా వ్యాఖ్యలు చేశారు. నటి మహికా శర్మ ఈ విషయంపై మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. 'ఎంటర్టైన్మెంట్ రంగంలో హీరోయిన్స్‌ను ఎప్పుడూ లైంగిక వస్తువులుగానే చూస్తారు. కొందరు బలవంతం చేస్తే మరికొందరు అవకాశాల ఆశ చూపి లోబర్చుకుంటారు. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఏదో ఒకటి త్యాగం చేయాల్సిందే అని నాతో చాలామంది చెప్పారు. వాళ్లు చెప్పినదానికి ఒప్పుకోకపోతే అవకాశాలు రావు. ఇక జీవితాంతం కష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. చిత్ర పరిశ్రమలో నిలదొక్కుకోవాలని వచ్చిన చాలామంది హీరోయిన్లు కాస్టింగ్ డైరెక్టర్ లేదా నిర్మాతలకు బలవుతుంటారు. వాళ్లు అమ్మాయిలను కేవలం లైంగిక వస్తువులుగానే చూస్తారు. ఇక ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన అమ్మాయిల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. సొసైటీ కూడా సినీ ఇండస్ట్రీని చూసే విధానం వేరుగా ఉంటుంది. హీరోయిన్స్ అంటే హై ప్రొఫైల్ ఉన్న వేశ్యలుగానే చూస్తారు. క్రేజ్ తప్ప గౌరవం ఉండదు. ఇది చాలా దారుణమైన విషయం' అంటూ సినీ ఇండస్ట్రీలో వేధింపుల గురించి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మోడల్‌గా కెరీర్ ఆరంభించిన మహికా పలు బాలీవుడ్ చిత్రాల్లో మెరిసింది. బుల్లితెరపై రామాయణ, ఎఫ్.ఐ.ఆర్ వంటి సీరియల్స్‌తో గుర్తింపు పొందింది. ఇక ప్రస్తుతం బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తున్న రాజ్‌కుంద్రా పోర్నోగ్రఫీ కేసుపై స్పందిస్తూ.. 'శిల్పాశెట్టిని మేము ఇన్స్పిరేషన్గా తీసుకుంటాము. అలాంటిది పోర్నోగ్రఫీ కేసులో ఆమె భర్త రాజ్‌కుంద్రా అరెస్ట్ కావడం చూస్తుంటే గుండె బద్దలవుతోంది' అని పేర్కొంది. -
నన్ను అసభ్యంగా తాకాలని ప్రయత్నించాడు: నటి
ముంబై: ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపిన ‘మీటూ’ ఉద్యమం తర్వాత చాలా మంది మహిళలు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా వెల్లడిస్తున్నారు. పలు రంగాల్లో పెద్ద మనుషులుగా చెలామణీ అయ్యే ‘మేక వన్నె పులుల’ అసలు బండారం బయటపెడుతున్నారు. ఇందులో భాగంగా తనూ శ్రీ దత్తా మొదలు పలువురు బాలీవుడ్ భామలు, దక్షిణాది సెలబ్రిటీలు కాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా గళం విప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎంతో మంది నటీమణులు తమకు ఎదురైన వేధింపుల గురించి బహిర్గతం చేస్తున్నారు. హిందీ టీవీ నటి, స్ప్లిట్స్‌విల్లా ఫేం ఆరాధన శర్మ తాజాగా ఈ జాబితాలో చేరారు. ఇటీవల ఓ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ... ‘‘ఆ భయానక ఘటన గురించి నా జీవితంలో మర్చిపోలేను. నాలుగైదేళ్ల క్రితం అనుకుంటా.. అప్పుడు నేను పుణెలో ఉన్నత విద్యనభ్యసిస్తున్నా. నాకప్పుడు 19 ఏళ్లు ఉంటాయి. ఒకరోజు స్వస్థలం రాంచికి వెళ్లినపుడు ఓ వ్యక్తిని కలిశాను. అతడు ముంబైలో కాస్టింగ్ డైరెక్టర్‌గా పనిచేసేవాడు. అప్పటికే నేను పుణెలో పలు మోడలింగ్ అసైన్మెంట్స్ చేసి ఉన్నందున తన గురించి తెలుసు. రాంచీకి వెళ్లినపుడు తను నన్ను కలిశాడు. ఒక మంచి కారెక్టర్ ఉంది. అడిషన్ ఇమ్మన్నాడు. నేను సరే అన్నాను. ఇద్దరం కలిసి స్క్రిప్టు చదువుతున్నాం. ఇంతలో అతడు నెమ్మదిగా నన్ను అసభ్యంగా తాకడం మొదలుపెట్టాడు. తొలుత నాకేం అర్థంకాలేదు. కానీ, విషయం అర్థమైన వెంటనే.. అతడిని తోసేసి గది నుంచి బయటకు పరిగెత్తుకు వచ్చాను’’ అని తనకు ఎదురైన భయంకరమైన అనుభవం గురించి చెప్పుకొచ్చారు. అదే విధంగా... ‘‘ఆ ఘటన తర్వాత నాకు పురుషులపై నమ్మకం పోయింది. నా మనసులో చెరగని ముద్ర పడింది. అప్పటి నుంచి.. ఏదైనా సందర్భంలో.. నా తండ్రితో అయినా సరే గదిలో ఒంటరిగా ఉండాలంటే నాకు భయం వేస్తుంది. ఎవరైనా సరే నన్ను తాకితే కంపరంగా ఉంటుంది. నాపై ఇంతటి చెడు ప్రభావం చూపిన ఆ ఘటనకు కారణమైన వ్యక్తిని అప్పుడే నిలదీయాలని మా అమ్మ నిర్ణయించుకుంది. కానీ మా కుటుంబ సభ్యులు గొడవలు వద్దంటూ సర్దిచెప్పారు’’ అని ఆరాధన శర్మ చేదు జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. కాగా స్ప్లిట్స్‌విల్లా షోలో పాల్గొన్న ఆరాధన... తారక్ మెహతా కా ఉల్టా చష్మా షోతో పాపులర్ అయ్యారు. అదే విధంగా.. అల్లావుద్దీన్- ‘నామ్ తో సునా హై హోగా’లో సుల్తానా తమన్నా పాత్ర పోషించారు. View this post on Instagram A post shared by Aradhana Sharma (@aradhanasharmaofficial) -
హీరోల కోరికలు తీర్చలేదని, సినిమా చాన్స్ ఇవ్వలేదు: బోల్డ్ బ్యూటీ
Mallika Sherawat: హాలీవుడ్ నుంచి మొదలు టాలీవుడ్ వరకు సినీ ఇండస్ట్రీలో గత కొద్ది రోజులుగా క్యాస్టింగ్ కౌచ్, మీటూ అనే పదాలు ఎక్కువగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. చిత్ర పరిశ్రమలో మహిళలకు లైంగిక వేధింపులు తప్పవని.. ఆయా నిర్మాతలు, దర్శకులతో మానసికంగా ఇబ్బంది పెట్టారని పలువురు తారలు బహిరంగా వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై మీటూ పేరుతో పెద్ద ఉద్యమమే జరిగింది. ఇప్పటికీ పలువురు తారలు క్యాస్టింగ్ కౌచ్ గురించి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంటారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఓ జాతీయ మీడియా సంస్థకి ఇచ్చిన ఇంటర్వ్యూలో లైంగిక వేధింపులు అనే అంశంపై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేసింది బోల్డ్ బ్యూటీ మల్లిక షెరావత్. ‘ఖ్వాహిష్’(2003)తో వెలుగులోకి వచ్చిన మల్లికా శెరావత్.. ఆ తర్వాత విడుదలైన ‘మర్డర్’(2004) సినిమాతో బోల్డ్ నటిగా గుర్తింపు పొందింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించింది. అయితే తెరవెనుక హీరోలతో సన్నిహితంగా ఉండకపోవడం వల్ల చాలా సినిమాలకు దూరమయ్యానని, తన టాలెంట్ తగిన అవకాశం ఇండస్ట్రీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేసింది మల్లిక. కోరికలు తీర్చలేదని కొందరు హీరోలు తనకు అవకాశాలు రాకుండా చేశారని సంచలన ఆరోపణలు చేసింది. తన కెరీర్ ఆరంభంలో ఇండస్ట్రీలో చాలా చేదు అనుభవాలు ఎదురయ్యాయని చెప్పుకొచ్చింది. అప్పట్లో నటిగా నిలదొక్కుకోవాలంటే.. హీరోలతో గడపడం తప్పనిసరి అన్నట్లుగా ఉండేదని చెప్పింది. ‘కెమెరా ముందు పొట్టి దుస్తులు ధరించి, ముద్దులు ఇచ్చే నువ్వు.. నిజ జీవితంలో ఎందుకు కుదరని చెబుతున్నావ్’ అని చాలా మంది అడిగేవారని మల్లిక చెప్పుకొచ్చింది. ఇప్పటికి అక్కడక్కడ మహిళా నటులు వేధింపులకు గురవుతూనే ఉన్నారని మల్లిక పేర్కొంది. -
అలా చేస్తే కమిట్మెంట్ ఇస్తానని చెప్పా : నటి ఖుష్బూ
కలియుగ పాండవులు సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన ఖుష్బూ అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా చక్రం తిప్పింది. తొలి సినిమాతోనే విక్టరీ వెంకటేష్‌తో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున వంటి స్టార్ హీరోలతో నటించి తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ను సొంతం చేసుకుంది. వరుస సినిమాలతో అతి తక్కువ కాలంలోనే దక్షిణాదిన స్టార్ హీరోయిన్ అయ్యింది. ఇక కోలీవుడ్‌లో ఖుష్బూకున్న స్టార్ ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమెను ఎంతగానో ఆరాధించే అభిమానులు ఖుష్బూ కోసం ఏకంగా గుడి కూడా కట్టించారు. తమిళనాడులో గుడి కలిగిన తొలి హీరోయిన్గా ఖుష్బూ రికార్డు సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవలె తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి అనూహ్యంగా ఓడిపోయింది. తాజాగా తన సినీ కెరీర్‌పై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. హీరోయిన్గా ఉన్న సమయంలో తెలుగులో ఓ స్టార్ హీరో తనను కమిట్మెంట్ అడిగాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. స్టార్ హీరో అయి ఉండి అలా కమిట్మెంట్ అడిగేసరికి చాలా కోపం వచ్చిందని, దాంతో మీ కూతుర్ని నా తమ్ముడి గదిలోకి పంపిస్తే నేను కూడా కమిట్మెంట్ ఇస్తానని సదరు హీరోకు చెంప చెళ్లుమనిపించే ఆన్సర్ ఇచ్చిందట. ఖుష్బూ చెప్పిన సమాధానం విని ఆ హీరో షాక్ అయ్యాడని, ఇక అప్పటి నుంచి తామిద్దరి మధ్యా మాటలు లేవని ఖుష్బూ పేర్కొంది. అయితే తనను కమిట్మెంట్ అడిగిన ఆ స్టార్ హీరో పేరు చెప్పేందుకు మాత్రం నిరాకరించింది. దీంతో ఈ స్టార్ హీరో ఎవరు అయ్యింటారా అని నెటిజన్లు సందేహంలో మునిగిపోయారు. ఖుష్బూ తెలుగులో చేసింది కూడా తక్కువ సినిమాలే కావడం, వాటిలో కూతుళ్లు ఉన్న స్టార్ హీరోలు ఎవరుంటారబ్బా అని నెట్టింట సెర్చింగ్ మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ఇక తెలుగులో ఖుష్బూ నటించిన చివరి సినిమా అజ్ఞాతవాసి. -
కాస్టింగ్ కౌచ్: దక్షిణాది అగ్ర దర్శకుడిపై బాలీవుడ్ నటి సంచలన వ్యాఖ్యలు
దక్షిణాది పరిశ్రమకు చెందిన నేషనల్ అవార్డు విన్నింగ్ దర్శకుడు తనని వేధించాడని బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. అది మొదటి సారి కాదని బాలీవుడ్, సౌత్ పరిశ్రమలో దాదాపు అయిదు సార్లు తాను కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నట్లు ఆమె ఆరోపించారు. ఇటీవలో ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. ‘ఏ పరిశ్రమలో అయిన క్యాస్టింగ్ కౌచ్ ఉంది. నేను కూడా దాని బాధితురాలినే. ఒక్కసారి కాదు 5 సార్లు ఈ సంఘటనను ఎదుర్కొన్నాను. ముఖ్యంగా దక్షిణాది సినీ పరిశ్రమలో మూడుసార్లు నాకు ఈ చేదు అనుభవం ఎదురైంది’ అని ఆమె చెప్పుకొచ్చారు. ‘అక్కడ పేరు మోసిన ఓ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహిత తన సినిమా ఆఫర్ ఇచ్చాడు. దీంతో నేను ఆడిషన్స్‌కి వెళ్లాను. ఒక రోజంతా ఆడిషన్‌లోనే ఉన్నాను. దీంతో నాకు కాస్తా జబ్బు చేయడంతో ఆ రోజు రాత్రి తిరిగి ముంబై వెళ్లిపోయాను. నేను ముంబై వచ్చాక ఆ దర్శకుడు ఫోన్ చేసి ‘మీకు ఆరోగ్యం బాగలేదు కదా నన్ను ముంబయికి రమ్మంటారా?’ అని అడిగారు. నేను వద్దని చెప్పి ఫోన్ పెట్టేశాను. అయినా అతడు పదే పదే ఫోన్ చేసి విసిగించారు. దీంతో అతడిపై తనకు అనుమానం వచ్చిందని’ ఆమె వ్యాఖ్యానించారు. ‘అలా కొన్ని రోజులకు మళ్లీ అదే నెంబర్ నుంచి ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేసి మాట్లాడగా ఈ సారి ఆయన మాట్లాడకుండా మరో వ్యక్తితో ఫోన్ మాట్లాడించారని చెప్పారు. ‘ఆ వ్యక్తి మాట్లాడుతూ ‘సినిమా తెరకెక్కించడానికి చాలా సమయం పడుతుంది. డైరెక్టర్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటున్నారు. ఇది కేవలం సినిమా పూర్తయ్యే వరకే’ అని అనడంతో అతడి మాటల్లోని భావం నాకు అర్థమైంది. దీంతో నా టాలెంట్ నచ్చితే అవకాశం ఇవ్వండి.. లేకపోతే అవసరం లేదు అని గట్టిగా సమాధానమిచ్చి ఫోన్ కట్ చేశాను’ అని చెప్పారు. అనంతరం ఆమె ఈ కాస్టింగ్ కౌచ్ దక్షిణాదిలోనే కాదని బాలీవుడ్‌లోనూ ఉందని పేర్కొన్నారు. ఇక్కడ ఓ నిర్మాత తన కాళ్లు ఎలా ఉన్నాయో చూడాలన్నారని, మరొకరమో నా శరీరభాగాల్లోని ప్రతి అణువు తనకు తెలియాలంటూ అసభ్యంగా మాట్లాడారంటూ సుర్వీన్ చావ్లా వివరించారు. కాగా తెలుగులో ఆమె ‘రాజు మహారాజు’లో నటించారు. చదవండి: సౌత్ నిర్మాత రాత్రంతా గదిలో ఉండమన్నాడు : నటి ముద్దు సీన్ రిహార్సల్ అంటూ దారుణంగా ప్రవర్తించేవాడు: హీరోయిన్ -
రాత్రి డిన్నర్‌కు వస్తావా? అని అడిగారు: నటికి చేదు అనుభవం
సినీ ఇండస్ట్రీలో వేధింపుల గురించి నటి మినీషా లంబా పెదవి విప్పింది. చిత్రపరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఎలా వేళ్లూనుకుపోయిందో తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. "ప్రతి ఇండస్ట్రీలోనూ మగాళ్లు ఉంటారు. సినీ పరిశ్రమలో కూడా అంతే! తమ కనుసన్నల్లో పనిచేసేవారి కోసం కొందరు మగాళ్లు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలో సినిమా ఆఫర్ గురించి మాట్లాడటానికి వెళ్లినప్పుడు కొందరు నన్ను డిన్నర్‌కు రమ్మని పిలిచేవారు" "రాత్రిపూట డిన్నర్ చేస్తూ మాట్లాడుకుందాం అని చెప్పేవారు. కానీ నేనందుకు అసలు ఒప్పుకోలేదు. డిన్నర్ కుదరదని, మనం ఆఫీసులోనే మాట్లాడుకుంటే సరిపోతుంది అని ముఖం మీదే చెప్పేసేదాన్ని. అంటే వాళ్లుం ఏం ఆశిస్తున్నారో తెలిసినా నాకేమీ అర్థం కానట్లు నటించేదాన్ని. ఇలా రెండుమూడుసార్లు జరిగాయి. కానీ ఆ ప్రాజెక్టులు మాత్రం పట్టాలెక్కలేదు" అని చెప్పుకొచ్చింది. 'యహాన్' చిత్రంతో 2005లో వెండితెర అరంగ్రేటం చేసింది మినీషా లంబా. 'బచ్నా యే హసీనా', 'కిడ్నాప్', 'అనామికా', 'జోకర్' వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన ఆమె హిందీ బిగ్‌బాస్ 8వ సీజన్లోనూ పాల్గొంది. అదే విధంగా 'తెనాలి రామ', 'ఇంటర్నెట్ వాలా' వంటి టీవీ షోలలో నటించి బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. నటి పూజా బేడీ కజిన్ రియాన్‌ను 2015లో పెళ్లాడిన ఆమె 2020లో వైవాహిక బంధానికి స్వస్తి పలికింది. అయితే విడాకులు తీసుకున్నంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్లు కాదని, తాను మళ్లీ ఓ వ్యక్తితో ప్రేమలో పడ్డానని ఇటీవలే వెల్లడించింది మినీషా. చదవండి: భర్తతో విడాకులు; మళ్లీ ప్రేమలో పడ్డా: నటి -
మాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ కలకలం
-
సౌత్ నిర్మాత రాత్రంతా గదిలో ఉండమన్నాడు : నటి
బాలీవుడ్ నటి నీనా గుప్తా తన బయోగ్రఫీ 'సచ్ కహున్ తో'లో పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది. పెళ్లి, విడాకులు, పెళ్లికి ముందే గర్భం దాల్చడం, కెరీర్లో ఆటంకాలు, ఒంటరి తల్లిగా తాను ఎదుర్కొన్న చీదరింపులు, సమస్యల సుడిగుండాలు, వాటిని ఎదుర్కొన్న తీరు.. ఇలా అన్నింటినీ ఏకరువు పెట్టింది. అలాగే ఇండస్ట్రీలో తాను కూడా క్యాస్టింగ్ కౌచ్‌కు గురయ్యానని సంచలన విషయాన్ని బయటపెట్టింది. దక్షిణాది చిత్రాల నిర్మాత ఒకరు నన్ను హోటల్‌కు ఆహ్వానించారు. అది ముంబైలోని పృథ్వీ థియేటర్‌కు దగ్గర్లోనే ఉంటుంది. అప్పటికే షూటింగ్లో ఉన్న నేను ఆరోజు షెడ్యూల్ పూర్తవగానే నిర్మాతకు ఫోన్ చేశాను. అతడు తన గదిలోకి రమ్మని పిలిచాడు. నా మనసెందుకో కీడు శంకించింది. మీరే లాబీలోకి రావచ్చు కదా అని అడిగాను. ఆయన ఒప్పుకోలేదు. దీంతో నేనే మెట్లెక్కుతూ పైన అతడి గదిలోకి వెళ్లాను. అక్కడ సోఫాలో కూర్చోగానే అతడు ఉపన్యాసం ప్రారంభించాడు' 'ఎంతోమంది తారలను దక్షిణాది ఇండస్ట్రీకి పరిచయం చేశానని బీరాలు పలికాడు. నాకో మంచి పాత్ర ఇవ్వబోతున్నా అంటూ ఆ పాత్ర వివరాలు చెప్పాడు. కానీ అది చాలా చిన్న పాత్ర అని అర్థమై నిరాసక్తిగా అక్కడి నుంచి వెళ్లిపోతాను అని చెప్పాను. దీంతో అతడు అదేంటి? ఈరోజు రాత్రికి నాతో ఉండవా? అని అడిగాడు. ఆ మాట వినగానే బకెట్ ఐస్ వాటర్ నా నెత్తిన గుమ్మరించినట్లనిపించింది. నా రక్తం గడ్డకట్టుకుపోయింది. ఇంతలో అతడు నా బ్యాగు తీసుకుని చేతిలో పెడుతూ బిందులో బలవంతం ఏమీ లేదు.. అని చెప్పాడు. వెంటనే పరుగు లంకించుకుంటూ అక్కడి నుంచి బయటపడ్డాను' అని నీనా చెప్పుకొచ్చింది. చదవండి: గర్భవతిగా ఉన్నా పెళ్లి చేసుకుంటానన్నాడు: నటి ‘రామాయణ్’ ఫేమ్ చంద్రశేఖర్ కన్నుమూత -
ముద్దు సీన్ రిహార్సల్ అంటూ దారుణంగా ప్రవర్తించేవాడు: హీరోయిన్
కాస్టింగ్ కౌచ్ పెద్దగా ఈ పేరు పరిచయం చేయాల్సిన పని లేదు. ఈ మధ్యకాలంలో సినీ పరిశ్రమలో ఎక్కడ చూసిన ఈ పేరు బాగా వినిపిస్తోంది. టీవీ, సినిమాకు సంబంధించిన కొంతమంది తారలు వరుసగా గతంలో వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకునే క్రమంలో కాస్టింగ్ కౌచ్‌పై నోరు విప్పుతున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ సినిమాతో పరిచయమైన హీరోయిన్ జరీన్ ఖాన్ దీనిపై స్పందించింది. తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని గతంలో చెప్పిన ఆమె ఇటీవల ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి దీని గురించి వివరణ ఇచ్చింది. కెరీర్ ప్రారంభంలో తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానన్న ఆమె.. ‘నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ల పేర్లను ఇప్పుడు బయట పెట్టాలనుకోవడం లేదు. అయితే బాలీవుడ్‌కు వచ్చిన కొత్తలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. పరిశ్రమలో అతడి కంటే మంచి వ్యక్తి లేడనేవిధంగా నాతో మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో అతడి సినిమాలో నటించే అవకాశం ఇప్పిస్తానని, అయితే అందులో ముద్దు సీన్ ఉంటుంది. దానికి మనం ముందే రిహార్సల్ చేద్దామని నన్ను పిలిచాడు. అలా నాతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మనసులోని భయాలన్ని పక్కన పెట్టు అంటూ ఆ డైరెక్టర్ నాతో దారుణంగా ప్రవర్తించేవాడు’ అని ఆమె చెప్పుకొచ్చింది. అలాగే ‘ఆ వ్యక్తి నన్ను తన దారిలోకి తెచ్చుకోవాడానికి అనేక విధాలుగా ప్రయత్నించాడు. మనం స్నేహితలకంటే ఎక్కువగా ఉందామని, ఇక నా సినిమా ఆఫర్ల విషయాన్ని తాను చూసుకుంటానని నన్ను నమ్మించాలని చూశాడు’ అని జరీన్ ఖాన్ వెల్లడించింది. కాగా కాల్ సెంటర్లో పని చేస్తూ సినిమా అవకాశాల కోసం ప్రయత్నించానని ఈ సందర్భంగా ఆమె తెలిపింది. ఇక సల్మాన్ సరసన వీర్ సినిమాలో హీరోయిన్ నటించి బాలీవుడ్ అరంగేట్రం చేసిన ఆమె ఆ తర్వాత ‘హౌజ్‌ఫుల్ 2, హేట్ స్టోరీ 3, అక్సర్ 2’తో పాటు మరిన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైంది. ఇక తెలుగులో గోపిచంద్ హీరోగా తెరకెక్కిన ‘చాణక్య’ చిత్రంలో జరీన్ ఖాన్ కీలక పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. చదవండి: డైరెక్టర్‌ను పెళ్లాడిన ప్రముఖ హీరోయిన్ హీరో ఆశీష్ గాంధీ పెళ్లి.. ఫోటోలు వైరల్ -
మా అమ్మ ముందే నిర్మాత అసభ్యంగా మాట్లాడాడు: నటి
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, దీని వల్ల తీవ్ర ఇబ్బందులకు లోనయ్యామంటూ గతంలో ఎందరో నటీమణులు మీడియా ముందు వాపోయారు. ఆ మధ్య వచ్చిన మీటూ ఉద్యమం కూడా క్యాస్టింగ్ కౌచ్ వివాదాన్ని మరోసారి తెరమీదకు తీసుకువచ్చింది. ఇక ఇటీవలే దివంగత నటుడు సుశాంత్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసి నటి అంకితా లోఖండే, ప్రాచీ దేశాయ్ కెరీర్ తొలినాళ్లలో చిత్ర పరిశ్రమలో వారు ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. తాజాగా టీవీ నటి, మోడల్ కిష్వర్ మర్చంట్ సైతం కాస్టింగ్ కౌచ్‌పై తొలిసారిగా నోరు విప్పింది. ఇటీవల ఆన్లైన్లో ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆమె కెరీర్ మొదట్లో కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. ‘ఒకసారి మా అమ్మతో కలిసి ఓ మీటింగ్ వెళ్లినప్పుడు ఇది జరిగింది. అక్కడ ప్రముఖ నిర్మాత నాకు అవకాశం ఇవ్వాలంటే ఆ హీరోతో గడపాలని చెప్పాడు. అయితే అక్కడే మా అమ్మ ఉందని కూడా చూడకుండా నాతో ఆ నిర్మాత అసభ్యంగా మాట్లాడాడు. మరోక్షణం ఆలోచించకుండా ఆయన ఆఫర్‌ను తిరస్కరించి మేం అక్కడి నుంచి వెళ్లిపోయాం’ అంటు తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది. అయితే ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా జరుగుతాయని చెప్పలేను కానీ ప్రస్తుతం ఏ పరిశ్రమలో అయిన కాస్టింగ్ కౌచ్ అనేది సాధారణ విషయం అయిపోయిందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక హోస్ట్ ఆ నిర్మాత ఎవరని అడగ్గా.. వారి పేరు చెప్పను కానీ పరిశ్రమలో ఆ హీరో, నిర్మాత ప్రముఖులలో ఒకరని పేర్కొంది. అయితే దీనివల్లే సినిమాలకు దూరమయ్యారాని హోస్ట్ అడగ్గా.. ‘అలా అని కాదు.. నా దృష్టి ఎప్పుడు మోడలింగ్‌పైనే ఉండేది. ఈ క్రమంలోనే టీవీలో నటించే అవకాశాలు వచ్చాయి. దీంతో వాటిపైనే ఎక్కువగా దృష్టి పెట్టాను. అయితే నేను ఎక్కడ పనిచేసిన విలువలతో కూడిన ప్రయాణం ఉండాలనుకుంటాను. అదే విధంగా నడుచుకున్నాను కూడా. ఇప్పుడు నా కెరీర్ పట్ల సంతోషంగా ఉన్నాను’ అని చెప్పింది. అలాగే టీవీలో నటించడమంటే కూడా చిన్న విషయం కాదని, సినిమాల్లో చిన్న పాత్రల కంటే టీవీలో ఏ పాత్రకైనా మంచి గుర్తింపు వస్తుందనేది తన అభిప్రాయమని చెప్పింది. కాగా ఆమె నటుడు సుయాష్ రాయ్‌ను 2016 డిసెంబర్ 16న వివాహం చేసుకుంది. త్వరలోనే తల్లి కాబోతున్న కిష్వర్ తరచూ సోషల్ మీడియాలో అమ్మతనాన్ని ఆస్వాధిస్తున్నానంటు బేబీ బంప్ ఫొటోలను అభిమానులతో పంచుకుంటోంది. -
నో చెప్పినా ఆ డైరెక్టర్ ఇప్పటికీ వదలట్లేదు: హీరోయిన్
సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని, దీని వల్ల తీవ్ర ఇబ్బందులకు లోనయ్యామంటూ గతంలో ఎందరో నటీమణులు మీడియా ముందు వాపోయారు. ఆ మధ్య వచ్చిన మీటూ ఉద్యమం కూడా క్యాస్టింగ్ కౌచ్ వివాదాన్ని మరోసారి తెరమీదకు తీసుకువచ్చింది. ఇక ఇటీవలే దివంగత నటుడు సుశాంత్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసి అంకితా లోఖండే సైతం చిత్రపరిశ్రమలో తనకు ఎదురైన చేదు అనుభవాలను పంచుకున్నారు. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ ప్రాచీ దేశాయ్ కెరీర్ తొలినాళల్లో చవిచూసిన చేదు అనుభవాలను చెప్పుకొచ్చింది. ఓ సినిమా నటించేందుకు దర్శకుడు తన నుంచి ఏదో ఆశించారని తెలిపింది. వారి ఉద్దేశం అర్థమై వెంటనే నాకు ఆ సినిమానే వద్దంటూ వచ్చేశానని చెప్పింది. అయితే ఆ డైరెక్టర్‌తో సినిమాలో నటించనని కరాఖండిగా చెప్పినప్పటికీ అతడు ఇప్పటికీ తరచూ ఫోన్లు చేస్తున్నాడని వాపోయింది. అప్పుడు మాత్రమే కాదు.. ఇప్పుడు కూడా అతడి సినిమాల్లో నటించనని తేల్చి చెప్పానని ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. ఇక ఈ మధ్య సినిమాల్లో పెద్దగా కనిపించకపోవడానికి ప్రధాన కారణమేంటో చెప్పింది ప్రాచీ దేశాయ్. ఎన్నో అవకాశాలు తన దగ్గరి దాకా వస్తున్నాయని, కానీ ఆ పాత్రలు నచ్చక వాటిని తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. ఉన్నత హోదాలో ఉండాలన్న కుతూహలం తనకు లేదని, తనకు ప్లస్ అయ్యే పాత్రలను మాత్రమే ఎంచుకుంటానని చెప్పుకొచ్చింది. చదవండి: ‘అప్పట్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నాం, కానీ!’ బేరాలు వద్దు: కాజల్ ఎమోషనల్ పోస్ట్ -
క్యాస్టింగ్ కౌచ్‌పై కీలక వ్యాఖ్యలు చేసిన సీనియర్ నటి
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వింతేమి కాదు. అప్పట్లో శ్రీరెడ్డి దీనిపై రచ్చ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీటూ ఉద్యమం కూడా తీవ్ర దుమారం రేపింది. ఇక నటి మాధవిలత సైతం పలు ఇంటర్వ్యూలో అవకాశాలు రావాలంటే ఖచ్చితంగా కాస్టింగ్ కౌచ్‌కు గురికావాల్సిందే అంటూ నిక్కచ్చిగా చెప్పుకొచ్చింది. తాజాగా కాస్టింగ్ కౌచ్‌పై ప్రముఖ సీనియర్ నటి అన్నపూర్ణ కూడా స్పందించారు. ప్రస్తుతం ఆమె అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఎఫ్-3’ మూవీలో ఆమె నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె కాస్టింగ్ కౌచ్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్బంగా కేరీయర్ ప్రారంభంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నారు. అలాగే క్యాస్టింగ్ కౌచ్ అనేది అనవసరపు వ్యవహరమన్నారు. ‘అప్పట్లో కూడా అవకాశాల కోసం వేధించేవారు. అవకాశం ఇస్తే మాకేంటని మా వెంట పడేవారు. అందుకే 20 ఏళ్లకే పెళ్లి చేసుకోవడం.. పాతికేళ్లకే అమ్మ వేషాలు వేయడం మొదలు పెట్టాను. హీరోయిన్గా ఛాన్సులు వచ్చినప్పటికి రెండు సినిమాలకే ఆపేశాను. అదే అమ్మ వేషాలైతే అలాంటివి ఉండవు.. అప్పుడు కూడా ఉండేవి కానీ ముందుగానే అలాంటి పనులు చేయమని ఒప్పందం ఇస్తేనే డేట్స్ ఇచ్చేవాళ్లం’ అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అలాగే తప్పు అనేది ఎప్పుడూ ఒకరి వైపే ఉండదంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇద్దరికి ఇష్టమైతేనే ఆ తప్పులు జరుగుతాయని ఆమె కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్రతి రంగంలో మహిళలు క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొంటున్నారు. తల్లిదండ్రులు, పిల్లలు, భర్త, కుటుంబ గౌరవాలను దృష్టిలో ఉంచుకుని మహిళలు వేటికి లొంగకుండా తప్పించుకు వస్తున్నారు. అదే మాదిరిగా సినీ పరిశ్రమ వాళ్లు కూడా తప్పించుకోవాలి. ఒకవేళ అలాంటి సంఘటనలు ఎదురైతే వెంటనే నోరు విప్పాలి’ అని చెప్పారు. అయితే తప్పులు జరగవని తాను చెప్పడం లేదని, ఇక్కడ ఖచ్చితంగా తప్పులు జరుగుతాయన్నారు. అది కూడా ఇద్దరికి సమ్మతమైతేనే అంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఇక అవకాశాల కోసం ప్రయత్నాలు చేసేవారికి మాత్రం ఇక్కడ కష్టాలు తప్పవని అన్నపూర్ణ అన్నారు. చదవండి: ఎన్టీఆర్, అఖిల్‌ల వీడియోపై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్ ‘ఆర్ఆర్ఆర్’ రచయిత కేవీ ప్రసాద్‌కు కరోనా -
చాన్స్ కోసం నిర్మాత గదిలోకి వెళ్లమన్నారు: నటి
ఈ మధ్య కాలంలో క్యాస్టింగ్ కౌచ్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండటంతో నిర్భయంగా మీడియా ముందుకు వచ్చి తాము ఎదుర్కొన్న సంఘటనల గురించి తెలియజేస్తున్నారు. ముఖ్యంగా చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పటికే పలువురు హీరోయిన్లు తమ కెరియర్లో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి మీడియాతో పంచుకున్న విషయం తెలిసిందే. తాజాగా సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ మాజీ ప్రేయసి, నటి అంకితా లోఖండే దక్షిణాది చిత్రపరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలను జాతీయ మీడియాతో పంచుకుంది. ‘నాకు 20 ఏళ్లు ఉన్నప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చాను. హిందీలో పవిత్ర రిస్తా సీరియల్ ద్వారా నేను ప్రేక్షకాదరణను పొందిన తర్వాత నాకు దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి ఒక ఆఫర్ వచ్చింది. ఒక స్టార్ హీరో నన్ను గదిలోకి పిలిచి కంప్రమైజ్ అవుతావా అని అడిగాడు. ఆయన ప్రశ్నకు నేను తెలివిగా సమాధానం ఇచ్చాను. మీ నిర్మాతకు ఎలాంటి కంప్రమైజ్ కావాలట? నేనేమైనా పార్టీలకు, డిన్నర్లకు రావాలా అని ప్రశ్నించాను. దీంతో ఆ హీరో ఏమి మాట్లాడలేదు. అతనికి ఒక షేక్‌హ్యాండ్ ఇచ్చి బయటకు వచ్చాను. ఆ సినిమా చాన్స్ ఇక నాకు రాదని అప్పుడే అర్థమైంది. ’అని అకింతా లోఖండే చెప్పుకొచ్చింది. అయితే ఆ స్టార్ హీరో పేరుకాని, నిర్మాత పేరును కానీ అకింతా వెల్లడించలేదు. ఇక అంకితా లోఖండే కెరీర్ విషయానికొస్తే.. ఆమె నటిగా కంటే సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ప్రియురాలిగానే ఎక్కువ గుర్తింపుపొందింది. బాలీవుడ్లో మణికర్ణిక, భాగీ3 చిత్రాల్లో నటించింది. చదవండి: ‘ఏం అర్హత ఉందని నీకు ఇంత అందమైన భార్య?’ హీరోయిన్‌పై పిడిగుద్దులు కురిపించిన నితిన్! -
ఏదైనా నిగ్గదీసి అడిగే చైతన్యం ఆమె సొంతం
ఆమె సినిమాలకు పాడతారు... కానీ ఛాన్స్ కోసం వాళ్ళు చెప్పినట్టు ఆడరు. ఆమె స్టార్లకు గొంతు అరువిస్తారు... కానీ రాజీ పడి గొంతు విప్పద్దంటే ఊరుకోరు. ఆమె జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు... అయినా సరే తారాలోకంలోని తప్పులుచూసి తల వంచుకు వెళ్ళిపోరు! ఆమె గళంలో ఆవేశం ఉంది. ఆమె అక్షరంలో ఆవేదన ఉంది. ఆమెకంటూ భిన్నమైన ఆలోచనా ఉంది. ఆధునిక స్త్రీ చైతన్యానికి ఓ ప్రతీక – సినీ గాయని చిన్మయి శ్రీపాద. ఏదైనా నిగ్గదీసి అడిగే ఆమె చైతన్యం... ఇవాళ సమాజంలో... ముఖ్యంగా సినీ రంగంలో... ప్రతిధ్వనిస్తున్న చిన్మయ నాదం! చిన్మయ వాదం!! అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా – సాక్షి టీవీ స్పెషల్ ఇంటర్వ్యూలో చిన్మయి శ్రీపాద పంచుకున్న మనోభావాలు... ► మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏడాదీ సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఇలాంటి ఓ రోజు ఉంది అంటే... ఇందు కోసం చాలామంది మహిళలు ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు. దాడులకు లింగభేదం లేదు. అమ్మాయిలపైనే కాదు, అబ్బాయిలపైనా జరుగుతున్నాయి. ► మహిళా దినోత్సవం అని ఏడాదికోసారి మనం జరుపుకొంటున్నాం. ఆ తర్వాత మనం మహిళల గురించి మర్చిపోతున్నాం. ‘కట్నం ఇవ్వకూడదు... అడగకూడదు’ అని మన దేశంలో చట్టం ఉంది. కానీ అమ్మాయికిచ్చే కట్నం మీదే ఆమె లైఫ్ అంతా తిరుగుతోంది. ఇటీవల రష్మీ అనే అమ్మాయి 7 కోట్ల కట్నం ఇచ్చింది. కానీ వేధింపుల వల్ల చనిపోయింది. సో... ఒక అమ్మాయి ఎంత బాధ భరించినా ఫర్లేదు. పెళ్లి చేస్తే చాలనుకుంటున్నారు. చట్టాలున్నా భ్రూణహత్యలు చేస్తున్నారు. ► సోషల్ మీడియాలో ‘అమ్మాయి లంటే ఇలానే ఉండాలి’ అని కొన్ని మీమ్స్ ఉంటాయి. ‘మేం మగాళ్లం, ఫెమినిజం గురించి కూడా మేమే చెబుతాం’ అంటారు. ► ఇప్పటికీ మహిళలపై లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్, గృహహింస జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిలపై ఇవి నార్మలే... జరుగుతాయి అంటారు. ఎబ్యూజ్ అనేది నార్మల్ అని మన పేరెంట్స్ మనకు చెబుతున్నారు. కానీ ఎబ్యూజ్ అనేది ఎందుకు నార్మల్? ఒక అమ్మాయిగా నేను ఎందుకు ఎబ్యూజ్కు గురి కావాలి? ► దిశ కేసులో కూడా చూడండి. ‘ఆమె దుప్పటా వేసుకుందా? ఆ టైమ్‌లో ఆ అమ్మాయి అక్కడ ఏం చేస్తోంది? అప్పుడు పెద్ద టైమ్ కూడా కాలేదు’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు. అర్ధరాత్రి ఓ మహిళ ఒంటరిగా తిరిగినప్పుడు మనకు స్వాతంత్య్రం వచ్చినట్లు అని గాంధీజీ చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ పరిస్థితులు లేవు. ► వైరముత్తు గురించి నేను మొదట్లో మాట్లాడకపోవడానికి కారణం మా అమ్మగారు నన్ను మాట్లాడనివ్వకపోవడమే! మనల్ని ఎవరు సపోర్ట్ చేస్తారు? సొసైటీలో మనకెలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని భయపడ్డారు. ► సోషల్ మీడియాలో నాపై రేప్ థ్రెట్ వస్తే కేసు పెట్టాను. 2011 నుంచి ఆ కేస్ నడుస్తూనే ఉంది. ఇండియాలోనే ఫస్ట్ సైబర్ క్రైమ్ కేస్ అది. ► చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల గురించి మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. కానీ ఇప్పటికీ రాలేదు. ఎందుకంటే ఎక్కువగా మగాళ్ళే ఉన్నారు కదా! ఇక, ఒక కంపెనీలో 10మంది ఉద్యోగులుంటే ఐసీసీ అనేది (ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ) ఉండాలి అనేది రూల్. విశాఖ గైడ్లైన్స్కి తగ్గట్లు అన్ని ఆఫీసుల్లో కమిటీలు న్నాయా? ఎన్ని కంపెనీలు ఫాలో అవుతున్నాయి. ► ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడటాన్ని సమాజంలో పెద్ద క్రైమ్‌గా చూస్తారు. ఆ అమ్మాయి, అబ్బాయి ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. ఒకవేళ వాళ్లు లవ్‌లో ఉంటే వారి తల్లితండ్రులతో మాట్లాడుకుంటారు. అంతేకానీ... అదొక పెద్ద నేరంలా చూడకూడదు. ఒక అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకోవడమే తప్పు అనే కల్చర్ మారాలి. కల్చర్ అంటే... నిరంతరం మారుతూ ఉండేది. మనం 1852లో ఎలా ఉన్నాం? ఇప్పుడు ఎలా ఉన్నాం? టైమ్‌తో పాటు మారాలి. పాతకాలంలోలాగానే ఉండాలనుకుంటే టీవీలు చూడకూడదు. ఇంటర్నెట్ వాడకూడదు. ► ‘నువ్వు..మగాడివికాబట్టి ఏడవకూడదు. బాధపడకూడదు’ అంటారు. అమ్మాయిలు మేకప్ వేసుకోవడానికి మూడు నాలుగు గంటలు పడుతుంది అని మాట్లాడుతుంటారు. కానీ మేకప్ ఆర్టిస్టు, హెయిర్ డ్రెస్సింగ్ల పని గురించి కూడా ఆలోచించాలి. మేల్ యాక్టర్‌కు ఫిమేల్ హెయిర్ డ్రెస్సరెందుకు ఉండకూడదు. సూపర్ స్టార్ రజనీకాంత్‌కి వర్క్ చేసే మహిళ భానుగారు మేకప్ ఉమన్‌గా యూని యన్‌లో గుర్తింపు కోసం కోర్టుకు వెళ్ళాల్సొచ్చింది. ► నేను సింగర్‌గా వచ్చి 19 ఏళ్లు. నాతో మిస్ బిహేవ్ చేసింది వైరముత్తు ఒక్కరే. మంచివాళ్ళు చాలా మంది ఉన్నారు. కొద్దిమంది వల్లే ఇండస్ట్రీకి చెడ్డపేరు. ► నేను ఓపెన్‌గా మాట్లాడుతున్నాను అంటే నాకు మా ఆయన (నటుడు రాహుల్ రవీంద్రన్) మంచి సపోర్ట్ ఇచ్చారు. చాలామంది అమ్మాయిలు ఎందుకు బయటకు చెప్పడం లేదంటే వాళ్ల తల్లితండ్రులే ఫ్రీడమ్ ఇవ్వరు. అన్నదమ్ములే తమ సిస్టర్ను తప్పుపడుతున్నట్లు మాట్లాడుతున్నారు. చైన్ స్నాచింగ్ గురించి, బ్యాగ్ దొంగతనం గురించి చెప్పొచ్చు. కానీ సెక్సువల్ హెరాస్మెంట్ గురించి బయటకు చెబితే, అందులో అమ్మాయిల తప్పు ఉన్నట్లు మాట్లాడతారు. దొంగతనం కేసుల్లో దోషులను తప్పుపడితే.... హెరాస్మెంట్ కేసుల్లో మహిళలదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. ► రేప్ కేసుల్లో కూడా తొందరగా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ కూడా కావాలి. ఇప్పుడు రద్దీ బస్సులో ఒక ఆకతాయి గిల్లితే గిల్లాడు లెమ్మని అమ్మాయిలు చెప్పలేరు. దానికి సాక్ష్యం అంటే ఏం చూపిస్తాం? ► 21వ శతాబ్దంలోనూ సినిమాల్లో మహిళలను భోగవస్తువులుగా చూడటం తగ్గడం లేదు. అమ్మాయి ఒక బికినీ కానీ, చిన్న షార్ట్ కానీ వేసుకుంటే... కెమెరా చూపిస్తుంది ఎక్కడ చూడాలనేది! ఇంగ్లీష్ సినిమాల్లో బికినీ హీరోయిన్స్‌ను మామూ లుగానే చూపిస్తారు. కానీ మన సినిమాల్లో కెమెరా జూమ్‌లో చూపిస్తుంటారు. ► సమంత వండర్ వుమన్ . సమంత కూడా లైంగికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొని, గెలిచారు. సమంతకూ, నాకు పూర్వజన్మ కనెక్షన్ ఉందనుకుంటా. రాహుల్, సమంత ఓ తమిళ సినిమా ద్వారా కెరీర్‌ను స్టార్ట్ చేశారు. నా తెలుగు డబ్బింగ్ కెరీర్ సమంత ద్వారానే మొదలైంది. నా కంటే ముందు రాహుల్, సమంత మంచి ఫ్రెండ్స్. ► నా భర్త రాహుల్ నా కన్నా పెద్ద ఫెమినిస్టు. విపరీతంగా చదివే రాహుల్ నన్ను మార్చాడు. క్యాస్టిజమ్, సెక్సిజమ్ గురించి రాహులే నాకు ఎక్కువ చెప్పాడు. మహిళల డ్రెస్‌తో సంబంధం లేకుండా వారి ఫేస్‌లు చూసే మాట్లాడాలన్నది రాహుల్ నుంచే నేను నేర్చుకున్నా. రాహుల్ నన్ను సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టే మేము ప్రశాంతంగా ఉన్నాం. మా ఫ్యామిలీ అంతా బాగుంది. ► సినీ గీత రచయిత వైరముత్తు దుష్ప్రవర్తన గురించి ఓపెన్ గా చెప్పా. కానీ, తమిళ డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ రాధా రవి నన్ను బ్యాన్ చేశారు. కోర్టుకు వెళ్లా. ఇప్పటికీ పోరాడుతున్నా. సింగర్‌గా ఛాన్సులు తగ్గిపోయాయి. బాధగానే ఉంది. కానీ మా ఇంట్లో నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నాకు కూడా కొన్ని వార్నింగ్‌లు వచ్చాయి. ‘పొలిటికల్ పార్టీల గురించి మాట్లాడితే ఐటీ రైడ్స్ జరుగుతాయి’ అని చెప్పారు. ► జర్నలిస్టు ఎం.జె. అక్బర్ లైంగిక వేధింపులపై 20 మంది మహిళా జర్నలిస్టులు ఆరోపించారు. ప్రియా రమణి వర్సెస్ అక్బర్ కేసులో తాజా తీర్పు రిలీఫ్. కానీ, నువ్వు రేప్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని రీసెంట్గా ఓ జడ్జ్ అడిగారు. చాలా విషయాలు నేను ఓపెన్‌గా మాట్లాడతా. నా గురించి నేను ఆలోచించను. సొసైటీకి మంచి జరిగితే చాలు. -
సిస్టర్హుడ్ మీద అవగాహన కల్పించేందుకు..
అత్తాకోడళ్లకు పడదు. వదినామరదళ్లూ ఎడమొహం పెడమొహమే. తోడికోడళ్లదీ స్నేహమూ రంగేసుకున్న వైరమే. ఇరుగుపొరుగు ఆడవాళ్ల మధ్యా అసూయను పెంచే పోటీయే. ఆఫీసుల్లోనూ నటనా చెలిమిలే. అదేమంటే స్త్రీకి స్త్రీయే శత్రువు.. అనే నానుడి వినిపిస్తారు. టాక్సిక్ ఫెమినినిటీ అనే పేరూ ఖాయం చేసేస్తారు. ఎవరు? పురుషులు. ఎందుకు? మగవాళ్ల ఆలోచనల్లోని టాక్సిన్స్‌ను బయటపెట్టినందుకు.. టాక్సిక్ మాస్క్యులినిటి అంటూ వేదనచెందినందుకు. నిజానికి స్త్రీని స్త్రీకి శత్రువుగా చేసిందే మాస్క్యులినిటీలోని ఆ టాక్సిన్సే. కొత్తగా వచ్చిన కోడలిని చూపిస్తూ అత్తకు అభద్రత సృష్టించడం, వదినకు వచ్చిన అధికారంతో మరదలిలో అటెన్షన్ సీకింగ్ను ప్రేరేపించడం, భర్త సంపాదన, పుట్టింటి కట్నకానుకలతో తోడికోడళ్ల మధ్య విభేదాలను పుట్టించడం, పొరిగింటి పుల్లకూరకు చవులూరిస్తూ ఇల్లాలిని పోటీకి రెచ్చగొట్టడం, ఉద్యోగినుల మధ్య పక్షపాతాన్ని అవలంభిస్తూ విరోధాన్ని నాటడం.. ఇవన్నీ పురుషాధిపత్య ప్రణాళికలే. ఆ మెదడు స్థిరం చేసిన అభిప్రాయాలే. ఈ నిజం గ్రహింపులోకి వచ్చింది. స్త్రీ, పురుష సమానత్వాన్ని కాంక్షించే వారు ముందు స్త్రీలలో ఐక్యత రావాలని కోరుకున్నారు. అందుకే ‘సిస్టర్హుడ్’ కామనకు ఉనికి కల్పించారు. కార్యాచరణతో సుస్థిరం చేసే ప్రయత్నంలో పడ్డారు. దాన్నీ పురుషాధిపత్యం అడ్డుకోకుండా ఉండడానికి ఓ ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ కదలికలో సినిమా, సాహిత్యాలూ పాలుపంచుకుంటున్నాయి. కలం, కెమెరాలు సిస్టర్‌హుడ్‌ను ప్రమోట్ చేస్తున్నాయి. ఇది కథ కాదు... అంటూ జీవితంలో అత్తాకోడళ్లు ఇలా ఉంటే బాగుంటుంది అని చూపించాడు దర్శకుడు కె.బాలచందర్ 1970ల్లోనే. శాడిస్ట్ భర్తతో వేగుతున్న భార్యకు అండగా నిలుస్తుంది అత్త. మనిషితనం లేని ఆ కొడుకు నుంచి కోడలిని విముక్తి చేయాలనుకుంటుంది. ముళ్ల బంధనంగా ఉన్న ఆ పెళ్లి బంధనాన్ని తెంచుకోమని.. కొత్త జీవితం ప్రారంభించమని చెప్తుంది. స్త్రీ మనసు స్త్రీకి కాక ఇంకెవరికి తెలుస్తుంది అనిపిస్తుంది ‘ఇది కథ కాదు’ చూస్తే! న్యాయం కావాలి.. అంటూ కోర్టుకు వెళ్లిన వనితకు న్యాయ పోరాటంలో సహాయం చేసింది ఇంకో మహిళే. 1981లో వచ్చిన ఈ సినిమాలో పెళ్లి చేసుకుంటానని మోసం చేస్తాడు ఓ పురుషాంహకారి. పెళ్లి కాకుండానే గర్భవతి అయిన ఆ బిడ్డను పరువు కోసం బయటకు పంపిస్తారు తల్లిదండ్రులు. అప్పుడు అక్కున చేర్చుకుంటుంది ఓ లాయర్. ఆమె తరపున కోర్టులో వాదిస్తుంది. ఆడవాళ్లకున్న ఆడవాళ్ల మద్దతును గెలిపిస్తుంది. దృష్టి.. సారించింది హిందీ సినిమా కూడా 1990ల్లో. భర్త వివాహేతర సంబంధంతో ఇంకో మహిళ తమ సంసారాన్ని విచ్ఛిన్నం చేస్తే ఆ రెండో మహిళను శాపనార్థాలు పెట్టదు ఇంటి ఇల్లాలు. భర్త వ్యక్తిత్వాన్ని తప్పు పడుతుంది. తన జీవితంలోంచి ఆ బలహీనుడు తప్పుకున్నా తను బలంగానే నిలబడుతుంది. సాటి స్త్రీ పట్ల సానుభూతే ప్రదర్శిస్తుంది. సెక్షన్ 375.. 2019లో వచ్చిన హిందీ సినిమా. చలనచిత్ర పరిశ్రమలోని కాస్టింగ్ కౌచ్ మీద ఎక్కుపెట్టిన బాణం. ఇందులోనూ బాధితురాలికి చేయూతనిచ్చిన న్యాయవాది మహిళే. ఒకరకంగా ఇది పరస్పర అంగీకార ఇచ్ఛ, రేప్‌కి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని, ఏది రేప్ అన్న నిర్ధారణను చర్చకు పెట్టిన సినిమా. మహిళల గౌరవమర్యాదలకు భంగం వాటిల్లే పరిస్థితులను మహిళలంతా ఏకమై ఎదుర్కోవాలని సూచించిన సినిమా. ఈ నాలుగు నమూనాలు మాత్రమే. ఇలాంటి ఇంకెన్నో దృశ్యాలు థియేటర్లో విడుదలయ్యాయి.. సిస్టర్హుడ్ మీద అవగాహన కల్పించేందుకు. ఓల్గా నుంచి తోట అపర్ణ దాకా చైతన్యవంతులైన రచయిత్రులెందరో సిస్టర్హుడ్ ఇతివృత్తంగా కథలు, నవలలు రాశారు.. రాస్తున్నారు. ఇందులో సోషల్ మీడియా పాత్రా ప్రధానమైనదే. 1967, అమెరికాలో సివిల్‌రైట్స్ మూవ్మెంట్స్ సమయంలో వైట్ ఫెమినిస్ట్‌లు తమకున్న ప్రత్యేక హక్కులకు అతీతంగా బాధితుల పక్షాన నిలబడాలని బ్లాక్ ఫెమినిస్ట్‌లు డిమాండ్ చేసినప్పుడు ఈ ‘సిస్టర్ హుడ్’ అనే పదం ప్రచారంలోకి వచ్చింది. ఆ స్ఫూర్తి ఇప్పటి సామాజిక మాధ్యమాల్లోనూ కనపడుతోంది. పాశ్యాత్య దేశాల్లోని స్త్రీవాదంలో రంగు విభజనరేఖను గీస్తే మన దగ్గర కులం, మతం ఆ వ్యత్యాసానికి కాపలాకాస్తున్నాయి. ఆ కంచెను తొలగించడంలో సోషల్ మీడియా చాలా చురుగ్గా పనిచేస్తోంది. హథ్రాస్ సంఘటనే తాజా ఉదాహరణ. కుల,మతాలకతీతంగా మహిళలు బాధితురాలి కుటుంబానికి అండగా నిలబడ్డారు. అగ్రకుల, పురుషాహంకారాన్ని నిరసించారు. సిస్టర్‌హుడ్‌ను చాటారు. సిస్టర్హుడ్ అంటే మహిళలందరూ ఒకేరకమైన ఆలోచనలు, విశ్వాసాలతో ఉండడం కాదు, పురుషాధిపత్యభావజాలంతో సమస్యలెదుర్కొంటున్న స్త్రీలకు మద్దతుగా నిలబడ్డమే. వాళ్లు ఏ విశ్వాసాలను అవలంబిస్తున్నా.. ఏ సామాజిక వర్గంలో ఉన్నా సరే. ఏ లేబుల్ వేయకుండా ఆ భిన్నత్వాన్ని గౌరవిస్తూ ఆలంబనగా ఉండడమే. -శరాది -
మూడు సినిమాల నుంచి తప్పించారు
‘‘సినిమా ఇండస్ట్రీలో పని చేయడం వైకుంఠపాళి ఆడటమే. ప్రతీ అడుగు జాగ్రత్తగా వేయాలి. తప్పటడుగు వేశామా పాము కాటు పడినట్టే. సినిమా ప్రయాణమే అంత’’ అన్నారు సమీరా రెడ్డి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇన్సైడర్స్ వర్సెస్ అవుట్‌సైడర్స్, క్యాస్టింగ్ కౌచ్ వంటి విషయాల్లో తన అనుభవాలను పంచుకున్నారు సమీర. ఆ విషయాల గురించి సమీరా రెడ్డి మాట్లాడుతూ– ‘‘స్టార్ కిడ్స్ (వారసులు)ను ప్రోత్సహించడం కోసం నా చేతివరకూ వచ్చిన మూడు సినిమాలను లాగేసుకున్నారు. నేను అంగీకరించిన మూడు సినిమాల నుంచి నన్ను తప్పించారు. ఓ చిత్రనిర్మాత అయితే ‘ఈ పాత్రకు నువ్వు సరిపోవు. నీలో ఆ పాత్ర పోషించే టాలెంట్ లేదు. అందుకే నిన్ను వద్దనుకున్నాం’ అన్నాడు. అయితే అసలు కారణం తెలీక నాకు నిజంగా ప్రతిభ లేదేమో అని భయపడేదాన్ని. కానీ వారసులకు అవకాశం ఇవ్వడం కోసం నన్ను తప్పించారని ఆ తర్వాత తెలిసింది’’ అన్నారు. క్యాస్టింగ్ కౌ^Œ గురించి మాట్లాడుతూ – ‘‘ఓ సినిమా ప్రారంభం అయ్యాక ఓ రోజు సడన్‌గా ముద్దు సన్నివేశాల్లో నటించాలని బలవంతపెట్టారు. ‘స్క్రిప్ట్ సమయంలో ఆ సన్నివేశం లేదు’ అని గుర్తు చేస్తే, ‘నిన్ను సినిమాలో నుంచి తొలగించడం పెద్ద కష్టమేం కాదు’ అనే సమాధానం వచ్చింది. మరో సినిమాలో నటిస్తున్నప్పుడు ఓ బాలీవుడ్ హీరో ‘నీతో నటించడం చాలా బోర్. నిన్ను అప్రోచ్ అవ్వడం చాలా కష్టం. మళ్లీ నీతో కలసి ఎప్పుడూ పని చేయను’ అన్నారు. అన్నట్టుగానే ఆ హీరో సినిమాలో ఆ తర్వాత ఎప్పుడూ నన్ను ఎంపిక చేయలేదు’’ అని గతాన్ని గుర్తు చేసుకున్నారు సమీరా రెడ్డి. -
సినిమాలోనే కాదు బుల్లితెరలోనూ అడ్జెస్ట్మెంట్
సినిమా: చేదు అనుభవాలెన్నో ఎదుర్కొన్నానని నటి కల్యాణి చెప్పింది. కేరళకు చెందిన ఈ అమ్మడు తమిళంలో పలు చిత్రాల్లో నటించింది. బాలనటిగా పరిచయమైన కల్యాణి కథానాయకి స్థాయికి ఎదిగింది. 10 చిత్రాలకు పైగా కథానాయకిగా నటించిన కల్యాణి ఆ తరువాత బుల్లితెరకు పరిచయమైంది. తరువాత బుల్లితెర నుంచి నిష్క్రమించింది. నటనకు దూరం కావడానికి కారణం ఏమిటన్న ప్రశ్నకు కల్యాణి బదులిస్తూ నేనని ఠక్కున చెప్పింది. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థల్లో నుంచి ఫోన్లు వచ్చేవని, తమ చిత్రంలో కథానాయకి మీరేనని చెప్పేవారని అంది. అందుకు సంతోషపడే లోపే అడ్జెస్ట్మెంట్ కావాలని చెప్పేవారన్నారు. అదేది కాల్షీట్స్కు సంబంధించిన పదం అనుకుని తన తల్లి ఓకే చెప్పేదని ఆ తరువాత విషయం అర్థం తెలియడంతో అడ్జెస్ట్మెంట్ అన్న పదం వినగానే ఫోన్ కట్ చేశానని చెప్పింది. సినిమాలోనే కాదు బుల్లితెరలోనూ అలాంటి చేదు అనుభవాలను చాలా ఎదుర్కొన్నట్లు చెప్పింది. ఒక టీవీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నత బాధ్యతలు నిర్వహిస్తున్న వ్యక్తి రాత్రికి పబ్బుకు పిలిచారని, అందుకు తాను సాయంత్రం కాపీ షాప్‌లో కలుసుకుందామని చెప్పానని అంది. అంతే ఆ తరువాత ఆ టీవీలో ఏ కార్యక్రమంలోనూ తనకు అవకాశం రాలేదని చెప్పింది. దీని కారణంగా తాను నటనకు దూరమైనట్లు నటి కల్యాణి చెప్పింది. ప్రస్తుతం ఈమె పెళ్లిచేసుకుని సంసారజీవితంలో మునిగిపోయింది. -
నేను కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నా: హీరో
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానా పరిశ్రమలో అడుగు పెట్టిన ప్రారంభంలో కాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నానని చెప్పాడు. ఓ ఇంటర్యూలో ఖురానా మాట్లాడుతూ.. సినిమా ఛాన్స్‌ల కోసం ఆడిషన్స్ ఇచ్చే సమయంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను గుర్తు చేసుకున్నాడు. ‘సినిమా ఛాన్స్ ఉందని ఓ దర్శకుడు ఆడిషన్స్‌కి పిలిచాడు. ఇక అక్కడికి వెళ్లాక ఆయన నువ్వు నీ ప్రైవేటు భాగాలను చూపిస్తే నీకు సినిమాలో ప్రధాన పాత్ర ఇస్తానని చెప్పాడు. ఇక క్షణం ఆలోచించకుండ వెంటనే ఆయన ఆఫర్‌ను సున్నీతంగా తిరస్కరించాను’ అని చెప్పుకొచ్చాడు. అయితే ‘‘అప్పటి నుంచి నేను ఎన్నో సార్లు తిరస్కరణలకు గురయ్యాను. ఇక ప్రారంభంలో సోలో టెస్టు తీసుకుంటామని చెప్పి ఒకేసారి 50 మందిని లోపలికి పిలిచేవారు. అయితే దీనిని నేను వ్యతిరేకిస్తే తిరిగి వెళ్లిపోమ్మని చెప్పేవారు. అలా నేను ఎన్నోసార్లు ఆడిషన్స్‌కు వెళ్లి తిరిగి వచ్చేవాడిని’’ అంటూ తనకు ఎదురైన చేదు అనుభాన్ని గుర్తు చేసుకున్నాడు. (అందుకే తిరస్కరించారు: ప్రియదర్శన్) కాగా ఈ తిరస్కరణల నుంచి ఇప్పుడు నేను మరింత బలవంతుడినయ్యాను అంటూ ఖురానా చెప్పాడు. ‘‘ప్రారంభంలో నేను ఎదుర్కొన్నా వైఫల్యాల వల్ల నాలో ఆత్మస్థైర్యం రెట్టింపు అయ్యింది. ఎంతగా అంటే ప్రస్తుతం అపజయాలను, విజయాలను ఒకేలా స్వీకరించేంతగా. అయితే గత మూడేళ్లలో విడుదలైన నా సినిమాలు అన్ని కూడా విజవంతమైనందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను’’ అని చెప్పాడు. కాగా ఆయుష్మాన్ ఖురానా ‘విక్కీ డోనర్’ సినిమాతో 2012లో బాలీవుడ్లో ఆరంగేట్రం చేశాడు. ఆ తర్వాత విభిన్న పాత్రలను ఎంచుకుంటూ బాలీవుడ్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్లో మెస్ట్ వాంటేడ్ నటుడిగా ఎదిగాడు. ఇటివల ఆయన నటించిన ‘శుభ మంగల్ జయాదా సావ్ధాన్’ విడుదలైన విషయం తెలిసిందే. ఇందులో ఆయుష్మాన్ స్వలింగ సంపర్కుడిగా నటించాడు. (ఆయుష్మాన్ ఖురానా సినిమాకు తాప్సీ బ్రేక్) -
వారికి అక్కాచెల్లెల్లు, పిల్లలు ఉండరా: అనుష్క
టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర కథానాయికగా కొనసాగుతున్న అనుష్క శెట్టి.. హీరోలతో సమానంగా పాపులారిటీ, పారితోషికం అందుకుంటున్నారు. తన 15 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్గా రాణిస్తున్నారు. అయితే అనుష్క ఎంత మంచి పేరు సంపాదించుకున్నారో.. ఆమెపై అంతే స్థాయిలో రూమర్లు ప్రచారం అవుతున్నాయి. ముఖ్యంగా స్వీటీ పెళ్లిపై అనేక పుకార్లు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తనపై వస్తున్న పుకార్లు, వ్యక్తిగత విషయాలపై స్వీటీ పెదవి విప్పారు. (నేనూ ప్రేమలో పడ్డా: అనుష్క) ఆమె మాట్లాడుతూ.. ‘చిత్ర పరిశ్రమలో రూమర్లు సాధారణం. వాటి కోసం నేనేం చేయలేను. అయితే అలాంటి పుకార్లు ఎందుకు వ్యాప్తి చేస్తారో నాకు అర్థం అవ్వడం లేదు. నా పెళ్లి విషయంలో వచ్చిన పుకార్ల వల్ల నేను మొదట నిరాశపడ్డాను. అయినా ఇలా పుకార్లు సృష్టిస్తున్న వారికి అక్కాచెల్లెల్లు, పిల్లలు ఉండరా’ అని తనపై గాసిప్స్ క్రియెట్ చేస్తున్న వ్యక్తులపై స్వీటీ విరుచుకుపడ్డారు. అలాగే బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్‌ల వల్ల తీవ్రమైన వెన్నునొప్పికి గురయినట్లు, దాని నుంచి కోలుకోవడానికి మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకున్నట్లు తెలిపారు. టీవీ చూడటం, న్యూస్ పేపర్ చదవడం తనకు అలవాటు లేదని, తన స్నేహితులు పంపిన మెసెజ్‌ల ద్వారా ఈ పుకార్ల గురించి తెలుసుకుంటానని అనుష్క వెల్లడించారు. (అవి నా కుటుంబాన్ని బాధిస్తున్నాయి: అనుష్క) ముక్కు సూటిగా మాట్లాడతా ఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై అనుష్క మాట్లాడుతూ.. తెలుగు చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ లేదని నేను చెప్పను. కానీ అదృష్టవశాత్తూ నేను ఎప్పుడూ దీన్ని ఎదుర్కోలేదు. నేను ఎప్పుడూ ముక్కుసూటిగా, స్పష్టంగా ఉంటాను. చిత్ర పరిశ్రమలో సులభ మార్గాల ద్వారా రాణించాలా.. లేదా కష్టపడి నిలదొక్కుకోవాలా అనేది నిర్ణయించుకోవాలి’ అని సూచించారు. ఇక అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’ ఏప్రిల్ 2న విడుదల కానుంది. హేమంత్ మధుకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడే అవకాశం ఉంది. (చిత్రం పేరు మాత్రమే నిశ్శబ్దం..) -
నేనూ.. కాస్టింగ్ కౌచ్ బాధితురాలినే
చెన్నై : 'అవును నేనూ అలాంటి ఘటనలు ఎదుర్కొన్నాను' అని నటి వాణిబోజన్ పేర్కొన్నారు. తాను కాస్టింగ్ కౌచ్ బాధితురాలినేననంటూ బుల్లితెర నుంచి వెండి తెరకు ప్రమోట్ అయిన నటి వాణిబోజన్ తెలిపారు.'ఓ మై కడవులే' చిత్రంతో సినిమాల్లో ఎంటరయిన ఈ భామ తొలి చిత్రంతోనే సక్సెస్‌ను అందుకుంది. ప్రస్తుతం వైభవ్‌తో జతకట్టిన లాకప్ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ మధ్యన వాణిబోజన్ తరచూ వార్తల్లో ఉంటోంది. గ్లామర్ విషయంలోనూ కాస్త ఫాస్ట్‌గా ఉన్న ఈ బ్యూటీ తన గ్లామరస్ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తూ ప్రచారం పొందే ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల ఒక భేటీలో తన అనుభవాలను పంచుకుంది. ఈ సందర్భంగా కాస్టింగ్ కౌచ్ గురించి అడిగిన ప్రశ్నకు తానూ అలాంటి సంఘటనలను ఎదుర్కొన్నానని, ఒక నిర్మాత అవకాశం కోసం పడక గదికి రమ్మన్నాడని చెప్పింది. అలాంటి అవకాశం తనకు వద్దని చెప్పినట్లు పేర్కొంది. ప్రసుత్తం వాణిబోజన్ చెప్పిన విషయం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. (దసరాకు రాకీ భాయ్ వస్తున్నాడు) మాయ అనే టీవీ సీరియల్ ద్వారా వాణిబోజన్ నటిగా పరిచయమయ్యారు.అయితే ఈ అమ్మడిని పాపులర్ చేసింది మాత్రం దైవమగళ్ అనే సీరియల్. ఈ సీరియల్‌తో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకున్న వాణిబోజన్ సాధారణంగా తన మేనేజర్‌తోనే నిర్మాతలు సంప్రదిస్తారని చెప్పింది. అలా పలువురు నిర్మాతలు అవకాశాల కోసం తనను పడక గదికి పిలిచినట్లు మేనేజర్ చెప్పారని అంది. కాస్టింగ్ కౌచ్ అన్నది ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు. ఇంతకు ముందే పలువురు నటీమణులు మీటూ బాధలను వ్యక్తం చేశారు. పోలీసులకు ఫిర్యాదు వరకూ వెళ్లారు. ఈ వ్యవహారం రోజురోజుకూ అధికమవుతోంది. హీరోయిన్లు, కాస్త నాగరీకంగా దుస్తులు ధరించి, సంప్రదాయబద్ధంగా నడుచుకుంటే ఇలాంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండదనే వాదన వినిపిస్తోంది. నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ లాంటి వారు కాస్టింగ్ కౌచ్ వంటి సంఘటనలు ఎదురైనప్పుడు ధైర్యంగా ఎదుర్కొనాలని, జరిగిపోయిన తర్వాత చెబితే ప్రయోజనం ఉండదని అంటున్నారు. (అవి నా కుటుంబాన్ని బాధిస్తున్నాయి) -
నో చెప్పడం నేర్చుకోండి
‘‘కెరీర్ తొలిరోజుల్లో క్యాస్టింగ్ కౌచ్‌కి నో చెప్పాను అని చాలా సందర్భాల్లో నన్ను సినిమాలనుంచి పలువురు దర్శక–నిర్మాతలు దూరం పెట్టారు. కానీ ఇవాళ 25 సినిమాలు పూర్తి చేసుకుని ఇండస్ట్రీలో స్థిరమైన స్థానాన్ని సంపాదించుకోగలిగాను’’ అన్నారు వరలక్ష్మీ శరత్‌కుమార్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడారామె. ‘‘మహిళలు తమను లైంగికంగా వేధించేవాళ్లను, క్యాస్టింగ్ కౌచ్‌కి అంగీకరించమనే వాళ్ల పేర్లను ధైర్యంగా బయటపెట్టాలి. అవకాశాలు తగ్గిపోతాయనే భయంలో ఉండిపోకూడదు. ఒకవేళ ఆ దారిలో వెళ్లి హీరోయిన్ అవుదామనుకున్నా అది వ్యక్తిగత నిర్ణయం. ఎవరి ఇష్టం వాళ్లది. కానీ ముందు అంగీకరించి ఆ తర్వాత ఫలనా వాళ్లు ఇలా చేశారు అని ఫిర్యాదు చేయకూడదు. కష్టమైనా ‘నో’ చెప్పడం నేర్చుకోండి’’ అన్నారు వరలక్ష్మి. -
‘చాన్స్ కోసం గదికి రమ్మన్నారు’
చెన్నై : అంతా అయిన తరువాత ఫిర్యాదు చేయడం అంగీకారం కాదని నటి వరలక్ష్మీశరత్‌కుమార్ అంటోంది. కోలీవుడ్‌లో డేరింగ్ అండ్ డైనమిక్ నటి ఎవరంటే ముందుగా గుర్తుకొచ్చే పేరు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్. పోడాపోడీ చిత్రంతో నటిగా కెరీర్‌ను ప్రారంభించిన ఈ బ్యూటీ ప్రముఖ నటుడు శరత్‌కుమార్ కూతురన్నది తెలిసిందే. కథానాయకిగా పయనాన్ని ప్రారంభించినా, అవకాశాలు రాకో, నటిగా నిరూపించుకోవాలన్న తపనతోనో ప్రతినాయకిగా నటించడానికి కూడా సై అంది. అలా రకరకాల పాత్రలతో కూడిన పలు చిత్రాలతో ప్రస్తుతం బిజీగా ఉన్న నటి వరలక్ష్మీశరత్‌కుమార్. ఈమె ప్రేమ వ్యవహారం గురించి చాలానే ప్రచారం జరిగింది. అలా కూడా సంచలన నటిగా ముద్ర వేసుకున్న వరలక్ష్మీశరత్‌కుమార్ కాస్టింగ్ కౌచ్ గురించి పలువురు ప్రముఖ నటీమణులు కథలు కథలుగా వెతలను చెప్పుకుంటున్న పరిస్థితుల్లో అలాంటి సమస్యను తానూ ఎదుర్కొన్నానని బహిరంగంగానే చెప్పింది. (చదవండి : ‘దర్శకులు ఒక్క రాత్రి మాతో గడపాలన్నారు’) అంతేకాదు తనను ఇంటర్వ్యూ చేసిన ఒక టీవీ చానల్ విలేకరి అడ్జెస్ట్మెంట్ కావాలని అడగడంతో అతని చెంప చెళ్లుమనిపించినట్లు చెప్పింది. కాగా కాస్టింగ్ కౌచ్ వ్యవహారం సద్దుమణిగిందనుకుంటున్న సమయంలో తాజాగా మళ్లీ అలాంటి ఆరోపణలు ప్రసారం అవుతుండడంతో దీనిపై నటి వరలక్ష్మీ స్పందిస్తూ మీటూ సమస్యను తానూ ఎదుర్కొన్నానని చెప్పింది. ఒక నటుడి వారసురాలినని తెలిసి కూడా సినిమా అవకాశం కోసం పడక గదికి రమ్మన్నారని చెప్పింది. దర్శక, నిర్మాతలతో అడ్జెస్ట్ కావాలని కొందరు చెప్పారని తెలిపింది. దీంతో అలాంటి అవకాశం తనకు అవసరం లేదని నిరాకరించినట్లు చెప్పింది. అలా మాట్లాడిన వారి ఆడియో ఆధారాలు తన వద్ద ఉన్నాయని చెప్పింది. కాగా ఇలాంటి విషయాల్లో అంతా జరిగిన తరువాత ఫిర్యాదు చేయడం అంగీకారం కాదంది. మహిళలు తమను తాము రక్షించుకోవడానికి తయారవ్వాలని చెప్పింది. కాగా ఈమె మహిళారక్షణ కోసం, సమాజంలో జరుగుతున్న అక్రమాలపై పోరాడడానికి స్త్రీశక్తి పేరుతో ఒక సమాఖ్యను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం ఈ అమ్మడు వెల్వెట్ నగరం, పాంబన్ చేజింగ్, డానీ పిరందాల్ పరాశక్తి తమిళ చిత్రాలతో పాటు, తెలుగులో క్రాక్ చిత్రం, కన్నడ చిత్రం రణం చిత్రాల్లో నటిస్తోంది. కాగా ఈమె నటించిన కన్నిరాశి, కాటేరి చిత్రాలు విడుదల కావలసి ఉన్నాయి. -
‘దర్శకులు ఒక్క రాత్రి మాతో గడపాలన్నారు’
సాక్షి, ముంబై: చిత్ర పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పెను దుమారాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఒక్కో నటి సమయం వచ్చినప్పుడు దీనిపై స్వరం వినిపిస్తూనే ఉన్నారు. దీనిపై చర్చ ఈ మధ్య కొంత తగ్గినట్లు కనిపించినా.. తాజాగా ఓ బాలీవుడ్ నటి చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపుల గురించి నోరు విప్పారు. సినిమాలో అవకాశం కోసం వస్తే ఇద్దరు దర్శకులు తనను లైంగిక వేధింపులకు గురిచేశారని బాలీవుడ్ నటి ఎల్లి అవ్రామ్ అన్నారు. మంగళవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. బాలీవుడ్లో తనకు ఎదురైన భయంకరమైన అనుభవాలను పంచుకున్నారు. స్వీడన్‌కు చెందిన తనకు అక్కడ అవకాశాలు లభించకపోవడంతో అవకాశాలు వెతుక్కుంటూ.. బాలీవుడ్‌కు వచ్చినట్లు తెలిపారు. అయితే కథ నిమిత్తం ఓ దర్శకుడికి దగ్గరకు వెళ్లితే తాను చాలా పొట్టిగా ఉన్నానని, ముందు పళ్లు బాగోలేవని తొలుత హేళన చేసినట్లు చెప్పుకొచ్చారు. ఆ తరువాత తన చేయి పట్టుకుని గోరుతో గిల్లినట్లు తెలిపింది. అయితే ఇవేవీ తనకు తెలియకపోవడంతో తేలిగ్గా తీసుకున్న ఎల్లి కొంత కాలం తరువాత తన స్నేహితురాలిని కలిసింది. ఈ విషయం తన వద్ద ప్రస్తావించగా.. ఆమె అసలు విషయం వివరించింది. గోరుతో చేయిపై గోకితే ఒక రాత్రి తనతో గడపమని అర్థం అని చెప్పడంతో ఒక్కసారిగా షాక్‌కి గురయ్యానని ఎల్లి ఆవేదన వ్యక్తం చేసింది. అయితే మరో దర్శకుడు కూడా తనతో ఇలానే ప్రవర్తించినట్లు గుర్తుచేసింది. దీనిపై ఆమె మాట్లాడుతూ.. బాలీవుడ్లో అవకాశాలు రావడం చాలా కష్టమన్నది. షూటింగ్ సమయంలో ఇలాంటి వేధింపులు తాను చాలా ఎదుర్కొన్నట్లు చెప్పింది. -
సినిమా వరకే... తర్వాత ఆపేద్దామన్నాడు!
‘‘నా కెరీర్లో ఐదుసార్లు క్యాస్టింగ్ కౌచ్ పరిస్థితులను ఎదుర్కొన్నాను. రెండు సార్లు బాలీవుడ్లో మూడుసార్లు సౌత్ ఇండస్ట్రీలో’’ అని పేర్కొన్నారు బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా. టెలివిజన్ నుంచి ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చారు సుర్వీన్. తెలుగులో ‘రాజు మహారాజు’ హిందీలో ‘హమ్ తుమ్ షబానా, అగ్లీ, హేట్ స్టోరీ 2, పార్చడ్, తమిళంలో ‘మూండ్రు పేర్ మూండ్రు కాదల్, పుదియ తిరుప్పంగళ్’ సినిమాల్లో నటించారామె. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సంఘటనల గురించి సుర్వీన్ చెబుతూ – ‘‘టీవీ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ సినిమాల్లో నా ప్రయాణం అంత సాఫీగా సాగలేదు. సౌత్‌లో ఓ చిత్రదర్శకుడు ‘నీ శరీరంలోని ప్రతి భాగాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను’ అన్నాడు. అప్పటి నుంచి అతని ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం మానేశాను. ఇంకోసారి ఓ నేషనల్ అవార్డు పొందిన దర్శకుడుకి ఆడిషన్ ఇవ్వడానికి వెళ్లాను. ఆ ఆడిషన్లో అనవసరమైన డైలాగ్స్ చెప్పించి, ఏదో ఏదో చేయించాడు. ఆరోగ్యం బాలేదని ముంబై తిరిగొచ్చాను. ‘నీ ఆరోగ్యం బాలేదు కదా. నేను కూడా ముంబై రానా?’ అని ఫోన్ చేసి అడిగించాడు. చాలా చీప్‌గా అనిపించింది. ‘నో థ్యాంక్యూ’ అన్నాను. అతనికి తమిళం తప్ప వేరే భాష రాదు. వేరే అతనితో మాట్లాడించాడు. ‘సినిమాకు చాలా టైమ్ పట్టేలా ఉంది. సార్ మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. కేవలం సినిమా జరిగేవరకే.. ఆ తర్వాత ఆపేయొచ్చు’ అన్నాడు. నేను చాలా అమాయకంగా ‘ఏం ఆపేయాలి’ అని అడిగా. ‘కేవలం సినిమా జరిగేవరకే.. ఆ తర్వాత ఆపేయొచ్చు’ అని మళ్లీ రిపీట్ చేశాడు. ‘మీరు రాంగ్ డోర్‌ని తడుతున్నారు. ఒకవేళ మీ సార్ నేను టాలెంటెడ్ అనుకుంటే నేను పని చేయడానికి సిద్ధమే’ అన్నాను. ఆ సినిమా ఇప్పటి వరకూ జరగలేదు. రెండేళ్ల క్రితం బాలీవుడ్లో ‘నీ ఎద ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నాను’ అని ఒక దర్శకుడు, ‘నీ తొడలు ఎలా ఉంటాయో చూడాలనుకుంటున్నాను’ అని మరొక దర్శకుడు కోరారు. వాళ్ల ఆఫీసుల నుంచి వెంటనే బయటకు వచ్చేశాను’’ అని పేర్కొన్నారు. ‘‘నిజానికి నా బరువు 56 మాత్రమే. అయినప్పటికీ ‘లావుగా ఉన్నావు’ అంటూ అదోలా చూసేవాళ్లు’ అని కూడా సుర్వీన్ వాపోయారు. -
గదిలోకి వెళ్లగానే వెకిలిగా ప్రవర్తించాడు
ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళలపై లైంగిక వేధింపులు జరుగుతున్నాయంటూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్, హాలీవుడ్ దాకా ఉద్యమాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. క్యాస్టింగ్ కౌచ్ పేరిట వేధిస్తున్నారంటూ ఇప్పటికే పలువురు నటీమణులు ఆరోపణలు చేశారు. తాజాగా నటి విద్యాబాలన్ కూడా కెరీర్ తొలినాళ్లలో క్యాస్టింగ్ కౌచ్ అనుభవాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. అక్షయ్ కుమార్, విద్యాబాలన్ ముఖ్యపాత్రల్లో జగన్ శక్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మిషన్ మంగళ్’. ఈ నెల 15న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సందర్భంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో విద్యాబాలన్ మాట్లాడుతూ– ‘‘కెరీర్ తొలిరోజుల్లో చెన్నైలోని ఒక దర్శకుడు నా దగ్గరకు వచ్చి స్టోరీ లైన్ చెప్పాడు. ‘పూర్తి కథ చెప్పడానికి కాస్త సమయం పడుతుంది, రూమ్‌లోకి వెళ్దాం’ అన్నాడు. నేను ఏదైనా కాఫీ షాప్‌లో కలుద్దామని చెబితే అతను అంగీకరించలేదు. తీరా హోటల్ రూమ్‌కి వెళ్లగానే ఆ వ్యక్తి రూమ్ తలుపు వేసి నాతో వెకిలిగా ప్రవర్తించాడు. నాకు కోపం రావడంతో తలుపు తీసి బయటకు పొమ్మన్నాను. అతను నన్ను పైకీ, కిందకీ చూస్తూ వెళ్లిపోయాడు’’ అన్నారు. ఈ సందర్భంలో మరో సంఘటనను గుర్తు చేసుకున్నారామె. ‘‘కెరీర్ ఆరంభంలో నా తల్లిదండ్రులతో కలిసి సినిమా అవకాశాల కోసం ఓ నిర్మాతను కలిశాను. నీది హీరోయిన్ ముఖమేనా? అని ఆ నిర్మాత అన్నారు’’ అని విద్యాబాలన్ పేర్కొన్నారు. -
‘తలుపులు మూయడానికి ఒప్పుకోలేదు’
విద్యా బాలన్.. జాతీయ ఉత్తమ నటి అవార్డు గ్రహీత. లేడీ ఓరియెంటెడ్ సినిమా అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది విద్యనే. నటనతోనే కాక విభిన్న కథాంశాలను ఎన్నుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు విద్యాబాలన్. అయితే ఈ గుర్తింపు వెనక ఎన్నో అవమానాలు, వేధింపులు, కష్టాలున్నాయంటున్నారు విద్యాబాలన్. అవి ఏంటో ఆమె మాటల్లోనే.. ‘1990 కాలంలో ‘హమ్ పాంచ్’తో ఇండస్ట్రీలోకి ప్రవేశించాను. ఆ తర్వాత 2003లో వచ్చిన బెంగాలీ చిత్రం ‘భలో థేకో’తో సినిమాల్లో ప్రవేశించాను. ఈ రెండింటి మధ్య కాలంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాను. నేను ఎదుర్కొన్న సంఘటనల్లో కొన్ని నేటికి నాకు కళ్లకు కట్టినట్లు గుర్తున్నాయి’ అన్నారు విద్య. ‘చెన్నైలో ఉండగా ఓ సంఘటన చోటు చేసుకుంది. నన్ను కలవడానికి ఓ దర్శకుడు వచ్చాడు. ఎక్కడైనా కాఫీ షాప్‌లో కూర్చుని మాట్లాడుకుందామన్నాను. అందుకు అతడు అంగీకరించలేదు. హోటల్‌కు వెడదామన్నాడు. దాంతో తప్పని సరి పరిస్థితుల్లో హోటల్‌కి వెళ్లాను. కానీ మేం కూర్చున్న గది తలుపులు మూయడానికి నేను అంగీకరించలేదు. దాంతో ఆ దర్శకుడు అక్కడి నుంచి వెళ్లి పోయాడు. అతడు అలా ఎందుకు ప్రవర్తించాడో ఆ క్షణం నాకు అర్థం కాలేదు. అర్థం అయ్యాక ఎంతో భయపడ్డాను. మరో చోట ఓ నిర్మాత నాకు తన సినిమాలో అవకాశం ఇస్తానన్నాడు. కానీ ఉన్నట్టుండి నన్ను ఆ సినిమా నుంచి తప్పించాడన్నారు. ఇలాంటి కొన్ని చేదు సంఘటనల తర్వాత 2005లో ‘పరిణీత’ చిత్రంతో విద్య బాలీవుడ్లో ప్రవేశించారు. అక్కడ కూడా ‘లావుగా ఉన్నావ్, ఫ్యాషన్ సెన్స్ లేదు’ అనే విమర్శలు ఎదుర్కొన్నారు విద్య. ఆ తర్వాత వచ్చిన ‘లగే రహో మున్నాభాయ్’, ‘పా’, ‘నో వన్ కిల్డ్ జెస్సికా’ చిత్రాలు విద్యలోని నటిని వెలికి తీశాయి. ఆ తర్వాత ‘డర్టీ పిక్చర్’ చిత్రంలో నటించి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు విద్య. ప్రస్తుతం విద్య నటించిన ‘మిషన్ మంగళ్ చిత్రం’ కూడా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. (చదవండి: ఆమె పుట్టగానే.. నర్సు ఏమన్నదంటే!) -
రాజీ పడాలన్నాడు
‘మీటూ’ అంటూ ఇండస్ట్రీలోని క్యాస్టింగ్ కౌచ్ సంఘటనలను హీరోయిన్లు బయటకు చెబుతూనే ఉన్నారు. తాజాగా మరో హీరోయిన్ తన చేదు అనుభవాలను పంచుకున్నారు. తమిళంలో ‘వరుత్తపడాద వాలిబర్ సంఘం, తిరుట్టుపయలే 2, మిస్టర్ లోకల్’ వంటి సినిమాల్లో కీలక పాత్రల్లో కనిపించారు హీరోయిన్ షాలు షాము. తాజాగా సోషల్ మీడియాలో అభిమానులతో చాట్ చేస్తూ తనకు ఎదురైన చేదు అనుభవాన్ని పంచుకున్నారు – ‘‘నేనూ క్యాస్టింగ్ కౌచ్‌ను ఎదుర్కొన్నాను. కానీ దాని గురించి కంప్లయింట్ చేయదలచుకోలేదు. అలాంటి పరిస్థితుల నుంచి నన్ను నేను ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. ఒకవేళ ఫిర్యాదు చేస్తే మనం ఆరోపించిన వారు తమ తప్పును అంగీకరిస్తారా? చాన్సే లేదు. ‘నాతో కాంప్రమైజ్ అయితే నీకు విజయ్ దేవరకొండ సినిమాలో హీరోయిన్గా అవకాశం ఇప్పిస్తా’ అని ఓ దర్శకుడు ప్రపోజల్ పెట్టాడు’’ అని పేర్కొన్నారు షాలు. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు? మీ ఊహలకే వదిలేస్తున్నాం. -
ఇండస్ట్రీ ధోరణి మారాలి
‘‘ఫిల్మ్ ఇండస్ట్రీలో స్త్రీలను కేవలం గ్లామర్ వస్తువుల్లా మాత్రమే చూస్తారు. కానీ దానికి మించి ఇంకా చాలా ఉంటుంది స్త్రీలలో’’ అన్నారు సమీరా రెడ్డి. ఇండస్ట్రీలో స్త్రీలను ట్రీట్ చేసే విధానం, స్త్రీ, పురుషుల మధ్య వ్యత్యాసం గురించి ఓ ఇంటర్వ్యూలో సమీరా రెడ్డి మాట్లాడుతూ – ‘‘ఇండస్ట్రీలో మారాల్సిన విషయం ఏదైనా ఉందంటే అది స్త్రీల నుంచి ఎక్స్పెక్ట్ చేయడమే. చాలా సందర్భాల్లో నన్ను అభ్యంతరకరంగా అప్రోచ్ అయ్యారు కూడా. స్త్రీలను కేవలం గ్లామర్ కోసమే అనేట్టుగా చూడటం మానేయాలి. ఇండస్ట్రీలో స్త్రీ, పురుషులు ఇద్దరికీ ఒకేలాంటి గౌరవం ఉండదు. ఒకవేళ ఇండస్ట్రీలో ఏదైనా మార్చాలనుకుంటే అది ఇదే అని కోరుకుంటాను. ప్రస్తుతం ఇండస్ట్రీ ఆ విధంగానే అడుగులేస్తోంది అనుకుంటున్నాను. చాలా చిన్న చిన్న అడుగులు. బేబీ స్టెప్స్లాగా’’ అని పేర్కొన్నారు. ‘అసభ్యకరంగా అప్రోచ్ అయ్యారు’ అని పేర్కొనడం వెనక కారణం క్యాస్టింగ్ కౌచ్‌కు సంబంధించిందా? లేద సెక్సువల్ హెరాస్మెంటా? అన్నది క్లారిటీగా చెప్పలేదు సమీర. -
కాస్టింగ్ కౌచ్‌పై బహిరంగ విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: సినీ, టీవీ రంగాన్ని కుదిపేసిన కాస్టింగ్ కౌచ్, నటీమణుల వేధింపులకు సంబంధించి బాధితుల సమస్యలను తెలుసుకునేందుకు బహిరంగ విచారణ జరపాలని, ఇందుకు సంబంధించి సమయం, తేదీ, ప్రత్యేక ఎజెండాను రూపొందించాలని ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన ఉన్నతస్థాయి కమిటీ సభ్యులు నిర్ణయించారు. శుక్రవారం హైదరాబాద్ మాసాబ్‌ట్యాంక్‌లోని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ భవనంలో సంస్థ చైర్మన్ రామ్మోహన్రావు అధ్యక్షతన కమిటీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీవీ, సినీ పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, లైంగిక వేధింపుల నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై పోలీసు, న్యాయ విభాగాల ఉన్నతాధికారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు. సినీ, టీవీ రంగంలో మహిళల సంఖ్య గణనీయంగా పెంచేందుకు, వారిని ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జూనియర్ ఆర్టిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశంపై నిపుణుల అభిప్రాయాలను సేకరించారు. ఆయా సమస్యలపై బాధిత మహిళల అభిప్రాయాలను సేకరించి వీటి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందజేయాలని సభ్యులు అభిప్రాయపడ్డారు. మరో రెండు వారాల్లో సినీ, టీవీ రంగాల్లోని అన్ని వర్గాల అభిప్రాయాలను సేకరించి.. సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు మరోసారి సమావేశం అవుతామని ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రామ్మోహన్రావు తెలిపారు. కాగా, ఈ కమిటీలో సభ్యత్వం లేని సినీనటి జీవిత ఈ సమావేశానికి హాజరుకావడం పట్ల పలువురు సభ్యులు అభ్యంతరం వ్యక్తంచేశారు. -
‘నా కల నిజమైంది.. ప్రపంచానికి నేనే హీరోయిన్’
తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ బాధితుల పోరాటానికి తెలంగాణా ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఉద్యమానికి కీలకమైన నటి శ్రీరెడ్డి ఫేస్బుక్లో స్పందించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తన కల సాకారమైందనీ, ఇందుకు ఒక హైదరాబాదీగా తనకు చాలా గర్వంగా ఉందంటూ ఆయనకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ ప్రపంచానికి తనను హీరోయిన్ చేశారంటూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. నా పోటారానికి అద్భుతమైన ఫలితాలొచ్చాయంటూ ఉద్యమానికి గుండె లాంటి అపూర్వ(నటి)కు, ఇంకా ఈ ఉద్యమంలో సాయపడిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరున శ్రీరెడ్డి కృతజ్ఞతలు చెప్పారు. తెలుగు సినిమా రంగంలో మహిళా నటులు ఎదుర్కొంటున్న లైంగిక వేధింపులపై తొలిసారిగా గొంతెత్తిన నటి శ్రీరెడ్డి. అనంతరం మీటూ అంటూ చాలామంది బాధితులు బహిరంగంగా తన బాధల గాథలను ప్రపంచానికి చెబుతూ ఈ ఉద్యమంలో జత కలవడంతో ఇది దావానలంలా రాజుకుంది. అటు వివిధ ప్రజా, మహిళా సంఘాలు ఈ ఉద్యమానికి బాసటగా నిలిచాయి. ప్రతిఫలంగా తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్లో లైంగిక వేధింపులపై చర్యలు తీసుకునేలా ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు బుధవారం జీవో నంబర్ 984 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కొర్పొరేషన్ ఛైర్మన్ రాంమోహన్ రావు ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇందులో టాలీవుడ్ ప్రతినిధులు నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలతో పాటు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయలక్ష్మి సభ్యులుగా ఉంటారు. ఇంకా సినిమా ప్రముఖులు రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ, నిర్మాత కె.ఎల్ నారాయణ, నటి ప్రీతి నిగమ్, నిర్మాత ఎన్.సుధాకర్ రెడ్డి, దర్శకులు శంకర్, తమ్మారెడ్డి భరద్వాజతోపాటు, మహిళా సంక్షేమ, తెలంగాణా అభివృద్ధి సంస్థ లాంటి వివిధ ప్రభుత్వ శాఖల అధ్యక్షులు, కమిషనర్లు, డైరెక్టర్లు కూడా ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. చదవండి : లైంగిక వేధింపులు; ప్యానెల్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం -
క్యాస్టింగ్ కౌచ్ బాధితులకు అండగా..
సాక్షి, హైదరాబాద్ : క్యాస్టింగ్ కౌచ్ బాధితులకు బాసటగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు టాలీవుడ్లో లైంగిక వేధింపులపై చర్యలు తీసుకునే కమిటీని నియమిస్తూ బుధవారం జీవో నంబర్ 984 ప్రకారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ స్టేట్ ఫిల్మ్ డెవలప్మెంట్ కొర్పొరేషన్ ఛైర్మన్ రాంమోహన్ రావు ఈ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఇందులో టాలీవుడ్ ప్రతినిధులు నటి సుప్రియ, యాంకర్ ఝాన్సీ, దర్శకురాలు నందిని రెడ్డిలతో పాటు నల్సార్ యూనివర్సిటీ ప్రొఫెసర్ వసంతి, గాంధీ మెడికల్ కళాశాల వైద్యురాలు రమాదేవి, సామాజిక కార్యకర్త విజయ లక్ష్మి సభ్యులుగా ఉంటారు. వీరితో పాటు దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, నిర్మాత సుధాకర్ రెడ్డిని కూడా కమిటీ సభ్యులుగా నియమించారు. సినీ పరిశ్రమకు సంబంధించిన మహిళలు తమను ఎవరైనా వేధిస్తే ఈ కమిటీ ముందు ఫిర్యాదు చేయవచ్చు. ప్యానెల్ సభ్యులు మాట్లాడుతూ... బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని, బాధితులకు అండగా ఉంటామని పేర్కొన్నారు. కాగా క్యాస్టింగ్ కౌచ్‌కు వ్యతిరేకంగా నటి శ్రీరెడ్డి పోరాటం చేసిన సంగతి తెలిసిందే. -
నిర్మాతకు దిమ్మతిరిగి పోయిందిగా..!
ప్రతి చోట తోడేళ్లు ఉంటాయి.. వాటిని నుంచి తెలివిగా తప్పించుకోవడం పైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందంటున్నారు నటి శృతి మరాఠీ. హ్యూమన్స్ బాంబేకిచ్చిన ఇంటర్వ్యూలో ఇండస్ట్రీలో తనకు తారసపడిన తోడేళ్ల గురించి.. తాను బయటపడిన విధానం గురించి చెప్పుకొచ్చారు. ‘ఒకసారి ఓ నిర్మాతను కలిశాను. ఆయన నాకు తన చిత్రంలో లీడ్ రోల్ ఇస్తానని చెప్పాడు. తొలుత చాలా ప్రొఫెషనల్‌గా ఉండేవాడు. కానీ రానురాను తనలోని వికృత బుద్ధిని బయటపెట్టడం ప్రారంభించాడు. ముందు చాలా మర్యాదగా మాట్లాడినా తర్వాత ఒప్పుకుంటే తప్పులేదు.. ఒక్క రాత్రికే కదా అని వేధించడం ప్రారంభించాడు. అతన్ని ఊరికే వదలాలని అనిపించలేదు. తగిన సమాధానం చెప్పాలని భావించాను’ అని పేర్కొన్నారు శృతి. ‘అందుకే ‘నన్ను మీతో పడుకోమంటున్నారు.. మరి హీరో ఎవరితో పడుకుంటార’ని ప్రశ్నించాను. దాంతో అతడు షాక్ అయ్యాడు. నోటి నుంచి ఒక్క మాట వస్తే ఒట్టు. వెంటనే ఈ విషయం గురించి మిగతా వారికి చెప్పాను. దాంతో వారు ఆ నిర్మాతను ప్రాజెక్ట్ నుంచి తొలగించారు. ఆ సమయంలో నేను నా గురించే కాక.. ప్రతి మహిళ తరఫున మాట్లాడినట్లు అనిపించింద’న్నారు శృతి. అంతేకాక ‘ఇండస్ట్రీలోకి వచ్చిన తొలినాళ్లలో ఓ తమిళ చిత్రం కోసం నేను బికిని ధరించాల్సి వచ్చింది. అప్పుడు దాని గురించి నేను పెద్దగా ఆలోచించలేదు. అవకాశం వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడమే ముఖ్యం అనుకున్నాను’ అన్నారు. ‘కానీ నాకంటూ ఓ గుర్తింపు లభించిన తర్వాత జనాలు నా బికిని సీన్ల గురించి నన్ను ట్రోల్ చేయడం ప్రారంభించారు. అయితే ఇలాంటి విమర్శలు మన ఆత్మాభిమానాన్ని ఎంతలా దెబ్బతీస్తాయో వారికి తెలీదు. అందుకే వాటన్నింటిని పట్టించుకోవడం మానేసి నా పని మీద దృష్టి కేంద్రీకరించాను. ఎందుకంటే ఇక్కడ నాకు ఏది ఊరికే లభించడం లేదు. ఈ రోజు నేను ఉన్న పరిస్థితికి నా పట్టుదల, కృషి తప్ప మరేది కారణం కాదు’ అని చెప్పుకొచ్చారు శృతి. సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ పోస్ట్ నెటిజన్ల హృదయాలు గెల్చుకుంది. మిమ్మల్ని చూసి చాలా గర్వపడుతున్నాం.. ఆత్మవిశ్వాసంతో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నామని తెలిపారు. View this post on Instagram “I’ve been in this industry since I was 16 years old. Over the years I’ve been celebrated in the limelight & shamed behind the camera. People have a misconception that actors lead a comfortable life & always feel good about themselves–that’s not true. Whether we like it or not, whether we feel right or not, we have to be the best versions of ourselves. There are no ‘bad days’. I remember, early on in my career, for a south film, I was asked to wear a bikini–I agreed without thinking twice. Questions like, ‘How are you going to shoot it?’ or ‘Is it required?’ didn’t even cross my mind. I was getting an opportunity to be in a film & that’s all that mattered! Years later when I gained popularity in a Marathi show, people looked me up & stumbled upon the bikini scene. I was trolled for the way I looked & how it was shot. Do you know how much that damages your self-esteem? I put myself out there without any barriers–but I wasn’t accepted; I was objectified. I still continued working as if it didn’t bother me. But I had a dream. I’d worked so hard & was finally moving forward, I wasn’t going to let it go–just because someone else had a problem, they weren’t in my shoes & would never know what it felt like. Slowly, I made myself tougher. Once I met a producer who’d offered me a lead role. At first he was professional, but soon he began using the words, ‘compromise’ & ‘one night’. I couldn’t let this slip so I asked him, ‘If you want me to sleep with you, who are you making the hero sleep with?’ He was stunned. I immediately informed others of his behaviour & they asked him to leave the project. All it took was one minute of being fearless–that day, I didn’t just stand up for me... I stood up for every woman who’s been objectified & judged for simply being who she is; for simply being ambitious. Why should the archaic rules of society & today's so-called modern world stop me? My clothes don’t define me–my talent does, my hard work does, my success does & I think it’s high time, people realise that.” ----- HoB with #FlipOnErosNow brings to you stories of people who have dealt with uncertainties and insecurities that life throws your way and have emerged triumphant A post shared by Humans of Bombay (@officialhumansofbombay) on Apr 4, 2019 at 5:28am PDT -
అతని కాలర్ పట్టుకుని ముఖం పచ్చడయ్యేలా కొట్టా..
సినిమా: అది అబద్దం కాదు..కానీ అంటోంది నటి కాజల్‌అగర్వాల్. ఇంతకీ ఈ బ్యూటీ చెప్పొచ్చేదేమై ఉంటుందనేగా మీ ఆసక్తి. 50 చిత్రాలు చేసిన తరువాత కొలీవుడ్లో ఒక లక్కీ అవకాశం ఈ అమ్మడిని వరించింది. అదే స్టార్ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమలహాసన్‌తో జత కట్టే అవకాశం. సాధారణంగా శంకర్ చిత్రాల్లో కథానాయికలకు నటనకు మంచి అవకాశం ఉంటుంది. తాజాగా ఇండియన్–2 చిత్రంలో కాజల్ అగర్వాల్‌కు అలాంటి పాత్రనేనట. ఇది చెప్పుకుని ఈ బ్యూటీ తెగ సంబరపడపోతోంది. మరోపక్క హిందీ చిత్రం క్వీన్‌కు రీమేక్‌గా తెరకెక్కిన ప్యారిస్ ప్యారిస్స్ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి సిద్ధం అవుతోంది. ఇది హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రం అన్న విషయం తెలిసిందే. దీంతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న కాజల్ చూడడానికి చాలా సాఫ్ట్‌గా ఉన్నా, కోపం వస్తే కాళికగా మారిపోతుందట. ఈ విషయాన్ని ఇటీవల ఒక భేటీలో తనే చెప్పింది. తాను కథానాయకిగా పరిచయమై దశాబ్దం దాటిందని చెప్పింది. తాను ఉత్తరాదికి చెందిన యువతిని అయినా, ఇక్కడ తమిళ అమ్మాయిగానే చూస్తున్నారని, ఇది చెప్పడానికే చాలా సంతోషంగా ఉందని అంది. ఇకపోతే తన మార్కెట్ పడిపోతుందని తానెప్పుడూ భయపడలేదని చెప్పింది. అందుకు కారణం వరుసగా అవకాశాలు తనను వెతుక్కుంటూ వస్తూనే ఉన్నాయని చెప్పింది. అందుకే ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవాలనే ఆలోచనను పక్కన పెట్టేశానని తెలిపింది. ప్రేమ వివాహమా? పెద్దలు కుదిరిచ్చిన వివాహం చేసుకుంటారా అని చాలా మంది అడుగుతున్నారని, తనకు నచ్చిన వాడు తారసపడితే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని, లేని పక్షంలో పెద్దలు నిర్ణయించిన పెళ్లే చేసుకుంటానని చెప్పింది. ఇప్పుటి వరకూ మంచి చిత్రాలు చేస్తున్నానని అంది. మరో విషయం ఏమిటంటే తాను చాలా ధైర్యవంతురాలినని, తనను ఎలా కాపాడుకోవాలో తనకు తెలుసునని చెప్పింది. తనకు కోపం వస్తే కాళికగా మారిపోతానని పేర్కొంది. ఇక సారి తన స్నేహితురాలిని ఒక వ్యక్తి వేధింపులకు గురి చేశాడని,అప్పుడు తాను అతని చొక్కా కాలర్ పట్టుకుని ముఖం పచ్చడయ్యేలా కొట్టానని చెప్పింది. ఇకపోతే అవకాశాల కోసం పడకగదికి పిలుస్తున్నారని కొందరు చెబుతున్నారని, అంది అబద్ధం కాదని అంది.అయితే అలాంటి సంఘటనలను తానెప్పుడూ ఎదుర్కోలేదని కాజల్‌అగర్వాల్ అంది. అదే విధంగా అన్ని రంగాల్లోనూ చెడ్డవాళ్లు ఉంటారని అంటోంది అమ్మడు. -
నేనే రాణి.. నేనే మంత్రి
నా లైన్ నాదే. నా లైఫ్ నాదే. ‘ఇండస్ట్రీలో అలా ఉంటుంది కదా.. ఇలా ఉంటుంది కదా’ అంటే.. ఎలాగున్నా.. మనం మనలా ఉండగలిగితే మన వరకు ఇబ్బందులు రావు. అంటే.. మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోగలగాలి. అందరికీ అది చేత కాకపోవచ్చు. నా వరకైతే, నేనే రాణి. నేనే మంత్రి! అంటున్న కాజల్ అగర్వాల్‌తో సాక్షి ఎక్స్‌క్లూజివ్.. చాలా సన్నగా అయిపోయారు. ఏం చేశారేంటి? కాజల్: అవునా? చూడ్డానికి సన్నగా కనిపిస్తున్నానేమో కానీ యాక్చువల్లీ నేను బరువు పెరిగాను. విచిత్రంగా చాలామంది నన్ను సన్నగా అయ్యారేంటి? అని అడుగుతున్నారు. ఇంతకీ ఎంత పెరిగారు? తగ్గాలనుకుంటున్నారా? ఇంతకుముందు 54 ఉండేదాన్ని.. 3 కిలోలు పెరిగినట్టున్నా. అయితే తగ్గాలని మాత్రం అనుకోవడంలేదు. ఎందుకంటే కంఫర్ట్‌బుల్‌గానే ఉన్నాను (నవ్వుతూ). గతంలో వంద సూర్య నమస్కరాలు చేసేవారు? ఇప్పుడూ చేస్తున్నారా? లేదు. దిష్టి తగిలినట్టుంది (నవ్వుతూ). మళ్లీ స్టార్ట్ చేస్తాను. హీరోయిన్ అయి పదేళ్లవుతోంది? ఈ టెన్ ఇయర్స్ జర్నీ ఎలా అనిపిస్తోంది? చాలా బాగుంది. పదేళ్లు గడిచాయి అని మాత్రం అనిపించడం లేదు. గ్రేట్ రన్. నేను చాలా ‘బ్లెస్డ్’ అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ నాకు ఇంత ప్రేమ దొరుకుతుందని అనుకోలేదు. నన్ను తెలుగుమ్మాయిగా స్వీకరించిన నా ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు. అఫ్కోర్స్ అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలను మరచిపోకూడదు. ఈ పదేళ్లలో ఎప్పుడైనా బ్రేక్ వస్తుందని భయపడిన సందర్భాలున్నాయా? ఆ భయం ఎప్పుడూ కలగలేదు. ఎందుకంటే ఒక సినిమా కంప్లీట్ అయ్యేసరికి ఇంకో సినిమా చేతిలో ఉండేది. ఒక్కోసారి రెండు మూడు సినిమాలు ఉండేవి. అయితే రెండే రెండు సార్లు బ్రేక్ వచ్చింది. అవి కూడా నా అంతట నేను తీసుకున్నవి. నా చెల్లెలు నిషా పెళ్లి కోసం ఒక బ్రేక్ తీసుకున్నాను. అక్కగా అన్నీ దగ్గరుండి చేయాలి కాబట్టి నెల రోజులు షూటింగ్స్‌కి ఎటెండ్ కాలేదు. ఆ తర్వాత 2018 స్టార్టింగ్‌లో ఆరోగ్యం బాగాలేక మూడు నెలలు ఇంటిపట్టున ఉన్నాను. పదేళ్లు కంటిన్యూస్‌గా పని చేసి, ఏదో అలా రిలాక్స్ అవ్వడానికి కొన్ని రోజులంటే ఓకే. ఏకంగా మూడు నెలలంటే బోరింగ్‌గా అనిపించిందా? బోర్ సంగతి పక్కన పెడితే ప్రతి రోజూ జ్వరంతో ఒళ్లు కాలిపోయేది. ‘హెల్త్ ఈజ్ వెల్త్’ అంటారు కదా. ఆరోగ్యంగా ఉండటం లైఫ్‌లో అన్నింటికన్నా ముఖ్యం. అందుకే ఫుల్‌గా రిలాక్స్ అవ్వాలని ఏ టెన్షన్సూ పెట్టుకోలేదు. ఈ మూడు నెలలు ‘ఆటో ఇమ్యూన్ డిజార్డర్’తో బాధపడ్డా. మూడు నెలలూ మీవాళ్లు మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుని ఉంటారు... మా అమ్మానాన్నలకు పిల్లలంటే చాలా శ్రద్ధ. నేను సినిమాల్లోకి వచ్చాక నాతో పాటే ఉంటూ, నాక్కావాల్సినవన్నీ సమకూర్చేవారు. అమ్మ అయితే స్వయంగా వంట చేసి పెట్టేది. ఇప్పుడు అమ్మని షూటింగ్ స్పాట్‌కి రావద్దని నేనే చెప్పేశాను. ఎందుకంటే ఇంకా ఎంతకాలం నాకోసం కష్టపడతారు. ఇది విశ్రాంతి తీసుకునే వయసు కదా. అమ్మ నాతో రావడంలేదు కాబట్టి నేను హోమ్ ఫుడ్‌ని చాలా మిస్సవుతున్నాను. అందుకే ఇంట్లో ఉన్న ఆ 3 నెలలూ మా అమ్మమ్మ, అమ్మ నెయ్యి విపరీతంగా దట్టించి, పరాటాలు చేసి పెట్టేశారు. పంజాబీ ఇల్లంటే స్వీట్లు, నెయ్యి, పన్నీర్ ఫుల్లుగా ఉంటాయి. అందుకే కాస్త బరువు పెరిగాను. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లయింది కాబట్టి బోలెడంతమంది ఫ్రెండ్స్, పార్టీలు కామన్. కానీ మీరు పార్టీల్లో పెద్దగా కనిపించరెందుకని? నా ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుంటాను. వాళ్లంతా ముంబైలో ఉంటారు. ఇండస్ట్రీలో కూడా ఏదైనా పార్టీ ఉంటే ఫార్మాలిటీగా అటెండ్ అవుతాను. పర్సనల్, ప్రొఫెషనల్ జీవితాన్ని మిక్స్ చేయకూడదని అనుకుంటాను. నా చైల్డ్ హుడ్ ఫ్రెండ్స్‌తో కంఫర్ట్‌బుల్‌గా ఉంటుంది. స్విచ్చాన్ స్విచ్చాఫ్ బటన్లాగా. వర్క్ అప్పుడు పార్టీలు చేసుకోలేను. ఎందుకంటే మళ్లీ మరుసటిరోజు నిద్ర లేవాలి. జిమ్‌కి వెళ్లాలి. షూట్‌కి వెళ్లాలి. ఇన్ని పనులు చేశాక ఎప్పుడెప్పుడు ముసుగు తన్నేద్దామా అనిపిస్తుంటుంది. ఇక పార్టీ అనే ఆలోచన ఉంటుందా? టీవీ చూస్తుంటాను. ఇంట్లో వాళ్లతో ఫోన్లో మాట్లాడతాను. అయితే జనరల్‌గా మీ రోజు ఎలా మొదలవుతుంది? ఉదయం ఐదు గంటలకు నిద్రలేస్తాను. అలారంతో పని లేదు. కొన్నేళ్లుగా ఐదింటికి నిద్రలేస్తున్నాను కాబట్టి శరీరం అలవాటు పడిపోయింది. అయితే షూటింగ్స్ లేనప్పుడు ఎక్కువసేపు నిద్రపోతా. రాత్రి నిద్రపోవడానికి దాదాపు పదకొండు అవుతుంది. 5 టు 11 వర్కవుట్స్, షూటింగులు. షూటింగులు లేకపోతే వేరే పనులు.. అలా బిజీబిజీ. ఈ మధ్య కొందరు హీరోయిన్లు పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ‘ఇది పెళిళ్ల్ల సీజన్. నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది’ అని ఓ సందర్భంలో అన్నారు. మరి పెళ్లెప్పుడు? ఏదో సరదాగా జోక్ చేశాను. అంతేకానీ ఇప్పటికిప్పుడు పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వాలని లేదు. లవ్ మ్యారేజా? అరేంజ్డ్ మ్యారేజా? లవ్ అంటే లవ్ అనలేను. నచ్చిన అబ్బాయి దొరికితే ఓకే. లేకపోతే అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా. ఇండస్ట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకోవడంలేదు. ఇండస్ట్రీలో వాళ్లను చేసుకోకూడదని ఎందుకు అనుకుంటున్నారు? అలా అని కాదు. ఒకవేళ ఎవరైనా నచ్చితే తప్పకుండా చేసుకుంటా. ఇండస్ట్రీలో అందరూ నాకు తెలుసు. అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. వాళ్లలో నాకు లైఫ్ పార్టనర్ కనిపించలేదు. అందుకే ఇండస్ట్రీ నుంచి ఎవర్నీ పెళ్లాడను అన్నాను. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోయే ముందు ఇది సాధించాలి, అది సాధించాలి అని పెట్టుకున్న లిస్ట్ అంతా ఫినిష్ చేసేశారా? రాసుకున్న లిస్ట్ అంటూ ఏదీ లేదు. మైండ్‌లోనే క్వాలిటీ సినిమాలు చేయాలనుకున్నాను. కెరీర్లో చెప్పుకోవడానికి ఓ 5 సినిమాలుంటే చాలనుకున్నా. ఆ సినిమాల గురించి ఎప్పుడు అనుకున్నా గర్వంగా అనిపించాలి. ‘మగధీర, నేనే రాజు నేనే మంత్రి, మిస్టర్ పర్ఫెక్ట్, వివేగమ్ (తమిళం), అ!’ సినిమాలు నాకు బాగా ఇష్టం. ‘అ!’లో నాది చిన్న రోల్ కానీ చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు తేజాగారితో ఓ సినిమా చేస్తున్నాను. అందులో నాది అద్భుతమైన పాత్ర. నేను గర్వంగా చెప్పుకునే సినిమాలలో ఇది కూడా ఉంటుంది. హిస్టారికల్ సినిమాలో నటించాలనుందా? ఉంటే.. ఎలాంటి పాత్ర? ఇండియన్ హిస్టరీ గురించి తెలుసుకోవాల్సింది చాలా ఉంది. నాకు ఝాన్సీ లక్ష్మీభాయ్ అంటే ఇష్టం. ఆమె భయం లేని గుణం, ఆత్మవిశ్వాసం గురించి మనందరం చదువుకున్నాం. స్క్రీన్ మీద ఆవిడ పాత్ర చేయాలని ఉంది. ఝాన్సీ లక్ష్మీభాయ్ లక్షణాల్లో మీకున్నవి? ఆవిడ అంత ధైర్యం లేకపోయినా కొంతవరకూ ధైర్యవంతురాలినే. కొన్నిసార్లు లక్ష్మీభాయ్ అవ్వాల్సి వస్తుంది కూడా. ఇక ఆ సమయంలో చుట్టు పక్కలవారి గురించి, పరిసరాల గురించి పట్టించుకోను కూడా. కొన్నిసార్లు సౌమ్యంగా, కొన్నిసార్లు సింహంలా, కాళీ మాతలా మారాల్సి ఉంటుంది. కాళీలా మారిన సందర్భం ఏదైనా గుర్తుందా? మా ఫ్రెండ్‌తో ఒక అబ్బాయి తప్పుగా ప్రవర్తించాడని రోడ్డు మీద కాలర్ పట్టుకుని ముఖం వాచిపోయేలా కొట్టాను. అది ప్లస్ టు చదువుతున్నప్పుడు అనుకుంటా. మేం ఉండే ఏరియాలో రాత్రి ఎనిమిదింటికి ఫ్రెండ్స్ అందరం సరదాగా మాట్లాడుకుంటూ ఉండగా, ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నా ఫ్రెండ్‌తో తప్పుగా ప్రవర్తించాడు. అప్పుడు మా గ్యాంగ్‌లో ఒక అబ్బాయి కూడా ఉన్నాడు. వాడు పారిపోయాడు. నాకు చాలా చిరాకు, కోపం వచ్చేశాయి. ఆకతాయి ఒంటి మీద ఒక్కటిచ్చి కళ్లు కనిపించడం లేదా? అన్నాను. ఆ తర్వాత ఇంటికెళితే మా నాన్నగారు అలా కొట్టకూడదు అన్నారు. సినిమాల్లోకి వచ్చాక చేదు అనుభవాలేవైనా? లేవు. కానీ కొందరు హీరోయిన్లు ‘క్యాస్టింగ్ కౌచ్’ అంటూ తమను వేధించారని పలువురు ప్రముఖుల పేర్లు బయటపెట్టారు కదా? క్యాస్టింగ్ కౌచ్ అస్సలు లేదు అనను. బయటకు వచ్చి చెబుతున్న వాళ్లందరి బాధ వింటున్నాం. వాళ్లు అబద్ధాలు చెప్పరు కదా. అయితే నాకు అలాంటి అనుభవం ఏదీ లేదంటున్నాను. ప్రతి ఒక్కరి ప్రయాణం వేరే కదా. నాకు మా ఫ్యామిలీ సపోర్ట్ ఉండేది. చాలా ఏళ్లు మా అమ్మగారు నాతోనే ఉన్నారు. నావరకూ చేదు అనుభవం ఒక్కటి కూడా లేదు. అయితే నాకేం కాలేదని ఆనందపడిపోకూడదు. ఆడవాళ్లు హాయిగా పని చేసుకునే వాతావరణం ఒక్క సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. అన్ని రంగాల్లోనూ ఉండాలి. ఎందుకంటే ప్రపంచంలో దారుణమైన మనుషులు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. అందుకే ‘నాతో పెట్టుకోవద్దు’ అనే సంకే తాలను పంపిస్తా. బహుశా నా జోలికి ఎవరూ రాకపోవడానికి అది కూడా ఓ కారణం అయ్యుండొచ్చు. నటి తనుశ్రీ దత్తాను తీసుకుందాం.. ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన హెరాస్మెంట్ ఇప్పుడు చెప్పారామె. నిజం చెప్పడానికి పదేళ్లు అవసరమా? ఏం చేస్తారో అని భయం. ఏ వ్యక్తికైనా కెరీర్ అంటే ఓ భయం ఉంటుంది. ఎవరైనా నష్టం చేస్తారనే భయంతో మాట్లాడలేరు. భయం లేకుండా చెప్పే ధైర్యం మీకుందా? ఓ. సపోజ్ నాకు ఏదైనా కాస్ట్యూమ్ ఇబ్బందిగా అనిపిస్తే చెప్పేదాన్ని. ఇది నాకు కంఫర్ట్‌బుల్‌గా ఉండదు.. వేసుకోలేను అని కరాఖండిగా చెప్పిన రోజులున్నాయి. అయితే ఇప్పుడు ఇంత అనుభవం సంపాదించుకున్న తర్వాత కాదు.. కెరీర్ స్టార్టింగ్ లోనే అలానే ఉండేదాన్ని. అవకాశాలు తగ్గిపోతాయని భయపడలేదా? లేదు. అలా తెగువ చూపించడమే నన్ను సేవ్ చేసిందని భావిస్తాను. కోల్పోయేవాటి గురించి అసలు కేర్ చేయను. ఎలా రాసుందో అలా జరుగుద్ది అనుకుంటాను. ఒకవేళ అవకాశాలు కోల్పోయుంటే ధైర్యం... (మధ్యలో అందుకుంటూ) చాలా సినిమాలు మిస్ అయ్యాను. అవి పెద్ద పెద్ద సినిమాలు. వదులుకోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. కానీ నేను సంతోషంగా ఉన్నాను. మనం తీసుకున్న చాయిస్‌ల వల్ల మనం హ్యాపీగా ఉండాలని నమ్ముతాను. వేరేవాళ్ల సంతోషం కోసం నేను బతకడంలేదు కదా. కొన్నిసార్లు పాత్ర స్వభావానికి, మీ పర్సనల్ అభిప్రాయాలకు తేడా వస్తే చేసేవారా? లేదా దర్శకుడితో డిస్కస్ చేసేవారా? ఈ మధ్య కాలంలో డిస్కషన్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే కెరీర్ స్టార్టింగ్‌లో క్యారెక్టర్స్ విషయంలో నాలెడ్జ్ లేదు. ఇప్పుడు ఏదైనా నచ్చకపోయినా, స్త్రీలను కొంచెం తక్కువగా, అసభ్యకరంగా చూపించడానికి ట్రై చేసినా నేను చేయనని చెప్పేస్తా. మార్చండి అని అడుగుతా. వీటిని ఎంకరేజ్ చేయను. కెమెరా యాంగిల్స్ మీద కూడా పూర్తి అవగాహన వచ్చే ఉంటుంది కదా? ఇప్పుడు వచ్చేసింది. కెరీర్ స్టార్టింగ్‌లో ఏం తెలుస్తుంది? ఇప్పుడు ఇబ్బందికరంగా ఉన్నా, నాకు నేను స్క్రీన్ మీద ఈ యాంగిల్లో బాగా కనిపించను అనిపించినా ఆ ఫ్రేమ్ మార్చండి అని అడుగుతాను. మీరు పని చేసిన దర్శకుల్లో మీకు చాలెంజింగ్ అనిపించింది ఎవరు? ఒక్కళ్లు అని చెప్పలేను. ఒక్కొక్కరిదీ ఒక్కో స్టైల్. ఇంత మంది దర్శకులతో కలసి పనిచేయడం అదృష్టం అని భావిస్తాను. చాలా నేర్చుకున్నాను. కొత్త దర్శకుడు అయినా స్టార్ డైరెక్టర్ అయినా కూడా నాకేదోటి నేర్పిస్తూనే ఉన్నారు. అది నా కెరీర్‌కు చాలా హెల్ప్ అవుతుంది. ఫైనల్లీ.. మీ పదేళ్ల కెరీర్‌ని ఒక పదంలో పెట్టమంటే? నేర్చుకుంటున్నాను. – డి.జి. భవాని -
ఐయామ్ లక్కీ
కెరీర్ తొలి దశలో క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదుర్కొన్నామంటూ చాలామంది నటీమణులు తమ అనుభవాలను షేర్ చేసుకున్నారు. తాజాగా ఓ ఈవెంట్లో ‘క్యాస్టింగ్ కౌచ్’ గురించి మాట్లాడారు తాప్సీ. ‘‘నా తొలి తెలుగు, హిందీ, తమిళం చిత్రాలు సక్సెస్ సాధించాయి. దాంతో ఆఫర్స్ కోసం ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం రాలేదు. క్యాస్టింగ్ కౌచ్ లాంటి అనుభవాలు నేను ఎదుర్కోలేదు. ఆ విధంగా నేను చాలా అదృష్టవంతురాలిని. కానీ, కొన్ని భయంకరమైన కథనాలు విన్నాను. నాకెలాంటి చెడు అనుభవాలు ఎదురు కాలేదని అలాంటివి జరగవనుకోవడం పొరపాటు. స్త్రీ, పురుష సమానత్వం లేకపోవడం, పవర్‌ని దుర్వినియోగం చేయడం వల్లే ఇలాంటి సమస్యలు తలెత్తుతాయి. కానీ, క్యాస్టింగ్ గురించి బయటకు వచ్చి అందరూ మాట్లాడటం మొదలుపెట్టాక మార్పు తెలుస్తోంది. ఇవాళ సినిమా సెట్స్‌లో పురుషుల ప్రవర్తన చాలా మారింది. జాగ్రత్తగా ఉంటున్నారు. మేం పబ్లిక్ పర్సనాల్టీ కాబట్టి, సినిమా ఇండస్ట్రీ మీద అందరికీ ఆసక్తి ఉంటుంది కాబట్టి మా గురించి రాస్తారు. అయితే ఇలాంటి సంఘటనలు సినిమా ఇండస్ట్రీలోనే జరుగుతాయనుకోకూడదు. ప్రతి చోటా జరుగుతుంటాయి’’ అని పేర్కొన్నారు తాప్సీ. -
అడ్జస్ట్ అయితేనే చాన్స్ ఇస్తామన్నారు!
‘‘ఇండస్ట్రీలో అడ్జస్ట్మెంట్ (క్యాస్టింగ్ కౌచ్) అనే దానికి ఒప్పుకోనందువల్లే దాదాపు ఎనిమిది నెలలు పనిని కోల్పోయాను’’ అంటూ ‘మీటూ’ ఉద్యమం గురించి మాట్లాడుతూ అదితీరావ్ హైదరీ తనకెదరైన అనుభవాన్ని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఓ సదస్సులో ‘మీటూ’ గురించి అదితీరావ్ హైదరీ మాట్లాడుతూ – ‘‘నేను కెరీర్ స్టార్ట్ చేసిన కొత్తలో అమాయకంగా ఉండేదాన్ని. నా ఫ్యామిలీ నన్ను చాలా జాగ్రత్తగా పెంచారు. ఇండస్ట్రీలో ఇలాంటి విషయాలు జరుగుతాయని నమ్మేదాన్ని కాదు. నిజాయితీగా చెప్పాలంటే నాకన్ని చేదు అనుభవాలు కూడా ఇక్కడ ఎదురవ్వలేదు. ఒక్క సంఘటన జరిగింది. అది నాకు అంతగా హాని చేయలేదు కానీ కొంచెం డిస్ట్రబ్ చేసింది. ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించి.. అడ్జస్ట్ అయితేనే చాన్స్ ఇస్తాం అని చాయిస్ ఇచ్చారు. దాని గురించి నేను పెద్దగా ఆలోచించకుండానే చాలా సింపుల్‌గా ఆ ప్రాజెక్ట్ నుంచి బయటకు వచ్చేశాను. అలా ఓ ఎనిమిది నెలలు పని కోల్పోయాను. దాంతో అప్సెట్ అయ్యాను. ఇక కొత్త సినిమాలేవి చేయలేనా? అనే ఆలోచనల్లో పడిపోయాను. నా టీమ్, నా మేనేజర్ అంతా కలసి నెగటీవ్ ఆలోచనల నుంచి నన్ను బయటకు తీసుకువచ్చారు. అలాగే లైంగిక వేధింపులకు గురైనవారిని కచ్చితంగా ఏదోటి మాట్లాడాలని ఒత్తిడికి గురి చేయకూడదు. వాళ్లు మాట్లడటానికి సిద్ధంగా ఉన్నారనుకున్నప్పుడే మాట్లాడమనాలి. ఎవరైనా తమ అనుభవాన్ని బయటకు చెప్పకపోతే నోరు నొక్కేసారు, అమ్ముడుపోయారు అని కొందరు ప్రచారం చేస్తారు. మాట్లాడకపోతే ‘మీటూ’ ఉద్యమాన్ని మీరు వదిలేసినట్టే.. మాట్లాడండి అని కొందరు కండీషన్స్లు పెడుతుంటారు. అది తప్పు. ప్రతి ఒక్కరూ వాళ్ళు ఏదైనా పని చేయాలనుకున్నప్పుడు, అది కరెక్ట్ అని అనిపించినప్పుడు చేయడమే నిజమైన సాధికారత అని నేను భావిస్తాను’’ అని పేర్కొన్నారు. -
సినీ అవకాశాల పేరుతో వ్యభిచారం
తమిళనాడు, పెరంబూరు: చెన్నైలో తాజాగా మరో కాస్టింగ్‌కౌచ్ వ్యవహారం వెలుగులోకి వచ్చి కలకలం సృష్టిస్తోంది. సినిమా అవకాశాల పేరుతో అమ్మాయిలతో కామవాంఛ తీర్చుకోవడం, వ్యభిచారంలోకి దింపడం వంటి చర్యలకు పాల్పడుతున్న వ్యకి గుట్టును ఒక మహిళ బయట పెట్టింది. కాస్టింగ్ కౌచ్ అంటూ నటి శ్రీరెడ్డి టాలీవుడ్, కోలీవుడ్‌లో ప్రకంపనలు పుట్టించిన విషయం తెలిసిందే. ఆ తరువాత పలువురు ప్రముఖ కథానాయికలు తామూ అలాంటి సంఘటనలను ఎదుర్కొన్నామని బహిరంగ ఇంటర్వ్యూల్లోనూ, సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించిన విషయం తెలి సిందే. తాజాగా మీటూ అంటూ లైంగిక వేధిం పుల ఫిర్యాదులు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో చెన్నైకి చెందిన ఒక యువతి మోహన్ అనే సినీ కాస్టింగ్ డైరెక్టర్ అవకాశాల ఆశ చూపి అనేక మంది మహిళలను వ్యభిచారంలో దింపుతున్నాడని ఆరోపించింది. తానూ అమ్మాయిలతో రాసలీలలు నడుపుతున్నాడని, ఈ విషయాన్ని బయట పెడితే తనతో గడిపిన రాసలీలల దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేస్తానని బెదిరిస్తున్నాడని చెప్పింది. మోహన్ అవకాశాల పేరుతో అమ్మాయిలను వా డుకుంటున్న ఆధారాలు తన వద్ద ఉన్నాయని తన ఫేస్బుక్లో పేర్కొంది. ఈ వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పింది. అయితే ప్రస్తుతం తన పేరును రక్షణ దృష్ట్యా బయటకు చెప్పలేనని, తన వద్ద ఉన్న మోహన్ రాసక్రీడల దృశ్యాలను ఇప్పటికే తన ఫేస్బుక్లో పోస్ట్ చేశానని పేర్కొంది. ఆమె పోస్ట్ చేసిన మోహన్ రాసలీలల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
అవును.. ఉంది!
అవును ఉంది. అసమానత ఉంది. వేధింపు ఉంది. సాధింపు ఉంది. దోపిడీ ఉంది. క్యాస్టింగ్ కౌచ్ కూడా ఉంది. అప్పుడూ ఉంది. ఇప్పుడూ ఉంది. నిర్భయంగా బయటికొచ్చి మాట్లాడితేనే.. వీటన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది. ఇప్పటివాళ్లు అదే చేస్తున్నారు. తప్పు చెయ్యడానికీ.. తప్పుడు ఆలోచనలు చెయ్యడానికీ భయపడేలా.. ఆత్మగౌరవం ప్రదర్శిస్తున్నారు. ‘ఇది మంచి పరిణామం..’ అంటున్నారు శరత్‌కుమార్ కూతురు వరలక్ష్మి. ఈ యంగ్ అండ్ డైనమిక్ తమిళ స్టార్.. ‘సాక్షి’తో చాలా బోల్డ్‌గా.. పర్సనల్ విషయాలు షేర్ చేసుకున్నారు. చదవండి. ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ. ఈ ఏడాది సుమారు ఆరు సినిమాల్లో కనిపించారు. ఎలా మ్యానేజ్ చేస్తున్నారు? రిలీజ్ సంగతి నిర్మాతలు చూసుకుంటారు. మనం మ్యానేజ్ చేసేది ఏం ఉండదు. నాకు నచ్చిన సినిమాల్లో కనిపిస్తున్నాను. ఒకే ఏడాది ఇన్ని సినిమాల్లో భాగమైనందుకు హ్యాపీగా ఉన్నాను. హీరోయిన్ అంటే సన్నగా, నాజూకుగా ఉండాలనేది ఇప్పటి ట్రెండ్. మీరు కొంచెం బొద్దుగా, టామ్‌బాయ్‌లా ఉంటారు. తగ్గాలని అనుకున్నారా? నేను హీరోయిన్ క్యాటగిరీలోనే ఉండాలనుకోను (నవ్వుతూ). అలాగే హీరోయిన్స్ అంటే సన్నగానే ఉండాలి అనే విషయాన్ని కూడా నమ్మను. ఒకప్పుడు బొద్దుగా ఉన్న హీరోయిన్సే సౌత్‌లో టాప్‌గా నిలిచారు. ఆ తర్వాతి తరంలో విద్యాబాలన్, అనుష్క బ్రిలియంట్ యాక్టర్స్. ముందు మనందరం బాడీ షేమింగ్ ఆపేయాలి. నువ్వు సన్నగా ఉండాలి, బరువు తగ్గాలి అని నాకెవరైనా సలహా ఇస్తే ‘నువ్వేమైనా నా బరువు మోస్తున్నావా?’ అన్నట్టుగా సమాధానం ఇస్తాను. నేనేం తింటే నీకేంటి? అన్నట్లుగా మాట్లాడతాను. ఆరోగ్యంగా ఉన్నానా లేదా అన్నదే నాకు ముఖ్యం. ఒకవేళ ఒక అద్భుతమైన స్క్రిప్ట్ మిమ్మల్ని బరువు తగ్గాలని డిమాండ్ చేస్తే? తగ్గుతా. సినిమా కోసం చేయడం వేరు. ‘మాస్టర్ పీస్’ అనే మలయాళ సినిమాలో పోలీసాఫీసర్ పాత్ర చేశాను. పోలీస్ యూనిఫామ్ అంటే ఫిట్‌గా ఉండాలి. దర్శకుడు అడిగారని కాదు.. నాకే అనిపించి తగ్గాను. తమిళ సినిమా ‘తారై తప్పటై్ట’ కోసం దర్శకుడు బాలా సార్ నన్ను బరువు పెరగమన్నారు. ఎందుకంటే అందులో నేను కరకాట్టమ్ డ్యాన్సర్‌గా చేయాలి. వాళ్లు లావుగా ఉంటారు. ఆ క్యారెక్టర్‌కి బరువు పెరగడం అవసరం అనిపించింది, పెరిగాను. యాక్చువల్లీ ‘బాడీ షేమింగ్’ అనేది మనం తీసుకొచ్చింది. ఎవరు ఎలా ఉండాలో మ్యాగజీన్స్, సోషల్ మీడియా నిర్ణయిస్తున్నట్టుంది. హీరోయిన్ ఎలా ఉండాలి? అనేది కూడా బయటివాళ్లే డిసైడ్ చేసేస్తారు. మ్యాగజీన్లో చూపించినట్టుగా ఏ హీరోయిన్ కూడా నిద్ర లేచినప్పుడు ఫ్రెష్‌గా ఉండదు. అందరిలానే పొద్దునే చెదిరిన జుట్టుతో నిద్రకళ్లతో ఉంటారు (నవ్వుతూ). ఎవరైనా హీరోయిన్లా ఉండాలని ఎందుకనుకోవాలి? మీరు మీలా ఉండండి. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉంటే అదే అందం. ఎవరైనా అందంగా ఉంటే అభినందించండి. కానీ వేరే వాళ్లను కూడా వాళ్లలా ఉండమని పోలికలు పెట్టి, వాళ్ల కాన్ఫిడెన్స్ తగ్గించకండి. ఇలా ఏది అనుకుంటే అది చెప్పేస్తారు కాబట్టే ఏడాది క్రితమే ‘మీటూ’ లాంటి ఇష్యూ గురించి మాట్లాడారు. కానీ అప్పుడు చాలామంది బయటకు రాలేదు. ఎందుకు? భయం అయ్యుండొచ్చు. మీకెందుకు భయం లేదంటారు? మీ వెనక మీ నాన్న (నటుడు శరత్‌కుమార్) ఉన్నారనే ధైర్యమా? బ్యాగ్రౌండ్ ఉపయోగించుకోకుండా సొంతంగా నిలబడాలనుకునే స్వభావం నాది. నేనేదైనా చేయాలనుకున్నప్పుడు నాన్నగారికి చెప్పను. అన్నీ చేసేసిన తర్వాత ఆయనకు తెలుస్తుంది (నవ్వుతూ). అరే.. ఇలా చేస్తున్నా అని నాకు చెప్పలేదే అంటుంటారు. నేను ఇండిపెండెంట్ పర్సన్‌ని. భయం లేదు. పరిస్థితులను ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. ఒకవేళ చిక్కుకున్నా అందులో నుంచి ఎలా బయటకు రావాలో కూడా తెలుసు. స్టార్ కిడ్స్ లైంగిక వేధింపులకు గురవ్వరని అనుకుంటుంటారు. అదెంత వరకూ నిజం? అస్సలు కాదు. నా విషయంలో జరిగింది కదా. ఓ టీవీ చానల్‌కి సంబంధించిన వ్యక్తి అందరి మధ్యలో నాతో బాగా మాట్లాడి, ఆ తర్వాత ‘మిగతా విషయాలు మనం బయట మాట్లాడుకుందాం’ అన్నాడు. ‘మిగతా విషయాలు’ అనే మాటలో చాలా అర్థం ఉంది. నేను స్టార్ కిడ్నే కదా. అయినా నాతో ‘కాంప్రమైజ్’ గురించి మాట్లాడాడంటే.. ఇంకెంత మంది దగ్గర ఇలా అడిగి ఉంటాడు? ఆ కోపంతోనే ఆ విషయం గురించి బయటకు వచ్చి మాట్లాడాను. మీరు స్త్రీవాది అనిపిస్తోంది. అయితే ఫెమినిజమ్ని కొంతమంది దుర్వినియోగం చేస్తున్నారు. అలాంటివారికి ఫెమినిజమ్ అంటే ఏంటి? అనేది చెబుతారా? స్త్రీలకు సమానత్వం ఇవ్వడం లేదు అనే దాంట్లో నుంచి పుట్టిందే ఫెమినిజం. మగవాళ్లలో కూడా చాలామంది ఫెమినిస్ట్‌లు ఉన్నారు. ఎందుకంటే వాళ్లు స్త్రీలను గౌరవిస్తారు కాబట్టి. దక్కాల్సిన హక్కుల కోసం పోరాడుతున్నవాళ్లను స్త్రీవాది అంటాం. మగవాళ్ల మీద లేనిపోని నిందలు వేయడం స్త్రీవాదం కాదు. సమానత్వం వచ్చే వరకూ ఫెమినిజం అనేది ఉంటుంది. హీరోయిన్, విలన్, స్పెషల్ రోల్స్.. ఇలా అన్నీ చేస్తున్నారు. ఒక సెట్ నుంచి మరో సినిమా సెట్‌కు వెళ్లేప్పుడు ఆ మూడ్ వేరియేషన్స్ ఎలా చూపించగలుగుతున్నారు? మీరు ఐటీ జాబ్ చేస్తున్నారు అనుకుందాం. రోజూ ఒకే మూడ్‌తో ఆఫీస్‌కు వెళ్లరు కదా. అయినా రోజూ చేసే పనిని పర్ఫెక్ట్గా చేయాలి. మా పని కూడా అంతే. సెట్ నుంచి సెట్‌కి మారుతుంటే కథ, పాత్ర, కాస్ట్యూమ్స్ మారొచ్చు కానీ అదే యాక్టింగ్. దర్శకుడు ఏం కావాలనుకుంటున్నారో తెలుసుకోగలిగితే మన పని సులువు అయిపోతుంది. (ఇటీవల రిలీజైన్ ‘సర్కార్’ , ‘పందెం కోడి–2’,చిత్రాల్లో... , రిలీజ్‌కు రెడీ అయిన ‘మారి–2’లో.. ) ఇంత బోల్డ్‌గా, ముక్కుసూటిగా ఉండే స్వభావం ఎక్కడి నుంచి వచ్చింది? మీ అమ్మగారా? నాన్నగారి దగ్గర్నుంచా? మా అమ్మ. ఆమే నా ధైర్యం. ఆవిడలో సగం ధైర్యవంతురాలిగా ఉన్నా కూడా నేను చాలా లక్కీ అనే అనుకుంటాను. నన్ను, నా చెల్లిని ఎలాంటి సపోర్ట్ లేకుండా తనొక్కతే పెంచింది. స్ట్రాంగ్ ఉమెన్. నా బలం ఆమె దగ్గర నుంచి వచ్చింది. అమ్మ ఎప్పుడైనా వేధింపులకు గురయ్యారా? అవి షేర్ చేసుకుని, మీకు ధైర్యం నూరిపోశారా? వేధింపులకు గురి కాలేదు. కానీ ఒకసారి ఎవరో దొంగతనానికి వస్తే ఒక్కతే అతన్ని ఎదుర్కొంది. ఫట్‌ఫట్‌మని చెంప దెబ్బలు ఇచ్చిందట. నిజం కోసం మా అమ్మగారు బలంగా నిలబడతారు. తన దగ్గరనుంచే నాకీ ధైర్యం వచ్చింది అనుకుంటాను. ఓకే.. యాక్టర్‌గా ఇంత బిజీలోనూ స్త్రీ సంక్షేమ కార్యక్రమాలతో యాక్టీవ్‌గా ఉంటారు. సమయాన్ని ఎలా కేటాయిస్తారు? ‘సేవ్ శక్తి’ అనే క్యాంపెయిన్ నడుపుతున్నాను. దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఎక్కువగా మా అమ్మగారు చూసుకుంటారు. గృహ హింసకు గురైనవారిని, లైంగిక వేధింపులకు గురైనవారిని కాపాడుతుంటాం. దానికి ఫండ్స్ రైజ్ చేస్తూ ఉంటాను నేను. ఒక స్త్రీ ఏదైనా చేదు అనుభవం ఎదుర్కొన్నప్పుడు ఆ విషయాన్ని బయటికి చెబితే ఆమెనే తప్పుబడుతూ కొందరు నిందిస్తారు. దీని గురించి ఏమంటారు? ఇది నేను చాలా చోట్ల చూశాను. అతను అలా హద్దులు మీరడానికి నువ్వే చాన్స్ ఇచ్చి ఉంటావనే అర్థంతో మాట్లాడతారు. కావాలని ఏ స్త్రీ అయినా చేదు అనుభవం కోరుకుంటుందా? ఆమెను నిందించి, నోరు నొక్కేయాలనుకోవడం సరి కాదు. నిందిస్తున్నారని భయపడి సైలెంట్ అయిపోవడమూ కరెక్ట్ కాదు. ఎవరేమన్నా నిర్భయంగా ఉండాలి.. పోరాడాలి. రచయిత వైరముత్తుని కొందరు నిర్భయంగా ఆరోపిస్తున్నారు. అసలు వైరముత్తు నిజంగా అలాంటి మనిషే అనుకుంటున్నారా? మన అభిప్రాయాలతో పని లేదు. రచయితగా ఆయన చాలా గొప్ప వ్యక్తి. ఆయన చేస్తున్న పనిలో కానీ ఆయన స్థాయిని కానీ ఎవ్వరం ప్రశ్నించడం లేదు. పర్సనల్ లైఫ్ గురించే ప్రశ్న. సెలిబ్రిటీ అయినంత మాత్రాన మంచి వ్యక్తి అయ్యుంటారని అనుకోలేం. అలాగే కామన్ మ్యాన్, పేదవాళ్లు అయినంత మాత్రాన చెడు వ్యక్తులు అనలేం. మనుషులు ఎలా అయినా ఉండచ్చు. చిన్మయి, మరికొందరు ఆరోపించినట్టుగా అందులో నిజం ఉంటే కచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సిందే. ‘మీటూ’ ఉద్యమం ప్రధమ లక్ష్యం ‘నేమ్ దెమ్.. షేమ్ దెమ్’ (పేరు బయటకు చెప్పి పరువు తీయడం). అప్పుడు భయం వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందంటారా? డెఫినెట్‌గా ఉంది. పాత తరం వాళ్లు కొందరు లొంగిపోవడం వల్లో, సినిమాల్లో ఇది భాగమేమో అనుకోవడంవల్లో, ఇలాంటి విషయాలు బయటకు చెప్పకూడదేమో అని భావించడం వల్లో క్యాస్టింగ్ కౌచ్ కంటిన్యూ అయిందేమో. సినిమాల విషయానికి వద్దాం. దివంగత నటి, తమిళ నాడు మాజీ సీఎం జయలలిత బయోపిక్‌లో చేస్తున్నారట? ఇంకా ఏదీ కన్ఫర్మ్ కాలేదు. అమ్మ రోల్ చేయాలని నాకూ ఉంది. ఆమె నా రోల్ మోడల్. భవిష్యత్తులో రాజకీయాల్లోకి ప్రవేశిస్తానన్నారు. పాలిటిక్స్‌ని డీల్ చేయడం సులువు కాదేమో? సినిమా ఇండస్ట్రీలో కూడా చాలామందిని డీల్ చేయాలి కదా. అలాగని నేను ఆగిపోలేదు. వచ్చాను, మార్చాను. రాజకీయాల్లోనూ అంతే. రాజకీయ నాయకురాలిగా మారి ఎటువంటి మార్పు తీసుకురావాలనుకుంటున్నారు? నా ముఖ్యోద్దేశం స్త్రీల హక్కుల కోసం నిలబడటమే. 50 శాతం ఓటు బ్యాంక్ స్త్రీలే అని గుర్తించరెందుకో అర్థం కాదు. ఒకవేళ స్త్రీ అనుకుంటే తన ఇంట్లో ఓట్లన్నీ తనకు కావాల్సిన వాళ్లకు వేయించగలదు. లేదంటే అన్నం పెట్టదు (నవ్వుతూ). వేరే రకం వాళ్లు కూడా ఉన్నారు. మా ఆయన ఎవరికి ఓటు వేస్తే నేనూ వాళ్లకే ఓటు వేయాలి అనుకునేవారు. అవన్నీ మారాలి. అలాంటి మార్పు తీసుకురావాలి అనుకుంటున్నాను. ప్రతి స్కూల్లో గుడ్ టచ్, బ్యాడ్ టచ్ తెలుసుకోవడానికి సెక్స్ ఎడ్యుకేషన్ క్లాస్ తప్పనిసరిగా ఉండేలా చేస్తాను. పీటీ (ఫిజికల్ ట్రైనింగ్) క్లాస్ బదులు సెల్ఫ్ డిఫెన్స్ క్లాస్ ఏర్పాటు చేస్తాను. ఇటీవల విశాల్‌తో మాట్లాడినప్పుడు ఆయన కూడా ఇలానే అన్నారు. ఈ సిమిలర్ ఐడియాలజీనే మిమ్మల్ని ఫ్రెండ్స్‌ని చేసిందా? మావల్ల ఏదో ఓ మంచి జరగాలని కోరుకునే మనస్తత్వం ఉన్నవాళ్లం. సొసైటీ మీద బాధ్యత ఉన్నవాళ్లం. దారి ఏదైనా ఇద్దరి ఆలోచనా తీరు ఒక్కటే. మా ఫ్రెండ్షిప్ ఇంత బలంగా ఉండటానికి అది కూడా ఒక కారణం అయ్యుండొచ్చు. వీ అండ్ వీ (విశాల్, వరలక్ష్మీ) రియల్ లైఫ్‌లో మంచి పెయిర్ అవుతుందని కోలీవుడ్‌లో టాక్ ఉంది? ఫ్రెండ్స్‌గా మేం మంచి జోడీ. మా మధ్యలో ఎటువంటి రొమాన్స్ లేదు. అయితే ఏదో ఉందని చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఒక అమ్మాయి అబ్బాయి క్లోజ్‌గా ఉన్నారంటే వాళ్ల మధ్య ఉన్నది రొమాన్సే.. ఇంకేం కాదు అని నిర్ణయానికి వచ్చేస్తారు. ఈ ధోరణి కూడా మారాలి. మేం డేటింగ్ చేసుకోవడంలేదు. ఫ్రెండ్స్‌గా చాలా హ్యాపీగా ఉన్నాం. ఒకసారి నటీనటుల సంఘం ఎలక్షన్స్ అప్పుడు మీ ఫాదర్ శరత్‌కుమార్, మీ బెస్ట్ ఫ్రెండ్ విశాల్ మధ్య పోటీ జరిగితే ఇబ్బందిపడ్డారా? అప్పుడు ప్రెస్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాను. మా నాన్నగారికే నేను సపోర్ట్ చేస్తున్నానని. విశాల్ ఎప్పటికీ బెస్ట్ ఫ్రెండే. కానీ నేను మా నాన్నగారినే సపోర్ట్ చేస్తాను. ఒకవేళ మీ ఫాదర్ సైడ్ తప్పు... మీ బెస్ట్ ఫ్రెండ్‌ది కరెక్ట్ అయితే అప్పుడు ఎవరివైపు నిలబడతారు? మా నాన్నగారు చేస్తుంది ఏదైనా తప్పు అనిపిస్తే ఆయనతో ధైర్యంగా చెప్పగలను. చాలా సార్లు చెప్పాను కూడా. తప్పును నిర్మొహమాటంగా నిలదీయాలని నేర్చుకున్నాను. నా సోషల్ మీడియాలో పోస్ట్‌లు క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్పు చేసినవాళ్లను బహిరంగంగా విమర్శించిన విషయం మీకు తెలుస్తుంది. నాన్నగారితో ఏదైనా ధైర్యంగా చెబుతానన్నారు. మరి.. ఆయన ఇంకో పెళ్లి (నటి రాధిక) చేసుకున్నారని ఎప్పుడైనా ఆగ్రహం వ్యక్తం చేశారా? కోపాన్ని మనసులోనే దాచుకునే టైప్ కాదు. అప్పుడే కోప్పడ్డాను. ఇద్దరు కలిసి ఉండలేకపోతే విడాకులు తీసుకోవడం ఇప్పుడు చాలా సాధారణం అయిపోయింది. కానీ అప్పట్లో చాలా తక్కువ. భార్య, భర్త ఆనందంగా ఉండలేనప్పుడు విడిపోవడమే నయం. కలిసి ఉండి కొట్టుకుంటుంటే అది పిల్లల్ని కష్టపెడుతుంది. మా అమ్మానాన్న విడివిడిగా ఉంటూ బెటర్ పేరెంట్స్ అయ్యారు. ఏది జరిగినా మంచికే అనే సిద్ధాంతాన్ని నమ్ముతాను. అప్పుడు అలా జరగబట్టే ఈ రోజు నేను ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నానని అనుకుంటున్నాను. మీ లైఫ్ పార్ట్నర్లో ఎలాంటి లక్షణాలు ఆశిస్తున్నారు? ఇంకా పుట్టలేదేమో (నవ్వుతూ). నచ్చే క్వాలిటీస్ అంటే.. తనని తాను సెక్యూర్డ్‌గా ఉంచుకోగలిగేవాడు. నా ఎదుగుదలను చూసి ఫీల్ అయ్యేవాడు నాకొద్దు. పెళ్లి ఎప్పుడు? పెళ్లి నా యాంబిషన్ కాదు. స్టేట్‌కి సీఎం అవ్వడం నా లక్ష్యం. మ్యారేజ్‌కి మీరు వ్యతిరేకమా? వ్యతిరేకం అని కాదు. పెళ్లి అనేది కచ్చితంగా చేసుకొని తీరాలి అని కాదు. ఎక్స్ట్రార్డినరీ క్వాలిటీస్‌తో నా గ్రోత్‌ని చూసి భయపడకుండా, పెళ్ళి తర్వాత ఇంట్లో కూర్చో అని అనకుండా ఉంటే పెళ్లి చేసుకుంటా. పెళ్లి తర్వాత భర్త జాబ్ మానేయమంటే మనం ఎందుకు మానేయాలి? – డి.జి. భవాని -
మిస్టర్ నకిలీ నిన్ను వదలా!
చెన్నై , పెరంబూరు: సంచలన నటి శ్రీరెడ్డి మరోసారి ఆరోపణలతో తెరపైకి వచ్చింది. ఈ అమ్మడు ఇంతకు ముందు కాస్టింగ్ కౌచ్ పేరుతో టాలీవుడ్లో కలకలం సృష్టించి ఆ తరువాత కోలీవుడ్‌లోనూ రచ్చ చేసిన విషయం తెలిసిందే. మంగళవారం తన ఫేస్బుక్లో పేర్కొంటూ దక్షిణ భారత నటీనటుల సంఘంలోని ఒక సభ్యుడిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ నిన్ను వదిలి పెట్టేది లేదని హెచ్చరించింది. మంగళవారం ఒక టీవీలో మీ ప్రసంగాన్ని విన్నాను. అసలు రూపాన్ని మరచి నంగనాసి కబుర్లు బాగానే చెబుతున్నారు. నీ అసలు రంగు బయట పెడతాను. నా వద్ద ఆధారాలు ఉన్నాయి. పరిశ్రమలోని ప్రముఖ నటీమణుల నుంచి సహాయ నటీమణుల వరకూ ఎలా లైంగికవేధింపులకు గురిచేస్తున్నారన్న ఆధారాలు నా వద్ద ఉన్నాయి. నువ్వు దక్షిణ భారత నటీనటుల సంఘంలోనూ, నిర్మాత మండలిలోనూ పదవుల్లో ఉన్నానని ఎగిరి పడుతున్నావు. మిస్టర్ నీ నకిలీ ముఖాన్ని త్వరలోనే బయట పెడతాను అని నటి శ్రీరెడ్డి తన ఫేస్బుక్లో పేర్కొని మరోసారి కలకలానికి తెరలేపింది. -
ఆ డైరెక్టర్‌ను చెప్పుతో కొట్టా : నటి
భారత్‌లో కూడా ‘మీటూ’ ఉద్యమం ఉధృతమైన వేళ క్యాస్టింగ్ కౌచ్‌కు గురైన పలువురు నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి ధైర్యంగా బయటపెడుతున్నారు. ఈ క్రమంలో ‘ఖుషీ’ సినిమా ఫేం ముంతాజ్ కూడా కెరీర్ తొలినాళ్లలో తాను ఎదుర్కొన్న పరిస్థితులు, వాటి నుంచి బయటపడిన తీరు గురించి చెప్పుకొచ్చారు. ‘అవును నాకు అలాంటి చేదు అనుభవాలు చాలానే ఎదురయ్యాయి. నాతో తప్పుగా ప్రవర్తించినందుకు ఓ దర్శకుడిని చెప్పుతో కొట్టాను. ఈ విషయం నడిగర్ సంఘం దృష్టికి తీసుకువెళ్లాను కూడా. వాళ్లు నా సమస్యని పరిష్కరించారు. ఇది జరిగిన తర్వాత కూడా మరో దర్శకుడు అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం చేశాడు. కోపంతో నోటికొచ్చినట్లు తిట్టేసా. అంతే ఇక అప్పటి నుంచి నా జోలికి రాలేదు సరికదా.. ఎప్పుడైనా కన్పిస్తే రండి మేడమ్, కూర్చోండి, ఏం తీసుకుంటారు అని మరాద్యలు చేసేవాడని’ ముంతాజ్ వ్యాఖ్యానించారు. అయితే మీటూ ఉద్యమాన్ని ఫాలో అవుతున్నారా అడుగగా.. ‘ నిజానికి ఫాలో అవ్వడం లేదు. కానీ ఒకరు మంచి వాళ్లో, చెడ్డవాళ్లో నిర్ణయించే హక్కు మనకైతే లేదు. ఆరోపణలు వచ్చినపుడు బాధితులు, బాధ్యులు ఇద్దరూ మాట్లాడినపుడే ఫలితం ఉంటుంది. అంతేకానీ ఒకరి వర్షన్ గురించి మాత్రమే వినడం సబబు కాదని’ ముంతాజ్ అభిప్రాయపడ్డారు. కాగా ఎన్నో ప్రత్యేక గీతాల్లో నర్తించి గుర్తింపు పొందిన ముంతాజ్.. తాజాగా తమిళ బిగ్‌బాస్-2తో మరోసారి లైమ్‌లైట్‌లోకి వచ్చారు. -
నాతో అశ్లీల సన్నివేశాలను చిత్రీకరించారు..
సినిమా: తననూ మోసం చేశారు అని నటి సంజనా గల్రాణి అంటోంది. తమిళం, తెలుగు, మలయాళం భాషల్లో వివిధ పాత్రల్లో నటించిన ఈ అమ్మడు నటి నిక్కీగల్రాణి సహోదరి అన్నది గమనార్హం. ఇప్పుడు సినీ పరిశ్రమలో లైంగికవేధింపుల ఆరోపణలు వీరవిహారం చేస్తున్న విషయం తెలిసిందే. ఒక్కొక్కరూ తమకు జరిగిన అన్యాయాలను ఏకరవు పెడుతున్నారు. అలా మీటూ అంటోంది సంజనా గల్రాణి. హిందీ చిత్రంలో నటిస్తున్న సమయంలో నేనూ లైంగిక వేధింపులకు గురైనట్లు చెప్పింది. ఆ కథేంటో ఆమె మాటల్లో చూద్దాం. నేను 15 ఏళ్ల వయసులోనే సినీరంగంలోకి అడుగు పెట్టాను. అప్పుడు ప్లస్‌ఒన్ చదువుతున్నాను. ఆ సమయంలో సినిమాల్లో నటించి మళ్లీ చదువుకోవచ్చుననే ఆలోచనతో వచ్చాను. తొలి అవకాశం కన్నడంలో వచ్చింది. ఆ చిత్ర దర్శకుడు హిందీ చిత్రం మర్డర్‌ను చూపించి దీన్నే కన్నడంలో రీమేక్ చేస్తున్నామని చెప్పారు. అందులో పలు అశ్లీల సన్నివేశాలు చోటు చేసుకోవడంతో నేను నటించనని చెప్పాను. అందుకా దర్శకుడు మర్డర్ చిత్రాన్ని కన్నడ ప్రేక్షకులకు తగ్గట్టుగా పలు మార్పులు చేస్తున్నట్లు చెప్పడంతో అందులో ఒక్క ముద్దు సన్నివేశంలో నటించడానికి మాత్రం నేను అంగీకరించాను. చిత్ర షూటింగ్ కోసం అమ్మతో కలిసి బ్యాంకాక్ వెళ్లడానికి అంగీకరించిన దర్శకుడు అక్కడకు వెళ్లిన తరువాత అమ్మను షూటింగ్ స్పాట్‌కు రావొద్దని చెప్పారు. అక్కడ నాతో పలు ముద్దు సన్నివేశాలు చిత్రీకరించారు. చాలా అశ్లీల సన్నివేశాలను చిత్రీకరించారు. నా శరీరంలోని మర్మ భాగాలను కూడా చిత్రీకరించారు. అలా చిత్రీకరించడానికి వ్యతిరేకత వ్యక్తం చేయగా మేము చెప్పినట్లు చేయకుంటే నీ కెరీర్‌ను నాశనం చేస్తామని బెదిరించారు. అలా ఎన్నో కలలతో వచ్చిన చిన్న పిల్లనైన నన్ను వారు ఇష్టానికి వాడుకున్నారు అని నటి సంజనా గల్రాణి ఆవేదన వ్యక్తం చేసింది. -
‘అది మగవారి తప్పు మాత్రమే కాదు’
మహిళలపై లైంగిక వేధింపుల వ్యవహారం ఇప్పుడు రచ్చరచ్చగా మారింది. ఇటీవల మీటూ అంటూ కొత్తగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఏళ్ల క్రితం జరిగిందంటూ కొందరు ఇప్పుడు ఆరోపణలు చేయడాన్ని చాలా మంది స్వాగతిస్తున్నా, వ్యతిరేకిస్తున్న వారు లేకపోలేదు. నిందలు ఎదుర్కొంటున్న వారిలో కొందరైతే మీటూ అనేది టీకప్పులో తుపాన్‌లా సమసిపోతుందని చాలా ఈజీగా తీసుకుంటున్నారు. ఇటీవల బాలీవుడ్ నటి తనూశ్రీదత్ సీనియర్ నటుడు నానాపటేకర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం కలకలం సృష్టించింది. ఆ తరువాత పలువురు అలాంటి ఆరోపణలు చేయడం మొదలెట్టారు. ఇక గాయని చిన్మయి మీటూ సామాజిక మాధ్యమంలో ప్రముఖ గీతరచయిత వైరముత్తుపై సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంలో చిన్మయికి పలువురు మద్దతుపలుకుతున్నారు. నా జీవితం నా ఇష్టం అనేలా ప్రవర్తించే నటి ఆండ్రియా రూటే వేరు కనుక ఆమె ఎలా స్పందిస్తుందో ప్రత్యేకంగా చెప్పాలా? ఈ అమ్మడు ధనుష్ హీరోగా నటించిన వడచెన్నై చిత్రంలో ముఖ్యపాత్రను పోషించింది. ఈ చిత్రం బుధవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఆండ్రియా ఏమందో చూద్దాం. అవకాశాల పేరుతో నటీమణులను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నారనే విషయంపై స్పందిస్తూ అలాంటి వారు అంగీకరించకుండానే మగవారు పడక గదికి పిలుస్తున్నారా అని ప్రశ్నించింది. అయితే తానూ మీటూ వ్యవహారాన్ని స్వాగతిస్తున్నానంది. ఇది మార్పు కోసం మంచి సమయంగా భావిస్తున్నానంది. అయితే ఈ మీటూ అనేది 5,10 ఏళ్ల క్రితం లేకపోయ్యిందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తాను పెద్దపెద్ద దర్శకుల చిత్రాల్లోనూ, ప్రముఖ నటులతోనూ కలిసి పని చేశానంది. హీరోయిన్‌కు ప్రాముఖ్యత ఉన్నా కథా పాత్రల్లోనూ నటిస్తున్నానని చెప్పింది. ప్రతిభ, శ్రమను నమ్ముకున్నానని ఆండ్రియా పేర్కొంది. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మంచి పాత్రల్లో నటిస్తున్న పలు నటీమణులు తనకు తెలుసని చెప్పింది. ‘మీటూ’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న వారిని ఆండ్రియా వ్యాఖ్యలు షాక్‌కు గురిచేస్తున్నాయి. -
నో చెప్పడంతో మూడు చిత్రాలు కోల్పోయాను : అధితిరావ్
తమిళసినిమా: మణిరత్నం హీరోయిన్‌కు అడ్జెస్ట్మెంట్ వేధింపులు తప్పలేదట. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పింది. మణిరత్నం కాట్రువెలియిడై చిత్రం ద్వారా కోలీవుడ్‌కు పరిచయమైన నటి అధితిరావ్. ఇటీవల కూడా ఆయన దర్శకత్వంలో వహించిన సెక్క సివంద వానం చిత్రంలో ఈ బ్యూటీకి అవకాశం కల్పించారు. అలా గుర్తింపు తెచ్చుకున్న అధితిరావ్ తాజాగా ఉదయనిధిస్టాలిన్‌తో కలిసి ఒక నూతన చిత్రంలో రొమాన్స్ చేయడానికి రెడీ అవుతోంది. ఇటీవల కాస్టింగ్ కౌచ్, ఇప్పుడు మీటు సంఘటనలు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు పుట్టిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఇప్పుడు చాలా మంది తమకు జరిగిన లైంగికవేధింపుల సంఘటనల గురించి బయట ప్రపంచానికి చెప్పుకుని ఇన్నాళ్లూ తమ గుండెల్లో రగులుతున్న బడబాగ్నులను చల్లబరచుకుంటున్నారు. అదే విధంగా నటి అధితిరావ్ కూడా దీనిపై స్పందించి తనకు ఎదురైన సంఘటనలను వెల్లడించింది. అడ్జెస్ట్‌మెంట్‌కు నో చెప్పడంతో నేనూ మూడు చిత్రాల అవకాశాలను కోల్పోయానని చెప్పుకొచ్చింది. ఇంతకీ ఈ అమ్మడు ఏం చెప్పిందో చూద్దాం. వారసుల కంటే సినీ నేపథ్యం లేని వారిని అవకాశాల కోసం పడక గది వేధింపులకు అధికంగా గురవుతున్నారని నేను చెప్పలేను గానీ, నా గురించి మాత్రం చెప్పగలను. కొత్తగా ఈ రంగానికి వచ్చే వారు లక్ష్యం దిశగా ముందుకెళ్లడం కష్టమే. అయితే అది అసాధ్యం కాదు. అందుకు ఉదాహరణ నేనే. అడ్జెస్ట్ కానందుకు అవకాశాలు తగ్గుతాయి. అయినా నా విధానాలను మార్చుకోలేదు. మొదట్లో చెడు అనుభవం ఎదురైంది. అడ్జెస్ట్‌మెంట్‌కు నో చెప్పడంతో మూడు చిత్రాల అవకాశాలను కోల్పోయాను. గౌరవంగా జీవించాలన్నది లక్ష్యంగా జీవిస్తున్నాను. నాకు గౌరవ మర్యాదలే ముఖ్యం. అందుకు అవకాశాలు పోయినా పర్వాలేదు. అదే విధంగా మహిళలకు సినిమా రంగంలోనే కాదు ఇతర రంగాల్లోనూ సరైన భద్రత లేదు. అన్ని రంగాల్లోనూ విభిన్న వ్యక్తులు ఉంటారు. కొందరు మర్యాదగా నడుచుకుంటే, మరి కొందరు మహిళపై అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు. ఇంకా చెప్పాలంటే పురుషాధిక్య సమాజంలో స్త్రీలు ఎదగడం కష్టమే. ఇకపోతే నేనెందుకు ఇంకా నంబర్ ఒన్ హీరోయిన్ను కాలేదని చాలా మంది అడుగుతున్నారు. అందుకు నా వద్ద సరైన సమాధానం లేదు గానీ, నాకు లభిస్తున్న అవకాశాలతో సంతోషంగానే ఉన్నాను. నేను కొందరు ప్రముఖ దర్శకుల చిత్రాల్లో నటించాను. దీంతో నంబర్‌వన్ నటిని కాలేకపోయానన్న బాధ ఏ కోశానా లేదు. కొందరు అధిక పారితోషాకం పొందడాన్ని విజయంగా భావిస్తారు. మరి కొందరు పలు అవార్డులను గెలుచుకోవడాన్ని సక్సెస్‌గా భావిస్తారు. ఇంకొందరు అధిక చిత్రాల్లో నటించడాన్ని విజయంగా భావిస్తారు. నేను మాత్రం ఒక పెద్ద దర్శకుడు నటించడానికి అవకాశం ఇస్తే గౌరవంగా భావిస్తాను. అదే నాకు విజయం అని అధితిరావ్ పేర్కొంది. -
అనుపై ప్రకాశ్‌రాజ్ అనుచిత వ్యాఖ్యలు
సినిమా: అది అందరికీ జరిగేదే అని తేలిగా తీసుకుంటోంది నటి అనుపమ పరమేశ్వరన్. మలయాళ చిత్రం ప్రేమమ్ ఫేమ్ బ్యూటీస్‌లో ఒకరైన ఈ అమ్మడు లక్కీగా తమిళంలో కొడి చిత్రంలో ధనుష్‌తో రొమాన్స్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. ఆ చిత్రం కూడా హిట్ అనిపించుకోవడంతో అనుపమ ఇక్కడ పాగా వేస్తుందని అందరూ అనుకున్నారు. అయితే అందుకు రివర్స్‌లో ఈ బ్యూటీ టాలీవుడ్లో పాగా వేసింది. అక్కడ వరుసగా అవకాశాలు వరించాయి. ఇప్పుడు అక్కడ కూడా జోరు తగ్గింది. ఇటీవల ఒక తెలుగు చిత్రంలో నటుడు ప్రకాశ్‌రాజ్ ఈ అమ్మడిపై అనుచిత వ్యాఖ్యలు చేశారట. దీంతో ఇద్దరి మధ్య వివాదం జరిగిందట. ఇలాంటి అంశాల గురించి అనుపమ పరమేశ్వరన్ ఏం చెప్పిందో చూద్దాం. నేను మలయాళీని కావడంతో తమిళ భాష నాకు బాగా తెలుసు. అయితే తెలుగు నేర్చుకోవడానికే చాలా కష్టపడ్డాను. ఇక నేను నటినైన కాలం నుంచి కన్నడంలో అవకాశాలు వస్తున్నాయి. అయితే తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉండటం వల్ల కన్నడ అవకాశాలను అంగీకరించలేకపోయాను. అలాంటిది ఇటీవల పునీత్ రాజ్‌కుమార్‌కు జంటగా నటించే అవకాశం వచ్చింది. కథ పాత్ర ఆకట్టుకోవడంతో ఆ చిత్రాన్ని వదులుకోలేకపోయాను. ఆ చిత్ర షూటింగ్లో పునీత్ రాజ్‌కుమార్‌తో సహా యూనిట్ అంతా నన్ను బాగా చూసుకుంటున్నారు. ఇకపోతే ప్రకాశ్‌రాజ్‌తో గొడవ గురించి చాలా ప్రచారం జరుగుతోంది. నేను ఆయనతో కలిసి 6 నెలలు చిత్రానికి పని చేశాను. అప్పుడు జరిగిన చిన్న సంఘటనను పెద్దగా ప్రచారం చేస్తున్నారు. ప్రకాశ్‌రాజ్ నాకు చిన్న హితబోధ చేసినదానికి ఏదో జరిగిపోయిందన్నంతగా రాద్దాంత్తం చేస్తున్నారు. నిజానికి ఆ సంఘటన జరిగిన తరువాత కూడా మేమిద్దం 25 రోజులు కలిసి పని చేశాం. నాకు ఆశ ఎక్కువే నాకు ఆశ కాస్త ఎక్కువే. చిత్రంలో ఎందరు హీరోయిన్లు ఉన్నారన్న విషయం గురించి పట్టించుకోను. నా పాత్రలో సత్తా ఉందా? అన్నదాని గురించే ఆలోచిస్తాను. అదే విధంగా నా దర్శకులు బలమైన పాత్రలను కల్పిస్తున్నారు. ఇంకా మంచి పాత్రల కోసం అత్యాశతోనే ఎదురు చూస్తున్నాను. -
'అతనో అమ్మాయిల పిచ్చోడు'
సినిమా: చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ వ్యవహారం రగులుతోంది. చిన్న హీరోయిన్ల నుంచి టాప్ హీరోయిన్ల వరకూ తాము ఎదుర్కొన్న వేధింపులను బహిరంగపరచడానికి ముందుకొస్తున్నారు. ఆ మధ్య సుచీ లీక్స్ పేరుతో గాయనీ సుచిత్ర కలకలం సృష్టించింది. నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో ప్రకంపనలు సృష్టించింది. బాలీవుడ్ నటి తనూశ్రీదత్తా ప్రముఖ నటుడు నానాపటేకర్ లాంటి వారిపై రాస క్రీడ హింసలను బట్టబయలు చేసింది. ఈమె వ్యవహారం బాలీవుడ్‌ని కుదిపేస్తున్న విషయం తెలిసిందే. నానాపటేకర్‌పై నటి తనూశ్రీదత్తా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మంటలు రగుతుండగానే మరో టాప్ హీరోయిన్ కంగనారనౌత్ మరో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడి రాసక్రీడల చిట్టాను బయట పెట్టి కలకలం పుట్టిస్తోంది. కంగనారనౌత్ తమిళంలో దామ్ ధూమ్ చిత్రంలో నటించింది. తెలుగులోనూ ఏక్ నిరంజన్ చిత్రంలో నటించింది. ఇక బాలీవుడ్లో అగ్ర నటిగా రాణిస్తున్న ఈ జాన క్వీన్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఈ చిత్రం ఇప్పుడు దక్షిణాది భాషలన్నింటిలోనూ రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు వికాశ్ పాహల్పైనే కంగనా లైంగిక వేధింపుల ఆరోపణలను గుప్పించింది. 2014లో క్వీన్‌లో నటిస్తున్నప్పుడే దర్శకుడు వికాస్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కంగనా ఆరోపించింది. అదే విధంగా 2015లో బాంబే వెల్వెట్ చిత్ర ప్రచారంలో పాల్గొన్నప్పుడు తనపై వేధింపులకు పాల్పడ్డాడని ఒక యువతి అతనిపై ఆరోపణలు చేసింది. ఆ వ్యవహారం అప్పట్లో వెలుగులోకి రాలేదు. ఇటీవల తనూశ్రీదత్తా నటుడు నానాపటేకర్ లైంగిక వేధింపుల గుట్టు రట్టు చేయడంతో ఇప్పుడు కంగనా తాను ఎదుర్కొన్న సెక్స్ వేధింపుల గురించి బయట పెట్టింది. దర్శకుడు వికాస్ నుంచి లైంగిక వేధింపులకు గురైన యువతికి తాను మద్దతుగా నిలిచానని కంగనా ఇటీవల ఒక భేటీలో పేర్కొంది. కంగనా తెలుపుతూ ఆ యువతి చెప్పింది నేను పూర్తిగా నమ్మాను. 2014లో క్వీన్ చిత్ర షూటింగ్ సమయంలో దర్శకుడు వికాస్ రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేసేవాడు. ప్రతి రాత్రి విందు, వినోదాలు జరిగేవి. షూటింగ్ పూర్తి కాగానే నేను విశ్రాంతి తీసుకోవడానికి వెళ్లిపోయేదాన్ని. రోజూ షూటింగ్ పూర్తి కాగానే నేను దర్శకుడు వికాశ్ కలిసి హగ్ చేసుకునే వాళ్లం. అయితే అతను నా మెడపై ముఖం పెట్టి గట్టిగా నొక్కేసేవాడు. అతని నుంచి విడిపించుకోవడాని చాలా బాధతో పోరాడాల్సి వచ్చేది. నువ్వు ఎలా గుభాళిస్తుంటావు. నేను నిన్ను ఆరాధిస్తున్నాను అని అంటుండేవాడు. అతని ప్రవర్తనలో తప్పు ఉందని నేను చెప్పగలను. అంతే కాదు అతనో అమ్మాయిల పిచ్చోడు. -
వారి అంతరంగం గ్రహించేస్తా..
సినిమా: ఎవరితోనైనా కొన్ని నిమిషాలు మాట్లాడితే చాలు వారి అంతరంగ విషయాలేమిటన్నది ఇట్టే గ్రహించేస్తానంటోంది నటి రకుల్‌ప్రీత్ సింగ్. ప్రస్తుతం తమిళంలో సోదర ద్వయం సూర్య, కార్తీలతో తలా ఒక చిత్రం చేస్తున్న ఈ బ్యూటీ తెలుగులో ఒక చిత్రం, హిందీలో ఒక చిత్రం చేస్తోంది. అయితే మునుపుటంత స్పీడ్ లేకపోయినా ఖాళీగా మాత్రం లేకుండా బండిని నడిపేస్తుంది. అలా సినిమాల్లో సీనియర్ నటిగా కొనసాగుతున్న రకుల్‌ప్రీత్‌సింగ్ తన అనుభవాలను ఎలా ఏకరువు పెట్టిందో చూద్దాం. ఇక చిత్రం జయాపజయాలు మన చేతుల్లో ఉండవు. అయితే చిత్రంలో నేను నటించిన పాత్ర పేరు తెచ్చిపెడుతుందా? లేదా? అన్నది నేను గ్రహించగలను. ఒకరితో కొన్ని నిమిషాలు మాట్లాడితే చాలు ఆయన అంతరంగ విషయాలేమిటో ఇట్టే అర్థం చేసుకోగలను. అలాంటి నేను చిత్ర కథలో సత్తా ఉందా? లేదా? అన్నది తెలుసుకోగలను. నేను ఈ రంగంలోకి వచ్చి చాలా సంవత్సరాలైంది. ఆ అనుభవంతో చెబుతున్నాను. కొన్ని సమయాల్లో పరిస్థితుల ప్రభావం కారణంగా మంచి చిత్రాలు కూడా అపజయం పొందాయి. అయితే కథ, పాత్రల విషయంలో మాత్రం నా లెక్కలు ఎప్పుడూ తప్పలేదు. మంచి కథ అని నేను భావించిన చిత్రాలు నాకు మంచి పేరు తెచ్చి పెట్టాయి. కథలను ఎంపిక చేసుకోవడంలో నేనెప్పుడూ జాగ్రత్తగానే ఉంటాను. ఒక నటిగా నా దృష్టి ఎప్పుడూ మంచి కథాపాత్రలపైనే ఉంటుంది. అయితే అన్ని వేళలా నేను ఆశించిన కథా పాత్రలు రావడం లేదు. దీంతో ఇంట్లో ఖాళీగా ఎందుకు కూర్చోవాలి. అందుకే స్టార్ హీరోలకు జంటగా కమర్శియల్ కథా చిత్రాల్లో డ్యూయెట్లు పాడి నటించేస్తున్నాను. అయితే ఇకపై విరామం తీసుకుని అయినా మంచి కథా పాత్రల్లో నటించాలని నిర్ణయించుకున్నాను అని రకుల్ ప్రీత్‌సింగ్ అంటోంది. ఈ నెల 10న అమ్మడి పుట్టిన రోజు. నాలుగు రోజుల ముందే పుట్టినరోజు వేడుకతో సందడి చేసింది. అదేంటి అని అనుకుంటున్నారా? రకుల్‌ప్రీత్‌సింగ్ నటిస్తున్న తాజా చిత్రాల్లో దేవ్ ఒకటి. కార్తీతో జతకట్టిన ఈ చిత్రానికి సంబంధించిన రకుల్‌ప్రీత్‌సింగ్ పాత్ర సన్నివేశాలు శనివారంతోనే పూర్తి అయ్యాయి. దీంతో చిత్ర యూనిట్ షూటింగ్ స్పాట్లో రకుల్‌ప్రీత్‌సింగ్ పుట్టినరోజు వేడుకను వేడుకగా నిర్వహించారు. ఈ బ్యూటీ పెద్ద కేక్‌ను కట్ చేసి చిత్ర యూనిట్ వర్గాలతో తన ఆనందాన్ని పంచుకుంది. -
‘అది చెప్పినందుకే.. సినిమా అవకాశాలు రాలేదు’
ముంబై: ఆషిక్ బనాయా అప్నేతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన తనుశ్రీ పరిశ్రమలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల గురించి గళం విప్పారు. 2008లో ఓ నటుడు తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని ఆమె తెలిపారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘క్యాస్టింగ్ కౌచ్‌పై హాలీవుడ్లో మీటూ ఉద్యమం రెండేళ్ల క్రితం ప్రారంభమై ఉంటుంది. కానీ భారత్‌లో నేను చాలా ఏళ్ల క్రితమే దానిని ప్రారంభించాను. ఇక్కడ తొలిసారి క్యాస్టింగ్ కౌచ్‌పై మాట్లాడింది, లైగింక వేధింపులపై ఉద్యమం చేసింది నేనే. 2008లో హార్న్ ఒకే ప్లీజ్ సినిమా చిత్రీకరణ సమయంలో నాతో ఒక నటుడు అసభ్యకరంగా ప్రవర్తించాడు. సాంగ్ షూటింగ్లో నా చేతులను తాకుతూ.. కొరియోగ్రాఫర్లను పక్కకు జరగమని చెప్పాడు. నాకు డ్యాన్స్ అతడే నేర్పుతానని అన్నాడు. ఈ విషయాన్ని అప్పుడే మీడియాకు వెల్లడించాను. మూడు రోజుల పాటు నాకు జరిగిన అన్యాయం గురించి దేశవ్యాప్తంగా చానళ్లలో చూపించారు. కానీ ప్రస్తుతం దాని గురించి ఎవరు మాట్లాడటం లేద’ని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు జరిగిన అన్యాయాన్ని టీవీల్లో చూసినప్పటికీ బాలీవుడ్‌కు చెందిన ఏ ఒక్కరు కూడా స్పందించలేదని వాపోయారు. ఆ సమయంలో తనకు ఎదురైన వేధింపుల గురించి మీడియా ముందుకువచ్చినందుకు.. ఆ తర్వాత తనకు సినిమా అవకాశాలు రాలేదని తనుశ్రీ తెలిపారు. ఇది ఇప్పటికీ ఓ గాయంగా మిగిలిపోయిందని గతాన్ని గుర్తుచేసుకున్నారు. ఆషిక్ బనాయా అప్నే తర్వాత ఆమె ‘చాకోలేట్’, ‘రఖీబ్’, ‘ధోల్’, ‘రిస్క్’, ‘గుడ్‌బాయ్ బ్యాడ్‌బాయ్’ వంటి హిందీ చిత్రాల్లో నటిచండమే కాక తెలుగులో ‘వీరభద్ర’ సినిమాలో బాలయ్యతో జత కట్టారు. 2010లో వచ్చిన అపార్ట్మెంట్ ఆమె నటించిన చివరి సినిమా. కొంతకాలం పాటు అమెరికాలో ఉన్న ఆమె ఈ ఏడాది జూలైలో ఇండియాకు తిరిగి వచ్చారు. ఇటీవల రాధిక అప్టే, రిచా చద్డా, స్వర భాస్కర్ వంటి వారు కూడా తమకు ఎదురైన లైంగిక వేధింపులపై స్పందించారు. -
డ్రైవర్‌కీ తెలుసు.. దాచాల్సిందేముంది?
సినిమా: ఇంకా దాచాల్సిందేముంది? అంటోంది సంచలన నటి రాధికా ఆప్తే. క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడిన తారల్లో దక్షిణాదిలో ముందున్న నటి ఈ అమ్మడే. ఆ మధ్య ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్న సమయంలో ఒక నటుడు తనను పడక గదికి రమ్మని చిత్రహింసలకు గురి చేశాడని సంచలన ఆరోపణలు చేసి వార్తల్లోకెక్కిన రాధికా ఆప్తే ఇకపై తెలుగు చిత్రాల్లో నటించేది లేదని ప్రకటించారు. ఆ మధ్య కబాలి చిత్రంలో రజనీకాంత్ సరసన నటించినా ఈ అమ్మడికి పెద్దగా క్రేజ్ రాలేదు. ఈ ఉత్తరాది భామ 2015లో బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన మెట్లీ అనే లఘు చిత్రంలో నగ్నంగా నటించి వివాదాలకు తావిచ్చారు. ఈ అమ్మడిని నెటిజన్లు ఏకి పారేశారు. ఆ తరువాత 2016లో పార్చ్డ్ అనే అనే చిత్రంలోనూ అదే విధంగా అర్ధ నగ్న దృశ్యాల్లో కనిపించి మరోసారి కలకలం సృష్టించారు. అయినా అవకాశాలు మాత్రం పెద్దగా రాలేదు. ఇక దక్షిణాదిలో అయితే రాధికాఆప్తేను పూర్తిగా పక్కన పెట్టేశారు. ప్రస్తుతం ఈ అమ్మడు ఆంగ్ల చిత్రాన్ని పూర్తి చేసి ఒక హిందీ చిత్రంలో నటిస్తోంది. కాగా, తన అర్ధనగ్న ఫొటోలను ఇంటర్నెట్లో ప్రచారం చేయడం గురించి ఇటీవల ఆమె ప్రస్తావిస్తూ ఆ సంఘటన తనను బాగా కలచివేసిందని పేర్కొంది. ఆ ఫొటోలు చాలా బాధించాయని, ఈ విషయాన్ని తొలుత తన తల్లి చెప్పిందని, ఆ తరువాత తన కారు డ్రైవర్ కూడా ఇదే మాట అన్నాడని రాధిక తెలిపారు. అయితే అందుకు తాను ఏం చేయను అని ఎదురు ప్రశ్న వేశారు. తన నగ్నదృశ్యాల ఫొటోలపై ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో రచ్చ రచ్చ చేశారని, ఇకపై తాను దాచడానికి ఏమీ లేదనీ పేర్కొన్నారు. తాను ఇక ఏమైనా చేయవచ్చునని, తన గురించి కొత్తగా ఎవరూ ప్రచారం చేసే అవకాశం ఉండదని అన్నారు. అయితే, ఏమీ లేనప్పుడు పాత విషయాలను కెలకడం ఎందుకు? మరచిపోయిన తన ఉనికిని చాటుకోవడానికా అంటున్నారు సినీ వర్గాలు. -
నాకలాంటి ఘటన ఎదురుకాలేదు!
ఇక్కడ ఎవరు మాత్రం అత్యాచార వేధింపులకు గురికావడం లేదూ? అంటూ ప్రశ్నించింది నటి అనుపమా పరమేశ్వరన్. మలయాళ చిత్రం ప్రేమమ్ చిత్రంతో పరిచయమైన ముగ్గురు ముద్దుగుమ్మల్లో ఒకరైన ఈ బ్యూటీ ఆ చిత్రం తెచ్చి పెట్టిన పేరుతో ఇప్పుడు దక్షిణాది భాషల్ని చుట్టేస్తోంది. ముఖ్యంగా తెలుగు, మలయాళంలో బాగానే పాపులర్ అయ్యింది. ఇక కోలీవుడ్‌లో ధనుష్‌కు జంటగా కొడి చిత్రంలో మెరిసింది. అప్పుడెప్పుడో గాయని సుచిత్ర చిత్ర పరిశ్రమలో సెక్స్ రాకెట్‌ను బయట పెట్టి కలకలం సృష్టించింది. అయితే కాస్టింగ్ కౌచ్ వ్యవహారం మాత్రం ముందు బాలీవుడ్లో బయటపడింది. ఆ తరువాత దక్షిణాదిలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఈ మధ్య నటి శ్రీరెడ్డి అవకాశాల పేరుతో లైంగికంగా వాడుకున్నారంటూ రోడ్డెక్కి కలకలం సృష్టించింది. అయితే అంతకు ముందే నటి రాధికా ఆప్తే, వరలక్ష్మీ శరత్‌కుమార్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి కొందరు సినీరంగంలో కాస్టింగ్ కౌచ్‌పై స్పందించారు. తాజాగా నటి అనుపమ పరమేశ్వరన్ లైంగిక వేధింపులు నిజమేనని పేర్కొంది. దీని గురించి ఈ అమ్మడు మాట్లాడుతూ సినీరంగంలో హీరోయిన్లకు లైంగిక వేధింపులు ఎదురవుతున్న మాట వాస్తవమేన న్నది తాను ఖండించలేనంది. ఇక్కడ ఎవరు మాత్రం లైంగిక వేధింపులకు గురి కావడం లేదు? అంటూ ప్రశ్నించింది. అయితే అలాంటి సంఘటన ఇంత వరకూ తనకు ఎదురవలేదని పేర్కొంది. ఈ రంగంలో ఏదో సాధించాలన్న ఆశతో కొత్తగా వచ్చే తారలు ఎక్కువగా అత్యాచార వేధింపులకు గురవుతున్నారని అంది. అయితే అలాంటి వేధింపులను ఎదిరించనంత వరకూ యథేచ్ఛగా జరుగుతూనే ఉంటాయన్నది తన భావన అని అంది. తన చుట్టూ మంచి వారే ఉన్నవారని చెప్పింది. అలాంటి వారు ఉన్నంత వరకూ తనకెలాంటి సమస్య రాదనే ధీమాను వ్యక్తం చేసింది. మరో విషయం ఏమిటంటే అందం అనేది మోడ్రన్‌గా ఉండడంలోనో, లంగా ఓణి ధరించడంలోనో ఉండదని, ప్రతిభావంతమైన నటనను ప్రదర్శంచడంలోనే ఉంటుందని ఆ అమ్మడు చెప్పింది. -
స్త్రీలోక సంచారం
►తమిళనాడులోని తిరుచ్చిలో 17 మహిళా స్వయం సహాయక బృందాలలోని సభ్యులు కలిసి ఏర్పాటు చేసుకున్న ‘కాలేజ్ బజార్ గ్రూపు’.. తిరుచ్చిలో తొలి విడతగా ఎంపిక చేసుకున్న 15 కళాశాలల్లోని ప్రాంగణాలలో కాలేజీ యాజమాన్యాల అనుమతితో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న స్టాల్స్ అత్యంత ఆదరణ పొందడమే కాక.. గ్రూపు సభ్యుల స్వయం సమృద్ధికి, ఆర్థిక స్వేచ్ఛకు తోడ్పడుతున్నాయి. తిరుచ్చి జిల్లా మొత్తంలో సుమారు 10 వేలకు పైగా మహిళా స్వయం సహాయక బృందాలు ఉండగా, ఒక్క తిరుచ్చి పట్టణంలోనే వెయ్యి వరకు చురుగ్గా పనిచేస్తున్నాయని, ఆ వెయ్యి బృందాలలోని పదిహేడు బృందాలు.. కాస్ట్యూమ్ జ్యుయలరీ, క్లాత్ బ్యాగులు, దుస్తులు, డెకరేటివ్ ఐటమ్స్, ఇంకా విద్యార్థినీ విద్యార్థులకు అవసరమైన ఉత్పత్తులను స్వయంగా తయారు చేసుకుని వచ్చి, చవక ధరల్లో విక్రయిస్తూ ఆదరణ పొందుతున్నందున.. కొత్తగా ప్రారంభం అయిన ‘కాలేజీ బజార్ గ్రూపు’ను ఒక సంస్థగా రిజిస్టర్ చేయించిన అనంతరం, ఇలాంటివే మరికొన్ని గ్రూపుల ఏర్పాటుకు సహకారం అందించనున్నామని ‘తమిళనాడు కార్పొరేషన్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్’ ప్రతినిధి ఒకరు తెలిపారు. ► తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న లైంగిక అకృత్యాలపై బాధితుల ఫిర్యాదును స్వీకరించి, వారికి న్యాయం జరిపించేందుకు వీలుగా ఒక అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలన్న తమ అభ్యర్థనపై తెలంగాణ ప్రభుత్వం ఉదాసీనంగా ప్రవర్తిస్తోందంటూ.. ఏడుగురు సామాజిక కార్యకర్తలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. టాలీవుడ్‌లోని పెద్ద పెద్ద దర్శకులు, నటులు అవకాశాల పేరుతో తనను వాడుకుని దగా చేశారనీ, తనకు న్యాయం జరిపించాలని డిమాండ్ చేస్తూ శ్రీరెడ్డి అనే యువతి ఈ ఏడాది ఏప్రిల్ 7న ఫిల్మ్ చాంబర్ ఎదుట.. సంచలనాత్మకంగా అర్ధనగ్న నిరసన చేపట్టిన అనంతరం.. తామంతా కలిసి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను అనేకమార్లు కలిసి.. ‘క్యాస్టింగ్ కౌచ్’ ఫిర్యాదులను స్వీకరించి, విచారించి, బాధితులకు న్యాయం జరిపించేందుకు ఒక అత్యున్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని అడుగుతున్నప్పటికీ ఫలితం లేకపోవడంతో కోర్టుకు వెళ్లక తప్పలేదని ఈ ఏడుగురు పిటిషనర్లు తెలిపారు. ►బాలీవుడ్ తారలు ప్రియాంక చోప్రా, దీపికా పడుకోన్‌ల మధ్య ప్రారంభం నుంచీ కెరీర్లో ఉన్న ‘శత్రుత్వం’.. దీపికను ప్రతిదానికీ ప్రియాంకతో పోల్చుకునేలా ప్రేరేపిస్తోందని వదంతులు వినిపిస్తున్న క్రమంలో.. ఇటీవలి నిశ్చితార్థం తర్వాత బాయ్‌ఫ్రెండ్ నిక్ జోనస్‌ని ఈ నవంబర్‌లో గానీ డిసెంబర్లో గానీ ప్రియాంక చేసుకోబోతున్న వివాహానికంటే ఘనంగా, అదే సమయానికి తన బాయ్‌ఫ్రెండ్ రణ్వీర్ సింగ్‌ను పెళ్లి చేసుకునేందుకు దీపిక ప్లాన్ చేస్తున్నారని బాలీవుడ్ పత్రికలు రాస్తున్నాయి. హాలీవుడ్ చిత్రాల్లో నటించడంలో ప్రియాంక పైచేయిగా ఉండగా, బాలీవుడ్లో దీపికే వెలిగిపోవడం దీపికకు ఉన్న ఒక ప్లస్ పాయింట్ అయితే.. ప్రియాంకలా దీపికకు విదేశీ బాయ్‌ఫ్రెండ్ లేకపోవడం ఒక మైనస్ పాయింట్ అని కూడా ఏవేవో విశ్లేషణలు జరుగుతున్నాయి. ►డాలర్ ముందు రూపాయి విలువ పడిపోకుండా ఉండటం కోసం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం పైన సుంకం విధించాలని ప్రభుత్వం యోచిస్తుండటంతో బంగారు ఆభరణాల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. రూపాయి విలువను కాపాడుకునేందుకు కనీసం 2 శాతంగానైనా బంగారంపై దిగుమతి సుంకాన్ని విధించడం ఒక్కటే ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న ఉత్తమమైన మార్గమని ఇండియన్ బులియన్ అండ్ జ్యుయలరీస్ అసోసియేషన్ (ఐ.బి.జె.ఎ.) జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా అంటున్నారు. ►భారతదేశంలో మహిళల ఆత్మహత్యల సంఖ్య అధికంగా ఉండడానికి కారణం.. చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసెయ్యడమేనని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న మహిళల ఆత్మహత్యల్లో 37 శాతం భారతదేశంలో జరుగుతున్నవేనని ప్రఖ్యాత ‘లాన్సెట్’ మెడికల్ జర్నల్‌లో వచ్చిన తాజా సర్వే నివేదిక వెల్లడించింది. చిన్న వయసులోనే తల్లి అవడం, ఆర్థికంగా ఆధారపడి ఉండటం, గృహహింస వంటివి.. మహిళల్లో మానసికంగా ఒత్తిడిని కలిగించి, వారిని ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నాయని నివేదిక తెలిపింది. ► 44 ఏళ్ల కేరళ నన్‌పై పలుమార్లు అత్యాచారం జరిపిన జలంధర్ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 9 నుండీ కొట్టాయంలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న 85 ఏళ్ల జోన్ జోసెఫ్ అనే జాయింట్ క్రిస్టియన్ కౌన్సిల్ సభ్యుడు, జోసెఫ్ స్టీఫెన్ అనే ఓ రైతుతో పాటు సోమవారం నుంచి బాధితురాలి చెల్లెలు కూడా దీక్షకు కూర్చున్నారు. ఇదిలా ఉండగా, అరెస్టు కాకుండా ఉండేందుకు ముందస్తు బెయిలు కోసం బిషప్ ములక్కల్ దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణను కేరళ హైకోర్టు సెప్టెంబర్ 24వ తేదీకి వాయిదా వేసింది. ►తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు తమిళిసై సౌందర్‌రాజన్.. చెన్నైలోని ఒక ఆటో డ్రైవర్ ఇంటిని అకస్మాత్తుగా సందర్శించి, ఆ కుటుంబం క్షేమ సమాచారాలు కనుక్కొని, ఒక స్వీట్ బాక్సును ఇచ్చి.. ప్రభుత్వం నీకు అండగా ఉంటుందని చెప్పివెళ్లిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ప్రధాని నరేంద్ర మోదీ పుట్టిన రోజు సందర్భంగా చెన్నైలో సోమవారం తమిళసై ఏర్పాటు చేసిన సభలో ఆ ఆటో డ్రైవర్.. పెట్రోల్ ధరలు పెరుగుతూ ఉండటంపై అసహనంతో ఆమెను ప్రశ్నిస్తూ ఉండగానే.. పార్టీ కార్యకర్తలో కొందరు అతడిని తోసుకుంటూ అక్కడి నుంచి తీసుకెళుతున్న వీడియో వైరల్ కావడంతో.. నష్ట నివారణ చర్యలో భాగంగా తమిళసై అతడి ఇంటికి వెళ్లి పరామర్శించి వచ్చారు. ► బ్రిటన్ రాజప్రాసాదంలోకి అడుగుపెట్టాక ప్రిన్స్ హ్యారీ సతీమణి మేఘన్ మార్కెల్ తొలిసారి ఒక కొత్త ప్రాజెక్టులో పాలుపంచుకున్నారు. గత ఏడాది లండన్‌లోని ‘గ్రెన్‌ఫెల్ టవర్’ ఫైర్‌లో 70 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనలో బాధిత కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించేందుకు విరాళాలను సేకరించడం కోసం ఆయా కుటుంబాలు సంప్రదాయికంగా వండే 50 రకాల వంటకాలను చేయించి, వాటిల్లో కొన్ని స్వయంగా తను చేసి, వాటన్నిటితో ‘టుగెదర్ : అవర్ కమ్యూనిటీ కుక్ బుక్’ అనే ఓ చక్కటి వంటల పుస్తకాన్ని వేయించి, దానికి ముందుమాట కూడా తనే రాసి, పుస్తకావిష్కరణ జరిపించారు మేఘన్ మార్కెల్. -
నేను కాస్త రఫ్!
‘‘నాకు బయటి ప్రొడక్షనే కంఫర్ట్‌గా ఉంటుంది (నవ్వుతూ). సొంత ప్రొడక్షన్ అయితే కాస్త టెన్షన్‌గా ఉంది. సినిమా రిజల్ట్ గురించి ఎక్కువగా ఆలోచించను. మా అమ్మానాన్నలు నన్ను నమ్మి సినిమా తీశారు.వేరే ప్రొడక్షన్ హౌస్‌లో చేసినప్పుడు ఎంత బాధ్యతగా ఉంటానో సొంత సినిమాకీ అలానే ఉంటాను. మా అమ్మ ఫస్ట్ క్రిటిక్. ఆవిడకు నచ్చితే చాలామంది ప్రేక్షకులకు నచ్చుతుందని నా ఫీలింగ్’’ అన్నారు నాగశౌర్య. శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన సినిమా ‘ఃనర్తనశాల’. ఈ నెల 30న సినిమా విడుదల కానున్న సందర్భంగా నాగశౌర్య చెప్పిన విశేషాలు.... ►ఈ సినిమా కథ విన్నప్పుడు బాగా ఎంజాయ్ చేశా. ట్రాన్స్‌జెండర్స్‌ను సినిమాలో తప్పుగా చూపించలేదు. ‘నర్తనశాల’ టైటిల్ పెట్టాలనుకున్నప్పుడు ఆ టైటిల్‌తో స్టార్ట్ చేసిన సినిమాలు ఆగిపోయాయాని డాడీకి ఎవరో చెప్పారు. అందుకే ‘ః’ సింబల్ వాడాం. జస్ట్ సెంటిమెంట్ కోసమే కాదు సినిమాకి కూడా యాప్ట్ అవుతుంది. పాత ‘నర్తనశాల’ సినిమా చూసినవాళ్లు మా సినిమాకి బాగా కనెక్ట్ అవుతారు. ఠి ఈ చిత్రంలో మహిళా సాధికారతను సపోర్ట్ చేసే క్యారెక్టర్ హీరోది. అమ్మాయిలను ధైర్యవంతులుగా తయారు చేస్తుంటాడు. ఈ టైమ్‌లోనే అతన్ని ఇద్దరు హీరోయిన్లు లవ్ చేస్తుంటారు. అయితే నెక్ట్స్ ఏంటీ? అతను నిజంగా గేనా? లేక ఇంకేమైనా ట్విస్ట్ ఉందా? అనేది థియేటర్లో చూడాలి. ►క్యాస్టింగ్ కౌచ్ గురించి విన్నాను. మహిళలు తిరగబడినప్పుడే ఇలాంటివి ఆగుతాయి. అమ్మాయిల పట్ల తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ ఫ్యామిలీ నుంచి శిక్ష మొదలైతే తప్పు చేయాలనుకునేవాళ్లు భయపడతారు. ఠి నా ప్రతి సినిమాలో నా నటన మా అమ్మకు నచ్చుతుంది. కానీ సినిమాలు నచ్చలేదని చెప్పేది. ఎందుకంటే నేను సినిమాల్లో కనిపించేంత సాఫ్ట్ అయితే కాదు. రఫ్. ‘ఛలో’లో చేసిన పాత్రలా రియల్ లైఫ్‌లో ఉంటాను. ప్రతి ఇంటర్వ్యూలో నా పెళ్లి టాపిక్ వస్తోంది. త్వరగా చేసుకోవాలి. ఠి రాజా దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నా. రమణ తేజ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్‌లో ఓ సినిమా ఉంటుంది. వెబ్‌సిరీస్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ఇలాంటి ప్లాట్‌ఫామ్స్‌లో నటించాలని ఉంది. చూడాలి. ► స్టార్ట్డమ్ అనేది అంత ఈజీ కాదు. ఆ రోజుల్లో ఎన్టీఆర్, ఏయన్నార్లను దేవుళ్లలా పూజించేవారు. ఆ తర్వాత చాలామంది స్టార్స్ వచ్చారు. ఇప్పుడు చిరంజీవిగారు, బాలకృష్ణగారు, ఎన్టీఆర్, ప్రభాస్.. ఇంకా చాలా మంది స్టార్స్ ఉన్నారు. ఇప్పుడు పవన్‌కల్యాణ్ సినిమా ఫ్లాప్ అయినా 80 కోట్ల కలెక్షన్స్ వస్తున్నాయి. స్టార్ మెటీరియల్ అంటే అది. తమిళనాడులో, మన దగ్గర, కేరళలో కానీ పెద్ద హీరోలందరినీ సెకండరీ దేవుళ్లులా చూస్తున్నారు. ఇప్పుడు వచ్చినవాళ్లు ‘మా సినిమాలు చూడండి.. మా సినిమాలు చూడండి’ అని అడుగుతున్నారు అంటే దేవుడే వచ్చి మా గుడికి రండీ అంటే ఏ భక్తుడు నమ్ముతాడు. అందరూ స్టార్ట్ అవ్వాలనే ట్రై చేస్తారు. అది తప్పు కాదు. కానీ అది రావడానికి 30 ఏళ్లు పడుతుంది. అది తెలుసుకోవాలని చెబుతున్నాను. సడన్‌గా ఎవరో వచ్చి స్టార్ అంటే..? నేనెవరి గురించీ నెగటివ్‌గా కామెంట్స్ చేయడం లేదు. ఆ మధ్య నేను మాట్లాడిన మాటలను వక్రీకరించారు. నా కామెంట్స్ విజయ్ దేవరకొండకు సంబంధించినవి అనడం తప్పు. అతన్ని చూసి నాకు ఎలాంటి అసూయ లేదు. నేను చేసే సినిమాలు వేరు. అతను చేసే సినిమాలు వేరు. డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా. అతని సినిమా హిట్ సాధించడం వల్ల మిగతావారికి సినిమాలు పోవు కదా?. మా ఇద్దరి మధ్యలో ఏమీ లేదు. ఎవరో పెట్టారంతే. -
మా కాలంలోనూ అదే టార్చర్! : మీనా
తమిళసినిమా: ఇప్పుడు ఏ నోట విన్నా కాస్టింగ్ కౌచ్ మాటే. అంతకు ముందు అణగారి ఉన్న ఈ అంశం గాయని సుచిత్ర, తాజాగా నటి శ్రీరెడ్డిల కారణంగా కలకలం సృష్టిస్తోంది. ఏ నటితో మాట్లాడినా మీడియా కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్నించడం ఒక ఆనవాయితీగా మారింది. కొందరు భామలు తమ అభిప్రాయాలను ధైర్యంగానే వెల్లడించే ప్రయత్నం చేస్తుండడం విశేషం. ఇటీవల నటి మీనాకు ఇలాంటి ప్రశ్నే ఎదురైంది. మీనా తమిళం, తెలుగు భాషల్లో స్టార్ హీరోలందరితోనూ నటించేసింది. ముఖ్యంగా కోలీవుడ్‌లో సూపర్‌స్టార్ రజనీకాంత్, కమలహాసన్ వంటి వారితోనూ జత కట్టింది. ఇంకా ఎవరితోనైనా నటించాలని కోరుకుని నటించలేకపోయిన నటులెవరైనా ఉన్నారా అన్న ప్రశ్నకు మీనా బదులిస్తూ నటడు అరవిందస్వామి సరసన నటించలేకపోయాను. రోజా చిత్రం సమయంలో ఆయనకు చాలా క్రేజ్ ఉంది. ఆ సమయంలో అరవిందస్వామికి జంటగా నటించే అవకాశం వచ్చినా కాల్షీట్స్ సమస్య కారణంగా ఆ అవకాశాన్ని వదులుకున్నాను. అలాంటి అవకాశాన్ని మిస్ చేసుకున్నానేమోనని ఇప్పటికీ అనిపిస్తోంది. అదే విధంగా విజయ్‌తో చాలా చిత్రాలు కమిట్ అయి కూడా నటించడం కుదరలేదు. తెరి చిత్రం షూటింగ్ సమయంలో విజయ్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కావాలనే నాతో నటించడానికి నిరాకరించారు కదూ అని వెంటనే అప్పట్లో మీ డైరీ గురించి నాకు తెలుసు ఊరికే సరదాగా అన్నాను అని నవ్వేశారు. అయితే విజయ్‌తో నటించలేదన్న కొరత పోవడానికే షాజహాన్ చిత్రంలో ఆయనతో ఒక పాటలో నటించాను. ఇక అవకాశాలు వచ్చి నేను మిస్ చేసుకున్న చిత్రాల పట్టిక చాలానే ఉంది. ఫ్రెండ్స్ (దేవయాని పాత్ర), ప్రిముడన్(కౌసల్య పాత్ర), వాలి(సిమ్రాన్ పాత్ర), దేవర్‌మగన్ (రేవతి పాత్ర), పడైయప్పా (రమ్యకృష్ణ పాత్ర), పొన్మణి(సౌందర్య పాత్ర) చిత్రాల కథలను విని అందులో నేను నటించలేకపోయిన పరిస్థితి. ఇక ప్రస్తుతం కలకలం చెలరేగుతున్న కాస్టింగ్ కౌచ్ గురించి అడుగుతున్నారు. అది చాలా విచారకరమైన విషయం. అన్ని రంగాల్లోనూ మహిళలకు సమస్యలు ఉన్నాయి. అలాంటి సంఘటనలను నేను ఎదుర్కోకపోయినా, మా కాలంలోనూ ఆ టార్చర్ ఉండేది. వక్ర బుద్ధి కలిగిన మగాళ్లు ఇకనైనా మారాలి. వారు ఒక స్త్రీతో డీల్ మాట్లాడే ముందు తమకు భార్య, పిల్లలు ఉన్నారన్నది గుర్తు చేసుకోవాలి. ప్రతిభను ప్రదర్శించే అవకాశాల కోసం ఎలాంటి సామరస్యానికి చోటు లేకుండా స్త్రీలు పోరాడాలి అని నటి మీనా పేర్కొంది. -
అత్యాచార వేధింపులు నిజమే : నటి
తమిళసినిమా: కోలీవుడ్‌లో హీరోయిన్లకు రక్షణ లేదన్నది ఇటీవల ఎక్కవగా వినిపిస్తున్న మాట. అయితే నటి శ్రుతిహాసన్ లాంటి కొందరు మాత్రం ఇక్కడ హీరోయిన్లకు భద్రత ఉందని స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అయితే ఆ మధ్య సుశీలీక్స్ పేరుతో గాయని సుచిత్ర కోలీవుడ్‌లోని పలువురికి దడ పుట్టించిన పరిస్థితులను మరచి పోకముందే నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌తో, కోలీవుడ్‌లోని కొందరు దర్శకులు, నటులను ఠారెత్తిస్తోంది. నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌తో సహా పలువురు హీరోయిన్లకు అత్యాచార వేధింపులు ఎదురవుతున్న మాట నిజమేనని కుండబద్ధలు కొట్టినట్లు బహిరంగంగానే చెబుతున్నారు. తాజా వర్ధమాన నటి ప్రియా భవానీ శంకర్ కూడా అత్యాచార వేధింపులు వాస్తవమేనంటోంది. మెయ్యాద మానే చిత్రంతో కథానాయకిగా రంగప్రవేశం చేసిన ఈ బుల్లితెర నటి ఇప్పుడు వెండి తెరపై హీరోయిన్గా బిజీ అవుతోంది. ఇటీవల కార్తీకి జంటగా కడైకుట్టి సింగం చిత్రంలోనూ నటించింది. కాగా శుక్రవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఈ భామ నటి శ్రీరెడ్డి వ్యవహారంపై స్పందిస్తూ సినిమా రంగంలో హీరోయిన్లకు అత్యాచారం వేధింపులు అన్నది కొట్టిపారవేయలేమని అంది. అయితే ఇలాంటి వేధింపులు ఇతర రంగాల్లోనూ జరుగుతున్నాయని పేర్కొంది. మహిళలు సెక్స్ వేధింపులకు గురవుతున్నారని, అయితే అలాంటి వాటిని అంగీకరించడం, నిరాకరించడం అనేది మన చేతుల్లోనే ఉందని అంది. అయితే నటి శ్రీరెడ్డి అత్యాచార వేధింపులను ఎదుర్కొన్నానని బహిరంగంగా చెప్పడం సరి కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. తప్పు చేసి దాన్ని బయటకు చెప్పుకోవడం ఎంత వరకు సబబు అని ప్రియా భవానీశంకర్ అంటోంది. సెక్స్ వేధింపుల భారిన పడకూడదనుకుంటే నటన నుంచి తప్పుకోవచ్చు కదా అని అంది. తాను మాత్రం కుటుంబ కథా చిత్రాల్లోనే నటించడానికి ఆసక్తి చూపుతున్నానని ఈ అమ్మడు చెప్పింది. -
నన్ను కాంప్రమైజ్ అవ్వమన్నారు: నటి
‘రోడ్డు మీద కనిపించిన రూపాన్ని చూసి వెంటనే మోహించడం.. ప్రేమ పేరుతో వల వేయడం.. మోజు తీరాక వదిలేసి మొహం చాటేయడం’... ఇవన్నీ చేయడం కొందరు అబ్బాయిల పనే కదా! అదే పని ఓ అమ్మాయి చేస్తే... వినడానికే ఆశ్చర్యం అనిపించే ఈ వి‘చిత్రం’ చూడ్డానికి ఇంకెలా ఉంటుంది? మరి అలాంటి అమ్మాయి పాత్రని తెరపై పండించడం ఇంకెంత సాహసం అనిపిస్తుంది? ఆ సాహసం చేసింది కాబట్టే పాయల్ రాజ్‌పుత్ సూపర్ పాపులర్ అయింది. ఈ పంజాబీ అమ్మాయి ‘ఆర్ఎక్స్ 100’ మూవీతో తెలుగు రాష్ట్రాల్లో క్రేజీగాళ్ ఇమేజ్ సంపాదించుకుంది. ‘అదొక స్ట్రాంగ్ క్యారెక్టర్. నేను వ్యక్తిగతంగా స్ట్రాంగ్. అయితే ‘ఇందూ’ లాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయిని మాత్రం అస్సలు ఇష్టపడను’ అంటున్న పాయల్ .. ‘తెలుగులో క్యాస్టింగ్ కౌచ్ (సినిమా ఆఫర్లు ఎరవేసి అమ్మాయిలను లొంగదీసుకోవడం) కచ్చితంగా ఉంది. ఇది నన్ను బాగా డిసప్పాయింట్ చేస్తోంది. ‘ఆర్ఎక్స్100’ పెద్ద హిట్టయి, నాకు పేరొచ్చిన తర్వాత కూడా నన్ను కాంప్రమైజ్ అవ్వమంటూ అడుగుతున్నారు. ఈ మాటను తప్పకుండా పబ్లిష్ చేయండి. ఐ మీన్.. ఇది క్యాస్టింగ్ కౌచ్ గురించి. ఐయామ్ రియల్లీ షాక్డ్. ఇలాంటి ప్రపోజల్‌తో నాలుగు రోజుల క్రితమే ఒకరు కలిశారు. బహుశా ఫస్ట్ మూవీలోనే బోల్డ్ క్యారెక్టర్ చేయడం వల్ల అలా అనుకుంటున్నారో ఏమో! కానీ ఒకటే చెప్పాలనుకుంటున్నాను. నేను ఇక్కడ టాలెంట్‌తో ఈ పొజిషన్లో ఉన్నాను. అంతే తప్ప.. కాంప్రమైజ్ అయ్యో, మరో విధంగానో కాదు’’ అంటోంది పాయల్ రాజ్‌పుత్. ఆమె చెప్పిన మరిన్ని విశేషాలు.. పుట్టి పెరిగింది ఢిల్లీలో. ప్రస్తుతం ముంబైలో ఉంటున్నాం. అమ్మానాన్న ఇద్దరూ టీచర్స్. నాకు ఒక సోదరుడు. మాది చిన్న హ్యాపీ ఫ్యామిలీ. సినిమాల మీద చిన్నప్పటి నుంచి ఇష్టమే. అయితే కాలేజీకి ముందు అంత కాన్ఫిడెన్స్ ఉండేది కాదు. పిరికిదాన్ని కూడా. అక్కడి నుంచే సెల్ఫ్‌మేడ్ ఉమన్‌గా మారాను. చదువుతూనే ట్యూషన్లు చెబుతూ మోడలింగ్ చేశాను. మోడలింగ్ నుంచి టీవీ రంగంలోకి ప్రవేశించాను. అలా తర్వాత పంజాబీ సినిమాలు చేశాను. అక్కడ మంచి పేరు రావడంతో ఇప్పుడు కంటిన్యూస్‌గా సినిమాలు చేస్తున్నాను. ఇందూ.. అందరికీ నచ్చేసింది.. ‘ఆర్ఎక్స్ 100’లో ఇందూ పాత్ర అంగీకరించేటప్పుడు కాస్త నెర్వస్‌గా ఫీలైన మాట వాస్తవం. ఇందూ క్యారెక్టర్ విన్నప్పుడు ‘ఓమై గాడ్’ అనుకున్నాను. పక్కింటి అమ్మాయి లాంటి పాత్ర కాదిది. తెస్తే మంచి పేరు తేవొచ్చు.. లేదా నా పేరు చెడగొట్టొచ్చు. తెలుగులో ఆరంభ చిత్రంలోనే పూర్తిస్థాయి నెగెటివ్ రోల్ పోషించడమంటే... అది ప్రమాదకరమైన నిర్ణయం కావచ్చు. పైగా సినిమాలో శృంగార దృశ్యాలు కూడా ఆలోచింపజేశాయి. మాది ట్రెడిషనల్ పంజాబీ ఫ్యామిలీ. దీనిపై మా అమ్మానాన్నతో కూర్చొని చర్చించాను. పాత్ర నచ్చిందని, నా మీద నమ్మకం ఉంచమని చెప్పాను. నాన్న తొలుత కొంచెం డిస్ట్రబ్ అయినా... చివరికి అంతా కలిసి ఓ నిర్ణయానికి వచ్చాం. మా అమ్మ నాతో కలిసి సినిమా చూశారు. ఆమెకు ఏమీ అభ్యంతరం అనిపించలేదు. ఇప్పుడు మాత్రం ఈ క్యారెక్టర్ చేసినందుకు ఐ ఫీల్ రియల్లీ గ్రేట్. ఎందుకంటే పబ్లిక్ ఇందూని బాగా లవ్ చేస్తున్నారు. నిజానికి పంజాబీ సినిమాల్లో నా పాత్రలన్నీ చాలా ఒద్దికగా, సిగ్గరి అయిన అమ్మాయి పాత్రలే. ప్రస్తుతం అమ్మాయిలు బాగా డామినేటింగ్‌గా, చాలా తెలివిగా కూడా ఉంటున్నారు. కొందరైతే మగవాళ్ల కంటే కన్నింగ్‌గా కూడా ప్రవర్తిస్తున్నారు. కాని నిజ జీవితంలో ఇందూ లాంటి మనస్తత్వం ఉన్న అమ్మాయెవరూ నాకు తారస పడలేదు. ఒకవేళ పరిచయమైనా... నేను దూరం పెట్టేస్తాను. డబుల్ ధమాకా.. నాలుగేళ్ల క్రితం దక్షిణాదిలో తొలిసారి తమిళ సినిమా చేశాను. అయితే ఏవో సమస్యలతో అది విడుదల కాలేదు. ఆ తర్వాత కూడా సౌత్ నుంచి ఆఫర్లు వచ్చాయి. కానీ ఒక డిఫరెంట్ రోల్ కోసం వెయిట్ చేశాను. అందుకే ‘ఇందూ’ పాత్రకు ఓకే చెప్పా. చాలా బాగా ప్రారంభమై.. అంతే బాగా ముగిసింది ‘ఆర్ఎక్స్ 100’ జర్నీ. ఈ నెల 15న నా పంజాబీ చిత్రం ‘మిస్టర్ అండ్ మిస్టర్ 420’ కూడా రిలీజైంది. అదీ మంచి హిట్టయింది. ఇటు ‘ఆర్ఎక్స్ 100’, అటు పంజాబీ సినిమా రెండూ హిట్ కావడంతో నాకు డబుల్ ధమాకా అన్నమాట. ‘హీరోయిన్’ నా డ్రీమ్ రోల్... ఆఫర్స్ బాగా వస్తున్నాయి. అయితే నేను ఏవి పడితే అవి అంగీకరించను. ఇందూ హిట్టయింది కాబట్టి... అన్నీ అదే రకమైన నెగెటివ్ క్యారెక్టర్స్ చేయను. ఒకదానికి ఒకటి పొంతన లేని పాత్రలు చేయాలని ఉంది. ఒక అమ్మాయిగా నేను చాలా స్ట్రాంగ్. అందుకేనేమో... పవర్ఫుల్ రోల్స్, ఫీమేల్ ఓరియెంటెడ్ స్టోరీస్ అంటే ఇష్టం. ‘హీరోయిన్’ అనే సినిమాలో కరీనా కపూర్ చేసిన క్యారెక్టర్ లాంటివి చేయాలని ఉంది. ఒక యువతి సినిమా ఇండస్ట్రీలో ఎదుర్కొనే పరిస్థితులకు అద్దం పట్టే అలాంటి పాత్ర ప్రస్తుతానికి నా డ్రీమ్ రోల్ అని చెప్పొచ్చు. ఓ రకంగా ఇందూ కూడా డ్రీమ్ రోల్ లాంటిదే. నేను నార్త్ ఇండియన్ అయినా నా ఫేస్ సౌతిండియన్లా ఉంటుంది అంటున్నారు. బహుశా మా అమ్మ గారి ఫీచర్స్ వల్ల అలా అనిపిస్తున్నానేమో. బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా గుడ్ స్క్రిప్ట్, గుడ్ డైరెక్షన్, మంచి పాత్రలకే నా ప్రాధాన్యత. ‘ఆర్ఎక్స్ 100’ డైరెక్టర్ అజయ్ భూపతి లాంటి దర్శకులు చాలా తక్కువ. ఆయన ఈ సినిమాలో నన్ను అద్భుతంగా పోట్రైట్ చేయించారు. అతనితో మరిన్ని మూవీస్ చేయాలని ఉంది. సిటీలో సెటిల్ అవుతానేమో... స్వీట్స్ అంటే బాగా ఇష్టం. సౌతిండియా ఫ్రెండ్ నుంచి నిన్నే నాకు పెద్ద స్వీట్ ప్యాకెట్ కూడా వచ్చింది (నవ్వుతూ). ఏవి తిన్నా, రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తాను. అన్నింటికన్నా యోగాసనాలు బాగా ఇష్టం. ఈ మధ్య పంజాబ్, హైదరాబాద్ ఎక్కువగా తిరగడం వల్ల 10కిలోలు పెరిగాను. మళ్లీ తగ్గాలి. ప్రస్తుతం ముంబైలో నివస్తున్నాను. కానీ ఐ లవ్ హైదరాబాద్. ఏమో భవిష్యత్తులో ఇక్కడే సెటిల్ అవుతానేమో చెప్పలేను. ఇక్కడ నాకు స్నేహితులు కూడా ఏర్పడ్డారు. తెలుగులో నా తర్వాతి సినిమా గురించి చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నాను. అది అక్టోబరులో ప్రారంభమై డిసెంబరులో రిలీజ్ అవుతుండొచ్చు అనుకుంటున్నాను. ఇంతకు మించి వివరాలు ఇప్పుడే చెప్పలేను. ఐ యామ్ ప్రొఫెషనల్.. ఇకపై కూడా ‘ఆర్ఎక్స్ 100’లో లాంటి బోల్డ్ సీన్స్ ఉన్న పాత్రలు చేస్తారా అంటే... అది దర్శకుడు నాకు నా పాత్ర గురించి, సినిమా కథకు అవెంత వరకు అవసరమో చెప్పి కన్విన్స్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. అయితే అందరూ గుర్తించాల్సింది ఏమిటంటే... ఇక్కడకి నేను నటించడానికి వచ్చాను. మంచి పాత్ర ఇస్తే... నా సత్తా ఏమిటో చూపిస్తా. ఉత్తరాది అమ్మాయిని కాబట్టి ఇన్హిబిషన్స్ తక్కువగా ఉంటాయి. అయితే నేను పూర్తిగా ప్రొఫెషనల్‌ని అనే విషయం కూడా గుర్తుంచుకోవాలి. ప్రతి సినిమాలో ప్రతి ఒక్కరినీ ముద్దు పెట్టుకోవడానికి నేనిక్కడికి రాలేదు. -
శ్రీరెడ్డి వ్యవహారం గురించి అడుగుతున్నారు..
తమిళసినిమా: మహిళలకు ధైర్యం అవసరం అంటోంది నటి ఆండ్రియా. తనకు నచ్చిన విధంగా జీవించే అతి కొద్ది మంది నటీమణుల్లో ఈ జాణ ఒకరని చెప్పకతప్పదు. విమర్శలను, వివాదాలను అసలు పట్టించుకోని నటి ఆండ్రియా. తొలుత గాయనిగా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తరువాత నటిగా తెరపైకి వచ్చింది. అలా పచ్చైక్కిళి ముత్తుచ్చారం, ఆయిరత్తిల్ ఒరువన్, విశ్వరూపం, తరమణి చిత్రాల్లో వైవిధ్యభరిత పాత్రలు పోషించి తనకంటూ సొంత ఇమేజ్ను సంపాదించుకున్న ఆండ్రియా తాజాగా కమలహాసన్‌తో నటించిన విశ్వరూపం–2 చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఈ ముద్దుగుమ్మ ముచ్చట్లు చూద్దాం. విశ్వరూపం చిత్రానికి కొనసాగింపుగానే విశ్వరూపం–2 ఉంటుంది. ఇందులో అశ్విత పాత్రలో నటించాను. తొలి భాగంలో కంటే రెండో భాగంలోనే అశ్విత ఎవరన్నది ప్రేక్షకులకు అర్థం అవుతుంది. చిత్రంలో ఫైట్స్ కూడా చేశాను. ఇంతకు ముందు కాలక్షేపం కోసమే చిత్రాల్లో నటించాను. అయితే విశ్వరూపం చిత్రంలో నటించిన తరువాత సామాజిక బాధ్యత ఎక్కువైంది. దేశ ప్రగతికి ప్రతి ఒక్కరికి బాధ్యత అవసరం. ఎవరి పని వారు చేయడం కాదు. అదే విధంగా పాఠ్యాంశాల్లో విద్యను అభ్యసించడంతదో సరిపోదు. దేశపోకడలను తెలుసుకోవాలి. నటన విషయంలో నిబంధనలు విధిస్తున్నారా అని అడుగుతున్నారు. చిత్రాల్లో నటించడానికి ఎలాంటి నిబంధనలు విధించను. అయితే కథ నాకు నచ్చాలి. అదే ముఖ్యం. విశ్వరూపం–2 చిత్రం తరువాత వడచెన్నై చిత్రంలో నటించాను. ఆ తరువాత ఏ చిత్రంలోనూ నటించలేదు. ఆరు నెలలు ఖాళీగానే ఉన్నాను. ప్రస్తుతం వడచెన్నై డబ్బింగ్ జరుగుతోంది. ఇద్దరు ముగ్గురు హీరోయిన్ల కథా చిత్రాల్లో నటిస్తున్నారే అని అడుగుతున్నారు. అలా నటించడం వల్ల నా స్థాయి తగ్గుతుందని భావించడం లేదు. నా కథా పాత్ర ఏమిటి? దర్శకుడు ఎవరు? అన్న అంశాలపైనే దృష్టి పెడతాను. నేను నటనతో పాటు గాయనీగానూ కొనసాగుతున్నాను. నా దృష్టిలో ఈ రెండూ ఒకటే. ఎందులో అవకాశం వస్తే అది చేస్తాను. ఇటీవల సంచలనంగా మారిన నటి శ్రీరెడ్డి వ్యవహారం గురించి అడుగుతున్నారు. ఆమె చెప్పేది నిజం అయితే వాటిని బహిరంగ పరచానికి చాలా ధైర్యం కావాలి. నాకైతే అలాంటి సంఘటనలు ఎదురు కాలేదు. అలా ఎవరికైనా జరిగితే ధైర్యంగా బయట పెట్టడం కరెక్ట్. అందుకు కారణం అయిన వారిని కఠినంగా శిక్షించాలి. ఇకపోతే ప్యూచర్ ప్లాన్ ఏమిటీ అని అడుగుతున్నారు. నేను మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేస్తానో తెలియదు. అలాంటిది ఫ్యూచర్ ప్లాన్ గురించి అడుతున్నారు. -
నా కూతుర్ని నేనెందుకు అడ్డుకోవాలి?
సౌత్‌తోపాటు నార్త్ మొత్తం అన్ని భాషల్లో నటిస్తూ.. ఇండస్ట్రీలో 38 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు నటుడు అర్జున్ సార్జా. ఆయన తనయ ఐశ్వర్య అర్జున్ ఐదేళ్ల క్రితమే సినిమాల్లోకి అడుగుపెట్టినా.. అదృష్టం అంతగా కలిసి రాలేదు. దీంతో ఆమె తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇదిలా ఉంటే హాట్ టాపిక్ ‘కాస్టింగ్ కౌచ్’ గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో అర్జున్ స్పందించారు. ‘ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉన్న మాట వాస్తవమే. ప్రతీ ఫీల్డ్‌లోనూ అది ఉంది. ఇండస్ట్రీపై చాలా మందికి చెడు అభిప్రాయం ఉండొచ్చు. కానీ, మంచి చెడుల ఎంపిక మన చేతుల్లోనే ఉంటుంది. మంచి మార్గాన్ని ఎంచుకున్నప్పుడూ ఎవరూ అడ్డుకోరు. చెడు రూట్లో వెళ్తే అది వాళ్ల దురదృష్టం. ఏదో జరుగుతుందని నా కూతురిని సినిమాల్లోకి రానీయకుండా నేను అడ్డుకోవాలా? అలాగైతే మిగతా వాళ్ల సంగతి ఏంటి? వాళ్లూ వాళ్ల కూతుళ్లను రానిస్తున్నారు కదా. స్టార్లు కూడా అందుకు మినహాయింపు కాదు. నేను ఇండస్ట్రీలో దాదాపు నలభై ఏళ్లుగా ఉన్నా. అలాంటప్పుడు అన్నీ తెలిసి నేనెందుకు భయపడాలి. నా కూతురిని నేనెందుకు అడ్డుకోవాలి’ అని యాక్షన్ కింగ్ కుండబద్ధలు కొట్టేశారు. -
చాలా రకాలుగా బాధిస్తున్నారు
తమిళసినిమా: మహిళకెక్కడ మర్యాదు అంటూ మరోసారి వార్తల్లోకొచ్చింది సంచలన నటి రాయ్‌లక్ష్మి. అందాలారబోతలో గానీ, ప్రేమ వ్యవహారంలో గానీ ఈ బ్యూటీపై చాలా వదంతులే ప్రచారంలో ఉన్నాయి. ఆ మధ్య బాలీవుడ్‌కు వెళ్లి జూలీ–2 చిత్రంలో టూ పీస్ దుస్తులతో పెద్ద దుమారానికి తెరలేపిన రాయ్‌లక్ష్మీ ఇటీవల ఎక్కడా కనిపించలేదు. నటనపై కంటే గ్లామర్‌నే ఎక్కువగా నమ్ముకున్న ఈ అమ్మడు ఆ దిశగానే అవకాశాలను రాబట్టుకుంటోంది. ఐటమ్ సాంగ్స్‌లో నటించడానికి సై అనే రాయ్‌లక్ష్మి ఈ మధ్య తెలుగులో చిరంజీవితో ఖైదీ నంబర్ 150 చిత్రంలో రత్తాలు రత్తాలు పాటలో దుమ్మురేపిన విషయం తెలిసిందే. చిన్న గ్యాప్ తరువాత మళ్లీ సంచలనాలకు రెడీ అయ్యింది. చేతిలో చిత్రాలు బాగానే ఉన్నాయి. కోలీవుడ్‌లో నీయా 2, యాగం నాలుగు చిత్రాల్లో నటిస్తోంది. ఇది ఈ అమ్మడికి ఒకరకంగా రీఎంట్రీ అనే చెప్పాలి. ఎందుకుంటే కోలీవుడ్‌లో రాయ్‌లక్ష్మిని చూసి చాలా కాలమైంది. కాగా ఏ విషయానైన్నా కుండబద్దలు కొట్టినట్లు చెప్పే రాయ్‌లక్ష్మీని ఇటీవల దక్షిణాదిలో కలకలం సృష్టిస్తున్న కాస్టింగ్ కౌచ్ గురించి ఎలా స్పందిస్తారన్న ప్రశ్నించగా మీకో విషయం చెప్పాలి సినీరంగంలోనే కాదు, ఏ రంగంలోనైనా మహిళలకు మర్యాదు తక్కువేనని చెప్పింది. ముఖ్యంగా పని కోసం కొత్తగా వచ్చే మహిళలు ఇలాంటి అఘాయిత్యాలకు గురవుతున్నారని అంది. ఇకపోతే కాస్టింగ్ కౌచ్ అన్నది తనకు ప్రత్యక్షంగా ఎదురవలేదని చెప్పింది. అయితే సినిమా రంగానికి కొత్తగా వచ్చే వారిని తక్కువ చేసి మాట్లాడడానికి ఇక్కడ చాలా మంది ఉన్నారని అంది. అది అత్యాచారం వంటి విషయాల్లోనే కాదు ఇంకా చాలా రకాలుగా బాధిస్తున్నారని రాయ్‌లక్ష్మి పేర్కొంది. -
స్త్రీలోక సంచారం
భారతదేశంలో బ్రెస్ట్ క్యాన్సర్‌కు గురయ్యే మహిళల సగటు వయసు పశ్చిమ దేశాలకన్నా దాదాపు దశాబ్దకాలం తక్కువగా ఉంటోందని, కొత్తగా బ్రెస్ట్ క్యాన్సర్ బయట పడిన ప్రతి ఇద్దరు మహిళల్లో ఒకరు మరణానికి చేరువవుతున్నారని నోయిడాలోని ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ప్రివెన్షన్ అండ్ రిసెర్చ్’ తన తాజా నివేదికలో వెల్లడించింది! సైలెంట్ కిల్లర్‌లా విస్తరిస్తూ దేశంలో ప్రతి 8 నిముషాలకూ ఒక మహిళ గర్భాయ క్యాన్సర్‌తో మరణించడానికి కూడా కారణమౌతున్న పరిస్థితులపై తగిన అవగాహన కల్పించన ట్లయితే ఈ మరణాల సంఖ్య పెరిగిపోయే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది. ► రుతుక్రమంపై ప్రాచీన కాలంలో మన దేశంలో ఉన్న అపోహల గురించి వింటే నవ్వొస్తుందని నటి రాధికా ఆప్టే అన్నారు. రుతుక్రమ పారిశుధ్య కథాంశంతో అక్షయ్ కుమార్, సోనమ్ కపూర్లతో కలిసి ఆప్టే నటించిన ‘ప్యాడ్ మాన్’ చిత్రం ఆగస్టు 12న టీవీలో ప్రసారం అవుతున్న సందర్భంగా ఆప్టే ఒక ప్రకటన విడుదల చేస్తూ.. రుతుక్రమం అనే ఒక ప్రకృతిసిద్ధమైన దేహధర్మం చుట్టూ అల్లుకున్న అపోహలతో పాటు, యువతుల్లో బిడియాన్నీ పోగొట్టేందుకు సమాజంలో మరిన్ని ప్రయత్నాలు జరగవలసిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ► బిహార్, ముజఫర్‌ఫూర్‌లోని ఒక షెల్టర్ హోమ్‌లో మైనరు బాలికలపై జరిగిన అత్యాచారాలకు బాధ్యత వహిస్తూ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తక్షణం రాజీనామా చేయాలని మంగళవారం నాడు ఢిల్లీలో అనేక పౌర సంఘాలు భారీ ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిపాయి. ‘బేటీ బచావో బేటీ పఢావో’ కోసం కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్న కేంద్ర ప్రభుత్వం.. బిహార్‌తో పాటు దేశంలోని అనేక రాష్ట్రాల్లో చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను ఆపలేకపోతోందని చాణక్యపురిలోని బిహార్ భవన్ ఎదుట జరిగిన ఆందోళన కార్యక్రమంలో ‘నేషనల్ ఫెడరేషన్ ఫర్ ఇండియన్ ఉమె¯Œ ’ ప్రధాన కార్యదర్శి యానీ రాజా విమర్శించారు. ► మహిళలకు భారతదేశం సురక్షితమైన ప్రదేశం కాదని ప్రపంచ దేశాలన్నీ ఇక్కడికి వచ్చేందుకు విముఖత ప్రదర్శిస్తోంటే.. అమెరికన్ మోడల్, నటి అంబర్ రోజ్ మాత్రం ఎవరైనా తనను భారతదేశానికి ఆహ్వానిస్తే బాగుండునని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారట! గత ఏడాది భారత్‌లో పర్యటించి, హిప్హాప్ ప్రదర్శన ఇచ్చిన ఆమె బాయ్‌ఫ్రెండ్ విజ్ ఖలీఫా.. ‘భారత్ తప్పక చూసి తీరవలసిన’ ప్రదేశం అని తనతో అన్నప్పటి నుంచీ ఆమె ఇండియా వచ్చేందుకు తహతహలాడిపోతున్నారట. ► కొన్నేళ్ల క్రితం ‘కాస్టింగ్ కౌచ్’ పై తన అభిప్రాయాన్ని ధైర్యంగా వ్యక్తం చేసి, ఎనిమిది నెలల పాటు అవకాశాలను కోల్పోయిన అదితీరావ్ హైదరీ మళ్లీ ఈ టాపిక్‌పై నిక్కచ్చిగా మాట్లాడుతూ.. ‘ఇష్టం లేని పనిని ఎవరూ ఎవరి చేతా బలవంతంగా చేయించకూడదు’ అన్నారు. ‘సండే గార్డియన్’కి ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో.. అవకాశాలను అశగా చూపించి, అమ్మాయిలను లోబరుచుకునే హీనమైన సంస్కృతిపై ఆమె తారస్థాయిలో విరుచుకుపడ్డారు. ► అమెరికా ప్రతిపక్ష ‘డెమొక్రాటిక్’ పార్టీ జాతీయ కమిటి సి.ఇ.వో.గా పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి భారతీయ సంతతి మహిళ సీమా నందా.. నవంబరులో జరగనున్న అత్యంత కీలకమైన మధ్యంతర ఎన్నికల్లో మూలమూలలా డెమోక్రాట్లే గెలిచేందుకు సర్వశక్తులను ఒడ్డుతానని ప్రతిజ్ఞ చేశారు. అమెరికా ఆత్మను తిరిగి ప్రతిష్ఠించేందుకు తను చేయబోతున్న పోరాటంలో విశ్రమించేది లేదని చెబుతున్న సీమ.. ‘డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ’కి సారథ్యం వహించేందుకు తనకు లభించిన అవకాశాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ► చైనాలోని బ్రిటిష్ విదేశాంగ కార్యదర్శి జెరెమీ హంట్.. బీజింగ్‌లో చైనా విదేశాంగ మంత్రి వాంగీతో కలిసి పాల్గొన్న దౌత్య అధికారుల సమావేశంలో జెరెమీ హంట్ పొరపాటున తన భార్య లూసియా గొవో జపాన్ సంతతి మహిళ అని చెప్పడం విశేషవార్త అయింది! ఆయన పొరపాటుగానే అన్నప్పటికీ.. చైనా, జపాన్ దేశాల మధ్య దీర్ఘకాలంగా కొనసాగుతున్న సైనిక వైరాల కారణంగా.. వెంటనే తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూ, ‘నా భార్య చైనా దేశస్థురాలు, నా పిల్లలు సగం చైనా సంతతి వారు. వారి అమ్మమ్మ, తాతయ్య కూడా చైనా వాళ్లే’ అని పనిగట్టుకుని చెప్పవలసి వచ్చింది. ► ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పార్లమెంటు సెంట్రల్ హాల్లో కూర్చుని ఉన్న మహిళా ఎంపీల మధ్య.. ఎవరు చక్కగా డ్రెస్ చేసుకున్నారనే చర్చ వచ్చినప్పుడు మొదటి రెండు స్థానాల్లో సోనియాగాంధీ, సుప్రియా సూలె నిలిచారని ప్రముఖ ఆంగ్ల జాతీయ దిన పత్రిక ఒకటి పేర్కొంది! ఉత్తరప్రదేశ్‌లోని మధుర ఎంపీ హేమమాలిని కూడా వారి మధ్యలో కూర్చొని ఉన్నప్పటికీ, సినీ నటి కనుక వారు ఆమెను పరిగణనలోకి తీసుకోలేదని చెబుతూ, మహరాష్ట్రలోని బారామతి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సుప్రియ గత నాలుగేళ్లుగా కట్టిన చీర కట్టడం లేదని ఒక సభ్యురాలు అన్నారని ఆ పత్రిక రాసింది. -
నేడు విచారణకు శ్రీరెడ్డి పిటిషన్
సాక్షి, హైదరాబాద్ : గత కొంతకాలం నుంచి టాలీవుడ్లో జరుగుతున్న కాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న నటి శ్రీరెడ్డి. వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చిన అనంతరం దర్శకులు, నిర్మాతలు, అగ్రహీరోలు అని ఏ భేదం లేకుండా ఇండస్ట్రీలో పలువురిపై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్‌పై హైకోర్టులో శ్రీరెడ్డి ఇటీవల ఓ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఇటీవల సినీ ఇండస్ట్రీలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలపై సీబీఐతో ఎంక్వైరీ చేయించాలని శ్రీరెడ్డి విజ్ఞప్తి చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆ పిటిషన్ విచారణకు రానుంది. పిటిషనర్ శ్రీరెడ్డి తరఫున సీనియర్ అడ్వకేట్ కళానిధి వాదనలు వినిపించనున్నారు. టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్ (తమిళ సినీ పరిశ్రమ)కు చెందిన మురగదాస్, లారెన్స్, విశాల్‌లపై కూడా ఆరోపణలు చేశారు. వ్యభిచారం లాంటి వాటిలో అనుకోకుండా తానే పాల్గొన్నట్లు పరోక్షంగా శ్రీరెడ్డే వ్యాఖ్యానించారని, అందుకే కేసులు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేయాలని నడిగర్ సంఘం పోలీసులను కోరింది. కాగా, హైకోర్టు శ్రీరెడ్డి పిటిషన్‌పై ఎలా స్పందిస్తుందోనని ఇండస్ట్రీ ప్రముఖులతో పాటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. -
కాస్టింగ్ కౌచ్.. దెబ్బకి ఇండస్ట్రీకి దూరమైందంట!
తెలుగు నేపథ్యం ఉన్న బ్యూటీ అదితి రావు హైదరి అటు బాలీవుడ్‌తోపాటు ఇటు సౌత్ ఇండస్ట్రీలోనూ వరుస ఆఫర్లతో దూసుకుపోతోంది. 2006లో మాలీవుడ్ ద్వారా సినిమాల్లోకి అడుగుపెట్టిన ఈ భామ.. మధ్యలో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆ గ్యాప్‌కు కారణం ఏంటన్నది తాజాగా సండే గార్డియన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు. కాస్టింగ్ కౌచ్ మూలంగానే కొన్ని నెలలపాటు ఆమె సినిమాలకు దూరం అయ్యారంట. ‘2013లో ఓ బాలీవుడ్ మేకర్ నా దగ్గరికొచ్చి ఓ సినిమా ఆఫర్ ఉందని చెప్పాడు. అయితే అందుకోసం నేను కాంప్రమైజ్ కావాలంటూ కోరాడు. చిర్రెత్తుకొచ్చేసింది. అక్కడి నుంచి వెళ్లిపోయా. ఏడ్చేశా.. ఎంత ధైర్యం వాడికి?.. ఇలాంటి తప్పుడు దారుల్లో ప్రయాణించి అనుకున్నది సాధించటం నాకు అవసరమా అనిపించింది. కొన్ని నెలలు ఖాళీగా ఉన్నా. కానీ, కొంత కాలానికి అవకాశాలు వాటికవే రావటం ప్రారంభించాయి. టాలెంట్ ఉంటే నిజాయితీగా సినిమాల్లో రాణించొచ్చన్న విషయం అప్పుడు అర్థమైంది’ అని ఆమె తెలిపారు. కాస్త ఓపికగా ఉంటే సరైన అవకాశాలు వచ్చి పడతాయని, అందుకే తానే ఉదాహరణ అని ఆమె కొత్తవాళ్లకు సలహా ఇస్తున్నారు. ఈ మధ్యే ‘సమ్మోహనం’తో మెరిసిన ఈ బ్యూటీ.. ప్రస్తుతం అదితి మణిరత్నం మల్టీస్టారర్ ప్రాజెక్టు ’చెక్కా చివంత వానమ్’తోపాటు సుధీర్ మిశ్రా ‘దాస్ దేవ్’లో కూడా నటిస్తున్నారు. -
శ్రీ రెడ్డిని చూస్తే జాలేస్తోంది
నటి శ్రీ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై కొరియోగ్రాఫర్ కమ్ హీరో రాఘవ లారెన్స్ స్పందించారు. గత కొంత కాలంగా తమిళ సినీ ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని శ్రీ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో లారెన్స్పైనా ఆరోపణలు చేయగా.. ఆయన ఖండించారు. తాజాగా ట్విటర్లో ఆయన మరోసారి స్పందించారు. ‘శ్రీరెడ్డి ఆరోపణల తర్వాత నాకు చాలా మంది నుంచి ఫోన్‌కాల్స్ వచ్చాయి. ఆమెతో వివాదం గురించి అడుగుతున్నారు. దాంతో ఆమెతో ఉన్న వివాదానికి ముగింపు పలకాలని అనుకొంటున్నాను’ అని రాఘవ ట్వీట్లో పేర్కొన్నారు. ట్వీట్లో ఏముందంటే.. ‘తెలుగులో రెబెల్ సినిమా షూటింగ్ సమయంలో శ్రీ రెడ్డి నన్ను కలిసింది. ఆ మూవీ పూర్తై ఇప్పటికీ 7 ఏళ్లు గడిచిపోయింది. అప్పటి నుంచి నాపై ఈ ఆరోపణలను ఆమె ఎందుకు చేయలేదు?.. హోటల్ రూమ్‌లో కలిసి తనతో అసభ్యంగా ప్రవర్తించానని అంది. అలాగే నా హోటల్ రూంలో రుద్రక్షమాల, దేవుడి ఫొటోలు చూశానని చెప్పింది. హోటల్లో రుద్రాక్ష మాలా ఉంచుకోవడం, పూజాలు చేయడానికి నేనేమైనా పిచ్చివాడినా? అని ఆయన పేర్కొన్నారు. శ్రీ రెడ్డిని చూస్తే జాలేస్తోంది: ... ‘శ్రీ రెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తోంది. ఇప్పటికీ నా సినిమాలో అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. అందుకు ఓ ప్రెస్‌మీట్ పెడతాను. మీడియా ముందు ఓ కార్యెక్టర్, సీన్ పేపర్ ఇస్తాను. యాక్టింగ్‌తోపాటు కొన్ని స్టెప్పులు నాతోపాటు వేసి చూపించు. అలాగని నేను నీకు కష్టమైన స్టెప్పులు ఇవ్వను. సింపుల్ స్టెప్స్ మాత్రమే ఇస్తాను. నీలో నటనలో బేసిక్స్, టాలెంట్ ఉందని భావిస్తే వెంటనే నా నెక్స్ట్ మూవీలో ఛాన్స్ ఇస్తా. అడ్వాన్స్ కూడా వెంటనే ఇచ్చేస్తా. నా సినిమాలో నటిస్తే తర్వాత నీకు మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ ప్రెస్మీట్లో నీకు అందరి ముందు నటించడానికి ఇష్టం లేకపోతే నా మేనేజర్‌ను క్లవండి. మీతోపాటు లాయర్‌ను లేదా మీ సన్నిహితులు ఎవరినైనా తెచ్చుకొండి. మీ టాలెంట్‌ను నిరూపించుకోండి. నేను మీకు ఎలాంటి సహాయమైనా చేయడానికి సిద్ధం’ అని శ్రీ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. శ్రీ రెడ్డి చేసిన ఆరోపణలకు భయపడి తాను ఈ సమాధానం ఇవ్వడం లేదని.. మహిళలను గౌరవిస్తాను కాబట్టే ఆ మచ్చను తొలగించుకునేందుకే ఈ వివరణ ఇస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. తల్లి కోసం గుడి కట్టిన నేను మహిళల పట్ల ఎప్పుడూ గౌరవంగా మెదులుతానని.. మంచి చేయటం. మాట్లాడటం మాత్రమే తనకు తెలుసని ఆయన అన్నారు. శ్రీ రెడ్డి జీవితం బాగుండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అని లారెన్స్ చెప్పుకొచ్చారు. కాగా, టాలీవుడ్ తర్వాత కోలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై ఉద్యమిస్తున్నట్టు చెప్పుకొంటున్న శ్రీరెడ్డి ఇటీవల కాలంలో ప్రముఖులపై ఘాటైన వ్యాఖ్యలతో పోస్టులు పెడుతున్నారు. -
శ్రీరెడ్డిపై ప్రముఖ దర్శకుడు ఫైర్
పెరంబూరు: టాలీవుడ్లో కాస్టింగ్ కౌచ్ అంటూ పలువురు సినీ ప్రముఖులపై ఆరోపణలు చేసి కలకలం సృష్టించిన నటి శ్రీరెడ్డి తాజాగా కోలీవుడ్‌పై పడ్డారు. ఇక్కడ ప్రముఖ దర్శకుడు ఎఆర్.మురుగదాస్, సుందర్.సి, నటుడు శ్రీకాంత్ (తెలుగులో శ్రీరామ్) వంటి వారు అవకాశాల కోసం ఆశ చూపి తనను వాడుకున్నారంటూ ఆరోపణలు చేసి సంచలనం సృష్టించారు. కాగా శ్రీరెడ్డి చర్యలకు కోలీవుడ్‌లో పలువురు ధ్వజమెత్తుతున్నారు. నటుడు వారాహి ఆమెపై చెన్నై కమిషనర్ కార్యలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో మరో సీనియర్ దర్శకుడు భారతీరాజా ఈ కాస్టింగ్ కౌచ్ వ్యవహారంపై స్పందిస్తూ.. శ్రీరెడ్డి సమ్మతంతోనే అన్నీ జరిగాయని పేర్కొన్నారు. అలాంటిది ఆమె వాటితో ప్రచారం పొందాలనుకోవడం సరైన పద్ధతి కాదని ధ్వజమెత్తారు. శ్రీరెడ్డి సినిమా వారినందరినీ తప్పుపట్టడం సరికాదని భారతీరాజా సూచించారు. -
తెలుగు ఆర్టిస్టులను ఎంకరేజ్ చేయాలని