తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడినే అంటున్నాడు టీవీ నటుడు అంకిత్ సివాచ్. మోడల్‌గా 12 ఏళ్ల క్రితమే కెరీర్ ఆరంభించిన ఈ నటుడు 2017లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. పలు హిందీ సీరియళ్లలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అంకిత్. అయితే ఒకానొక సమయంలో అన్నీ వదిలేసి వెనక్కు వెళ్లిపోవాలనుకున్నానంటూ కాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకున్నాడు.
'అందరూ మంచివాళ్లు అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని. కానీ అలా అనుకోవడమే నా బలహీనతగా మారింది. ఈ వీక్‌నెస్‌ను ఎదుటివాళ్లు యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ చెడు కూడా ఉంటుంది. కానీ అది రాక్షసత్వంగా మారి మిమ్మల్ని ముప్పుతిప్పలు పెట్టొచ్చు. మోడలింగ్ చేసేటప్పుడు నేను అలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నాను. ఒంటి మీద బట్టలు లేకుండా ఫొటోలు పంపమనేవారు. నాకు ఇచ్చిన పనితో సంబంధం లేకుండా పార్టీలకు రావాలనేవారు.
నన్ను వేధింపులకు గురి చేశారు. చాలాసార్లు మోడలింగ్ మానేద్దామా అనిపించింది. కొంతమందిని చూసినప్పుడు మన కళ్ల ముందు రాబంధులు నిలబడి మనల్ని పీక్కు తినడానికి వస్తున్నాయనిపించేది. అలాంటివారిని చూసినప్పుడు అన్నీ వదిలేసి వెనక్కు వెళ్లిపోదాం అనిపించేది. దీనివల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యా. కుమిలిపోయాను. కానీ అధికారంలో ఉన్నవారు ఇతరులను దగా చేయడం మానవ స్వభావమని నన్ను నేను సంభాలించుకున్నాను.
ఇది ప్రతి ఇండస్ట్రీలో ఉంది. వాటినుంచి మనం తప్పించుకోలేము. ఏదో ఒకసారి ఫేస్ చేయాల్సిందే. అలా నాకు ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయి. నీకు ఇష్టమున్నా లేకపోయినా నీ కెరీర్ కోసమైనా ఆ పని చేసి తీరాల్సిందే అని ఒత్తిడి తెచ్చినవాళ్లు కూడా ఉన్నారు. అప్పుడు నేను స్వయంకృషితో ఎదిగిన సెలబ్రిటీల గురించి ఉదాహరణగా చెప్పేవాడిని. మేము చెప్పినదానికి కాంప్రమైజ్ కాకుండా నువ్వు ముందుకు వెళ్లగలననుకుంటున్నావా? అని బెదిరించేవాళ్లు కూడా!' అని చెప్పుకొచ్చాడు అంకిత్ సివాచ్.
చదవండి: ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు..
ప్రియుడితో లేచిపోయారంటూ వచ్చిన వార్తలపై రాజశేఖర్ కూతురు ఫైర్
Comments
Please login to add a commentAdd a comment