serial actor
-
సిక్స్ ప్యాక్‌తో కండలవీరుడుగా బిగ్‌బాస్ బ్యూటీ ప్రియుడు (ఫోటోలు)
-
మహేష్ బాబుతో నటించాలన్నదే నా చిరకాల కోరిక..
సీతమ్మధార(విశాఖ): అటు అందం.. ఇటు అభినయం కలగలిపిన విశాఖ సోయగం హేమలతారెడ్డి.. గ్లామర్ ఫీల్డ్‌లో పాదరసంలా దూసుకుపోతున్నారు. బుల్లితెర, వెండితెర, ఫ్యాషన్ రంగాల్లో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పలు టీవీ చానళ్లలో యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె దినదిన ప్రవర్థమానంగా ఎదుగుతూ వచ్చారు. అటు సీరియళ్లు, సినిమాలు.. ఇటు ఫ్యాషన్ రంగంలో విజయాలతో తన కలలను సాకారం చేసుకుంటున్నారు. వెండితెరపై నా పేరుండాలి.. నా నటన అందరూ గుర్తు పెట్టుకోవాలి.. అని అంటున్న ఆమె హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఇటీవల ఓ ఈవెంట్లో పాల్గొనేందుకు విశాఖ వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు. విశాఖలోనే ఓనమాలు విశాఖ నటనలో నాకు ఓనమాలు నేర్పింది. ఇక్కడ ఎన్నో విషయాలు నేర్చుకున్నా.. ఇప్పుడీస్థాయిలో ఉండడానికి కారణం నా తల్లిదండ్రులే. డాబాగార్డెన్స్‌లో ఉంటున్నాం. నాన్న సూర్య దేవర వెంకటరావు నేవీలో పనిచేసి రిటైరయ్యారు. ఇక్కడే సెటిల్ అయ్యారు. చదువుంతా సెయింట్ జోసెఫ్ విద్యాసంస్థలో సాగింది. తాను ఇంటర్ వరకు అక్కడే చదివా. తర్వాత ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఏ క్లాసికల్ చేశా. తల్లి ధనలక్ష్మి ఫైనాన్స్ వ్యాపారం.న్యూస్‌రీడర్ నుంచి హీరోయిన్ వరకు.. నాన్న నన్ను న్యూస్ రీడర్‌గా చూడాలనుకున్నారు. ముందుగా టీవీ 9, తర్వాత ఎన్టీవీలో ఎంటర్టైన్మెంట్ షోలు చేశా. ఎందరో హీరోయిన్లను ఇంటర్వ్యూ చేశా. జెమిని టీవీలో సినిమా న్యూస్‌రీడర్‌గా చేశా. మంచు విష్ణు నిర్మించిన హ్యాపీడేస్ సీరియల్లో కల్యాణి పాత్రలో నటించా. ఆ సీరియల్‌కు, అందులో నా పాత్రకు మంచి ఆదరణ లభించింది. అంతఃపురం, క్రైమ్ తదితర సీరియల్స్ చేశాను. జెమిని, మా టీవిలో నేను నటించిన సీరియల్స్ ప్రసారమయ్యాయి. నేను ఇప్పటివరకు సుమారుగా 20 వరకు సీరియల్స్‌లో నటించాను. గతంలో విశాఖ బిగ్ ఎఫ్ఎంలో జాబ్ కోసం ట్రై చేశా. ఇప్పుడు అదే ఎఫ్ఎంలో నన్ను ఇంటర్వ్యూ అడగడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేష్ బాబుతో నటించాలన్నదే నా చిరకాల కోరిక. సౌందర్య, సమంత తన అభిమాన హీరోయిన్లు. తెలుగు హీరోయిన్లు అంజలి, వైష్ణవి సినిమాల్లో రాణిస్తున్నారు. వారి లాగే నన్ను ప్రేక్షకులు ఆదరిస్తున్నందుకు ఆనందంగా ఉంది. వీరభద్ర క్రియేషన్స్ పేరిట సొంత బ్యానర్ 2017లో ప్రారంభించాను.గ్లామర్ ఆన్ మిసెస్ ఇండియా అవార్డుతో విశాఖలో జని్మంచిన పోతురెడ్డి హేమలతా రెడ్డి మలేసియాలో జరిగిన గ్లామ్ ఆన్ మిసెస్ ఇండియాగా నిలిచారు. మొదట లోకల్ టీవీ, జెమినీ టీవీ యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె.. ఆ తర్వాత పలు షోలో పాల్గొన్నారు. హ్యాపీడేస్ సీరియల్లో లీడ్ రోల్ చేసి బుల్లితెర ప్రేక్షకుల మనసులు దోచుకున్నారు. అనంతరం హీరో జగపతిబాబుతో ప్రవరాఖ్యుడు సినిమాలో నటించారు. అందులో హేమలతా రెడ్డి హీరోయిన్ ప్రియమణి స్నేహితురాలిగా నటించారు. నిన్నే చూసి సినిమాలో హీరోయిన్గా నటించి నిర్మాతగా వ్వవహరించారు. అక్కడ నుంచి మిసెస్ ఇండియా పోటీలో విశాఖ నుంచి ప్రాతినిథ్యం వహించి ప్రపంచ వ్యాప్తంగా 300 మందిలో విజేతగా నిలిచారు. -
నా మొదటి భార్య అలాంటిది.. అందుకే రెండో పెళ్లి: నటుడు
ఈ రోజుల్లో బట్టతల, బయటకు తన్నుకొచ్చిన పొట్ట కామన్ అయిపోయింది. కానీ పెళ్లి చేసుకునేవరకైనా ఆ రెండింటినీ అడ్డుకోవాలని లేదా కవర్ చేసుకోవాలని ప్రయత్నించేవాళ్లు బోలెడు. అయితే మలయాళ బుల్లితెర నటుడు క్రిస్ వేణుగోపాల్ మాత్రం నెరిసిన గడ్డం, బట్టతలతోనే పెళ్లి చేసుకున్నాడు. ముసలాడిగానే పెళ్లిపీటలపై కూర్చుని ప్రేయసి మెడలో మూడు ముళ్లు వేశాడు. పిల్లల ఎదుటే రెండో పెళ్లి చేసుకున్నాడు.దంపతులపై ట్రోలింగ్ఇది చూసిన జనం నోరెళ్లబెట్టారు. సోషల్ మీడియా వేదికగా వేణుగోపాల్‌ను, నటి దివ్య శ్రీధర్‌ను తిట్టిపోస్తున్నారు. ఈ వయసులో రెండో పెళ్లేంటని విమర్శిస్తున్నారు. ఈ ట్రోలింగ్‌తో కొత్త జంట ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో దివ్య శ్రీధర్ స్పందిస్తూ.. తమ వయసు మరీ ఎక్కువేమి కాదని పెదవి విప్పింది. తన వయసు 40, క్రిస్ వయసు 49 అని పేర్కొంది. తాము శారీరక వాంఛ కోసం పెళ్లి చేసుకోలేదని, ఒకరికొకరం తోడు కోరుకున్నామని వెల్లడించింది.కుటుంబానికి కూడా దూరంక్రిస్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. మొదటి భార్యతో నేను సంతోషంగా లేను. నా స్వేచ్ఛను దూరం చేసింది. ఆమె నా కుటుంబంతో కూడా మాట్లాడనిచ్చేదికాదు. ఎన్నో షరతులు విధించేది. ఎవరూ మా ఇంటికి వచ్చేవారు కాదు. కనీసం ఫోన్లో మాట్లాడేందుకు కూడా ఒప్పుకునేది కాదు. నేను మనిషిలా కాకుండా ఒక పెంపుడు జంతువులా ఉండేవాడిని. జీవితంపైనే విరక్తి వచ్చింది. దాని నుంచి విముక్తి కోరుకున్నాను.అందుకే రెండో పెళ్లి2019లో విడాకులకు దరఖాస్తు చేయగా 2022లో మంజూరయ్యాయి. కానీ కొన్ని నెలలకు ఏ తోడూ లేకుండా బతకడం కష్టంగా అనిపించింది. అందుకే దివ్యను పెళ్లి చేసుకున్నాను. చాలామంది మా రెండో పెళ్లి గురించి తప్పుగా మాట్లాడుతుంటే బాధగా ఉంది అన్నాడు. కాగా క్రిస్ వేణుగోపాల్, దివ్య శ్రీధర్.. ఇద్దరికీ ఇది రెండో వివాహమే! క్రిస్ వేణుగోపాల్ పాతరమట్టు సీరియల్లో తాతగా నటించాడు. పలు సీరియల్స్‌లో యాక్ట్ చేసిన ఇతడు పల్లు రైజింగ్, తెలివు, సంబవస్తలతు నిన్నుమ్ వంటి చిత్రాల్లోనూ నటించాడు.చదవండి: ఎట్టకేలకు బయటకొచ్చిన హర్షసాయి.. కేసు గురించి.. -
భార్య చెప్పిందని ఆఫర్ వదులుకున్న నటుడు? ఇంద్రనీల్ ఏమన్నాడంటే?
రెండు రోజుల్లో బిగ్‌బాస్ షో ప్రారంభం కానుంది. కంటెస్టెంట్లు వీళ్లేనంటూ ఎంతోమంది పేర్లు ప్రచారంలోకి చ్చాయి. వారిలో ఆదిత్య ఓం, అంజలి పవన్, నిఖిల్, అభిరామ్ వర్మ, బెజవాడ బేబక్క, కిర్రాక్ సీత, శేఖర్ భాషా, నైనిక, మణికంఠ, కల్యాణి, రవితేజ, విష్ణు ప్రియ ఉన్నారు. వీరే కాదు, కృష్ణ ముకుంద మురారీ సీరియల్లో నటించిన ప్రేరణ, యష్మిని గౌడ కూడా ఈ సీజన్లో సందడి చేయనున్నారట! అలాగే దర్శకుడు పరమేశ్వర్‌ను సంప్రదించారని ప్రచారం జరుగుతోంది.బిగ్‌బాస్ టీమ్ సంప్రదింపులుమొన్నటివరకైతే మొఘలిరేకులు ఫేమ్ ఇంద్రనీల్ కూడా బిగ్‌బాస్‌కు రాబోతున్నాడని ఓ వార్త వైరలయింది. దీనిపై ఇంద్రనీల్ తన యూట్యూబ్ ఛానల్లో స్పందించాడు. అతడు మాట్లాడుతూ.. బిగ్‌బాస్ టీమ్ నన్ను సంప్రదించిన మాట వాస్తవమే.. కానీ నాకు ఆసక్తి లేదని చెప్పేశాను. నాలాంటివాళ్లకు ఇలాంటి రియాలిటీ షోలు సెట్టవవు. అయితే కొందరు మా గురించి వింతగా మాట్లాడారు. మా ఆవిడకు ఇష్టం లేదని, తను వద్దని చెప్పడంతో నేను షోలో పాల్గొనడం లేదని ఓ రివ్యూయర్ కామెంట్లు చేసింది. అది చూసి నవ్వుకున్నాం.మా లైఫ్‌లోకి దూరొద్దుఇంకొకరైతే బిగ్‌బాస్‌కు వస్తే మా పచ్చళ్ల బిజినెస్ పెరుగుతుందని ఫూలిష్‌గా మాట్లాడారు. ఎవరైనా షోకి వెళ్లి పచ్చళ్లు అమ్ముకుంటారా? అసలు మాకు లేని ఆసక్తి మీకెందుకు? నా కెరీర్లో ఇప్పటివరకు అన్ని నిర్ణయాలు నా సొంతంగానే తీసుకున్నాను. నా భార్య ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. మేమిద్దరం ఎవరి కెరీర్ వాళ్లం చూసుకుంటున్నాం. అనవసరంగా ఏదేదో ఊహించుకుని మాట్లాడొద్దు. మా వ్యక్తిగత జీవితంలోకి దూరొద్దు. ఈసారైతే బిగ్‌బాస్‌కు వెళ్లడం లేదు అని క్లారిటీ ఇచ్చాడు.చదవండి: ఏంది స్వామీ ఆ స్పీడు.. అదేం షూటింగ్ కాదు..కాస్తా తగ్గించు! -
Serial Actor Chandu: నేను పిచ్చివాడినైపోతా.. నటుడు చందు చివరి మాటలు వైరల్
తెలుగు సీరియల్ నటుడు చంద్రకాంత్ మరణంతో అతడి కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఇటీవల పవిత్రతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సమయంలో యాక్సిడెంట్ జరగ్గా అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో నటి పవిత్ర గుండెపోటుతో కన్నుమూసింది. ప్రియురాలి మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన చందు ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. ఐదేళ్లుగా నటితో సహజీవనంతల్లిని, కట్టుకున్న భార్యను, పిల్లలను వదిలేసి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలో అతడి వాట్సాప్ చాట్ ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. పవిత్రను ప్రేమించాక భార్యాపిల్లల్ని వదిలేశాడు చందు. ఐదేళ్లుగా నటితోనే కలిసుంటున్నాడు. సడన్‌గా ఆమె తనను వదిలేసి పోవడంతో చందు డిప్రెషన్లోకి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో వాట్సాప్‌లో తన సహనటి కరాటే కల్యాణికి మెసేజ్‌లు చేశాడు.ఈ జన్మకు చాలునేను వెళ్లిపోతాను.. ఈ జన్మకు ఇక చాలు.. కానీ అప్పుడే ఎవరికీ చెప్పకండి అన్నాడు. అలా మాట్లాడొద్దని ఆమె వారిస్తున్నా ఆ మాటల్ని లెక్క చేయలేదు. నేను వెళ్లిపోతేనే కరెక్ట్. లేదంటే నేను పిచ్చోడిని అయిపోతా, తాగుబోతునైపోయి ఇంట్లోవాళ్లను ఇబ్బంది పెడతాను అంటూ ఏడుస్తున్న ఎమోజీని షేర్ చేశాడు. ఈ చాట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.చదవండి: చనిపోతానని ముందే హింటిచ్చిన నటుడు.. ఐదేళ్ల నుంచి పట్టించుకోట్లేదంటూ విలపించిన తల్లి -
చందు వైఫ్ షాకింగ్ కామెంట్స్
-
చందు సూసైడ్ వెనక సంచలన నిజాలు
-
పవిత్ర భర్త చంద్రకాంత్ సూసైడ్
-
రోడ్డు ప్రమాదం వల్ల పవిత్ర చనిపోలేదు.. అసలు కారణం ఇదే!
త్రినయని సీరియల్ నటి పవిత్ర గౌడ రెండు రోజుల క్రితం మరణించింది. అయితే తను యాక్సిడెంట్లో మరణించలేదంటున్నాడు నటుడు చంద్రకాంత్. ఈ మేరకు ఓ ఇంటర్వ్యూలో పవిత్ర గురించి చెప్తూ కన్నీరుమున్నీరుగా విలపించాడు. 'కన్నడలో ఓ సినిమాకు సంతకం చేసేందుకు మేమంతా బెంగళూరు వెళ్లాం. అక్కడ ప్రాజెక్టుకు ఒప్పుకుని కొంత అడ్వాన్స్ తీసుకుని హైదరాబాద్‌కు తిరుగుప్రయాణమయ్యాము. నటికి గాయాలవలేదు!కారులో నేను, పవిత్ర వెనకాల కూర్చున్నాం. ముందు డ్రైవర్ పక్కన పవిత్ర సోదరి కూతురు ఉంది. అందరమూ గాఢ నిద్రలో ఉన్నాం. బస్ మమ్మల్ని ఓవర్టేక్ చేసే క్రమంలో మా కారు డివైడర్‌ను ఢీ కొట్టింది. అప్పుడు నా ఒక్కడికి మాత్రమే తీవ్ర గాయాలయ్యాయి. పవిత్రకు ఒక్క దెబ్బ కూడా తగల్లేదు. నన్ను రక్తపు మడుగులో చూసేసరికి నాన్నా ఏమైందంటూ షాక్‌లోకి వెళ్లిపోయింది. అంబులెన్స్ ఆలస్యంగా రావడం వల్లే తను మరణించింది. అంబులెన్స్ సమయానికి వచ్చుంటే తను బతికేది. గుండెపోటు వల్లే తన ఊపిరి ఆగిపోయిందని వైద్యులు పేర్కొన్నారు.ఇంతలోనే..మేము భార్యాభర్తలమన్న విషయాన్ని అధికారికంగా చెప్దామనుకున్నాము. ఇంతలోనే తను నన్ను మోసం చేసి వెళ్లిపోయింది. నా జీవితం ఎటు కాకుండా పోయింది. ఆ దేవుడు తనను అలాగే ఉంచి నన్ను తీసుకెళ్లినా బాగుండేది. నా పవిత్ర గురించి తప్పుడుగా ప్రచారం చేయకండి.. అది చాలా మంచి మనిషి' అని చంద్రకాంత్ కన్నీరుమున్నీరుగా విలపించాడు.చదవండి: గాయపడిన ఐశ్వర్య రాయ్.. అయినా అక్కడికి ప్రయాణం -
పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?
'మామగారు' సీరియల్ హీరో గంగాధర్ పెళ్లి చేసుకున్నాడు. అదేనండి సీరియల్ నటుడు ఆకర్ష బైరమూడి.. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో అంగరంగ వైభవంగా ప్రేమించిన అమ్మాయితో ఏడడుగులు వేసేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని యూట్యూబర్ నిఖిల్ పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పలువురు సీరియల్ యాక్టర్స్.. కొత్త జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.(ఇదీ చదవండి: అక్కా నన్ను పెళ్లి చేసుకుంటావా?.. యంగ్ హీరోయిన్‌కు ఉహించని ప్రశ్న!)కర్ణాటకలోని సక్లేష్పురలో పుట్టి పెరిగిన ఆకర్ష్.. కన్నడ, తెలుగు సీరియల్స్‌లో హీరోగా చేసి క్రేజ్ సంపాదించాడు. పున్నాగ, అత్తారింట్లో అక్క చెల్లెళ్లు, అగ్నిపరీక్ష, రాజేశ్వరి విలాస్ కాఫీ తదితర సీరియల్స్ ఇతడు చేసిన వాటిలో ఉన్నాయి. అలానే 'మామగారు' సీరియల్ కూడా ఇతడి చేస్తున్నాడు.గత కొన్నిరోజుల నుంచి బ్యాచిలర్ పార్టీ, హల్దీ, ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతూ వచ్చాయి. దీంతో ఆకర్ష్ ఎవరిని పెళ్లి చేసుకోబోతున్నాడా అని అతడి అభిమానులు అనుకున్నారు. తాజాగా ఆకర్ష్ పెళ్లికి సంబంధించిన ఓ వీడియోని యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర ఇన్ స్టాలో పోస్ట్ చేశాడు. అయితే అమ్మాయి ఎవరనేది మాత్రం సస్సెన్స్ గానే ఉంచేశాడు. (ఇదీ చదవండి: డైరెక్ట్‌గా ఓటీటీకి టాలీవుడ్ సస్పెన్ష్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే!) View this post on Instagram A post shared by Nikhil Vijayendra Simha (@nikhilvijayendrasimha) View this post on Instagram A post shared by Nikhil Vijayendra Simha (@nikhilvijayendrasimha) View this post on Instagram A post shared by Nikhil Vijayendra Simha (@nikhilvijayendrasimha) -
తెలుగు ఇండస్ట్రీలో బ్యాన్.. భార్యతో కలిసి గుడ్‌న్యూస్ చెప్పిన హీరో
ఈ మధ్య సీరియల్ యాక్టర్స్ వరుస శుభవార్తలు చెప్తున్నారు. బుల్లితెర నటి మహేశ్వరి పండంటి బాబుకు జన్మనివ్వగా లేడీ విలన్ శోభా శెట్టి ఎంగేజ్మెంట్ చేసుకుంది. అలాగే బుల్లితెర కమెడియన్ కొండమ్మ త్వరలో తల్లి కాబోతోంది. తాజాగా ఈ లిస్టులోకి మరో సెలబ్రిటీ కపుల్ వచ్చి చేరింది.తెలుగువారికి సుపరిచితుడే!చందన్ కుమార్- కవిత దంపతులు త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోషన్ పొందనున్నారు. ఈ మేరకు ఓ ఫోటో షేర్ చేశారు. ఇది చూసిన అభిమానులు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చందన్ తెలుగు సీరియల్స్ చూసేవారికి సుపరిచితుడే..! సావిత్రమ్మగారి అబ్బాయి సీరియల్‌తో గుర్తింపు పొందిన చందన్ కుమార్ శ్రీమతి శ్రీనివాస్ ధారావాహికలోనూ ప్రధాన పాత్ర పోషించాడు.చందన్‌పై బ్యాన్అయితే ఈ సీరియల్ సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. అతడి తల్లిని దుర్భాషలాడటంతో ఆయన చందన్ చెంప చెళ్లుమనిపించాడు. దీంతో చందన్ తెలుగు బుల్లితెర గురించి దురుసుగా మాట్లాడాడు. ఇందుకుగానూ తెలుగు టీవీ ఫెడరేషన్ అతడిపై బ్యాన్ విధించింది. అలా ఈ కన్నడ నటుడు తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యాడు.ఇటీవలే కొత్త బిజినెస్కాగా చందన్- కవిత ఇటీవలే ఫుడ్ బిజినెస్‌లోకి దిగారు. మండిపేట్ ప్లేట్ ఇడ్లీ కేఫ్ పేరిట వెజిటేరియన్ రెస్టారెంట్ ప్రారంభించారు. కన్నడ హీరో కిచ్చా సుదీప్ చేతుల మీదుగా ఈ రెస్టారెంట్‌ను ఓపెన్ చేశాడు. చందన్ ఇటీవల జరిగిన సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌లో కర్ణాటక బుల్డోజర్స్ టీమ్ తరపున ఆడాడు. ఇతడు హీరోగా కన్నడ భాషలో పరిణయ, కట్టె, లవ్యూ అలియా, బెంగళూర్ 560023, ఎరడోండ్ల మూరు, ప్రేమ బరహ సినిమాలు చేశాడు. View this post on Instagram A post shared by K A V I T H A (@iam.kavitha_official) -
Manjula Nirupam Photos: బుల్లితెర జంట నూతన గృహప్రవేశం (ఫోటోలు)
-
లోక్‌సభకు ‘రాముని’కి ముందు ‘కృష్ణుడు’.. చివరికి ఏమయ్యింది?
లోక్‌సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఏప్రిల్ 19న జరగనుంది. రాజకీయ నేతలంతా ప్రచారాల్లో తలమునకలై ఉన్నారు. ఈ ఎన్నికల్లో పలువురు సినీ నటులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ కోవలోనే యూపీలోని మీరట్ నుండి బీజేపీ తరపున టీవీ సీరియల్ రామాయణంలోని రాముని పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ ఎన్నికల బరిలోకి దిగారు. టీవీ రాముడు అరుణ్ గోవిల్‌కు ముందు టీవీ సీరియల్ మహాభారత్‌లో శ్రీ కృష్ణుని పాత్ర పోషించిన నితీష్ భరద్వాజ్ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. అప్పట్లో నటుడు నితీష్ భరద్వాజ్ భారతీయ జనతా పార్టీలో చురుకైన నాయకునిగా పేరు తెచ్చుకున్నారు. అయితే రాజకీయాల నుంచి కొద్ది కాలానికే తప్పుకున్నారు. 1996 లోక్‌సభ ఎన్నికల్లో జార్ఖండ్‌లోని జంషెడ్పూర్ నుంచి బీజేపీ టిక్కెట్‌పై పోటీ చేసి, విజయం సాధించారు. అయితే 1999 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని రాజ్‌గఢ్ స్థానం నుంచి పోటీ చేసి, అప్పటి ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ సోదరుడు లక్ష్మణ్ సింగ్ చేతిలో నితీష్ భరద్వాజ్ ఓటమిని చవిచూశారు. నితీష్ భరద్వాజ్ కొంతకాలం పాటు బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరించారు. జంషెడ్పూర్ నియోజకవర్గానికి ఇప్పటి వరకు 18 సార్లు లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. బీజేపీ ఆరు సార్లు గెలుపొందగా, కాంగ్రెస్, జేఎంఎం నాలుగుసార్లు, సీపీఐ, బీఎల్డీ, జనతా పార్టీ, భోజోహరి మహతో ఒక్కోసారి గెలుపొందాయి. ఈ సీటుపై విజయాన్ని నమోదు చేసేందుకు బీజేపీ ఎప్పటికప్పుడు అనేక ప్రయోగాలు చేస్తూ వస్తోంది. 1996లో నితీష్ భరద్వాజ్.. జనతాదళ్ సీనియర్ నేత, అప్పటి మంత్రి ఇందర్ సింగ్ నామ్‌ధారీపై 95,650 ఓట్ల తేడాతో విజయం సాధించారు. -
Smriti Zubin Irani: క్యోం కి స్మృతీ భీ కభీ అభినేత్రీ థీ
స్మృతి జుబిన్ ఇరానీ. ఇప్పుడు కేంద్ర మంత్రిగా సుపరిచితులు. ఒకప్పుడు హిందీ టీవీ సీరియల్ వీక్షకుల అభిమాన నటి. సంప్రదాయ కుటుంబం నుంచి వచి్చనా మోడల్‌గా, నటిగా రాణించారు. రాజకీయాల్లో స్వయంకృషితో ఎదిగారు. కాంగ్రెస్ కంచుకోట అమేథీలో రాహుల్‌గాందీనే మట్టికరిపించారు. ఈసారి కూడా అమేథీలో కాంగ్రెస్‌కు సవాల్ విసురుతున్నారు... రాజకీయ ప్రయాణం.. నటనతో దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్న స్మృతీ 2003లో బీజేపీలో చేరారు. మహారాష్ట్ర బీజేపీ యువజన విభాగం ఉపాధ్యక్షురాలిగా చేశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత కపిల్ సిబల్పై ఢిల్లీలోని చాందినీ చౌక్ నుంచి పోటీ చేసి ఓడారు. 2011లో గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2014లో యూపీలోని అమేథీ నుంచి రాహుల్ గాం«దీపై పోటీ చేసి ఓటమి చవిచూశారు. 2017లో రెండోసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అమేథీపై బాగా దృష్టి పెట్టారు. నిత్యం స్థానికంగా ప్రజల్లో ఉన్నారు. కాంగ్రెస్‌పై, రాహుల్‌పై విమర్శలతో హోరెత్తించారు. 2019లో అమేథీలో రాహుల్‌ను ఓడించి తొలిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. అమేథీలో స్థిర నివాసం ఏర్పరుచుకుని అక్కడే ఉంటానని ప్రకటించారు. 2021లో మావాయి గ్రామంలో ఇల్లు కట్టుకున్నారు. ఇటీవలే గృహప్రవేశం చేశారు. ‘దమ్ముంటే అమేథీ నుంచి పోటీ చేయండి’ అంటూ మళ్లీ రాహుల్‌కు సవాలు విసురుతున్నారు. కేంద్రంలో మానవ వనరులు, సమాచార–ప్రసార, జౌళి శాఖ మంత్రిగా చేశారు. ప్రస్తుతం మహిళా సంక్షేమం, శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల మంత్రి. బహుభాషా ప్రావీణ్యం... స్మృతి 1976 మార్చి 23న ఢిల్లీలోని పంజాబీ కుటుంబంలో జని్మంచారు. తండ్రి అజయ్ కుమార్ మల్హోత్రా వ్యాపారి. తల్లి శిబానీ నే బాగ్చీ బెంగాలీ. ఢిల్లీలోని హోలీ చైల్డ్ ఆగ్జీలియమ్ స్కూల్లో చదివారు. తండ్రి ఇష్టానికి వ్యతిరేకంగా పాఠశాల విద్య కాగానే మోడలింగ్ వైపు వెళ్లారు. తర్వాత నటనలో అదృష్టం పరీక్షించుకునేందుకు ముంబైలో అడుగుపెట్టారు. పలు ఉత్పత్తులకు మోడల్‌గా చేస్తూనే నటిగా ప్రయతి్నంచారు. ఆ క్రమంలో సినిమా కష్టాలు పడ్డారు. పెద్ద కూతురుగా ఇంటి బాధ్యతలను తలకెత్తుకున్నారు. పలు సీరియళ్లలో నటించారు. క్యోం కీ సాస్ భీ కభీ బహు థీ సీరియల్‌తో ఎందరో అభిమానులను సంపాదించుకున్నారు. ఒక టీవీ సీరియల్‌కు సహదర్శకత్వంతో పాటు పలు టీవీ షోలకు హోస్ట్‌గా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ‘జై బోలో తెలంగాణ’ సినిమాతో తెలుగు ప్రజలకూ పరిచయమయ్యారు. 2001లో జుబిన్ ఇరానీని పెళ్లాడారు. వీరికి కొడుకు జోహార్, కూతురు జోయిష్ ఉన్నారు. వైవిధ్యమైన కుటుంబ, సినీ నేపథ్యం కారణంగా ఆమె హిందీ, బెంగాలీ, మరాఠీ, గుజరాతీ, పంజాబీ భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు. వివాదాలకు కేరాఫ్ రకరకాల కారణాలతో స్మృతి తరచూ వివాదాల్లో పడుతుంటారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో చాందినీచౌక్ నుంచి పోటీ చేసినప్పుడు ఎన్నికల అఫిడవిట్లో ఢిల్లీ యూనివర్సిటీ (స్కూల్ ఆఫ్ కరస్పాండెన్స్)లో 1996లో బీఏ చదివానని పేర్కొన్నారు. 2014, 2019ల్లో అమేథీ నుంచి పోటీ చేసినప్పుడేమో 1994లో ఢిల్లీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్‌లో చేరినట్టు వెల్లడించారు. దాంతో ఆమె డిగ్రీలో చేరింది 1994లోనా, 1996లోనా, చదివింది బీఏనా, కామర్సా అనే విమర్శలొచ్చాయి. 2014లో మానవ వనరుల మంత్రి కావడంతో కనీసం డిగ్రీ లేని వ్యక్తి దేశానికి విద్యా మంత్రా అంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి. సమస్య కోర్టు దాకా వెళ్లింది. ఈ వివాదాల నేపథ్యంలో ఆమె మానవ వనరుల నుంచి జౌళి శాఖకు మారారు. -
ఆస్పత్రిలో చేరిన ప్రముఖ నటుడు
హిందీ సీరియల్ యాక్టర్ అర్జున్ బిజ్లానీ అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. ఈ విషయాన్ని ఇన్‌స్టా వేదికగా తెలియజేస్తూ.. తీవ్రమైన కడుపు నొప్పి కారణంగా ఆసుపత్రిలో చేరాను. వైద్యులు శనివారం శస్త్రచికిత్స చేయనున్నారు. ఏది జరిగినా మన మంచికే’ అంటూ ఆస్పత్రి బెడ్‌పై ఉన్న ఫోటోలను షేర్ చేశాడు. నాగిన్(తెలుగులో నాగిని) మిలే జబ్ హమ్, తుమ్ వంటి సీరియల్స్ తో బాలీవుడ్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు అర్జున్. ఒకవైపు సీరియల్స్, మరోవైపు రియాల్టీ షోలల్లో పాల్గొంటూ ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. తన నటనతో పలు అవార్డులను సొంతం చేసుకున్నారు. నాగిని సీరియల్ ద్వారా తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు కూడా చేరువయ్యాడు. అలియా భట్, రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘రాకీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ’ సినిమాలో అతిథి పాత్రలో కనిపించి, తనదైన నటనతో మెప్పించాడు. ప్రస్తుతం పలు వెబ్ సిరీస్‌తో పాటు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అర్జున్ త్వరగా కోలుకోవాలంటూ అతని ఫ్యాన్స్‌తో పాటు పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Arjun Bijlani 🧿 (@arjunbijlani) -
నటుడు 'దయ' మృతికి కారణాలివే..
సీరియల్ నటుడు దయ అలియాస్ పవిత్రనాథ్ మృతి అభిమానులను కలిచివేస్తోంది. మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్‌తో పవిత్రనాథ్ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. ముఖ్యంగా దయ పాత్రతో అందరికీ గుర్తుండిపోయారు. ఈ రోల్ తన కెరీర్‌కు ఎంతో ప్లస్ పాయింట్ అయింది. ఈ పాత్ర ద్వారానే తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకున్నారు. తర్వాత ఎన్నో సీరియల్స్‌లో నటించినా మొగలిరేకులు, చక్రవాకం తెచ్చిపెట్టినంత పేరు మాత్రం రాలేదు. నాలుగురోజులుగా అస్వస్థత కొంతకాలంగా బుల్లితెర మీద కనిపించకుండా పోయిన పవిత్రనాథ్ మార్చి 1న మరణించారు. ఆయన ఆకస్మిక మరణంపై అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఇంత చిన్న వయసులోనే మరణించడానికి గల కారణాలేంటని ఆరా తీస్తున్నారు. పవిత్రనాథ్ కొంతకాలంగా ముభావంగా ఉంటున్నారట. ఇండస్ట్రీ మిత్రులకు సైతం దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది! గత నాలుగురోజులుగా పవిత్రనాథ్ అస్వస్థతకు లోనయ్యారు. గుండె కొట్టుకోవడం ఆగిపోయింది! ఊపిరి తీసుకోవడంలో సమస్య తలెత్తడంతో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే పరిస్థితి విషమించగా.. హార్ట్ ఫెయిల్యూర్ కారణంతో పవిత్రనాథ్ మరణించారని వైద్యులు వెల్లడించారు. కాగా కొన్నేళ్ల క్రితం పవిత్రనాథ్.. అతడి భార్య శశిరేఖ మధ్య గొడవలు తలెత్తాయి. భర్త మీద ఎన్నో ఆరోపణలు చేసింది. అయినా సరే నటుడు వాటి గురించి పట్టించుకోలేదు. ఏనాడూ సదరు ఆరోపణల మీద స్పందించడానికి కూడా ఇష్టపడలేదు. అయితే ఆ సమయంలో మానసికంగా వేదన అనుభవించాడని ఆయన సన్నిహితులు చెప్తూ ఉంటారు. చదవండి: ప్రముఖ బుల్లితెర నటుడు మృతి.. ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయామంటూ.. వ్యాపారవేత్తతో హీరోయిన్ 'రెజీనా' పెళ్లి ఫిక్స్ -
'మొగలిరేకులు' నటుడు దయ కన్నుమూత
ప్రముఖ బుల్లితెర నటుడు పవిత్రనాథ్ కన్నుమూశారు. మొగలిరేకులు సీరియల్లో దయగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన చిన్నవయసులోనే మరణించారు. ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియాలో వెల్లడించింది. 'పవి.. ఈ బాధను మేము వర్ణించలేకపోతున్నాం.. మా జీవితాల్లో నువ్వు ఎంతో ముఖ్యమైనవాడివి. నీ మరణవార్త అబద్ధమైతే బాగుండనిపిస్తోంది. ఇది నిజం కాకూడదు.. నువ్వు మమ్మల్ని వదిలి వెళ్లిపోయావనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం. చివరి చూపు కూడా.. కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం. గుడ్‌బై కూడా చెప్పలేకపోయాం. నిన్ను ఎంతో మిస్ అవుతున్నాం.. నీ ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ భగవంతుడు నీ కుటుంబానికి మరింత శక్తినివ్వాలి' అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. అయితే నటుడి మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా బుల్లితెరపై సంచలనం రేపిన మొగలిరేకులు, చక్రవాకం సీరియల్స్‌లో పవిత్రనాథ్ ముఖ్యపాత్రలో నటించారు. 'మొగలిరేకులు' ధారావాహికలో ఇంద్రనీల్ తమ్ముడు దయగా మెప్పించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. View this post on Instagram A post shared by Meghna Raami (@raamimeghna) చదవండి: డ్రగ్స్ కేసులో అనూహ్య మలుపు.. క్రిష్ నమూనాల సేకరణ..! -
సీరియల్ హీరోయిన్‌తో పెళ్లి.. విడాకులిచ్చిన విలన్
ప్రేమ-పెళ్లి-విడాకులు సర్వసాధారణమైపోయాయి. జీవితకాలం ప్రేమించడం, కలిసుండటం కష్టమే అని చేతులెత్తేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మలయాళ సెలబ్రిటీ జంట జిషిన్ మోహన్- వరద వచ్చి చేరింది. వీరు విడాకులు తీసుకున్నారంటూ కొంతకాలంగా మాలీవుడ్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇది నిజమేనని ధ్రువీకరించాడు జిషిన్. తాము విడిపోయామని వెల్లడించాడు. విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు. అంత టైం లేదు తాను ఓ సీరియల్ నటిని పెళ్లాడినట్లు వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదన్నాడు. దేవుడి దయ వల్ల సీరియల్స్‌తో బిజీగా ఉన్నాను. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించేంత సమయం లేదు అని చెప్పుకొచ్చాడు. రీల్ లైఫ్‌లో హీరోయిన్- విలన్‌గా ఉన్న వీరు రియల్ లైఫ్‌లో మాత్ం జోడీ కట్టారని సంతోషించేలోపే ఇలా జరిగిందేంటని అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఏడుస్తూ ఉండనక్కర్లే! తాజాగా వరద సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ పెట్టింది. 'నిన్న నవ్వాను, ఈ రోజు నవ్వుతూనే ఉన్నాను. రేపు కూడా నవ్వులు చిందిస్తూనే ఉంటాను. జీవితం చాలా చిన్నది. ఏడుస్తూ గడపడం కాదు జీవితమంటే..!' అని రాసుకొచ్చింది. ఇది చూసిన జనాలు.. మీ ఇద్దరి మధ్య ఏమైంది? ఎందుకని విడిపోయారంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా అమల అనే సీరియల్లో వరద హీరోయిన్గా, జిషిన్ విలన్‌గా నటించాడు. ఆ ధారావాహిక చిత్రీకరణ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది. 2014లో పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రేమకు గుర్తుగా ఓ బాబు కూడా పుట్టాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంపతులు విడాకులు తీసుకోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. చదవండి: కథ వినలేదు, జోక్యం చేసుకోలేదు.. ఫ్రెండ్ కోసం ఫ్రీగా.. అదీ అతడి గొప్పతనం! -
పెళ్లి చేసుకోనున్న నిఖిల్-కావ్య? నటుడి ఆన్సరిదే!
ఆన్‌స్క్రీన్‌లో జంటగా కనిపించే సెలబ్రిటీలు రియల్ లైఫ్‌లో కూడా జోడీగా ఉంటే చూడాలని ముచ్చటపడుతుంటారు అభిమానులు. అలాగే చాలామంది రీల్ జంటగా మిగిలిపోకుండా రియల్ లైఫ్‌లోనూ పెళ్లి చేసుకుని చూపించారు. ఈ క్రమంలో బుల్లితెర జంట కావ్య-నిఖిల్‌కు ఎప్పుడూ ఓ ప్రశ్న ఎదురవుతూనే ఉంది. ఏ షోకి వెళ్లినా జంటగా వెళ్లే వీళ్లిద్దరూ వైవాహిక జీవితంలోకి ఎప్పుడు అడుగుపెడతారని ప్రశ్నిస్తున్నారు. నిజమైన దంపతులుగా చూడాలని ఉందని అభిమానులు తహతహలాడుతున్నారు. తను నాకు ఫ్రెండ్‌గా దొరకడమే గ్రేట్ ఈ క్రమంలో పెళ్లిపై పెదవి విప్పాడు నటుడు నిఖిల్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. 'కావ్య చాలా మంచి అమ్మాయి, మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుంది. అలాంటి అమ్మాయి జీవిత భాగస్వామిగా వస్తే బాగుండని నాలాంటి ప్రతీ అబ్బాయి కోరుకుంటాడు. నిజం చెప్పాలంటే తను నాకు బెస్ట్ ఫ్రెండ్‌గా దొరకడమే గొప్ప. మీరంతా లవ్వు, గివ్వు అని ఎక్కడికో వెళ్లిపోతున్నారు. జనాలకు మేము జంటగా కనిపిస్తే ఇష్టం. అందుకే మేమిద్దరం కలిసే షోలు చేస్తాము. మేము పెళ్లి చేసుకుంటామా? లేదా? అన్నది మా చేతుల్లో లేదు. పెళ్లి గురించి ఆలోచించట్లే అది కాలమే నిర్ణయిస్తుంది. ఇప్పటికైతే పెళ్లి గురించి ఆలోచించడం లేదు. మా ఇంట్లో పెళ్లి గురించి తొందరపడటం లేదు. కాబట్టి ఇప్పట్లో దాని జోలికి వెళ్లను' అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన అభిమానులు.. త్వరలోనే మీరు బెస్ట్ ఫ్రెండ్స్ నుంచి బెస్ట్ రియల్ కపుల్‌గా ప్రమోషన్ పొందాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా వీరిద్దరూ ప్రస్తుతం ఓ సీరియల్, వెబ్ సిరీస్ చేస్తున్నారు. చదవండి: విఘ్నేశ్ ఎల్ఐసీ.. సినిమా నుంచి తప్పుకున్న నయనతార? -
పండక్కి గుడ్‌న్యూస్ చెప్పిన బుల్లితెర బ్యూటీ
బుల్లితెర నటి సురభి చందన గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు ప్రకటించింది. 13 ఏళ్లుగా ప్రియుడు, నటుడు కరణ్ శర్మతో డేటింగ్లో ఉన్న ఆమె అతడితో కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నట్లు వెల్లడించింది. సంక్రాంతి సందర్భంగా ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుంది. పెళ్లెప్పుడు? ఎక్కడ? అనే వివరాలను పూర్తిగా ప్రకటించలేదు. పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు అయితే ఆమెకు పెళ్లవబోతున్న విషయాన్ని సురభి పెంపుడు కుక్క చెప్తున్నట్లుగా మై హ్యూమన్స్ ఆర్ గెటింగ్ మారీడ్ (నా మనుషులు పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు) అని రాసి ఉన్న బోర్డు ముందు దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. 13 ఏళ్ల ప్రేమను పెళ్లి బంధంతో పదిలం చేసుకోబోతున్న ఈ ప్రేమజంటకు అభిమానులు శుభాకాంక్షలు చెప్తున్నారు. కాగా సురభి హిందీ సూపర్ హిట్ సీరియల్ 'తారక్ మెహతా కా ఉల్టా చష్మా'లో అతిథి పాత్రలో మెరిసింది. 'ఖుబూల్ హై' సీరియల్లో ప్రధాన పాత్రలో నటించింది. ఇద్దరికీ సీరియల్స్ ద్వారానే క్రేజ్ 'ఇష్క్బాజ్', 'సంజీవని', 'నాగిన్ 5', 'హునర్బాజ్: దేశ్ కీ షాన్', 'షెర్డిల్ షెర్గిల్' సీరియల్స్‌లో నటించింది. 'బాబీ జాసూస్' అనే హిందీ మూవీలో అతిథి పాత్రలో మెరిసింది. ఇది ఆమె వెండితెరపై నటించిన ఏకైక సినిమా! కరణ్ శర్మ విషయానికి వస్తే ఇతడు కూడా చాలా ఏళ్లుగా ఇండస్ట్రీలో నటుడిగా రాణిస్తున్నాడు. 'యే రిష్తా క్యా కెహ్లాతా హై', 'పవిత్ర రిష్తా' వంటి సీరియల్స్‌తో గుర్తింపు పొందాడు. ప్రస్తుతం 'ఉదారియన్' అనే సీరియల్ చేస్తున్నాడు. View this post on Instagram A post shared by Surbhi Chandna (@officialsurbhic) చదవండి: సంక్రాంతి రేసులో ఏడుసార్లు.. ఎన్ని హిట్సో తెలుసా? -
ఆ సినిమా డిజాస్టర్.. ఇప్పటికీ వడ్డీలు కడుతున్నా: టాలీవుడ్ నటుడు
టాలీవుడ్లో బుల్లితెర అభిమానులకు గుర్తుండిపోయే పేరు నందకిశోర్. 2001లో మా టీవీలో ప్రసారమైన అత్తగారు కొత్త కోడలు అనే సీరియల్లో కానిస్టేబుల్‌గా నటించే బుల్లితెరపై తన కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత వెలుగు నీడలు అనే సీరియల్లో విలన్‌గా నటించారు. ఆ తర్వాత బుల్లితెరపై సూర్యవంశం సీరియల్లో ఆఫర్ వచ్చింది. అంతే కాకుండా జెమినీ టీవీలో ప్రసారమైన స్రవంతి సీరియల్లో నటించాడు. ఈ సీరియల్ ద్వారా ఆయనకు గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత నంద కిశోర్‌కు వరుసగా అవకాశాలు వచ్చాయి. స్రవంతి నుంచి శుభలేఖ, మంచుపల్లకి, శ్రీమతి కళ్యాణం, రామాసీత, రామసక్కని సీత.. ఇలా వరుస సీరియల్స్‌లో నటించారు. టీవీలో సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ చిన్న చిన్న రోల్స్ చేశారు. నితిన్ మూవీ ద్రోణలోనూ మంచి రోల్ చేశారు. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. అయితే ప్రేమ వివాహం చేసుకున్న ఆయనకు ముగ్గురు కూతుర్లు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఉప్పెన సీరియల్లో నటిస్తున్నారు. అంతే కాకుండా స్రవంతి పార్ట్-2 స్టార్ట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. నంద కిశోర్ సీరియల్స్‌లో పాటు సినిమాల్లోనూ చేస్తున్నారు. తాజాగా ఇంటర్వ్యూకు హాజరైన నంద కిశోర్ తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. సొంతంగా సినిమా తీశాక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు వెల్లడించారు. అంతే కాకుండా యాంకర్ సిరి హనుమంతుతో గొడవపై కూడా స్పందించారు. ఇంతకీ ఆ వివరాలేంటో చూద్దాం. బుల్లితెరపై పలు సీరియల్స్‌లో సందడి చేసిన ఈ నటుడు 'నరసింహపురం' సినిమా చేశాడు. 2021 జూలైలో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. ఈ చిత్రంలో సిరి హనుమంతు హీరోయిన్గా నటించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ మూవీని తెరకెక్కించారు. అయితే సినిమా కొవిడ్ టైంలో రిలీజ్ కావడంతో ప్రేక్షకుల నుంచి ఆదరణ దక్కలేదని నందకిశోర్ అన్నారు. అయితే ఈ మూవీ ఓ అనుభవాన్ని మిగిల్చిందని తెలిపారు. దాదాపు రూ.కోటి రూపాయల వరకు అప్పులైనట్లు పేర్కొన్నారు. ఆ సినిమా డిజాస్టర్.. ఎందుకంటే? నందకిశోర్ మాట్లాడుతూ.. 'టీవీ ఇండస్ట్రీలో సక్సెస్‌పుల్ అంటే యాంకర్స్ మాత్రమే. టెలివిజన్‌లో చేయాలంటే మనం కొన్ని రోజులు కేటాయించాలి. నరసింహపురం సినిమా విషయంలో పొరపాటు జరిగింది. అయితే నేను సినిమా విషయంలో ఫుల్‌గా ప్రిపేర్ అవ్వలేదు. అందువల్లే కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. అది కేవలం ఒక ప్రయత్నం మాత్రమే. ఎవరీ సపోర్ట్ లేకుండా మేము సినిమా తీశాం. మాకు మూడేళ్లు పట్టింది. కరోనా సెకండ్‌వేవ్ కావడంతో ప్రేక్షకులు పెద్దగా చూడలేదు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉంది. నా సొంత సంపాదన, అప్పులు తెచ్చి సినిమా తీశా. నాకున్న ప్యాషన్‌తో ఏదో చేయాలనిపించింది. ఆ సినిమా కోసం ఒరిజినల్‌గా గుండు కూడా కొట్టించుకున్నా. కానీ అది డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఇప్పటికీ ఆ సినిమా అప్పులకు వడ్డీలు కడుతున్నా.' అని తెలిపారు. సిరి హనుమంతుతో గొడవ.. సిరితో గొడవపై మాట్లాడుతూ.. 'నేను సిరిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు. కానీ కొన్ని ఛానెల్స్ వేరేగా రాసి ఉండొచ్చు, తాను చాలా బాగా చేసింది. సిరికి మంచి టాలెంట్ ఉంది. అయితే మేము ఆమె అనుకున్నంత డబ్బులు ఇవ్వలేకపోయాం. సిరి అప్పుడప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటోంది. చాలా మంచి అమ్మాయి.. మంచి యాక్టర్ కూడా' అని అన్నారు. కాగా.. నరసింహపురం సినిమాలో యాంకర్, వైజాగ్ అమ్మాయి సిరి హనుమంతు హీరోయిన్గా నటించింది. అయితే ఆమె మూవీ ప్రమోషన్స్‌కు పిలిచినప్పుడు తాను రాలేదు.. అంతే తప్ప ఆమెతో నాకు ఎలాంటి విభేదాల్లేవని అని నందకిశోర్ తెలిపారు. -
Shrenu-Akshay: సమ్‌థింగ్ సమ్‌థింగ్...పెళ్లితో ఒక్కటైన నటి (ఫొటోలు)
-
డేటింగ్‌కు ఫుల్స్టాప్, పెళ్లితో ఒక్కటైన లవ్ బర్డ్స్
బుల్లితెర జంట శ్రెను పరిఖ్, అక్షయ్ మాత్రే పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరూ 2021లో ప్రసారమైన 'ఘర్ ఏక్ మందిర్ కృపా అగ్రసేన్ మహారాజా కీ' అనే సీరియల్లో కలిసి నటించారు. అప్పటి నుంచే వీరిమధ్య సమ్‌థింగ్ సమ్‌థింగ్ స్టార్ట్ అయింది. ఈ ప్రేమను ఇరు కుటుంబాలు అంగీకరించాయి, పెళ్లికి పచ్చజెండా ఊపాయి. దీంతో శ్రెను సొంతూరైన గుజరాత్‌లోని వడోదరలో గురువారం(డిసెంబర్ 21న) వీరి వివాహం ఘనంగా జరిగింది. అతడితోనే జీవితం.. తమ పెళ్లి ఫోటోలను ఈ నవదంపతులు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఇందులో శ్రెను రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ లెహంగాలో ధగధగ మెరిసిపోయింది. అటు అక్షయ్ రెడ్ కలర్ షేర్వాణీ ధరించాడు. ఈ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొత్త పెళ్లికూతురు ఈ జీవితానికి అతడినే బుక్ చేసుకున్నానని రాసుకొచ్చింది. సీరియల్స్‌తో గుర్తింపు పెళ్లికి ముందు హల్దీ, మెహందీ, సంగీత్ వేడుకలు సైతం జరిగాయి. సంగీత్‌లో ఈ లవ్ బర్డ్స్ బాలీవుడ్ హిట్ సాంగ్స్‌కు స్టెప్పులేశారు. కాగా శ్రెను పరిఖ్.. ఏక్ భ్రమ్ సర్వగుణ్ సంపన్, ఇస్ ప్యార్ కో క్యా నామ్ ధూన్- ఏక్ బార్ ఫిర్, ఇష్క్బాజ్, ఘర్ ఏక్ మందిర్, జింగదగీ కా హర్ ర్యాంగ్, గులాల్.. వంటి పలు సీరియల్స్‌తో హిందీ ప్రేక్షకులకు దగ్గరైంది. అక్షయ్ మాత్రే.. ఇండియావాలీ మా సీరియల్లో నరేన్ వ్యాస్‌గా నటించి బోలెడంత గుర్తింపు తెచ్చుకున్నాడు. View this post on Instagram A post shared by Shrenu Parikh (@shrenuparikhofficial) చదవండి: సీనియర్‌ను ప్రేమించా.. అతడు కూడా ఇంట్రస్ట్ చూపించాడు.. అంతలోనే! -
Maanas Nagulapalli Srija Wedding: తొలిసారి పెళ్లి ఫొటోలు షేర్ చేసిన 'బిగ్ బాస్' మానస్ (ఫొటోలు)
-
Maanas-Srija Marriage: బిగ్‌బాస్ కంటెస్టెంట్, నటుడు మానస్ పెళ్లి (ఫోటోలు)
-
తెలుగు సీరియల్ నటుడు ఎంగేజ్మెంట్.. డాక్టర్‌బాబు సందడి
ఈ మధ్య సెలబ్రిటీలు పెళ్లి, నిశ్చాతార్థం లాంటి వాటితో బిజీ అయిపోతున్నారు. ఈ మధ్య సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ కీర్తి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు ఆమె రూట్ లోనే ప్రముఖ తెలుగు సీరియల్ నటుడు ఎంగేజ్ మెంట్ చేసుకున్నాడు. తాజాగా జరిగిన ఈ వేడుకలో డాక్టర్‌బాబు.. అదేనండి నిరూపమ్ తోపాటు పలువురు సందడి చేశారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 'ఉల్టా పల్టా' అసలు మీనింగ్ ఇదేనా!?) తెలుగు ప్రేక్షకులు సినిమాలని ఎంత ఆదరిస్తారో.. సీరియల్స్‌ని అంతకంటే ఎక్కువగా చూసేస్తుంటారు. అలా ప్రముఖ ఛానెల్లో ప్రసారమైన ముద్దమందారం, ముత్యమంత ముద్దు లాంటి సీరియల్స్‌తో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కృష్ణా రెడ్డి ప్రస్తుతం పలు సీరియల్స్‌లో నటిస్తున్నాడు. ఇప్పుడు అతడు స్వాతి అనే అమ్మాయితో నిశ్చితార్థం చేసుకున్నాడు. బహుశా ఈ ఏడాదిలోనే పెళ్లి కూడా ఉండొచ్చు. ఈ వేడుకలో పలువురు సీరియల్ స్టార్స్ సందడి చేసి, కొత్త జంటని ఆశీర్వాదించారు. (ఇదీ చదవండి: సారీ చెప్పిన హీరో లారెన్స్.. ఆ గొడవపై కామెంట్స్!) -
శామీర్‌పేట్ ఘటన: కాల్పులు జరిపింది తాను కాదన్న సీరియల్ నటుడు
శామీర్‌పేట్ కాల్పుల ఘటనలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. సిద్దార్థ్‌పై నటుడు మనోజ్ కాల్పులు జరిపాడంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ ఘటనతో తనకెలాంటి సంబంధం లేదంటూ వీడియో రిలీజ్ చేశాడు నటుడు మనోజ్. గన్ ఫైర్ కేసుతో తనకు సంబంధం లేదని, ప్రస్తుతం తాను బెంగళూరులో ఉన్నానని వెల్లడించాడు. శామీర్‌పేట్ సెలబ్రిటీ రిసార్ట్‌లో కాల్పులు జరిపిన మనోజ్ నాయుడు తాను కాదని స్పష్టం చేశాడు. కొంతమంది తన ఫోటోలు, వీడియోలు వాడుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని, ఈ తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరాడు. నిజానిజాలు తెలుసుకోకుండా తనపై అసత్య ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని తెలిపాడు. అనవసరంగా తనపై చేయని నేరాన్ని మోపుతున్నారంటూ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఆవేదన వ్యక్తం చేశాడు మనోజ్. 'ఈరోజు ఉదయం నుంచి నాపై అసత్య వార్తను ప్రచారం చేస్తున్నారు. మనోజ్ అనే ఓ వ్యక్తి గన్ ఫైర్ చేసినందుకు అతడి స్థానంలో నా పేరు, ఫోటోలు వాడుతున్నారు. ఆఖరికి నా సీరియల్ క్లిప్పింగ్స్ కూడా వాడుతున్నారు. ముందూవెనకా తెలుసుకోకుండా ఇలా ఎలా చేస్తారు? రెండు రోజులుగా నేను బెంగళూరులో ఉన్నాను. హైదరాబాద్‌లో ఏం జరుగుతుందనేది కూడా నాకు తెలియదు. నా గురించి అసత్య ప్రచారం చేసి నా పరువుకు భంగం కలిగించారు. ఇది నా జీవితం, కెరీర్‌పై ఎంతగానో దుష్ప్రభావం చూపుతుంది. దీనిపై త్వరలో పోలీసులకు ఫిర్యాదు చేస్తాను' అని చెప్పుకొచ్చాడు. అసలేం జరిగిందంటే.. శామీర్‌పేట్ సెలబ్రిటీ రిసార్ట్‌లోని విల్లాలో సిద్ధార్థ దాస్‌పై కాల్పులు జరిగాయి. మూడేళ్లుగా సిద్ధార్ధ్‌దాస్ భార్యతో మనోజ్ సహజీవనం చేస్తున్నాడు. 2019లో భర్త సిద్ధార్ధ్ దాస్‌తో విడిపోయిన స్మిత విడాకుల కోసం కూకట్పల్లి కోర్టులో దరఖాస్తు చేసింది. దాంతో పాటు తాను నివాసం ఉంటున్న వైపు భర్త రాకుండా ఇంజక్షన్ ఆర్డర్ కూడా స్మిత తెచ్చుకుంది. మనోజ్‌తో కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీని ఏర్పాటు చేసిన స్మిత.. సెలబ్రిటీ రిసార్ట్స్‌లోని తాముంటున్న ఇంట్లోనే ఆఫీస్ ఏర్పాటు చేశారు. పిల్లలతో పాటు స్మిత, మనోజ్ కలిసి అక్కడే నివాసం ఉంటున్నారు. ఇటీవల మనోజ్.. స్మిత కుమారుడు 17 ఏళ్ల బాలుడిని కొట్టాడు. ఈ విషయాన్ని బాలుడు తన తండ్రి సిద్దార్థ్‌కు చెప్పాడు. తన చెల్లెలిని కూడా వేధిస్తున్నారని పేర్కొన్నాడు. దీంతో పాపను తీసుకెళ్లడానికి ఈ రోజు(శనివారం) ఉదయం సిద్ధార్థ్ దాస్ విల్లాకు చేరుకున్నాడు. సిద్ధార్థ్ వెంట పాపని పంపడం ఇష్టం లేక స్మిత అతడితో గొడవకు దిగింది. దీంతో ముగ్గురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అనంతరం మనోజ్ ఎయిర్ గన్ తీసుకొని కాల్పులు జరిపాడు. సిద్ధార్థ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. View this post on Instagram A post shared by Manoj Kumar (@imanoj_kumar) చదవండి: శామీర్‌పేట్ ఘటన.. అందమైన అమ్మాయిలకు ట్రాప్ ఛీ.. అంత నల్లగానా.. హీరోయిన్ను అందరిముందే అవమానించిన స్టార్ హీరో -
‘ఆదిపురుష్’ చూసి నిజంగా సిగ్గుపడుతున్నా.. ఓం రౌత్‌కు ఇవన్నీ అవసరమా?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ భామ కృతి సనన్ జంటగా నటించిన మైథలాజికల్ చిత్రం 'ఆదిపురుష్'. ఈనెల 16న థియేటర్లో విడుదలైన ఈ చిత్రం తొలిరోజు నుంచే మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అయినప్పటికీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు సృష్టించింది. తొలిరోజే రూ.140 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. అంతేస్థాయిలో విమర్శల పాలైంది. రోజు రోజుకు ఈ చిత్రాన్ని విమర్శించే వారి సంఖ్యం పెరుగుతోంది. తాజాగా రామాయణం టీవీ సీరియల్లో లక్ష్మణుడి పాత్ర పోషించిన సునీల్ లహరి ఆదిపురుష్ చిత్రంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సినిమా వాస్తవానికి చాలా దూరంగా ఉందని విమర్శించారు. (ఇది చదవండి: 'సలార్' కొత్త పోస్టర్లో 'కేజీఎఫ్' కనెక్షన్.. గమనించారా? ) సునీల్ లహరి మాట్లాడుతూ.. 'వాల్మీకి రామాయణం ఆధారంగా సినిమా తీస్తున్నామని డిస్క్లెయిమర్లో స్పష్టంగా చెప్పడం చాలా నిరుత్సాహానికి గురిచేసింది. అలా ఎందుకు చెప్పారని నేను నిజంగా సిగ్గుపడుతున్నా. ఇది కేవలం ఫాంటసీ అని చెప్పి.. అందుకు భిన్నంగా తీశారు. పుష్పక విమానంతో రావణుడిని చూపించలేదు. మేఘనాథ్, లక్ష్మణ్ యుద్ధాన్ని నీటిలో చూపించారు. డైలాగులు చాలా దారుణంగా ఉన్నాయి. ఏ పాత్ర క్యారెక్టరైజేషన్ కూడా స్పష్టంగా లేదు. దర్శకుడు చాలా గందరగోళంగా ఉన్నట్లు కనిపించింది. అసలు ఈ సినిమా ఎందుకు తీశాడో తెలియదు. స్పెషల్ ఎఫెక్ట్స్, విఎఫ్ఎక్స్తో మాత్రమే సినిమాని నిలబెట్టలేరు. ఎందుకంటే రామాయణం గురించి సరళంగా చెప్పాలి. హనుమంతునితో ఎలాంటి పాత్రను క్రియేట్ చేశారో.. ఎలాంటి డైలాగులు చెప్పారో అర్థం కావడం లేదు. ' అని అన్నారు. సినిమాలోని పాత్రలపై గురించి ఆయన మాట్లాడుతూ.. 'ఆదిపురుష్‌లో పాత్రలు చూసి నిజంగా ఆశ్చర్యపోయా. రావణుడు అత్యంత సుందరమైన దేశానికి రాజు. అలా ఎందుకు చూపించారో నాకు తెలియదు. సినిమాలో నకిలీ సీతను తీసుకురావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? వాళ్లు కథను సింపుల్‌గా చెప్పి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. నాకు ఈ సినిమాలో అన్ని పాత్రలూ అయోమయంగా కనిపించాయి. వాటిలో ఏదీ స్పష్టంగా రాలేదు. ఇది నటీనటుల తప్పు కాదు. వారి పాత్రలను స్పష్టంగా లేనందున అలా జరిగింది. ఓం రౌత్ సెన్సిబుల్ డైరెక్టర్ అనుకున్నా. ఈ సినిమా తీయడంలో ఆయన మరింత తెలివిగా వ్యవహరించాల్సింది.' అని అన్నారు. (ఇది చదవండి: ఆదిపురుష్ మూవీ ఓ పెద్ద జోక్.. తీవ్ర విమర్శలు చేసిన నటుడు) -
మహాభారత్ నటుడు కన్నుమూత
మహాభారత్ సీరియల్లో శకుని మామగా నటించిన సీనియర్ నటుడు గుఫి పైంటాల్ (80) కన్నుమూశారు. అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన ఆయన మృతి చెందినట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. వారం రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుఫి ఇవాళ ఉదయం 9 గంటల ప్రాంతంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని గుఫీ మేనల్లుడు హిటెన్ వెల్లడించారు. (ఇది చదవండి: కెరీర్ ఎందుకు నాశనం చేసుకుంటావ్? అని నా భార్య ప్రశ్నించింది: మనోజ్) ఆయన మరణవార్త తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయనకు ఓ కొడుకు, కోడలితో పాటు ఓ మనవడు కూడా ఉన్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు అంధేరి సబర్బన్‌లోని శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో నటుడు మృతి) కాగా.. గుఫీ టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ నటించారు. మహాభారత్ సీరియల్‌తో పాటు బహదూర్ షా జఫర్, కానూన్, ఓం నమః శివాయ, సీఐడీ, కోయి హై ద్వారకాధీష్ భగవాన్ శ్రీ కృష్ణ, రాధాకృష్ణ, జే కనియా లాల్ షోలలో కనిపించాడు. అతను 1975 చిత్రం రఫూ చక్కర్తో బాలీవుడ్లో అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత దిల్లాగి, దేశ్ పరదేశ్, సుహాగ్ చిత్రాలలో కనిపించాడు. -
బిగ్‌బాస్ 7లోకి బుల్లితెర హీరో అమర్దీప్.. క్లారిటీ ఇచ్చిన నటుడు
అప్పుడే బిగ్‌బాస్ 7 సీజన్‌పై బజ్ మొదలైంది. ఈ సారి పలువురు స్టార్స్ హౌజ్‌లో సందడి చేయనున్నారంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ రియాలిటీ షో అన్ని భాషల్లో ఎంతో ఆదరణ పొందింది. తెలుగులోనూ ఈ షో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటికే 6 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ 7వ సీజన్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన రకరకాలుగా పుకార్లు పుట్టుకొస్తున్నాయి. చదవండి: అమెరికాలో లయ శాలరీ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.. ప్రముఖ స్టార్స్ ఈ సీజన్లో సందడి చేయనున్నారంటూ ఇప్పటికే యాంకర్ రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్‌తో పేర్లు వినిపించాయి. తాజాగా మరో స్టార్ నటుడి పేరు తెరపైకి వచ్చింది. బుల్లితెర సీరియల్ ‘జానకీ కలగనలేదు’ హీరో అమర్ దీప్ ఈ సీజన్‌కు గానూ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా రానున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. బుల్లితెర హీరోగా ఎంతోమంది ప్రేక్షక్ష అభిమానులను సొంతం చేసుకున్న అమర్ దీప్‌ను బిగ్‌బాస్‌లోకి తీసుకువచ్చేందుకు నిర్వహకులు ప్లాన్ చేస్తున్నాయి. చదవండి: NTR30 కోసం రంగంలోకి ప్రముఖ హాలీవుడ్ టెక్నిషియన్ అయితే తాజాగా అమర్ దీప్ బిగ్‌బాస్ ఆఫర్‌పై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అమర్ దీప్ మాట్లాడుతూ.. ‘నాకు బిగ్‌బాస్ 7 ఆఫర్ వచ్చిందనే వార్తలు నేను కూడా చూశాను. కానీ అది నా చేతుల్లో లేదు. అది మా చానల్(స్టార్ మా) ఇష్టం. ప్రస్తుతం నేను సీరియల్‌తో బిజీగా ఉన్న. మరి మా చానల్ నన్ను బిగ్‌బాస్‌కు పంపిస్తుందో?లేదో? చూడాలి. నేను బిగ్‌బాస్ వెళ్లడమనేది వారి నిర్ణయం మీదే ఆధారపడి ఉంది’ అంటూ స్పష్టం చేశాడు. -
ప్రియుడిని సీక్రెట్‌గా పెళ్లాడిన సీరియల్ నటి!
బుల్లితెర నటి కీర్తిదా మిస్త్రీ పెళ్లిపీటలెక్కింది. బాయ్‌ఫ్రెండ్, నటుడు రిబ్బు మెహ్రాను పెళ్లాడింది. ఈ వారం ప్రారంభంలోనే గుట్టుచప్పుడు కాకుండా వీరి పెళ్లి జరిగినట్లు తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ నోయిడాలోని రిబ్బు నివాసం ఈ వివాహ వేడుకకు వేదికగా మారింది. తాజాగా తమ పెళ్లి ఫోటోలను కొత్త జంట సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి వైరల్‌గా మారాయి. కీర్తిదా లెహంగాలో మెరిసిపోతుండగా రిబు షేర్వానీ ధరించాడు. 'ఇప్పుడు మేము మిస్టర్ అండ్ మిసెస్ మెహ్రా. ఈ పెళ్లిని ఇంత అద్భుతంగా మలిచినందుకు రుచి శర్మకు కృతజ్ఞతలు. ఈ మూడు రోజుల పెళ్లిని అందంగా మలిచిన కుటుంబసభ్యులు, బంధుమిత్రలు, స్నేహితులందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు' అని రాసుకొచ్చారు నవ దంపతులు. ఈ పోస్ట్‌పై బుల్లితెర సెలబ్రిటీలు స్పందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా కీర్తిదా, రిబు ఇద్దరూ 'బహుత్ ప్యార్ కర్తే హై' అనే సీరియల్లో కలిసి నటించారు. అప్పడే వీరి మధ్య ప్రేమ చిగురించినట్లు తెలుస్తోంది. ఇకపోతే రిబు 'గమ్ హై కిసికె ప్యార్ మే', 'యే హై మొహబ్బతే', 'కుంకుమ్ భాగ్య' సహా పలు సీరియల్స్‌లో నటించాడు. కీర్తిదా 'ప్రియా రంగ్రెజ్', 'విక్రమ్ బేతాల్కీ రహస్య గాథ' వంటి సీరియల్స్‌లో యాక్ట్ చేసింది. View this post on Instagram A post shared by Ribbhu Mehra (@ribbhu.mehra_djribz) View this post on Instagram A post shared by Ribbhu Mehra (@ribbhu.mehra_djribz) View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani) -
వివాహబంధంలోకి అడుగుపెట్టిన బుల్లితెర జంట.. ఫోటోలు వైరల్
ఇటీవల సినీ ప్రముఖుల పెళ్లిళ్లు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే పలువురు హీరోయిన్స్ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెట్టారు. తాజాగా ఈ లిస్ట్‌లో మరో సెలబ్రిటీ జంట వచ్చి చేరింది. తెలుగు బుల్లితెర నటుడు అమర్దీప్.. నటి తేజస్వినిని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ సందర్భంగా కొత్త జంటకు పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఆగస్టులో ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట ఇవాళ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్న వధూవరులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా అమర్ దీప్.. జానకి కలనగలేదులో హీరోగా నటిస్తుండగా తేజస్వి కేరాఫ్ అనసూయ సీరియల్ చేస్తోంది. అమర్దీప్ పలు ఓటీటీ సిరీస్‌ల్లోనూ నటిస్తున్నారు. View this post on Instagram A post shared by CelebrityNews (@industrycelebritynews) -
సీరియల్ నటుడి ఆత్మహత్య
ప్రముఖ తమిళ నటుడు లోకేశ్ రాజేంద్రన్(34) ఆత్మహత్య చేసుకున్నారు. అక్టోబర్ 2న చెన్నైలోని ఓ బస్టాండ్‌లో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే స్థానికులు అతడిని దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా తమిళ సీరియల్ మర్మదేశంలో బాలనటుడిగా అలరించిన లోకేశ్ రాజేంద్రన్ 150కిపైగా సీరియల్స్, 15 సినిమాల్లో నటించారు. గత కొంత కాలంగా ఆయన కుటుంబ కలహాలతో సతమతమవుతున్నట్లు లోకేశ్ తండ్రి మీడియాకు వెల్లడించారు. నాలుగు రోజుల క్రితమే లోకేశ్‌కు అతడి భార్య నుంచి విడాకుల నోటీసులు వచ్చాయని, ఈ కారణంగానే అతడు డిప్రెషన్లోకి వెళ్లి ఉండవచ్చని పేర్కొన్నారు. తన కొడుకును చివరిసారిగా శుక్రవారం చూశానని తెలిపారు. తనకి కొంత డబ్బు కావాలని అడిగితే ఇచ్చానని, అంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు లోకేశ్ తండ్రి. కాగా లోకేశ్‌కు ఒక భార్య, ఇద్దరు పిల్లలు సంతానం. చదవండి: ఆదిపురుష్‌పై అయ్యవారి ఆగ్రహం ఖరీదైన కారు కొన్న షణ్ముఖ్ జశ్వంత్ -
సెట్లో దురుసు ప్రవర్తన.. నటుడు చందన్‌పై నిషేధం
ఇటీవల షూటింగ్ సెట్లో బుల్లితెర హీరో ఓవరాక్షన్ చేసి చెంపదెబ్బతిన్న సంఘటన సంచలనం రేపింది. ‘స్టార్ మా’ ధారావాహిక సావిత్రమ్మ గారి అబ్బాయితో తెలుగులో గుర్తింపు పొందిన నటుడు చందన్ కుమార్ ‘శ్రీమతి శ్రీనివాస్’ సీరియల్లో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ క్రమంలో సోమవారం జరిగిన షూటింగ్ సెట్లో అసిస్టెంట్ డైరెక్టర్‌తో దురుసుగా ప్రవర్తించాడు. అంతేకాదు దుర్భాషలాడుతూ, అతడి తల్లిని దూషించాడు. దీంతో అసిస్టెంట్ డైరెక్టర్ నటుడితో వాదనకు దిగాడు. చదవండి: ఆ హీరోయిన్‌తో డేటింగ్ వార్తలపై నోరు విప్పిన చై ఈ క్రమంలో చందన్ ప్రవర్తన కాస్తా ఇబ్బందిగా అనిపించడంతో అక్కడి వారంత అతడిపై సీరియస్ అయ్యారు. అసిస్టెంట్ డైరెక్టర్‌కి క్షమాపణ చెప్పమనడంతో చందన్ కుమార్ నేనేంటో చూపిస్తా అంటూ సీరియస్ అయ్యాడు. దీంతో ఆగ్రహించిన అసిస్టెంట్ డైరెక్టర్ చందన్ కుమార్‌ని అందరి ముందే కొట్టాడు. చుట్టూ ఉన్న వాళ్ళు ఆపడానికి ప్రయత్నించగా చందన్ షూటింగ్ నుంచి వెళ్ళిపోయాడు. అయితే అక్కడితో గొడవ ముగిసింది అనుకుంటే చందన్ కన్నడ మీడియా ముందు తెలుగు పరిశ్రమపై అసత్యాలు ప్రచారం చేస్తూ, తెలుగు బుల్లితెరని కించపరుస్తూ మాట్లాడాడు. చదవండి: సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్ దీంతో ఈ వివాదం కాస్తా మరింత ముదిరింది. తెలుగు పరిశ్రమ గురించి తప్పుగా మాట్లాడినందుకు నేడు తెలుగు టీవీ ఫెడరేషన్ సమావేశం ఏర్పాటు చేసి చందన్‌పై బ్యాన్ విధించింది. తెలుగు టీవీ ఫెడరేషన్ సమావేశంలో బాధితుడు అసిస్టెంట్ డైరెక్టర్ మాట్లాడుతూ.. ‘షాట్ రెడీ అని నాలుగు సార్లు పిలిచాను, అయినా రాకుండా నన్ను కొట్టి, బూతులు తిట్టాడు. డైరెక్టర్‌కి కంప్లైంట్ చేస్తే బయటకి రా దమ్ముంటే నేనెంటో చూపిస్తానంటూ బెదిరించాడు’ అని తెలిపాడు. దీంతో చందన్ తీరును క్షమించరానిదిగా పరిగణించి తెలుగు టీవీ ఫెడరేషన్ చందన్‌ని బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటన ఇచ్చింది. -
సెట్లో ఓవరాక్షన్ చేసి తన్నులు తిన్న హీరో.. వీడియో వైరల్
షూటింగ్ సెట్లో సంచలన ఘటన చోటుచేసుకుంది. బుల్లితెర హీరో, నటుడుపై సిబ్బంది చేయి చేసుకున్న వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. ‘స్టార్ మా’ ధారావాహిక సావిత్రమ్మ గారి అబ్బాయితో తెలుగులో గుర్తింపు పొందిన నటున్ చందన్ కుమార్. ప్రస్తుతం అతడు తెలుగులో ‘శ్రీమతి శ్రీనివాస్’ సీరియల్లో లీడ్ రోల్ పోషిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నేడు జరిగిన షూటింగ్లో చందన్ సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించాడు. సీరియల్‌కు పనిచేస్తున్న ఓ టెక్నిషియన్‌ను నానాబూతులు తిడుతూ నోరుపారేసుకున్నాడు. దీంతో యూనిట్ అంతా తిరగబడ్డారు. ఈ క్రమంలోనే తన మదర్‌ను దూషించాడంటూ ఓ టెక్నిషియన్ చందన్ చెంప చెల్లుమనిపించాడు. చదవండి: విడాకులపై ప్రశ్న.. తొలిసారి ఘాటుగా స్పందించిన చై అంతేకాదు అతనిపై మాటల దాడికి దిగారు. ఇక అక్కడే ఉన్న మిగతా సిబ్బంది చందన్‌తో చేత టెక్నిషియన్‌కు క్షమాపణలు చెప్పించారు. అనకూడని మాటలు అన్నాడు, నా తల్లిని దూషించాడు ఇప్పుడు సారీ చెబితే ఊరుకుంటామా అని సదరు సిబ్బంది వాదించాడు. ఇలా నటుడు చందన్ ఓవరాక్షన్ చేసి చెంప దెబ్బతిన్న వీడియో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కాగా చందన్ కన్నడ పరిశ్రమలో ఎంతోకాలంగా యాక్టివ్‌గా ఉన్నాడు. చందన్ హీరోగా, యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్గా ప్రేమ బరహా చిత్రం కూడా వచ్చింది. ‘రాధా కళ్యాణ’, ‘లక్ష్మీ బారమ్మ’ వంటి కన్నడ సీరియల్స్‌తో బుల్లితెర ఎంట్రీ ఇచ్చాడు. చదవండి: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత -
సీమ బిడ్డల సినిమా కథ.. 60 సినిమాలు, 100కు పైగా సీరియళ్లు.. ‘పోలీస్’ దావూద్
వారిది ఒక్కొక్కరిదీ ఒక్కో నేపథ్యం. సినిమా రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. అవకాశాలను అందిపుచ్చుకున్నారు. కుటుంబ పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా వెరవక.. లక్ష్యం వైపు అడుగులు వేశారు. సన్నివేశం ఏదైనా అందుకు తగ్గ వేషం వేసి అందరినీ అలరిస్తున్న వారు కొందరు.. తమదైన కళతో నటీనటుల మోముకు అందాలు అద్దుతూ సంపూర్ణత్వాన్ని తెస్తున్న వారు మరొకరు. చలనచిత్ర రంగంలో రాణిస్తున్న సీమ బిడ్డల గురించి ప్రత్యేక కథనం.. మేకప్ బాద్షా.. జమ్మలమడుగు (వైఎస్సార్ కడప): మైలవరం మండలం దొమ్మరనంద్యాలకు చెందిన గోవిందపల్లె రోషన్ మహబూబ్‌బాషా సినిమా రంగంలో మేకప్‌మెన్‌గా మంచి గుర్తింపు పొందాడు. ఇతని సినీరంగ ప్రవేశం ఆసక్తికరంగా సాగింది. బాల్యంలో చదువు వంటబట్టకపోవడంతో మోటార్ మెకానిక్‌గా పని చేస్తున్న తన మామ గఫూర్ వద్ద పని నేర్చుకుందామని పులివెందుల వెళ్లాడు. రెండేళ్లపాటు అక్కడ పని నేర్చుకున్నాడు. ఆ సమయంలో పులివెందులకు చెందిన రమణబాబు అనే వ్యక్తి మద్రాసు నుంచి కొందరు సినీ నటులను పిలిపించి పులివెందులలో ఓ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ సినిమా రంగానికి చెందిన వారిని పరిచయం చేసుకుని వారి వెంట 1983లో మద్రాసు వెళ్లాడు. తొలుత నటుడు రంగనాథ్ వద్ద అసిస్టెంట్ మేకప్‌మెన్‌గా చేరాడు. రెండేళ్ల తర్వాత ఏఎం రత్నం, విజయశాంతి వద్ద అసిస్టెంట్ మేకప్‌మెన్‌గా పనిచేశాడు. దేవాలయం, వందేమాతరం, అరుణ కిరణం తదితర సినిమాల్లో విజయశాంతికి మేకప్ వేశారు. ముత్యాల సుబ్బయ్య ప్రోత్సాహంతో.. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం వహించిన సినిమాలకు చీఫ్ మేకప్‌మెన్‌గా పనిచేశారు. అందులో ప్రధానంగా పవన్‌కల్యాణ్‌తో నిర్మించిన గోకులంలో సీత, ఒకేమాట, దీవించండి, మామగారు తదితర సినిమాలకు మేకప్‌మెన్‌గా పనిచేశారు. బాలకృష్ణతో మహబూబ్‌బాషా.. సుమన్‌కు మేకప్ వేస్తున్న మహబూబ్‌బాషా (ఫైల్) బాలకృష్ణకు సైతం బాలకృష్ణ నటించిన పలు సినిమాలకు అసిస్టెంట్ మేకప్‌మెన్‌గా పనిచేశారు. ఇన్స్పెక్టర్ ప్రతాప్, పవిత్రప్రేమ, కృష్ణబాబు, ఆదిత్య 369, భైరవద్వీపం, పట్టాభిషేకం, అనసూయమ్మగారి అల్లుడు, తిరుగబడ్డ తెలుగుబిడ్డ, అఖండ సినిమాలలో అసిస్టెంట్ మేకప్‌మెన్‌గా పనిచేశారు. నటుడు రంగనాథ్‌తో ప్రారంభించిన మేకప్‌మెన్ ప్రస్థానంలో మొత్తం 250 సినిమాలకు మేకప్‌మెన్‌గా పనిచేశానని మహబూబ్‌బాషా తెలిపాడు. ప్రధానంగా బాలకృష్ణ, చిరంజీవి, సుమన్, విజయశాంతి వంటి ప్రముఖ నటీనటుల వద్ద మేకప్‌మెన్‌గా పనిచేసే అవకాశం రావడం తన అదృష్టమని చెబుతున్నాడు. పోలీసు పాత్రలో దావూద్ పోలీసు పాత్ర.. దావూద్ ప్రత్యేకత ప్రొద్దుటూరు: ప్రముఖ హీరోలు నటించిన సినిమాల్లో, అన్ని తెలుగు ఛానళ్లలో వస్తున్న సీరియల్స్‌లో నటిస్తున్న నటుడు దావూద్ ప్రొద్దుటూరుకు చెందిన వాడు. ఈయన ఇప్పటి వరకు సుమారు 60 సినిమాలు, 100కు పైగా సీరియల్లలో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందుతున్నాడు. ప్రొద్దుటూరు పట్టణంలోని ఖాదర్ హుసేన్ మసీదు వీధికి చెందిన మహమూద్, అఫ్తాబ్‌ల కుమారుడు దావూద్ చిన్నప్పటి నుంచి సినిమా రంగంపై మక్కువ పెంచుకున్నాడు. 2011లో కడప మదీనా ఇంజినీరింగ్ కాలేజిలో బీటెక్ పూర్తి చేశాడు. సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్‌కు వెళ్లి చాలా కాలం ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. ► 2013లో రిలీజైన చిరంజీవి సినిమా ఖైదీనంబర్ 150లో దుబాయి కూలి పాత్రలో దావూద్ రాణించాడు. ఈ ఏడాది దసరాకు రిలీజ్ కానున్న చిరంజీవి నటించిన గాడ్‌ఫాదర్ సినిమాలో ఎస్ఐ పాత్రలో, హీరో ఆది సాయికుమార్ క్రేజీ ఫెలో సినిమాలో కానిస్టేబుల్ పాత్రలో, కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మీటర్ సినిమాలో సీఐ పాత్రలో, సుధీర్‌బాబు హీరోగా భవ్యా క్రియేషన్స్ నిర్మిస్తున్న సినిమాలో ఎస్ఐ పాత్రలో, నిత్యామీనన్ హీరోయిన్గా నటిస్తున్న కుమారి శ్రీమతి సినిమాలో బ్యాంకు ఆఫీసర్ పాత్రలో దావూద్ నటించిన సినిమాలు ఈ ఏడాది విడుదల కానున్నాయి. ► తాజాగా విడుదలైన విరాట పర్వం సినిమాలో మఫ్టీ పోలీసు పాత్రలో, శేఖర్ సినిమాలో ఎస్ఐ పాత్రలో, శ్యాంసింగరాయ్లో కానిస్టేబుల్ పాత్రలో, ఆర్ఆర్ఆర్ సినిమాలో బ్రిటిష్ పోలీసు పాత్రలో, రిపబ్లిక్ సినిమాలో రిపోర్టర్‌గా, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలో జైలర్‌గా, శ్రీకారం సినిమాలో మేనేజర్‌గా నటించాడు. ► ప్రముఖ తెలుగు ఛానళ్లలో వస్తున్న ఊహలు గుసగుసలాడే, సూర్యకాంతం, జానకి కలగనలేదు, వైదేహి పరిణయం, మౌనపోరాటం తదితర సీరియల్స్‌లో పలు పాత్రలు దావూద్ పోషిస్తున్నాడు. హీరో, హీరోయిన్లకు సీన్ వివరిస్తున్న డైరెక్టర్, తదితరులు శభాష్.. మహేష్ పులివెందుల రూరల్: పులివెందుల మండలం తుమ్మలపల్లె గ్రామానికి చెందిన మహేష్ గాయకుడిగా, నటుడిగా సామాజిక మాధ్యమాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటున్నాడు. బాబయ్య, ఇమాంబిల కుమారుడు మహేష్. డిప్లొమా పూర్తి చేసిన ఈ యువకుడు ప్రస్తుతం వ్యవసాయం చేస్తున్నాడు. ఫేస్బుక్, ఇన్‌స్ట్రాగాం, యూట్యూబ్ చానెళ్లు, సీరియళ్లలో పాటలు పాడుతూ, నటిస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నాడు. ఎంతోమంది అభిమానులను సైతం సంపాదించుకున్నాడు. ఇప్పటివరకు ఇతను 25 లఘుచిత్రాలు, 30 సీరియల్స్‌తోపాటు స్పైడర్, నేనే రాజు – నేనే మంత్రి, నేను లోకల్, ద్వారక, మీలో ఎవరు కోటీశ్వరుడు సినిమాలలో చిన్న పాత్రల్లో నటించినట్లు తెలిపాడు. సినిమా రంగంలో నటుడిగా స్థిరపడాలనేదే నా కోరిక’ అంటున్న ఈ యువ నటుడు మరింతగా రాణించాలనేదే ఈ ప్రాంత వాసుల ఆకాంక్ష. వారం ప్రవీణ్‌కుమార్ వేణుమాధవ్ మళ్లీ వచ్చాడు! కడప సిటీ: హాస్యనటుడిగా సినిమాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణుమాధవ్ తనువు చాలించి రెండేళ్లకు పైగా అయింది. అయితే అదే ముఖ కవళికలు, పోలికలతో కడపకు చెందిన వారం ప్రవీణ్‌కుమార్ వేణుమాధవ్‌ను మరిపిస్తున్నాడు. జూనియర్ వేణుమాధవ్‌గా గుర్తింపు తెచ్చుకుని ప్రస్తుతం శాంతకుమార్ దర్శకత్వంలో సాయికుమార్ హీరోగా నిర్మిస్తున్న నాతో నేను అనే సినిమాలో హాస్యనటుడిగా ప్రముఖ నటుడు భద్రం, సాయిశ్రీనివాస్‌ల సరసన నటిస్తున్నాడు. తొలుత టిక్‌టాక్ షోలలో కామెడీ సీన్లు చేసి యూ ట్యూబ్‌లో అప్లోడ్ చేస్తూ వచ్చాడు. అచ్చం వేణుమాధవ్ లాగే ఉన్నాడని కొన్ని ఛానళ్లు గ్రహించి టీవీ షోలలో కూడా ఇంటర్వ్యూ చేశారు. ఇటీవల కాలంలో మృతి చెందిన సినీ నటులకు సంబంధించిన వారి కుటుంబ సభ్యులతో హైదరాబాదులో ప్రముఖ ఛానల్లో షో నిర్వహించారు. ఆ షోలో ప్రవీణ్‌కుమార్ పాల్గొని అచ్చం వేణుమాధవ్‌లా హావభావాలు ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నాడు. కుటుంబ నేపథ్యం.. కడప విశ్వనాథపురానికి చెందిన వారం సుబ్బరాయుడు, శ్యామలాదేవి దంపతుల రెండో కుమారుడు వారం ప్రవీణ్‌కుమార్. ఇతను ఎంఏ బీఈడీ చదువుకున్నాడు. ప్రస్తుతం ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నాడు. ఉన్నత విద్య అభ్యసించినప్పటికీ నటనపై ఆసక్తి పెంచుకున్నాడు. సినిమా రంగంలో అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. ‘నేను వేణుమాధవ్ పోలికలతో ఉండడం నిజంగా నా అదృష్టమని, దాంతోనే నాకు సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం దక్కుతోందని’ తెలిపాడు. తన సోదరి, బావ, సతీమణి సహకారంతోనే తాను రాణిస్తున్నాని చెప్పాడు. సినిమాల్లో అవకాశం రావడానికి ఆయన పోలికలు ఉండడమే ప్రధాన కారణమని చెప్పుకొచ్చాడు. కడపకు చెందిన ఈ జూనియర్ వేణుమాధవ్ భవిష్యత్తులో తన నటనా చాతుర్యంతో అందరి మన్ననలు పొందాలని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. -
బుల్లితెరపై కందనూలు కుర్రాడు.. పదేళ్ల కష్టం తర్వాత..
సాక్షి, మహబూబ్‌నగర్: కష్టాన్ని నమ్ముకుంటే ఏదో ఒకరోజు ఫలితం ఉంటుందని నిరూపించాడు నాగర్‌కర్నూల్‌కు చెందిన రాఘవ. తాను పడ్డ పదేళ్ల కష్టానికి నేడు బుల్లితెర హీరో అయ్యాడు. కొందరు స్నేహితుల సహకారంతో నేడు ఓ ప్రముఖ ఛానల్లో ప్రసారమవుతున్న గీతగోవిందం సీరియల్లో హీరోగా.. రంగులరాట్నం అనే మరో సీరియల్లోనూ సెకండ్ లీడ్రోల్లో నటిస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి.. రాఘవ డిగ్రీ వరకు నాగర్‌కర్నూల్‌లోనే చదివారు. 2012లో కొందరు స్నేహితులతో కలిసి కొన్ని షార్ట్ ఫిలిమ్స్ తీశారు. 2013లో హైదరాబాద్ బస్సెక్కా రు. అక్కడ జ్ఞానేశ్వర్ అనే షార్ట్ ఫిలిమ్ డైరెక్టర్‌తో కొన్నాళ్లు కథలు రాశారు. అయిదేళ్ల పాటు మోడలింగ్, షార్ట్‌ఫిలిమ్స్‌లోనూ ప్రయత్నాలు చేశారు. టిక్‌టాక్‌తోనే.. స్నేహితుడు శేఖర్ సలహా మేరకు 2018లో టిక్‌టాక్‌లో అడుగుపెట్టి సుమారు 250 వీడియోలు చేశారు. ఈ వీడియోలతో తెలుగు రాష్ట్రాల కంటే తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో రాఘవకు మంచి పేరొచ్చిందనే చెప్పాలి. తన ఫిజిక్, నటన సూర్యను పోలి ఉండటంతో జూనియర్ సూర్య అంటూ కామెంట్లు మేలు చేశాయి. వీడియోలు చూసిన ఓ డైరెక్టర్ ఫోన్లో సంప్రదించి అవకాశం ఇచ్చారు. చదవండి: ‘గృహలక్ష్మి’ సీరియల్ నా జీవితానికి టర్నింగ్ పాయింట్.. మొదటిసారి యాడ్‌లో.. దీపక్ అనే యాడ్స్ డైరెక్టర్ కడపకు చెందిన పీఎస్కే టీ పౌడర్ యాడ్‌లో నటించేందుకు అవకాశం ఇవ్వడంతో 2019లో యాడ్ షూటింగ్లో పాల్గొన్నారు. ఇదే ఏడాది నందగోకుల్ నెయ్యికి సంబంధించిన యాడ్లోనూ నటించారు. సీరియల్స్‌లో అవకాశం.. 2020 అక్టోబర్ 2న మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాఘవకు ఫోన్ వచ్చింది. గీతగోవిందం సీరియల్లో హీరో కావాలని.. ఆడిషన్స్‌లో పాల్గొనే అవకాశం ఇచ్చారు. సెలెక్టయినా లాక్డౌన్ రావడంతో ఈ ప్రాజెక్టు వాయిదాపడింది. 2021లో అనిల్ అనే డైరెక్టర్ రంగులరాట్నం సీరియల్ తీస్తుండడంతో అందులో సెకండ్ హీరోగా రాఘవను ఎంపిక చేయగా మొదట ఇదే సీరియల్ టెలికాస్ట్ అయింది. జనవరి 2, 2022న గీతగోవిందం ప్రారంభం కాగా ఫిబ్రవరి 2న సీరియల్ ప్రేక్షకుల ముందుకొచ్చింది. హీరో అవ్వడమే లక్ష్యం.. ప్రస్తుతం రెండు సీరియల్స్‌లో నటిస్తున్నా. వీటితో పాటే ఇతర ప్రయత్నాలు చేస్తున్నా. సినీ హీరో అవ్వడమే లక్ష్యం. ఈ ప్రయాణంలో చాలామంది స్నేహితులు సహకరించారు. ప్రోత్సహించడమే కాకుండా ఆర్థికంగా కూడా ఆదుకున్నారు. వారి సహకారం ఎప్పటికీ మర్చిపోను. – రాఘవ, సీరియల్ హీరో -
దిక్కుతోచక ఏటీఎమ్ రూమ్‌లో నిద్రించేవాడిని: బుల్లితెర నటుడు
ముఖానికి రంగేసుకుని కెమెరా ముందు నవరసాలు పలికించే నటీనటుల జీవితంలో ఎన్నో విషాదాలు ఉంటాయి. కానీ వాటన్నింటినీ పైకి కనిపించనీయకుండా ముఖానికి మేకప్‌తో, పెదాలపై చిరునవ్వుతో స్క్రీన్‌పై కనిపిస్తూ జనాలను అలరిస్తూ ఉంటారు. బుల్లితెర స్టార్ అంకిత్ సివాచ్ కూడా ఈ కోవకే చెందుతాడు. మోడలింగ్ సమయంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నానని తెలిపాడు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో జన్మించిన అంకిత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. 'ఢిల్లీలో ఓ పక్క చదువుకుంటూనే కాల్ సెంటర్లో పనిచేసేవాడిని. మోడలింగ్ పూర్తి చేయడానికి రూ.60,000 అవసరమయ్యాయి. కానీ దీనికోసం నా తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టాలనుకోలేదు. ఎందుకంటే కేవలం నా ఇష్టంతో మోడలింగ్‌ను ఎంచుకున్నాను. నేను సంపాదించిన డబ్బులతోనే మోడలింగ్ పూర్తి చేయాలనుకున్నాను. అయితే వేసవిలో ఢిల్లీలో ఎండలు మండిపోతాయి. ఆ సమయంలో ఎండకు తాళలేక నేను ఏటీఎమ్ దగ్గర పనిచేసే వాచ్‌మెన్‌కు ఓ వంద రూపాయలు ఇచ్చి అక్కడ పడుకునేవాడిని. ఎందుకంటే అందులో ఏసీ ఉంటుంది కదా! అలా దాదాపు ఏడు వారాలపాటు ఏసీ కోసం ఏటీఎమ్‌లో నిద్రించేవాడిని. ఒకవేళ నాకు డబ్బు కావాలని పేరెంట్స్‌ను అడిగితే వాళ్లు ఒక్క మాట కూడా తిరిగి ప్రశ్నించకుండా నాకు మనీ పంపించేవారు. కానీ నాకది ఇష్టం లేదు. పైగా డబ్బులు దుబారా ఖర్చు పెట్టకూడదని ఫ్రెండ్స్‌తో పార్టీలకు కూడా వెళ్లేవాడిని కాదు. అందువల్ల వాళ్లు నన్ను ద్వేషించేవారు కూడా! ఇంట్లో(మీరట్‌లో) ఉంటే హాయిగా బతికేవాడినే, కానీ ఇక్కడికొచ్చాక చాలా కష్టాలు పడ్డాను' అని చెప్పుకొచ్చాడు. కాగా అంకిత్.. మన్మోహిని, యే జుకీసి నజర్, సఫర్నమ వంటి పలు సీరియల్స్‌లో నటిస్తున్నాడు. చదవండి: సాక్షి ఆడియన్స్ పోల్, సర్కారువారి పాటపై ప్రేక్షకుల రివ్యూ బాలీవుడ్ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది -
గర్ల్‌ఫ్రెండ్ ఫిర్యాదుతో సీరియల్ నటుడి అరెస్ట్.. ఎందుకంటే ?
Odia Serial Actor M Suman Kumar Arrested For Cheating Girlfriend Case: సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపులకు గురైన హీరోయిన్లు చాలానే ఉన్నారు. ఇటీవల కాలంలో వారు ఒక్కొక్కరిగా వారికి జరిగిన అన్యాయాలను బయటపెడుతున్నారు. అలాగే లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న పెద్ద పెద్ద మేల్ సెలబ్రిటీలు కూడా లేకపోలేదు. తాజాగా ఒక టీవీ సీరియల్ నటుడు ప్రేమ, పెళ్లి పేరు చెప్పి శారీరకంగా లొంగదీసుకుని, మోసం చేశాడనే ఆరోపణలతో అరెస్ట్ అయ్యాడు. ఒడియా టీవీ సీరియల్లో నటించే ఎం సుమన్ కుమార్‌ను భువనేశ్వర్‌లోని పహాలా పోలీసులు ఆదివారం (ఏప్రిల్ 24) అరెస్ట్ చేశారు. ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఓ అమ్మాయిని మోసం చేశాడనే ఆరోపణలతో సుమన్ కుమార్‌పై కేసు నమోదు అయింది. నటుడు ఎం సుమన్ గత రెండేళ్లుగా అమ్మాయితో సంబంధం కొనసాగిస్తున్నట్లు బాధితురాలి తరఫు న్యాయవాది ప్రశాంత్ దే తెలిపారు. ఆమెను పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి అమ్మాయితో సాన్నిహిత్యం పెంచుకున్నాడన్నారు. తీరా పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే ముఖం చాటేశాడని ఆయన పేర్కొన్నారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా సుమన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 376 (2) (ఎన్), 420, 294, 323, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. చదవండి: ఆ నటుడికి 61 ఏళ్లు.. రెండేళ్ల వివాహ బంధానికి విడాకులు.. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఒంటిపై బట్టలేకుండా ఫొటోలు పంపమనేవారు: బుల్లితెర నటుడు
తాను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితుడినే అంటున్నాడు టీవీ నటుడు అంకిత్ సివాచ్. మోడల్‌గా 12 ఏళ్ల క్రితమే కెరీర్ ఆరంభించిన ఈ నటుడు 2017లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చాడు. పలు హిందీ సీరియళ్లలో నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు అంకిత్. అయితే ఒకానొక సమయంలో అన్నీ వదిలేసి వెనక్కు వెళ్లిపోవాలనుకున్నానంటూ కాస్టింగ్ కౌచ్ అనుభవాలను పంచుకున్నాడు. 'అందరూ మంచివాళ్లు అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని. కానీ అలా అనుకోవడమే నా బలహీనతగా మారింది. ఈ వీక్నెస్ను ఎదుటివాళ్లు యూజ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ చెడు కూడా ఉంటుంది. కానీ అది రాక్షసత్వంగా మారి మిమ్మల్ని ముప్పుతిప్పలు పెట్టొచ్చు. మోడలింగ్ చేసేటప్పుడు నేను అలాంటి ఇబ్బందులనే ఎదుర్కొన్నాను. ఒంటి మీద బట్టలు లేకుండా ఫొటోలు పంపమనేవారు. నాకు ఇచ్చిన పనితో సంబంధం లేకుండా పార్టీలకు రావాలనేవారు. నన్ను వేధింపులకు గురి చేశారు. చాలాసార్లు మోడలింగ్ మానేద్దామా అనిపించింది. కొంతమందిని చూసినప్పుడు మన కళ్ల ముందు రాబంధులు నిలబడి మనల్ని పీక్కు తినడానికి వస్తున్నాయనిపించేది. అలాంటివారిని చూసినప్పుడు అన్నీ వదిలేసి వెనక్కు వెళ్లిపోదాం అనిపించేది. దీనివల్ల మానసిక ఒత్తిడికి లోనయ్యా. కుమిలిపోయాను. కానీ అధికారంలో ఉన్నవారు ఇతరులను దగా చేయడం మానవ స్వభావమని నన్ను నేను సంభాలించుకున్నాను. ఇది ప్రతి ఇండస్ట్రీలో ఉంది. వాటినుంచి మనం తప్పించుకోలేము. ఏదో ఒకసారి ఫేస్ చేయాల్సిందే. అలా నాకు ఎన్నో ప్రపోజల్స్ వచ్చాయి. నీకు ఇష్టమున్నా లేకపోయినా నీ కెరీర్ కోసమైనా ఆ పని చేసి తీరాల్సిందే అని ఒత్తిడి తెచ్చినవాళ్లు కూడా ఉన్నారు. అప్పుడు నేను స్వయంకృషితో ఎదిగిన సెలబ్రిటీల గురించి ఉదాహరణగా చెప్పేవాడిని. మేము చెప్పినదానికి కాంప్రమైజ్ కాకుండా నువ్వు ముందుకు వెళ్లగలననుకుంటున్నావా? అని బెదిరించేవాళ్లు కూడా!' అని చెప్పుకొచ్చాడు అంకిత్ సివాచ్. చదవండి: ఓటీటీల్లో మిస్ అవ్వకూడని టాప్ 6 సినిమాలు.. ప్రియుడితో లేచిపోయారంటూ వచ్చిన వార్తలపై రాజశేఖర్ కూతురు ఫైర్ -
విడాకులు తీసుకున్న మరో నటుడు.. మరణమే బాగుంటుందని
Nitish Bharadwaj As Krishna Announces Divorce With His Wife Smita: చిత్ర పరిశ్రమలో వివాహ బంధాలతో ఇలా ఒక్కటవుతుంటే.. అలా విడిపోతున్నారు. ఎంత వేగంగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారో.. అంతే వేగంగా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. గత కొంతకాలం నుంచి సెలబ్రిటీల సినిమాలు కాకుండా వారి వ్యక్తిగత విషయాలతోనే హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. కొందరు నేరాలు, మోసాలతో వార్తల్లోకి ఎక్కితే.. వారి భాగస్వామితో తెగదెంపులు చేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు మరికొందరు. టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ నాగ చైతన్య, సమంత విడిపోయారనే విషయాన్ని ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్న తరుణంలో కోలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ ధనుష్, ఐశ్వర్యలు విడాకులు తీసుకుంటున్నట్లు పెద్ద బాంబు పేల్చారు. దీంతో అభిమానగనం, ప్రేక్షకలోకం నివ్వెరపోయి అందుకు కారణాలు ఏంటా అని ఆలోచిస్తున్నాయి. (చదవండి: ధనుష్-ఐశ్వర్య విడాకులపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు..) ఇదిలా ఉంటే తాజాగా మరో సెలబ్రిటీ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు. అతనే ప్రముఖ టీవీ సీరియల్ నటుడు నితీష్ భరద్వాజ్. అతను భరద్వాజ్ కంటే 'మహాభారతం' సీరియల్లో శ్రీకృష్ణుడిగానే మోస్ట్ పాపులర్. నితీష్ భరద్వాజ్ తన భార్య, ఐఏఎస్ అధికారిణి స్మితా గేట్‌తో ఉన్న 10 సంవత్సరాల వైవాహిక జీవితానికి స్వస్తి పలికి విడిపోయినట్లు తెలిపాడు. అయితే నితీష్ భరద్వాజ్, స్మితా గేట్ 2019 సెప్టెంబర్‌లో విడిపోయారు. వారికి ఇద్దరు కవల కుమార్తెలు. భరద్వాజ్ తన డివోర్స్ గురించి 'నేను 2019 సెప్టెంబర్‌లో ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేశాను. మేము విడిపోడానికి కారణాలు నాకు చెప్పాలని లేదు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. నేను చెప్పేది ఏంటంటే.. కొన్నిసార్లు మరణం కంటే విడాకులే చాలా బాధగా ఉంటాయి.' అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. కాగా 2009లో స్మితా గేట్‌ను రెండో వివాహం చేసుకున్నాడు నితీష్ భరద్వాజ్. (చదవండి: ధనుష్-ఐశ్వర్య డివోర్స్.. ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్స్) బీఆర్ చోప్రా తెరకెక్కించిన టీవీ సిరీస్ 'మహాభారతం'లోని శ్రీకృష్ణుడి పాత్రలో భరద్వాజ్ ప్రేక్షకులను ఎంతో అలరించాడు. ఈ పాత్రతో అతనికి ఎనలేని పేరు వచ్చింది. ఈ టీవీ సిరీస్ 1988వో నాలుగు సీజన్స్‌తో వచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందింది. అలాగే బీఆర్ చోప్రా రూపొందించిన అనేక సీరియల్స్‌లో నటించాడు. అందులో 'విష్ణువు' పాత్రతో మరింత ప్రసిద్ధి చెందాడు నితీష్ భరద్వాజ్. అలాగే నితీష్ తొలిసారిగా డైరెక్ట్ చేసిన పిత్రురూన్ చిత్రానికి ఎంతో పేరు వచ్చింది. నితీష్ సినిమాల్లోకి రాకముందు వెటర్నరీ సర్జన్‌గా పనిచేశాడు. (చదవండి: విడాకుల ప్రకటనకు ముందు రజనీకి ధనుష్ ఫోన్ కాల్.. కారణం ఇదేనా?) -
సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న హీరో.. వైరల్ అవుతున్న ఫోటోలు
Dev Mahadev Star Mohit Raina Secretly Marries Aditi : బాలీవుడ్ నటుడు మోహిత్ రైనా సీక్రెట్‌గా వివాహం చేసుకున్నాడు. జనవరి1న న్యూ ఇయర్ సందర్భంగా పెళ్లి ఫోటోలు షేర్ చేసి అందరికి షాక్ ఇచ్చాడు. సాధారణంగా సెలబ్రిటీల వివాహం అంటే కొన్ని రోజుల ముందు నుంచే ఆ హడావిడి సోషల్ మీడియాలో స్పష్టంగా కనిపిస్తుంది. కానీ మోహిత్ మాత్రం పెళ్లి తేదీ వరకు తన వివాహాన్ని అత్యంత రహస్యంగా ఉంచాడు. గత కొన్నాళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నా ఆ విషయం బయటికి పొక్కకుండా చాలా జాగ్రత్త పడ్డాడు. తాజాగా ప్రియురాలిని సీక్రెట్‌గా పెళ్లి చేసుకొని ఫ్యాన్స్‌కి షాకిచ్చాడు. కొత్త ఏడాదిలో కొత్త జీవితం ప్రారంభమవుతుందని, మీ అందరి ఆశీస్సులు కావాలంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేశాడు. ఇక చూడముచ్చటైన ఈ జంటకు సినీ ప్రముఖులు, నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 2005 నుంచి ఇండస్ట్రీలో ఉన్న మోహిత్ మహాదేవ్ సీరియల్‌తో ఎంతో పాపులర్ అయ్యాడు. శివుడి పాత్రలో మోహిత్ నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. 2019లో వచ్చిన యురి..ది సర్జికల్ స్ట్రైక్ సినిమాలో సైతం కీలక పాత్రలో కనిపించాడు. View this post on Instagram A post shared by Mohit Raina (@merainna) -
'మొగలిరేకులు' సీరియల్ నటుడిపై భార్య షాకింగ్ కామెంట్స్
Mogali Rekulu Serial Actor Pavithranath: టాలీవుడ్ టాప్ సీరియల్స్‌లో ఒకటైన మొగలిరేకులు సీరియల్ నటుడు పవిత్రనాథ్ చీకటి వ్యవహారాన్ని అతని భార్య బయటపెట్టింది. మొగలిరేకులు సీరియల్లో దయ పాత్రలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర నాథ్ రియల్ లైఫ్‌లో మాత్రం విలన్ అని ఆయన భార్య శశిరేఖ పేర్కొంది. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె పలు షాకింగ్ విషయాలను బయటపెట్టింది. 'పవిత్రనాథ్‌తో 2009లో పెళ్లి జరిగింది. పెళ్లయిన నాటి నుంచి అతనికి అమ్మాయిలంటే పిచ్చి. జాతకం పేరుతో ఎంతోమంది అమ్మాయిలను నేరుగా ఇంటికే తీసుకొచ్చేవాడు. ఏదేంటని ప్రశ్నిస్తే పలుసార్లు చేయి చేసుకున్నాడు. అంతేకాకుండా ఓ అమ్మాయితో8 ఏళ్లు ఎఫైర్ నడిపించి తనని కూడా మోసం చేశాడు. ప్రతిరోజూ ఇంటికి తాగొచ్చి టార్చర్ పెడతాడు. తను ఏ సీరియల్స్‌లో నటిస్తున్నాడో నాకు ఒక్కరోజు కూడా చెప్పలేదు. పదేళ్లుగా నరకం అనుభవిస్తున్నా' అంటూ పేర్కొంది. విడాకులు సైతం ఇవ్వకుండా టార్చర్ పెడుతున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ విషయం గురించి తన అత్తమామాలకు చెప్తే తననే ఇంట్లోంచి గెంటేశారని తెలిపింది. తనకు జరిఘిన అన్యాయం మరో ఆడపిల్లకు జరగొద్దని, తన భర్తను అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతం పవిత్ర నాథ్ కృష్ణ తులిసి అనే సీరియల్లో మల్లికార్ణున్ అనే విలన్ పాత్రలో నటిస్తున్నాడు. -
భార్యను మూడోసారి పెళ్లి చేసుకున్న హిందీ నటుడు
ప్రముఖ టెలివిజన్ స్టార్ కపుల్ డెబీనా-గుర్మీత్ చౌదరి మళ్లీ పెళ్లి చేసుకున్నారు. బెంగాళీ సాంప్రదాయంలో ఇద్దరూ మరోసారి వివాహం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవతున్నాయి. చూడచక్కని ఈ జంటకు అభిమానుల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కాగా 'రామాయణ' టీవీ సీరియల్‌తో హిందీనాట పాపులర్ అయిన డెబీనా-గుర్మిత్లు షూటింగ్ సమయంలోనే ప్రేమలో పడ్డారు. 2006లో ఇంట్లో చెప్పకండా సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 2011లో పెద్దల అంగీకారంతో మరోసారి పెళ్లి చేసుకున్నారు.అవకాశం కుదిరినప్పుడల్లా ఒకరిపై మరొకరు సోషల్ మీడియా వేదికగా ప్రేమను కురిపిస్తూ హిందీ నాట మోస్ట్ క్యూటెస్ట్ కపుల్‌గా పేరు తెచ్చుకున్నారు. గుర్మీత్ కంటే డెబీనా వయసులో నాలుగేళ్లు పెద్దది. అయితే వీరి వివాహం బెంగాళీ సాంప్రదాయం ప్రకారం చేసుకోవాలని ఆమె భావించినా అప్పుడు అది కుదరలేదు. తాజాగా డెబీనా కోరికను గుర్మీత్ తీర్చాడు. ఆమెకు నచ్చిన విధంగా బెంగాలీ స్టైల్లో మరోసారి ఆమెను పెళ్లాడాడు. ఈ సందర్భంగా గుర్మీత్ బంగారు వర్ణపు ధోతీలో కనిపించగా, డెబీనా ఎరుపు రంగు చీరలో అందంగా ముస్తాబైంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చేస్తున్నాయి. -
స్మాల్ స్క్రీన్ ‘మిరాకిల్’ పల్లవి ముఖర్జీ
మొదట హీరోయిన్గా చేసి, వయసు పైబడ్డాక తల్లి పాత్రలు వేయడం పాత పద్ధతి. దానికి రివర్స్‌గా తల్లి పాత్రతో మొదలుపెట్టి తర్వాత హీరోయిన్గా రాణించడం తన స్టయిల్‌గా మార్చుకుంది పల్లవి ముఖర్జీ. వరుస సీరియల్స్, సిరీస్‌తో వీక్షకులను అలరిస్తున్న ఆ స్మాల్ స్క్రీన్ మిరాకిల్ గురించి.. ►పుట్టింది, పెరిగింది, చదివింది అంతా కోల్‌కతాలోనే. అక్కడే జోగమాయా దేవి కాలేజ్‌లో బీఏ సైకాలజీ కోర్సు పూర్తి చేసింది. ►డాన్స్ అంటే చాలా ఇష్టం. కొంతకాలం గుడియా నృత్యం(బెంగాలీ జానపద నృత్యం)లో శిక్షణ కూడా తీసుకుంది. ►చిన్నప్పటి నుంచి హీరోయిన్ కావాలనుకున్న పల్లవి, కమేడియన్‌గా కెరీర్ ప్రారంభించింది. ►2014లో ‘మిరాకిల్’ అనే బెంగాలీ స్టాండప్ కామెడీ షోలో పాల్గొని బుల్లితెరకు పరిచయమైంది. తర్వాత ‘ఆరెంజ్ ఇష్క్’ షోతో యాంకర్‌గా మారింది. ►ఒకవైపు చిన్న చిన్న షోలు, మోడలింగ్ చేస్తూనే, సినిమా అవకాశాల కోసం ప్రయత్నించేది. ►2015లో ‘మీరా’ అనే బెంగాలీ సీరియల్లో లీడ్ రోల్ చేసే అవకాశం దక్కింది. అలా సినిమా హీరోయిన్ కాకపోయినా సీరియల్ హీరోయిన్ అయింది. ►ఆమె అద్భుతమైన నటనకు అవకాశాలవెల్లువ మొదలైంది. వరుసగా ‘భూతూ’, ‘బారిస్టర్ బాబు’ సీరియల్స్ చేసింది. ►‘గందీ బాత్ 3’, ‘ క్లాస్ ఆఫ్ 2020’ సిరీస్‌తో వెబ్ దునియాలోకీ అడుగుపెట్టి తన పరిచయాన్ని విస్తృతం చేసుకుంది. బారిస్టర్ బాబు’ సీరియల్లో అరవై ఏళ్ల ముసలాయనకు భార్యగా, అతని పిల్లలకు తల్లిగా నటించా. కెరీర్ ప్రారంభంలోనే మదర్ రోల్స్ చేస్తే ఎన్నటికీ హీరోయిన్ కాలేవన్నారు. కానీ, టాలెంట్ ఉంటే అవేవీ మనల్ని ఆపలేవు. నేను ఎప్పటికైనా సినిమా హీరోయిన్ అవుతా – పల్లవి ముఖర్జీ -
పరిస్థితి దిగజారకముందే విడిపోయాం: నటుడు
సీఐడీ, యే రిష్తా క్యా కెహ్లాతా హై నటుడు హృషికేశ్ పాండే ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆమె చేయి పట్టుకుని నడవాలని కలలు గన్నాడు. పెద్దలను ఒప్పించి వారి సమక్షంలోనే 2004లో ఆమెను పరిణయమాడాడు. కానీ పెళ్లి తర్వాత అతడు అనుకున్నట్లు జరగలేదు. గొడవలు మొదలయ్యాయి. ఇద్దరి మధ్య మనస్పర్థలు తొంగిచూశాయి. దీంతో సరిగ్గా పది సంవత్సరాల తర్వాత ఇద్దరూ వేర్వేరేగా జీవించడం మొదలు పెట్టారు. ఏకంగా విడాకులు కావాలంటూ కోర్టుకెక్కారు. ఆ విడాకులు ఈ ఏడాది మార్చిలో మంజూరవడంతో అధికారికంగా విడిపోయినట్లు ప్రకటించారు. తాజాగా ఈ విడాకుల గురించి హృషికేశ్ మాట్లాడుతూ.. 'ఒకానొక సమయంలో మేము భార్యాభర్తలుగా ఇక కలిసి ఉండలేం అనిపించింది. పరిస్థితులు చేజారకముందే విడివిడిగా జీవించడం మొదలు పెట్టాం. నా వ్యక్తిగత జీవితం గురించి అందరితో పంచుకోవడం ఇష్టం లేక ఇన్నేళ్లపాటు మౌనంగా ఉన్నాను. విడాకులు వచ్చేశాయి, కాబట్టి ఇప్పుడు దీని గురించి మాట్లాడొచ్చు అనిపిస్తోంది. అలా అని మేమేమీ పెద్ద కొట్లాటలకు దిగలేదు. ఇద్దరమూ పరిపక్వత చెందినవాళ్లమే కాబట్టి చాలా హుందాగా విడిపోయాం'. 'మా బంధం విచ్ఛిన్నమయిందంటూ వచ్చే వార్తలు నా కొడుకు దక్షయ్ చెవిన పడటం నాకిష్టం లేదు. నేను మౌనంగా ఉండటానికి వీడు కూడా ఓ కారణం. వాడికిప్పుడు 12 ఏళ్లు. అతడు నా దగ్గరే పెరుగుతున్నాడు. నేను ఎక్కువ కాలం షూటింగ్లో గడిపేసినప్పుడు వాడు ఇంట్లో ఒంటరిగా ఉండటం నన్ను బాధిస్తోంది అందుకే మంచి హాస్టల్లో చేర్పించేందుకు అడ్మిషన్ తీసుకున్నా. తను కావాలనుకున్నప్పుడు తన తల్లిని కలుసుకోవచ్చు' అని నటుడు చెప్పుకొచ్చాడు. ఇప్పటికీ ప్రేమను నమ్ముతానంటోన్న హృషికేశ్ ఇప్పుడప్పుడే మళ్లీ లవ్‌లో పడే ఉద్దేశ్యం లేదని చెప్పుకొచ్చాడు. చదవండి: కోలివుడ్‌ను కుదిపేస్తున్న కరోనా: దర్శకుడి భార్య మృతి -
ప్రియాంకతో పెళ్లి వచ్చే జన్మలో అయినా..
బాలీవుడ్ స్టార్ హీరోయిన్గా కొనసాగుతూనే హాలీవుడ్‌లోనూ వరుస అవకాశాలు దక్కించుకుంటుంది నటి ప్రియాంక చోప్రా. తనకంటే పదేళ్లు చిన్నవాడైన ఆమెరికన్ పాప్ సింగర్ నిక్‌జోనస్‌తో ప్రేమలో పడిన ఈ భామ 2018లో అతడిని వివాహం చేసుకొని ప్రస్తుతం అమెరికాలో ఉంటోంది. తాజాగా ప్రియాంక పెళ్లికి సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే ప్రియాంక వివాహం మొదట దేవొంకే దేవ్ మహదేవ్ అనే హిందీ సీరియల్ నటుడు మోహిత్ రైనాతో చేయాలని ఆమె కుటుంబసభ్యులు భావించారట. ఈ సీరియల్లో శివుడి పాత్రలో కనిపించిన మోహిత్ ప్రియాంకకు సరిజోడి అని ఆమె తల్లి ఫిక్సయిందట. అంతేకాకుండా అతడి గురించి ఎంకర్వ్యైరీ కూడా చేసి ఎంతో మంచివాడని, మోహిత్తోనే ప్రియంకకు పెళ్లి జరిపించాలని అనుకున్నారట. దీనికి సంబంధించిన వార్త మీడియాలో అప్పట్లో హాట్ టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అయితే ఇదే విషయాన్ని మోహిత్‌తో ప్రస్తావించగా..ప్రియాంక అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆమెను సూపర్ స్టార్ అని కొనియాడారు. తాను కేవలం టెలివిజన్ నటుడిని అని, అయినా తన గురించి ప్రియాంక పేరేంట్స్ ఇలా ఆలోచించడం చాలా గొప్పవిషయమని అన్నారు. అయితే తనలాంటి చిన్న వ్యక్తితో ప్రియాంక పెళ్లి ఈ జన్మలో జరగకపోయినా, వచ్చే జన్మలో అయినా జరగాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఇదిలా వుంటే ఈ ఏడాది ప్రియాంక బోలెడు ప్రాజెక్టులకు సంతకం చేసింది. అందులో టెక్స్ట్ ఫర్ యూ చిత్రాన్ని ఇదివరకే కంప్లీట్ చేయగా మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. ‘సిటాడెల్’ అనే అమెజాన్ సిరీస్‌తో పాటు ‘మ్యాట్రిక్స్ 4’లోనూ నటిస్తోంది. ఇక ఈ మధ్యే న్యూయార్క్‌లో సోనా అనే రెస్టారెంట్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. చదవండి : ప్రియాంక వల్ల సినిమా ఛాన్స్‌లు రాలేదు : మీరా చోప్రా అవును ఒప్పుకుంటున్న, నా వయసైపోతుంది: ప్రియాంక -
కోయిలమ్మ నటుడు అమర్ అరెస్ట్
కోయిలమ్మ సీరియల్ హీరో అమర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల బోటిక్ నిర్వహణ విషయంలో స్నేహితురాళ్ల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో జరిగిన గొడవలో అమర్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషనులో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు అమర్‌ను బుధవారం అరెస్టు చేశారు. కూకట్పల్లి కోర్టు అతనికి రిమాండ్ విధించడంతో అమర్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. కాగా శ్రీ విద్య, స్వాతి, లక్ష్మి ఈ ముగ్గురూ కలిసి మణికొండలో బౌటిక్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల స్వాతి బౌటిక్ వ్యాపారం నుంచి తప్పుకుంది. అయితే తనకు రావాల్సిన కుట్టు మెషిన్, డబ్బుల విషయంలో పార్టనర్స్ ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. స్వాతికి రావాల్సిన బకాయిలు శ్రీవిద్య ఇవ్వకపోవడంతోఇటీవల స్వాతి తన భాయ్‌ఫ్రెండ్ కోయిలమ్మ సీరియల్ నటుడు అమర్‌తో కలిసి శ్రీ విద్య ఇంటికి వెళ్లి నిలదీశారు. మాటా మాటా పెరిగి గొడవకు దారి తీయడంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దాంతో సమీర్ తాగిన మత్తులో అసభ్య పదజాలంతో తనను దూషించాడని శ్రీవిద్య రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే అమర్, స్వాతిలు కూడా కౌంటర్ కేసు పెట్టారు. ఇరువురి ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. చదవండి: ఆ రోజు నేను తాగి వెళ్లలేదు: అమర్ -
తన నవ్వుకే పడి చచ్చిపోతాను: నటుడు
ముంబై: నేటికీ మన దేశంలో రుతుక్రమం గురించి మాట్లాడేందుకు సందేహించే అమ్మాయిలు ఎక్కువగానే ఉన్నారు. నెలసరి సమయంలో ఎంత కష్టాన్నైనా ఓర్చుకుంటారే తప్ప ఆ బాధను ఎవరితోనూ పంచుకోవడానికి ఇష్టపడరు. పీరియడ్స్‌లో అటు గృహిణులకు, ఇటు ఉద్యోగినులకు గానీ ప్రత్యేకంగా సెలవులేమీ దొరకవు. నొప్పి భరిస్తూనే ఇంట్లో పనులు చక్కదిద్దుకోవాలి, ఆఫీసులో వర్క్ చేస్తూనే ఉండాలి. చాలా మంది మగవాళ్లు సైతం.. నెలసరి సమయంలో ఇంట్లోని ఆడవాళ్లు కష్టపడుతూ పనిచేసుకుంటుంటే చూస్తారే తప్ప సాయం చేయడానికి ముందుకురారు. ఇది చాలా తప్పు అంటున్నాడు హిందీ బుల్లితెర నటుడు షోయబ్ ఇబ్రహీం. లాక్డౌన్ కాలంలో షూటింగ్ లేకపోవడంతో ఇంటికే పరిమితం కావడం వల్ల చాలా మంది సెలబ్రిటీలు సొంతంగా యూట్యూబ్ చానెళ్లు మొదలుపెట్టి, వ్లోగ్స్ చేయడం ఆరంభించారు. వారిలో ‘ససురాల్ సిమర్ కా’ సీరియల్ జంట దీపికా కక్కర్- షోయబ్ కూడా ఉన్నారు. కలిసి నటిస్తున్న సమయంలో స్నేహితులుగా మారిన వీరు 2018లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ క్రమంలో కపుల్ గోల్స్ సెట్ చేస్తూ గతంలో అనేకసార్లు అభిమానుల మనసు దోచుకున్నారు. ఇక తాజాగా తన వ్లోగ్‌లో పీరియడ్స్ గురించి ప్రస్తావించి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటున్నాడు షోయబ్.(చదవండి: పెళ్లికి ముందు ఆ ఒప్పందం పెట్టుకున్నాం: ప్రియాంక) నెలసరిలో ఉన్న భార్య దీపిక కోసం వంట చేసి, ఆమెకు వడ్డించిన అతడు.. తన అభిమానులు కూడా ఇలాగే రుతుక్రమ సమయంలో ఇంట్లో వాళ్లకు సాయం చేయాలని అభ్యర్థించాడు. అలాగే పీరియడ్స్ గురించి మాట్లాడితే తప్పేమీ కాదన్నాడు. శరీరంలో సహజసిద్ధంగా కలిగే మార్పుల గురించి, తద్వారా కలిగే ఇబ్బందుల గురించి చర్చిస్తేనే విశ్రాంతి తీసుకునే వెసలుబాటు ఉంటుందని లేడీ ఫ్యాన్స్‌కు సైతం సలహా ఇచ్చాడు. ఇక ఆస్క్ మీ ఎనీథింగ్ క్వశ్చన్ అవర్‌లో భాగంగా.. తన భార్య నవ్వు నకిలీది అంటూ కామెంట్ చేసిన నెటిజన్‌కు దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు షోయబ్. ‘‘నా దీపిక నవ్వుకు నువ్వు దిష్టిపెట్టకు. ఎందుకంటే తన స్మైల్‌కే నేను పడిచచ్చిపోతాను. మా గురించి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేసుకోకు. ఏది పడితే అది మాట్లాడకు సరేనా!’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు. -
ఆ రోజు నేను తాగి వెళ్లలేదు: అమర్
సాక్షి, హైదరాబాద్: ఉద్దేశపూర్వకంగానే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ‘కోయిలమ్మ’ సీరియల్ నటుడు అమర్ అలియాస్ సమీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి రెచ్చగొట్టిన వాళ్లపై తాను కూడా తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నాడు. కాగా బోటిక్ నిర్వహణ విషయంలో స్నేహితురాళ్ల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో జరిగిన గొడవలో, అమర్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషనులో కేసు నమోదైన విషయం తెలిసిందే. మణికొండలో బొటిక్ నడుపుతున్న శ్రీవిద్య, రష్మీదీప్ అనే యువతులు అభిప్రాయ భేదాలతో దూరమయ్యారు. ఈ క్రమంలో శ్రీవిద్య ఒక్కరే బొటిక్ నడుపుతున్నారు.(చదవండి: మదనపల్లి మధుకర్‌కు 12 ఏళ్ల జైలు) దీంతో తమకు సంబంధించిన రూ. 5 వేల విలువ గల కుట్టుమిషన్‌ను షాపులో వదిలివేశామని, దానిని తిరిగి ఇవ్వాలంటూ రష్మి స్నేహితులైన స్వాతి, తేజ, అమర్, హర్ష అడిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అమర్‌పై కేసు నమోదు అయ్యింది. ఈ విషయం గురించి బుధవారం మీడియాతో మాట్లాడిన అమర్.. ‘‘ఆ రోజు నేను తాగి వెళ్లలేదు. బ్లడ్ రిపోర్ట్స్ కూడా నెగెటివ్‌గానే వచ్చాయి. నిజానికి, కావాలనే నాపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ రోజు గొడవ పడిన వీడియో లో కేవలం 2 నిమిషాలు మాత్రమే బయటికి రిలీజ్ చేశారు. అందులో ఉన్న వాళ్లందరూ మా స్నేహితులే. ఎఫ్ఐఆర్ కాపీలో సైతం నేను లైంగిక వేధింపులకు పాల్పడలేదనే ఉంది. నా గురించి అసత్యాలు ప్రచారం చేసిన వారిపై నేను కూడా కేసు పెడతాను. నేను రూ. 5 లక్షలు తీసుకున్నట్టు ఆధారాలు చూపించాలి. కానీ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడిది. మీడియాలో కూడా నేను గొడవ పడుతున్నట్టు చూపించారు. అంతకు ముందు నుంచే గొడవ జరిగింది దాన్ని మాత్రం చూపించలేదు’’ అని చెప్పుకొచ్చాడు.(చదవండి: ‘కోయిలమ్మ’నటుడు అమర్‌పై కేసు) -
‘కోయిలమ్మ’నటుడు అమర్‌పై కేసు
గచ్చిబౌలి: బోటిక్ పెట్టిన స్నేహితురాళ్లు నష్టం రావడంతో ఘర్షణ పడి ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోగా కోయిలమ్మ సీరియల్ కథానాయకుడు అమర్‌పై కేసు నమోదైంది. రాయదుర్గం సీఐ ఎస్.రవీందర్ వివరాల ప్రకారం.. స్నేహితులైన శ్రీవిద్య, రష్మీదీప్ మణికొండలోని సిద్ధిసాయి కాలనీలో షాపు అద్దెకు తీసుకొని బోటిక్ పెట్టారు. నష్టం రావడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోగా శ్రీవిద్య బోటిక్‌ను నిర్వహిస్తోంది. రూ. 5 వేల విలువ చేసే కుట్టు మెషిన్ బోటిక్‌లో వదిలి వేశానని స్నేహితులైన స్వాతి, తేజ, బుల్లితెర నటుడు అమర్, హర్ష బుధవారం రాత్రి 8 గంటలకు మణికొండకు వెళ్లి కుట్టు మెషిన్ ఇవ్వాలని అడిగారు. ఇంటి వద్ద ఉందని చెప్పడంతో శ్రీవిద్య స్నేహితురాళ్లు అపర్ణ, లక్ష్మీలతో పాటు రష్మీకి మద్దతుగా వచ్చిన వారందరు స్ప్రింట్ రివర్ షేడ్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి ఇరు వర్గాల మధ్య ఘర్షన నెలకొంది. అసభ్యంగా దూషించి దాడికి పాల్పడ్డారని శ్రీవిద్య రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తమను కూడా దూషించి దాడి చేశారని స్వాతి ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
ప్రేయసితో నటుడి నిశ్చితార్థం, పెళ్లి ఎప్పుడంటే..
బుల్లితెర నటుడు, 'యే రిష్తా హై ప్యార్ కే' సీరియల్ హీరో షాహీర్ షైఖ్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ప్రేయసి రుచికా కపూర్‌తో నిశ్చితార్థం కూడా జరుపుకున్నాడు. ఈ శుభవార్తను సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలిపాడు. నెచ్చెలి చేయందుకున్న ఫొటోను సైతం షేర్ చేశాడు. నీతో జీవితం పంచుకునే తదుపరి మజిలీ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని రాసుకొచ్చాడు. అటు రుచికా పరిస్థితి కూడా ఇంచుమించు అలాగే కనిపిస్తోంది. (చదవండి: ఢిల్లీ క్రైమ్ చిత్రానికి అంతర్జాతీయ ఎమ్మీ అవార్డు) షాహీరో షేర్ చేసిన ఫొటోలో రుచికా ఎడమ చేతి వేలికి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగి ఉండగా, కోరుకున్నవాడితో జీవితం పంచుకోబోతున్నందుకు సంతోషంలో తేలియాడుతున్నట్లుగా కనిపిస్తోంది. కాగా ఏడాదిన్నరకు పైగా డేటింగ్లో ఉన్న ఈ జంట ఇప్పుడు ఏడడుగులు నడవనుండటంతో వారి అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నెలలోనే సాదాసీదాగా పెళ్లి తంతు కానిచ్చేయనున్న ఈ జంట వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మాత్రం సాంప్రదాయబద్ధంగా అందరి సమక్షంలో ఘనంగా వివాహం జరుపుకోనున్నారు. (చదవండి: నా ప్రేమ వందనాలు స్వీకరించు ప్రియా) View this post on Instagram A post shared by Shaheer Sheikh (@shaheernsheikh) -
‘నేను నోరు విప్పితే.. ఆమెకే నష్టం’
హిందీ బిగ్‌బాస్ 13 కంటెస్టెంట్ పరాస్ చబ్రా తన మాజీ ప్రియురాలు, బిగ్‌బాస్ 14 కంటెస్టెంట్ పవిత్ర పునియా గురించి సంచలన విషయాలు వెల్లడించాడు. ‘ఆమె తన పెళ్లి విషయం దాచి పెట్టి నాతో డేటింగ్ చేసింది’ అంటూ ఆరోపించాడు పరాస్. గతంలో పవిత్ర ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. పరాస్ తన జీవితంలో చేసిన అతి పెద్ద మిస్టేక్ అని తెలిపింది. దీనిపై అతడు స్పందిస్తూ.. ‘అవును ఆమె మాటలు నిజమే. ఎందుకంటే ఓ వివాహిత తనకు పెళ్లి అయ్యిందనే విషయాన్ని దాచి పెట్టి.. నన్ను ఫూల్‌ని చేయాలని చూసింది. అదృష్టం కొద్ది నేను ఈ బంధానికి ముగింపు పలికాను’ అన్నాడు. (బిగ్ బాస్: సెలబ్రెటీలకు ఒరిగిందేంటి?) ‘ఒక రోజు పవిత్ర భర్త నుంచి నాకు ఒక మెసేజ్ వచ్చింది. ‘మీరిద్దరు ఒకర్ని ఒకరు చాలా ఇష్టపడుతున్నారు. కలిసి జీవిద్దాం అనుకుంటున్నారు. ఇవన్ని జరగాలంటే నేను ఆమెకు విడాకులు ఇవ్వాలి’ అని మెసేజ్ చేశాడు. అది చూసి నేను షాక్‌కు గురయ్యాను. ఆ తర్వాత ఆరా తీయడంతో ఆమె పాత రిలేషన్స్ అన్ని తెలిసాయి. దాంతో ఆమె నుంచి విడిపోయాను. నేను గనక ఇప్పుడు వాటి గురించి నోరు విప్పితే.. ఆమె చాలా బ్యాడ్ అవుతుంది. ఆమెకే మంచిది కాదు’ అంటూ చెప్పుకొచ్చాడు. పరాస్, పవిత్ర మొదట ఓ రియాలిటీ షో ద్వారా కలుసుకున్నారు. ఆ తర్వాత టీవీ పరిశ్రమలోకి ప్రవేశించారు. ప్రస్తుతం పవిత్ర పునియా పలు సీరియళ్లలో నటిస్తున్నారు. -
బుల్లితెర నటుడికి చేదు అనుభవం..
బుల్లితెర నటుడికి చేదు అనుభవం ఎదురయ్యింది. కొందరు గుండాలు రోడ్డు మీద తనను బెదిరించి దొంగతనానికి పాల్పడ్డారని తెలిపాడు. హప్పు కి ఉల్తాన్ పల్తాన్ ఫేమ్ సంజయ్ చౌదరికి ఈ అనుభవం ఎదురయ్యింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేశాడు. ‘గైస్ దయచేసి తెలుసుకొండి. నా విషయంలో ఇదే జరిగింది. నేరస్థులు మీరు ఎవరనే విషయం గురించి పట్టించుకోరు’ అనే క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. సంజయ్ చౌదరి మాట్లాడుతూ.. ‘నేను మధ్యాహ్నం సమయంలో మీరా రోడ్డు నుంచి షూటింగ్ జరిగే నైగావ్ ప్రాంతానికి వెళ్తున్నాను. ఇంతలో ఓ వ్యక్తి స్కూటీపై వచ్చి నా కారు విండోని తట్టి పార్క్ చేయమని చెప్పాడు. అంతేకాక మరాఠీలో తిట్టడం ప్రారంభించాడు. నేను చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తున్నాను. ఏ వాహనాన్ని ఢీ కొట్టలేదు. అతను గ్లాస్‌ను కిందకి దించమన్నాడు. నేను అలానే చేశాను. వెంటనే అతడు నా కారు డోర్ తెరిచి లోపలకి వచ్చి కూర్చున్నాడు. ఆ తర్వాత నేను తన స్కూటీని ఢీ కొట్టానని.. అందువల్ల అతడికి 20 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు’ అన్నాడు. (చదవండి: కరణ్ పార్టీకి డ్రగ్స్ కేసుకు సంబంధం లేదు) View this post on Instagram This is actually happened with me criminals doesn’t care who you are A post shared by Sanjay choudhary (@sanjayychoudhary) on Sep 24, 2020 at 4:33am PDT ‘ఇంతలో మరో ఇద్దరు వ్యక్తులు అక్కడు వచ్చారు. వారు ముగ్గురు నన్ను బెదిరించడం ప్రారంభించారు. నా దగ్గర అంత మొత్తం లేదని చెప్పాను. ఏటీఎంకి వెళ్లి డ్రా చేసి తీసుకురమ్మన్నారు. లేదంటే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తామని బెదిరించారు. నా ఫోన్ లాక్కున్నారు. డబ్బులిస్తేనే మొబైల్ ఇస్తామన్నారు. నా దగ్గర అంత డబ్బు లేదని వాలెట్ తెరిచి చూపించాను. దానిలో ఒక ఐదు వందల రూపాయల నోటు, 200 వందల రూపాయలు మొత్తం ఏడు వందల రూపాయలు మాత్రమే ఉన్నాయి. వారు ఆ మొత్తం తీసుకుని వెళ్లి పోయారు. నేను ఇంకా షాక్‌లోనే ఉన్నాను. వారు గుండాలు అని తర్వాత అర్థం అయ్యింది. ఈ సందర్భంగా అభిమానులందరికి నేను చెప్పేది ఒక్కటే.. అపరిచితులతో జాగ్రత్తగా ఉండండి’ అన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. -
ట్రయాంగిల్ సీ‘రియల్’ స్టోరీ!
సాక్షి, హైదరాబాద్: టీవీ సీరియల్ నటి కొండపల్లి శ్రావణి ఆత్మహత్య కేసును ఎస్సార్‌నగర్ పోలీసులు కొలిక్కి తీసుకు వచ్చారు. ఆమెతో సన్నిహితంగా ఉన్న దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డిలతో పాటు సినీ నిర్మాత అశోక్‌రెడ్డి వేధింపుల కారణంగానే శ్రావణి ఆత్మహత్య చేసుకున్నట్లు తేల్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న దేవరాజ్‌రెడ్డి, రెండో నిందితుడు సాయికృష్ణారెడ్డిలను అరెస్టు చేసినట్లు పశ్చిమ మండల సంయుక్త పోలీసు కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ సోమవారం వెల్లడించారు. పరారీలో ఉన్న అశోక్‌రెడ్డి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ కేసు పూర్తి వివరాలు వెల్లడించారు. వివరాలిలా ఉన్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సమీపంలో గొల్లప్రోలు గ్రామానికి చెందిన శ్రావణి నటనపై ఉన్న ఆసక్తితో ఎనిమిదేళ్ల క్రితం హైదరాబాద్ వలసవచ్చింది. ఆమెకు ఐదేళ్ల క్రితం సాయికృష్ణారెడ్డితో పరిచయం ఏర్పడింది. సాయి ఏపీలోని అనంతపురం నుంచి వచ్చి, నగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. శ్రావణితో సన్నిహితంగా ఉండటంతో పాటు వారి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకున్న సాయి కొన్నాళ్లకు ఆమె కుటుంబానికీ దగ్గరయ్యాడు. అయితే కొన్ని స్పర్థలు తలెత్తిన నేపథ్యంలో శ్రావణి–సాయిలు 2018లో దూరమయ్యారు. అయినప్పటికీ ఆమె కుటుంబంతో సాయి సంబంధాలు కొనసాగించాడు. అదే ఏడాది అశోక్‌రెడ్డి నిర్మించిన ‘ప్రేమతో కార్తీక్’ చిత్రంలో శ్రావణి నటించింది. అప్పటి నుంచి అశోక్‌రెడ్డితో ఆమె పరిచయం కొనసాగింది. టిక్‌టాక్‌తో పరిచయం.. ఇదిలా ఉండగా.. టిక్‌టాక్ ద్వారా గత ఏడాది ఆగస్టు 8న శ్రావణికి కాకినాడకు చెందిన దేవరాజ్‌రెడ్డితో పరిచయమైంది. ఓ సీరియల్లో నటించేందుకు ఆడిషన్స్ కోసం దేవరాజ్ గత ఏడాది నవంబర్‌లో హైదరాబాద్ వచ్చాడు. అప్పట్లో శ్రావణి ఇంట్లోనే తొమ్మిది రోజుల పాటు ఉన్నాడు. ఈ తొమ్మిది రోజుల్లోనే వారి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. శ్రావణి ఇంట్లో ఉన్న సందర్భంలోనే దేవరాజ్‌రెడ్డి.. ఆమె ఫోన్లోని వివరాలను పరిశీలించాడు. ఆమెకు అశోక్‌రెడ్డితో పాటు సాయికృష్ణతోనూ సంబంధం ఉన్నట్లు గుర్తించాడు. దీంతో ఆమెకు దూరంగా ఉండటం మొదలుపెట్టిన దేవరాజ్‌రెడ్డి తన స్వస్థలానికి వెళ్లిపోయాడు. ఆపై కొన్ని సీరియళ్లలో నటించే అవకాశం రావడంతో మళ్లీ హైదరాబాద్ వచ్చిన అతను సీతాఫల్మండి ప్రాంతంలో కుటుంబంతో సహా స్థిరపడ్డాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఓ నటుడి పుట్టినరోజు వేడుకను శ్రావణి ఇంట్లో నిర్వహించారు. దేవరాజ్‌ను కూడా ఆమె ఈ వేడుకకు ఆహ్వానించింది. ఆ సందర్భంలో ఆమె అందరి ముందూ ‘ఐ లవ్ దేవరాజ్‌రెడ్డి’అంటూ ప్రకటించింది. అయితే శ్రావణికి అశోక్‌రెడ్డితో పాటు సాయితోనూ సంబంధాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే తనకు ఆమెపై ఆసక్తి లేదని అతను చెప్పాడు. దేవరాజ్‌కు సర్దిచెప్పడానికి శ్రావణి ప్రయత్నించినా.. అతడు తిరస్కరించాడు. దేవరాజ్‌తో ఘర్షణ.. కేసులు.. కాగా, ఈ ఏడాది మార్చి 20వ తేదీ రాత్రి దేవరాజ్‌కు ఫోన్ చేసిన శ్రావణి, అతడిని చంపేస్తానంటూ బెదిరించింది. సాయి, అశోక్‌రెడ్డిల పేర్లు చెప్పి, వారితో సంబంధం ఉందంటూ తన జీవితం నాశనం చేస్తున్నావని హెచ్చరించింది. ఈ ఏడాది జూన్ 21 రాత్రి 8.30 గంటలకు దేవరాజ్‌రెడ్డితో శ్రావణి ఘర్షణ పడింది. ఈ సందర్భంగా శ్రావణి తన సోదరుడు శివ, మరో యువతితో కలిసి అతనిపై దాడికి పాల్పడింది. నీ కారణంగా అశోక్‌రెడ్డితో స్పర్థ లు వచ్చాయంటూ.. వాగ్వాదానికి దిగి కొట్టా రు. దీనిపై దేవరాజ్ ఫిర్యాదు మేరకు పంజగుట్ట పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. ఆ వెంటనే శ్రావణి తనను వేధిస్తున్నాడంటూ దేవరాజ్‌పై ఎస్సార్‌నగర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదైంది. అయితే చాటింగ్ ద్వారా దేవరాజ్‌కు నచ్చచెప్పడానికి శ్రావణి ప్రయత్నించింది. ఈ విషయం తెలిసిన అశోక్‌రెడ్డి, సాయికృష్ణతో పాటు శ్రావణి కుటుంబీకులు ఆమెను శారీరకంగా, మానసికంగా వేధించారు. కాగా, ఈ నెల 7న శ్రావణిని ఓ షూటింగ్ లొకేషన్లో కలుసుకున్న దేవరాజ్‌రెడ్డి అక్కడ నుంచి ఆమెను పంజగుట్టలోని శ్రీకన్య రెస్టారెంట్‌కు తీసుకువెళ్లాడు. అదే సమయంలో అక్కడకు చేరుకున్న సాయికృష్ణ ఆవేశంతో దేవరాజ్‌పై దాడి చేయడానికి ప్రయత్నించాడు. దీన్ని శ్రావణి అడ్డుకోవడంతో ఆమె చెంపపై కొట్టిన సాయి ఆటోలో ఇంటికి తీసుకువెళ్లాడు. ఆ రోజు దేవరాజ్‌కు ఫోన్ చేసిన శ్రావణి తనను అశోక్‌రెడ్డి, సాయిలతో పాటు తన కుటుంబీకులూ వేధిస్తున్నారని చెప్పింది. ఆ తర్వాత ఫోన్ చేసిన శ్రావణి నీతో పాటు అశోక్‌రెడ్డి, సాయి వేధింపుల కారణంగా తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి చనిపోయింది. ఈ ఫోన్ రికార్డులన్నిటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దేవరాజ్, సాయిలను అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న నిర్మాత అశోక్‌రెడ్డి కోసం గాలిస్తున్నారు. -
శివ పార్వతి సారీ చెప్పారు
-
శివ పార్వతి వీడియోపై ప్రభాకర్ స్పందన
సాక్షి, హైదరాబాద్: తనకు కరోనా వచ్చినా పట్టించుకునేవారే కరువయ్యారని 'వదినమ్మ' సీరియల్ నటి శివపార్వతి భావోద్వేగానికి లోనైన విషయం తెలిసిందే. తన గురించి ఆ సీరియల్ నటుడు, నిర్మాత ప్రభాకర్ పట్టించుకోలేదని ఆమె వీడియోలో వాపోయారు. అయితే, ఇదంతా ఓ చిన్న పొరపాటు వల్లే జరిగిందని పేర్కొంటూ ప్రభాకర్ బుధవారం రాత్రి ఫేస్బుక్లో వీడియో పోస్ట్ చేశారు. "శివపార్వతి అమ్మ ఒక వీడియో రిలీజ్ చేశారు. దాని మీద స్పందించమని నన్ను అభిమానించే వాళ్లు, అలాగే అది నిజమని నమ్మిన వాళ్లు, మీడియా ఛానల్స్ వాళ్లు, అసలేం జరిగిందని తెలసుకోవాలనుకునేవాళ్లు.. అందరూ అడిగారు. ఇంతమంది అడుగుతున్నా కూడా దాని గురించి ఎందుకు మాట్లాడలేదంటే.. ఇన్ని రోజుల తర్వాత అమ్మని నిన్న వీడియోలో చూడటమే. ఆ వీడియోలో ఆమె మాటలు వినడమే. ఎందుకంటే నాకు అటునుంచి ఫోన్లు రాలేదు. నేను ఫోన్ చేసినప్పుడు అమ్మ మాట్లాడలేదు, వాళ్ల అబ్బాయి మాట్లాడాడు. (చిరు ఫ్యాన్స్‌కు పండుగే.. డబుల్ ధమాకా!) ఇవన్నీ అమ్మకు పెద్దగా తెలియకపోవడం వల్ల చిన్న మిస్ అండర్స్టాండింగ్ జరిగి బాధపడి, వీడియో రిలీజ్ చేశారు. అయినా నేను అమ్మ కోలుకోవాలి, అమ్మ కోలుకున్న తర్వాత ఈ విషయం మాట్లాడతాను అని రియాక్ట్ అవలేదు. కానీ ఇందాక శివ పార్వతమ్మ నాకు ఫోన్ చేసి బాబు.. సారీ, చిన్న పొరపాటు జరిగింది. అపార్థం చేసుకోవడం వల్లే ఇలా జరిగింది. నేను అది యూట్యూబ్‌లో కూడా పెట్టలేదు. నాకు సోషల్ మీడియా గురించి కూడా తెలీదు. వదినమ్మ గ్రూప్‌లో మాత్రం పెట్టాను. అది బయటకు ఎలా వెళ్లిందో నాకు తెలియదు. నాకు విషయం తెలిసిన తర్వాత చాలా బాధపడ్డాను. అసలేం జరిగిందనేది మళ్లీ ఇంకో వీడియో పెడతానన్నారు. ఈ వీడియోలు పెట్టడాలు వదిలేయండి. ముందు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండమ్మా అని చెప్పాను. (నేను చచ్చిపోయినా వాళ్లింతే: సీరియల్ నటి) అమ్మకు ఏ అవసరం వచ్చినా చూసుకోడానికి మేమున్నాం, ఎప్పటికీ ఉంటాం కూడా! అమ్మే కాదు, ఇండస్ట్రీలో ఎవరికి ఏం ఆపద వచ్చినా అందరం సాయం చేస్తాం. ఈ సందర్భంగా శివ పార్వతి అమ్మకు కరోనా వచ్చినప్పటి నుంచి ఇంటికి వచ్చేంతవరకు సహాయపడ్డ మా ఇండస్ట్రీ గొప్ప వ్యక్తులకు, ముఖ్యంగా శివబాలాజీ, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్, జీవితా రాజశేఖర్, ఇంకా ఎవరెవరు ముందుకొచ్చి అమ్మకు సహాయపడ్డారో వాళ్లందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. ఈ విషయం గురించి తప్పకుండా నేను వివరణ ఇస్తాను. అమ్మ కూడా వివరణ ఇస్తుంది. ప్రస్తుతానికి అమ్మ కోలుకోవాలని మనస్ఫూర్తిగా మనమందరం ప్రార్థిద్దాం" అని ప్రభాకర్ తెలిపారు. -
‘స్వాతి చినుకులు’ ఫేం భరద్వాజ్‌కు కరోనా
-
కరోనా: మరో బుల్లితెర నటుడికి పాజిటివ్
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. సాధారణ ప్రజలతో పాటు అధికారులు, పోలీసులు, సెలబ్రిటీలు సైతం కరోనా భారిన పడటం ఆందోళనకరంగా మారింది. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో కరోనా కేసులు పెగుతున్నాయి. ఇప్పటికే పలువురు టెలివిజన్ నటీనటులకు కరోనా పాజిటివ్ రాగా తాజాగా మరో నటుడికి పాజిటివ్ వచ్చింది. బుల్లితెర నటుడు భరద్వాజ్ రంగావిజ్జుల ఆదివారం కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో వెల్లడించారు. స్వాతిచినుకులు, బంధం అనే టీవీ సీరియళ్ల ద్వారా భరద్వాజ్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. (‘బిగ్‌బాస్-3’ ఫేం రవికృష్ణకు కరోనా..) తన ఆరోగ్యానికి సంబంధించి భరద్వాజ్ ఇన్‌స్టాగ్రామ్‌లో రెండు నిమిషాల వీడియో పోస్టు చేశారు. తనకు లక్షణాలేవి లేవని, ఎవరూ భయపడవద్దని సూచించాడు. సరైన ఆహార నియమాలు, మందులతో వ్యాధి నుంచి బయట పడవచ్చని పేర్కొన్నారు. అయితే తనతో కలిసి నటించిన వాళ్ళు ఐసోలేషన్‌లో ఉండాలని, టెస్టులు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇక భరద్వాజ్ కరోనా సోకిన విషయంతో తెలియడంతో అతని అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. కాగా ఇప్పటి వరకు నవ్య స్వామి, రవికృష్ణ, ఝాన్సీ, సాక్షి శివ, ప్రభాకర్ వంటి పలువురు బుల్లితెర నటులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. (మళ్లీ షూటింగ్‌లకు బ్రేక్) తెలుగు టీవీ నటికి కరోనా పాజిటివ్ -
‘బిగ్‌బాస్-3’ ఫేం రవికృష్ణకు కరోనా..
సాక్షి, హైదరాబాద్ : తెలుగు బుల్లితెర నటులపై కరోనా ఉగ్రరూపం చూపిస్తోంది. గత కొన్ని రోజులుగా టీవీ సీరియల్ నటులను కరోనా వెంటాడుతోంది. తాజాగా బిగ్‌బాస్-3తో పాపులర్ అయిన రవికృష్ణకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని రవినే సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా తనకు పాజిటివ్ అని తేలిందని, మూడు రోజులు నుంచి ఇంట్లోనే ఉంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, కరోనా లక్షణాలు ఏమి లేవని పేర్కొన్నారు. కొన్ని రోజుల నుంచి తనను కాంటాక్ట్ అయిన వారు ఇంట్లోనే ఉండి వీలైతే కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నాడు. (మరో బుల్లితెర నటుడికి సోకిన కరోనా) View this post on Instagram A post shared by Rᴀᴠɪ ᴋʀɪsʜɴᴀ (@ravikrishna_official) on Jul 3, 2020 at 10:57am PDT తెలుగు సీరియల్ ‘మొగలి రేకులు’ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రవి కృష్ణ ఆ తరువాత వరూధిని పరిణయం, శ్రీనివాస కళ్యాణం, మహాలక్ష్మీ, బావా మరదల్లు వంటి సీరియల్స్‌లో నటించి మంచి పేరును సంపాదించారు. ప్రస్తుతం రవి కొన్ని సీరియళ్లతోపాటు సినిమాల్లో నటిస్తున్నారు. కాగా ఇటీవలే సీరియల్ నటి నవ్య స్వామి కూడా కరోనా బారిన పడగా, ప్రస్తుతం ఆమె కూడా హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. అయితే రవికృష్ణ, నవ్య కలిసి ఆమె కథ సీరియల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. సీరియల్లోని ఇద్దరు నటులు కరోనా బారిన పడటంతో యూనిట్ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. (తెలుగు టీవీ నటికి కరోనా పాజిటివ్) -
నా భార్య కళ... ఇదేనా కల
‘జీవితం మనం ప్లాన్ చేసుకున్న ప్రకారం ఉండదని బాగా నమ్ముతాను. ఎందుకంటే నేను అనుకున్నవాటికన్నా నన్ను వేరేగా చూపింది ఈ లైఫ్ జర్నీ’అంటూ తన గురించి పరిచయం చేసుకున్నారు ప్రతాప్ అభి. ‘శశిరేఖ పరిణయం’,‘కుటుంబ గౌరవం’, ‘కుంకుమపువ్వు’, ‘తేనెమనుసులు’, ‘నిన్నే పెళ్లాడతా..’ఇలా వరుస సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు చిరపరిచితుడు ప్రతాప్ అభి.తన గురించి ఇలా వివరించారు. ‘సీరియల్స్ చేస్తూనే నాలుగేళ్ల క్రితం ‘ముద్దపప్పు – ఆవకాయ’ టైటిల్‌తో వెబ్‌సీరీస్ చేశాను. మంచి రెస్పాన్స్ వచ్చింది. చిన్నప్పటి నుంచి యాక్టర్ కావాలని ఆలోచన ఏమీ లేదు. మాది ఖమ్మం జిల్లా పాల్వంచ. మా నాన్నగారు పవర్ స్టేషన్లో ప్రభుత్వోద్యోగి. అమ్మ గృహిణి. ముగ్గురు అన్నదమ్ములం. ఇంట్లో నేనే పెద్దవాడిని. నా ఇష్టాలకు ఇంట్లో ఎప్పుడూ అడ్డు చెప్పలేదు. కానీ, నా భవిష్యత్తుకు ఒక మార్గం వేసుకోవడంలో మాత్రం చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. ఇందులో పాఠాలు ఎన్నో నేర్చుకున్నాను. నిన్నే పెళ్లాడతా... ‘జీ’ తెలుగులో వస్తున్న ఈ సీరియల్ నాకు జీవితాన్నే ఇచ్చిందని చెప్పవచ్చు. ఈ సీరియల్లో హీరోయిన్గా నటించిన అనూష హె గ్డే నిజ జీవితంలో నా అర్ధాంగి అయ్యింది. ఇప్పుడు అనూష ‘సూర్యకాంతం’ సీరియల్లో లీడ్ రోల్ పోషిస్తోంది. ‘నిన్నే పెళ్లాడతా’ సీరియల్లో ఏర్పడిన మా పరిచయం స్నేహంగా.. ఆ తర్వాత ప్రేమగా మారింది. తనది మంగుళూరులోని పుత్తూరు. మా ఇరు కుటుంబాల వాళ్లు మా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇద్దరం కిందటి నెలలో పెళ్లి చేసుకున్నాం. త్రీ క్యారెక్టర్స్... బుల్లితెర మీద నా లైఫ్ ఇచ్చిందే ‘శిశిరేఖపరిణయం’ సీరియల్, ఆ తర్వాత తేనెమనసులు. ఇప్పుడు నిన్నే పెళ్లాడతా! ఈ మూడు సీరియల్స్‌లోని మూడు క్యారెక్టర్స్ నాకు మంచి గుర్తింపునిచ్చాయి. అయితే, సీరియల్స్‌లో ముందు కథ విన్నప్పుడు క్యారెక్టర్ వేరుగా ఉంటుంది. ఆ తర్వాత రేటింగ్ బట్టి కథ, క్యారెక్టరైజేషన్ అన్నీ మారుతాయి. దానిని మనం డిసైడ్ చేయలేం. అందుకే లైఫ్ అంటే ఇలాగే ఉండబోతుందని ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోను. విధిని నమ్ముతాను... చదువుకునే రోజుల్లో దేవుడు–దెయ్యం అంటూ నమ్మకాలు ఏవీ లేవు. ప్రసాదాల కోసం గుడికి వెళ్లాలని అనుకునేవాడిని. కుటుంబం అంతా కలుసుకోవడానికి ఒక మంచి సందర్భం అనుకునేవాడిని. ఇంటర్మీడియట్ నుంచి నాకు తెలియకుండానే నా జీవితంలో కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. ఆ సమయంలో భయంతో స్టార్ట్ అయిన భక్తి ఇప్పుడు ప్రేమగా మారింది. ఇలా జరిగి తీరాల్సిందే అని గట్టిగా నేను అనుకున్నప్పుడల్లా అలా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. దీంతో నమ్మకం మీద ఎక్కువ నమ్మకం ఏర్పడింది. పంచభూతాలు ఉన్నట్టే దైవం కూడా ఉందని, భయానికి ధైర్యంలా, ప్రశ్నకు సమాధానంలా ఈ సృష్టికి భగవంతుడు ఉన్నాడని నమ్ముతాను. ఆర్మీకి వెళ్లాలనుకున్నా ఇంటర్మీడియట్ టైమ్‌లో ఆర్మీకి వెళ్లాలని చాలా ఆరాటపడ్డాను. సైనికుడిని కావాలన్నది నా లక్ష్యంగా ఉండేది. కానీ, అనుకోని కారణాల వల్ల ఆర్మీకి వెళ్లే అవకాశం కోల్పోయాను. ఆ విషయం అర్ధమయ్యాక డిప్లమా ఇన్ యానిమేషన్, మల్టీమీడియా కోర్సు చేశాను. ఇది పూర్తయ్యాక కోరుకున్న కంపెనీలో అవకాశాలు రాలేదు. దీంతో 2009 నుంచి సినీ పరిశ్రమలో అవకాశాల కోసం ప్రయత్నించాను. 2013లో ఒక సినిమాలో అవకాశం వచ్చింది. కానీ, అది మొదట్లోనే ఆగిపోయింది. అయితే నిరాశ చెందలేదు. పడిపోయిన దగ్గరే ప్రయత్నాలు చేయాలనుకున్నాను. అప్పుడు ‘శిశరేఖ పరిణయం’ సీరియల్ ఆడిషన్స్‌కి పిలుపు వచ్చింది. సెలక్ట్ అయ్యాను. అప్పటినుంచి ఈ ఫీల్డ్‌లో కొనసాగుతున్నాను. నా భార్య కళ .. నా కల జీవితంలో బాగా సెట్ అవ్వాలి. పచ్చదనానికి దగ్గరగా ఉండాలి. వ్యవసాయం చేయాలి. పక్షులతో కబుర్లు చెప్పాలి. మూగజీవాల ఆలనాపాలన చూసుకోవాలి. అందుకు ఒక ఫామ్ హౌజŒ ఏర్పాటు చేసుకోవాలనేది ఆలోచన. అంతకుమించి ఒక నృత్య అకాడమీ ఏర్పాటు చేయాలన్నది కల. నా భార్య అనూష క్లాసికల్ డ్యాన్సర్. తనకు నృత్యం అంటే ప్రాణం. తన కోసమే ఇప్పుడు కల కంటున్నా. దానిని నెరవేర్చే ప్రయత్నంలో ఉన్నా. విధి ఎటువైపుగా తీసుకెళుతుందో చూడాలి.’ – సంభాషణ: నిర్మలారెడ్డి -
ఎక్కడకు వెళ్లినా సాకేత్ అనే పిలుస్తారు
‘మంగమ్మగారి మనవరాలు’ సీరియల్లో సాకేత్‌గా బుల్లితెరకు పరిచయం అయిన గుడిబోయిన మధుబాబు అతి త్వరలోనే అభిమానులను సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ‘అభిషేకం’, ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’, ‘రెండు రెళ్లు ఆరు’... ఇలా వరుస సీరియల్స్‌తో ఏడేళ్లుగా బుల్లితెర నటుడిగా బిజీ బిజీగా ఉన్న మధుబాబు తన గురించి పంచుకున్న ముచ్చట్లివి. ‘‘మంగమ్మగారి మనవరాలు’ సీరియల్ వెయ్యికి పైగా ఎపిసోడ్స్‌లో నటించాను. ఆ తర్వాత అభిషేకం సీరియల్ మూడువేలకు పైగా దాటింది. దీంతోపాటు జీ టీవీలో వచ్చే అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు, జెమినీలో వచ్చే రెండు రెళ్లు ఆరు సీరియల్స్‌లో నటిస్తున్నాను. అన్ని సీరియల్స్ టాప్ రేటింగ్‌లో నన్ను నిలబెట్టాయి. ఇంతగా బుల్లితెర అభిమానులను సంపాదించుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఎక్కడకు వెళ్లినా నా అసలు పేరుకన్నా సాకేత్ అని పిలిచేవారు. ఆ పేరుతోనే ఇప్పటికీ పిలిచేవారున్నారు. బీటెక్ చేస్తూ.. పుట్టి పెరిగింది వరంగల్‌లోని హన్మకొండలో. చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే పిచ్చి. స్కూల్, కాలేజీల్లో ఏ చిన్న సందర్భం వచ్చినా డ్యాన్స్‌లో ముందుండేవాడిని. హైదరాబాద్‌లో బీటెక్ చేశాను. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకున్నాను. కానీ, ఈ ఇండస్ట్రీకి రావాలని ఆలోచనా ఎక్కువ ఉండేది. దానికితోడు స్నేహితుల ప్రోత్సాహం నన్ను ‘యంగ్ ఇండియా’ సినిమా ఆడిషన్స్‌కు వెళ్లేలా చేసింది. సెలక్ట్ అయ్యాను. ఆ తర్వాత ‘పవనిజం’ సినిమా చేశాను. ఇప్పుడు ‘సత్యాగ్రాహి’ సినిమాలోనూ నేనే హీరోని. డ్యాన్స్ బాగా వచ్చినా నటన కోసం రెండు నెలల పాటు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో యాక్టింగ్ నేర్చుకున్నా. ‘అత్తారింట్లో అక్కాచెల్లెళ్లు’ సీరియల్లో... ఉద్యోగం చేయకపోయినా ఏమీ అనలేదు హైదరాబాద్‌కి వచ్చి పన్నెండేళ్లు అయ్యింది. నేను బీటెక్ చదువుకుని ఉద్యోగం చేయకుండా ఈ ఫీల్డ్కి వచ్చినందుకు మా ఇంట్లో వాళ్లు ఎలాంటి అభ్యంతరం పెట్టలేదు. పిల్లల ఇష్టాలకే వదిలేశారు. మా తమ్ముడికి ఆర్ట్ అంటే చాలా ఇష్టం. యానిమేషన్ నేర్చుకొని ఇప్పుడు జాబ్ చేసుకుంటున్నాడు. మాకు ఒక చెల్లి. తను ఇప్పుడు కెనడాలో ఉంటోంది. మా బావ, తను ఇద్దరూ ఫిజియో థెరపిస్ట్‌లు. వాళ్లన్నా, వాళ్ల బాబు లక్కీ అన్నా నాకు చాలా ఇష్టం. మద్యం తెచ్చిన ముప్పు మా నాన్నగారు రైల్వేలో పనిచేసేవారు. అమ్మ గృహిణి. జాలి గుండె. మా నాన్న మందుకు బానిసవడంతో కుటుంబం మొత్తం చాలా సఫర్ అయ్యాం. ఆ సమయంలో కొండంత అండగా నిలిచి మా బాగోగులు చూసుకున్న దేవతలాంటి మా అమ్మమ్మ మూడేళ్ల క్రితం దేవుడి దగ్గరకు వెళ్లిపోవడంతో ఆమెను బాగా చూసుకోవా లనుకున్న నాకు చాలా బాధగా ఉంది. మా నాన్న తాగుడు వ్యసనం మూలంగా మా బంధువులు మమ్మల్ని చులకనగా చూసేవారు. అలాంటి తండ్రి మీద ఆశ వదిలేసుకోమనేవారు. కానీ, వదిలిపెట్టకుండా కౌన్సెలింగ్ ఇప్పిస్తూ, విరుగుడు మందులు వాడుతూ ఆ మద్యం చెర నుంచి విడిపించి హైదరాబాద్ తీసుకువచ్చాను. మంచి ప్లాట్ కొనుక్కొని అందరం సంతోషంగా ఉన్నాం. ఇప్పుడు అమ్మానాన్నలు నా సీరియల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. మా నాన్నలో వచ్చిన ఈ మార్పు చూసి మా బంధువులంతా ఆశ్చర్యపోతుంటారు. గతంలో వెలివేసినట్టుగా చూసిన వారే ఇప్పుడు మమ్మల్ని గౌరవంగా చూస్తున్నారు. వాళ్లు అప్పుడు మమ్మల్ని అలా నిరుత్సాహపరచడం వల్లే మేము పట్టుదలతో ఎదిగాం అనిపిస్తుంది. చాలా నిరుత్సాపడ్డాను టీవీ సీరియల్స్ ద్వారా ఇంత పేరు వస్తుందని మొదట్లో అనుకోలేదు. సినిమాలో నిలదొక్కుకోవడానికి చాలానే ప్రయత్నాలు చేశాను. కానీ, కొన్ని సినిమాలు సగం షూటింగ్‌తోనే ఆగిపోయి చాలా నిరుత్సాహపడ్డాను. ముందుగానే అనుకున్న సీరియల్ ఆఫర్ ఆగిపోయింది. అవకాశాలు లేనప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో చూశాను. ఓర్పు వహించాను. ఆ తర్వాత ఒకటొకటిగా అవకాశాలు వచ్చాయి. సినిమాల మీద ఉన్న ఇష్టంతో ఆ ప్రయత్నాలూ మానుకోలేదు. పవనిజం తర్వాత ఇప్పుడు సత్యాగ్రాహి సినిమా చేస్తున్నాను. సంతోషమే బలం ఇప్పుడు ఇంట్లో అందరం సంతోషంగా ఉన్నాం. మా అమ్మ జీవితంలో చాలా బాధలు పడింది. ఆమెను సంతోషంగా చూసుకోవాలి. మా కుటుంబాన్ని అర్ధం చేసుకుని మాతో ఫ్రీగా కలిసిపోయే అమ్మాయి భార్యగా రావాలనుకుంటున్నాను. వస్తున్న అవకాశాలు అందుకుంటూ ఇలా సీరియల్స్, సినిమాలు చేసుకుంటూ రోజులు హ్యాపీగా గడిపేయాలనుకుంటున్నాను.’’ – సంభాషణ: నిర్మలారెడ్డి -
కాకర్ల వంశీకృష్ణ అనే కార్తీక్
ఈ రోజుల్లో బుల్లితెర అందిస్తున్న అవకాశాలు మెండు. వాటికి తగిన విధంగా తెలుగు వారే కాదు కన్నడ, తమిళ ఆర్టిస్టులూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ఉంటారు. ప్రాంతాల అడ్డుగోడలను చెరిపేస్తూ బుల్లితెర అభిమానాన్ని మూటగట్టుకుంటూ ఉంటారు. అలా వచ్చినవాడే కార్తీక్. కన్నడ ఆర్టిస్ట్ అయినా తెలుగు బుల్లితెర నటుడిగా రాణిస్తూ ‘మాటే మంత్రం’ అంటూ మెప్పిస్తున్నాడు కార్తీక్. కాకర్ల వంశీకృష్ణగా బుల్లితెర ప్రేక్షకులకు ఆకట్టుకుంటున్న కార్తీక్ చెబుతున్న కబుర్లివి.. ‘‘వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ మనల్ని మనం నిరూపించుకుంటూ వెళ్లాలి. ప్రతీ పాత్రకు లైఫ్ ఉంటుంది. ఈ పాత్ర అయితేనే చేస్తాను అని ఈ ఇండస్ట్రీలో గిరిగీసుక్కూర్చోనక్కర్లేదు. సినిమాలకు రావాలనే ఆలోచనల్లో ఉండగానే బుల్లితెరపై నటించే అవకాశాలు వచ్చాయి. వాటిని వినియోగించుకుంటూ నన్ను నేను నిలబెట్టుకునే ్రçపయత్నం చేస్తున్నాను. ‘మాటేమంత్రం’ సీరియల్ ద్వారా కాకర్ల వంశీకృష్ణగా తెలుగువారి అభిమానం పొందుతున్నందుకు ఆనందంగా ఉంది. చిన్నప్పటి నుంచి ఆరిస్టుగా రాణించాలనే ఆలోచన ఉండేది. అందుకు కాలేజీ రోజుల నుంచే ఆడిషన్స్‌కి వెళ్లడం మొదలుపెట్టాను. బిఎస్సీ పూర్తయ్యాక ఆరునెలల పాటు దాదాపు అన్ని టీవీ ఆడిషన్స్‌కి వెళ్లాను. పుట్టి పెరిగింది అంతా మైసూరులో. కన్నడలో ఖుషి, అక్క, మహాకాళీ, శని.. సీరియల్స్‌లో నటించాను. తమిళంలోనూ ఓ సీరియల్లో నటించాను. తెలుగు, కన్నడ, తమిళ నటుడిగా మంచి గుర్తుంపు పొందాలన్నదే నా అభిలాష. ‘జీ’ తెలుగులో వస్తున్న మాటేమంత్రం సీరియల్లో కాకర్ల వంశీకృష్ణగా లీడ్రోల్లో నటిస్తున్నాను. అన్నీ చెడు అలవాట్లు ఉన్న వ్యక్తిగా ఈ సీరియల్లో కనిపిస్తుంటాను. వంశీకృష్ణ దగ్గర పి.ఎగా వసుంధర చేరుతుంది. చాలా మంచి అమ్మాయి. ఎలాంటి సమస్యనైనా పరిష్కరించగల నేర్పు, ధైర్యం గల అమ్మాయి. వంశీకృష్ణకు వసుంధరతో పెళ్లి అవుతుంది. అక్కణ్ణుంచి వంశీకృష్ణలో కుటుంబ విలువలతో కూడిన మార్పు వస్తుంటుంది. ఈ క్రమంలో వచ్చే ఒడిదొడుకులు, మార్పులు.. వంటి అంశాలతో ‘మాటేమంత్రం’ సీరియల్ నడుస్తుంది. మంచి రేటింగ్‌తో ఉన్న ఈ సీరియల్ రీప్లేసింగ్ ద్వారా నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర దొరికింది. అమ్మనాన్నల ప్రేమ యాక్టింగ్ అనేది ప్రతి రోజూ కొత్తగానే ఉంటుంది. సీనియర్స్ నటన చూసే కాదు స్క్రీన్‌పై నన్ను నేను చూసుకుంటూ ఇంకాస్త మెరుగుపరుచుకుంటూ ఉంటాను. మొదట ఈ ఫీల్డ్‌వైపు రావడానికి అమ్మనాన్నలు అంతగా ఆసక్తి చూపలేదు. ‘చదువుంది, లేదంటే నాన్న చేసే ఫ్యాబ్రిక్ బిజినెస్ చూసుకో’అన్నారు. కానీ, నా ఇష్టాన్ని కాదనలేకపోయారు. అమ్మ గృహిణి. అక్క ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నారు. ఇంట్లో ఇప్పుడు నా సీరియల్స్ చూస్తూ ‘నెక్ట్స్ ఏమవుతుంది స్టోరీలో’ అని అడుగుతుంటారు. చాలా ఆనందంగా అనిపిస్తుంది. టీవీ ఇండస్ట్రీ అంటే నిలకడలేని జాబ్ అన్నారు కానీ, ఎప్పుడూ నన్ను వెనక్కిలాగాలని ప్రయత్నించలేదు. ప్రయత్నించు.. ఏ మాత్రం సౌకర్యంగా లేకున్నా వెనక్కి వచ్చేయ్ అన్నారు. కుటుంబం నుంచి ఫుల్ సపోర్ట్ ఉంటే ఇష్టమైన ఫీల్డ్‌లో హ్యాపీగా రాణించవచ్చు. నా విషయంలో ఇది నిజమైంది. మహాకాళీ, శని సీరియల్స్‌లో నారాయణుడిగా నటించాను. దైవ పాత్రల్లో నటిస్తున్నప్పుడు తెలియని అలౌకిక భావన నన్ను చుట్టుముట్టేది. నారాయణుడి పాత్రకు సంబంధించిన సన్నివేశాలు టీవీలో చూసిన అమ్మనాన్నలు ‘ఎంత బాగా చేశావు నాన్నా’ అన్నప్పుడు కలిగిన ఆనందం వెలకట్టలేనిది. ఆటలంటే పిచ్చి నటనతోపాటు స్పోర్ట్స్ అంటే బాగా పిచ్చి. క్రికెట్, ఫుట్‌బాల్‌ను బాగా ఇష్టపడతాను. కాస్త ఖాళీ సమయం దొరికినా గ్రౌండ్లో ఉండేలా చూసుకుంటాను. ఫ్రెండ్స్‌తో కలిసి లాంగ్ డ్రైవ్‌కి వెళ్లడం నాకున్న మరో అలవాటు. కాస్ట్యూమ్స్ కోసం పాపింగ్ చేయడమే కాదు డిజైనర్ డ్రెస్సులకు సంబంధించిన వాటికి అప్పుడప్పుడు మా సిస్టర్ అడ్వైజ్ కూడా తీసుకుంటూ ఉంటాను. నటనలోనే కాకుండా ఒక మంచి కథతో నన్ను నేను నిరూపించుకోవాలని ఉంది. అందుకే సీరియల్ కథ రెడీ చేస్తున్నాను.’’ సంభాషణ: నిర్మలారెడ్డి -
నటుడిపై లైంగిక వేధింపుల కేసు
ముంబై: ప్రముఖ చిత్ర, టీవీ నటుడు షాబాజ్ ఖాన్‌పై లైంగిక వేధింపుల కేసును నమోదు చేసినట్లు ముంబై పోలీసులు తెలిపారు. ఓ యువతిని లైంగిక వేధించినట్లు ఫిర్యాదు రావడంతో ఓషివారా పోలీసు స్టేషన్లో ఆయనపై ఐపీసీ సెక్షన్ 354, 509 కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బుధవారం పోలీసులు వెల్లడించారు. కాగా ఈ కేసు దర్యాప్తులో ఉన్నందున ఆయనపై ఇంతవరకు ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోలేదని ఏఎన్ఐ న్యూస్ పేర్కొంది. Mumbai: Case of molestation filed against actor Shahbaz Khan at Oshiwara Police Station. FIR registered under IPC sec 354 (Assault or criminal force to woman with intent to outrage her modesty) & 509 (Word, gesture or act intended to insult modesty of a woman). Investigation on. — ANI (@ANI) February 12, 2020 ఇక పలు హిందీ సీరియల్లో ప్రతి నాయకుడి పాత్రల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న షాబాజ్ ఖాన్ అసలు పేరు హైదర్ ఖాన్. శాస్త్రీయ గాయకుడిగా పద్మభూషన్ ఆవార్డును గెలుచుకున్న ఉస్తాద్ మీర్ ఖాన్ కుమారుడు. షాబాజ్ తెనాలి రామా, రామా సియా కే లవ్ కుష్, సలామ్ అలీ ఖాన్.. వంటి హిందీ సిరియళ్లతో పాటు వెండితెరపై కూడా ప్రతినాయకుడి పాత్రల్లో నటించి పాపులర్ అయ్యాడు. -
బుల్లితెర పెద్దబాబు
ఘట్టమనేని దేవేంద్రగా బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడు పవన్‌సాయి. ‘జీ తెలుగు’లో వచ్చే ‘ముద్దమందారం’ సీరియల్లో పెద్దబాబుగా ఆకట్టుకున్నాడు. వరుస సీరియల్స్‌తో పలకరిస్తున్న పవన్‌సాయి తన జర్నీ గురించి ఆనందంగా వివరించాడు. ‘పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. నేను అన్నయ్య, ముగ్గురు అక్కచెల్లెల్లు. అందరికీ మంచి చదువులు చెప్పించారు అమ్మనాన్న. అన్నయ్య ఉద్యోగాన్ని ఎంచుకున్నారు. నేను ఈ ఇండస్ట్రీకి వచ్చాను. యాక్టింగ్ ఫీల్డ్ అన్నప్పుడు మా వాళ్ల నుంచి ఎలాంటి వ్యతిరేకత రాలేదు. ‘నీ ఇష్టమే మా ఇష్టం’ అన్నారు. ఏం చేసినా టాప్‌లో! అనుకోకుండా ఈ రంగం వైపు వచ్చాను. టెన్త్ క్లాస్ అయిపోయాక వేసవి సెలవుల్లో ఓ రోజు నా స్నేహితుడితో కలిసి ఈవెనింగ్ వాక్‌కి వెళ్లాను. మేం వెళ్లేదారిలో ఫ్రెండ్ వాళ్ల అన్నయ్య డ్యాన్స్ క్లాస్ ఉంది. అన్నయ్యను కలవాలని తనతో పాటు నన్నూ తీసుకెళ్లాడు నా ఫ్రెండ్. అక్కడికి వెళితే కొంతమంది గ్రూప్ డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్లని చూసి ‘నేనూ డ్యాన్స్ నేర్చుకుంటాను’ అన్నాను. మా ఫ్రెండ్ అన్నయ్య ‘డ్యాన్స్‌తో పాటు యాక్టింగ్ కూడా నేర్పిస్తా’ అన్నాడు. ముందు డ్యాన్స్ క్లాస్‌లో జాయిన్ అయ్యాను. రెగ్యులర్‌గా డ్యాన్స్ క్లాస్‌కి వెళ్లేవాడిని. ముందుగా వెళ్లిన రోజు యాక్టింగ్ కోసం వచ్చిన స్టూడెంట్స్ ప్రాక్టీస్ చూసి నేనూ నేర్చుకునేవాడిని. అలా కాలేజీ రోజులూ గడిచిపోయాయి. ఏ పని చేసినా టాప్‌లో ఉండాలనేది నా తపన. అక్కణ్ణుంచి ఫొటోస్ దిగడం, ప్రతీ ఒక్క సినిమా, సీరియల్స్ ప్రొడక్షన్ ఆఫీసులకు ఇవ్వడం చేస్తుండేవాడిని. ఈ ప్రయాణంలో చాలా మంది సహాయపడ్డారు. డ్యాన్స్ నేర్చుకున్న నాటి నుంచి అన్ని ఆఫీసులకు వేల ఫోటోలు ఇచ్చి ఉంటాను. ప్రొడక్షన్ మేనేజర్లకు వారానికి రెండుసార్లు ఫోన్ చేసి నన్ను నేను పరిచయం చేసుకునేవాడిని. ఫస్ట్‌టైమ్ కామెడీ రోల్ ఉన్న హ్యాపీడేస్ సీరియల్లో ‘బ్లూటూత్’ అనే క్యారెక్టర్‌కి అవకాశం వచ్చింది. హ్యాపీగా జర్నీ హ్యాపీడేస్ టైమ్‌లోనే గుర్తింపు వచ్చిన మరో సీరియల్ మొగలిరేకులు. ఇది చేస్తుండగానే ముద్దుబిడ్డ సీరియల్‌కు అవకాశం. ముగింపులో ‘శ్రావణసమీరాలు’. ఆ తర్వాత ఏడాదికి ‘ముద్దమందారం’ స్టార్ట్ అయ్యింది. ముద్దమందారం.. పెద్ద కొడుకు ఒక సీరియల్ తర్వాత మరో సీరియల్ అంటూ ఒక నియమం పెట్టుకున్నాను. దీని వల్ల ఆ వర్క్‌లో, ఆ క్యారెక్టర్లో లీనమై నటించే అవకాశం ఉంటుందని నమ్ముతాను. అలా ఐదేళ్లుగా ముద్దమందారం సీరియల్లో నటించాను. టీమ్ అందరితోనూ ఒక మానసికమైన బంధం ఏర్పడింది. టీమ్ అంతా బయట కూడా నన్ను పెద్ద కొడుకులా చూసుకున్నారు. హరితమ్మ, తనూజ, సురేశ్.. అంతా ఇంట్లో పెద్దబ్బాయిని ఎలా ట్రీట్ చేస్తారో అలా చూసేవారు. ఈ జర్నీ చాలా అద్భుతం. ఆటలంటే పిచ్చి నటన తర్వాత పిచ్చి ప్రేమ ఆటలమీదనే. చాలా స్పోర్టీ పర్సన్‌ని. క్రికెట్ కోసం ఎక్కడెక్కడో గ్రౌండ్స్ వెతికేవాడిని. ఇదొక్కటే కాదు బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, షటిల్, వీడియోగేమ్స్.. అన్నీ ఇష్టమే. ఇంట్లో ఉన్నానంటే టీవీకే అంకితం. సమయం అంతా టీవీ చూడ్డంతోనే అయిపోతుంది. చిన్నప్పటి నుంచి ఆ అలవాటు ఉంది. ఈ ఇండస్ట్రీలోకి రావడానికి టీవీ చూడ్డం హాబీయే కారణం అనుకుంటాను.’ – నిర్మలారెడ్డి -
ప్రేక్షకుల ప్రేమే∙ నా విజయం
ఏ సీరియల్ చూసినా ఆ కథనంలో ఇమిడిపోయేలా అనిపిస్తారు. భిన్నమైన పాత్రలతో అలరిస్తున్నారు. ‘ఒకేలాంటి పాత్రలు చేస్తూ ఉంటే బోర్ అనిపించవచ్చు. కానీ, భిన్నమైన పాత్రల వల్ల పనిని ఎంజాయ్ చేస్తున్నాను. వాటి వల్ల మనల్ని మనం నిరూపించుకోవచ్చు’ అంటున్నారు టీవీ నటుడు నిరుపమ్ పరిటాల. పుష్కరకాలంగా సీరియల్స్ ద్వారా ఆకట్టుకుంటున్న నిరుపమ్ ప్రస్తుతం కుంకుమపువ్వు, కార్తీకదీపం, ప్రేమ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నారు. తన గురించి ‘సాక్షి’తో పంచుకున్న కబుర్లు ఇవి.. ‘చంద్రముఖి సీరియల్ నా జీవితంలో ఓ మైలు రాయి అని చెప్పవచ్చు. అది కెరియర్ పరంగానూ, జీవితంలో నిలదొక్కునేలా చేసింది. 2007లో మొదలైన ఈ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యాను. నాన్న నో చెప్పారు.. మా నాన్న ఓంకార్ పరిటాల. ఆయన నటుడు, రచయిత. నేను ఈ ఫీల్డ్కి రావడం నాన్నకి ఏ మాత్రం ఇష్టం లేదు. చదువుకునేటప్పుడు కెరియర్ అంటూ పెద్ద ఆలోచనలేవీ లేవు. సినిమాల్లోకి రావాలని ఉండేది. కానీ, సోర్స్ అంటూ ఏమీ లేదు. నాన్న మాత్రం ‘ముందు చదువుకో, తర్వాత ట్రై చేయవచ్చు’ అనేవారు. మాది విజయవాడ. నాన్న నటుడు కావడంతో నా చదువు అంతా చెన్నైలోనే సాగింది. ఇంజినీరింగ్ తర్వాత ఎంబీయే చేశాను. నేను సినిమాల్లోకి రావాలనే ఆలోచనతో చెన్నై నుంచి హైదరాబాద్‌కి షిఫ్ట్ అవ్వాలనుకున్నాం. ఆ సమయంలోనే నాన్న చనిపోయారు. ఆ టైమ్‌లో రెండు విషయాలు ఆలోచించాను. ఒకటి ఉద్యోగం, రెండు సినిమా ఇండస్ట్రీ. ఆ సమయంలోనే నాన్న స్నేహితుల ద్వారా నాకు సీరియల్ అవకాశం వచ్చింది. ఇంకేమీ ఆలోచించకుండా ఓకే చెప్పాను. మొదట్లో నాన్న పేరు నన్ను ఎదుటివారు గుర్తించే వరకే ఉపయోగపడింది. ఆ తర్వాత పనిని బట్టే విలువ ఏర్పడింది. చిన్నప్పటి నుంచి మా నాన్నగారిని చూస్తూ పెరిగాను. తను ఈ ఫీల్డ్ వద్దనడానికి కారణం ‘ఒకనాడు బాగుంటుంది, మరోసారి అంత బాగుండకపోవచ్చు’ అనే ఉద్దేశంతోనే. అన్నింటికీ సిద్ధపడే రంగంలోకి దిగాను. ఇక్కడ బిహేవియర్, డిసిప్లిన్, డెడికేషన్‌తో ఉంటేనే రాణించడం సాధ్యం. కొంతమంది వైఫల్యాలు చూసి పాఠాలు నేర్చుకున్నాను. భిన్న పాత్రలు ‘కుంకుమపువ్వు’ సీరియల్ చేస్తున్న సమయంలో ‘కార్తీక దీపం’ సీరియల్ డిస్కషన్స్ జరిగాయి. ఆ సీరియల్ ప్రొడ్యూసర్‌తో అప్పటికే ‘మూగమనసులు’ సీరియల్ చేసున్నాను. ఆ తర్వాత కూడా ఆ టీమ్‌తో టచ్‌లో ఉండేవాడిని. కార్తీక దీపం హీరో వెతుకులాటలో నా సలహా అడిగితే ఒకరిద్దరి పేర్లు కూడా చెప్పాను. వాళ్లతో ఆడిషన్స్ చేసినా క్లియర్ అవ్వలేదు. దీంతో నన్నే చేయమన్నారు. అప్పటివరకు వాళ్ల మనసులో నేను ఉన్నాను అనే విషయం నాకు తెలియదు. ‘అత్తారింటికి దారేది’ సీరియల్లో విలన్ రోల్ చేశాను. జనాలకు ఎప్పుడూ ఒకేలా కనిపించకూడదు.. ‘ఇలాగ కూడా మెప్పించగలడు నిరుపమ్..’ అనుకోవాలి. ఆ ఆలోచనతో ఒప్పుకున్న పాత్ర అది. అందరూ బాగుంది అన్నారు కానీ, కొంతమంది నెగిటివ్ రోల్ వద్దులెండి అని చెప్పేవారు. రచయితగా! ‘నెక్ట్స్ నువ్వే’ అనే సినిమాకి స్క్రిప్ట్ రాశాను. ఇప్పుడలాంటివేమీ లేవు. ఒక సీరియల్‌కి పది రోజుల షూటింగ్ షెడ్యూల్ ఉంటుంది. డబ్బింగ్స్ కూడా ఉంటాయి. ప్రస్తుతం ఈ పనుల్లోనే ఉన్నాను. మా ఆవిడ మంజుల కూడా ఇదే ఫీల్డ్. చంద్రముఖి సీరియల్లో ఇద్దరం కలిసి చేశాం. ప్రేమిం చి, పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నాం. సర్దుబాట్లు మంజుల కూడా సీరియల్ నటి కావడంతో ఇండస్ట్రీలో వర్క్ ఎలా ఉంటుందో తనకు బాగా తెలుసు. తన పని వేరు, నా పని వేరు. ఇద్దరం మెచ్యూర్డ్‌గా ఉంటాం. ఎప్పుడైనా చిన్న చిన్న వాదనలు వచ్చినా అర్థం చేసుకుంటాం. తనకోసం టీవీ షోస్‌లో కపుల్ డ్యాన్స్‌కి అవకాశం ఉంటే, ప్రాక్టీస్ చేసి మరీ ఆ ప్రోగ్రామ్‌లో పాల్గొన్నాను. టైమ్‌కి సంబంధించి. కంప్లైంట్స్ ఉంటాయి మా ఇద్దరికి. ఏదో విధంగా సర్దిచెప్పుకుంటాను. ప్రొడక్షన్వైపుగా అడుగు చంద్రముఖి నుంచి కార్తీక దీపం వరకు గ్రోత్ పరంగా చూసుకుంటూ ‘జీ తెలుగు’లో ఇప్పుడు ‘ప్రేమ’ సీరియల్‌తో ప్రొడక్షన్ వైపుగానూ వెళ్లాను. అనుకోకుండా వచ్చిన బాధ్యత ఇది. ఇందులో లీడ్ రోల్ కూడా చేస్తున్నాను. అన్నీ ప్లాన్ ప్రకారం చేసుకుంటూ వెళితే ఏదీ మిస్ చేసుకోలేం. రోజు మొత్తం ఈ ఇండస్ట్రీకి సంబంధించిన ఆలోచనలు, షెడ్యూల్.. ఉంటుంది కాబట్టి అన్నీ సాఫీగా సాగిపోతున్నాయి. – నిర్మలారెడ్డి -
బుల్లితెర శోభన్‌బాబు
బుల్లితెరపై విజె సన్నిగా అలరించిన అరుణ్ సీరియల్ నటుడిగా ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నాడు. ‘అందరూ సీరియల్ శోభన్‌బాబు అని కితాబులిస్తున్నారు’ అంటూ సరదాగా వివరించిన అరుణ్ సింగిల్ ట్రావెల్ జర్నీ అంటే అమితంగా ఇష్టపడతానని తన విషయాలు చెప్పుకొచ్చాడు. ‘మాది ఖమ్మం. పీజీ చేస్తున్నప్పుడు అవకాశం వస్తే ముందు ఒక టీవీ చానెల్లో లైఫ్‌సై్టల్ రిపోర్టర్‌గా పనిచేశాను. ఆ తర్వాత యాంకరింగ్ వైపు వచ్చాను. మూడేళ్లపాటు టీవీ యాంకర్‌గా వర్క్ చేశాను. నా యాంకరింగ్ చూసిన టీవీ సీరియల్ వాళ్లు ఆడిషన్స్‌కు పిలిచారు. అలా ‘కళ్యాణవైభోగం’ సీరియల్ ద్వారా నటుడిగా పరిచయం అయ్యాను. మూడేళ్లుగా ఈ సీరియల్లో లీడ్ రోల్ చేస్తున్నాను. ‘కళ్యాణవైభోగం’ సీరియల్లోని దృశ్యం సూర్యదేవర జయసూర్య అనే నేను ‘జీ తెలుగు’లో వచ్చే ‘కళ్యాణౖవైభోగం’ సీరియల్లో సూర్యదేవర జయసూర్యగా లీడ్ రోల్లో నటిస్తున్నాను. ఈ సీరియల్లో బిజినెస్ మ్యాన్‌గా రాణిస్తుంటాను. బిజినెస్ ఉమన్ నిత్యను చూసి, ఇష్టపడి పెళ్లిచేసుకుంటాను. తనే నా లైఫ్ అన్నట్టుగా ఉంటాను. అయితే, అనుకోకుండా మా ఇద్దరి మధ్య బిజినెస్ వార్ నడుస్తూ ఉంటుంది. ఒకానొక సందర్భంలో నిత్య చనిపోయిందని అందరూ అనుకుంటారు. నిత్య స్థానంలో అదే పోలికతో ఉండే మంగను చేర్చుతారు. ఈ విషయం ఎక్కడ బయటపడిపోతుందో అని భయం. ఇలా ఓ భిన్న కథాంశంతో సీరియల్ నడుస్తుంది. మా టీమ్‌లో అందరూ నన్ను సీరియల్ శోభన్‌బాబు అని పిలవడానికి కారణం కూడా అదే. మూడేళ్లుగా ఈ సీరియల్ టాప్ రేటింగ్‌లో ఉన్నందుకు గాను టీవీ అవార్డు నన్ను వరించింది. ఈ రంగానికి వచ్చినందుకు ఇదో అద్భుతమైన అవకాశంగా భావిస్తుంటాను. అమ్మ కష్టంతో ఎదిగాం ఖమ్మంలో అమ్మ విలేజ్ హెల్త్ రిప్రజెంటేటివ్‌గా వర్క్ చేసేవారు. ఇద్దరు అన్నయ్యలు. అమ్మ సింగిల్ పేరెంట్‌గా మా ముగ్గురిని చదివించింది. అమ్మ కష్టాన్ని అర్థం చేసుకుంటూ పెరిగాం. మా ముగ్గురిలో చిన్నవాడిని కాబట్టి నేను కాస్త గారంగానే పెరిగాను. పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తుండగా రిపోర్టర్‌గా, అటు నుంచి వీడియోజాకీగా.. అవకాశాలు వచ్చాయి. దీంతో టీవీనే నా ప్రపంచం అనుకుంటూ వచ్చేశాను. అన్నయ్యలిద్దరూ ఉద్యోగాల్లో సెటిల్ అయ్యారు. నాకున్న ఇష్టం కొద్దీ ఈ ఇండస్ట్రీకి వచ్చాను. అమ్మకు మా మీద చాలా నమ్మకం. ఏ వర్క్ అయినా స్వేచ్ఛ ఉంటుంది. ఇదే చేయ్, ఇదే చదువుకొని జాబ్ తెచ్చుకో.. అని అనలేదు. దీంతో సృజన ఉన్న ఈ రంగాన్ని ఎంచుకున్నాను. సీరియల్స్‌తో పాటు సినిమాలోనూ రాణించాలనుకుంటున్నాను. ప్రయాణాలతో ప్రమోదం సీరియల్ షూటింగ్, ఈవెంట్స్, షోస్ అంటూ నెలలో పాతిక రోజులు గడిచిపోతాయి. మిగతా రోజులను ట్రావెల్‌కు ఉపయోగించుకుంటాను. కొత్త కొత్త ప్రదేశాలను సందర్శించడం అంటే చాలా ఇష్టం. అలాగని ట్రూప్‌లుగా వెళ్లే జర్నీ అంటే ఇష్టముండదు. అమ్మవాళ్లు తీర్థయాత్రలు చేస్తుంటారు. నేను మాత్రం బైక్‌పైన ఫ్రెండ్స్‌తో ట్రావెల్ ఎక్కువ చేస్తుంటాను. ప్రపంచ పర్యాటక స్థలాలన్నీ సందర్శించాలనేది నా కల’ అంటూ తన జీవనవిధానంతోపాటు అభిరుచులనూ షేర్ చేశారు సన్ని. – నిర్మలారెడ్డి -
సీరియల్ ఆర్టిస్ట్ గుట్టురట్టు!
సాక్షి, హైదరాబాద్: అతనో సీరియల్ ఆర్టిస్టు. ఒకవైపు సీరియళ్లలో నటిస్తూ.. ఇంకోవైపు తాళాలు వేసిన ఇళ్లు కనబడితే చాలు పగటిపూటే అక్కడ వాలిపోతాడు. తాళాలు పగులగొట్టి దొంగతనాలకు పాల్పడుతుంటాడు. దొంగతనాలతో వచ్చిన సొమ్మును సీరియల్స్ తీసి.. అందులో నటించడం ఇతగాడి హాబి. ఈ ‘దొంగ’ ఆర్టిస్ట్ గుట్టు తాజాగా రట్టయింది. కూకట్పల్లి పరిధిలో పగటిపూట ఇళ్ల తాళాలు పగలగొట్టి దొంగతనాలకు పాల్పడుతున్న సీరియల్ ఆర్టిస్ట్ విక్కీ రాజాను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి 30 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇతడు దొంగతనాలకు పాల్పడ్డాడని, చోరీ సోమ్ముతో సీరియళ్లలో నటించడం ఇతని అలవాటు అని కూకట్పల్లి పోలీసులు తెలిపారు. -
విలన్ పాత్రల్లో కొంగరి జగ్గయ్య వారసుడు
కంచుకంఠాన్ని ప్రతినాయకుడి పాత్రకు ఎంత చక్కగా ఉపయోగించారో, కథానాయకుడి భూమికకు అంతే నేర్పుగా వినియోగించిన ఏకైక భారత నటుడు ‘పద్మభూషణ్’ కొంగర జగ్గయ్య. 1951లో ‘ప్రియురాలు’ సినిమాతో ఆరంభించి 125సినిమాల్లో నాయకుడిగా, 325 చిత్రాల్లో విభిన్న పాత్రల్లో నటించి, తెలుగు ప్రేక్షకుల మదిలో ‘కళావాచస్పతి’గా ముద్ర వేసుకున్నారు. కొంగర జగ్గయ్య సినీవారసుడు లేడనుకుని నిరాశపడ్డారెందరో.. ఇందుకు జవాబుగానేమో? ఆయన వంశాంకురం కొంగర సాత్విక్ కృష్ణ కళల తెనాలి నుంచి నటనా రంగంలోకి దూసుకొచ్చారు. బుల్లితెర బిజీ స్టార్‌గా ఉంటూ, మరోవైపు వెండితెరపైనా సాత్విక్ అరంగేట్రం చేశాడు. సాక్షి, తెనాలి(విజయవాడ): లోక్‌సభకు ఎన్నికైన తొలి సినీనటుడిగా గుర్తింపును పొందిన కొంగర జగ్గయ్య స్వస్థలం తెనాలి దగ్గర్లోని దుగ్గిరాల మండల గ్రామం మోరంపూడి. సాత్విక్ కృష్ణ జగ్గయ్య సోదరుడు కృష్ణారావు మనుమడు. తలిదండ్రులు సుధారాణి, శ్రీనివాస్. తెనాలిలో స్థిరపడ్డారు. శ్రీనివాస్‌ది బిజినెస్ కాగా, సుధారాణి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయురాలు. వీరి ఏకైక కుమారుడు సాత్విక్ కృష్ణ. తెనాలిలో డిగ్రీ తర్వాత చింతలపూడిలోని ప్రియదర్శిని ఇంజినీరింగ్ కాలేజి నుంచి 2012లో బీటెక్ పట్టాతో బయటకొచ్చాడు. ఉద్యోగం కోసం హైదరాబాద్ రైలెక్కాడు. పెద్దగా కష్టపడకుండానే సాధించిన సాఫ్ట్వేర్ ఉద్యోగంలో ఏడాది పాటు పనిచేశాక, తన లక్ష్యమైన నటనారంగంకేసి చూశాడు. తొలి నుంచి నటనపై ఆసక్తి సాత్విక్ కృష్ణకు తొలినుంచి నటన అన్నా, సాంస్కృతిక కార్యక్రమాలన్నా ఆసక్తి. హైస్కూల్, కాలేజీ రోజుల్లో తనే ముందుండేవాడు. తండ్రి మాటల్లో తాత కొంగర జగ్గయ్య కళాప్రతిభను గురించి వింటూ పెరిగాడాయె. పాత సినిమాల్లో జగ్గయ్య కనిపిస్తే, ఆ సినిమా గురించి, అందులో జగ్గయ్య గారి ప్రత్యేకతల గురించి తండ్రి శ్రీనివాస్ కచ్చితంగా చెబుతూ వచ్చేవారు. కాలేజి రోజుల్లోనే సినీ ప్రయాణం చేయాలని ఉబలాటపడిన సాత్విక్ ఉత్సాహానికి తండ్రి బ్రేకులు వేశాడు. ‘విద్య లేకుండా జీవితం లేదు.. తగిన విద్యార్హత సాధించాక ఇష్టమైన రంగంలో పనిచెయ్యి’ అని తండ్రి చెప్పటంతో బుద్ధిగా చదువుకున్నాడు. ఏడాది ఉద్యోగం కూడా చేశాక, తన అభిరుచిని బహిర్గతం చేయడంతో తలిదండ్రులు, సంతోషంగా ‘బెస్టాఫ్ లక్’ చెప్పి పంపారు. ‘వాస్తవానికి యువకుడిగా ఉన్న రోజుల్లో మా నాన్న శ్రీనివాస్‌కు నటనా రంగంలోకి రావాలని అభిలషించారు. అయితే పెళ్లి, ఆ తర్వాత కుటుంబ బాధ్యతలతో తనకు వీలుపడలేదు’ అని సాత్విక్ వెల్లడించారు. తొలిసారిగా వెండితెర అవకాశమే ‘అర్ధనారి’ సినిమా రూపంలో పలకరించింది. అందులో పోలీసాఫీసర్ పాత్రలో నటించిన సాత్విక్‌కు, బుల్లితెర మంజులానాయుడు నుంచి కబురొచ్చింది. ‘శ్రావణ సమీరాలు’ టీవీ సీరియల్లో ‘షెట్టి’ అనే ప్రధాన విలన్‌గా అవకాశమొచ్చింది. ఏడాదిపాటు 150 పైగా ఎపిసోడ్లలో నటించారు. అవకాశాలు వరుసకట్టాయి. ‘కోయిలమ్మ’, ‘అభిషేకం’, ‘స్వాతిచినుకులు’, ‘అగ్నిసాక్షి’, ‘సావిత్రి’, ‘ఆడదే ఆధారం’ సీరియల్స్‌తో బుల్లితెరకు పర్మినెంట్ నటుడయ్యారు. దాదాపు అన్నీ విలన్ పాత్రలే. కోయిలమ్మ, స్వాతిచినుకులు, అగ్నిసాక్షి సీరియల్స్‌తో మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ప్రస్తుతం నడుస్తున్న సీరియల్స్ ‘మధుమాసం’లో సీబీఐ అధికారిగా, ‘గోరింటాకు’, ‘మట్టిగాజులు’లో విలన్ పాత్రలో నటిస్తున్నారు. సాయిధరమ్ తేజతో కృష్ణవంశీ తీసిన ‘నక్షత్రం’ సినిమాలో నటించారు. ‘టీవీ సీరియల్స్‌తో బీజీగా ఉండటం సంతృప్తిగా ఉంది. సినిమాల్లోనూ ప్రూవ్ చేసుకోవాలని ఉంది’ అంటారు సాత్విక్. తాతయ్య కొంగర జగ్గయ్య గురించి అందరూ చెబుతుంటే హ్యాపీగా ఉంటుంది. ‘టాలెంటుతోనే పైకిరావాలని ముందుకెళుతున్నా, ఇంటిపేరుతో తెలిసిపోతున్నాను’ అని చెప్పారు. ఇటీవలే ఖమ్మంకు చెందిన భావనతో వివాహంతో సాత్విక్ ఓ ఇంటి వాడయ్యాడు కూడా. -
తెలుగింటి పద్మావతి
తెలుగువారింట గోరంత దీపమై, పున్నాగగా పరిమళించి బంగారు గాజులు ధరించిన పద్మావతి అసలు పేరు అంజనా శ్రీనివాస్. సీరియల్ నటిగా తెలుగువారి మనసులను ఆకట్టుకుంటున్న పద్మావతి ఉరఫ్ అంజన సాక్షితో పంచుకున్న ముచ్చట్లు. అమ్మనాన్నలకు ముగ్గురు ఆడపిల్లలం. ఇంట్లో నేనే పెద్ద కూతురిని. మా అమ్మవాళ్ల నాన్నగారు నాటకాలు వేసేవారట. అలాగే నాకు సాంస్కృతిక వ్యవహారాలపై ఇష్టం ఏర్పడి ఉంటుందని అమ్మానాన్నా అంటుంటారు. పుట్టి పెరిగింది అంతా బెంగుళూరులోనే. డిగ్రీ వరకు చదువుకున్నాను. ఒక తెలిసిన మేకప్‌మేన్ సీరియల్‌కి ఆడిషన్స్ జరుగుతున్నాయంటే వెళ్లాను. అక్కడ నూట ఇరవైమందిలో నేను సెలక్ట్ అయ్యాను. అలా కన్నడలో ‘కృష్ణా రుక్మిణి’ సీరియల్లో నటించాను. తమిళంలో కూడా ఓ సీరియల్ చేస్తున్నాను. తెలుగులో గోరంతదీపం, పున్నాగ తర్వాత ఇప్పుడు బంగారు గాజులు సీరియల్లో నటిస్తున్నాను. చెల్లెళ్లకు అన్నలా! నాన్న శ్రీనివాస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్. అమ్మ రాధ హౌజ్‌వైఫ్. మేం ముగ్గురు ఆడపిల్లలమే అని అమ్మనాన్న ఎప్పుడూ భయపడలేదు. అలాగే మా ఇష్టాలకు ఆంక్షలు ఎప్పుడూ పెట్టలేదు. ఏది నచ్చితే అది చేయమన్నారు. అయితే, ఏం చేసినా చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇబ్బందులు పడకూడదని, ఫ్యామిలీకీ ఇబ్బంది రాకూడదని చెబుతారు. నన్నయితే చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయిలాగే పెంచారు. అందుకే మా చెల్లెళ్లకు అన్నలా ఉంటాను. కాని, మా సిస్టర్సే నాకన్నా మెచ్యూర్డ్. నేనే వాళ్లతో బాగా అల్లరి చేస్తాను. ఒక్కోసారి వాళ్లకే చెల్లెలిగా మారిపోతాను. నాకేదైనా అడ్వైజ్ అవసరమైతే వాళ్లే చెబుతారు. ఇంటికి పెద్ద కొడుకులా! నేనీ ఇండస్ట్రీకి వచ్చి ఎనిమిదేళ్లయ్యింది. ఐదేళ్ల వరకు అమ్మ నాతోపాటు షూటింగ్స్‌కి వచ్చేవారు. ఇప్పుడు వద్దని చెప్పాను. నా పనులు నేను చూసుకోగల ధైర్యం వచ్చింది, నువ్వు చెల్లెళ్లను చూసుకో’ అని చెప్పాను. ఇంకా మంచి మంచి సీరియల్స్ చేస్తూ నా ప్రొఫెషన్లో ఎదగాలని ఉంది. ఫ్యూచర్లో కూడా అమ్మానాన్నలని బాగా చూసుకోవాలి. పెళ్లయినా వాళ్లని వదిలి ఉండలేను. ‘అమ్మనాన్నలతో నేను ఉంటాను, నేను ఉంటాను’ అంటూ ముగ్గురం అక్కచెల్లెళ్లం గొడవ పడుతుంటాం. డ్యాన్స్ అంటే పిచ్చి నే చేసిన సీరియల్స్ అన్నీ చాలా నేచురల్‌గా, భిన్నమైన పాత్రలు రావడం బాగా నచ్చింది. ఈ ఫీల్డ్కి రాకముందు మొదట్లో మా అమ్మతో అనేదాన్ని‘ ఇలాంటి సీరియల్స్ ఎలా చూస్తున్నావ్?’ అని. కానీ, అలా అనే నేను కూడా సీరియల్స్ చూసేదాన్ని. సీరియల్లో తర్వాత కథ ఏమవుతుందనే ఆసక్తి ఉంటుంది. ఆ ఆసక్తి వల్లే ఇలా ఈ ఇండస్ట్రీకి వచ్చాననిపిస్తుంది. డ్యాన్స్ అంటే విపరీతమైన పిచ్చి. ఏ కాస్త ఖాళీ దొరికినా స్ప్రింగ్‌లా ఊగిపోతుంటాను. వరించిన పాత్రలు నేను ఈ ఇండస్ట్రీకి రాకముందు ఏమేం అనుకున్నానో అలాంటి పాత్రలన్నీ ఇప్పుడు సీరియల్స్‌లో చేస్తున్నాను. తమిళ్ ‘శివగామి’ సీరియల్లో ఐపిఎస్ ఆఫీసర్‌గా చేస్తున్నాను. ఈ సీరియల్ ఒప్పుకోవడానికి ముందు కొంచెం భయపడ్డాను. హీరోయిన్ అనగానే ఏడ్వాలి.. అనే కాన్సెప్ట్ ఉంటుంది. కానీ, ఇందులో ధైర్యవంతురాలిగా ఉంటుంది నా పాత్ర. తండ్రిని చంపిన వారిని శిక్షించాలని అనుకుంటుంది. అలాగని పగ పెంచుకోదు. న్యాయపరంగా ఉంటుంది. నిజంగా పోలీస్ జాబ్‌లో ఉన్న అమ్మాయిలు ఎంత కష్టపడుతున్నారు అని ఆ పాత్ర చేస్తున్నప్పుడల్లా అనిపిస్తుంది. బంగారు గాజులు సీరియల్ పాత్ర సింగింగ్ బేస్డ్గా ఉంటుంది. చదువుకునే రోజుల్లో మంచి సింగర్‌ని కావాలని సింగింగ్ క్లాసులకు కూడా వెళ్లాను. ఇప్పుడు ఈ సీరియల్ ద్వారా ఆ ముచ్చట తీరుతోంది. ఈ సీరియల్లో పద్మావతిగా నా పాత్ర చాలా సంప్రదాయ బద్ధంగా, తల్లీ–కూతురు మధ్య ఉండే బంధం గొప్పగా ఉంటుంది. అల్లరిపిల్లగా కూడా కనిపిస్తుంది. గోరంత దీపంలోనూ నా పాత్ర పేరు పద్మావతే. ఈ పేరు సెంట్‌మెంట్‌గా వర్కవుట్ అయిందన్నారు యూనిట్. ఇప్పుడు నా అసలు పేరు మర్చిపోయి యూనిట్లో అంతా పద్దు అని, బాపు బొమ్మ అని పిలుస్తుంటారు. – నిర్మలారెడ్డి -
ప్రముఖ టీవీ నటుడు అరెస్ట్
ముంబై : ప్రముఖ హిందీ టీవీ నటుడు సిద్దార్ద్ శుక్లా తన ర్యాష్ డ్రైవింగ్‌తో కారు ప్రమాదానికి కారణమయ్యారు. ఈ ప్రమాదంలో ఆయన కారుతో పాటు మరో మూడు కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఓ వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం సాయంత్రం కారును నడుపుతున్న సిద్దార్ద్ శుక్లా ఒక్కసారిగా పట్టుతప్పి ముందు వస్తున్న కార్లను ఢీకొన్నారు. ఆ తర్వాత ఓ కరెంట్ స్థంబాన్ని ఢీకొన్న అతని కారు ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రాజ్‌కుమార్ దూదె అనే కారు యాజమాని స్వల్పగాయాలతో బయటపడ్డాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని నటుడిని అదుపులోకి తీసుకున్నారు. కారు నడుపుతున్న సమయంలో సిద్దార్ద్ శుక్లా తాగి ఉన్నాడా? లేదా? అని తెలుసుకోవటానికి అతని రక్తాన్ని వైద్యపరీక్షల నిమిత్తం పంపినట్లు పోలీసులు తెలిపారు. సిద్దార్ద్ కారు కరెంట్ స్థంబాన్ని ఢీకొన్నా కారులోని ఏయిర్ బ్యాగ్స్ తెరుచుకోలేదని, అయినా అదృష్టం కొద్ది అతడికి ఏ గాయాలుకాలేదని వెల్లడించారు. 279,336,337 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. సిద్దార్ద్ శుక్లా పాపులర్ హిందీ సీరియల్ ‘‘ బాలికా వధు’’ (తెలుగులో ‘‘చిన్నారి పెళ్లికూతురు’’)లో లీడ్ రోల్ చేశారు. -
ప్రముఖ బుల్లితెర నటుడు కన్నుమూత
ముంబై : ప్రముఖ హిందీ బుల్లితెర హాస్య నటుడు కవి కుమార్ ఆజాద్ కన్నుమూశారు. సోమవారం కార్డియాక్ అరెస్ట్ కారణంగా ఆయన మరణించారు. హిందీ సీరియల్ ‘ తారక్ మెహ్తా కా ఉల్టా చెస్మా’లో డా. హన్షరాజ్ హాథీ పాత్రతో ప్రేక్షకులకు ఎంతో చేరువయ్యారాయన. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన ముంబై మీరా రోడ్‌లోని వక్రదంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా నిన్న రాత్రి కోమాలోకి వెళ్లిన ఆయన సోమవారం మధ్యాహ్నం కార్డియాక్ అరెస్ట్ కారణంగా మృతి చెందాడని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఆయన నటించిన ‘ తారక్ మెహ్తా కా ఉల్టా చెస్మా’ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. అత్యధిక ఎపిసోడ్స్ ప్రసారమైన సీరియల్‌గా ఈ రికార్డును నెలకొల్పింది. కేవలం బుల్లితెర మీదే కాకుండా ఆమిర్ ఖాన్ కథానాయకునిగా నటించిన మేలా, ఫన్తూస్ వంటి సినిమాలలో కవి కుమార్ నటించారు. -
ఈ బుల్లితెర నటుడు నిజంగా శ్రీమంతుడే
ముంబై : పుట్టిన ఊరికి కొంతైనా మేలు చేయాలనుకున్నాడు. సొంత గడ్డ అభివృద్ధిని తన ఎదుగుదలగా భావించాడు. అనుకున్నదే తడవుగా సొంత ఊరిలో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనే ప్రముఖ హిందీ బుల్లితెర నటుడు గుర్మిత్ చౌదరి. సామాజిక సేవలలో ఎప్పుడూ ముందుండే ఇతడు ఇప్పుడు మరో అడుగు ముందుకేశాడు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న ఆలోచనతో ముందుగా తను పుట్టిన ఊరిని తీర్చిదిద్దాలని అనుకున్నాడు. గుర్మిత్ పుట్టింది బీహార్‌లోని బాగల్పుర అనే గ్రామంలో. ఆ గ్రామం తీవ్రమైన కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతోందని తెలుసుకున్న గుర్మిత్ వాటిని పరిష్కరించాలని అనుకున్నాడు. అక్కడ సోలార్ పానెళ్లను ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యను కొంతైనా తీర్చాలని భావించాడు. కేవలం వనరులను సమకూర్చడంతోనే సరిపోదనుకున్న గుర్మిత్ ముందుగా ఆ ఊరి ప్రజలకు సోలార్ శక్తిని ఉపయోగించటంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా గుర్మిత్ మాట్లాడుతూ.. సోలార్ పానెళ్ల ఆలోచన తనకు ఎప్పటి నుంచో ఉందని, వాతావరణ మార్పులపై వస్తున్న వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వాడినని తెలిపాడు. సౌర శక్తి వాడకం ఒకటే దీనికి మార్గంగా భావించానని పేర్కొన్నాడు. సహజ సిద్ధంగా లభించే వాటితో విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చని తన ఊరి వాళ్లకు తెలియదని చెప్పాడు. సొంత ఊరి నుంచి ఈ మంచి పని మొదలుపెట్టడం సంతోషంగా ఉందని, ఈ మంచి పనుల్ని మరింత ముందుకు తీసుకుపోతానని గుర్మిత్ వెల్లడించాడు. -
150 ఎపిసోడ్లతో రంగా టెలీ సీరియల్
-
పెద్దల మాటే పెళ్లిమంత్రం
ఈ ఇంట్లో రెండో అబ్బాయ్ శ్రీరామ్. ఆ ఇంట్లో రెండో అమ్మాయ్ శ్రీలక్ష్మి. ఇద్దర్నీ కలిపి ఒకటి చేసేస్తే? ఏడడుగులు నడిపిస్తే? ఈ ఇంటి పెద్దాయనకి, ఆ ఇంటి పెదనాన్నకీ... ఒకేసారి వచ్చిన ఐడియా! ఐడియా వస్తే సరిపోతుందా? పిల్లల్ని అడగాలి కదా! శ్రీరామ్‌ని అడిగారు... మీ ఇష్టం అన్నాడు. శ్రీలక్ష్మిని అడిగారు... తనదీ అదే మాట! పెళ్లయిపోయింది. పాతికేళ్లు కూడా అయిపోతున్నాయి. ఇప్పుడీ దంపతుల్ని కదిపి చూడండి... ‘‘అరేంజ్డ్ మ్యారేజ్ ఇంత కుదురుగా ఉంటుందా!!’’ అని ఇద్దరూ ఒకేమాటగా ఆశ్చర్యపోతారు. ఉమ్మడి కుటుంబంలోని కోడలిగా శ్రీలక్ష్మి... నలుగురిలో ఒక తోడల్లుడిగా శ్రీరామ్... సాగిస్తున్న కలుపుగోలు ప్రయాణమే ఈవారం ‘మనసే జతగా...’ మొన్నటి సినీ నటుడు. నిన్నటి సీరియల్ నటుడు, ప్రముఖ నిర్మాత ఏడిద నాగేశ్వరరావు రెండవ కుమారుడు ఏడిద శ్రీరామ్! ‘డిగ్రీ వరకు చదివినా, సినిమా హీరో అనిపించుకున్నా తల్లిదండ్రుల చాటు బిడ్డగానే పెరిగాను’ అంటారు శ్రీరామ్! ‘పెద్దలు కుదిర్చిన వివాహబంధంలోని ఔన్నత్యాన్ని అర్థం చేసుకున్నాం కనుకనే పాతికేళ్లుగా ఆనందంగా ఉంటున్నాం’ అంటూ హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో కాపురం ఉంటున్న శ్రీరామ్, ఆయన అర్ధాంగి శ్రీలక్ష్మి తమ వైవాహిక జీవితం ముచ్చట్లను ఇలా తెలిపారు. శ్రీరామ్: ‘స్వరకల్పన’ సినిమా చేస్తున్న సమయంలో అమ్మానాన్నలు పెళ్లి చేయాలని నిశ్చయించారు. వారు చూపించిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అలా శ్రీలక్ష్మితో నా పెళ్లి అక్టోబర్ 5, 1989 జరిగింది. అప్పటివరకు చెన్నైలోనే ఉండేవాళ్లం. వివాహవ్యవస్థ పట్ల ఉండే గౌరవం, అందులోని ఆనందం... మా అమ్మానాన్నల దాంపత్యం చూసి తెలుసుకున్నాను. మాది ఉమ్మడికుటుంబం. ఇంట్లో అందరికీ నచ్చిన, అణకువ కలిగిన అమ్మాయి నాకు తోడుంటే చాలనుకున్నాను. అలాగే నా జీవితంలోకి శ్రీలక్ష్మి అడుగుపెట్టింది. మా ఇంట అడుగుపెట్టినరోజే తనది కలుపుగోలు స్వభావమనీ, ఆనందంగా ఉండే తత్త్వమనీ అర్థమైంది. ఆ ఆనందం పాతికేళ్లుగా నాతో కలిసి ప్రయాణం చేస్తూనే ఉంది. నటుడిగా కొనసాగుతూనే సీరియల్స్ వైపు పయనించాను. ఆ తర్వాత ఇక నటనాపరంగా చాలనుకున్న సమయంలో కన్స్ట్రక్షన్ రంగం వైపు ఆసక్తి కనబరిచాను. ఏం చేసినా భార్యగా నన్ను ప్రోత్సహించడంలో తను ముందుంటుంది. జీవితభాగస్వామి అర్థం చేసుకుని ఆలంబనగా ఉండటంలోనే ఉంది అసలైన విజయం. శ్రీలక్ష్మి: మాది కాకినాడ. వ్యవసాయ కుటుంబం. అమ్మానాన్నలకు నలుగురు ఆడపిల్లలం. నేను రెండవ అమ్మాయిని. మా పెదనాన్న, మామయ్యగారు స్నేహితులు. ముందు ఈ సంబంధం గురించి పెదనాన్న చెప్పినప్పుడు ‘సినిమా రంగానికి చెందిన వ్యక్తి కదా... ఎలా ఉంటారో’ అని భయమేసి వద్దన్నాను. కాని, కుటుంబం చాలా ఉన్నతమైనదని, అబ్బాయి మంచి వాడని పెదనాన్న చెప్పారు. పెద్దవాళ్లు అంతగా చెబుతున్నారంటే నా బాగు గురించే అనుకుని ఒప్పుకున్నాను. ‘ఉమ్మడి కుటుంబంలోకి వెళ్లాలి, ఎలా నడుచుకుంటానో, ఏం తప్పుపడతారో...’ అని ఎప్పుడూ ఆలోచించలేదు. పెళ్లయ్యాక నాకు మరింత స్వేచ్ఛ లభించినట్టు అనిపించింది. అత్తవారింట్లో అడుగుపెడుతూనే, ఇదే నా ఇల్లు, ఈయనతోనే నా జీవితం అని డిసైడయ్యాను. అప్పటికి వయసురీత్యా కూడా చిన్నదాన్ని కావడంతో మా అత్తగారు నన్ను చిన్నపిల్లలా, సొంత కూతురులా చూసుకునేవారు. తోటికోడలు, అత్త, మామ... ఎక్కడా పరాయి భావన కలగలేదు. ఏ విషయమైనా అందరితో అంత బాగా పంచుకునేదాన్ని. బాధ అనేది ఎవరూ మచ్చుకైనా నా దరికి రానివ్వలేదు. పోనుపోను కుటుంబంలో నా ప్రాముఖ్యం పెరుగుతూ వచ్చింది. మావారు ఇప్పుడు సినిమా నిర్మాతగా మారాలనుకుంటున్నారు. ఏ కొత్త ప్రాజెక్ట్ చేపట్టినా నా సలహా అడుగుతారు. ఏది ఆసక్తిగా ఉంటుందో ఆ పని చేస్తే నూటికి నూరుపాళ్లు విజయం లభిస్తుందని చెబుతుంటాను. మా నాన్నగారికి నలుగురు అల్లుళ్లు. అన్నదమ్ముల్లా కలిసిపోతారు. మా నాన్నగారు ‘ఇది నా అదృష్టం’ అంటారు. శ్రీరామ్: శ్రీలక్ష్మికి మంచి అభిరుచులున్నాయి. ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఆసక్తి. పెయింటింగ్స్ వేయడమంటే ప్రేమ. నృత్యం, సంగీతం అంటే ఇష్టం. ఇవన్నీ నలుగురిలో తనని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఇంటికి కావలసిన డిజైనింగ్‌లోనే కాదు నా వర్క్‌లో కూడా సలహాలు అడిగి తెలుసుకుంటాను. శ్రీలక్ష్మి: శ్రీరామ్ బయటకు సీరియస్‌గా, అంత ఎక్కువ మాట్లాడనట్టు కనిపిస్తారు. కాని ఆయనకు సెన్సాఫ్ హ్యూమర్ ఎక్కువ. ఇంట్లో ఈయన లేకపోతే బోర్‌గా అనిపిస్తుంటుంది. మా అత్తగారు కూడా ఈయన ఇంట్లో లేకపోతే ‘రాంబాబు(శ్రీరామ్) ఎప్పుడొస్తాడు, బోర్‌గా ఉంది’ అని అడుగుతుంటారు. మాకు ఒక పాప. పేరు శ్రీజ. తను ఇప్పుడు అమెరికాలో చదువుకుంటోంది. ముగ్గురం కలిశామంటే పండగే! ఆయన పాపను గారాబంగా చూస్తుంటే, నేను మాత్రం స్ట్రిక్ట్ అనే పేరు తెచ్చుకున్నాను. ఈ విషయంలోనే అప్పుడప్పుడు దెబ్బలాడుతుంటాను. శ్రీరామ్: చిన్న చిన్న గొడవలు, మాటపట్టింపులు మా ఇద్దరి మధ్య వస్తుంటాయి. అలాగని ఏ విషయాన్నీ సాగదీయం. ఎదుటివారిని సాధిద్దామనే ఆలోచన ఉండదు. ఎప్పుడైనా నేనే కాస్త కోపం తెచ్చుకుంటాను. అప్పుడు తను కూల్‌గా ఉంటుంది. తనవైపు కరెక్ట్ అనిపించినప్పుడు నేను కూల్‌గా ఉంటాను. ఇరువైపులా కుటుంబ సభ్యులు ఎక్కువ. అందువల్ల పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పండగలు, వేడుకలూ ... అన్నీ ఎక్కువే! మా కుటుంబంలోని పిల్లలకు, పెద్దవారికి శ్రీలక్ష్మి ప్రత్యేకంగా దుస్తులు డిజైన్ చేస్తుంటుంది. శ్రీలక్ష్మి: ఆర్థిక విషయాలు నేనంతగా పట్టించుకోను. కాని, శ్రీరామ్ అవి నాకు తెలియాలనుకుంటారు. అందువల్ల ప్రతిదీ నాతో చర్చిస్తారు. ఆలూమగల మధ్య ఎటువంటి దాపరికాలూ లేకపోతేనే వారిద్దరూ ఆనందంగా ఉండగలరన్న పెద్దల సూచనను ఇద్దరం పాటిస్తాం. తన కింద పనిచేసేవారు తప్పులు చేసినా వారిని ఒక్కమాట కూడా అనరు. డౌన్ టు ఎర్త్ అనిపిస్తారు. ఆ ప్రవర్తన నాకు బాగా నచ్చుతుంది. ఎప్పుడో ఈయన దగ్గర పనిచేసిన వారు కూడా ఇప్పటికీ ఈయనను కలిసి వెళుతుంటారు. ఈయన దేనికీ టెన్షన్ పడరు. నేనే కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాను. వాటిని వెంటనే అమల్లో పెట్టవచ్చు కదా! అని అడుగుతుంటాను. అప్పటికి సరే అంటారు. కాని ఆచితూచి నిర్ణయం తీసుకోవడం అవసరమని చెబుతుంటారు. అలాగే పనులు కూడా చేస్తారు. ఇది ముందు నచ్చకపోయినా, ఫలితం చూశాక సబబే అనిపిస్తుంది. ‘భార్యాభర్తలిద్దరూ కుటుంబాన్ని సంతోషంగా ఉంచడానికి నిరంతరం ప్రయత్నించాలి. అహానికి ఏమాత్రం చోటివ్వకూడదు. ఏదైనా విషయం వస్తే.. ఇద్దరూ సర్దుబాట్లు చేసుకోవాలి. సాధించాలనే ధోరణి ఇద్దరిలోనూ ఉండకుండా జాగ్రత్తపడితేనే ఆ ఇల్లు ఆనందనిలయంగా మారుతుంది’ అని ఈ జంట పాతికేళ్ల వివాహబంధం విజయంలోని అసలు కిటుకులను వివరించారు. - నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి మా ఇంట అడుగుపెట్టినరోజే తనది కలుపుగోలు స్వభావమనీ, ఆనందంగా ఉండే తత్త్వమనీ అర్థమైంది. ఆ ఆనందంపాతికేళ్లుగా నాతో కలిసి ప్రయాణం చేస్తూనే ఉంది. - శ్రీరామ్ పెళ్లయ్యాక నాకు మరింత స్వేచ్ఛ లభించినట్టు అనిపించింది. అత్తవారింట్లో అడుగుపెడుతూనే, ఇదే నా ఇల్లు, ఈయనతో నేనా జీవితం అని డిసైడయ్యాను. - శ్రీలక్ష్మి