
ప్రముఖ తమిళ నటుడు లోకేశ్ రాజేంద్రన్(34) ఆత్మహత్య చేసుకున్నారు. అక్టోబర్ 2న చెన్నైలోని ఓ బస్టాండ్‌లో అపస్మారక స్థితిలో కనిపించారు. వెంటనే స్థానికులు అతడిని దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
కాగా తమిళ సీరియల్ మర్మదేశంలో బాలనటుడిగా అలరించిన లోకేశ్ రాజేంద్రన్ 150కిపైగా సీరియల్స్, 15 సినిమాల్లో నటించారు. గత కొంత కాలంగా ఆయన కుటుంబ కలహాలతో సతమతమవుతున్నట్లు లోకేశ్ తండ్రి మీడియాకు వెల్లడించారు. నాలుగు రోజుల క్రితమే లోకేశ్‌కు అతడి భార్య నుంచి విడాకుల నోటీసులు వచ్చాయని, ఈ కారణంగానే అతడు డిప్రెషన్‌లోకి వెళ్లి ఉండవచ్చని పేర్కొన్నారు. తన కొడుకును చివరిసారిగా శుక్రవారం చూశానని తెలిపారు. తనకి కొంత డబ్బు కావాలని అడిగితే ఇచ్చానని, అంతలోనే ఈ ఘోరం జరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు లోకేశ్ తండ్రి. కాగా లోకేశ్‌కు ఒక భార్య, ఇద్దరు పిల్లలు సంతానం.
చదవండి: ఆదిపురుష్‌పై అయ్యవారి ఆగ్రహం
ఖరీదైన కారు కొన్న షణ్ముఖ్ జశ్వంత్
Comments
Please login to add a commentAdd a comment