సీరియ‌ల్‌ హీరోయిన్‌తో పెళ్లి.. విడాకులిచ్చిన విల‌న్‌ | Varada Shared Post After Divorce With Jishin Mohan, Says Can Not Cry For Anything! Life Is Too Short - Sakshi
Sakshi News home page

Varada-Jishin Mohan Divorce: 'విడాకులిచ్చేశా.. బిజీగా ఉన్నాను కాబ‌ట్టి లైట్‌..', జీవితం చాలా చిన్న‌ది..

Published Thu, Feb 22 2024 2:17 PM | Last Updated on Thu, Feb 22 2024 3:49 PM

Can not Cry for Anything! Life is too short; Varada About Divorce Jishin Mohan - Sakshi

ప్రేమ‌-పెళ్లి-విడాకులు స‌ర్వ‌సాధార‌ణ‌మైపోయాయి. జీవిత‌కాలం ప్రేమించ‌డం, క‌లిసుండ‌టం క‌ష్ట‌మే అని చేతులెత్తేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలోకి మ‌ల‌యాళ సెల‌బ్రిటీ జంట జిషిన్ మోహ‌న్‌- వ‌ర‌ద వ‌చ్చి చేరింది. వీరు విడాకులు తీసుకున్నారంటూ కొంత‌కాలంగా మాలీవుడ్‌లో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఇది నిజ‌మేన‌ని ధ్రువీక‌రించాడు జిషిన్‌. తాము విడిపోయామ‌ని వెల్ల‌డించాడు. విడాకులు తీసుకున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

అంత టైం లేదు
తాను ఓ సీరియ‌ల్ న‌టిని పెళ్లాడిన‌ట్లు వ‌స్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేద‌న్నాడు. దేవుడి ద‌య వ‌ల్ల సీరియ‌ల్స్‌తో బిజీగా ఉన్నాను. వ్య‌క్తిగ‌త జీవితం గురించి ఆలోచించేంత స‌మ‌యం లేదు అని చెప్పుకొచ్చాడు. రీల్ లైఫ్‌లో హీరోయిన్‌- విల‌న్‌గా ఉన్న వీరు రియ‌ల్ లైఫ్‌లో మాత్ం జోడీ క‌ట్టార‌ని సంతోషించేలోపే ఇలా జరిగిందేంట‌ని అభిమానులు విచారం వ్య‌క్తం చేస్తున్నారు.

ఏడుస్తూ ఉండ‌న‌క్క‌ర్లే!
తాజాగా వర‌ద సోష‌ల్ మీడియాలో ఇలా పోస్ట్ పెట్టింది. 'నిన్న న‌వ్వాను, ఈ రోజు న‌వ్వుతూనే ఉన్నాను. రేపు కూడా న‌వ్వులు చిందిస్తూనే ఉంటాను. జీవితం చాలా చిన్న‌ది. ఏడుస్తూ గ‌డ‌పడం కాదు జీవిత‌మంటే..!' అని రాసుకొచ్చింది. ఇది చూసిన జ‌నాలు.. మీ ఇద్ద‌రి మ‌ధ్య ఏమైంది? ఎందుక‌ని విడిపోయారంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా అమ‌ల అనే సీరియ‌ల్‌లో వర‌ద హీరోయిన్‌గా, జిషిన్ విల‌న్‌గా న‌టించాడు. ఆ ధారావాహిక చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే వీరి మ‌ధ్య ప్రేమ చిగురించింది. 2014లో పెళ్లి చేసుకున్నారు. ఆ ప్రేమ‌కు గుర్తుగా ఓ బాబు కూడా పుట్టాడు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ దంప‌తులు విడాకులు తీసుకోవ‌డం అందరినీ విస్మ‌యానికి గురి చేసింది.

చ‌ద‌వండి: క‌థ విన‌లేదు, జోక్యం చేసుకోలేదు.. ఫ్రెండ్ కోసం ఫ్రీగా.. అదీ అత‌డి గొప్ప‌త‌నం!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement