Serial Actor Amardeep Clarity About Telugu Bigg Boss 7 Entry - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Reality Show: బిగ్‌బాస్‌ 7లోకి బుల్లితెర హీరో అమర్‌దీప్‌.. క్లారిటీ ఇచ్చిన నటుడు

Published Wed, Mar 29 2023 9:49 AM | Last Updated on Wed, Mar 29 2023 11:02 AM

Serial Actor Amardeep Clarifies on Rumours on Bigg Boss 7 Offer - Sakshi

అప్పుడే బిగ్‌బాస్‌ 7 సీజన్‌పై బజ్‌ మొదలైంది. ఈ సారి పలువురు స్టార్స్‌ హౌజ్‌లో సందడి చేయనున్నారంటూ కొద్ది రోజులుగా సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్‌ రియాలిటీ షో అన్ని భాషల్లో ఎంతో ఆదరణ పొందింది. తెలుగులోనూ ఈ షో బాగా పాపులర్‌ అయ్యింది. ఇప్పటికే 6 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్‌ 7వ సీజన్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన రకరకాలుగా పుకార్లు పుట్టుకొస్తున్నాయి.

చదవండి: అమెరికాలో లయ శాలరీ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే..

ప్రముఖ స్టార్స్‌ ఈ సీజన్‌లో సందడి చేయనున్నారంటూ ఇప్పటికే యాంకర్‌ రష్మీ గౌతమ్‌, సుడిగాలి సుధీర్‌, యాంకర్‌ ప్రదీప్‌తో పేర్లు వినిపించాయి. తాజాగా మరో స్టార్‌ నటుడి పేరు తెరపైకి వచ్చింది. బుల్లితెర సీరియల్‌ ‘జానకీ కలగనలేదు’ హీరో అమర్‌ దీప్‌ ఈ సీజన్‌కు గానూ బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌గా రానున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. బుల్లితెర హీరోగా ఎంతోమంది ప్రేక్షక్ష అభిమానులను సొంతం చేసుకున్న అమర్‌ దీప్‌ను బిగ్‌బాస్‌లోకి తీసుకువచ్చేందుకు నిర్వహకులు ప్లాన్‌ చేస్తున్నాయి.

చదవండి: NTR30 కోసం రంగంలోకి ప్రముఖ హాలీవుడ్‌ టెక్నిషియన్‌

అయితే తాజాగా అమర్ దీప్‌ బిగ్‌బాస్‌ ఆఫర్‌పై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అమర్‌ దీప్‌ మాట్లాడుతూ.. ‘నాకు బిగ్‌బాస్‌ 7 ఆఫర్‌ వచ్చిందనే వార్తలు నేను కూడా చూశాను. కానీ అది నా చేతుల్లో లేదు. అది మా చానల్‌(స్టార్‌ మా) ఇష్టం. ప్రస్తుతం నేను సీరియల్‌తో బిజీగా ఉన్న. మరి మా చానల్‌ నన్ను బిగ్‌బాస్‌కు పంపిస్తుందో?లేదో? చూడాలి. నేను బిగ్‌బాస్‌ వెళ్లడమనేది వారి నిర్ణయం మీదే ఆధారపడి ఉంది’ అంటూ స్పష్టం చేశాడు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement