Amar
-
అమర్ రచన "మూడు దారులు" పై.. కల్లూరి భాస్కరం సమీక్ష!
సహచర పాత్రికేయ మిత్రుడు దేవులపల్లి అమర్ తన నాలుగున్నర దశాబ్దాల అనుభవసారం రంగరించి రచించిన ‘మూడు దారులు - రాజకీయ రణరంగాన భిన్న ధృవాలు’ అనే ఈ పుస్తకంలో మొత్తం 15 అధ్యాయాలు ఉన్నాయి. ‘రాజకీయాలు-ఒక సమాలోచన’ అనే అధ్యాయంతో మొదలయ్యే ఈ రచనలో అమర్ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి ముందు-మొదట ఆంధ్రరాష్ట్రాన్ని, ఆ తర్వాత అవిభక్త ఆంధ్రప్రదేశ్‌ను - ఏకచ్చత్రంగా ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వాల గురించి, కాంగ్రెస్ ముఠాకలహాల గురించి, ఒకరినొకరు పడదోసుకుంటూ సాగించిన రాజకీయక్రీడ గురించి, తెలంగాణ ఉద్యమం గురించి వివరించి ఈ తొలి అధ్యాయం ద్వారా ఈ పుస్తకానికి ఒక చారిత్రక ప్రతిపత్తిని సంతరించారు. ఈ పుస్తకంలోని మొదటి అధ్యాయాన్ని ‘చరిత్రను తిరగ తోడటం దేనికి?’ అనే ప్రశ్నతో అమర్ ప్రారంభిస్తారు. ‘చరిత్ర పుటలను ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తూ వర్తమానంలోకి రాలేమా, రావచ్చు కానీ గతాన్ని నిశితంగా పరికించినప్పుడు మాత్రమే వర్తమానాన్ని బేరీజు వేయగలం. అంతేకాదు వర్తమానంలో చోటు చేసుకుంటున్న మార్పులను, జరుగుతున్న సంఘటనలను నిష్పాక్షిక దృష్టితో చూసే వీలు కలుగుతుంది’ అంటూ ప్రారంభంలోనే ఈ పుస్తకంలోని థీమ్‌కి ఒక డెప్త్ తీసుకువచ్చారు, దీనిని చరిత్రగా చూపించారు. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి ఒకే కాలంలో రాజకీయరంగ ప్రవేశం చేయడం, భిన్నమైన దారుల్లో వెళ్లడం, ఆ తరువాత జగన్మోహన్ రెడ్డి ప్రవేశం ఇవన్నీ ఈ పుస్తకంలో రచయిత చర్చించారు. ఈ విషయాల్లో ఎక్కడా రచయిత బేసిక్ ఫ్యాక్ట్స్‌తో కాంప్రమైజ్ కాలేదు. బేసిక్ ఫ్యాక్ట్స్‌పై, పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలపై ఇంకొంచెం స్పష్టత ఇవ్వడానికి ప్రయత్నం చేశారు తప్ప ఫ్యాక్ట్స్‌ను డిస్టార్ట్ చేయడం గానీ, కప్పిపుచ్చడం గానీ చేయలేదని ఈ పుస్తకం చదివినప్పుడు నాకు అర్థమైంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఈ ముగ్గురు నాయకులూ, వారు అనుసరించిన దారుల గురించి ప్రధానంగా చర్చించిన పుస్తకం ఇది. ఈ పుస్తకంలో వైస్రాయి ఘట్టం చదువుతున్నప్పుడు నాకు ఒక సినిమా చూస్తున్నట్టు అనిపించింది. నిజంగా ఒక సినిమాకు సబ్జెక్టు అది. అమర్ ఈ పుస్తకంలో బేసిక్ ఫ్యాక్ట్స్‌తో కాంప్రమైజ్ అవలేదనడానికి ఇంకో ఉదాహరణ ఏం చెబుతానంటే, వైస్రాయ్‌తో ముడిపడిన ఈ మొత్తం ఉదంతంలో ఎన్టీఆర్ స్వయంకృతం కూడా చాలా ఉంది. రాజకీయంగా అనుభవం లేకపోవడం, చెప్పినా వినకపోవడం, మొండితనం వంటివి కూడా దీనికి కొంత దోహదం చేశాయి. ఆ సంగతినీ అమర్ ప్రస్తావించారు. ఆవిధంగా రెండువైపులా ఏం జరిగిందో చిత్రించారు. అలాగే లక్ష్మీపార్వతి జోక్యాన్నీ ఆయన దాచలేదు. ఆ తరువాత మీడియా! ఇందులో ఎన్టీఆర్ వ్యక్తిగత వ్యవహార శైలి, అల్లుళ్లతో సహా ఆయన కుటుంబ సభ్యుల పాత్ర, ఆయన అర్ధాంగి పాత్ర.. వీటన్నిటితో పాటు మీడియా కూడా ప్రధాన పాత్రధారి. ఎన్టీఆర్ అధికారచ్యుతికి సంబంధించిన మొత్తం ఉదంతంలో మీడియా పాత్ర గురించి, మీడియా వ్యవహారశైలి గురించి ప్రత్యేకంగా ఒక పుస్తకం రావాలని! ప్రీ-తెలుగుదేశం, పోస్ట్-తెలుగుదేశం అనే డివిజన్‌తో తెలుగు మీడియా చరిత్ర రాయాలని నేనంటాను. నాదెండ్ల భాస్కరరావు చేసిన దానికి చంద్రబాబు చేసినది ఒకవిధంగా పొడిగింపే. మొత్తం మీద అమర్ ఈ పుస్తకంలో పబ్లిక్ డొమైన్లో ఉన్న విషయాలనే అందించారు. ప్రత్యక్షసాక్షిగా తన దృక్కోణాన్ని కలుపుకుంటూ వాటిని కథనం చేశారు. చివరిగా జగన్ మోహన్ రెడ్డిగారి విషయానికి వచ్చేసరికి ముఖ్యమంత్రిగా ఆయన వ్యవహార శైలి, ఆయన ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన సంక్షేమ పథకాలు, ఇతరత్రా చర్యలు, విధానాల గురించి చెప్పారు. ఈ అధ్యాయంలో కూడా అమర్ ఫ్యాక్ట్స్‌తో రాజీపడలేదనే విశ్వసిస్తున్నాను. (ఫిబ్రవరి ఒకటవ తేదీన హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో దేవులపల్లి అమర్ రాసిన మూడు దారులు పుస్తక పరిచయ సభలో పాత్రికేయ ప్రముఖులు, రచయిత కల్లూరి భాస్కరం చేసిన సమీక్ష నుంచి ముఖ్య భాగాలు). ఇవి చదవండి: Lok Sabha polls 2024: సోషల్ మీడియా... నయా యుద్ధరంగం -
న్యూఢిల్లీ : అమర్ దేవులపల్లి పుస్తకం ఆవిష్కరణ
న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్టు దేవులపల్లి అమర్ రచించిన "ది డెక్కన్ పవర్ ప్లే The Deccan Power Play" పుస్తకాన్ని ప్రధాని మీడియా మాజీ సలహాదారు సంజయ్ బారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ వెంకట నారాయణ, ఆలిండియా కెమెరామన్ అసోసియేషన్ అధ్యక్షుడు సిన్హా, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు లహరి తదితరులు హాజరయ్యారు. పుస్తక ఆవిష్కరణ సందర్భంగా అతిథులు పలు కీలక అంశాలను పంచుకున్నారు. సంజయ్ బారు, ప్రధాని మీడియా మాజీ సలహాదారు జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాధాన్యం తగ్గుతోంది విభజన వల్ల రాజకీయంగా కేంద్రంలో తెలుగు బలం తగ్గింది రాజకీయాలు భాష కాకుండా, కులం ఆధారంగా మారిపోతున్నాయి రాష్ట్ర విభజన జరిగిన తర్వాతా... రెండు రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి కొనసాగడం శుభపరిణామం పాలసీల కొనసాగింపు వల్ల మంచి అభివృద్ధి జరిగింది డెక్కన్ ప్రాంతం ఈ దేశానికి గ్రోత్ ఇంజన్ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలు ఈ దేశ అభివృద్ధికి గ్రోత్ ఇంజన్‌లా పని చేస్తున్నాయి 50 శాతం జనాభా హిందీ రాష్ట్రాలలో ఉంటే, దక్షిణాది రాష్ట్రాలు 50% జిడిపి దేశానికి అందిస్తున్నాయి అమర్, రచయిత తెలుగు రాజకీయాలపై ఢిల్లీలో అపోహలు, పొరపాటు అభిప్రాయాలు ఉన్నాయి ఢిల్లీ మీడియా దక్షిణ రాజకీయాలను సరైన రీతిలో పట్టించుకోలేదు ఢిల్లీ మీడియా తప్పుడు అభిప్రాయాలను సరిచేసేందుకే ఈ పుస్తకం తీసుకొచ్చాం అందుకే దక్షిణాది రాజకీయాల అంశాన్ని ఎంచుకుని పుస్తకం రాశాను 47 ఏళ్ల జర్నలిస్ట్ జీవితంలో అనేక అనుభవాలను ఈ పుస్తకంలో ప్రస్తావించాను వెంకట్ నారాయణ, సీనియర్ జర్నలిస్ట్ దక్కన్ రాజకీయాలపై వచ్చిన మంచి పుస్తకం ఇది దక్షిణ భారతం నుంచి రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అవుతారని భావిస్తున్నాను పుస్తకంలో దేవులపల్లి అమర్ ఏ అంశాలు చర్చించారంటే.. తెలుగు రాజకీయాల్లో ముగ్గురు నాయకులు బహుశా ఎప్పటికీ గుర్తుండిపోతారేమో. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అలాగే 14 ఏళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ప్రజాసేవలో భిన్నమైన దారులు ఎంచుకుని, తెలుగునాట రాజకీయాలపై తమదైన ముద్ర వేసిన నేతలు వీరు. ఈ ముగ్గురూ రాజకీయాల్లో ఎంచుకున్న దారుల గురించి, అనుసరించిన పద్ధతుల గురించీ విశ్లేషిస్తుందీ పుస్తకం. 40 ఏళ్ళపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తమదైన ముద్ర వేసిన ఈ నాయకులను అతి దగ్గరగా చూసిన దేవులపల్లి అమర్, తన అనుభవాన్నంతా మేళవించి రాసిన ‘మూడు దారులు’, నాయకుల రాజకీయ క్రీడలను, అధికారం కోసం వెన్నుపోట్లకు సైతం వెనుకాడని వారి తెగింపును కళ్ళకు కడుతుంది. పుస్తకం అద్యంతం ఆసక్తికరం ముఖ్యంగా చంద్రబాబు చేసిన ‘వైస్రాయ్ కుట్ర’ పాఠకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీని రెండవ సారి చీల్చి కాంగ్రెస్ (ఐ) అనే కొత్త రాజకీయ పార్టీని 1978 లో ఇందిరాగాంధీ ఏర్పాటు చేయడం మొదలుకుని 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వరకూ అనేక పరిణామాలను, అందుకు కారణమైన నేతల వైఖరిని విపులంగా చర్చించింది ఈ పుస్తకం. గడచిన నలభయ్యేళ్లలో సంయుక్త ఆంధ్రప్రదేశ్ ను పాలించిన మర్రి చెన్నారెడ్డి మొదలుకుని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకూ 11 మంది ముఖ్యమంత్రులతోపాటు ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చోటు చేసుకున్న సంఘటనలపై రచన విశ్లేషణాత్మకంగా సాగింది. పుస్తకం చదువుతున్నంతసేపూ రాజకీయ వేదికపై ఉత్కంఠభరితమైన తెలుగు సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది. -
శివాజీని చేతులెత్తి వేడుకున్న అమర్దీప్.. ఎందుకంటే?
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం సీజన్-7 12వ వారానికి చేరుకుంది. గతవారం ఎవరినీ ఎలిమినేట్ చేయని బిగ్‌బాస్.. ఈ వారంలో ఏకంగా డబుల్ ఎలిమినేషన్ ఉండొచ్చని హింట్ ఇచ్చాడు. మరీ ఈ వారంలో ఎవరు బయటకు రానున్నారో తెలియాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే. అయితే ఈలోగా సేఫ్ అయ్యేందుకు ఉన్న అవకాశాల కోసం కంటెస్టెంట్స్ పోటీ పడుతున్నారు. తాజా ఎపిసోడ్లో కెప్టెన్ కంటెండర్ పోటీని బిగ్ బాస్ నిర్వహించారు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. (ఇది చదవండి: స్టార్ హీరో వారసుడు తెరంగేట్రం.. డైరెక్టర్‌గా ఎవరంటే?) ప్రోమో చూస్తే అయితే ఈ పోటీలో చివరికీ అమర్, అర్జున్ మాత్రమే ఫైనల్‌గా కెప్టెన్ పోటీలో నిలిచినట్లు తెలుస్తోంది. గతవారంలో తృటిలో కెప్టెన్సీ కోల్పోయిన అమర్దీప్ బోరున ఏడ్చేసిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే తరహాలో హౌస్‌లో హంగామా చేశాడు. అమర్, అర్జున్ విషయంలో శివాజీ, శోభాశెట్టి తన అభిప్రాయాలు బిగ్‌బాస్‌కు వెల్లడించారు. కెప్టెన్సీ పోటీలో అర్జున్‌కు వ్యతిరేకంగా శోభాశెట్టి తన నిర్ణయాన్ని వెల్లడించింది. కెప్టెన్ అయ్యేందుకు నీకెంత అర్హత ఉందో.. అమర్‌కు అంతే ఉందని చెప్పింది. ఆ తర్వాత శివాజీ కెప్టెన్సీ పోటీలో అర్జున్‌కు మద్దతుగా నిలిచారు. దీంతో అమర్దీప్, శివాజీని బతిమాలాడారు. ప్లీజ్ అన్న.. అర్థం చేసుకో.. ఇప్పుడు అవకాశం వచ్చింది.. పోగోట్టకన్నా.. నీకు దండం పెడతా అంటూ రెండు చేతులతో మొక్కాడు. నువ్వు కెప్టెన్ అవ్వడం కోసం ఏడుస్తున్నావేంట్రా? అని శివాజీ అన్నాడు. నేను కెప్టెన్ అవ్వాలన్నా అంటూ శివాజీని వేడుకుంటూ కన్నీటి పర్యంతమయ్యాడు అమర్. కానీ చివరికీ నేను దేనికి పనికిరాను అంటూ అమర్ ఎమోషనలయ్యాడు. ఆ తర్వాత అమర్ ఫోటో మంటల్లో కాలిపోతూ ఉండగా ప్రోమో ముగిసింది. మరీ ఈ వారం కెప్టెన్సీ ఎవరినీ వరించిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. (ఇది చదవండి: ముసలి వెంట్రుక ఎంతపని చేసింది? వంకరబుద్ధి పోనిచ్చుకోని శివాజీ!) -
జనశక్తి నేతలు రాజన్న, అమర్ విడుదల
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్‌తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. రెండు రోజుల విచారణ అనంతరం విడుదల చేశారు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం గాజువాక సమీపంలోని ఓ బత్తాయి తోటలో ఆల్ ఇండియా కిసాన్ సంయుక్త మోర్చా రెండు రోజుల సమావేశం నిర్వహిస్తుండగా గురువారం మధ్యాహ్నం అందించిన సమాచారం మేరకు పోలీసులు రెక్కీ నిర్వహించి అరెస్ట్ చేశారు. సుమారు 3గంటల పాటు ఆ తోటలోనే విచారించారు. అనంతరం జిల్లా పోలీసు అధికారుల సూచన మేరకు జిల్లా కేంద్రంలోని డీటీఎస్కు తరలించారు. శుక్రవారం జిల్లా పోలీసు అధికారుల ముందు ప్రవేశపెట్టారు. అరెస్ట్ అయిన వారిలో కూర రాజన్న, అమర్‌తో పాటు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు రైతు నాయకులు ఉన్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా జరగబోయే రైతు ఉద్యమాల గురించి చర్చించేందుకు రెండు రోజులపాటు ఇక్కడ సమావేశాలు పెట్టుకున్నట్లు చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న తరువాత వీరి వద్ద ఉన్న బ్యాగులను క్షుణ్ణంగా పోలీసులు పరిశీలించగా ఎలాంటి ఆయుధాలు లభించలేదని తెలిసింది. అమర్‌కు సంబంధించిన బ్యాగులో ఒక లేఖ లభ్యమైనట్లు సమాచారం. సమావేశాలు ఎందుకు పెట్టుకున్నారు.. భవిష్యత్తులో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు చేయబోతున్నారా.. రాబోయే ఎన్నికల సందర్భంగా ఏదైనా కుట్ర పన్నారా అనే అంశాలపై విచారించినట్లు తెలిసింది. శుక్రవారం సాయంత్రం వారిని పోలీసులు వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. అన్యాయంగా అరెస్టు చేశారు: రాజన్న, అమర్ దేశ వ్యాప్తంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు సమావేశం పెట్టుకుంటే పోలీసులు తమను అన్యాయంగా అరెస్ట్ చేశారని జనశక్తి నేతలు కూర రాజన్న, అమర్ ఆరోపించారు. పోలీసుల వేధింపులు ఇటీవల ఎక్కువయ్యాయని విమర్శించారు. శుక్రవారం వారు తమను కలిసిన విలేకరులతో మాట్లాడారు. వరంగల్ జిల్లాలో ముంపు బాధితులను పరామర్శించేందుకు వెళ్తే అక్కడ పోలీసులు ఇబ్బందులు పెట్టారని, ఖమ్మంలో జిల్లాలో కూడా పోలీసులు అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని చెప్పారు. తమ సంఘం నిషే«ధితం కాదని, అలాంటప్పుడు తమను ఎందుకు ఇబ్బందులు గురిచేస్తున్నారో పోలీసులకే తెలియాలన్నారు. -
ప్లాన్ ప్రకారమే అమర్ హత్య: బాపట్ల ఎస్పీ
సాక్షి, బాపట్ల: చెరుకుపల్లి మండల పరిధిలో దారుణ హత్యకు గురైన పదో తరగతి స్టూడెంట్ అమర్నాథ్ ఉదంతంపై బాపట్ల ఎంపీ వకుల్ జిందాల్ స్పందించారు. ఈ హత్య ప్లాన్ ప్రకారమే జరిగిందని.. కేసుకు సంబంధించి పలు వివరాలను తెలియజేశారాయన. అమర్నాథ్ హత్య వెనుక రాజకీయ కారణాలు లేవు. ప్లాన్ ప్రకారం అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. అమర్ సోదరికి ఫోన్స్, మెసేజ్ చేసి వెంకటేశ్వరరెడ్డి వేధిస్తున్నాడు. ఆ విషయం ఇంట్లో చెప్పడంతో.. అమర్ పై వెంకటేశ్వరరెడ్డి కోపం పెంచుకున్నాడు. నిందితుడు వెంకటేశ్వరరెడ్డికి హత్యలో గోపిరెడ్డి, వీరబాబు, సాంబిరెడ్డి సహకరించారు అని తెలిపారు. ఈ కేసులో వెంకటేశ్వరరెడ్డి సహా ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. సాంబిరెడ్డి పరారీలో ఉన్నాడని.. అతని పట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్లు వివరించారాయన. ఇదీ చదవండి: అమర్ కుటుంబానికి న్యాయం చేసి తీరతాం -
బిగ్‌బాస్ 7లోకి బుల్లితెర హీరో అమర్దీప్.. క్లారిటీ ఇచ్చిన నటుడు
అప్పుడే బిగ్‌బాస్ 7 సీజన్‌పై బజ్ మొదలైంది. ఈ సారి పలువురు స్టార్స్ హౌజ్‌లో సందడి చేయనున్నారంటూ కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. బిగ్‌బాస్ రియాలిటీ షో అన్ని భాషల్లో ఎంతో ఆదరణ పొందింది. తెలుగులోనూ ఈ షో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పటికే 6 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ 7వ సీజన్‌కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన రకరకాలుగా పుకార్లు పుట్టుకొస్తున్నాయి. చదవండి: అమెరికాలో లయ శాలరీ ఎంతో తెలిస్తే షాకవ్వాల్సిందే.. ప్రముఖ స్టార్స్ ఈ సీజన్లో సందడి చేయనున్నారంటూ ఇప్పటికే యాంకర్ రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్, యాంకర్ ప్రదీప్‌తో పేర్లు వినిపించాయి. తాజాగా మరో స్టార్ నటుడి పేరు తెరపైకి వచ్చింది. బుల్లితెర సీరియల్ ‘జానకీ కలగనలేదు’ హీరో అమర్ దీప్ ఈ సీజన్‌కు గానూ బిగ్‌బాస్ కంటెస్టెంట్‌గా రానున్నాడంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. బుల్లితెర హీరోగా ఎంతోమంది ప్రేక్షక్ష అభిమానులను సొంతం చేసుకున్న అమర్ దీప్‌ను బిగ్‌బాస్‌లోకి తీసుకువచ్చేందుకు నిర్వహకులు ప్లాన్ చేస్తున్నాయి. చదవండి: NTR30 కోసం రంగంలోకి ప్రముఖ హాలీవుడ్ టెక్నిషియన్ అయితే తాజాగా అమర్ దీప్ బిగ్‌బాస్ ఆఫర్‌పై క్లారిటీ ఇచ్చాడు. తాజాగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో అమర్ దీప్ మాట్లాడుతూ.. ‘నాకు బిగ్‌బాస్ 7 ఆఫర్ వచ్చిందనే వార్తలు నేను కూడా చూశాను. కానీ అది నా చేతుల్లో లేదు. అది మా చానల్(స్టార్ మా) ఇష్టం. ప్రస్తుతం నేను సీరియల్‌తో బిజీగా ఉన్న. మరి మా చానల్ నన్ను బిగ్‌బాస్‌కు పంపిస్తుందో?లేదో? చూడాలి. నేను బిగ్‌బాస్ వెళ్లడమనేది వారి నిర్ణయం మీదే ఆధారపడి ఉంది’ అంటూ స్పష్టం చేశాడు. -
ఇప్ప నారాయణరెడ్డి.. స్మృతివనంలో త్యాగధనుడు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగువేల లోపు జనాభా కలిగిన ఒక చిన్న ఊరి పేరు దుమాల. 21 మంది రక్త తర్పణలతో అమరుల స్మృతి వనంగా ఈ ఊరు ప్రాధాన్యత సంతరించుకుంది. సరిగ్గా నేటికి 50 సంవత్సరాల క్రితం ‘శ్రీ వేంకటేశ్వర యువజన సంఘం’ స్థాపించి, దుమాలలో నూతన చైతన్యానికి అంకురార్పణ చేసిన ఇప్ప నారాయణరెడ్డి, ఆయన మిత్ర బృందం రైతుకూలీ సంఘం నిర్మాణం ద్వారా విప్లవోద్యమానికి కూడా నాంది పలికారు. మధ్యయుగాల నాటి భూస్వామ్య దోపిడీనీ, దానిపై ప్రజల పోరాటాన్నీ అర్థం చేసుకోవడానికి దుమాల గ్రామం అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. పంచాయితీ వ్యవస్థ అమల్లోకి వచ్చే ముందూ... వచ్చిన తర్వాత కూడా దుమాలలో దొర, మాలి పటేల్, పోలీస్ పటేల్, పట్వారి వ్యవస్థలు కొనసాగిన రోజుల్లో... లక్ష్మయ్య దొర.. దొరగా, కిష్టయ్య దొర మాలిపటేల్గా, నాంపల్లి దొర పోలీస్ పటేల్‌గా, నారాయణ పంతులు పట్వారీగా– దాదాపు 300 ఎకరాల భూములకు యజమానులుగా ఉండేవారు. వీరి దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారు. 1978లో ప్రభుత్వం కల్లోలిత ప్రాంతంగా ఈ ఏరియాను ప్రకటించి భూస్వాములకు అండగా నిలిచింది. దీంతో ప్రజాపోరాటం ఎగసిపడింది. 1989 ఫిబ్రవరి 23న దుమాలకు చెందిన కానవరపు చంద్రయ్యను బెజ్జంకి దగ్గర బూటకపు ఎన్కౌంటర్ చేయడంతో హింసాకాండ రూపమే మారిపోయింది. 2001 వరకు 22 సంవత్సరాలు నిరాఘాటంగా సాగిన ఈ హత్యాకాండలో 21 మంది ఈ గ్రామానికి చెందినవారు మరణించారు. శ్రీ వెంకటేశ్వర యువజన సంఘం ప్రాథమిక పాఠశాలకు తరగతి గదులు కట్టించింది. హైస్కూల్‌కు విశాల స్థలం ఇచ్చింది. రూ. 5 లక్షలతో తరగతి గదులు పెంచడానికి జనశక్తి పార్టీ స్వయంగా పూనుకుంది. మేక పుల్లరి, వెట్టి గొర్లు, వెట్టి నాగళ్ళు, జీతాల వ్యవస్థ అంతమైపోవడానికి పార్టీ కారణమైంది. అన్నింటికీ మించి ఉత్పత్తి శక్తులకు దొరికిన స్వేచ్ఛ ప్రజల జీవితాల్లో కొత్త మార్పునకు నాంది పలికింది. – అమర్, జనశక్తి (జూలై 29న ఇప్ప నారాయణరెడ్డి ప్రథమ వర్ధంతి) -
కోయిలమ్మ నటుడు అమర్ అరెస్ట్
కోయిలమ్మ సీరియల్ హీరో అమర్‌ను రాయదుర్గం పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల బోటిక్ నిర్వహణ విషయంలో స్నేహితురాళ్ల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో జరిగిన గొడవలో అమర్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషనులో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాయదుర్గం పోలీసులు అమర్‌ను బుధవారం అరెస్టు చేశారు. కూకట్పల్లి కోర్టు అతనికి రిమాండ్ విధించడంతో అమర్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ కేసుపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేపడుతున్నారు. కాగా శ్రీ విద్య, స్వాతి, లక్ష్మి ఈ ముగ్గురూ కలిసి మణికొండలో బౌటిక్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు రావడం వల్ల స్వాతి బౌటిక్ వ్యాపారం నుంచి తప్పుకుంది. అయితే తనకు రావాల్సిన కుట్టు మెషిన్, డబ్బుల విషయంలో పార్టనర్స్ ముగ్గురి మధ్య గొడవలు జరుగుతున్నాయి. స్వాతికి రావాల్సిన బకాయిలు శ్రీవిద్య ఇవ్వకపోవడంతోఇటీవల స్వాతి తన భాయ్‌ఫ్రెండ్ కోయిలమ్మ సీరియల్ నటుడు అమర్‌తో కలిసి శ్రీ విద్య ఇంటికి వెళ్లి నిలదీశారు. మాటా మాటా పెరిగి గొడవకు దారి తీయడంతో ఈ వివాదం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. దాంతో సమీర్ తాగిన మత్తులో అసభ్య పదజాలంతో తనను దూషించాడని శ్రీవిద్య రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే అమర్, స్వాతిలు కూడా కౌంటర్ కేసు పెట్టారు. ఇరువురి ఫిర్యాదులపై కేసులు నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. చదవండి: ఆ రోజు నేను తాగి వెళ్లలేదు: అమర్ -
ఆ రోజు నేను తాగి వెళ్లలేదు: అమర్
సాక్షి, హైదరాబాద్: ఉద్దేశపూర్వకంగానే తనపై తప్పుడు కేసు నమోదు చేశారని ‘కోయిలమ్మ’ సీరియల్ నటుడు అమర్ అలియాస్ సమీర్ ఆవేదన వ్యక్తం చేశాడు. తన గురించి ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి రెచ్చగొట్టిన వాళ్లపై తాను కూడా తిరిగి పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నాడు. కాగా బోటిక్ నిర్వహణ విషయంలో స్నేహితురాళ్ల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో జరిగిన గొడవలో, అమర్‌పై రాయదుర్గం పోలీస్ స్టేషనులో కేసు నమోదైన విషయం తెలిసిందే. మణికొండలో బొటిక్ నడుపుతున్న శ్రీవిద్య, రష్మీదీప్ అనే యువతులు అభిప్రాయ భేదాలతో దూరమయ్యారు. ఈ క్రమంలో శ్రీవిద్య ఒక్కరే బొటిక్ నడుపుతున్నారు.(చదవండి: మదనపల్లి మధుకర్‌కు 12 ఏళ్ల జైలు) దీంతో తమకు సంబంధించిన రూ. 5 వేల విలువ గల కుట్టుమిషన్‌ను షాపులో వదిలివేశామని, దానిని తిరిగి ఇవ్వాలంటూ రష్మి స్నేహితులైన స్వాతి, తేజ, అమర్, హర్ష అడిగారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో అమర్‌పై కేసు నమోదు అయ్యింది. ఈ విషయం గురించి బుధవారం మీడియాతో మాట్లాడిన అమర్.. ‘‘ఆ రోజు నేను తాగి వెళ్లలేదు. బ్లడ్ రిపోర్ట్స్ కూడా నెగెటివ్‌గానే వచ్చాయి. నిజానికి, కావాలనే నాపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఆ రోజు గొడవ పడిన వీడియో లో కేవలం 2 నిమిషాలు మాత్రమే బయటికి రిలీజ్ చేశారు. అందులో ఉన్న వాళ్లందరూ మా స్నేహితులే. ఎఫ్ఐఆర్ కాపీలో సైతం నేను లైంగిక వేధింపులకు పాల్పడలేదనే ఉంది. నా గురించి అసత్యాలు ప్రచారం చేసిన వారిపై నేను కూడా కేసు పెడతాను. నేను రూ. 5 లక్షలు తీసుకున్నట్టు ఆధారాలు చూపించాలి. కానీ వాళ్ళ దగ్గర అంత డబ్బు ఎక్కడిది. మీడియాలో కూడా నేను గొడవ పడుతున్నట్టు చూపించారు. అంతకు ముందు నుంచే గొడవ జరిగింది దాన్ని మాత్రం చూపించలేదు’’ అని చెప్పుకొచ్చాడు.(చదవండి: ‘కోయిలమ్మ’నటుడు అమర్‌పై కేసు) -
‘కోయిలమ్మ’నటుడు అమర్‌పై కేసు
గచ్చిబౌలి: బోటిక్ పెట్టిన స్నేహితురాళ్లు నష్టం రావడంతో ఘర్షణ పడి ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోగా కోయిలమ్మ సీరియల్ కథానాయకుడు అమర్‌పై కేసు నమోదైంది. రాయదుర్గం సీఐ ఎస్.రవీందర్ వివరాల ప్రకారం.. స్నేహితులైన శ్రీవిద్య, రష్మీదీప్ మణికొండలోని సిద్ధిసాయి కాలనీలో షాపు అద్దెకు తీసుకొని బోటిక్ పెట్టారు. నష్టం రావడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోగా శ్రీవిద్య బోటిక్‌ను నిర్వహిస్తోంది. రూ. 5 వేల విలువ చేసే కుట్టు మెషిన్ బోటిక్‌లో వదిలి వేశానని స్నేహితులైన స్వాతి, తేజ, బుల్లితెర నటుడు అమర్, హర్ష బుధవారం రాత్రి 8 గంటలకు మణికొండకు వెళ్లి కుట్టు మెషిన్ ఇవ్వాలని అడిగారు. ఇంటి వద్ద ఉందని చెప్పడంతో శ్రీవిద్య స్నేహితురాళ్లు అపర్ణ, లక్ష్మీలతో పాటు రష్మీకి మద్దతుగా వచ్చిన వారందరు స్ప్రింట్ రివర్ షేడ్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి ఇరు వర్గాల మధ్య ఘర్షన నెలకొంది. అసభ్యంగా దూషించి దాడికి పాల్పడ్డారని శ్రీవిద్య రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. తమను కూడా దూషించి దాడి చేశారని స్వాతి ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు. -
ఎలా బయటపడ్డారు?
అమర్, ప్రదీప్ వర్మ, ఉదయ్, అభి, సి.టి, ఖాదర్, లక్ష్మీ, శృతి, కావ్య, దేవి, వీణ, జాస్మిన్ ముఖ్య తారలుగా రూపొందిన చిత్రం ‘చెడ్డీ గ్యాంగ్’. ఇందులో శ్రీనివాస రెడ్డి కీలక పాత్ర పోషించారు. కనగాల రమేష్ చౌదరి దర్శకత్వంలో విక్కి రాజ్ నిర్మించిన ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలకు సిద్ధమైంది. సంక్రాంతి పండగ సందర్భంగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. రమేష్ మాట్లాడుతూ– ‘‘దాదాపు 32ఏళ్లుగా అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ డైరెక్టర్‌గా చిత్రపరిశ్రమలో పని చేసిన నేను దర్శకునిగా తెరకెక్కించిన తొలి చిత్రమిది. సాఫ్ట్వేర్ కంపెనీలో బాగా పనిచేసే ఓ పది మంది ఉద్యోగులను ఆ కంపెనీ ఎండీ కేరళ టూర్‌కి పంపిస్తాడు. కేరళ అడవుల్లో జరుగుతున్న కోయవారి జాతరకు వెళ్లిన ఆ పదిమంది అక్కడే ఇరుక్కుపోవాల్సి వస్తుంది. ఆ పరిస్థితుల నుంచి సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఎలా బయటపడ్డారనేది చిత్రకథాంశం. మలేసియాలో తీసిన క్లైమాక్స్ ఓ హైలైట్. దాదాపు 125 రోజుల పాటు రెండు షెడ్యూల్స్‌లో ఈ సినిమాను తెరకెక్కించాం. బాలీవుడ్ బ్యూటీ స్నేహా కపూర్ చేసిన స్పెషల్ సాంగ్ అదనపు ఆకర్షణ’’ అన్నారు. ఈ సినిమాకు ప్రదీప్ వర్మ సంగీతం అందించారు. -
నా బిడ్డ పేరుతో ఒక చట్టం రావాలి
భారతీయ నౌకాదళంలో విధి నిర్వహణలో ఉన్న తన కుమారుడి ఆకస్మిక మరణం వెనుక అంతుచిక్కకుండా ఉన్న కారణాలను వెల్లడించాలని పాతికేళ్లుగా ఒంటరి న్యాయపోరాటం చేస్తున్న మాతృమూర్తి అనూరాధ పాల్థేకు ఎట్టకేలకు కొద్దిపాటి ఊరట లభించింది. ఈ కేసును తక్షణం సి.బి.ఐ. విచారణకు అప్పగిస్తూ గత సోమవారం హైదరాబాద్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా మహారాష్ట్ర థాణే జిల్లా డోంబివలిలో ఉంటున్న అనూరాధ పాల్థే తనను కలిసిన ‘సాక్షి’ ప్రతినిధులతో తన ఆవేదనను పంచుకున్నారు. అసలేం జరిగింది? పాతికేళ్ల క్రితం.. ఇండియన్ నేవీలో చేరిన అమర్ పాల్థేకి సీ మ్యాన్ 1గా కాకినాడ తీరప్రాంతంలో పోస్టింగ్ వచ్చింది. 1993 సెప్టెంబర్ 21 న అమర్, తక్కిన సీ మెన్.. నేవీ శిక్షణలో భాగంగా హెలికాప్టర్ నుంచి సముద్ర తీరంలోకి దుమికి ఒడ్డుకు చేరే విన్యాసాన్ని ప్రదర్శిస్తుండగా, సముద్రంలోకి పడిపోయిన అమర్ తిరిగి ఒడ్డుకు చేరలేదు. రెండు రోజుల తర్వాత అతడి మృతదేహం లభ్యమైంది. పోస్ట్‌మార్టమ్‌లో వైద్యులు అతడి తలపై గాయాలు ఉండడం గమనించినప్పటికీ, అవి ఘటనకు ముందు నుంచే ఉన్న దెబ్బలని గుర్తించడంతో అమర్ మరణం అనుమానాస్పదం అయింది. దీనిపై అమర్ తల్లి అనూరాధా అశోక్ పాల్థే విచారణకు పట్టుపట్టారు. కాకినాడ పోర్ట్ పోలీసులు, నేవీల అంతర్గత దర్యాప్తు సంస్థ ‘బోర్డ్ ఆఫ్ ఎంక్వయరీ’.. ఈ రెండు కూడా.. ప్రమాదం వల్లనే అమర్ చనిపోయాడు తప్ప, వేరే కారణాలేవీ లేవని తేల్చి చెప్పినప్పటికీ వాటిపై నమ్మక కుదరక అనూరాధ న్యాయస్థానాన్ని ఆశ్రయించి అవిశ్రాంతంగా పోరాటం సాగిస్తూ వచ్చారు. నేవీకి వ్యతిరేకం కాదు ‘‘నేను నేవీకి వ్యతిరేకం కాదు. నేవీలోని అవినీతి అధికారులకు వ్యతిరేకంగానే నా న్యాయ పోరాటం. నా కొడుకు అమర్ మృతి ప్రమాదవశాత్తు జరగలేదని కోర్టు అంగీకరించింది కనుకనే ఈ కేసును సీబీఐకి అప్పగించింది. అందుకు నా ధన్యవాదాలు. సీబీఐ దర్యాప్తు చేపడితే అమర్ మర ణానికి వాస్తవ కారణాలు బయటపడతాయన్న నమ్మకం నాకు ఉంది. కేసును వెనక్కి తీసుకోవాలని ఇన్నేళ్లలోనూ అనేక బెదిరింపులు వచ్చాయి. దీంతో మానసికంగా కుంగిపోయి ఈ కేసును వెనక్కి తీసుకోవాలని కూడా అన్పించింది. కానీ కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, నా విద్యార్థులు ఇలా అనేక మంది ప్రోత్సాహం, ముఖ్యంగా ఈ కేసు వాదిస్తున్న న్యాయవాదులు సునీల్, మంజీరా దంపతుల సహకారంతో ఇంతవరకు పోరాడగలిగాను. నేను ఉన్నంత వరకు ఈ న్యాయపోరాటం చేస్తాను. నా కుమారునిలాగే నేవీలో అనుమానాస్పదంగా అనేక మంది మరణించినట్టు గడిచిన ఇరవై ఐదేళ్లలో తెలుసుకున్నాను. ఏదైనా అడిగితే ప్రమాదవశాత్తు మరణించారని చెబుతారు. అనేక మంది శవాలు కూడా లభించలేదు. ఈ మరణాలపై విచారణకు అడ్డుపడేవారికి, నేవీలోని అవినీతి అధికారులకు శిక్ష పడేలా చూడాలి. ఇందుకోసం అవసరమైతే చట్టం ఉండాలి. ఆ చట్టానికి నా కుమారుని పేరు పెడితే సంతోషిస్తాను.’’ బలి తీసుకున్నారు అమర్ 1970 మే 25వ తేదీ పుట్టాడు. 1990 జనవరి ఒకటవ తేదీ నేవీలో చేరాడు. మొదటి ఆరు నెలలు ‘చిలుక’లో శిక్షణ పొందాడు. తర్వాత డైవర్‌గా సెలక్టయ్యాడు. వాడికి అడ్వెంచర్స్ అంటే ఇష్టం. అవార్డులు కూడా అందుకున్నాడు. విధుల్లో భాగంగా 1993లో కాకినాడ వెళ్లాడు. అప్పుడే ప్రమాదవశాత్తూ అమర్ మరణించినట్లు వార్త వచ్చింది. కుప్పకూలి పోయాను. అక్కడికి వెళ్లాను. రెండు రోజుల ముందే హెలిక్యాప్టర్ నుంచి డైవ్ చేస్తూ మిస్ అయ్యాడని, తర్వాత ఒడ్డుకు కొట్టుకురావడం స్థానిక మత్స్యకారులు చూశారని అధికారులు చెప్పారు. నాకు నమ్మబుద్ధి కాలేదు. ఘటనకు ముందే అమర్‌కు బలమైన గాయాలైనట్టు పోస్ట్‌మార్టమ్‌లో తేలింది. ఖిన్నురాలినయ్యాను. నేవీ అంటే ఎంతో గౌరవమున్న మేము మా అబ్బాయి కోసం నేవీపైనే న్యాయపోరాటానికి దిగాం. నేవీలో కొందరు అవినీతి అధికారుల కారణంగానే మా కొడుకు మరణించాడని నా నమ్మకం. ముందుగా ముంబై హై కోర్టులో పిటిషన్ వేశాం. అనంతరం 1997లో కాకినాడ కోర్టులో కేసు నమోదు చేశాం. కేసులు నడుస్తున్నప్పుడు కొందరు నేవీ అధికారులు ఈ కేసుల్ని అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. అమర్ సముద్రంలోకి డైవ్ చేస్తున్న సమయంలో అధిక ఎత్తులో హెలికాప్టర్ ఉండడం, భారీ ఎత్తున అలలు ఎగిసి çపడడం వల్ల అమర్‌ను వెంటనే వెదకలేకపోయామని, దీంతో అమర్ మరణించాడని కోర్టుకు నేవీ అధికారులు చెప్పారు. కానీ నేవీ, ఏయిర్‌ఫోర్స్, ఆర్మీ ఇలా మూడూ ఆ సమయంలో అక్కడ ఉండగా ఎందుకు వెదకలేకపోయారనే అనుమానాలకు వారి వివరణ తావిచ్చేలా ఉంది. మా అనుమానం నిజమేనని కాకినాడ కోర్టుతోపాటు, హైదరాబాదు హైకోర్టు కూడా నా కుమారుని మృతి ప్రమాదవశాత్తు జరగలేదని, అన్నేచురల్ డెత్ అని అభిప్రాయపడ్డాయి’’ అని తెలిపారు అనూరాధ. భర్త మరణానంతరం అనూరాధ స్కూల్ టీచర్. కోర్టు కేసులకు వెళ్లి రావడానికి ఇబ్బందిగా ఉండడంతో 2001లో స్వచ్ఛందంగా రాజీనామా చేశారు. 2007లో ఆమె భర్త అశోక్ మరణించారు. అప్పుడు మాత్రం ఈ పోరాటంలో తను ఒంటరినయ్యానని అమెకు అనిపించింది. చిన్న కుమారుడు ప్రతాప్, కోడలు సహకారం అందించారు. ఈసారి పూర్తిస్థాయిలో న్యాయపోరాటం మొదలైంది. ముఖ్యంగా 2008 నుంచి ఇప్పటి వరకు కుటుంబానికి... అంటే .. తన మనవలు, మనవరాళ్లకు ప్రేమను అందించలేక పోయినందుకు ఆమె విలపించిన రోజులెన్నో ఉన్నాయి. ‘‘పదేళ్లపాటు దేవుణ్ణి కూడా కొలవడం మానేసి నా కొడుకు కోసం పోరాడాను. నిజంగా దేవుడున్నాడు. నా మొర ఆలకించాడు’’ అన్నారు అనూరాధ. అనేక బెదిరింపులు ‘‘ఈ కేసులను వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తూ ఎక్కడెక్కడి నుంచో నాకు కాల్స్ వస్తుండేవి. ఓసారి బాగా భయపడి వెంటనే న్యాయవాది దంపతులకు ఫోన్ చేసి చెప్పాను. వాళ్లు పోలీస్ ఎంక్వయిరీ చేయిస్తే ఆ కాల్స్‌లో ఒకటి పాకిస్తాన్ సిమ్ నుంచి వచ్చినట్లు బయటపడింది. ఇలాంటివన్ని కూడా నా కేసును మరింత బలోపేతం చేశాయి. 2017 జులైలో తుది తీర్పు ఇవ్వనున్నట్టు హైదరాబాదు కోర్టు పేర్కొంది. దీనిపై ఎంతో ఉత్కంఠతో గడిపాను. కాని తీర్పును అడ్డుకోవడంలో నేవీ అధికారులు సఫలీకృతమయ్యారు. మళ్లీ ఈ కేసు వాయిదా పడింది. మానసికంగా కుంగిపోయాను. కేసును వెనక్కి తీసుకుందామనుకున్నాను. కొన్ని రోజులపాటు అనారోగ్యం పాలయ్యాను. కానీ నిలబడ్డాను. అందరి ప్రోత్సాహం లభించింది. ముఖ్యంగా నయాపైసా తీసుకోకుండా నా కోసం పోరాడుతున్న న్యాయవాది దంపతులు నాకు అండగా నిలిచారు. నేను పనిచేసిన పాఠశాలకు చెందిన పాఠశాల విద్యార్థుల సహకారం కూడా లభించింది. అనేక మంది విద్యార్థులు న్యాయం చేయాలంటూ డిఫెన్స్ శాఖ మంత్రికి లేఖలు రాశారు. నేను కూడా అనేక మందిని కలిశాను. ఎట్టకేలకు పాతికేళ్ల అనంతరం 2018 డిసెంబరు 17వ తేదీన హైదరాబాదు హై కోర్టు సిబిఐకి అప్పగించింది’’ అని భారమైన హృదయంతో తెలిపారు అనూరాధ. నాలుగు పుస్తకాలు అనూరాధ తన న్యాయపోరాటంపై ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు రాశారు. సుప్రసిద్ద రచయిత్రి శిరీష్ పయి ప్రొత్సాహంతో తన కుమారుడు జన్మదినాన్ని (జయంతి) పురస్కరించుకుని 2013 మే 25వ తేదీన మొదటి పుస్తకం అవిష్కరించారు. నాలుగువ పుస్తకం జనవరి ఒకటవ తేదీ 2016న విడుదల అయింది. ఇప్పటి వరకు కొనసాగిన కేసుతోపాటు తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, న్యాయపోరాటంపై అయిదవ పుస్తకాన్ని కూడా రాస్తున్నట్టు అనూరాధ చెప్పారు. మరాఠీలో ఉన్న ఈ పుస్తకాలన్నిటినీ త్వరలోనే ఇంగ్లిష్‌లోకి అనువదిస్తున్నట్లు తెలిపారు. – గుండారపు శ్రీనివాస్, సాక్షి, ముంబై – మూడి శ్రీనివాస్, సాక్షి, పుణెí -
తండ్రి నడిచిన బాటలోనే
కొన్ని విషయాలు పనిగట్టుకొని నేర్పించనవసరం లేదు. వారసత్వంగానూ సంక్రమిస్తాయి అంటున్నారు శాండిల్‌వుడ్ వాసులు. కన్నడ రెబల్‌స్టార్ అంబరీష్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అంబరీష్ కుమారుడు అభిషేక్ తన ఫస్ట్ చిత్రం ‘అమర్’ కోసం బిజీబిజీగా షూటింగ్ చేస్తున్నారు. తండ్రి అంత్యక్రియలన్నీ దగ్గరుండి జరిపించి, బాధనంతా తనలోనే ఉంచుకుని మూడు రోజుల్లో తిరిగి షూటింగ్లో జాయిన్ అయ్యారు. కాగా ఒకప్పుడు రెబల్ స్టార్ అంబరీష్‌కు కూడా ఇలాంటి బాధాకరమైన సంఘటన ఎదురైంది. 1978లో ‘పదువరల్లి పాండవురు’ అనే కన్నడ చిత్రం షూటింగ్ చేస్తూ ఉండగా అంబరీష్ తండ్రి మర ణించారు. అవుట్డోర్ లొకేషన్లో షూటింగ్ చేస్తున్న అంబరీష్ తన తండ్రి అంత్యక్రియలను పూర్తి చేసి మూడు రోజుల్లో షూటింగ్లో జాయిన్ అయ్యారు. తన కుటుంబానికి వచ్చిన కష్టం నిర్మాతకు నష్టంగా మారకూడదని అంబరీష్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఊహించవచ్చు. ఇలా తండ్రి నడిచిన బాటలోనే అభిషేక్ నడుస్తున్నాడు అంటున్నారు అంబరీష్ ఫ్యాన్స్. అభిషేక్ తొలి సినిమా ‘అమర్’ విషయానికి వస్తే.. ఈ చిత్రం షూటింగ్ దాదాపు 60 శాతం పూర్తయింది. వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. -
సోషియో ఫాంటసీ
అమర్, సంతోషి, షాలు చౌరస్య, తనికెళ్ల భరణి, పోసాని ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘అంతర్వేదమ్’. చందిన రవికిశోర్ దర్శకత్వంలో క్రౌడ్ ఫండ్‌తో నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలవుతోంది. ‘‘సోషియో ఫాంటసీగా తెరకెక్కిన చిత్రమిది. క్రౌడ్ ఫండింగ్‌తో రెండేళ్లపాటు కష్టపడి తెరకెక్కించిన చిత్రమిది. ప్రేక్షకులు మా కష్టాన్ని అర్థం చేసుకొని సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నా’’ అన్నారు రవికిశోర్. ‘‘యూనిట్ అంతా కొత్తవారే. వాళ్ల ప్యాషన్, ప్రేమ చూస్తుంటే ముచ్చటేసింది. క«థ, కథనాల పరంగా ఈ చిత్రాన్ని ది బెస్ట్‌గా రవికిశోర్ తెరకెక్కించాడు’’ అన్నారు తనికెళ్ల. ఈ చిత్రానికి సహ నిర్మాత: ఎస్.ఎన్. -
220 మంది మృతి.. జర్నలిస్ట్‌లను కాపాడండి..!
సాక్షి, న్యూఢిల్లీ : గతకొంత కాలంగా తెలంగాణలో జరుగుతున్న జర్నలిస్ట్‌ల మరణాలపై ఢిల్లీలో టీయూడబ్య్లూజే ధర్నాను నిర్వహించింది. ‘జర్నలిస్ట్‌లను కాపాడండి’ అంటూ ఢిల్లీ పార్లమెంట్ స్ట్రీట్‌లో జర్నలిస్టులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమానికి వామపక్ష పార్టీల నేతలు.. సురవరం సుధాకర్ రెడ్డి, సీతారా ఏచూరి, డీ రాజా హాజరై సంఘీభావం తెలిపారు. ఎన్‌యూజే నేత రాజ్ బిహారీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు, ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, ఐజేయూ నేత శ్రీనివాస్ రెడ్డి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణలో గత నాలుగేళ్ల కాలంలో మరణించిన 220 మంది జర్నలిస్టులపై పుస్తకాన్ని విడుదల చేశారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభమైన జర్నలిజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదని, ఇంత పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు ఏ రాష్ట్రంలో కూడా మరణించలేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వ్యాఖ్యానించారు. జర్నలిజం కత్తిమీద సాములాంటి వృత్తని.. జర్నలిస్ట్‌ల సమస్యలను కారుణ్య దృష్టితో చూడొద్దని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. జర్నలిస్ట్‌ల సమస్యలను కేసీఆర్ పట్టించుకోవడం లేదని.. అందుకే 31 జిల్లాల జర్నలిస్టులు వచ్చి ఢిల్లీలో ధర్నా చేపట్టారని ఐజేయూ సెక్రటరీ జనరల్ అమర్ విమర్శించారు. తెలంగాణలో చనిపోయిన 220 మంది జర్నలిస్టులవి అసహజ మరణాలని, శ్రమ దోపిడి కారణంగానే వారు చనిపోయారని అన్నారు. కేసీఆర్ ఎవరితో మాట్లాడకుండా ఓ గడీని నిర్మించుకున్నారని, తెలంగాణలో నిరసన తెలిపే అవకాశం లేకుండా ధర్నాచౌక్‌ను ఎత్తివేశారని ఆయన మండిపడ్డారు. వందలాది జర్నలిస్టులు చనిపోయినా ప్రభుత్వంలో చలనం లేదని.. వారికి తగిన గుణపాఠం చెప్పాలని ఐజేయూ నేత శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. -
కొత్తవాళ్ల ప్యాషన్ చూస్తుంటే ముచ్చటేసింది
‘‘ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. వేరే రంగాల్లో విజయం సాధిస్తున్నప్పటికీ మానసిక సంతృప్తి కోసం సినిమా రంగంలోకి వస్తున్నారు. వాళ్లందరూ తప్పకుండా విజయం సాధిస్తారు. ‘అంతర్వేదమ్’ చిత్రంలో నటించినవారు, యూనిట్ మెంబర్స్ అందరూ కొత్తవారే. సినిమా పట్ల వారి ప్యాషన్, ప్రేమ చూస్తుంటే ముచ్చటేసింది’’ అని రచయిత–నటుడు తనికెళ్ల భరణి అన్నారు. అమర్, సంతోషి, శాలు చౌరస్య, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘అంతర్వేదమ్’. చందిన రవికిశోర్ దర్శకత్వంలో ఫ్రెండ్స్ ఫండింగ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై క్రౌడ్ ఫండ్‌తో నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటోంది. జె.యస్. నిథిత్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. రవికిషోర్ మాట్లాడుతూ– ‘‘నేను చెప్పిన కథ నచ్చి తనికెళ్ల భరణిగారు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఇప్పటి వరకూ ఒక్కరూపాయి కూడా తీసుకోకుండా పని చేశారు. ఇక్కడికి విచ్చేసిన అతిథులందరికీ కృతజ్ఞతలు’’ అన్నారు. చిత్రకథానాయకుడు అమర్, రైటర్ ప్రసన్నకుమార్, నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ, నటులు రాంప్రసాద్, ‘రైజింగ్’ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శివ దేవరకొండ, సహ నిర్మాత: ఎస్.ఎన్. -
ఆత్మ పయనమెటు?
అమర్, సంతోషి, శాలు చౌరస్య, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణమురళి ముఖ్య తారలుగా తెరకెక్కిన చిత్రం ‘అంతేర్వేదమ్’. రవికిశోర్ దర్శకత్వంలో క్రౌడ్ ఫండ్‌తో నిర్మించిన ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయింది. రవికిశోర్ మాట్లాడుతూ– ‘‘మనిషి చనిపోయినప్పుడు.. నిద్రపోయినప్పుడు.. కోమాలో ఉన్నప్పుడు అతని ఆత్మ ఎటువైపు వెళ్తుంది? మనం నిద్రపోయినప్పుడు మన ఆత్మ మనకి తెలియకుండా ఆ ప్రదేశానికి వెళ్లి చనిపోయిన వారిని, మనకి తెలియనివారిని కలిసి వస్తుందా? దీనినే మనం కల అనుకుంటున్నామా?.. ఇలాంటి విషయాలన్నీ రాసి ఉన్న తాళపత్ర గ్రంథం పేరే ‘అంతేర్వేదం’. ఆ తాళపత్ర గ్రంథం ఆధారంగా తీసిన చిత్రమే ‘అంతేర్వేదమ్’. త్వరలో ట్రైలర్, ఆడియో రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: శివ దేవరకొండ, సంగీతం: జె.యస్. నిథిత్. -
ప్రెస్ కౌన్సిల్ సభ్యులుగా అమర్, మాజిద్
సాక్షి, హైదరాబాద్: ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (పీసీఐ) సభ్యులుగా తెలంగాణ నుంచి ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) జాతీయ అధ్యక్షుడు దేవులపల్లి అమర్, కార్యవర్గ సభ్యుడు ఎంఏ మాజిద్ నియమితులయ్యారు. పీసీఐకి దేశవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టుల కోటా నుంచి ఏడుగురు సభ్యులను ఎంపిక చేయగా.. అందులో ఐజేయూ నుంచి అమర్, మాజిద్‌లతోపాటు బల్వీందర్‌సింగ్ జమ్మూ (పంజాబ్), ప్రభాత్‌దాస్, శరత్ బెహెరా (ఒడిశా)లు నియమితులయ్యారు. వీరితోపాటు వార్తా పత్రికల యాజమాన్యాల కేటగిరీ కింద నలుగురికి, సంపాదకుల కేటగిరీ కింద మరో నలుగురికి, వార్తా సంస్థల కేటగిరీ నుంచి ఒకరికి కలిపి మొత్తం 18 మందికి పీసీఐ సభ్యులుగా అవకాశం లభించింది. వీరంతా మూడేళ్లపాటు పీసీఐ సభ్యులుగా కొనసాగుతారు. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. హర్షం వ్యక్తం చేసిన టీఎస్‌యూడబ్ల్యూజే.. తమ సంస్థ సభ్యులు దేవులపల్లి అమర్, ఎంఏ మాజిద్‌లు ప్రెస్ కౌన్సిల్ సభ్యులుగా నియామకం కావడంపై తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ (టీఎస్‌యూడబ్ల్యూజే) హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు యూనియన్ అధ్యక్షుడు ఎన్.శేఖర్, ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ ఒక ప్రకటన విడుదల చేశారు. పీసీఐ సభ్యులుగా నియమితులైన వారికి అభినందనలు తెలిపారు. వారు పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి, జర్నలిజంలో నైతిక విలువలను పెంపొందించడానికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక పీసీఐ సభ్యులుగా నియమితులైన ఐజేయూ నాయకులకు పీసీఐ మాజీ సభ్యుడు కె.అమర్నాథ్ అభినందనలు తెలిపారు. -
ఐజేయూ అధ్యక్షునిగా దేవులపల్లి అమర్
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ జర్న లిస్ట్‌ల యూనియన్(ఐజేయూ) కొత్త అధ్యక్షునిగా దేవులపల్లి అమర్, సెక్రటరీ జనరల్‌గా సబీనా ఇంద్రజిత్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఐజేయూ –2018 ఎన్నికల అధికారి ప్రేమ్‌నాథ్ భార్గవ ఈ మేరకు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. త్వరలో జరగ నున్న ఇండియన్ జర్నలిస్టుల యూని యన్ ప్లీనరీలో వీరు పదవీ బాధ్య తలు స్వీకరిస్తారు. హైదరాబాద్ కేం ద్రంగా పనిచేస్తున్న దేవులపల్లి అమర్ జర్నలిజం వృత్తిలోనూ, ట్రేడ్ యూని యన్ కార్యకలాపాల్లోనూ 42 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం కలిగి ఉన్నారు. ఆయన ప్రస్తుతం సాక్షి టీవీలో కన్స ల్టింగ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. 1976 లో ఈనాడు దినపత్రిక ద్వారా జర్నలిజం వృత్తిలోకి ప్రవేశించిన అమర్ ఆ తరువాత వివిధ దినపత్రి కలలో వివిధ హోదాల్లో పని చేశారు. ప్రజాతంత్ర పత్రిక వ్యవస్థాపక సంపా దకుడు కూడా అయిన అమర్ రెండు సార్లు ఏపీ ప్రెస్ అకాడమీ అధ్యక్షు డిగా వ్యవహరించారు. ఆయన ప్రస్తు తం ఐజేయూ సెక్రటరీ జనరల్‌గా ఉన్నారు. సబీనా ఇంద్రజిత్ ఢిల్లీలో ఇండియన్ న్యూస్ అండ్ ఫీచర్స్ ఏజె న్సీ(ఇన్ఫా)లో ఎగ్జిక్యూటివ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆమె ఇన్ఫా సంస్థ స్థాపకులు, ప్రముఖ సంపాదకుడు దుర్గాదాస్ మనుమరాలు. ప్రముఖ పార్లమెంటేరియన్, జర్నలిస్ట్ ఇంద్ర జిత్ కుమార్తె. సబీనా ప్రస్తుతం బ్రస్సె ల్స్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జా తీయ జర్నలిస్ట్ సమాఖ్య (ఐఎఫ్‌జే) ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. అమర్, సబీనాల ఎన్నిక పట్ల పదవీ విరమణ చేయనున్న ఐజేయూ అధ్యక్షుడు ఎస్ఎన్ సిన్హా, ఐజేయూ మాజీ ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ రెడ్డి , మరో సీనియర్ నేత అమర్నాథ్ వారికి అభినందనలు తెలిపారు. -
జర్నలిస్టుల గర్జన
-
వేశ్యా గృహం పేరుతో.. పోలీసుల సూపర్ ట్రాప్..
న్యూఢిల్లీ : మైనర్ బాలికను వేశ్యా గృహానికి అమ్మబోయి.. పోలీసులకు ఫోన్ చేసిన ఇద్దరు వ్యక్తులను ఢిల్లీ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు వ్యక్తులు బిహార్‌కు చెందిన వారిగా వెల్లడించారు. వేశ్య గృహం నిర్వహిస్తున్నట్లు నటించి వారిని ట్రాప్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు. వేశ్య గృహం పేరుతో ఓ మొబైల్ నంబర్‌ను తామే ఇంటర్నెట్లో పెట్టినట్లు వివరించారు. అది వేశ్య గృహానికి చెందినదిగా భావించిన అమర్(24), రంజీత్ షా(27)లు మైనర్ బాలిక అమ్మకానికి ఉన్నట్లు ఫోన్ చేసి చెప్పారు. ఆ కాల్‌ను రిసీవ్ చేసుకున్న స్టేషన్ హౌస్ ఆఫీసర్ వారితో చాకచక్యంగా మాట్లాడి ట్రాప్ చేసినట్లు తెలిపారు. బాలికను రూ.3.5 లక్షలకు అమ్ముతామని ఇద్దరు ఫోన్లో చెప్పగా.. రూ. 2.3 లక్షలకు డీల్ కుదుర్చుకున్నట్లు తెలిపారు. తొలుత న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ వద్ద డబ్బును ఇవ్వాలని అనంతరం గుడ్‌గావ్‌లోని ఇఫ్కో చౌక్‌లో బాలికను అందజేస్తామని పోలీసులతో ఇద్దరు వ్యక్తులు ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద డబ్బు కోసం వేచి ఉన్న ఇద్దరిని పట్టుకున్నట్లు చెప్పారు. తాము ఏర్పాటు చేసిన మొబైల్ నంబర్‌కు పెద్ద ఎత్తున అమ్మాయిలను అమ్ముతామని ఫోన్లు వస్తున్నట్లు వివరించారు. గుడ్‌గావ్ పోలీసుల సాయంతో బాలికను రక్షించినట్లు వెల్లడించారు. ట్రాఫికింగ్‌కు గురైన మైనర్ బాలిక ఇంట్లో వదిలి ఢిల్లీకి వచ్చినట్లు తెలిసింది. బిహార్‌లో బాలికను ప్రేమించానని నమ్మించిన అమర్.. ఢిల్లీకి వస్తే జాబ్ ఇప్పిస్తానని నమ్మబలికినట్లు పోలీసులు చెప్పారు. అక్టోబర్‌లో ఢిల్లీకి వచ్చిన ఆమెపై అమర్, రంజీత్ షాలు పలుమార్లు అత్యాచారం చేసినట్లు తెలిపారు. -
ప్రేమ వేధింపులకు డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య
ములుగు: జయశంకర్ జిల్లా ములుగులో దారుణం చోటు చేసుకుంది. వేధింపులు తాళలేక ఓ విద్యార్థిని వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. చికిత్స నిమిత్తం ఆమెను ఆస్పత్రికి తరలించగా.. కొద్దిసేపటి క్రితం మృతి చెందింది. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న రమ్య(19) ఓ ప్రైవేట్ కళాశాలలో డిగ్రీ చదువుతోంది. కాగా.. గత కొన్ని రోజులుగా అమర్ అనే వ్యక్తి ఆమెను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడు. అమర్‌కు ఇంతకు ముందే పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మధ్య కాలంలో అమర్ వేధింపులు ఎక్కువకావడంతో రమ్య ఇంట్లో ఎవరు లేని సమయంలో వంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇది గుర్తించిన చుట్టుపక్కల వారు అంబులెన్స్ సాయంతో వరంగల్‌లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
విప్లవ సాహిత్యంలో మెరుపుతీగ కాశీపతి
సందర్భం విప్లవోద్యమ ప్రభావానికి లోనయిన యాభై ఏళ్ళ వయస్సు వాళ్ళందరిలో కాశీపతి గురించి ఎరుగని వాళ్లుండరు. ప్రగతిశీల విద్యార్థి ఉద్యమంలో పయనించిన అసంఖ్యాకుల్లో ‘‘ఉయ్యాలో జంపాల/ఈ దోపిడి కూలదొయ్యాల’’ అనే పాటని వినని వాళ్ళుండరు. లక్షలాది మందిని కట్టిపడేసే ఆయన ఉపన్యాసం గురించి చెవులు కోసుకోని వాళ్ళుండరు. దాదాపు ఇలాంటి ఎన్నో లక్షణాలు పుణికిపుచ్చుకున్న కాశీపతిని ఎమర్జెన్సీ ఎత్తేసిన కొత్తలో సిరిసిల్ల సభలో మొట్టమొదటిసారిగా చూశాను. 1977లో మొదలైన ఈ బంధం అనేక ఆటుపోట్ల మధ్య చెదర కుండా ఆయన ‘మద్య తరగతి మందుహాసం’లో ముందు మాటగా భాగం పంచుకునేదాకా సాగింది. ఎక్కడో అనంతపురం పట్టణంలో బ్రాహ్మణ ఉన్నతవర్గంలో జన్మించిన కాశీపతికి, వేములవాడలో పెద జాలరి కుటుంబంలో పుట్టిన నాకు విప్లవోద్యమమే బంధం వేసింది. పలురకాల వ్యాధులతో ఆగస్టు 11, 2016న కామ్రేడ్ కాశీపతి అంతిమ శ్వాస వదలడంతో కూడా ఈ అనుబంధం ముగిసిపోలేదు. చరిత్ర నిర్మాతలు ప్రజలే అయినా విప్లవ నాయకత్వాన్ని తయారు చేసుకోవడానికి కూడా లెనిన్ ప్రాధాన్యతనిచ్చాడు. అందుకే చరిత్రలో వ్యక్తుల క్రియాశీల పాత్రను, మననం చేసుకుంటూ వారి పరిమితులను మననం చేసుకోక తప్పదు. వారి పరిమితులను విశ్లేషించక తప్పదు. నక్సల్బరి తర్వాత కల్లోల విప్లవ దశాబ్దంలో తెలుగునేల అందించిన విప్లవ ఆణిముత్యాల్లో యాధాటి కాశీపతి ఒకరు. సీపీఎం నుంచి తెగతెంపులు చేసుకున్న ఆంధ్ర విప్లవ కమ్యూనిస్టుల సాంగత్యంలో, చండ్రపుల్లారెడ్డి సాన్నిహిత్యంలో విజయ వాడలో కేంద్రంగా ‘జనశక్తి’ పత్రిక నిర్వహ ణలో భాగం కావడానికి, ఉన్నత ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. విప్లవోద్యమానికి ప్రతి బింబంగా వెలువడే విప్లవ సాహిత్యం తిరిగి విప్లవోద్యమాన్ని భావప్రచారంతో తాత్వికంగా అభివృద్ధి చేసే క్రమంలో ఏర్పడ్డ విరసం వ్యవ స్థాపకుల్లో ఒకరుగా నిలిచారు. పౌర-ప్రజా స్వామిక హక్కుల అంశాన్ని ప్రజా సాంస్కృతిక సేన అవసరాన్ని ఎజెండా మీదకు తీసుకురావ డంతో పాటు వాటి నిర్మాణంలోనూ కీలక పాత్ర వహించాడు. విరసం, పౌరహక్కుల సంఘాలు తెలుగునేలపై ఎన్నెన్నో శక్తులు కలసి పనిచేసే ఉమ్మడి వేదికలుగా ఉండేవి. వీటిని మరింత విశాలంగా అభివృద్ధి చేయాలని పలు ఆంతరంగిక వేదికల్లో కాశీపతి పోరా డేవారు. ఇలాంటి విప్లవ స్ఫూర్తితోనే విమోచన పత్రిక బాధ్యతలు నిర్వర్తించడం చేశాడు. మార్క్సిస్టు తత్వశాస్త్రం, అర్థశాస్త్రం, దేశీయ-అంతర్జాతీయ పరిస్థితులపై శిక్షణ నెరుపగల నిష్ణాతులు పాటల సాహిత్య సృష్టి చేయడం చాలా అరుదు. కానీ కాశీపతి రాసిన ఎన్నో పాటలు స్థలకాలాదులకతీతంగా, శాశ్వతంగా నిలిచిపోయే స్థాయిని కలిగి ఉన్నాయి. ఈ స్థాయిలో చాలామంది కవిత్వానికి, కథలకు, సాహిత్య విశ్లేషణలకు పరిమి తంగావడం మనం చూస్తాము. పామరులను మెప్పించే పాటలతో పాటు మధ్యతరగతిని సైతం అలరించే ‘మద్య తరగతి మందుహాసం’కు సాహిత్యేతిహాసం అని ఆయన పేరు పెట్టారు. విప్లవోద్యమంలో మధ్యతరగతి పాత్ర, ఉద్రేకం, ఊగిసలాటలెన్నో మన కళ్లముం దున్నాయి. వాటన్నింటికీ కాశీపతి సైతం అతీతం కాదనే చరిత్ర సైతం మన ముందే ఉంది. ఈ అనేక పరిణామాల్లో అంతర్గత-బహిర్గత కారణాలు కూడా మనం విస్మరించలేము. గోదావరిలోయ ప్రతిఘటనోద్యమం తర్వాత ముందుకు వచ్చిన సిరిసిల్ల రైతాంగ పోరాటానికి దేశం నలుమూలల నుండి సంఘీభావం లభించింది. ఆ పోరాటానికి సంఘీ భావంగా కదిలివచ్చిన వాళ్ళల్లో కాశీపతి పాత్ర, మరిచిపోలేనిది. తీవ్రమైన రాజ్యహింస మధ్య 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ిసీపీఐ (ఎం.ఎల్) అభ్యర్థిగా సిరిసిల్ల నుండి కాశీపతి పోటీ చేశారు. తినడానికి తిండిలేని దరిద్ర నారాయణులతో పాటు పేగులన్నీ బిగపట్టి మంత్రాలు చదివే బ్రాహ్మణ పండితుల వరకు ఎంతో మందిని తన ఉపన్యా సాలతో ఒప్పించి, మెప్పించారు. ఈ ప్రాంతంలో గ్రామ, గ్రామం ఆయన ఉపన్యాసాలను, నాల్కపై తారాడే లెక్కలను విని చప్పట్లు కొట్టిన వాళ్ళే. దీని తర్వాత విప్లవోద్యమంలో సంభవించిన మరికొన్ని చీలికలు, నైరాశ్య వాతావ రణంలో కొంతమంది ఊగిసలాటకు గురైనారు. కవిగా, రచయితగా, ప్రజా కార్యకర్తగా, అనంతపురం కోలార్ మైన్స్ యూనియన్ అధ్యక్షునిగా, అనంతపురం మున్సిపల్ కౌన్సి లర్, విప్లవ ప్రజాస్వామిక సంస్థల నిర్మాణ భాగస్వామిగా బహుముఖ పాత్ర నిర్వహించిన కాశీపతి జర్నలిస్టుగానూ పనిచేశారు. ఇతరత్రా బలహీనతలతో కొంతదూరం ప్రయాణిం చాడు. కానీ చివరి వరకు విప్లవ సాహిత్య వినీలాకాశంలో తళుక్కుమనే తారగా వెలుగొం దుతూనే ఉన్నాడు. ‘‘గాయపడిన కవి గుండెలలో రాయబడని కావ్యాలెన్నో’’ అన్న దాశరథి పద్యంలాగా కాశీపతి మన నుండి అర్ధంతరంగా సెలవు తీసుకున్నాడు. కాని ఆయన ప్రగతిశీల ఆలోచనలకు సెలవు లేదు. వ్యాసకర్త: అమర్, జనశక్తి కార్యకర్త -
రోడ్డు ప్రమాద బాధితులకు అమర్ పరామర్శ
అనకాపల్లి టౌన్: కశింకోట ఆర్ఈసీఎస్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, స్థానిక ఉషాఫ్రై మ్ వైద్యాలయంలో చికిత్స పొందుతున్న క్షగగాత్రులను వైఎస్ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పరామర్శించారు. అనంతరం వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ప్రమాదం జరిగిన తీరుపై బ్రాండెక్స్ కార్మికులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు మందపాటి జానకిరామరాజు, పట్టణ కార్యదర్శి సూరిశెట్టి రమణ అప్పారావు, మండల పార్టీ అధ్యక్షుడు గొర్లి సూరిబాబు, పార్టీ నాయకులు పి.డి.గాంధీ, యువజన విభాగం అధ్యక్షుడు జాజుల, గంటా సముద్రాలు, రమేష్, గైపూరి రాజు తదితరులు పాల్గొన్నారు. -
అమర్-అక్బర్-ఆంటోనీ మళ్లీ పుట్టారు!
అమర్.. అక్బర్.. ఆంటోని.. అన్నదమ్ముల ఆత్మీయ అనుబంధానికి అద్దంపట్టిన వెండితెర దృశ్యరూపం. సినిమా విడుదలై, హిట్టై 39 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు ఆ ముగ్గురూ మరో రూపంలో పునర్జన్మ పొందారు. పులి కూనలుగా భూమి మీదకు పాదంమోపి, గురువారం నామకరణ మహోత్సవం జరుపుకొన్నారు. మంగళూరు శివారులోని పిలికులా జాతీయ పార్కు పులలకు ఫేమస్. అక్కడి నేత్రావతి, విక్రమ్ అనే జంటకు మార్చిలో జన్మించిన కూనలే ఈ అమర్, అక్బర్, ఆంటోనీ, నిషాలు. నిధుల కొరతతో సతమతమవుతోన్న పార్క్ నిర్వాహకులు.. పులులను దత్తత తీసుకోవాల్సిందిగా(నిర్వహణా బాధ్యతలు తీసుకోవాల్సిందిగా) చేసిన అభ్యర్థనలకు మంచి స్పందన లభించింది. అబుదాబికి చెందిన మిచెల్ డిసౌజా అనే వ్యక్తి నాలుగు పులి పిల్లల సంరక్షణార్థం ఏడాదికి రూ.5 లక్షల వితరణ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. దీంతో పులి పిల్లలకు పేరుపెట్టే అవకాశం ఆయనకు లభించింది. బాలీవుడ్ హిట్ సినిమా అమర్- అక్బర్- ఆంటోనీ పేర్లను మూడు మగ పులి పిల్లలలకు, ఆడ పిల్లకేమో నిషా అని పేరు పెట్టాయన. ప్రస్తుతం పిలికులా పార్క్ లో 11 పులులు ఉన్నాయని, సంరక్షణా బాధ్యతలు స్వీకరించాలనుకునేవారు తమను సంప్రదించవచ్చని చెబుతున్నారు జూ డైరెక్టర్ హెచ్ జే భండారి. మీరూ pilikulazoo.com ను దర్శించి, ఏదేని జంతువునో, పక్షినో దత్తత తీసుకుని ఇష్టమైన పేరు పెట్టుకోండిమరి!