న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్టు దేవులపల్లి అమర్ రచించిన "ది డెక్కన్ పవర్ ప్లే The Deccan Power Play" పుస్తకాన్ని ప్రధాని మీడియా మాజీ సలహాదారు సంజయ్ బారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ వెంకట నారాయణ, ఆలిండియా కెమెరామన్ అసోసియేషన్ అధ్యక్షుడు సిన్హా, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు లహరి తదితరులు హాజరయ్యారు. పుస్తక ఆవిష్కరణ సందర్భంగా అతిథులు పలు కీలక అంశాలను పంచుకున్నారు.
సంజయ్ బారు, ప్రధాని మీడియా మాజీ సలహాదారు
- జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాధాన్యం తగ్గుతోంది
- విభజన వల్ల రాజకీయంగా కేంద్రంలో తెలుగు బలం తగ్గింది
- రాజకీయాలు భాష కాకుండా, కులం ఆధారంగా మారిపోతున్నాయి
- రాష్ట్ర విభజన జరిగిన తర్వాతా... రెండు రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి కొనసాగడం శుభపరిణామం
- పాలసీల కొనసాగింపు వల్ల మంచి అభివృద్ధి జరిగింది
- డెక్కన్ ప్రాంతం ఈ దేశానికి గ్రోత్ ఇంజన్
- ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలు ఈ దేశ అభివృద్ధికి గ్రోత్ ఇంజన్‌లా పని చేస్తున్నాయి
- 50 శాతం జనాభా హిందీ రాష్ట్రాలలో ఉంటే, దక్షిణాది రాష్ట్రాలు 50% జిడిపి దేశానికి అందిస్తున్నాయి
అమర్, రచయిత
- తెలుగు రాజకీయాలపై ఢిల్లీలో అపోహలు, పొరపాటు అభిప్రాయాలు ఉన్నాయి
- ఢిల్లీ మీడియా దక్షిణ రాజకీయాలను సరైన రీతిలో పట్టించుకోలేదు
- ఢిల్లీ మీడియా తప్పుడు అభిప్రాయాలను సరిచేసేందుకే ఈ పుస్తకం తీసుకొచ్చాం
- అందుకే దక్షిణాది రాజకీయాల అంశాన్ని ఎంచుకుని పుస్తకం రాశాను
- 47 ఏళ్ల జర్నలిస్ట్ జీవితంలో అనేక అనుభవాలను ఈ పుస్తకంలో ప్రస్తావించాను
వెంకట్ నారాయణ, సీనియర్ జర్నలిస్ట్
- దక్కన్ రాజకీయాలపై వచ్చిన మంచి పుస్తకం ఇది
- దక్షిణ భారతం నుంచి రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అవుతారని భావిస్తున్నాను
పుస్తకంలో దేవులపల్లి అమర్ ఏ అంశాలు చర్చించారంటే..
తెలుగు రాజకీయాల్లో ముగ్గురు నాయకులు బహుశా ఎప్పటికీ గుర్తుండిపోతారేమో. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అలాగే 14 ఏళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ప్రజాసేవలో భిన్నమైన దారులు ఎంచుకుని, తెలుగునాట రాజకీయాలపై తమదైన ముద్ర వేసిన నేతలు వీరు. ఈ ముగ్గురూ రాజకీయాల్లో ఎంచుకున్న దారుల గురించి, అనుసరించిన పద్ధతుల గురించీ విశ్లేషిస్తుందీ పుస్తకం. 40 ఏళ్ళపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తమదైన ముద్ర వేసిన ఈ నాయకులను అతి దగ్గరగా చూసిన దేవులపల్లి అమర్, తన అనుభవాన్నంతా మేళవించి రాసిన ‘మూడు దారులు’, నాయకుల రాజకీయ క్రీడలను, అధికారం కోసం వెన్నుపోట్లకు సైతం వెనుకాడని వారి తెగింపును కళ్ళకు కడుతుంది.
పుస్తకం అద్యంతం ఆసక్తికరం
ముఖ్యంగా చంద్రబాబు చేసిన ‘వైస్రాయ్ కుట్ర’ పాఠకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీని రెండవ సారి చీల్చి కాంగ్రెస్ (ఐ) అనే కొత్త రాజకీయ పార్టీని 1978 లో ఇందిరాగాంధీ ఏర్పాటు చేయడం మొదలుకుని 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వరకూ అనేక పరిణామాలను, అందుకు కారణమైన నేతల వైఖరిని విపులంగా చర్చించింది ఈ పుస్తకం. గడచిన నలభయ్యేళ్లలో సంయుక్త ఆంధ్రప్రదేశ్ ను పాలించిన మర్రి చెన్నారెడ్డి మొదలుకుని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకూ 11 మంది ముఖ్యమంత్రులతోపాటు ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చోటు చేసుకున్న సంఘటనలపై రచన విశ్లేషణాత్మకంగా సాగింది. పుస్తకం చదువుతున్నంతసేపూ రాజకీయ వేదికపై ఉత్కంఠభరితమైన తెలుగు సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment