Political Affairs
-
హెజ్బొల్లా వారసుడు హషీం?
ఎడతెరిపి లేకుండా ఇజ్రాయెల్ చేస్తున్న ప్రతీకార దాడుల ధాటికి లెబనాన్ ఉగ్రవాద సంస్థ హెజ్బొల్లా కకావికలవుతోంది. ముఖ్యంగా అగ్ర నాయకత్వమంతా దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది ముందు సంస్థ ఆపరేషన్స్ చీఫ్ ఇబ్రహీం అకీల్, తర్వాత టాప్ కమాండర్ ఫౌద్ షుక్ర్. ఇప్పుడు తాజాగా ఏకంగా సంస్థ అధినేత నస్రల్లా. ఇలా ఒకరి తర్వాత ఒకరుగా అగ్ర నేతలందరినీ రోజుల వ్యవధిలోనే మట్టుపెట్టింది ఇజ్రాయెల్. శుక్రవారం నాటి దాడుల్లో నస్రల్లాతో పాటు కనీసం మరో ఇద్దరు అగ్ర నేతలు కూడా మరణించారు. దాంతో హెజ్బొల్లాలో నాయకత్వ సంక్షోభం తలెత్తింది. మూడు దశాబ్దాల పైచిలుకు సారథ్యంలో సంస్థను తిరుగులేని సాయుధ శక్తిగా మార్చిన ఘనత నస్రల్లాది. ఆయన మృతితో ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి ఎదురవుతున్న పెను దాడులను కాచుకుంటూ కష్టకాలంలో సంస్థను ముందుండి నడిపేది ఎవరన్నది పెద్ద ప్రశ్నగా మారింది. కొత్త సారథిగా నస్రల్లాకు వరుసకు సోదరుడయ్యే హషీం సైఫుద్దీన్ పేరు గట్టిగా వినిపిస్తోంది. ద టైమ్స్ ఆఫ్ ఇజ్రాయెల్‌లో ఇప్పటికే ఈ మేరకు కథనం కూడా వెలువడింది. హషీం ప్రస్తుతం హెజ్బొల్లా రాజకీయ వ్యవహారాల చీఫ్‌గా ఉన్నాడు. శుక్రవారం నాటి హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ లక్షిత దాడుల్లో అతను కూడా మరణించినట్టు తొలుత వార్తలొచి్చనా అదేమీ లేదని విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ రాయిటర్స్ తదితర వార్తా సంస్థలు తేల్చాయి. హషీం ప్రస్తుతం హెజ్బొల్లా రాజకీయ వ్యవహారాలు చూడటమే గాక సంస్థ జిహాద్ కౌన్సిల్లో కీలక సభ్యుడు కూడా. 2017 లోనే అమెరికా అతన్ని ఉగ్రవాదిగా ప్రకటించింది. పైగా హెజ్బొల్లాకు కొమ్ముకాసే ఇరాన్‌తో అతనికి అతి సన్నిహిత సంబంధాలున్నాయి. 2020లో అమెరికా మట్టుపెట్టిన ఇరాన్ సైనిక జనరల్ ఖాసీం సులేమానీ కూతురు జైనబ్‌కు హషీం మామ అవుతాడు. నస్రల్లా మాదిరిగానే ఇతను కూడా మతాధికారే. తలపాగతో అచ్చం నస్రల్లాను తలపిస్తాడు. 1964లో దక్షిణ లెబనాన్‌లో పుట్టాడు. 1990ల్లో ఇరాన్ లో ఉన్నత చదువులు చదువుతుండగానే హెజ్బొల్లా అతన్ని వెనక్కు పిలిపించింది. తర్వాత ఏడాదికే నస్రల్లా హెజ్‌బొల్లా్ల చీఫ్ అయ్యాడు. రెండేళ్లకే హషీం సంస్థ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సార థి అయ్యాడు. నాటినుంచే నస్రల్లా వారసునిగానూ గుర్తింపు పొందుతూ వస్తున్నాడు. విద్యా వ్యవస్థ, ఆర్థిక వ్యవహారాలు తదితరాలు చూసుకుంటున్నాడు. మారిన పరిస్థితుల్లో హెజ్బొల్లాకు సారథి కావాలంటే సంస్థ ఇతర అగ్ర నేతలతో పాటు ఇరాన్ మద్దతునూ హషీం కూడగట్టుకోవాల్సి ఉంటుందని అంటున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఢిల్లీ ప్రభావం.. పంజాబ్ క్యాబినెట్లో మార్పులు
చండీగఢ్: ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వంలో మార్పులు చోటుచేసుకున్న దరిమిలా ఆ ప్రభావం పంజాబ్‌పై పడింది. ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ రాజీనామా చేయడం, అనంతరం కొత్త ముఖ్యమంత్రిగా ఆతిశీ ప్రమాణ స్వీకారం చేసిన దరిమిలా పంజాబ్‌లో ఆప్ ప్రభుత్వం భారీ పునర్వ్యవస్థీకరణ దిశగా ముందడుగు వేసింది. పంజాబ్ నీటి సరఫరా, పారిశుధ్యం, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి బ్రహ్మ్ శంకర్ జింపా, సమాచార, పౌరసంబంధాలు, మైనింగ్, భూమి ప్రకటనల శాఖ మంత్రి చేతన్ సింగ్ జోరామజ్రా, పర్యాటక మంత్రి అన్మోల్ గగన్ మాన్‌తో పాటు మరో మంత్రి బాల్కర్ సింగ్ తమ పదవులకు రాజీనామా చేశారు. వీరి రాజీనామాలను పంజాబ్ ప్రభుత్వం ఆమోదించి, వెంటనే గవర్నర్‌కు పంపింది. అనంతరం పంజాబ్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణను ప్రకటించింది. కొత్తగా బరీందర్ కుమార్ గోయల్, తరణ్‌ప్రీత్ సింగ్ సౌంద్, మహీందర్ భగత్, హర్దీప్ సింగ్ ముండియాలను మంత్రివర్గంలో చేర్చుకోనున్నట్లు ప్రకటించింది.ఈ నలుగురు కొత్త మంత్రుల చేత పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా ఈరోజు (సోమవారం) సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్ అయిన తర్వాత కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడం ఇదే తొలిసారి. 30 నెలల భగవంత్ మాన్ ప్రభుత్వంలో ఇది నాల్గవసారి మంత్రివర్గ విస్తరణ. 117 మంది ఎమ్మెల్యేలున్న పంజాబ్ అసెంబ్లీలో సీఎం భగవంత్ మాన్ సహా 15 మంది మంత్రులు కేబినెట్లో ఉన్నారు. మంత్రి మండలిలో మొత్తం 18 మంది మంత్రులు ఉండేందుకు అవకాశముంది. ఇది కూడా చదవండి: Sign Languages Day: ఒకప్పుడు చులకనగా చూసినవాళ్లే నేడు.. -
రాజకీయాల కన్నా.. ఉద్యోగమే మిన్న
సాక్షి, చెన్నై: రాజకీయాల కన్నా, పోలీసు ఉద్యోగమే బెస్ట్ అన్నట్లుగా తనకు అనేక సందర్భాలలో ఆలోచనలు వచ్చినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. ఒక్కోరోజు ఒక్కో సమస్య ఎదురు కావడంతో రాజకీయాల నుంచి తప్పుకుంద్దామా? అనే భావన మదిలో మెదిలినట్లు పేర్కొన్నారు. ఐపీఎస్ ఉద్యోగాన్ని పక్కన పెట్టి బీజేపీతో రాజకీయాల్లోకి అన్నామలై అడుగు పెట్టిన విషయం తెలిసిందే. బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టినానంతరం ఈ మూడేళ్ల కాలంలో పార్టీ బలోపేతానికి ఆయన వీరోచితంగానే శ్రమించారు. అధికార పక్షాన్ని విమర్శలు, ఆరోపణలతో ఉతికి ఆరేయడమే కాకుండా, ప్రధాన ప్రతిపక్షాన్ని సైతం ఎండగట్టంలో ముందున్నారు. ఈ పరిస్థితుల్లో మంగళవారం కోయంబత్తూరులో తనకు ఓట్ల వేసిన వారికి, తనకోసం లోక్‌సభ ఎన్నికలలో శ్రమించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ జరిగిన సభలో అన్నామలై రాజకీయాల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోజుకో సమస్య.. తాన రాజకీయ ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నానని పేర్కొంటూ మనస్సు విప్పి తన మదిలోని భావాలను పంచుకున్నారు. మూడేళ్లుగా తమిళనాడు బీజేపీ అధ్యక్ష సీటులో కూర్చుని ఉన్నానని, ఇందులో కూర్చున్నప్పుడు పలు విషయాలను ఆలోచించే వాడినని వివరించారు. ఈ రాజకీయాలలో ఉండాలా? అవసరమా? అని ఆలోచించడమే కాకుండా, రాజకీయాల కన్నా, పోలీసు ఉద్యోగమే సులభం అని భావించే వాడినని పేర్కొన్నారు. పోలీసు విభాగంలో నలుపు, తెలుపు మాత్రమే ఉంటుందని, నేరం చేశాడా? చేయలేదా? అన్నది కనిపెట్టేయవచ్చ అని అన్నారు. చివరకు రాజకీయాలలో కొనసాగేందుకు గాను పలు విషయాలలో రాజీ పడక తప్పలేదన్నారు. సాధరణ వ్యక్తిలా వెంటనే ఆగ్రహాన్ని ప్రదర్శించ లేనని, తప్పుగా చిత్రీకరిస్తే ఓపికగా నడచుకోక తప్పలేదని తనకు ఎదురైన అనుభవాలను గుర్తు చేశారు. రాజకీయాలో గెలుపు కోసం ఓపిక గా ఉండడం కన్నా, ప్రయత్నం చేయడం అవశ్యమన్నారు. ప్రజా పయనంలో అనేక సందర్భాలలో నిరుత్సాహం, నిరాశ ఎదురైనా, కోపం తెప్పించే పరిస్థితులు ఎదురైనా, కత్తి పట్టి యుద్ధం చేయలేమని వ్యాఖ్యలు చేశారు. కొన్ని సందర్భాలలో వెనుకడుగు వేయక తప్పలేదని పేర్కొంటూ, ప్రస్తుతం 2026 అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా టాప్ గేర్‌లో దూసుకెళ్లాల్సిన అవశ్యం ఏర్పడిందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కోయంబత్తూరులో తాను ఓటమి పాలు కాలేదని, 4.5 లక్షల ఓట్లు చేజిక్కించుకోవడం సాధారణం కాదని, ప్రస్తుతానికి గెలుపు కూత వేటు దూరంలో ఆగి ఉందని, ఏదో ఒక రోజు వరించి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు. -
డింపుల్ యాదవ్ సింపుల్ పొలిటీషియన్
డింపుల్ యాదవ్. సైనిక కుటుంబానికి చెందిన సాదాసీదా అమ్మాయి. అఖిలేశ్ యాదవ్‌ను పెళ్లాడి అనూహ్యంగా బడా రాజకీయ కుటుంబంలో అడుగు పెట్టారు. తొలుత తనను అంతగా ఇష్టపడని ములాయం సింగ్ యాదవ్‌కు ప్రియమైన కోడలిగా మారారు. తండ్రీ కొడుకుల రాజకీయ విభేదాలను పరిష్కరించే స్థాయికి ఎదిగారు. అంతే అనూహ్యంగా రాజకీయ అరంగేట్రమూ చేసినా స్వయంకృషితో ఎంపీగానూ రాణించారు. అలా ఇంటా బయటా ఫుల్ మార్కులు కొట్టేశారు.డింపుల్‌కు తొలుత రాజకీయాలు, కులాల గురించి అస్సలు అవగాహన లేదు. ఆమె పుట్టింది పూర్తి భిన్నమైన కుటుంబం కావడమే అందుకు కారణం. అలాంటిది పెళ్లి తర్వాత వాటిపై లోతుగా అవగాహన పెంచుకున్నారు. కుల సమీకరణాలకు పుట్టిల్లయిన యూపీ వంటి రాష్ట్రంలో బలమైన నాయకురాలిగా ఎదిగారు. స్వతహాగా మితభాషి అయినా వేదిక ఎక్కితే మాత్రం డింపుల్ అద్భుతమైన వక్త. యూపీలోని మెయిన్‌పురి లోక్‌సభ స్థానానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈసారీ అక్కడి నుంచే సమాజ్‌వాదీ అభ్యరి్థగా బరిలోకి దిగుతున్నారు.అనూహ్యంగా రాజకీయాల్లోకి... రాజకీయాల్లోకి రావాలని డింపుల్ ఎప్పుడూ అనుకోలేదు. భర్త అఖిలేశ్ యాదవ్ 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఫిరోజాబాద్, కన్నౌజ్ లోక్‌సభ స్థానాల నుంచి పోటీ చేసి రెండింట్లోనూ విజయం సాధించారు. కన్నౌజ్ను అట్టిపెట్టుకోవడంతో ఫిరోజాబాద్‌కు ఉప ఎన్నిక జరిగింది. దాంతో అక్కడ డింపుల్ బరిలో దిగాల్సి వచి్చంది. కానీ బాలీవుడ్ నటుడు రాజ్‌బబ్బర్ చేతిలో ఓడిపోయారు. 2012లో అఖిలేశ్ యూపీ సీఎం కావడంతో కన్నౌజ్ లోక్‌సభ స్థానమూ ఖాళీ అయింది. అక్కడి నుంచి డింపుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కన్నౌజ్‌కు ప్రాతినిధ్యం వహించిన రెండో మహిళగా, యూపీ చరిత్రలో ఏకగ్రీవంగా ఎంపికైన తొలి మహిళా ఎంపీగా రికార్డు నెలకొల్పారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కన్నౌజ్ స్థానం నుంచి మళ్లీ గెలుపొందారు. 2019లో బీజేపీ నేత సుబ్రతా పాఠక్ చేతిలో ఓడిపోయారు. 2022లో మామ ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి లోక్‌సభ స్థానం ఖాళీ అయింది. ఉప ఎన్నికలో డింపుల్ భారీ విజయం సాధించారు. ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడని డింపుల్ 2017 అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఒంటరిగా ప్రచారం చేశారు. భర్తకు మద్దతుగా 20 ర్యాలీల్లో ప్రసంగించారు. అంతకుముందు కుటుంబ కలహాల వేళ తండ్రీ కొడుకుల మధ్య సఖ్యత నెలకొల్పారు.ప్రేమ, పెళ్లి, పిల్లలు.. డింపుల్ మహారాష్ట్రలోని పుణెలో 1978 జనవరి 15న జని్మంచారు. తండ్రి ఆర్మీ కల్నల్ రామ్‌చంద్ర సింగ్ రావత్. వారిది ఉత్తరాఖండ్. తండ్రి ఉద్యోగరీత్యా పుణె, భటిండా, అండమాన్, నికోబార్ దీవుల్లోని ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలో చదివారు డింపుల్. లక్నో యూనివర్సిటీ నుంచి కామర్స్ డిగ్రీ పొందారు. అఖిలేశ్‌ను తొలిసారి చూసినప్పుడు డింపుల్ ప్లస్ టూ చదువుతున్నారు. ఆమెకు 17 ఏళ్లు, అఖిలేశ్‌కు అప్పుడు 21 ఏళ్లు. ఇంజనీరింగ్ చేస్తున్నారు. కామన్ ఫ్రెండ్ పార్టీలో పరిచయమైంది. తొలి భేటీలోనే మంచి స్నేహితులయ్యారు. పై చదువులకు అఖిలేశ్ ఆ్రస్టేలియా వెళ్లారు. అప్పుడు ఇద్దరూ ఉత్తరాలు రాసుకునేవారు. అలా ప్రేమ చిగురించింది. తిరిగొచ్చాక అఖిలేశ్‌పై పెళ్లి ఒత్తిడి పెరగడంతో డింపుల్ గురించి అమ్మమ్మకు చెప్పారు. కుటుంబ నేపథ్యాలు వేర్వేరు కావడంతో వారు పెళ్లికి అంగీకరించలేదు. అఖిలేశ్ పట్టుదల చూసి తండ్రి ములాయం సింగ్ చివరికి పెళ్లికి అంగీకరించారు. అలా 1999న వారు ఒకటయ్యారు. వారికి ముగ్గురు పిల్లలు. పెద్దమ్మాయి అదితి. అర్జున్, టీనా కవలలు. ఖాళీ సమయాల్లో పుస్తకాలు చదవడం, పెయింటింగ్ వేయడానికి ఇష్టపడతారు డింపుల్. ‘‘పిల్లలే దేశ భవిష్యత్తు. రాజకీయాలతోపాటు పిల్లలకు సమయమివ్వడానికి ఇష్టపడతా’’ అంటారు. -
రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ!
దక్షిణాదిలో కొంతవరకూ తమ ఎన్నికల పోరు ముగిసిన తరువాత కాంగ్రెస్ థింక్ ట్యాంక్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లోని తమ రాయ్‌బరేలీ కోటను కాపాడుకునేందుకు సిద్ధమయ్యింది. తాజాగా ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ సెంట్రల్ కోర్ కమిటీ సమావేశంలో రాయ్‌బరేలీ రాజకీయ సమీకరణాలపై చర్చించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. రాయ్‌బరేలీ నుంచి ఎవరు పోటీ చేస్తారనే దానిపై నేడు (ఆదివారం)వెల్లడికానుంది.ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీ నుంచి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమని తెలుస్తున్నప్పటికీ ఆమె పేరును పార్టీ ఇంకా అధికారికంగా వెల్లడించాల్సివుంది. ప్రియాంక గాంధీ పోటీకి సంబంధించి జిల్లా కాంగ్రెస్ కమిటీకి ఇంకా హైకమాండ్ నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదు. అయితే కాంగ్రెస్ జిల్లా కార్యాలయానికి రంగులు వేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రియాంక గాంధీ రాయ్‌బరేలీకి రాగానే ఆమె తొలుత జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహిస్తారని, ఆ తర్వాత కోర్ కమిటీతో సంప్రదింపులు జరుపుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.జిల్లా కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలకు ఈరోజు (ఆదివారం) చాలా ముఖ్యమైన రోజు. నేడు ప్రియాంక పోటీపై ఢిల్లీ నుంచి సమాచారం వచ్చే అవకాశం ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు పంకజ్ తివారీ మాట్లాడుతూ ఇప్పుడు తాము ఢిల్లీ నుంచి వచ్చే సమచారం కోసం ఎదురు చూస్తున్నామన్నారు. ఏదిఏమైనప్పటికీ రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక పోటీ ఖాయమని, ఆమె ఇక్కడకు రాగానే ఎన్నికల సన్నాహాలు మొదలవుతాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. -
ఎన్డీఏలోకి రాజ్‌ఠాక్రే?
మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరగబోతున్నాయి. ఎంఎన్ఎస్ అధ్యక్షుడు రాజ్‌ఠాక్రే ఎన్డీఏలో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాజ్ ఠాక్రే ఎన్డీయేలో చేరడంపై జరుగుతున్న చర్చలు చివరి దశలో ఉన్నాయని తెలుస్తోంది. దక్షిణ ముంబై సీటును ఎంఎన్ఎస్ అభ్యర్థికి కేటాయించాలని రాజ్ ఠాక్రే డిమాండ్ చేస్తున్నారని సమాచారం. ఈ సీటు నుంచి ఇప్పటికే బీజేపీ తరపున రాహుల్ నర్వేకర్ పేరు వినిపిస్తోంది. కాగా రాజ్ ఠాక్రే డిమాండ్‌పై బీజేపీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. ఈ సీటు కేటాయించిన తర్వాతనే రాజ్‌ఠాక్రే ఎన్డీఏలో చేరనున్నారనే వార్త వినిపిస్తోంది. తాజాగా మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గంతో బీజేపీకి ఒప్పందం ఏమీ లేదని అన్నారు. బీజేపీ, షిండే నేతృత్వంలోని శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (అజిత్ పవార్) కూటమి మధ్య ఒప్పందం కుదిరిందని తెలిపారు. ఈసారి బీజేపీ సీట్ల రికార్డును బ్రేక్ చేస్తుందన్నారు. -
నితీష్ పార్టీ ముక్కలు కానుందా? జేడీయూ ఏం చేస్తోంది?
బీహార్ రాష్ట్ర రాజకీయాల్లో గందరగోళం కొనసాగుతోంది. ఇదే సమయంలో బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏకి పూర్తి మెజారిటీ ఉందని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఉమేష్‌సింగ్ కుష్వాహ ప్రకటించడం విశేషం. ప్రతిపక్షాలు చేస్తున్న వాదనలు పూరిగా నిరాధారమన్నారు. అధికారం కోల్పోయిన తరువాత ప్రతిపక్షం రాజకీయ నిరుద్యోగిగా మారింది. నితీష్ కుమార్ పార్టీ(జేడీయూ)ని విచ్ఛిన్నం చేయడం అసాధ్యం. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు నిరాధారమైన, అసంబద్ధ ప్రకటనలు చేస్తున్నాయని జేడీయూ రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపించారు. గందరగోళ పరిచే రాజకీయాలు ఎప్పటికీ ఫలించవు. చివరికి ‘వారికి’ నిరాశే మిగులుతుంది. రాష్ట్రంలో ఎన్డీఏకి 128 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఇది మెజారిటీ కంటే ఆరు ఎక్కువ. ఈ లెక్కలు ఎన్డీఏకి అనుకూలంగా ఉన్నాయి. దీనికి భయపడే కాంగ్రెస్ తన పార్టీ ఎమ్మెల్యేలందరినీ హైదరాబాద్‌కు తరలించింది. ఎదుటివారి ఇళ్లను ధ్వంసం చేసేందుకు కుట్ర చేసే ముందు ప్రతిపక్షాలు సొంత ఇంటి గురించి ఆలోచించాలని ఉమేష్‌సింగ్ కుష్వాహ సూచించారు. బీహార్ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలి రోజున అంటే సోమవారం(ఫిబ్రవరి 12) బలపరీక్ష జరగనుంది. దీనికి ముందు శనివారం పట్నాలో జేడీయూకి చెందిన మంత్రి శ్రవణ్ కుమార్ నివాసంలో విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు ఎమ్మెల్యేలంతా హాజరు కావాలిన జేడీయూ ఆహ్వానించింది. ఈ విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే ఆదివారం మంత్రి విజయ్ చౌదరి నివాసంలో జేడీయూ ఎమ్మెల్యేల విందు కార్యక్రమం జరగనున్నట్లు తెలుస్తోంది. -
న్యూఢిల్లీ : అమర్ దేవులపల్లి పుస్తకం ఆవిష్కరణ
న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్టు దేవులపల్లి అమర్ రచించిన "ది డెక్కన్ పవర్ ప్లే The Deccan Power Play" పుస్తకాన్ని ప్రధాని మీడియా మాజీ సలహాదారు సంజయ్ బారు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ జర్నలిస్ట్ వెంకట నారాయణ, ఆలిండియా కెమెరామన్ అసోసియేషన్ అధ్యక్షుడు సిన్హా, ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు లహరి తదితరులు హాజరయ్యారు. పుస్తక ఆవిష్కరణ సందర్భంగా అతిథులు పలు కీలక అంశాలను పంచుకున్నారు. సంజయ్ బారు, ప్రధాని మీడియా మాజీ సలహాదారు జాతీయ రాజకీయాల్లో తెలుగు వారి ప్రాధాన్యం తగ్గుతోంది విభజన వల్ల రాజకీయంగా కేంద్రంలో తెలుగు బలం తగ్గింది రాజకీయాలు భాష కాకుండా, కులం ఆధారంగా మారిపోతున్నాయి రాష్ట్ర విభజన జరిగిన తర్వాతా... రెండు రాష్ట్రాల్లో పారిశ్రామిక అభివృద్ధి కొనసాగడం శుభపరిణామం పాలసీల కొనసాగింపు వల్ల మంచి అభివృద్ధి జరిగింది డెక్కన్ ప్రాంతం ఈ దేశానికి గ్రోత్ ఇంజన్ ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలు ఈ దేశ అభివృద్ధికి గ్రోత్ ఇంజన్‌లా పని చేస్తున్నాయి 50 శాతం జనాభా హిందీ రాష్ట్రాలలో ఉంటే, దక్షిణాది రాష్ట్రాలు 50% జిడిపి దేశానికి అందిస్తున్నాయి అమర్, రచయిత తెలుగు రాజకీయాలపై ఢిల్లీలో అపోహలు, పొరపాటు అభిప్రాయాలు ఉన్నాయి ఢిల్లీ మీడియా దక్షిణ రాజకీయాలను సరైన రీతిలో పట్టించుకోలేదు ఢిల్లీ మీడియా తప్పుడు అభిప్రాయాలను సరిచేసేందుకే ఈ పుస్తకం తీసుకొచ్చాం అందుకే దక్షిణాది రాజకీయాల అంశాన్ని ఎంచుకుని పుస్తకం రాశాను 47 ఏళ్ల జర్నలిస్ట్ జీవితంలో అనేక అనుభవాలను ఈ పుస్తకంలో ప్రస్తావించాను వెంకట్ నారాయణ, సీనియర్ జర్నలిస్ట్ దక్కన్ రాజకీయాలపై వచ్చిన మంచి పుస్తకం ఇది దక్షిణ భారతం నుంచి రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అవుతారని భావిస్తున్నాను పుస్తకంలో దేవులపల్లి అమర్ ఏ అంశాలు చర్చించారంటే.. తెలుగు రాజకీయాల్లో ముగ్గురు నాయకులు బహుశా ఎప్పటికీ గుర్తుండిపోతారేమో. దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అలాగే 14 ఏళ్ల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబునాయుడు ప్రజాసేవలో భిన్నమైన దారులు ఎంచుకుని, తెలుగునాట రాజకీయాలపై తమదైన ముద్ర వేసిన నేతలు వీరు. ఈ ముగ్గురూ రాజకీయాల్లో ఎంచుకున్న దారుల గురించి, అనుసరించిన పద్ధతుల గురించీ విశ్లేషిస్తుందీ పుస్తకం. 40 ఏళ్ళపాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై తమదైన ముద్ర వేసిన ఈ నాయకులను అతి దగ్గరగా చూసిన దేవులపల్లి అమర్, తన అనుభవాన్నంతా మేళవించి రాసిన ‘మూడు దారులు’, నాయకుల రాజకీయ క్రీడలను, అధికారం కోసం వెన్నుపోట్లకు సైతం వెనుకాడని వారి తెగింపును కళ్ళకు కడుతుంది. పుస్తకం అద్యంతం ఆసక్తికరం ముఖ్యంగా చంద్రబాబు చేసిన ‘వైస్రాయ్ కుట్ర’ పాఠకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీని రెండవ సారి చీల్చి కాంగ్రెస్ (ఐ) అనే కొత్త రాజకీయ పార్టీని 1978 లో ఇందిరాగాంధీ ఏర్పాటు చేయడం మొదలుకుని 2014లో జరిగిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వరకూ అనేక పరిణామాలను, అందుకు కారణమైన నేతల వైఖరిని విపులంగా చర్చించింది ఈ పుస్తకం. గడచిన నలభయ్యేళ్లలో సంయుక్త ఆంధ్రప్రదేశ్ ను పాలించిన మర్రి చెన్నారెడ్డి మొదలుకుని నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకూ 11 మంది ముఖ్యమంత్రులతోపాటు ప్రస్తుత విభజిత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో చోటు చేసుకున్న సంఘటనలపై రచన విశ్లేషణాత్మకంగా సాగింది. పుస్తకం చదువుతున్నంతసేపూ రాజకీయ వేదికపై ఉత్కంఠభరితమైన తెలుగు సినిమా చూస్తున్నట్టుగా ఉంటుంది. -
బీజేపీ నేత ఈటల దారెటు?
హైదరాబాద్: బీజేపీ నేత ఈటల రాజేందర్ పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగేది ఎక్కడి నుంచి? మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం సాగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని మరోచోటు నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటూ టాక్ నడుస్తోంది. తాను కాంగ్రెస్‌లో చేరడంలేదని ఈటల చెబుతున్నా ప్రచారం మాత్రం ఆగడంలేదు. మరి ఈటల కాంగ్రెస్‌లో చేరతారా? హస్తం గూటికి చేరితే ఎక్కడి నుంచి పోటీచేస్తారు? అసలు ఆయన ఆలోచన ఏంటి?.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. కరీంనగర్ ఎంపీగా మరోసారి విజయఢంకా మోగించాలనే కసితో బీజేపీ నేత బండి సంజయ్ కృషి చేస్తున్నారు. బూత్ లెవల్ మీటింగ్స్ నిర్వహిస్తూ.. సుమారు 20 వేల మంది కార్యకర్తలతో ఓ భారీ సమావేశానికి బండి ఇప్పటికే స్కెచ్ వేసేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తన చిరకాల ప్రత్యర్థి గంగులపైనే ఈసారీ ఓటమిపాలైన బండి.. అదే స్థాయిలో ఓట్లను తెచ్చుకోవడం మాత్రం ఈసారి ఆయనకు మరింత బూస్టప్ ఇచ్చిన అంశం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా కార్యకర్తలు, మీడియాకు ఓ పెద్దపార్టీ అరేంజ్ చేసి.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తనకు బాసటగా ఉండేలా ఓ పథకం వేశారు. మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తెరపైకొస్తున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో బండి సంజయ్ పై ఓటమిపాలైన వినోద్ ఈసారెలాగైనా గెలవాలన్న తపనతో.. ప్రస్తుత నియోజకవర్గ వ్యాప్తంగా శుభకార్యాలతో పాటు.. అన్ని కార్యక్రమాలకూ హాజరవుతూ అందరినీ కలుపుకుపోతున్నారు. కారు, కమలం అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లుగా తెలుస్తున్నా.. రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదే ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేపుతోంది. సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ వ్యవహారాల ఇంఛార్జ్ గా జీవన్ రెడ్డిని నియమించడంతో.. ఆయన నిజామాబాద్ నుంచి బరిలో ఉండే అవకాశాలున్నట్టుగా సమాచారం. కానీ, జీవన్ రెడ్డి మనసు మాత్రం కరీంనగర్ పార్లమెంట్ పైనే ఉన్నట్టుగా మరో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి బరిలో ఉంటారా.. లేక, కరీంనగర్ నుంచి పోటీకి దిగుతారా అన్న చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బరిలో.. ఇదిలాఉంటే.. మరోవైపు కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండబోతున్నారనే ప్రచారం మొదలైంది. ప్రస్తుతం బీజేపీలో కీలకపాత్రలో ఉన్న రాజేందర్ బీజేపీని వీడేది లేదని పైకి చెబుతున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో తన అనుచరుల నుంచి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి బరిలో ఉంటే కలిసొస్తుందనే సూచనలు వస్తున్నట్టుగా సమాచారం. ఈటల మల్కాజిగిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. మల్కాజ్గిరి కంటే.. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే కచ్చితంగా విజయం సాధించవచ్చు.. మళ్లీ రాజకీయంగా స్ట్రాంగ్ కావచ్చని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రిగా కరీంనగర్ జిల్లాపై పట్టున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్‌కు భారీ ఓట్ షేరింగ్ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లతో ఈటలకు అనుకూల పవనాలు వీస్తాయని కొందరు సలహాలిస్తూ ఫోర్స్ చేస్తున్నట్టుగా సమాచారం. త్రిముఖ పోరు..? మొత్తం మీద కరీంనగర్ పార్లమెంట్ సీటుకు గనుక ఈటల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండి గెలిస్తే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా ఆసక్తికర పరిణామాలు జరుగుతాయంటున్నారు. ఇంతకాలం సొంతపార్టీ బీజేపీలోనే ప్రధాన ప్రత్యర్థిలా తయారైన బండికి.. మరోవైపు తన చిరకాల ప్రత్యర్థి పార్టీ అయిన బీఆర్ఎస్ కూ ఏకకాలంలో చెక్ పెట్టినట్టవుతుందనే ఆయనపై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో.. బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్, కాంగ్రెస్ నుంచి ఈటల గనుక బరిలో ఉంటే కచ్చితంగా కరీంనగర్ లో త్రిముఖ పోరు రసవత్తరంగా జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో జీవన్ రెడ్డి బరిలోకి దిగినా ఫైట్ టఫ్ గా ఉండే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. మరి బీజేపీ నేత ఈటల దారెటు? కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవ్వరనేది ఇప్పుడు జిల్లా రాజకీయవర్గాల్లో అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది. ఇదీ చదవండి: సందిగ్ధంలో ఎన్నికలు -
‘సమాజ్‌వాది’ వస్తే.. సీఎంగా డింపుల్ యాదవ్?
యూపీలోని లక్నోలో గల సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం దగ్గర వెలసిన ఒక పోస్టర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ పోస్టర్లో డింపుల్ యాదవ్‌ను యూపీకికి కాబోయే ముఖ్యమంత్రిగా చూపించారు. ఇంతేకాదు ఈ పోస్టర్లో డింపుల్ యాదవ్ ఫొటోను అఖిలేష్ యాదవ్ కంటే పెద్దదిగా చూపించారు. ఈ నేపథ్యంలో ఈ పోస్టర్ వెనుక కథనం అంటూ పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయం దగ్గర తరచూ పోస్టర్లు కనిపించడం సాధారణమే. అయితే తాజాగా వెలసిన డింపుల్ యాదవ్‌కు సంబంధించిన పోస్టర్ హెడ్‌లైన్స్‌లో నిలిచింది. ఈ హోర్డింగ్‌ను ఎస్పీ నేత అబ్దుల్ అజీమ్ ఏర్పాటు చేశారు. ఇందులో దుప్పట్ల పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ఇవ్వడంతో పాటు, డింపుల్ యాదవ్‌ను యూపీకి కాబోయే కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. జనవరి 15న డింపుల్ యాదవ్ పుట్టినరోజు. దీనికి ముందుగానే పార్టీ కార్యాలయం ముందు ఈ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్ అనేక అర్థాలకు అవకాశమిస్తోంది. దీనిని చూసిన కొందరు ఇకపై అఖిలేష్ యాదవ్ దేశరాజకీయాలపై దృష్టిపెడతారని, అతని స్థానంలో డింపుల్ యాదవ్ యూపీ బాధ్యతలు చేపడతారని వ్యాఖ్యానిస్తున్నారు. ఇదిలావుండగా అఖిలేష్ యాదవ్ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కన్నౌజ్, అజంగఢ్ లోక్‌సభ స్థానాల నుంచి అఖిలేష్ యాదవ్ పోటీ చేయవచ్చంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
పాక్‌లో సత్తా చాటుతున్న మహిళా నేతలు వీరే!
పాకిస్తాన్లో 2024 ఫిబ్రవరి 8న సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. జైల్లో ఉన్న ఇమ్రాన్‌ఖాన్ నామినేషన్‌పై ఓ వైపు చర్చ జరుగుతుండగా, మరోవైపు తొలిసారిగా హిందూ మహిళ డాక్టర్ సవీరా ప్రకాష్ ఎన్నికల రంగంలోకి దిగడం కూడా ఉత్కంఠ రేపుతోంది. పురుషాధిక్య పాకిస్తాన్ రాజకీయాల్లో తమదైన ముద్ర వేసిన కొందరు మహిళా నేతలు కూడా ఉన్నారు. వారెవరో.. వారి ప్రాముఖ్యత ఏమిటో ఇప్పుడు చూద్దాం. మరియమ్ నవాజ్: పాకిస్తాన్ రాజకీయాల్లో అగ్రశ్రేణి మహిళా రాజకీయ నేతలలో మరియమ్ నవాజ్ పేరు ముందుగా వినిపిస్తుంది. ఆమె పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, కుల్సూమ్ నవాజ్‌ల కుమార్తె. ఆమె తన తండ్రితో పాటు రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. ఆయలా మాలిక్: ఇమ్రాన్ ఖాన్ ప్రచార నిర్వాహకురాలు ఆయలా. ఈమె మామ పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు సర్దార్ ఫరూక్ అహ్మద్ ఖాన్ లెఘారీ. ఆయలా సోదరి సుమైరా మాలిక్ కూడా రాజకీయాల్లో చురుకుగా ఉన్నారు. అలీజ్ ఇక్బాల్: పాకిస్తాన్ మాజీ ఎంపీ అలీజ్ ఇక్బాల్ హైదర్ అక్కడి ప్రముఖ మహిళా నేతల్లో ఒకరు. అలీజ్ తండ్రి ఇక్బాల్ హైదర్ చట్టసభ సభ్యుడు. అలీజ్.. బిలావల్ భుట్టో జర్దారీకి ప్రతినిధిగా కూడా ఉన్నారు. షాజియా మేరీ: పాక్ మహిళా నేతలలో షాజియా మేరీ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. షాజియా మేరీ సింధీ బలూచ్ పాకిస్తాన్ రాజకీయనేత. ఆమె 2002లో సింధ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. హీనా రబ్బానీ ఖర్: పాక్‌కు చెందిన మహిళా నేత హీనా రబ్బానీ ఖర్ తన ప్రత్యేక ప్రసంగాలతో ఎంతో పేరు తెచ్చుకున్నారు. హీనా రబ్బానీ ఖర్ 2011- 2013 మధ్య కాలంలో పాకిస్తాన్ విదేశాంగ మంత్రిగా పనిచేశారు. కష్మలా తారిక్: కష్మలా తారిక్ పాక్‌లో మహిళల రక్షణకు పాటుపడుతున్నారు. ఆమె 2018 నుండి రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తున్నారు. కష్మలా పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యురాలు. షర్మిలా ఫారూఖీ పాక్ రాజకీయాలపై లోతైన అవగాహన కలిగిన మహిళా నేతగా షర్మిలా ఫారూఖీ పేరొందారు. ప్రస్తుతం షర్మిల పాకిస్తాన్‌లోని సింధ్ ముఖ్యమంత్రికి సలహాదారుగా ఉన్నారు. మార్వి మెమన్: మార్వి మెమన్ ప్రస్తుతం బెనజీర్ ఇన్కమ్ సపోర్ట్ ప్రోగ్రామ్ చైర్‌పర్సన్‌గా ఉన్నారు. ఆమె అతి పిన్న వయస్కురాలైన మహిళా ఎమ్మెల్యేగానూ పేరొందారు. హీనా పర్వేజ్ బట్ హీనా పర్వేజ్ బట్ తరచూ ప్రజల మధ్య తిరుగుతూ ఉత్తమ నేతగా పేరు తెచ్చుకున్నారు. హీనా.. లాహోర్ విశ్వవిద్యాలయం నుంచి గోల్డ్‌మెడల్ సాధించారు. సుమైరా మాలిక్ మానవ హక్కుల కార్యకర్తగా సుమైరా ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆమె ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. పాక్ మహిళల అభిమానాన్ని సుమైరా చూరగొన్నారు. -
'రాజకీయ పార్టీల విరాళాలపై.. ప్రజలకు ఆ హక్కు లేదు'
ఢిల్లీ: రాజకీయ పార్టీలకు నిధుల కోసం ఉద్దేశించిన ఎలక్టోరల్ బాండ్ల పథకంలో ఎలాంటి అవకతవకలు జరగడం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ నిధులు ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలుసుకునే హక్కు ప్రజలకు ఉండదని తెలిపింది. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి సుప్రీంకోర్టుకు లిఖితపూర్వకంగా పేర్కొన్నారు. ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం (అక్టోబర్ 31న) సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో న్యాయస్థానానికి కేంద్రం తన వాదనను సమర్పించింది. "ఎలక్టోరల్ బాండ్ల విధానంలో విరాళాలు సమర్ఫించే దాతల గోప్యతను కాపాడాల్సి ఉంటుంది. ఈ పథకం స్వచ్ఛమైన డబ్బును రాజకీయ పార్టీలకు అందిస్తుంది. ఈ విరాళాలు పన్ను బాధ్యతలకు కట్టుబడి ఉండేలా చేస్తుంది. అందువల్ల ఇది ఏ హక్కుకు కూడా భంగం కలిగించదు" అని అటార్ని జనరల్ సుప్రీంకోర్టుకు తెలిపారు. ఎన్నికల బాండ్ల సమాచారం పబ్లిక్ డొమైన్లలో ఉండబోదని అటార్ని జనరల్ తెలిపారు. అభ్యర్థుల వివరాలకు సంబంధించి ప్రతిదీ తెలుసుకునే హక్కు ప్రజలకు ఉండదని వెల్లడించారు. రాజకీయ నిధులలో పారదర్శకతను తీసుకొచ్చే ప్రయత్నాల్లో భాగంగా రాజకీయ పార్టీలకు ఇచ్చే నగదు విరాళాలకు జనవరి 2, 2018న ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ఈ ఎన్నికల బాండ్లు ఓ ప్రామిసరీ నోట్ లాంటిది. వ్యక్తులు, కంపెనీలు వీటిని కొనుగోలు చేయవచ్చు. వీటిని రాజకీయ పార్టీలకు విరాళంగా ఇవ్వవచ్చు. ఈ బాండ్లను పార్టీలు నగదుగా మార్చుకుని ప్రచారాల కోసం వాడుకోవచ్చు. ఇదీ చదవండి: ఈడీ ముందు హాజరైన రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ కుమారుడు -
టీడీపీ కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమం అట్టర్ ఫ్లాప్
అమరావతి: టీడీపీ నిర్వహించిన కళ్ళు తెరిపిద్దాం కార్యక్రమం అట్టర్ ఫ్లాప్ అయింది. చంద్రబాబుకు సంఘీభావంగా కళ్ళుకు గంతలు కట్టుకొని నిరసన చేపట్టాలని లోకేష్ పిలుపు నిచ్చినప్పటికీ.. ప్రజలు, టీడీపీ క్యాడర్ పట్టించుకోలేదు. ఇళ్లల్లో నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు బయటికి కూడా రాలేదు. చంద్రబాబు సంఘీభావ కార్యక్రమాలు వరుసగా అట్టర్ ప్లాప్ అవుతున్నాయి. మోత మోగిద్దాం, కాంతిలో క్రాంతి, న్యాయానికి సంకెళ్లు కార్యక్రమాలు ఇప్పటికే అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఫోటోలకు పోజులు కోసం కొంతమంది టీడీపీ సంఘీభావం పేరుతో డ్రామాలు చేస్తున్నారు. ఇదీ చదవండి: ‘లోకేష్ సినిమా డైలాగులు మానుకుంటే మంచిది’ -
లిక్కర్ స్కాం: సంజయ్ సింగ్‌కు కోర్టు స్ట్రాంగ్ వార్నింగ్
ఢిల్లీ: కోర్టు హాల్లో రాజకీయ ప్రసంగం చేసినందుకు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌కు న్యాయస్థానం హెచ్చరికలు జారీ చేసింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు విచారణలో భాగంగా వాదనలు వినిపించే క్రమంలో వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, ప్రధాని నరేంద్ర మోదీల పేర్లు ఎత్తినందుకు సంజయ్ సింగ్‌కు వార్నింగ్ ఇచ్చారు. మరోసారి ఇలా చేస్తే వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే వాదనలు జరుగుతాయని న్యాయమూర్తి తెలిపారు. సంబంధం లేని విషయాల గురించి మాట్లాడవద్దని న్యాయమూర్తి సంజయ్ సింగ్‌కు హెచ్చరించారు. గౌతమ్ అదానీపై తాను చేసిన ఫిర్యాదుపై దర్యాప్తు సంస్థలు పనిచేయడం లేదని సంజయ్ సింగ్ కూడా ఆరోపించారు. ఈడీ దర్యాప్తులో తనను కూడా సంబంధం లేని ప్రశ్నలు అడిగారని సంజయ్ సింగ్ న్యాయస్థానానికి తెలిపారు. 'నా తల్లి నుంచి ఎందుకు డబ్బులు తీసుకున్నాను. నా భార్యకు ఎందుకు రూ.10,000 ఎందుకు పంపాను. అనవసమైన ప్రశ్నలతో ఈడీ ఎంటర్టైన్మెంట్ డిపార్ట్మెంట్గా మారింది. అన్నీ అబద్దాలే. అదానీపై ఫిర్యాదు చేశాను. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు కదలలేదు.' అని సంజయ్ సింగ్ అన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత మరో రెండు వారాలు రిమాండ్ పెంచాలని ఈడీ అభ్యర్థన మేరకు.. న్యాయస్థానం అక్టోబర్ 27 వరకు సంజయ్ సింగ్ రిమాండ్‌ను పొడిగించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో వ్యాపారవేత్త దినేశ్ అరోరా లొంగిపోవడంతో సంజయ్ సింగ్‌పై ఈడీ దూకుడు పెంచింది. ఇప్పటికే అరెస్టైన దినేశ్ అరోరా, మనీష్ సిసోడియాకు మధ్య మీటింగ్‌ను సంజయ్ సింగ్ ఏర్పాటు చేశారని ఈడీ ఆరోపిస్తోంది. ఢిల్లీ ప్రభుత్వంలో సంజయ్ సింగ్ ఎక్సైజ్ శాఖకు మంత్రిగా పనిచేశారు. ఈడీ ఆయన నివాసంపై దాడి చేసి కీలక పత్రాలను కూడా ఇప్పటికే స్వాదీనం చేసుకుంది. ఇదీ చదవండి: Operation Ajay News: ఢిల్లీ చేరుకున్న రెండో విమానం -
సుధీర్ రెడ్డిపై పోస్టర్ల కలకలం
హైదరాబాద్: ఎల్బీనగర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. సుధీర్ రెడ్డిపై రౌడీషీట్ తెరవాలని నియోజకవర్గం మొత్తం రాత్రికి రాత్రే పోస్టర్లు వెలిశాయి. దినపత్రికలలో సైతం పాంప్లెంట్లు పెట్టి ఇంటింటికి పంపించారు గుర్తుతెలియని వ్యక్తులు. పోస్టర్లలో ప్రముఖ వ్యక్తులపై దాడులకు పాల్పడ్డాడని పేర్కొంటూ అగంతకులు కొంతమంది ఫోటోలని కూడా వేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చెంపపేట్ డివిజన్ కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి పేరుతో ఒక ఫోన్ నెంబర్ వేసి దుండగులు పోస్టర్లు అతికించారు. పోస్టర్లు వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ నాయకులు. మరొకసారి మా నాయకునిపై ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇదీ చదవండి: బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి.. క్లారిటీ ఇచ్చిన వివేక్ -
భారత్‌పై కెనడా ప్రధాని ఆరోపణల వెనక ఆంతర్యం ఇదే!
ఒట్టావా: ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసులో భారత ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ అంశంలో అటు కెనడా.. ఇటు భారత్ దౌత్య అధికారులను దేశం విడిచివెళ్లాలని ఆదేశాలను ఇప్పటికే జారీ చేశాయి. అయితే.. ఖలిస్థానీ ఉగ్రవాది అంశంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఎందుకు సానుకూల వైఖరిని ప్రదర్శిస్తున్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది. ఖలిస్థానీల మద్ధతును కూడగట్టుకోవడం వంటి కొన్ని రాజకీయ సమీకరణాల కోసమే ట్రూడో ఈ చర్యలకు పాల్పడ్డారని విశ్లేషకులు అంటున్నారు.. ఇంతకు అవేంటంటే..? ట్రూడో పాలనపై వ్యతిరేకత కెనడాలో ప్రస్తుతం జస్టిన్ ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ కష్టకాలంలో ఉంది. ట్రూడో పాలనపై అక్కడి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల అబాకస్ డేటా సర్వే కూడా ఈ విషయాన్నే వెల్లడించింది. కెనడా యువత లిబరల్ పార్టీ కంటే కన్జర్వేటివ్ పార్టీ వైపే మొగ్గు చూపుతున్నారట. ప్రజాభిప్రాయాన్ని సేకరించే ఆంగస్ రీడ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. ట్రూడో పట్ల కేవలం 33 శాతం మంది మాత్రమే సానుకూల వైఖరి కలిగి ఉన్నారు. దాదాపు 63 శాతం మందికి ట్రూడో పాలనపై వ్యతిరేక అభిప్రాయాలు ఉన్నాయని సర్వే పేర్కొంది. అటు.. భారత్‌లో జరిగిన జీ20 సమ్మిట్‌కి ట్రూడో పర్యటన ఆ దేశంలో విమర్శలకు దారి తీసింది. విమానంలో సాంకేతిక లోపాల కారణంగా కెనడా ప్రధాని ట్రూడో భారత్‌లోనే రెండు రోజులు ఉండాల్సి వచ్చింది. దీంతో కెనడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఎంతటి దారుణానికి దిగజారిందో అర్థమవుతోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ద్రవ్యోల్భణం, ధరలు.. ట్రూడో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి దేశంలో ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భవన నిర్మాణాల నుంచి కనీస నిత్యావసరాల వరకు అన్ని రంగాల్లో ఖర్చులు అమాంతం పెరిగాయి. ద్రవ్యోల్బణం, అధిక విదేశీయుల తాకిడి విపరీతంగా హెచ్చయింది. ఇమ్మిగ్రేషన్లను పెంచడం ద్వారా దేశ ఆర్ధిక వ్యవస్థను పరుగులు పెట్టించాలని ట్రూడో భావించాడు. కానీ కొత్తగా వస్తున్నవారితో నిరుద్యోగం, జీవన వ్యయం, సేవల కొరతతో ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సమస్యలన్నింటిని కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియర్ పోయిలీవ్రే సమర్థవంతంగా పరిష్కరించగలడని ప్రజలు భావిస్తున్నారు. ఆ పార్టీ మద్దతు కోసమే.. కన్జర్వేటివ్ పార్టీ నాయకుడు పియర్ పోయిలీవ్రేకు కెనడాలో రోజురోజుకు ఆధరణ పెరిగిపోతోంది. వచ్చే ఎన్నికల్లో పియర్ పోయిలీవ్రే ప్రధాని అవుతారనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో జగమీత్ సింగ్ నాయకత్వం వహిస్తున్న ఖలిస్థానీ మద్దతు పార్టీ ఎన్డీపీ మద్దతు అవసరమని ట్రూడో భావించాడని విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఎన్డీపీ 24 సీట్లు సాధించింది. మళ్లీ విజయం సాధించాలంటే ఎన్డీపీ మద్దతు కీలకమని లిబరల్ పార్టీ భావించి ఉంటుందని సమాచారం. అందుకే ఖలిస్థానీ ఉగ్రవాది హర్దిప్ సింగ్ నిజ్జర్ హత్య కేసుపై జస్టిన్ ట్రూడో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదీ చదవండి: కెనడాకు షాకిచ్చిన భారత్.. ఐదు రోజుల్లో వెళ్లిపోవాల్సిందే.. -
చట్టానికి ఎవ్వరు చుట్టం కాదు: పండుగాయల రత్నాకర్
సాక్షి, అమరావతి: పాప భీతి, నైతిక విలువలు ఏమాత్రం లేని వ్యక్తి రాజకీయాల్లో ఉండడం ఎంత ప్రమాదకరమో చెప్పడానికి బాబే ఉదాహరణ అని ఉత్తర అమెరికా ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ అన్నారు. బాబు 45 ఏళ్ళ క్రితం రాజకీయాల్లోకి వచ్చిందే సులువుగా సంపాదించుకోవడం కోసం, అక్రమంగా ప్రజల డబ్బును దోచుకుని తన అవినీతి సామ్రాజ్యాన్ని నిర్మించుకోవడం కోసంమేనని ఆయన అన్నారు. ప్రజలపై, ప్రజాధనం పై ఏమాత్రం గౌరవం లేని వ్యక్తి చంద్రబాబని దుయ్యబట్టారు. అధికారం, డబ్బు, వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకుని తప్పుడు పనులు చేయడం, సొంతమనుషులకు దోచిపెట్టడం ఇవే చంద్రబాబు లక్ష్యాలని విమర్శించారు. 'స్కిల్ డెవెలప్ మెంట్ స్కాం జరిగిన తీరు రాష్ట్రమే సిగ్గుపడేలా ఉంది. 2014లో ఇంటికో ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ భృతి ఇస్తామన్న చంద్రబాబు యువతను నమ్మించి నిలువునా మోసం చేశాడు. అంతటితో ఆగకుండా యువతకు నైపుణ్యాన్ని అందించి సుశిక్షితులు చేసే పేరుతో రూ.371 కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. బాధ్యత మర్చిపోయి నైతిక విలువలు గాలికొదిలి ఇలాంటి దారుణమైన దోపిడీకి చంద్రబాబు పాల్పడ్డాడు.' అని రత్నాకర్ వెల్లడించారు. No more StayBN ….#SkillDevelopmentScam #CorruptionKingCBN #ScamsterChandrababu pic.twitter.com/1maEQJi1ho — Kadapa Rathnakar (@KadapaRathnakar) September 9, 2023 'ప్రజల కళ్లుగప్పి అవినీతి చేద్దామనుకున్న బాబు ఇవాళ అడ్డంగా దొరికిపోయి దబాయిస్తున్నాడు. చట్టం చంద్రబాబుకు చుట్టం కాదు. తప్పు చేస్తే చట్టం ఎంతటివారినైనా ఉపేక్షించదు. ప్రజాధనం ఇష్టమొచ్చినట్టు దోపిడీ చేస్తుంటే చట్టం చూస్తూ ఊరుకోదు. అందులో భాగంగానే ఈ రోజు బాబు అరెస్ట్ జరిగింది. ప్రభుత్వానికి కక్ష సాధించాలని ఉంటె ఎప్పుడో అరెస్ట్ అయ్యేవాడు. చంద్రబాబు అవినీతి చేసాడని రుజువయ్యాకే సీఐడీ అరెస్ట్ చేసింది.' అని రత్నాకర్ పేర్కొన్నారు. బాబు బరితెగించి చేసిన అవినీతి ఇది: 'ఏమాత్రం నియమనిబంధనలు పాటించకుండా, చట్టానికి భయపడకుండా బాబు బరితెగించాడు. సీమెన్స్ సంస్థకు తెలియకుండా ఆ సంస్థ పేరు వాడుకున్నారు. రూ. 3,350 కోట్ల ప్రాజెక్టులో 90% డబ్బు ప్రైవేట్ సంస్థ గ్రాంట్ ఇస్తుందన్నారు. ఎక్కడైనా ప్రైవేట్ సంస్థ 90% గ్రాంట్ ఇస్తుందా ? డీపీఆర్ లేకుండా ప్రాజెక్టుకు ఒకే చేశారు. తేదీలు లేకుండా ఎంవోయూ కుదుర్చుకున్నారు. ఎంవోయూ కుదుర్చుకునే సమయానికి 90% గ్రాంట్ నిబంధన ఎత్తేశారు. షెల్ కంపెనీల ద్వారా చట్టం తన చుట్టం, వ్యవస్థలను మేనేజ్ చేయగలమన్న ధీమాతోనే బాబు దిగజారి ప్రవర్తించాడు. బాబుకు ఈ కేసులో కఠినమైన శిక్ష పడకతప్పదు.' అని రత్నాకర్ చెప్పారు. రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసిన చంద్రబాబు: '2014- 2019 వరకు బాబు అవినీతికి అడ్డుఅదుపూ లేకుండా పోయింది. వ్యవస్థలను అడ్డంపెట్టుకుని అడుగడుగునా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడు. రాజధాని లక్షకోట్ల కుంభకోణం, పోలవరం దోపిడీ, నీరు-చెట్టు, జన్మభూమి కమిటీల లంచాలు, చంద్రన్న కానుకల పేరుతొ దోపిడీ, ఎన్నికలకు 6 నెలల ముందు అన్నా క్యాంటీన్ల నిర్మాణానికి ఇష్టమొచ్చిన రేటుకు కాంట్రాక్టులు.. ఇలా బాబు పాలన అవినీతిమయంగా సాగింది.' అని రత్నాకర్ చెప్పారు. 'దోపిడీయే ఏకైక లక్ష్యంగా రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరి చేసాడు. 75 ఏళ్ళ చరిత్రలో ఇలాంటి చెత్తపాలన మరెక్కడా జరగలేదు. ఆ ఐదేళ్లు ప్రజలను వేధించి తాను మాత్రం జేబులు నింపుకున్నాడు. బాబు పాలనపై విసుగెత్తిన రాష్ట్రప్రజలు సరైన సమయంలో బాబుకు గుణపాఠం చెప్పారు. బాబు అవినీతికి సరైన శిక్షగా 23 సీట్లకు పరిమితం చేశారు. 2024లో బాబుకు 23 సీట్లు కూడా వచ్చే పరిస్థితిలేదని జాతీయ సర్వేలే చెబుతున్నాయి. బాబుకు చట్టం ఎన్ని సంవత్సరాలు శిక్ష వేస్తుందో తెలియదు గానీ.. రాష్ట్ర ప్రజలు మాత్రం బాబుకు జీవితకాలం శిక్ష వేశారు.' అని పండుగాయల రత్నాకర్ అన్నారు. ఇదీ చదవండి: ఏమో.. తెలియదు.. గుర్తు లేదు.. సీఐడీ ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు -
‘ఈటల, రేవంత్ రెడ్డి రహస్యంగా భేటీ అయ్యారు.. ఫొటోలు బయటపెట్టాలా?’
హైదరాబాద్: ఖమ్మంలో జరిగిన సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బీఆర్ఎస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కేసీఆర్, బీజేపీ ఒక్కటే అని చెప్పే క్రమంలో బీఆర్ఎస్.. బీజేపీ బీ టీం అంటూ ఎద్దేవా చేశారు. దీనిపై స్పందించిన రోడ్డు రవాణా శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి రాహుల్ గాంధీ వ్యాఖ్యలను ఖండించారు. రాహుల్‌ని చాలా మంది పప్పు అని పిలుస్తుంటారు.. కానీ అందుకు తగిన వ్యక్తేనని అన్నారు. కాంగ్రెస్, బీజేపీలే ఏ టీం, బీ టీం అంటూ వ్యాఖ్యానించారు. ఈటెల రాజేందర్, రేవంత్ రెడ్డి రహస్య మంతనాలు జరిపిన మాట వాస్తవం కాదా?అని ప్రశ్నించారు. అందుకు సంబంధించిన ఫొటోలు చూపించాలా? అని అన్నారు. భేటీ జరిగిందా? టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. జాతీయ పార్టీలో చేరిన ఆయన హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించి.. బీజేపీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చారు. అయితే.. సాధారణంగా బీజేపీ లాంటి జాతీయ పార్టీల్లో ముందు నుంచి ఉన్న నాయకులకే ప్రాధాన్యత ఎక్కువ. ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న వారికి ప్రధాన బాధ్యతలను అప్పగిస్తారు. పార్టీలో తనకు సరైన ప్రధాన్యత లభించట్లేదని ఈటల రాజేందర్ కొన్ని రోజులుగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని రాజకీయ వర్గాల్లో వార్తలు వచ్చాయి. ఖమ్మం సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా ఈటల ప్రస్తావన మరోసారి తెరమీదకు వచ్చింది. నిజానికి ఈటల, రేవంత్ రెడ్డి టచ్‌లోనే ఉన్నారనే రాజకీయ వర్గాల్లో వినికిడి ఉన్న నేపథ్యంలో వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రధాన్యత సంతరించుకున్నాయి. రాహుల్ గాంధీ.. ఓ రిమోట్ గాంధీ.. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలపై అవగాహన లేకుండా రాహుల్ గాంధీ మాట్లాడారని వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలు ఏంటో గుర్తెరిగి మాట్లాడాలని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాసిచ్చిని స్ర్కప్టిను చదివి వెళ్లాడని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఓ రిమోట్ గాంధీ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ హోదా ఏంటో తెలియదని అన్నారు. గతంలో తెలంగాణ కంటే ముందు పదేళ్లు కాంగ్రెస్ పాలించింది.. మరి అప్పుడు పెన్షన్లు, కల్యాణలక్ష్మి, 24 గంటల కరెంట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో అమలవుతున్న పథకాలను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: ‘వాపును చూసి.. బలుపు అనుకుంటున్న కాంగ్రెస్’ మంత్రి ప్రశాంత్‌రెడ్డి -
'రాహుల్ బాబా ఇది తెలుసుకో..' రాహుల్‌పై అమిత్ షా ఫైర్..
గుజరాత్: స్వదేశాన్ని విదేశాల్లో విమర్శించడం ఏ పార్టీ నాయకుడికైనా తగనిపని అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. భారత్‌ను కించపరచడానికే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు చేస్తున్నారని ఆరోపించారు. రాహుల్ తన పూర్వీకుల నుంచి నేర్చుకోవలసింది చాలా ఉందని సూచించారు. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించిన నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. 'దేశంపై భక్తి ఉన్న ఏ వ్యక్తి అయినా దేశ రాజకీయాలను దేశంలోపలే మాట్లాడుతారు. విదేశాలకు వెళ్లి దేశ రాజకీయాల గురించి ఏ పార్టీ నాయకుడు మాట్లాడరు.దేశాన్ని విదేశాల్లో విమర్శించడం సరైన పని కాదు.ప్రజలు దీన్ని గమనిస్తున్నారు' అని ప్రధాని మోదీ పాలన 9 ఏళ్లు గడిచిన సందర్భంగా గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో నిర్వహించిన సమావేశంలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. దేశ వ్యతిరేక చర్యల గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడకుండా ఉండలేదు. ఎండాకాలం వేడి నుంచి తప్పించుకోవడానికి రాహుల్ విదేశాలకు వెళ్లారని ఎద్దేవా చేశారు. ఇదీ చదవండి:దేశంలో తొలిసారి.. ముంబై అరుదైన ఘనత.. రెండు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లు -
వారాహి యాత్ర ప్యాకేజీనా? పవన్‌పై పేర్ని నాని సెటైర్లు
సాక్షి, అమరావతి: షూటింగ్‌లు లేకనే పవన్ వారాహి యాత్ర చేపట్టారని మాజీ మంత్రి పేర్ని నాని ఎద్దేవా చేశారు. వారాహి మీద పవన్‌ది టూర్ ప్యాకేజీనా?. అన్నవరం, భీమవరం బదులు చంద్రవరం యాత్ర అంటే బాగుంటుందని సెటైర్లు విసిరారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయినందుకు శుభాకాంక్షలు చెబుతావా అంటూ చంద్రబాబును దుయ్యబట్టారు. రాష్ట్రం విడిపోయేప్పుడు ఏం చేశారు?. నవంబర్ 1న ఏపీ అవతరణ దినోత్సవం మీరు ఎందుకు చేయలేదు, చంద్రబాబుకు సెల్ఫ్ డబ్బా ఎక్కువ అని పేర్ని నాని మండిపడ్డారు. ఎన్టీఆర్ గొప్ప వ్యక్తి అయితే ఎందుకు వెన్నుపోటు పొడిచావ్.. ఆయనను పదవి నుంచి ఎందుకు దించేశావ్? అని పేర్ని నాని ప్రశ్నించారు. హైదరాబాద్‌తో చంద్రబాబుకు సంబంధం లేదన్నారు. వైఎస్సార్ సీఎం అయ్యే వరకు హైటెక్ సిటీకి రోడ్డు ఉందా?.. హైటెక్ సిటీకి మౌలిక సదుపాయాలు వైఎస్సార్ కల్పించారన్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు, పీవీ ఎక్స్‌ప్రెస్, ఓఆర్ఆర్ నిర్మాణం వైఎస్సార్ హయాంలోనే జరిగిందని పేర్ని నాని అన్నారు. చదవండి:ఎల్లో మీడియాకు హైకోర్టు దిమ్మదిరిగే గుణపాఠం.. ఆ కుట్రకు గండి పడిందా? -
గుంటూరు, కర్నూలు జిల్లాల్లో సీఎం జగన్ పర్యటన
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు (గురువారం) గుంటూరు, కర్నూలు జిల్లాల్లో పర్యటించనున్నారు. ఉదయం 7.30 గంటలకు తాడేపల్లిలోని నివాసం నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా మంగళగిరికి చేరుకుంటారు. అక్కడ సీకే కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న పేర్నాటి శ్యామ్‌ప్రసాద్ రెడ్డి సోదరుడు పేర్నాటి రామలింగారెడ్డి కుమారుడు కౌశిక్ పెళ్లికి హాజరై వధూవరులను ఆశీర్వదించనున్నారు. అనంతరం అక్కడ నుంచి గన్నవరం చేరుకుని.. కర్నూలు జిల్లాకు బయలుదేరుతారు. పత్తికొండలోని సెయింట్ జోసెఫ్ ఇంగ్లీషు మీడియం స్కూల్లో ఏర్పాటు చేసిన బహిరంగసభా వేదికపై ప్రసంగించనున్నారు. అనంతరం, వరుసగా ఐదో ఏడాది తొలివిడత వైయస్సార్ రైతుభరోసా- పీఎం కిసాన్ పథకం లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. సభ అనంతరం మధ్యాహ్నం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చదవండి:ఏపీ: బడి గంట రోజే ‘కానుక’ -
India new parliament building: ప్రారంభ ‘గౌరవం’పై.. పెను దుమారం
పార్లమెంటు కొత్త భవనం ప్రారంభోత్సవంపై రాజకీయ రగడ తీవ్ర రూపు దాలుస్తోంది. కొత్త భవన ప్రారంభోత్సవం ఈ నెల 28న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగనుండటం తెలిసిందే. అయితే కాంగ్రెస్‌తో పాటు విపక్షాలన్నీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యాంగాధిపతి, దేశాధిపతి, ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిని కాదని ప్రధాని ఎలా ప్రారంభిస్తారంటూ ముక్త కంఠంతో ఆక్షేపిస్తున్నాయి. భవనాన్ని ప్రారంభించాల్సిందిగా మోదీని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆహ్వానించడంపై మండిపడుతున్నాయి. అంతేగాక వి.డి.సావర్కర్ వంటి హిందూత్వవాది జయంతి రోజునే ప్రారంభోత్సవం జరపనుండటాన్ని కూడా విపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ప్రజాస్వామ్య దేవాలయమైన పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని ఒకే వర్గానికి పరిమితయ్యే రోజున చేయనుండటం తప్పేనని వాదిస్తున్నాయి. దాంతో ఈ వివాదం అంతకంతకూ పెద్దదవుతోంది. చివరికి పార్లమెంటు భవన ప్రారంభోత్సవాన్ని కాంగ్రెస్‌తో సహా ఏకంగా 19 ప్రతిపక్ష పార్టీలు బహిష్కరించే దాకా వెళ్లింది. 2024 లోక్‌సభ ఎన్నికలు అంతకంతకూ సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీపై నిర్ణాయకమైన సమైక్య పోరుకు పార్లమెంటు భవనం అంశంతోనే శ్రీకారం చుట్టే యోచనలో విపక్షాలున్నట్టు కనిపిస్తోంది. మొత్తమ్మీద జాతీయ రాజకీయాల్లో త్వరలో కీలక పరిణామాలు చోటుచేసుకునే వాతావరణం కనిపిస్తోందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. ఏడాది ముందే ఎన్నికల వేడి రాజుకుంటోందనేందుకు దీన్ని స్పష్టమైన సూచికగా భావిస్తున్నారు. ప్రతిపక్షాల అభ్యంతరాలేంటి..? పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతే ప్రారంభించాలని ప్రతిపక్ష పార్టీలు వాదిస్తున్నాయి. అవేమంటున్నాయంటే... ► ఆర్టికల్ 79 ప్రకారం ఉభయ సభలైన లోక్‌సభ, రాజ్యసభ, రాష్ట్రపతి కలిస్తేనే పార్లమెంటు. ► సాధారణంగా అంతా రబ్బరు స్టాంపుగా పరిగణించే భారత రాష్ట్రపతి పదవికి రాజ్యాంగం అంతటి ప్రాధాన్యం కట్టబెట్టింది. ► ఉభయ సభలకు అధిపతి గనుక దేశ ప్రథమ పౌరుని హోదాలో కొత్త భవనాన్ని ప్రారంభించే హక్కు కచ్చితంగా రాష్ట్రపతిదే. ► ఎందుకంటే ప్రధాని పార్లమెంటు లోని ఒక అంగమైన లోక్‌సభకు మాత్రమే నేతృత్వం వహిస్తారు. ► ఆ కోణం నుంచి చూస్తే రాజ్యాంగపరంగా కూడా పార్లమెంటు భవనాన్ని ప్రధాని ఆవిష్కరించడానికి వీల్లేదు. ► ఏటా పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించే అధికారం, సార్వత్రిక ఎన్నికల తర్వాత ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేసే అధికారం ఆర్టికల్ 87 ప్రకారం రాష్ట్రపతిదే. ► పార్లమెంటు ఆమోదించే బిల్లులన్నీ ఆర్టికల్ 111 మేరకు రాష్ట్రపతి సంతకంతో మాత్రమే చట్ట రూపం దాలుస్తాయి. ► అలాంటప్పుడు రాష్ట్రపతిని ఉద్దేశపూర్వకంగా విస్మరించడం అధికార బీజేపీ అహంకారానికి, లెక్కలేనితనానికి తాజా నిదర్శనం. గతానుభవాలు ఏం చెబుతున్నాయి? ఇలాంటి విషయాల్లో నిర్దిష్టంగా ఇలా వ్యవహరించాలంటూ నియమ నిబంధనలేవీ లేవు. కాకపోతే గత ప్రధానులు తమ వ్యవహార శైలి ద్వారా వీటి విషయమై చక్కని సంప్రదాయాలను నెలకొల్పి ఉంచారన్నది విపక్షాలు చెబుతున్న మాట. వారిలో కేంద్రం బీజేపీ ప్రభుత్వానికి సారథ్యం వహించిన వాజ్‌పేయి కూడా ఉన్నారని గుర్తు చేస్తున్నాయి. ఆ సంప్రదాయాలను పాటించడం విజ్ఞత అనిపించుకుంటుందని అవి అభిప్రాయపడుతున్నాయి. విపక్షాలు ఏమంటున్నాయంటే... నాడు ‘గాంధీ’ గిరి.. లోక్‌సభ సచివాలయమైన ‘పార్లమెంట్ హౌస్ ఎస్టేట్’ ప్రచురణల రికార్డుల ప్రకారం పార్లమెంటు అనుబంధ భవన నిర్మాణానికి 1970 ఆగస్టు 3న నాటి రాష్ట్రపతి వి.వి.గిరి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయ్యాక భవనాన్ని 1975 అక్టోబర్ 24న నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రారంభించారు. అంటే రెండు కార్యక్రమాలుగా ఇద్దరూ పంచుకున్నారు. అలా చూసినా పార్లమెంటు కొత్త భవన నిర్మాణానికి 2020 డిసెంబర్ 10న మోదీ భూమి పూజ చేశారు. కనుక ప్రారంభోత్సవం రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా జరగాలన్నది విపక్షాల వాదన. వాజ్‌పేయిదీ అదే బాట... 2002లో వాజ్‌పేయి హయాంలో కొత్తగా నిర్మించిన పార్లమెంటు లైబ్రరీ భవనాన్ని నాటి రాష్ట్రపతి కె.ఆర్.నారాయణన్ ప్రారంభించారు. లోక్‌సభ సచివాలయం సంప్రదాయాల ప్రకారం భవనాన్ని ప్రారంభించాల్సిందిగా రాష్ట్రపతినే స్పీకర్ ఆహ్వానించారు. ఇప్పుడు కూడా అదే సంప్రదాయాన్ని పాటిస్తూ పార్లమెంటు కొత్త భవనాన్ని రాష్ట్రపతే ప్రారంభించాలన్నది విపక్షాల డిమాండ్. ‘‘2002లో కేంద్రంలో ఉన్నది మీ బీజేపీ ప్రభుత్వమే. వాజపేయి ప్రధాని హోదాలో రాష్ట్రపతి పదవికి అలాంటి గౌరవమిచ్చారు. కనీసం దీన్నుంచైనా మోదీ నేర్చుకోవాలి’’ అని మోదీకి విపక్ష నేతలు హితవు పలుకుతున్నారు. అలాంటి అవమానాలు వద్దు రాష్ట్రపతి కేవలం దేశ ప్రథమ పౌరుడు మాత్రమే కాదు. ఆర్టికల్ 53 ప్రకారం త్రివిధ బలగాలకు సుప్రీం కమాండర్. మోదీ చేయ బోతున్న పని అక్షరాలా అలాంటి దేశ అత్యున్నత పదవిని విస్మరించించడం, కించపరచడమేనని విపక్షాలంటున్నాయి. రాష్ట్రపతిని ఇలా అవమాని స్తుంటే సహించేది లేదంటూ గట్టిగా హెచ్చరిస్తున్నాయి. రాష్ట్రపతినిలా న్యూనత పరచడం మోదీకి కొత్తేమీ కాదంటూ గత ఉదంతాలను గుర్తు చేస్తు న్నాయి. ‘‘2019 ఫిబ్రవరి 25న ఢిల్లీలో నేషనల్ వార్ మెమోరియల్‌ను ప్రధాని హోదాలో మోదీయే ప్రారంభించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కార్యక్రమానికి దూరం పెట్టి ఘోరంగా అవమానించారు. గణతంత్ర పరేడ్‌లో త్రివిధ బలగాల నుంచి రాష్ట్రపతే గౌరవ వందనం స్వీకరిస్తారు. యుద్ధంలో వీరమరణం పొందే సైనిక యోధులకు వీర చక్ర, అశోక చక్ర వంటి గౌరవ పురస్కారాలనూ ఆయనే ప్రదానం చేస్తారు. అలాంటిది యుద్ధ వీరుల జ్ఞాపకార్థం నిర్మించిన వార్ మెమోరియల్ ప్రారంభోత్సవంలో రాష్ట్రపతికి భాగస్వామ్య మే లేకుండా చేయడం అతి పెద్ద తప్పిదం. మోదీ లెక్కలేనితనానికి ఇది రుజువు’’ అంటూ మండిపడుతున్నాయి. కనీసం ఇప్పుడైనా అలాంటి తప్పిదాన్ని పునరావృతం చేయొద్దని సూచిస్తున్నాయి. కేంద్రం ఏమంటోంది.? ఎటుపోయి ఎటొస్తుందోనని పార్లమెంటు భవనం ప్రారంభోత్సవ రగడపై ఇప్పటిదాకా నోరు మెదపని బీజేపీ నేతలు ఇప్పుడిక తప్పనిసరై ఒక్కోలా స్పందిస్తున్నారు. బహిష్కరణ నిర్ణయంపై విపక్షాలు పునరాలోచించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి అనునయించే ధోరణిలో మాట్లాడారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా మాత్రం, ‘కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించాం. రావడం, రాకపోవడమన్నది వారి విజ్ఞతకే వదిలేస్తాం’ అంటూ కుండబద్దలు కొట్టడం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కేబినెట్లో కొత్త ముఖాలకు చోటు
సాక్షి, చైన్నె: రాష్ట్ర కేబినెట్లో మార్పులకు వేళైంది. సీఎం స్టాలిన్ తన మంత్రి వర్గంలో మార్పులకు సంబంధించిన తాజా జాబితాను సిద్ధం చేసినట్లు సచివాలయంలో చర్చ జోరందుకుంది. నలుగురు మంత్రులకు ఉద్వాసన పలికి, వారి స్థానంలో కొత్త ముఖాలకు అవకాశం కల్పించబోతున్నట్లు తెలుస్తోంది. వివరాలు.. రాష్ట్రంలో డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయ్యింది. ఆదివారం మూడో వసంతంలోకి అడుగు పెట్టింది. గత కొంత కాలంగా పలువురు మంత్రుల పనితీరుపై సీఎం స్టాలిన్ అసంతృప్తితో ఉన్నట్లు ఇప్పటికే సంకేతాలు వెలువడ్డాయి. వీరిలో కొందరిక ఉద్వాసన పలకడం, మరికొందరికి శాఖల్లో మార్పులు చేసే విధంగా కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం మార్పుల జాబితా సిద్ధమైనట్లు తెలిసింది. బుధవారం ఈ జాబితా బయటకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ జాబితాలో ఆర్థిక మంత్రి పళణి వేల్ త్యాగరాజన్, అటవీ శాఖ మంత్రి రామచంద్రన్‌తో పాటు మరో ఇద్దరు మంత్రుల పేర్లు గల్లంతయ్యే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది. -
ఉండవల్లి శ్రీదేవి గురించి అసలు నిజాలు బయటపెట్టిన రమణయ్య నాయుడు
-
రాజకీయరంగంలో సంచలనంగా పళని ప్రస్థానం
తెల్ల చొక్కా, తెల్ల పంచె, నుదుటున విభూదితో కనిపించే పళణి స్వామి ప్రస్థానం తమిళ రాజకీయాల్లో ప్రత్యేకమనే చెప్పాలి. 1954లో సేలం జిల్లా శిలువం పాళయం అనే గ్రామంలో ఆయన జన్మించారు. కోనేటి పట్టిలో బెల్లం వ్యాపారంలో రాణించారు. ఎంజీఆర్ మరణంతో అన్నాడీఎంకే ముక్కలైన సమయంలో 1989లో జయలలిత శిబిరం ఎమ్మెల్యేగా ఎడపాడి నియోజకవర్గం నుంచి తొలిసారి గెలుపొందారు. అప్పటి నుంచి ఎడపాడి ఆయన ఇంటి పేరుగా మారింది. పార్టీ జిల్లా కార్యదర్శిగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా విజయాలతో దూసుకొచ్చిన పళణి స్వామి 2011లో తొలిసారి మంత్రి అయ్యారు. 2016లో మరో మారు మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. జయలలిత మరణం తదుపరి పరిణామాలతో అన్నాడీఎంకేలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో అనూహ్యంగా పళణి స్వామి శాసన సభ పక్ష నేతగా మారారు. జయలలిత నెచ్చెలి, చిన్నమ్మ శశికళ అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్తూ, తన ప్రతినిధిగా పళని స్వామిని ఏకంగా సీఎం పీఠంపై కూర్చోబెట్టింది. ఆ తదుపరి పళనిస్వామి రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతూ, ఎత్తుకు పై ఎత్తులతో శశికళ శిబిరాన్నే పూర్తిగా పక్కన పెట్టారు. అలాగే, పార్టీకి వ్యతిరేకంగా ఉన్న పన్నీరు సెల్వంను అక్కున చేర్చుకుని జంట నాయకత్వంతో ముందుకెళ్లారు. ఎంత కాలం ఈ ప్రభుత్వం కొనసాగుతుందో అని అనుమానం వ్యక్తం చేసిన వారికి తన మార్కు పాలనతో సమాధానం చెప్పారు. ప్రజల మన్ననలే కాదు, అన్నాడీఎంకే కార్యకర్తలు, నాయకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికలలో అన్నాడీఎంకేకు అధికారం దూరమైనా, గౌరవప్రదంగా 65కు పైగా ఎమ్మెల్యేలను గెలిపించుకుని తన ప్రత్యేకత చాటుకున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా పగ్గాలు చేపట్టి.. తనదైన రాజకీయ వ్యూహాలతో ముందుకు సాగారు. ఇక చివరికి అన్నాడీఎంకేలో తిరుగు లేని నేతగా మారి జయలలిత తర్వాత ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టారు. :: సాక్షి, చైన్నె ప్రతినిధి