వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీల్లో జిల్లాకు పెద్దపీట
విజయవాడ : వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీల్లో జిల్లాకు ప్రముఖస్థానం లభించింది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా, సెంట్రల్ గవర్నింగ్ బాడీ సభ్యులుగా, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులుగా జిల్లా ముఖ్య నేతలను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు రాష్ట్ర అధికార ప్రతినిధిగా, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించారు.
గుడివాడ శాసనసభ్యులు కొడాలి నానీని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యునిగా నియమించారు. మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని)కు రాష్ట్ర అధికార ప్రతినిధిగా, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యునిగా బాధ్యతలు అప్పగించారు. పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన, మాజీ మంత్రి కొలుసు పార్థసారథిలను రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు. వాసిరెడ్డి పద్మను సెంట్రల్ గవర్నింగ్‌బాడీ సభ్యురాలిగా ఎంపిక చేశారు. టీవీ చర్చావేదికల్లో పాల్గొనేదుకు మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్‌ను నియమించారు.