Jalil Khan
-
నవరంగ్ కాంగ్రెస్ అధ్యక్షుడికి జనసేన బెదిరింపు
తాడేపల్లి రూరల్: ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేయడానికి వీలు లేదంటూ జనసేన పార్టీ నేతలు తనను బెదిరించి బీఫామ్ పత్రాలు లాక్కున్నారని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఖాన్ ఆరోపించారు. జనసేన పోటీ చేసే స్థానాల్లో ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి తన తలపై గన్ పెట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో షేక్ జలీల్‌ఖాన్ మాట్లాడారు. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గ్లాసు, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు బకెట్ రెండూ ఒకే పోలికతో ఉండటంతో తనను 15 రోజులుగా జనసేన నేతలు బాలÔౌరి, నాదెండ్ల మనోహర్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. రూ.5 కోట్లు ఇస్తామని, బీఫామ్‌లు తమకిచ్చేయాలని బాలÔౌరి ఒత్తిడి చేశారన్నారు. రెండుసార్లు ఇదే విషయమై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో ఫోన్లో మాట్లాడించారని చెప్పారు. తాను ఒప్పుకోకపోవడంతో జనసేన కార్యకర్తలతో చంపిస్తామని మనోహర్ బెదిరించారన్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి విజయవాడ ఐలాపురం హోటల్ వద్ద ఉన్న తనను వల్లభనేని బాలÔౌరి గన్ పెట్టి బెదిరించారన్నారు. తన వద్ద ఉన్న నవరంగ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌లు లాక్కున్నారని వాపోయారు. పవన్ నీచ రాజకీయాలు బీజేపీతో కలసి మైనార్టీలను అణగదొక్కేందుకు పవన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని జలీల్ ఖాన్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌పై పిఠాపురంలోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. ఇప్పటికే డీజీపీ కార్యాలయంలో బాలÔౌరిపైన, ఆయనకు సహకరించిన పవన్, మనోహర్‌పైనా ఫిర్యాదు చేశామన్నారు. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని మైనార్టీలను సర్వనాశనం చేసిన చంద్రబాబుతో జతకట్టిన పవన్‌కు రాష్ట్ర ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. -
విజయవాడ పశ్చిమ టికెట్ నాదే: జలీల్‌ఖాన్
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య సీట్ల పొత్తు ఖరారు కాలేదు. అయితే ఈ రెండు పార్టీ శ్రేణుల మధ్య విజయవాడ పశ్చిమ నియోజకవర్గ సీటు విషయమై రభస జరుగుతోంది. ఆ సీటు తమదేనంటూ టీడీపీలో నలుగురు నాయకులు బహిరంగంగా ప్రకటనలు చేస్తూ పార్టీలో గందరగోళం సృష్టిస్తున్నారు. మరోవైపు పశ్చిమ సీటు తమదేనంటూ జనసేన పార్టీ నాయకులు కూడా ప్రకటనలు ఇస్తూ మరింత రచ్చచేస్తున్నారు. దీంతో రెండు పార్టీల కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు. పెరుగుతున్న దూరం రాష్ట్రంలో తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పశ్చిమ నియోజకవర్గ సీటు జనసేనకు కేటాయిస్తారన్న సమాచారం ప్రచారంలో ఉంది. అయితే కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ నేతలు సీటు విషయంలో ఎవరికి వారు తమదేనంటూ బహిరంగ వేదికలపై పోటీపడి ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఈ వ్యవహారం ఆ రెండు పార్టీల నేతల మధ్య దూరం పెంచుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పొత్తు సన్నాహాలు పూర్తి స్థాయిలో ప్రారంభంకాక ముందే ఈ విధమైన గలాటాలు ఆ పార్టీ శ్రేణులను గందర గోళానికి గురిచేస్తున్నాయి. ఇరు పార్టీల్లోనూ అయోమయం తెలుగుదేశం, జనసేన పార్టీల రెండిటిల్లోనూ గందరగోళనం నెలకొంది. ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ బహిరంగంగా సీట్లు తమవేనంటూ ప్రకటించి హడావుడి చేయటం, జనసేన ప్రచారం చేపట్టడంతో రెండు పార్టీల్లోనూ ఏమిటీ పరిస్థితి అంటూ కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. ఏది ఏమైనా పొత్తుపొడవక ముందే ఆ రెండు పార్టీల్లోనూ అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీలో నాలుగు స్తంభాలాట పశ్చిమ తెలుగుదేశం పార్టీలో నాలుగు స్తంభా లాట కొనసాగుతోంది. ఆ పార్టీ నేతలు ఎవరికి వారు సీటు తమదేనంటూ బహిరంగ సభల్లోనే ప్రకటించి అలజడి సృష్టి చేస్తున్నారు. రెండు మాసాల క్రితం ఆ పార్టీ నేత ఎంఎస్ బేగ్ పుట్టిన రోజు వేడుకలు స్థానిక పంజా సెంటర్లో జరిగాయి. ఆ క్రమంలో ఆ సభకు హాజరైన ఎంపీ కేశినేని నాని పశ్చిమ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థిగా ఎంఎస్ బేగ్ పోటీ చేస్తాడని, అతడిని ఎమ్మెల్యేగా గెలిపించి తీరుతానని సంచలన వ్యాఖ్యలు చేసి ఆ పార్టీలో అలజడి లేపారు. ఇక మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ రెండు రోజుల క్రితం తన పుట్టిన రోజు వేడుకలను పురస్కరించుకొని మైనార్టీ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఆ సభలో టీడీపీ పశ్చిమ సీటు తనదేనని, కేశినేని చిన్ని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని జలీల్‌ఖాన్ ప్రకటించారు. ఆ మరుసటి రోజే మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న పశ్చిమ నుంచి టీడీపీ బీసీ అభ్యర్థిగా తాను పోటీ చేస్తానని, ఒక వేళ మైనార్టీకి సీటు కేటాయిస్తే నాగుల్‌మీరా బరిలో ఉంటారని ప్రకటించారు. జలీల్‌ఖాన్ వ్యవహారంపై తాను స్పందించనని మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. వీరితో పాటుగా మరి కొంత మంది సైతం టీడీపీ సీటు తమదే నంటూ హడావుడి చేస్తున్నారు. జనసేన పార్టీకి చెందిన ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. 2019 ఎన్నికల్లోనూ పోతిన మహేష్ జనసేన అభ్యర్థిగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే ఈ సారి సైతం అదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందాలని భావిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ జనసేన పొత్తులో సీటు తమకే కేటాయిస్తారంటూ ప్రకటిస్తూ ఆయన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు తీరు చూస్తుంటే జనసేనకు పశ్చిమంలో ఝలక్ ఇవ్వటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. -
జూపూడి ప్రభాకర్ రాజీనామా
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవికి జూపూడి ప్రభాకర్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంకు పంపించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో నామినేటెడ్ పోస్టుల్లో నియమితులైన వారు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్నారు. చలనచిత్ర టీవీ నాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ అంబికా కృష్ణ, బ్రాహ్మణ ఫెడరేషన్ చైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య, వక్ఫ్ బోర్డు చైర్మన్ జలీల్‌ఖాన్, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్రావు తదితరులు ఇప్పటికే తమ పదవులను వదులుకున్నారు. -
‘ఆ పదవి పాముల పుట్ట వంటిది.. అందుకే’
సాక్షి, అమరావతి : వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తెలిపారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి జలీల్‌ఖాన్ అభినందనలు తెలిపారు. తన రాజీనామా నేపథ్యంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి అనేది పాముల పుట్టవంటిదని పేర్కొన్నారు. తమ నియోజకవర్గంలో టీడీపీ గట్టి పోటీ ఇచ్చిందని.. నువ్వా నేనా అన్నట్లుగా ఓట్లు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఇతరుల వల్ల కొంత నష్టం జరిగిందని.. ఓడిపోయినా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఎన్నికలు మొత్తం కులరాజకీయాల మీద నడిచాయని పేర్కొన్నారు. కాగా గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచిన జలీల్‌ఖాన్ ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై స్థానికంగా వ్యతిరేకత రావడంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈసారి జలీల్‌ఖాన్ కుమార్తెకు టికెట్ ఇచ్చారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ఫ్యాను హవా వీచిన నేపథ్యంలో ఆమె ఓటమి పాలయ్యారు. నామినేటెడ్ పదవుల రాజీనామా పర్వం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో జలీల్‌ఖాన్‌తో పాటు మరికొంత మంది టీడీపీ నాయకులు కూడా నామినేటెడ్ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఇందులో భాగంగా జమ్మలమడుగు ఏరియా ఆస్పత్రికి చైర్మన్‌గా ఉన్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తనయుడు సుధీర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అదే విధంగా టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి నుంచి అంబికా కృష్ణ వైదొలిగారు. ఇక ఇప్పటికే దుర్గ గుడి పాలక మండలి చైర్మన్ సభ్యులు రాజీనామా సమర్పించగా.. ఎస్వీబీసీ ఛానెల్లో పోస్టు దక్కించుకున్న రాఘవేంద్రరావు కూడా రాజీనామా చేశారు. అదే విధంగా.. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వేమూరి ఆనంద్ సూర్య తెలిపారు. -
జలీల్‌ఖాన్‌పై వైఎస్ఆర్సీపీ నాయకుల ఫిర్యాదు
-
కృష్ణాజిల్లా టీడీపీలో టికెట్ల లొల్లి
సాక్షి, విజయవాడ: ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార టీడీపీలో విభేదాలు భగ్గుమంటున్నాయి. టికెట్ల లొల్లి రోజురోజుకీ రాజుకుంటోంది. స్థానిక ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించవద్దని సొంతపార్టీ నేతలే డిమాండ్ చేయడంతో పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ముఖ్యంగా కృష్ణాజిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు భయటపడుతున్నాయి. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే అభ్యర్థులపై వివాదాలు తారాస్థాయికి చేరాయి. విజయవాడ పశ్చిమ టికెట్‌పై ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ చేసిన ప్రకటన ఆ పార్టీలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. సీటు తన కుమార్తెకే దక్కుతుందని ఇటీవల ఆయనే స్వయంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై పోలీస్ హౌజింగ్ బోర్డు చైర్మన్ నాగూల్ మీరా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు చంద్రబాబు నాయుడు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని నాగూల్ మీరా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ పశ్చిమ టికెట్ దక్కకపోతే టీడీపీకి రాజీనామా చేయాలని ఆయన అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకునేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఎంపీ కేశినేని నానితో కలిసి ముఖ్యమంత్రిని కలిశారు. మరోవైపు నాగుల్ త్వరలోనే పోలీస్ హౌజింగ్ బోర్డు చైర్మన్ పదవికి, టీడీపీకి రాజీనామా చేయనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక పామర్రులో కూడా టీడీపీ అసమ్మతి సెగలుగక్కుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వ్యవహారంపై స్థానిక నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆమెకు వ్యతిరేకంగా మరో వర్గం నేతలు ఏకమవుతున్నారు. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఓ వర్గం టీడీపీ నేతలు ఎన్నారైను రంగంలోకి తీసుకువచ్చారు. (మరో సీనియర్ నేత టీడీపీని వీడనున్నారా..!?) అలాగే నందిగామలో టీడీపీలో కూడా అదే వరుస. సిట్టింగ్ ఎమ్మెల్యే సౌమ్యకు ఈసారి టిక్కెట్ కేటాయించవద్దని అసమ్మతి నేతల నిరసన స్వరం బలంగా వినిపిస్తోంది. ఎమ్మెల్యే అభ్యర్థిగా తంగిరాల సౌమ్యను మార్చాలంటూ టీడీపీ నేతలు ఏకంగా నిరసన దీక్షలకు దిగారు. అలాగే పెడనలో కూడా కాగిత వెంకట్రావు, వేదవ్యాస్ గ్రూపుల మధ్య విభేదాలు రోజురోజుకి ముదురుతున్నాయి. నూజివీడులోనూ టీడీపీ గ్రూపు రాజకీయాలు బయటపడుతున్నాయి. కాపా శ్రీనివాస్, ముద్రబోయిన వర్గాల మధ్య టికెట్ వివాదం తారాస్థాయికి చేరింది. (అమరావతికి టికెట్ల వేడి!) -
జలీల్ ఖాన్‌పై మండిపడ్డ ముస్లీం సంఘాలు
సాక్షి, విజయవాడ : జుమ్మమసీద్ స్థలాన్ని అన్యాక్రాంతం చేస్తున్నారంటూ ముస్లిం సంఘాలు మండిపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే ,వక్ఫ్ బోర్డు చైర్మన్ జలీల్ ఖాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జుమ్మమసీద్ సెంటర్లో ఆందోళకు దిగాయి.పలు ముస్లిం సంఘాల ఆందోళనతో విజయవాడలో ఉదృక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముడుపులు తీసుకొని ముస్లిం ఆస్తులను ఇతరులకు అప్పగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీడీపీని నమ్ముకుంటే మోసం చేశారు..
సాక్షి, అమరావతి : రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌గా జలీల్ ఖాన్ నియామకంపై తెలుగుదేశం పార్టీలోని మైనార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి ఇవ్వకపోవడంపై టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అమీర్ బాబు కలత చెందారు. 25 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకుని ఉంటే, వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వకుండా మోసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్, ఇతర డైరెక్టర్లు ప్రమాణ స్వీకారుం చేస్తుండగా అమీర్ మధ్యలోనే వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి తన అసంతృప్తిని తెలియజేశారు. ముఖ్యమంత్రి వారించిన వినకుండా తనకు కేటాయించిన వక్ఫ్ బోర్డు డైరెక్టర్ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సమర్పించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
మండలాల విభజనపై జలీల్‌ఖాన్ అభ్యంతరం
సాక్షి, విజయవాడ : విజయవాడ అర్బన్ మండలాన్ని నాలుగు మండలాలుగా విభజించాలనే ప్రభుత్వ నిర్ణయంపై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అభ్యంతరం తెలిపారు. తనకు అనుకూలంగా ఉన్న డివిజన్లు తన మండల పరిధిలోనే ఉంచాలంటూ ఆయన అధికారులకు లేఖ రాయడం చర్చనీయాంశమైంది. అయితే, ఎమ్మెల్యే ప్రతిపాదనను పరిశీలించాక విభజనపై తుది నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. కాగా, ఎమ్మెల్యే కోరినట్టు మారిస్తే మండలాల సంఖ్య తగ్గే అవకాశం ఉంది. జనాభా, డివిజన్ల ఆధారంగా.. విజయవాడ నగరంలో 59 డివిజన్లు, జనాభాను దృష్టిలో పెట్టుకుని అధికారులు నాలుగు మండలాలను రూపొందించారు. నగరంలోని 10.50 లక్షల జనాభా నాలుగు మండలాలకు సమానంగా సరిపోయేలా కొన్ని డివిజన్లను విభజించారు కూడా. ఒక్కో మండల కార్యాలయ పరిధిలో 14 డివిజన్లు ఉండేలా నోటిఫికేషన్ తయారుచేశారు. ఈ నోటిఫికేషన్‌పై ఏవైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని అధికారులు కోరారు. దీనిపై ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నాలుగు.. మూడయ్యే అవకాశం జలీల్‌ఖాన్ కోరినట్టుగా ఉత్తర మండల పరిధిలోని మూడు డివిజన్లు పశ్చిమ మండలంలోకి మారిస్తే పశ్చిమ మండలంలో జనాభా ఎక్కువవుతారు. ఉత్తర మండలంలో జనాభా తగ్గుతారు. కనీసం ఐదారు వేల మంది తగ్గితే ఉత్తర మండలాన్ని తీసివేసి మిగిలిన డివిజన్లను పశ్చిమ, సెంట్రల్, తూర్పు డివిజన్లలో కలిపేయాల్సి ఉంటుంది. ఎక్కువ మండల కార్యాలయాలు ఉంటే ప్రజలకు సేవలు మరింత సమర్థవంతంగా అందించవచ్చు. కార్యాలయం ఆయా డివిజన్ వాసులకు అందుబాటులో ఉంటుంది. అధికారులపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. నాలుగు మండలాలకు బదులుగా మూడు ఏర్పాటుచేస్తే ఇబ్బందులు పెరుగుతాయి. -
బీకాంలో ఫిజిక్స్.. ఎంకామ్‌లో ఎంఫిల్
ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై సరదాగా ఒక హ్యూమరస్ ఔట్లుక్! ‘ఏపీ బడ్జెట్ ఎలా ఉందండీ మాస్టారూ’ అడిగాడు గోపాత్రుడు.పేపర్ చదువుతోన్న గిరీశం ఏవో లెక్కలు వేసుకుంటున్నాడు. ‘జీడీపీయో ఏదో 11.6 శాతం ఉందంట కదండీ’ మళ్లీ తానే అడిగాడు గోపాత్రుడు. ‘అవునోయ్, దేశానికే అంత లేదు. దేశం జీడీపీ 7.1 శాతమే’. ‘అదేనండీ మా సెందరబాబంటే ఏటనుకుంటున్నారు? పేకాటాడించేత్తారాయన’ అన్నాడు గోపాత్రుడు. ‘నీ అసాధ్యం సంతకెళ్లా, నువ్వు కూడా బడ్జెట్ ఫాలో అవుతున్నావేంట్రా’ అని ఆశ్చర్యంగా అడిగాడు గిరీశం. ‘అవునండీ బాబూ. మా సెందరబాబు సిఎం అయ్యాక అన్నీ ఫాలో అవుతున్నా’ అన్నాడు గోపాత్రుడు నవ్వుతూ. ‘ఒరేయ్ మరి మీ చంద్రబాబు సిఎం అయ్యాక వ్యవసాయం ఎలా ఉందిరా’ అని అడిగారు గిరీశం. ‘అంటే... అంతకుముందు కంటే తగ్గిందిలెండి’ అన్నాడు. ‘సరేలేరా అది వదిలేయ్, ఇండస్ట్రీలూ గట్రా బాగా వచ్చాయా?’ ‘అబ్బే... అయింకా రాలేదండి. కానీ వత్తాయండి. వచ్చాక బోలెడు డెవలప్‌మెంటూ గట్రా ఉంటాదండి’ అన్నాడు గోపాత్రుడు. ‘డిస్కంలు కూడా నష్టాల్లో ఉన్నాయట?’ అడిగాడు గిరీశం. ‘అవునండీ. ఎదవది. ఏకంగా 62 శాతం లాసండీ బాబూ’. ‘రుణమాఫీకి బడ్జెట్లో బాగా డబ్బిచ్చారా?’ అడిగాడు గిరీశం. ‘అంటే డబ్బులకి కొంచెం ఇబ్బంది కదండీ... 80వేల చిల్లర కోట్లకు గాను మూడువేల కోట్లు ఇచ్చారండి’ అన్నాడు గోపాత్రుడు. ‘పోనీ నిరుద్యోగులకు ఉద్యోగాలు బాగా వచ్చాయా?’‘ఉద్యోగాలెక్కడివండీ బాబూ. నేవు. కొత్త పరిశ్రమలు వస్తే ఉద్యోగాలొస్తాయండి’ అన్నాడు గోపాత్రుడు. ‘మరి భృతి?’ అని అడిగారు ‘అదీ నేదండీ బాబూ!’ అని అన్నాడు గోపాత్రుడు. ‘రాష్ట్రం ఆదాయం బాగా పెరిగిందేంట్రా?’ అడిగాడు గిరీశం. ‘నేదండీ బాబూ. డబ్బులకి కటకటలాడే కదా పాపం మా సెందరబాబు అప్పులు చేసుకుంటున్నారు’ అన్నాడు గోపాత్రుడు. ‘మరి ఏదీ బాగా లేనపుడు జీడీపీ 11 శాతం కంటే ఎక్కువ ఎలా వచ్చిందంటావ్?’ అని గిరీశం నవ్వుతూ అడిగాడు. గోపాత్రుడు బుర్రగోక్కున్నాడు. ఏం తట్టలేదు. ‘ఏమోనండీ బాబూ! అయన్నీ నాకెట్లా తెలుస్తాయి. మీరే చెప్పండి’ అని ఆత్రంగా అడిగాడు. గిరీశం నవ్వేసి ‘ఏం లేదురా, ఈ లెక్కలన్నీ మన జలీల్ ఖాన్ చెప్పి ఉంటారు. మ్యాథ్స్‌లో కూడా ఆయన జీనియస్ కదా. ఆయన లెక్కలు నీకూ నాకే కాదు ఎవ్వరికీ అర్థం కావు. ఆఖరికి మీ చెందరబాబుకి కూడా అర్థం కావు. జలీల్‌ఖాన్ ఏమో బీకాంలో ఫిజిక్స్ బ్యాచ్.. మీ చెందరబాబు నాయుడేమో ఎంకామ్‌లో ఎమ్మే, ఎంఫిల్ గట్రా ఇంకేమేం చదివేశాడో. ఇద్దరూ కలిసి యనమల రామకృష్ణుడికి ఏం లెక్కలు చెప్పేసి ఉంటారో. అందుకే జీడీపీ అలా పెరిగిపోయి ఉంటుంది’ అన్నాడు గిరీశం. గోపాత్రుడికి లీలగా అర్థం అవుతోంది. గిరీశం మాస్టారు తనని ఆట పట్టిస్తున్నారని అనుమానం వచ్చింది. - నానాయాజీ 'బీకాంలో ఫిజిక్స్'పై చంద్రబాబు ఆరా..! అసెంబ్లీ లాబీల్లో ‘జలీల్‌ఖాన్ ఫిజిక్స్’ -
అసెంబ్లీ లాబీల్లో ‘జలీల్‌ఖాన్ ఫిజిక్స్’
‘హాయ్ ఫిజిక్స్’ అంటూ పలకరించిన రోజా సాక్షి, అమరావతి: కామర్స్‌లో ఫిజిక్స్ ఉంటుందని, కామర్స్ కూడా మేథమెటిక్సేనని చెప్పి విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో ఇప్పటికీ దానిపై విసు్తృతంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా మంగళవారం అసెంబ్లీ లాబీల్లో జలీల్‌ఖాన్ ఫిజిక్స్ హాట్‌టాపిక్ అయింది. అసెంబ్లీకి వచ్చిన జలీల్‌ఖాన్ ఉదయం 11 గంటల సమయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న లాబీల్లోకి వచ్చారు. ఆయన్ను చూసిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ‘హాయ్ ఫిజిక్స్’ అంటూ పలకరించారు. దీంతో ఆయన అక్కడే ఆగిపోయారు. రోజాతో పాటు మిగతా మహిళా ఎమ్మెల్యేలు విశ్వసరాయి కళావతి, పుష్పశ్రీవాణి, వంతెల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి తదితరులు ఆయన దగ్గరకు వచ్చారు. ‘మేము ధర్నాలు చేసినా, పోలీసులు అరెస్టులు చేసినా మాకు అంత పాపులారిటీ రాలేదు, మీరు కామర్స్‌లో ఫిజిక్స్ ఉంటుందని చెప్పగానే మీకు ఎవరూ ఊహించనంత పాపులారిటీ వచ్చింది..’ అంటూ రోజా ఛలోక్తి విసిరారు. దీనికి జలీల్‌ఖాన్ స్పందిస్తూ... ‘సీదాగా చెబితే ఏ మీడియా వాళ్లైనా సరిగా చూపిస్తారా? ఉల్టాగా చెబితేనే వేస్తారు..’ అంటూ వ్యాఖ్యానించారు. ఇంతలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జంకె వెంకటరెడ్డి, అనిల్ కుమార్ యాదవ్‌లు వచ్చి అన్నా బీకాంలో ఫిజిక్స్‌తో మీరు నేషనల్ ఫిగర్ అయ్యా రన్నా అంటూ జోకు వేశారు. దీనికాయన స్పందిస్తూ.. ‘నేను మాట్లాడింది అంతా వెయ్యలేదు. అయినా మీడియా వాళ్లు వాళ్లకేం కావాలో అదే వేసుకుంటారు. మనం మాట్లాడింది ఎడిట్ చేస్తారు..’ అని అన్నారు. దీనికి అనిల్ కుమార్ స్పందిస్తూ... ‘భవిష్యత్తులో బీకాంలో ఫిజిక్స్ పెట్టొచ్చేమోలే అన్నా...మీ సీఎం అమరావతిని సింగపూర్ చేస్తా, అది చేస్తా, ఇదిచేస్తా అని చెబుతారుకదా...దానికంటే ఇదేమీ తప్పుకాదులే..’ అంటూ నవ్వులు పూయించారు. తర్వాత ఎమ్మెల్యే ముస్తఫాను పలకరించిన జలీల్‌ఖాన్ తాను మళ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని, పవన్ కళ్యాణ్మీద అయినా పోటీ చేసి గెలుస్తానని నవ్వుతూ అంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. -
విజయవాడ పశ్చిమ టీడీపీలో కలకలం
-
జారిపడ్డ జలీల్‌ఖాన్
విజయవాడ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జారి కిందపడ్డారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు సభలో మాట్లాడిన తీరును తప్పుపడుతూ ఆవేశపూరితంగా మాట్లాడిన ఎమ్మెల్యే పోడియం దిగే ప్రయత్నంలో కిందపడిపోయారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు గాయమై రక్తస్రావమైంది. అక్కడున్న ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, టీడీపీ ప్రధాన కార్యదర్శి ప్రభాకరావులు వెంటనే తేరుకొని కిందపడిపోయిన ఎమ్మెల్యేని కూర్చోపెట్టారు. అయితే అక్కడే ఉన్న ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకరరావు ప్రమాదాన్ని పట్టించుకోకుండా మీడియాతో మాట్లాడుతూనే ఉండడం గమనార్హం. -
నేను మంత్రిని కాబోతున్నా..
భక్తులకు ముందస్తు అనుమతిలేకుండా మిఠాయిలు పంచుతున్న విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు పోలీసులు క్లాస్ తీసుకున్నారు. కృష్ణా పుష్కరాలకు వచ్చిన భక్తులకు స్వీట్స్ ఇస్తూ జలీల్‌ఖాన్ పోలీసుల కంటపడ్డారు. దీంతో పోలీసులు పుష్కరాల్లో అనుమతి లేకుండా మిఠాయిలు పంచకూడదని తెలిపారు. నిబంధనలు తెలియవా అని పోలీసులు ప్రశ్నించారు. ఇందుకు ఎమ్మెల్యే 'నేను మంత్రిని అవుతున్నా'అని సమాధానం ఇచ్చారు. అందుకోసమే స్వీట్స్ ముందే పంచుతున్నానని హడావిడి చేశారు. పోలీసులు చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
సమావేశానికి వస్తేనే ఇళ్లు
► ముస్లింలకు జలీల్‌ఖాన్ వల ► ఇళ్ల పేరుతో ఏమార్చే యత్నాలు ► చంద్రబాబు పది వేల ఇళ్లు ► తనకిచ్చారంటూ ప్రచారం వన్‌టౌన్ : ‘మీరు మీటింగ్‌కు వస్తేనే మీకు ఇళ్లు ఇప్పిస్తా. లేకుంటే లేదు. చంద్రబాబు పశ్చిమ నియోజకవర్గంలో పదివేల ఇళ్లు ముస్లింలకు ఇవ్వమని ఇచ్చారు. అవన్నీ రేపు మీటింగ్‌కు వచ్చినవారికే ఇస్తా...’ అంటూ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ వల విసురుతున్నారు. ఏప్రిల్ రెండో తేదీన స్థానిక గాంధీజీ నగరపాలకసంస్థ హైస్కూల్ ప్రాంగణంలో ముస్లింల ఆత్మీయ సమ్మేళనం పేరుతో ఆయన సభను నిర్వహించనున్నారు. దీనికి ముస్లిం మత పెద్దలు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును ఆహ్వానించారు. అయితే పార్టీమారిన నేపథ్యంలో నియోజకవర్గంలో చాలా మంది ఆయనపై కినుకవహించారు. ముఖ్యమంత్రి వద్ద తన బలాన్ని నిరూపించుకోవడానికి ఈ సభ నిర్వహిస్తున్నారని పలువురు అంటున్నారు. అయితే స్థానికుల ఆదరణ కరువైందని భావించిన జలీల్‌ఖాన్ ఇతర ప్రాంతాల నుంచి జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే ఇటీవల ఇబ్రహీంపట్నంలో జలీల్‌ఖాన్ తీరుపై అక్కడి ముస్లింలు మండిపడిన విషయం తెలిసిందే. 15 రోజులుగా ప్రచారం సభ విజయవంతం కోసం జలీల్‌ఖాన్ తన అనుచరులతో పదిహేను రోజులుగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. తనకు చంద్రబాబు పదివేల ఇళ్లు కేటాయించారని జలీల్‌ఖాన్ చెప్పారని పలువురు వించిపేట మహిళలు చెబుతున్నారు. పశ్చిమంలో ముస్లింలేనా ప్రజలు ? పశ్చిమ నియోజకవర్గంలో ముస్లింలు మాత్రమే ఉన్నారా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గంలో వివిధ సామాజిక వర్గాలకు చెందిన లక్షలాది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఒక వేళ ప్రభుత్వం ఇళ్లను మంజూరు చేస్తే అన్ని వర్గాలకు సమానంగా ఇళ్లను కేటాయించాల్సి ఉంటుంది. పేదల అర్హతలను బట్టి ఇళ్లను కేటాయించకుండా ముస్లింలకే కేటాయించాలని చూడటం దుర్మార్గమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అంతా మాయే ! జలీల్‌ఖాన్ చెబుతున్న ఇళ్లు మంజూరు అంతా ఆయన సృష్టించిన మాయేనని పలువురు కార్పొరేటర్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇళ్ల కేటాయింపు జరిగితే నగరపాకలసంస్థకు, స్థానిక ప్రజాప్రతినిధులైన కార్పొరేటర్లకు సమాచారం లేకుండా జరగదని వారు చెబుతున్నారు. సభ విజయవంతంకోసం జలీల్ ప్రచారంపై పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. -
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీల్లో జిల్లాకు పెద్దపీట
విజయవాడ : వైఎస్సార్ సీపీ రాష్ట్ర కమిటీల్లో జిల్లాకు ప్రముఖస్థానం లభించింది. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులుగా, సెంట్రల్ గవర్నింగ్ బాడీ సభ్యులుగా, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యులుగా జిల్లా ముఖ్య నేతలను నియమిస్తూ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు రాష్ట్ర అధికార ప్రతినిధిగా, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యునిగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతలు అప్పగించారు. గుడివాడ శాసనసభ్యులు కొడాలి నానీని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యునిగా నియమించారు. మచిలీపట్నం నియోజకవర్గ సమన్వయకర్త పేర్ని వెంకట్రామయ్య(నాని)కు రాష్ట్ర అధికార ప్రతినిధిగా, పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ సభ్యునిగా బాధ్యతలు అప్పగించారు. పామర్రు శాసనసభ్యురాలు ఉప్పులేటి కల్పన, మాజీ మంత్రి కొలుసు పార్థసారథిలను రాష్ట్ర అధికార ప్రతినిధులుగా నియమించారు. వాసిరెడ్డి పద్మను సెంట్రల్ గవర్నింగ్‌బాడీ సభ్యురాలిగా ఎంపిక చేశారు. టీవీ చర్చావేదికల్లో పాల్గొనేదుకు మైలవరం నియోజకవర్గ సమన్వయకర్త జోగి రమేష్‌ను నియమించారు. -
మైనార్టీల మోసానికేనా బ్యాంకు హామీ?
హైదరాబాద్: ఎన్నికల ముందు ముస్లిం మైనారిటీలకు తెలుగుదేశం పార్టీ అరచేతిలో స్వర్గం చూపి అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపుతోందని ప్రతిపక్ష వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఇస్లామిక్ బ్యాంకుల ఏర్పాటు సాధ్యం కానప్పుడు ఎందుకు అటువంటి హామీ ఇచ్చారని నిలదీసిం ది. వైఎస్సార్సీపీ సభ్యులు ఎస్వీ మోహన్‌రెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, జలీల్‌ఖాన్, అత్తర్ చాంద్‌బాషా, మహమ్మద్ ముస్తాఫా షేక్, అంజాద్ బాషా అడిగిన ప్రశ్నకు రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం అసెంబ్లీలో సమాధానమిచ్చారు. అటువంటి బ్యాంకుల ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం రాజ్యసభలో స్పష్టం చేసినందున రాష్ట్రంలోనూ అలాంటి బ్యాంకులు నెలకొల్పలేమని తేల్చిచెప్పారు. ఆచరణ సాధ్యంకాని హామీ లు ఎందుకిచ్చారంటూ ప్రశ్నించింది. జనాభాలో 12 శాతం ఉన్న ముస్లిం మైనారిటీలకు మెడికల్ కళాశాల ఒక్కటీ లేదన్నారు. రాష్ట్రంలో హజ్హౌ స్, వక్ఫ్‌బోర్డును ఏర్పాటు చేయాలని జలీల్‌ఖాన్ కోరారు. ఇస్లామిక్ బ్యాంకు ద్వారా కాకుంటే ప్రత్యామ్నాయ మార్గమేమిటో చూపించాలని చాంద్‌బాషా కోరారు. దీనికి మంత్రి రఘునాథరెడ్డి జవాబిస్తూ, ముస్లింమైనారీటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నింటినీ దశల వారీగా అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 4,600 వక్ఫ్‌బోర్డులు, వాటికింద 67,903 ఎకరాల భూములున్నట్టు వివరించారు. వేలాది ఎకరాల వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి సభకు చెప్పారు. -
ఆకస్మిక తనిఖీలు చేస్తా
అవినీతి ఆరోపణలపై మంత్రి ఉమా ఆగ్రహం ఆలయ అధికారులపై ప్రశ్నల వర్షం వారంలో సమాధానాలు చెప్పాలని ఆదేశం విజయవాడ : స్థానిక దుర్గామల్లేశ్వరస్వామి ఆలయం(దుర్గగుడి)లో కొంత కాలంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవకతవకలు, భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించి ఆలయ అధికారులపై రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నల వర్షం కురిపించారు. అమ్మవారి సన్నిధిలో ఐదు వేల మందికి అన్నప్రసాదం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు మంత్రి ఉమా బుధవారం ఆలయానికి వచ్చారు. తొలుత అమ్మవారి సన్నిధికి చేరుకున్న మంత్రి ఉమా, పశ్చిమ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు ఆలయ ఈవో త్రినాథరావు, వేద పండితులు పూర్ణకుంభంతో సాదర స్వాగతం పలి కారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటాలను అందజేసి, సత్కరించారు. అన్నసంతర్పణ ప్రారంభం అన్నదాన భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన రెండో విభాగంలో అమ్మవారి చిత్రపటానికి మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ పూజలుచేశారు. అనంతరం భక్తులకు వారు అన్నప్రసాదాన్ని అందచేశారు. అనంతరం భక్తులను పలుకరిం చారు. అన్నప్రసాదాన్ని శుచిగా, శుభ్రంగా వండేలా చూడాలని ఆలయ ఈవో త్రినాథరావు, అన్నదాన విభాగం అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు, వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి రాంపిళ్ల శ్రీను, దేవస్థాన ఏఈవోలు సాయిబాబు, లక్ష్మీకాంతం, ఈఈలు కోటేశ్వరరావు, మురళీబాలకృష్ణ, డీఈ రమా, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. అధికారులపై ప్రశ్నల వర్షం ఆలయంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై ఉమా సంబంధిత అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు. వీఐపీ లాంజ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఉమా మాట్లాడారు. పలు అంశాలపై మీడియా ద్వారా అధికారులను ప్రశ్నలు అడుగుతున్నానని పేర్కొన్నారు. దాతల నుంచి సేకరించిన విరాళాలతో ఆలయ అభివృద్ధి పనులను ఎందుకు ప్రారంభించలేదని ఇంజినీరింగ్ అధికారులను ప్రశ్నించారు. దుకాణాల్లో పూజాసామగ్రిని అధిక ధరలకు విక్రయిస్తున్నా పట్టించుకోవడంలేదని, ఫుట్‌బ్రిడ్జి, ఆలయ ప్రాగణంలో సుమారు 117 మంది హాకర్లు ఉండగా, వారిలో 90 మంది ఆలయ ఉద్యోగుల బంధవులేనని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని అధికారులను నిలదీశారు. చైనా వాల్ నిర్మాణ సమయంలో ధ్వంసమైన కార్పొరేషన్ వాటర్ పైపులైన్ పునరుద్ధరణకు రూ.50 లక్షలు ఇచ్చినట్లు ఎంబుక్‌లో నమోదు చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. మహామండపం, రాజగోపురం పనుల్లో అలసత్వం. శానిటేషన్, టికెట్ల రీసైక్లింగ్, దసరా, భవానీ దీక్షల సమయంలో దుబారాపై వారం రోజుల్లో తనతో పాటు దేవాదాయ శాఖ మంత్రికి, ముఖ్యమంత్రి పేషీకి వివరణ ఇవ్వాలని ఆదేశించారు. -
చివరి రౌండ్లో జలీల్ ఖాన్ విజయం
హైదరాబాద్ : కృష్ణాజిల్లాలోని 16 నియోజకవర్గాల్లో అయిదు స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. విజయవాడ వెస్ట్, నూజివీడు, గుడివాడ, పామర్రు, తిరువూరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. నూజివీడు- మేకా ప్రతాప్ అప్పారావు, గుడివాడ-కొడాలి నాని, పామర్రు-ఉప్పులేటి కల్పన, విజయవాడ వెస్ట్-జలీల్ ఖాన్ గెలుపొందారు. కాగా విజయవాడ వెస్ట్ స్థానానికి హోరాహోరీగా జరిగిన పోరులో చివరి రౌండ్లో జలీల్ ఖాన్ రెండువేల మెజార్టీతో గెలుపొందారు. ఇక గన్నవరం, కైకలూరు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పెనమలూరు, విజయవాడ సెంట్రల్,విజయవాడ ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, అసెంబ్లీ స్థానాల్లో సైకిల్ హవా కొనసాగింది. అలాగే కృష్ణాజిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లను టీడీపీ సొంతం చేసుకుంది.