హైదరాబాద్: ఎన్నికల ముందు ముస్లిం మైనారిటీలకు తెలుగుదేశం పార్టీ అరచేతిలో స్వర్గం చూపి అధికారంలోకి వచ్చాక మొండిచేయి చూపుతోందని ప్రతిపక్ష వైఎస్సార్ కాం గ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విరుచుకుపడింది. ఇస్లామిక్ బ్యాంకుల ఏర్పాటు సాధ్యం కానప్పుడు ఎందుకు అటువంటి హామీ ఇచ్చారని నిలదీసిం ది. వైఎస్సార్‌సీపీ సభ్యులు ఎస్వీ మోహన్‌రెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డి, జలీల్‌ఖాన్, అత్తర్ చాంద్‌బాషా, మహమ్మద్ ముస్తాఫా షేక్, అంజాద్ బాషా అడిగిన ప్రశ్నకు రాష్ట్ర మంత్రి పల్లె రఘునాథరెడ్డి సోమవారం అసెంబ్లీలో సమాధానమిచ్చారు. అటువంటి బ్యాంకుల ఏర్పాటు సాధ్యం కాదని కేంద్రం రాజ్యసభలో స్పష్టం చేసినందున రాష్ట్రంలోనూ అలాంటి బ్యాంకులు నెలకొల్పలేమని తేల్చిచెప్పారు. ఆచరణ సాధ్యంకాని హామీ లు ఎందుకిచ్చారంటూ ప్రశ్నించింది. జనాభాలో 12 శాతం ఉన్న ముస్లిం మైనారిటీలకు మెడికల్ కళాశాల ఒక్కటీ లేదన్నారు. రాష్ట్రంలో హజ్‌హౌ స్, వక్ఫ్‌బోర్డును ఏర్పాటు చేయాలని జలీల్‌ఖాన్ కోరారు.
ఇస్లామిక్ బ్యాంకు ద్వారా కాకుంటే ప్రత్యామ్నాయ మార్గమేమిటో చూపించాలని చాంద్‌బాషా కోరారు. దీనికి మంత్రి రఘునాథరెడ్డి జవాబిస్తూ, ముస్లింమైనారీటీల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని, ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలన్నింటినీ దశల వారీగా అమలు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో 4,600 వక్ఫ్‌బోర్డులు, వాటికింద 67,903 ఎకరాల భూములున్నట్టు వివరించారు. వేలాది ఎకరాల వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమణకు గురయ్యాయని, వాటిని తిరిగి స్వాధీనం చేసుకునే విషయాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి సభకు చెప్పారు.
మైనార్టీల మోసానికేనా బ్యాంకు హామీ?
Published Tue, Aug 26 2014 1:39 AM | Last Updated on Fri, May 25 2018 9:17 PM
Advertisement