వైఎస్‌ఆర్ సీపీతోనే మైనారిటీలకు మహర్దశ | minority development only possible with ysrcp | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్ సీపీతోనే మైనారిటీలకు మహర్దశ

Published Sun, Nov 23 2014 4:03 AM | Last Updated on Tue, Oct 16 2018 5:58 PM

వైఎస్‌ఆర్ సీపీతోనే మైనారిటీలకు మహర్దశ - Sakshi

వైఎస్‌ఆర్ సీపీతోనే మైనారిటీలకు మహర్దశ

మదనపల్లె: రాష్ర్టంలో ముస్లిం మైనారిటీల దశ, దిశలను మార్చే ఏకైక పార్టీ ఒక్క వైఎస్‌ఆర్ కాంగ్రెస్సేనని ఆ పార్టీ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ షఫీ అహ్మద్ ఖాదరి అన్నారు. శనివారం మదనపల్లెలోని ఎంపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లిం మైనారిటీలకు ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందన్నారు. ఒక్క మైనారిటీకికూడా కేబినెట్‌లో స్థానం ఇవ్వకపోవడంఆ పార్టీ నిరంకుశ ధోరణికి తార్కాణమన్నారు. అన్యాయాలను అడ్డుకునేందుకు మైనారిటీ విభాగాన్ని మరింత పటిష్టం చేయనున్నామని చెప్పారు.

జిల్లావ్యాప్తంగా పర్యటించి, అన్ని మండలాల్లో మైనారిటీ కమిటీలను ఏర్పాటు చేస్తామన్నారు. మండల స్థాయిలో ప్రత్యేక మైనార్టీ కమిటీలను ఏర్పాటు చేసి మైనార్టీల్లో చైతన్యం తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామన్నారు. మరో నాయకుడు చిందేపల్లి మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఒక్క వైఎస్ మాత్రమే పాటు పడ్డారని గుర్తు చేశారు. వైఎస్‌ఆర్ సీపీ ఎస్టీ జిల్లా అధ్యక్షుడు హనుమంతునాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు చంద్రబాబు ప్రభుత్వం తీరని అన్యాయం చేస్తోందని వాపోయారు.

మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి సిరాజ్‌బాషా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మైనారిటీ విభాగాన్ని మరింత పటిష్టం చేస్తామని చె ప్పారు. నియోజకవర్గ మైనారిటీ నాయకులు బాబ్‌జాన్, మాజీ మున్సిపల్ చైర్మన్ గుండ్లూరి షమీం అస్లాం, మున్సిపల్ కౌన్సిలర్ జింకా వెంకటాచలపతి, షరీఫ్, హరిరాయల్, ఎస్‌ఏ కరీముల్లా, కౌన్సిలర్లు మహ్మద్ రఫీ, ముక్తియార్, బాలగంగాధర్‌రెడ్డి, పూల వేమనారాయణ, పూజారి రమేష్, అంజి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement