టీడీపీ నుంచి వైఎస్‌ఆర్‌సీపీలోకి చేరిక
– పార్టీ తీర్థం పుచ్చుకున్న కలుగొట్ల టీడీపీ నాయకులు, ప్రధాన అచుచరులు, 50 కుటుంబాలు
కోవెలకుంట్ల: కలుగొట్ల గ్రామానికి చెందిన టీడీపీ నేతలు, వారి అనుచరులు, 50 కుటుంబాలు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. శనివారం గ్రామంలో గడప గడపకూ వైఎస్‌ఆర్ కార్యక్రమం నిర్వహించారు. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గోపవరం రమేష్‌రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు సుధాకర్‌రెడ్డి, శింగా నాగేశ్వరరెడ్డి, శింగా వెంకటసుబ్బారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, విజయసారథిరెడ్డి తమ అనుచరులతో వైఎస్‌ఆర్‌సీపీ బనగానపల్లె నియోజకవర్గ ఇన్‌చార్జ్, మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి సమక్షంలో పార్టీలో చేశారు. అలాగే టీడీపీకి మద్దతుదారులుగా ఉన్న గ్రామానికి చెందిన జిలాన్‌బాష, చిన్నవలి, ఉసేన్‌బాషా, అక్బర్‌బాషా, దస్తగిరి, రజాక్, మహబూబ్‌బాషా, నబీరసూల్, చిన్న ఉసేని, బొంబాయి, ఉసేన్‌సా, అబ్దుల్‌మియా, తదితర 40 ముస్లిం కుటుంబాలు, వడ్డె రామన్న, అంజితోపాటు మరో పది బీసీ కుటుంబాలు వైఎస్‌ఆర్‌సీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన రమేష్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీలో గుర్తింపులేదని, ఏ పనులు కావడంలేదనే ఉద్దేశంతో పార్టీని వీడినట్లు ప్రకటించారు. కార్యక్రమంలో సౌదరదిన్నె సర్పంచ్ రమణారెడ్డి, చిన్నకొప్పెర్ల మాజీ సర్పంచ్ రఘునాథరెడ్డి, వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగ కార్యదర్శి అబ్రహం, నాయకులు లోకేష్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, శేషిరెడ్డి, జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు.