
సాక్షి, అమరావతి : రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌గా జలీల్ ఖాన్ నియామకంపై తెలుగుదేశం పార్టీలోని మైనార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి ఇవ్వకపోవడంపై టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అమీర్ బాబు కలత చెందారు. 25 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకుని ఉంటే, వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వకుండా మోసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు.
వక్ఫ్ బోర్డు చైర్మన్, ఇతర డైరెక్టర్లు ప్రమాణ స్వీకారుం చేస్తుండగా అమీర్ మధ్యలోనే వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి తన అసంతృప్తిని తెలియజేశారు. ముఖ్యమంత్రి వారించిన వినకుండా తనకు కేటాయించిన వక్ఫ్ బోర్డు డైరెక్టర్ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సమర్పించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు.