ameer babu
-
నాదంటే.. నాదే: కడప టీడీపీలో రగులుతున్న చిచ్చు
సాక్షి, కడప: కడప అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీలో టికెట్ చిచ్చు రగులుతోంది. వచ్చే ఎన్నికల్లోనూ కడప టీడీపీ టికెట్ ముస్లింలకేనని ఓ వర్గం వాదిస్తుండగా.. వరుసగా ఓడిపోతున్న వారికి టికెట్ ఇచ్చేది లేదని, ఈసారి నాన్ మైనార్టీ వర్గానికే అని మరోవర్గం వాదిస్తోంది. పార్టీ అధిష్టానం ఎటూ తేల్చకపోవడంతో కడప టీడీపీ మైనారీ్ట, నాన్ మైనార్టీ వర్గాలుగా విడిపోయి రోడ్డుకెక్కింది. గత ఎన్నికల్లో కడప అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగాపోటీ చేసిన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి అమీర్‌బాబు వైఎస్సార్సీపీ అభ్యర్థి, ప్రస్తుత డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్‌బాషా చేతిలో ఘోర పరాజయం పాలయ్యారు. రాబోయే ఎన్నికల్లోనూ తనకే టీడీపీ టికెట్ వస్తుందని, అధిష్టానం మద్దతు తనకేనని, కచ్చితంగా పోటీలో ఉంటానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. తన వర్గీయులకు ఇదే చెబుతున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కడప సీటును మైనారీ్టల నుంచి తప్పించాలని టీడీపీలోని నాన్ మైనార్టీ వర్గం వేగంగా పావులు కదుపుతోంది. మైనార్టీలు అధికంగా ఉండే కడప నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ తిరుగులేని శక్తిగా ఉంది. ప్రతి ఎన్నికలోనూ ఆ పార్టీ అభ్యర్థి భారీ మెజారీ్టతో వరుసగా గెలుపొందుతూ వస్తున్నారు. ప్రధానంగా ముస్లింలు వైఎస్సార్ సీపీకి మద్దతు పలుకుతున్నారు. ఈ పరిస్థితుల్లో కడప అసెంబ్లీ టీడీపీ టికెట్ ముస్లింలకు కేటాయించినా మైనార్టీలు టీడీపీ అభ్యర్థికి మద్దతు పలికే పరిస్థితి లేదని టీడీపీలోని నాన్ మైనార్టీ వర్గం చంద్రబాబు, లోకేష్‌లకు వివరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో మైనార్టీలకు టికెట్ ఇచ్చినా ఓడిపోవడం మినహా గత్యంతరం లేదని, ఈసారి ఎన్నికల్లో నాన్ మైనార్టీ వర్గానికి టికెట్ ఇస్తే మిగిలిన వర్గాలను దగ్గర చేసుకోవచ్చని కడప అసెంబ్లీ పరిధిలోని కొందరు టీడీపీ నేతలు, జిల్లా స్థాయి టీడీపీ ముఖ్య నేతలు చంద్రబాబుకు చెబుతున్నట్లు తెలుస్తోంది. చదవండి: (శభాష్ భాస్కర్!.. చెవిరెడ్డిని అభినందించిన సీఎం జగన్) ఇదే సమయంలో రాబోయే ఎన్నికల్లో కడప అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు రెడ్డెప్పగారి శ్రీనివాసులురెడ్డి (వాసు), టీడీపీ సీనియర్ నేత ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి పోటీ పడుతున్నారు. శ్రీనివాసులురెడ్డి కడప పార్లమెంట్ అభ్యరి్థగా పోటీ చేయిస్తున్నట్లు ఇటీవల అన్నమయ్య జిల్లా పర్యటనలో చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. ఇదే జరిగితే శ్రీనివాసులురెడ్డి కడప అసెంబ్లీ నుంచి పోటీ చేసే అవకాశం ఉండదు. ఈ పరిస్థితుల్లో ఆలంఖాన్‌పల్లె లక్ష్మిరెడ్డి కడప బరిలో ప్రధాన పోటీ దారుగా ఉన్నారు. లక్ష్మిరెడ్డి లేదా ఆయన కోడలు, కడప నగరం 49వ డివిజన్ కార్పొరేటర్ ఉమాదేవి పోటీలో నిలిచే అవకాశం ఉంది. కడప నియోజకవర్గంతోపాటు జిల్లా టీడీపీలోని ఓ వర్గం లక్ష్మిరెడ్డికే మద్దతు పలుకుతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు పార్టీలో ఆది నుంచి పనిచేస్తున్న గోవర్దన్‌రెడ్డి, ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి తిరిగి టీడీపీలో చేరిన హరిప్రసాద్‌లు సైతం కడప నుంచి పోటీకి సిద్ధమంటూ ప్రచారం చేస్తున్నారు. అమీతుమీకి సిద్ధమవుతున్న అమీర్‌బాబు కడప అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న అమీర్‌బాబు రాబోయే ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థిగా పోటీకి సిద్ధమయ్యారు. గత ఎన్నికల్లో ఓటమి చెందిన అమీర్‌బాబు ఆర్థికంగా భారీగా నష్టపోయినట్లు పార్టీలోని ఆయన అనుచరవర్గం పేర్కొంటోంది. కడప నియోజకవర్గంలో ముస్లిం మైనారీ్టలు కీలక ఓటర్లుగా ఉన్నారు. అమీర్‌బాబు పోటీలో ఉంటే అంతో ఇంతో ముస్లిం వర్గం సైతం మద్దతు పలికే అవకాశం ఉందని, ఆయనకు టికెట్ ఇవ్వకపోతే పారీ్టకి ముస్లిం మైనార్టీలు పూర్తిగా దూరమవుతారని ఆయన వర్గం వాదిస్తోంది. ఇదే జరిగితే టీడీపీ నుంచి నాన్ మైనార్టీ అభ్యర్థి పోటీ చేసినా డిపాజిట్ దక్కదని ఆ వర్గం తేల్చి చెబుతోంది. రోడ్డున పడిన వర్గ విబేధాలు అమీర్‌బాబుకు టిక్కెట్‌రాకుండా సొంత పార్టీలోని మరోవర్గం అడుగడుగునా అడ్డుకుంటోంది. అమీర్‌బాబు ఇప్పటివరకు కడప అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా ఉన్నారు. ఇటీవల ఆర్టీసీ బస్టాండు ఆవరణలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు. అమీర్‌బాబు హాజరు కాకముందే ఆయన వ్యతిరేకవర్గం కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా ముగించింది. అక్కడికి చేరుకున్న అమీర్‌బాబు నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న తాను రాకుండానే కార్యక్రమం ఎలా చేస్తారంటూ ప్రశ్నించే ప్రయత్నం చేయగా, వైరివర్గం ఫొటోలకు ఫోజులు ఇచ్చేందుకు ఆలస్యంగా వస్తే మేము చూస్తుండాలా...అంటూ ఏకంగా ఘర్షణకు దిగింది. దీంతో ఇరు వర్గాలు రోడ్డుపైనే కొట్టుకునే పరిస్థితి తలెత్తింది. అధిష్టానం ఎటూ తేల్చకపోవడంతో కడప టీడీపీ వర్గాలుగా విడిపోయి రోడ్డున పడింది. -
అమీర్‌బాబు ఇంటి వద్ద వైఎస్సార్సీపీ నేతల బైఠాయింపు
-
అమీర్‌బాబు ఇంటి వద్ద వైఎస్సార్సీపీ నేతల బైఠాయింపు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కడప టీడీపీ నేత అమీర్‌బాబు ఇంటి వద్ద ఉద్రికత్త చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేత అమీర్‌బాబు ఇంటి వద్ద వైఎస్సార్సీపీ నేతలు బైఠాయించి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ నేతలు నినాదాలు చేశారు. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. -
భోరున ఏడ్చిన కడప టీడీపీ అభ్యర్థి
సాక్షి, కడప : కడప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అమీర్ బాబు భోరున విలపించారు. పార్టీ కోసం చేపట్టే ఏ కార్యక్రమానికైనా తన దగ్గరున్నదంతా ఊడ్చిపెట్టానని, ఒక్కపైసా కూడా ఎవరూ సాయం చేసింది లేదని ఆయన కార్యకర్తల సాక్షిగా కంటతడిపెట్టారు. ఇకనైనా కార్యకర్తలను పట్టించుకోవాలని అమీర్ బాబు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం అమీర్ బాబు అధిష్టాన పెద్దల చిన్నచూపుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన ...మరోవైపు భావోద్వేగాన్ని అదుపులో పెట్టుకోలేకపోక భోరుమన్నారు. పార్టీలో దోచుకున్నవాళ్లు దోచుకుంటున్నారని, జెండా మోసేవాళ్లు ఇంకా మోస్తూనే ఉన్నారని అమీర్‌బాబు అన్నారు. కార్యకర్తల సమక్షంలో జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిపై తిగురుబావుటా ఎగురవేసిన ఆయన మీ అనుచరులకే తప్ప..కడపలో జెండా మోసిన నిజాయతీ గల కార్యకర్తకు మీరేమైనా చేశారా అంటూ అమీర్‌బాబు మండిపడ్డారు. కార్యకర్తలను పట్టించుకోని నాయకులు ఎందుకని ప్రశ్నించిన అమీర్‌బాబు...ఇన్నాళ్లుగా అధిష్టానం తననూ ఏమీ పట్టించుకోలేదంటూ భోరున ఏడ్చేశారు. మరోవైపు ఎంపీ ఆదినారాయణరెడ్డిపైనా అమీర్ బాబు ఇంతెత్తున లేచారు. మాకేం చేశారని మీకు మద్దతు ఇవ్వాలంటూ మంత్రి ఆదిని సూటిగా ప్రశ్నించారు. -
టీడీపీని నమ్ముకుంటే మోసం చేశారు..
సాక్షి, అమరావతి : రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌గా జలీల్ ఖాన్ నియామకంపై తెలుగుదేశం పార్టీలోని మైనార్టీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తనకు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ పదవి ఇవ్వకపోవడంపై టీడీపీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అమీర్ బాబు కలత చెందారు. 25 సంవత్సరాల నుంచి పార్టీని నమ్ముకుని ఉంటే, వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి ఇవ్వకుండా మోసం చేశారని ఆయన వ్యాఖ్యానించారు. వక్ఫ్ బోర్డు చైర్మన్, ఇతర డైరెక్టర్లు ప్రమాణ స్వీకారుం చేస్తుండగా అమీర్ మధ్యలోనే వెళ్లిపోయారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి తన అసంతృప్తిని తెలియజేశారు. ముఖ్యమంత్రి వారించిన వినకుండా తనకు కేటాయించిన వక్ఫ్ బోర్డు డైరెక్టర్ పదవికి కూడా ఆయన రాజీనామా చేశారు. రాజీనామా లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి సమర్పించి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
ఇంత అన్యాయం చేస్తారా..!
-
ఇంత అన్యాయం చేస్తారా..!
కడప అర్బన్, న్యూస్‌లైన్ : తమకు జరిగిన అన్యాయంపై టీడీపీ మహిళా విభాగం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిప్పగిరి మీనాక్షి, విజయలక్ష్మి తీవ్ర ఆవేదనతో సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారిని వెంటనే నగరంలోని హిమాలయ హాస్పిటల్‌కు తరలించారు.టీడీపీ మేయర్ అభ్యర్థి బాలకృష్ణయాదవ్, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు వీఎస్ అమీర్‌బాబు వే ధింపుల కారణంగానే తాము ఈ చర్యకు పాల్పడినట్లు బాధితులు తెలిపారు. కడప నగరంలో స్థానిక సంస్థల వ్యవహారం టీడీపీ నేతల్లో సిగపట్లకు దారితీసింది. మేయర్ అభ్యర్థిగా బాలకృష్ణ యాదవ్‌ను నియమించిన సందర్భం నుంచి ప్రస్తుత సమయం వరకు తెలుగు తమ్ముళ్లు ఒకరిపై ఒకరు వాగ్వావాదాలు, గొడవ లు చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో తమకు అన్యాయం జరిగిందని రెండు రోజులుగా టీడీపీ మహిళా విభాగం నగర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చిప్పగిరి మీనాక్షి, విజయలక్ష్మి తమ సహచరులతో కలిసి జిల్లా పార్టీ కార్యాలయంలో ఆందోళన చేశారు. పార్టీ కోసం ఎన్నో సంవత్సరాలుగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆందోళనలు, ఉద్యమాల్లో పాల్గొన్నప్పటికీ తమకు విలువ లేకుండా పోయిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఆవేదనకు టీడీపీ నేతలు స్పందించకపోగా 8వ డివిజన్లో విజయలక్ష్మి భర్త రవీంద్రారెడ్డి నామినేషన్ దాఖలు చేస్తే అతనికి పార్టీ తరపున టికెట్ ఖరారు చేయకుండా అదే డివిజన్లో కాంగ్రెస్ నేత గుర్రం గంగాధర్‌కు టికెట్ ఇచ్చారు. అలాగే 26వ డివిజన్లో తన అత్తకు అవకాశం ఇవ్వాలని చిప్పగిరి మీనాక్షి కోరింది. అయితే అమీర్‌బాబు అభీష్టం మేరకు పార్టీతో ఎలాంటి సంబంధం లేని యానాదమ్మ అనే మహిళకు టికెట్ ఇవ్వడంతో వారు తీవ్ర అసంతృప్తి చెందారు. బాలకృష్ణ యాదవ్, అమీర్‌బాబులే కారణం : టీడీపీ నగర మేయర్ అభ్యర్థి బాలకృష్ణ యాదవ్, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడు అమీర్‌బాబులే తమ ఆత్మాయత్యాయత్నానికి కారణమని టీడీపీ మహిళా విభాగం నగర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిప్పగిరి మీనాక్షి, విజయలక్ష్మిఆరోపించారు. పార్టీ కోసం కష్టపడిన తమను వదిలిపెట్టి బాలకృష్ణ యాదవ్, అమీర్‌బాబులు తమకిష్టిమైన వారికి టికెట్లు అమ్ముకున్నారన్నారు. ఈ విషయమై జిల్లా పార్టీ కార్యాలయంలో రెండు రోజులుగా ఆందోళనలు చేశామన్నారు. కొందరు తమపై వ్యతిరేకంగా చెప్పడంతో పార్టీ జిల్లా అధ్యక్షుడు లింగారెడ్డి తమను సస్పెండ్ చేశారన్నారు. పార్టీకోసం కష్టపడితే చివరకు మమ్మల్నే పార్టీ నుంచి సస్పెన్షన్ చేయాలనుకోవడం దురదృష్టమన్నారు. తాము బాలకృష్ణయాదవ్‌కు క్షమాపణ చెప్పాలని కోరారని ఆ అవమానం తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డామన్నారు. ఈ సంఘటనలకు కారణమైన అమీర్‌బాబు, బాలకృష్ణ యాదవ్‌లపై ఎస్సీ, ఎస్టీ కేసును నమోదు చేయాలని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.