
సాక్షి, విజయవాడ : జుమ్మమసీద్ స్థలాన్ని అన్యాక్రాంతం చేస్తున్నారంటూ ముస్లిం సంఘాలు మండిపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే ,వక్ఫ్ బోర్డు చైర్మన్ జలీల్ ఖాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జుమ్మమసీద్ సెంటర్‌లో ఆందోళకు దిగాయి.పలు ముస్లిం సంఘాల ఆందోళనతో విజయవాడలో ఉదృక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముడుపులు తీసుకొని ముస్లిం ఆస్తులను ఇతరులకు అప్పగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.