Mazid
-
జలీల్ ఖాన్‌పై మండిపడ్డ ముస్లీం సంఘాలు
సాక్షి, విజయవాడ : జుమ్మమసీద్ స్థలాన్ని అన్యాక్రాంతం చేస్తున్నారంటూ ముస్లిం సంఘాలు మండిపడ్డాయి. టీడీపీ ఎమ్మెల్యే ,వక్ఫ్ బోర్డు చైర్మన్ జలీల్ ఖాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ జుమ్మమసీద్ సెంటర్లో ఆందోళకు దిగాయి.పలు ముస్లిం సంఘాల ఆందోళనతో విజయవాడలో ఉదృక్త పరిస్థితులు నెలకొన్నాయి. ముడుపులు తీసుకొని ముస్లిం ఆస్తులను ఇతరులకు అప్పగిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అమ్మానాన్నకు ప్రేమతో..!
హుజూర్నగర్ : అమ్మానాన్న జ్ఞాపకార్థం మసీదును నిర్మించి ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా మత పెద్దల సమక్షంలో ప్రారంభించాడు.. హుజూర్‌నగర్‌కు చెందిన మాజీ వార్డు సభ్యుడు ఎంఏ.మజీద్. ఈయన తల్లిదండ్రులు అబ్దుల్నబీ, తహెరాబేగంలు 20 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అమ్మానాన్నల మీద ప్రేమతో స్థానిక షాదీఖానా సమీపంలో రూ. 20 లక్షలతో మసీదును నిర్మించాడు. మసీదుకు మజీద్–ఈ–తహెరా అబ్దుల్నబీ అనే పేరు పెట్టాడు. చిరకాలంగా తల్లిదండ్రుల పేరు చరిత్రలో నిలిచిపోనున్నందున వారి కుమారుడిగా తనకు ఎంతో సంతృప్తిగా ఉందని మజీద్ తెలిపారు. తల్లిదండ్రుల పేరు మీదుగా మసీదు నిర్మాణం చేపట్టడంపై పలువురు మజీద్‌ను అభినందించారు. -
రూ.5 భోజన పథకం ప్రారంభం
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్(జిహెచ్ఎంసి) ఆధ్వర్యంలో 5 రూపాయలకే భోజన పథకం ప్రారంభమైంది. నగర మేయర్ మాజిద్, కమిషనర్ సోమేష్ కుమార్‌లు ఈ రోజు ఈ పథకాన్ని నాంపల్లిలో ప్రారంభించారు. 11 కోట్ల రూపాయలతో ఈ భోజనం పథకాన్ని మొదలు పెట్టారు. త్వరలో 50 కేంద్రాలలో ఈ పథకం ప్రారంభిస్తారు. ప్రతి కేంద్రంలో 300 మందికి మాత్రమే 5 రూపాలయకు భోజనం పెడతారు.