హుజూర్‌నగర్‌లో నిర్మించిన మసీదు
హుజూర్‌నగర్ : అమ్మానాన్న జ్ఞాపకార్థం మసీదును నిర్మించి ఆదివారం మాతృదినోత్సవం సందర్భంగా మత పెద్దల సమక్షంలో ప్రారంభించాడు.. హుజూర్‌నగర్‌కు చెందిన మాజీ వార్డు సభ్యుడు ఎంఏ.మజీద్. ఈయన తల్లిదండ్రులు అబ్దుల్‌నబీ, తహెరాబేగంలు 20 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. అమ్మానాన్నల మీద ప్రేమతో స్థానిక షాదీఖానా సమీపంలో రూ. 20 లక్షలతో మసీదును నిర్మించాడు. మసీదుకు మజీద్–ఈ–తహెరా అబ్దుల్‌నబీ అనే పేరు పెట్టాడు. చిరకాలంగా తల్లిదండ్రుల పేరు చరిత్రలో నిలిచిపోనున్నందున వారి కుమారుడిగా తనకు ఎంతో సంతృప్తిగా ఉందని మజీద్ తెలిపారు. తల్లిదండ్రుల పేరు మీదుగా మసీదు నిర్మాణం చేపట్టడంపై పలువురు మజీద్‌ను అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment