
గన్‌తో చంపుతానని బెదిరించిన ఎంపీ బాలశౌరి
జనసేన బరిలో ఉన్న స్థానాల్లో పోటీ చేయొద్దని దౌర్జన్యం
బీఫామ్‌లను లాక్కొన్న వైనం
నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఖాన్
తాడేపల్లి రూరల్: ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేయడానికి వీలు లేదంటూ జనసేన పార్టీ నేతలు తనను బెదిరించి బీఫామ్ పత్రాలు లాక్కున్నారని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ ఖాన్ ఆరోపించారు. జనసేన పోటీ చేసే స్థానాల్లో ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని ఎంపీ వల్లభనేని బాలశౌరి తన తలపై గన్ పెట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం గుంటూరు జిల్లా తాడేపల్లి ప్రెస్‌క్లబ్‌లో మీడియాతో షేక్ జలీల్‌ఖాన్ మాట్లాడారు.
జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గ్లాసు, నవరంగ్ కాంగ్రెస్ పార్టీ గుర్తు బకెట్ రెండూ ఒకే పోలికతో ఉండటంతో తనను 15 రోజులుగా జనసేన నేతలు బాలÔౌరి, నాదెండ్ల మనోహర్ బెదిరిస్తున్నారని ఆరోపించారు. రూ.5 కోట్లు ఇస్తామని, బీఫామ్‌లు తమకిచ్చేయాలని బాలÔౌరి ఒత్తిడి చేశారన్నారు. రెండుసార్లు ఇదే విషయమై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌తో ఫోన్‌లో మాట్లాడించారని చెప్పారు.
తాను ఒప్పుకోకపోవడంతో జనసేన కార్యకర్తలతో చంపిస్తామని మనోహర్ బెదిరించారన్నారు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి విజయవాడ ఐలాపురం హోటల్ వద్ద ఉన్న తనను వల్లభనేని బాలÔౌరి గన్ పెట్టి బెదిరించారన్నారు. తన వద్ద ఉన్న నవరంగ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్‌లు లాక్కున్నారని వాపోయారు.
పవన్ నీచ రాజకీయాలు
బీజేపీతో కలసి మైనార్టీలను అణగదొక్కేందుకు పవన్ నీచ రాజకీయాలు చేస్తున్నారని జలీల్ ఖాన్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్‌పై పిఠాపురంలోనూ తమ పార్టీ పోటీ చేస్తుందన్నారు. ఇప్పటికే డీజీపీ కార్యాలయంలో బాలÔౌరిపైన, ఆయనకు సహకరించిన పవన్, మనోహర్‌పైనా ఫిర్యాదు చేశామన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేస్తానని చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని మైనార్టీలను సర్వనాశనం చేసిన చంద్రబాబుతో జతకట్టిన పవన్‌కు రాష్ట్ర ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు.