తిరుపతి: కూటమి ప్రభుత్వంలోని నేతల అన్యాయాన్ని ఎవరైనా ప్రశ్నిస్తే.. అరెస్టులు, దాడులు తప్పితే న్యాయం జరగదు. ఇది కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర్నుంచి చూస్తూనే ఉన్నాం. మరీ ఎక్కువగా కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తే ‘రెడ్‌బుక్’ పాలన షురూ చేస్తారు.
ఆంధ్రా బిడ్డకు ఈ అన్యాయమేంటో?
.నాకు అన్యాయం జరిగింది మహాప్రభో.. న్యాయం చేయండి.. నేను ఒక జనసేన నాయకుడి చేతిలో మోసపోయాను’ అని అరిచి గీపెట్టుకుంటే ఆమెను అరెస్ట్ చేసిన వైనం ఏమిటో అర్థం కాదు. అది కూడా జైపూర్ పోలీసులు వచ్చి ఆమెను అరెస్ట్ చేస్తారు. ఎక్కడో ముంబై లో ఉండే సినీనటి కాదంబరి జెత్వానిని తీసుకొచ్చి ఆడబిడ్డకు న్యాయం చేస్తాం అంటూ బీరాలు పలికిన కూటమి ప్రభుత్వం.. నేడు ఆంధ్ర ఆడబిడ్డకు జనసేన నేత అన్యాయం చేశాడు అని కేస్ పెడితే రివర్స్ లో పాత కేస్ ఏదో ఉందని ఇప్పుడు ఆ మహిళను అరెస్ట్ చేయించారు.కూటమి ప్రభుత్వంలో ఒక్కో మహిళకు ఒక్కో న్యాయం అనుకుంటా...?
అరెస్ట్ అంటూ ముందుగానే జోస్యం?
రెండు రోజుల్లో ఆమెను అరెస్ట్ చేస్తారంటూ మీడియా ముఖంగా చెప్పాడు కిరణ్ రాయల్. తిరుపతి జనసేన ఇంచార్జిగా ఉన్న కిరణ్ రాయల్ చేతికి కోటి ఇరవై లక్షలతో పాటు బంగారం కూడా కొంత ఇచ్చి మోసం పోయింది లక్ష్మీ అనే మహిళ. అయితే ఇదే విషయాన్ని బహిర్గతం చేస్తే.. ఆమెపై తిరిగి ఆరోపణలు చేశాడు కిరణ్ రాయల్. ‘ చూడండి.. ఆమె రెండు రోజుల్లో అరెస్ట్ అవ్వుది.. జైపూర్ నుంచి పోలీసులు వస్తారు’ అని చెప్పాడు.
ఆమెను అరెస్ట్ చేయడానికి జైపూర్ పోలీసులు వస్తారని కిరణ్ కు ఎలా తెలుసు. ఆమెను ఇరికించాలనే ప్రయత్నంలో భాగంగా పాత కేసును తిరగతోడి రాజస్థాన్ పోలీసుల్ని రప్పించారా? ఇక్కడ పోలీసులు అరెస్ట్ చేస్తే కూటమి ప్రభుత్వానికి తలనొప్పులు వస్తాయని, ఏకంగా జైపూర్‌కు వెళ్లారా? దీని వెనుక ఉన్నది ఎవరు? అసలు జైపూర్ నుంచి పోలీసుల్ని ఇక్కడకు రప్పించి ఆమెను అరెస్ట్ ేచేయిండంలో చక్రం తిప్పింది ఎవరు? అనే వాదన తెరపైకి వచ్చింది. అదే సమయంలో #saveAPFromRedbookRuling అనేది ‘ఎక్స్’లో ట్రెండ్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment