భక్తులకు ముందస్తు అనుమతిలేకుండా మిఠాయిలు పంచుతున్న విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు పోలీసులు క్లాస్ తీసుకున్నారు.
భక్తులకు ముందస్తు అనుమతిలేకుండా మిఠాయిలు పంచుతున్న విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు పోలీసులు క్లాస్ తీసుకున్నారు. కృష్ణా పుష్కరాలకు వచ్చిన భక్తులకు స్వీట్స్ ఇస్తూ జలీల్‌ఖాన్ పోలీసుల కంటపడ్డారు. దీంతో పోలీసులు పుష్కరాల్లో అనుమతి లేకుండా మిఠాయిలు పంచకూడదని తెలిపారు. నిబంధనలు తెలియవా అని పోలీసులు ప్రశ్నించారు. ఇందుకు ఎమ్మెల్యే 'నేను మంత్రిని అవుతున్నా'అని సమాధానం ఇచ్చారు. అందుకోసమే స్వీట్స్ ముందే పంచుతున్నానని హడావిడి చేశారు. పోలీసులు చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు.