Krishna ample
-
కృష్ణా పుష్కరాలు సమష్టి విజయం
♦ నేను టీమ్‌లీడర్ మాత్రమే ♦ ఉద్యోగుల అభినందన సభలో సీఎం చంద్రబాబు సాక్షి, అమరావతి : అందరూ సమష్టిగా పనిచేయడం వల్లే కృష్ణా పుష్కరాలు విజయవంతమయ్యాయని, తాను టీమ్ లీడర్‌ను మాత్రమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అధికారులు, ఉద్యోగులంతా పోటీపడి పనిచేశారన్నారు. బుధవారం ఆయన ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో పుష్కరాల్లో పనిచేసిన ఉద్యోగులు, అధికారుల కోసం నిర్వహించిన అభినందన సభలో మాట్లాడారు. పుష్కరాల ప్రత్యేక అధికారి రాజశేఖర్, డీజీపీ సాంబశివరావు బాగా పని చేశారని ప్రశంసించారు. టెక్నాలజీని పూర్తిగా వాడుకుని కమాండ్ కంట్రోల్ యూనిట్ నుంచి రియల్‌టైమ్ గవర్నెన్స్ నిర్వహించే స్థాయికి తీర్చిదిద్దామన్నారు. అక్షయపాత్ర, టీటీడీ, సత్యసాయి సేవా ట్రస్ట్‌తోపాటు 300 స్వచ్ఛంద సంస్థలు పుష్కర సేవలు నిర్వహించాయన్నారు. ఇదే అనుభవంతో ఈ ఏడాది సెప్టెంబర్ 15వ తేదీ కల్లా 110 మున్సిపాల్టీల్లో వీధి లైట్లను సెన్సర్ల ద్వారా కంట్రోల్‌రూమ్ నుంచి పర్యవేక్షించే వ్యవస్థను తీసుకురానున్నట్లు తెలిపారు. పుష్కర సేవల స్ఫూర్తితో పనిచేస్తే ప్రపంచంలోనే ఏపీ రోల్‌మోడల్‌గా మారుతుందన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను అభినందించారు. వారికి శుక్రవారం సెలవు.. పుష్కరాల్లో పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా అభినందించిన సీఎం.. విశ్రాంతి కోసం శుక్రవారం వారికి సెలవు ప్రకటించారు. డీజీపీ సాంబశివరావు మాట్లాడుతూ హోమ్‌గార్డు నుంచి డీజీపీ వరకూ అందరూ బాగా పనిచేశారని, 34 వేలమంది పుష్కర విధులు నిర్వర్తించారన్నారు. -
ముగిసిన పుష్కర సంరంభం
- హారతితో కృష్ణా ఆది పుష్కరాలకు ముగింపు - పుష్కర స్నానం చేసిన కేంద్ర మంత్రులు వెంకయ్య, ప్రభు సాక్షి, అమరావతి : పన్నెండు రోజుల పాటు తెలుగురాష్ట్రాలను భక్తి పారవశ్యంలో ముంచెత్తిన కృష్ణా పుష్కరాలు మంగళవారం ముగిశాయి. విజయవాడ సంగమం ఘాట్ వద్ద హారతితో ఈ ఆది పుష్కరాలకు ముగింపు పలికారు. ఈ పుష్కరాల్లో 1,94,43, 984 మంది పుణ్య స్నానాలు చేశారు. పవిత్ర సంగమం ఘాట్ వద్ద మంగళవారం సాయంత్రం పుష్కరాల ముగింపు వేడుకలను నిర్వహించారు. కాగా, పుష్కరాల చివరి రోజైన రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం 14,95,720 మంది పుష్కర స్నానాలు చేశారు. పద్మావతి ఘాట్ వద్ద తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి చక్రస్నానం నిర్వహించింది. పుష్కర స్నానాలు చేసిన ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభు, సినీ నటుడు సాయికుమార్, వాయిద్యకారుడు శివమణి తదితరులు ఉన్నారు. ముగింపు వేడుకల్లో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, సురేష్ ప్రభులతో పాటు పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఒలింపిక్ పతక విజేత పీవీ సింధూ, ఆమె కోచ్ గోపీచంద్ ముగింపు వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. -
అగ్రీగోల్డ్ బాధితులను ప్రభుత్వమే ఆదుకోవాలి
- ఆత్మహత్య చేసుకున్న మృతులకు పిండ ప్రధానం గుణదల అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు చేసి మోసపోయి ఆత్మహత్య చేసుకున్న అగ్రిగోల్డ్ బాధిత మృతులకు మంగళవారం ఉదయం పద్మావతి ఘాట్‌లో అగ్రిగోల్డ్ బాధితుల సంఘం ఆధ్వర్యంలో పిండ ప్రధాన కార్యక్రమం జరిగింది. బాధితుల సంఘం ప్రధాన కార్యదర్శి వి. తిరుపతిరావు, ఉప ప్రధాన కార్యదర్శి వి. చంద్రశేఖర్ తదితరులు పిండ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా తిరుపతిరావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధిత డిపాజిటర్లు మొత్తం 20 లక్షల మంది ఉన్నారని, అందులో 3 లక్షల మంది ఏజట్లు ఉన్నారని వీరంతా ప్రభుత్వ జోక్యం కోసం ఎదురు చూస్తున్నారని ఆయన అన్నారు. 100 మందికి పైగా బాధితులు ఆత్మహత్య చేసుకున్నారని, వీరందరికీ తమ సంఘం తరఫున పిండ ప్రధానం చేస్తున్నామని తెలిపారు. అగ్రిగోల్డ్ చేసిన ఆర్థిక కుంభకోణానికి డిపాజిటర్లు బలైపోతున్నారని, ప్రభుత్వం ఆదుకుని డిపాజిటర్లకు న్యాయం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. డిపాజిట్ దారులను ఆదుకునేందుకు రూ.100 కోట్లు విడుదల చేయాలని, ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి ప్రతి నెలరూ. 1000 కోట్ల అస్తుల వేలం వేయటానికి చర్యలు తీసుకోవాలని, అలాగే అగ్రిగోల్డ్ డిపాజిటర్ల జాబితాను ఆన్లైన్లో పొందుపరచి, కొంత ఏజంట్లకి బాండ్ల రూపంలో నగదును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు షరీఫ్, వెంకటేష్, టి. పెద్ద వెంకటేశ్వర్లు, కే.ఆర్ ఆంజనేయులు, ఆర్. పిచ్చయ్య, పటేల్ శ్రీనివాసరెడ్డి, మూనంపాటి సుబ్బలక్ష్మీ, ఆంజనేయులు, కాంత్రి తదితరులు పాల్గొన్నారు. -
పదకొండో రోజు.. 32 లక్షల పైమాటే!
-
పదకొండో రోజు.. 32 లక్షల పైమాటే!
- కిటకిటలాడిన నల్లగొండ, పాలమూరు ఘాట్లు - పుణ్యస్నానాలు చేసిన జానారెడ్డి, ఉత్తమ్ - అమరవీరులకు తెలంగాణ జాగృతి కార్యకర్తల పిండ ప్రదానం - వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి సాక్షి ప్రతినిధి, నల్లగొండ/మహబూబ్‌నగర్: మరో రోజులో కృష్ణా పుష్కర పండుగ ముగియనున్న వేళ నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని ఘాట్లు కిట కిటలాడాయి. పదకొండో రోజైన సోమవారం నల్లగొండ జిల్లావ్యాప్తంగా 11.5 లక్షల మంది, మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 21 లక్షల మంది భక్తు లు పుణ్యస్నానాలు ఆచరించారు. నాగార్జునసాగర్, వాడపల్లి, మట్టపల్లి, దర్వేశిపురం ఘాట్లు లక్షలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయాయి. నాగార్జున సాగర్‌లో 3 లక్షల మందికి పైగా పుష్కర స్నానాలు చేయగా, వాడపల్లి, మట్టపల్లి, దర్వేశిపురం ఘాట్ల లో 2 లక్షల చొప్పున పుణ్యస్నానాలు చేశారు. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండటంతో తెల్లవారుజాము నుంచే భక్తులు ఘాట్ల వద్దకు క్యూ కట్టారు. ప్రముఖుల పుణ్యస్నానాలు పుష్కర స్నానాల కోసం పలువురు ప్రముఖులు నల్లగొండ జిల్లాలోని ఘాట్లకు తరలివచ్చారు. వాడపల్లి వీఐపీ ఘాట్‌లో పుష్కర స్నానం చేసిన కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత కె.జానారెడ్డి.. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మట్టపల్లి ప్రహ్లాద్ ఘాట్‌లో పీపీసీ చీఫ్ ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ స్నానాలు చేశారు. తెలంగాణ ఉద్యమంలో అసువులు బాసిన అమరవీ రులకు వాడపల్లి శివాలయం ఘాట్‌లో తెలంగాణ జాగృతి కార్యకర్తలు పిండ ప్రదానం చేశారు. పాలమూరు ఘాట్లకు తగ్గని జనం ఇక పాలమూరులోని వివిధ పుష్కరఘాట్లు భక్తులతో పోటెత్తాయి. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య బీచుపల్లి ఘాట్‌లో పుణ్య స్నానమాచరించి అలంపూర్ జోగుళాంబ దేవాలయాన్ని సందర్శిం చారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి రంగాపూర్ పుష్కర ఘాట్‌లో పుణ్యస్నానం చేశారు. ఆత్మకూరు మండలం మూల మల్ల పుష్కర ఘాట్‌లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి పుణ్యస్నానం ఆచరించారు. బీచుపల్లిలో ఎంపీ గరికపాటి మోహన్‌రావు పుణ్యస్నానం చేశారు. సోమశిలలో మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ టికె.శ్రీదేవి కృష్ణమ్మకు గంగాహారతి ఇచ్చారు. బీచుపల్లిలో మంత్రి లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్మన్ బండారు భాస్కర్, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి హారతి ఇచ్చారు. మంగళవారం పుష్కరాల ముగింపు సందర్భంగా బీచుపల్లిలో ప్రభుత్వం ముగింపు పర్వాన్ని చేపట్టనుంది. ఇందుకోసం బీచుపల్లి ఘాట్‌ను ముస్తాబు చేస్తున్నారు. మరోవైపు సాగర్ శివాలయం, ఆంజనేయస్వామి ఘాట్లకు సోమవారం నీరు నిలిచి భక్తుల పుష్కర స్నానాలకు అంతరాయం ఏర్పడింది. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరి మృతి పెద్దకొత్తపల్లి/కోడేరు: పుష్కరాల్లో సోమవారం అపశ్రుతులు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌కు చెం దిన మినీ వ్యాన్ డ్రైవర్ మహేశ్‌గౌడ్(32) పుష్కర స్నానానికి వెళ్లి నీట మునిగి చనిపోయాడు. నదిలోకి స్నానాలకు వచ్చిన భక్తుల కాళ్లకు శవం తగలడంతో, గజ ఈతగాళ్లు శవాన్ని బయటకు తీసినట్లు స్పెషల్ ఆఫీసర్ సురేందర్‌గౌడ్ తెలిపారు. మహబూబ్న గర్జిల్లా కోడేరు చెందిన రామదాసు (16) వనపర్తిలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. తల్లిదండ్రులు శ్యామలమ్మ, వెంకటయ్యలతో సోమశిల ఘాట్‌లో స్నానమాచరించి.. ఆటోలో తిరుగు ప్రయాణమయ్యాడు. నర్సాయిపల్లి వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో మృతి చెందాడు. -
పుష్కర ఘాట్లను పరిశీలించిన సీఎం
లింగాల ఘాట్‌లో నదీమతల్లికి పూజలు సాక్షి, అమరావతి/జగ్గయ్యపేట/సాక్షి ప్రతినిధి, కర్నూలు : కృష్ణా పుష్కరాల్లో భాగంగా సీఎం చంద్రబాబు సోమవారం రాష్ట్రంలోని పలు పుష్కర ఘాట్లను పరిశీలించారు. గుంటూరు జిల్లా గురజాల మండలం దైదలో పర్యటించిన ఆయన.. తొలుత అమరలింగేశ్వరస్వామిని దర్శించుకుని, దైదలో పుష్కర ఘాట్లను సందర్శించారు. సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దైతను పర్యాటక కేంద్రంగా చేస్తామన్నారు. క్రీడాకారిణి సింధుకు మనం చేసిన ప్రార్థనలతో వెండి మెడల్ వచ్చిందన్నారు. ఇక్కడ పుట్టిన బిడ్డ భారత దేశ ప్రతిష్టను పెంచిందన్నారు. నేడు ఆమె పుష్కర స్నానానికి వస్తోందని తెలిపారు. కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలంలోని ముక్త్యాల పుష్కర ఘాట్‌ను చంద్రబాబు పరిశీలించారు. నది ఒడ్డున ఉన్న శివాలయంలో పూజలు నిర్వహించారు. నదీమతల్లికి చీర సమర్పించిన సీఎం కృష్ణా పుష్కరాల్లో భాగంగా శ్రీశైలంలోని లింగాలఘాట్‌ను సీఎం సందర్శించారు. నదిలో పసుపు, కుంకుమ, చీరను వదిలి కృష్ణా నదీమ తల్లికి పూజలు చేశారు. -
బాబోయ్...ట్రాఫిక్
- హంసలదీవి నుంచి సంగమం వరకు ఏటూ చూసినా వాహనాలే - ఆరు కిలోమీటర్ల మేర నాలుగు గంటలపాటు స్తంభించిన ట్రాఫిక్ - తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్న పుష్కరభక్తులు కోడూరు శత్ధాబాల చరిత్ర కలిగిన హంసలదీవి క్షేత్రంలోని పవిత్ర కృష్ణా సాగరసంగమానికి కనివిని ఎరుగని రీతిలో పుష్కరస్నానం చేసేందుకు భక్తులు తరలిరావడంతో ఎక్కడి వాహనాలు అక్కడే స్తంభించాయి. హంసలదీవిలోని శ్రీవేణుగోపాలుడి సన్నిధి నుంచి సముద్రం వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర సంగమ రహదారి వాహనాలతో కిక్కిరిపోయింది. పాలకాయతిప్ప కరకట్ట దగ్గర నుంచి డాల్ఫిన్ భవనం వరకు వాహనాలు తప్పుకునే పరిస్థితి లేకపోవడంతో తీవ్రమైన ట్రాఫిక్ సమస్య తలెత్తింది. సాగరసంగమ చర్రితలో ఇంత వరకు ఎప్పుడూ ఇన్ని వాహనాలు ఒకేసారి రాలేదని, వాహనాల రద్దీకి రోడ్డు వెడల్పు సరిపోకపోవడంతో ఇంతలా ట్రాఫిక్ సమస్య ఏర్పడిందని అధికారులు అంటున్నారు. కరకట్ట దగ్గర నుంచి హంసలదీవి వరకు రహదారికి ఒకవైపునా వాహనాలు భారీ మొత్తంలో ఆగిపోవడంతో భక్తులు ఏటూ కదలేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పసిపిల్లలతో వచ్చినవారు సంగమం వరకు నడుచుకుంటూ వెళ్లి పుష్కరస్నానం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ తీవ్రతను చూసిన భక్తులను సంగమం వరకు వెళ్లనీవ్వకుండానే పాలకాయతిప్ప దగ్గర నుంచే వెనుదిరిగి వెళ్లిపోవడం గమనార్హం. మధ్యాహ్నం 12గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు.. మధ్యాహ్నం 12గంటల సమయంలో సంగమ రహదారి మొత్తం భారీగా ట్రాఫిక్ స్తంభించింది. సాయంత్రం 4 గంటల వరకు వాహనాలను క్రమబద్ధికరించేందుకు పోలీసులు నానా ఇబ్బందులు పడ్డారు. తరువాత శింకు వంతెన దగ్గర నుంచి వంతులవారిగా వాహనాలను వదులుతూ కొంతమేర సమస్యను పరిష్కరించారు. అయితే రాత్రి 6గంటల వరకు పలుచోట్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతూనే ఉంది. కోడూరు ప్రధాన సెంటర్లో సైతం వాహనాల రద్దీతో అనేకసార్లు ట్రాఫిక్ సమస్య తలెత్తింది. -
ఇంకా మూడు రోజులే పుష్కరాలు
సాక్షి,సిటీబ్యూరో: కృష్ణా పుష్కరాలు ఈనెల 23తో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం నగరం నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు పవిత్ర స్నానాలకు తరలివెళ్లారు. బస్ స్టేషన్లు, రైల్వేస్టేషన్లలో ప్రయాణికులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో చాలామంది శనివారం సాయంత్రమే నగరంలో వివిధ ప్రాంతాల నుంచి తెలుగు రాష్ట్రాల్లోని పుష్కర ఘాట్లకు తరలి Ðð ళ్లారు. గుంటూరు, విజయవాడ మీదుగా వెళ్లే రెగ్యులర్ రైళ్లు, పుష్కర ప్రత్యేక రైళ్లు ప్రయాణికులతో కిక్కిరిసాయి. నేడు వివిధ రూట్లలో స్పెషల్ రైళ్లు.. పుష్కరాల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆదివారం రాత్రి 11.50 గంటలకు సికింద్రాబాద్ నుంచి పుష్కరం స్పెషల్ ట్రైన్ బయలు దేరనుంది. ఇది విజయవాడ సమీపంలోని కృష్ణా కెనాల్ జంక్షన్ వరకు వెళ్తుంది. అలాగే ఉదయం 5.30 గంటలకు ఇంటర్ సిటీ, ఉదయం 5.40కి నాంపల్లి స్టేషన్ నుంచి గుంటూరుకు పుష్కరం స్పెషల్ ట్రైన్ బయలు దేరతాయి. ఉదయం 6.15 కు సికింద్రాబాద్ నుంచి రాయచూర్ దగ్గర ఉన్న కృష్ణా రైల్వేస్టేషన్‌కు మరో పుష్కరం స్పెషల్ నడుస్తుంది. ఉదయం 11–12 గంటల మధ్య సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి గద్వాల్‌కు డెమూ ప్యాసింజర్ రైళ్లు బయలు దేరనున్నాయి. రెగ్యులర్ జన్మభూమి, ఇంటర్సిటీ, తదితర ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు ఆదివారం రాత్రి 11.30కు సికింద్రాబాద్ నుంచి కాకినాడకు మరో పుష్కరం ట్రైన్ నడుపుతున్నారు. 300కు పైగా ప్రత్యేక బస్సులు.. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా వెళ్లే 93 రెగ్యులర్ బస్సులతో పాటు శనివారం మరో 50 బస్సులు అదనంగా బయలుదేరాయి. ఇవి కాకుండా నాగార్జునసాగర్, బీచుపల్లి, శ్రీశైలం, వాడపల్లి, తదితర ప్రాంతాలకు 250 బస్సులు నడిపారు. నగరం నుంచి రెగ్యులర్ బస్సులకు కాకుండా పుష్కరాల ప్రారరంభం నుంచి 1065 బస్సులు నడుపుతున్నారు. వీటికి అదనంగా శనివారం 350 బస్సులను పెంచారు. ఆదివారం మరిన్ని ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు అదనపు బస్సులు నడిపేందుకు అర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
భక్తులపై భానుడి ప్రతాపం
కృష్ణా పుష్కరాల్లో పుణ్య స్నానాలు ఆచరించడానికి వస్తున్న భక్తులపై భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. గత నాలుగు రోజులు ఎండలు విపరీతంగా ఉండటంతో.. భక్తులు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఎండ వేడిమి నుండి తమను రక్షించుకోవడానికి ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లు చేయకపోవడంతో.. భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ రోజు విజయవాడ పుష్కర ఘాట్లలో 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. -
నేను మంత్రిని కాబోతున్నా..
భక్తులకు ముందస్తు అనుమతిలేకుండా మిఠాయిలు పంచుతున్న విజయవాడ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌కు పోలీసులు క్లాస్ తీసుకున్నారు. కృష్ణా పుష్కరాలకు వచ్చిన భక్తులకు స్వీట్స్ ఇస్తూ జలీల్‌ఖాన్ పోలీసుల కంటపడ్డారు. దీంతో పోలీసులు పుష్కరాల్లో అనుమతి లేకుండా మిఠాయిలు పంచకూడదని తెలిపారు. నిబంధనలు తెలియవా అని పోలీసులు ప్రశ్నించారు. ఇందుకు ఎమ్మెల్యే 'నేను మంత్రిని అవుతున్నా'అని సమాధానం ఇచ్చారు. అందుకోసమే స్వీట్స్ ముందే పంచుతున్నానని హడావిడి చేశారు. పోలీసులు చేసేదేమీ లేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
పుష్కర దోపిడీ!
సాక్షి, సిటీబ్యూరో: కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు తరలి వెళ్తున్న నగరవాసుల జేబులను ప్రైవేట్ వాహనాల ఆపరేటర్లు గుల్ల చేస్తున్నారు. సాధారణ చార్జీలపైన రెట్టింపు వసూళ్లకు పాల్పడుతూ నిలువునా దోచుకుంటున్నారు. విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాలతో పాటు నాగార్జునసాగర్, శ్రీశైలం, బీచుపల్లి, వాడపల్లి, సోమశిల తదితర ప్రాంతాల్లోని పుష్కరఘాట్లకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్తున నగర వాసులకు పుష్కర ప్రయాణం చేదు అనుభవాన్నే మిగులుస్తోంది. రైళ్లలో వెళ్లేందుకు అవకాశం లేక, ఆర్టీసీ బస్సులకు డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ప్రైవేట్ బస్సులు, ఇతర వాహనాల్లో వెళ్లవలసి వస్తోంది. దీంతో ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకొని ప్రైవేట్ ఆపరేట్లు, ట్రావెల్స్ సంస్థలు తమ దోపిడీని కొనసాగిస్తున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు సూపర్‌లగ్జరీ బస్సుల్లో సాధారణ చార్జీ రూ.350 అయితే ఇప్పుడే ఏకంగా రూ.600 లకు చేరుకుంది. అలాగే శ్రీశైలం, నాగార్జునసాగర్ వైపు వెళ్లే ప్రైవేట్ బస్సుల్లోనూ సాధారణ చార్జీలపైన రెట్టింపు వసూళ్లకు పాల్పడుతున్నాయి. శ్రీశైలంకు ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో సాధారణంగా అయితే రూ.210 లు ఉంటుంది. ఇప్పుడు ఏకంగా రూ.400లకు పెంచేశారు. అలాగే నాగార్జునసాగర్ వైపు వెళ్లే ప్రైవేట్ బస్సులు సైతం రూ.250 నుంచి రూ.500లకు పెంచేశాయి. ఇక 7 సీట్లు, 12 సీట్లు ఉన్న వాహనాలను సొంతంగా బుక్ చేసుకొనే వెళ్లే ప్రయాణికులకు సైతం ట్రావెల్స్ సంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి. కిలోమీటర్ చొప్పున లెక్కగట్టి తీసుకొనే చార్జీలతో నిమిత్తం లేకుండా గంపగుత్తగా పెద్ద మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నాయి. సాధారణంగా అయితే రూ.5000 ఖర్చయ్యే దూరానికి ఇప్పుడు రూ.7000 వరకు వసూలు చేస్తున్నారు. విజయవాడ వైపు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అటు వైపు వెళ్లే అన్ని ప్రైవేట్ వాహనాలు సగటు పుష్కర భక్తుడిని నిండా ముంచడమే లక్ష్యంగా పెట్టుకొని వసూళ్ల పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. ఇంట్లో నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లే వాళ్లకు చార్జీల రూపంలోనే రూ.వేల సంఖ్యలో ఖర్చు చేయవలసి వస్తోంది. మరోవైపు ఆర్టీసీ బస్సుల్లోనూ 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు. విజయవాడకు గరుడ బస్సుల్లో రూ.550 వరకు చార్జీ ఉంటే ఇప్పుడు అది ఏకంగా రూ.820కి చేరుకొంది. బీచుపల్లికి డీలక్స్ చార్జీ రూ.200 ఉండగా ప్రస్తుతం రూ.350 వసూలు చేస్తున్నారు. అన్ని రూట్లలోనూ అదనపు చార్జీల పర్వం కొనసాగుతుంది. రైళ్లు, బస్సుల్లో రద్దీ.... మరోవైపు కృష్ణా పుష్కర ప్రభం‘జనం’ కొనసాగుతోంది. నగర వాసులు పెద్ద సంఖ్యలో పుష్కరాలకు తరలి వెళ్తున్నారు. గురువారం రాఖీ పౌర్ణమి, సెలవు దినం కావడంతో బుధవారం సాయంత్రమే పెద్ద సంఖ్యలో నగర వాసులు వివిధ ప్రాంతాల్లో పుష్కర స్నానాల కోసం బయలుదేరారు. విజయవాడ, గుంటూరు, కాకినాడ, గద్వాల తదితర ప్రాంతాలకు ప్రతి రోజు రాకపోకలు సాగించే 40 రెగ్యులర్ రైళ్లతో పాటు 15 ప్రత్యేక రైళ్లు బుధవారం వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించాయి. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేçÙన్ల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు తరలారు. సాధారణ రోజుల్లో 2.5 లక్షల మంది రాకపోకలు సాగిస్తుండగా బుధవారం ఆ సంఖ్య 3 లక్షలకు చేరుకుంది. గుంటూరు, విజయవాడల మీదుగా వెళ్లే రైళ్లన్నీ కిక్కిరిసాయి. రిజర్వుడ్, అన్‌రిజర్వుడ్ బోగీలన్నీ ప్రయాణికులతో కిటకిటలాడాయి. కాచిగూడ–గద్వాల మధ్య నడిచే రైళ్లలోనూ భారీ రద్దీ నెలకొంది. రిజర్వుడ్ బోగీల్లో బెర్తులు లభించని వాళ్లు జనరల్ బోగీల్లో బయలుదేరారు. దీంతో సాధారణ బోగీలు సైతం పరిమితికి మించిన ప్రయాణికులతో నిండిపోయాయి. పలు ప్రాంతాలకు 100 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ బస్సుల్లోనూ రద్దీ కనిపించింది. బుధవారం వివిధ ప్రాంతాలకు 100 బస్సులు అదనంగా నడిపారు. వివిధ ప్రాంతాలకు రెగ్యులర్‌గా రాకపోకలు సాగించే 1500 ఎక్స్‌ప్రెస్, సూపర్‌లగ్జరీ, ఏసీ బస్సులకు ఇవి అదనం. నాగార్జునసాగర్, బీచుపల్లి, శ్రీశైలం ఘాట్లకు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. విజయవాడ వైపు వెళ్లే 93 రెగ్యులర్ బస్సులు ప్రయాణికులతో నిండిపోయాయి. -
ఆర్టీసీకి గోదావరి పుష్కరాల ఆదాయం భళా...
- కృష్ణా పుష్కరాలకు డీలా - గత వారం రోజులుగా రూ.12 కోట్ల ఆదాయం.. 25 లక్షల మంది ప్రయాణం - ప్రైవేటు దోపిడీని అడ్డుకోలేకపోయిన సర్కారు సాక్షి, అమరావతి కృష్ణా పుష్కరాలకు ఆర్టీసీ ఆశించిన మేర ఆదాయం ఆర్జించలేకపోతోంది. గోదావరి పుష్కరాల్లో రూ.74 కోట్ల మేర ఆదాయం రాబట్టిన ఆర్టీసీకి కష్ణా పుష్కరాలు మాత్రం అంత ఆశాజనకంగా లేవు. కష్ణా పుష్కరాలకు రూ.60 నుంచి రూ.80 కోట్ల ఆదాయాన్ని ఆర్టీసీ ఆశించింది. అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా భారీగానే చేసింది. కానీ గత వారం రోజులుగా ఆదాయం రూ.12 కోట్లు మాత్రమే రాబట్టింది. కష్ణా పుష్కరాల్లోనైనా సర్వీసులు తిప్పి నష్టాల్ని కొంత మేర పూడ్చుకుందామని భావించిన ఆర్టీసీకి తొలి రోజే చుక్కెదురు కావడంతో అప్పటి నుంచి నిరాశాజనకంగానే కొనసాగుతుంది. చివరి ఐదు రోజుల్లోనూ ఆదాయం రూ.10 కోట్లు దాటేలా కనిపించడం లేదని ఆర్టీసీ వర్గాలే పేర్కొనడం గమనార్హం. ప్రణాళికా లోపమే కారణమా? పుష్కరాలకు ప్రతి రోజూ 4.50 లక్షల మంది విజయవాడకు వస్తారని అంచనా వేశారు. ఇందుకోసం ఇతర జిల్లాల నుంచి వచ్చే భక్తుల కోసం ఆర్టీసీ విజయవాడలో ఐదు శాటిలైట్ స్టేషన్లు ఏర్పాటు చేసింది. పుష్కరాలకు రెండు రోజుల ముందు నుంచే ఆర్టీసీ దూర ప్రాంత సర్వీసులకు ప్రధాన బస్టాండ్ నుంచి రిజర్వేషన్లు రద్దు చేయడం, హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణీకులను ఇబ్రహీంపట్నం వరకు మాత్రమే అనుమతించడంతో ప్రయాణీకులు ఎక్కువ శాతం మంది ప్రైవేటు సర్వీసుల్ని ఆశ్రయించారు. పుష్కరాల తొలి రోజు ఆర్టీసీ ఆదాయం రూ.50 లక్షలకు మించలేదు. ఆర్టీసీ హడావుడిగా ఆంక్షలు సడలించింది. రిజర్వేషన్ పునరుద్ధరించి దూర ప్రాంత సర్వీసుల్ని బస్టాండ్ వరకు అనుమతించింది. అయితే మూడు రోజుల పాటు ఆర్టీసీ ఆదాయం మెరుగుపడలేదు. పై పెచ్చు ఆర్టీసీ అధికారులు విజయవాడ-గుంటూరు నడుమ సర్వీసుల్ని కూడా సరిగ్గా నడపలేదు. పుష్కరాల రెండో రోజు బస్సు సర్వీసులు లేక ప్రయాణీకులు గుంటూరు బస్టాండ్‌లో ఆందోళనలు కూడా చేశారు. ఆర్టీసీ నష్ట నివారణ చర్యలు చేపట్టేలోగానే ఆదాయం పడిపోయింది. మరోవైపు ప్రైవేటు సర్వీసుల్ని కట్టడి చేస్తామని రవాణా మంత్రి శిద్ధా రాఘవరావు ఆర్భాట ప్రకటనలు చేశారే తప్ప చర్యలు మాత్రం తీసుకోలేదు. కాంట్రాక్టు క్యారియర్లుగా తిప్పాల్సిన ప్రైవేటు సర్వీసులు మాత్రం స్టేజి క్యారియర్లుగా తిప్పుతూ ప్రయాణీకుల్ని దోచుకున్నాయి. ఆన్లైన్లో రిజర్వేషన్ వెసులుబాటు ఉంచి ప్రైవేటు సర్వీసులు అందినకాడికి దోచుకున్నా.. రవాణా శాఖ మాత్రం చేష్టలుడిగి చూసిందే తప్ప ఏ మాత్రం అడ్డుకోలేకపోయింది. ఆర్టీసీ ఒక్క విజయవాడలోనే ఉచిత సిటీ సర్వీసుల్ని తిప్పిందే తప్ప గుంటూరు, కర్నూలు జిల్లాల్లో ఉచిత సౌకర్యం కల్పించలేదు. మొత్తం మీద భారీ ప్రణాళికలు రూపొందించిన ఆర్టీసీకి పుష్కర ఆదాయం నిరాశాజనకంగానే ఉంది. -
ప్రభుత్వాలు ప్రజలకు అనుగుణంగా పనిచేయాలి
- జస్టిస్ ఎన్వి రమణ విజయవాడ (భవానీపురం) ఏ ప్రభుత్వాలైనా ప్రజలకు అనుగుణంగా పనిచేయాలని, అప్పుడే అవి వారి అభిమానాన్ని చూరగొంటాయని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అన్నారు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని బుధవారం ఆయన విజయవాడ పున్నమిఘాట్లో పుష్కర స్నానమాచరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రకృతిని, నదులను గౌరవించాలన్నారు. తెలుగు ప్రజల జీవనాధారమైన కృష్ణానదిని పూజించాలని అన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఏర్పడిన తరువాత వచ్చిన తొలి పుష్కరాలలో స్నానమాచరించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పుష్కర సమయంలో స్నానం చేయటం ఎంతో పవిత్రమైనదని, ప్రతి ఒక్కరూ దానిని ఆచరించాలని సూచించారు. -
నదీ రుణాన్ని తీర్చుకోవాలి
- పుష్కర ఏర్పాట్లు బాగా చేశాం - నదుల అనుసంధానం కోసం మహాసంకల్పం - వర్షపునీటిని భూగర్బ జలాలుగా మార్చండి - సాక్షిపై అక్కసు సాక్షి , అమరావతి ‘మనకు నది నీళ్లు, సంపద అన్నీ ఇస్తుంది. అలాంటి నదికి మనం రుణం తీర్చుకోవాలి’-అని ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిలో మంగళవారం మధ్యాహ్నం ధ్యాన బుద్ద ఘాట్‌ను పరిశీలించారు. అనంతరం కృష్ణావేణి విగ్రహానికి పూలమాలవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోదావరి పుష్కరాల్లో సంకల్పం చేసి కృష్ణమ్మ చెంతకు గోదావరిని చేర్చామన్నారు. ఇప్పుడు ఆ రెండు నదులు కలిసే పవిత్ర సంగమం వద్దనే హారతిని ఇస్తున్నామన్నారు. కృష్ణ పుష్కరాల సందర్భంగా మహా సంకల్పం చేస్తున్నామని, కృష్ణ నుంచి గోదావరి నీళ్లు పెన్నాలో కలిపి నదుల అనుసంధానం చేస్తామని తెలిపారు. మీ ప్రాంతాల్లో వర్షపునీటిని భూగర్బ జలాలుగా మార్చుకునేందుకు చెరువుల్లో పూడిక తీతలు, ఫాంపాండ్స్ తవ్వి, వాటిని భూగర్బ జలాలుగా మారిస్తే కరువు ఉండదన్నారు. మన జీవితంలో వెలుగు నిచ్చే నదులకు కృతజ్ఞతతో ఉండాలని పేర్కొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో పుష్కర స్నానాల ప్రచారం చేయాలన్నారు. స్వచ్ఛందంగా గ్రామ ప్రజలు ముందుకు వచ్చి పలుచోట్ల భోజనాలు పెడుతున్నారని, ఇది బ్రహ్మాండమైన స్ఫూర్తి అని అన్నారు. స్వచ్ఛంద సేవా సంస్థలకు చెందిన యువకులు, పోలీసులు, అధికారులు చక్కగా పనిచేస్తున్నారని కితాబునిచ్చాడు. నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి.... స్విమ్మింగ్ పూల్‌లో కెమికల్స్ కలుపుతున్నారు. ఇక్కడ నీళ్లు బ్రహ్మాండంగా ఉన్నాయి.. ప్రతిఒక్కరూ పుష్కర స్నానం చేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు.నదిలో స్నానం చేస్తే పుణ్యం పురుషార్థం వస్తుందన్నారు. స్మార్ట్ ఫోన్ పట్టుకొని ఉత్సాహంగా సెల్ఫీలు తీస్తున్నారని తెలిపారు. ఫేస్బుక్, యూట్యూబ్,వాట్సప్, ఇంటర్నెట్,మెసెజ్‌ల రూపంలో విస్తృత ప్రచారం చేయాలన్నారు. పుష్కరాలను వినూత్న రీతిలో డ్రోన్ల ద్వారా మానిటరింగ్ చేస్తున్నామన్నారు. మరుగు దొడ్లను సైతం ప్రతి రెండు గంటలకు ఒకసారి శుభ్రం చేస్తున్నారని,భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పుష్కర ఏర్పాట్లు పక్కాగా చేశామని తెలిపారు. స్మార్ట్ ఫోన్ ఉంటే అన్ని పనులు అవుతాయన్నారు. సాక్షిపై అక్కసు ‘సాక్షి లాంటి పత్రిక కూడా పుష్కరాల ఏర్పాట్లపై వ్యతిరేకంగా వార్తలు రాయలేక పోతోంది... రాసినా దానిని పట్టించుకోవద్దు.. ఒక వేళ వ్యతిరేకంగా రాస్తే ఆ పేపరు చదవటం మానేయండి... అప్పుడు బుద్ధి వస్తుంది’అని సాక్షి పత్రికపై బాబు తన ఆక్రోశాన్ని వెళ్ల గక్కారు. కాగా, తన పర్యటన సందర్భంగా ఇక్కడి రాజా వాసిరెడ్డి వెంకటాద్రినాయుడు విగ్రహానికి బాబు పూలమాల వేశారు. నమూనా ఆలయాలను సందర్శించి, జరుగుతున్న చండీయాగాన్ని దర్శించుకున్నారు. ఈ పరిశీలనలో మంత్రులు చిన్నరాజప్ప, పరిటాల సునీత, పత్తిపాటి పుల్లారావు,ఎంపీ గల్లా జయదేవ్, ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్, జీవి ఆంజనేయులు, జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే, రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ నాలుగు గంటలూ నరకయాతనే...
- 5.30నుంచి మొదలై 9.30 వరకు స్తంభిస్తున్న ట్రాఫిక్ - ప్రహసనంలా ముఖ్యమంత్రి ప్రసంగం -రోజూ అదే ప్రసంగం గాంధీనగర్ (విజయవాడ) సాయంత్రం 6 గంటలు అవుతోందంటే ఇబ్రహీంపట్నం, కొండపల్లి పరిసర ప్రాంత వాసులు వణికిపోతున్నారు. నదుల అనుసంధానంతో తమ ప్రాంతం ఖ్యాతికెక్కిందన్న ఆనందం పుష్కరాల పుణ్యమాని ఆవిరైపోయింది. ప్రభుత్వం కృష్ణా పుష్కరాల సందర్భంగా ఫెర్రి వద్ద పవిత్ర సంగమం ఘాట్ ఏర్పాటు చేసి ప్రాచుర్యం కల్పించింది. పుష్కరుడికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హారతి ఇచ్చి స్వాగతించారు. స్వయానా ముఖ్యమంత్రి నదుల అనుసంధానం చేశామన్న విషయాన్ని ప్రజలకు చెప్పుకునేందుకు తాపత్రయ పడుతున్నారు. ప్రతి రోజు సాయంత్రం 7గంటలకు జరిగే నవదుర్గల హారతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరవుతున్నారు. ఇదే సమయంలో 12రోజులపాటు పన్నెండు కీలక శాఖలకు సంబంధించిన సమీక్షా సమావేశాలు సంగమం వద్దే నిర్వహించాలని అధికారులకు ఆయన సూచించారు. ముఖ్యమంత్రి నిత్యం సాయంత్రం సమయంలో ఘాట్ వద్దకు వచ్చి గంటన్నరకు పైగా సంగమం వద్ద ఉంటున్నారు. ఆ సమయంలో పోలీసుల ఆంక్షలు మీతిమీరిపోతున్నాయి. సాయంత్రం 5గంటల నుంచే పోలీసులు ఘాట్ వద్ద బస్సులు, ద్విచక్రవాహనాలు అనుమతించడం లేదు. హారతి సమయానికి రెండు గంటల ముందు ఘాట్‌కు చేరుకోకపోతే తర్వాత వెళ్లలేని పరిస్థితి. ఒకవేళ సాహసించి వెళ్లాలనుకుంటే ఇబ్రహీంపట్నం రింగు వద్ద నుంచి రెండు కిలోమీటర్లు నడిచివెళ్లాల్సిందే. నడిచే వారిపైనా పోలీసులు తమ ప్రతాపం చూపుతున్నారు. ఎటువెళ్లాలని భక్తులు అడిగితే మాకేమి తెలియదు.. మేం కొత్త అటుగా వెళ్లండంటూ ఉచిత సలహాలు ఇస్తున్నారు. దీంతో నదీ తీరంలో దీపాలు వెలగగానే భక్తులు నమస్కరించుకుని ఘాట్‌నుంచి జారుకుంటున్నారు. ప్రహసనంలా సీఎం ప్రసంగం.. ఇదంతా ఒక ఎత్తై ముఖ్యమంత్రి ఘాట్ వద్ద ఉన్న సమయంలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. అటు..ఇటు అంటూ పవిత్ర హారతి కార్యక్రమాన్ని వీక్షించకుండా చేస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. హారతి సమయంలో ఘాట్ వద్ద జనం లేక ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేస్తుంటే , పోలీసులు వారిని అనుమతించకుండా దూరంగా పంపుతున్నారు. ఇక ముఖ్యమంత్రి ప్రసంగం ఓ ప్రసహనంలా మారింది. రోజూ రావడం..గతేడాది గోదావరిలో సంకల్పం చేశాను. ఏడాదిలో గోదావరిని కృష్ణమ్మతో కలిపాను.. మరో ఏడాదిలో కృష్ణను పెన్నా నదితో కలుపుతాను.. చేతులు ముందుకు చాచి సంకల్పం చేయడంటూ ప్రజలను అష్టకష్టాలు పెడుతున్నారు. ముఖ్యమంత్రి పక్కన వస్తున్న మంత్రులు చేయి చాచి సంకల్పం చేసిన పాపాన పోవడం లేదు. ఇదీ తంతు. సీఎం చంద్రబాబు ఏవైనా కొత్త విషయాలు చెబుతారని ఆశించిన భక్తులు భంగపడాల్సిన పరిస్థితి. ఆ నాలుగు గంటలు నరకమే... ఈ తంతు కోసం రోజూ సాయంత్రం 5.30 గంటలనుంచి 9.30, ఒక్కో రోజు పది గంటల వరకు ఇబ్రహీంపట్నం రింగు వద్ద ట్రాఫిక్ భారీగా స్తంభించి ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ట్రాఫిక్ స్తంభించిన విషయాన్ని డ్రోన్లతో చిత్రీకిరిస్తున్నా ట్రాఫిక్‌ను నియంత్రించలేకపోతున్నారు. పిల్లలు, వృద్దులతో దూరప్రాంతాలనుంచి హారతి కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చి ట్రాఫిక్‌లో చిక్కుకుని ఆగచాట్లు పడుతున్నారు. పుణ్యానికి వస్తే పాపాం ఎదురైందన్నట్లు ఉందని ప్రజలు నిట్టూర్చుతున్నారు. దూరప్రాంతాలనుంచి వచ్చే భక్తులతోపాటు, స్థానికులు ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి రోజు వచ్చి ‘ నదులు అనుసంధానం చేశామని చెప్పుకోవడం ఎంతవరకు సబబని నిలదీస్తున్నారు. రద్దీగా ఉండేచోట్లకు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వచ్చి గంటల తరబడి ఉంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి రాకకుముందే ఘాట్‌నుంచి బయటకు వద్దామనుకుంటే అప్పటి వరకు ఉచితంగా తిప్పిన బస్సులను దూరంగా నిలిపివేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ముఖ్యమంత్రి హెలికాప్టర్లో వచ్చి వెళితే మంచిదని స్థానికులు భావిస్తున్నారు. నాలుగు రోడ్లలో నలిగిపోతున్నారు... రింగ్నుంచి కొండపల్లి వైపు..., విజయవాడ రోడ్డులో గుంటుపల్లి వరకు,హైదరాబాద్ రోడ్డులో జూపూడి వరకు ట్రాఫిక్ నిలిచిపోతోంది. స్థానికంగా ఉండే వీధులు వాహనాల రణగొణధ్వనులతో మార్మోగిపోతోంది. -
ప్రత్యేక హోదాపై త్వరలో ప్రకటన
-కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి విజయవాడ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ప్యాకేజీ అన్న అంశంపై కొద్ది రోజుల్లోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించనుందని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్రామ్మేఘవాల్ అన్నారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా మంగళవారం నగరానికి వచ్చిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్‌ను రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖామాత్యులు కామినేని శ్రీనివాస్ దుర్గాఘాట్‌లోని వీఐపీ ఘాట్‌కు తీసుకొచ్చారు. కేంద్ర మంత్రి కృష్ణానదికి నమస్కరించి నదిలోని నీటిని తలకు రాసుకున్నారు. అనంతరం భక్తులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పవిత్ర కృష్ణానది పుష్కరాల వేళ విజయవాడకు రావటం మధురానుభూతిగా మిగిలిపోతుందన్నారు. ప్రధాని నరేంద్రమోడీ దేశంలోని స్వాతంత్య్ర సమరయోధులను సత్కరించి రావాలని మంత్రులందరినీ ఆదేశించారన్నారు. ఆయన ఆదేశాలతో నెల్లూరు వెళ్తూ ఇక్కడకు వచ్చానని చెప్పారు. పుష్కరాలు భారతీయ ఔన్నత్యాన్ని చాటే గొప్ప కార్యక్రమామన్నారు. పుష్కరాలకు మంచి ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. అనంతరం ప్రత్యేక హోదాపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ దీనిపై ఇటీవల రెండు సభల్లోనూ సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. సభల నిర్ణయాలను తమ శాఖ అమలు చేస్తుందన్నారు. ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వానికి అత్యంత ముఖ్యమైన రాష్ట్రమన్నారు. దీనికి అన్ని విధాల సాయమందించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. ప్రత్యేకహోదా అంశంపై కేంద్రం పూర్తిస్తాయిలో కసరత్తు చేస్తుందన్నారు. కేవలం కొద్ది రోజుల్లోనే హోదా లేదా ప్యాకేజీ అనే అంశాలను ప్రకటిస్తామని వివరించారు. రాష్ట్ర మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ పుష్కరాల్లో అన్ని శాఖలు సమర్థవంతంగా పని చేస్తున్నాయన్నారు. ముఖ్యంగా తమ వైద్య ఆరోగ్య శాఖ సోమవారం జరిగిన సంఘటనల్లో చక్కగా స్పందించి వైద్య సేవలందించిందన్నారు. -
తృటిలో తప్పిన ప్రమాదం
కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలోని ఐల్లూరు ఘాట్ వద్ద తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రొక్లైనర్తో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఘాట్పైకి దూసుకొచ్చింది. ఆ ప్రాంతంలో పుణ్య స్నానం ఆచరిస్తున్న భక్తులు ఇది గుర్తించి వెంటనే పక్కకు తప్పుకోవడంతో.. పెను ప్రమాదం తప్పింది. లారీ కృష్ణానదిలోకి దూసుకెళ్లింది. ఘాట్ మెట్ల సమీపంలో పనులు నిర్వహించిన ప్రొక్లైనర్‌ను లారీ పై ఎక్కించి తీసుకెళ్తుండగా.. అదుపుతప్పిన లారీ నదిలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో అక్కడ స్నానం చేస్తున్న సుమారు 10 మంది భక్తులు ఇది గుర్తించి పక్కకు తప్పుకోవడంతో.. ప్రమాదం తప్పింది. -
సేవచేయండి.... ఆనందం పొందండి
విలేకరుల సమావేశంలో సీఎం సాక్షి, అమరావతి/విజయవాడ: వచ్చే పుష్కరాల నాటికి రాష్ట్రంలోని వాగులు, వంకలు అనుసంధానం కావాలని, ప్రజలు దీన్ని ఒక సంకల్పంగా తీసుకోవాలని సీఎం చంద్రబాబు అన్నారు. తను గతేడాది కృష్ణా, గోదావరి అనుసంధానాన్ని సంక్పలంగా తీసుకుని పట్టిసీమ ద్వారా పూర్తి చేశానని, ఈ కృష్ణా పుష్కరాల్లో గోదావరి నీటిని పెన్నాకు తరలించాలని సంకల్పం తీసుకున్నానని, పూర్తి చేస్తానని చెప్పారు. విజయవాడలో ఏర్పాటైన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్లో ఆదివారం విలేకరులతో ఆయన మాట్లాడారు. నదీమాతకు ప్రతి ఒక్కరూ తమ తమ ప్రార్థనా మందిరాల్లో పూజలు చేసి రుణం తీర్చుకోవాలన్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలు, ముఖ్యంగా విజయవాడ వాసులు నదీజలాలను వినియోగించుకుని ఉన్నత స్థానాల్లోకి వెళ్లి బాగా సంపాదించారని, వారందరూ పుష్కరాల్లో సేవ చేసి ఆనందం, తృప్తి పొందాలన్నారు. దుర్గామాత దర్శనాని కి పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక సమయం కేటాయించనున్నట్లు చెప్పారు. డ్వాక్రా బజార్లను స్టార్టప్‌లుగా మార్చేందుకు మూలధనం.. డ్వాక్రా సంఘాల యూనిట్లను స్టార్టప్(అంకుర) సంస్థలుగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వ్యవస్థీకృత మూలధనాన్ని అందిస్తుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఆదివారం గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన డ్వాక్రా బజారు స్టాల్‌ను సీఎం ప్రారంభించారు. మొక్కలు పెంచకుంటే రాయితీలు కట్ ఉద్యోగులు మొక్కలు పెంచకుంటే బదిలీలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఉండవని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఆదివారం రాత్రి ఇబ్రహీంపట్నం మండలంలోని పవిత్ర సంగమం ఘాట్ వద్ద జరిగిన ‘వనం-మనం’ సదస్సుకు సీఎం ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మొక్కలు పెంచి పచ్చదనాన్ని కాపాడే వారికోసం ప్రత్యేక పాలసీ, మొక్కల్ని పెంచే విద్యార్థులకు ప్రత్యేకంగా మార్కులు ఇస్తామన్నారు. సీఎం స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. -
పుష్కర సందోహం
మూడోరోజు పోటెత్తిన భక్తజనం * మహబూబ్‌నగర్ జిల్లాలో 13.5 లక్షల మంది, నల్లగొండలో 3.5 లక్షల మంది పుణ్యస్నానాలు * పలుచోట్ల ట్రాఫిక్ రద్దీ.. ఘాట్లను పరిశీలించిన డీజీపీ సాక్షి ప్రతినిధులు,నల్లగొండ/మహబూబ్‌నగర్: కృష్ణా పుష్కరాల మూడోరోజు భక్తులు పోటెత్తారు. అశేష జనవాహినితో ఘాట్లు జన సంద్రమయ్యాయి. మూడ్రోజుల వరుస సెలవులతో శుక్రవారం నుంచి పెరిగిన భక్తుల రద్దీ ఆదివారం మరింత ఊపందుకుంది. మహబూబ్‌నగర్ జిల్లావ్యాప్తంగా ఆదివారం దాదాపు 13.5 లక్షల మంది పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు తెలిపారు. బీచుపల్లి, అలంపూర్, సోమశిల పుష్కరఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుంచే జనప్రవాహం పెరిగింది. ట్రాఫిక్ నియంత్రణ కోసం పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. అలంపూర్‌లోని గొందిమళ్లలో దాదాపు 1.30 లక్షల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి జోగుళాంబ దేవాలయాన్ని దర్శించారు. బీచుపల్లిలో దాదాపు 2 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరించారు. సోమశిలలో 80 వేల మంది వరకు పుణ్యస్నానాలు ఆచరించారు. అచ్చంపేటలోని పాతాళగంగలో సైతం భక్తుల సంఖ్య పెరిగింది. గద్వాలలోని నది అగ్రహారంలో తెల్లవారుజాము నుంచే పుష్కర స్నానాలు ఆచరించడానికి భక్తులు బారులు తీరారు. జూరాల, పస్పుల, ఆత్మకూర్, క్యాతూర్ తదితర ప్రాంతాల్లోనూ రద్దీ కనిపించింది. డీజీపీ అనురాగ్‌శర్మ మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ పుష్కరఘాట్‌ను, నల్లగొండ జిల్లాలోని వాడపల్లి ఘాట్‌ను సందర్శించారు. ఏర్పాట్లపై అధికారులను, సామాన్య భక్తులను అడిగి తెలుసుకున్నారు. కొన్నిచోట్ల అంచనాలకు మించి భక్తులు రావడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇక నల్లగొండ జిల్లాలో పుణ్యస్నానాలకు 3.50 లక్షల మంది తరలివచ్చారు. నాగార్జున సాగర్ శివాలయం ఘాట్ వద్ద 1.60 లక్షలు, వాడపల్లి శివాలయం ఘాట్‌వద్ద సుమారు 70 వేల మంది, మట్టపల్లిలో 80 వేల మందికి పైగా స్నానాలు చేశారు. జిల్లాలోని మిగిలిన ఘాట్లలో భక్తుల తాకిడి రోజువారీ మాదిరిగానే ఉంది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్.. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం వాహనాలు కిలోమీటర్ల మేర బారులుదీరాయి. హైవేపై రోజుకు సరాసరి 16 వేల వాహనాలు ప్రయాణిస్తుండగా.. శనివారం 4 వేలు, ఆదివారం 2 వేల వాహనాలు అదనంగా రాకపోకలు సాగించాయి. పుష్కర ప్రాంతాల్లో మంత్రుల ఏరియల్ పర్యవేక్షణ సాక్షి, హైదరాబాద్: పుష్కరాలు జరిగే మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోని ప్రధాన ప్రాంతాలను హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షించాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఆయా జిల్లాల మంత్రులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఈ మేరకు వివరాలను సీఎం కార్యాలయం వెల్లడించింది. సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా రంగాపూర్, సోమశిల, అలంపూర్, బీచ్పల్లి ప్రాంతాల్లో ఆ జిల్లా మంత్రులు లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి హెలికాప్టర్ ద్వారా పర్యవేక్షిస్తారు. మంగళవారం నల్లగొండ జిల్లా వాడపల్లి, నాగార్జునసాగర్, మట్టపల్లిలో ఆ జిల్లా మంత్రి జగదీష్‌రెడ్డి పర్యవేక్షిస్తారు. ఈ రెండు జిల్లాల పర్యవేక్షణలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొంటారు. -
పిండ ప్రదానానికి వచ్చి ప్రాణం విడిచి..
పితృదేవతలకు పిండప్రదానం చేయడానికి వచ్చి గుండె నొప్పిరావడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా వ్యక్తి మృతి చెందిన విషాదకర సంఘటన ఆదివారం గొల్లపూడిలో చోటుచేసుకొంది. గొల్లపూడి త్రిబులెక్స్ కాలనీకి చెందిన చావలి సాయి కామేశ్వరావు(59) విజయవాడరైల్వే శాఖ ఏసీ కోచ్ లో సీనియర్ సెక్షన్ ఇంజినీరు(ఏసి మెయింటెనెన్స్)గా పనిచేస్తున్నారు. భార్య అరుణప్రభతో గొల్లపూడిలోని పుష్కర్‌ఘాట్‌కు పుష్కరాల ప్రారంభం నుంచి పుష్కరాల స్నానానికి వస్తున్నారు. ఆదివారం పితృదేవతలకు పిండప్రదానం కార్యక్రమాన్ని పురోహితునితో చేయించుకొని నదిలో నిమజ్జనం చేయడానికి వస్తుండగా హఠాత్తుగా గుండె నొప్పి రావడంతో కామేశ్వరావు కుప్పకూలిపోయారు. భార్య గట్టిగా కేకలువేయడంతో అధికారులు ఎంపీడీఓ వై.బ్రహ్మయ్య దగ్గరలోవున్న వైద్యసిబ్బందిని పిలిచి ప్రాథమిక వైద్యం చేయాలని సూచించారు. పల్స్‌రేటు తక్కువుగా వుందని చెప్పడంతో అక్కడేవున్న పుష్కరఘాట్ ప్రత్యేక అధికారి, డీఎస్పీ ఆస్మ ఫరజాన వెంటనే 108కి ఫోను చేశారు. వ్యాను అందుబాటులో లేకపోవడంతో తనజీపులో ఎక్కించుకొని స్థానిక ఆంధ్రాహాస్పటల్కు వైద్యం కోసం తరలిస్తుండగా కామేశ్వరావు మృతి చెందారు. మృతుడు గుండెజబ్బుకు సంబంధించి స్టంట్స్ వేయించుకొన్నాడని ఆయన కుటుంబసభ్యులు చెప్పారు. పుష్కరఘాట్‌లో జరిగిన ప్రమాద సంఘటన వివరాలను ఎంపీడీఓ బ్రహ్మయ్య జిల్లా కలెక్టర్ బాబు ఏ, జిల్లావైద్యశాఖాధికారి, ఇతర అధికారులకు తెలియచేశారు. అందుబాటులో లేని ప్రభుత్వ వైద్యం: పుష్కరఘాట్ల వద్ద ప్రభుత్వ వైద్యులను, సిబ్బందితోపాటు ఎమర్జెన్సీ కోసం అంబులెన్స్‌ను అందుబాటులో వుంచాల్సివుండగా గొల్లపూడి పుష్కరఘాట్ సీ గ్రేడ్ కావడంతో ఏఎన్ఎంను, సాధారణ మందులను మాత్రమే ఏర్పాటు చేశారు. ఈ ఘాట్ వద్ద ప్రభుత్వ అంబులెన్స్‌ను ఏర్పాటు చేయాలని అధికారులు కొందరు ప్రభుత్వానికి ప్రతిపాదన చేసినా జిల్లావైద్యశాఖ పట్టించుకోలేదని తెలిసింది. ఇప్పటికైనా అంబులెన్స్‌ను అందుబాటులో వుంచాలని గ్రామస్తులు జిల్లాయంత్రాంగానికి విజ్ఞప్తి చేస్తున్నారు. -
జ్ఞానబుద్ధ పుష్కరఘాట్‌లో కూలిన టెంట్లు
- ఇనుప రాడ్దులు తగిలి భక్తులకు గాయాలు అమరావతి(గుంటూరు జిల్లా) కృష్ణా పుష్కరాల్లో అధికారుల నిర్లక్ష్యం అడుగడుగునా కనపడుతోంది. గుంటూరు జిల్లా అమరావతిలోని జ్ఞానబుద్ధ పుష్కరఘాట్‌లో ఆదివారం భక్తుల రద్దీ అధికం కావటంతో శనివారం సాయంత్రమే టెంట్లను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం 11-12గంటల మధ్య ఘాట్లలో తీవ్రంగా గాలులు వీయటంతో ఒక్కసారిగా రెండు టెంట్లు పడిపోయాయి. పూర్తిస్థాయిలో జాగ్రత్తలు పాటించకపోవటంతో 24 గంటలు తిరగముందే టెంట్ కుప్పకూలింది. దీనితో ఇనుపరాడ్డులు తగిలి భక్తులు గాయాలపాలయ్యారు. ఒక్కసారిగా జరిగిన హాఠాత్ పరిణామానికి భక్తులు భయాందోళన చెందారు. ఒంగోలుకు చెందిన సీహెచ్ ప్రసన్నకు తలకు, గుంటూరు నల్లచెరువుకు చెందిన సాయిలిఖిత, సంగడిగుంటకు చెందిన బాబులకు తీవ్ర గాయాలయ్యాయి. దీనితో అక్కడే ఉన్న వారి బంధువులు, రెడ్‌క్రాస్ తరుఫున వచ్చిన విద్యార్థులు హుటాహుటిన క్షత్రగాత్రులను తీసుకుని కమాండ్ కంట్రోల్‌రూమ్ వద్ద ఉన్న ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. ఒక్క అధికారి లేరు.... సంఘటన జరిగిన సమయంలో అక్కడ ఒక్క అధికారి కూడా లేరని బాధితులు చెబుతున్నారు. కనీసం ఆసుపత్రికి తీసుకుని వెళ్ళే సమయంలో కూడా ఏ ఒక్కరూ తోడు రాలేదని ఆరోపించారు. అధికారులు ఏర్పాట్లు సక్రమంగా చేసి ఉంటే ఇటువంటి పరిస్ధితి వచ్చి ఉండేది కాదని మండిపడ్డారు. ఇప్పటికైనా ఇటువంటి దుర్ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అంటున్నారు. విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండే, పెదకూరపాడు ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌లు బాధితులను పరామర్శించారు. -
కష్ణా పుష్కరాల్లో అపశృతి
కృష్ణా పుష్కరాల్లో అపశృతి చోటుచేసుకుంది. పుష్కరాల్లో పుణ్య స్నానం ఆచరించడానికి వచ్చిన మహిళకు ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల తీవ్ర గాయాలయ్యాయి. ధరణికోట బుద్ధుని ఘాట్‌లో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ ఎదుట వేసిన టెంట్ కూలిపోయింది. ఆ సమయంలో టెంట్ కింద ఉన్న సాయి నిఖిత అనే మహిళ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెతో పాటు ఉన్న మరో మహిళకు స్వల్ప గాయాలయ్యాయి. ఇది గుర్తించిన పోలీసులు వెంటనే వారిని వైద్య సేవల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. -
ఆహ్వానంలోనూ కుసంస్కారం
-
ఆహ్వానంలోనూ కుసంస్కారం
టీడీపీ తీరుపై ధ్వజమెత్తిన వైఎస్సార్సీపీ పుష్కరాలు ప్రారంభమయ్యాక ప్రతిపక్షనేతకు ఆహ్వానం జగన్ ఇంటి గేటువద్దకు వచ్చి మంత్రి రావెల రాజకీయం శనివారం ఉదయం సాదరంగా ఆహ్వానించిన జగన్ ఆహ్వాన పత్రికను అందుకుని, కాఫీతో మర్యాద తాను 18న పుష్కర స్నానానికి వెళుతున్నట్లు వెల్లడి ఇంటి బయటకు వచ్చి విమర్శించిన రావెల ఆహ్వానం విషయంలో అన్నీ అబద్ధాలే: పార్థసారధి సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాలకు ఆహ్వానించడానికి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నివాసానికి వచ్చిన రాష్ట్ర మంత్రి రావెల కిషోర్‌బాబు వ్యవహరించిన తీరు తెలుగుదేశం పార్టీ కుసంస్కారానికి పరాకాష్టగా నిలుస్తోందని వైఎస్సార్సీపీ ధ్వజమెత్తింది. ఆహ్వానం పేరుతో రాజకీయం చేస్తున్న అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని విమర్శించడం మొగుణ్ని కొట్టి మొగసాలకు ఎక్కిన చందంగా ఉందని విమర్శించింది. ప్రతిపక్ష నేత పట్ల తడవ తడవకూ చులకన భావంతో వ్యవహరిస్తున్న ప్రభుత్వం తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు చేసిన ప్రయత్నంలో భాగమే శుక్ర, శనివారాల్లో ‘ఆహ్వానం’ పేరుతో జరిగిన సంఘటనలని పేర్కొంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు.. శనివారం ఉదయం పది గంటల ప్రాంతంలో జగన్ నివాసానికి మంత్రి రావెల ప్రభుత్వ విప్ కూన రవికుమార్, మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డితో కలిసి వచ్చినపుడు వారిని సాదరంగా పార్టీ నేతలు లోనికి ఆహ్వానించి కూర్చోబెట్టారు. ఆ తరువాత జగన్‌తో పాటు, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి కె.పార్థసారథి, ప్రధాన కార్యదర్శి ఎస్.దుర్గాప్రసాద్‌రాజు వారితో కొద్దిసేపు ముచ్చటించారు. రావెల పుష్కర ఆహ్వాన పత్రికను అందజేసిన తరువాత జగన్ వారి కోసం కాఫీ తెప్పించారు. తాను 18న పుష్కర స్నానానికి వెళుతున్నట్లు కూడా ఆ సందర్భంగా వారికి చెప్పారు. అయినా రావెల బయటకు రాగానే రాజకీయం చేస్తున్నారంటూ విమర్శలు చేయడం అందరినీ నివ్వెరపరచిందని, దురుద్దేశంతోనే వారు జగన్ నివాసానికి వచ్చారనేది అర్థమవుతోందని పార్టీ వర్గాలు తెలిపాయి. జగన్‌కు, ఆహ్వానం అందజేయడానికి వారం రోజులుగా అపాయింట్మెంట్ కావాలని హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రయత్నిస్తే దొరకలేదని రావె ల చెప్పడం తప్పు దోవపట్టించే దిగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ వారం రోజుల్లో రాజప్ప నుంచి జగన్ వ్యక్తిగత సిబ్బందికి గాని, పార్టీ నేతలకు గాని వర్తమానం రాలేదని పేర్కొన్నాయి. రాజకీయం మంచిది కాదు: రావెల తమను అవమాన పరిచారని, నిర్లక్ష్యం చేస్తున్నారనీ ప్రతిపక్షం ప్రతి విషయాన్ని చిలువలు పలువలు చేస్తూ రాజకీయం చేయడం సబబు కాదని మంత్రి రావెల కిశోర్‌బాబు వ్యాఖ్యానించారు. జగన్‌కు ఆహ్వానం అందజేసి బయటకు వచ్చాక ఆయన మీడియాతో మాట్లాడుతూ... వాస్తవానికి జగన్‌కు హోంమంత్రి చిన్న రాజప్ప ఆహ్వానం ఇవ్వాలనుకున్నా వారం రోజులుగా అపాయింట్మెంట్ దొరకలేదని చెప్పారు. శుక్రవారం రాత్రి తాను, రవికుమార్ ఇంటి వద్దకు వచ్చినా జగన్ కలవడానికి నిరాకరించినప్పటికీ... ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సలహా మేరకు తాము పెద్ద మనసు చేసుకుని శనివారం వచ్చామని చెప్పారు. ప్రజలు పవిత్రంగా భావించే పుష్కరాలను కూడా రాజకీయం చేయడం తగదని సూచించారు. ఆహ్వానం పేరిట కుళ్లు రాజకీయం: పార్థసారథి పుష్కరాల ఆహ్వానం పేరుతో టీడీపీ కుళ్లు రాజకీయం చేస్తూ.. తాము చేస్తున్నట్లుగా చిత్రీకరించడం దారుణమని వైఎస్సార్సీసీ అధికార ప్రతినిధి పార్థసారథి ధ్వజమెత్తారు. పార్టీ నేత చలమశెట్టి సునీల్‌తో కలిసి ఆయన జగన్ నివాసం వద్ద మాట్లాడారు. ఆహ్వానం అందించడానికి వచ్చిన మంత్రి, ఇతర నేతలతో జగన్ చాలా గౌరవంగా మాట్లాడి పంపితే... బయటకు వచ్చి విమర్శించడం వారి కుసంస్కారానికి నిదర్శనమని మండిపడ్డారు. అసలు అయిపోయిన పెళ్లికి బాజాలు అన్నట్లుగా పుష్కరాలు ప్రారంభం అయిన 24 గంటల తరువాత ఆహ్వానం ఇవ్వడానికి వచ్చారంటేనే వారి సంస్కారం ఏపాటిదో అర్థం అవుతోందన్నారు. ప్రతిపక్ష నేత అపాయింట్మెంట్ లేక పోయినా శుక్రవారం రాత్రి తాము ఆహ్వానించడానికి వెళుతున్నట్లు లీకులిచ్చి టీవీల్లో ప్రచారం చేయడాన్ని తప్పుబట్టారు. -
‘వచ్చే పుష్కరాలకు పుష్కలమైన నీటిలో స్నానాలు చేద్దాం’
‘ఇలా కాకుండా వచ్చే పుష్కరాలకైనా పుష్కలమైన నీటిలో పవిత్ర స్నానాలు చేద్దాం’ అని త్రిదండి రామానుజ చిన జియర్‌స్వామి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలువలో నీటిని చేతులతో చూపిస్తూ అన్నారు. మానవుని చర్యల వల్ల నదికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు. అందుకే నదిని కలుషితం చేయకుండా స్నానాలు చేయాలని ఆయన భక్తులకు సూచించారు. తాడేపల్లి సమీపంలోని సీతానగరం ఘాట్ వద్దకు శుక్రవారం వేకువజామున భక్తులతో కలిసి కృష్ణానదికి చేరుకున్నారు. ఆశ్రమంలోని వేదవిశ్వవిద్యాలయం విద్యార్థులు, స్వామీజీలతో కలిసి సీతానగరం ఘాట్ వద్ద గోమాతకు, భూదేవికి, నదీమతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కృష్ణా పుష్కరాల విశిష్టత గురించి భక్తులకు వివరించారు. సూర్యోదయం స్నానం మంచిదని, అందుకే ఎక్కువ మంది భక్తులు ఉదయమే పవిత్రస్నానాలు చేస్తారన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాలువలో భక్తులు స్నానం చేయగా.. చిన జియర్‌స్వామి మాత్రం ప్రవహించే నదివద్దకు వెళ్లారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి పవిత్రస్నానం చేశారు. -
కృష్ణా పుష్కరాల్లో విషాదం
కృష్ణా పుష్కరాల్లో విషాదం చోటుచేసుకుంది. పుష్కర స్నానానికి వచ్చిన ఐదేళ్ల బాలుడు నీట మునిగి మృతిచెందాడు. ఈ సంఘటన విజయవాడలోని పద్మావతి ఘాట్ వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. పుష్కర స్నానానికని నదిలోకి దిగిన బాలుడు ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందాడు. గోదావరి పుష్కరాల్లో జరిగిన తొక్కిసలాటను దృష్టిలో ఉంచుకొని కృష్ణా పుష్కరాలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు చేశామని గప్పాలు కొట్టిన ప్రభుత్వం సరైన సౌకర్యాలు కల్పించకపోవడంతోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. మరో ఘటనలో.. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి కృష్ణా నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో విజయవాడలోని పున్నమిఘాట్ సమీపంలో ఏపీ టూరిజం విహార యాత్ర బోటు నుంచి ఓ వ్యక్తి కృష్ణా నదిలో దూకాడు. ఇది గుర్తించిన బోటు డ్రైవర్ గజ ఈతగాళ్ల సాయంతో అతన్ని కాపాడి భవానీపురం పోలీసులకు అప్పగించాడు. ఆత్మహత్యాయత్నం చేసిన వ్యక్తి విశాఖ జిల్లా మాడుగుల మండలం వీరవల్లి అగ్రహారానికి చెందిన దొరబాబు(33)గా గుర్తించారు. భార్యతో మనస్పర్థలు, కుటుంబ కలహాలతోనే ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో తేలింది. -
పుష్కరాలకు శ్రీశైలంలో ఏర్పాట్లు పూర్తి
-
కృష్ణమ్మకు పుష్కర శోభ
-
పుష్కరాలకు శ్రీశైలంలో ఏర్పాట్లు పూర్తి
- అలంపూర్ మహా పుణ్యక్షేత్రంలో విస్తృత సౌకార్యాలు సాక్షి,సిటీబ్యూరో కృష్ణాపుష్కరాలను పురష్కరించుకొని ఏపీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీశైలం, అలంపూర్ పుణ్యక్షేత్రాల్లో భక్తుల ర ద్దీకి తగ్గట్లు ఏర్పాట్లు చేశారు. శ్రీశైలంలో శ్రీభ్రమరాంబా శక్తిపీఠం, అలంపూర్ జోగులాంబ శక్తి పీఠం ఉన్నాయి. దీంతో భక్తులు మొదటి చూపు ఆ ప్రాంతాలపై ఉంది. రెండు ప్రాంతాల్లో విస్తృత ఏర్పాట్లును చేశారు. తెల్లవారు జామున 4 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించవచ్చు. శ్రీశైలంలో మూడు పుష్కర నగర్లు, ఘాట్లతో పాటు భక్తులకు స్వామి అమ్మవారి దర్శనం, అలంపూర్‌లోని జోగులాంబ టెంపుల్లో దర్శనం సులువుగా కల్గేటట్లు ప్రభుత్వ ఉన్నతాధికారులు మార్గం సుగమం చేశారు. పుష్కర నగర్లు - 1: శ్రీశైలంలోని యజ్ఞవాటిక ప్రదేశం వద్ద పుష్కర్ నగర్ -1 ఏర్పాటు చేశారు. బస్సుల్లో ఇతర ప్రాంతాల నంచి వచ్చిన భక్తులు ఇక్కడే దిగ వలసి ఉంటుంది. ఈ ప్రదేశం నుంచే తెలంగాణ ఆర్టీసీ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఈ పుష్కర్ నగర్ వద్ద భక్తుల సౌకర్యార్థం వసతి, క్లాక్ రూం, మరుగుదొడ్ల సదుపాయం కల్పించారు. పుష్కర్ నగర్- 2: స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వెనుక వైపు పుష్కర్ నగర్ - 2 ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశంలో భక్తులకు వసతి ఏర్పాటు చేశారు. పర్యాటక శాఖ ఆధ్వర్యంలో పుడ్స్టాల్స్ ఏర్పాటు అయ్యాయి. రుచికరమైన వివిధ రకాల వంటను నోరారా భుజించవచ్చు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లేజర్‌షో భక్తులను ఆకట్టుకొనుంది. ఆ సమీపంలోనే రాష్ట్రంలోని ప్రముఖ నమునా దేవాలయాల సముదాయాన్ని ఏర్పాటు చేశారు. యాత్రీకుల సౌకర్యార్థం ఇక్కడ క్లాక్‌రూం, దుకాణాలు అందుబాటులో తీసుకవచ్చారు. పార్కింగ్ కూ అవకాశం కల్పించారు. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయాలు ఉంటాయి. పుష్కర నగర్ - 3 : పాతాళ గంగకు వెళ్లే మార్గంలోని కాటేజి నెం. 111 ఎదురుగా యాత్రికుల వసతి సముదాయ షెడ్లను పుష్కర్ నగర్ - 3 గా ఏర్పాటు చేశారు. ఇక్కడ అధిక సంఖ్యలో వసతి పొందటానికి సౌకర్యం సమకూర్చారు. అన్న దాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తుల సౌకర్యార్థం స్నానపు గదులు, మరుగుదొడ్లు అందుబాటులో ఉంటాయి. పుష్కర ఘాట్లు... శ్రీశైలంలోని పాతాళగంగ వద్ద రోప్‌వే వైపు కొత్తగా నిర్మించిన భ్రమరాంబ పుష్కర్ ఘాట్, ఆ ప్రక్కనే మల్లికార్జున ఓల్డ్ పుష్కర ఘాట్, లింగాల గట్టు లో లెవల్, హైలెవెల్ రెండు పుష్కర ఘాట్లలో భక్తులు పుణ్య స్నానం చేయవచ్చు. మల్లమ్మ కన్నీరు వద్ద పార్కింగ్... శ్రీశైలానికి వచ్చిన జీపులు, కార్లు వంటి వాహనాలను టోల్గేట్, యజ్ఞవాటిక, వలయమార్గం మీదుగా మల్లమ్మ కన్నీరు ఆలయానికి సమీపంలోని పార్కింగ్ ప్రదేశానికి మళ్లిస్తారు. పుష్కర్ నగర్ -2 వద్ద వహనాలు నిలుపుకోవటానికి అవకాశం ఉంది. అలంపూర్ గొందిమళ్ల ఘాట్... మహబూబ్‌నగర్ జిల్లా మొత్తం 55 పుష్కర ఘాట్లు ఉన్నాయి. కానీ అలంపూర్‌కు 9 కి.మీ దూరంలో గొందిమళ్ల వద్ద శ్రీజోగులాంబ అమ్మవారిగా ఘాట్ ఏర్పాటు చేశారు. ఇక్కడ శుక్రవారం ఉదయం 5.50 నిమిషాలకు సీఎం కేసీఆర్ దంపతులు పుణ్యస్నానాలు చేస్తారు. అనంతరం భక్తులు స్నానాలు చేస్తారు. అమ్మవారి ఆలయానికి దగ్గరగా ఉన్న ఘాట్ ఇదే. దర్శనం ఏర్పాట్లు... శ్రీశైలంలో ఈ నెల 12 నుంచి 23వ తేదీ వరకు భక్తులకు ఉచిత, శ్రీఘ్ర, అతి శ్రీఘ్ర దర్శనాన్ని దేవస్థానం కల్పించింది. శ్రీఘ్ర దర్శనానికి రూ. 200, అతి శ్రీఘ్ర దర్శనానికి రూ. 1000 టిక్కెట్టు ధర నిర్ణయించారు. సిఫార్సు లేఖలు, ముఖ్య అతిధులకు అతి శ్రీఘ్ర దర్శనం టికెట్లు విక్రయించనున్నారు. వేర్వేరు చోట్ల రెండు లడ్డు విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో దర్శనం కోసం క్యూ లైన్లలో వచ్చే భక్తులకు ఒక లడ్డు కేంద్రం, విడిగా వచ్చిన భక్తుల కోసం మరో లడ్డు విక్రయ కేంద్రం అందుబాటులో ఉంటుంది. వైద్య, వలంటీర్ల సేవలు ఏర్పాట చేశారు. అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయంలో వీఐపీ టికెట్ రూ. 500, సాధారణ టికెట్ రూ. 100 ధర నిర్ణయించారు. -
కలిసొచ్చిన సెలవులు
ఆగస్టు 12వ తేదీన పుష్కరాలు మొదలవుతాయి. అదే రోజు వరలక్ష్మి వ్రతం ఐచ్ఛిక సెలవు, 13వ తేదీన రెడో శనివారం, 14వ తేదీ ఆదివారం, 15వ తేదీ సోమవారం స్వాతంత్య్ర దినోత్సవం. వరుసగా మూడురోజులు సెలవులు. 18వ తేదీ శ్రావణపూర్ణిమ రక్షాబంధన్ ఐచ్ఛిక సెలవుదినం, 21వ తేదీ ఆదివారం. మధ్యలో 16,17,19,20 తేదీలు మాత్రమే పనిదినాలు. సెలవుదినాలు వచ్చినందున పురాతన ఆలయాలుండే పుష్కర ప్రాంతాల్లో భక్తులు రద్దీ పెరిగే సూచనలున్నాయి. శని, సోమ వారాల్లో పూజలు పుష్కర మూలమూర్తి శివునికి ప్రీతికరం. శ్రావణ మాసం అమ్మవారికి ప్రీతికరం. అలంపూర్‌లో జోగులాంబ అమ్మవారు ఆలయంతో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉంది. 16న శ్రావణ మంగళవారం, 18వ తేదీ శ్రావణ పౌర్ణమి రక్షాబంధన్, 19న శ్రావణ శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమే. ఈ రోజుల్లోనూ జోగులాంబ శక్తి పీఠం ఆలయం అలంపూర్ రద్దీ ఉండే అవకాశం ఉంది. -
పుష్కరాల దృష్ట్యా సాగర్‌కు 10 టీఎంసీలు
శ్రీశైలం నుంచి నీటి విడుదలకు కృష్ణా బోర్డు అంగీకారం తదుపరి ఆదేశాల వరకు నీటిని వాడొద్దని తెలంగాణ, ఏపీకి సూచన ఏపీలో తాగునీటి కోసం హంద్రీనీవాకు 4.5 టీఎంసీలు కేటాయింపు 22.7 టీఎంసీల విడుదలకు బోర్డును కోరిన తెలంగాణ ఏపీ నీటి మళ్లింపుపై దృష్టి పెట్టాలని లేఖ హైదరాబాద్: కృష్ణా పుష్కరాలను దృష్టిలో పెట్టుకొని శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జున సాగర్‌కు 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల విజ్ఞప్తికి కృష్ణా నదీ యాజమాన్య బోర్డు అంగీకరించింది. అయితే ఆ నీటిని నిల్వ చేసి పెట్టాలని, తదుపరి ఆదేశాల వరకు నీటిని వినియోగించరాదని సూచించింది. రాష్ట్రాల అవసరాల మేరకు ఈ నీటి విడుదలపై ఇరు రాష్ట్రాలతో చర్చించాక నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. ఈ మేరకు కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ చటర్జీ బుధవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. మరోవైపు కర్నూలు, అనంతపురం తాగునీటి అవసరాలకు 5 టీఎంసీలు విడుదల చేయాలన్న ఏపీ విజ్ఞప్తిపై బోర్డు సానుకూలంగా స్పందించింది. ఇప్పటికే హంద్రీనీవా ద్వారా 0.5 టీఎంసీల నీటిని వాడుకున్నందున మిగతా 4.5 టీఎంసీల నీటిని వాడుకునేందుకు ఏపీకి అనుమతిచ్చింది. బుధవారం నుంచి వచ్చే నెల 9 వరకు రోజుకు 2 వేల క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని ఏపీకి సూచించింది. అలాగే హైదరాబాద్ తాగునీటి అవసరాల దృష్ట్యా ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు (ఏఎంఆర్పీ) ద్వారా తెలంగాణ యథావిధిగా 525 క్యూసెక్కుల నీటిని వినియోగించుకోవచ్చని తెలిపింది. 22.7 టీఎంసీలు కావాలి... శ్రీశైలం నుంచి సాగర్‌కు 22.7 టీఎంసీల నీటిని విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అంతకుముందే బోర్డును కోరుతూ లేఖ రాసింది. సాగర్‌లో ఇప్పటికీ కనీస నీటిమట్టానికి (510 అడుగులు) దిగువన 505 అడుగుల వద్ద నీటి లభ్యత ఉందని, హైదరాబాద్ తాగునీటి అవసరాల దృష్ట్యా ఎమర్జెన్సీ పంపులు బిగించి నీటిని తీసుకుంటున్నామని తెలిపింది. ప్రస్తుతం శ్రీశైలానికి వరద చేరుతున్న దృష్ట్యా సాగర్‌కు నీరు విడుదల చేయాలని కోరింది. సాగర్‌లో కనీస నీటిమట్టం 510 అడుగులు చేరేందుకు వీలుగా 6.70 టీఎంసీలు, సాగర్ కుడి, ఎడమ కాల్వ కింద అవసరాల కోసం ఏపీకి, తమకు చెరో 5 టీఎంసీల చొప్పున 10 టీఎంసీలు, హైదరాబాద్, నల్లగొండ తాగునీటి అవసరాల కోసం ఏఎంఆర్పీ ద్వారా మరో 6 టీఎంసీలు కేటాయించాలని విన్నవించింది. ఈ నీటితో రాష్ట్ర తాగు అవసరాలతోపాటు పుష్కరాలకు నీటి కొరత తీరుతుందని విన్నవించింది. ఇదే సమయంలో శ్రీశైలం నుంచి రాయలసీమ అవసరాల కోసం హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ తరలిస్తున్న నీటిపై దృష్టి పెట్టాలని బోర్డుకు రాష్ట్రం సూచించింది. ఏపీ ఏ మేరకు నీటిని వాడుకుంటోందనే అంశంపై దృష్టి పెట్టి వాటా మేరకే వాడుకునేలా చూడాలని విన్నవించింది. -
దుర్గాఘాట్‌లో సీఎం పుష్కర స్నానం...
- ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు సాక్షి, అమరావతి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు కృష్ణా పుష్కరాల ప్రారంభం రోజైన శుక్రవారం ఉదయం 5.45 గంటలకు విజయవాడలోని దుర్గాఘాట్‌లో పుష్కర స్నానమాచరిస్తారు. బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించిన రోజు నుంచి 12 రోజుల పాటు జరుపుకొనే వేడుకను పుష్కరం అంటారు. బృహస్పతి కన్యారాశిలో గురువారం రాత్రి 9.28 గంటలకు ప్రవేశిస్తాడు. సూర్యాస్తమయం తర్వాత స్నానం చేయకూడదనే నిబంధన ఉండడంతో 12వ తేదీ సూర్యోదయ సమయంలో స్నానం చేస్తారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పుష్కర స్నానంతో పుష్కర స్నానాలు ప్రారంభమవుతాయి. అదే సమయంలో సీఎం చంద్రబాబు కూడా స్నానం చేస్తారు. ఈ విషయాన్ని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు. దుర్గాఘాట్ వీఐపీ ఘాట్ కావడంతో వారు అక్కడ స్నానం చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 62వేల మంది ఉద్యోగులు పుష్కరాల్లో సేవలందిస్తున్నట్లు వివరించారు. వీరంతా 1120 ప్రాంతాల్లో ఉంటారన్నారు. అత్యవసర సేవలు నిత్యం అందుబాటులో ఉంటాయని, విజయవాడ నగరంలో మొత్తం ఏడు ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో ఘాట్‌కు ఒక రిఫరల్ ఆస్పత్రిని గుర్తించినట్లు తెలిపారు. ఎవరికైనా అనారోగ్య సమస్య వచ్చినట్లు గుర్తిస్తే వెంటనే ఆయా ఆస్పత్రులకు తరలిస్తామని చెప్పారు. పది లక్షల మంది పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా తప్పిపోతే సులభంగా తెలుసుకోవచ్చునని చెప్పారు. 54 స్వచ్ఛంద సంస్థలు భోజనాలు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు వివరించారు. విజయవాడ నగరంలో 60 ప్రాంతాల్లో అన్నప్రసాదాలు పెడతారని తెలిపారు. ప్రతి ఘాట్‌కు ఒక ఇన్చార్జి ఉంటారని, మల్టీ డిసిప్లెయినరీ టీం కూడా ప్రతి ఘాట్‌కు ఉంటుందని వివరించారు. మొత్తం 45 పుష్కర నగర్లు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అక్కడ్నుంచి నిత్యం ఘాట్లకు రోజుకు 400 బస్సులు తిరుగుతాయని, స్నానాలు పూర్తిచేసుకున్న తర్వాత తిరిగి పుష్కర్‌నగర్‌లో వారిని బస్సుల్లో దించుతారని వివరించారు. 380 రైళ్లు కొత్తగా వేస్తున్నట్లు తెలిపారు. 400 మంది అధికారుల వద్ద వాకీటాకీలు ఉంటాయని, ప్రతి క్షణం ఒకరితో ఒకరు మాట్లాడి సమాచారాన్ని పంచుకుంటారని చెప్పారు. 26 సెల్ టవర్స్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. 1400 సీసీ టీవీలు ఏర్పాటు చేసి మానిటరింగ్ సిస్టంను నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఏ సమాచారం కావాలన్నా తగిన ఫోన్ నంబర్లు, అధికారుల వివరాలతో ఒక పుస్తకం ప్రచురించామని, ఆ పుస్తకాలు ఘాట్ల వద్ద అందుబాటులో ఉంటాయని చంద్రుడు తెలిపారు. -
దుర్గాఘాట్‌లో సీఎం పుష్కర స్నానం...
- ఏర్పాట్లు పూర్తిచేసిన అధికారులు సాక్షి, అమరావతి ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబునాయుడు కృష్ణా పుష్కరాల ప్రారంభం రోజైన శుక్రవారం ఉదయం 5.45 గంటలకు విజయవాడలోని దుర్గాఘాట్‌లో పుష్కర స్నానమాచరిస్తారు. బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించిన రోజు నుంచి 12 రోజుల పాటు జరుపుకొనే వేడుకను పుష్కరం అంటారు. బృహస్పతి కన్యారాశిలో గురువారం రాత్రి 9.28 గంటలకు ప్రవేశిస్తాడు. సూర్యాస్తమయం తర్వాత స్నానం చేయకూడదనే నిబంధన ఉండడంతో 12వ తేదీ సూర్యోదయ సమయంలో స్నానం చేస్తారు. కంచి కామకోటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి పుష్కర స్నానంతో పుష్కర స్నానాలు ప్రారంభమవుతాయి. అదే సమయంలో సీఎం చంద్రబాబు కూడా స్నానం చేస్తారు. ఈ విషయాన్ని కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు చెప్పారు. దుర్గాఘాట్ వీఐపీ ఘాట్ కావడంతో వారు అక్కడ స్నానం చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 62వేల మంది ఉద్యోగులు పుష్కరాల్లో సేవలందిస్తున్నట్లు వివరించారు. వీరంతా 1120 ప్రాంతాల్లో ఉంటారన్నారు. అత్యవసర సేవలు నిత్యం అందుబాటులో ఉంటాయని, విజయవాడ నగరంలో మొత్తం ఏడు ప్రాంతాల్లో బేస్ క్యాంపులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఒక్కో ఘాట్‌కు ఒక రిఫరల్ ఆస్పత్రిని గుర్తించినట్లు తెలిపారు. ఎవరికైనా అనారోగ్య సమస్య వచ్చినట్లు గుర్తిస్తే వెంటనే ఆయా ఆస్పత్రులకు తరలిస్తామని చెప్పారు. పది లక్షల మంది పిల్లలు, సీనియర్ సిటిజన్లకు జియో ట్యాగింగ్ సిస్టం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా తప్పిపోతే సులభంగా తెలుసుకోవచ్చునని చెప్పారు. 54 స్వచ్ఛంద సంస్థలు భోజనాలు పెట్టేందుకు ముందుకు వచ్చినట్లు వివరించారు. విజయవాడ నగరంలో 60 ప్రాంతాల్లో అన్నప్రసాదాలు పెడతారని తెలిపారు. ప్రతి ఘాట్‌కు ఒక ఇన్చార్జి ఉంటారని, మల్టీ డిసిప్లెయినరీ టీం కూడా ప్రతి ఘాట్‌కు ఉంటుందని వివరించారు. మొత్తం 45 పుష్కర నగర్లు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. అక్కడ్నుంచి నిత్యం ఘాట్లకు రోజుకు 400 బస్సులు తిరుగుతాయని, స్నానాలు పూర్తిచేసుకున్న తర్వాత తిరిగి పుష్కర్‌నగర్‌లో వారిని బస్సుల్లో దించుతారని వివరించారు. 380 రైళ్లు కొత్తగా వేస్తున్నట్లు తెలిపారు. 400 మంది అధికారుల వద్ద వాకీటాకీలు ఉంటాయని, ప్రతి క్షణం ఒకరితో ఒకరు మాట్లాడి సమాచారాన్ని పంచుకుంటారని చెప్పారు. 26 సెల్ టవర్స్ ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. 1400 సీసీ టీవీలు ఏర్పాటు చేసి మానిటరింగ్ సిస్టంను నూజివీడులోని ట్రిపుల్ ఐటీలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. భక్తులకు ఏ సమాచారం కావాలన్నా తగిన ఫోన్ నంబర్లు, అధికారుల వివరాలతో ఒక పుస్తకం ప్రచురించామని, ఆ పుస్తకాలు ఘాట్ల వద్ద అందుబాటులో ఉంటాయని చంద్రుడు తెలిపారు. -
పుష్కరస్నానాలకు ఇబ్బంది ఉండదు: మంత్రి ఉమ
పుష్కర స్నానానికి వచ్చే భక్తులకు నీటి ఇబ్బంది లేకుండా చూస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. సోమవారం మీడియా పాయింట్లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. శ్రీశైలంలో 860 అడుగులు ఉందని, నాగార్జునసాగర్ నుంచి 5,046 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారని తెలిపారు. పవర్ హౌస్ నుంచి కిందికి 3,884 క్యూసెక్కులు వదులుతుండగా పులిచింతల నుంచి 10,900 క్యూసెక్కులు కిందికి వదులుతున్నారన్నారు. పులిచింతల వద్ద 7,800, కీసర వద్ద 1500 మొత్తం కలిపి 9,300 ఇన్‌ఫ్లో ఉందని చెప్పారు. సాగర్‌లో 5 టీఎంసీలు, పులిచింతలలో 2.7 టీఎంసీల కృష్ణాజలాలు ఉన్నాయని, వీటిని ప్రకాశం బ్యారేజ్ ద్వారా కాల్వలకు వదులుతామని చెప్పారు. ఇది కాకుండా పట్టిసీమ వద్ద గండి పూడ్చే పనులు జరుగుతున్నాయని, 11వ తేదీ నాటికి గోదావరి జలాలు పట్టిసీమ ద్వారా కృష్ణనదిలో ఫెర్రిలోని పవిత్ర సంగమం వద్ద కలుస్తాయని చెప్పారు. జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం విషయంలోనూ కొంతమంది రాజకీయం చేస్తున్నారని ఉమా ఆరోపించారు. తన నియోజకవర్గంలోనే జాతిపితకు అవమానం జరగడాన్ని జీర్ణించుకోలేని దేవినేని ఉమా దీనిపై ఎదురుదాడికి దిగారు. విగ్రహం కాల్వలో పడవేయడం, దీనిపై కేవలం ఒక చానల్, ఒక పత్రికకే సమాచారం అందడంపై అనుమానం ఉందన్నారు. దీనిపై అధికారులు సమగ్ర విచారణ జరుపుతున్నారన్నారు. బొత్స సత్యనారాయణ జాతిపిత గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని చెప్పారు. విజయవాడలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఇటువంటి ఆరోపణలు చేస్తున్నారన్నారు. తాము ప్రతిపక్షంలో ఉండగా ప్రజాసమస్యలపై పోరాడుతుంటే ప్రభుత్వం కేసులు పెట్టిందని, ఇప్పుడు వాటిని చూపించి చంద్రబాబు కేబినేట్లో క్రిమినల్స్ దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు ఉన్నారని ఆరోపించడం తగదని హితవు చెప్పారు. -
11వ తేదీ సాయంత్రం నుంచే పుష్కర సందడి
రాష్ట్రంలో కృష్ణా పుష్కరాల హడావుడి ఈ నెల 11వ తేదీ సాయంత్రం నుంచే ఆరంభం కానుంది. 12వ తేదీ తెల్లవారుజాము నుంచి పుష్కరాలు ప్రారంభమవుతుండగా.. ముందురోజు సూర్యాస్తమయం తర్వాత ఇబ్రహీంపట్నం వద్ద ఏర్పాటు చేసిన ఫెర్రీ ఘాట్‌లో పుష్కర ఆరంభ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం మొదలపెట్టబోతోంది. ఈ ఆరంభ వేడుకల్లోనే కృష్ణానదికి నిత్యహారతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. పోలవరం కాల్వల ద్వారా గోదావరి జలాలు కృష్ణలో కలిసే ప్రాంతానికి కాస్త ఎగువ వైపు కొత్తగా నిర్మిస్తున్న ఫెర్రీ ఘాట్ వద్ద ఈ వేడుకలు నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఆరంభవేడుకల్ని అట్టహాసంగా నిర్వహించాలన్న సీఎం చంద్రబాబు సూచన మేరకు సినీ దర్శకుడు బోయపాటి శ్రీను నేతృత్వంలో ఫెర్రీ ఘాట్ వద్ద భారీ సెట్టింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆరంభ వేడుకల్లో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు ఆ ప్రాంతానికి చేరుకోగానే వెయ్యి మంది కళాకారులు ఆయనకు స్వాగతం పలికేలా ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలో లక్ష విద్యుత్ బల్బులను అమర్చబోతున్నారు. ఇందుకోసం 400 మెగావాట్ల జనరేటర్లను ఏర్పాటు చేయనున్నారు. రాత్రంతా ఆ ప్రాంతంలో భారీ ఎత్తున సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధం చేశారు. కృష్ణా నదికి హారతి ఇచ్చేందుకు ఘాట్ వద్ద నది ఒడ్డు ప్రాంతంలో రెండు ప్రత్యేక బోట్లు కలగలిపి దానిపై భారీ సెట్టింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా హారతి కోసం ప్రత్యేకంగా ఒక పాటను రూపొందించారు. తూర్పు నుంచి ఈశాన్యం కృష్ణా నదికి హారతిని తూర్పు వైపున చూపడం మొదలుపెట్టి చుట్టూ చూపుతూ ఈశాన్యం ప్రాంతంలో ముగిసేలా ఘాట్ వద్ద ప్రత్యేక ఏర్పాటు చేస్తున్నారు. వేదికపై హారతి మొదలయ్యే తూర్పు ప్రాంతంలో సంగమ ప్రాంతం ఉంటుంది. హారతిని చివరగా చూపే ఈశాన్య ప్రాంతంలో వేలాది మంది భక్తులు కూర్చునే ఏర్పాట్లు ఉన్నాయి. రూ. 48 లక్షలతో నమూనా ఆలయం కృష్ణా ఫుష్కరాలు జరిగే 12 రోజుల పాటు హారతి, సంగమ ఘాట్ వద్ద స్నానాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం దేవాదాయ శాఖ ఆ ప్రాంతంలో రూ. 48 లక్షల ఖర్చుతో ప్రత్యేక నమూనా ఆలయాన్ని నిర్మిస్తోంది. నమూనా ఆలయ ప్రాంగణంలో దుర్గమ్మ గుడితో పాటు మొత్తం 8 చిన్న ఆలయాలు ఉంటాయి. -
బెజవాడలో శ్రీవారి దర్శనం ప్రారంభం
కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికులకు తిరుమలవాసుడి దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ విజయవాడ స్వరాజ్యమైదానంలో నిర్మించిన శ్రీ వేంకటేశ్వరుడి నమూనా ఆలయంలో ఆదివారం ఉదయం పూజలు మొదలయ్యాయి. అనంతరం వెంకన్న దర్శనం ప్రారంభమైంది. కంచిస్వామి జయేంద్ర సరస్వతి నమూనా దేవాలయాన్ని సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. టీటీడీ కార్యనిర్వహణాధికారి డి.సాంబశివరావు మాట్లాడుతూ.. నిత్యం లక్షమంది స్వామిని దర్శించుకునేలా ఏర్పాట్లుచేసినట్లు తెలిపారు. తిరుమల తరహాలో ప్రతిరోజూ అర్చనలు, శ్రీవారి సేవలు నిర్వహిస్తామని, పుష్కరాల్లో 12లక్షలకు పైగా భక్తులు వస్తారని అంచనావేసి అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. 12వ తేదీ నుంచి రోజూ సాయంత్రం ఉత్సవ విగ్రహాలతో శోభాయాత్ర నిర్వహించి కృష్ణవేణికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామన్నారు. 7 గంటలకు ఊంజల్ సేవ, గాత్ర సంగీత సభలు నిర్వహిస్తారు. అమరావతి, అలంపురం, శ్రీకాకుళం ప్రాంతాల్లో ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని వివరించారు. -
యథావిధిగా ఎంబీబీఎస్ పరీక్షలు
కృష్ణా పుష్కరాల నేపథ్యంలో ఎంబీబీఎస్ పరీక్షలను వాయిదావేసే ప్రసక్తే లేదని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చెప్పారు. శుక్రవారం విజయవాడలోని ఆంధ్రాహార్ట్ అండ్ బ్రెయిన్ ఇనిస్టిట్యూట్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి ప్రారంభం కానున్న ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని పేర్కొన్నారు. పుష్కరాల ప్రభావం సిద్ధార్థ వైద్య కళాశాల విద్యార్థులపైనే ఉంటుందని, వారు సమీప కళాశాలకు సెంటర్‌కు మార్పుచేసుకునే అవకాశం కల్పించనున్నట్లు చెప్పారు. కార్పొరేట్ ఆస్పత్రులకు చెందిన స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ వైద్యులు ప్రభుత్వాస్పత్రుల్లోని నిరుపేద రోగులకు సేవ చేసేలా ఒక విధానాన్ని అమలుచేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
కృష్ణమ్మకు వెంకన్న సారె
తిరుమల నుండి పుష్కర యాత్ర ప్రారంభం తిరుమల: కృష్ణా పుష్కరాలు పురస్కరించుకుని కృష్ణమ్మకు సమర్పించేందుకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సారె తరలి వెళ్లింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారితో కూడిన కల్యాణరథంలో బుధవారం ఈ సారెను పుష్కరయాత్రగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో దొండపాటి సాంబశివరావు మాట్లాడుతూ భక్తుల సౌకర్యార్థం విజయవాడలోని పీడబ్ల్యూడీ మైదానంలోని నమూనా ఆలయంలో ఈ నెల 7 నుంచి శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. ఈ కల్యాణరథం 5న విజయవాడలోని దుర్గా మల్లేశ్వరస్వామివారి ఆలయానికి చేరుకుంటుంది. -
నీటి కొరత లేకుండా దీక్ష తీసుకుందాం
పుష్కరాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు అమరావతి: కృష్ణా పుష్కరాలకు రాష్ట్రంలో నీటి కొరత లేకుండా దీక్ష తీసుకుందామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.పుష్కరాలపై బుధవారం అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 12 అంశాలపై 12 రోజుల పాటు చర్చలు, గోష్టులు నిర్విహ స్తామని, మంత్రులు వీటికి ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తారని సీఎం తెలిపారు. పుష్కరాలకు భారీగా ఆహ్వానాలు పంపాలని అధికారులను సీఎం ఆదేశించారు. గురువారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. శుక్రవారం సాయంత్రానికి తిరిగి విజయవాడ చేరుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, కేంద్ర మంత్రులు వెంకయ్య, సురేశ్‌ప్రభు, నిర్మలా సీతారామన్ తదితరులను పుష్కరాలకు ఆహ్వానించనున్నారు. -
కృష్ణమ్మకు వెంకన్న సారె
కృష్ణా పుష్కరాలు పురస్కరించుకుని కృష్ణమ్మకు సమర్పించేందుకు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి సారె తరలి వెళ్లింది. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారితో కూడిన కల్యాణరథంలో బుధవారం ఈ సారె పుష్కరయాత్రగా తీసుకెళ్లారు. తొలుత ఆలయంలోని గర్భాలయ మూలమూర్తి ముందు పూజలు నిర్వహించారు. తర్వాత పసుపు, కుంకుమ, పట్టువస్త్రాలతోకూడిన సారెను ఆలయం నుంచి వెలుపల వైభవోత్సవ మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పతో కూడిన క ల్యాణ రథంలో సారెను ఉంచి విజయవాడలోని శ్రీవారి నమూనా ఆలయానికి పుష్కరయాత్రగా తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు మాట్లాడుతూ, కృష్ణా పుష్కరాలు సందర్భంగా భక్తుల సౌకర్యార్థం విజయవాడలోని పిడబ్ల్యుడి మైదానంలో నమూనా ఆలయంలో ఈ నెల 7వ తేదీ నుండి శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కల్పిస్తామన్నారు. ప్రతి రోజు సుమారు లక్ష మంది భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు, అన్నప్రసదాలు పంపిణీ చేసేందుకు భారీ ఏర్పాట్లు చేశామన్నారు. ప్రతి రోజు స్వామివారి ఉత్సవమూర్తులను ఊరేగింపుగా తీసుకువెళ్ళి, పుష్కర హారతి ఇస్తారని అన్నారు. ఈ కళ్యాణరథం తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయం, ఒంటిమిట్టలోని కోదండరామస్వామివారి ఆలయం, అహోబిలంలోని లక్ష్మీనరసింహస్వామివారి ఆలయానికి చేరుకుంటుంది. 4వ తేది అహోబిలం నుండి ప్రారంభమై మహానంది ఆలయం, శ్రీశైలంలోని భ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామివారి ఆలయం, 5న శ్రీశైలం నుండి ప్రారంభమై మంగళగిరిలోని పానకాల నరసింహస్వామివారి ఆలయం, అమరావతిలోని అమరేశ్వరస్వామివారి ఆలయం, విజయవాడలోని దుర్గా మల్లేశ్వరస్వామివారి ఆలయానికి చేరుకుంటుంది. -
వాడపల్లి పుష్కరఘాట్‌ను పరిశీలించిన మంత్రులు
దామరచర్ల మండలంలోని వాడపల్లి పుష్కరఘాట్ పనులను తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డిలు పరిశీలించారు. పుష్కరఘాట్ పనుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీరితో పాటు నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్ రావు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పుష్కర ఘాట్‌ను పరిశీలించారు. అనంతరం సమీపంలోని శ్రీమీనాక్షి అగస్తేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
నమో కృష్ణవేణి
కృష్ణా తరంగాల సారంగ రాగాలు పుష్కరాలు. బృహస్పతి కన్యారాశిలో ప్రవేశిస్తే కృష్ణా పుష్కరాలు. మహాబలేశ్వర్‌లో పుట్టి, సహ్యాద్రి మీద తుళ్లుతూ, తూలుతూ, వయ్యారాలు పోతూ, ఎగసిపడుతూ, మనసును విశాలంగా చేసుకుంటూ సాగుతుంది కృష్ణమ్మ గమనం. మధ్యలో ఎన్నో నదీనదాలను, ఉపనదులను తనలో ఐక్యం చేసుకుంటుంది. మధ్యమధ్యలో సిగపాయల మందారాలను చూపుతుంది. దారిలో పర్వతాలను, కొండలను, అడవులను, జనజీవన స్రవంతిని అందరినీ పరవశింపజేస్తూ, పులకింపజేస్తూ కొన్ని వందల మైళ్లు ప్రయాణించి... అలసిసొలసి, ‘ఇక ప్రయాణం చాలు’ అంటూ అత్తవారింటికి చేరి, తన భర్త సాగరుడి ఒడిలో హంసలదీవిలో మనోహరంగా సేదతీరుతుంది. కృష్ణమ్మ గమనం మనోహరం... కృష్ణమ్మ రూపం సౌందర్యం... గలగల పారే కృష్ణమ్మ ధ్వనులు... ఎగసిపడే కృష్ణమ్మ అందాలు... తుళ్లుతూ పలకరించే కృష్ణమ్మ పరవళ్లు... ఇవన్నీ ఈ పుష్కరాలలో తనివితీరా ఆస్వాదిద్దాం రండి. కృష్ణమ్మలో మునిగి తరించడానికి ఆ తల్లి ప్రయాణిస్తున్న మార్గంలో ఎన్నో ఘాట్లు! కృష్ణా పుష్కర స్నానానికి వచ్చే వారి కోసం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని ఆ ఘాట్ల సమాచారాన్ని సాక్షి ఇలా మీకు అందిస్తోంది. స్నానం ఆచరించండి... ఆ తల్లి ఒడిలో పునీతులు కండి... 1. కృష్ణ ఘాట్ (మాగనూరు మండలం) నీటిస్థాయి : ప్రస్తుతం కృష్ణా నది ఘాట్ల మెట్ల మీదుగా ప్రవహిస్తోంది. ఆలయాలు : కృష్ణా, భీమా నదుల సంగమం, దత్త మందిరం, శ్రీ క్షీరలింగేశ్వర ఆలయం, వెంకటేశ్వర ఆలయాలు రవాణా సౌకర్యాలు : హైదరాబాద్ నుంచి కృష్ణ గ్రామానికి 182 కిలోమీటర్ల్ల దూరం ఉంటుంది. బస్సుద్వారా అయితే మహబూబ్‌నగర్, మక్తల్ మీదుగా కృష్ణకు చేరుకోవచ్చు. రైలు ద్వారా నాంపల్లి, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ల నుంచి బెంగళూర్‌కు వెళ్లే ప్రతి రైలు కృష్ణ మీదుగా వెళ్తుంది, వికారాబాద్, వాడి జంక్షన్, యాద్గిర్ పట్టణాల మీదుగా కృష్ణకు చేరుకోవచ్చు. కర్ణాటక నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. వసతులు : యాత్రినివాస్, వివేకానంద ఆశ్రమం ఉన్నాయి. 2. పస్పుల ఘాట్ (మక్తల్) నీటిస్థాయి : కృష్ణానది నీటిమట్టం 30 అడుగుల లోతు ఉంది. ఆలయాలు : దత్తస్వామి దేవాలయం రవాణా సౌకర్యాలు : హైదరాబాద్ నుంచి పస్పుల వరకు 185 కిలోమీటర్ల దూరం ఉంది. హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్, దేవరకద్ర, మక్తల్ రోడ్డుమార్గం గుండా చేరుకోవాలి. మక్తల్ నుంచి ఖానాపూర్, కర్ని, చిట్యాల మీదుగా పస్పుల గ్రామం చేరుకోవచ్చు. మక్తల్ నుంచి 19 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వసతులు : తాత్కాలికంగా షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. 3. నందిమల్ల ఘాట్ (ఆత్మకూర్) నీటిస్థాయి : నీటి ప్రవాహం లేదు పుణ్యక్షేత్రాలు: చింతల మునిరంగస్వామి, భ్రమరాంబికా మల్లికార్జునస్వామి ఆలయం సౌకర్యాలు- వసతులు: పార్కింగ్ స్థలం, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తున్నారు. రవాణా : ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు ప్రధాన ఎడమ విభాగంలో నిర్మిస్తున్న పుష్కరఘాట్‌కు హైదరాబాద్ నుంచి జడ్చర్ల, కొత్తకోట మీదుగా ఆత్మకూర్‌కు 165 కి.మీ ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడి నుంచి పుష్కరఘాట్‌కు 12 కి.మీ ప్రయాణించాలి. రాయచూరు నుంచి 40 కి.మీ ప్రయాణించి ధరూర్ చేరుకున్న అనంతరం అక్కడి నుంచి 10 కి.మీ దూరంలో జూరాల ప్రాజెక్టుకు ప్రయాణం చేయాలి. కర్నూలు నుంచి వచ్చే భక్తులు ఎర్రవల్లి చౌరస్తా వద్ద దిగాలి. అక్కడినుంచి గద్వాల మీదుగా నందిమల్లకు చేరుకోవచ్చు. 4. రంగాపూర్ ఘాట్ (పెబ్బేరు) నీటిస్థాయి : ప్రస్తుతం ఘాట్ మొదటి మెట్టు వద్ద కృష్ణానది నీళ్లు ప్రవహిస్తున్నాయి. కృష్ణానది బ్యాక్ వాటర్ వస్తే ఐదో లైన్ వరకు నీరు వచ్చే అవకాశం ఉంది. ఆలయాలు : రంగనాయకస్వామి, అభయాంజనేయ స్వామి ఆలయాలు రవాణా సౌకర్యాలు : హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు 44వ నంబర్ జాతీయ రహదారిపై 150 కి.మీ ప్రయాణం చేస్తే పెబ్బేరు పట్టణానికి చేరుకుంటారు. అక్కడి నుంచి కర్నూలుకు వెళ్లే దారిలో 5 కి.మీ దూరం ప్రయాణం చేస్తే రంగాపూర్ పుష్కరఘాట్‌కు చేరుకోవచ్చు. మహబూబ్‌నగర్ పట్టణం నుంచి వచ్చే భక్తులు కూడా 85 కి.మీ. ప్రయాణం చేసి పెబ్బేరు పట్టణానికి చేరుకోవాలి. ఇక్కడినుంచి కర్నూలు వెళ్లే దారిలో 5 కి.మీ. ప్రయాణించి రంగాపూర్ పుష్కరఘాట్‌కు చేరుకోవచ్చు. సౌకర్యాలు : ఘాట్ వద్ద తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. భోజనాల కోసం పెబ్బేరులో హోటళ్లు ఉన్నాయి. 5. బీచుపల్లి ఘాట్ (ఇటిక్యాల) నీటిస్థాయి : పుష్కరఘాట్లను ఆనుకుని ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం. ఆలయాలు : ఆంజనేయస్వామి దేవాలయం, శివాలయం, కోదండరామా లయం, హయగ్రీవ సరస్వతి జ్ఞానమందిరం రవాణా సౌకర్యం : హైదరాబాద్ నుంచి బీచుపల్లికి 166 కిలోమీటర్ల దూరం ఉంది. హైదరాబాద్ నుంచి 44వ నంబరు జాతీయ రహదారిపై నేరుగా బీచుపల్లి పుణ్యక్షేత్రానికి చేరుకోవచ్చు. కర్నూలు నుంచి బీచుపల్లికి 44 కిలోమీటర్ల దూరం ఉంది. 44వ నంబరు జాతీయ రహదారిపై నేరుగా అక్కడికి చేరుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలోని రాయచూర్ నుంచి బీచుపల్లికి 60 కిలోమీటర్ల దూరం ఉంది. రాయచూర్ నుంచి భక్తులు బీచుపల్లి పుణ్యక్షేత్రానికి గద్వాల, ఎర్రవల్లిచౌరస్తా మీదుగా చేరుకోవచ్చు. రైలుమార్గం : హైదరాబాద్ నుంచి రైలు మార్గంలో గద్వాలకు చేరుకుని గద్వాల నుంచి ఎర్రవల్లిచౌరస్తా మీదుగా బీచుపల్లికి చేరుకోవచ్చు. గద్వాల నుంచి బీచుపల్లికి 16 కిలోమీటర్ల దూరం ఉంది. వసతులు : ఎర్రవల్లిచౌరస్తా వద్దనే భక్తుల వాహనాలను పార్కింగ్‌చేసి అక్కడి నుంచి ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆటోల ద్వారా బీచుపల్లి పుష్కరఘాట్ వద్దకు భక్తులను తరలిస్తారు. 6. నదీ అగ్రహారం ఘాట్ (గద్వాల) నీటిస్థాయి : ఘాట్‌కు 3.3 మీటర్ల దూరంలో నీటి ప్రవాహం ఉంది. పుణ్యక్షేత్రాలు : స్పటిక లింగేశ్వరాలయం, కల్యాణ వెంకటేశ్వరస్వామి రామాలయం, ఆంజనేయస్వామి, నవగ్రహ మండపం, సాక్షేశ్వరస్వామి ఆలయాలు ఉన్నాయి. అదే విధంగా అహోబిల మఠం ఉంది. సౌకర్యాలు - వసతులు : ఘాట్ల దగ్గర ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పుష్కర భక్తుల కోసం ఉచిత అన్నదానాలను, నీటి సౌకర్యాన్ని వివిధ స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్నాయి. గద్వాలలో విడిది చేయడానికి అవసరమైన లాడ్జింగ్‌లు, భోజన వసతి ఉన్నాయి. బస్సు మార్గం : గద్వాల పట్టణం మీదుగా ఘాట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్లే బస్సులలో జాతీయ రహదారి గుండా 180 కిలోమీటర్లు ప్రయాణించి ఎర్రవల్లి చౌరస్తాలో దిగాలి. అక్కడినుంచి 16 కిలోమీటర్ల దూరంలో గద్వాల ఉంది. కర్నూలు వచ్చే భక్తులు హైదరాబాద్ వెళ్లే బస్సులలో 45 కిలోమీటర్లు జాతీయ రహదారి గుండా ప్రయాణించి ఎర్రవల్లిచౌరస్తా వద్ద దిగాలి. అక్కడినుంచి 16 కిలోమీటర్ల దూరం ప్రయాణించి గద్వాలకు చేరుకోవచ్చు. కర్ణాటక రాష్ట్రంలో రాయచూర్ జిల్లా నుంచి నందిన్నె, ధరూర్ మీదుగా 50 కిలోమీటర్లు ప్రయాణించి గద్వాలకు చేరుకోవచ్చు. రైలు మార్గం : గద్వాల రైల్వేస్టేషన్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో నదీ అగ్రహారం ఘాట్ ఉంది. సికింద్రాబాద్, హైదరాబాద్‌ల నుంచి రైలు మార్గంలో ప్రయాణించే భక్తులు షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌ల మీదుగా గద్వాలకు చేరుకోవచ్చు. 7. క్యాతూర్ ఘాట్ (అలంపూర్) నీటిస్థాయి : ఘాట్ వద్ద 10మీటర్ల దూరంలో ప్రవాహం ఉంది. ఆలయాలు : కుళ్లాయప్ప ఆలయాలు, శివాలయం, ఆంజనేయస్వామి ఆలయం వసతులు : తాత్కాలిక షెడ్లు నిర్మిస్తున్నారు. అలంపూర్ చౌరస్తాలో భోజన వసతులు ఉంటాయి. రవాణా : హైదరాబాద్ నుంచి అలంపూర్ చౌరస్తా (కర్నూలు జాతీయ రహదారి) వరకు 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చౌరస్తా నుంచి అలంపూర్‌కు 15 కిలోమీటర్లు ఉంటుంది. అలంపూర్ నుంచి క్యాతూర్ ఘాట్‌కు 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కర్నూలు నుంచి అలంపూర్ చౌరస్తా వరకు 10కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడినుంచి అలంపూర్, గొందిమల్ల ఘాట్‌కు 23 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రైలుసౌకర్యం : హైదరాబాద్ నుంచి కర్నూలుకు వెళ్లే రైలు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర రైల్వేహాల్ట్ వద్ద దిగాల్సి ఉంటుంది. అక్కడినుంచి గొందిమళ్ల ఘాట్ 18 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారా ఘాట్లు, పుణ్య క్షేత్రాలకు చేరుకోవచ్చు. 8. గొందిమళ్ల ఘాట్ (అలంపూర్) నీటిస్థాయి : ఘాట్‌కు 5 మీటర్ల దూరంలో నీటి ప్రవాహం ఉంది. పుణ్యక్షేత్రాలు : ఝుకారేశ్వరి మాత ఆలయం, శ్రీజోగుళాంబ ఆలయం, నవగ్రహ బ్రహ్మా ఆలయాలు, సంగమేశ్వర ఆలయం, సూర్యనారాయణ స్వామి, శ్రీయోగనరసింహ స్వామి, పాపనాశిని తీర్థం వసతులు : ఘాట్ వద్ద తాత్కాలిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, పార్కింగ్, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు. రవాణా సౌకర్యాలు : హైదరాబాద్ నుంచి అలంపూర్ చౌరస్తా (కర్నూల్ జాతీయ రహదారి) వరకు 200 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చౌరస్తా నుంచి అలంపూర్‌కు 15 కిలోమీటర్లు ఉంటుంది. అలంపూర్ నుంచి గొందిమళ్ల ఘాట్‌కు 8 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సుద్వారా చేరుకోవచ్చు. కర్నూలు నుంచి అలంపూర్ చౌరస్తా వరకు 10కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడినుంచి అలంపూర్, గొందిమల్ల ఘాట్‌కు 23 కిలోమీటర్ల దూరం ఉంటుంది. రైలుసౌకర్యం : హైదరాబాద్ నుంచి కర్నూల్‌కు వెళ్లే రైలు జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర రైల్వేహాల్ట్ వద్ద దిగాల్సి ఉంటుంది. అక్కడినుంచి గొందిమల్ల ఘాట్ 15కిలోమీటర్ల దూరం ఉంటుంది. అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు, ప్రైవేటు వాహనాల ద్వారాఘాట్లు, పుణ్యక్షేత్రాలకు చేరుకోవచ్చు. 9. సోమశిల ఘాట్ (కొల్లాపూర్) (వీఐపీ, జనరల్ ఘాట్లు) నీటిస్థాయి : ఇది శ్రీశైల బ్యాక్ వాటర్ వద్ద ఏర్పాటుచేశారు. ప్రస్తుతం కృష్ణానది నీళ్లు లోతట్టులో ఉన్నాయి. నదీనీటి మట్టం పెరుగుతోంది. మరో 60 అడుగులకు పైగా నీరు పెరిగితే ఘాట్ల వద్దకు నీళ్లు చేరుకుంటాయి. ఆలయాలు : ద్వాదశ జ్యోతిర్లింగాలయం (దీనినే లలితాంబికా సోమేశ్వరాలయం) రవాణాసౌకర్యాలు : సోమశిలకు చేరుకోవాలంటే కొల్లాపూర్ నుంచే వెళ్లాలి. హైదరాబాద్ నుంచి కొల్లాపూర్‌కు 200 కిలో మీటర్ల దూరం ఉంటుంది. హైదరాబాద్ నుంచి జడ్చర్ల, నాగర్‌కర్నూల్ మీదుగా కొల్లాపూర్ చేరుకోవచ్చు. మరోదారిలో వనపర్తి, పెబ్బేర్ నుంచి కూడా కొల్లాపూర్ రావచ్చు. వనపర్తి నుంచి కొల్లాపూర్‌కు 50 కిలోమీటర్లు, పెబ్బేరు నుంచి కొల్లాపూర్‌కు 50 కిలోమీటర్ల దూరం ఉంది. పెబ్బేరు రోడ్డు ఇంకా నిర్మాణ దశలో ఉంది. వనపర్తి రోడ్డు కంటే నాగర్‌కర్నూల్ నుంచి కొల్లాపూర్ చేరుకునేందుకు రోడ్డు బాగా ఉంటుంది. వసతులు : సోమశిలకు విచ్చేసే భక్తులు బస చేసేందుకు కొల్లాపూర్‌లో ఒక చిన్నపాటి లాడ్జింగ్ మాత్రమే ఉంది. అద్దె గదులు కూడా దొరకవు. ప్రభుత్వం విడిది సౌకర్యాలు ఏర్పాటుచేసే యోచనలో ఉంది. ఇక్కడికి ఉదయం వచ్చి రాత్రి వెళ్లడమే మంచిది. లేదంటే నాగర్‌కర్నూల్, వనపర్తిలో బసచేసేందుకు లాడ్జీలు, విడిదిగృహాలు ఉంటాయి. 10. పాతాళగంగ ఘాట్ (మన్ననూరు) నీటిస్థాయి : ప్రస్తుతం మెట్ల వద్ద కొంత నీరు నిలిచి ఉంది. నీటి ప్రవాహం లేదు. ఆలయాలు : శ్రీఉమామహేశ్వర క్షేత్రం, మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయం, చెంచులక్ష్మి మ్యూజియం, వ్యూపాయింట్, మల్లెలతీర్థం జలపాతం, కదలీవనం, అక్కమహాదేవిగృహాలు, శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయాలు. సౌకర్యాలు : ఇక్కడ సేదతీరేందుకు తాత్కాలిక టెంట్లు ఏర్పాటుచేస్తున్నారు. రవాణాసౌకర్యాలు : హైదరాబాద్ నుంచి పాతాళగంగ 190 కి.మీ దూరం ఉంటుంది. ఆమనగల్లు, కల్వకుర్తి, డిండి, మన్ననూరు మీదుగా ప్రయాణించవచ్చు. పాతాళగంగ పుష్కరఘాట్ నుంచి 18 కి.మీ వెళ్లితే శ్రీశైలం మల్లికార్జునస్వామి ఆలయం వస్తుంది. మహబూబ్‌నగర్ నుంచి పాతాళగంగ 167 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, మన్ననూరు మీదుగా చేరుకోవాలి. 11. సంగమేశ్వరం ఘాట్ (కొత్తపల్లి) ఇక్కడ రెండు ఘాట్లు ఏర్పాటు చేస్తున్నారు. నీటిస్థాయి: ప్రస్తుతం ఆలయానికి 15 అడుగుల దూరంలో కృష్ణా నది ప్రవహిస్తోంది. ఘాట్ వద్ద నీళ్లు అందుబాటులో లేవు. ఆలయాలు: సంగమేశ్వరస్వామి ఆలయం, కొలనుభారతి(ఘాట్‌కు 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ) సౌకర్యాలు: పిండ ప్రదాన సౌకర్యం, మరుగుదొడ్లు, మంచినీరు, తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. సంగమేశ్వరానికి 5 కిలోమీటర్ల దూరంలోని కపిలేశ్వరం వద్ద ఒకటి, కపిలేశ్వరం-సంగమేశ్వరం మధ్య మరొకటి వాహన పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నారు. రవాణా సౌకర్యం: కర్నూలు నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. నందికొట్కూరు, ఆత్మకూరు, నందికుంట్ల, కొత్తపల్లి, శివపురం, కపిలేశ్వరం. 12 పాతాళగంగ ఘాట్ (శ్రీశైలం ) నీటి స్థాయి: ప్రస్తుతం వినియోగంలో ఉన్న పుష్కర ఘాట్ వద్ద నీళ్లు మోకాళ్ల వరకు ఉన్నాయి. కొత్తగా నిర్మిస్తున్న పుష్కర ఘాట్‌కు ఇంకా నీరు అందలేదు. నదిలో నీటి ప్రవాహం లేదు. ఆలయాలు: శ్రీశైలం, ట్రైబల్ మ్యూజియం, శివాజీ స్ఫూర్తి కేంద్రం, సాక్షి గణపతి, హఠకేశ్వరి, పాలధార.. పంచధార.. శిఖరేశ్వరం. వీటితో పాటు బోటు మార్గంలో రెండు గంటలు ప్రయాణిస్తే అక్కమహాదేవి గుహలను సందర్శించచ్చు. అక్కమహాదేవి గుహల నుంచి నడక మార్గంలో 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే కదలీవనం వస్తుంది. సౌకర్యాలు : దుస్తులు మార్చుకొనే గదులు, మరుగుదొడ్లు, క్లాక్‌రూం, హోల్డింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేస్తున్నారు. పుష్కర నగర్ (క్లాక్‌రూం, మరుగుదొడ్లు, ఉచిత వైద్య శిబిరం, భోజన వసతి, తాత్కాలిక వసతి, సాంస్కృతిక కార్యక్రమాలు)లను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీశైలం నుంచి పాతాళగంగ చేరుకునేందుకు సెట్విన్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత అన్నదాన శిబిరాలను సత్రాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్నాయి. రవాణా సౌకర్యం: కర్నూలు నుంచి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. నందికొట్కూరు, ఆత్మకూరు. ఇక్కడి నుంచి 70 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు ప్రయాణిస్తూ దోర్నాల చెక్‌పోస్టు చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి మరో 50 కిలోమీటర్ల ఘాట్ ప్రయాణంలో శ్రీశైలం చేరుకోవచ్చు ప్రకాశం జిల్లా 190 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒంగోలు, చీమకుర్తి, పొదిలి, మార్కాపురం, దోర్నాల మీదుగా శ్రీశైలం చేరుకోవచ్చు. గుంటూరు-విజయవాడ నుంచి 230 కిలోమీటర్లు. నరసరావుపేట, వినుగొండ, త్రిపురాంతకం, దోర్నాల మీదుగా శ్రీశైలం చేరుకోవచ్చు. 13 లింగాలగట్టు ఘాట్ (శ్రీశైలం ) నీటి స్థాయి: ప్రస్తుతం ఘాట్ల వద్ద నీళ్లు లేవు. సమీపంలోని నిల్వ ఉన్న నీటిలో స్నానాలు చేయాల్సి ఉంటుంది. ఆలయాలు: శ్రీశైలం, ట్రైబల్ మ్యూజియం, శివాజీ స్ఫూర్తి కేంద్రం, సాక్షి గణపతి, హఠకేశ్వరి, పాలధార.. పంచధార.. శిఖరేశ్వరం. వీటితో పాటు బోటు మార్గంలో రెండు గంటలు ప్రయాణిస్తే అక్కమహాదేవి గుహలను సందర్శించచ్చు. అక్కమహాదేవి గుహల నుంచి నడక మార్గంలో 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే కదలీవనం వస్తుంది. సౌకర్యాలు : దుస్తులు మార్చుకొనే గదులు, మరుగుదొడ్లు, క్లోక్‌రూం, హోల్డింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేస్తున్నారు. 3 పుష్కర నగర్(క్లోక్‌రూం, మరుగుదొడ్లు, ఉచిత వైద్య శిబిరం, భోజన వసతి, తాత్కాలిక వసతి, సాంస్కృతిక కార్యక్రమాలు)లను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీశైలం నుంచి పాతాళగంగ చేరుకునేందుకు సెట్విన్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత అన్నదాన శిబిరాలు సత్రాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్నాయి. రవాణా సౌకర్యం: కర్నూలు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. నందికొట్కూరు, ఆత్మకూరు. ఇక్కడి నుంచి 70 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు ప్రయాణిస్తూ దోర్నాల చెక్‌పోస్టు చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి మరో 50 కిలోమీటర్ల ఘాట్ ప్రయాణంలో శ్రీశైలం చేరుకోవచ్చు ప్రకాశం జిల్లా 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒంగోలు, చీమకుర్తి, పొదిలి, మార్కాపురం, దోర్నాల మీదుగా శ్రీశైలం చేరుకోవచ్చు గుంటూరు-విజయవాడ నుంచి 250 కిలోమీటర్లు. నరసరావుపేట, వినుగొండ, త్రిపురాంతకం, దోర్నాల మీదుగా శ్రీశైలం చేరుకోవచ్చు. 13 లింగాలగట్టు ఘాట్ (శ్రీశైలం ) నీటి స్థాయి: ప్రస్తుతం ఘాట్ల వద్ద నీళ్లు లేవు. సమీపంలోని నిల్వ ఉన్న నీటిలో స్నానాలు చేయాల్సి ఉంటుంది. ఆలయాలు: శ్రీశైలం, ట్రైబల్ మ్యూజియం, శివాజీ స్ఫూర్తి కేంద్రం, సాక్షి గణపతి, హఠకేశ్వరి, పాలధార.. పంచధార.. శిఖరేశ్వరం. వీటితో పాటు బోటు మార్గంలో రెండు గంటలు ప్రయాణిస్తే అక్కమహాదేవి గుహలను సందర్శించచ్చు. అక్కమహాదేవి గుహల నుంచి నడక మార్గంలో 5 కిలోమీటర్లు ప్రయాణిస్తే కదలీవనం వస్తుంది. సౌకర్యాలు : దుస్తులు మార్చుకొనే గదులు, మరుగుదొడ్లు, క్లోక్‌రూం, హోల్డింగ్ ప్లేసెస్ ఏర్పాటు చేస్తున్నారు. 3 పుష్కర నగర్(క్లోక్‌రూం, మరుగుదొడ్లు, ఉచిత వైద్య శిబిరం, భోజన వసతి, తాత్కాలిక వసతి, సాంస్కృతిక కార్యక్రమాలు)లను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీశైలం నుంచి పాతాళగంగ చేరుకునేందుకు సెట్విన్ బస్సులను ఏర్పాటు చేస్తున్నారు. ఉచిత అన్నదాన శిబిరాలు సత్రాలు, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్నాయి. రవాణా సౌకర్యం: కర్నూలు నుంచి 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. నందికొట్కూరు, ఆత్మకూరు. ఇక్కడి నుంచి 70 కిలోమీటర్ల ఘాట్ రోడ్డు ప్రయాణిస్తూ దోర్నాల చెక్‌పోస్టు చేరుకోవచ్చు. ఇక్కడి నుంచి మరో 50 కిలోమీటర్ల ఘాట్ ప్రయాణంలో శ్రీశైలం చేరుకోవచ్చు ప్రకాశం జిల్లా 210 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒంగోలు, చీమకుర్తి, పొదిలి, మార్కాపురం, దోర్నాల మీదుగా శ్రీశైలం చేరుకోవచ్చు గుంటూరు-విజయవాడ నుంచి 250 కిలోమీటర్లు. నరసరావుపేట, వినుగొండ, త్రిపురాంతకం, దోర్నాల మీదుగా శ్రీశైలం చేరుకోవచ్చు. 14. నాగార్జున సాగర్ ఘాట్ (గుంటూరు) నీటి స్థాయి: ప్రస్తుతం ఘాట్లకు పది అడుగుల దూరంలో నీరు ఉన్నాయి. ఆలయాలు: కృష్ణవేణి ఘాట్ వద్ద అయ్యప్పస్వామి దేవాలయం, అమరలింగేశ్వరస్వామి దేవాలయం, ఎత్తిపోతల వద్ద దత్తాత్రేయ స్వామి, అనుపులో శ్రీరంగనాధ స్వామి దేవాలయాలు ఉన్నాయి. సౌకర్యాలు: పుష్కర నగర్లు నిర్మిస్తున్నారు. కృష్ణవేణి ఘాట్‌లో పిండప్రదానం షెడ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఘాట్ల నిర్మాణ పనులు 80శాతం పూర్తయ్యాయి. రవాణా సౌకర్యం: హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్లు. మాచర్ల నుంచి 30 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. శ్రీశైలం నుంచి లాంచీల ద్వార ప్రయాణం చేయవచ్చు. 15. సాగర్ శివాలయం ఘాట్ (నాగార్జున సాగర్) నీటిస్థాయి : ఈ ఘాట్ సాగర్ డ్యాం దిగువన కృష్ణా నది తీరంలో ఉంది. ప్రస్తుతం సాగర్ డ్యాం నుంచి వచ్చే లీకేజీ నీటిని ఘాట్‌లోకి మళ్లిస్తే భక్తులు స్నానాలు చేసే అవకాశం ఉంది. పుణ్యక్షేత్రాలు : శృంగేరి మఠాధిపతులు ఏర్పాటు చేసిన శివాలయం, ఏలేశ్వరాలయం, సురికి వీరాంజనేయస్వామి ఆలయం, రామాలయం, మార్కండేయ మల్లికార్జునస్వామి ఆలయం, రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయం, సౌకర్యాలు-వసతులు : పార్కింగ్ స్థలం, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తున్నారు. పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న విజయ విహార్ అతిథి గృహంతోపాటు హోటళ్లు ఉన్నాయి. రవాణా : హైదరాబాద్ నుంచి సాగర్‌కు మాల్.. మల్లేపల్లి, పెద్దవూర మీదుగా నేరుగా బస్సుల ద్వారా సాగర్‌లోని పుష్కర ఘాట్ సమీపానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి 150 కి.మీలు ఉంటుంది నల్లగొండ నుంచి హాలియా మీదుగా సాగర్‌కు చేరుకోవచ్చు. 60 కిలో మీటర్లు ఉంటుంది. వరంగల్ నుంచి జనగాం, భువనగిరి, రామన్నపేట, నార్కట్‌పల్లి, నల్లగొండ, హాలియా మీదుగా సాగర్ వరకు 237 కిలో మీటర్లు ఉంటుంది. ఖమ్మం నుంచి మిర్యాలగూడ, హాలియా మీదుగా సాగర్ వరకు 155 కిలో మీటర్లు ఉంటుంది భక్తుల వాహనాలు, బస్సులు సాగర్‌కు 15 కిలో మీటర్ల దూరాన గల సమ్మక్క-సారక్క ఆలయ సమీపంలో నిలిపివేస్తారు. అక్కడ నుంచి స్పెషల్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. 16. సత్రశాల ఘాట్ నీటిస్థాయి: ప్రస్తుతం ఘాట్లకు 15 అడుగుల దూరంలో నీరు ఉన్నాయి. ఆలయాలు: ప్రముఖ శైవ క్షేత్రం, శ్రీగంగా బ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి దేవాలయం, సౌకర్యాలు: ఇక్కడ అన్ని కులాలకు సంబంధించిన సత్రాలు ఉన్నాయి. వీటితోపాటు పుష్కర నగర్ ఏర్పాటుచేశారు. రవాణా సౌకర్యం: మాచర్ల నుంచి పాలువాయి జంక్షన్ మీదుగా సత్రశాలకు చేరుకోవచ్చు. గురజాల నుంచి రెంటచింతల మీదుగా సత్రశాలకు చేరుకోవచ్చు. బస్సు సౌకర్యం ఉంది. 17. దైద ఘాట్ నీటి స్థాయి: ప్రస్తుతం పది అడుగుల దూరంలో నీరు ఉన్నాయి. ఆలయాలు: ప్రముఖ శైవక్షేత్రమైన అమరలింగేశ్వరస్వామి దేవస్థానం ఉంది. సౌకర్యాలు: ఇప్పటి వరకు 80శాతం పనులు పూర్తయ్యాయి. రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. రవాణా సౌకర్యం: గురజాల నుంచి పులిపాడు మీదుగా దైద పుష్కర ఘాట్‌కు చేరుకోవచ్చు. దాచేపల్లి నుంచి నడికుడి మీదుగా పులిపాడు నుంచి దైద పుష్కర ఘాట్‌కు చేరుకోవచ్చు. బస్సు సౌకర్యం ఉంది. 18. ఇర్కిగూడెం ఘాట్ నీటిస్థాయి : ప్రస్తుతం నీటి ప్రవాహం లేదు. ఘాట్‌కు ఏడు అడుగుల దూరంలో నీరు నిలిచి ఉంది. పుణ్యక్షేత్రాలు : పార్వతీ దేవాలయం నిర్మాణంలో ఉంది. పుష్కరాల సమయం వరకు పూర్తి కానుంది. సౌకర్యాలు-వసతులు : పార్కింగ్ స్థలం, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తున్నారు. రవాణా : మిర్యాలగూడ నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. 19. పొందుగల ఘాట్ నీటి స్థాయి: ప్రస్తుతం ఎనిమిది అడుగుల దూరంలో నీరు ఉన్నాయి. ఆలయాలు: ఆంజనేయస్వామి దేవస్థానం ఉంది. దాచేపల్లి మండలంలో ఐదు పుష్కర ఘాట్లు ఉన్నాయి. 50శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. సౌకర్యాలు: పొందుగల ఘాట్ వద్ద పుష్కర నగర్ఏర్పాటు తోపాటు, ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగకుండా లింకు రోడ్లు ఏర్పాటు చేశారు. రవాణా సౌకర్యం: హైదరాబాద్ నుంచి మిర్యాల గూడ మీదుగా పొందుగల పుష్కర ఘాట్‌కు చేరుకోవచ్చు. గుంటూరు నుంచి దాచేపల్లి మీదుగా పొందుగల పుష్కర ఘాట్‌కు చేరుకోవచ్చు. బస్సు సౌకర్యంతోపాటు, నడికుడి జంక్షన్ వరకు హైదరాబాద్ నుంచి గుంటూరు నుంచి రైలు సౌకర్యం ఉంది. 20. వాడపల్లి శివాలయం ఘాట్ నీటిస్థాయి : ప్రస్తుతం నీటి ప్రవాహం లేదు. ఘాట్‌కు పది అడుగుల దూరంలో నీరు నిలిచి ఉంది. పుణ్యక్షేత్రాలు : వాడపల్లి శ్రీ మీనాక్షి అగస్తేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు సౌకర్యాలు-వసతులు : పార్కింగ్ స్థలం, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తున్నారు. రవాణా : రైలు ద్వారా వచ్చే భక్తులు విష్ణుపురం రైల్వేస్టేషన్లో దిగాలి. వారిని ప్రత్యేక ఆర్టీసీ బస్సులు ఇండియా సిమెంట్స్ ఎదుట ఉన్న హోల్డింగ్ పాయింట్ వద్దకు చేరుస్తాయి మిర్యాలగూడ నుంచి ప్రతి ఐదు నిమిషాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ప్రైవేటు వాహనాల ద్వారా వచ్చే వారు పోలీస్‌లు నిర్దేశించిన పార్కింగ్‌ల వరకూ రావాలి. అక్కడ నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం వాడపల్లి హోల్డింగ్ పాయింట్ వరకు ఉంటుంది. హోల్డింగ్ పాయింట్ నుంచి ఘాట్‌కు 2 కి.మీ.ల దూరం ఉంటుంది. 21. మహంకాళి ఘాట్ నీటిస్థాయి : ప్రస్తుతం నీటి ప్రవాహం లేదు. ఘాట్‌కు 20 అడుగుల దూరంలో నీరు నిలిచి ఉంది. పుణ్యక్షేత్రాలు : ఆంజనేయస్వామి, మహంకాళి ఆలయాలు సౌకర్యాలు-వసతులు : పార్కింగ్ స్థలం, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తున్నారు. రవాణా : మిర్యాలగూడ, కోదాడ నుంచి ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. ఘాట్‌కు పది కిలోమీటర్ల దూరం హోల్డింగ్ పాయింట్ వరకు ప్రయాణికులను చేరవేస్తారు. అక్కడి నుంచి ఆర్టీసీ స్పెషల్ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. 22. మట్టపల్లి ప్రహ్లాద ఘాట్ నీటిస్థాయి : ప్రస్తుతం నీటి ప్రవాహం లేదు. ఈ ఘాట్‌లోకి కనీసం 80 నుంచి 100 అడుగుల లోతుకు దిగాలి. ప్రస్తుతం ఈ ఘాట్‌కు పదడుగుల దూరంలో నీరు నిలిచి ఉంది. పుణ్యక్షేత్రాలు: లక్ష్మీనరసింహ క్షేత్రం, పార్వతీ రామలింగేశ్వరాలయం, గోదాదేవి, ఆంజనేయస్వామి ఆలయాలు సౌకర్యాలు-వసతులు : అన్నదాన సత్రాలు ఉన్నాయి. 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న హుజూర్‌నగర్‌లో లాడ్జీల సౌకర్యం కలదు. పార్కింగ్ స్థలం, మరుగుదొడ్లు, తాగునీటి వసతులు కల్పిస్తున్నారు. రవాణా : ప్రహ్లాద ఘాట్‌కు చేరుకునేందుకు రోడ్డు సౌకర్యం మాత్రమే ఉంది. హుజూర్నగర్ నుంచి మఠంపల్లి మీదుగా మట్టపల్లి ఊరు బయట వరకు రోడ్డు సౌకర్యం కలదు. 23. వేదాద్రి ఘాట్ (పంచారామ నరసింహ క్షేత్రం) జగ్గయ్యపేట మండలం నీటి స్థాయి : పది నుంచి 15 అడుగుల మేర నీరు ఉంది. ఆలయం : యోగానంద లక్ష్మీనృసింహస్వామి ఆలయం సౌకర్యాలు: పుష్కర భక్తులు సేదతీరేందుకు తాత్కాలిక షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. రవాణా సౌకర్యం : హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు జగ్గయ్యపేట లేదా చిల్లకల్లు నుంచి వేదాద్రి చేరుకోవాల్సి ఉంటుంది. చిల్లకల్లు నుంచి 12 కి.మీ, కొణకంచి అడ్డరోడ్డు నుంచి 18 కి.మీ దూరం. బస్సులు, ఆటోలు ఉంటాయి. 24. ముక్త్యాల ఘాట్ ( కృష్ణానది ఉత్తర వాహినిగా ప్రవహిస్తోంది) జగ్గయ్యపేట మండలం నీటిస్థాయి : 15 నుంచి 20 అడుగుల మేర ఉంది. ఆలయం: భవానీ ముక్తేశ్వరస్వామి దేవాలయం సౌకర్యాలు: తాత్కాలిక షెడ్లు, దుస్తులు మార్చుకొనేందుకు గదులున్నాయి. రవాణా సౌకర్యం: హైదరాబాద్ నుంచి 220 కి.మీ దూరం. జగ్గయ్యపేట నుంచి పది కిలోమీటర్లు. బస్సు సౌకర్యం తక్కువ. ఆటోలపైనే ఆధారపడి ప్రయాణం చేయాల్సి ఉంటుంది. 25. ధరణి కోట ఘాట్ (అమరావతి) నీటి స్థాయి: పుష్కర ఘాట్ నుంచి 150 అడుగుల వరకు నీరు లేదు. ఆలయాలు: అమరలింగేశ్వరస్వామి దేవస్థానం ఉంది. ధ్యానబుద్ధ విగ్రహం ఉంది. సౌకర్యాలు: ఈఘాట్ మొత్తం 1.3 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. గుంటూరు జిల్లాలోనే అతి పెద్ద ఘాట్. రోజుకు రెండున్నర లక్షల మంది భక్తులు వస్తారనే అంచనాతో, అందుకు తగ్గట్లుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు పుష్కర నగర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సత్తెనపల్లి, విజయవాడ, గుంటూరు రోడ్లను విస్తరించారు. ట్యాంక్ బండ్ తరహాలో టూరిజం వారు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ పిండప్రదానం షెడ్లు నిర్మిస్తున్నారు. అమరావతిలోకి వెళ్లకుండా రింగ్ రోడ్డు ఏర్పాటు చేశారు. హైమాస్ లైట్లతో ప్రత్యేక లైటింగ్ ఏర్పాటు చేశారు. రవాణా సౌకర్యం: గుంటూరు 35 కిలో మీటర్లు, విజయవాడ నుంచి 35 కిలోమీటర్లు, సత్తెనపల్లి 50 కిలోమీటర్లు ఉంటుంది. గుంటూరు వరకు రైలు సౌకర్యం ఉంది. విజయవాడ నుంచి అమరావతి వెళ్ళే యాత్రికులు తాడేపల్లి కరకట్ట మీదుగా రాయపూడి అడ్డరోడ్డు నుంచి అమరావతి చేరుకునే వీలుంది. బస్సు సౌకర్యం అధికంగా ఉంది. 26. హరిశ్చంద్రాపురం ఘాట్ (తుళ్ళూరు మం.) నీటి స్థాయి: ప్రస్తుతం కృష్ణా నదిలో నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది. దీనికి 10 కిలోమీటర్ల ముందు ప్రకాశం బ్యారేజ్ వాటర్ స్టోరేజ్ ఉండంతో నీరు ఎప్పుడు అందుబాటులో ఉంటుంది. ఆలయాలు-ఇక్కడ అమరావతి మండలంలోని వైకుంఠపురం వెంకటేశ్వరస్వామి దేవాలయంకు అనుబంధంగా ఉన్న అలివేలు మంగ అమ్మవారి దేవాలయం ఉంది సౌకర్యాలు: పుష్కర ఘాట్లను నిర్మించి అక్కడ షెడ్లు ఏర్పాటు చేస్తున్నారు. 150 మీటర్ల ఘాట్‌ను రూ 1.50 కోట్లతో నిర్మిస్తున్నారు. రవాణా సౌకర్యం: విజయవాడ నగరం నుంచి కృష్ణానదీ కరకట్ట మీదుగా 25 కిలోమీటర్లు గుంటూరు నగరం నుంచి తుళ్ళూరు మీదుగా హరిశ్చంద్రాపురానికి 46 కిలోమీటర్ల దూరం, ఆర్టీసీ బస్సు సౌకర్యం ఉంది. 27. పవిత్ర సంగమం ఘాట్ (ఇబ్రహీంపట్నం మండలం) నీటి స్థాయి: పోలవరం కుడి ప్రధాన కాల్వ నుంచి గోదావరి నీటిని కృష్ణమ్మకు కలిపే బుదమేరు డైవర్షన్ కెనాల్ వద్ద కొత్తగా 250 మీటర్ల పొడవైన ఘాట్ ఏర్పాటు చేశారు. సౌకర్యాలు: స్నానాలకు ప్రత్యేక ప్లాట్‌ఫారంలు ఏర్పాటు చేస్తున్నారు. రవాణా సౌకర్యాలు: ఇబ్రహీంపట్నం సర్కిల్ నుంచి పవిత్రసంగమం వరకు 1.6 కి.మీ. పొడవైన 4 లైన్ల రోడ్డును నిర్మిస్తున్నారు. విజయవాడ హైదరా బాద్ రూట్ నుంచి వెళ్లే వారు ఈ మార్గంలో పవిత్ర సంగమానికి వెళ్లవచ్చు. 8 నమూనా దేవాలయాలు ఏర్పాటు: ఇక్కడ 25ఎకరాల స్థలంలో రాష్ట్రంలో ప్రముఖమైన 8 నమూనా దేవాలయాలు ఏర్పాటు చేస్తున్నారు. శ్రీశైలం మల్లికార్జునుడు, అనంతపురం జిల్లా కదిరి లక్ష్మీనరసింహస్వామి, కాణిపాకం వరసిద్ధి వినాయకుని ఆలయం, విజయవాడ ఇంద్రకీలాద్రిలో ఉన్న కనకదుర్గ ఆలయం, శ్రీకాకుళంలో ఉన్న కూర్మసిద్ది దేవాలయం, తూర్పుగోదావరి జిల్లా బిక్కఓలులో సుబ్రమణ్యేశ్వర ఆలయం, మచిలీపట్నంలో పాండురంగనాధ స్వామి ఆలయం, విజయనగరం జిల్లా రామతీర్ధంలో రామనాధస్వామి వారి ఆలయం, ఏర్పాటు చేస్తున్నారు. 28. తాళ్ళయ్యపాలెం ఘాట్ (తుళ్ళూరు మం.) నీటిస్థాయి: కృష్ణా నది దిగువ ప్రాంతం కావటంతో నీరు పుష్కలంగా ఉంది. 25 నుంచి 35 అడుగుల లోతు ఉంటుంది ఆలయాలు: శ్రీ శైవ క్షేత్రం ఉంది. 1,116 శివలింగాలు, పాదరస శివలింగం ఉన్న క్షేత్రం ఇది. సౌకర్యాలు: పుష్కర ఘాట్లను 455 మీటర్ల పొడవునా రూ 4.5 కోట్లతో నిర్మిస్తున్నారు. అలాగే షెడ్లు ఎర్పాటు, తాత్కాలిక గదులు నిర్మిస్తున్నారు. రవాణా సౌకర్యం: విజయవాడ నగరం నుంచి కరకట్ట మీదుగా 9 కిలోమీటర్లు. అలాగే మంగళగిరి నుంచి 21 కిలోమీటర్లు, గుంటూరు నుంచి 39 కిలోమీటర్లు. బస్సు సౌకర్యం ఉంది. 29. ఫెర్రీ ఘాట్ ఏరియా: పవిత్ర సంగమానికి అనుకుని హారతి పెవిలియన్ దాటిన తర్వాత 750 మీటర్ల పొడవైన ఫెర్రీఘాట్ నిర్మాణం చేశారు. నీటిస్థాయి: పోలవరం కుడి కాలువ నుంచి గోదావరి నీటిని కృష్ణమ్మకు కలిపే బుడమేరు డైవర్షన్ కెనాల్ వద్ద నుంచి నీటిని మళ్ళిస్తారు. రవాణా సౌకర్యాలు: ఇబ్రహీంపట్నం సర్కిల్ నుంచి పవిత్రసంగమం సుమారు 1.6 కి.మీ. పొడవైన 4లైన్ల రోడ్డును కొత్తగా నిర్మిస్తున్నారు. విజయవాడ, హైరరాబాద్ నుంచి యాత్రీకులు ఇబ్రహీంపట్నం సర్కిల్‌కు చే రుకోవచ్చు. 30. మహాఘాట్ (విజయవాడ నగరం) పున్నమి, భవానీఘాట్లు కలిపి మహాఘాట్గా నామకరణం చేశారు. పున్నమి ఘాట్: విజయ డైరీ ఇన్‌టేక్‌వెల్ నుంచి పున్నమి రెస్టారెంట్ గోడ వరకు విస్తరించిన ఈ ఘాట్ పొడవు 400 మీటర్లు. నీటిస్థాయి: మహాఘాట్ ప్రకాశం బ్యారేజి నుంచి ప్రత్యేక కాలువను తవ్వి నీటిని మళ్ళిస్తారు. షవర్ స్నానం చేసే విధంగా ఏర్పాట్లు చేశారు. రవాణా సౌకర్యాలు: విజయవాడ రైల్వేస్టేషన్ నుంచి ప్రత్యేక సిటీ బస్సులు ఈ ఘాట్ వరకు నడుపుతారు. 31. సీతానగరం పుష్కర ఘాట్ (తాడేపల్లి మం.) నీటి స్థాయి: ప్రకాశం బ్యారేజ్ ప్రాంతం కావటంతో నీటి నిల్వ పర్వాలేదు. ప్రస్తుతం 6.3 మీటర్ల మేర నీటి నిల్వ ఉంది. ఆలయాలు: సీతానగరంలో ఆంజనేయస్వామి దేవస్థానం, ప్రాచీన శివాలయాలు రెండు, ఉండవల్లిలో అనంతపద్మనాభస్వామి దేవాలయం ఉన్నాయి. సౌకర్యాలు: రూ 6.50 కోట్లతో 450 మీటర్ల వెడల్పుతో ఘాట్‌ను నిర్మిస్తున్నారు. గుంటూరు నుంచి 27 కిలోమీటర్లు, విజయవాడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. రెండు ప్రాంతాల నుంచి బస్సు సౌకర్యం ఉంది. 32. దుర్గా ఘాట్ (విజయవాడ నగరం) ఏరియా: ప్రకాశం బ్యారేజి నుంచి కనకదుర్గ అమ్మవారి గాలిగోపురం వరకు ఇది విస్తరించి ఉంది. దీని పొడవు 325 మీటర్లు. నీటిస్థాయి: ప్రకాశం బ్యారేజి నుంచి కాలువ తవ్వి నీటిని మళ్ళిస్తారు. సౌకర్యాలు: ఈ ఘాట్‌లో పుణ్యస్నానాలు ఆచరించే భక్తులు మునక వేసేందుకు 25 మీటర్ల వెడల్పు, ఉన్న చప్టాలు నిర్మించారు. 33. కృష్ణవేణి ఘాట్ (విజయవాడ నగరం) నీటి స్థాయి: ఇక్కడ జల్లు స్నానం (షవర్‌బాత్) ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజి నుంచి స్లూయిస్ ఏర్పాటు చేసి 10 మీటర్ల వెడల్పున ఒక ప్రత్యేక కాలువ తవ్వారు. ఈ కాల్వద్వారా బ్యారేజి నుంచి స్లూయిస్ ద్వారా నిరంతరం నీటిని సరఫరా చేస్తారు. ఇక్కడ 4అడుగుల లోతున పరిశుభ్రమైన నీటిని నిరంతరం వదులుతారు. సౌకర్యాలు: తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. రవాణా సౌకర్యాలు: విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. విస్తీర్ణం: రైల్వే బ్రిడ్జి నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు విస్తరించిన ఘాట్ ఇది. దీని పొడవు 750 మీటర్లు 34. పద్మావతి ఘాట్ (విజయవాడ నగరం) నీటిస్థాయి: జల్లు స్నానం ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజి నుంచి కాలువ తీసి నాలుగు అడుగుల లోతులో గుంట స్నానానికి ఏర్పాట్లు చేశారు. ఘాట్ పొడవు 1.1కి.మీ. దేవాలయం: ఇష్టకామ్యార్ధ నాగేశ్వరస్వామి ఆలయం. సౌకర్యాలు: తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. రవాణ సౌకర్యాలు: విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ దిగిన ప్రయాణికులు నడక మార్గంలో వెళ్ళవచ్చు. విజయవాడ రైల్వే స్టేషన్లో దిగిన యాత్రికులు సిటీ బస్సుఎక్కి పండిట్ నెహ్రూ బస్టాండ్ వద్ద దిగవచ్చు. 35. చిలుమూరు పుష్కర ఘాట్ (కొల్లూరు మండలం) నీటి స్థాయి: కృష్ణా నదిలో ప్రస్తుతం నీరు లేదు. పుష్కరాలకు నీరు వదిలినప్పటికీ నీటి లభ్యత తక్కువ ఉంటుంది. ఆలయాలు: ప్రాచీన ఉభయ రామలింగేశ్వరస్వామి దేవస్థానం ఉంది సౌకర్యాలు: 20 మీటర్ల ఘాట్‌ను రూ.21 లక్షలతో నిర్మిస్తున్నారు. రవాణా సౌకర్యం: గుంటూరు జిల్లా తెనాలి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో ఉంది. బస్సు, ఆటోల సౌకర్యం ఉంది. 36. పెదకళేపల్లి ఘాట్ (దక్షిణ కాశీగా ప్రసిద్ధి) (మోపిదేవి మండలం) నీటిస్థాయి: నీరు పుష్కలంగా ఉంది. సుమారు 40 అడుగుల మేర ఉంది. ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ప్రమాదాలు జరగకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆలయం : దుర్గా నాగేశ్వరస్వామి ఆలయం సౌకర్యాలు: ఘాట్ ఆధునీకరణ పనులు చేస్తున్నారు. భక్తులు సేదతీరేందుకు షెడ్లు ఏర్పాటు చేశారు. రవాణా సౌకర్యం : పెదకళేపల్లి నుంచి 2 కి.మీ మేర ఆటోల్లో ఘాట్‌కు చేరుకోవచ్చు. 37. పెనుమూడి ఘాట్ (రేపల్లె మండలం) నీటి స్థాయి: కృష్ణా నది చివరి ప్రాంతం కావటంతో నీరు లేదు. పుష్కరాలకు బ్యారేజ్ విడుదల చేస్తే నీరు విడుదల చేస్తే ఐదు అడుగుల మేర ఉంటుంది. ఆలయాలు: మోర్తట శ్రీ ముక్తేశ్వర స్వామి దేవాలయం సౌకర్యాలు: 500 మీటర్ల ఘాట్‌ను ఆరు కోట్లతో నిర్మిస్తున్నారు. రవాణా సౌకర్యం: రేపల్లె నుంచి పెనుమూడి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంది. రేపల్లె నుంచి ఆటోలు, బస్సు సౌకర్యం ఉంది. గుంటూరు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉంది. 38. కొత్తపేట ఘాట్ (అవనిగడ్డ మండలం) నీటిస్థాయి : నీటి నిల్వలు 5 అడుగుల మేర మాత్రమే ఉంది. ఆలయం: రెండు కి.మీ దూరంలో లక్ష్మీనరసింహస్వామి ఆలయం ఉంది. సౌకర్యాలు: భక్తుల సౌకర్యార్థం ఘాట్‌ను ఆధునీకరించారు. షెడ్లు ఏర్పాటు చేశారు. రవాణా సౌకర్యం: ఆటోలు, బస్సుల్లో ఘాట్ వద్దకు చేరుకొనే అవకాశం ఉంది. 39. శ్రీపాదక్షేత్రం ఘాట్ (త్రివేణి సంగమం) (నాగాయలంక) నీటిస్థాయి : 30 అడుగుల మేర నీరు పుష్కలంగా ఉంది. సౌకర్యాలు : భక్తులకు ఉపయోగపడేలా షెడ్లు ఏర్పాటు చేశారు. రవాణా సౌకర్యం: విజయవాడ, మచిలీపట్నం నుంచి బస్సు సౌకర్యం ఉంది. నాగాయలంక ప్రధాన క్షేత్రం నుంచి ఘాట్‌కు అర కి.మీ ఉంటుంది. ఆటోలు, ద్విచక్రవాహనాలపై చేరుకోవచ్చు. 40. సంగమ ప్రదేశం ఘాట్ (కోడూరు మండలం) నీటిస్థాయి: నది, సముద్రం సంగమ ప్రదేశం ఆలయాలు: హంసలదీవి దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయం సౌకర్యాలు: స్నానాలకు ఎర్పాటు చేశారు. ఘాట్ల నిర్మాణం లేదు. రవాణా సౌకర్యం: అవనిగడ్డ నుంచి 25 కిలోమీటర్ల దూరం. బస్సు, ఆటోలు ఉన్నాయి. -
కృష్ణ కృష్ణ.. ఎక్కడి పనులక్కడే..
- మరో పక్షం రోజుల్లో పుష్కరాలు - పలు పనులకు టెండర్లు పిలవని వైనం - సమీక్షించిన మంత్రి తుమ్మల సాక్షి, హైదరాబాద్ : మరో పక్షం రోజుల్లో కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానుండగా, ఇప్పటికీ ప్రధాన పనులు పూర్తికాకపోగా కొన్నింటికి కనీసం టెండర్లు కూడా పిలవలేకపోయారు. ఫలితంగా కృష్ణా పుష్కరాలు మొదలై భక్తులు పుణ్యస్నానాలకు వస్తున్నా పనులు మాత్రం కొనసాగేలా కనిపిస్తున్నాయి. మంగళవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ నిర్లక్ష్యం తేటతెల్లమైంది. అన్నీ అసంపూర్తిగానే.. నల్లగొండ జిల్లాలో కృష్ణా పుష్కరాల కోసం ఇప్పటికి కేవలం 36 కోట్లతో 17 రోడ్లను మాత్రమే పూర్తి చేశారు. మిగతా పనులను పరుగుపెట్టించినా పుష్కరాలు మొదలయ్యే నాటికి పూర్తి అయ్యే పరిస్థితి కనిపించటం లేదు. దీంతో మంత్రి తుమ్మల అధికారులకు ఆగస్టు 8 గడువు విధించారు. 9 అతిథి గృహాలను ఆగస్టు 8లోగా నిర్మించాలని, 17 పార్కింగ్ స్థలాలను పదో తేదీనాటికి సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇక మహబూబ్‌నగర్ జిల్లాలో 16 రోడ్డు పనులు మాత్రమే పూర్తయ్యాయి. మిగతావి వచ్చేనెల ఐదో తేదీకి పూర్తి చేస్తామని అధికారులు మంత్రి దృష్టికి తెచ్చారు. 15 అతిథి గృహాల మరమ్మతులు చేయాల్సి ఉండగా రెండే పూర్తయ్యాయి. మిగతావి వచ్చేనెల పది నాటికి పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. 30 ప్రాంతాల్లో పార్కింగ్ పనులకు టెండర్లు మాత్రమే పిలిచారు. మరో రెండుమూడు రోజుల తర్వాతగాని పనులు ప్రారంభమయ్యేలా లేవు. వాటిని కూడా పదో తేదీ నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు. పనుల తీరు గుర్తించిన మంత్రి రెండు జిల్లాలకు ఇద్దరు ఈఎన్సీలను అటాచ్ చేశారు. వీలైనంత తొందరలో పనులు పూర్తి అయ్యేలా చూడాలని మంత్రి అధికారులను ఆదేశించారు. -
పుష్కర యాత్రికులకు భోజన ఏర్పాట్లు
అధికారులతో సమీక్షలో సీఎం సాక్షి, విజయవాడ బ్యూరో: కృష్ణా పుష్కరాలకు వచ్చే యాత్రికులకు నాణ్యమైన ఆహారం అందించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పుష్కర యాత్రికులకు సేవలు, ఇతర ఏర్పాట్లపై ఆదివారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. అక్షయపాత్ర, టీటీడీ సహకారంతో భోజనాలు, ఇతర ఆహార పదార్థాలు శుచిగా, రుచిగా అందించాలని సూచించారు. టీటీడీ ఆధ్వర్యంలో రోజుకు లక్ష మందికి భోజన వసతి కల్పించాలన్నారు.పుష్కరాలు జరిగే 12 రోజులు కృష్ణా నదిలో జలక్రీడలు నిర్వహించాలని చెప్పారు. ప్రధాని, రాష్ట్రపతులకు ఆహ్వానం.. పుష్కరాలకు ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, స్పీకర్లు, రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు తదితరులను వీఐపీలుగా ఆహ్వానించాలని నిర్ణయించారు. అగ్రిగోల్డ్ కేసు దర్యాప్తుపై సీఎం సమీక్ష అగ్రిగోల్డ్ సంస్థ కేసు దర్యాప్తును ముఖ్యమంత్రి ఆదివారం తన నివాసం నుంచి సమీక్షించారు. బాధితులకు న్యాయం జరిగేలా చర్యలుండాలని చెప్పారు. కాగా, హైదరాబాద్‌లోని ఫిల్మ్ నగర్లో జరిగిన ప్రమాదపై సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయ చర్యల్లో పాలుపంచుకోవాలని హైదరాబాద్ జంట నగరాల టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చినట్లు ఆయన మీడియా సలహాదారు కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
పాతాళగంగ పుష్కరఘాట్ లో విరిగిపడ్డ కొండచరియలు
శ్రీశైలమహాక్షేత్రంలో ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాల ప్రారంభమవుతున్న నేపథ్యంలో పుష్కరఘాట్ల వద్ద రోడ్డు విస్తరణకోసం కొండచరియలను తొలచడంతో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఆ మార్గంలో కొండరాళ్లు హఠాత్తుగా జారిపడ్డాయి. పుష్కర పనులు నిర్వహించే సిబ్బంది ఆ సమయంలో పనుల్లోకి దిగకపోవడం, అదే సమయంలో భక్తుల రాకపోకలు కూడా లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. కొండచర్యలు విరిగిపడే సంఘటనలు జరుగుతాయనే ఉద్దేశ్యంతో జిల్లా కలెక్టర్ విజయమోహన్ ముందస్తుగానే తొలచిన కొండ ప్రాంతంలో ఐరన్ మెష్ ఏర్పాటు చేసి కాంకీట్ పూత పూయాల్సిందిగా గతంలో ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ పని ఇప్పటి వరకు అమలు కాలేదు. శనివారం రాత్రి కురిసిన ఒక్క భారీ వర్షానికే పై నుంచి కొండచరియలు విరిగిపడడంతో రోప్‌వే నుంచి ప్రస్తుతం వినియోగంలో ఉన్న పుష్కరఘాట్‌కు వేళ్లేరోడ్డుమార్గంలో కొండరాళ్లతో నిండిపోవడంతో ఆ ఘాట్ మూసుకుపోయింది. కొండచరియలు విరిగిపడ్డ సంఘటనను తెలుసుకున్న దేవాదాయ శాఖ కమీషనర్ అనురాధ, ఈఓ నారాయణ భరత్ గుప్త,జెఈఓ హరినాథ్‌రెడ్డిలు ఆ ప్రదేశాన్ని పరిశీలించి వెంటనే కొండరాళ్లలను తొలగించాల్సిందిగా ఆదేశించడంతో ప్రొక్లైన్ ద్వారా వాటిని కాంట్రాక్టర్లు తొలగించిమార్గం సుగుమం చేశారు. -
పుష్కర పనుల్లో దోపిడీ
పుష్కర పనులు నాసిరకంగా సాగుతున్నాయని, అధికార పార్టీ నేతల దోపిడీకి మారుపేరుగా నిలుస్తున్నాయని వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లాలో ధరణికోట, అమరావతి, సీతానగరంలో ఘాట్లను పార్టీ నాయకులు అంబటి రాంబాబు, నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నియోజకవర్గ సమస్వయకర్తలు కావటి మనోహర్‌నాయుడు, క్రిస్టినా, బొల్లా బ్రహ్మనాయుడు, రావి వెంకటరమణ, అన్నాబత్తుని శివకుమార్‌లతో కలిసి వారు పరిశీలించారు. ఘాట్లలో జరుగుతన్న పనుల తీరు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పనుల్లో సాంకేతికపరమైన అంశాలు,నాణ్యతపై ఎమ్మెల్యే ఆర్కే ప్రశ్నలవర్షం కురిపిస్తుంటే.. అధికారులు నీళ్లు నమిలారు. ధరణికోటలో 350 మీటర్ల మేర ఘాట్ పనులు దాదాపు రూ. 10 కోట్లతో జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఇంతవరకు కేవలం 40 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయన్నారు. 0.4 మీటర్ల మందంతో కాంక్రీట్ వేయాల్సిఉండగా.. కనీసం 0.2 మీటర్ల మందం కూడా వేయడం లేదని, ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ జరుగుతున్న పనులేనన్నారు. కాంక్రీట్‌కు ముందు ఇసుక వేసి చదును చేసేటప్పుడు పిన్ వైబ్రేటర్ వాడాలి. కాంక్రీట్ వేసేటప్పుడు ప్యాన్ వైబ్రేటర్ ఉపయోగించాలి. అవేమీ ఇక్కడ కనిపించలేదన్నారు. బెడ్‌కు వాడే కాంక్రీట్‌కు 40 ఎంఎం కంకర బదులు అన్‌సైజు 3/4 కంకర వాడుతున్నారని పేర్కొన్నారు. అక్కడ నదిలో ఉన్న ఇసుకను వినియోగిస్తూ.. క్యూబిక్ మీటరుకు రూ. 250 వంతున దండుకుంటున్నారని ధ్వజమెత్తారు. పనుల్లో వాడుతున్న స్టీల్‌కు టెస్టింగ్ సర్టిఫికెట్లు అడిగితే చూపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. టెస్టింగ్ క్యూబ్ గురించి అధికారులు మాట్లాడటం లేదని పేర్కొన్నారు. పుష్కరాల తేదీలు ముందుగా తెలియదా అని ప్రశ్నించారు. జూన్ 10న పనులు ప్రారంభించి హడావుడి చేయడమేమిటని వారు ప్రశ్నించారు. గడువు మేరకు ఈ నెలాఖరుకు పనులు కాకపోతే కాంట్రాక్టర్లకు రేట్లు పెంచే కుట్ర జరుగుతుందన్నారు. జేబులు నింపుకోవడానికే.. పుష్కర పనులను సైతం సీఎం చంద్రబాబునాయుడు, చినబాబు , స్థానిక అధికార పార్టీ నేతలు వదలటం లేదన్నారు. పనులు నాసిరకంగా చేసి వాటాలు పంచుకొంటున్నారని ఆరోపించారు. పనులు జరుగుతున్న తీరు చూస్తే భక్తుల కోసమా, జేబులు నింపుకోవటానికా అనే అనుమానాలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. పనుల్లో నాణ్యత పాటించలేదనే విషయం స్పష్టమవుతుందన్నారు. ఇప్పటికే అవినీతికి సంబంధించి ఏపీ అగ్రస్థానంలో ఉందని జాతీయస్థాయిలో చర్చ జరుగుతోందన్నారు. నంబరు 1 సీఎం అని గొప్పలు చెప్పుకొనే బాబు అవినీతి పరాకాష్టకు చేరిందని దుయ్యబట్టారు. ఈ పర్యటనలో పార్టీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఘాట్ల రహదారులు ఇలా...
-
ఘాట్ల రహదారులు ఇలా...
అస్తవ్యస్తంగా రోడ్లు సమీపిస్తున్న పుష్కరాలు నత్తనడకన పనులు ప్రధాన రహదారి నిర్మాణానికి అడ్డంకులు భవానీపురం: కృష్ణా పుష్కరాలు దగ్గరపడుతున్నాయి. స్నాన ఘాట్లకు వెళ్లే రహదారుల నిర్మాణం నత్తనడకన సాగుతున్నాయి. గట్టు వెనక ప్రాంతంలోని పున్నమి, మల్లేశ్వరి, భవానీఘాట్‌ల నిర్మాణానికి కార్పొరేషన్ సుమారు రూ.6.60 కోట్లు ప్రతిపాదనలతో, ప్రణాళికలు సిద్ధం చేసింది. పనులు మాత్రం నెమ్మదిగా నడుస్తున్నాయి. పుష్కరాలకు ఇంకా 29 రోజులే ఉంది. పనులు సకాలంలో పూర్తి అవుతాయా అనే అనుమానాలు ప్రజలలో రేకెత్తుతున్నాయి. ఏడు రహదారులు.. భవానీపురం పున్నమి హోటల్ నుంచి భవానీ పురం వీటీపీఎస్ కూలింగ్ కెనాల్ పంపింగ్ స్కీమ్ వరకు 2.5 కిలోమీటర్ల కరకట్ట ప్రధాన రహదారి నిర్మించాల్సి ఉంది. దానికి అనుబంధంగా ఆరు రహదారులు నిర్మించాలి. ప్రధాన రహదారిని భవానీఘాట్ వరకే పరిమితం చేశారు. వాస్తవానికి ఈ పనులన్నీ ఈ నెలాఖరుకు పూర్తి చేస్తామని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. పనులు ప్రారంభించిన నెలా పది రోజులకు 40 శాతం మించి కాలేదు. మిగిలిన 60 శాతం పనులు 29 రోజుల్లో ఎలా పూర్తి అవుతాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. పుష్కర ఘాట్ల నిర్మాణానికి సంబంధించిన కాంక్రీట్, మట్టిని తీసుకువెళ్లే లారీలు కరకట్ట ప్రధాన రహదారి మీదుగానే రాకపోకలు సాగిస్తున్నాయి. రహదారుల నిర్మాణ పనులు మొదలుపెడితే లారీలు తిరిగే అవకాశం ఉండదు. కరకట్ట ఇళ్లను తొలగిస్తేనే.. ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టాలంటే కరకట్ట వెంట ఉన్న ఇళ్లను తొలగించాల్సి ఉంది. చాలా వరకు కార్పొరేషన్ అధికారులు వాటిని తొలగించారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ సుమారు 70 మంది న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఆ ఇళ్లను తొలగించటం అధికారులకు సాధ్యం కాలేదు. ఫలితంగా స్నానఘాట్లకు వెళ్లే ప్రధాన రహదారి నిర్మాణం చేపట్టలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కోర్టుకు వెళ్లిన ఇళ్ల యజమానులు ఆందోళనబాట పట్టారు. వారికి అఖిలపక్ష నాయకులు అండగా నిలబడ్డారు. ఆ ఇళ్ల తొల గింపు, గతంలో ఇళ్లను తొలగించిన సమయంలో పగిలిపోయిన పైప్లైన్లు మార్చాల్సి ఉంది. ఇవన్నీ ఎప్పుడు పూర్తవుతాయోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. -
ఆల్మట్టిపైనే ఆశలన్నీ..
పుష్కరాలకు సాగర్ ప్రాజెక్ట్ కళకళలాడుతుందనే ఆశాభావం గత పుష్కరాల సమయంలోనూ చివరి నిమిషంలో వచ్చిన నీరు అప్పుడు 570 అడుగులకు చేరిక.. ప్రస్తుత నీటిమట్టం 504 అడుగులే.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో రావచ్చంటున్న అధికారులు 570 అడుగులకు రావాలంటే ఇంకా 135 టీఎంసీలు కావాలి లక్ష క్యూసెక్కుల చొప్పున 15 రోజులు వచ్చినా పుష్కరాలకు ఢోకా లేనట్టే ఆల్మట్టికి రోజూ 2 లక్షల క్యూసెక్కుల ప్రవాహం.. నాలుగు రోజుల్లో నిండే అవకాశం.. నల్లగొండ : ఎగువ కర్ణాటకలో కురుస్తున్న వర్షాలు కృష్ణా పుష్కరాలపై ఆశలు చిగురింపజేస్తున్నాయి. పుష్కరాలకు ఇంకా 25 రోజుల సమయం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు వెలవెలబోతున్నా... అప్పటికి కళకళలాడుతుందనే అభిప్రాయం ఏర్పడుతోంది. అయితే, గత పుష్కరాలను ఒక్కసారి స్మరించుకుంటే అప్పుడు కూడా (2004లో) పాజెక్టులోకి నీళ్లు చివరి నిమిషంలోనే వచ్చి చేరాయి. మొత్తం 570 అడుగుల వరకు సాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు వచ్చాయని అప్పటి లెక్కలు చెబుతున్నాయి. ప్రస్తుతం సాగర్ నీటి మట్టం 503.9 అడుగులే ఉన్నా పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి ఖచ్చితంగా ఆ స్థాయికి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ముఖ్యంగా కర్ణాటకలో ఉన్న ఆల్మట్టి డ్యాంకు రోజుకు 2లక్షలకు పైగా క్యూసెక్కుల (దాదాపు 16 టీఎంసీలు) ఇన్‌ఫ్లో ఉండడంతో పుష్కరాలు ప్రారంభమయ్యే నాటికి సాగర్ ప్రాజెక్టు కూడా కళకళలాడుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. మధ్యలో మూడు ప్రాజెక్టులు.. ఆల్మట్టి ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున ఇన్‌ఫ్లో వస్తోంది. ఆ ప్రాజెక్టుకు రోజుకు మూడు రోజుల క్రితం లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, మొన్న 1.75 లక్షలకు, ఆ తర్వాత 2లక్షలకు, శుక్రవారం 2,00, 859 క్యూసెక్కులకు చేరింది. అంటే ఒక్కరోజే 17 టీఎంసీలకు పైగా నీరు వచ్చింది. ఆల్మట్టిలో ప్రస్తుతం ఉన్న నీటికి తోడు ఆ ప్రాజెక్టు నిండేందుకు మరో 60 టీఎంసీల నీరు వస్తే సరిపోతుంది. అంటే ఇదే ఇన్‌ఫ్లో కొనసాగితే మంగళవారం నాటికి ఆల్మట్టి నిండే అవకాశాలున్నాయి. అప్పుడు నారాయణపూర్, జూరాల ప్రాజెక్టులకు నీరు త్వరగానే వస్తుంది. ఎందుకంటే ఈ రెండు ప్రాజెక్టులు కలిపినా మొత్తం నీటి నిల్వ 49 టీఎంసీలే. ఇప్పటికే వాటిలో 18 టీఎంసీలున్నాయి. అంటే మరో 31 టీఎంసీలు వస్తే చాలు. ఆ తర్వాత శ్రీశైలంలో ఇంకా 190 టీఎంసీల వరకు నీరు కావాలి. ఈ ప్రాజెక్టులోకి కూడా 2లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో ఉంటే 10 రోజుల్లో నిండుతుంది. అంటే మొత్తం కలిపి 15 రోజుల్లో ఇదే వరద కొనసాగితే సాగర్‌కు నీటి విడుదల ప్రారంభం అవుతుంది. అంటే దాదాపు ఆగస్టు నెల ప్రారంభం లేదా అంతకంటే ముందే నీళ్లు రాక మొదలవుతుంది. అప్పటికీ 12 రోజుల సమయం ఉంటుంది కనుక ఇబ్బంది లేదని అధికారులు అంటున్నారు. అయితే, శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిగా నిండకపోయినా, విద్యుదుత్పాదన కోసం కిందికి నీళ్లు వదిలితే ఆ ఇన్‌ఫ్లో సాగర్‌లోకి వచ్చి చేరుతుంది కాబట్టి పుష్కరాల నాటికి మన జిల్లాలో ప్రవహించే కృష్ణా నదిలోకి పుష్కలంగా నీరు వస్తుందని అంచనా. సాగర్ లెక్క ఇది... వాస్తవానికి నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 590 అడుగులు. దాన్ని టీఎంసీల్లో లెక్కిస్తే 312.04 టీఎంసీలు. ప్రస్తుత సాగర్‌లో ఉన్నది కేవలం 503.9 అడుగులే. అంటే 121 టీఎంసీలే. అయితే, అధికారులు ఆశిస్తున్నట్టుగా సాగర్‌నీటి మట్టం 570 అడుగులకు చేరాలంటే (కిందికి నీళ్లు వదలాలంటే 570 అడుగుల మేర నీళ్లు రావాలి.) 256.5 టీఎంసీల నీళ్లు కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉన్నవి కాకుండా ఇంకా 135 టీఎంసీల వరకు నీళ్లు రావాలన్నమాట. ఈ 135 టీఎంసీలను క్యూసెక్కుల్లో లెక్కిస్తే ఒక్క టీఎంసీకి 11,575 క్యూసెక్కుల చొప్పున 15,62,625 క్యూసెక్కుల నీళ్లు కావాలి. అలా కావాలంటే సాగర్‌కు ఇన్‌ఫ్లో రోజుకు లక్ష క్యూసెక్యుల చొప్పున 15 రోజులొస్తే సరిపోతుందన్న మాట. పుష్కరాలు ఆగస్టు 12 నుంచి ప్రారంభం అవుతున్న నేపథ్యంలో ఈనెల 25 నుంచి ఇన్‌ఫ్లో ప్రారంభం అయినా సరిపోతుందని అధికారులంటున్నారు. ఇప్పటికే ఆల్మట్టికి వస్తున్న ప్రవాహం చూస్తుంటే మరో 3, 4 రోజుల్లో అది నిండిపోతుందని, అప్పుడు సాగర్‌కు ఒకటిన్నర రోజుల్లో నీళ్లు వచ్చే అవకాశాలుంటాయని అధికారులు చెపుతున్నారు. అయితే, మధ్యలో ఉన్న ప్రాజెక్టుల్లో నీరు నిండేందుకు మరో వారం, పది రోజులు తీసుకున్నా... 25 నుంచి లక్ష క్యూసెక్కుల చొప్పున వస్తే సరిపోతుందని, ఇంకా అదనంగా వస్తే ఇంకా తక్కువ రోజుల్లోనే సాగర్ కళకళలాడుతుందనే అధికారులు చెపుతున్నారు. అయితే, తుంగభద్ర కు కూడా రోజుకో రెండు టీఎంసీల చొప్పున ఇన్‌ఫ్లో వస్తోంది. ఆ ఇన్‌ఫ్లో కూడా పెరిగితే అక్కడి నుంచి సాగర్‌కు ఇన్‌ఫ్లో వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఎప్పుడో కానీ జూలై మాసంలో సాగర్ ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో ఉండదు. ఆగస్టు మొదటి వారంలో ప్రారంభం అయి రెండు, మూడు వారాల్లో గేట్లు పైకి ఎత్తే పరిస్థితి వస్తుంది. అది సెప్టెంబర్ 15 వరకు కొనసాగుతుంది (వరద ఉంటే). ఈ పరిస్థితుల్లో ఎగువన వస్తున్న వరదలను చూస్తే పుష్కరాల నాటికి సాగర్ నీటికి ఢోకా ఉండబోదని అధికారులు చెపుతున్నారు. పుష్కరాల నాటికి సాగర్‌లో నీళ్లు నిండాలని, నీళ్లు లేవని భక్తులు నిరాశ చెందకుండా పుష్కరాలు పూర్తికావాలని ఆశిద్దాం. -
యాక్షన్ ప్లాన్
పుష్కరాలకు రవాణా శాఖ ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి 7 స్టేషనరీ కంట్రోల్ రూములు, 5 మొబైల్ కంట్రోల్ టీముల ఏర్పాటు ఇతర జిల్లాల నుంచి 147 మంది సిబ్బంది కేటాయింపు తెలంగాణ ఎంట్రీ పాయింట్ల వద్ద ప్రత్యేక బృందాలు విజయవాడ : కృష్ణా పుష్కరాలకు జిల్లా రవాణా శాఖ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. ఉన్నతాధికారులతోనూ ఆమోదముద్ర వేయించుకుంది. ట్రాఫిక్ నియంత్రణపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించింది. వాహనాల ఓవర్‌లోడ్, మితిమీరిన వేగం నియంత్రణకు మొబైల్ కంట్రోల్ టీములను ఏర్పాటు చేయనుంది. జిల్లాలో మంగినపూడి బీచ్, అవనిగడ్డ, చెవిటికల్లు, గన్నవరం, ఈడ్పుగల్లు, ఆర్టీసీ బస్టాండ్, విజయవాడ రైల్వేస్టేషన్లో స్టేషనరీ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పుష్కర ఘాట్ల వద్ద ట్రాఫిక్, ఇతర ఇబ్బందులను ఇక్కడి సిబ్బంది పర్యవేక్షిస్తారు. ప్రతి కంట్రోల్ రూమ్‌లో ఒక అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్తో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు లేదా హోంగార్డులు విధుల్లో ఉంటారు. ప్రతి 8 గంటలకు ఒక షిఫ్టు చొప్పున రోజుకు మూడు షిఫ్టుల్లో విధులు నిర్వహిస్తారు. ప్రతి రూమ్‌ను ఒక ఎంవీఐ, వీటన్నింటినీ ఆర్టీవో పురేంద్ర పర్యవేక్షిస్తారు. ఐదు మొబైల్ టీంలు... వాహనాల వేగం నియంత్రణకు, కీలక రహదారుల్లో ప్రమాదాలు జరగకుండా పర్యవేక్షించటానికి, ఇబ్బందికర మార్గాల్లో ప్రత్యేక చర్యల పర్యవేక్షణకు ఐదు మొబైల్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కరకట్ట మార్గంలో కృష్ణలంక నుంచి మోపిదేవి వరకు, వేదాద్రి నుంచి ముక్తేశ్వరం, పులిచింతల మీదుగా జగ్గయ్యపేట వరకు, అవనిగడ్డ నుంచి ఉయ్యూరు రోడ్డు వరకు, గుడిమెట్ల నుంచి వావిరాల మీదుగా చందర్లపాడు వరకు, ఇబ్రహీంపట్నం నుంచి భవానీపురం మీదుగా విజయవాడ నగరం వరకు ఒక్కొక్క టీమ్ చొప్పున పర్యవేక్షణ చేస్తాయి. ప్రతి టీమ్‌లో ఒక ఎంవీఐ, ఇద్దరు కానిస్టేబుల్స్ లేదా హోంగాార్డు ఉంటారు. వీటిని ఆర్ర్టీవోలు డీఎస్ఎన్ మూర్తి, ఎస్.వెంకటేశ్వరరావు పర్యవేక్షిస్తారు. జిల్లాలోని సిబ్బంది కాకుండా బయటి జిల్లాల నుంచి 147 మంది కానిస్టేబుళ్లు, ఎంవీఐల నుంచి డిప్యూటీ కమిషనర్ స్థాయి అధికారుల వరకు పుష్కర విధులకు రానున్నారు. వీరంతా ఆగస్టు 10 నాటికి విధులకు హాజరవుతారు. వీరికి బస ఏర్పాటు కోసం 60 గదులు కేటాయించాలని జిల్లా కలెక్టర్‌ను కోరారు. జిల్లా పరిధిలోని సిబ్బందితో తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్ట్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జగ్గయ్యపేటలోని గరికపాడు చెక్‌పోస్ట్, తిరువూరు సమీపంలో మరోటి ఏర్పాటు చేసి వాహనాల నుంచి పన్నులు వసూలు చేయాలని నిర్ణయించారు. రవాణా శాఖ డిప్యూటీ కమిషనర్ మీరా ప్రసాద్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇప్పటికే పుష్కరాల అంశంపై యాక్షన్ ప్లాన్‌పై చర్చించామన్నారు. -
గోదావరి పుష్కర ఘోరానికి ఏడాది
-
పుష్కర నగర్లు 23
రూ.6 కోట్లతో టెండర్లు ఖరారు మార్పుల అనంతరం జాబితా సిద్ధం సమీప గ్రామాల్లోనూ ఏర్పాటుకు నిర్ణయం మొదలైన పనులు విజయవాడ సెంట్రల్ : కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించేందుకు విజయవాడ నగర పరిధిలోని 23 ప్రాంతాల్లో పుష్కర నగర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు టెండర్లు ఖరారయ్యాయి. నగరం, శివారు ప్రాంతాల్లో మాత్రమే ఏర్పాటు చేయాలని తొలుత నిర్ణయించినా.. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు అనువుగా ఉండేందుకు గాను కానూరు, పెనమలూరు, ఇబ్రహీంపట్నం, రాయనపాడు, తుమ్మలపాలెం, గొల్లపూడి, గన్నవరం ప్రాంతాల్లో కూడా పుష్కర నగర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ.2 కోట్ల మేరకు బడ్జెట్‌ను పెంపుదల చేశారు. మొత్తం రూ.6 కోట్లతో పుష్కర నగర్లను తీర్చిదిద్దనున్నారు. ఈ నెలాఖరు నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడి నుంచే వెళ్లాలి... పుష్కరాలకు వచ్చే భక్తులు ముందుగా పుష్కర నగర్‌లకు చేరుకోవాల్సి ఉంటుంది. అక్కడ వారికి కావాల్సిన వసతి, భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తారు. క్లోక్ రూం సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అక్కడి నుంచి ఘాట్ల వద్దకు వెళ్లి స్నానాలు చేసిన తరువాత తిరిగి అక్కడికే చేరుకోవాలి. ప్రయాణికుల సౌకర్యార్థం పుష్కర నగర్లలో బస్సు, రైల్వే టికెట్ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రకాశం బ్యారేజీ నుంచి వీటీపీఎస్ కెనాల్ వరకు, సీతమ్మ వారి పాదాల నుంచి కృష్ణలంక వరకు నాలుగు కిలోమీటర్ల మేర ఘాట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో కిలోమీటర్లో రోజుకు ఆరు లక్షల మంది చొప్పున 24 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారన్నది అధికారుల అంచనా. దీనిని దృష్టిలో పెట్టుకొని పుష్కర నగర్లను ఏర్పాటు చేస్తున్నారు. పుష్కర నగర్లు ఇవే... నగర పరిధిలో ఏర్పాటు చేయాలని నిర్ణయించిన 23 పుష్కర నగర్ల వివరాలివీ. పున్నమి ఘాట్, భవానీ ఘాట్, సీతమ్మ వారి పాదాలు, రాజీవ్‌గాంధీ పార్క్, పాత ఆర్టీసీ బస్టాండ్ (పోలీస్ కంట్రోల్ రూం ఎదురు), గుణదల రైల్వేస్టేషన్ సమీపంలో, వైవీరావు ఎస్టేట్స్, వైవీరావ్ ఎస్టేట్స్ ఎదురు ఖాళీ స్థలం, లారీ స్టాండ్ (భవానీపురం), దూరదర్శన్ సమీప ప్రాంతం, ఉడా పార్క్, కనకదుర్గ వార ధి, స్క్రూబ్రిడ్జి సమీపంలో, సిద్ధార్థ మహిళా కళాశాల, సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల (కానూరు), యనమలకుదురు ఘాట్ (పెనమలూరు), ట్రక్ టెర్మినల్ (ఇబ్రహీంపట్నం), వీటీపీఎస్ గ్రౌండ్ (ఇబ్రహీంపట్నం), సీడబ్ల్యూసీ గోడౌన్ (రాయనపాడు), దేవాదాయ శాఖ ఖాళీ స్థలం (తుమ్మలపాలెం, ఇబ్రహీంపట్నం), హోల్‌సేల్ మార్కెట్ యార్డు (గొల్లపూడి), గూడవల్లిలోని ఖాళీ స్థలం (గన్నవరం). -
ఇనుప కమ్మీలు గుచ్చుకుని కూలీ మృతి
పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కాపవరం గ్రామ శివారులో ఇనుప కమ్మీల లోడుతో వెళుతున్న లారీలో ఇనుప చువ్వలు గుచ్చుకుని రమణ అనే కూలి మృతిచెందాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన ఆరుగురు కూలీలు కృష్ణా పుష్కరాల పనులకు వెళ్లేందుకు ఇనుప కమ్మీల లోడుతో వెళుతున్న లారీలో ఎక్కారు. కమ్మీలపై కూర్చుని ప్రయాణం చేస్తుండగా డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో కమ్మీలు గుండెలో గుచ్చుకుని రమణ అక్కడికక్కడే మృతిచెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. మిలిగిన నలుగురు క్షేమంగా బయటపడ్డారు. -
ముందుచూపేది?
గుంటూరు నగరంలో కనిపించని నిఘా నేత్రాలు ఏడాదిగా నిలిచిన సీసీ కెమెరాల ఏర్పాటు ప్రక్రియ కొద్ది రోజుల్లోనే కృష్ణా పుష్కరాలు ప్రారంభం లక్షలాది మంది భక్తులు, యాత్రికులు వచ్చే అవకాశం ప్రజా భద్రతపై దృష్టి సారించని అధికార యంత్రాంగం గుంటూరు నగరంలోని ఉన్నతాధికారులకు ముందు చూపు కొరవడిందనే విమర్శలు వస్తున్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని ప్రజా భద్రతకు పెద్ద పీట వేయాల్సిన అధికారులు, చివరకు సీసీ కెమెరాల ఏర్పాటును సైతం పట్టించుకోకపోవడాన్ని ఎత్తిచూపుతున్నారు. కృష్ణా పుష్కరాల నాటికైనా కళ్లు తెరిచి నిఘా నేత్రాల ఏర్పాటు చేయాల్సిన బాధ్యతనూ గుర్తుచేస్తున్నారు. - సాక్షి, గుంటూరు గుంటూరు: నగరంలో ఎక్కడ ఏం జరిగినా మిన్నకుండిపోవాల్సిందే అన్నట్లు పరిస్థితులున్నాయి. ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, విద్యార్థినులపై ఉన్మాదుల దాడులు, సంఘవిద్రోహ శక్తుల కదలికలు ఇలా ఏం జరిగినా ఏం చేయలేం. కనీస సమాచారం సైతం తెలిసే అవకాశం గుంటూరు నగరంలో లేదు. దీనికి కారణం ఆయా కూడళ్లలో సీసీ కెమెరాలు లేకపోవడమే. ఎన్నో ఏళ్ల కిందట నగరంలోని కొన్ని సిగ్నల్స్ వద్ద ఏర్పాటుచేసిన కొద్దిపాటి సీసీ కెమెరాలు సైతం పనిచేయడం లేదు. అనుకోని సంఘటనలు జరిగినా ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. కేసుల విచారణలో కీలకంగా ఉండే సీసీ కెమెరాలు లేకపోతే ఎన్నో విధాలుగా నష్టాలు తప్పవని పలువురు అంటున్నారు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన... నగరంలో గత ఏడాదిగా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప ఒక్క అడుగు ముందుకు పడడం లేదు. విజయవాడలో కేవలం రెండు నెలల వ్యవధిలోనే నగరంలోని ప్రధాన ప్రాంతాలతో పాటు పుష్కరఘాట్లు, కూడళ్ల వద్ద నిఘా కెమెరాలను ఏర్పాటు చేశారు. గతంలో గుంటూరులో పనిచేసిన అర్బన్ ఎస్పీ సీసీ కెమెరాల ఏర్పాటు గురించి అప్పటి కమిషనర్ నాగవేణికి లేఖ రాశారు. దీన్ని పరిశీలించిన కమిషనర్ ఓ సంస్థకు నిఘా కెమెరాలు ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించారు. దీనిపై పోలీసుల సూచనలు, సలహాలు మేరకు మాత్రమే పనిచేయాలని తేల్చారు. అప్పటి ఎస్పీ కొన్ని సూచనలు, ఆదేశాలతో కెమెరాలు ఏర్పాటుకు ఒప్పుకున్నారు. కెమెరాల ఏర్పాటుకు ప్రభుత్వం సైతం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో సదరు సంస్థతో కార్పొరేషన్ అధికారులు ఎంఓయూ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ తర్వాత కమిషనర్‌గా వచ్చిన కన్నబాబు ఆ సంస్థకు కెమెరాలు ఏర్పాటు చేసేందుకు వర్క్ఆర్డర్ ఇవ్వలేదు. తిరిగి టెండర్లు పిలవాలని ప్రతిపాదించగా తమతో ఒప్పందం కుదుర్చుకొని వర్క్ఆర్డర్ ఇవ్వడంలేదని కోర్టుకు వెళ్లింది. అక్కడ నుంచి కెమెరాల ఏర్పాటు ప్రక్రియ నిలిచిపోయింది. సమాధానం వేయని కార్పొరేషన్... కోర్టుకు వెళ్లిన సంస్థకు వ్యతిరేకంగా కార్పొరేషన్ అధికారులు ఇప్పటి వరకు సమాధానం వేయలేదు. ప్రత్యేకంగా నగరపాలక సంస్థకు న్యాయవాది ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. ప్రస్తుత ఎస్పీ సైతం కార్పొరేషన్‌కు కెమెరాల ఏర్పాటుపై రెండు సార్లు లిఖితపూర్వకంగా లేఖ రాశారు. దీనిపై కార్పొరేషన్ అధికారులు స్పందించిన దాఖలాలు లేవు. ఆ సంస్థకు కెమెరాల ఏర్పాటు బాధ్యతను అప్పగించడమా.. లేక వేరే ఏమైనా నిర్ణయం తీసుకోవడమా అన్న అంశంపై స్పష్టత కోసం రాష్ట్ర పురపాలకశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి లేఖ రాసినా తగిన ఫలితం ఉంటుందని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. -
పుష్కర విధులకు 60వేల మంది
72 గంటలు ముందుగానే విధుల్లో చేరనున్న ఉద్యోగులు వారికి ‘అక్షయ పాత్ర’ భోజనం విద్యాసంస్థల భవనాల్లో సిబ్బందికి వసతి 12 రోజులపాటు ప్రత్యేక కాల్ సెంటర్లు కృష్ణా పుష్కరాల నిర్వహణకు ప్రణాళిక సిద్ధమైంది. పోలీసులు సహా అన్ని శాఖల ఉద్యోగులు 60 వేల మంది పుష్కర విధుల్లో పాలుపంచుకోనున్నారు. ఆయా శాఖల వారీగా ఉద్యోగులు, సిబ్బందికి ప్రత్యేక జాకెట్లు సిద్ధం చేస్తున్నారు. పుష్కరాలు జరిగే 12 రోజులు పనిచేసేలా ప్రత్యేక కాల్సెంటర్లను ఏర్పాటుచేయనున్నారు. కలెక్టర్ బాబు.ఎ అధ్యక్షతన బుధవారం జరిగిన జిల్లా అధికారుల సమావేశంలో ఈ మేరకు కార్యాచరణ రూపొందించారు. విజయవాడ : వచ్చేనెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకూ జరగనున్న కృష్ణా పుష్కరాల నిర్వహణకు చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా యంత్రాంగం వ్యూహం సిద్ధం చేసింది. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి అధికార యంత్రాగంతో కలెక్టర్ బాబు.ఎ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. పుష్కరాలను విజయవంతం చేసేం దుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. పుష్కర విధులకు వచ్చే పోలీసులు, సాధారణ ఉద్యోగులు, వారికి కల్పించే వసతికి సంబంధించి కార్యాచరణపైనా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బాబు.ఎ మాట్లాడుతూ పోలీసులు, సాధారణ ఉద్యోగులకు పుష్కర నగర్‌లకు 500 మీటర్లలోపు వసతి ఏర్పాట్లు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పుష్కరఘాట్, పుష్కర నగర్‌కు సమీపంలో ఉన్న ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల భవనాల జాబితాలు తక్షణమే ఇవ్వాలని జిల్లా విద్యాశాఖాధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఆయా శాఖాధిపతులు తమ శాఖల నుంచి పుష్కర విధులకు కేటాయిస్తున్న ఉద్యోగుల వసతిపై రెండురోజుల్లో వేదిక ఇవ్వాలని కోరారు. మూడు రోజులు ముందుగానే విధులకు పుష్కరాల ప్రారంభానికి 72 గంటల ముందుగానే ఉద్యోగులు కేటాయించిన ప్రదేశంలో విధులకు హాజరై అక్కడి వాతావరణానికి అలవాటు పడాలని కలెక్టర్ సూచించారు. ఘాట్ల వారీగా బందోబస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పుష్కర విధులు నిర్వహించే ఆయా శాఖల ఉద్యోగులను సులభంగా గుర్తించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన జాకెట్లను అందజేస్తామన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ఆకుపచ్చరంగు, పారా మెడికల్ సిబ్బందికి కాషాయం రంగు జాకెట్లను ఇచ్చేందుకు నిర్ణయించామన్నారు. 85 శాతం మంది భక్తుల స్నానాలు ఇక్కడే.. సుమారు ఆరు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పద్మావతి, కృష్ణవేణి, దుర్గ, పున్నమి ఘాట్లు, పవిత్రసంగమం వద్ద 85 శాతం మంది యాత్రీకులు పవిత్ర స్నానాలు ఆచరిస్తారని అధికారులు అంచనావేశారు. ఈ ప్రాంతాల్లో యాత్రికులకు అసౌకర్యం కలగకుండా సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. 3 చోట్ల అక్షయపాత్ర వంటశాలలు పుష్కర విధుల్లో పాల్గొనే 60 వేల మంది ఉద్యోగులకు అక్షయపాత్ర సంస్థ ద్వారా భోజన సదుపాయం కల్పించేందుకు నిర్ణయించామని కలెక్టర్ చెప్పారు. ఆయా శాఖలు సిబ్బంది భోజన వసతి కోసం ఇచ్చే నిధులను అక్షయపాత్ర సంస్థకు కేటాయించాల్సి ఉందని కలెక్టర్ తెలిపారు. విజయాడలో మూడు ప్రాంతాల్లో అక్షయపాత్ర సంస్థ వంట శాలలు ఏర్పాటు చేసి ఐదు లక్షల మందికి ఆహారం అందించేందుకు చర్యలు తీసుకుంటోందన్నారు. ఉద్యోగులు పుష్కర విధులు నిర్వహించే చోటే ఆహారాన్ని పంపిణీ చేస్తామని కలెక్టర్ చెప్పారు. పుష్కర కాల్‌సెంటర్లు పుష్కరాల కోసం ప్రత్యేకంగా కాల్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ బాబు.ఎ తెలిపారు. పుష్కర సమాచారం, వివిధ హోదాల్లో ఉన్న ముఖ్యుల (వీఐపీ) పర్యటనలను ముందుగానే తెలుసుకుని, సాధారణ యాత్రికులకు అసౌకర్యం కలగకుండా, ముఖ్యులకు ఏర్పాట్లు చేసేందుకు వీలుగా ఇవి పనిచేస్తాయని చెప్పారు. 10 మంది ఉద్యోగులు నిరంతరం ఈ కాల్ సెంటర్లలో విధులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు, జిల్లా అధికారులు పలువురు పాల్గొన్నారు. -
హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు
విజయవాడలో రహదారుల విస్తరణ కోసం ప్రభుత్వం ఏకపక్షంగా ఆలయాలను ధ్వంసం చేయడం రాష్ట్రానికే అరిష్టమని శ్రీభువనేశ్వరీ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సత్యానందభారతీస్వామి పేర్కొన్నారు. ఆదివారం ఆయన కృష్ణాజిల్లా గన్నవరంలో విలేకరులతో మాట్లాడారు. హిందూవుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం విజయవాడలో రాత్రికి రాత్రే 30కి పైగ దేవాలయాలను కూల్చివేయడం దారుణమన్నారు. కనీసం పండితులు, హిందూ ధార్మిక సంస్థలను కూడా సంప్రదించకుండా చేస్తున్న విధ్వంసం కారణంగా అరిష్టాలు జరుగుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కృష్ణా పుష్కరాల కోసం ప్రభుత్వం ఇంత పెద్దఎత్తునప్రచారం, ఆర్భాటం చేయాల్సిన అవసరం లేదని చెప్పారు. గోదావరి పుష్కరాలకు కూడా ఇదే విధంగా చేసిన కారణంగా తొక్కిసలాటలో ఎంతోమంది భక్తులు మృతి చెందారని గుర్తుచేశారు. -
కృష్ణా పుష్కరాల్లో వీఐపీ ఘాట్లు లేవు!
విజయవాడ సెంట్రల్ : కృష్ణా పుష్కరాల్లో వీఐపీ ఘాట్లు లేవని, ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అందరిలానే స్నానం చేస్తారని నగరపాలక సంస్థ కమిషనర్ జి.వీరపాండియన్ తెలిపారు. గోదావరి పుష్కరాల తరహాలో ఇప్పుడు కూడా కార్పొరేటర్లకు వీఐపీ పాస్‌లు మంజూరు చేయాల్సిందిగా టీడీపీ సభ్యులు ముప్పా వెంకటేశ్వరరావు, చెన్నుపాటి గాంధీ కోరారు. దీనిపై కమిషనర్ తీవ్రంగా స్పందించారు. పుష్కరాలకు వీఐపీ ఘాట్లు ఏర్పాటు చేయడం లేదన్నారు. చివరి నిమిషంలో వీఐపీ ఘాట్లు ఏర్పాటు చేస్తే కార్పొరేటర్లకు పాస్‌లు మంజూరు చేయాల్సిందిగా మేయర్ కోనేరు శ్రీధర్ కోరారు. రోజుకు 50 లక్షల మంది స్నానం.. ప్రకాశం బ్యారేజ్ నుంచి వీటీపీఎస్ కెనాల్ వరకు, సీతమ్మవారి పాదాల నుంచి కృష్ణలంక వరకు 4 కి.మీ మేర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఒక్కో కిలోమీటర్లో రోజుకు 6 లక్షల మంది చొప్పున 24 లక్షల మంది పుణ్యస్నానాలు ఆచరిస్తారన్నారు. చిన్న పెద్ద ఘాట్లు మొత్తం కలిపి 92 ఉన్నాయని, రోజుకు 50 లక్షల మంది స్నానాలు ఆచరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. భక్తులు ముందుగా పుష్కర నగర్‌లకు చేరుకోవాలని సూచించారు. అక్కడ వారికి కావాల్సిన వసతి, భోజన సదుపాయాలను ఏర్పాటు చేస్తారన్నారు. పుష్కర నగర్లలో బస్, రైల్వే టిక్కెట్ విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పండిట్ నెహ్రూ బస్టాండ్, సిద్ధార్థ మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలల్లో శాటిలైట్ బస్స్టాండ్లు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. పుష్కర విధుల్లో సుమారు 25 వేల మంది కార్మికులు, ఉద్యోగులు పాల్గోనున్నట్లు తెలిపారు. నగరపాలక సంస్థ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్ళు, ప్రైవేటు పాఠశాలల్లో వీరికి భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రకాశం బ్యారేజ్ దిగువ ప్రాంతంలో నీటి సమస్యను ఎలా అధిగమిస్తారని టీడీపీ సభ్యుడు ముప్పా వెంకటేశ్వరరావు ప్రశ్నించగా పట్టిసీమ నీళ్లను తరలిస్తున్నట్లు కమిషనర్ వివరణ ఇచ్చారు. సాధారణ నిధులు వాడటం లేదు.. కృష్ణా పుష్కరాలకు సాధారణ నిధులు వినియోగించడం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. వైఎఎస్సార్సీపీ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల నిధుల వినియోగం అంశాన్ని ప్రస్తావించగా ఆయనపై విధంగా సమాధానమిచ్చారు. రూ.145 కోట్ల మంజూరుకు సంబంధించి ప్రభుత్వం పరిపాలనా అనుమతిల్ని మంజూరు చేసిందన్నారు. మరో రూ.39 కోట్లు విడుదల కావాల్సి ఉందన్నారు. -
కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు
50 జతల రైళ్లు అదనంగా నడిపే యోచనలో ఈ.కో. రైల్వే తాకిడిని బట్టి మరికొన్ని... పట్టాలెక్కనున్న డబుల్ డెక్కర్ ? ప్లాట్‌ఫాంలపై అదనపు సహాయక, విచారణ కేంద్రాలు సివిల్ డిఫెన్స్, జీఆర్పీ, ఆర్పీఎఫ్కి అదనపు సిబ్బంది గోదావరి పుష్కరాలతో పోలిస్తే.. ప్రయాణికుల సంఖ్య తగ్గొచ్చని అంచనా... తాటిచెట్ల పాలెం(విశాఖ) : పవిత్ర కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక రైళ్లు కూతపెట్టనున్నాయి. ఆగస్టు 12 నుంచి 23 వరకూ జరిగే ఈ పుష్కరాలకు 50 జతల రైళ్లు నడిపే యోచనలో ఈస్టుకోస్టు రైల్వే కార్యాచరణను సిద్ధం చేస్తోంది. విశాఖ నుంచి ఇటు భువనేశ్వర్, అటు విజయవాడ మీదుగా ప్రస్తుతం 97 జతల రైళ్లు నడుస్తుండగా, అందులో 37 రైళ్లు విజయవాడ మీదుగా రాకపోకలు సాగిస్తున్నాయి. రద్దీలేని సమయాల్లో నిత్యం 5 వేలు, పండగ సమయాల్లో 15 నుంచి 20 వేల మంది విజయవాడ వైపు ప్రయాణం సాగిస్తున్నారు. పుష్కరాల సమయంలో ఆ సంఖ్య 40 వేలకు చేరే అవకాశాలున్నందున ప్రత్యేక రైళ్ల విషయంలో రైల్వే అధికారులు సమాయత్తమవుతున్నారు. గోదావరి పుష్కరాల ఆదాయం: రూ.5.2 కోట్లు గతేడాది జూలైలో జరిగిన గోదావరి మహా పుష్కరాలకు విశాఖ మీదుగా పరుగుతీసిన 168 రైళ్లలో 6.1 లక్షల మంది ప్రయాణం సాగించగా ఈ.కో.రైల్వేకు రూ.5.2 కోట్ల ఆదాయం వచ్చింది. కృషా ్ణపుష్కరాల విషయంలో ఆ ఆదాయం తగ్గేసూచనలు ఉన్నట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. పుష్కర సమయంలో టికెట్ ధరపై మేళా చార్జీని 5 శాతం అదనంగా కలుపుతారు. గోదావరి వర్సెస్ కృష్ణా! రాజమండ్రి స్టేషన్లో మొత్తం 5 ప్లాట్‌ఫాంలున్నాయి. ఈ నేపథ్యంలో ఇటు నుంచి వెళ్లే రైళ్లు అక్కడి నుంచి తిరుగు ప్రయాణమవ్వడానికి 2 గంటల అదనపు సమయం పట్టేది. విజయవాడలో మొత్తం 10 ప్లాట్‌ఫాంలున్నాయి కనుక.. విశాఖ నుంచి వెళ్లే రైళ్లు త్వరితగతిన తిరిగివచ్చే సూచనలున్నాయి. రైళ్లరాక పోకల విషయంలో ఇబ్బందులెదురయ్యే అవకాశమే ఉండదని రైల్వే వర్గాలు భావిస్తున్నాయి. పట్టాలెక్కనున్న డబుల్ డెక్కర్? ఇప్పటికే విశాఖ రైల్వేస్టేషన్లో ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకున్న డబుల్ డెక్కర్ కృష్ణా పుష్కరాలకు పట్టాలెక్కే సూచనలు కన్పిస్తున్నాయి. రైల్వే బోర్డు అనుమతే తరువాయి.. టికెట్ధర దాదాపు ఖరారైనట్టు కనిపిస్తోంది. రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ ఏసీ చైర్‌కార్ టికెట్ ధర రూ.535 కాగా, డబుల్ డెక్కర్ రైలుకూ అదే ఫేర్ ఉంటుందని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. పుష్కర ఏర్పాట్లు ఇవీ... 1, 8 నంబరు ప్లాట్‌ఫాంలపై అదనంగా 5 చొప్పున సహాయక్ బూత్, ఎంక్వైరీ, టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేయనున్నారు.సివిల్ డిఫెన్స్, స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రయాణికులకు గైడ్ చేయనున్నారు. పలు డివిజన్ల నుంచి కమర్షియల్ సిబ్బందితోపాటు, ఆర్పీఎఫ్, జీఆర్పీ అదనపు సిబ్బందిని నియమించనున్నారు.టోల్ ఫ్రీ నంబర్లతో పాటు హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులో ఉంచనున్నారు. ఫ్లెక్సీల రూపంలో 139, 138, 183 నంబర్ల సహాయక అవసరాలను ప్రదర్శించనున్నారు. -
ఏరియల్ సర్వే
► హెలికాప్టర్ నుంచి పుష్కరఘాట్లను ► పరిశీలించిన అదనపు డీజీపీ, ఉన్నతాధికారులు ► జూరాల నుంచి నాగార్జున్‌సాగర్ వరకు పర్యటన ► సర్వేలో పాల్గొన్న కలెక్టర్, ఎస్పీ ► పుష్కరాల ఏర్పాట్లు చకచకా ► పూర్తిచేయాలని కోరిన డీజీపీ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జిల్లాలో తొలిసారిగా నిర్వహించనున్న కృష్ణా పుష్కరాల నిర్వహణ కోసం ఏర్పాటుచేస్తున్న ఘాట్లను రాష్ట్ర అదనపు డీజీపీ(లాఅండ్ ఆర్డర్) అంజన్‌కుమార్, హైదరాబాద్ రీజియన్ ఐజీ నాగిరెడ్డి, హైదరాబాద్ రేంజ్ డీఐజీ అకున్ సబర్వాల్, కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎస్పీ రెమా రాజేశ్వరి గురువారంకృష్ణా పరీవాహక ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేశారు. మొదట హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చిన డీజీపీ నేరుగా జూరాల ప్రాజెక్టు మీదుగా బీచుపల్లి, అలంపూర్, సోమశిల తదితర ఘాట్లను పరిశీలించుకుంటూ నాగార్జున్‌సాగర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా పాలమూరు జిల్లాలో కృష్ణా పుష్కరాల కోసం ఏర్పాటుచేసిన 32 ఘాట్లమ్యాప్ను అదనపు డీజీపీ స్వయంగా పరిశీలిస్తూ.. హెలిక్యాప్టర్ నుంచి ఆయా ఘాట్లను క్షుణ్ణంగా పరిశీలించారు. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న ఘాట్ల వివరాలు తీసుకుని త్వరగా పూర్తిచేయాల్సిందిగా కలెక్టర్‌ను కోరినట్లు సమాచారం. జిల్లాలో కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12 నుంచి 23వ తేదీ వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో పోలీసుశాఖ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్పీ వద్ద చర్చించినట్లు తెలిసింది. కేవలం పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఆటంకాలు కలుగకుండా శాఖపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ పరంగా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పార్కింగ్ కోసం అనువైన స్థలాలు సేకరించాలని సూచించారు. జాతీయ రహదారిపై ఉన్న బీచుపల్లి పుష్కరఘాట్‌కు కిలోమీటర్ దూరంలో వాహనాలు మొత్తం నిలిపివేయాలని కేవలం వీఐపీ తప్ప ఇతర వాహనాలకు లోపలికి అనుమతి లేకుండా అవసరమైన ప్రణాళిక ఏర్పాటుచేయాలని ఆదేశించినట్లు తెలిసింది. బందోబస్తుపరంగా జిల్లా పోలీసుశాఖ నుంచి పూర్తిస్థాయిలో నివేదిక తయారుచేయాలని అదనపు డీజీపీ జిల్లా ఎస్పీ రెమా రాజేశ్వరిని కోరినట్లు సమాచారం. వారి వెంట ఇరిగేషన్ శాఖ అధికారులు ఉన్నారు. -
పుష్కర పనుల టెండ‘రింగ్’
ప్రజారోగ్యశాఖలో రూ.21.71 కోట్లతో టెండర్లు బినామీ పేర్లతో టీడీపీ ప్రజాప్రతినిధుల మాయాజాలం చక్రం తిప్పిన ఇద్దరు మహిళా కార్పొరేటర్లు, బ్రోకర్ అధికారి చాంబర్లోనే బేరసారాలు కృష్ణా పుష్కరాల్లో పారిశుధ్య పనులకు టీడీపీ ప్రజాప్రతినిధులు టెండ ‘రింగ్’ పెట్టారు. రూ.21.71 కోట్ల రూపాయల పనుల్ని బినామీ పేర్లతో ఎగరేసు పోయేందుకు పక్కా స్కెచ్ వేశారు. బయటి కాంట్రాక్టర్లకు చాన్స్ ఇవ్వకుండా రింగ్ చేశారు.ఇద్దరు మహిళా కార్పొరేటర్లు, ఒక బ్రోకర్ చక్రం తిప్పుతున్నారనే విమర్శలు వెల్లువె త్తుతున్నాయి. ముఖ్య అధికారి వారి కనుసన్నల్లో పాలన సాగించడం పలు అనుమానాలకు తావిస్తోంది. విజయవాడ సెంట్రల్ : పుష్కర పనులు టీడీపీ ప్రజాప్రతినిధులకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. అధికార దర్పంతో అడ్డగోలు దోపిడీకి తెగబడుతున్నారు. టీడీపీకి చెందిన ఇద్దరు మహిళా కార్పొరేటర్లు, ఒక బ్రోకర్ కలిసి ప్రజారోగ్య శాఖలో దందా చలాయిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. కోట్ల విలువైన టెండర్లను బినామీ పేర్లతో దక్కించుకున్నారని సమాచారం. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో పకడ్బందీగా శానిటేషన్ పనుల్ని చేపట్టేందుకు ప్రజారోగ్య శాఖ కు రూ.21.70 కోట్లు కేటాయించారు. ఫినాయిల్, కర్రలు, చీపుర్లు, మందులు కొనుగోలు చేయడంతోపాటు 15 వేల మంది తాత్కాలిక సిబ్బంది నియామకం, మలేరియా నివారణ చర్యలు, కోతులు, కుక్కలు, పందుల్ని పట్టడం తదితర పనులు చేపట్టాలని నిర్ణయించారు. 61 ప్యాకేజీలుగా విభజించి ఈ మేరకు ఈ నెల తొమ్మిదో తేదీన టెండర్లు పిలిచారు. 37 ప్యాకేజీలకు సంబంధించి టెండర్లు దాఖలయ్యాయి. పదో తేదీన వీటిని పరిశీలించిన ప్రజారోగ్యశాఖ అధికారులు తుది ఆమోదం కోసం కమిషనర్ టేబుల్‌పైకి పంపారు. టెండ‘రింగ్’ టెండర్లను దక్కించుకొనేందుకు టీడీపీ ప్రజాప్రతినిధులు బ్రోకర్‌తో కలిసి హైడ్రామా నడిపారు. టెండర్ల నిర్వహణకు సంబంధించి ప్రజారోగ్యశాఖ అధికారి ముందుగా కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించారు. అందులో 80 శాతం మంది బ్రోకర్ మనుషులే అని తెలుస్తోంది. టెండర్లు దాఖలు చేసే సమయంలో సైతం బ్రోకర్ హల్చల్ చేశాడని పలువురు కాంట్రాక్టర్లు వాపోతున్నారు. టెండర్లు వేయకుండా తమను అడ్డుకున్నారని, తమ మాట విన్న వారిని రింగ్ చేసి టెండర్లు దాఖలు చేయించారని బాధిత కాంట్రాక్టర్లు చెబుతున్నారు. గతంలో బ్రోకర్ ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో హవా చలాయించేవాడని, అంగన్వాడీ ఉద్యోగం ఇప్పిస్తానని ఒక మహిళ వద్ద రూ.10 వేలు వసూలు చేయడంపై వివాదమూ ఉందని తెలిసింది. ఈ ఘటన తరువాత ఎంపీ దూరంగా పెట్టడంతో ఇద్దరు మహిళా కార్పొరేటర్లతో కలిసి ప్రజారోగ్య శాఖలో దందా చలాయిస్తున్నట్లు సమాచారం. శానిటరీ ఇన్స్పెక్టర్ల డివిజన్ల మార్పులు, చేర్పులతో భారీ డీల్స్ చేస్తున్నాడని భోగట్టా. ముఖ్య అధికారి చాంబర్లో మహిళా కార్పొరేటర్లతో కలిసి తిష్ట వేసి బేరసారాలు సాగించడం కార్పొరేషన్లో హాట్ టాపిక్‌గా మారింది. వీరితో అధికారి సుదీర్ఘ సమావేశం కారణంగా వివిధ పనులపై లోనికి వెళ్లలేకపోతున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. అధికారి బర్త్‌డే వేడుకల్ని ఇటీవల బ్రోకర్ ఘనంగా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. లెస్ టెండర్ల మాయాజాలం పుష్కరాల్లో పారిశుధ్య విధులు నిర్వహించేందుకు 15 వేల మంది తాత్కాలిక కార్మికుల్ని నియమించాలని నిర్ణయించారు. వీరికి రోజుకు రూ.425 చొప్పున ఇచ్చే విధంగా టెండర్లో అధికారులు పొందుపరిచారు. రింగ్ అయిన కాంట్రాక్టర్లు రూ.403 నుంచి రూ.424 వరకు ధరను కోట్ చేసినట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. లెస్ టెండర్లుగా బయటకు కనిపిస్తున్న వీటి వెనుక పెద్ద మాయాజాలమే దాగుంది. ప్రజారోగ్య శాఖలో ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న కార్మికులకు రోజుకు రూ.365 చొప్పున చెల్లిస్తున్నారు. తాత్కాలిక కార్మికులకు మాత్రం రూ.425 ధర నిర్ణయించారు. ఇందుకు ఒక రూపాయి అటు ఇటుగా టెండర్లను ఓకే చేస్తారు. తాత్కాలిక కార్మికులకు కాంట్రాక్టర్ నిర్ణయించిన ధర మాత్రమే చెల్లిస్తాడు. అదనపు ధర కాంట్రాక్టర్ల లబ్ధి కోసమే అన్న విషయం స్పష్టమవుతోంది. ప్రస్తుతం 7,500 మంది కార్మికుల్ని సరఫరా చేసేందుకు టీడీపీ అండ్ కో టెండరేసింది. ఇవి ఓకే అయితే భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలన్నది వారి వ్యూహంగా తెలుస్తోంది. ప్రజారోగ్యశాఖలో అవినీతి కంపుపై కమిషనర్ దృష్టి సారిస్తే మరిన్ని నిజాలు వెలుగు చూసే అవకాశముంది. బయటి విషయాలు అనవసరం పుష్కర పనులకు సంబంధించి లెస్ టెండర్లే వచ్చాయి. కాంట్రాక్టర్లు రింగ్ అయిన విషయం నాకు తెలియదు. బయట జరిగే విషయాలు నాకు అనవసరం. మొత్తం 61 ప్యాకేజీల్లో 19 ప్యాకేజీలకు సంబంధించి టెండర్లు దాఖలు కాలేదు. మరోసారి పిలిచాం. గోదావరి పుష్కరాల్లో అప్సెట్ వ్యాల్యూ ఆధారంగానే టెండర్లు పిలిచాం. ప్రస్తుతం కమిషనర్ పరిశీలనలో ఉన్నాయి. - ఎం.గోపీనాయక్, చీఫ్ మెడికల్ ఆఫీసర్, నగరపాలక సంస్థ -
సా...గుతున్న పనులు
ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయలోపం ఇప్పటికి పూర్తయిన పుష్కర పనులు 30 శాతమే.. కాంట్రాక్టర్లకు తాఖీదులు ఇవ్వనున్న అధికారులు చేపా.. చేపా.. ఎందుకు ఎండలేదే అంటే గడ్డిమోపు అడ్డొచ్చింది.. అన్న కథను గుర్తుకు తెచ్చేలా విజయవాడ నగరంలో కృష్ణాపుష్కరాల పనులు కొనసా...గుతున్నాయి. రూ.98 కోట్లతో చేపట్టిన రోడ్ల విస్తరణ, అభివృద్ధి పనులు నత్తకే నడక నేర్పుతున్నాయి. వానలు ముంచుకు రావడంతో అసలు ఈ పనులు పూర్తవుతాయా అన్న అనుమానం వ్యక్తమవుతోంది. విజయవాడ సెంట్రల్ : పుష్కరాల అభివృద్ధి పనులు మూడడుగులు ముందుకు ఏడడుగులు వెనక్కు నడుస్తున్నాయి. ఈనెలాఖరుకు పనులు పూర్తి చేయాలనేది లక్ష్యం కాగా ఇప్పటి వరకు 30 శాతం మాత్రమే పూర్తయ్యాయి. షెడ్యూల్ ప్రకారం పనులు పూర్తి చేయని కాంట్రాక్టర్ల నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు. కృష్ణా పుష్కరాల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నం కాకుండా ఉండేందుకు మూడు సర్కిళ్ల పరిధిలో 55 రోడ్లను రూ.98 కోట్లతో విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. 14 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. రెండు నెలల క్రితం ప్రారంభమైన పనులు ముందుకు కదలడం లేదు. పుష్కరాలకు ముహూర్తం ముంచుకొస్తుండటంతో అధికారుల్లో హైరానా మొదలైంది. సమన్వయలోపం ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగానే పనులు చురుగ్గా సాగడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ట్రాన్స్ కో అధికారులు ఆయా స్థలాల్లోని విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను తొలగించకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో రోడ్డు పనులు సాగడం లేదు. విద్యుత్‌స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను తొలగించి ఇస్తే కానీ పనులు చేయలేమని కొందరు కాంట్రాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. నగరపాలక సంస్థ ఇంజి నీరింగ్ అధికారులు పలుమార్లు ట్రాన్స్‌కో అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినప్పటికీ స్పందించడం లేదు. కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణదారులు, స్థల యజమానులు కోర్టు నుంచి స్టే తెస్తుండటంతో తొలగింపు ప్రక్రియకు బ్రేక్ పడుతోంది. చెట్లు తొలగించిన తరువాత వాటి తరలింపు సకాలంలో జరక్కపోవడంతో రోజుల తరబడి పనులు నిలిచిపోతున్నాయి. సబ్‌లీజులు పుష్కర పనులను 14 ప్యాకేజీలుగా విభజించగా బడా కాంట్రాక్టర్లు దక్కించుకున్నారు. వీరిలో కొందరు సొంతంగా ప్రారంభించగా, మరికొందరు సబ్‌లీజ్‌కు చిన్న కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ పనులకు సంబంధించి నిధులను ప్రభుత్వం ఇంకా విడుదల చేయకపోవడంతో చిన్న కాంట్రాక్టర్లు సందేహంలో పడ్డారు. హడావుడిగా పూర్తి చేశాక డబ్బులు రాకుంటే అడ్డంగా బుక్కైపోతామన్న భయం వారిని వెంటాడుతోంది. ఈక్రమంలో పనులు చేయాలా వద్దా అన్న డైలమాలో పడ్డారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో పనులు ఇంకా ప్రారంభదశలోనే ఉన్నాయి. తాఖీదులు సిద్ధం కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశాల మేరకు పనులు చేయడంలో వెనకబడ్డ కాంట్రాక్టర్లకు తాఖీదులు ఇచ్చేందుకు ఇంజినీరింగ్ అధికారులు సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా నోటీసులు ఇచ్చి వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేయాలని భావిస్తున్నారు. సర్కిల్ -3 పరిధిలో పనులు చేపట్టిన వీఎస్ ఇంజినీరింగ్స్తో పాటు మరో ఇద్దరు కాంట్రాక్టర్ల పనితీరుపై కమిషనర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. -
ఇళ్లపై నల్లజెండాలతో నిరసన
- పుష్కరాల నిధులు కేటాయించలేదని ఆగ్రహం పగిడ్యాల కర్నూలు జిల్ల పగిడ్యాల మండలం పాతముత్తుమర్రి, కొత్తముత్తుమర్రి, కొత్త ఎల్చాల, పడమర వనములపాడు గ్రామస్థులు కృష్ణా నది పుష్కరాలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. కృష్ణా పుష్కరాల్లో భాగంగా నదీ తీర ప్రాంతంలోని తమ గ్రామాలకు నిధులు కేటాయించకపోవడాన్ని నిరసిస్తూ వారు సోమవారం నల్లజెండాలతో నిరసన తెలిపారు. గ్రామంలోని ప్రతీ ఇంటిపై నల్లజెండా ఎగురవేశారు. విద్యుత్ స్తంభాలకు, చెట్లకు కూడా నల్లజెండాలను కట్టారు. నంది కొట్కూరు నియోజకవర్గం పరిధిలో కృష్ణా నది పుష్కరాల సందర్భంగా రోడ్లు, ఆలయాల అభివృద్ధి ఇతర పనులకు ప్రభుత్వం రూ.60కోట్లు కేటాయించగా, అందులో రూ.7 కోట్లు పగిడ్యాల మండలానికి కేటాయించారు. తమ గ్రామాలకు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయకపోవడంతో స్థానికుల్లో ఆగ్రహానికి దారి తీసింది. దీంతో రాయలసీమ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు బైరైడ్డి రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తమ గ్రామాల్లో దేవాలయాలు లేవా? అని వారు ప్రశ్నించారు. దీనిపై కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. -
చోటెక్కడ..!
పుష్కరనగర్ల ఏర్పాటుకు కరువైన ప్రభుత్వ స్థలాలు ప్రైవేటు స్థలాల కోసం అధికారుల అన్వేషణ రెండు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా అమరావతి : కృష్ణా పుష్కరాలు అనగానే గుర్తొచ్చేది విజయవాడ నగరమే. కృష్ణా నదిలో స్నానాలు ఆచరించి కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఇక్కడికే తరలివస్తారు. ఈ ఏడాది పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం భావిస్తోంది. గోదావరి పుష్కరాల తొలిరోజు జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మరణించారు. ఈ నేపథ్యంలో కృష్ణాపుష్కరాల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా భక్తుల రాకపోకలకు, వసతికి అనుకూలంగా పుష్కర నగర్లను ఏర్పాటు చేయాలని భావించింది. అయితే పుష్కరనగర్లు ఏర్పాటు చేసేందుకు విజయవాడలో ప్రభుత్వ స్థలాలు కరువయ్యాయి. దీంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. స్థలాల కోసం అన్వేషణ ప్రారంభించారు. 2 కోట్ల మంది వస్తారని అంచనా పన్నెండేళ్లకోసారి వచ్చే కృష్ణాపుష్కరాలు గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఆగస్టు 12 నుంచి ప్రారంభం కానున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి లక్షల మంది భక్తులు తరలిరానున్నారు. గత కృష్ణాపుష్కరాలకు 1.30 కోట్ల మంది భక్తులు విజ యవాడ తరలివచ్చి పుణ్యస్నానాలు చేశారని అధికారులు పేర్కొంటున్నారు. ఈ సారి పుష్కరాలకు రెండు కోట్ల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం విజయవాడలో 15 నుంచి 20 వరకు పుష్కర నగర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటి కోసం విజయవాడ నగరపాలక సంస్థ రూ.40 కోట్లు కేటాయించింది. నలుదిక్కుల నుంచి.... కృష్ణా పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి రానున్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ యాజమాన్యం 1500 బస్సులు నడపాలని భావిస్తోంది. అన్ని పుష్కరనగర్ల నుంచి ఘాట్ వరకు ఉచితంగా బస్సులు నడిపేందుకు చర్యలు చేపట్టింది. హైదరాబాద్ వైపు నుంచి వచ్చే వాహనాలు ఇబ్రహీంపట్నం మీదుగా విజయవాడలోకి ప్రవేశిస్తాయి. రాజమండ్రి, విశాఖపట్నం, ఏలూరు, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ నుంచి వచ్చే భక్తులు రామవరప్పాడు మీదుగా, తెలంగాణ, ఛత్తీస్ఘట్లోని కొన్ని ప్రాంతాల నుంచి మైలవరం, తిరువూరు, నూజివీడు మీదుగా విజయవాడుకు చేరుకుంటాయి. చెన్నై, రాయలసీమ, ప్రకాశం, గుంటూరు నుంచి వచ్చే వాహనాలు తాడేపల్లి మీదుగా నగరానికి చేరతాయి. లక్షలాదిగా వచ్చే భక్తుల కోసం ఆయా మార్గాల్లోనే పుష్కర నగర్లు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. పుష్కరఘాట్‌కు రెండు కిలోమీటర్ల దూరంలోనే వీటిని ఏర్పాటు చేస్తారు. సుమారు ఐదు వేల మంది భక్తులు వసతి పొందేలా ఒక్కొక్క పుష్కరనగర్ ఏర్పాటు చేయాలని నిర్ణయిం చారు. ఒక్కొక్క దానికి సుమారు రెండు నుంచి మూడు ఎకరాల స్థలం అవసరమని అంచనా. ఇబ్రహీంపట్నం, గొల్లపూడి, రామవరప్పాడు, సిద్ధార్థ కళాశాల ప్రాంతంలో వీటిని ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఎక్కడా ప్రభుత్వ స్థలాలు లేవు. ఒకవేళ ఉన్నా వాటి విస్తీర్ణం పుష్కరనగర్ ఏర్పాటుకు చాలదు. ప్రభుత్వ స్థలాలు కరువవడంతో ప్రైవేటు స్థలాల కోసం అధికారులు అన్వేషిస్తున్నారు. ప్రైవేటు స్థలాలు కూడా అందుబాటులో లేకపోవడం, ఉన్న చోట్ల ఎక్కువ మొత్తంలో యజమానులు అద్దె డిమాండ్ చేస్తుండటంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
ఎంత ఖర్చయినా వెనక్కు తగ్గం
కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తాం: హరీశ్ సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి 23 వరకు జరగనున్న కృష్ణా పుష్కరాలకు ఎంత ఖర్చయినా వెనక్కు తగ్గేది లేదని భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఒక్క భక్తునికి కూడా ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. గురువారం మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ఆయన నాగార్జునసాగర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా సాగర్‌లో మూడు చోట్ల పుష్కరఘాట్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గోదావరి పుష్కరాల నిర్వహణలో తెలంగాణకు దేశంలోనే మంచి పేరు వచ్చిందని, అదే రీతిలో కృష్ణా పుష్కరాలను ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు. నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో 86 పుష్కర ఘాట్లను 4,852 మీటర్ల వెడల్పుతో నిర్మిస్తామని, పుష్కరాల కోసం రూ. 212 కోట్లు కేటాయించామని చెప్పారు. పుష్కరాల ప్రారంభానికి కేవలం రెండున్నర నెలలు మాత్రమే సమయం ఉన్నందున పనులను వేగవంతం చేయాలని ఆదేశాలిచ్చినట్టు తెలిపారు. వర్షాకాలంలో పుష్కరాలు జరగనున్నందున కృష్ణా నదిలో ఎన్ని నీళ్లు వచ్చినా ఇబ్బంది లేకుండా ఘాట్లను నిర్మిస్తామన్నారు. ఈ పర్యటనలో నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ బాలూనాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, కలెక్టర్ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. -
సాగర సంగమంపై ప్రత్యేక దృష్టి
కోడూరు : ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతున్న పవిత్ర కృష్ణా సాగరసంగమ ప్రాంతంపై జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి, కృష్ణా పుష్కరాలకు తీర్చిదిద్దాలని కలెక్టర్ బాబు.ఎ అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ అధికారులతో కలిసి సంగమ ప్రాంతాన్ని పరిశీలించారు. కృష్ణా పుష్కరాలకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులు సంగమ అందాలు తిలకించి, పుణ్యస్నానాలు ఆచరించేందుకు సదుపాయాల కల్పనపై ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. విజయవాడలోని దుర్గా ఘాట్ తరువాత భక్తుల తాకిడి సంగమ ప్రాంతానికే ఉంటుందని, దీనిని దృష్టిలో పెట్టుకొని అధికారులు పని చేయాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ‘సాగరసంగమం’ పేరుతో ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసేందుకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడనున్నట్లు చెప్పారు. పాలకాయతిప్ప కరకట్ట దగ్గర నుంచి సముద్రం వద్ద ఉన్న డాల్ఫిన్ భవనం వరకు రహదారి విస్తరణ చేయాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. రహదారి మార్గంమధ్యలో ఉన్న వంతెనను మరింత పెద్దగా నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సముద్రం వద్ద నుంచి సంగమ ప్రాంతం వరకు రూ.2 కోట్ల వ్యయంతో రహదారిని నాణ్యతతో నిర్మించాలని కలెక్టర్ ఆదేశించారు. సంగమంలో ఊహకందని లోతు ఉంటుందని, ప్రత్యేక బారికేడింగ్ ఏర్పాటు చేయాలని పంచాయతీరాజ్, రెవెన్యూ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సంగమం వరకు నూతన టెక్నాలజీని ఉపయోగించి విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులకు సూచించారు. మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయలు, శానిటేషన్‌పై అధికారులు ముందు నుంచే ప్రణాళిక సిద్ధం చేసి, తనకు పంపాలని కోరారు. పుష్కర నగర్.. సంగమం వద్ద ఏర్పాటుచేయనున్న పుష్కరనగర్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ అధికారులకు సూచిం చారు. తొలుత పాలకాయతిప్ప వద్ద రహదారి నిర్మాణ పనులను పరిశీలించారు. హంసలదీవిలోని శ్రీరుక్మిణీ సత్యభామ సమేత శ్రీవేణుగోపాలస్వామి ఆలయాన్ని సందర్శించారు. పండితుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అసిస్టెంట్ కలెక్టర్ సలోమి సూడాన్, ఎస్పీ విజయకుమార్, పీఆర్ ఎస్ఈ సూర్యనారాయణ, ఆర్అండ్బీ ఎస్ఈ శేషుకుమార్, ఈఈ మురళీకృష్ణ, విద్యుత్ డీఈ వెంకటేశ్వరరావు, ఆర్డీవో పి.సాయిబాబు, డీఎస్పీ షేక్ ఖాదర్‌భాషా, తహశీల్దార్ ఎం.వి.సత్యనారాయణ, ఎంపీడీవో గౌసియాబేగం, జెడ్పీటీసీ బండే శ్రీనివాసరావు, ఎంపీపీ మాచర్ల భీమయ్య, కేడీసీసీ బ్యాంక్డెరైక్టర్ ముద్దినేని చంద్రరరావు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వారధి నిర్మాణం పనులను వేగవంతం చేయాలి కదివిసీమ ప్రజలు మచిలీపట్నం చేరుకునేందుకు కృష్ణానదిపై నిర్మిస్తున్న ‘ఉల్లిపాలెం-భవానీపురం’ వారధి నిర్మాణం పనులు వేగవంతం చేసి, ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ బాబు.ఎ ఆర్అండ్బీ అధికారులు, నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. మంగళవారం వారధి నిర్మాణ ప్రాంతాన్ని అధికార యంత్రాంగంతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. కరకట్ట దగ్గర నుంచి నది వరకు జరుగుతున్న పనులను పరిశీలించారు. గాంట్రీ సహాయంతో పనులు నిర్వహించకుండా మట్టి తొల డంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కూలీల సంఖ్య పెంచి పనులు వేగవంతంగా పూర్తి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేయాలని కంపెనీ ప్రతినిధులకు సూచించారు. కలెక్టర్ అసంతృప్తి ఇప్పటి వరకు ఒక్క గడ్డర్ మాత్రమే పూర్తిచేయడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గాంట్రీ లాంచింగ్ సిస్టమ్‌ను ప్రారంభించకుండా పనులు ఎలా ముందుకు సాగుతాయని ఇంజినీర్లను ప్రశ్నించారు. వారధి నిర్మాణ విషయాలను ఎప్పటికప్పుడు తమకు పంపాలని ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. భవానీపురం వైపు జరుగుతున్న పనులను కంపెనీ ప్రతినిధులు కలెక్టర్‌కు వివరించారు. -
కృష్ణా పుష్కరాలకు ప్రత్యేక ప్రణాళిక
కమిషనర్ వీరపాండియన్ విజయవాడ సెంట్రల్ : కృష్ణా పుష్కరాలకు నగరంలో రోడ్లు అభివృద్ధి, గ్రీన్అండ్ బ్లూ ప్రాజెక్ట్‌ను పూర్తిచేసే విధంగా యాక్షన్ ప్లాన్ రూపొందించాలని కమిషనర్ జి.వీరపాండియన్ ఆదేశించారు. క్యాంప్ కార్యాలయంలో టౌన్‌ప్లానింగ్, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం శనివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నగరంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులకు సంబంధించి సమగ్ర నివేదికను సిద్ధం చేయాలని చెప్పారు. బందరు, ఏలూరు, రైవస్ కాలువలతో పాటు భవానీపురంలోని కృష్ణా రివర్‌ఫ్రంట్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని కోరారు. రహదారుల అభివృద్ధిలో భాగంగా సెంట్రల్ డివైడర్లు, ఫుట్‌పాత్‌లు, ట్రాఫిక్ ఐలాండ్‌ల్లో పచ్చదనాన్ని పెంపొందించే విధంగా ప్రణాళికలు రూపొందించాల్సిందిగా సూచించారు. రాజీవ్‌గాంధీ, కేఎల్ రావు, రాఘవయ్య, అంబేడ్కర్ పార్కులతో పాటు 35 ప్రాంతాల్లో 1,500 స్కేర్‌మీటర్ల విస్తీర్ణంలోని ఖాళీస్థలాలను పార్కులుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాల్సిందిగా చెప్పారు. ఇవి కాకుండా మరో 41 చిన్న పార్కులు కూడా అభివృద్ధి చేయాల్సిందిగా ఉద్యాన శాఖ అధికారులను కోరారు. చీఫ్ ఇంజినీర్ ఎంఏ షుకూర్, సిటీప్లానర్ ప్రదీప్‌కుమార్, ఈఈ ఎ.ఉదయ్‌కుమార్, ఉద్యాన శాఖ అధికారి జీపీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
యాదగిరీశుడి ఆదాయం 11.. వ్యయం 14
యాదగిరికొండ: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆదాయం 11, వ్యయం 14, అమ్మవారి ఆదాయం 11, వ్యయం 5గా పంచాంగ శ్రవణంలో సత్యనారాయణశర్మ సిద్ధాంతి వినిపించారు. ఉగాది పండగను పురస్కరించుకుని ఆలయంలో పంచాంగాన్ని దేవస్థానం చైర్మన్ నరసింహమూర్తి, ఈఓ గీతారెడ్డి ఆవిష్కరించారు. పంచాంగ శ్రవణంలో ఈ ఏడాది రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, పంటలు బాగా పండుతాయని, సకాలంలో వర్షాలు కురుస్తాయని సిద్ధాంతి పేర్కొన్నారు. స్వామి, అమ్మవార్ల ఆదాయం కన్నా వ్యయం ఎక్కువగా ఉంటుందనే భావన అవసరం లేదని, అమ్మవారితో స్వామి వారు కూడా ఉన్నందున ఆదాయ వ్యయాలలో సమాన భాగాలుగా ఉంటూ లోక కల్యాణం చేస్తారన్నారు. ఆహార ధాన్యాలు సరసమైన ధరలకు లభ్యమవుతాయన్నారు. కృష్ణా పుష్కరాల సమయంలో వివాహాది శుభ ముహూర్తాలు ఉండవన్నారు. -
కృష్ణా పుష్కరాలు
జ్యోతిష శాస్త్రం ప్రకారం పుష్కరం అంటే పన్నెండేళ్ల కాలం. దేవగురువు బృహస్పతి ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క సంవత్సరం చొప్పున సంచరిస్తూ ఉంటాడు. ఆయన ఏ రాశిలో సంచరిస్తాడో, అప్పుడు ఆ రాశికి సంబంధించిన నదికి పుష్కరాలు వస్తాయి. అంటే బృహస్పతి సింహరాశిలో ప్రవేశిస్తే గోదావరీ పుష్కరాలు, కన్యారాశిలోకి అడుగుపెట్టినప్పుడు కృష్ణానదికి, మకర రాశిలో ప్రవేశించినప్పుడు తుంగభద్రానదికీ పుష్కరాలు వస్తాయి. ఈ పవిత్ర పుష్కర సమయంలో స్నాన, దాన, జప, అర్చన, ధ్యాన, హోమ, తర్పణాది అనుష్ఠానాలకూ, పితృపిండ ప్రదానానికీ అక్షయమైన పుణ్యం లభిస్తుందని శాస్త్రోక్తి. పుష్కర కాలంలో చేసే ఆయా కర్మల వలన శారీరక, మానసిక మలినాలు తొలగి పవిత్రత, ఆధ్యాత్మిక తేజస్సు కలుగుతాయి. బంగారం, వెండి, భూమి, ధనం, గోవులు, ధాన్యం, లవణం, రత్నాలు, అశ్వం, పండ్లు, బెల్లం, వస్త్రాలు, తైలం, కూరగాయలు, తేనె, పీట, అన్నం, పుస్తకం ... ఇలా ఎవరి శక్తిని బట్టి వారు రోజుకు కొన్ని చొప్పున దానం చెయ్యడం వల్ల ఇహలోకంలో సుఖసంపదలు పొందడంతోపాటు అంత్యమున ముక్తి కలుగుతుందని రుషి ప్రమాణం. ఈ పన్నెండు రోజులు నదీస్నానాలు, దానధర్మాలు, పిండప్రదానాలు పుణ్యఫలాన్నిస్తాయి. కృష్ణానదికి 2016 ఆగస్టు 12 నుంచి పుష్కరాలు ప్రారంభమై 12 రోజుల పాటు కొనసాగుతాయి. ఈ కాలంలో కృష్ణలో స్నానాదులు, పూజలు, దానధ ర్మాలు, పితృదేవతలకు పిండప్రదానాలు చేస్తే పుణ్యఫలం కలుగుతుంది. పుష్కరాలలో నదీ స్నానం చేస్తే పన్నెండు సంవత్సరాలపాటు ఆ నదులలో నిత్యం స్నానం చేసినంత పుణ్య ఫలం లభిస్తుంది. జన్మజన్మల పాపాలూ నశించి, మోక్షప్రాప్తి కలుగుతుంది. ఏ నదికి పుష్కరాలు వస్తాయో ఆ నదిపేరును మనం స్నానం చేసేటప్పుడు ముమ్మారు మనస్సులో తలచుకున్నా కొంతమేర పుష్కర స్నానఫలితం పొందచ్చునని శాస్త్రవచనం. కృష్ణానది శ్రీమహావిష్ణువు శరీరం. శివుని అష్టమూర్తులలో ఒకటైన జలస్వరూపం. శివకేశవ స్వరూపం. మహాపాపాలను పోగొడుతుంది. కృష్ణానదీ విశేషం కృష్ణానది దక్షిణ భారతదేశంలోని ముఖ్యనదులలో ఒకటి. మహారాష్ట్రలోని సహ్యాద్రి పర్వతశ్రేణిలో మహాబలేశ్వరం వద్ద ఉద్భవించింది. మహాబలేశ్వర లింగం పైనుండి ప్రవహించి పెద్ద నదిగా మారింది. తుంగభద్ర, మూసీ, దిండి, పాలేరు, మున్నేరు ఉపనదులు. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల గుండా ప్రవహించి ఆంధ్రప్రదేశ్‌లోని హంసలదీవి మీదుగా ఏటిమొగ, ఎదురుమొండి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. కృష్ణానదీ తీర క్షేత్రాలు శ్రీశైలం: ఇక్కడ కృష్ణానది ఉత్తర వాహిని. ఇక్కడి స్వామివారు మల్లికార్జునుడు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. అమ్మవారు భ్రమరాంబ. శ్రీశైలం అష్టాదశ శక్తి పీఠాలలో ఒకటి. శ్రీశైలం పురాణ ప్రసిద్ధమైన శైవ క్షేత్రం.అమరారామం: దేవ రాజయిన అమరేశ్వరుడు ప్రతిష్ఠించడంచేత ఇక్కడి స్వామిని అమరేశ్వరస్వామి అని అంటారు. ఇక్కడి దేవికి బాల చాముండిక అనీ, రాజ్యలక్ష్మీదేవి అనీ పేర్లు. ఇది శక్తిపీఠాలలో ఒకటి. ఇక్కడి స్వామిని క్రౌంచనాథుడంటారు. అలంపురం: అమ్మవారు జోగులాంబ. స్వామి బాలబ్రహ్మేశ్వర స్వామి. అలంపురం అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటి. కృష్ణా, తుంగభద్రా నదుల సంగమ స్థానం. తుంగానది ‘బ్రహ్మ’ స్వరూపమని, భద్రానది ‘శివ’ స్వరూపమని, కృష్ణానదిని ‘విష్ణు’ స్వరూపమని చెబుతారు వేదాద్రి: కృష్ణా తీరంలోని ఆలయం. యోగానంద లక్ష్మీనరసింహస్వామి ఇక్కడి దైవం. జ్వాలానరసింహ, సాలగ్రామ నరసింహ, యోగానంద నరసింహ, వీర నరసింహ, చెంచులక్ష్మీ నరసింహులను పూజిస్తే, పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయని ప్రతీతి. వాడపల్లి: నృసింహస్వామి. మూసీ, కృష్ణానదుల సంగమస్థానం. ఇక్కడ స్వామి వారు ఊపిరి పీలుస్తూ వదులుతూ ఉన్నట్లుగా వారికెదురుగా ఉండే దీపం కదులుతుంటుంది. ఇక్కడున్న అగస్త్యేశ్వరస్వామి లింగరూపం నుంచి నీరు ఊరుతూ ఉంటుంది. చిలుమూరు - ఐలూరు: సీతారాములు అయోధ్యకు వెళ్తూ శివుని ప్రతిష్ఠింపదలచారు. శివలింగాన్ని తీసుకురావడం కోసం హనుమంతుని కాశీనగరానికి పంపారు. ముహూర్త సమయానికి హనుమంతుడు రాలేక పోవడంతో - సీతాదేవి ప్రతిష్ఠించిన శివలింగం. గంగాపార్వతీ సమేత రామలింగేశ్వరస్వామి సైకత (ఇసుక) లింగం, చిలుమూరు. హనుమంతుడు ముహూర్తం దాటిన తరువాత కాశీ నుండి శివలింగాన్ని తెచ్చాడు. అప్పటికే లింగప్రతిష్ఠ జరగడంతో బాధపడిన హనుమంతుడు దానిని నది ఆవలి ఒడ్డుకు వేయగా ఆ లింగం స్వయంగా ప్రతిష్ఠితమైంది. ఆ లింగమే రామలింగేశ్వరస్వామి - ఐలూరు. ఈ రెండు శివలింగాలూ పశ్చిమాభిముఖాలే. హనుమంతుడు ప్రతిష్ఠించిన స్వామివారి ఆలయానికి పక్కగా రఘునాయక ఆలయం ఉంది. చిలుమూరు గుంటూరు జిల్లాలో, ఐలూరు కృష్ణాజిల్లాలో ఉన్నాయి. శ్రీకాకుళం: ఆంధ్ర మహావిష్ణువు శ్రీకాకుళేశ్వరుడు. అమ్మవారు రాజ్యలక్ష్మీదేవి. స్వామికి వెనుకగా దశావతారాలు చెక్కిన శిల్పం ఉన్నది. ఆలయ గోపురం మిక్కిలి పెద్దది. ఇచటి స్వామివారికి 108 సాలగ్రామ శిలాహారముంది. ఏకరాత్ర మల్లికార్జునస్వామి: కృష్ణా తీరం. అమ్మవారు బాలాత్రిపుర సుందరి. ఆంధ్ర మహావిష్ణువు ఆలయం పక్కన ఉంది. కృష్ణకు ఉత్తర తీరాన ప్రతిష్ఠితం. కృతయుగం కన్నా ముందే నిర్మింపబడిందని విశ్వాసం. స్వర్ణమయ దేవాలయం. వరదలు వచ్చినా శిథిలం కాని ఆలయం. ఇక్కడున్న మర్రిచెట్టు ప్రాచీనమైనది. విజయవాడ: కృష్ణాతీరంలో ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ కొలువైన ఆలయం ఉంది. స్వామి పేరు మల్లేశ్వరస్వామి. అర్జునుడిక్కడ ప్రతిష్ఠించిన శివలింగం విజయేశ్వరస్వామి. హంసలదీవి: ఇక్కడి దేవుడు వేణుగోపాలస్వామి. కృష్ణాసాగర సంగమ స్థానం. అతి ప్రాచీనమైన ఆలయం మంగళగిరి: రాజ్యలక్ష్మీ నరసింహస్వామి. ధర్మరాజు ప్రతిష్ఠించాడు. గోపురం మిక్కిలి ఎత్తయినది. కొండపై పానకాల నరసింహస్వామివారి మూర్తి ఉంది. ఈ స్వామి మూర్తి నైఋతీ ముఖంగా ఉంటుంది. తోట్లవల్లూరు: మల్లికార్జునస్వామి, భ్రమరాంబ. నర్సోబావాడి: శ్రీదత్తాత్రేయస్వామి. కోరిన కోరికలు తీరతాయని నమ్మిక. కృష్ణా పంచగంగా సంగమం. మహారాష్ర్టలో ఉంది. మాహులీ: సంగమేశ్వరస్వామి. కృష్ణా-వేణీ నదీ సంగమం. కోల్ నృసింహ: షోడశ భుజ నృసింహ. కృష్ణా, కోయినా నదీ సంగమం కృష్ణానదిలో కలిసే చోటు. దీనిని పంచనదీ సంగమ క్షేత్రమని అంటారు. మహాబలేశ్వర్: ఇది పంచనదీ జన్మస్థానం. అతిబల, మహాబల, రాక్షసుల సంహారం ఇక్కడే జరిగింది.పుష్కరాలు జరిగే స్థలాలు: కృష్ణానదీ పరివాహక ప్రాంతాలైన విజయవాడ, అలంపురం, వాడపల్లి, మట్టపల్లి తదితర ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. -
కృష్ణా పుష్కరాలకు పక్కా ఏర్పాట్లు
► సీహెచ్ విజయమోహన్ ఆదేశం ► పాతాళగంగలో రెండు.. ► లింగాలగట్టులో రెండు ఘాట్ల నిర్మాణం ► ఎస్పీతో కలిసి శ్రీశైలంలో పర్యటన శ్రీశైలం : కృష్ణా పుష్కరాల నిర్వహణకు పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆదేశించారు. పాతాళగంగ వద్ద 2, లింగాలగట్టులో 2 పుష్కర ఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపాలని అధికారులకు సూచించారు. ఆగస్టు 12 నుంచి పుష్కరాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ విజయమోహన్, ఎస్పీ రవికృష్ణ, ఓఎస్డీ రవిప్రకాశ్, ఆర్డీఓ రఘుబాబు, దేవస్థానం ఈఓ సాగర్‌బాబు, జేఈఓ హరినాథ్‌రెడ్డి, డీఎస్పీ సుప్రజ తదితర అధికారులు శుక్రవారం ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు పుష్కర ఏర్పాట్లపై క్షేత్ర పర్యటన చేశారు. అనంతరం శిఖరేశ్వరం చేరుకుని అక్కడి నుంచి సున్నిపెంట ఏరియల్ వ్యూను పరిశీలించారు. ముందుగా వారు శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను దర్శించుకుని భక్తుల కోసం ఏర్పాటు చేసిన షామియానాలు, క్యూలను పరిశీలించారు. తరువాత పాతాళగంగ వద్దకు చేరుకుని ప్రస్తుతం ఉన్న ఘాట్ల పరిస్థితి, అదనంగా ఏర్పాటు చేయాల్సిన వాటి గురించి చర్చించారు. ప్రస్తుత మెట్ల మార్గంలోనే ఇన్, ఔట్ మార్గాలు, మధ్యలో బారికేడింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. భక్తుల సంఖ్య మరింత పెరిగితే ప్లై ఓవర్ నిర్మించి రెండవ ఘాట్‌కు మళ్లించాలన్నారు. పాతమెట్ల మార్గాన్ని కూడా వీలైనంత మేరకు పునరుద్ధరించాలని, అటువైపు కూడా భక్తులు స్నానాలాచరించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. లింగాలగట్టు వద్ద రెండు పుష్కరఘాట్లు రాష్ట్ర విభజన జరిగిన తరువాత లింగాలగట్టు ఎడమభాగం తెలంగాణా రాష్ట్రానికి వెళ్లిపోవడంతో కుడివైపున ఉన్న లింగాలగట్టు ప్రాంతంలో రెండు ఘాట్లను ఏర్పాటు చేయాల్సిందిగా కలెక్టర్ విజయమోహన్ ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న ఘాట్ల వద్దకు చేరుకునే మార్గానికి అడ్డుగా మత్స్యకారుల ఇళ్లు పై భాగంలో ఉండడంతో వాటిని తొలగించాల్సిందిగా సూచించారు. దీనిపై మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేయగా తొలగించిన ఇళ్లకు ప్రత్యామ్నాయంగా కొత్త గృహాలు నిర్మించి ఇస్తామని తెలిపారు. -
ఈ నిధులు ఏమూలకు!
• కృష్ణా పుష్కరాలకు రూ. 800 కోట్లతో ప్రతిపాదనలు • రూ. 250 కోట్లు విదిల్చిన రాష్ట్ర ప్రభుత్వం • నగరపాలక సంస్థ కేటాయింపులపై స్పష్టత ఏదీ • ఖజానాపై భారం తలుచుకునికార్పొరేషన్ పరేషాన్ రాజధాని ఏర్పడిన తర్వత తొలిసారి జరగనున్న కృష్ణా పుష్కరాలకు విజయవాడ నగరం ప్రధాన వేదిక కానుంది. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ కొలువై ఉండటంతో పుష్కర స్నానంతో పాటు అమ్మవారి దర్శనం కూడా చేసుకోవచ్చనే ఆలోచనతో భక్తులు పెద్ద సంఖ్యలోనే వచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో జరగనున్న పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం మాత్రం మొక్కుబడిగా రూ.250 కోట్లు మాత్రమే కేటాయించింది. దీంతో ఈ నిధులు ఏమూలకు సరిపోతాయని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కార్పొరేషన్‌పై భారం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ : కొత్త రాష్ట్రం.. కొత్త రాజధాని.. ఈ క్రమంలో వస్తున్న కృష్ణా పుష్కరాలు ప్రత్యేకతను సంతరించుకోనున్నాయి. ఆగస్టులో జరిగే పుష్కరాలను విజయవంతం చేయాలంటే సమష్టి కృషితోపాటు నిధుల విడుదలలో సర్కారు కాస్త పెద్ద మనసు చేసుకోవాల్సి ఉంది. పుష్కరాల నిర్వహణకు జిల్లాలో రూ.450 కోట్లు, విజయవాడ కార్పొరేషన్ పరిధిలో రూ. 350 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపగా ప్రభుత్వం కేవలం రూ.250 కోట్లు మంజూరుచేసింది. ప్రధానంగా పుష్కరాలకు కేంద్ర బిందువైన విజయవాడ నగరంలో సుందరీకరణ పనులు మొదలుకొని, పుష్కర ఘాట్ల మరమ్మతుల వరకు ఎన్నో పనులు జరగాల్సి ఉంది. మెరుగైన పారిశుద్ధ్యం, అదనపు సిబ్బంది వినియోగం వంటివి వందల కోట్ల ఖర్చుతో కూడుకున్న అంశాలు. ఇవేమీ పట్టించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా నిధులు విడుదల చేయడం, కార్పొరేషన్‌కు ఎంత ఇచ్చేదీ స్పష్టంగా ప్రకటించకపోవడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అసలే లోటు బడ్జెట్‌తో కోట్లాది రూపాయల అప్పుల ఊబిలో కూరుకుపోయిన విజయవాడ నగరపాలక సంస్థకు పుష్కరాలు గుదిబండలా మారే ప్రమాదం ఉందనే ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. నగరానికి ప్రాధాన్యత ఏదీ! పుష్కరాల్లో విజయవాడ నగరం కీలక కేంద్రంగా మారుతుంది. ముఖ్యమంత్రి నుంచి వీవీఐపీల వరకు అంతా ఇక్కడే ఉంటారు. దీంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు, వీఐపీల తాకిడి ఎక్కువగా విజయవాడ నగరానికే ఉంటుంది. కనకదుర్గమ్మవారి దేవస్థానం ఉండడంతో యాత్రికుల రద్దీ అధికంగానే ఉంటుంది. అటు ఆధ్యాత్మికంగా, ఇటు పర్యాటకంగా నగరాన్ని కేవలం నాలుగు నెలల కాలంలో తాత్కాలిక అభివృద్ధి చేయాలంటే కనీసం రూ.250 కోట్ల నిధులు అవసరం. కాని ప్రభుత్వ కేటాయింపులు ఇప్పటికే పూర్తికావడంతో అధికారుల్లో ఆందోళన మొదలైంది. గత ఏడాది జరిగిన గోదావరి పుష్కరాలకు తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి ప్రభుత్వం వివిధ శాఖలతో నిమిత్తం లేకుండానే రూ.234 కోట్ల నిధులు కేటాయించింది. తక్కువ సమయం ఉండడంతో రూ.170 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మాత్రమే చేశారు. దీంతో అక్కడ రూ.64 కోట్ల నిధులు మిగిలిపోయాయి. రూ.760 కోట్ల నుంచి రూ.350 కోట్లకు గతంలో నగరపాలక సంస్థ అధికారులు పుష్కరాల అభివృద్ధి పనులు, పుష్కరాలు జరిగే 12 రోజులు వివిధ కార్యక్రమాల నిర్వహణ, ఇతర పనుల కోసం రూ.760 కోట్లు అవసరమని నిర్ణయించి ఆ మేరకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపారు. ప్రతిపాదనల స్థాయి ఎక్కువగా ఉందని, తగ్గించి మళ్లీ పంపాలని మౌఖిక ఆదేశాలు అందిన క్రమంలో రూ.350 కోట్లతో మార్పుచేసి పంపారు. ఇప్పటికే నగర మేయర్, కమిషనర్ సీఎం చంద్రబాబును కలిసి నిధులు మంజూరుచేయాలని కోరారు. నిరంతర శానిటేషన్ కోసం 35 వేల మంది అదనపు సిబ్బంది నియామకానికి వీలుగా నిధులు, వందల సంఖ్యలో తాత్కాలిక మరుగుదొడ్లు, పుష్కర ఘాట్ల వద్ద 24 గంటలు పారిశుద్ధ్య నిర్వహణ, 200కు పైగా అద్దె వాహనాలు, పుష్కరాల నేపథ్యంలో నగరంలోని కీలక రహదారుల విస్తరణ, తాత్కాలిక వసతి కోసం భారీ షెడ్ల ఏర్పాటు.. ఇలా అనేక కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ప్రభుత్వం నిధుల విషయంలో మొండిచెయ్యి చూపితే నగరపాలక సంస్థ ఖజనాకు రూ.100 కోట్లకు పైగా ఆర్థిక భారం పడే ప్రమాదం ఉంది. కోటలు దాటే మాటలు.. కృష్ణా పుష్కరాలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే దీనికి భిన్నంగా.. నామమాత్రంగా నిధులు విడుదల చేయడం విమర్శలకు దారితీస్తోంది. డబ్బుల్లేకుండా అభివృద్ధి పనులెలా చేయాలని నగరపాలక సంస్థ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాకు కేటాయించిన రూ.250 కోట్లలో ఎక్కువగా పంచాయతీరాజ్, జలవనరుల శాఖలకే దక్కనున్నాయి. ఈ క్రమంలో విజయవాడ నగరానికి ఏమేర అవసరం ఉంది. తక్షణం ఎంత కేటాయించాలి... మిగిలిన నిధులు ఎప్పుడివ్వాలి అనే దానిపై స్పష్టత లేదు. -
కృష్ణా పుష్కరాలపై దృష్టి సారించండి
జిల్లా ఎస్పీ విజయ్‌కుమార్ సాగర సంగమ ప్రాంతం పరిశీలన కోడూరు : కృష్ణా పుష్కరాలపై జిల్లా పోలీసు యంత్రాంగం ఇప్పటి నుంచే ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ కె.విజయకుమార్ సూచించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న పవిత్ర కృష్ణా సాగర సంగమ ప్రదేశాన్ని ఎస్పీ స్థానిక పోలీసులతో కలిసి శనివారం పరిశీలించారు. విజయవాడ దగ్గర నుంచి హంసలదీవి వరకు కృష్ణానది వెంట ఉన్న ఘాట్లు వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామన్నారు. దేవాలయాల వద్ద కూడా పటిష్ట చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. విజయవాడ, వేదాద్రి, ముక్త్యాల, శ్రీకాకుళం, పెదకళ్లేపల్లి, హంసలదీవి ఘాట్ల వద్ద భక్తుల సంఖ్య అధికంగా ఉంటుందని అధికార యంత్రాంగం అంచనా వేస్తోందని, ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆయన ఆదేశించారు. హంసలదీవిలోని సాగర సంగమం వద్ద లోతు అధికంగా ఉన్నందున ప్రత్యేక దృష్టిసారించాల్సి ఉంటుందని అవనిగడ్డ డీఎస్పీ ఖాదర్‌బాషా ఎస్పీకి వివరించారు. సంగమం వద్దకు నూతన రహదారి ఏర్పాటుకు ఇప్పటికే ప్రతిపాదించారని, దీంతో భక్తులు ఈ ప్రాంతానికి అధిక సంఖ్యలో తరలి వస్తారని డీఎస్పీ పేర్కొన్నారు. ముమ్మర గస్తీ నిర్వహించాలి పాలకాయతిప్పలోని సముద్రం తీరం వెంట ముమ్మర గస్తీ నిర్వహించి, ప్రతి నిత్యం పరిస్థితులను తనకు వివరించాలని స్థానిక పోలీసులను ఎస్పీ ఆదేశించారు. సాగర సంగమం ప్రాంతంలో ప్రత్యేక బోటుపై ప్రయాణించి సముద్ర స్థితిగతులను పరిశీలించారు. అనంతరం హంసలదీవిలోని శ్రీ రుక్మిణీ సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సీఐ చంద్రశేఖర్, కోడూరు, అవనిగడ్డ ఎస్.ఐలు వై.సుధాకర్, డి.వెంకటకుమార్ ఉన్నారు. -
ఆగస్టు 12 సూర్యోదయం నుంచి కృష్ణా పుష్కరాలు
-నోటిఫికేషన్ జారీ ద్వారా అధికారికంగా ప్రకటించిన ప్రభుత్వం హైదరాబాద్: కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12వ తేదీ సూర్యోదయం నుంచి ఆరంభమవుతాయని దేవాదాయ శాఖ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేస్తూ ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. టీటీడీకి చెందిన ఆస్థాన సిద్దాంతి తంగిరాల వెంకట కృష్ణ పూర్ణ సిద్ధాంతిని సంప్రదించిన తరువాత తేదీ ఖరారు చేసినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 11వ తేదీ రాత్రి 9.21 గంటలకు బృహస్పతి నక్షత్రం కన్యారాశిలో ప్రవేశిసున్నందున మరుసటి రోజు సూర్యోదయం నుంచి పుష్కరాల నిర్వహణకు సిద్ధాంతి ముహర్తం నిర్ణయించినట్టు పేర్కొన్నారు. 23వ తేదీ వరకు పుష్కరాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. -
ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు
పుష్కరాల నిర్వహణపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష సాక్షి, విజయవాడ బ్యూరో: ఈ ఏడాది ఆగస్టు 12 నుంచి కృష్ణా పుష్కరాలు జరగనున్నట్లు ఏపీ దేవాదాయ మంత్రి మాణిక్యాలరావు తెలిపారు. శుక్రవారం క్యాంపు కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా పుష్కరాలపై సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా పుష్కరాల కోసం నూతనంగా 280 ఘాట్లు నిర్మించనున్నట్లు చెప్పారు. అమరావతిలో ఘాట్ల నిర్మాణంతో పాటు కృష్ణా పరీవాహక ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామన్నారు. గోదావరి, కృష్ణా సంగమంలో ఘాట్ల నిర్మాణంపై మార్చి 15న మరోసారి సమీక్ష నిర్వహిస్తానని సీఎం చెప్పినట్లు వెల్లడించారు. కాగా, గోదావరి పుష్కరాల్లో జరిగిన తప్పిదం పునరావృతం కాకుండా చూడాలని సమీక్ష సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా గోదావరి-కృష్ణా నదుల అనుసంధానానికి సంకల్పం తీసుకున్నట్లు వివరించారు. అలాగే కృష్ణా పుష్కరాలను కూడా నదుల అనుసంధానికి సంకల్పంగా స్వీకరించాలన్నారు. పూణె ఎంఐటీ(మహారాష్ట్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ) ప్రతినిధి బృందం శుక్రవారం క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసింది. యువతకు నాయకత్వ లక్షణాల్లో శిక్షణ ఇస్తున్నట్లు ముఖ్యమంత్రికి సంస్థ ఉపాధ్యక్షుడు రాహుల్ విశ్వనాథ్ కరాడ్ తెలిపారు. -
ఈ పనుల్లోనూ ‘నామినేషన్’!
కృష్ణా పుష్కరాల పనులపై ఉద్దేశపూర్వకంగానే జాప్యం ఆఖరి నిమిషంలో టీడీపీ నేతలకు అప్పగించే ఎత్తుగడ సాక్షి, హైదరాబాద్: గోదావరి పుష్కరాల పనులను నామినేషన్ విధానంలో అధికార పార్టీ నేతలకు కట్టబెట్టిన ప్రభుత్వం కృష్ణా పుష్కరాల్లోనూ అదే తరహా విధానానికి తెరతీసింది. ఆగస్టు 12 నుంచి జరగనున్న కృష్ణా పుష్కరాల పనుల అంచనాను పెంచి, నామినేషన్‌పై అప్పగించేందుకు స్కెచ్ వేసింది. పుష్కరాలకు మరో 6నెలలే గడువు మిగిలి ఉంది. ఈపనుల్లో పారదర్శకత పాటించాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే వీటిని ఇప్పటికే టెండర్ విధానంలో అప్పగించేవారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. రూ. 2,200 కోట్లతో ప్రతిపాదనలు కృష్ణా పుష్కరాలు జరగనున్న కర్నూలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రోడ్ల నిర్మాణానికి రోడ్లు, భవనాల శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. మొత్తం రూ.2,200 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలిచ్చింది. రోడ్ల నిర్మాణాలకు అంచనాలను రూపొందించింది. గోదావరి పుష్కరాల తరహాలో కృష్ణా పుష్కరాల నిర్వహణలోనూ సింహభాగం పనులను ఆర్‌అండ్‌బీకే అప్పగించనున్నారు. గోదావరి పుష్కరాల్లో రూ.1,600 కోట్లతో ముందుగా అంచనాలు సిద్ధం చేశారు. పనులు ప్రారంభమయ్యే నాటికి వాటిని రూ.1,800 కోట్లకు పెంచేశారు.ఉభయగోదావరి జిల్లాల్లో రూ.1,800 కోట్లు ఖర్చు చేయగా, మూడు జిల్లాల పరిధిలో జరిగే కృష్ణా పుష్కరాలకు కనీసం రూ.2,000 కోట్ల మేర ఖర్చు ఉంటుందని ఆర్అండ్బీ, మున్సిపల్, దేవాదాయ శాఖల అధికారులు భావిస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో ఆర్‌అండ్‌బీకి రూ.650 కోట్ల వరకు కేటాయించారు. -
రూ.1600 కోట్లతో కృష్ణా పుష్కర ప్రతిపాదనలు
విజయవాడ:కృష్ణా పుష్కర ఏర్పాట్లకు అవసరమైన పనులు చేపట్టేందుకు వివిధ శాఖల ద్వారా సుమారు రూ.1600 కోట్ల నిధులు కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు జిల్లా కలెక్టర్ బాబు.ఏ పేర్కొన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గురువారం కృష్ణా పుష్కరాల సన్నాహక ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ, నిర్ణీత గడువులో పనులు నాణ్యతతో పూర్తిచేసేందుకు వీలుగా ప్రతి పని ప్రారంభించినప్పటి నుంచి పూర్తి కావడానికి ఎన్ని రోజులు సమయం అవసరమో కచ్చితంగా పేర్కొనాలని ఆదేశించారు. అన్ని శాఖలు చేపట్టే పనులన్నీ, విభాగాల వారీగా స్వష్టంగా విభజించాలన్నారు. భూసేకరణ, అవసరమైన పనుల సంఖ్య, గ్రామ సరిహద్దులో ఉండే విద్యుత్ స్తంభాలు, ఇతర వసతుల తొలగింపు తదితర విషయాలు పేర్కొనాలన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా తాత్కాలికంగా వినియోగించి, ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న వివిధ శాఖలలో పరికరాలను గుర్తించి వాటిని కృష్ణా పుష్కరాలలో వినియోగించే అవకాశాన్ని పరిశీలించాలని ఆయన కోరారు. రోడ్లు భవనాల శాఖ గోదావరి పుష్కరాలకు కొనుగోలు చేసిన 100కి.మీ. బారికేడింగ్‌కు ఉపయోగించే పరికరాలను కృష్ణా జిల్లాకు తరలిస్తామని ఆ శాఖ ఎస్ఈ కె. శేషుకుమార్ కలెక్టర్‌కు వివరించారు. -
కాసులు కావాలి
మరో ఏడు నెలల్లో కృష్ణా పుష్కరాలు అధ్వానంగా ఉన్న ఆర్ అండ్ బి రహదారులు రూ. 500 కోట్ల మంజూరుకు ప్రతిపాదనలు నిధుల కోసం అధికారుల ఎదురుచూపులు విజయవాడ : మరో ఏడు నెలల్లో కృష్ణా పుష్కరాలు మొదలుకానున్నాయి. కోట్లాదిమంది యాత్రికులు పుణ్యస్నానాలాచరించేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాలకు తరలివస్తారు. వేలాది వాహనాల రాకతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. దీనికితోడు కృష్ణా తీరం వెంబడి ఉన్న రహదారులన్నీ గోతులమయంగా మారడంతో ప్రయాణికులు యాతన పడే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో జిల్లాలోని ఆర్ అండ్ బి రోడ్లకు పుష్కరాలనాటికి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయాలి. రోడ్ల అభివృద్ధికి ఆ శాఖ అధికారులు అంచనాలైతే సిద్ధం చేశారు కాని అక్కడ్నుంచి మరో అడుగు ముందుకు పడలేదు. జిల్లాలో ఆర్ అండ్ బి శాఖ పరిధిలో వేల కిలోమీటర్ల రహదారులున్నాయి. ప్రధానంగా జగ్గయ్యపేట నుంచి హంసలదీవి వరకు ఉన్న కృష్ణా తీరంలో దాదాపు 800 కి.మీ. మేర రహదారులు విస్తరించాయి. ప్రధాన రహదారులతోపాటు అనేక సర్వీసు రోడ్లు, గ్రామాల్లో ఉన్న ప్రధాన రహదారులన్నీ ఆర్ అండ్ బి పరిధిలోనే ఉన్నాయి. పుష్కరాలను సమర్ధంగా నిర్వహించాలని కలెక్టర్ గత నెలలో అన్ని ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందే జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా కూడా సమీక్ష నిర్వహించారు. ఎక్కడా నిధుల కొరత లేదని, అన్ని శాఖల అధికారులు అవసరమైన ప్రతిపాదనలు పంపితే ప్రత్యేకంగా ఆయా శాఖల నుంచి నిధులు మంజూరుచేయిస్తామని ప్రకటిం చారు. ఇది జరిగి కూడా రెండు నెలలు దాటింది. మళ్లీ మంత్రి వాటి గురించి కనీసం వాకబు కూడా చేసిన దాఖ లాలు లేవు. మరోవైపు దుర్గగుడి వద్ద కనకదుర ఫ్లైఓవర్ పనులు ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్‌సహా జిల్లా ఉన్నతాధికారులంతా ఆ పనులపైనే దృష్టిసారించి మిగిలిన పనులను మరిచిపోయారు. అన్ని ప్రభుత్వ శాఖల్లానే ఆర్ అండ్ బి అధికారులు కూడా భారీగా ప్రతిపాదనలు సిద్ధం చేసి గత నెలలో ఆమోదం కోసం పంపి కాసుల కోసం నిరీక్షిస్తున్నారు. 60 రహదారులకు మరమ్మతులు జిల్లాలో 2800 కిలోమీటర్ల పొడవున ఆర్ అండ్ బి రహదారులున్నాయి. అన్ని గ్రామాలను కలుపుతూ జాతీయ రహదారులకు అనుసంధానంగా ఇవి ఉన్నాయి. వీటికి ఏటా సాధారణ మరమ్మతులు జిల్లాలో నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే పుష్కరాలు కావడంతో ప్రభుత్వం దీనికి కొంత ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే జిల్లాలోని ఆర్ అండ్ బి రహదారులకు మరమ్మతులు చేయాలని అధికారులు నిర్ణయించారు. దీనికి పుష్కరఘాట్లను ప్రామాణికంగా తీసుకొని ఘాట్లకు అనుసంధానంగా ఉన్న రోడ్లను అధికారులు గత నెలలో పరిశీలించారు. దీనికి అనుగుణంగా అవసరమైన చోట నిర్వహించాల్సిన పనులను కూడా గుర్తించారు. ప్రాథమికంగా జగ్గయ్యపేటలోని వేదాద్రి నుంచి అవనిగడ్డ సమీపంలోని హంసలదీవి వరకు 90 ప్రధాన ఘాట్లు ఉన్నాయి. 60 ప్రధాన రహదారులకు మరమ్మతులు చేయడం, కొన్ని చోట్ల ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు వీలుగా రహదారుల విస్తరణ పనులు నిర్వహిం చాల్సి ఉంది. వీటికి సుమారు రూ. 500 కోట్ల ఖర్చు అవుతుందని అధికారులు అంచనాలు వేసి 60 రహదారుల పనులను ఆమోదించాలని ప్రతిపాదనలు పంపారు. ముఖ్యంగా మైలవరం, తిరువూరు రోడ్డు, నూజివీడు రోడ్డు, యనమలకుదురు నుంచి చల్లపల్లి వరకు ఉన్న కరకట్ట మార్గం, గుడివాడ నుంచి మచిలీపట్నం వరకు ఉన్న మార్గం, హైదరాబాద్ నుంచి తెలంగాణ ప్రాంతాల వాహనాల రద్దీ నియంత్రణకు జగ్గయ్యపేట నియోజకవర్గంలోని కీలక ఆర్ అండ్ బి రహదారులను అభివృద్ధి చేయడం, దాదాపు 15 చోట్ల రోడ్లను విస్తరించడం వంటి పనులు పూర్తిచేయాలి. పుష్కరాలకు సమయం దగ్గర పడుతున్నా ప్రభుత్వం మాత్రం నిధుల మంజూరు విషయంపై దృష్టి సారించడంలేదు. -
పంట కాలువలకూ ఘాట్లు!
కృష్ణాపుష్కరాలకు సన్నాహాలు అదనపు మినీ ఘాట్లుగా నామకరణం ఖరీఫ్ సీజను అనుభవాలతో ముందస్త్తు జాగ్రత్త ! తెనాలి : కృష్ణా పుష్కరాలకు ప్రభుత్వం సన్నాహాలు ఆరంభించింది. పుష్కరఘాట్ల ఏర్పాటు అంశాలపై ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఘాట్ల నిర్మాణానికి వ్యయ అంచనాలను తయారు చేసి, ప్రభుత్వ అనుమతికి పంపనున్నారు. ఈ పర్యాయం కృష్ణానదిలోనే కాకుండా ఆ నది నీరు ప్రవహించే పంటకాలువల వెంట కూడా పుష్కరఘాట్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయటం విశేషం. నదిలో నీటి లభ్యత కొరవడితే మినీఘాట్లుగా పిలుచు కుంటున్న కాలువల ఘాట్లలోనూ భక్తులకు పుష్కరస్నానం ఆచరించే అవకాశం కల్పించాలనేది దీనివెనుక ఉద్దేశంగా చెబుతున్నారు. కృష్ణా పుష్కరాలకు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్ర తీరం వరకు సుమారు 75 కిలోమీటర్ల పరిధిలో కుడి వరదకట్ట నుంచి నదిలోకి ఈ పర్యాయం 40 పుష్కరఘాట్లు ఉండేలా చూడనున్నారు. గత పుష్కరాలకు నిర్మించిన ఘాట్లకు మరమ్మతులు చేసి, వినియోగంలోకి తేవడమే కాకుండా, మరి కొన్ని కొత్తగా నిర్మించటానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీలైనంత ఎక్కువమంది భక్తులు పుణ్యస్నానం ఆచరించేలా చూడాలనే ఉద్దేశంతో ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు ఇచ్చిన ప్రతిపాదనల్లో కనీసం 40 అమల్లోకి తెచ్చేందుకు అవకాశముందని సమాచారం. గతంలో ఉన్న ఘాట్ల మరమ్మతులకు, అదనంగా ఘాట్ల ఏర్పాటుపై ప్రతిపాదనల సాధ్యాసాధ్యాలను దేవాదాయ, నీటిపారుదల అధికారులు స్వయంగా పరిశీలన చేస్తున్నారు. ఈసారి కొన్ని ముఖ్యమైన పంట కాలువల వెంట మరో 20 పుష్కరఘాట్ల ఏర్పాటుకు ప్రజాప్రతినిధులు, నీటి పంపిణీ సంఘాల నేతలు ప్రతిపాదించారు. ప్రస్తుత ఖరీఫ్ సీజనులో వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని, వచ్చే ఏడాది ఆగస్టులో వచ్చే పుష్కరాలకు ప్రకాశం బ్యారేజీ దిగువకు నీరు వదిలే అవకాశాలు లేకపోతే ఎలాగన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. పశ్చిమడెల్టాలో ఖరీఫ్ వరి నాట్లు ముమ్మరంగా సాగే తరుణమది. ప్రధాన జలాశయాల నుంచి నీరందకపోతే, పంట కాలువలకు సరఫరానే పెద్ద సమస్యగా మారుతుంది. అలాంటప్పుడు నదివెంట సముద్రతీరం వరకు ప్రజలకు పుష్కరస్నానాలు ఆచరించేందుకు వీలుగా బ్యారేజీ దిగువకు నీటి విడుదల అసాధ్యమనే చెప్పాలి. ఇందుకు ప్రత్యామ్నాయంగా కొమ్మమూరు కాలువ, రేపల్లె బ్యాంక్ కెనాల్ వంటి ముఖ్యమైన పంట కాలువల్లోనూ ఘాట్లను ఏర్పరచి, పుణ్యస్నానం ఆచరించే అవకాశం కల్పించాలని ప్రభుత్వ అధికారు లు, నీటి పంపిణీ సంఘాల నేతలు తలపోశారు. అనుకున్నదే తడవుగా ప్రతిపాదనలు సిద్ధంచేశారు. అదనపు మినీ ఘాట్లుగా ఇవి తెరపైకి రానున్నాయి. -
కాలుష్య కాటు
విజయవాడ : తెల్లగా, స్వచ్ఛంగా ఉండే కృష్ణానది నీరు రంగు మారుతోంది. జీవనది కాలుష్య కోరల్లో చిక్కుకుంది. నిత్యం వేల గ్యాలన్ల మురుగునీరు, టన్నుల కొద్దీ చెత్త కృష్ణలో కలుస్తోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రజల అలక్ష్యం వెరసి కృష్ణమ్మ పాలిట శాపంగా మారింది. పండుగలు, పుణ్యతిథుల్లో పవిత్ర స్నానాలు ఆచరించే భక్తులు నదిలో వదిలే చెత్త టన్నులకొద్దీ పేరుకుపోయి నీరు కలుషితమవుతోంది. ఇదికాక పలు ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు తిన్నగా నదిలోకి కలవడంతో మరో మూసీగా మారే ప్రమాదం ఉంది. కనీసం ఇప్పటినుంచైనా నదిని పరిశుభ్రంగా ఉంచగలిగితే వచ్చే ఏడాది జరగనున్న కృష్ణా పుష్కరాలు సవ్యంగా జరుగుతాయి. లేదంటే మురికినీటిలో స్నానమాచరించలేక ఆ నీటిని నెత్తిన చల్లుకోవాల్సిందే. చర్మ సంబంధ సమస్యలు రాకుండా.. ఇటీవలి గోదావరి పుష్కరాల్లో లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరించిన క్రమంలో ఈకోలి బాక్టీరియా శాతం నీటిలో తీవ్రంగా ఉందని, చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ యంత్రాంగమే ప్రకటించింది. జిల్లాలో ఎగువన జగ్గయ్యపేట సమీపంలోని ముక్త్యాల వద్ద నుంచి దిగువన అవనిగడ్డ సమీపంలోని హంసలదీవి వద్ద కృష్ణనీరు సముద్రంలో కలుస్తుంది. జిల్లాలో సుమారు 100 కిలోమీటర్ల మేర నదీ ప్రవాహం ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఏడాది పొడవునా 12 అడుగుల మేర 3 టీఎంసీలు నిల్వ ఉంటుంది. అలాగే ఎగువన గుంటూరు జిల్లాలోని పులిచింతల వద్ద 45 టీఎంసీల నీటిని నిల్వ చేసే సామర్థ్యం ఉంది. నీరు ప్రవాహంలా కాకుండా నిల్వ ఉండడం వల్ల చెత్త వేయడంతో కలుషితం అవుతోంది. ఇప్పటినుంచే చెత్తను తొలగించి ‘స్వచ్ఛ కృష్ణ’గా మార్చితే పుష్కరాల నాటికి ఇబ్బంది ఉండదు. మరుగుదారులన్నీ నదిలోకే డ్రైనేజీ వ్యవస్థ మొదటి నుంచి సక్రమంగా లేదు. బందరు కాలువ, రైవస్ కాలువల్లోకి నగరంలోని అవుట్‌ఫాల్ డ్రైన్లు కలిపి ఉన్నాయి. దాదాపు 29 డ్రైన్లు పంట కాలువకు కలిసుండడంతో మురుగుకాలువల్లా మారిపోయాయి. ఇదే పరిస్థితి కృష్ణా నదికీ ఉంది. జగ్గయ్యపేటలో సిమెంట్ ఫ్యాక్టరీలు నది నీటిని పూర్తిగా కలుషితం చేస్తున్నాయి. భవానీపురం సమీపంలో నదీ కాలుష్యం అధికంగా ఉంది. కరకట్ట ప్రాంతం, భవానీ ఐలాండ్, పున్నమి ఘాట్, భవానీ ఘాట్, లోటస్ అపార్ట్మెంట్స్, చేపల మార్కెట్ తదితర ప్రాంతాల్లో భారీ అవుట్‌ఫాల్ డ్రైన్లు నదిలోకి ఉన్నాయి. రోజుకి సగటున 10 వేల గ్యాలన్ల మురుగు నీరు కృష్ణానదిలో కలుస్తుంది. తరచూ కురిసే భారీ వర్షాలకు కూడా నగరంలోని డ్రైన్లు పొంగి చివరకు కృష్ణలో కలుస్తున్నాయి. అధికారులు నీటిని కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారుతప్ప ఆచరణలో కనిపించడంలేదు. తగ్గుతున్న బయోలాజికల్ ఆక్సిజన్ కృష్ణా నది నీటిలో బయోలాజికల్ ఆక్సిజన్ శాతం తగ్గుతోంది. కాలుష్య నియంత్రణ మండలి శాఖలోని అధికారులు తరచూ నది నీటిని శాంపిల్స్ తీసి పరీక్షలు నిర్వహిస్తారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద, గుంటూరు జిల్లాలోని అమరావతి వద్ద, ముక్త్యాల వద్ద నీటిని సేకరించి పరీక్షలు నిర్వహించారు. ప్రధానంగా కృష్ణా నదికి, గోదావరి నదికి పూర్తి సారూప్యత ఉంది. కృష్ణా నదీ నీరు భూమిలో కలిసే స్వభావం లేకపోవటంతో నీరు ఎప్పుడు స్వచ్ఛంగా తెల్లగా కనిపిస్తుంది. గోదావరి నీరు పచ్చగా ఉంటుంది. నీటిలో హైడ్రోజన్ శాతం 2014లో 7.8 శాతం ఉండగా 2015లో 7.7 శాతంగా ఉంది. డీసాల్ట్ ఆక్సిజన్ శాతం గత ఏడాది 6.7 శాతంగా ఉండగా ఈ ఏడాది 7.1 శాతానికి పెరిగింది. బయోలాజికల్ ఆక్సిజన్ గత ఏడాది 0.6 శాతంగా ఉండగా ఇప్పుడు 0.5 శాతంగా నమోదయింది. నీటిలో సోడియం లెవల్స్ గత ఏడాది 28 శాతం ఉండగా ఈ ఏడాది 33 శాతంగా నమోదయ్యాయి. నదిలో కాలుష్య శాతం గత ఏడాది 632 ఉండగా ఈఏడాది 532 శాతం ఉంది. హైడ్రోజన్ లెవల్స్ 7 శాతం వరకు ఉండవచ్చు. దాటితే నష్టం. అలాగే నదిలో నీటి కాలుష్యం 500 శాతానికి మించితే చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది. నది నీటి ప్రవాహం నిరంతరం ఉంటే నీరు స్వచ్ఛంగా ఉంటుంది. నీరు నిల్వ ఉంటే ఫికల్ బ్యాక్టీరియా పెరిగి ఆక్సిజన్ లెవల్స్ తగ్గుతాయి. నీటిని బ్యాక్టీరియా శుద్ధి చేస్తుంది కాబట్టి నీరు నిల్వ ఉన్నా పెద్ద ఇబ్బంది ఉండదని నిపుణులు చెబుతున్నార -
నదీతీర ఆలయాలకు మహర్దశ
కృష్ణా పుష్కరాల కోసం తళుకుబెళుకులు 30 దేవాలయాల వరకు గుర్తింపు దుర్గగుడి అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి విజయవాడ : నదీతీర ప్రాంతాల్లోని దేవాలయాలకు మహర్దశ పట్టనుంది. వచ్చే ఏడాది జరిగే కృష్ణా పుష్కరాలను దృష్టిలో ఉంచుకుని వీటిని అభివృద్ధి చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. నదీ స్నానం చేసిన తరువాత భక్తులు దైవదర్శనానికి ప్రాధ్యానమిస్తారు. గోదావరి పుష్కరాల సందర్భంగా అక్కడి నదీ తీర ఆలయాలకు భక్తుల తాకిడి భారీగా పెరిగిన విషయం తెలిసిందే. లక్షలాది మంది భక్తులు దేవాలయాలను దర్శించుకున్నారు. మొక్కుబడులు, కానుకలు కూడా భారీగా చెల్లించుకున్నారు. దీనిని గుర్తించిన దేవాదాయ శాఖ ఇక్కడి దేవాలయాలను కూడా అందంగా తీర్చిదిద్దేందుకు తగిన ప్రణాళికలు ఇప్పటినుంచే రూపొందిస్తోంది. 10 కిలోమీటర్ల పరిధిలోని ఆలయాల అభివృద్ధికి నిర్ణయం... కృష్ణానది ప్రవహిస్తున్న 16 మండలాల్లోని పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. నదీతీర ప్రాంతంలో ఉన్న వేదాద్రి యోగానంద లక్ష్మీనరసింహస్వామి దేవాలయం, ముక్త్యాల భవానీముక్తేశ్వరస్వామి ఆలయం, యనమలకుదురు రామలింగేశ్వరస్వామి ఆలయం, మోపిదేవి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వరస్వామి ఆలయం, హంసలదీవి వేణుగోపాలస్వామి ఆలయం తదితర 30 దేవాలయాలను దేవాదాయ శాఖ అధికారులు ఇప్పటికే గుర్తించినట్లు ఆ శాఖ అసిస్టెంట్ కమిషనర్ దుర్గాప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. నదీతీర ప్రాంతంలో ఉన్న దేవాలయాలు సాధారణంగా మహాశివరాత్రి, కార్తీక మాసం, ఇతర పర్వదినాల్లో భక్తులతో పోటెత్తుతూ ఉంటాయి. ఆయా సమయాల్లో ఏయే దేవాలయాలకు ఎంతెంత మంది భక్తులు వస్తూ ఉంటారనే సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. విజయవాడపై పుష్కర భక్తుల రద్దీని తగ్గించేందుకు జగ్గయ్యపేట నుంచి అవనిగడ్డ వరకు ఘాట్లను అభివృద్ధి చేయడంతో పాటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులను వారికి దగ్గరగా ఉండే ఘాట్లకు పంపే విధంగా జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఘాట్లకు వచ్చే భక్తుల రద్దీని బట్టి దేవాలయాలకు రద్దీ పెరుగుతుందని, అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు దుర్గాప్రసాద్ వివరించారు. రద్దీని తట్టుకునేలా క్యూ లైన్లు... దేవాలయాలను రంగులతో ఆకట్టుకునేవిధంగా తీర్చిదిద్దనున్నారు. భక్తుల రద్దీని తట్టుకునేందుకు వీలుగా క్యూలైన్లు, బారికేడింగ్‌లు ఏర్పాటు చేస్తారు. దేవాలయాల్లో ఫ్లోరింగ్, లైటింగ్ తదితర మరమ్మతులు చేయించనున్నారు. భక్తులకు మంచినీటి సౌకర్యం, వస్తువులు భద్రపరుచుకునేందుకు తాత్కాలిక క్లోక్ రూమ్‌లు, తలనీలాలు సమర్పించేందుకు తాత్కాలిక కేశఖండన శాలలు, క్షురకుల ఏర్పాటు, మంచినీటి సౌకర్యం, వైద్య సౌకర్యాలు కల్పించాలని నిర్ణయించారు. భక్తులు కూర్చుని సేదతీరేందుకు వీలుగా చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తారు. జిల్లాలోని నదీపరీవాహక ప్రాంతంలో లేని దేవాలయ సిబ్బందితో పాటు ఇతర జిల్లాల నుంచి సిబ్బందిని రప్పించి వారి సేవలు వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. త్వరలో ప్రణాళికలు సిద్ధం... గోదావరి నదీ తీర ప్రాంతంలోని దేవాలయాల మరమ్మతులకు దేవాదాయ శాఖ ఈ ఏడాది ప్రత్యేకంగా నిధులు విడుదల చేసింది. అదే తరహాలోనే ఇక్కడి దేవాలయాలకు నిధులు విడుదల చేస్తామని ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్ వై.వి.అనూరాధ తెలిపారు. ఈ నేపథ్యంలో పురాతన దేవాలయాలకు పూర్తి హంగులు సమకూర్చేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక్కొక్క దేవాలయానికి ఎంత ఖర్చు అవుతుందో లెక్కలు వేస్తున్నారు. త్వరలోనే ఒక నివేదిక ఆర్జేసీ ద్వారా కమిషనర్‌కు పంపుతామని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు. దుర్గగుడిలో అదనపు సౌకర్యాలు... కృష్ణా పుష్కరాల నేపథ్యంలో శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థాన అభివృద్ధిపై ఈవో సీహెచ్ నర్సింగరావు ఇప్పటికే ఒకసారి సిబ్బందితో సమీక్ష సమావేశాలు నిర్వహించారు. కృష్ణాపుష్కరాల 12 రోజులూ భక్తులతో కిటకిటలాడుతుంది కాబట్టి దసరా ఉత్సవాలు, భవానీ దీక్షల్లో ఏవిధంగా ఏర్పాట్లు చేస్తామో అదే తరహాలో దేవాలయ దర్శన వేళలు ఎక్కువసేపు ఉంచడం, ప్రసాదాలు ఎక్కువగా తయారు చేయించడం, భక్తులు వేగవంతంగా దర్శనం పూర్తి చేసుకోవడం వంటి సౌకర్యాలు కల్పిస్తామని ఈవో తెలిపారు. -
బదిలీ భయం
ఇంద్రకీలాద్రిపై జోరుగా ఊహాగానాలు 40 మంది ఉద్యోగులు బదిలీ అంటూ ప్రచారం దీర్ఘకాలంగా పాతుకుపోయిన సిబ్బంది కృష్ణా పుష్కరాల నేపథ్యంలోనే ఈ నిర్ణయం? విజయవాడ : శ్రీదుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఉద్యోగులకు బదిలీల ఫీవర్ పట్టుకుంది. ఈనెల 15వ తేదీ వరకు బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో ప్రతి ఒక్కరూ టెన్షన్ టెన్షన్‌గా ఉన్నారు. రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల్లో దీర్ఘకాలంగా పనిచేస్తున్న సిబ్బందిని మారిస్తే బాగుంటుందని దేవాదాయశాఖ కమిషనర్ అనూరాధ భావిస్తున్నారు. దీనికితోడు ఇటీవల దేవాదాయశాఖ మంత్రి పి.మాణిక్యాలరావు నగరానికి వచ్చినప్పుడు తమ శాఖలో బదిలీలు ఉంటాయని చెప్పడంతో ఇంద్రకీలాద్రిపై ఈ ప్రచారం మరింత జోరందుకుంది. 2006 తరువాత బదిలీలే లేవు.. 2006లో అప్పటి కమిషనర్ ఏబీ కృష్ణారావు రాష్ట్రంలోని 12 దేవాలయాల్లో భారీగా మార్పులు చేర్పులు చేశారు. ఏఈవో స్థాయి నుంచి అటెండర్ వరకు పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరిగింది. అప్పట్లో దుర్గగుడిలో పనిచేసిన ఉద్యోగిని శ్రీకాళహస్తికి కూడా బదిలీ చేశారు. ఆ తరువాత కాలంలో అధికారులు, సిబ్బంది తమ పరపతిని ఉపయోగించుకుని తిరిగి సొంత దేవాలయాలకు చేరుకున్నారు. 2010 నాటికి దరిదాపుగా సిబ్బంది అంతా ఎక్కడివారు అక్కడికి వచ్చేశారు. అప్పటి నుంచి పని సర్దుబాటు కోసమో, ఉద్యోగుల కోరిక మేరకో బదిలీలు జరుగుతున్నాయి తప్ప పెద్ద ఎత్తున జరగలేదు. తిరిగి ఇప్పుడు సమూలంగా ప్రక్షాళన చేయాలని ఆ శాఖ మంత్రి, కమిషనర్ భావిస్తున్నారు. దీర్ఘకాలంగా పాతుకుపోయిన ఉద్యోగులు దుర్గగుడిలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న 70శాతం మంది సిబ్బంది ఇక్కడే దీర్ఘకాలంగా పాతుకుపోయారు. తప్పని పరిస్థితుల్లో పెనుగంచిప్రోలు దేవాలయంలోనో, ద్వారకా తిరుమల దేవస్థానంలోనో కొద్దిరోజులు చేసి తిరిగి స్వస్థలానికి చేరుకుంటున్నారు. దీర్ఘకాలంగా ఇక్కడే పాతుకుపోయి ఉండటంతో దేవస్థానంలోని పనులను బినామీ పేర్లతో తామే చేయడం, ఖాళీ అవుతున్న పోస్టులపై దృష్టిపెట్టి తమ వారికి తెచ్చుకోవడంపైనే శ్రద్ధ చూపుతున్నారు. దేవస్థానంలో ఎన్‌ఎంఆర్‌లుగా పనిచేసే సిబ్బందిలో మూడొంతుల మందికి పర్మినెంట్ ఉద్యోగులతో బంధుత్వాలు ఉన్నాయి. దేవస్థానానికి చెందిన ఒక మహిళా ఇంజినీర్ తన తమ్ముడిని తాత్కాలిక ఇంజినీర్‌గా నియమించుకోవడమే ఇందుకు ఉదాహరణ. ఇక శానిటేషన్, ప్రసాదాల తయారీ తదితర విభాగాల్లో టెండర్లు, క్యాంటీన్ లీజులు, దుకాణాలు.. సిబ్బంది బినామీలకే దక్కుతున్నాయి. 40 మందికి బదిలీలు? ప్రస్తుతం దేవస్థానంలో సమూల ప్రక్షాళన చేస్తే తప్పా కృష్ణా పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించడం కష్టం. ఇప్పుడు చేయకపోతే పుష్కరాలు పూర్తయ్యే వరకు చేయకూడదు. మధ్యలో బదిలీలు చేస్తే ఇబ్బంది అవుతుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దేవస్థానం నుంచి 40 మందిని సాగనంపాలనే ఆలోచనలో కమిషనర్ ఉన్నట్లు తెలిసింది. అయితే, ఈ వారంలోనే బదిలీలు జరుగుతాయా? లేక సిబ్బంది యధావిధిగా కొనసాగుతారా? అనేది వేచిచూడాలి.