నీటి కొరత లేకుండా దీక్ష తీసుకుందాం
పుష్కరాలపై వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు
అమరావతి: కృష్ణా పుష్కరాలకు రాష్ట్రంలో నీటి కొరత లేకుండా దీక్ష తీసుకుందామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.పుష్కరాలపై బుధవారం అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ జరిపారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 12 అంశాలపై 12 రోజుల పాటు చర్చలు, గోష్టులు నిర్విహ స్తామని, మంత్రులు వీటికి ఇన్‌చార్జ్‌లుగా వ్యవహరిస్తారని సీఎం తెలిపారు. పుష్కరాలకు భారీగా ఆహ్వానాలు పంపాలని అధికారులను సీఎం ఆదేశించారు.
గురువారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు.. శుక్రవారం సాయంత్రానికి తిరిగి విజయవాడ చేరుకుంటారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్, న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ జాస్తి చలమేశ్వర్, కేంద్ర మంత్రులు వెంకయ్య, సురేశ్‌ప్రభు, నిర్మలా సీతారామన్ తదితరులను పుష్కరాలకు ఆహ్వానించనున్నారు.