ఏ ప్రభుత్వాలైనా ప్రజలకు అనుగుణంగా పనిచేయాలని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ అన్నారు.
- జస్టిస్ ఎన్‌వి రమణ
విజయవాడ (భవానీపురం)
ఏ ప్రభుత్వాలైనా ప్రజలకు అనుగుణంగా పనిచేయాలని, అప్పుడే అవి వారి అభిమానాన్ని చూరగొంటాయని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వి రమణ అన్నారు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని బుధవారం ఆయన విజయవాడ పున్నమిఘాట్‌లో పుష్కర స్నానమాచరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రకృతిని, నదులను గౌరవించాలన్నారు. తెలుగు ప్రజల జీవనాధారమైన కృష్ణానదిని పూజించాలని అన్నారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి ఏర్పడిన తరువాత వచ్చిన తొలి పుష్కరాలలో స్నానమాచరించటం ఎంతో సంతోషంగా ఉందన్నారు. పుష్కర సమయంలో స్నానం చేయటం ఎంతో పవిత్రమైనదని, ప్రతి ఒక్కరూ దానిని ఆచరించాలని సూచించారు.