సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ (ఫైల్)
సాక్షి, విజయవాడ: ప్రస్తుతం తనకు ఏ పార్టీతో అనుబంధం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ తెలిపారు. ఆయన ఆదివారం విజయవాడలో మాట్లాడారు. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విలేకరుల సమావేశం నిర్వహించిన ముగ్గురు న్యాయమూర్తుల్లో జస్టిస్ చలమేశ్వర్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆయన మాట్లాడుతూ తన గురించి ఎవరేం మాట్లాడినా పట్టించుకోనని, జడ్జికి వ్యక్తిగత నమ్మకాలు, అభిమానాలు ఉండకూడదని అన్నారు.
'రెండు వారాల క్రితం నా స్నేహితుడు ఓ వాట్సప్ మెసెజ్ పంపాడు. నేను ఒక రాజకీయ పక్షానికి చెందిన వాడిని కాబట్టి ముగ్గురు న్యాయమూర్తులతో కలిసి ప్రెస్‌మీట్ పెట్టానని ఆ మెసెజ్‌లో ఉంది. ఎవరి అభిప్రాయం వారిది. అయితే, అది కొంత హేతుబద్ధంగా ఉండాలి. ఎన్‌జేఏసీ (జాతీయ జ్యుడీషియల్ నియామకాల కమిషన్)లో జడ్జిమెంట్లు, డిసెంటింగ్ జడ్జిమెంట్లు రాసినప్పుడు ఇవాళ నేను ఏ పార్టీకి చెందిన వాడినని ప్రచారం చేశారో ఆ పార్టీకి చెందిన వాళ్ళే నేను అధికార పార్టీకి చెందిన వాడినని, అందుకే వారికి అనుకూలంగా తీర్పును రాశానని ప్రచారం చేశారు.
ఇవాళ్ళ ఏదో కారంణంతో ఇంకో పక్షమంటున్నారు. నేను ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు. నాకు ఓ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండేది. నాకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధముందో అందరికీ తెలుసు. జడ్జిని అయిన మరునాడే ఆ పార్టీతో అనుబంధాన్ని వదులుకున్నా.. వ్యక్తిగత నమ్మకాలు, అభిమానాలు ఈ ఉద్యోగంలోకి తేకూడదు. నేను జడ్జి పదవిలోకి వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఇచ్చాను. ఇవాళ నాగురింది మాట్లాడే వాళ్ళను ఎంతమంది మహానుభావులు డిక్లరేషన్ ఇచ్చారో కనుక్కోమనండి. నేను రిటైర్ట్ అయ్యాక ఏ పార్టీకి వెళ్ళి పదవులు అడుక్కోను' అని ఆయన అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment