Justice Chelameswar
-
‘ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం’
రాయదుర్గం: ఎన్నికల్లో వ్యయం పెరగడం ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదమని, దీన్ని పూర్తిగా తగ్గిస్తేనే ప్రజాస్వామ్యం ఆశించిన స్థాయిలో విజయవంతమవుతుందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ అన్నారు. గచ్చిబౌలిలోని ఇండి యన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)లో ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫారŠమ్స్, ఐఎస్బీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంయుక్తంగా ‘ఇండియన్ డెమోక్రసీ ఎట్ వర్క్ వార్షిక సదస్సుల సిరీస్‌లో భాగంగా ‘మనీ పవర్ ఇన్ పాలిటిక్స్’అనే అంశంపై 2 రోజుల చర్చా కార్యక్రమాన్ని గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్యానల్ డిస్కషన్లో ‘ఆర్గనైజేషనల్ బర్డన్ ఆన్ పొలిటికల్ పార్టీస్’అనే అంశంపై జరిగిన చర్చకు ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జస్టిస్ చలమేశ్వర్ మాట్లాడుతూ.. ప్రస్తుత లోక్‌సభలో అత్యధికంగా కోటీశ్వర్లు ఉన్నట్లు పత్రికల్లోనే వస్తున్నాయని అన్నారు. అయిదేళ్ల పదవీకాలం తర్వాత కొందరి ఆస్తులు 500 రెట్లు పెరిగాయని మనం వింటున్నామని తెలిపారు. ఢిల్లీలో తాను పాల్గొన్న ఓ సమావేశంలో మాజీ ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ఒక ఎంపీ ఎన్నికల్లో రూ.50 కోట్లు వ్యయం చేశారని, ఒక మహిళ కూడా రూ.50 కోట్ల వరకు వ్యయం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించినట్లు వెల్లడించారు. ప్రముఖులు ఎవరేమన్నారు.. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రభావాన్ని పూర్తిగా తగ్గించే అంశంపై అంతటా చర్చ జరగాలని తెలంగాణ ఎన్నికల అధికారి రజత్‌కుమార్ అన్నారు. రాష్ట్రంలో 2018, 2019లో నిర్వహించిన ఎన్నికల్లో డబ్బు, మద్యం గణనీయంగా పట్టుబడిందని తెలిపారు. ప్రజల్లో మార్పు వస్తే ఇలాంటి వాటిని సులభంగా అరికట్టవచ్చని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వ్యయం గణనీయంగా పెరిగిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అన్నారు. రాజకీయ పార్టీలకు కార్పొరేట్ సంస్థలు, ఎన్జీవోలు ఇచ్చే నిధులపై నిషేధం విధించాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. రాజకీయ పార్టీలకు కార్యకర్తలే బలమని, కేడర్‌పై చేసే వ్యయం ఏమాత్రం భారం కాబోదని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బి.వినోద్‌కుమార్ అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజకీయ పార్టీలను నడపడం వ్యయంతో కూడుకున్న ప్రక్రియగా మారిందని ఎంపీ రాజీవ్‌గౌడ తెలిపారు. స్థానిక సంస్థలకు పార్టీయేతర ఎన్నికలు పెడితే గ్రామీణ స్థాయిలో డబ్బు ప్రభావం గణనీయంగా తగ్గే అవకా«శం ఉందని రాష్ట్ర మాజీ ప్రధాన కార్యదర్శి కె మాధవరావు అభిప్రాయపడ్డారు. సమావేశంలో లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
నేడు జస్టిస్ చలమేశ్వర్ పదవీవిరమణ
-
సంస్కరణలకు తక్షణ తరుణం
కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల స్వతంత్ర ప్రతిపత్తికి పూచీ పడుతూనే, ప్రభుత్వ, పార్లమెంట్ నిర్ణయాలను ప్రశ్నించడానికీ లేదా వ్యాఖ్యానించడానికీ న్యాయవ్యవస్థకు రాజ్యాంగం హక్కు కల్పించింది. ఈ ప్రతిపత్తిని కోర్టుకు దక్కనివ్వకుండా చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే తీరులోనే వ్యవహరించిన సంగతిని విస్మరించలేం. కేవలం 540 మంది లోక్‌సభ సభ్యులు 125 కోట్ల మంది భారతీయుల మౌలిక ప్రయోజనాలను, రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించి ఆదేశించిన కుల, మత, సామాజిక వ్యత్యాసాలు లేని, దోపిడీ వ్యవస్థకు తావులేని సెక్యులర్, సోషలిస్ట్ సమాజ నిర్మాణానికి, రక్షణకు ఎంతవరకు సహకరించే స్థితిలో ఉన్నారు? ‘భారత రాజ్యాం గంలో సుప్రీం కోర్టు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ. కానీ దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం మసకబారుతూ ఉండడంతో న్యాయస్థానం విశ్వసనీయత హరించుకుపోతుంది.’ – ఫ్రంట్‌లైన్, 25–5–2018 (హిందూ గ్రూపు) ‘భావితరాల కోసం న్యాయ వ్యవస్థ హోదాను సంరక్షించుకుని కాపాడుకోవలసిన అవసరం ఉంది. న్యాయ వ్యవస్థ దృఢంగా, తగినంత స్వతంత్ర ప్రతిపత్తితో మెలగుతూ వర్తమాన సామాజిక సమస్యల పట్ల బాధ్యతతో ఉండాలి. ఈ దేశంలో ఎవరికీ భద్రత లేదు. ఈ పరిస్థితులలో పరిపాలనలో ఉన్న స్త్రీపురుషులను అదుపాజ్ఞలలో పెట్టగల యంత్రాంగం స్వతంత్ర న్యాయ వ్యవస్థ మాత్రమే. పదవులలో ఉన్నవారిని అధికారం అవినీతి పాల్జేస్తుందని మానవచరిత్ర నిరూపించింది. అధికారంలో ఉన్న పార్టీలు సీబీఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లను దుర్వినియోగం చేస్తున్నాయి.’ – జస్టిస్ చలమేశ్వర్ (నాగ్‌పూర్ సభలో, 17–4–18) ఇటీవల దేశ పరిపాలన క్రమంలో గొలుసుకట్టుగా సాగిన పరిణామాలు గణతంత్ర రాజ్యాంగ నిర్దేశిత లక్ష్యాలకే ప్రమాదకరంగా పరిణమించిన సూచనలు కనిపిస్తున్నాయి. ఇందుకు దారితీసిన పరిణామాలు నాలుగు: 1. ఒక వైద్య కళాశాల ప్రవేశాల వ్యవహారంలో జరిగిన కుంభకోణంలో పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి ఒకరికి సంబంధం ఉన్న అంశాన్ని పరిశీలించాలని ఒక ఎన్జీవో (ప్రభుత్వేతర సంస్థ) సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా సిద్ధపడలేదు. దీనితో పిటిషనర్ నుంచి మరో పిటిషన్ దాఖలైంది. ఈసారి జస్టిస్ దీపక్ మిశ్రా లేని ధర్మాసనానికి తన దరఖాస్తును నివేదించాలని పిటిషనర్ (ఎన్జీవో) కోరడం జరిగింది. ఆపై అత్యున్నత న్యాయస్థానంలో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ వేరే ధర్మాసనం ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు. 2. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కేఎం జోసెఫ్, సీనియర్ న్యాయవాది ఇందు మల్హోత్రాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా కొలీజియం (న్యాయ పాలనా నిర్వహణ వ్యవస్థ) సిఫారసు చేయడం. 3. సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తిగా సొహ్రా బుద్దీన్ ఎన్కౌంటర్ కేసును విచారిస్తున్న జస్టిస్ లోయా ఆకస్మికంగా మరణించారు. ఈ కేసులో ఒక బీజేపీ ప్రముఖ నేత అభియోగాలను ఎదుర్కొంటున్నారు. లోయా మరణం గురించి న్యాయవాదులు, పౌర సంఘాల ప్రతినిధులు, లోయా తోబుట్టువులు అనుమానాలు వ్యక్తం చేశారు. చివరకు కేసు సుప్రీం కోర్టుకు చేరినా సమగ్ర విచారణకు ఆదేశాలు ఇవ్వడానికి అంగీకరించక, కొట్టివేయడం జరిగింది. ఇంకొక అంశం– జస్టిస్ దీపక్ మిశ్రా మీద రాజ్యసభలో విపక్షం ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానాన్ని చైర్మన్ వెంకయ్యనాయుడు ఏకపక్షంగా తోసిపుచ్చడం. 4. సుప్రీంకోర్టుకు వచ్చిన పిటిషన్లను సంబంధిత ధర్మాçసనాలకు కేటాయించడంలో ప్రధాన న్యాయమూర్తి సోదర న్యాయమూర్తులతో సంప్రతించడం అనివార్యమా అన్న ప్రశ్న తలెత్తింది. దీనిపైన న్యాయమూర్తులలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనాయి. ఇంత పెద్ద దేశాన్ని వారే శాసించాలా? కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల స్వతంత్ర ప్రతిపత్తికి పూచీ పడుతూనే, ప్రభుత్వ, పార్లమెంట్ నిర్ణయాలను ప్రశ్నించడానికీ లేదా వ్యాఖ్యానించడానికీ న్యాయవ్యవస్థకు రాజ్యాంగం హక్కు కల్పిం చింది. ఈ ప్రతిపత్తిని కోర్టుకు దక్కనివ్వకుండా చేయడంలో కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందే తీరులోనే వ్యవహరించిన సంగతిని విస్మరించలేం. కేవలం 540 మంది లోక్‌సభ సభ్యులే 125 కోట్ల మంది భారతీయుల మౌలిక ప్రయోజనాలను, రాజ్యాంగం స్పష్టంగా నిర్వచించి ఆదేశించిన కుల, మత, సామాజిక వ్యత్యాసాలు లేని, దోపిడీ వ్యవస్థకు తావులేని సెక్యులర్, సోషలిస్ట్ సమాజ నిర్మాణానికి, రక్షణకు ఎంత వరకు సహకరించే స్థితిలో ఉన్నారు? ఏడు దశాబ్దాలుగా పాలకవర్గ ఆచరణ దీనిని నిరూపిస్తూనే ఉంది. అలాంటి వాతావరణంలో మనం నిర్వహించుకుంటున్న పెట్టుబడిదారీ వ్యవస్థలో న్యాయస్థానాలు కూడా తమ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడుకోలేవని (తొలి రెండు దశాబ్దాల నాటి భారత న్యాయమూర్తుల తీర్పులను మినహాయిస్తే) నేటి చరిత్ర మరింత స్ఫుటంగా హెచ్చరిస్తున్నది. అనేక సందర్భాలలో సాక్ష్యాలు ఉన్నా వాటిని ‘నిర్దిష్టంగా లేవు’ అన్న సాకుతో నీరుగారుస్తున్నారు. బీజేపీ హయాంలో 2002లో గుజరాత్లో మైనారిటీల మీద జరిగిన దాడులు కావచ్చు, ఇప్పుడు ఉత్తరాది నుంచి దక్షిణాది వరకు ఏదో ఒక పేరుతో దళితులు, మైనారిటీల మీద జరుగుతున్న దాడుల విషయంలో గానీ సాక్ష్యాలను, సాక్షులను మాయం చేస్తున్న ఘటనలు మీడియా ద్వారా వెలుగు చూస్తున్నాయి. ఐదుగురు సభ్యుల ధర్మాసనం 1964లోనే (కొలీజియంకు మచ్చలేని రోజులు) అన్ని కేసులలోను అన్ని సాక్ష్యాలను నమ్మలేకపోయినా సాక్ష్యాన్ని పూర్తిగా విచారించి బేరీజు వేయడంలో న్యాయస్థానం జాగరూకతతో మెలగాలని ఒక తీర్పులో పేర్కొన్నది. ‘ఇచ్చిన సాక్ష్యంలో కొన్ని వైరుధ్యాలు ఉన్నా, లేకపోయినా లేదా సాక్ష్యం సబబైనదేనని కోర్టుకు అనిపించినా లేదా సాక్ష్యం వల్ల బహిర్గతమై గాథ నిజమైనా లేకున్నా – ఇవన్నీ తప్పనిసరిగా గణనలోనికి తీసుకోవలసిందే. కానీ సాక్షులు ఇచ్చిన సాక్ష్యాలు సాక్షికమైనవీ, ప్రయోజనాలు ఆశించినవీ కాబట్టి, వాటిని సాక్ష్యాలుగా పరిగణించరాదన్న భావన మాత్రం హేతు విరుద్ధం. కేవలం ఫలానా సాక్ష్యాన్ని అది పాక్షికమైనదన్న కారణంగా యాంత్రికంగా (మెకానికల్ రిజెMý‡్షన్) తోసిపుచ్చడమంటే తరచూ అన్యాయానికే దారితీస్తుంది’’(మసల్తీ వర్సెస్ ఉత్తరప్రదేశ్ కేసులో సుప్రీం తీర్పు). న్యాయ నిపుణుడు జస్టిస్ వి.ఆర్. కృష్ణయ్యర్ ఒక సందర్భంలో చెప్పినట్టు ‘‘న్యాయమూర్తులు వివాదాలపై తీర్పులు చెబుతూంటారు. కానీ, సమాజాన్ని మార్చడం కూడా న్యాయమూర్తుల కర్తవ్యం కాగలిగినప్పుడు అసలైన మార్పుకు దోహ దం చేయగలుగుతారు!’’ సంస్కరణలకు తొందరపడాలి ఈ అనుభవాలన్నింటిని రంగరించి, క్రోడీకరించుకున్న జస్టిస్ కృష్ణయ్యర్ న్యాయవ్యవస్థకు ఆరోగ్యకరమైన ఒక ‘సంస్కరణ పత్రాన్ని’(రిఫార్మ్ ఎజెండా) 1980లోనే అందజేశారు: అందులో: ‘‘మన న్యాయస్థానాలు నేడు క్లిష్ట దశలో ఉన్నాయి, మన జడ్జీలకు సవాళ్లు ఎదురవుతున్నాయి. మన న్యాయ పాలనా వ్యవస్థ ఎంత గోప్యంగా, ఎంత ఆటంకంగా తయారైందంటే– అది సామాన్య ప్రజల నుంచి దూరంగా జరిగిపోయింది. అందుకనే ఈ మౌలికమైన లోటును సవరించాలి. ఇందుకు న్యాయ ప్రక్రియలోనే సంస్కరణ, కూలంకషమైన మార్పులు రావాలి. మన న్యాయ వ్యవస్థ రాజ్యాంగ దార్శనిక దృష్టి స్పష్టంగా, ప్రకాశమానంగా ఉండాలి. దాని లక్ష్యం రాజ్యాంగం ముందుమాటలో నిర్వచించిన ప్రజానుకూల విలువలకు కట్టుబడి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర స్థాయి శాసన వేదికలు నేడు సమాజంలోని మోతుబరులకే అనుకూల వ్యవస్థలు. శ్రామిక ప్రజా బాహుళ్యంతో సంబంధం లేని వర్గాలు న్యాయ వ్యవస్థ తీరుతెన్నుల్ని నడిపిస్తున్నాయి. వీరి ఎంపిక ఆశ్రిత పక్షపాతం ఆదాయ వనరులపై ఆధారపడి జరుగుతుంటుంది. జడ్జీల ఎంపిక ప్రక్రియలో, సుప్రీం బెంచ్‌కి సోదర న్యాయమూర్తులను ఎంచుకోవడంలో చర్యలు కొన్ని సందర్భాలలో సెలక్షన్ తీరుకు విరుద్ధంగా ఉంటున్నాయి. చివరికి ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) సహితం పేదల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వాడుతున్నారు’’అన్నారు (ఫ్రం బెంచ్ టు బార్’ జస్టిస్ కృష్ణయ్యర్). ఎన్నికైన ప్రతినిధులూ, శాసనకర్తలూ ఎంతగా వంకర పద్ధతుల్లో ధన ప్రయోగానికీ అవి నీతికీ పాల్పడుతుంటారో ఇంటర్నెట్ ద్వారా ఒకరు తనకు ‘ఈ–మెయిల్’లో పంపిన వ్యంగ్య సందేశాన్ని జస్టిస్ కృష్ణయ్యర్ ప్రస్తావించారు. అందులో పేర్కొన్న ‘కంపెనీ’ ఏదో కాదు సుమా! ప్రభుత్వమే. ‘‘ఈ కంపెనీ కింద పనిచేసే ‘ఉద్యోగులు’ 500 మంది పైచిలుకు ఉంటారు. అందులో 29 మంది భార్యల్ని వేధించేవారని ఆరోపణ. మరి ఏడుగురు మోసాల కారణంగా అరెస్టయినవారు. 19 మంది పైన క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. 117 మంది మీద హత్య, రేప్‌లు, దాడులు, దోపిడీ నేరాల మీద విచారణ సాగుతోంది. 71 మంది తీసుకున్న రుణాలు/అప్పులున్నందున పరపతి పుట్టనివారు. 21 మంది అనేక కోర్టు దావాల్లో ఇరుక్కున్నవారు. 84 మంది దాడుల కేసుల్లో జరిమానాలు చెల్లించారు. ఇంతకూ ఇంతటి ‘బడా కంపెనీ’ ఏదై ఉంటుందో ఊహించండి. ఆ ‘కంపెనీ’ భారత దిగువ సభ, ఇది నీ కోసం, నా కోసమే పనిచేస్తుంది సుమా! దిగువ సభలోని 545 మంది సభ్యులు నీ కోసం నా కోసమే పనిచేస్తారు. ఇదే ‘గ్రూపు’ మనల్నందర్నీ ఒక వరసలో నిలబెట్టి వందలాదిగా చట్టాలు చేస్తుంది. ఇంతటి భారీ ‘కంపెనీ’ గురించి మనమేమైనా చేయగలమా?!’’. ఆ ప్రశ్నార్థకంతో ఆ ఈ–మెయిల్ సందేశాన్ని జస్టిస్ ముగించారు. -ఏబీకే ప్రసాద్,సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
జస్టిస్ చలమేశ్వర్ రిటైరైతే ఎట్లా..?
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు జడ్జీగా నియమించేందుకు ఉత్తరాఖండ్ చీఫ్ జస్టిస్ కేఎం జోసఫ్ పేరును మరోసారి కేంద్రం ముందు ప్రతిపాదించేందుకు సుప్రీంకోర్టు కొలీజియం శుక్రవారం సూత్రబద్ధంగా అంగీకరించింది. సుప్రీంకోర్టులో మరికొన్ని పదోన్నతులకు సిఫారసు చేయాల్సి ఉన్నందున మే 16వ తేదీన మరోసారి సమావేశమై జోసఫ్‌తోపాటు అన్ని సిఫారసులను ఒకేసారి పంపించాలని చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నాయకత్వంలోని ఐదుగురు సభ్యులు గల కొలీజియం అభిప్రాయపడింది. 16వ తేదీన ఆ సమావేశం జరక్కపోతే ఏమవుతుంది? సుప్రీంకోర్టులో రెండవ సీనియర్ న్యాయమూర్తి అయిన జస్టిస్ జే. చలమేశ్వర్ జూన్ 22వ తేదీన పదవీ విరమణ చేస్తున్నారు. ఆయన ఆఖరి వర్కింగ్ రోజు మే 18వ తేదీ. ఆ మరుసటి రోజు నుంచి సుప్రీం కోర్టుకు సెలవులు. జూలై రెండవ తేదీన తిరిగి సుప్రీంకోర్టు తెరచుకునేలోగా ఆయన పదవీ కాలం ముగిసిపోతుంది. జస్టిస్ చలమేశ్వర్ కొలీజియం సభ్యుడన్న విషయం తెల్సిందే. మే 18వ తేదీలోగా కేఎం జోసఫ్ విషయంలో సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకోకపోవడం వల్ల ఏం జరుగనుంది? కొలీజియంలోని జడ్జీ ఎవరైన పదవీ విరమణ చేసినా, అందుబాటులో లేకపోయినా ఆ స్థానంలో వచ్చే కొత్త జడ్జీతో కొలీజియంను తిరిగి ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. చలమేశ్వర్ స్థానంలో జస్టిస్ సీకే సిక్రీ కొలీజియంలోకి రానున్నారు. సుప్రీంకోర్టు జడ్జీగా కేఎం జోసఫ్ పేరును ప్రతిపాదించేందుకు జస్టిస్ సిక్రీ వ్యతిరేకిస్తే ఇక ఆయన నియామకం జరగదు. ఎందుకంటే, ఐదుగురు సభ్యులుగల సుప్రీం కోర్టు కొలీజియం ఏకగ్రీవంగా చేసిన సిఫారసుకు కేంద్రం కట్టుబడి వ్యవహరించాల్సి ఉంటుంది. ఏ ఒక్కరు వ్యతిరేకించినా ఆ సిఫారసును కేంద్రం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చవచ్చు. పునర్ ప్రతిపాదన విషయంలోనే ఈ నిబంధన వర్తిస్తుంది. జస్టిఫ్ జోసఫ్‌ను సుప్రీంకోర్టు జడ్జీగా నియమించాలంటూ కొలీజియం చేసిన సిఫారసును మోదీ ప్రభుత్వం తిరస్కరించిన విషయం తెల్సిందే. అందుకని మరోసారి జోసఫ్ పేరును ప్రతిపాదించాలని జస్టిస్ చలమేశ్వర్లతో కూడిన కొలీజియం సూత్రబద్ధంగా అంగీకరించింది. మే 16లోగా కొలీజియం సమావేశం కానప్పుడే ఈ సమస్య ఉత్పన్నమవుతుంది. సుప్రీంకోర్టు సెలవుల్లో కూడా అవసరమైతే కొలీజియం సమావేశాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి ఏర్పాటు చేయవచ్చు. అయితే, ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అలాంటి సమావేశానికి చొరవ తీసుకుంటారా? అన్నది ప్రశ్న. -
విందు సమావేశం: హాజరు కాని జస్టిస్ చలమేశ్వర్
-
ఎంతమంది మహానుభావులు డిక్లరేషన్ ఇచ్చారు?
సాక్షి, విజయవాడ: ప్రస్తుతం తనకు ఏ పార్టీతో అనుబంధం లేదని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ తెలిపారు. ఆయన ఆదివారం విజయవాడలో మాట్లాడారు. ఇటీవల సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ విలేకరుల సమావేశం నిర్వహించిన ముగ్గురు న్యాయమూర్తుల్లో జస్టిస్ చలమేశ్వర్ కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆయన మాట్లాడుతూ తన గురించి ఎవరేం మాట్లాడినా పట్టించుకోనని, జడ్జికి వ్యక్తిగత నమ్మకాలు, అభిమానాలు ఉండకూడదని అన్నారు. 'రెండు వారాల క్రితం నా స్నేహితుడు ఓ వాట్సప్ మెసెజ్ పంపాడు. నేను ఒక రాజకీయ పక్షానికి చెందిన వాడిని కాబట్టి ముగ్గురు న్యాయమూర్తులతో కలిసి ప్రెస్‌మీట్ పెట్టానని ఆ మెసెజ్‌లో ఉంది. ఎవరి అభిప్రాయం వారిది. అయితే, అది కొంత హేతుబద్ధంగా ఉండాలి. ఎన్‌జేఏసీ (జాతీయ జ్యుడీషియల్ నియామకాల కమిషన్)లో జడ్జిమెంట్లు, డిసెంటింగ్ జడ్జిమెంట్లు రాసినప్పుడు ఇవాళ నేను ఏ పార్టీకి చెందిన వాడినని ప్రచారం చేశారో ఆ పార్టీకి చెందిన వాళ్ళే నేను అధికార పార్టీకి చెందిన వాడినని, అందుకే వారికి అనుకూలంగా తీర్పును రాశానని ప్రచారం చేశారు. ఇవాళ్ళ ఏదో కారంణంతో ఇంకో పక్షమంటున్నారు. నేను ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు. నాకు ఓ రాజకీయ పార్టీతో అనుబంధం ఉండేది. నాకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధముందో అందరికీ తెలుసు. జడ్జిని అయిన మరునాడే ఆ పార్టీతో అనుబంధాన్ని వదులుకున్నా.. వ్యక్తిగత నమ్మకాలు, అభిమానాలు ఈ ఉద్యోగంలోకి తేకూడదు. నేను జడ్జి పదవిలోకి వచ్చేటప్పుడు డిక్లరేషన్ ఇచ్చాను. ఇవాళ నాగురింది మాట్లాడే వాళ్ళను ఎంతమంది మహానుభావులు డిక్లరేషన్ ఇచ్చారో కనుక్కోమనండి. నేను రిటైర్ట్ అయ్యాక ఏ పార్టీకి వెళ్ళి పదవులు అడుక్కోను' అని ఆయన అన్నారు. -
‘సుప్రీం’ సంక్షోభంపై న్యాయ నిపుణుల స్పందనలు
సాక్షి, న్యూఢిల్లీ : సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మీడియా సమావేశాన్ని అసాధారణ అంశంగా న్యాయ నిపుణులు పేర్కొన్నారు. దీని వెనుక ఏదో బలమైన కారణాలు ఉండవచ్చని మరికొందరు వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతో న్యాయ వ్యవస్థ విశ్వసనీయతపై సందేహలు తలెత్తాయని కొందరు న్యాయ కోవిదులు ఆందోళన వ్యక్తం చేశారు. సీనియర్ న్యాయవాదులు కేటీఎస్ తులసీ, న్యాయ శాఖ మాజీ మంత్రులు సల్మాన్ ఖుర్షీద్, అశ్వనీ కుమార్, మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఆర్ఎస్ సోధీ, జస్టిస్ ముకుల్ ముద్గల్లు ఆందోళన వెలిబుచ్చగా.. సీనియర్ న్యాయవాది ఇందిరా జై సింగ్ ఈ పరిణామాల్ని ఆహ్వానించడంతో పాటు, మీడియా సమావేశం నిర్వహించిన నలుగురు న్యాయమూర్తుల్ని అభినందించారు. ‘ఈ పరిణామం జరిగి ఉండాల్సింది కాదు. ఇప్పుడు న్యాయమూర్తులు రాజనీతి విజ్ఞతను ప్రదర్శించి, విభేదాలు తొలగి పోయేలా చూడాలి. న్యాయమూర్తుల మధ్య పరస్పర అవగా హన కొనసాగేలా చేయాలి. న్యాయవాదులుగా మేమిదే కోరుకుంటున్నాం’. – సీజేఐతో భేటీ అనంతరం అటార్నీ జనరల్ వేణుగోపాల్ సీనియర్ న్యాయవాదులుగా డబ్బు సంపాదించగల అవకాశమున్నా వృత్తి జీవితాన్ని వారు త్యాగం చేశారు. వారిని మనం గౌరవించాలి. ప్రెస్ కాన్ఫరెన్స్‌తో ఆ న్యాయమూర్తులు ముందుకు వచ్చినప్పుడు.. తప్పుపట్టకుండా తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరముంది. ఈ మొత్తం పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలి. సంప్రదింపులతో ఈ విషయం పరిష్కారమయ్యేలా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నలుగురు న్యాయమూర్తులతో ప్రధాని మాట్లాడాలి. – సుబ్రహ్మణ్య స్వామి, సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ ఆ నలుగురు న్యాయమూర్తులు చాలా బాధ్యత కలిగినవారు. వారు ఈ విధంగా చేయడమంటే.. తప్పకుండా పరిస్థితి అదుపు తప్పి ఉండాలి. కేసుల కేటాయింపు విధానంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి తన అధికార పరిధిని దుర్వినియోగం చేస్తున్నారని వారు చెప్పారు. – ప్రశాంత్ భూషణ్, సీనియర్ న్యాయవాది న్యాయవ్యవస్థలో ఇది చీకటి రోజు. ఈ రోజు జరిగిన మీడియా సమావేశం చెడు సంప్రదాయానికి దారితీయవచ్చు. ఇక నుంచి న్యాయవ్యవస్థలోని అన్ని తీర్పుల్ని సామాన్య పౌరుడు అనుమానాస్పద దృష్టితో చూడవచ్చు. ప్రతి తీర్పును ప్రశ్నించవచ్చు.– ఉజ్జ్వల్ నికమ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మీడియా సమావేశం నిర్వహించడం మినహా ఏ ఇతర ప్రత్యామ్నాయం లేనంత తీవ్రమైన విషయం ఆ నలుగురు న్యాయమూర్తుల వద్ద ఉండొచ్చు. వారు ప్రచారం కోసం పాకులాడే న్యాయమూర్తులు కాదు. అనవసర ప్రచారం కోసం అర్రులు చాచరు. లోయాకు ఈ అంశంతో సంబంధం ఏంటి? నాకైతే ఏమీ తెలియదు. – ముకుల్ ముద్గల్, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఈ అంశంలో నేను చాలా కలత చెందా. ఇది జరిగి ఉండకూడదు. అయితే జరిగింది.. వారి వద్ద ఏదో బలమైన కారణం ఉండవచ్చు. ఈ పరిణామం ప్రజల మనసుల్లో ఆందోళన కలిగించే అవకాశముంది. – ఏకే గంగూలీ, సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఈ పరిణామంతో నేను చాలా నిరాశ చెందా.. నలుగురు సుప్రీం జడ్జీలు ఇలా చేయకూడదు. ఇది న్యాయ వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.– సోలీ సొరాబ్జీ, మాజీ అటార్నీ జనరల్ ఇది చరిత్రాత్మకం.. ఆ నలుగురు న్యాయమూర్తుల్ని నేను అభినందిస్తున్నా. వారితో నేను ఏకీభవిస్తున్నా. ఈ పరిణామం మెచ్చుకోదగింది. సుప్రీంకోర్టులోని ఐదుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తుల మధ్య ఏకాభిప్రాయం ఉండాలి. – ఇందిరా జైసింగ్, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది న్యాయవ్యవస్థలోని అంతర్గత సమస్యను ఇలా బహిరంగంగా చర్చించ డం సరికాదు. నాలుగు గోడల మధ్య పరిష్కరించుకోవాల్సిన సమస్యను నలుగురు న్యాయమూర్తులు అనవసరంగా మీడియా ముందుకు తీసుకు వచ్చారు. న్యాయవ్యవస్థను అప్రతిష్టపాలు చేసేలా వారు ప్రవర్తించారు. –సంతోష్ హెగ్డే, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి చదవండి: 'సుప్రీం' సంక్షోభం ‘సుప్రీం’లో సంక్షోభానికి కారణాలివి! -
అక్కడ అంతా సమానులే
ఆ అంశం మీద ఇంకా అపరిమిత జాప్యం చేయడం సాధ్యంకాదు. ఇదే కోర్టుకు చెందిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం జూలై 4, 2017న గౌరవ జస్టిస్ సీఎస్ కర్ణన్ ((2017) 1 ఎస్సీసీ 1) విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై పునరాలోచన చేయాలని, అభిశంసన కాకుండా వ్యవస్థను క్రమబద్ధం చేసే చర్యలు తీసుకోవాలని (ఆర్ లూథ్రాను ప్రస్తావిస్తూ) ఆ ఏడుగురు న్యాయమూర్తులలో ఇద్దరం పేర్కొన్నాం. ఆ సమయంలో కూడా విధాన క్రమపత్రం గురించి ఆ ఏడుగురు న్యాయమూర్తులలో ఏ ఒక్కరు కూడా ప్రస్తావించలేదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిసెస్ జాస్తి చలమేశ్వర్, రంజన్ గొగొయ్, మదన్ లోకుర్, కురియన్ జోసెఫ్ కలసి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రాకు రెండు మాసాల క్రితం రాసిన లేఖ పూర్తి పాఠం. అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన న్యాయ సంబంధమైన కొన్ని ఆదేశాలు ‘న్యాయ వ్యవస్థ నిర్వహణ మీద ప్రతికూలమైన ప్రభావాన్ని చూపించాయి’అంటూ దేశ అత్యున్నత న్యాయస్థానంలో పనిచేస్తున్న ఐదుగురు సీనియర్ న్యాయమూర్తులలో పైన పేర్కొన్న ఆ నలుగురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ ఆ లేఖ– గౌరవనీయులైన ప్రధాన న్యాయమూర్తిగారికి! అత్యున్నత న్యాయస్థానం ఇస్తున్న కొన్ని ఆదేశాలు మొత్తం న్యాయ వ్యవస్థ పని తీరు మీద, హైకోర్టుల స్వాతంత్య్రం మీద, వీటితో పాటు గౌరవనీయ భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వ్యవస్థ నిర్వహణ మీద కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపించాయి. ఈ అంశాన్ని ఈ లేఖ ద్వారా మీ దృష్టికి తీసుకు రావడం సబబుగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆందోళనతో, తీవ్ర క్షోభతో ఈ లేఖ రాశాం. కలకత్తా, బొంబాయి, మద్రాసు హైకోర్టులు మూడింటిని ప్రత్యేక అధికారాలతో నెలకొల్పిన నాటి నుంచి న్యాయ వ్యవస్థలో కొన్ని ఆచారాలు, సంప్రదాయాలు ఆవిర్భవించాయి. ఆ మూడు హైకోర్టులు ఆవిర్భవించిన తరువాత దాదాపు వందేళ్లకు రూపుదిద్దుకున్న ఈ అత్యున్నత న్యాయస్థానం ఆ ఆచారాలూ, సంప్రదాయాలనే స్వీకరించింది. ఈ సంప్రదాయాలన్నీ ఆంగ్లో– సాక్సన్ న్యాయ సిద్ధాంత అధ్యయనం, అమలు ద్వారానే నెలకొన్నాయి. ఒకసారి స్థిరపడిన ఈ సిద్ధాంతాల ప్రకారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రోస్టర్ (జాబితా)లో, ఆ రోస్టర్‌ను నిర్ణయించడంలో అధికారం కలిగిన పెద్ద అనే హోదా దక్కించుకున్నారు. లావాదేవీలు జరిపేందుకు అవసరమైన కోర్టుల సంఖ్య, కోర్టులు నడిచేందుకు అవసరమైన విధానాల రూపకల్పనకు ఏర్పాట్లు, సుప్రీంకోర్టులో ధర్మాసనం/సభ్యుని నిర్ణయం వంటివాటికి ప్రధాన న్యాయమూర్తి బాధ్యులు. రోస్టర్‌ను రూపొందించడంలో, వ్యాజ్యాన్ని సభ్యులకు/ధర్మాసనాలకు కేటాయించడంలో ప్రధాన న్యాయమూర్తికి ఉన్న ప్రత్యేక హక్కును గుర్తించడమనేది కూడా సంప్రదాయమే. ఇది కోర్టు లావాదేవీలు సమర్థంగా, క్రమపద్ధతిలో సాగేందుకు ప్రవేశపెట్టిన సంప్రదాయమే కానీ, దీనితో ప్రధాన న్యాయమూర్తి న్యాయ నిర్వహణ పరంగా, వాస్తవంగా మిగిలిన తన సహచరుల కంటే అధికునిగా గుర్తించడానికి కాదు. న్యాయ శాస్త్ర వ్యవహారాలలో స్థిరపడిన సంప్రదాయం ప్రకారం భారతదేశంలో ప్రధాన న్యాయమూర్తి అంటే, తనతో సమ స్థాయిలో ఉన్నవారిలో మొదటివారు మాత్రమే అవుతారు. అంతకు మించి ఎక్కువ కాదు, తక్కువ కాదు. అలాగే రోస్టర్ నిర్ధారణలో కూడా ప్రధాన న్యాయమూర్తికి మార్గదర్శకంగా ఉండే విధంగా బాగా స్థిరపడిన, కాల పరీక్షకు నిలిచిన సంప్రదాయాలు ఉన్నాయి. ఆ విధంగా ఆ వ్యాజ్యానికి సంబంధించిన ధర్మాసనాన్ని పటిష్టం చేయడానికి అవసరమైన సంప్రదాయాలను పాటించాలి. పైన పేర్కొన్న ఈ సిద్ధాంతం సహజ పరిణామం ఏమిటంటే బహుళ సభ్యులు కలిగిన ఒక చట్ట బద్ధ వ్యవస్థలో ఉన్నవారు, ఈ ఉన్నత న్యాయస్థానం సభ్యులతో సహా– ఒక ప్రత్యేక వ్యాజ్యం కోసం నియమించిన ధర్మాసనం మీద తమకు తాము ఆధిపత్యం తెచ్చుకోకూడదు. ధర్మాసనం కూర్పులో గానీ, సంఖ్య విషయంలో గాని నిర్ధారించిన రోస్టర్ మేరకు జరిగిన నిర్ణయం మీద వారు ఆధిపత్యం చేయలేరు. ఈ రెండు నియమాలను అధిగమించినట్టయితే వికృతమైన, అవాంఛనీయమైన పరిణామాలు ఎదురవుతాయి. వ్యవస్థ పరిపూర్ణత గురించి సందేహాలు తలెత్తుతాయి. ఇలాంటి సంక్షోభం గురించి మౌనం వహించడం కూడా అలాంటి పలాయనం ఫలితమే కాగలదు. ఇటీవలి కాలంలో ఈ రెండు నిబంధనలకు కచ్చితంగా కట్టుబడి ఉండే పరిస్థితి లేదని చెప్పడానికి చింతిస్తున్నాం. ప్రధాన న్యాయమూర్తి అప్పగించిన వ్యాజ్యం ద్వారా జాతికి, వ్యవస్థకి విస్తృత స్థాయి పరిణామాలు ఎదురైన ఉదంతాలు ఉన్నాయి. అలాగే ఆ కేసుల కోసం ధర్మాసనాలలో నియమించిన ‘వారి సమక్షం’గురించి ఎలాంటి హేతుబద్ధత కనిపించదు. ఎంత మూల్యం చెల్లించి అయినా ఇలాంటి దాని నుంచి రక్షణ కల్పించాలి. వ్యవస్థను ఇబ్బందికి గురి చేయరాదన్న ఉద్దేశంతోనే మేం పూర్తి వివరాలను ఇక్కడ ప్రస్తావించడం లేదు. కానీ పైన పేర్కొన్న నిబంధనల ఉల్లంఘన కారణంగా వ్యవస్థ ప్రతిష్ట ఇప్పటికే కొంతమేర దెబ్బతిన్నది. పైన పేర్కొన్న ఈ నేపథ్యంలోనే ఆర్.బి. లూథ్రా వర్సెస్ కేంద్ర ప్రభుత్వం కేసులో అక్టోబర్ 27, 2017న ఇచ్చిన ఆదేశాలను గురించి కూడా మీ దృష్టికి తీసుకురావడం తప్పనిసరి అని భావించాం. ఈ న్యాయస్థానంలో అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్–ఇతరులు వర్సెస్ భారత ప్రభుత్వం కేసులలో (2016)5 ఎస్సీసీ1) రాజ్యాంగ ధర్మాసనం అదే విధాన క్రమపత్రం గురించి విచారిస్తున్నది. ఆ కేసుపై ఇచ్చిన ఆదేశంలో ప్రజల విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అనుసరించవలసిన పద్ధతికి సంబంధించిన విధాన పత్ర రూపకల్పనలో మరింత జాప్యం నివారించాలని చెప్పారు. అయితే అదే విధాన క్రమపత్రం రాజ్యాంగ ధర్మాసనం పరిశీలిస్తుండగా జాప్యం జరగరాదని ఇతర బెంచ్ ఎలా చెప్పగలుగుతుందో అర్థం చేసుకోవడం కష్టం. ఇదే కాకుండా రాజ్యాంగ ధర్మాసనం నిర్ణయం దరిమిలా ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన (మీతో సహా) కొలీజియం క్షుణ్ణంగా చర్చించి విధాన క్రమపత్రానికి తుది రూపం ఇవ్వడం జరిగింది. దీనినే మార్చి నెల 2017లో గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి, భారత ప్రభుత్వానికి పంపించడం కూడా జరిగింది. కానీ ఈ సమాచారానికి కేంద్ర ప్రభుత్వం స్పందించలేదు. కేంద్రం మౌనం నేపథ్యంలో కోలీజియం ఆమోదించి తుది రూపం ఇచ్చిన విధాన క్రమపత్రానికి సుప్రీంకోర్టు అడ్వొకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ (సుప్ర) కేసులో ఇచ్చిన ఆదేశాల మేరకు కేంద్రం ఆమోదం తెలిపినట్టుగా భావించవలసి వచ్చింది. ఆ విధంగా విధాన క్రమపత్రం తుది రూపానికి సంబంధించి పరిశీలించడానికి ధర్మాసనానికి ఎలాంటి అవకాశం కూడా లేకపోయింది. ఆ అంశం మీద ఇంకా అపరిమిత జాప్యం చేయడం సాధ్యంకాదు. ఇదే కోర్టుకు చెందిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం జూలై 4, 2017న గౌరవ జస్టిస్ సీఎస్ కర్ణన్ (2017)1 ఎస్సీసీ 1) విషయంలో ఒక నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం మేరకు న్యాయమూర్తుల నియామక ప్రక్రియపై పునరాలోచన చేయాలని, అభిశంసన కాకుండా వ్యవస్థను క్రమబద్ధం చేసే చర్యలు తీసుకోవాలని (ఆర్ లూథ్రాను ప్రస్తావిస్తూ) ఆ ఏడుగురు న్యాయమూర్తులలో ఇద్దరం పేర్కొన్నాం. ఆ సమయంలో కూడా విధాన క్రమపత్రం గురించి ఆ ఏడుగురు న్యాయమూర్తులలో ఏ ఒక్కరు కూడా ప్రస్తావించలేదు. విధాన క్రమపత్రం విషయంలో ఏ అంశాన్నయినా ప్రధాన న్యాయమూర్తుల సదస్సులోనే, అది కూడా అందరు న్యాయమూర్తులు కలసి చర్చించాలి. ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఆ అంశంలో చట్టపరిధికి సంబంధించిన నిర్ణయం తీసుకోవలసి వస్తే అది ఒక్క రాజ్యాంగ ధర్మాసనమే తీసుకోవాలి. పైన పరిణామాన్ని ఇంత తీవ్రమైన అంశం అన్న స్థాయిలోనే పరిశీలించాలి. విధి నిర్వహణలో నిబద్ధంగా వ్యవహరించే గౌరవ ప్రధాన న్యాయమూర్తి కొలీజియంతో పూర్తి స్థాయి చర్చలు జరిపి పరిస్థితిని మెరుగుపరచడానికి తగిన చర్యలు తీసుకోగలరని ఆశిస్తున్నాం. అలాగే తరువాతి దశలో ఇందుకు అసవరమైతే ఇతర న్యాయమూర్తులతో కూడా చర్చించాలి. పైన ఉదహరించిన, అంటే ఆర్పీ లూథ్రా వర్సెస్ భారత ప్రభుత్వం వాజ్యంలో అక్టోబర్ 27, 2017న కోర్టులో వెలువడిన ఆదేశాల విషయంలో మీరు మళ్లీ ఒకసారి దృష్టి సారించగలిగితే, ఈ న్యాయస్థానం ఇచ్చిన అలాంటి ఇతర ఆదేశాలను కూడా మీ ముందుకు తీసుకువస్తాం. వాటిని కూడా అదే తీరులో పరిశీలించవలసి ఉంది. గౌరవాభినందనలతో... జె. చలమేశ్వర్, రంజన్ గొగొయ్, మదన్ బి లోకుర్, కురియన్ జోసెఫ్ -
హడావుడిగా చట్టాలు చేస్తే ఇలాగే ఉంటుంది
సాక్షి, న్యూఢిల్లీ: హడావుడిగా చట్టాలు రూపొందిస్తే వివాదాలు, వ్యాజ్యాలు, చిక్కులు మాత్రమే కాకుండా దానికి పర్యవసానంగా వికృత పరిస్థితులు కూడా తలెత్తుతాయని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టాన్ని ఉద్దేశించి సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఏపీల న్యాయాధికారుల విభజన జరపనిదే నియామకాలు, పదోన్నతుల ప్రక్రియ చేపట్టరాదని తెలంగాణ న్యాయమూర్తుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై మూడు రోజులుగా విచారణ జరుగుతోంది. గురువారం సంఘం తరఫు న్యాయవాది ఇందిరా జైసింగ్ వాదనలు వినిపిస్తూ.. న్యాయమైన, సమానమైన వాటా కోసమే తెలంగాణ డిమాండ్ వచ్చిందంటూ జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ సిఫారసులను ఉటంకించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది హరేన్ రావల్ వాదనలు ప్రారంభించారు. రెండు రాష్ట్రాల మధ్య వచ్చే వివాదాలను పరిష్కరించడంలో కేంద్రానిదే కీలక పాత్ర అని నివేదించారు. జస్టిస్ జాస్తి చలమేశ్వర్ జోక్యం చేసుకుంటూ ‘హడావుడిగా చట్టాలు రూపొందిస్తే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. అన్నికోణాల్లో ఎదురయ్యే సమస్యలకు సంబంధిత చట్టంలో నిబంధనలు లేకపోతే వివాదాలు, వ్యాజ్యాలు మాత్రమే కాకుండా దానికి పర్యవసానంగా వికృతమైన పరిస్థితులు తలెత్తుతాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఇరు రాష్ట్రాల పోలీసులు కొట్టుకునే పరిస్థితి రావడం ఈ కోవలోనిదే. ఒక చట్టం ద్వారా ప్రభావితమయ్యే అన్ని తరగతులకు న్యాయపరమైన పరిష్కారం ఆ చట్టంలో ఉండాలి’ అని పేర్కొన్నారు. విచారణ మంగళవారానికి వాయిదా పడింది. -
‘న్యాయశాస్త్రం వైపు ఆకర్షితులవడం శుభపరిణామం’
* న్యాయశాస్త్ర అధ్యయనం వైపు భారతీయ యువత ఆకర్షణ ముదావహం * వాషింగ్టన్ డీసీ సభలో జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ఒకప్పుడు ఇంజినీరింగ్, వైద్య విద్యల వైపు ఉరకలేసిన భారతీయ యువత ప్రస్తుత తరుణంలో న్యాయవాద వృత్తి, న్యాయశాస్త్ర అధ్యయనాల పట్ల ఆకర్షితులవడం దేశ భవితకు శుభ పరిణామం అని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పేర్కొన్నారు. ఆదివారం నాడు వర్జీనియా రాష్ట్ర యాష్‌బర్న్ నగరంలోని సితార సమావేశ మందిరంలో బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంఘం, ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా)లు సంయుక్తంగా స్థానిక ప్రవాస భారతీయులతో ఏర్పాటు చేసిన ముఖాముఖి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నవరక్తం నిండిన యువతరం న్యాయవాద వృత్తి వైపు ఆకర్షితులు కావడం, మౌలిక వసతులు, జవాబుదారీతనం వృద్ధిలోకి రావడం తీర్పులను త్వరితరగతిన అందించేందుకు ఆరోగ్యకర ఆచ్ఛాదనను కల్పిస్తుందని జాస్తి పేర్కొన్నారు. ప్రజల్లో న్యాయవ్యవస్థ పట్ల నమ్మకం కలిగించినప్పుడే అసాంఘిక కార్యకలాపాలకు శాశ్వత అడ్డుకట్ట వేయగలిగి తద్వారా దేశ సురుచిర లక్ష్యాలను అందుకునేందుకు మార్గం సుగమం అవుతుందని అన్నారు. ప్రవాసులు మాతృదేశానికి చేస్తున్న సేవలను ఆయన ప్రత్యేకంగా కొనియాడారు. భారత పార్లమెంట్ ప్రజాస్వామ్యబద్ధమైన శాసనాల ద్వారా కక్షిదారులకు న్యాయం మరింత సత్వరంగా, సమర్థంగా సాంత్వన చేకూర్చేలా చర్యలు చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు. అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తుల ఎంపిక ఆ దేశ అధ్యక్షుడి ద్వారా పారదర్శకంగా నిర్వహింపబడుతున్నట్లే భారత రాజ్యాంగ వ్యవస్థ కూడా ఆ పద్ధతిని ఆకళింపు చేసుకోవాలని ఆయన సూచించారు. పద్మభూషణ్ పురస్కార గ్రహీత, మాజీ రాజ్యసభ సభ్యులు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ప్రసంగిస్తూ ఒబామా వంటి అగ్రరాజ్య అధ్యక్షుడికి కూడా జాతిపిత మహాత్ముడే ఆదర్శమని అటువంటి దేశంలో పుట్టిన మనమంతా దానికి ఎల్లవేళలా సేవ చేస్తూ ఋణపడి ఉండాలని కోరారు. ప్రవాస తెలుగు చిన్నారులకు తెలుగు నేర్పించడం వరకు బాగానే ఉన్నా "అభ్యాసం కూసు విద్య" అనే సామెతను ప్రవాసులు మరవకూడదని అన్నారు. పిల్లలు నేర్చుకున్న దాన్ని ఆచరణలో పెట్టేందుకు తల్లిదండృలు వారిని మాతృభాషలోనే రాయడం, పలకడం, మాట్లాడటం వంటి వాటి వైపు ప్రోత్సహించవల్సిందిగా సూచించారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో సైతం ఆంగ్ల భాష వ్యాప్తి మర్రిచెట్టును తలిపిస్తుండంపై ఆయన ఆవేదన వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో తానా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు వేమన సతీష్, బృహత్తర వాషింగ్టన్ తెలుగు సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు దంగేటి కిషోర్, ఉపాధ్యక్షుడు మన్నే సత్యనారాయణ, ప్రవాస ప్రముఖులు డాక్టర్ యడ్ల హేమప్రసాద్, కాట్రగడ్డ కృష్ణప్రసాద్, డాక్టర్.నరేన్ కొడాలి, ఏపీ ఎన్.ఆర్.టీ ప్రతినిధి కలపటపు బుచ్చిరాంప్రసాద్, ప్రముఖ పాత్రికేయులు డా.నరిశెట్టి ఇన్నయ్య, కోయా రమాకాంత్, కుక్కట్ల శ్రీనివాస్, ఉప్పుటూరి రాంచౌదరి, మేరీల్యాండ్ తెలుగు సంఘం, తెలంగాణా అభివృద్ధి మండలి(టీడీఎఫ్) ప్రతినిధులు తదితరులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. -
జస్టిస్ చలమేశ్వర్‌కు అరుదైన గౌరవం
-
విద్యతోనే మహిళలకు హక్కులపై అవగాహన
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ రాజమండ్రి, న్యూస్‌లైన్: స్త్రీలు విద్యావంతులైనప్పుడే తమ హక్కులపై సమగ్ర అవగాహనను ఏర్పరచుకోగలరని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. శుక్రవారం రాజమండ్రిలో అద్దేపల్లి శ్రీధర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘స్త్రీలు- రాజ్యాంగపరమైన హక్కులు’ అంశంపై జరిగిన సదస్సుకు జస్టిస్ చలమేశ్వర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం స్త్రీలకు విద్య, ఉపాధి, ఆస్తి మొదలైన అంశాల్లో సమాన హక్కు కల్పించిందన్నారు. అయినా ఆ హక్కులను మహిళలు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోవడానికి అనేక సామాజిక కారణాలు ఉన్నాయన్నారు. మన దృక్పథంలో మార్పు రావలసిన అవసరం ఉందని సూచించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులయిన మహిళలను ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అద్దేపల్లి శ్రీధర్ సత్కరించారు.