సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్
రాజమండ్రి, న్యూస్‌లైన్: స్త్రీలు విద్యావంతులైనప్పుడే తమ హక్కులపై సమగ్ర అవగాహనను ఏర్పరచుకోగలరని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ అన్నారు. శుక్రవారం రాజమండ్రిలో అద్దేపల్లి శ్రీధర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘స్త్రీలు- రాజ్యాంగపరమైన హక్కులు’ అంశంపై జరిగిన సదస్సుకు జస్టిస్ చలమేశ్వర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం స్త్రీలకు విద్య, ఉపాధి, ఆస్తి మొదలైన అంశాల్లో సమాన హక్కు కల్పించిందన్నారు. అయినా ఆ హక్కులను మహిళలు పూర్తిస్థాయిలో వినియోగించుకోలేక పోవడానికి అనేక సామాజిక కారణాలు ఉన్నాయన్నారు. మన దృక్పథంలో మార్పు రావలసిన అవసరం ఉందని సూచించారు. వివిధ రంగాల్లో నిష్ణాతులయిన మహిళలను ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అద్దేపల్లి శ్రీధర్ సత్కరించారు.
విద్యతోనే మహిళలకు హక్కులపై అవగాహన
Published Sat, Dec 28 2013 2:03 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement