‘అగ్ర’రాజ్యంలో అదే చర్చ | Right to Abortion: Women in America | Sakshi
Sakshi News home page

‘అగ్ర’రాజ్యంలో అదే చర్చ

Published Sat, Oct 5 2024 3:12 AM | Last Updated on Sat, Oct 5 2024 3:12 AM

Right to Abortion: Women in America

అబార్షన్‌ హక్కెవరిది?

స్త్రీ హక్కులను గుర్తిస్తే..  వాళ్ల నిర్ణయా«ధికారాన్ని సమ్మతించినట్లే! వాళ్ల సాధికారతను గౌరవించినట్లే! అయితే ఇప్పుడు పేచీ అంతా అక్కడే..  మ్యారిటల్‌ రేప్‌ నుంచి అబార్షన్‌ కేస్‌ వరకు.. అమె చాయిస్‌ను అడిగేవాళ్లు లేరు సరికదా..  ఆమె అలా అడగడమే సరికాదని వాదిస్తున్నారు.. అగ్రరాజ్యమైన అమెరికా నుంచి  అభివృద్ధి చెందుతున్న దేశాల వరకు!  

అనిత (పేరు మార్చాం) ఎకనామిక్‌ ఎనలిస్ట్‌. ఆంట్రప్రెన్యూర్‌ కావాలనేది ఆమె లక్ష్యం. అందుకోసం పెళ్లి, పిల్లలనే జంఝాటాలూ వద్దనుకుంది. కానీ తనంటే చాలా ఇష్టపడే ఓ ఇన్వెస్టర్‌ పెళ్లి ప్రపోజల్‌ తేవడంతో, ఇంట్లో వాళ్లూ బలవంత పెట్టడంతో పెళ్లికి ఒప్పుకుంది.. తనకున్న లక్ష్యాన్ని వివరించి, పిల్లల్ని కనే ఉద్దేశం తనకు లేదని స్పష్టం చేసి మరీ! అందుకు సరే అంటూ అనిత చేయి అందుకున్నాడు అతను. అయితే ఫ్యామిలీ ΄్లానింగ్‌ ఫెయిలై అనిత గర్భం దాల్చింది. అబార్షన్‌ ఆప్షన్‌ను ఎంచుకుంది. పెళ్లికి కాంప్రమైజ్‌ అయినట్టుగా, ప్రెగ్నెన్సీకీ కాంప్రమైజ్‌ అవమని ఒత్తిడి తెచ్చాడు భర్త. అలా కుదరదని తేల్చిచెప్పి, అబార్షన్‌ కోసం ఫ్యామిలీ డాక్టర్‌ని సంప్రదించింది. ‘భర్త అంగీకారం ఉంటేనేప్రోసీడ్‌ అవుతాను’ అంది డాక్టర్‌. హతాశురాలైంది అనిత! 

బాగా చదువుకున్నవాడు, లోకం తెలిసిన అనిత భర్తకే భార్య హక్కు గురించి తెలియకపోతే.. మిగిలిన వాళ్ల పరిస్థితేంటి! తొమ్మిది నెలలు మోసి, కని, పెంచే ఆమె అన్నిరకాలుగా సిద్ధంగా ఉందా లేదా అనేది తెలుసుకోవాలి! ఎందుకంటే ఆమె శరీరం మీద ఆమెదే సంపూర్ణ అధికారం! హర్‌ బాడీ.. హర్‌ చాయిస్‌! అందుకే ఇష్టం లేని గర్భాన్ని అవసరంలేదనుకునే హక్కు ఆమెకు ఉంటుంది. 

ఇప్పుడు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ ఇదే ప్రధానాంశం అయింది. దీనిమీద.. అధ్యక్ష బరిలో ఉన్న ట్రంప్, కమలా హ్యారిస్‌ల మధ్య వేడిగావాడిగా చర్చ సాగుతోంది. డెమోక్రాట్స్‌ అభ్యర్థి కమలా హ్యారిస్‌.. స్త్రీలకు అబార్షన్‌ హక్కు ఉండాలని గట్టిగా చెబుతున్నారు. ఇది స్త్రీ నిర్ణయాధికారాన్ని, సాధికారతను సూచిస్తుందని ఆమె అభి్రపాయపడుతున్నారు. రిపబ్లికన్‌ అభ్యర్థి ట్రంపేమో దీనికి సంబంధించి తన వైఖరిని మాటిమాటికీ మారుస్తూ వస్తున్నారు. నిన్నమొన్న జరిగిన డిబేట్‌లో కూడా ‘అబార్షన్‌ రైట్‌’ అంశాన్ని రాష్ట్రాలకే వదిలిపెట్టాలనే నిర్ణయానికి మద్దతిచ్చాడు.

 ట్రంప్‌ మాటల మీద మిగతా వాళ్ల అభి్రపాయాలెలా ఉన్నా.. స్వయానా ఆయన సతీమణి మెలానియా ట్రంప్‌ మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అబార్షన్‌ అనేది స్త్రీ ఇష్టానికే వదిలిపెట్టాలి, అది ఆమె హక్కు.. ఈ విషయంలో రాజీకి చోటే లేదంటూ స్పష్టంగా చె΄్పారు. అంతేకాదు, ప్రాథమిక హక్కయిన వ్యక్తి స్వేచ్ఛను నేను సంరక్షిస్తాను’ అని చె΄్పారు. దీంతో ఆమె మాటలు వైరల్‌ అయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలపై కన్ను వేసి ఉంచిన ప్రపంచం యావత్తూ దీని మీద చర్చనూ మొదలుపెట్టింది. 

అసలు ఈ అబార్షన్‌ రైట్‌ అనేది స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు నెలవైన అమెరికాలో ఎందుకంత వివాదమవుతోంది? ఆ నేపథ్యం ఏంటంటే.. 
అమెరికాలో అబార్షన్‌కి సంబంధించి స్త్రీ స్వేచ్ఛను సవాలు చేసేలా ఉన్న నియమ నిబంధనల మీద 1969ప్రాంతంలో పెద్ద ఉద్యమమే సాగింది ‘మై బాడీ.. మై చాయిస్‌’ నినాదంతో. ఈ క్రమంలో 1973లో ఆ దేశ సుప్రీంకోర్ట్‌.. రో (ఖ్ఛౌ) వర్సెస్‌ వేడ్‌ (గ్చిఛ్ఛీ) కేసులో గర్భస్రావం హక్కునుప్రాథమిక/ రాజ్యాంగ హక్కుగా తీర్పునిచ్చింది. అయితే అదే అమెరికా సుప్రీంకోర్ట్‌ 2022లో ఆ తీర్పును తిరగరాస్తూ అబార్షన్‌పై 1973 కంటే ముందున్న నియమ నిబంధనలే సరైనవని వ్యాఖ్యానిస్తూ మరో తీర్పునిచ్చింది. దీని మీద అమెరికా అంతటా మళ్లీ నిరసనలు వెల్లువెత్తాయి.

ఆ తీర్పు తర్వాత దాదాపు రెండువందల మందికి పైగా మహిళల మీద అబార్షన్‌ నేరం కింద కేసులు నమోదైనట్టు ఓ నివేదిక తెలిపింది. అప్పటి నుంచి అబార్షన్‌ రైట్‌ కోసం అమెరికాలోపోరాటం సాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ వ్యాఖ్యలు, వాటిని వ్యతిరేకిస్తూ మెలానియా వెలిబుచ్చిన తన అభి్రపాయంతో మళ్లీ ఒకసారి ప్రపంచంలోని దేశాలన్నీ అబార్షన్‌కి సంబంధించి తమ దేశాల్లోని చట్టాలు, అవి మహిళలకు ఇస్తున్న వెసులుబాటు, వాళ్ల హక్కుల్ని గౌరవిస్తున్న తీరుతెన్నులను పరిశీలించుకుంటున్నాయి. మనమూ మన దగ్గరున్న చట్టాన్ని ఒకసారి పరికిద్దాం!

గర్భం దాల్చాలా? వద్దా? అనేది మహిళే నిర్ణయించుకోవాల్సిన విషయం. దీన్ని ఆమె స్వేచ్ఛకే వదిలేయాలని మన చట్టం చెబుతోంది. మెడికల్‌ టర్మినేషన్‌ ఆఫ్‌ ప్రెగ్నెన్సీ యాక్ట్‌ 1971, సెక్షన్‌ 3 ప్రకారం.. గర్భస్రావం తప్పనిసరైనప్పుడు దానికి గర్భిణి అంగీకారం మాత్రమే చాలు. 2017లో అనిల్‌కుమార్‌ వర్సెస్‌ అజయ్‌ పశ్రీచా కేసులో ‘గర్భం దాల్చాలా వద్దా అనే అంశంలో తుది నిర్ణయం మహిళదే. వైవాహిక బంధానికి సమ్మతించినంత మాత్రాన ఆ పురుషుడి బిడ్డకు తల్లినౌతానని ఆమె అంగీకరించినట్టు కాదు’ అని సుప్రీంకోర్ట్‌ వ్యాఖ్యానించింది. దీన్నిబట్టి అబార్షన్‌ సమయంలో పురుషుడి అనుమతి అవసరం లేదు. స్త్రీ అంగీకారం మాత్రమే చాలు అని అర్థమవుతోంది. అయితే భర్త అనుమతి లేకుండా అబార్షన్‌ చేయించుకుంటే అది నేరం కాకపోయినప్పటికీ, ఆ కారణాన్ని చూపి భర్త విడాకులు కోరే అవకాశం ఉంటుంది.

మొత్తంగా చూస్తే.. 
అబార్షన్‌కి సంబంధించిన చట్టాల్లో మనం అమెరికా కంటే మెరుగే అని తెలుస్తోంది. ఆ విషయంలో మన చట్టం.. స్త్రీ హక్కును గౌరవిస్తోంది. ఆచరణలో మటుకు సమాజం ఇంకా చైతన్యవంతం కావాలి.  – సరస్వతి రమ

ఎంచుకునే స్వేచ్ఛను ఇవ్వాలి
మదర్‌హుడ్‌ అంటే ఒకరకంగా స్త్రీల మీద టాక్సేషన్‌ లాంటిదే! ఎందుకంటే తొమ్మిది నెలలు మాత్రమే కాదు పిల్లలు పెరిగి, వాళ్లు ఇండిపెండెంట్‌ అయ్యే వరకు కూడా స్త్రీల కెరీర్‌పాజ్‌లోనే ఉంటుంది. పర్‌ఫార్మెన్స్‌ బేస్డ్‌ ఉద్యోగాల సొసైటీలో ఇదంతా అవరోధంగానే ఉంటుంది. ఇలాంటప్పుడే మదర్‌హుడ్‌ కావాలా? కెరీర్‌ కావాలా అని ఎంచుకునే పరిస్థితి ఎదురవుతుంది. రెండూ కావాలనుకునేవాళ్లు ఎన్నోరకాల ఒత్తిడికి లోనవుతుంటారు. ఆర్థికంగా, సామాజికంగా ఆమెకు ఎన్నో సౌలభ్యాలు సమకూర్చితే తప్ప ఆమె రెండు ఆప్షన్స్‌ను ఎంచుకునే వీలుండదు. కానీ ఈ వెసులుబాట్లేమీ లేవు, ఉండవు. అలాంటప్పుడు ఏది కావాలో ఎంచుకునే స్వేచ్ఛను ఆమెకివ్వడమే కరెక్ట్‌. అబార్షన్‌ను ఆమె హక్కుగా గుర్తించి, గౌరవించాలి. – అపర్ణ తోట, జెండర్‌ కన్సల్టెంట్, ది పర్పుల్‌ వరండా

స్త్రీ యంత్రం కాదు
స్త్రీ శరీరం ఒక యంత్రం కాదు. బిడ్డను మోసి, కని, పెంచేందుకు ఆమె మానసికంగా, శారీరకంగా సిద్ధపడి ఉండాలి. అందుకే అది పూర్తిగా ఆమె స్వేచ్ఛకు సంబంధించిన అంశం. పురుషుడికి ఆ విషయంలో ఎటువంటి హక్కు ఉండదు, ఉండకూడదు. నా ఉద్దేశంలో ఖ్ఛౌ ఠిట. గ్చిఛ్ఛీ కేసును అమెరికా సుప్రీంకోర్టు తిరగరాయడం సమంజసం కాదు. – శ్రీకాంత్‌ చింతల, హైకోర్ట్‌ అడ్వకేట్‌

కలవరపెట్టే విషయం..
ఈ మధ్యకాలంలో డోనాల్డ్‌ ట్రంప్, కమల హారిస్‌ మధ్య ట్ఛౌ ఠిటఠ్చీఛ్ఛీ పై జరిగిన చర్చ డెవలప్డ్‌ కంట్రీ అనే పిలవబడే అమెరికా, అక్కడి రాజకీయాల్లోని ఆలోచన ధోరణుల్లోని వ్యత్యాసాన్ని తెలుపుతోంది. అబార్షన్‌ హక్కులను పరిమితం చేయడానికి ఒత్తిడి తెచ్చిన వాళ్లలో ట్రంప్‌ ఒకడు. అతని హయాంలో అబార్షన్‌ హక్కులను పరిమితం చేసే ప్రయత్నాలు చాలా జరిగాయి. Roe vs. Wade ఉద్యమానికి అతను మద్దతు ఇచ్చాడు. మరోవైపు పునరుత్పాదక హక్కులు అనేవి వ్యక్తిగత స్వేచ్ఛకి, అలాగే హెల్త్‌ కేర్‌ యాక్సెస్‌కిప్రాథమికం అనే ప్రగతిశీల దృక్పథం కమలది. బిడ్డని కనాలా వద్దా అని నిర్ణయం తీసుకునే హక్కు ఆడవాళ్ళ అధికారాన్ని సమానత్వాన్ని సూచిస్తుందని ఆమె వాదన. 

అబార్షన్‌ హక్కులు లేకపోవడం వలన వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా ప్రజారోగ్యం మీద, సోషియో ఎకనామిక్‌ స్టేటస్‌ పైనా ప్రభావం ఉంటుందనే ముఖ్యమైన అంశాన్ని ఆమె లేవనెత్తింది. ఈ చర్చలో వచ్చినవి వ్యక్తిగత అభి్రపాయాలే కాదు, భవిష్యత్తులో అమెరికన్‌ సమాజం ఎలా ఉండబోతుందో కూడా తెలుపుతున్నాయి. అబార్షన్‌ హక్కు లేకపోవడం వల్ల ఎంతోమంది మహిళలుప్రాణాలు కూడా కోల్పోయారు. మహిళల జననాంగాల గురించి పబ్లిగ్గా అశ్లీల వ్యాఖ్యలు చేసిన ట్రంప్‌ లాంటి పురుషహంకారులకు మహిళల స్వేచ్ఛ ఎలాగూ అర్థం కాదు. ఐతే ఇటువంటి వాదనలను సమర్థించే వాళ్లలో చదువుకున్న వాళ్లు, స్త్రీలూ కూడా ఉండడం కలవరపెట్టే విషయం. – దీప్తి శిర్ల, జెండర్‌ యాక్టివిస్ట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement