Holi 2025: పసందైన సినీ హోలీ పాటలు | Holi 2025 celebrations tollywood soing on holi festival | Sakshi
Sakshi News home page

Holi 2025: పసందైన సినీ హోలీ పాటలు

Published Fri, Mar 14 2025 11:04 AM | Last Updated on Fri, Mar 14 2025 11:23 AM

Holi 2025 celebrations tollywood soing on holi festival

హోలీ పండుగ అంటేనే సంబరాలు పండుగ.   హోలీకి  సంబంధించిన అనేక పురాణ గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అలాగే  సరదా సంబరాల పండుగలో పాటలు లేకుండా సరదా  ఏముంటుంది.  సినీ పరిశ్రమలో ఎన్నో పాటలు  రంగుల వసంతాలను వెదజల్లాయి.  తెలుగు సినిమా  పాటల్లో హోలీ సంబరం కనిపిస్తుంది. మచ్చుకు కొన్ని పాటలు...

 

71 సంవత్సరాల హోలీ సాంగ్‌... 
 

  • మణిరత్నం–కమల్‌హాసన్‌ ‘నాయకుడు’ సినిమాలోని హోలీ  పాట ‘సందెపొద్దు మేఘం పూలజల్లు కురిసెను నేడు’ ప్రతి హోలీ సందర్భంగా ఎక్కడో ఒకచోట వినిపిస్తూనే ఉంటుంది 

  • జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమా ‘రాఖీ’లో ‘రంగ్‌ బర్‌సే’ హోలీ పాట బాగా పాపులర్‌.

  • నాగార్జున ‘మాస్‌’ సినిమాలోని ‘రంగు తీసి కొట్టు’ హోలీ పండగ రోజున చెవిన పడాల్సిందే 

  • వెంకటేష్‌ ‘జెమిని’లో ‘దిల్‌ దివానా.. మై హసీనా’ హోలీ నేపథ్యంలో వినిపిస్తుంది

  • ప్రణయ విలాసములే. శివాజీ గణేషన్‌ సినిమా ‘మనోహర’ సినిమాలోనిది ఈ పాట.
     

వీటితోపాటు గోపాల గోపాల, విజయ్ దేవర కొండ, మెహ్రీన్.. ‘హోలీ’ స్పెషల్ సాంగ్ , సీతారామరాజు సీనిమాలోని నాగార్జున, హరికృష్ణ, సాక్షి శివానంద్, ఆట ఆరంభం: అజీత్ కుమార్, రాణా, నయన తార నటించిన కృష్ణగాడి వీర ప్రేమ గాథ సినిమాల్లోని పాటలు ఉన్నాయి. 

హోలీ -పురాణగాథలు

చెడు అంతానికి సంకేతం
వద్దని చెప్పినా శ్రీమహావిష్ణువునే స్మరిస్తున్న ప్రహ్లాదుడిని చంపాని తన సోదరి హోలికను ఆదేశిస్తాడు హిరణ్యకశిపుడు. ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకొని హోలిక మంటల్లో దూకుతుంది. విష్ణునామ స్మరణలో ఉన్న ప్రహ్లాదుడికి చీమ కుట్టినట్లు కూడా కాదు. హోలిక మాత్రం కాలి బూడిద అవుతుంది, ఆ బూడిదే చెడు అంతానికి సంకేతం.

చదవండి: Holi 2025 - నేచురల్‌ కలర్స్‌ ఈజీగా తయారు చేసుకోండిలా!

కాముని పున్నం శివుని భార్య సతీదేవి దక్ష ప్రజాప్రతి యజ్ఞంలో దేహాన్ని విసర్జింపగా శివుడు విరాగిౖయె హిమవత్‌ పర్వతంపై తపస్సు చేయసాగాడు. రాక్షసుల బాధలు పడలేని దేవతలు తపస్సులో ఉన్న శివుడి దీక్షను విరమింపజేసేందుకు ప్రయత్నించారు. పార్వతిగ పుట్టిన సతీదేవిపై శివుడికి ప్రేమ కలిగించవలసిందిగా దేవతలు మన్మథుణ్ణి కోరారు. మన్మథుడు తన భార్య రతీదేవి మిత్రుడు వసంతుడితో కలిసి హిమవంతం చేరాడు. పార్వతీదేవి సపర్యలు చేస్తున్న సమయంలోశివుడిపై మన్మథుడు పుష్ప బాణాలు ప్రయోగించాడు. తన దివ్యదృష్టితో కాముని చర్యలు గ్రహించిన శివుడు కోపంతో ముక్కంటితో దహించాడు. కాముడి రూపంలో ఉన్న మన్మథుడిని దహించి వేయడాన్ని ‘కాముని దహనం’  ‘కాముని పున్నం’గా ఫాల్గుణ శుద్ధ  పౌర్ణమి రోజున ప్రజలు పండుగ చేసుకుంటారు.కాముని పున్నంకృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు రాజు ఉండేవాడు. పసిపిల్లలను ‘హోలిక’ అనే రాక్షసి హింసిస్తోందని ప్రజలు రాజుకు విన్నవించుకున్నారు. అదే సభలో ఉన్న నారద మహాముని ‘ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమినాడు హోలికను పూజించిన పసిపిల్లలకు బాధలు ఉండవు’ అని చెప్పాడు. ఆనాటి నుంచి ఈ  హోలీ ఉత్సవం జరుగుతోందని ప్రతీతి.

‘రంగుల’ రాట్నం 
పురాతన కాలంలో గ్రీస్‌లో ‘నీలం’ రంగుకు నేరుగా సరిపోయే పదం లేదు. దగ్గరి వర్ణనలు మాత్రమే ఉండేవి ఆఫ్రికా ఎడారి తెగ ప్రజలు ‘ఎరుపు’ వర్ణాన్ని ఆరు పేర్లతో పిలుస్తారు. పురాతన కాలంలో ఈజిప్షియన్‌లు, మాయన్‌లు వేడుకలలో తమ ముఖానికి ఎరుపు రంగు పూసుకోవడం తప్పనిసరిగా ఉండేది. రోమన్‌ సైన్యాధిపతులు తమ విజయాలను సెలబ్రేట్‌ చేసుకోవడానికి శరీరానికి ఎరుపురంగు వేసుకునేవారు. కలర్‌ అసోసియేషన్‌ల ద్వారా వ్యక్తిత్వ లోపాలను నిర్ధారించేవాడు... డాక్టర్‌ మాక్స్‌ లుషర్‌. ∙వన్స్‌ అపాన్‌ ఏ టైమ్‌ రోమన్‌ల కాలంలో క్యారెట్‌లు ఉదా, తెలుపు రంగులలో ఉండేవి. మధ్య యుగాలలో నలుపు, ఆకుపచ్చ రంగులలో కూడా ఉండేవి.

కలర్‌ మ్యాజిక్‌ వర్డ్స్‌: సెలాడాన్‌–లేత ఆకుపచ్చ రంగు, ల్యూటీయన్‌–డీప్‌ ఆరెంజ్, కెర్మెస్‌–ప్రకాశవంతమైన ఎరుపు, సినోపర్‌–ముదురు ఎరుపు–గోధుమ రంగు, స్మాల్డ్‌–డీప్‌ బ్లూ.  

చదవండి : Holi 2025 : ఈ విషయాలు అస్సలు మర్చిపోవద్దు!

 -యంబ నర్సింహులు, సాక్షి, ప్రతినిధి, యాదాద్రి భువనగిరి  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement