ముంబై: మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో అమెరికాకు చెందిన ఓ మహిళను గొలుసులతో కట్టేసిన ఘటనలో ట్విస్ట్ చోటు చేసుకుంది. పోలీసుల వాంగ్మూలంలో అమెరికన్ మహిళ తనకు తాను సంకెళ్లు వేసుకున్నానని, మరెవరి ప్రమేయం లేదని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది.
జులై 27 న సింధుదుర్గ్ జిల్లాలోని అటవీ ప్రాంతమైన సోనుర్లి గ్రామ శివార్లలో ఇనుప గొలుసులతో మహిళను చెట్టుకు కట్టేశారు. అయితే ఆ ప్రాంతానికి వెళ్లిన పశువు కాపరికి మహిళ బిగ్గరగా కేకలు వేస్తూ కనిపించారు. దీంతో పశువుల కాపరి అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కట్టేసిన గొలుసుల్ని విడిపించారు. అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
వైద్య పరీక్షల అనంతరం ఆమె పలు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధారించారు. శనివారం (ఆగస్టు 3) సింధుదుర్గ్ పోలీసులు మహిళ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. ఈ సమయంలో ఆమె మూడు తాళాలు, ఇనుప గొలుసులతో ముంబై నుంచి 460 కిలోమీటర్ల దూరంలోని సోనుర్లి గ్రామ సమీపంలోని అడవిలోకి వెళ్లినట్లు, తాను అక్కడనున్న ఓ చెట్టుకు కట్టుకున్నట్లు తెలిపారు. ఆమెను ఎన్ని రోజులు చెట్టుకు కట్టివేసిందనే దానిపై ఇంకా స్పష్టత లేదని ఆయన చెప్పారు.
ఇక మహిళ వద్ద ఉన్న బ్యాగ్‌ను పరిశీలించగా.. ఆమె బ్యాగ్‌లో అమెరికా పాస్‌పోర్ట్, ఆధార్ కార్డ్, ఇతర డాక్యుమెంట్లు ఉన్నాయి. ఆమెను తమిళనాడుకు చెందిన లలితా కయీగా గుర్తించిన పోలీసులు..తమిళనాడు పోలీసులకు సమాచారం అందించారు. తదిపరి విచారణ కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment