ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో పాటు మెషిన్ లెర్నింగ్ అనేది ప్రస్తుతం మన జీవితాల్లో ప్రధాన భాగంగా మారిపోయింది. అయితే ఏఐ చేసిన పొరపాటు కారణంగా పోలీసులు ఎవరినైనా అరెస్టుచేస్తే.. పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడం చాలా కష్టం. ఇటువంటి ఘటన అమెరికాలోని డెట్రాయిట్‌లో చోటుచేసుకుంది.
మెషీన్ చేసిన పొరపాటు కారణంగా పోలీసులు ఒక మహిళను అరెస్టు చేశారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీలో జరిగిన పొరపాటు కారణంగా పోలీసులు 8 నెలల గర్భిణిని అరెస్టు చేశారు. 32 ఏళ్ల పోర్చ్ ఉడ్రఫ్ కోర్టులో జరుగుతున్న వాదనల్లో మాట్లాడుతూ తాను తన ఇద్దరు పిల్లలను స్కూలుకు రెడీ చేస్తుండగా, పోలీసులు తనను అరెస్టు చేసేందుకు వచ్చి, తన చేతులకు బేడీలు వేసి, తనను తీసుకువెళ్లారని ఆరోపించింది.
ఈ ఉదంతం గురించి బాధితురాలి తరపు న్యాయవాది మాట్లాడుతూ తన క్లైంట్‌ను అనవసరంగా అరెస్టు చేశారని అన్నారు. పోలీసులు ఆమె ఇంటికి దొంగతనం, కార్‌జాకింగ్ ఆరోపణలకు సంబంధించిన అరెస్ట్ వారెంట్‌తో పాటు వచ్చారన్నారు. తన క్లైంట్ ఆ సమయంలో గర్భిణిగా ఉందన్నారు.
అరెస్టుకు వ్యతిరేకంగా కోర్టులో జరుగుతున్న కేసులో పోలీసు అధికారులు తమ వాదన వినిపిస్తూ, తాము ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీనే నమ్మామని తెలిపారు. అయితే దీనిని పూర్తిగా నమ్మకూడదని, దానిలో చాలా లోపాలు ఉన్నాయన్నారు. ఒక బ్లాక్ ఉమెన్‌ను అరెస్టు చేయబోయి ఉడ్రఫ్‌ను అరెస్టు చేశామని తెలిపారు.
ఐటీ నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ పూర్తి స్థాయిలో నమ్మదగినది కాదని, దీనిలో మరింత పరిశీలన అవసరమన్నారు. కాగా వేన్ కౌంటీ ప్రాసిక్యూటర్ ఒక ప్రకటనలో ఉడ్రఫ్ అరెస్టు వారెంట్ పటిష్టమైన ప్రాతిపదికన జారీ చేశారన్నారు. వాస్తవాల ఆధారంగా చూస్తే ఈ తరహా వారెంట్ సరైనదేనని అన్నారు.
ఈ ఉదంతం జరిగిన రోజున పోలీసులు.. కొందరు ముష్కరుల కారుజాకింగ్ కేసును పరిశోధిస్తున్నారు. ఈ గ్యాంగ్‌లోని ఒక మహిళను గుర్తించేందుకు పోలీసులు ఒక గ్యాస్ స్టేషన్‌లోని సీసీటీవీ వీడియో ఫుటేజ్ సేకరించారు. వీడియో ఆధారంగా ఫేస్ రికగ్నిషన్ ఎనాలసిస్ జరగగా ఉడ్రఫ్‌కు సరిపోలిన రూపం కనిపించింది. కోర్టు వాదనల అనంతరం ఉడ్రఫ్ నేరానికి పాల్పడినట్లు సరైన రుజువులు దొరకకపోవడంతో ఆమెను పోలీసులు విడిచిపెట్టారు. అయితే ఈ ఆధునిక టెక్నాలజీ మున్ముందు ఎన్ని సమస్యలను తెచ్చిపెట్టనున్నదోనని పలువురు వాపోతున్నారు.
ఇది కూడా చదవండి: ‘ప్రతిరోజూ నా అండర్‌వేర్ చెక్ చేస్తారు’.. 8 మందిని పెళ్లాడిన మోడల్‌కు వింత సమస్య!
Comments
Please login to add a commentAdd a comment