ఉత్తరకొరియా మరో సంచలనం.. కిమ్‌ ప్లాన్‌తో ప్రపంచానికే హెచ్చరిక! | North Korea Kim Builds Largest And Deadliest Ever Warship, Check More Information Inside | Sakshi
Sakshi News home page

ఉత్తరకొరియా మరో సంచలనం.. కిమ్‌ ప్లాన్‌తో ప్రపంచానికే హెచ్చరిక!

Apr 17 2025 9:26 AM | Updated on Apr 17 2025 11:20 AM

North Korea Kim builds Largest Ever warship

పాంగ్‌య్యాంగ్‌: ఉత్తరకొరియా తన శత్రు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిత్యం క్షిపణి పరీక్షలతో కవ్వించే కిమ్‌.. ఇప్పుడు అత్యాధునిక యుద్ధనౌకను తయారుచేసే పనిలో స్పీడ్‌ పెంచారు. మాక్సర్ టెక్నాలజీస్, ప్లానెట్ ఉపగ్రహాలు తీసిన చిత్రాల ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం ఉత్తర కొరియా నౌకాదళంలో ఉన్న వార్‌షిప్‌ల కంటే ఇది దాదాపు రెండింతలు పెద్దదిగా ఉన్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

వివరాల ప్రకారం.. కిమ్‌ అధికారం చేపట్టాక సైనిక దళాలను అత్యంత వేగంగా ఆధునికీకరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్తర కొరియా నౌకాదళం ఓ అతిపెద్ద నౌకను తయారుచేసే పనిలో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆ యుద్ధ నౌకపై ఆయుధ, అంతర్గత వ్యవస్థలను నిర్మిస్తున్నారు. దీని పనులు ఆ దేశ ఉత్తర తీరంలో జరుగుతున్నాయి. ఈ విషయాన్ని మాక్సర్‌ టెక్నాలజీస్‌, ప్లానెట్‌ ఉపగ్రహాలు పసిగట్టాయి. ప్రస్తుతం ఆ దేశ నౌకాదళంలో ఉన్న వార్‌షిప్‌ల కంటే ఇది దాదాపు రెండింతలు పెద్దదిగా ఉందని సమాచారం. దీని పొడవు సుమారు 140 మీటర్లుగా అంచనా వేశారు. దీని నిర్మాణానికి అవసరమైన టెక్నాలజీ మాస్కో నుంచి అంది ఉంటుందని దక్షిణ కొరియా నిపుణులు చెబుతున్నారు.

ఇదిలా ఉండగా.. అమెరికాకు చేరే స్థాయి ఖండాంతర క్షిపణులను ఇప్పటికే ఉత్తర కొరియా సమకూర్చుకొంది. ఈ ఆయుధాల తయారీకి అవసరమైన టెక్నాలజీ, పరికరాలను ఎవరూ ఉత్తరకొరియాకు విక్రయించకుండా ఐరాస ఆంక్షలు విధించింది. రష్యాతో మంచి సంబంధాలు ఉండటంతో ఆంక్షల ప్రభావం లేకుండా చూసుకొంది. మొత్తానికి ఈ భారీ నౌక నిర్మాణం ఉత్తర కొరియా సైనిక శక్తిని మెరుగుపరిచే మరో ముఖ్యమైన అడుగుగా చెప్పవచ్చు. దీంతో, అమెరికా.. ఈ విషయంపై ఫోకస్‌ పెంచే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement