north korea
-
పుతిన్, కిమ్ మధ్య కుదిరిన డేంజర్ డీల్..
మాస్కో: రష్యా, ఉత్తరికొరియా మధ్య మరో కీలక ఒప్పందం కుదిరింది. రెండు దేశాల మధ్య మిలిటరీ ఒప్పందం అమలులోకి వచ్చింది. ఈ మేరకు నార్త్ కొరియాకు చెందిన అధికారిక న్యూస్ ఏజెన్సీ కేసీఏన్ఏ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా రెండు దేశాల మిలటరీ తమకు అవసరమైన సమయాల్లో సాయం చేసుకోనుంది.రష్యా, ఉత్తర కొరియా మిలిటరీ ఒప్పందం అమల్లోకి వచ్చింది. పరస్పరం మిలిటరీ సాయం చేసుకోవడానికి ఈ ఏడాది జూన్‌లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఒప్పందం చేసుకున్నారు. అయితే, పశ్చిమ దేశాలు విధించే ఆంక్షలను సంయుక్తంగా ఎదుర్కోవడం, ఆపత్కాల సమయంలో తక్షణ మిలిటరీ సాయం చేసుకునేలా రెండు దేశాల ఒప్పందం కుదిరింది. ఇక, అణ్వాయుధాలు కలిగిన ఉత్తర కొరియా తన బలగాలను పంపించి రష్యాకు సాయం చేస్తోందని అమెరికా, ఉక్రెయిన్ దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో రక్షణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. పుతిన్‌కు సాయం చేసేందుకు రష్యా సైన్యంలోకి నార్త్ కొరియాకు చెందిన దాదాపు పది వేల మంది సైనికులను పంపినట్టు అమెరికా ఆరోపించింది. మరోవైపు.. రష్యా, కొరియా దేశాల మధ్య జరిగిన ఈ కీలక ఒప్పందానికి ప్రతిఫలంగా మాస్కో.. కిమ్‌కు అధునాతన టెక్నాలజీ అందజేయనుందని వార్తలు వెలువడ్డాయి. పైగా యుద్ధభూమిలో పోరాడటం వల్ల కిమ్ సైనికులు రాటుదేలే అవకాశం ఉందని ఆయా దేశాలకు చెందిన నేతలు చెబుతున్నారు. ఇక, ఇప్పటికే వేల సంఖ్యలో నార్త్ కొరియా సైనికులు ట్రైనింగ్ తీసుకున్న విషయం తెలిసిందే. కాగా, ఉక్రెయిన్‌తో రష్యా పోరులో భాగంగా పుతిన్‌కు ఉత్తర కొరియా బలగాలు ఎంతో సాయం చేసే అవకాశం ఉంది. ఉక్రెయిన్‌పై మరింత ధీటుగా దాడులు చేసేందుకు పుతిన్ ప్లాస్ చేసినట్టు సమాచారం. #BREAKING North Korea, Russia defence treaty has come into force: KCNA pic.twitter.com/3ODW1bg5Bl— AFP News Agency (@AFP) December 4, 2024 -
ఉ.కొరియా చేతికి రష్యన్ గగనతల రక్షణ క్షిపణులు
సియోల్: ఉక్రెయిన్ యుద్ధం పరోక్షంగా ఉత్తర కొరియా, రష్యాల రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేస్తోంది. ఉక్రెయిన్ యుద్ధక్షేత్రాల్లో పాల్గొనేందుకు 10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు అక్టోబర్‌లో రష్యాకు తరలివెళ్లిన విషయం తెల్సిందే. ఉత్తరకొరియా సాయానికి బదులుగా రష్యా సైతం పెద్ద సాయమే చేసిందని దక్షిణకొరియా శుక్రవారం ప్రకటించింది. గగనతల రక్షణ క్షిపణులను ఉ.కొరియాకు రష్యా అందించిందని దక్షిణకొరియా అధ్యక్షుడు యూన్సుక్కు జాతీయ భద్రతా సలహాదారు షిన్ వోన్సిక్ శుక్రవారం వెల్లడించారు. ఈ మేరకు ఎస్బీసీ టీవీ కార్యక్రమంలో షిన్ మాట్లాడారు. ‘‘ ఉ.కొరియా గగనతల రక్షణ వ్యవస్థలో వాడే క్షిపణులను రష్యా సరఫరా చేసింది. వీటితోపాటు ఇతర ఉపకరణాలనూ ఉ.కొరియాకు పంపించింది. తమను ద్వేషించేలా దేశ వ్యతిరేక కరపత్రాలను తమ దేశంలోనే డ్రోన్ల ద్వారా జారవిడుస్తున్నారని, ఇది పునరావృతమైతే క్షిపణి దాడులు తప్పవని ఉ.కొరియా ఇటీవల ద.కొరియాను హెచ్చరించిన విషయం విదితమే. అయితే ఈ కరపత్రాలతో తమకు ఎలాంటి సంబంధంలేదని ద.కొరియా స్పష్టంచేసింది. -
అమెరికా రెచ్చగొడుతోంది.. కిమ్ సంచలన ఆరోపణలు
సియోల్: అగ్ర రాజ్యం అమెరికాపై సంచలన ఆరోపణలు చేశారు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. తమ దేశం విషయంలో శత్రుత్వ విధానం ప్రదర్శించడంలో అమెరికా ముందు స్థానంలో ఉందన్నారు. అలాగే, కొరియా ద్వీపకల్పంలో అమెరికా ఉద్రిక్తతలను పెంచుతోందని చెప్పుకొచ్చారు.ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ తాజాగా ప్యాంగ్యాంగ్లో నిర్వహించిన మిలటరీ ఎగ్జిబిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిమ్ మాట్లాడుతూ.. అమెరికా మమ్మల్ని బాగా రెచ్చగొడుతోంది. కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలను పెంచే నిర్ణయాలు తీసుకుంటోంది. ఇంతటి ఘర్షణ వాతావరణాన్ని ఇంతకుముందు ఎప్పుడు నేను చూడలేదు. ప్రస్తుత పరిస్థితులు థర్మో న్యూక్లియర్ యుద్ధంలా మారే వరకు వెళ్లినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.కొరియా ద్వీపకల్పం ఇప్పటివరకు అణుయుద్ధ ప్రమాదాలే ఎరుగదు. అమెరికాతో చర్చలు జరిపేందుకు నేను ఎప్పుడో ముందుకు వచ్చాను. చర్చల కోసం నేను చాలా దూరం వెళ్లినప్పటికీ అక్కడి నుంచి సరైన స్పందన రాలేదు. అమెరికా.. మాపై దూకుడు, శత్రుత్వ విధానం ప్రదర్శించడంలో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదని చెప్పుకొచ్చారు. అయితే, ట్రంప్ అధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో ఆయనతో కిమ్ మూడు సార్లు భేటీ అయ్యారు. 2018-19 మధ్య కాలంలో సింగపూర్, హనోయ్, కొరియా సరిహద్దుల్లో వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ సందర్బంగా పలు అంశాలపై చర్చలు జరిపినా.. సఫలం కాలేదు. అనంతరం, రెండు దేశాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. North Korean leader says past diplomacy only confirmed US hostilityNorth Korean leader Kim Jong Un says past negotiations with the United States only confirmed Washington's"unchangeable" hostility towardPyongyang and described his nuclear buildup as the only way to counter pic.twitter.com/OenQzQLlu4— Simo saadi🇲🇦🇵🇸🇺🇸 (@Simo7809957085) November 22, 2024 ఇదిలా ఉండగా.. నార్త్ కొరియా కిమ్ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. త్వరలో అమెరికాలో ట్రంప్ అధికారం చేపట్టనున్న నేపథ్యంలో కిమ్ అలర్ట్ అయ్యారు. మళ్లీ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకునే అవకాశం ఉన్న క్రమంలో నార్త్ కొరియా సైన్యం అలర్ట్‌గా ఉండాలన్నారు. దీంతో, అమెరికాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కిమ్ జోంగ్ ఉన్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలను తయారు చేయాలని నార్త్ కొరియా అధికారులకు కిమ్ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ ఆర్ఢర్తో కొరియా అధికారులు అణ్వాయుధాలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. -
ట్రంప్‌తో పోరుకు రెడీ.. నార్త్ కొరియా కిమ్ సంచలన నిర్ణయం!
ప్యాంగ్యాంగ్: అణ్వాయుధాల తయారీలో ఉత్తర కొరియా దూసుకెళ్తోంది. అమెరికాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కిమ్ జోంగ్ ఉన్ ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలను తయారు చేయాలని నార్త్ కొరియా అధికారులకు కిమ్ ఆదేశాలు జారీ చేశారు. కిమ్ ఆర్ఢర్తో కొరియా అధికారులు అణ్వాయుధాలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం.అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో కిమ్ జోంగ్ ఉన్ అప్రమత్తమయ్యారు. గత ట్రంప్ పాలనలో అనుభవాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా వ్యూహాలను ఎదుర్కొనేందుకు కిమ్ ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అపరిమిత సంఖ్యలో అణ్వాయుధాలు తయారుచేయాలని కిమ్ మరోసారి తన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఇటీవల తన అధికారులతో కిమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దక్షిణకొరియాతో కలిసి అమెరికా అణ్వస్త్ర వ్యూహాలకు పదునుపెట్టడాన్ని ఖండించారు. జపాన్‌తో కలిసి ఆసియా నాటో ఏర్పాటుచేయాలన్న ఆలోచనలను ఆయన తప్పుపట్టారు.మరోవైపు, దక్షిణ కొరియా, అమెరికాపై దాడి చేయడానికి అవసరమైన శక్తి సామర్థ్యాలను కిమ్ సేనలు వేగంగా పెంచుకొంటున్నాయి. అణ్వాయుధాలు, ఖండాంతర క్షిపణులను వేగంగా తయారుచేస్తోంది. ఇక, ఉత్తర కొరియా త్వరలోనే న్యూక్లియర్ బాంబు పరీక్ష నిర్వహించవచ్చని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ సంస్థలు రెండు వారాల క్రితం నివేదికలు ఇచ్చాయి.ఇదిలా ఉండగా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో జెలెన్ స్కీకి అమెరికా సహాకరించడాన్ని కిమ్ తీవ్రంగా ఖండించారు. రష్యాపై యుద్ధంలో ఉక్రెయిన్ను పశ్చిమ దేశాలు పావుగా వాడుకుంటున్నాయని ఆరోపించారు. అమెరికా ప్లాన్ ప్రకారమే తన పలుకుబడి పెంచుకునేందుకు ఉక్రెయిన్‌కు సహకరిస్తోందన్నారు. 🚨#BREAKING: North Korea's Kim Jong Un Is Calling For A "New Cold War"This comes in response to the Biden Administration's recent actions in the East.Kim Jong Un also calls for UNLIMITED EXPANSION OF HIS NUCLEAR WEAPONS.Thoughts? pic.twitter.com/naRaJLkTs8— Donald J. Trump News (@realDonaldNewsX) November 18, 2024 -
ఆత్మాహుతి డ్రోన్లను పరీక్షించిన ఉ.కొరియా
సియోల్: లక్ష్యాలపైకి దూసుకెళ్లి పేలిపోయే ఆత్మాహుతి డ్రోన్లను ఉత్తరకొరియా పరీక్షించింది. వీటి దాడులను ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ దగ్గరుండి పర్యవేక్షించారు. ఆత్మాహుతి డ్రోన్లను భారీ ఎత్తున తయారు చేయాలని కిమ్ ఆదేశించారు. అంతర్జాతీయ జలాల్లో అమెరికా, దక్షిణకొరియా, జపాన్‌లు ఉమ్మడి సైనిక విన్యాసాలు చేపట్టిన తరుణంలో ఉత్తరకొరియా ఈ డ్రోన్ల సామర్థ్యాన్ని పరీక్షించడం గమనార్హం. ఈ మానవరహిత ఏరియల్ వెహికిల్స్‌కు ‘ఎక్స్’ ఆకృతిలో రెక్కలు, తోక భాగం ఉన్నాయి. ఆగస్టులో పరీక్షించిన డ్రోన్లను పోలి ఉన్నాయని ఉత్తరకొరియా సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. అధ్యక్షుడు కిమ్ సైనిక అధికారులతో మాట్లాడుతున్న ఫొటోలను విడుదల చేసింది. ఈ డ్రోన్లు ఒక బీఎండబ్ల్యూ కారును, పాత యుద్ధ ట్యాంకులను ఢీకొని పేలి్చవేసిన దృశ్యాలను ప్రసారం చేసింది. వివిధ దిశల్లో ఈ డ్రోన్లు దూసుకెళ్లి లక్ష్యాలను ఛేదించాయి. వీటి పనితీరు పట్ట కిమ్ సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ డ్రోన్ల తయారీని యుద్ధప్రాతిపదికన చేపట్టాలని కిమ్ అధికారులను ఆదేశించారు. సైనిక అవసరాల నిమిత్తం పెద్ద ఎత్తున తయారు చేయాలని, చవకైన ఈ డ్రోన్లు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. -
‘కిమ్’ సైనికులు కొందరు చనిపోయారు: జెలెన్స్కీ
కీవ్: రష్యా తరపున తమపై యుద్ధంలో పాల్గొన్న ఉత్తరకొరియా సైనికుల్లో కొందరు చనిపోయారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తాజాగా తెలిపారు. ఈ విషయాన్ని ఆయన మీడియాకు వెల్లడించారు. ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు మద్దతుగా ఉత్తరకొరియా పెద్దమొత్తంలో సైనికులను రష్యాకు పంపిన విషయం తెలిసిందే.తమపై యుద్ధానికి కుర్స్క్లో 11వేల మంది ఉత్తరకొరియా సైనికులను మోహరించినట్లు గతంలో జెలెన్స్కీ చెప్పారు. ఈనేపథ్యంలోనే తాజాగా అక్కడ జరిగిన యుద్ధంలో పాల్గొన్న ఆ సైనికుల్లో కొందరు ఉక్రెయిన్ దళాల చేతుల్లో మరణించినట్లు తెలిపారు. తాము ఈ తరహా కఠిన చర్యలు తీసుకోకపోతే ఉత్తరకొరియా మరిన్ని బలగాలను పంపే అవకాశం ఉందన్నారు. కాగా, రెండేళ్ల నుంచి జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియా తాజాగా ఎంటరైంది. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నియంత కిమ్జోంగ్ఉన్కు సత్సంబంధాల వల్లే ఉత్తర కొరియా తమ సైనికులను రష్యాకు పంపిందని ఆరోపణలున్నాయి. యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం చేసుకుంటే తీవ్ర పరిణామలుంటాయని ఉక్రెయిన్ ఇప్పటికే హెచ్చరించింది.ఇదీ చదవండి: కెనడాలో ఆ మీడియాపై నిషేధం -
అన్లిమిటెడ్ ఇంటర్నెట్! ‘అశ్లీలం’లో మునిగిపోయి..
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు మంట తెప్పించే పని చేశారట ఆ దేశ సైనికులు. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ దొరికిందనే ఆనందంలో అశ్లీలంలో మునిగిపోయి.. మిత్రదేశంలో నార్త్ కొరియా పరువు తీసేశారట. ఈ విషయాన్నిఆంగ్ల మీడియా ప్రముఖంగా ప్రచురించింది. రష్యా-ఉత్తర కొరియాల మధ్య బంధం ఎంతగా బలపడిందో తెలిసిందే. ఈ క్రమంలో.. మిత్రదేశానికి సహాయంగా ఉత్తర కొరియా సైన్యం ఉక్రెయిన్ యుద్ధంలో పాల్గొంటోంది. అయితే ఆ యుద్ధం కోసం వెళ్లిన సైనికులకు అపరిమితంగా ఇంటర్నెట్ అందించారట. దీంతో స్వేచ్ఛ దొరికినంతగా ఫీలైపోయి.. వాళ్లు ఎగబడి అడల్ట్ కంటెంట్ చూస్తూ ఉన్నారంటూ ఆధారాల్లేని కథనాలను బ్రిటిష్ పత్రికలు పబ్లిష్ చేశాయి. ఇక.. సోమవారం సుమారు ఏడు వేల మంది ఉ.కొ. సైనికులను ఉక్రెయిన్ సరిహద్దు గుండా ఉన్న పాయింట్లలో మోహరింపజేయించింది రష్యా. దానికంటే ముందు.. వాళ్లకు ప్రత్యేక శిక్షణ ఇప్పించింది. అయితే బుధవారం జరిగిన తొలిసారిగా ఉక్రెయిన్ బలగాలతో నార్త్ కొరియా సైన్యం తలపడింది. -
అమెరికా ఎన్నికల వేళ.. ఉత్తర కొరియా వరుస క్షిపణి ప్రయోగాలు
సియోల్ : అమెరికాలో ఎన్నికలు జరుగుతున్న వేళ.. ఉత్తర కొరియా ఒకదాని తర్వాత ఒకటిగా పలు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. తూర్పు సముద్రం వైపు పలు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించించినట్లు దక్షిణ కొరియా సైన్యం తెలిపింది.అయితే ఉత్తర కొరియా ఎన్ని క్షిపణులను ప్రయోగించిందనేది దక్షిణ కొరియా సైన్యం తెలియజేయలేదు. కాగా క్షిపణులు ఇప్పటికే సముద్రంలో పడిపోయాయని భావిస్తున్నామని, ఇప్పటి వరకు ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం లేదని జపాన్ రక్షణ మంత్రిత్వ శాఖ పేర్కొంది.కొద్ది రోజుల క్రితం కిమ్ జోంగ్ ఉన్ పర్యవేక్షణలో ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ఆ దేశం ఇప్పటివరకు పరీక్షించిన క్షిపణుల కంటే బాలిస్టిక్ క్షిపణి ఎంతో శక్తివంతమైనది. ఈ క్షిపణి ద్వారా అమెరికా ప్రధాన భూభాగాన్ని లక్ష్యంగా చేసుకోవచ్చని ఉత్తర కొరియా గతంలో పేర్కొంది. దీనికి ప్రతిస్పందనగా యూఎస్ఏ తాజాగా దక్షిణ కొరియా, జపాన్‌లతో కలసి దీర్ఘ శ్రేణి బీ-వన్ బీ బాంబర్లను ప్రయోగించింది.ఉత్తర కొరియాకు చెందిన కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ(కేసీఎన్ఏ)ఈ క్షిపణిని 'హ్వాసాంగ్-19' ఐసీబీఎంగా పేర్కొంది. దీనిని ప్రపంచంలోని బలమైన వ్యూహాత్మక క్షిపణి అని పేర్కొంది. ఈ క్షిపణి పరీక్షను ఆ దేశ అధినేత కిమ్ జోంగ్ ఉన్ వీక్షించారని, ఉత్తర కొరియాకు చెందిన విశిష్ట వ్యూహాత్మక అణు దాడి సామర్థ్యాన్ని ప్రదర్శించినందుకు శాస్త్రవేత్తలకు ధన్యవాదాలు తెలిపారని కేసీఎన్ఏ పేర్కొంది. ఎన్నికలకు ముందు ఉత్తర కొరియా జరిగిపిన క్షిపణుల ప్రయోగాలు ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతను పెంచే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా ఉన్న సమయంలో ఆయన ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరిచే లక్ష్యంతో కిమ్‌తో భేటీ అయ్యారు. ఇది కూడా చదవండి: అన్ని ప్రైవేటు ఆస్తులు ప్రభుత్వానివి కావు: సుప్రీం కీలక తీర్పు -
వారి సైన్యాన్ని ఎదుర్కొనేందుకు మిసైల్స్ కావాలి: ఉక్రెయిన్
కీవ్: రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించారు. ఈ నేపథ్యంలో రష్యా, ఉత్తర కొరియా సైనిక దాడులను ఎదుర్కొవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ భావిస్తున్నారు. అందులో భాగంగానే రష్యాపై క్షిపణులను ప్రయోగించేందుకు తమ మిత్రదేశాల నుంచి అనుమతి అవసరమని తెలిపారు. శుక్రవారం సాయంత్రం జెలెన్స్కీ మీడియాతో మాట్లాడారు.‘‘రష్యా ఉక్రెయిన్ భూభాగంలో ఉత్తర కొరియా సైనికులను ప్రతి స్థావరాలు, వారి అన్ని శిబిరాలను మేం గమనిస్తాం. ఈ పరిస్థితుల్లో దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటే.. మేం రష్యా దాడులకు నివారణగా కచ్చితంగా ప్రతిదాడిచేసే అవకాశం ఉంది. ఉక్రేనియన్లపై దాడి చేయటం కోసం ఉత్తర కొరియా సైన్యం ఎదురు చూస్తోంది. రష్యాకు మద్దతుగా మోహరించిన ఉత్తర కొరియా సేనలను దీటుగా ఎదుర్కోవాలంటే క్షిపణులు ప్రయోగించాలి. అందుకు తమ మిత్ర దేశాల మద్దతు అవసరం ఉంది. మా వద్ద సుదూర లక్ష్యాలను ఛేదించే సౌలభ్యం ఉంటే వారిని అడ్డుకోవడానికి వినియోగిస్తాం’’అని వెల్లడించారు.చదవండి: ప్రపంచంలోనే శక్తిమంతమైన క్షిపణి పరీక్ష.. ఉక్రెయిన్ సరిహద్దుల్లో 8 వేల కొరియా సైనికులు -
ప్రపంచంలోనే శక్తిమంతమైన క్షిపణి పరీక్ష.. ఉక్రెయిన్ సరిహద్దుల్లో 8 వేల కొరియా సైనికులు
సియోల్: అత్యంత శక్తివంతమైన, బలీయమైన ఖండాంతర బాలిస్టిక్ మిస్సైల్ (ఐసీఎంబీ)ను పరీక్షించామని శుక్రవారం ఉత్తరకొరియా ప్రకటించింది. ఇది ప్రచారయావ తప్పితే.. వాస్తవ యుద్ధ పరిస్థితుల్లో ఇంతటి భారీస్థాయి క్షిపణి ఉపయుక్తకరంగా ఉండదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికాను చేరుకోగల ఖండాంతర క్షిపణుల అభివృద్ధి చేయడంలో సాంకేతిక అడ్డంకులను ఉత్తరకొరియా అధిగమించినట్లు తాజా క్షిపణి పరీక్ష ఎక్కడా రుజువు చేయలేకపోయిందని నిపుణులు పేర్కొన్నారు. గురువారం తాము పరీక్షించిన ఖండాంతర క్షిపణి హ్వాసాంగ్–19 .. ఇదివరకు ఎన్నడూ లేనంత దూరానికి, ఎన్నడూ లేనంత ఎత్తులో ప్రయాణించిందని ఉత్తరకొరియా ప్రకటించింది. దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ ఈ పరీక్షను దగ్గరుండి పరిశీలించారని వెల్లడించింది. రష్యా, అమెరికా వద్దనున్న అత్యాధునిక ఖండాంతర క్షిపణుల పొడవు 20 మీటర్ల లోపే ఉంటుందని, హ్వాసాంగ్–19 పొడవు 28 మీటర్లు ఉండటం మూలంగా.. ప్రయోగానికి ముందుగానే దీన్ని దక్షిణకొరియా నిఘా సంస్థలు కనిపెట్టగలిగాయని దక్షిణకొరియా వ్యూహ నిపుణుడు చాంగ్ యంగ్–కెయున్ తెలిపారు. ల్యాంచ్‌పాడ్ల పరిమాణం పెరుగుతుందని, పొడవు అధికంగా ఉన్నందువల్ల శత్రుదేశాల నిఘా రాడార్లకు ఈ తరహా క్షిపణులు సులభంగా చిక్కుతాయని వివరించారు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో 8 వేల కొరియా సైనికులు ఎనిమిది వేల మంది ఉత్తరకొరియా సైనికులను ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా మొహరించిందని అమెరికా వెల్లడించింది. రష్యాలోని కస్క్‌లో ఉక్రెయిన్ సేనలు పాగా వేయడం తెలిసిందే. కస్క్ నుంచి ఉక్రెయిన్ సేనలు వెనక్కి మళ్లించడానికి వీలుగా 8 వేల మంది ఉత్తరకొరియా సైనికులను తరలించిందని వివరించింది. -
ఉక్రెయిన్‌లోకి ఉత్తర కొరియా సైనికులు! అమెరికా వార్నింగ్
న్యూయార్క్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాకు మద్దతుగా ఉత్తరకోరియా సైనికులు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించినట్లు వార్తలు వస్తున్న క్రమంలో అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా స్పందించింది. రష్యాతో పాటు ఉక్రెయిన్‌లో పోరాడేందుకు వెళ్లిన ఉత్తర కొరియా సైనికుల మృతదేహాలు శవాల బ్యాగుల్లో తిరిగి వెళ్తాయని అమెరికా ఉత్తరకొరియాకు వార్నింగ్ ఇచ్చింది.‘‘రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దళాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించినట్లయితే.. కచ్చితంగా ఉత్తర కొరియా సైనికుల మృతదేహాలు శవాల బ్యాగుల్లో తిరిగి వెళ్తాయి.కాబట్టి అటువంటి నిర్లక్ష్య, ప్రమాదకరమైన చర్యలకు పాల్పటం ఒకటికి రెండుసార్లు ఆలోచించమని నేను ఉత్తర కొరియా అధ్యక్షడు కిమ్ జోంగ్-ఉన్‌కు సలహా ఇస్తాను’’ అని ఐక్యరాజ్యసమితిలో యూఎస్ డిప్యూటీ రాయబారి రాబర్ట్ వుడ్ అన్నారు.North Korean Troops Who Enter Ukraine Will "Return In Body Bags", Warns US"Should DPRK's troops enter Ukraine in support of Russia, they will surely return in body bags," US deputy ambassador to the UN Robert Wood told the Security Council.https://t.co/HVoaV5LbYo— M. Rowland (@melrow74) October 31, 2024చదవండి: ఉక్రెయిన్‌పై దాడులు.. పుతిన్ దళంలోకి ‘కిమ్’ సైన్యం -
ఉక్రెయిన్‌పై దాడులు.. పుతిన్ దళంలోకి ‘కిమ్’ సైన్యం
మాస్కో: రష్యా, ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతూనే ఉంది. రెండేళ్లకు పైగా సాగుతున్న దాడుల్లో రెండు దేశాల సైన్యం వీరోచితంగా పోరాడుతూనే ఉంది. ఇప్పటికే ఈ యుద్ధంలో ఎంతో మంది చనిపోయారు. ఈ పోరులో ఉక్రెయిన్ సైన్యం.. రష్యా భూభాగంలో అడుగుపెట్టింది. రష్యాతో పోరులో ఉక్రెయిన్‌కు సాయం చేసేందుకు ఇప్పటికే పలు దేశాలు ముందుకు వచ్చాయి. మరోవైపు.. రష్యాకు సాయం చేసేందుకు ఉత్తర కొరియా బలగాలు రంగంలోకి దిగాయి.ఉక్రెయిన్‌తో యుద్ధంలో మరింతగా పోరాడేందుకు ఉత్తర కొరియా తన బలగాలను రష్యాలోకి తరలిస్తోంది. ఈ విషయాన్ని తాజాగా నాటో వెల్లడించింది. ఇప్పటికే రష్యాలోని కొన్ని ప్రాంతాల్లో కిమ్ బలగాలను మోహరించినట్లు నాటో చెప్పుకొచ్చింది. ఈ క్రమంలో రష్యాలోని కుర్క్స్ ప్రాంతంలో కొన్ని బలగాలను ఇప్పటికే మోహరించినట్లు నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మీడియాకు తెలిపారు. ఇక, ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఉత్తర కొరియా జోక్యం చేసుకోవడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. ఇది రెండు మధ్య యుద్ధాన్ని మరింత ప్రోత్సహిస్తుందని అన్నారు.NATO confirms North Korean troops have been sent to Russia to support its war in Ukraine. This marks a dangerous escalation, violating UN resolutions and risking global security. As Putin turns to Pyongyang for military aid, democracies must unite to uphold peace and security.… pic.twitter.com/kHT1g57y68— Pete (@splendid_pete) October 28, 2024ఇదిలా ఉండగా.. ఇటీవలే రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉత్తర కొరియాలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగానే పుతిన్.. ఉక్రెయిన్‌పై పోరుకు నార్త్ కొరియా సాయం కోరినట్టు వార్తలు వెలువడ్డాయి. అందులో భాగంగానే ఉత్తర కొరియా సైన్యం రష్యాకు చేరుకున్నట్టు తెలుస్తోంది. ఇక, కొద్ది రోజుల క్రితమే ఉత్తర కొరియా సైన్యంలోకి భారీగా యువత వచ్చి చేరారు.మరోవైపు.. రష్యాలోకి కిమ్ సేన ప్రవేశించే అంశంపై ఇటీవల అమెరికా స్పందించింది. ఒకవేళ ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలోకి చొరబడితే.. కచ్చితంగా వాళ్లు కూడా లక్ష్యాలుగా మారతారని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అమెరికా ఎలాంటి చర్యలు తీసుకోనుందో అనే చర్చ కూడా జరుగుతోంది. -
దక్షణ కొరియా రాజధాని సియోల్ లో అధ్యక్ష కార్యాలయంపై పడిన చెత్త బెలూన్
-
అదే జరిగితే.. రష్యా బలహీతకు సంకేతం: అమెరికా
న్యూయార్క్: ఉత్తర కొరియాకు చెందిన 3 వేల మంది సైనికులు రష్యాకు వెళ్లి డ్రోన్లు, ఇతర పరికరాలపై శిక్షణ పొందుతున్నారని దక్షిణ కొరియా వ్యాఖ్యలు చేసింది. దక్షిణ కొరియా వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఉత్తర కొరియాకు సైనికులు ఉక్రెయిన్‌పై పోరాటంలో భాగంగా రష్యా ఆర్మీలో చేరితే సైనిక చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొంది. ఉక్రెయిన్‌తో పోరాటాని రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మద్దతు పొందితే అది క్రెమ్లిన్ బలహీనతకు సంకేతమని వైట్ హౌస్ తెలిపింది. అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘రష్యన్లు, ఉత్తర కొరియన్లు ఇక్కడ ఏమి చేయాలని నిర్ణయించుకుంటారో మేము చూస్తాం. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్‌పై పోరాటంలో చేరాలని నిర్ణయించుకుంటే చట్టబద్ధమైన సైనిక లక్ష్యాలుగా మారిపోతాయి. ఈ పరిస్థితులపై నిశితంగా పరిశీలిస్తున్నాం. సైనికులు ఉత్తర కొరియాలోని వోన్సాన్ ప్రాంతం నుంచి రష్యాలోని వ్లాడివోస్టాక్‌కు ఓడలో ప్రయాణించారు. రష్యన్ సైనిక శిక్షణా కేంద్రాలున్న ప్రాంతాలు వెళ్లారు. అయితే.. ఉత్తర కొరియా సైనికులు రష్యన్ మిలిటరీతో కలిసి యుద్ధంలోకి పాల్గొంటాయో లేదో స్పష్టత లేదు. ఉత్తర కొరియా సైనికులు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఉక్రేయిన్ మిలిటరీకి వ్యతిరేకంగా పోరాడేందుకు పశ్చిమ రష్యాకు వెళ్లవచ్చ. ఉక్రెయిన్ ప్రభుత్వానికి కూడా ఈ పరిస్థితి గురించి తెలియజేశాం. ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొంటే.. రష్యాలో పెరుగుతున్న నిరాశ, బలహీనతకు సంకేతం అవుతుంది’’ అని అన్నారు. ఉత్తర కొరియా ఇప్పటివరకు 3వేల మంది సైనికులను రష్యాకు తరలించిందని దక్షిణ కొరియా తెలుపుతోంది. ఇటీవల 1500 మంది సైనికులను ఉత్తర కొరియా రష్యాకు తరలించినట్లు దక్షిణ కొరియా గూఢచర్య సంస్థ(ఎన్ఐఎస్) వెల్లడించింది. మరోవైపు.. రష్యా రాయబారి జార్జి జినోవిచ్తో భేటీ అయిన దక్షిణ కొరియా విదేశాంగ డిప్యూటీ మినిస్టర్ కిమ్ హాంగ్ క్యూన్ ఉత్తర కొరియా బలగాలను పంపడాన్ని ఖండించటం గమనార్హం.చదవండి: హిట్లర్‌ను ప్రస్తావించిన ట్రంప్.. కమలా హారీస్‌కు బిగ్ బూస్ట్ -
అనుక్షణం భయం..భయం!
(సియోల్ నుంచి సాక్షి ప్రత్యేకప్రతినిధి) ఉత్తరకొరియా, దక్షిణకొరియాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత శత్రుత్వం ఉంటుంది. అలాంటిది ఇరుదేశాల సరిహద్దులో పరిస్థితులు ఎలా ఉంటాయి.. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అన్ని దేశాల మధ్య సరిహద్దుల్లా కాకుండా ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు కాస్త భిన్నంగా ఉంటుంది. అదేంటో తెలుసుకుందాం. సియోల్ పర్యటనలో ఉన్న మీడియా ప్రతినిధులు సరిహద్దు డీమిలిటరైజ్డ్ జోన్ (డీఎంజెడ్)ను సందర్శించారు. అక్కడి పరిస్థితులను నేరుగా పరిశీలించారు. సందర్శన సమయంలోనే అక్కడ బాంబుల మోత మోగింది. ప్రతిక్షణం ఇరు దేశాల సైనికులు కయ్యానికి కాలు దువ్వుతూ ఉంటారని, అది సర్వసాధారణమని అక్కడి సైనికాధికారులు పేర్కొంటున్నారు. రెండు దేశాలను వేరు పరిచేదే డీఎంజెడ్..ఇరు దేశాలను సమానంగా ఈ డీఎంజెడ్ వేరుపరుస్తుంది. 4 కిలోమీటర్ల వెడల్పు, 258 కిలోమీటర్ల పొడవుతో ఈ సరిహద్దు ప్రాంతం విస్తరించి ఉంది. ఇరువైపులా భారీస్థాయిలో విద్యుత్ కంచెలు ఏర్పాటు చేశారు. ఈ డీఎంజెడ్కు రెండువైపులా ప్రపంచంలోకెల్లా అత్యంత భారీ స్థాయిలో సైనికులను మోహరించారు. డీఎంజెడ్‌లో మాత్రం సైనికులెవరూ ఉండరు. ఎలాంటి సైనిక కార్యకలాపాలు మాత్రం జరగవు. 1953లో ఇక్కడ సైనిక తటస్థ ప్రాంతం (డీఎంజెడ్) ఏర్పాటు చేశారు.ప్రచ్ఛన్నయుద్ధం జరిగిన సమయంలోనే ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య సరిహద్దుగా ఉండేది. అయితే 1953లో ఇరుదేశాల మధ్య అమెరికా, చైనా కలిసి శాంతి ఒప్పందం కుదిర్చేందుకు ప్రయత్నించాయి. రెండుదేశాలు ఇప్పటికీ అంగీకరించలేదు. కానీ డీఎంజెడ్ ప్రాంతంలో మాత్రం ఎలాంటి సైనిక చర్య ఉండదు. ఇదే ప్రదేశంలో 1635 మీటర్ల పొడవు, 1.95 మీటర్ల ఎత్తు, 2.1 మీటర్ల వెడల్పుతో ఓ టన్నెల్ కూడా ఉంది. ఈ సొరంగాన్ని ఉత్తర కొరియా సైనికులు సియోల్పై దాడి చేసేందుకు తవ్వారని చెబుతారు. ఇది పూర్తి కాకముందే ఐక్యరాజ్య సమితి పోలీసు అధికారులు గుర్తించి ఉత్తర కొరియాను హెచ్చరించారట. అయితే తొలుత అసలు ఈ సొరంగాన్ని తవ్వలేదని ఉత్తర కొరియా బుకాయించినా.. చివరకు అది గనుల తవ్వకాల్లో భాగంగా తవ్వామని మాట మార్చిందని అక్కడి పర్యాటకుల సందేశంలో రాసి ఉంది. డీఎంజెడ్తో పాటు ఈ సొరంగాలను చూసేందుకు పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తుంటారు. హిల్ పాయింట్ వ్యూ నుంచి ఉత్తర కొరియాతోపాటు దక్షిణకొరియా గ్రామాలను వీక్షించొచ్చు. కాకపోతే చాలా కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. చిన్న ఫొటో కూడా తీసుకోవడానికి అనుమతివ్వరు. -
రష్యాకు ‘కిమ్’ బలగాలు.. ‘సియోల్’ ఆగ్రహం
సియోల్: ఉత్తర కొరియా తాజాగా మరో పదిహేను వందల మంది తమ సైనికులను రష్యాకు తరలించిందని దక్షిణ కొరియా గూఢచర్య సంస్థ(ఎన్ఐఎస్) వెల్లడించింది. ఈ విషయాన్ని తమ దేశ చట్టసభ సభ్యులకు ఎన్ఐఎస్ చీఫ్ యంగ్ తెలిపారు. ఉక్రెయిన్‌పై యుద్ధం కోసమే వారిని పంపిందని పేర్కొన్నారు. డిసెంబర్ నాటికి మరో 10 వేల మంది సైన్యాన్ని రష్యాకు పంపాలని ఉత్తరకొరియా యోచిస్తోందన్నారు.ఇప్పటికే ఉత్తర కొరియా ఈ నెలలో రష్యాకు 1,500 మంది సైనికులను పంపినట్లు ఎన్ఐఎస్ తేల్చిచెప్పింది. రష్యా యుద్ధ నౌకల్లో 1500 మందితో కూడిన ఉత్తరకొరియా ప్రత్యేక బలగాలు రష్యాలోని వ్లాదివోస్తోక్ పోర్టుకు చేరుకున్నాయని ఎన్ఐఎస్ తెలిపింది. తాజాగా రష్యా రాయబారి జార్జి జినోవిచ్తో భేటీ అయిన దక్షిణ కొరియా విదేశాంగ డిప్యూటీ మినిస్టర్ కిమ్ హాంగ్ క్యూన్ ఉత్తర కొరియా బలగాలను పంపడాన్ని ఖండించారు. ఉత్తర కొరియాతో తమ సంబంధాలు దక్షిణ కొరియా భద్రతా ప్రయోజనాలకు వ్యతిరేకం కాదని రష్యా రాయాబారి స్పష్టం చేశారు. అయితే ఉత్తర కొరియా చర్యలు ఇలానే ఉంటే తాము ఉక్రెయిన్‌కు అత్యాధునిక ఆయుధాలు పంపుతామని సౌత్ కొరియా హెచ్చరిస్తోంది. ఉత్తరకొరియా ఒక క్రిమినల్ దేశమని ఫైర్ అయింది. కాగా, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌కు రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు మధ్య మంచి సంబంధాలున్నాయి. కిమ్‌కు ఇటీవల పుతిన్ ఖరీదైన బహుమతులను కూడా ఇవ్వడం గమనార్హం. ఇదీ చదవండి: ప్రజాస్వామ్యానికి ట్రంప్ ప్రమాదకరం: జో బైడెన్ -
మళ్లీ డ్రోన్లు కనిపిస్తే యుద్ధమే
ప్యాంగాంగ్: ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య ఉద్రిక్తతలు నానాటికీ పెరుగుతున్నాయి. దక్షిణ కొరియా మిలిటరీ డ్రోన్ అవశేషాలు శనివారం తమ భూభాగంలో కనిపించాయని, మరోసారి కనిపిస్తే యుద్ధ ప్రకటన తప్పదని ఉత్తరకొరియా హెచ్చరించింది. దక్షిణ కొరియా ఈ నెలలో మూడు సార్లు ప్యాంగ్యాంగ్పై డ్రోన్లను ఎగురవేసిందని ఆరోపించిన ఉత్తర కొరియా, మరోసారి అదే జరిగితే బలప్రయోగంతో ప్రతిస్పందిస్తామంది. -
రష్యాకు ఉత్తర కొరియా సైనిక సాయం
సియోల్: ఉక్రెయిన్‌పై యుద్ధంలో రష్యాకు ఉత్తర కొరియా సైనిక సాయం చేస్తోంది. ఇప్పటికే 1,500 మంది సైనికులను రష్యాకు పంపిందని దక్షిణ కొరియా నిఘా సంస్థ ‘నేషనల్ ఇంటెలిజెన్స్ సర్వీసు (ఎన్ఐఎస్) శుక్రవారం వెల్లడించింది. స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్‌కు చెందిన 1,500 సైనికులను ఈనెల 8 నుంచి 13 వరకు రష్యాకు పంపిందని తెలిపింది. రష్యా తీరప్రాంత నగరం వ్లాదివోస్టోక్‌కు వీరు చేరుకున్నారని పేర్కొంది. ఉత్తరకొరియా సైనికులకు రష్యా సైనిక దుస్తులను ఇచ్చారని, ఆయుధాలను అందజేశారని, నకిలీ ధ్రువపత్రాలను సమకూ ర్చారని ఎన్ఐఎస్ వెల్లడించింది. ఉత్తర కొరి యా మరింత మంది సైనికులను రష్యాకు పంపనుందని వివరించింది. నిఘా సమాచా రం మేరకు 10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు రష్యా తరఫున యుద్ధంలో పాల్గొననున్నట్లు తనకు తెలిసిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ గురువారం ప్రకటించడం గమనార్హం. ఉత్తరకొరియా మొత్తం 12 వేల మందిని కదనరంగానికి పంపనుందని దక్షిణకొరియా మీడియా తెలిపింది. ఉత్తరకొరియా చోంగ్జిన్ పోర్టులో రష్యా నావికాదళం నౌకలు మొహరించడం, ఉసురియిస్క్, ఖబరోస్క్లలో ఉత్తరకొరియా సైనికులు గుమిగూడిన ఉపగ్రహ చిత్రాలను ఎన్ఐఎస్ తమ వెబ్సైట్లో పొందుపర్చింది. విదేశీయుద్ధంలో ఉత్తరకొరియా నేరుగా పాల్గొనడం ఇదే తొలిసారి. ప్రపంచంలోనే అతిపెద్ద సైనిక బలగాల్లో ఉత్తరకొరియా ఒకటి. మొత్తం 12 లక్షల మంది సైన్యం ఉంది. ఈ ఏడాది జూన్‌లో ఉత్తరకొరియా అధ్యక్షుడు కింగ్ జోంగ్ ఉన్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ల మధ్య సైనిక ఒప్పందం కుదిరింది. ఇరుదేశాల్లో దేనిపై దాడి జరిగినా.. మరో దేశం సైనికంగా సాయపడాలని నిర్ణయించుకున్నాయి. మరోవైపు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సక్ యోల్ శుక్రవారం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి భద్రతపై సమీక్షించారు. అంతర్జాతీయ సమాజం అందుబాటులో ఉన్న అన్ని మార్గాల ద్వారా స్పందించాలని విజ్ఞప్తి చేశారు.10 వేల మంది ఉత్తరకొరియా సైనికులు చేరొచ్చు: జెలెన్స్కీబ్రస్సెల్స్: పదివేల మంది ఉత్తరకొరియా సైనికులు రష్యా సైన్యంలో చేరవచ్చని తమకు నిఘా సమాచారం ఉందని ఉక్రె యిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అన్నారు. వీరిని రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ భూభాగంలో మొహరించనున్నారని తెలిపారు. రష్యా– ఉక్రెయిన్ యుద్ధంలో మూడోదేశం జోక్యం చేసుకుంటే అది ప్రపంచయుద్ధంగా మారుతుందని హెచ్చరించారు. -
దక్షిణ కొరియా శత్రు దేశమే, రాజ్యాంగంలో మార్పులు: నార్త్ కొరియా
గత కొద్ది రోజులుగా ఉత్తర- దక్షిణ కొరియా దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. దక్షిణ కొరియాకు చెందిన డ్రోన్లు తమ దేశంలోకి వచ్చాయని ఆరోపిస్తూ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కఠిన చర్యలు దిగుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఉత్తర కొరియా కీలక నిర్ణయం తీసుకుంది.దక్షిణకొరియాను శత్రుదేశంగా పరిగణిస్తూ తమ రాజ్యాంగంలో మార్పులు చేపట్టినట్లు ఉత్తర కొరియా అధికారికంగా ప్రకటించింది. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాల మేరకు రాజ్యాంగంలో మార్పులు చేసినట్లు పాగ్యాంగ్ వెల్లడించింది. దక్షిణ కొరియాను శత్రుదేశంగా పరిగణించడం అనివార్యమైన, న్యాయపరమైన చర్యగా కిమ్ సర్కార్ పేర్కొంది. 1991లో ఉత్తర- దక్షిణకొరియా దేశాల మధ్య జరిగిన కీలక ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించింది. అయితే రాజ్యాంగ మార్పుల గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.రెండు కొరియా దేశాల మధ్య సంబంధాలు అత్యల్ప స్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే దక్షిణ కొరియాతో తమకున్న సరిహద్దును పూర్తిగా మూసివేస్తున్నట్లు కిమ్ సర్కారు నిర్ణయించింది. అంతేగాక ఈ ఏడాది జనవరిలో కిమ్ దక్షిణ కొరియాను తమ దేశానికి ప్రధాన శత్రువుగా నిర్వచించారు. అధ్యక్షుడు పిలుపునిచ్చిన చట్టపరమైన మార్పులను ప్యోంగ్యాంగ్ మొదటిసారిగా గుర్తించింది.కాగా ఇటీవల దక్షిణ కొరియాను అనుసంఘానం చేసే సరిహద్దులోని రోడ్లను, రైల్వేలను కిమ్ సైన్యం బాంబులతో పేల్చివేసిన అనంతరం ఈ ప్రకటన వెలువడింది. తమ దేశంలోకి సౌత్ కొరియాకు చెందిన ఏ ఒక్క డ్రోన్ వచ్చినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కిమ్ హెచ్చరించారు. తమ ప్రజల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండబోదన్నారు. కవ్వింపు చర్యలు మానుకోవాలని పొరుగు దేశానికి సూచించారు. -
కొరియా దేశాల మధ్య హైఅలర్ట్.. కిమ్ ఆర్మీలోకి భారీ చేరికలు
సియోల్: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. దక్షిణకొరియాతో అనుసంధానం చేసే సరిహద్దులోని రోడ్డు, రైల్వే మార్గాలను ఉత్తర కొరియా ధ్వంసం చేయడంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. మరోవైపు.. ఒక్క వారం వ్యవధిలోనే 14 లక్షల మంది యువత ఉత్తర కొరియా సైన్యంలో చేరడంతో దాడులు పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.ఉత్తర కొరియాలో యుద్ధ వాతావరణం చోటుచేసుకుంది. లక్షలాది మంది విద్యార్థులు, యూత్ లీగ్ అధికారులు ఆర్మీలో చేరినట్టు.. మరి కొందరు సర్వీసులోకి తిరిగి వచ్చినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. ఒక్క వారంలోనే సైన్యంలో 14 లక్షల మంది యువత సైన్యంలో చేరినట్టు చెప్పుకొచ్చింది. యువకులు పవిత్ర యుద్ధంలో పోరాడాలని నిర్ణయించుకున్నారని, వారు విప్లవ ఆయుధాలతో శత్రువును నాశనం చేస్తారని వెల్లడించింది. దీంతో, దక్షిణ కొరియాపై దాడులకు నార్త్ కొరియా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. తమ దేశ రాజధానిపైకి దక్షిణ కొరియా డ్రోన్లను పంపుతోందని ఉత్తర కొరియా ఇటీవల ఆరోపించడంతో రెండు దేశాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ఈ క్రమంలోనే దక్షిణకొరియాతో అనుసంధానం చేసే సరిహద్దులోని రోడ్డు, రైల్వే మార్గాలను ఉత్తర కొరియా పేల్చేసింది. ఇక, కిమ్ చర్యతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఉత్తర కొరియా చర్యకు కౌంటర్‌గా దక్షిణ కొరియా సైన్యం సరిహద్దు వద్ద హెచ్చరిక కాల్పులు జరిపింది. ఇదే సమయంలో తమ ప్రజల భద్రత ప్రమాదంలో పడితే మాత్రం ఉత్తర కొరియాను తీవ్రంగా శిక్షిస్తామని హెచ్చరించింది.అయితే, 2000 సంవత్సరం ఉభయ కొరియాల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో రోడ్లను నిర్మించారు. దీంతోపాటు రెండు రైలు మార్గాలను ఏర్పాటు చేసుకొన్నారు. వీటి వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. కానీ, ఉత్తరకొరియా అణ్వాయుధాల అభివృద్ధి, ఇతర కారణాల వల్ల ఆ తర్వాత ఈ మార్గాలను మూసివేశారు. ఇది కూడా చదవండి: పాకిస్తాన్లో జై శంకర్.. ప్రధాని షరీఫ్‌తో కరచాలనం -
అసియాలోనే అత్యధిక స్త్రీ అక్షరాస్యత కలిగిన దేశాలు ఇవే..
విద్యాభివృద్ధితోనే ఏ దేశమైనా సమగ్రాభివృద్ధి చెందుతునేది అక్షర సత్యం. అభివృద్ధి చెందిన దేశాలను పరిశీలిస్తే ఇది ముమ్మాటికీ నిజమనిపిస్తుంది.అయితే పురుషులతో పోలిస్తే స్త్రీల అక్షరాస్యత తక్కువగా ఉంటుందనేది తెలిసిందే. ఆసియాలో స్త్రీల సగటు అక్షరాస్యత శాతం 81.6గా ఉంది. అయితే భారత్‌లో స్త్రీ అక్షరాస్యత 65.8 శాతంగా ఉంది. భారత్ కంటే అనేక అరబ్ దేశాలు అక్షరాస్యతలో చాలా ముందంజలో ఉండటం గమనార్హం..15 ఏళ్ల కంటే ఎక్కువున్న బాలికలు, చదవడం, రాయగల సామర్థాన్ని కలిగి ఉన్నవారిని.. స్త్రీ అక్షరాస్యతగా పేర్కొంటారు. ఇది విద్య, సాధికారత ద్వారా సాధ్యమవుతుంది. మహిళ ఆర్థిక అభివృద్ధి, సామాజిక పురోగతి, లింగ సమానత్వంలో కీలక పాత్ర పోషిస్తుంది. స్త్రీల అక్షరాస్యత రేట్లను మెరురుపరచడం వల్ల వారికి ఉద్యోగావకాశాలు, ఆదాయ అవకాశాలు పెరుగుతతాయి. రాజకీయ, సామాజిక కార్యక్రమాలలో భాగస్వామ్యం పెరుగుతుంది. అన్నీ దేశాలను గమనిస్తే..స్త్రీ అక్షరాస్యతలో ఉత్తర కొరియా 100 శాతంతో ఉంది. దీనితోపాటు సమానంగాా ఉజ్బెకిస్తాన్ కూడా 100 శాతం ఉంది. తరువాత కజకిస్తాన్ -99.7 శాతంతజకిస్తాన్-99.7 శాతంజార్జియా-99.7 శాతంఅర్మెనియా-99.7 శాతంఅజర్బైజాన్-99.7 శాతంకిరిగిస్తాన్ 99.5 శాతంసైప్రస్- 99.2 తుర్క్మెనిస్తాన్- 99.6 శాతంసిరియా-81 శాతంఇరాక్ -77.9 శాతంఇరాన్ 88.7 శాతంఇజ్రాయిల్ 95.8 శాతంజోర్దాన్ 98.4 శాతంకువైట్ 95.4 శాతంసౌదీ అరేబియా 96 శాతంటర్కీ 94.4శాతంఓమన్-92.7 శాతంయెమెన్ 55 శాతంయూఏఈ-92.7 శాతందక్షిణ కొరియా-96.6 శాతంజపాన్-99 శాతంవియాత్నం 94.6 శాతంబ్రూనై -96.9 శాతంఇండోనేషియా-94.6 శాతంమలేషియా 93.6 శాతంఫిలిప్పిన్స్-96.9 శాతంసింగపూర్-96.1 శాతంశ్రీలంక-92.3 శాతంతైవాన్-97.3 శాతంమంగోలియా-99.2 శాతంఖతర్ 94.7 శాతంచైనా-95.2 శాతంభారత్ 65.8 శాతంనేపాల్ 63.3 శాతంభూటాన్ 63.9 శాతంమయన్మార్ 86.3 శాతంథాయ్లాండ్ 92.8 శాతం కంబోడియా 79.8 శాతంఇక అన్నింటికంటే తక్కువగా చివరి స్థానంలో అప్ఘనిస్తాన్ ఉంది. ఇక్కడ స్త్రీల అక్షరాస్యత కేవలం-22.6శాతం మాత్రమే ఉంది. -
అదే చివరి రోజవుతుంది.. జాగ్రత్త: కిమ్‌కు సౌత్ కొరియా స్ట్రాంగ్ వార్నింగ్
సియోల్: వరుస క్షిపణి ప్రయోగాలతోపాటు, అణ్వాయుధాలను ప్రయోగిస్తామంటూ ఉత్తరకొరియా పాలకుడు కిమ్ తరచూ చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలపై దక్షిణ కొరియా దీటుగా స్పందించింది. అణ్వాయుధ ప్రయోగానికి ప్రయత్నిస్తే అందుకు తగురీతిలో బుద్ధి చెబుతామని హెచ్చరించింది. ఆర్మ్డ్ ఫోర్సెస్ డేను పురస్కరించుకుని మంగళవారం సియోల్‌లో అత్యంత శక్తివంతమైన బాలిస్టిక్ క్షిపణి హ్యున్మూ–5 సహా అధునాతన 340 రకాల ఆయుధాలు, ఆయుధ వ్యవస్థలను ప్రదర్శించింది. పరేడ్‌కు హాజరైన ప్రముఖులు, వేలాదిమంది జవాన్లను ఉద్దేశించి ఈ సందర్భంగా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ మాట్లాడారు. ‘మాపై అణ్వాయుధాలను ప్రయోగించేందుకు ఉత్తరకొరియా ప్రయత్నించిన పక్షంలో మా సైన్యం, ఊహించని రీతిలో దీటైన జవాబిస్తుంది. ఉత్తరకొరియా పాలకులకు అదే చివరి రోజవుతుంది. తమను కాపాడేది అణ్వాయుధాలేనన్న భ్రమలను ఉత్తరకొరియా పాలకులు వదిలేయాలి’అని తీవ్ర స్వరంతో హెచ్చరించారు.చదవండి: ఇరాన్ దాడులు.. ఐరాస చీఫ్‌పై ఇజ్రాయెల్ నిషేధంబంకర్లను సైతం తుత్తునియలు చేసేలా..హ్యున్మూ–5 క్షిపణి 8 టన్నుల భారీ సంప్రదాయ వార్‌హెడ్ కలిగి ఉంటుంది. భూమి లోపలి అండర్ గ్రౌండ్ బంకర్లను సైతం తుత్తునియలు చేసే సత్తా దీని సొంతం. ఈ క్షిపణిని మొట్టమొదటిసారిగా దక్షిణ కొరియా ప్రదర్శించింది. పరేడ్ సమయంలో అమెరికా లాంగ్ రేంజ్ బి–1బీ బాంబర్‌తోపాటు దక్షిణకొరియా అత్యాధునిక ఫైటర్ జట్లు ఆ ప్రాంతంలో చక్కర్లు కొట్టాయి. దక్షిణ కొరియా వద్ద అణ్వాయుధాలు లేవు. ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమాన్ని ధీటుగా ఎదుర్కొనే లక్ష్యంతో దక్షిణ కొరియా ప్రభుత్వం ‘స్ట్రాటజిక్ కమాండ్’ సెంటర్‌ను కూడా ప్రారంభించింది. -
కిమ్ కర్కశత్వం.. ఇద్దరు మహిళలకు ఉరిశిక్ష
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి తన కర్కశత్వాన్ని ప్రదర్శించారు. ఆ దేశానికి చెందిన ఇద్దరు మహిళల్ని ఉరితీయించారు.ఉత్తర కొరియాకి చెందిన రీ,కాంగ్ అనే ఇద్దరు మహిళలు చైనాలో ఉంటున్నారు. చైనాలో ఉంటూ ఉత్తర కొరియా నుంచి దక్షిణ కొరియాకు పారిపోవాలనుకునే వారికి సహరిస్తున్నారు. అయితే ఈ అంశం కిమ్ ప్రభుత్వ దృష్టికి వచ్చింది. దీంతో కోపోద్రికుడైన కిమ్.. రీ, కాంగ్ ఇద్దరిని చైనా నుంచి ఉత్తర కొరియాకు రప్పించాడు. అనంతరం ఆ ఇద్దరిని ఉరితీయించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.మహిళలకు ఉరిశిక్ష విధించడంపై కిమ్ ప్రభుత్వం తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో కిమ్ ప్రభుత్వం ఆ ఇద్దరు మహిళలకు మానవ అక్రమ రవాణాకు పాల్పడ్డారని ఆరోపించింది. తాము నిర్వహించిన బహిరంగ విచారణలో నేరం రుజువు కావడంతో చర్యలు తీసుకున్నట్లు సమర్ధించుకుంది. చదవండి : మీకు అర్థమయ్యిందా? హిజ్బుల్లాకు ఇజ్రాయెల్ హెచ్చరిక -
మరిన్ని అణ్వాయుధాలపై దృష్టి: కిమ్
సియోల్: ఉత్తరకొరియా మొట్టమొదటి సారిగా రహస్య యురేనియం శుద్ధి కేంద్రాన్ని బయటి ప్రపంచానికి చూపింది. ఆదేశాధ్యక్షుడు కిమ్ జొంగ్ ఉన్ ఇటీవల అణ్వాయుధాల తయారీలో వినియోగించే యురేనియం శుద్ధి కేంద్రాన్ని సందర్శించినట్లు అధికార కేసీఎన్ఏ తెలిపింది. ‘నిపుణుల కృషిని కిమ్ కొనియాడారు. పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా, మిత్ర దేశాల నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు మరిన్ని అణ్వాయుధాల అవసరం ఉంది. వీటి తయారీకి ప్రయత్నాలు సాగించాలంటూ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు’అని వెల్లడించింది. యురేనియం శుద్ధి కేంద్రంలోని పొడవైన బూడిదరంగు పైపుల వరుసల మధ్య కిమ్ తిరుగుతున్న ఫొటోలను కేసీఎన్ఏ బయటపెట్టింది. ఈ కేంద్రం ఎక్కడుంది? కిమ్ ఎప్పుడు పర్యటించారు? అనే వివరాలను మాత్రం పేర్కొనలేదు. అయితే, యోంగ్బియోన్లోని ప్రధాన అణుశుద్ధి కేంద్రమా కాదా అనే విషయాన్ని నిపుణులు పరిశీలిస్తున్నారు. ఫొటోల్లోని వివరాలను బట్టి ఉత్తరకొరియా సిద్ధం చేసిన అణు బాంబులు, శుద్ధి చేసిన ఇంధనం పరిమాణం వంటి అంశాలపై ఒక అంచనాకు రావచ్చని చెబుతున్నారు. ఉత్తరకొరియా మొదటిసారిగా 2010లో యోంగ్‌బియోన్ యురేనియం శుద్ధి కేంద్రాన్ని గురించిన వివరాలను వెల్లడించింది. -
కిమ్ అరాచకం: 30 మంది ప్రభుత్వ అధికారులకు ఉరి.. ఎందుకంటే!
ఉత్తర కొరియాలో ఇటీవల భారీ స్థాయిలో వర్షాలు, వరదలు ముంచెత్తాయి కొండచరియలు కూడా విరిగిపడ్డాయి. ఆ ఘటనల్లో సుమారు 4 వేల మంది మరణించినట్లు, దాదాపు 5 వేల మందికి పైగా నిరాశ్రయులు అయినట్లు ఆ దేశ మీడియా వెల్లడించింది. అయితే వరదల వల్ల సంభవించిన ప్రాణనష్టాన్ని నివారించడంలో ప్రభుత్వ అధికారులు విఫలం అయ్యారు.ఈ నేపథ్యంలో ఆ దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కీలక ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. సుమారు 30 మంది అధికారులను ఉరి తీయాలని ఆయన ఆదేశాలు జారీ చేసిట్లు దక్షిణ కొరియా మీడియా పేర్కొంది. దేశానికి, ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లడానికి కారణమయ్యారనే వారికి మరణ శిక్ష విధించినట్లు తమ కథనాల్లో వెల్లడించింది.కాగా ఇటీవల చాగాంగ్ ప్రావిన్సులో వచ్చిన భారీ వర్షాలు, వరదల కారణంగా వేలాది మంది మరణించారు. అనేక మంది నిరాశ్రయులయ్యారు. వరదల్లో చిక్కుకున్న ప్రాంతాల్లో అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ స్వయంగా పర్యటించారు. మోకాలు లోతు నీటిలో తన కారులో ప్రయాణించిన కిమ్.. వరదనీటిలో బోటుపై వెళ్లారు. వరదల తీవ్రతను, ప్రజలపై వాటి ప్రభావాన్ని స్వయంగా చూశారు.ఈ భారీ విపత్తు నుంచి కోలుకుని, తిరిగి నిర్మాణాలు చేపట్టడానికి రెండు మూడు నెలలు పడుతుందని అధికారులు తెలిపారు. ఇంతటి భారీ విపత్తుకు అధికారుల నిర్లక్ష్యమే కారణమని కిమ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.మరణశిక్ష విధించిన అధికారుల వివరాలను స్థానిక మీడియా వెల్లడించలేదు. అయితే గత నెలాఖరులోనే ఈ శిక్ష అమలు చేశారని నార్త్ కొరియా అధికారిక మీడియాను ఉటంకిస్తూ పలు అంతర్జాతీయ మీడియా సంస్థలు వార్తలు ప్రచురించాయి.