![North Korea fires two short-range ballistic missiles - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/16/missaile.jpg.webp?itok=FTK4uN29)
సియోల్: అమెరికా, దక్షిణ కొరియాల సంయుక్త సైనిక విన్యాసాలు ముగిసిన వేళ ఉత్తర కొరియా గురువారం రెండు తక్కువ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ఉభయ కొరియాల సరిహద్దుల్లో భారీగా కొనసాగిన అయిదో విడత సైనిక విన్యాసాలపై ఉత్తరకొరియా గుర్రుగా ఉంది.
ఇటువంటి రెచ్చగొట్టే చర్యలపై తాము ఏదో ఒక రీతిలో తప్పక స్పందిస్తామని ఆ దేశ సైన్యం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా, గురువారం సాయంత్రం ఆ దేశ రాజధాని ప్రాంతం నుంచి తూర్పు సముద్ర జలాలపైకి రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు గుర్తించామని దక్షిణ కొరియా సైన్యం ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment