ballistic missiles
-
ముంచుకొస్తున్న మూడో ప్రపంచ యుద్ధం?
రష్యాపై యూఎస్ తయారీ దీర్ఘశ్రేణి బాలిస్టిక్ క్షిపణులతో ఉక్రెయిన్ దాడులు. తీవ్రస్థాయిలో మండిపడుతున్న రష్యా. దీన్ని అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణిస్తామని ప్రకటన. అణు దాడితో దీటుగా బదులిచ్చేందుకు వీలుగా రష్యా అణు విధానాన్ని సవరిస్తూ అధ్యక్షుడు పుతిన్ నిర్ణయం. ‘ఏ క్షణాన్నయినా అణు యుద్ధం ముంచుకు రావచ్చు, జాగ్రత్తగా ఉండండి’ అంటూ ప్రజలకు యూరప్ దేశాల ‘వార్ గైడ్‌లైన్స్’. సోమవారం ఒక్క రోజే శరవేగంగా జరిగిన తీవ్ర ఆందోళనకర పరిణామాలివి! ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి తెర తీసి సరిగ్గా 1,000 రోజులు పూర్తయిన నాడే చోటుచేసుకున్న ఈ తీవ్ర పరిణామాలు గుబులు రేపుతున్నాయి. ఇప్పటికే నాల్కలు చాస్తున్న యుద్ధ జ్వాలలు మరింతగా విస్తరించి మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తాయా అన్న ఆందోళనలు సర్వత్రా తలెత్తుతున్నాయి.అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ విజయంతో ఉక్రెయిన్ యుద్ధానికి తెర పడుతుందని, పశ్చిమాసియా కల్లోలమూ కాస్త అదుపులోకి వస్తుందని భావిస్తున్న తరుణంలో అంతర్జాతీయంగా అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పదవి నుంచి దిగిపోయే ముందు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇందుకు బీజం పడింది. అమెరికా అందజేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాలో సుదూర లక్ష్యాలపై దాడుల నిమిత్తం వాడేందుకు ఉక్రెయిన్‌కు ఆయన అనుమతివ్వడం ఒక్కసారిగా ఉద్రిక్తతలను రాజేసింది. దీన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్న ఉక్రెయిన్ మంగళవారమే రష్యాపై యూఎస్ దీర్ఘశ్రేణి ఆర్మీ టాక్టికల్ మిసైల్ సిస్టం (ఏటీఏసీఎంస్) బాలిస్టిక్ క్షిపణులను ఎడాపెడా ప్రయోగించింది. రష్యాలోని బ్రయాన్స్క్ ప్రాంతమే లక్ష్యంగా దాడులకు దిగింది. ఈ క్షిపణులను ఉక్రెయిన్ యుద్ధంలో వాడటం ఇదే తొలిసారి. అలాంటి చర్యలకు దిగితే తీవ్రస్థాయి ప్రతిస్పందన తప్పదని ఇప్పటికే హెచ్చరించిన రష్యా ఈ పరిణామంపై భగ్గుమంది. తమ భూభాగాలపైకి కనీసం ఆరు అమెరికా తయారీ ఏటీఏసీఎంఎస్ క్షిపణులు వచ్చి పడ్డాయని ధ్రువీకరించింది. వాటిలో ఐదింటిని కూల్చేయడంతో పాటు ఆరో దాన్నీ ధ్వంసం చేసినట్టు ప్రకటించింది. ఉక్రెయిన్‌పై రష్యా అణు దాడులు! తాజా పరిణామాలపై రష్యా అధ్యక్షుడు పుతిన్ మండిపడుతున్నారు. మంగళవారం ఆయన రక్షణ తదితర శాఖల అత్యున్నత స్థాయి అధికారులతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ క్షిపణి దాడులను అమెరికాతో కలిసి చేసిన సంయుక్త దాడిగానే పరిగణించాలని నిర్ణయించారు. అందుకు వీలు కలి్పంచేలా దేశ అణు విధానానికి సవరణ కూడా చేశారు! దాని ప్రకారం సంప్రదాయ ఆయుధాలతో రష్యాపై జరిగే దాడికి ఏ అణ్వాయుధ దేశమైనా మద్దతిస్తే దాన్ని ఆ రెండు దేశాల సంయుక్త దాడిగానే పరిగణిస్తారు. సదరు దేశాలపై అణు దాడులకు దిగుతారా అన్నదానిపై సవరణలో స్పష్టత ఇవ్వలేదు. కాకపోతే రష్యాపై భారీ స్థాయి వైమానిక, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణి దాడులు జరిగితే అణ్వాయుధాలతో బదులిచ్చేందుకు అది వీలు కలి్పస్తుండటం విశేషం! అంతేగాక మిత్ర దేశమైన బెలారస్‌పై దుందుడుకు చర్యలకు దిగినా అణ్వాయుధాలతో బదులు చెప్పేందుకు తాజా సవరణ అనుమతించనుంది! ఉక్రెయిన్‌కు మరింత సాయం చేయకుండా యూరప్ దేశాలను నియంత్రించడంతో పాటు అవసరమైతే దానిపై అణ్వాయుధ ప్రయోగానికి, అమెరికాపై సైనిక చర్యకు కూడా దిగడం పుతిన్ తాజా నిర్ణయాల ఉద్దేశమని భావిస్తున్నారు. అమెరికా దీర్ఘశ్రేణి క్షిపణులతో ఉక్రెయిన్ చేసిన తాజా దాడులకు బదులుగానే అణు విధాన సవరణ జరిగిందా అన్న ప్రశ్నకు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ నేరుగా బదులివ్వలేదు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండేలా అణు విధానాన్ని అప్డేట్ చేయాల్సిందిగా పుతిన్ ఆదేశించారంటూ నర్మగర్భంగా స్పందించారు. ఇటీవలి కాలంలో రష్యా అణు విధానానికి పుతిన్ సవరణ చేయడం ఇది రెండోసారి. రష్యాకు దన్నుగా ఉత్తర కొరియా సైన్యం కూడా ఉక్రెయిన్‌పై యుద్ధంలో పాల్గొంటుండటం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు అమెరికా ఇప్పటికే ప్రకటించింది. దీర్ఘశ్రేణి క్షిపణుల వాడకానికి అనుమతి దాని పర్యవసానమేనంటున్నారు. ఈ నేపథ్యంలో యుద్ధ జ్వాలలు త్వరలో కొరియా ద్వీపకల్పం దాకా విస్తరించినా ఆశ్చర్యం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బైడెన్ మతిలేని విధానాలతో ట్రంప్ పగ్గాలు చేపట్టే నాటికే ప్రపంచాన్ని పెనుయుద్ధం ముంగిట నిలిపేలా ఉన్నారని ఆయన కుమారుడు జూనియర్ ట్రంప్ మండిపడటం తెలిసిందే.నిత్యావసరాలు నిల్వ చేసుకోండితాజా పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీసేలా కన్పిస్తుండటంతో యూరప్ దేశాలు భీతిల్లుతున్నాయి. అలాంటి పరిస్థితే తలెత్తితే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలంటూ స్వీడన్, ఫిన్లండ్, నార్వే, డెన్మార్క్ తదితర నాటో సభ్య దేశాలు తమ పౌరులను హెచ్చరించడం విశేషం. ‘‘ఏ క్షణంలోనైనా అణు యుద్ధం ముంచుకు రావచ్చు. సిద్ధంగా ఉండండి’’ అంటూ స్వీడన్ ఏకంగా ఇంటింటికీ కరపత్రాలే పంచుతోంది. ‘సంక్షోభమో, యుద్ధమో వస్తే...’ అనే శీర్షికతో కూడిన 52 లక్షల కరపత్రాలను సోమవారం నుంచి వారం పాటు పంచనుంది! అది నిజానికి 32 పేజీలతో కూడిన డాక్యుమెంట్. ‘‘మనపై ఎవరైనా దాడికి తెగబడితే దేశ స్వాతంత్య్ర పరిరక్షణకు అందరమూ ఒక్కటవుదాం’’ అని అందులో పౌరులకు స్వీడన్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. దాంతోపాటు, ‘‘పిల్లల డైపర్లు, బేబీ ఫుడ్, దీర్ఘకాలం నిల్వ ఉండే ఆహార పదార్థాలు, మంచినీరు తదితరాలన్నింటినీ వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’’ అని సూచించింది. అంతేగాక బాంబు దాడులు జరిగితే వాటిబారి నుంచి ఎలా తప్పించుకోవాలి, గాయపడితే రక్తస్రావాన్ని నిరోధించేందుకు, ప్రాణ నష్టాన్ని తగ్గించేందుకు ఏం చేయాలి, యుద్ధ బీభత్సం చూసి భీతిల్లే చిన్నారులను ఎలా సముదాయించాలి వంటి వివరాలెన్నో పొందుపరిచింది.‘‘పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత స్వీడన్ ఇలాంటి చర్యకు దిగడం ఇది ఐదోసారి. నార్వే కూడా ఇలాంటి ‘యుద్ధ’ జాగ్రత్తలతో ప్రజలకు ఎమర్జెన్సీ పాంప్లెంట్లు పంచుతోంది. ‘పూర్తిస్థాయి యుద్ధంతో పాటు ఏవైనా అనుకోని పరిస్థితులు ఎదురైతే వారం దాకా ఇల్లు కదలకుండా గడిపేందుకు సిద్ధపడండి’ అంటూ అప్రమత్తం చేస్తోంది. డెన్మార్క్ కూడా కనీసం మూడు రోజులకు పైగా సరిపడా సరుకులు, మంచినీరు, ఔషధాలు తదితరాలు నిల్వ ఉంచుకోవాలంటూ తన పౌరులందరికీ ఇప్పటికే ఈ–మెయిళ్లు పంపింది! ఫిన్లండ్ కూడా అదే బాట పట్టింది. ‘రష్యా–ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతున్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండండి. నిత్యావసరాలను వీలైనంతగా సేకరించి పెట్టుకోండి’ అంటూ తన పౌరులకు ఆన్లైన్ బ్రోషర్లు పంపింది.అపారంగా అణ్వాయుధాలు రష్యా వద్ద వేలాదిగా అణ్వాయుధాలు పోగు పడి ఉన్నాయి. ప్రపంచంలోకెల్లా అత్యధిక సంఖ్యలో అణు వార్హెడ్లున్న దేశం రష్యానే. 1994లో సోవియట్ నుంచి విడిపోయేనాటికి ఉక్రెయిన్ వద్ద కూడా భారీగానే అణ్వాయుధాలుండేవి. ఆ జాబితాలో ప్రపంచంలో మూడో అతి పెద్ద దేశంగా ఉక్రెయిన్ ఉండేది. కానీ రష్యాతో ఒప్పందంలో భాగంగా తన అణ్వాయుధాలన్నింటినీ నాశనం చేసింది. కాకపోతే అమెరికాతో పాటు అణు సంపత్తి ఉన్న పలు దేశాలు ఉక్రెయిన్‌కు దన్నుగా ఉన్నాయి.క్షిపణులే మాట్లాడతాయి భారీ క్షిపణి దాడులకు మాకు అనుమతి లభించిందంటూ మీడియా ఏదేదో చెబుతోంది. కానీ దాడులు జరిగేది మాటలతో కాదు. వాటిని ముందుగా చెప్పి చేయరు. ఇక మా తరఫున క్షిపణులే మాట్లాడతాయి. – ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ – సాక్షి, నేషనల్ డెస్క్ -
మధ్యప్రాచ్యంలో యుద్ధ భేరి.. ఇజ్రాయెల్‌పై ఇరాన్ భారీ దాడులు
జెరుసలేం/టెహ్రాన్/వాషింగ్టన్: మధ్యప్రాచ్యం అగ్నిగుండమైంది. దాడులు, ప్రతి దాడులు, ప్రతీకార దాడులతో భగ్గుమంటోంది. లెబనాన్‌ను కొద్ది రోజులుగా వైమానిక దాడులతో బెంబేలెత్తిస్తున్న ఇజ్రాయెల్ మంగళవారం భూతల దాడులను తీవ్రతరం చేసింది. లెబనాన్‌కు దన్నుగా నిలుస్తున్న ఇరాన్ కూడా కాసేపటికే ప్రతీకారేచ్ఛతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. అమెరికా నిఘా విభాగం హెచ్చరికలను నిజం చేస్తూ మంగళవారం రాత్రి పెద్దపెట్టున వైమానిక దాడులకు దిగింది. ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్ లక్ష్యంగా భారీ సంఖ్యలో బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది.నిమిషాల వ్యవధిలో వందలాది మిసైళ్లు, రాకెట్లు దూసుకొచ్చాయి. టెల్ అవీవ్‌తో పాటు సమీపంలోని జెరుసలేం తదితర ప్రాంతాలు భారీ పేలుళ్లతో దద్దరిల్లిపోయాయి. పలు భవనాలు దెబ్బతిన్నాయి. ఇరాన్‌కు దన్నుగా హెజ్బొల్లా కూడా టెల్ అవీవ్‌పైకి మిసైళ్లు ప్రయోగించింది. దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ దేశవ్యాప్తంగా విమానాశ్రయాలన్నింటినీ మూసేసింది. ప్రజలందరినీ అప్రమత్తం చేసింది. బంకర్ సైరన్లు నిరంతరాయంగా మోగాయి. ప్రాణాలు కాపాడుకునేందుకు జనం బంకర్లు, సురక్షిత ప్రాంతాలకేసి పరుగులు తీశారు. జోర్డాన్ రాజధాని అమ్మాన్పైకి కూడా మిసైళ్లు దూసుకెళ్లి కలకలం రేపాయి.రంగంలోకి అమెరికా యుద్ధనౌకలుఇరాన్ దాడులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తీవ్రంగా ఖండించారు. స్వీయరక్షణ చేసుకునేందుకు ఇజ్రాయెల్‌కు అన్నివిధాలా అండగా నిలుస్తామని ప్రకటించారు. ఇరాన్ మిసైళ్లను నేలకూల్చడంలో ఇజ్రాయెల్‌కు సహకరించాల్సిందిగా సైన్యాన్ని ఆదేశించారు. దాంతో మధ్యదరా సముద్రంలోని అమెరికా యుద్ధనౌకలు కూడా రంగంలోకి దిగి పలు ఇరాన్ క్షిపణులను అడ్డుకుని కూల్చేశాయి. ఇరాన్ దాడులకు తెగబడితే ఇజ్రాయెల్‌కు దన్నుగా రంగంలోకి దిగాల్సి వస్తుందని అమెరికా ఇప్పటికే హెచ్చరించడం తెలిసిందే. మధ్యప్రాచ్యంలో మోహరించిన అమెరికా యుద్ధ నౌకలు, యుద్ధ విమానాలు ఆ దిశగా రంగంలోకి దిగే సూచనలు కని్పస్తున్నాయి.ఇరాన్ తాజా దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. మధ్యప్రాచ్యంలో తాము చేరలేని చోటంటూ ఏదీ లేదని పునరుద్ఘాటించారు. మొత్తానికి హమాస్‌ను ఏరివేసేందుకు గాజాపై ఏడాది క్రితం ఇజ్రాయెల్ తెరతీసిన దాడులు చివరికి లెబనాన్, ఇరాన్‌తో పూర్తిస్థాయి యుద్ధం దిశగా దారి తీసేలా కన్పిస్తున్నాయి. ఈ పరిణామంపై ప్రపంచ దేశాలన్నీ ఆందోళన చెందుతున్నాయి. గత ఏప్రిల్‌లో కూడా ఇజ్రాయెల్‌పై ఇరాన్ అనూహ్యంగా దాడికి దిగడం తెలిసిందే. అయితే అది ప్రయోగించిన క్షిపణులన్నింటినీ ఇజ్రాయెల్ మధ్యలోనే అడ్డుకుంది. ప్రతిదాడులకు దిగారో...: ఇరాన్ ఇజ్రాయెల్‌పైకి భారీగా మిసైళ్లు ప్రయోగించినట్టు ఇరాన్ సైన్యం ‘ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ)’ ప్రకటించింది. ‘‘గత జూలైలో హమాస్ అగ్ర నేత ఇస్మాయిల్ హనియాను, తాజాగా హెజ్»ొల్లా చీఫ్ నస్రల్లాను, తమ జనరల్ అబ్బాస్ నిల్ఫొరుషన్ను హతమార్చినందుకు, అసంఖ్యాకులైన అమాయక లెబనీస్, పాలస్తీనా ప్రజలను పొట్టన పెట్టుకుంటున్నందుకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాం’’ అని పేర్కొంది.‘‘ఇది ఆరంభం మాత్రమే. మాపై ప్రతి దాడులకు దిగితే మరింత భారీగా విరుచుకుపడతాం’’ అని హెచ్చరించింది. ఇజ్రాయెల్ సైన్యం కూడా ఇరాన్ దాడులను ధ్రువీకరించింది. వాటిని అడ్డుకునేందుకు భారీగా ఇంటర్‌సెప్టర్ మిసైళ్లు ప్రయోగించింది. ఇరాన్ దాడులు విస్తరించవచ్చని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి డేనియల్ హగరీ అభిప్రాయపడ్డారు. తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టం పూర్తిస్థాయిలో రంగంలోకి దిగిందని ప్రకటించారు. ఇరాన్ దాడులు ఆగాయని. ప్రస్తుతానికి ముప్పు లేనట్టేనని పేర్కొన్నారు. హెచ్చరించి మరీ లెబనాన్‌లోకి... ఇజ్రాయెల్, లెబనాన్ సరిహద్దు ప్రాంతాలు కూడా బాంబుల మోతతో దద్దరిల్లిపోతున్నాయి. హెజ్»ొల్లా మిలిటెంట్ల ఏరివేతే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం సోమవారం అర్ధరాత్రి నుంచే లెబనాన్‌లోకి చొచ్చుకుపోవడం మొదలుపెట్టింది. సరిహద్దు గ్రామాల్లోని లెబనాన్ ప్రజలంతా సురక్షిత ప్రాంతాలకు తరలాలని ముందుగానే హెచ్చరించి మరీ రంగంలోకి దిగింది. దక్షిణ సరిహద్దుకు, లితానీ నదికి మధ్యన 20 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలు, పట్టణాల్లో ఉన్నవారంతా తక్షణం ఇళ్లు ఖాళీ చేయాలని హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం ఇజ్రాయెల్ దళాలు భారీ సంఖ్యలో సరిహద్దు దాటి కిలోమీటర్ల కొద్దీ చొచ్చుకెళ్లాయి. లెబనాన్‌పై లక్షిత భూతల దాడులు మొదలైనట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.‘‘అక్కడి హెజ్»ొల్లా స్థావరాలను లక్ష్యం చేసుకున్నాం. మిలిటెంట్లు భారీగా ఆయుధాలను దాచిన బంకర్లు, టన్నెళ్లు తదితరాలను స్వా«దీనం చేసుకున్నాం’’ అంటూ వీడియోలు విడుదల చేసింది. ఇరు పక్షాల మధ్య భారీగా కాల్పులు, రాకెట్ దాడులు జరుగుతున్నాయి. ఒక రాకెట్ బీరూట్‌లో ఇరాన్ దౌత్య కార్యాలయానికి అతి సమీపంలో పడింది. దాంతో పలు భవనాలు కుప్పకూలాయి. ఎర్రసముద్రంలోని హొడైడా నగరానికి 110 కిలోమీటర్ల దూరంలో మంగళవారం ఉదయం వేళ ఇజ్రాయెల్ తొలి దాడి జరిగినట్టు తెలుస్తోంది. తర్వాత కాసేపటికే అక్కడి ఉత్తర దిశగా రెండో దాడి జరిగిందని బ్రిటన్ సముద్ర వర్తక కార్యకలాపాల కేంద్రం పేర్కొంది. ఈ క్రమంలో లెబనాన్‌లోని అతి పెద్ద శరణార్థుల శిబిరాల్లో ఒకటైన సిడాన్‌లోని ఎన్ ఆల్ హిల్వే శిబిరంపై జరిగిన బాంబు దాడిలో ఆరుగురి దాక మరణించినట్టు చెబుతున్నారు. వీరిలో పాలస్తీనా ప్రెసిడెంట్ మహమ్మద్ అబ్బాస్‌కు చెందిన ఫతా గ్రూప్ సారథి జనరల్ మునీర్ మగ్దా కొడుకు, కోడలు కూడా ఉన్నట్టు తెలుస్తోంది.ఉగ్ర కాల్పుల్లో ఆరుగురి మృతియుద్ధజ్వాలల నడుమ ఇజ్రాయెల్‌లో భారీ కాల్పులు చోటుచేసుకున్నాయి. జెరూసలేంలో ఇద్దరు ఉగ్రవాదులు విచ్చలవిడి కాల్పులకు తెగబడ్డారు. దాంతో ఆరుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, సైన్యం హుటాహుటిన రంగంలోకి దిగి ముష్కరులిద్దరినీ మట్టుబెట్టారు.లెబనాన్‌లో 900 మంది భారత సైనికులు!లెబనాన్ దక్షిణ సరిహద్దుల వద్ద ఐరాస శాంతి పరిరక్షక దళంలో 900 మంది దాకా భారత సైనికులున్నట్టు తెలుస్తోంది. అక్కడ యుద్ధమేఘాలు కమ్ముకున్న నేపథ్యంలో వారి భద్రతపై ఆందోళలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఐరాస దళంలో భాగంగా ఉన్న దృష్ట్యా వారిని ఇప్పటికిప్పుడు వెనక్కు పిలవడం సరైన చర్య కాబోదని కేంద్రం అభిప్రాయపడుతోంది. ‘‘మన సైనికులంతా సురక్షితంగా ఉన్నారు. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాం’’ అని తెలిపింది. -
రష్యాకు బాలిస్టిక్ క్షిపణుల సరఫరానా!
లండన్: ఉక్రెయిన్‌పై యుద్ధంలో వాడేందుకుగాను రష్యాకు ఇరాన్ స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను సరఫరా చేస్తోందని అమెరికా ఆరోపించింది. ఇందుకు బాధ్యులపై తగు చర్యలుంటాయని హెచ్చరించింది. ఆంక్షల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్, బ్రిటన్ విదేశాంగ మంత్రి డేవిడ్ ల్యామీ మంగళవారం లండన్‌లో ప్రకటించారు. ఇటువంటి ఆయుధాలను రష్యాకు సరఫరా చేయడమంటే సంక్షోభాన్ని పెద్దది చేయడమేనని, దీనిపై తాము ఎప్పటి నుంచో హెచ్చరిస్తున్న ఇరాన్ నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. ‘బాలిస్టిక్ మిస్సైళ్ల షిప్మెంట్ రష్యాకు అందింది. మరికొద్ది రోజుల్లోనే వాటిని ఉక్రెయిన్‌పైకి, అక్కడి ప్రజలపైకి రష్యా ప్రయోగిస్తుంది. ఈ క్షిపణులను యుద్ధ క్షేత్రానికి దూరంగా ఉండే లక్ష్యాలపైనా రష్యా గురి పెడుతుంది’అని బ్లింకెన్ అన్నారు. ఇందుకు గాను ఇరాన్ వైమానిక దళంపై ఆంక్షలు విధిస్తామన్నారు. ఇరాన్‌తో ద్వైపాక్షిక వైమానిక సేవల ఒప్పందం రద్దుతోపాటు బాలిస్టిక్ క్షిపణులను ఉత్పత్తి చేసే సంస్థలు, సంబంధిత అధికారులపై ఆంక్షలు విధించనున్నట్లు అనంతరం అమెరికా, బ్రిటన్, జర్మనీ ఒక ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. బ్లింకెన్, ల్యామీ బుధవారం ఉక్రెయిన్ను సందర్శించనున్నట్లు సమాచారం. -
ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణుల దాడి.. 41 మంది మృతి
రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌లోని పోల్టావా ప్రాంతంలో రష్యా రెండు బాలిస్టిక్ మిసైల్స్‌తో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 41 మంది మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ‘పోల్టావా ప్రాంతంలో రష్యా దాడులు చేసినట్లు మాకు ప్రాథమిక నివేదికలు అందాయి. పోల్టోవాపై రష్యా రెండు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. రష్యా ఒక విద్యా సంస్థ, సమీపంలోని ఆసుపత్రిని టార్గెట్ చేశాయి. టెలికమ్యూనికేషన్స్ సంస్థ భవనాలలో పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. చాలా మంది శిథిలాల కింది చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇప్పటివరకు 41 మంది మృతి చెందారు. సుమారు 180 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారికి చికిత్స అందిస్తున్నాం. మృతి చెందినవారికి కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నా’ అని తెలిపారు. ఈ దారుణమైన దాడులకు తెగబడిన రష్యా రానున్న కాలంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వ్లాదిమిర్ జెలెన్స్కీ హెచ్చరించారు. I received preliminary reports on the Russian strike in Poltava. According to available information, two ballistic missiles hit the area. They targeted an educational institution and a nearby hospital, partially destroying one of the telecommunications institute's buildings.… pic.twitter.com/TNppPr1OwF— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) September 3, 2024 -
Iran-Israel war: ఇజ్రాయెల్‌పై ఇరాన్ మెరుపుదాడి
జెరూసలేం: అనుకున్నంతా అయింది. సిరియాలో తమ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ మెరుపుదాడికి దిగింది. ఆదివారం తెల్లవారుజామునే 300కుపైగా క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైల్స్‌తో భీకరదాడికి తెగబడింది. ఇరాన్ తన భూభాగం నుంచి నేరుగా ఇజ్రాయెల్‌పై సైనిక చర్యకు దిగడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. మధ్యధరా సముద్రంలో సిద్ధంగా ఉన్న అమెరికా యుద్ధనౌకల నుంచి ప్రతిగా ప్రయోగించిన క్షిపణులు, ఇజ్రాయెల్ ప్రయోగించిన క్షిప ణులు ఈ ఇరాన్ మెరుపుదాడిని విజయవంతంగా ఎదుర్కొన్నాయి. ఫ్రాన్స్, బ్రిటన్, జోర్డాన్ దేశాలు ఈ విషయంలో ఇజ్రాయెల్‌కు సాయపడ్డాయి. లెబనాన్, జోర్డాన్ గగనతలాల మీదుగా దూసుకొచ్చిన వాటిల్లో దాదాపు 90 శాతం క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్ మిస్సైళ్లను గాల్లోనే తుత్తినియలు చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే కొన్ని బాలిస్టిక్ క్షిపణులు మాత్రం ఇజ్రాయెల్ భూభాగాన్ని తాకాయి. దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఇజ్రాయెల్ ఐడీఎఫ్ సైనిక స్థావరం దెబ్బతింది. బెడోయిన్ అరబ్ పట్టణంలో పదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడిందని ఇజ్రాయెల్ సైన్యం అధికార ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగేరీ చెప్పారు. ఇరాన్ దాడితో ఇజ్రాయెల్‌లో చాలా ప్రాంతాల్లో హెచ్చరిక సైరన్లు వినిపించాయి. జనం భయంతో వణికిపో యారు. అండగా ఉంటామన్న అమెరికా ఇరాన్ దాడిపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ మాట్లాడారు. ‘‘ ఉక్కుకవచంలా ఇజ్రా యెల్‌కు రక్షణగా నిలుస్తాం. అన్నివిధాలుగా అండగా ఉంటాం’ అని అన్నారు. దాడి నేపథ్యంలో జాతీయ భద్రతా మండలిని సమావేశపరిచి వివరాలు అడిగి తెల్సుకు న్నారు. అమెరికా స్పందనపై ఐక్యరాజ్య సమితిలోని ఇరాన్ మిషన్ ఘాటుగా స్పందించింది. ‘‘ మా దాడికి ప్రతిదాడి చేసేందుకు ఇజ్రాయెల్ ప్రయత్నిస్తే పరిణామాలు దారు ణంగా ఉంటాయి. ఈ సమస్య పశ్చిమాసి యాకే పరిమితం. ఉగ్ర అమెరికా ఇందులో తలదూర్చొద్దు’’ అని హెచ్చరించింది. ఇంతటితో మా ఆపరేషన్ ముగిసిందని ఇరాన్ సైన్యం చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ మొహమ్మద్ హుస్సేన్ బఘేరీ ప్రకటించారు. ‘‘దాడిని మేం అడ్డుకున్నాం. మిత్రదేశాల సాయంతో విజయం సాధించాం’ అని దాడి తర్వాత ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు. ఖండించిన ప్రపంచదేశాలు ఇరాన్ దాడిని ప్రపంచదేశాలు ఖండించాయి. ‘‘ ఈ శత్రుత్వాలకు వెంటనే చరమగీతం పాడండి. లేదంటే ఈ ఉద్రిక్త పరిస్థితి పశ్చిమాసియాను పెను ప్రమాదంలోకి నెట్టేస్తుంది. పరస్పర సైనిక చర్యలకు దిగకండి’ అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ వేడుకున్నారు. భారత్, కెనడా, బ్రిటన్ సహా పలు దేశాలు ఇరాన్ సైనికచర్యను తప్పుబట్టాయి. పౌరుల భద్రతపై భారత్ ఆందోళన ఇజ్రాయెల్‌లో ఉంటున్న భారతీయపౌరుల భద్రతపై భారత విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తంచేసింది. అక్కడి ఎంబసీలు మన పౌరులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారంటూ మరో ముఖ్య అడ్వైజరీని విడుదలచేసింది. ‘అనవసరంగా బయటికి వెళ్లకండి. మీ పేర్లను సమీప ఎంబసీల్లో రిజిస్టర్ చేసుకోండి. శాంతంగా ఉంటూ భద్రతా సూచనలు పాటించండి’ అని సూచించింది. హార్మూజ్ జలసంధి వద్ద ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన నౌకను ఇరాన్ బలగాలు హైజాక్‌చేసిన ఘటనలో అందులోని 17 మంది భారతీయ సిబ్బంది విడుదల కోసం చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. ఇరాన్ గగనతల దాడి నేపథ్యంలో ఇజ్రాయెల్‌లోని టెల్అవీవ్ నగరానికి ఢిల్లీ నుంచి విమానసర్వీసులను నిలిపేస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. -
రెండు క్షిపణులను పరీక్షించిన ఉత్తరకొరియా
సియోల్: అమెరికా, దక్షిణ కొరియాల సంయుక్త సైనిక విన్యాసాలు ముగిసిన వేళ ఉత్తర కొరియా గురువారం రెండు తక్కువ శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించింది. ఉభయ కొరియాల సరిహద్దుల్లో భారీగా కొనసాగిన అయిదో విడత సైనిక విన్యాసాలపై ఉత్తరకొరియా గుర్రుగా ఉంది. ఇటువంటి రెచ్చగొట్టే చర్యలపై తాము ఏదో ఒక రీతిలో తప్పక స్పందిస్తామని ఆ దేశ సైన్యం ఇప్పటికే ప్రకటించింది. తాజాగా, గురువారం సాయంత్రం ఆ దేశ రాజధాని ప్రాంతం నుంచి తూర్పు సముద్ర జలాలపైకి రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు గుర్తించామని దక్షిణ కొరియా సైన్యం ప్రకటించింది. -
కీవ్‌పై రష్యా క్షిపణుల వర్షం
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై రష్యా సైన్యం మరోసారి విరుచుకుపడింది. సోమవారం ఉదయం 11.30 గంటల సమయంలో బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లు ప్రయోగించింది. రష్యా సైన్యం ప్రయోగించిన 11 బాలిస్టక్, క్రూయిజ్ క్షిపణులను తాము కూల్చివేశామని ఉక్రెయిన్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ప్రకటించారు. వాటి శకలాలు నగరంలో అక్కడక్కడా చెల్లాచెదురుగా పడిపోయాయని, దట్టమైన పొగ కమ్ముకుందని చెప్పారు. రష్యా దాడుల్లో కీవ్‌లో ఒకరు గాయపడినట్లు సమాచారం. రష్యా సేనలు తొలుత ఆదివారం రాత్రి దాడులు ప్రారంభించాయి. జనం బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొందరు అండర్‌గ్రౌండ్ రైల్వే స్టేషన్లలో తలదాచుకున్నారు. కొంత విరామం తర్వాత సోమవారం ఉదయం మళ్లీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో పలు భవనాలు ధ్వంసమైనట్లు తెలుస్తోంది. రష్యా క్షిపణి దాడుల నేపథ్యంలో చిన్నారులు భయాందోళనలతో బాంబు షెల్టర్ వైపు పరుగులు తీస్తున్న వీడియోను ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఉక్రెయిన్ వైమానిక స్థావరాలను లక్ష్యంగా చేసుకొని లాంగ్–రేంజ్ మిస్సైళ్లు ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. ఈ దాడుల్లో ఉక్రెయిన్‌కు చెందిన కమాండ్ పోస్టులు, రాడార్లు, ఆయుధాలు ధ్వంసమయ్యాయని పేర్కొంది. కీవ్‌లో క్షిపణుల దాడి భయంతో మెట్రో స్టేషన్లో దాక్కున్న స్థానికులు -
ఉక్రెయిన్ చేతికి ‘పేట్రియాట్’
కీవ్: అమెరికా అత్యాధునిక పేట్రియాట్ గైడెడ్ క్షిపణి వ్యవస్థ ఉక్రెయిన్ చేతికొచ్చింది. దీంతో రష్యా యుద్ధమూకలను మరింత దీటుగా ఎదుర్కొంటామని ఉక్రెయిన్ రక్షణ మంత్రి ఒలెక్సీ రెజ్నికోవ్ బుధవారం ట్వీట్‌చేశారు. ‘ భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే పేట్రియాట్ క్షిపణి వ్యవస్థ రాకతో మా గగనతలానికి మరింత రక్షణ చేకూరింది’ అని ఆయన అన్నారు. శత్రు సేనల నుంచి దూసుకొచ్చే క్షిపణులు, స్వల్ప శ్రేణి బాలిస్టిక్ మిస్సైళ్లను ఈ వ్యవస్థతో కూల్చేయొచ్చు. క్రూయిజ్ క్షిపణులు, స్వల్ప శ్రేణి మిస్సైళ్లతోనే ఉక్రెయిన్ పౌర మౌలిక వసతులు ముఖ్యంగా విద్యుత్ సరఫరా వ్యవస్థలను రష్యా ధ్వంసం చేస్తున్న విషయం విదితమే. అందుకే జనావాసాలు, మౌలిక వసతుల రక్షణ కోసం కొంతకాలంగా పేట్రియాట్ సిస్టమ్స్ సరఫరా చేయాలని అమెరికాను ఉక్రెయిన్ కోరుతోంది. ఇన్నాళ్లకు అవి ఉక్రెయిన్ చేతికొచ్చాయి. -
విద్వేషమే విడదీసింది! కొరియన్ యుద్ధానికి కారణమెవరు? చివరకు మిగిలింది!
ఉత్తర కొరియా. ప్రపంచంలో దూర్త దేశాల్లో ఒకటిగా అగ్రరాజ్యం అమెరికాతోపాటు యూరప్ దేశాలు గుర్తించిన దేశం. అమెరికా హెచ్చరికలను ఖాతరు చేయకుండా వరుస క్షిపణి ప్రయోగాలతో దూకుడు ప్రదర్శిస్తోంది. యథేచ్ఛగా ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. అణ్వాయుధాలకూ పదును పెడుతోంది. తమవైపు కన్నెత్తి చూస్తే ఖబడ్దార్ అంటూ ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ హెచ్చరిస్తున్నారు. అమెరికా–దక్షిణ కొరియా కూటమి సంయుక్తంగా సైనిక విన్యాసాలపై మండిపడుతున్నారు. తాజాగా 48 గంటల వ్యవధిలో రెండుసార్లు క్షిపణి ప్రయోగాలు జరిపారు! ఉభయ కొరియాల మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతుండటం ప్రపంచ దేశాలను ఆందోళన పరుస్తోంది. వీటి మధ్య ఇంతటి విద్వేషానికి కారణమేమిటి...? ఉత్తర, దక్షిణ కొరియాల శత్రుత్వానిది దశాబ్దాల చరిత్ర. స్వతంత్ర దేశమైన ఉమ్మడి కొరియా ద్వీపకల్పాన్ని 1910లో జపాన్ ఆక్రమించుకుంది. 1945 దాకా నిరంకుశ పాలనలో కొరియా మగ్గిపోయింది. జపాన్ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ పోరుబాట పట్టింది. కమ్యూనిస్టు నేత కిమ్ ఇల్–సంగ్ కొరియా విముక్తి కోసం మంచూరియా నుంచి జపాన్ సైన్యంపై గెరిల్లా యుద్ధం చేశారు. 1945లో రెండో ప్రపంచ యుద్ధం చివర్లో జపాన్ అధీనంలో ఉన్న కొరియాలోకి సోవియట్ సేనలు అడుగుపెట్టాయి. 38వ ప్యారలెల్ లైన్ దాకా దూసుకొచ్చాయి. దాని దిగువ ప్రాంతాన్ని అమెరికా స్వాధీనం చేసుకుంది. అలా కొరియా విభజనకు బీజం పడింది. 1945లో ప్యారలెల్ లైన్‌కు ఎగువన తమ అధీనంలోని కొరియా ప్రాంతంలో పాంగ్యాంగ్ రాజధానిగా సోవియట్ సైనిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదే ఉత్తర కొరియా. దిగువ ప్రాంతంలో అమెరికా సైనిక ప్రభుత్వాన్ని నెలకొల్పింది. అదే దక్షిణ కొరియా! ప్రచ్ఛన్నయుద్ధం చిచ్చు కొరియాకు స్వాతంత్య్రం ఇవ్వడానికి ఉమ్మడి వేదిక ఏర్పాటు చేయాలని సోవియట్ యూనియన్, మిత్రదేశాలు భావించాయి. ప్రపంచాధిపత్యం కోసం అమెరికాతో సాగిన ప్రచ్ఛన్న యుద్ధంలో ఉత్తర కొరియా మద్దతు కోసం అక్కడి కమ్యూనిస్టులను సోవియట్ ప్రోత్సహించింది. దాని అండతో కిమ్ ఇల్ సంగ్ పెద్ద నేతగా అవతరించాడు. 1948లో ప్రధానిగా పీఠమెక్కాడు. అనంతరం సోవియట్ సేనలు ఉత్తర కొరియాను వీడాయి. మరోవైపు దక్షిణ కొరియాలో అమెరికా సైన్యం కమ్యూనిస్టులను కఠినంగా అణచివేసింది. అమెరికాలో చదివిన కమ్యూనిస్టు వ్యతిరేకి సైంగ్ మాన్ రీ కి మద్దతిచ్చింది. 1948లో జరిగిన ఎన్నికల్లో సైంగ్‌మాన్ రీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 1949లో అమెరికా సైన్యం దక్షిణ కొరియా వీడింది. అక్కడి నుంచి ఇరు కొరియాల మధ్య కొట్లాటకు బీజం పడింది. కొరియా ద్వీపకల్పం మొత్తాన్ని తామే పాలిస్తున్నామని, ఉభయ ప్రభుత్వాలు వాదించడం మొదలుపెట్టాయి. కిమ్ ఇల్ సంగ్ నాటి సోవియట్, చైనాల్లోని కమ్యూనిస్టు పాలకులు స్టాలిన్, మావోల మద్దతు కోరారు. ఇటు సైంగ్ మాన్ రీ కూడా ఉత్తర కొరియాను జయించాలన్న ఆకాంక్షలను దాచుకోలేదు. ఇది కొరియన్ యుద్ధానికి దారితీసింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అట్టహాసంగా ఉత్తర కొరియా సైనిక పరేడ్
సియోల్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తన సైనిక బలాన్ని మరోసారి ప్రదర్శించారు. రాజధాని పాంగ్యాంగ్లో బుధవారం రాత్రి సైనిక పరేడ్ అట్టహాసంగా నిర్వహించారు. అమ్ముల పొదిలోని కీలక ఆయుధాలతోపాటు అత్యాధునిక, భారీ అణు క్షిపణులకు సైతం ఈ పరేడ్‌లో చోటుకల్పించారు. కిమ్ జోంగ్ ఉన్‌తోపాటు ఆయన కుమార్తె కిమ్ జూ అయే ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పది సంవత్సరాల వయసున్న కిమ్ జూ అయే భవిష్యత్తులో ఉత్తర కొరియా పాలనా పగ్గాలు చేపట్టడం ఖాయమన్న చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. కిమ్ జోంగ్ ఉన్ తన కుమార్తెను ఆ దిశగా సన్నద్ధం చేస్తున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. కిమ్ జూ అయే బహిరంగంగా ప్రజలకు కనిపించడం ఇది ఐదోసారి. ఆమె కిమ్‌కు రెండో సంతానమని తెలుస్తోంది. మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె తండ్రితోపాటు కనిపించారు. మరిన్ని అణ్వాయుధాలను సొంతం చేసుకోవడానికి కిమ్ తీవ్రంగా శ్రమిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు. రాబోయే రోజుల్లో నూతన ఘన–ఇంధన ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ఉత్తర కొరియా పరీక్షించబోతున్నట్లు అంచనా వేస్తున్నారు. తాజా సైనిక పరేడ్‌లో డజనుకుపైగా ఖండాంతర బాలిస్టిక్ మిస్సైళ్లను ప్రదర్శించారు. పొరుగు దేశమైన దక్షిణ కొరియాతోపాటు అగ్రరాజ్యం అమెరికాతో ఉత్తర కొరియా కయ్యానికి కాలు దువ్వుతోంది. పశ్చిమ దేశాల ఆంక్షల వల్ల వనరులు పరిమితంగా ఉన్నప్పటికీ అత్యాధునిక అణ్వాయుధాల తయారీపై కిమ్ దృష్టి పెట్టడం ఆసక్తికరంగా మారింది. -
కవ్విస్తున్న ఉత్తర కొరియా
సియోల్: ఆయుధ పరీక్షలను ఉత్తర కొరియా ఆపట్లేదు. వరుస పెట్టి ప్రయోగాలు చేస్తూ పక్క దేశాలను భయపెడుతోంది. ఉద్రిక్తతలను పెంచేలా గురువారం మరోసారి రెండు బాలిస్టిక్ మిసైళ్లను సముద్రంలోకి ప్రయోగించింది. దీంతో ఈ నెలలో ఆ దేశం చేపట్టిన ప్రయోగాల సంఖ్య ఆరుకు చేరుకుందని దక్షిణ కొరియా మిలటరీ వెల్లడించింది. ఉత్తర కొరియాలోని హామ్‌హంగ్ టౌన్ నుంచి ఈ ప్రయోగాలు జరిగాయని, 5 నిమిషాల వ్యవధిలో రెండు మిసైళ్లను వదిలారని తెలిపింది. ఈ ప్రయోగాల వల్ల జపాన్ తీరంలో నౌకలు, విమానాలకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని జపాన్ ప్రధాని ఫుమియో కిషిడ తెలిపారు. అమెరికాతో ఆగిపోయిన అణ్వస్త్ర దౌత్య చర్చలు మళ్లీ జరిగేలా, తమపై విధించిన ఆంక్షలను ఎత్తేసేలా ఒత్తిడి పెంచాలనే ఉద్దేశంతో ఉత్తర కొరియా ఇలా ప్రయోగాలు చేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బైడెన్ సర్కారు ఉత్తర కొరియాతో అణ్వస్త్రాల నిరోధానికి సంబంధించి చర్చలు ప్రారంభించినా.. ఆయుధాలను కిమ్ పూర్తిగా విడిచిపెట్టే వరకూ ఆంక్షలు తొలగించకూడదని భావిస్తోంది. 2016 నుంచి అంతర్జాతీయ ఆంక్షలు కొనసాగుతుండటంతో ఉత్తర కొరియా ప్రధాన ఎగుమతి కార్యకలాపాలు చాలా వరకు ఆగిపోయాయి. చైనా వైపు మళ్లీ తెరుచుకున్న సరిహద్దులు? కరోనా వల్ల దాదాపు రెండేళ్ల పాటు కఠినమైన లాక్డౌన్ పెట్టిన ఉత్తర కొరియా.. సరిహద్దులను క్రమం గా తెరుస్తోంది. చైనా నుంచి సరుకు రవాణాను తిరిగి ప్రారంభించడంతో ఈ విషయం స్పష్టమవుతోంది. గత వారం యాలూ నదిని దాటి ఉత్తర కొరియాకు గూడ్స్ రైలు వచ్చిందని, సరుకును ఖాళీ చేసిందని వాణిజ్య శాటిలైట్ చిత్రాలు చెబుతున్నాయి. అమెరికా ఆంక్షలతో తలకిందులైన ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా వల్ల మరింత దిగజారిందని తాజా పరిణామాల వల్ల తెలుస్తోంది. అయితే దక్షిణ కొరియాలోని ఓ వర్గం మీడియా మాత్రం.. కిమ్ తండ్రి 80వ పుట్టిన రోజు వేడుకలు వచ్చే నెలలో జరగనున్నాయని, ఆ తర్వాత ఏప్రిల్ నెలలో తన తాత 110 పుట్టిన రోజు ఉందని, ఈ వేడుకలకు గాను ప్రజలకు అవసరమైన ఆహారం, ఇతర నిత్యావసరాలను బహుమతిగా అందివ్వడానికి తాత్కాలికంగా సరిహద్దును తెరిచినట్టు చెబుతోంది. దక్షిణ కొరియా లెక్కల ప్రకారం చైనాతో ఉత్తర కొరియా వాణిజ్యం 2020 దాదాపు 80 శాతం తగ్గింది. 2021లో సరిహద్దులు మూసేయడంతో మళ్లీ 2/3 వంతు తగ్గిపోయింది. ఉత్తర కొరియాలో ఇంకా వ్యాక్సినేషన్ మొదలు కాలేదు. సరిహద్దులు తెరిచిన పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌పై ఆ దేశం ఎలా స్పందిస్తుందోనని అనుకుంటున్నారు. సరిహద్దు పట్టణాల్లో డిసిన్ఫెక్టెంట్ జోన్లను ఉత్తర కొరియా ఏర్పాటు చేసుకుందని దక్షిణ కొరియా చెబుతోంది. -
పోటాపోటీగా ఉభయ కొరియాలా క్షిపణి పరీక్షలు
సియోల్: ఉభయ కొరియాలు పోటా పోటీగా తమ ఆయుధ సంపత్తిని పెంచుకొని ప్రాంతీయంగా ఉద్రిక్తతలకు తెరతీస్తున్నాయి. బుధవారం కొద్ది గంటల తేడాలో రెండు దేశాలు క్షిపణి పరీక్షలు నిర్వహించాయి. ఉత్తర కొరియా మళ్లీ దిగువ శ్రేణి క్షిపణి ప్రయోగాలు రెండు చేయడంతో.. దక్షిణ కొరియా దానికి పోటీగా ఏకంగా సముద్రగర్భంలో క్షిపణి ప్రయోగాలు చేసి తన సత్తా చాటింది. జలాంతర్గామి నుంచి క్షిపణి పరీక్షలు నిర్వహించగలిగే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సొంతం చేసుకున్న ఏడో దేశంగా నిలిచింది. కొత్తగా నిర్మించిన సబ్‌మెరైన్ అహ్ చంగ్ హో ద్వారా సముద్రగర్భంలో ఈ క్షిపణి పరీక్షలు నిర్వహించినట్టుగా ద.కొరియా అధ్యక్ష భవనం వర్గాలు వెల్లడించాయి. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన 3 వేల టన్నుల బరువున్న సబ్‌మెరైన్ నుంచి నిర్దేశిత లక్ష్యాలను ఈ క్షిపణి కచి్చతంగా ఛేదించింది. అంతకు ముందు ఉత్తర కొరియా రెండు షార్ట్ రేంజ్ బాలిస్టిక్ క్షిపణి పరీక్షలు నిర్వహించింది. కాగా, ఇదిలాగే కొనసాగితే ద్వైపాక్షిక సంబంధాలకు తీవ్ర విఘాతం కలగడం ఖాయమని ఉత్తరకొరియా అధినేత కిమ్ సోదరి యో జాంగ్ హెచ్చరించారు. -
ఉత్తర కొరియా కవ్వింపు చర్య.. ట్రంప్‌కు కూడా తెలుసు!
ప్యాంగ్యాంగ్: ప్రపంచమంతా కరోనా వైరస్ భయంతో బిక్కుబిక్కుమంటుంటే ఉత్తర కొరియా మరోసారి దుందుడుకు చర్యకు దిగింది. వోన్సాన్ పట్టణం నుంచి సీ ఆఫ్ జపాన్(తూర్పు సముద్రం)పై బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించి.. సూపర్ లార్జ్ మల్టిపుల్ రాకెట్ లాంచర్ల పనితీరును పరిశీలించింది. జపాన్, కొరియా, రష్యాలో సరిహద్దులో ఉండే ద్వీపం లక్ష్యంగా ఆదివారం కవ్వింపు చర్యలకు పాల్పడింది. అయితే ప్రతీసారి క్షిపణి ప్రయోగాలను ప్రత్యక్షంగా వీక్షించే ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ ఈసారి మాత్రం వాటికి దూరంగా ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. జాతీయ రక్షణ, సైన్స్ అకాడమీ ఆధ్వర్యంలో అధికార పార్టీ ఉపాధ్యక్షుడు రీ ప్యాంగ్ చోల్ క్షిపణి ప్రయోగాలను పర్యవేక్షించినట్లు తెలిపింది.(కరోనా: ఉత్తర కొరియా దుందుడుకు చర్య!) ఇక ఈ విషయంపై స్పందించిన దక్షిణ కొరియా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ ఎన్బీసీ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘‘ప్రపంచమంతా కరోనాతో పోరాడుతుంటే.. ఇక్కడ ఇలా... ఇది నిజంగా అనుచిత చర్య. అనుచిత ప్రవర్తనకు నిదర్శనం’’అని తీవ్రంగా మండిపడ్డారు. ఆదివారం ఉదయం ఆరు గంటల పది నిమిషాల సమయంలో సీ ఆఫ్ జపాన్‌లో రెండు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించినట్లు పేర్కొన్నారు. ఉత్తర కొరియా చర్యలను దక్షిణ కొరియా, అమెరికా ఇంటలెజిన్స్ వర్గాలు నిశితంగా పరిశీలిస్తున్నాయని తెలిపారు. (కరోనా భయం: స్టైల్ మార్చిన ఉత్తర కొరియా!) ఇదిలా ఉండగా.. ఈ విషయం గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కూడా తెలుసునని ఆయన ప్రభుత్వంలోని ఓ అధికారి వెల్లడించారు. జపాన్ రక్షణ శాఖ కూడా ఉత్తర కొరియా చర్యపై స్పందించిందని.. ఆ దేశ ప్రత్యేక ఎకనమిక్ జోన్‌కు అత్యంత సమీపంలో క్షిపణులు ల్యాండ్ అయినట్లు గుర్తించామని అధికారులు వెల్లడించారు. కాగా కొరియా ద్వీపకల్పంలో శాంతి స్థాపన, సంపూర్ణ అణ్వాయుధ నిరాయుధీకరణే లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌లు 2018లో సింగపూర్‌లో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇరు దేశాధినేతలు ఉమ్మడి ఒప్పందంపై సంతకాలు చేశారు. ఆ తర్వాత ఇటీవల ట్రంప్ ఉత్తర కొరియాలో పర్యటించి చారిత్రాత్మక ముందడుగు వేశారు. అయితే ఉత్తర కొరియా మాత్రం తన తీరును మార్చుకోకుండా నిరంతరం క్షిపణులను ప్రయోగిస్తూ దాయాది దేశాన్ని కలవరపెడుతోంది. ఇక ప్రాణాంతక వైరస్ కారణంగా తమ దేశంలో ఇంతవరకు ఒక్క మరణం కూడా సంభవించలేదని ఉత్తర కొరియా పేర్కొన్న విషయం తెలిసిందే. అంతేగాకుండా వరుసగా క్షిపణి ప్రయోగాలు జరుపుతూ ఆందోళనలు రేకెత్తిస్తోంది. కేవలం మార్చి నెలలోనే ఇప్పటి వరకు మొత్తం నాలుగుసార్లు క్షిపణులను పరిశీలించింది. -
ఉ.కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
సియోల్: ప్రపంచమంతా కరోనా మహమ్మారితో ఒకవైపు తల్లడిల్లుతుండగా ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జొన్ ఉంగ్ తన పంథాలోనే వెళ్తున్నారు. తాజాగా మరోసారి క్షిపణి ప్రయోగం చేపట్టారు. కిమ్ శుక్రవారం ఉదయం సోంచన్ కౌంటీలోని ఓ ప్రాంతంలో క్షిపణి ప్రయోగాలను పర్యవేక్షిస్తున్నట్లుగా ఉన్న ఫొటోలను అధికార మీడియా విడుదల చేసింది. 700 మంది సభ్యులతో కూడిన పార్లమెంట్ సమావేశం ఏప్రిల్ 10న ఉంటుందని ఈ క్షిపణి ప్రయోగానికి ముందుగా అధికార మీడియా ప్రకటించింది. ఉ.కొరియా శుక్రవారం రెండు స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను సముద్రంపైకి ప్రయోగించినట్లు సమీప పొరుగు దేశాలు దక్షిణ కొరియా, జపాన్ కూడా ధ్రువీకరించాయి. ఇవి 410 కిలోమీటర్ల మేర ప్రయాణించి సముద్రంలో పడిపోయాయని ద.కొరియా సైన్యం తెలిపింది.ఉత్తర కొరియాపై కరోనా ప్రభావానికి సంబంధించి బయటి ప్రపంచానికి ఎటువంటి సమాచారం లేదు. అయితే, ఆ దేశంలో కరోనా కేసులు భారీగా∙ఉంటాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
కరోనా: ఉత్తర కొరియా దుందుడుకు చర్య!
ప్యాంగ్యాంగ్: ప్రాణాంతక కరోనా వైరస్(కోవిడ్-19) ధాటికి ప్రపంచదేశాలన్నీ విలవిల్లాడుతుంటే ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ మాత్రం ‘నా రూటే సపరేటు’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. మహమ్మారి వ్యాపిస్తున్న తరుణంలో సైన్యం చిన్న తరహా బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగిస్తుంటే తాపీగా కూర్చుని వాటిని పర్యవేక్షించారు. అంతేకాదు కరోనాను ఉత్తర కొరియా సమర్థవంతంగా ఎదుర్కొందని తెలియజేసేందుకు ఏకంగా 700 మంది అధికారులు ఒక్కచోట చేరాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో దాయాది దేశం తీరును దక్షిణ కొరియా తీవ్రంగా తప్పుబట్టింది. అంటువ్యాధి వ్యాపిస్తున్న తరుణంలో ఇలా క్షిపణులు పరీక్షించడం అనుచిత చర్య అని మండిపడింది. ఈ మేరకు శనివారం ఉదయం 6.45- 50 నిమిషాల సమయంలో కొరియా ద్వీపంలోని సోన్‌చోన్ సమీపంలో ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ వెల్లడించారు. ఉత్తర కొరియా సైనిక చర్య గర్హనీయమన్నారు. (కరోనా: ఉత్తర కొరియాలో పేషెంట్ కాల్చివేత!) కాగా తమ దేశంలో కరోనా వైరస్ ప్రభావం లేదని చాటి చెప్పేందుకు ఉత్తర కొరియా సుప్రీం పీపుల్స్ అసెంబ్లీ శనివారం సమావేశం కానుందని స్థానిక మీడియా వెల్లడించింది. దాదాపు 700 మంది ఉన్నతాధికారులు అంతా ఒక్కచోట చేరి ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తారని వెల్లడించింది. ఈ క్రమంలోనే కిమ్ జోంగ్ ఉన్ క్షిపణుల ప్రయోగానికి సైనిక అధికారులను శుక్రవారం ఆదేశించినట్లు పేర్కొంది. ఇక ఇందుకు సంబంధించిన దృశ్యాలను స్వయంగా వీక్షించారని.. ఆ సమయంలో మాస్కులు ధరించలేదని వెల్లడించారు. కాగా చైనాలో కరోనా వైరస్ మూలాలు బయటపడిన నాటి నుంచి.. కిమ్ జోంగ్ ఉన్ పలు కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. అన్ని సరిహద్దు దేశాలు సహా దౌత్యపరంగా తమకు మిత్రపక్షంగా ఉన్న ఏకైక దేశం చైనా సరిహద్దును సైతం మూసివేశారు. అంతేకాకుండా... కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తమ దేశ పౌరులతో పాటు విదేశీయులను కూడా ఎప్పటికప్పుడు నిర్బంధంలోకి తీసుకున్నా.. అధికారులకు సహకరించాలని ఆదేశించారు. ఈ క్రమంలో కరోనా వైరస్ సోకినట్లుగా భావిస్తున్న ఓ వ్యక్తిని ఉత్తర కొరియా పాశవికంగా హతమార్చినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. (కరోనా: 11 వేలు దాటిన మృతుల సంఖ్య) కోవిడ్: యువతకు డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు! -
ఉత్తర కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగం
సియోల్: ఉత్తర కొరియా రెండు క్షిపణులను పరీక్షించినట్లు తమకు సమాచారం ఉందని దక్షిణ కొరియా మిలిటరీ తెలిపింది. ఆ రెండూ షార్ట్–రేంజ్ బాలిస్టిక్ క్షిపణులుగా భావిస్తున్నట్లు చెప్పింది. ఓ కొత్త వ్యూహాత్మక క్షిపణిని పరీక్షిస్తామని ఉత్తర కొరియా ఇది వరకే చెప్పిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా–అమెరికాల మధ్య జరుగుతున్న అణు చర్చలు ఫలితం తేలకుండా ఉండగానే ఈ క్షిపణిని ప్రయోగించడం గమనార్హం. వోన్సన్ ప్రాంతం నుంచి తూర్పు తీర ప్రాంతం మీదుగా దాదాపు 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యానికి ఈ క్షిపణులు గురిపెట్టినట్లు భావిస్తున్నామని దక్షిణ కొరియా ఉన్నతాధికారులు తెలిపారు. (చదవండి: శతాబ్దానికో మహమ్మారి!) -
ఇరాన్ క్షిపణుల వర్షం అమెరికా శాంతి మంత్రం
టెహ్రాన్/వాషింగ్టన్: ఇరాన్–అమెరికాల మధ్య ఉద్రిక్తతలు బుధవారం కీలక మలుపు తీసుకున్నాయి. ఒకవైపు, ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ మంగళవారం రాత్రి క్షిపణుల వర్షం కురిపించగా, మరోవైపు, అమెరికా అనూహ్యంగా శాంతి మంత్రం జపించింది. ఇరాన్ క్షిపణి దాడిలో తమ సైనికులెవరూ చనిపోలేదని, తమ మిలటరీ స్థావరాలకు కొంత నష్టం మాత్రం వాటిల్లిందని బుధవారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. శాంతిని కోరుకునే అందరితో శాంతియుత సంబంధాలనే కోరుకుంటామన్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రసంస్థను నిర్మూలించేందుకు కలసిరావాలని ఇరాన్‌ను కోరారు. దీంతో, తీవ్ర స్థాయికి చేరిన ఉద్రిక్తతలు కొంతమేరకు చల్లబడ్డాయి. అమెరికా సైనికులు, సంకీర్ణ దళాలు ఉన్న అల్ అసద్, ఇర్బిల్ మిలటరీ స్థావరాలపై ఇరాన్ డజనుకు పైగా బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసింది. ఈ దాడిలో 80 మంది అమెరికా సైనికులు చనిపోయారని ప్రకటించింది. ఈ దాడి అమెరికాకు చెంపపెట్టులాంటిదని ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ వ్యాఖ్యానించారు. ‘అమెరికాకు భయపడి వెనక్కువెళ్లబోం’ అని ఈ దాడి ద్వారా స్పష్టం చేశామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ స్పష్టం చేశారు. ఇరాన్ సైనిక జనరల్ సులేమానీని అమెరికా చంపినందుకు ప్రతీకారంగానే ఈ క్షిపణి దాడి జరిగిందని ఇరాన్ అధికార టీవీ ప్రకటించింది. ‘ఈ దాడుల్లో అమెరికాకు చెందిన 80 టెర్రరిస్ట్ సైనికులు హతమయ్యారు’ అని వ్యాఖ్యానించింది. ‘అమెరికా సైనికులు ఉన్న రెండు స్థావరాలపై 22 క్షిపణులను ప్రయోగించారు. ఈ దాడిలో ఇరాకీ సైనికులకు గాయాలు కాలేదు’ అని ఇరాక్ మిలటరీ ప్రకటించింది. ‘నేరానికి పాల్పడితే.. తగిన జవాబు సిద్ధంగా ఉంటుందని ఆమెరికాకు తెలియాలి’ అని హసన్ రౌహానీ పేర్కొన్నారు. ‘వారు తెలివైన వారైతే.. ఈ పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకోరు’ అని అమెరికాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. భయాందోళనలకు తెర ఇరాన్ క్షిపణి దాడులపై అమెరికా ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠ, మూడో ప్రపంచ యుద్ధానికి తెరలేవనుందనే ఊహాగానాల మధ్య బుధవారం ట్రంప్ అమెరికా ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘శాంతిని కోరుకునే అందరితో అమెరికా సామరస్యపూర్వక సంబంధాలనే కోరుకుంటుంది’ అని ఇరాన్ నాయకత్వానికి, ప్రజలకు స్పష్టం చేశారు. ‘ఇరాన్ ప్రజలు, ఆ దేశ నాయకులు కోరుకున్న భవిష్యత్తు, గొప్ప భవిష్యత్తు లభించాలనే మేమూ కోరుకుంటున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో, ఇరాన్‌ను అణ్వాయుధ దేశంగా మారనివ్వబోనని ప్రతినబూనారు. ‘నేను అమెరికా అధ్యక్షుడిగా ఉన్నంతవరకు ఇరాన్ అణ్వాయుధ దేశం కాబోదు’ అన్నారు. ఇరాన్ తన అణ్వాయుధ కార్యక్రమాన్ని తక్షణమే విడనాడాలన్నారు. ప్రస్తుతం ఇరాన్‌తో ప్రపంచ దేశాలు మరింత సమర్ధవంతమైన అణు ఒప్పందాన్ని కుదుర్చుకోవాల్సి ఉందన్నారు. సులేమానీని క్రూరుడైన ఉగ్రవాదిగా ట్రంప్ మరోసారి అభివర్ణించారు. అమెరికా, ఇరాన్ రక్తంతో సులేమానీ చేతులు తడిచాయన్న ట్రంప్.. అతడిని అంతమొందించడం ద్వారా ఉగ్రవాదులకు కఠిన సందేశమిచ్చామన్నారు. ఉగ్ర సంస్థ ఐఎస్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీని అంతమొందించడం వల్ల ఇరాన్‌కు మంచి జరిగిందని ట్రంప్ వ్యాఖ్యానించారు. మరోవైపు, ఇరాన్‌పై తక్షణమే మరిన్ని ఆర్థిక ఆంక్షలను విధించనున్నామని ప్రకటించారు. ఇరాన్ తన తీరును మార్చుకునే వరకూ ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇరాన్ దాడి చేసిన సైనిక కేంద్రాల్లోని తమ సైనికులంతా క్షేమంగా ఉన్నారని ట్రంప్ తెలిపారు. ఇరాన్ దాడులకు తెగబడే అవకాశముందన్న సమాచారం నేపథ్యంలో ఇరాక్‌లో తమ దళాలున్న అన్ని మిలటరీ స్థావరాల్లో తగిన ముందు జాగ్రత్తలు తీసుకున్నామని అమెరికా మిలటరీ కేంద్రం పెంటగన్ అధికార ప్రతినిధి జొనాథన్ హాఫ్మన్ తెలిపారు. తమ దళాలు, మిత్ర పక్షాల సంకీర్ణ దళాల రక్షణ కోసం అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. మరోవైపు, ట్రంప్ బుధవారం ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానికి ఫోన్ చేసి ఇరాన్ – ఇరాక్ పరిస్థితిపై చర్చించారు. జర్మనీ చాన్సెలర్ మెర్కెల్‌తో ఉద్రిక్త పరిస్థితిపై ట్రంప్ చర్చించారు. చావుదెబ్బ తీస్తాం: ఇజ్రాయెల్ మాపై దాడికి దిగితే చావుదెబ్బ తప్పదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ తమ బద్ధ శత్రువు ఇరాన్‌ను హెచ్చరించారు. సులేమానీని హతమార్చినందుకు అమెరికాకు అభినందనలు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్లో ఘర్షణల్లో అమెరికాకు తమ సంపూర్ణ మద్దతుంటుందన్నారు. ఇజ్రాయెల్ నగరాలను నేలమట్టం చేస్తామని ఇటీవల ఇరాన్ మిలటరీ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో నెతన్యాహూ పై వ్యాఖ్యలు చేశారు. ఇరాక్ వెళ్లకండి న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరాక్ వెళ్లాలనుకునే పర్యాటకులకు భారత్ పర్యాటక సూచన జారీ చేసింది. ‘అంతగా అవసరం లేని ప్రయాణమైతే రద్దు చేసుకోండి’ అని ఇరాక్ వెళ్లే భారత ప్రయాణీకులకు భారత విదేశాంగ శాఖ సూచించింది. ఇరాక్‌లోని భారతీయులు సైతం జాగ్రత్తగా ఉండాలని, అనవసర ప్రయాణాలు అస్సలు చేయవద్దని సూచించింది. శాంతికి భారత్ కృషి చేయాలి ఇరాన్–అమెరికాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించేందుకు భారత్ తీసుకునే ఎలాంటి శాంతి చర్యలనైనా ఇరాన్ స్వాగతిస్తుందని భారత్‌లో ఆ దేశ రాయబారి అలీ చెగెనీ పేర్కొన్నారు. ఇరాన్–అమెరికాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగబోవని ఆశిస్తున్నానని వ్యాఖ్యానించారు. సులేమానీకి నివాళులర్పించేందుకు ఇరాన్ ఎంబసీలో బుధవారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో మాట్లాడారు. -
భారత్ లక్ష్యంగా చైనా కొత్త క్షిపణి!
బీజింగ్: చైనా తయారు చేసిన కొత్త బాలిస్టిక్ క్షిపణులు అమెరికా భద్రతా వ్యవస్థకు సవాల్ విసరడమే కాకుండా భారత్, జపాన్‌లోని మిలిటరీ క్యాంపులను లక్ష్యంగా చేసుకోగలవని తెలుస్తోంది. గతేడాది చివర్లో ‘హైపర్సోనిక్ గ్లైడ్ వెహికల్ (హెచ్‌జీవీ)’లేదా డీఎఫ్–17 అనే క్షిపణిని చైనా పరీక్షించిందని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ అనే పత్రిక ఓ కథనంలో పేర్కొంది. చైనా ఆర్మీకి చెందిన రాకెట్ బలగాలు నవంబర్ 1న ఓ పరీక్ష, రెండు వారాల తర్వాత రెండో పరీక్ష నిర్వహించాయని వెల్లడించింది. ‘అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ప్రకారం రెండు పరీక్షలు విజయవంతమయ్యాయి’అని ప్రచురించింది. కాగా, ఈ పరీక్షలపై చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధిని వివరణ అడగగా ఆ వార్తలను ఖండించారు. -
మూడు క్షపణుల్ని పరీక్షించిన ఉత్తరకొరియా
వాషింగ్టన్: ఉత్తరకొరియా శనివారం మూడు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందని అమెరికా మిలిటరీ అధికారులు పేర్కొన్నారు. పసిఫిక్ సముద్ర తూర్పు జలాల్లో ఉత్తరకొరియా ఈ ప్రయోగాలు నిర్వహించిందని, మొదటి రెండు విఫలమవడంతో మూడోది ప్రయోగించినట్లు చెప్పారు. 250 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలపై ప్రయోగించే ఈ మూడు క్షిపణులు తేలికపాటివేనన్నారు. ‘ పరిస్థితిని మేం నిశితంగా పరిశీలిస్తున్నాం’ అని వైట్‌హౌజ్ పేర్కొంది. -
దూకుడు కొనసాగిస్తున్న ఉత్తర కొరియా
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా తన దూకుడును కొనసాగిస్తోంది. మరో మూడు బాలిస్టిక్ క్షిపణులను మంగళవారం ఉత్తర కొరియా ప్రయోగించినట్లు దక్షిణ కొరియా మీడియా సంస్థ యొన్హప్ వెల్లడించింది. వాంగ్జు కౌంటీ నుంచి తూర్పు సముద్రం(సీ ఆఫ్ జపాన్) వైపు ఈ క్షిపణి ప్రయోగాలను ఉత్తర కొరియా నిర్వహించినట్లు యొన్హప్ తెలిపింది. హైడ్రోజన్ బాంబ్ ప్రయోగాన్ని నిర్వహించిన ఉత్తర కొరయా బాలిస్టిక్ క్షిపణుల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. రెండు వారాల క్రితం ఓ సబ్ మెరైన్ నుంచి ఉత్తర కొరియా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి జపాన్ సముద్రజలాల్లో పడటంతో వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ముందస్తు సమాచారం లేకుండా ఉత్తర కొరియా పరీక్షలు జరిపిన తీరును జపాన్ తీవ్రంగా వ్యతిరేకించింది.