ఉత్తర కొరియా బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగం | North Korea Fires Two Ballistic Missiles, Says South Korea | Sakshi
Sakshi News home page

ఉత్తర కొరియా క్షిపణులు గురిపెట్టింది: ద.కొరియా

Published Tue, Mar 3 2020 8:13 AM | Last Updated on Tue, Mar 3 2020 8:13 AM

North Korea Fires Two Ballistic Missiles, Says South Korea - Sakshi

సియోల్‌: ఉత్తర కొరియా రెండు క్షిపణులను పరీక్షించినట్లు తమకు సమాచారం ఉందని దక్షిణ కొరియా మిలిటరీ తెలిపింది. ఆ రెండూ షార్ట్‌–రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణులుగా భావిస్తున్నట్లు చెప్పింది. ఓ కొత్త వ్యూహాత్మక క్షిపణిని పరీక్షిస్తామని ఉత్తర కొరియా ఇది వరకే చెప్పిన సంగతి తెలిసిందే. ఉత్తర కొరియా–అమెరికాల మధ్య జరుగుతున్న అణు చర్చలు ఫలితం తేలకుండా ఉండగానే ఈ క్షిపణిని ప్రయోగించడం గమనార్హం. వోన్సన్‌ ప్రాంతం నుంచి తూర్పు తీర ప్రాంతం మీదుగా దాదాపు 150 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యానికి ఈ క్షిపణులు గురిపెట్టినట్లు భావిస్తున్నామని దక్షిణ కొరియా ఉన్నతాధికారులు తెలిపారు. (చదవండి: శతాబ్దానికో మహమ్మారి!)

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement