రష్యా-ఉక్రెయిన్ మధ్య దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌లోని పోల్టావా ప్రాంతంలో రష్యా రెండు బాలిస్టిక్ మిసైల్స్‌తో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 41 మంది మృతి చెందినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్‌స్కీ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.
‘పోల్టావా ప్రాంతంలో రష్యా దాడులు చేసినట్లు మాకు ప్రాథమిక నివేదికలు అందాయి. పోల్టోవాపై రష్యా రెండు బాలిస్టిక్ క్షిపణులు ప్రయోగించింది. రష్యా ఒక విద్యా సంస్థ, సమీపంలోని ఆసుపత్రిని టార్గెట్ చేశాయి. టెలికమ్యూనికేషన్స్ సంస్థ భవనాలలో పాక్షికంగా ధ్వంసం అయ్యాయి. చాలా మంది శిథిలాల కింది చిక్కుకున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఈ దాడుల్లో ఇప్పటివరకు 41 మంది మృతి చెందారు. సుమారు 180 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడినవారికి చికిత్స అందిస్తున్నాం. మృతి చెందినవారికి కుటుంబ సభ్యులకు నా సానుభూతిని తెలియజేస్తున్నా’ అని తెలిపారు. ఈ దారుణమైన దాడులకు తెగబడిన రష్యా రానున్న కాలంలో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని వ్లాదిమిర్ జెలెన్‌స్కీ హెచ్చరించారు.
I received preliminary reports on the Russian strike in Poltava. According to available information, two ballistic missiles hit the area. They targeted an educational institution and a nearby hospital, partially destroying one of the telecommunications institute's buildings.… pic.twitter.com/TNppPr1OwF
— Volodymyr Zelenskyy / Володимир Зеленський (@ZelenskyyUa) September 3, 2024
Comments
Please login to add a commentAdd a comment