![Donald Trump Sensation Comments Over Ukraine And Russia](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/13/Putin.jpg.webp?itok=AwO7UGzY)
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉక్రెయిన్‌కు వరుస షాక్‌లు ఇస్తున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మాట్లాడిన తర్వాత ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్ధంపై స్పందిస్తూ కీవ్ నాటో సభ్యత్వం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో జెలెన్‌స్కీకి ఎదురుదెబ్బ తగిలింది. ఎందుకంటే ఉక్రెయిన్‌తో శాంతి చర్చల్లో రష్యా ప్రధాన డిమాండ్లలో ఇది కూడా ఒకటి కావడం గమనార్హం.
తాజాగా ట్రంప్.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌లో దాదాపు 90 నిమిషాల పాటు సుదీర్ఘంగా ఫోన్‌కాల్‌లో మాట్లాడారు. అనంతరం, ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలు మొదలవుతాయని పేర్కొన్నారు. ఇదే సమయంలో రష్యా అధినేత పుతిన్‌తో తాను ఈ శాంతి చర్చల కోసం తొలిసారి సౌదీ అరేబియాలో భేటీ కావచ్చని ఓవల్ ఆఫీస్‌లో ట్రంప్ పేర్కొన్నారు. తేదీలు ఇంకా ఫిక్స్ కాలేదని వెల్లడించారు. అలాగని ఈ భేటీలో భారీ జప్యం జరగదని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సౌదీ యువరాజు కూడా భాగం కావచ్చని వెల్లడించారు.
మరోవైపు.. రష్యా ఆక్రమణలో ఉన్న భూమి ఉక్రెయిన్ తిరిగి పొందే అవకాశాల్లేవని ట్రంప్ బాంబు పేల్చారు. దీంతో క్రిమియా సహా రష్యా ఆక్రమణల్లోని ప్రాంతాలపై ఉక్రెయిన్ ఆశలకు చెక్ పెట్టినట్టు అయ్యింది. అలాగే, కీవ్ నాటో సభ్యత్వం ప్రాక్టికల్‌గా సాధ్యం కాదని తేల్చిచెప్పారు. దీంతో, ఉక్రెయిన్‌కు డబుల్ స్ట్రోక్ తగిలింది.
REPORTER: The borders and the lack of NATO membership -- ultimately these are both demands Russia has made. Is there not a danger of handing Russia a win?
TRUMP: Well I think if you look at the war, the way the war is going, you'll have to make your own determination pic.twitter.com/ZGQru3Of2g— Aaron Rupar (@atrupar) February 12, 2025
ఇదిలా ఉండగా.. ట్రంప్‌తో ఫోన్‌కాల్ చర్చలపై జెలెన్‌స్కీ స్పందిస్తూ..‘మా మధ్య సమగ్రంగా చర్చలు జరిగాయి. కీవ్‌లో నిజమైన శాంతిని తీసుకొచ్చేందుకు ఏం చేయాలనే అంశంపై మాట్లాడుకొన్నాం. వీటిల్లో దౌత్య, సైనిక, ఆర్థిక అంశాలున్నాయి. తాను, పుతిన్‌తో మాట్లాడినట్లు ట్రంప్ స్వయంగా వెల్లడించారు. పుతిన్, రష్యాపై ఒత్తిడి తీసుకురావడానికి అమెరికా శక్తి సరిపోతుందని నేను భావిస్తున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment