![Ukraine Zelenskyy says Ready To Swap Territory with Russia](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/Putin.jpg.webp?itok=KwqQVMQX)
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వేళ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా(Russia) ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్ భూభాగాలను పుతిన్ విడిచిపెడితే తమ ఆధీనంలో ఉన్న ప్రాంతాలను అప్పగిస్తామని జెలెన్ స్కీ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో తాము అనుకున్నది జరగాలంటే రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య చర్చలు జరిగేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) చొరవ చూపాలని చెప్పుకొచ్చారు.
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘రష్యాతో భూభాగ మార్పిడికి మేము సిద్ధంగా ఉన్నాం. అయితే, ఉక్రెయిన్ భూభాగాలను రష్యా విడిచిపెడితే మా అధీనంలో ఉన్న కుర్స్క్‌ను వారికి అప్పగిస్తామం’ అని అన్నారు. ఈ సందర్బంగా వాటిలో ఏ భూభాగాలను తిరిగి తీసుకుంటారని మీడియా అడగ్గా తమ భూభాగాలన్నీ ముఖ్యమైనవే అన్నారు. ఏవి తిరిగి తీసుకోవాలనే విషయంపై చర్చల అనంతరం నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చారు.
ఇదే సమయంలో తాము అనుకున్నది జరగాలంటే రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య చర్చలు జరిగేలా డొనాల్డ్ ట్రంప్ కృషి చేయాలని కోరారు. రష్యా నుంచి తమ భూభాగాలను ఉక్రెయిన్‌కు అప్పగించినందుకు అమెరికాలో పలు ఒప్పందాలు చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు జెలెన్ స్కీ ప్రకటించారు. తమవద్ద అరుదైన ఖనిజ నిల్వలు అధికంగా ఉన్నాయని.. వాటివల్ల అమెరికా కంపెనీలకు లాభాలు చేకూరుతాయని తెలిపారు. ఉక్రెయిన్‌లోనూ ఉద్యోగాలు సృష్టించవచ్చని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉండగా.. 2014లో రష్యా క్రిమియాను స్వాధీనం చేసుకుంది. అనంతరం డోనెస్క్, ఖేర్సన్, లుహాన్స్క్, జాపోరిజ్జియా ప్రాంతాలను తన నియంత్రణలోకి తీసుకుంది. అయినప్పటికీ వాటిపై పుతిన్‌కు మాత్రం పూర్తి నియంత్రణ లేదు. ఉక్రెయిన్‌పై యుద్దం సందర్భంగా కూడా రష్యా పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.
JUST IN: 🇺🇦🇷🇺 Ukrainian President Zelensky says he's prepared to offer a territory swap with Russia as part of peace deal negotiations to end the war. pic.twitter.com/N9w9uoYfnl
— BRICS News (@BRICSinfo) February 11, 2025
Comments
Please login to add a commentAdd a comment