
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం ముగియాలంటే జెలెన్ స్కీ, పుతిన్ కలిసిపోవాలని సూచించారు. ఇదే సమయంలో లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు ట్రంప్.
రష్యా-ఉక్రెయిన్ వివాదంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. తాజాగా ట్రంప్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రష్యా-ఉక్రెయిన్ మధ్య నేను కాల్పల విరమణను చూడాలనుకుంటున్నాను. ఆ ఒప్పందాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నా. ఇప్పటికైనా యుద్ధం ఆపాలని కోరుకుంటున్నాను. కీవ్, మాస్కో మధ్య యుద్ధం ఆగిపోవాలంటే ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కలవాల్సిన అవసరం ఉంది. రెండు దేశాల్లో లక్షలాది మంది ప్రజల చావులు ఆగాలని కోరుకుంటున్నాం కాబట్టి అది జరిగి తీరాలన్నారు.
#WATCH | Washington | On the Russia-Ukraine conflict, US President Donald Trump says, "President Putin and President Zelenskyy have to get together because we want to stop the war and stop killing millions of people... I want to see a ceasefire, and I want to get the deal done...… pic.twitter.com/404opUoyGl
— ANI (@ANI) February 21, 2025
అలాగే, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అమెరికాను పెద్దగా ప్రభావితం చేయదు. కానీ, యూరప్‌ను ప్రభావితం చేస్తోంది. యుద్ధం కారణంగా అమెరికా భారీగా సాయం($300 బిలియన్ల) అందించింది. యూరప్ కూడా పెద్ద మొత్తంలో సాయం($100 బిలియన్ల) చేయాల్సి వచ్చింది. బైడెన్ వారికి డబ్బు ఇచ్చారని అన్నారు. ఇదే సమయంలో, ఖనిజ నిక్షేపాల్లో వాషింగ్టన్‌కు వాటా ఇచ్చేందుకు ఉక్రెయిన్ త్వరలోనే అంగీకారం తెలిపే అవకాశం ఉందని వెల్లడించారు.
మరోవైపు.. ట్రంప్ ఇప్పటికే జెలెన్‌స్కీపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని జెలెన్‌స్కీ యుద్ధం వరకూ తీసుకొచ్చారని నిందించారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్దసంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందన్నారు. యుద్ధానికి ఉక్రెయినే కారణమని, పోరు మొదలుకావడానికి ముందే సంధి చేసుకొని ఉండాల్సిందని అన్నారు. మూడేళ్లుగా ఆ పనిని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment