
టెల్‌అవీవ్:బందీగా తీసుకెళ్లిన షిరి బిబాస్ మృతదేహం కాకుండా వేరే మృతదేహాన్ని హమాస్ పంపడంపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.ఇది కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనేనని, దీనికి ప్రతిగా హమాస్‌ను మొత్తమే లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించిన విషయం తెలిసిందే.
ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉగ్రవాద సంస్థ హమాస్ వెంటనే మెట్టుదిగి వచ్చింది. బందీ షిరి బిబాస్ మృతదేహాన్ని వెంటనే ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగించింది.తాము షిరిబిబాస్ మృతదేహాన్ని గుర్తుపట్టామని ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు.
కాగా, హమాస్ గురువారం అప్పగించిన నాలుగు మృతదేహాల్లో మహిళ మృతదేహం 2023 అక్టోబర్ 7 దాడి సమయంలో హమాస్ తీసుకెళ్లిన బందీలకు చెందినది కాదని ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం తెలిపింది.
మృతదేహాల్లో ఖఫీర్ బిబాస్,అతని నాలుగేళ్ల సోదరుడు ఏరియల్ అనే ఇద్దరు పిల్లలున్నారని, మూడో మృతదేహం వారి తల్లి షిరి బిబాస్‌ది కాదని వెల్లడించింది.మహిళ మృతదేహం ఇతర బందీల పోలికలతో కూడా సరిపోలడం లేదని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment