జెరూసలెం: గాజాలో కాల్పుల విరమణపై హమాస్‌తో చర్చలకు ఓకే అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. అయితే నెతన్యాహూ ప్రకటనపై హమాస్ ఇంకా స్పందించలేదు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఆగస్టు 15న దోహా లేదా కైరోలో చర్చలుండే అవకాశముందని మధ్యవర్తిత్వం వహిస్తున్న మూడు దేశాలు అమెరికా, ఈజిప్టు, కైరో తెలిపాయి.
సమయం వృథా కాకుండా గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసే దిశగా చర్చలు జరపాలని ఇజ్రాయెల్, హమాస్‌లకు మూడు దేశాలు పిలుపునిచ్చాయి. హమాస్ చీఫ్ హానియే హత్యకు ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థే కారణమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌తో చర్చలకు హమాస్ ఓకే అంటుందా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.
గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాలోని గాజా కేంద్రంగా పనిచేసే తీవ్రవాద సంస్థ హమాస్ మెరుపు దాడి చేసి వందల మందిని బలిగొన్నది. దీంతో అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తోంది. ఈ దాడులతో గాజా ఇప్పటికే చిధ్రమైపోయింది. ఇక్కడ కాల్పుల విరమణ పాటించడానికి తమ దేశం నుంచి బంధీలుగా తీసుకెళ్లిన వారిని హమాస్ విడుదల చేయాలని ఇజ్రాయెల్ షరతు విధించింది.
Comments
Please login to add a commentAdd a comment