Netanyahu
-
నెతన్యాహు వార్నింగ్..దిగొచ్చిన హమాస్
టెల్అవీవ్:బందీగా తీసుకెళ్లిన షిరి బిబాస్ మృతదేహం కాకుండా వేరే మృతదేహాన్ని హమాస్ పంపడంపై ఇజ్రాయెల్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.ఇది కాల్పుల విరమణ ఒప్పందం ఉల్లంఘనేనని, దీనికి ప్రతిగా హమాస్‌ను మొత్తమే లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించిన విషయం తెలిసిందే.ఇజ్రాయెల్ ఆగ్రహంతో ఉగ్రవాద సంస్థ హమాస్ వెంటనే మెట్టుదిగి వచ్చింది. బందీ షిరి బిబాస్ మృతదేహాన్ని వెంటనే ఇజ్రాయెల్ సైన్యానికి అప్పగించింది.తాము షిరిబిబాస్ మృతదేహాన్ని గుర్తుపట్టామని ఆమె కుటుంబ సభ్యులు ప్రకటించారు.కాగా, హమాస్ గురువారం అప్పగించిన నాలుగు మృతదేహాల్లో మహిళ మృతదేహం 2023 అక్టోబర్ 7 దాడి సమయంలో హమాస్ తీసుకెళ్లిన బందీలకు చెందినది కాదని ఇజ్రాయెల్ సైన్యం శుక్రవారం తెలిపింది.మృతదేహాల్లో ఖఫీర్ బిబాస్,అతని నాలుగేళ్ల సోదరుడు ఏరియల్ అనే ఇద్దరు పిల్లలున్నారని, మూడో మృతదేహం వారి తల్లి షిరి బిబాస్‌ది కాదని వెల్లడించింది.మహిళ మృతదేహం ఇతర బందీల పోలికలతో కూడా సరిపోలడం లేదని తెలిపింది. -
హమాస్‌కు ఇక నరకమే: నెతన్యాహు వార్నింగ్
టెల్అవీవ్:ఇజ్రాయెల్,హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పడే అవకాశం కనిపిస్తోంది. తాజాగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు హమాస్‌పై చేసిన వ్యాఖ్యలు గాజాలో పరిస్థితిని మళ్లీ మొదటికి తెచ్చేలా ఉన్నాయి. బందీలుగా ఉన్న తమ పౌరులను విడుదల చేయకపోతే హమాస్‌ను లేకుండా చేస్తామని,హమాస్ ఉగ్రవాదులకు నరకం గేట్లు తెరుస్తామని నెతన్యాహు తాజాగా వార్నింగ్ ఇచ్చారు.్హహమాస్ను పూర్తిగా నిర్మూలించడంపై తమ వద్ద ఉన్న వ్యూహాన్ని ఇప్పుడే వెల్లడించలేమన్నారు. అమెరికా కూడా ఇందుకు సహకరిస్తుందన్నారు. ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చిన అమెరికా స్టేట్ సెక్రటరీ మార్కో రుబియోతో కలిసి ఆదివారం నెతన్యాహు మీడియాతో మాట్లాడారు.గాజాలో హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలతో పాటు దాని ప్రభుత్వాన్ని లేకుండా చేస్తామని రుబియో చెప్పారు. హమాస్ వద్ద బందీలుగా ఉన్న తమ వారిని సురక్షితంగా తీసుకువస్తామని నెతన్యాహు అన్నారు. అయితే తాజాగా రఫాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ముగ్గురు హమాస్ ప్రతినిధులు చనిపోయారు. దీనిపై హమాస్ ఆగ్రహంగా ఉంది. రెండో దశ కాల్పుల విరమణకుగాను మళ్లీ చర్చలు జరగాలని, కాల్పుల విరమణతో పాటు గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెళ్లిపోవాలని హమాస్ అంటోంది.ఇప్పటికే కుదిరిన తొలి దశ కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ ఇప్పటికే పలువురు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. -
హమాస్‌ను నిర్మూలించాల్సిందే
జెరూసలేం: హమాస్‌ను గాజా నుంచి తుడిచిపెట్టాల్సిందేనని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో స్పష్టం చేశారు. సైనికపరమైన లేదా ప్రభుత్వాన్ని నడిపే శక్తిగా హమాస్ ఎంతమాత్రం కొనసాగనివ్వబోమని చెప్పారు. ఆదివారం ఆయన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూతో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ప్రభుత్వంగా, పరిపాలనా శక్తిగా, హింసకు పాల్పడతామంటూ బెదిరించే వ్యవస్థగా హమాస్ ఉన్నంత కాలం శాంతి నెలకొనడం అసాధ్యం. అందుకే హమాస్‌ను నిర్మూలించకతప్పదు’’ అని కుండబద్దలు కొట్టారు. హమాస్‌పై పోరుకు అరబ్ దేశాల సాయం కూడా కోరుతామన్నారు. ఎవరూ ముందుకు రాకుంటే సొంతంగా ఇజ్రాయెలే ఆపని పూర్తి చేస్తుందని చెప్పారు. ఈ నేపథ్యంలో హమాస్, ఇజ్రాయెల్ మధ్య కాల్పుల ఒప్పందం కొనసాగడంపై అనుమానంగా మారింది. దాని గడువు రెండు వారాల్లో ముగియనుంది. రెండో దశలో మిగతా బందీలను హమాస్ విడుదల చేయాల్సి ఉండటం తెలిసిందే. ఇజ్రాయెల్ సైన్యం ఆదివారం గాజాపై దాడులకు దిగింది. వీటిలో తమ ముగ్గురు పోలీసులు చనిపోయినట్లు హమాస్ తెలిపింది. -
నెతన్యాహుకు శస్త్ర చికిత్స..డాక్టర్ల కీలక ప్రకటన
టెల్అవీవ్:ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(75) మూత్రనాళ ఇన్ఫెక్షన్కు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ విషయాన్ని జెరూసలెంలోని హడస్సా మెడికల్ సెంటర్ వైద్యులు వెల్లడించారు. సర్జరీ విజయవంతంగా జరిగిందని, నెతన్యాహుకు క్యాన్సర్ సోకలేదని తెలిపారు. నెతన్యాహు అండర్‌గ్రౌండ్ చికిత్సా కేంద్రంలో కోలుకుంటున్నారని ఆయన కార్యాలయం వెల్లడించింది.ఈ అండర్‌గ్రౌండ్ చికిత్సా కేంద్రం మిసైల్ దాడుల నుంచి నెతన్యాహుకు రక్షణ కల్పిస్తుంది. నెతన్యాహుకు సర్జరీ కారణంగా ఇజ్రాయెల్ న్యాయశాఖ మంత్రి యారివ్లెవిన్ ప్రస్తుతం దేశ తాత్కిలిక ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు.నెతన్యాహు కోలుకోవడానికి మరికొన్ని వారాలు పడుతుందని అధికారులు తెలిపారు. ఓ వైపు హమాస్‌తో కాల్పుల విరమణచర్చలు మరోవైపు యెమెన్ నుంచి హౌతి రెబెల్స్ దాడులు చేస్తున్న నేపథ్యంలో నెతన్యాహు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండడం అక్కడి ప్రజల్లో కొంతమేర ఆందోళన కలిగిస్తోంది.ఇదీ చదవండి: ఇంజినీర్ సుచిర్ బాలాజీ మృతి.. మస్క్ కీలక ట్వీట్ -
నేను చేసిన తప్పేంటో నాకు అర్ధం కావడం లేదు యువరానర్!!
-
ఇరాన్‌పై దాడులు.. నెతన్యాహు సంచలన ప్రకటన
టెల్అవీవ్:ఇరాన్ మీద ఇటీవల జరిపిన దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన ప్రకటన చేశారు.ఇరాన్ అణు స్థావరాలపై తాము అక్టోబర్‌లోనే దాడి చేసినట్లు నెతన్యాహు తాజాగా అంగీకరించారు.ఈవిషయాన్ని ఆయన దేశ పార్లమెంట్లో వెల్లడించారు.తాము వాటిని ధ్వంసం చేసినప్పటికీ ఇరాన్ అణు కార్యక్రమం మాత్రం ఆగలేదని ఆయన పేర్కొన్నారు.ఇక ఇదే ఏడాది ఏప్రిల్‌లో తాము చేసిన దాడిలో టెహ్రాన్ చుట్టూ మోహరించిన మూడు ఎస్-300 బ్యాటరీలను ధ్వంసం చేశామని నెతన్యాహు తెలిపారు. మరో మూడు బ్యాటరీలు ఆ దేశం వద్ద ఉండగా అక్టోబర్‌లో చేసిన దాడిలో అవి కూడా ధ్వంసం అయ్యాయన్నారు. అదే సమయంలో ఇరాన్ తన క్షిపణుల్లో వాడే ఘన ఇంధన తయారీ కేంద్రాన్ని కూడా పేల్చేశామని వెల్లడించారు.ఒకవేళ వీటికి ఇరాన్ ప్రతి దాడులు చేస్తే వాటికి కూడా ఎలా స్పందించాలనే ప్రణాళిక తమ వద్ద ఉందని నెతన్యాహూ తెలపడం గమనార్హం.కాగా, ఇరాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ సైనిక స్థావరాలు ధ్వంసమైన విషయం తెలిసిందే.అయితే దాడుల సమయంలో అణుస్థావరాల విషయం ప్రస్తావనకు రాలేదు. -
పేజర్ దాడులు.. యస్ మా పనే
జెరూసలేం: ఇటీవల లెబనాన్, సిరియాలపై జరిగిన పేజర్ దాడులు ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించాయి. ఈ దాడిలో పలువురు హిజ్బుల్లా నేతలు హతమయ్యారు. తాజాగా ఈ దాడులకు సంబంధించి సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ పేజర్ల దాడుల ఆపరేషన్‌కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపారు.గత సెప్టెంబరులో హిజ్బుల్లాపై జరిపిన పేజర్ దాడులకు తానే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా బెంజమిన్ నెతన్యాహు ధృవీకరించారు. ఈ దాడుల్లో 40 మంది మృతిచెందగా, మూడు వేల మంది గాయాలపాలయ్యారు. నాడు ఈ పేజర్ల దాడి వెనుక ఇజ్రాయెల్ హస్తముందనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై లెబనాన్ ఐక్యరాజ్య సమితికి ఫిర్యాదు చేసింది. దీనిని మానవత్వంపై జరిగిన దాడిగా పేర్కొంది.తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని ప్రతినిధి ఒమర్ దోస్త్రి మీడియాతో మాట్లాడుతూ లెబనాన్‌లో పేజర్ ఆపరేషన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు నెతన్యాహు స్వయంగా ధృవీకరించారన్నారు. ఈ దాడులపై ఐక్యరాజ్యసమితిలో ఫిర్యాదు అందిన కొద్ది రోజులకే ఈ దాడుల వెనుక ఉన్నది తానే అనే విషయాన్ని నెతన్యాహు తొలిసారిగా బహిరంగంగా అంగీకరించారు.కాగా ఈ పేలిన పేజర్లను హంగేరీకి చెందిన బీఏసీ కన్సల్టింగ్ సంస్థ తయారు చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ గతంలో తెలిపింది. గత సెప్టెంబరులో లెబనాన్‌లో యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇజ్రాయెల్.. హిజ్బుల్లాకు వ్యతిరేకంగా నిరసనలను తీవ్రతరం చేసింది. ఈ క్రమంలోనే లెబనాన్‌లోకి తమ దళాలను దింపి, దాడులకు తెగబడింది. ఇది కూడా చదవండి: ‘వరద’ వైఫల్యాలపై స్పెయిన్‌లో భారీ నిరసనలు -
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఇంటిపై డ్రోన్ దాడి
-
Israel: నెతన్యాహు నెగ్గుకొచ్చేనా?
సాక్షి, నేషనల్ డెస్క్: ఇజ్రాయెలీల ఆక్రోశం, ఆక్రందనలు క్రమంగా ఆగ్రహ జ్వాలలుగా మారాయి. ఇజ్రాయెల్ ప్రధాని పీఠానికి ఎసరు పెట్టేలా కని్పస్తున్నాయి. హమాస్ చెరనుంచి ఇజ్రాయెలీ బందీలను విడిపించడంలో నెతన్యాహు సర్కారు వైఫల్యంపై దేశవ్యాప్తంగా నిరసనలు తీవ్ర రూపు దాలుస్తున్నాయి. తాజాగా ఆగస్టు 31న ఆరుగురు బందీలను గాజాలో ఉగ్రవాదులు పాశవికంగా హతమార్చడంతో ఇజ్రాయెలీలు భగ్గుమంటున్నారు. సోమవారం లక్షలాదిగా వీధుల్లోకి వచ్చారు. దేశాన్ని స్తంభింపజేశారు. నెతన్యాహూ వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. కోర్టు జోక్యం చేసుకుంటే గానీ వెనక్కు తగ్గలేదు. ఈ నిరసనలు చివరికి నెతన్యాహూ రాజకీయ జీవితానికి ఫుల్స్టాప్ పెడతాయా? అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు.. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి తెగబడ్డ హమాస్ 1,200 మందికి పైగా పొట్టన పెట్టుకోవడమే గాక 250 మందిని బందీలుగా తీసుకెళ్లడం తెలిసిందే. ఖైదీల మారి్పడి కింద 100 మందిని విడిపించారు. 35 మందికి పైగా చనిపోయినట్టు భావిస్తుండగా 100 మందికి పైగా ఇంకా హమాస్ చెరలోనే మగ్గుతున్నారు. వాళ్లను విడిపించేందుకు ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం చేసిన తాజా ప్రయత్నం వికటించడం, ఆరుగురు బందీలను హమాస్ చంపేయడం తెలిసిందే. దీనిపై ఇజ్రాయేలీల్లో ఆగ్రహావేశాలు మిన్నంటుతున్నాయి. బందీలను విడిపించడంలోనే గాక గాజాలో కాల్పుల విరమణలో కూడా ప్రధానిగా బెంజమిన్ నెతన్యాహు ఘోరంగా విఫలమయ్యారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు బాధ్యత వహిస్తూ తక్షణం రాజీనామా చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.ఇజ్రాయెల్‌లో అతిపెద్ద కార్మిక సంఘం హిస్ట్రాడుట్ ఇచ్చిన సార్వత్రిక సమ్మె పిలుపు సోమవారం దేశాన్ని స్తంభింపజేసింది. హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధం మొదలయ్యాక దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో ఇదే అతి పెద్దది. దాని దెబ్బకు బెన్ గురియన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కార్యకలాపాలు కూడా నిలిచిపోయాయి. విశ్వవిద్యాలయాలు, షాపింగ్ మాల్స్, ఓడరేవులనూ మూసివేశారు. నిరసనలు సాయంత్రం దాకా కొనసాగాయి. నిరసనకారులు నెతన్యాహూ నివాసాన్ని కూడా ముట్టించారు. అమెరికా ఎంబసీ ముందు బైఠాయించారు. అయలాన్ హైవేను దిగ్బంధించారు. దాంతో వారిపైకి పోలీసులు వాటర్ క్యానన్లు ప్రయోగించాల్సి వచ్చింది. విధ్వంసానికి, అధికారులపై దాడికి పాల్పడ్డారంటూ టెల్ అవీవ్‌లో 29 మందిని అరెస్టు చేశారు. చివరికి లేబర్ కోర్టు ఆదేశాలతో సమ్మె ఆగింది. ఇజ్రాయెలీల నిరసనల వెల్లువను తట్టుకుని నిలవడం నెతన్యాహూకు కష్టమేనంటున్నారు.పెరుగుతున్న వ్యతిరేకత.. యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయాలన్న నెతన్యా హు వైఖరిపై విమర్శలు నానాటికీ పెరుగుతున్నా యి. ఇజ్రాయెల్ విపక్ష నేత యైర్ లాపిడ్ కూడా ప్రధానిపై విమర్శలు గుప్పించారు. యుద్ధ విషయమై నెతన్యాహు తీసుకున్న, తీసుకుంటున్న పలు నిర్ణయాలపై సొంత కేబినెట్లోనే వ్యతిరేకత ప్రబలుతోంది. బందీలను విడిపించే ఒప్పందం కుదు ర్చుకోవడం కంటే కారిడార్ నియంత్రణకే ప్రాధాన్యమిస్తుండటం సరికాదని రక్షణ మంత్రి యెవ్ గాలెంట్ బాహాటంగానే విమర్శించారు. దీన్ని ‘నైతికంగా అవమానం’గా అభివరి్ణంచారు. బందీల ఒ ప్పందంపై గానీ, కాల్పుల విరమణపై గానీ నెత న్యాహుకు ఎలాంటి ఆసక్తి లేదని ఇజ్రాయెల్ మాజీ రాయబారి, ప్రభుత్వ సలహాదారు అలోన్ పింకస్ ఆరోపించారు. ‘‘ఆశ్చర్యంగా అని్పంచినా ఇదే నిజం. ఒప్పందానికి నెతన్యాహూ విముఖత వల్లే బందీలు బలవుతున్నారు’’ అని మండిపడ్డారు.తగ్గుతున్న మద్దతు..మరోవైపు నెతన్యాహుకు మద్దతు కూడా నానాటికీ తగ్గుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయకూడదని మెజారిటీ ఇజ్రాయెలీలు భావిస్తున్నట్లు గత శుక్రవారం ఛానెల్ 12 చేసిన సర్వేలో తేలింది. ఆయన మళ్లీ పోటీ చేయొద్దని 69 శాతం పేర్కొనగా కేవలం 22 శాతం మంది మాత్రమే మళ్లీ ఎన్నికల బరిలో దిగాలని కోరుతున్నారు.నిత్యం నిరసనలే..ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత అతివాద సంకీర్ణ సర్కారుకు నెతన్యాహూ నేతృత్వం వహిస్తున్నారు. 2023 జనవరిలో ఆయన గద్దెనెక్కిన నాటినుంచీ దేశంలో తరచూ నిరసనలూ, ఆందోళనలూ కొనసాగుతూ వస్తున్నాయి. సుప్రీంకోర్టు అధికారాలకు భారీగా కత్తెర వేసేందుకు ఉద్దేశించిన న్యాయ సంస్కరణలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏడాది కింద జనం భారీగా రోడ్డెక్కారు. చివరికి ఆ ప్రతిపాదనలపై ప్రభుత్వం వెనక్కు తగ్గాల్సి వచ్చింది. ఇక హమాస్ ఆటవిక దాడి అనంతరం నెతన్యాహూ ప్రభుత్వ స్పందనను నిరసిస్తూ గత అక్టోబర్ నుంచి రాజధాని మొదలుకుని దేశంలో ఏదో ఒక మూల నిత్యం ఆందోళనలు, నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. హమాస్‌తో ఒప్పందానికి అంగీకరిస్తే ప్రభుత్వాన్ని పడగొడతామని కూడా కొన్ని సంకీర్ణ పక్షాలు బెదిరిస్తున్నాయి. దీనికి తోడు నెతన్యాహూపై అవినీతి, మోసం, నమ్మకద్రోహం తదితర అభియోగాలపై విచారణలు కోర్టుల్లో పలు దశల్లో ఉన్నాయి.ఎన్నికలకు మరో రెండేళ్లు..ఇజ్రాయెల్‌లో ఎన్నికలకు మరో రెండేళ్ల గడువుంది. ఆలోపు నెతన్యాహూపై విపక్షం అవిశ్వాసం పెట్టాలన్నా కనీసం ఐదుగురు పాలక సంకీర్ణ సభ్యుల మద్దతు అవసరం.నెతన్యాహు.. తగ్గేదేలే..నెతన్యాహు మాత్రం వెనక్కు తగ్గేందుకు ఏమాత్రం సిద్ధంగా లేరు. ఎట్టి పరిస్థితుల్లోనూ హమాస్‌ను పూర్తిగా నిర్మూలించడమే తన లక్ష్యమని ఆయన కరాఖండిగా చెబుతున్నారు. కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకోవాలన్న నిరసనకారుల డిమాండ్లను, మంత్రివర్గ సహచరుల విజ్ఞప్తులను నెతన్యాహూ తోసిపుచ్చారు. ‘‘ఆరుగురు బందీలను ఉరి తీశారు. అయినా కసి తీరక తల వెనుక భాగంలో కాల్చారు. వాళ్లతో రాయబారాలా?’’ అని ప్రధాని ప్రశి్నస్తున్నారు. కొన్ని మినహాయింపులతోనైనా కాల్పుల విరమణ చర్చల్లో పాల్గొనాలన్న సూచనకు ససేమిరా అంటున్నారు.దీనిపై ఇటీవల మరింత కఠిన వైఖరి తీసుకున్నారు. గాజా నుంచి ఇజ్రాయెల్ పూర్తిగా వైదొలగాలన్న హమాస్ డిమాండ్‌కు ఒప్పుకునేదే లేదంటున్నారు. బందీలను కాపాడలేకపోయినందుకు క్షమాపణ చెప్పిన నెతన్యాహూ, యుద్ధాన్ని ముగించేందుకు అంతర్జాతీయ సమాజమే హమాస్‌పై మరింత ఒత్తిడి తేవాలంటూ కుండబద్దలు కొట్టారు. బందీల విడుదలకు తాను తగినంత కృషి చేయడం లేదన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యలను తోసిపుచ్చారు. ‘‘ఈ విషయంలో నాకంటే నిబద్ధత కలిగిన వారెవరూ లేరు. దీనిపై నాకెవరూ ఉపన్యాసం ఇవ్వనక్కరలేదు’’ అన్నారు! -
బ్లింకెన్ ‘కొత్త ఒప్పంద’ వ్యాఖ్యలపై హమాస్ విమర్శలు
గాజా కాల్పుల విరమణ ఒప్పంద చర్చలపై అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్ చేసిన వ్యాఖ్యపై హమాస్ విమర్శలు చేసింది. ఆయన వ్యాఖ్యలు ఎంతమాత్రం ఆమోదయోగ్యంగా లేవని పేర్కొంది. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నవీకరించిన ఒప్పంద ప్రతిపాదనను ఆమోదించారని ఆంటోని బ్లింకెన్ చేసిన వాఖ్యలపై హమాస్ సీనియర్ అధికారి ఒసామా హమ్దాన్ స్పందించారు.‘నవీకరించిన గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పటం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆ ఒప్పందం మాకు సమర్పించింది (లేదా) అంగీకరించినది కాదు. మాకు కొత్త గాజా కాల్పుల విరమణ చర్చలు అవసరం లేదు. అమలు యంత్రాంగాన్ని మేము అంగీకరించము’అని అన్నారు.సోమవారం బ్లింకెన్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో సమావేశమయ్యారు. నెతన్యాహుతో సమావేశం అనంతరం.. ‘ఇది చాలా కీలమైన దశ.. ఒప్పందానికి ఆఖరి అత్యుత్తమ అవకాశం. అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందానికి నెతన్యాహు మద్దతు తెలిపారు. హమాస్ కూడా ఈ ప్రతిపాదనకు అంగీకరించాలి. కొత్త గాజా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరిస్తున్నట్లు నెతన్యాహు చెప్పారు’అని అన్నారు.అమెరికా, ఈజిప్టు, ఖతార్‌ల మధ్యవర్తిత్వంతో గురువారం ప్రారంభమైన గాజా కాల్పుల విరమణ చర్చలు ఎలాంటి పురోగతి లేకుండానే శుక్రవారం ముగిసిన విషయం తెలిసిందే. ఈ వారంలో మళ్లీ చర్చలు ప్రారంభం కానున్నాయి. -
ట్రంప్ నాకేం ఫోన్ చేయలేదు: ఇజ్రాయెల్ ప్రధాని
టెల్అవీవ్: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ బుధవారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహుకు ఫోన్ చేసి మాట్లాడినట్లు ఓ కథనం వెలువడింది. హమాస్‌తో కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చేలా ఇజ్రాయెల్‌ను ప్రోత్సహించేందుకు ట్రంప్ ఈ ఫోన్‌కాల్ చేసినట్లు ఆ కథనం పేర్కొంది. అయితే.. తాజాగా ఈ కథనాన్ని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఖండించారు. ‘‘ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు నిన్న (బుధవారం).. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడలేదు’’ ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.ట్రంప్.. ఫోన్ చేసిన హమాస్‌తో కాల్పుల విరమణ కోసం నెతన్యాహును పోత్సహించినట్లు యాక్సిస్ నివేదిక పేర్కొంది. మరోవైపు.. ఈ విషయంపై ట్రంప్ ప్రచార బృందం కూడా స్పందించకపోవటం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఈజిప్ట్, అమెరికా, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వంతో ఇవాళ గాజా కాల్పుల విరమణపై ఇజ్రాయెల్, హమాస్ మధ్య చర్చలు జరనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చర్చలను ఎక్కడ జరుపుతారనే విషయంపై స్పష్టత లేదు. -
హమాస్‌తో చర్చలపై నెతన్యాహూ కీలక ప్రకటన
జెరూసలెం: గాజాలో కాల్పుల విరమణపై హమాస్‌తో చర్చలకు ఓకే అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ స్పష్టం చేశారు. అయితే నెతన్యాహూ ప్రకటనపై హమాస్ ఇంకా స్పందించలేదు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఆగస్టు 15న దోహా లేదా కైరోలో చర్చలుండే అవకాశముందని మధ్యవర్తిత్వం వహిస్తున్న మూడు దేశాలు అమెరికా, ఈజిప్టు, కైరో తెలిపాయి. సమయం వృథా కాకుండా గాజాలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసే దిశగా చర్చలు జరపాలని ఇజ్రాయెల్, హమాస్లకు మూడు దేశాలు పిలుపునిచ్చాయి. హమాస్ చీఫ్ హానియే హత్యకు ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థే కారణమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌తో చర్చలకు హమాస్ ఓకే అంటుందా లేదా అన్నదానిపై సందిగ్ధత నెలకొంది.గతేడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాలోని గాజా కేంద్రంగా పనిచేసే తీవ్రవాద సంస్థ హమాస్ మెరుపు దాడి చేసి వందల మందిని బలిగొన్నది. దీంతో అప్పటి నుంచి ఇజ్రాయెల్ గాజాపై దాడులు చేస్తోంది. ఈ దాడులతో గాజా ఇప్పటికే చిధ్రమైపోయింది. ఇక్కడ కాల్పుల విరమణ పాటించడానికి తమ దేశం నుంచి బంధీలుగా తీసుకెళ్లిన వారిని హమాస్ విడుదల చేయాలని ఇజ్రాయెల్ షరతు విధించింది. -
నెతన్యాహు సంచలన నిర్ణయం.. ఇజ్రాయెల్ వార్ క్యాబినెట్ రద్దు
జెరూసలెం: హమాస్ లక్ష్యంగా గాజాపై గత కొంత కాలంగా భీకర యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది. యుద్ధ నిర్ణయాల్లో కీలకమైన వార్ క్యాబినెట్‌ను రద్దు చేసింది. దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వార్ క్యాబినెట్‌ను రద్దు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రతిపక్ష నేతలు బెన్నీ గాంట్జ్, గాడీ ఐసెన్‌కోట్ వార్ క్యాబినెట్ కమిటీ నుంచి ఇటీవల బయటకు వచ్చిన నేపథ్యంలో దానిని రద్దు చేయడం గమనార్హం. గత ఏడాది అక్టోబరు 6న ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన ఉగ్రవాద సంస్థ హమాస్ మెరుపుదాడులకు పాల్పడిన విషయం తెలిసిందే. దీంతో ఇజ్రాయెల్‌పై పాలస్తీనాలోని గాజాపై భీకర దాడులకు దిగింది. హమాస్‌తో యుద్ధంలో కాల్పుల విరమణకు నెతన్యాహు సముఖంగా లేకపోవడం పట్ల అసంతృప్తితోనే వార్ క్యాబినెట్ నుంచి ప్రతిపక్షనేతలు బయటికి వచ్చినట్లు సమాచారం. -
నెతన్యాహు ప్రసంగానికి హాజరుకాను:సెనేటర్
యుద్ధ నేరస్తుడు బెంజమిన్ నెతన్యాహును యూఎస్ కాంగ్రెస్‌లో మాట్లాడేందుకు చట్టసభ సభ్యులు ఆహ్వానించడాన్ని సెనేటర్ బెర్నీ శాండర్స్ తప్పబట్టారు. తాను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రసంగానికి హాజరుకావడం లేదని పేర్కొన్నారు.అక్టోబర్ ఏడవతేదీ నాటి హమాస్ ఉగ్ర దాడికి వ్యతిరేకంగా తమ దేశాన్ని రక్షించుకునేందుకు ఇజ్రాయెల్‌కు హక్కు ఉంది. అయితే నెతన్యాహు రైట్ వింగ్ తీవ్రవాద నాయకత్వంతో పాలస్తీనా ప్రజలపై యుద్ధానికి దిగారు. ఇటువంటి హక్కు ఇజ్రాయెల్‌కు లేదంటూ సెనేటర్ బెర్నీ శాండర్స్ సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు.రిపబ్లికన్, డెమొక్రాటిక్ నేతలు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును సెనేట్, ప్రతినిధుల సభలో ప్రసంగించేందుకు అధికారికంగా ఆహ్వానించారు. దీనికి నెతన్యాహు అంగీకారాన్ని తెలిపారని, కాంగ్రెస్ ఉభయ సభల ముందు ఇజ్రాయెల్‌కు ఆయన ప్రాతినిధ్యం వహించనున్నారని నెతన్యాహు కార్యాలయం తెలిపింది. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగేదీ వెల్లడించలేదు. Right now tens of thousands of children in Gaza are facing starvation, malnutrition, and famine.And Congressional leadership thinks it’s okay to invite war criminal Netanyahu to address Congress?No. Unacceptable. pic.twitter.com/sun43kAE4z— Bernie Sanders (@BernieSanders) June 4, 2024 -
ఇరాన్ మిసైల్ దాడులు: తొలిసారి స్పందించిన నెతన్యాహు
జెరూసలెం: తమ దేశం మీద డ్రోన్లు, మిసైళ్లతో ఇరాన్ జరిపిన దాడులపై ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఆదివారం(ఏప్రిల్14) స్పందించారు. ఇరాన్ దాడులకు ఎలా స్పందించాలనేదానిపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన వార్ క్యాబినెట్ భేటీకి వెళ్లే ముందు నెతన్యాహు మాట్లాడారు.‘మేం అడ్డుకున్నాం. కూల్చివేశాం. కలిసికట్టుగా గెలుస్తాం’అని ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లను అమెరికా,బ్రిటన్ సహకారంతో కూల్చివేయడంపై స్పందించారు. కాగా శనివారం(ఏప్రిల్13)అర్ధరాత్రి ఇరాన్,ఇజ్రాయెల్‌పై వందల కొద్ది డ్రోన్లు, మిసైళ్లతో దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడులకు ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తునేదానిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ‘ఇజ్రాయెల్ మిలిటరీ యాక్షన్ ఇంకా ముగియలేదు. ఎలాంటి పరిస్థితిని ఎదుర్కోడానికైనా మేం సిద్ధంగా ఉన్నాం’అని ఇజ్రాయెల్ డిఫెన్స్ మంత్రి యోవ్ గల్లాంట్ అన్నారు. కాగా, సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇటీవల ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ మిలిటరీ ఉన్నతాధికారులు మరణించారు. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ఇరాన్ డ్రోన్లు, మిసైళ్లతో దాడులకు దిగింది. ఇదీ చదవండి.. ఇరాన్ దాడులు.. ఇజ్రాయెల్‌కు పోప్ కీలక సూచన -
ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం.. నెతన్యాహు సంచలన ప్రకటన
జెరూసలెం: ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం ప్రారంభమై ఆదివారం(ఏప్రిల్ 7)తో సరిగ్గా ఆరు నెలలు గడిచిన వేళ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్ వద్ద బంధీలుగా ఉన్న తమ పౌరులను విడుదల చేసేదాకా గాజాలో కాల్పుల విరమణకు ఒప్పుకునేలేదని తేల్చిచెప్పారు. ఆదివారం జరిగిన ఇజ్రాయెల్ క్యాబినెట్ సమావేశానికి ముందు బెంజమిన్ నెతన్యాహు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల ఒత్తిడి తమపై పెరుగుతున్నప్పటికీ హమాస్ గొంతెమ్మ కొరికలకు తాము ఒప్పుకోబోమని తేల్చిచెప్పారు. కాల్పుల విరమణకు సంబంధించి ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఈజిప్టులో తాజా రౌండ్ చర్చలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. కాగా, గతేడాది అక్టోబర్ 7న దక్షిణ ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూపు హమాస్ మెరుపుదాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో వందల మంది ఇజ్రాయెల్ పౌరులను చంపడమే కాకుండా కొంత మంది పౌరులను హమాస్ ఉగ్రవాదులు తమ వెంట బంధీలుగా తీసుకువెళ్లారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ పాలస్తీనాలోని పలు ప్రాంతాలపై బాంబుల వర్షం కురిపిస్తోంది. గాజాను పూర్తిగా చిధ్రం చేసింది. ఇజ్రాయెల్ దాడులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇదీ చదవండి.. ఆరు నెలల మారణహోమం.. వేల మరణాలు -
Israel-Hamas war: స్వతంత్ర పాలస్తీనాకు నెతన్యాహు నో
టెల్ అవీవ్: గాజాలో యుద్ధం ముగిశాక స్వతంత్ర పాలస్తీనా దేశం ఏర్పాటు చేయాలన్న అగ్ర రాజ్యం అమెరికా ప్రతిపాదనను తిరస్కరించానని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హమాస్ నిర్మూలన, బందీల విడుదలతో సంపూర్ణ విజయం లభించేదాకా గాజాలో యుద్ధం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఇందుకు మరికొన్ని నెలలు పడుతుందని చెప్పారు. గాజాలోని 25 వేల మంది ప్రజలు మృత్యువాత, 85% మంది ప్రజలు వలసబాట పట్టిన నేపథ్యంలో యుద్ధం విరమించుకునేలా చర్చలు జరపాలంటూ ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెరుగుతోంది. అమెరికా సహా పలు దేశాలు ‘రెండు దేశాల’విధానాన్ని పునరుద్ధరించాలంటూ కోరుతున్నాయి. అయితే, నెతన్యాహు తాజా ప్రకటనతో యుద్ధం విషయంలో ఇజ్రాయెల్ నిర్ణయంలో మార్పులేదని స్పష్టమైంది. నెతన్యాహు వ్యాఖ్యలపై అమెరికా జాతీయ భద్రతా సలహాదారు ప్రతినిధి జాన్ కిర్బీ స్పందిస్తూ.. ఇజ్రాయెల్, అమెరికాలు ఒకే అంశంపై భిన్నంగా ఆలోచించడం సహజమేనన్నారు. -
జో బైడెన్ వ్యాఖ్యలపై మండిపడ్డ హమాస్
Israel-Hamas War: హమాస్‌ను అంతం చేయటమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం దాడులు చేస్తునే ఉంది. గాజాపై దాడులును నిలిపివేసి పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అంగీకరించాలంటూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యహును కోరిన విషయం తెలిసిందే. బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధానితో ఫొన్లో మాట్లాడారు. బైడెన్.. ఇజ్రాయెల్ ప్రధానితో ఫోన్ సంభాషణ అనంతరం నెతాన్యహు పాలస్తీనాను స్వంతత్ర దేశంగా అంగీకరించడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. బైడెన్ వ్యాఖ్యలపై హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు ఇజ్జత్ అల్-రిష్క్ స్పందించారు. పాలస్తీనా విషయంలో ఇజ్రాయల్ ప్రధానిపై బైడెన్ చేసిన వ్యాఖ్యలను ఇజ్జత్ తోసిపుచ్చారు. గాజాలో జరుగుతున్న మారణహోమం వెనుక ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పాత్ర ఉందని మండిపడ్డారు. ఇక పాలస్తీనా ప్రజలకు ఎప్పటికీ ఇజ్రాయెల్‌కు మద్దతుగా నిలిచిన బైడెన్‌పై సదభిప్రాయం కలిగి ఉండరని చెప్పారు. బైడెన్ మాటలతో తమకు మంచి జరుగుతుందన్న నమ్మకం పాలస్తీనా ప్రజల్లో లేదని పేర్కొన్నారు. బైడెన్.. నెతన్యహుతో ఫోన్లో మాట్లాడిన తర్వాత మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలకు ముగింపు పలకడానికి రెండు దేశాల విధానాన్ని ఇజ్రాయెల్ ప్రధాని తీసుకువచ్చే అవకాశం ఉందని అన్నారు. రెండు దేశాల విధానం ద్వారా చాలా దేశాలు ఉన్నాయని.. అటువంటి దేశాలు కూడా యూఎన్‌ఏలో భాగమై ఉన్నాయని తెలిపారు. ఇక.. ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అంగీకరించమని తేల్చి చెప్పారు. పాలస్తీనాకు స్వతంత్ర దేశ హోదా ఇచ్చినా హమాస్ వల్ల ఇజ్రాయెల్‌కు ముప్పు తప్పదని అన్నారు. ఇక హమాస్‌ను అంతం చేసేవరకు దాడులు ఆపమని తెలిపారు. గాజాపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో ఇప్పటివరకు 24, 927 మంది పాలస్తీనా ప్రజలు మృతిచెందారు. చదవండి: న్యూ జెర్సీలో మంచు తుఫాను బీభత్సం -
Israel Hamas war: నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
జెరూసలెం: ఉగ్రవాద సంస్థ హమాస్ పూర్తిగా నాశనమైన తర్వాతే గాజాలో శాంతి సాధ్యమవుతుందని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తేల్చిచెప్పారు. తాజాగా క్రిస్మస్ రోజు గాజాలో పర్యటించిన నెతన్యాహు తర్వాత ఇజ్రాయెల్ తిరిగి వచ్చి తన పార్టీ(లికుడ్) మీటింగ్‌లో మాట్లాడారు. రాబోయే రోజుల్లో హమాస్‌ను నాశనం చేయడమే లక్ష్యంగా దాడులు మరింత తీవ్రం చేస్తామని నెతన్యాహు తెలిపారు.క్రిస్మస్ రోజు గాజాలో శరణార్థుల క్యాంపు మీద ఇజ్రాయెల్ జరిపిన దాడులపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్(డబ్ల్యూహెచ్‌వో) రిపోర్టు చేసిన తర్వాత నెతన్యాహు ప్రకటన వెల్లడవడం గమనార్హం. ‘హమాస్ పూర్తిగా నాశనమవ్వాలి. గాజా డీ మిలిటరైజ్ కావాలి. పాలస్తీనా సొసైట్ రాడికల్ ఫ్రీగా మారాలి. గాజాలో శాంతి నెలకొల్పడానికి ఈ మూడు లక్ష్యాలు పూర్తవ్వాలి. అప్పుడే గాజాలో శాంతిపై పాలస్తీనాతో శాంతి ఒప్పందం చేసుకుంటాం’ అని నెతన్యాహు స్పష్టం చేశారు. ఇదీచదవండి..అమెరికా ఎన్నికలు.. ట్రంప్ క్యాంపెయిన్‌లో ఆమె కీ రోల్ ! -
Israel Hamas War: పోప్‌కు నెతన్యాహు భార్య కీలక లేఖ
జెరూసలెం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భార్య సారా నెతన్యాహు పోప్ ఫ్రాన్సిస్‌కు ఒక లేఖ రాశారు. గాజాలో హమాస్ వద్ద ఇప్పటికీ బందీలుగా ఉన్న 129 మందిని వెంటనే విడిపించే విషయంలో జోక్యం చేసుకోవాలని పోప్‌ను కోరారు. అక్టోబర్ 7న హమాస్ జరిపిన దాడి యూదులపై హిట్లర్ జరిపిన మారణకాండ తర్వాత అత్యంత పెద్దదని లేఖలో ఆమె అభివర్ణించారు. ‘ఇజ్రాయెల్‌పై హమాస్ అక్టోబర్ 7న దాడి జరిపింది. దాడిలో భాగంగా కొంత మందిని హమాస్ ఉగ్రవాదులు తమ వెంట బందీలుగా తీసుకెళ్లారు. 78 రోజులు గడుస్తున్నా 129 మంది ఇప్పటికీ హమాస్ చెరలో బందీలుగా ఉన్నారు. బందీలుగా ఉన్న వారిలో కొంత మంది గాయాలు, అనారోగ్యంతో బాధపడుతున్నారు. హమాస్ ఉగ్రవాదులు వారికి కనీస మందులు కూడా ఇవ్వడం లేదు. బందీలంతా ఆకలితో ఉన్నారు’ అని సారా తన లేఖలో పోప్ దృష్టికి తీసుకువెళ్లారు. ‘హమాస్ జరిపిన దాడి యూదులపై హిట్లర్ మారణకాండ తర్వాత అత్యంత పెద్దది. ఇజ్రాయెల్ వైపు నుంచి ఎలాంటి రెచ్చగొట్టే ఘటన లేకుండా జరిగిన అక్టోబర్ 7 దాడుల్లో అమాయక పౌరులను హమాస్ ఉగ్రవాదులు ఊచకోత కోశారు. చిన్న పిల్లలను సజీవ దహనం చేశారు. ఆడవారిపై అత్యాచారాలు చేశారు. కొంత మందిని తమ వెంట బందీలుగా తీసుకువెళ్లారు’ అని లేఖలో సారా వివరించారు. ఇదీచదవండి..యుద్ధం ఎఫెక్ట్.. కళ తప్పిన క్రీస్తు జన్మస్థలం -
నెతన్యాహును ఆ మోడల్లో చంపాలి : కాంగ్రెస్ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
కొచ్చి: ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహుపై కేరళకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెతన్యాహూపై న్యూరెంబర్గ్ మోడల్ వాడాలని కాసర్గడ్ ఎంపీ రాజమోహన్ ఉన్నితన్ వ్యాఖ్యానించారు. పాలస్తీనాలోని గాజాపై యుద్ద నేరానికి పాల్పడినందుకుగాను నెతన్యాహును ఎలాంటి విచారణ లేకుండా కాల్చి చంపాలని రాజ్‌మోహన్ అన్నారు. కేరళలోని కాసర్‌గఢ్‌లో పాలస్తీనాకు మద్దతుగా జరిగిన ఓ ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ దుమారానికి తెరలేపింది. జెనీవా కన్వెన్షన్ కింద అన్ని ఒప్పందాలను ఉల్లంఘించిన వారిని ఇంతకంటే ఏం చేయాలని ఎంపీ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. ప్రస్తుతం ప్రపంచం ముందు యుద్ధ నేరస్తుడిగా నెతన్యాహు నిల్చున్నారని తెలిపారు. పాలస్తీనీయన్లపై పాల్పడ్డ అకృత్యాలకు అతడిని వెంటనే న్యూరెంబర్గ్ మోడల్లో అంతమొందించాల్సిందేనన్నారు. కాగా, న్యూరెంబర్గ్ మోడల్లో శిక్షలను హిట్లర్ ఆధ్వర్యంలోని నాజీలు ఎక్కువగా అమలు చేసేవారు. ఈ పద్ధతిలో యుద్ధ ఖైదీలను ఎలాంటి విచారణ లేకుండా కాల్చి చంపేశేవారు. ఇదీచదవండి..కాంగ్రెస్ నేతలపై దాడి.. జ్యోతి పటేల్ సంచలన ఆరోపణలు -
ఇజ్రాయెల్ వార్‌పై ఒవైసీ రియాక్షన్.. ఆయనో డెవిల్ అంటూ..
సాక్షి, హైదరాబాద్: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య భీకర యుద్ధం నడుస్తోంది. ఇజ్రాయెల్-హమాస్ దాడుల కారణంగా ఇప్పటికే వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. ఇలాంటి తరుణంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఇజ్రాయెల్ వార్‌పై ఘాటుగా స్పందించారు. తన మద్దతు పాలస్తీనాకు ఉంటుందని ఒవైసీ స్పష్టం చేశారు. కాగా, ఒవైసీ శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఒవైసీ మాట్లాడుతూ.. తాను పాలస్తీనా వైపే ఉంటానని తేల్చి చెప్పారు. గాజాలో ఇప్పటికీ పోరాడుతున్న వారికి లక్షలాదిమంది సెల్యూట్ చేస్తున్నారని అన్నారు. గాజాకు విద్యుత్, తాగునీటి సరఫరాను నిలిపివేయడంతో లక్షల మంది పౌరులు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 21 లక్షల జనాభా ఉన్న గాజాలో 10 లక్షల మంది పేద ప్రజలు నిరాశ్రయులయ్యారు. అయినా కూడా ప్రపంచం మౌనంగా ఉంది. 70 ఏళ్లుగా పాలస్తీనాలో ఇజ్రాయెల్ ఆక్రమణదారుగా ఉంది. అక్కడ దారుణాలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. #WATCH | Hyderabad: On the Israel-Palestine conflict, AIMIM chief Asaduddin Owaisi says, "The poor people of Gaza, with a population of 21 lakh, 10 lakh have been rendered homeless...The world is silent...For 70 years Israel has been an occupier...You cannot see the occupation,… pic.twitter.com/9riNvVEOV1 — ANI (@ANI) October 15, 2023 ఇదే సమయంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహును దుష్టశక్తిగా(డెవిల్) అభివర్ణించారు. ఆయన క్రూరుడని, యుద్ధ నేరగాడని మండిపడ్డారు. పాలస్తీనా పేరెత్తితే కేసులు పెడతామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరిండంపై ఒవైసీ ఘాటు విమర్శలు చేశారు. మన త్రివర్ణ పతాకంతోపాటు తాను పాలస్తీనా జెండాను కూడా గర్వంగా ధరిస్తానని పేర్కొన్నారు. తాను పాలస్తీనా పక్షానే ఉంటానని తేల్చి చెప్పారు. పాలస్తీనియన్లపై జరుగుతున్న అకృత్యాలను ఆపాలని ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేయాలని అనుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ విషయమై ప్రధాని మోదీ మానవత్వంతో స్పందించాలని కోరారు. పాలస్తీనా కేవలం ముస్లింలకు సంబంధించిన విషయం కాదని, ఇది మానవతా సమస్య అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. పాలస్తీనాకు ఇప్పటికే కాంగ్రెస్ తన మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఇరు దేశాల మధ్య వెంటనే కాల్పుల విరమణ పాటించాలని నిన్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పిలుపునిచ్చింది. ఇది కూడా చదవండి: కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల.. లిస్ట్ ఇదే.. -
ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్.. భయానక పోరుకు ఇజ్రాయెల్ సిద్ధం
జెరూసలేం: హమాస్ పాశవిక దాడిపై ఇజ్రాయెలీలు మండిపడుతున్నారు. చీకటిమాటున తీసిన దొంగ దెబ్బపై కనీవినీ ఎరగని రీతిలో ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనని నినదిస్తున్నారు. హమాస్‌ను సర్వనాశనం చేసి గానీ విశ్రమించేది లేదని ఆయన ఇప్పటికే స్పష్టం చేసిన నెతన్యాహు.. యుద్ధంలో మరోస్థాయికి సమయం ఆసన్నమైందని అన్నారు. ఈ మేరకు గాజాపై పోరాడుతున్న ఫ్రంట్‌లైన్ ఇజ్రాయెల్ దళాలను ప్రధాని బెంజమన్ నెతన్యాహు కలిశారు. తొమ్మిదో రోజు యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో సైనికులను సందర్శించి వారిలో మనోధైర్యాన్ని పెంచారు. యుద్ధంలో మరో స్థాయికి వెళ్లనున్నామని తెలిపిన నెతన్యాహు.. ఇందుకు సిద్ధమేనా అంటూ సైనికులను అడిగారు. అందుకు వారు సిద్ధమని చెబుతూ తలలు ఊపారు. ఇందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్(ఎక్స్) వేదికగా పంచుకున్నారు. యుద్ధంలో అసలైన ఘట్టం వచ్చేసిందని ప్రధాని నెతన్యాహు అన్నారు. హమాస్ 'ఆపరేషన్ అల్ అక్సా ఫ్లడ్ బ్యాటిల్'కు ప్రతీకారంగా ఇజ్రాయెల్ 'ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్స్' గురించి నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ప్రధాని సైనికులతో కరచాలనం చేశారు. యుద్ధంలో మరోస్థాయికి వెళుతున్నామని సైనికులకు తెలిపిన వీడియో బయటకు వచ్చింది. గాజాను ఖాలీ చేయాలని పౌరులను హెచ్చరించిన ఇజ్రాయెల్.. యుద్ధాన్ని తదుపరి మరింత ఉద్ధృతం చేయనున్నట్లు స్పష్టమవుతోంది. అటు.. గాజాను వీడకూడదంటూ హమాస్ దళాలు పిలుపునిచ్చాయి. ఈ హోరాహోరి పోరు రానున్న రోజుల్లో యుద్ధం మరింత భీకర స్థాయికి చేరనున్నట్లు తెలుస్తోంది. భూతల దాడి.. ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్‌ను దాని నాయకత్వాన్ని నిర్మూలించడానికి ఇజ్రాయెల్ సన్నద్ధమవుతోంది. ఇందుకోసం భూతల, వాయు, జల అన్ని మార్గాల్లో దాడులు చేయడానికి దళాలను సమన్వయం ఏర్పరిచింది. ఆకస్మిక దాడులతో విరుచుకుపడిన హమాస్‌ను నిర్మూలించడానికి భూతల దాడులను జరపనున్నట్లు తెలుస్తోంది. గాజాను రాజకీయంగా, సైనికంగా హమాస్ పాలించడానికి వీలు ఉండకూడదని ఇజ్రాయెల్ రక్షణ దళాల(ఐడీఎఫ్) ప్రతినిధి డానిల్ హాగరీ అన్నారు. ఇస్మాయిల్ హనియే తర్వాత రెండవ స్థానంలో ఉన్న హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్‌ను నిర్మూలించడం గ్రౌండ్ అటాక్ ముఖ్య లక్ష్యం. బందీలుగా ఉన్న ఇజ్రాయెలీలను ఈ దాడుల ద్వారా కాపాడుకోవచ్చని భావిస్తున్నారు. గత శనివారం ఇజ్రాయెల్‌లపై జరిగిన అకృత్యాలకు సిన్వార్ బాధ్యత వహించాడని ఇజ్రాయెల్ ఆరోపిస్తోంది. దీనికి గ్రౌండ్ అటాక్ మాత్రమే సరైనదని భావిస్తున్నారు. ఈ వారాంతంలో ఈ దాడి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గాజా సరిహద్దులో 30,000 ఇజ్రాయెల్ సైనికులు వేచి ఉన్నారు. 10,000 మంది సైనికులు గాజాలోకి అడుగుపెట్టారు. ఈ దాడులకు కావాల్సిన యుద్ధ సామగ్రిని, యుద్ధం ట్యాంకులను సరిహద్దుకు చేర్చారు. అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేయడంతో యుద్ధం ఆరంభం అయింది. హమాస్ దాడులకు ఇజ్రాయెల్ తీవ్ర స్థాయిలో బదులిస్తోంది. భూతల, వాయు మార్గాల్లో వైమానిక దాడులతో గాజాపై విరుచుకుపడుతోంది. తొమ్మిది రోజులుగా జరుగుతున్న యుద్ధంలో ఇరుపక్షాల వైపు 3200 మంది మరణించారు. ఇజ్రాయెల్‌లో 1300 మంది ప్రాణాలు కోల్పోయారు. పాలస్తీనాలో 1900 మంది మృత్యువాతపడ్డారు. ఇదీ చదవండి: అల్‌ఖైదా కంటే ప్రమాదకరం -
ప్రజల ఇష్టానుసారమే నిర్ణయం తీసుకుంటాం! : నెతాన్యాహు
నిరసనలు, ఆందోళనలు సమ్మెలతో ఇజ్రాయెల్ అట్టుడుకుపోయిన సంగతి తెలిసిందే. అక్కడ ప్రభుత్వం న్యాయ వ్యవస్థలో తీసుకువచ్చిన మార్పులు పట్ల ప్రజాగ్రహం కట్టలు తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షడు జో బైడెన్ సైతం మరింత ఆజ్యం పోసేలా కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో బైడెన్ వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతాన్యాహు ఘాటుగా స్పందించారు. ఈ మేరకు నెతాన్యాహు బైడెన్ వ్యాఖ్యలకు బదులిస్తూ..ఇజ్రాయెల్ సార్వభౌమాధికారం కలిగిన దేశం. విదేశాల నుంచి వచ్చే ఒత్తిళ్లపై ఆధారపడి ఇజ్రాయెల్ నిర్ణయాలు తీసుకోదని సూటిగా కౌంటరిచ్చారు. తన ప్రజల ఇష్టానుసారమే ఇజ్రాయెల్ నిర్ణయం తీసుకుంటుందని కరాఖండీగా చెప్పారు. కాగా బైడెన్ ఇజ్రాయెల్ ప్రభుత్వం తీసుకొచ్చిన న్యాయపరమైన సంస్కరణలు రాజకీయ సంక్షోభానికి దారితీసింది కాబట్టి నెతాన్యాహుల వాటిని వెనక్కి తీసుకుంటారని ఆశిస్తున్నా అని అన్నారు. (చదవండి: డోక్లామ్‌పై భూటాన్ ప్రధాని షాకింగ్ వ్యాఖ్యలు! టెన్షన్లో భారత్) -
సంస్కరణలు నెలపాటు వాయిదా
జెరూసలేం: ప్రజాగ్రహానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ తలొగ్గారు. న్యాయ వ్యవస్థలో సంస్కరణల ప్రణాళికను నెల పాటు వాయిదా వేస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. దేశ ప్రజలను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ‘‘ఇజ్రాయెల్‌ను చీల్చడానికి శత్రువులు ప్రయత్నిస్తున్నారు. వారికి అవకాశం ఇవ్వొద్దు. ఆందోళనలు విరమించండి. హింసకు దూరంగా ఉండండి’’ అని ప్రజలకు సూచించారు. పార్లమెంట్ వేసవి సమావేశాలు ఏప్రిల్ 30న పునఃప్రారంభం కానున్నాయి. సంస్కరణలపై బిల్లును వాటిలో ప్రవేశపెట్టాలని నెతన్యాహూ నిర్ణయానికొచ్చినట్లు తెలుస్తోంది. అయితే సంస్కరణలను శాశ్వతంగా పక్కన పెట్టాలని నిరసనకారులు తేల్చిచెప్పారు. అప్పటిదాకా పోరాటం కొనసాగుతుందని హెచ్చరించారు. సోమవారం వేలాదిగా పార్లమెంట్ ముట్టడికి ప్రయత్నించారు. సంస్కరణలపై పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించాలన్నదే నెతన్యాహూ ఉద్దేశమని తెలుస్తోంది. -
నమస్కార్ కరోనా!
భారతదేశపు పలకరింపు నమస్కారానికి చేతులెత్తి నమస్కరించారు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి నెతన్యాహు. ప్రపంచమంతటా కోవిడ్ –19 (కరోనా వైరస్ డిసీజ్) మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో కరచాలనాల (షేక్ హ్యాండ్) కన్నా పరస్పర పలకరింపులకు భార తీయుల్లాగా నమస్కారం చెప్పడమే సంస్కార మన్నారు. అది అలవర్చుకొండంటూ ఆయన తమ దేశ వాసులకు పిలుపునిచ్చారు. ఇదొ క్కటే కాదు... చాలా చాలా సంప్రదాయిక విలువలు కొన్ని వేల సంవ త్సరాల పాటు భారతీయుల్ని సురక్షితంగా ఉంచాయి. సంస్కృతి– సంప్రదాయాలు, విలువల జీవనం పరంగా ఎంతో జ్ఞాన సంపదను భారత్ ప్రపంచానికి అందించింది. కానీ, కాలక్రమ పరిణామాల వల్ల ఆహారపు అలవాట్లు, పనితీరు, జీవనశైలి మారి ఇప్పుడు మనం ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తోంది. కోవిడ్–19 వ్యాప్తిస్తున్న సంక్లిష్ట సందర్భంలోనూ అది కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. మన ఆహార అల వాట్లు మారడం, పనిచేసే తత్వంలో వచ్చిన అలసత్వం, ఇతరేతరంగా జీవనశైలి గతి తప్పడం మన ఆరోగ్య భద్రతకు, ప్రగతికి, జీవన ప్రమా ణాల మెరుగుకు అవరోధంగా మారింది. ఫలితంగా ఇలాంటి విప త్తులు ముంచుకు వచ్చినపుడు ప్రతికూల ప్రభావానికి గురి కావాల్సి వస్తోంది. ఈ దుస్థితిని తప్పించడానికి యుద్ధప్రాతిపదికన సమైక్య చర్యలు చేపట్టాల్సిన అవసరముంది. కేంద్ర–రాష్ట్రాల ప్రభుత్వాలు ఉమ్మడిగా పనిచేస్తూ.. వైద్యారోగ్య విభాగాలు, ప్రయివేటు ఆస్ప త్రులు, కార్పొరేట్లు, ప్రసార మాధ్యమాలు, పౌర సమాజం మధ్య సమన్వయం సాధించి ఉపద్రవాన్ని అధిగమించే కృషి చేయాలి. నిజమే! వదంతుల వ్యాప్తి ప్రజల్లో అలజడిని సృష్టిస్తుంది. కానీ, వాస్త వాల్ని మరుగుపరచి, పైపై మాటలతో కాలం వెల్లబుచ్చడం కూడా అంతే ప్రమాదకరం. వైరస్ ప్రభావిత కేసులు ఒక్కసారిగా పెరిగితే, వైద్యపరంగా, పలు విషయాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు లేని మన వ్యవస్థలు ఏ మేరకు తట్టుకొని నిలువ గలుగుతాయన్నది ప్రశ్నార్థకమే! కలకలం చెందకుండానే దేశ ప్రజలు విషయం అర్థం చేసుకునేలా అవగాహన పెంచాలి. అలవాట్లు, పద్ధతులు, వ్యవహార శైలిలో పౌరులు జాగ్రత్త తీసుకునేలా ప్రచారం ముమ్మరం చేయాలి. వ్యాప్తి నిరోధం మన చేతుల్లోనే... కోవిడ్–19 గురించి దేశం లోపల, బయట చాలా మందికి సరైన అవ గాహన లేదు. కరోనా వైరస్ ఆ జాతికి చెందిన పలు వైరస్ల కన్నా తక్కువ ప్రమాదకారే! అందుకే, వ్యాధి సోకిన వారిలో మృతుల సంఖ్య 3 శాతం లోపే ఉంది. 50 సంవత్సరాల లోపు వయస్కులకు ఇదే మంత ప్రమాదకారి కాదని రుజువౌతోంది. వయసుతో నిమిత్తం లేకుండా రోగనిరోధక శక్తి లోపించిన వారికి వైరస్ హాని కలిగిస్తోంది. సత్వర చికిత్సతో ఫలితాలుంటాయి. కానీ, ఇప్పటికి అది వ్యాప్తి చెందు తున్న తీరే ఆందోళన కలిగిస్తోంది. చైనా నుంచి మొదలై ప్రపంచంలోని మూడో వంతు పైగా దేశాలకు(77) విస్తరించింది. వైరస్ లక్షణాన్ని బట్టి... మనుషులు వ్యవహరించే తీరులో జాగ్రత్తలు తీసుకుంటే ఆ వ్యాప్తిని తేలిగ్గా నిరోధించవచ్చు. ఇప్పుడు చైనా చేసిందదే! ఆరం భంతో పోల్చి చూస్తే, గడచిన మూడు రోజులుగా వ్యాప్తి చాలావరకు అదుపులోకొచ్చింది. కొత్తగా వ్యాధి సోకిన వారి సంఖ్య, ఆరు వారా ల్లోనే అత్యల్పంగా బుధవారం 119గా నమోదైంది. వ్యాధిగ్రస్తుల నుంచి వెలువడే ద్రవదినుసు (డ్రాప్లెట్)లో తప్ప బయట దీర్ఘకాలం ఈ వైరస్ బతకలేదు. గాలిలో ఒకర్నుంచి మరొకరికి సోకదు. వ్యాధి సోకిన వారు గట్టిగా దగ్గినపుడో, తుమ్మినపుడో, ఉమ్మినపుడో... ద్రవ దినుసులో బయటకు వస్తుంది. మూడు అడుగుల వరకు అలా వ్యాప్తి చెందగలుగుతుంది. అందుకే, ఇతరులతో కనీసం ఒక మీటర్ ఎడంతో ఉండమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ఏవైనా వస్తువులపై ద్రవదినుసు పడినపుడు కొన్ని గంటల పాటు వైరస్ అక్కడ మనగలు గుతుంది. ఈ లోపు ఇతరులెవరికైనా అది సోకే ప్రమాదముంటుంది. తగు జాగ్రత్తల ద్వారా దాన్ని అడ్డుకోవాలి. మాస్క్‌లు ధరించమనడం, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోమనడం, చీటికి మాటికి చేతులతో కళ్లు, ముక్కు, ముఖం రాసుకోవద్దని చెప్పడం ఇందుకోసమే! ఏ ప్రభుత్వ పథకాలు, విశేష కార్యక్రమాలు కూడా పౌరులే పాటించా ల్సిన ఈ చర్యలకు ప్రత్యామ్నాయాలు కాజాలవు! రోగనిరోధక శక్తి దివ్యౌషధం మనిషిలో సహజంగా ఉండే రోగనిరోధక శక్తి ఏ రకమైన వైరస్‌నైనా సమర్థంగా ఎదుర్కొంటుంది. అది జీవుల శరీర నిర్మాణంలోని గొప్ప దనం. కానీ, అసహజమైన మన ఆహారపు అలవాట్లతో ఆ శక్తిని నశిం పజేస్తున్నాం. వైరస్‌లను ఎదుర్కోలేని, వ్యాధుల్ని తట్టుకోలేని బల హీన మనుషులుగా మిగులుతున్నాం. దాదాపు ముఫ్పై ఏళ్ల కింద మొదలైన ప్రపంచీకరణ, తర్వాతి పట్టణీకరణ మన ఆహారపు అల వాట్లను, జీవన శైలిని సమూలంగా మార్చేసింది. అంతకు ముందు, చేలలో పండిన పంట ధాన్యంతో, సీజన్ల వారీగా లభించే కాయ గూరలు, ఫలాలతో సమతుల ఆహారం తీసుకునేది. మంచి పౌష్టికా హారం, శారీరక శ్రమ వల్ల రోగనిరోధక శక్తి ఆ తరం వారిలో పుష్క లంగా ఉండేది. కానీ, ప్రపంచీకరణలో పుట్టుకొచ్చిన మార్కెట్ మాయాజాలం మనను ఫక్తు వస్తు వినిమయదారులుగా మలిచింది. జంక్ ఫుడ్‌కు బానిసను చేసింది. కోట్ల రూపాయల ప్రచారంతో దూసుకొచ్చే విషరసాయన పానీయాలు, పీచులేని కృతక ఆహారాల ముప్పేట దాడికి సంప్రదాయిక సమతులాహారం వెనుక వరుసలోకి వెళ్లింది. సత్తువలేని దేహాలు మనకు మిగిలాయి. వైరస్లు విజృంభి స్తున్నాయి. ‘భారత్, చైనా వంటి తూర్పు దేశాల్లోని సంప్రదాయిక ఆహారం, ఆహార అలవాట్లు వేల సంవత్సరాల పాటు వారిని పటి ష్టమైన రోగనిరోధక శక్తితో నిలిపాయి, పాశ్చాత్తీకరణే గత కొన్ని దశా బ్దాలుగా వారిని దెబ్బతీసింద’ని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2012–13 లో జరిపించిన ఓ అధ్యయన నివేదిక చెప్పింది. పారిశ్రామికీకరణ, ఐటీ విప్లవం తర్వాత వ్యక్తుల కొనుగోలు శక్తి పెరగడం, భార్యాభర్తలు ఉద్యోగులు కావడం, ఒకరో, ఇద్దరో పిల్లలు కలిగిన చిన్న కుటుంబా లుగా మిగలడం... అత్యధికుల ఆహారపు అలవాట్లను, జీవన శైలిని సమూలంగా మార్చింది. అది వ్యక్తుల అంతర్గత రోగనిరోధక శక్తికి శాçపమైంది. దానికి తోడు, విలువలు నశించిన పక్కా వ్యాపార వైద్యరంగం ఈ పరిస్థితిని పెంచి పోషించింది. కాలగతిలో వచ్చిన ఒక విపరిణామాన్ని తమ ఇబ్బడిముబ్బడి సంపాదనకు, దోపిడీకి భూమిక చేసుకుంది. మనిషి అవసరాలు చూసి స్పందించే మానవతా విలువలు గాలికిపోయాయి. సగటు మనిషి అవసరాన్నే అవకాశంగా పిండుకుం టోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఒక్కసారిగా తలెత్తిన సర్జికల్ మాస్క్‌లు, వెంటిలేటర్ల కొరత ఇటువంటిదే! ప్రపంచ సంస్థ హెచ్చరించినా.. భారతీయ సనాతన సమాజం వైద్యాన్ని ఎప్పుడూ వ్యాపారంగా చూడ లేదు. ప్రాణం నిలిపే వైద్యుడు జీవం పోసే దేవుడితో సమానమంది. అతి సాధారణ చార్జీలతో వైద్యం చేసే వైద్యులు కూడా కలరా, ప్లేగు వంటి విపత్తులు సంభవించినపుడు పూర్తి ఉచితంగా వైద్యం చేసిన దాఖలాలున్నాయి. అవే విలువలతో వేల ఏళ్లపాటు ఈ భూభాగంపై ఆరోగ్యసమాజం పరిఢవిల్లింది. సర్జికల్ మాస్క్‌లతో పాటు సాధారణ మాస్క్‌లు కూడా ఈ రోజు తేలిగ్గా దొరకటం లేదు. మాస్క్‌లైనా, వెంటిలేటర్లయినా, ఈ విపత్కాలంలో అవసరమైన ఏ వైద్య వస్తువు లైనా... ఉత్పత్తి తగ్గించడం, అక్రమ నిల్వల ద్వారా కృత్రిమ కొరత సృష్టించడం నేరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ జెనీవా నుంచి హెచ్చ రించింది. ‘తగిన సర్జికల్ మాస్క్‌లు పరికరాలతో మా సిబ్బంది ప్రాణాలు కూడా కాపాడుకోకుంటే మేమీ వ్యాధిని అరికట్టలేమ’ని డబ్లుహెచ్‌వో అధినేత స్పష్టం చేశారు. దేశంలో తగినన్ని వైరాలజీ ల్యాబ్‌లు లేవు. కరోనా వైరస్‌ను గుర్తించే కిట్స్ లేవు. కోవిడ్–19 వ్యాధిగ్రస్తుల్ని విడిగా ఉంచే ఐసొలేషన్ కేంద్రాలు తగిన ప్రమాణా లతో లేవు. ఉన్న అరకొర కేంద్రాల్లో కూడా అప్పటికప్పుడు ఒకటో, రెండో, మరెన్నో పడకల్ని సర్దుబాటు చేసి బయట బోర్డు పెడుతు న్నారు తప్ప వాటికి ప్రత్యేక మూత్రశాలలు కూడా లేవు. మూత్ర విస ర్జన కోసం కోవిడ్–19 రోగులు జనరల్ వార్డుల్లోని మూత్ర శాలలకు వస్తుంటే, వ్యాధి తమకెక్కడ సోకుతుందోనని అక్కడి రోగులు జడుసు కుంటున్నారు. ప్రజాసుపత్రుల నుంచి ‘ఐసొలేషన్ యూనిట్’లను తొలగించండని మొరపెట్టుకుంటున్నారు. రాష్ట్రాల రాజధానుల్లోనే ఈ పరిస్థితి ఉంటే, ఇక జిల్లా కేంద్రాల్లో స్థితిని ఊహించవచ్చు. వ్యాక్సినే గొప్ప ఉపశమనం ప్రపంచంలో గొప్ప పేరున్న దాదాపు అన్ని వైరాలజీ, ఇతర వైద్య ప్రయోగశాలల్లో పరీక్షలు జరుగుతున్నాయి. కరోనాకు విరుగుడు కను గొనే యత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మనుషులపై అతి ప్రభావం చూపిన రెండు పోగుల్ని (స్ట్రేయిన్స్) చైనా శాస్త్రవెత్తలు గుర్తిం చారు. ఈ వ్యాధి పుట్టిన వుహాన్‌లో కరోనా వైరస్ నుంచి సేకరించిన ‘జన్యు పటం’ (జీనోమ్ సీక్వెన్స్ డాటా)పై విస్తృత పరిశోధనల తర్వాత ఈ విషయం కనుగొన్నట్టు గురువారం వెల్లడించారు. వ్యాధి ప్రభావానికి 70 శాతం ఒక (దూకుడు) పోగు కారణం కాగా 30 శాతా నికి మరో (అణకువ)పోగు కారణంగా గుర్తించారు. మిగతా ప్రపంచ మంతటా వ్యాధి కారకమైన వైరస్ జన్యు పటాల్ని విశ్లేషిస్తే చిత్రం మరింత స్పష్టమౌతుంది. ఇది వ్యాధి నివారణ మందు, వ్యాక్సిన్ కను గొనేందుకు ఎంతో ఉపకరిస్తుంది. నేపాల్, వియత్నాం, కంబోడి యాతో సహా ఇప్పటికి 23 దేశాలు, తమ దేశాల్లో కరోనా వైరస్ నుంచి సేకరించిన జన్యుపటాలను ‘గ్లోబల్ ఇనిషియేటివ్’తో పంచుకు న్నాయి. దాంతో ప్రపంచ వ్యాప్త పరిశోధనలకిది అందుబాటులోకి వచ్చినట్టయింది. ఈ పని చైనా జనవరి 11నే చేసింది. కానీ, మన దేశం ఇప్పటివరకు జన్యు పటాన్ని విశ్వవేదికపై (పబ్లిక్ డాటాబేస్) పొందు పరచలేదు. ఎందుకింత అలసత్వం? ఇది భారత సంస్కృతి, సంప్రదా యానికి విరుద్ధమైన పోకడ! విపత్కాలంలో వదంతులు ఎంత చేటో అలసత్వం అంతే ప్రమాదకారి. మరింత చిత్తశుద్ధి, తగి నంత నిబద్ధత చూపిస్తేనే విపత్తు నుంచి బయటపడుతాం! దిలీప్ రెడ్డి ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com -
జపాన్ ప్రధానికి తీవ్ర అవమానం
టెల్అవీవ్, ఇజ్రాయెల్ : ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్న జపాన్ ప్రధాని షింబో అబేకు తీవ్ర అవమానం జరిగింది. ఇజ్రాయెల్ ప్రధాని కుటుంబంతో కలసి విందుకు హాజరైన అబేకు చెఫ్ బూటులో ఆహార పదార్థాలను ఉంచి సర్వ్ చేయడం వివాదాస్పదంగా మారింది. నెతన్యాహు అత్యంత ఇష్టపడే చెఫ్ మోషే సెర్గీ ఈ విందుకు వంటకాలను తయారు చేశారు. అబేకు డిసర్ట్‌తో పాటు ఓ బూటులో చాకెట్లను ఉంచి సర్వ్ చేయడంపై జపాన్ దౌత్యవేత్తలు భగ్గమన్నారు. బూటుతో ఆహారాన్ని అందించడాన్ని జపాన్‌లో తీవ్రంగా, ఘోర అవమానంగా భావిస్తారని చెప్పారు. ఘటనపై చెఫ్ సెర్గీ వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. అది నిజమైన షూ కాదని, మెటల్‌తో తయారు చేసిన వస్తువని వెల్లడించారు. కాగా, భోజన వడ్డన సమయంలో సెర్గీ వివాదాల్లో ఇరుక్కోవడం ఇది తొలిసారేమీ కాదు. గతేడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్, నెతన్యాహూల ముఖచిత్రాలు కలిగిన బౌల్స్‌లో సెర్గీ డిసర్ట్స్‌ను సర్వ్ చేశారు. -
చిక్కుల్లో నెతన్యాహూ
జెరూసలేం: ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహూ చిక్కుల్లో పడ్డారు. అవినీతి, నమ్మక ద్రోహా నికి సంబంధించి నెతన్యాహూకు వ్యతిరేకంగా కీలక ఆధారాలు లభ్యమయ్యాయని పోలీసులు వెల్లడించారు. 14 నెలల దర్యాప్తు తర్వాత నెతన్యాహూకు వ్యతిరేకంగా ఆధారాలు లభించాయని, వీటి ఆధారంగా నిందితుల జాబితాలో ఆయన పేరు చేర్చాలని ప్రాసిక్యూషన్‌కు సిఫార్సు చేశారు. అయితే ఈ ఆరోపణలను ఖండించిన నెతన్యాహూ పదవి నుంచి వైదొలిగేందుకు నిరాకరించారు. 2009 నుంచి నెతన్యాహూ ఇజ్రాయెల్ ప్రధానిగా కొనసాగుతున్నారు. అంతకుముందు 1996 నుంచి 1999 వరకూ ఆయన ఆ పదవిలో ఉన్నారు. అయితే గత పదేళ్లలో బహుమతుల రూపంలో 3 లక్షల అమెరికన్ డాలర్లను నెతన్యాహూ పారిశ్రామికవేత్తల నుంచి స్వీకరించినట్టు పోలీసులు ఆరోపిస్తున్నారు. ప్రముఖ పబ్లిషర్ ఆర్నన్ మోజెస్‌కు లబ్ధి చేకూరేలా కేస్ 1000, కేస్ 2000కు సంబంధించి ఖరీదైన బహుమతులు అందుకున్నారనే ఆరోపణలపై నెతన్యాహూ ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రధానిని నిందితుడిగా చేర్చాలని సిఫార్సు చేస్తూ పోలీసులు ఆధారాలను అటార్నీ జనరల్‌కు సమర్పిస్తే, ఆయన దీనిపై తుది నిర్ణయం తీసుకుంటారు. జాబితాలో రతన్ టాటా! నెతన్యాహూపై అభియోగాలు మోపాలని ఇజ్రాయెల్ పోలీసులు సిఫార్సు చేసిన జాబితాలో పారిశ్రామికవేత్త రతన్ టాటా పేరు ఉందని స్థానిక మీడియా పేర్కొంది. అయితే ఈ ఆరోపణలను టాటా కార్యాలయం కొట్టిపారేసింది. ఇజ్రాయెల్‌లో జన్మించిన హాలీవుడ్ నిర్మాత మిల్చన్, ఆస్ట్రేలియాకు చెందిన రిసార్ట్ యజమాని జేమ్స్ ప్యాకర్ నుంచి నెతన్యాహూ, ఆయన భార్య సారా భారీగా ముడుపులు పుచ్చుకున్నారంటున్న కేస్ 1000లోనే టాటాకూ పాత్ర ఉన్నట్లు ఆరోపణ. మిల్చన్కు ప్రయోజనం కలిగేలా నెతన్యాహూ ఫ్రీ ట్రేడ్ జోన్‌కు మద్ద తు పలికారని, ఇందులో టాటాకు భాగస్వామ్యం ఉందని పోలీసులు తెలిపారు. -
మన బంధం స్వర్గంలోనే నిశ్చయం
ముంబై: భారత–ఇజ్రాయెల్ బంధం స్వర్గంలోనే నిశ్చయమైందని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. మానవత్వం, ప్రజాస్వామ్యం, స్వాతంత్య్ర విలువలపై ఈ బంధం ఆధారపడి ఉందన్నారు. భారత పర్యటనకు వచ్చిన నెతన్యాహు గురువారం ముంబైలో ఏర్పాటుచేసిన భారత్–ఇజ్రాయెల్ వ్యాపారవేత్తల సదస్సులో మాట్లాడారు. ఇజ్రాయెల్ క్లిష్టపరిస్థితులనుంచి పైకెదిగి తన దిశను మార్చుకుని ప్రయాణిస్తున్నట్లే.. భారత్ మోదీ నాయకత్వంలో ఇదే విధంగా ముందుకెళ్తోందన్నారు. ఇరుదేశాల మధ్య లోతైన వ్యక్తిగత స్నేహముందన్నారు. భారత సంస్కృతి సాంప్రదాయాలంటే తనకు ఎనలేని గౌరవమని వెల్లడించారు. ‘ప్రపంచంలోని పురాతన సంస్కృతులున్న ప్రజాస్వామ్య దేశాలు మనవి. మనం స్వాతంత్య్రాన్ని, మానవత్వాన్ని పంచుకున్నాం. మనం అసలైన భాగస్వాములం. అందుకే ఈ బంధం స్వర్గంలోనే నిర్ణయమైంది’ అని నెతన్యాహు వ్యాఖ్యానించారు. 2008 ముంబై దాడులతో రక్తమోడిన ఛబాద్ భవనాన్ని నెతన్యాహు సందర్శించారు. నారీమన్ హౌజ్ వద్ద ఆనాటి మృతులకు ఆయన నివాళులర్పించారు. ముంబై దాడుల్లో తల్లిదండ్రులను కోల్పోయిన 11 ఏళ్ల మోషే హోల్ట్జ్బర్గ్ను కలిసి మాట్లాడారు. -
సబర్మతి ఆశ్రమంలో నెతన్యాహు
అహ్మదాబాద్ : ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అహ్మదాబాద్‌లో రోడ్ షో నిర్వహించారు. అహమ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సబర్మతీ ఆశ్రమం వరకూ దాదాపు 8 కిలోమీటర్ల మేరకు జరిగిన రోడ్ షోలో మోదీ, నెతన్యాహు పాల్గొన్నారు. సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన నెతన్యాహు దంపతులకు ప్రధాని మోదీ స్వయంగా అక్కడి విషయాలను వివరించారు. ఈ సందర్భంగా నెతన్యాహు...ఆశ్రమంలో నూలు వడికారు. అనంతరం నెతన్యాహు, మోదీ ‘ఐ క్రియేట్’ కేంద్రానికి సందర్శించారు. గతంలోనూ జపాన్ ప్రధాని షింజో అబే, చైనా అధ్యక్షుడు క్సీ జిన్‌పింగ్ గుజరాత్ పర్యటకు వచ్చినప్పుడు కూడా రోడ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా మోదీ సొంతగడ్డపై ఇజ్రాయల్ ప్రధాని పర్యటిస్తుండటంతో స్థానిక అధికారులు విస్తృత సన్నాహాలు చేశారు. -
ఇజ్రాయెల్‌తో చెలిమి
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆరు రోజుల పర్యటన కోసం శని వారం న్యూఢిల్లీ వచ్చినప్పుడు ఆయనకు ఘన స్వాగతం లభించింది. ప్రొటోకాల్ పక్కనపెట్టి విమానాశ్రయానికి వెళ్లడమే కాదు... ఆయనను గాఢంగా హత్తుకుని తన అభిమానాన్ని చాటుకున్న ప్రధాని నరేంద్ర మోదీ తీరును గమనిస్తే పాతికేళ్ల క్రితం మొదలైన ఇరు దేశాల బంధమూ ఏ స్థాయికి చేరుకుందో అర్ధమవుతుంది. సరిగ్గా ఆరునెలలక్రితం అంటే జూలై మొదటివారంలో మోదీ ఇజ్రాయెల్ పర్య టనకు వెళ్లినప్పుడు కూడా ఈ మాదిరి స్వాగత సత్కారాలే లభించాయి. మన ప్రధాని ఒకరు ఇజ్రాయెల్ పర్యటించడం అదే మొదటిసారి కాగా, ఇజ్రాయెల్ ప్రధాని ఇక్కడకు రావడం పదిహేనేళ్ల తర్వాత ఇది రెండోసారి. మోదీ జూలై పర్యటన సందర్భంగా వ్యవసాయం, జల సంరక్షణ, నవీకరణ రంగాల్లో సహకార ఒప్పందాలు కుదిరాయి. అవన్నీ వెనువెంటనే చకచకా కదిలాయి. ఇండో– ఇజ్రా యెల్ వ్యవసాయ పథకం కింద మన దేశంలో 35 ఎక్స్‌లెన్స్ కేంద్రాలు ప్రారం భించాలని నిర్ణయించగా వాటిలో 20 ఇప్పటికే పనిచేయడం ప్రారంభించాయి. తీవ్రమైన నీటి కొరత ఎదుర్కొంటున్న ఇజ్రాయెల్‌లో జల సంరక్షణ విధానాలను అభివృద్ధి చేసి అందులో ఉత్తమ సాంకేతికతను సాధించిన శాస్త్రవేత్తలు మన దేశంలో నీటి కరువు అధికంగా ఉన్న ప్రాంతాల్లో వినియోగపడగల పథకాలకు తుదిరూపం ఇస్తున్నారు. నవీకరణ రంగానికి సంబంధించినంతవరకూ వ్యవ సాయం, జల సంరక్షణ, ఆరోగ్యం అంశాల్లో ఇరు దేశాలకూ చెందిన 36 ఔత్సాహిక పరిశ్రమలకు అనుమతులు లభించాయి. ఇందుకోసం ప్రత్యేక నిధిని ఏర్పాటుచేసి ఏడాదికి చెరో 40 లక్షల డాలర్లు చొప్పున అయిదేళ్లపాటు కేటాయించాలని తాజాగా నిర్ణయించారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యాన్ని ఇప్పుడున్న 500 కోట్ల డాలర్ల స్థాయి నుంచి మరింత పెంచుకోవాలన్న ఉద్దేశం రెండు దేశాలకూ ఉంది. వాణిజ్య రంగంలో భారత్ భాగస్వాముల్లో ఇజ్రాయెల్ స్థానం 38. వివిధ అరబ్ దేశాలు మొదటి 15 ర్యాంకుల్లో ఉన్నాయంటే ఇజ్రాయెల్‌తో మన వాణిజ్యం ఎంత తక్కువగా ఉన్నదో అర్ధమవుతుంది. అయితే ఆయుధాలు, రక్షణ రంగానికి సంబం ధించిన ఇతర కొనుగోళ్లకు సంబంధించినంత వరకూ ఇజ్రాయెల్‌దే అగ్ర స్థానం. ఇజ్రాయెల్ నుంచి ఏటా వంద కోట్ల డాలర్ల విలువైన ఆయుధాలు, ఇతర రక్షణ పరికరాలు మన దేశం కొనుగోలు చేస్తున్నది. ఇతర రంగాల్లో సైతం వాణిజ్యం ఈ స్థాయికి విస్తరించాలన్నది రెండు దేశాల ఆలోచన. దాన్ని దృష్టిలో పెట్టుకునే నెత న్యాహుతో పాటు భారీ పారిశ్రామికవేత్తల బృందం మన దేశం వచ్చింది. అయితే ఇజ్రాయెల్‌తో మన సంబంధాలు సంక్లిష్టమైనవి. రెండు దేశాల మధ్య నెలకొన్న సంబంధాలనూ ‘స్వర్గంలో కుదిరిన పెళ్లి’గా నెతన్యాహు అభి వర్ణించడం మాటెలా ఉన్నా దాని పర్యవసానాలు కూడా తక్కువేమీ కాదు. ఎందుకంటే ఇజ్రాయెల్‌కు అరబ్ దేశాలతో ససేమిరా కుదరదు. ఇరాన్– ఇజ్రాయెల్ మధ్య పచ్చగడ్డేస్తే భగ్గున మండుతుంది. ఇక పాలస్తీనా సమస్య ఉండనే ఉంది. ఇజ్రాయెల్‌తో సంబంధాలు బలపడేకొద్దీ అరబ్ దేశాలతో, ఇరా న్‌తో మనకున్న సంబంధాలపై అవి తీవ్ర ప్రభావం కలగజేస్తాయని, ఇది మంచిది కాదని దౌత్య నిపుణులు చాన్నాళ్లుగా హెచ్చరిస్తున్నారు. మన చమురు దిగు మతుల్లో అరబ్ దేశాల వాటా 50 శాతం. సహజవాయువు అవసరాల్లో 85 శాతం ఆ దేశాలనుంచే లభిస్తుంది. అలాగే గల్ఫ్ సహకార మండలి(జీసీసీ)తో మన వాణిజ్యం 15000 కోట్ల డాలర్లు మించి ఉంది. మన దేశానికి చెందిన 80 లక్షల మంది యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, బహ్రైన్ దేశాలకు వలస పోయి అక్కడ ఉపాధి పొందుతున్నారు. సాధారణంగా అయితే ఒక దేశంతో సంబంధాలు మరో దేశంతో ఉన్న సంబంధాలను దెబ్బతీస్తాయని భావించ నవసరం లేదు. తైవాన్‌తో మనకున్న సంబంధాలు చైనాతో ఉన్న సంబంధాలకు అడ్డు రాలేదు. అలాగే చైనా–పాకిస్తాన్ మైత్రి భారత్–చైనా సంబంధాలపై ప్రభా వం చూపడం లేదు. అయితే ఇజ్రాయెల్‌తో పశ్చిమాసియాకు, ఇరాన్‌కు ఉన్న వైరం నేపథ్యం వేరు. 1947లో ఇజ్రాయెల్ ఆవిర్భావం తమ ప్రయోజనాలకు భంగకరమని ముస్లిం ప్రపంచం భావిస్తోంది. జర్మనీలో యూదుల వేధింపును 1938లో మహాత్మా గాంధీ తీవ్రంగా ఖండించినా యూదుల కోసం ఇజ్రాయెల్ ఏర్పరచాలన్న ప్రతిపాదనను ససేమిరా అంగీకరించలేదు. అరబ్‌ల మనసు గెల్చుకుని, వారి ఇష్టంతో మాత్రమే అలాంటి ప్రయత్నం చేయాలని చెప్పారు. స్వాతంత్య్రానంతరం కూడా మన దేశం ఆ మార్గాన్నే ఎన్నుకుంది. 1947లో ఇజ్రాయెల్ ఏర్పాటైనప్పుడు భారత్ గట్టిగా వ్యతిరేకించింది. మరో రెండేళ్లకు ఐక్యరాజ్యసమితిలో దానికి సభ్యత్వం ఇవ్వడాన్ని కూడా అంగీకరించలేదు. పాలస్తీనా ప్రజానీకంపై ఇజ్రాయెల్ దాడులు చేసిన ప్పుడల్లా వాటిని మన దేశం ఖండిస్తూనే ఉంది. అమెరికా తన దౌత్య కార్యాలయాన్ని వివాదాస్పద జెరుసలేంకు తరలించాలని నిర్ణయించడాన్ని వ్యతిరేకిస్తూ గత నెలలో ఐక్యరాజ్యసమితి అత్యవసర సమావేశం తీర్మా నించినప్పుడు సైతం మన దేశం దానికి మద్దతునిచ్చింది. ఇటీవలికాలంలో అమెరికా–అరబ్–ఇజ్రాయెల్ దేశాల మధ్య లోపాయికారీగా సాన్నిహిత్యం పెరగడాన్ని, ముఖ్యంగా పర్షియన్ జలసంధిలో ఇరాన్ యుద్ధ నౌకల కదలికపై నిఘాకు అవసరమైన గూఢచార ద్రోన్లను సౌదీ అరేబియాకు ఇజ్రాయెల్ సరఫరా చేయడాన్ని గమనిస్తే పశ్చిమాసియా మునుపటిలా లేదని, అక్కడ సమీకరణాలు మారుతున్నాయని అవగతమవుతుంది. అటు చైనా తలపెట్టిన వన్ బెల్ట్ వన్ రోడ్(ఓబీఓఆర్)ను ఇజ్రాయెల్ స్వాగతించడాన్ని, సిరియాకు వ్యతిరేకంగా అల్ కాయిదా, ఐఎస్‌ల సాయం తీసుకోవడానికి అది ప్రయ త్నించడాన్ని మన దేశం వ్యతిరేకించింది. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ఆశిస్తున్నట్టు ఇరు దేశాల సంబంధాలూ వ్యూహాత్మక స్థాయికి చేరడం ఏమేరకు సాధ్యమో, అసలు ప్రస్తుత సంబంధాల పరిధి, పరిమితి ఏమిటో రాగలకాలంలో తేట తెల్లమవుతుంది. -
మోదీతో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు భేటీ
-
మోదీతో ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు భేటీ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సోమవారం భేటీ అయ్యారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరుగుతున్న ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, ఒప్పందాలపై ఇరువురు నేతలు చర్చించారు. అనంతరం తొమ్మిది ద్వైపాక్షిక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. కాగా అంతకు ముందు ఇజ్రాయిల్ ప్రధానికి రాష్ట్రపతి భవన్లో సాదర స్వాగతం లభించింది. రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్‌తో పాటు, ప్రధాని మోదీ కూడా నెతన్యాహు దంపతులకు స్వాగతం పలికారు. అంతకు ముందు నెతన్యాహు దంపతులు రాజ్‌ఘాట్‌లోని మహాత్మాగాంధీ సమాధిని సందర్శించి నివాళులర్పించారు. ఆరు రోజుల పర్యటన నిమిత్తం నెతన్యాహు, భార్య సారాతో కలిసి ఆదివారం భారత్‌కు చేరుకున్న విషయం తెలిసిందే. -
బంధం కోసం: 'ఐ ఫర్ ఐ'
జెరుసలేం/న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెటన్యాహుతో బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ప్రపంచ శాంతి, భద్రతలకు ఇరుదేశాలు చేయాల్సిన కృషిపై చర్చించారు. దాదాపు నాలుగు గంటలపాటు సాగిన ఇరువురు దేశాధినేతల భేటీలో ఏడు ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. వీటిలో వ్యవసాయం, నీటి నిర్వహణ వంటి కీలకమైన ఒప్పందాలు కూడా ఉన్నాయి. ఇజ్రాయెల్‌లో తనకు లభించిన స్వాగతానికి ప్రధానమంత్రి మోదీ.. నెటన్యాహుకు ధన్యవాదాలు తెలియజేశారు. భారత పర్యటనకు కుటుంబ సమేతంగా విచ్చేయాలని మోదీ నెటన్యాహును ఆహ్వానించారు. దీనిపై స్పందించిన నెటన్యూహు.. మోదీ ఆఫర్‌ను అంగీకరిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే భారత పర్యటనకు విచ్చేస్తామని వెల్లడించారు. కాగా, ఓ భారత ప్రధానమంత్రి ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడం ఇదే తొలిసారి. మోదీ ఇజ్రాయెల్ పర్యటన - కీలకాంశాలు: 1- ఇరువురు దేశాధినేతల భేటీ అనంతరం 2008 పేలుళ్ల బాధితురాలైన ఇజ్రాయెల్ బాలిక మోషే హోల్ట్జ్బెర్గ్ను మోదీ కలిశారు. మోషే ప్రధానమంత్రి మోదీని తమ దేశానికి ఆహ్వానిస్తూ 'డియర్ మిస్టర్ మోదీ.. ఐ లవ్ యూ' అంటూ వెల్కమ్ నోట్‌ను చదివింది. 2- ఇరు దేశాలను ఉగ్రవాదం సవాలు చేస్తోందని నెటన్యాహు అన్నారు. మోషేను కలవడం ఇరు దేశాలు చెడుకు వ్యతిరేకంగా పోరాడతాయని చెప్పడానికేనని తెలిపారు. 3- వ్యవసాయం, నీరు, ఆరోగ్యం తదితర కీలకాంశాలపై చర్చించినట్లు నెటన్యాహు పేర్కొన్నారు. ఇరుదేశాల భాగస్వామ్యం మంచిని పెంచి పోషించేందుకు కృషి చేస్తుందని చెప్పారు. 4- భారత్, ఇజ్రాయెల్‌లు ఒకరి ఇంట్రెస్ట్‌లను మరొకరు పరస్పరం గౌరవించుకుని, సహకరించుకుంటాయని మోదీ పేర్కొన్నారు. 5- ఇరు దేశాలు పెట్టుబడులను పెంచుకుంటు పోవడం వల్ల భాగస్వామ్యం మరింత దృఢపడుతుందని మోదీ చెప్పారు. గురువారం ఇరు దేశాల ప్రధానమంత్రులు టాప్ కంపెనీల సీఈవోలను భేటీ అవనున్నారు. 6- మూడు రోజుల పర్యటనకు వెళ్లిన మోదీ.. తనకు లభించిన ఆహ్వానంపై ట్వీటర్ ద్వారా స్పందించారు. తనను ప్లీజ్ చేయడం కోసం అధ్యక్షుడు రివ్లిన్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించారని చెప్పారు. ఇజ్రాయెల్ తనకు ఘన స్వాగతాన్ని పలికిందని తెలిపారు. నెటన్యాహు తనకు ఇచ్చిన గౌరవం భారత ప్రజలకు ఇచ్చిందని అన్నారు. 7- ఐ ఫర్ ఐ( ఇండియా ఫర్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ ఫర్ ఇండియా) అని మోదీ వ్యాఖ్యానించారు. అధ్యక్షుడు రివ్లిన్ను కలిసిన అనంతరం మోదీ ఈ వ్యాఖ్య చేశారు. 8- ఈ రోజు కోసం తాము 70 సంవత్సరాల నుంచి వేచి చూస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెటన్యాహు అన్నారు. భారత్-ఇజ్రాయెల్‌ల మధ్య సంబంధం సహజమైనదని చెప్పారు. 9- ప్రధాని మోదీకి ఇస్తున్న విందుకు నెటన్యాహు హాజరయ్యారు. 10- ఇజ్రాయెల్‌లో నివసిస్తున్న భారతీయులను ఉద్దేశించి జెరుసలేంలో ప్రధాని మోదీ చేసే ప్రసంగానికి నెటన్యాహు కూడా హాజరుకానున్నారు. -
భారత్–ఇజ్రాయెల్ పంచమంత్ర
70 ఏళ్లలో ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని నరేంద్రమోదీ. వివిధ కీలక రంగాల్లో ఆ దేశంతో మైత్రి బంధాన్ని బలోపేతం చేసుకోవాలని మోదీ భావిస్తున్నారు. ప్రపంచంలోని ఎన్నో దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు నెరపుతుండగా.. ఇజ్రాయెల్ ఎందుకంత ప్రత్యేకం అంటే దానికి ఐదు కారణాలు కనిపిస్తున్నాయి. రక్షణ, వ్యవసాయం, వాణిజ్యం, దౌత్యం, నీటి నిర్వహణ. ప్రస్తుతం ఇరు దేశాల చర్చల్లో వీటిదే అగ్రతాంబూలం. – సాక్షి, తెలంగాణ డెస్క్ 1 రక్షణ 2012–16 మధ్యకాలంలో ఇజ్రాయెల్ మొత్తం ఆయుధాల ఎగుమతుల్లో 41 శాతం కొనుగోలు చేసింది మనదేశమే. మరోవైపు ఆయుధాల కోసం మనదేశం ఆధారపడు తున్న మూడో దేశం ఇజ్రాయెల్. 1962 ఇండో–చైనా యుద్ధంతో ఇరు దేశాల బంధం మొదలైంది. 1965, 1971లో పాక్‌తో యుద్ధం సమయంలోనూ మనదేశానికి తోడ్పా టును అందించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యాధునిక ఉపరితలం నుంచి గగనతలం మధ్యతరహా క్షిపణి పరిజ్ఞానానికి సంబంధించి ఇరు దేశాల మధ్యా రూ.13 వేల కోట్ల విలువైన ఒప్పందం కుదిరింది. 2 దౌత్య సంబంధాలు మోదీ పర్యటనకు ముందుగా ఎల్కే అడ్వాణీ (2000లో), ఏపీజే అబ్దుల్ కలాం(2008లో), రాజ్‌నాథ్‌సింగ్ (2014లో), ప్రణబ్‌ముఖర్జీ (2015లో), సుష్మా స్వరాజ్ (2016లో) ఇజ్రాయెల్‌లో పర్యటించారు. ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక సంబంధాలు మొదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది మేలో మూడు భారత యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ ముంబై, ఐఎన్ఎస్ త్రిశూల్, ఐఎన్ఎస్ ఆదిత్య ఇజ్రాయెల్‌లో గుడ్‌విల్ విజిట్‌కు వెళ్లాయి. 3 వ్యవసాయం అత్యాధునిక సాగు పద్ధతులను గురించి మనదేశ రైతులకు తెలియ జేసేందుకు ఇండో–ఇజ్రాయెల్ అగ్రికల్చర్ యాక్షన్ ప్లాన్ 2015–18 ప్రస్తుతం అమలులో ఉంది. ఇజ్రాయెల్ సాయంతో ప్రతిపాదిత 26 ఎక్సలెన్స్ సెంట ర్లకుగానూ 15 సెంటర్ల అభివృద్ధి పూర్తయ్యింది. హార్టికల్చర్, రక్షిత సాగు, నర్సరీ నిర్వహణ, సూక్ష్మ సేద్యం, నీటిపా రుదల కోత నిర్వహణ మొదలైన అంశాల్లో ఇజ్రాయెల్ టెక్నాలజీతో మనదేశం ముఖ్యంగా హరియా ణా, మహారాష్ట్ర లబ్ధిపొందుతోంది. 4 నీటి నిర్వహణ దేశంలో జల సంరక్షణ నిమిత్తం జూన్‌లో ఇరు దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఇజ్రాయెల్ టెక్నాలజీ సాయంతో తాగునీటిని ప్రజలకు అందించనున్నారు. 5 వాణిజ్యం ఇజ్రాయెల్ భారత దేశ 38వ అతిపెద్ద వాణిజ్య భాగ స్వామి. 2016–17లో ఇరు దేశాల మధ్య వాణిజ్యం విలువ రూ.33,634 కోట్లు. ఖనిజ ఇంధనాలు, ఆయిల్స్ మొద లైనవి మనదేశ ఎగుమతుల్లో కీలకం. ఇక ఇజ్రాయెల్ నుంచి దిగుమతుల్లో సహజ ముత్యాలు, విలువైన రాళ్లు ముఖ్యమైనవి. ద్వైపాక్షిక వాణిజ్యంలో వజ్రాలదే 54 శాతం కావడం గమనార్హం. -
పూదోటలో విహారం.. ఓ పువ్వుకు మోదీ పేరు
టెల్ అవివ్: మిష్మర్ హషివలోని డాంజిగర్ పూదోటను నెతన్యాహూతో కలసి మోదీ సందర్శించారు. ఈ తోట జెరూసలేంకు 56 కిలోమీటర్ల దూరంలో.. 80 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడి నుంచి దాదాపు 60 దేశాలకు పూలు ఎగుమతవుతాయి. అనంతరం యాద్ వాషెం స్మారకాన్ని మోదీ సందర్శించి నివాళులర్పించారు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ ఊచకోతకు బలైన 60 లక్షల మంది యూదుల స్మృత్యర్థం ఈ మ్యూజియం నిర్మించారు. కాగా, యూదు దేశం ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీని ఆ దేశ ప్రభుత్వం కొత్త రీతిలో గౌరవించింది. ఇజ్రాయెల్‌లో వేగంగా పెరిగే ‘క్రిసెంతమన్’ పుష్పానికి ‘మోదీ’ అని నామకరణం చేసినట్లు ఇజ్రాయెల్ అధికారిక మీడియా ట్విటర్ ఖాతాలో వెల్లడించింది. పూదోటను మోదీ సందర్శించిన సందర్భంగా క్రిసెంతమన్ పువ్వుకు మోదీ పేరు పెట్టారు. యూదు మతవాద స్థాపకుడిగా భావించే థియోడర్ హెర్జ్ స్మారకాన్ని కూడా మోదీ సందర్శించారు. ముందుగా అనుకోకపోయినా నెతన్యాహూ సలహాపై ఆయన అక్కడికి వెళ్లారు. యాద్ వాషెం స్మారకం పక్కనే హెర్జ్ సమాధి ఉంటుంది. సమాధిపై మోదీ చిన్న రాయి పెట్టి ప్రార్థనలు చేశారు. -
ఉమ్మడిగా ఉగ్రపోరు
మీడియా సమావేశంలో మోదీ, నెతన్యాçహూ టెల్ అవివ్: ఉగ్రవాద, అతివాద శక్తులపై ఉమ్మడిగా పోరు కొనసాగించాలని భారత్–ఇజ్రాయెల్ ప్రధానులు ఉద్ఘాటించారు. సంయుక్త మీడియా సమావేశాన్ని ఉద్దేశించి మంగళవారం మోదీ, నెతన్యాçహూలు ప్రకటన చేస్తూ.. రెండు దేశాలు ఒకే రకమైన ముప్పును, సవాళ్లను ఎదుర్కొంటున్నాయని వాటిపై కలసికట్టుగా ముందుకు సాగాలని అభిప్రాయపడ్డారు. ‘భారత ప్రధాని మోదీకి ఆతిథ్యమివ్వడం ఎంతో ఆనందంగా ఉంది. భారత్‌ను మేం ఎంతో గౌరవిస్తున్నాం. ఇరు దేశాలు ఉగ్రవాదం వంటి ఒకే రకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వాటిని ఓడించాలని భారత్, ఇజ్రాయెల్‌లు కోరుకుంటున్నాయి. అందుకు కలసికట్టుగా, ఉమ్మడి పోరు జరపాలి. ఇరు దేశాల ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం కలసికట్టుగా గొప్ప పనులు చేయగలమనే నమ్మకముంద’ని నెతన్యాహూ పేర్కొన్నారు. ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘మనం తప్పకుండా ఉగ్రవాద, అతివాద శక్తుల్ని, హింసను వ్యతిరేకించాలి. అందుకోసం మానవత్వం, నాగరిక విలువల పట్ల నమ్మకం ఉన్నవారంతా ముందుకు రావాలి. కొన్ని దశాబ్దాల క్రితం నాటి ఉగ్రభూతం దారుణాలకు యాద్ వాషెం మ్యూజియమే సాక్ష్యం. ఇజ్రాయెల్‌ను మరో ఇల్లుగా భావిస్తున్నాను. ఆ దేశం స్ఫూర్తి ఎప్పటికీ నిలిచిపోతుంది. గత కొన్నేళ్లుగా భారత్–ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు వేగంగా పురోగమిస్తున్నాయి. ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థల బలోపేతానికి సంబంధాల్ని మరింత దృఢం చేసుకోవాల’న్నారు. -
ఆప్ కా స్వాగత్ హై.. దోస్త్!
మోదీకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఆహ్వానం ► టెల్ అవివ్ ఎయిర్‌పోర్ట్‌లో ఘన స్వాగతం ► ఆలింగనాలతో ఆత్మీయత చూపిన ఇరువురు నేతలు టెల్ అవివ్: ఇజ్రాయెల్, భారత్‌లు కలసికట్టుగా ముందుకు సాగితే మరిన్ని అద్భుతాలు సాధించగలవని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం ఇజ్రాయెల్ చేరుకున్న మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. టెల్ అవివ్‌లోని బెన్ గురియన్ విమానాశ్రయంలో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూతో పాటు ఆయన కేబినెట్ మొత్తం మోదీని ఆహ్వానించేందుకు తరలివచ్చింది. ‘ఆప్ కాస్వాగత్ హై, మేరే దోస్త్’ అంటూ హిందీలో మోదీకి నెతన్యాహూ స్వాగతం పలికారు. అమెరికా అధ్యక్షుడు, పోప్‌కు మాత్రమే లభించే గౌరవం ఎయిర్‌పోర్ట్‌లో మోదీకి దక్కింది. విమానాశ్రయంలో మోదీ, నెతన్యాహూ మాట్లాడుతూ.. భారత్, ఇజ్రాయెల్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంతో పాటు, ఉగ్రవాదంపై ఉమ్మడి పోరులో సహకరించుకుంటామని పేర్కొన్నారు. తన ఇజ్రాయెల్ పర్యటన మార్గదర్శకంగా నిలుస్తుందని మోదీ చెప్పారు. మోదీ విమానం దిగగానే ఇరు ప్రధానులు ఒకరి నొకరు మూడుసార్లు ఆలింగనం చేసుకున్నారు. ఇజ్రాయెల్ సైనిక బృందం ఇరు దేశాల జాతీయ గీతాల్ని ఆలపించి మోదీకి సైనిక వందనం సమర్పించింది. అనంతరం మోదీ, నెతన్యాహూ ఎయిర్‌పోర్టులో సంక్షిప్తంగా ప్రసంగించారు. ‘ఇది నిజంగానే చారిత్రక పర్యటనే, గత 70 ఏళ్లుగా భారత ప్రధాని రాక కోసం వేచిచూస్తున్నాం.. భారత్‌కు చెందిన గొప్ప నేత, ప్రపంచంలో ప్రముఖ నేత మోదీ’ అంటూ నెతన్యాహూ ఉద్వేగంతో ప్రసంగాన్ని ప్రారంభించారు. పలుమార్లు మోదీని నా స్నేహితుడని సంబోధించారు. ‘భారత్‌ను ప్రేమిస్తున్నాం. ఆ దేశంతో సహకారంలో ఇక నుంచి ఆకాశమనే హద్దును కూడా చేరిపేస్తున్నాం. భారత్, ఇజ్రాయెల్ సంబంధాల్లో ఆకాశమే హద్దని మా మొదటి సమావేశంలో మోదీ చెప్పిన విషయం గుర్తుంది. ఇప్పుడు మనం అంతరిక్ష రంగంలో కూడా సహకరించుకుంటున్నాం.. అందువల్ల ఆకాశం కూడా ఇక అడ్డంకి కాద’ని నెతన్యాహూ పేర్కొన్నారు. షాలోమ్.. మీ స్వాగతానికి కృతజ్ఞతలు: మోదీ ఘన స్వాగతానికి మోదీ కృతజ్ఞతలు తెలుపుతూ.. హిబ్రూలో ప్రసంగాన్ని ప్రారంభించారు. ‘షాలోమ్(హలో).. ఇక్కడికి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉంది. విమానాశ్రయంలో స్వాగతం పలికిన నా స్నేహితుడు నెతన్యాహూకు కృతజ్ఞతలు. నా పర్యటన భవిష్యత్తులో మార్గదర్శకంగా నిలుస్తుంది. ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్న తొలి భారత ప్రధానిని నేను కావడం గౌరవంగా భావిస్తున్నా. ఇజ్రాయెల్‌తో దృఢమైన సంబంధాలు ఏర్పరచుకోవడమే నా పర్యటన లక్ష్యం. ఇరు దేశాలకు ఉమ్మడి ముప్పుగా పరిణమించిన ఉగ్రవాదం నుంచి మన సమాజాల్ని కాపాడుకోవాలి. కలసికట్టుగా పనిచేస్తే మరింత ముందుకు సాగడంతో పాటు అద్భుతాలు సాధిస్తాం. భారత్‌లో ఎంతో యువ శక్తి ఉంది. ఇరు దేశాల్లో తెలివైన, నైపుణ్యమున్న యువతరం ఉంది. వారే మన చోదకశక్త’ని మోదీ పేర్కొన్నారు. ఇజ్రాయెల్‌ను కీలకమైన అభివృద్ధి భాగస్వామిగా అభివర్ణించారు. ‘ఇది అద్భుత యాత్ర.. ఇరు దేశాల ప్రజలు, సమాజ హితం కోసం కలసికట్టుగా సాగాలి. ఎన్నో శతాబ్దాల క్రితం నుంచి భారత్, ఇజ్రాయెల్ మధ్య కొనసాగిన సంబంధాల్ని ఈ పర్యటనతో గుర్తుచేసుకుంటున్నా’మనిచెప్పారు. 41 ఏళ్ల క్రితం ఉగాండాలో బందీలుగా ఉన్న ఇజ్రాయెలీల్ని రక్షిస్తూ ప్రాణాలు కోల్పోయిన నెతన్యాహూ పెద్దన్న యొనాతన్‌ని మోదీ గుర్తుచేశారు. ‘ఈ రోజు జూలై 4. సరిగ్గా 41 ఏళ్ల క్రితం యొనాతన్ తన ప్రాణాలను త్యాగం చేశారు’ అని ఆయన పేర్కొన్నారు. ఎప్పుడూ మీ గురించే చెబుతుంటారు: మంత్రి ‘ప్రధాని నెతన్యాహూ ఎప్పుడూ మీ గురించే చెబుతుంటారు. మీరంటే మాకు ఎంతో ఇష్టం’ అని ఇజ్రాయెల్ కమ్యునికేషన్ల శాఖ మంత్రి అయూబ్ కారా మోదీతో అన్నారు. కేబినెట్ మంత్రుల్ని నెతన్యాహూ పరిచయం చేస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. వెంటనే మోదీ నవ్వుతూ ఆయనపై భుజంపై చేయి వేశారు. -
కాల్పుల విరమణ విఫలం.. దాడులు యథాతథం!
గాజాపై దాడులను తీవ్రం చేసిన ఇజ్రాయెల్ జెరూసలేం/గాజా: ఈజిప్ట్ మధ్యవర్తిత్వంలో సోమవారం కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్.. ఆ మర్నాడే పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ ఆధీనంలోని గాజాపై వైమానిక దాడులను కొనసాగించింది. ‘కాల్పుల విరమణలో భాగంగా గాజాపై మేం కాల్పులు ఆపేసిన తరువాత హమస్ మాపై 47 రాకెట్లను ప్రయోగించింది. దాంతో మళ్లీ దాడులను ప్రారంభించాల్సి వచ్చింది’ అని ఇజ్రాయెల్ సైన్యం పేర్కొంది. ఈజిప్ట్ ప్రతిపాదించిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని మొదట్నుంచీ వ్యతిరేకిస్తున్న హమాస్ కూడా మంగళవారం ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులను తీవ్రం చేసింది. ఇజ్రాయెల్ కాల్పులను ఏకపక్షంగా విరమించడంతో సోమవారం ఉదయం కాసేపు గాజాలో ప్రశాంతత నెలకొంది. కాల్పుల విరమణకు ఒప్పుకోకపోతే గాజాపై సైనిక చర్యలను తీవ్రం చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు హెచ్చరించారు. కాగా.. ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ తీర్మానం చేయాలన్న డిమాండ్‌తో పలు పార్టీలు సోమవారం లోక్‌సభను హోరెత్తించాయి. అయితే ప్రభుత్వం ఈ డిమాండ్‌కు ఒప్పుకోలేదు.