![Modi and Israel PM Netanyahu roadshow in Ahmedabad - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/17/modi_1.jpg.webp?itok=JlQ-iXUN)
అహ్మదాబాద్ : ఇజ్రాయిల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో కలిసి ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం అహ్మదాబాద్‌లో రోడ్ షో నిర్వహించారు. అహమ్మదాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సబర్మతీ ఆశ్రమం వరకూ దాదాపు 8 కిలోమీటర్ల మేరకు జరిగిన రోడ్ షోలో మోదీ, నెతన్యాహు పాల్గొన్నారు. సబర్మతీ ఆశ్రమాన్ని సందర్శించిన నెతన్యాహు దంపతులకు ప్రధాని మోదీ స్వయంగా అక్కడి విషయాలను వివరించారు. ఈ సందర్భంగా నెతన్యాహు...ఆశ్రమంలో నూలు వడికారు. అనంతరం నెతన్యాహు, మోదీ ‘ఐ క్రియేట్’ కేంద్రానికి సందర్శించారు. గతంలోనూ జపాన్ ప్రధాని షింజో అబే, చైనా అధ్యక్షుడు క్సీ జిన్‌పింగ్ గుజరాత్ పర్యటకు వచ్చినప్పుడు కూడా రోడ్ షోలో పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా మోదీ సొంతగడ్డపై ఇజ్రాయల్ ప్రధాని పర్యటిస్తుండటంతో స్థానిక అధికారులు విస్తృత సన్నాహాలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment