
సాక్షి, అహ్మదాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 24న భారత్ రానున్న నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. ఢిల్లీ నుంచి అహ్మదాబాద్ చేరుకొని అక్కడ మూడు గంటల పాటు గడపనున్నారు. అందుకోసం విజయ్ రూపాణి సర్కార్ రూ.100 కోట్లు వెచ్చిస్తోంది. అహ్మదాబాద్ నగరపాలక సంస్థ, అహ్మదాబాద్ పట్టణాభివృద్ధి సంస్థ సంయుక్తంగా ఈ ఖర్చులను భరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం అదనంగా మరో రూ. 14 కోట్లను అందించనుంది. చదవండి: కెమ్ ఛో ట్రంప్!
ఇప్పటికిప్పుడు యుద్ధప్రాతిపదికన కొత్త రోడ్లు ఏర్పాటు, పాత రోడ్ల మరమ్మత్తులు చేపట్టారు. వీటి కోసం రూ. 80 కోట్లను కేటాయించగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇక ట్రంప్ భద్రత కోసమే రూ. 15 కోట్ల దాకా ఖర్చుచేయనున్నారు. మోదీ, ట్రంప్ రోడ్ షో వెంబడి సాంస్కృతిక కార్యక్రమాలకు అదనంగా రూ. 4 కోట్లు వెచ్చిస్తున్నారు. ట్రంప్-మోదీ హాజరయ్యే రోడ్ షో కోసం 10 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. చదవండి: 'ట్రంప్ పర్యటనంటే ఆ మాత్రం ఉండాలి మరి'
Comments
Please login to add a commentAdd a comment