road show
-
విశాఖలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
-
ఒక్కొక్కరికి రూ.110తో ఫుడ్ ప్యాకెట్
మహారాణిపేట: ప్రధాని మోదీ రోడ్డు షో, బహిరంగ సభ కోసం వచ్చే ప్రజల కోసం ఆహారం తయారీలో సివిల్ సప్లయిస్ అధికారులు బిజీగా ఉన్నారు. రెండు లక్షల మందికి పైగా భోజనాలు, స్నాక్స్ తయారు చేయిస్తున్నారు. ఒక్కొక్క ప్యాకెట్ రూ.110 చొప్పున తయారీ కోసం పలువురికి క్యాటరింగ్ అప్పగించారు. పెదగదిలి(తోటగరువు) వద్ద ఉన్న యెర్ని దుర్గామాంబ కల్యాణ మండపంలో ఓం సాయిరామ్ కేటరింగ్, పవన్ కేటరింగ్‌లకు బాధ్యతలు అప్పగించారు. రామాటాకీస్ వద్ద ఉన్న బి.ఆర్.అంబేడ్కర్ భవన్లో అమృతం కేటరింగ్, క్విక్ సప్లయిర్స్‌కు, అక్కయ్యపాలెం షాదీఖానా కల్యాణ మండపంలో కృష్ణారెడ్డి కేటరింగ్‌కు, ఫెర్రీ రోడ్డు(వన్ టౌన్) పొట్టి శ్రీరాములు కల్యాణ మండపంలో మణికంఠ ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, సుధీర్ హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటేషన్లకు మధ్యాహ్నం పులిహోరా, మజ్జిగ ప్యాకెట్, వాటర్ బాటిల్, రాత్రికి బిర్యానీ, వాటర్, మజ్జిగ ప్యాకెట్, బిస్కెట్ ప్యాకెట్ అందించే బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. -
జననేతకు బ్రహ్మరథం..
-
సినిమా వాళ్లేమైనా ప్రత్యేకమా? పోలీసులు అనుమతి నిరాకరించినా అల్లు అర్జున్ రోడ్ షో చేశారు... అసెంబ్లీలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విమర్శలు
-
Lok Sabha Election 2024: మోదీ @ 200 సభలు, రోడ్‌షోలు
సాక్షి, న్యూఢిల్లీ: ముచ్చటగా మూడోసారి బీజేపీని అధికారంలోకి తీసుకుని రావడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఈ ఎన్నికల ప్రచారంలో సుడిగాలి పర్యటనలు చేశారు. ఒక్కో రోజు మూడు నుంచి ఐదు సభలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. మార్చి 16న ఈసీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక మొత్తంగా మోదీ 206 సభలు, సమావేశాలు, రోడ్‌షో, ర్యాలీల్లో పాల్గొన్నారు. ఒక్క మేలో 96 ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.అత్యధిక ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్‌లో ప్రధాని ఏకంగా 31 సభల్లో పాల్గొన్నారు. బిహార్‌లో 20, మహారాష్ట్రలో 19, పశి్చమబెంగాల్లో 16 సభలకు హాజరయ్యారు. కేవలం ఈ 4 రాష్ట్రాల్లోనే 86 సభల్లో మోదీ పాల్గొనడం గమనార్హం. దక్షిణాదిన కర్ణాటక, తమిళనాడు, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గెలుపే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేశారు. అత్యధికంగా కర్ణాటక, తెలంగాణల్లో 11, తమిళనాడులో 7 ప్రచార కార్యక్రమాల్లో మోదీ పాల్గొన్నారు. 2019 ఎన్నికల్లో మోదీ 145 సభలు, సమావేశాలు, రోడ్‌షో, ర్యాలీల్లో పాల్గొన్నారు. 2019లో 68 రోజులు ప్రచారంచేయగా ఈసారి 76 రోజులపాటు ప్రచారంచేశారు. ఈసారి ఆయన మొత్తం 80 మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంటే సగటున రోజుకు ఒకటి కంటే ఎక్కువ. -
నటుడు మిథున్ చక్రవర్తి రోడ్ షోలో రాళ్ల దాడి
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మరో అల్లర్ల ఉదంతం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని మిడ్నాపూర్‌లో నటుడు, బీజేపీ నేత మిథున్ చక్రవర్తి రోడ్ షోలో కొందరు వ్యక్తులు రాళ్లు రువ్వారు. అనంతరం ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మిడ్నాపూర్ లోక్‌సభ స్థానం నుండి బీజేపీ అభ్యర్థి అగ్నిమిత్ర పాల్ పోటీ చేస్తున్నారు. ఈయనకు మద్దతుగా మిథున్ చక్రవర్తి రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు ఊరేగింపుపై గాజు సీసాలు, రాళ్లు విసిరారనే ఆరోపణలు వచ్చాయి. అయితే ఈ ఆరోపణలను రాష్ట్ర అధికార టీఎంసీ కొట్టిపారేసింది. కాగా ఈ ఘటనలో చక్రవర్తి, పాల్ ఇద్దరికీ ఎటువంటి గాయాలు కాలేదు.మిడ్నాపూర్ కలెక్టరేట్ మలుపు నుండి ప్రారంభమైన రోడ్ షో కెరనిటోలా వైపు వెళుతుండగా వందలాది మంది బీజేపీ మద్దతుదారులు నినాదాలు చేస్తుండగా, మిథున్ చక్రవర్తి, అగ్నిమిత్ర పాల్ జనానికి అభివాదాలు తెలిపారు. ఈ రోడ్ షో షేక్‌పురా మలుపు వద్దకు చేరుకోగానే రోడ్డుపక్కన నిలుచున్న కొందరు ఊరేగింపుపై రాళ్లు, సీసాలు విసిరారు. ఈ నేపధ్యంలో బీజేపీ కార్యకర్తలు ఎదురు దాడులకు దిగడంతో ఘర్షణ చెలరేగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. అయితే కొద్దిసేపటికే పరిస్థితి అదుపులోకి వచ్చిందని ఆయన పేర్కొన్నారు.బీజేపీకి మద్దతు పెరుగుతుందనే భయంతో తృణమూల్ కాంగ్రెస్ ఇలాంటి గూండాయిజానికి పాల్పడుతోందని అగ్నిమిత్ర పాల్ ఆరోపించారు. మిథున్ చక్రవర్తి లాంటి ప్రముఖ నటుడిని అవమానించేలా వారు ప్రవర్తించారన్నారు. కాగా తృణమూల్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి త్రినాంకుర్ భట్టాచార్య బీజేపీ నేత చేస్తున్న ఆరోపణలను ఖండించారు. రోడ్ షో ఫ్లాప్ కావడంతో బీజేపీ ఇలాంటి నాటకాలు ఆడుతోందని ఆరోపించారు. -
వాజ్‌పేయిని ఒప్పించి రోడ్లేశా!
బొమ్మలసత్రం/సాక్షి, చిత్తూరు: హైదరాబాద్ అభివృద్ధికి తానే కారణమని.. అందువల్లే ఐటీ కంపెనీలు డబ్బులు సంపాదిస్తున్నాయని టీడీపీ అధినేత చంద్రబాబు తెలిపారు. ప్రధాని వాజ్‌పేయిని ఒప్పించి అద్దంలాంటి రహదారులు వేయించానన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు శనివారం నంద్యాల, చిత్తూరుల్లో బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ్ముళ్లు సెల్‌ఫోన్ వాడుతున్నారంటే దానికి కారణం తానేనన్నారు. తెలుగు తమ్ముళ్లు నష్టపోతారని అమరావతిని రాజధానిగా ప్లాన్ చేశానన్నారు. హైదరాబాద్ కంటే అమరావతిని బెస్ట్ సిటీగా మార్చాలని భావించానని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఆడవాళ్లు ఉద్యోగాలకెళ్తే మగవాళ్లు వంట చేసే రోజులు వస్తాయన్నారు. పోలవరం 72 శాతం పూర్తి చేసి.. ఆ నీటిని బనకచర్లకు అనుసంధానం చేయాలని చూశానన్నారు. తన చివరి శ్వాస ఉన్నంతవరకు పేదవాళ్ల అభివృద్ధి కోసమే పనిచేస్తానని తెలిపారు. రూ.16 లక్షల కోట్లు పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చానన్నారు. 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చి రెండింతలు అభివృద్ధి చేశానని వెల్లడించారు. కోవిడ్ సమయంలో కూడా వర్చువల్ సమావేశాలు పెట్టి ప్రజల కోసం పనిచేశానన్నారు. కాగా, నంద్యాలలో చంద్రబాబు సభ అట్టర్‌ఫ్లాప్ అయ్యింది. ఆయన మాట్లాడుతున్నప్పుడే కార్యకర్తలు వెనుదిరిగారు. చంద్రబాబు రోడ్ షోలో డిగ్రీ విద్యార్థి మృతి ఒంగోలు సబర్బన్: ఒంగోలు నగరంలో శుక్రవారం చంద్రబాబు నిర్వహించిన రోడ్డు షోలో అపశ్రుతి చోటు చేసుకుంది. చంద్రబాబు కాన్వాయ్‌లోని ఒక వాహనం ఫుట్‌పాత్‌పై నిలబడి ఉన్న డిగ్రీ విద్యార్థి కాట్రగడ్డ సాయికృష్ణ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేయడంతో కిందపడిపోయాడు. దీంతో తీవ్రంగా గాయాలపాలైన అతడిని ఒక ప్రైవేటు వైద్యశాలలో చేరి్పంచారు. తలకు బలమైన గాయం కావడంతో చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. కాట్రగడ్డ సాయికృష్ణను మద్దిపాడు మండలం దొడ్డవరం గ్రామానికి చెందిన విద్యారి్థగా గుర్తించారు. -
Aravind Kejriwal: నేను వచ్చేశా...
న్యూఢిల్లీ: త్వరలో తిరిగి వస్తానని చెప్పాను కదా! చెప్పినట్లే వచ్చేశా అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తనకు మధ్యంతర బెయిల్ ఇచి్చన సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు, ఇన్నాళ్లూ తనకు అండగా నిలిచి ఆశీస్సులందించిన ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు నుంచి విడుదలైన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నియంతృత్వం నుంచి మన దేశాన్ని కాపాడుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకోసం తన శక్తిమేరకు పోరాడుతానని, తనకు 140 కోట్ల మంది ప్రజల మద్దతు కావాలని కోరారు. ప్రజలంతా ఈ పోరాటంలో భాగస్వాములు కావాలన్నారు. తాను ఎంతగానో విశ్వసించే హనుమంతుడి ఆశీర్వాదంతో జైలు నుంచి బయటకు వచ్చానని తెలిపారు. శనివారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ కన్నాట్ ప్లేస్‌లోని హనుమాన్ ఆలయాన్ని దర్శించుకోబోతున్నానని, తనను చూడాలంటే ప్రజలు అక్కడికి రావాలని కేజ్రీవాల్ సూచించారు. ఆయన శనివారం మధ్యాహ్నం ఆప్ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతారు. రోడ్ షోలో పాల్గొంటారు. ‘ఇండియా’ కూటమిలో హర్షాతిరేకాలు అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో మధ్యంతర బెయిల్ మంజూరు కావడంతో ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్)తోపాటు విపక్ష ‘ఇండియా’ కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు. మరో నాలుగు దశల పోలింగ్ మిగిలి ఉన్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తమ కూటమికి లాభిస్తుందని వారు చెప్పారు. సత్యమేవ జయతే అని ఆప్ నేతలు నినదించారు.‘‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నా. అన్యాయాన్ని వ్యతిరేకిస్తూ లభించిన ఈ విజయం మన ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. కేజ్రీవాల్ విడుదల న్యాయానికి ప్రతిబింబం. ఆయన రాకతో ‘ఇండియా’ కూటమిని మరింత బలోపేతం అవుతుంది. ఈ ఎన్నికల్లో మా విజయావకాశాలు ఇంకా పెరుగుతాయి’’ – ఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి ‘‘హనుమాన్జీ కీ జై.. ఇది ప్రజాస్వామ్య విజయం. లక్షలాది మంది ప్రజల ప్రార్థనలు, ఆశీస్సులతో అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ లభించింది. వారందరికీ నా కృతజ్ఞతలు’’ – సునీతా కేజ్రీవాల్, అరవింద్ కేజ్రీవాల్ భార్య కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్ పొందడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పరిణామం ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి విజయానికి దోహదపడుతుందని భావిస్తున్నా’’ – మమతా బెనర్జీ, పశి్చమ బెంగాల్ ముఖ్యమంత్రి ‘‘కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వును స్వాగతిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడంలో మన దేశం దృఢంగా వ్యవహరిస్తోంది’’ – శరద్ పవార్, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత -
వికసిత్ భారత్ కాదు.. విఫల భారత్
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : ‘‘పదేళ్ల పాలనలో ప్రధాని మోదీ చేసిన ఏ వాగ్దానం కూడా నెర్చలేదు. సబ్కా సాథ్ సబ్కా వికాస్ అన్న మోదీ.. దేశ్ కా సత్యనాశ్ చేసిండు. వికసిత భారత్ అంటూ దేశాన్ని విఫల భారత్‌గా చేసిండు..’’ అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. నోటికొచ్చిన హామీలిచ్చి రాష్ట్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్.. వాటిని అమలు చేయలేక నాలుగైదు నెలల్లోనే తెలంగాణను ఆగమాగం చేసిందని విమర్శించారు. కేసీఆర్ గురువారం కరీంనగర్లో రోడ్ షో నిర్వహించి.. తెలంగాణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే..‘‘పదేళ్ల కింద మోదీ ప్రధాని అయినపుడు 150 హామీలిచ్చి ఒక్కటైనా నెరవేర్చలేదు. అచ్చేదిన్ అన్నారు.. సచ్చేదిన్ వచ్చింది. అంతా గ్యాస్.. ట్రాష్..! మాట్లాడితే పాకిస్తాన్, పుల్వామా అంటారు. పాకిస్తాన్ చిన్న దేశం. వాడిని చూపించి డ్రామా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నారు. దేశం నుంచి ఎగుమతులు నిలిచినయ్. విదేశీ మారకాలు తగ్గినయ్.. కొలువుల భర్తీలేదు. కార్పొరేట్లకు రూ.15 లక్షల కోట్లు రుణమాఫీ చేశారే తప్ప పేదలకు రుపాయి ఇవ్వలేదు. తెలంగాణలో ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వలేదు.బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఏం చేశారు?పోయినసారి మంచికో చెడుకో రాష్ట్రంలో నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారు. వారు నాలుగు రూపాయల పనైనా చేశారా. మత విద్వేషాలు పెంచడం తప్ప ఏమీ చేయలేదు. అసలు ఇక్కడి ఎంపీ బండి సంజయ్‌కు సరిగా మాట్లాడటం వస్తదా? అతన్ని పార్లమెంటుకు పంపుదామా? విద్యావంతుడైన వినోద్‌కుమార్‌ను పంపుదామా? ఆలోచించాలి.మహిళలకు రూ.2,500 సాయం ఏది?అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మహిళలకు రూ.2,500 ఇస్తామన్నరు, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామన్నరు. ఏవి? రుణమాఫీ, పింఛన్ల పెంపు ఏవి? మహిళలకు ఫ్రీ అని చెప్పి బస్సులు సరిగా వేయకపోతే.. మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకోవాల్సి వస్తోంది. 9 ఏళ్లపాటు రెప్పపాటు పోని కరెంటు ఇప్పుడు ఎక్కడికి పోయింది? మిషన్ భగీరథ నీళ్లు ఏవి? మహిళలు మళ్లీ బిందెలు పట్టుకుని నీళ్ల కోసం పోవడం చూసి నా కళ్లలోకి నీళ్లు వస్తున్నాయి. నాలుగైదు నెలల్లోనే తెలంగాణ ఎందుకింత ఆగమైంది? ముస్లింలంతా కాంగ్రెస్‌కు ఓటేస్తే.. బీజేపీ గెలుస్తుంది. బీజేపీకో హఠానా చాహియే.. ఆ పని బీఆర్ఎస్తోనే సాధ్యం’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
నాడు తిట్లు.. నేడు కౌగిలింతలు!
సాక్షి, అమరావతి: చంద్రబాబుకు అధికారమే పరమావధి. ఇందుకోసం ఎవరినైనా వెన్నుపోటు పొడుస్తారు.. విమర్శిస్తారు.. వ్యతిరేకిస్తారు. విలువలు, సిద్ధాంతాలకు తిలోదకాలు ఇచ్చేస్తారు. మళ్లీ అవసరమైతే తాను తిట్టినవారి ఒళ్లోనే చేరతారు. సరిగ్గా ఐదేళ్ల క్రితం 2019 ఫిబ్రవరి 10న ప్రధాని నరేంద్ర మోదీ గుంటూరులో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. తాజాగా బుధవారం ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించిన విజయవాడ రోడ్డుపైనే నాడు టీడీపీ నేతలు ప్రధానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు.ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ నేతలు నల్ల జెండాలు ఎగరవేస్తూ ‘గో బ్యాక్ మోదీ’ అంటూ నినాదాలు చేశారు. ఈ ఘటనకు నాలుగైదు రోజుల ముందు చంద్రబాబు విజయవాడ బెంజి సర్కిల్లో నల్లచొక్కా తొడుక్కొని ధర్నా చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఘటనకు ఆరు నెలలు ముందే బీజేపీని వ్యతిరేకించి టీడీపీ ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వచ్చింది. 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన టీడీపీ మళ్లీ ఇప్పుడు 2024 ఎన్నికలకు కేవలం రెండు నెలల ముందు అదే బీజేపీతో పొత్తు పెట్టుకొని తిరిగి ఎన్డీఏ కూటమిలో చేరిపోవడం గమనార్హం. అధికారం కోసం చంద్రబాబు ఏ గడ్డిఅయినా కరుస్తారనడానికి ఈ ఉదంతం ఒక నిదర్శనం. నాడు ఎన్నికల ముందు బాబు డ్రామా.. 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకుని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. రాష్ట్ర ప్రభుత్వంలో బీజేపీ కూడా చేరింది. అలాగే కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ చేరి మంత్రి పదవులు కూడా తీసుకుంది. అయినప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరంకు నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులు, రైల్వే జోన్ ఇలా ఏ ముఖ్యమైన హామీని సాధించలేకపోయింది. ఇలా అయితే 2019 ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో ఎన్నికలకు ముందు ఎన్డీఏ నుంచి టీడీపీ వైదొలగింది. రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వనందుకు తప్పుకుంటున్నామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే ఇప్పుడు కూడా బీజేపీ ప్రత్యేక హోదాపై ఎలాంటి హామీ ఇవ్వలేదు. అయినప్పటికీ చంద్రబాబు ఎన్డీఏ కూటమిలో చేరారు. అప్పట్లో ‘నరేంద్ర మోదీ కరుడుకట్టిన ఉగ్రవాది. మంచివాడు కాదు. భార్యనే చూసుకోనివాడు, దేశాన్ని ఏం చూసుకుంటాడు’ అంటూ చంద్రబాబు వ్యక్తిగతంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. దీనికి తానేమీ తక్కువ తినలేదన్నట్టు ప్రధాని మోదీ సైతం ‘చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. అద్భుతమైన అమరావతి నిర్మాణమంటూ వ్యక్తిగత అభివృద్ధిలో బిజీ అయిపోయారు’ అంటూ విమర్శించారు. అంతేకాకుండా ‘పోలవరం ప్రాజెక్టును డబ్బులు డ్రా చేసిపెట్టే ఏటీఎం లాగానే చంద్రబాబు వాడుకుంటున్నారు’ అని తీవ్ర విమర్శలు చేశారు. నాడు ప్రధాని మోదీపై చంద్రబాబు వ్యక్తిగతంగా దారుణమైన విమర్శలు చేసి.. ఇప్పుడు అధికారమే పరమావధిగా పొత్తు పెట్టుకోవడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మోదీని ఉద్దేశించి చంద్రబాబు విమర్శలు.. దేశ రక్షణ రంగంలో అతిపెద్ద కుంభకోణంగా పేర్కొంటున్న రూ.59,000 కోట్ల రఫెల్ ఒప్పందం, అందుకు సంబంధించిన నివేదికలు, ఇందులో నేరుగా ప్రధాని కార్యాలయ ప్రమేయం ఉండే అవకాశాలు ఉన్నాయని పేర్కొంటున్నాయి. దానిపై ప్రధాని మోదీ మౌనంగా ఉన్నారు. ఇది బీజేపీ ప్రభుత్వ విధ్వంసక నిర్ణయాలను తెలియజేస్తోంది. మోదీ జీ మీరు దేశాన్ని మోసం చేసినప్పుడు సత్యాన్ని ఎక్కువ కాలం దాచలేరు. 2019 ఫిబ్రవరి 8న తన ట్విట్టర్లో మీకూ, బ్రిటిష్ వాళ్లకూ తేడా ఏమిటి? వాళ్లే నయం. కాటన్ దొర ఇచి్చన నీళ్లయినా తాగుతున్నాం. మేం మీ బానిసలమా? రాజధానిని 50 ఏళ్లకు నిరి్మస్తారా? నాలాంటి సీనియర్ నాయకుడు నల్ల చొక్కా వేసుకున్నారంటే వీళ్లు ఎంత దుర్మార్గంగా వ్యవహరించారో ప్రజలు అర్ధం చేసుకోవాలి. 2002లో మోదీ, నిన్న అమిత్‌షా రాజకీయాల్లోకి వచ్చారు. నేను 1978లోనే ఎమ్మెల్యేనయ్యా. ప్రధాని మోదీని సార్ అంటూ గౌరవిస్తే అమరావతికి మట్టి, నీరు ముఖాన కొట్టిపోతారా? –2019 ఫిబ్రవరి 2న శాసనసభలో ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రం కోసం 29 సార్లు తలవంచుకొని ఢిల్లీ వెళ్లా. కేంద్రం ముందు చేయి చాచా. ఎలాంటి కనికరం లేదు. ప్రజలుగా మీరు చెప్పండి. 2018 జూన్ 9న నెల్లూరు సభలో బీజేపీకి ఒకటే చెబుతున్నా.. టీడీపీతో పెట్టుకుంటే ఖబడ్డార్.. మీ కుట్రలు ఏ రాష్ట్రంలోనైనా చెల్లుతాయోమో.. ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం సాగవు. 2018లో శృంగవరపుకోటలో నేను ఎవరికీ భయపడేది లేదు. నరేంద్ర మోదీ, ఎన్డీఏ ప్రభుత్వం ఇబ్బందులు పెడితే భయపడే పిరికి పందను కాను. ఒక్కో రాష్ట్రంలో నాయకత్వాన్ని బలహీనపరచడానికి ఇష్టమొచ్చినట్టు ఆడుకోవడం వీళ్లకు అలవాటైంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సంక్షోభాలను చూశాను. ఎప్పుడు భయపడలేదు. భయమనేది నా జీవితంలో లేదు. 2018 మార్చి 6న విజయవాడలో విభజన హామీలను నాలుగు బడ్జెట్లలో పట్టించుకోలేదు. చివరి బడ్జెట్లోనూ ఏపీ పేరు పెట్టలేదు. కేంద్ర ప్రభుత్వం కనీస ప్రయత్నం చేయలేదు. –2018 మార్చి 7న వివిధ సందర్భాల్లో మోదీ చంద్రబాబునుద్దేశించి చేసిన విమర్శలు.. » అమరావతి నుంచి పోలవరం వరకు తన ఆస్తులు పెంచుకోవడం కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. సొంత ఆస్తులు పెంచుకునే ఆశ నాకు లేదు. ళీ ఎన్టీఆర్ ఏపీకి కాంగ్రెస్ నుంచి విముక్తి కావాలనుకున్నారు. అందువల్లే టీడీపీ ఆవిర్భవించింది. కానీ, ఈ రోజు కాంగ్రెస్ వారసత్వపు అహంకారాన్ని ఎదుర్కొవాల్సిన చంద్రబాబు అదే వంశపారంపర్య కుటుంబం ముందు మోకరిల్లారు. అప్పట్లో ఏపీని అవమానించిన కాంగ్రెస్‌ను దుష్టకాంగ్రెస్ అని ఎన్టీఆర్ అన్నారు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి (చంద్రబాబు) అదే కాంగ్రెస్‌తో దోస్తీ కట్టారు. » చంద్రబాబుకు ఏమైంది? ఆయన నా కంటే చాలా సీనియర్‌నని మళ్లీ మళ్లీ నాకు గుర్తు చేస్తుంటారు. ఇందులో వివాదం ఏముంది? మీరు (చంద్రబాబు) సీనియర్. అందువల్లే గౌరవమిచ్చే విషయంలో ఎప్పుడూ తక్కువ చేయలేదు. కానీ, మీరు సీనియర్.. కూటములు మార్చడంలో.. కొత్త కూటములు కట్టడంలో.. మీ సొంత మామకు వెన్నుపోటు పొడవడంలో.. ఈ రోజు ఎవరిని తిడతారో.. రేపు వారి ఒళ్లోనే కూర్చోవడంలో. నేనైతే ఈ విషయాల్లో సీనియర్‌ను కానే కాదు. చంద్రబాబు చేస్తున్నది అమరావతి నిర్మాణం కాదు.. కూలిపోతున్న తన పార్టీ నిర్మాణం. –2019 ఫిబ్రవరి 10న గుంటూరులో ప్రధాని మోదీ » కేంద్రం అన్ని రకాల సహాయ సహకారాలు అందించినప్పటికీ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనే చిత్తశుద్ధి మాత్రం ఈ ప్రభుత్వానికి లేదు. ఎప్పుటికప్పుడు ప్రాజెక్టు ఖర్చు అంచనాలు పెంచుతూ, ఎక్కువ నిధులు పొందుతున్నారు. పోలవరం ప్రాజెక్టు ఇప్పుడు మనల్ని పరిపాలిస్తున్న నాయకుల (చంద్రబాబు)కు ఒక ఏటీఎం లాంటిది. అందులో నుంచి డబ్బులు తీసేసుకోవడమే. ఈ రకంగా పోలవరం ప్రాజెక్టు అంచనాలు పెంచడం ద్వారా ఎవరికి మేలు చేయాలని యూటర్న్ బాబు అనుకుంటున్నారో మీ అందరికీ తెలుసు. » ప్రజలు రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచించేవారైతే.. ఇక్కడి యూటర్న్ బాబు మాత్రం తన కుటుంబం మొదట, ఆ తర్వాత తన అనుయాయులు అన్నట్టు పాలన సాగిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల హెరిటేజ్ (సంస్కృతి) మంచి పాలనతో అభివృద్ధి చెందాలని. కానీ యూటర్న్ బాబు నైజం మాత్రం తన సొంత హెరిటేజ్ (చంద్రబాబు కుటుంబీకుల వ్యాపార సంస్థ పేరు) కంపెనీ బాగుంటే చాలన్న తీరు. – 2019 ఏప్రిల్ 1న రాజమండ్రి ఎన్నికల సభలో ప్రధాని మోదీ -
గుర్తుందా.. సింగిల్ ‘హ్యాండ్’!
ఖమ్మం వన్‌టౌన్: ‘అందరికీ గుర్తుందా.. చేయి గుర్తు.. సేవాభావం కలిగిన కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డిని గెలిపించుకుంటే ప్రజ లకు ఉపయోగపడే పనులు చేయడమే కాక అభివృద్ధికి పాటుపడతారని ఆయన వియ్యంకుడు, సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ తెలిపారు. రఘురాంరెడ్డి తరఫున మంగళవారం ఖమ్మంలో నిర్వహించిన రోడ్డుషోలో ఆయన పాల్గొన్నారు. సాయంత్రం 6గంటలకు మయూరిసెంటర్ వద్ద ప్రారంభమైన రోడ్డుషో పాత ఎల్ఐసీ ఆఫీస్, జెడ్పీ సెంటర్, ప్రభుత్వ ఆస్పత్రి, ఇల్లెందు క్రాస్‌రోడ్డు వరకు కొనసాగింది. మార్గమధ్యలో జెడ్పీ సెంటర్, ఇల్లెందు క్రాస్‌రోడ్డు వద్ద జరిగిన కార్నర్ మీటింగ్‌లో వెంకటేష్ మాట్లాడుతూ అందరూ ఓటు వేయడాన్ని బాధ్యతగా భావించాలని సూచించారు. ‘ఎనీటైం... ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్ రఘురాంరెడ్డి.. కమాన్ ఖమ్మం’ అంటూ తన సినిమాల్లోని డైలాగ్‌లతో వెంకటేష్ ఆకట్టుకోగా ఆయనను చూసేందుకు రహదారి పొడవునా జనం బారులు దీరారు. అలాగే, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ శ్రేణులు సైతం భారీగా తరలివచ్చాయి అనంతరం రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడగా ఎంపీ రేణుకాచౌదరి, అభ్యర్ధి రామసహాయం రఘురాంరెడ్డితో పాటు తుమ్మల యుగంధర్, బాలసాని లక్ష్మీనారాయణ, మహ్మద్ జావీద్, కమర్తపు మురళి, పాలెపు విజయలక్ష్మి, రాపర్తి శరత్, దొబ్బల సౌజన్య, విజయాబాయి, నాగండ్ల దీపక్‌చౌదరి, తుంబూరు దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇచ్చాపురంలో సీఎం జగన్ రోడ్ షో, ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
-
బాలయ్య.. ఇదేం బాలేదయ్యా..!
కంచరపాలెం: అసలే నందమూరి నటసింహం..ఆయన సభకు జనం లేకపోతే టీడీపీ స్థానిక నేతలకు దబిడి దిబిడే. కాళ్లోవేళ్లో పట్టుకుని మనిషికి రూ.200 ఇచ్చి మరీ టీడీపీ నేతలు జనసమీకరణ చేశారు. అయితే బాలయ్య తనమార్కు డైలాగ్‌లతో ప్రజలను విసిగించాడు. మరీ ఆనాడు...అంటూ ప్రారంభించి తలాతోకలేని మాటలతో విసుగుతెప్పించాడు. కంచరపాలెం మెట్టు ప్రధాన రహదారిపై శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ 5.45 గంటలకు ప్రారంభించాల్సి ఉండగా..రాత్రి 7.20 గంటలకు బాలకృష్ణ రావడంతో జనం రోడ్లపై నిలబడలేక ఊసూరుమన్నారు. మైక్ అందుకున్న బాలయ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బదులు సీఎం జీవన్ అంటూ నోరుతిరగని పదాలతో జనాన్ని అయోమయంలో పడేశాడు. స్థానిక టీడీపీ, బీజేపీ అభ్యర్థుల కోసం కాకుండా తన తండ్రి ఎన్టీఆర్ సేవల గురించి చెప్పుకున్నాడు. చంద్రబాబు కోసం అంతంత మాత్రమే మాట్లాడగా.. ఇక పవన్ కల్యాణ్ గురించి అసలు ప్రస్తావనే లేదు. రాష్ట్రాభివృద్ధి కోసం టీడీపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. అర్థం కాని మాటలు, సినీ డైలాగ్‌లతో బాలకృష్ణ బోర్ కొట్టించాడు. ఐటీఐ కూడలిలో బాలకృష్ణకు పూలదండ వేసేందుకు భారీ క్రేన్‌ను టీడీపీ నాయకులు అడ్డంగా పెట్టడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సభా వేదిక వద్ద టీడీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచార రథాలపై మహిళలు సినీ గీతాలకు డ్యాన్స్ చేస్తున్నా.. పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించారు. బీఆర్టీఎస్ రోడ్డులో కార్యకర్తలు అడ్డంగా ఉండటంతో అంబులెన్స్ వెళ్లేందుకు దారి లేక చాలాసేపు అక్కడే నిలిచిపోయింది. -
స్పీడందుకున్న కారు..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాస్త వెనుకంజగా కనిపించిన కారు పార్టీలో తిరిగి కొత్త జోరు కనిపిస్తోంది. పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగడం బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపుతోంది. కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర, రోడ్ షోలకు ప్రజల నుంచి వస్తున్న స్పందనతో పార్టీకి పునరై్వభవం వస్తుందన్న ధీమా కనిపిస్తోందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయమైన సీట్లు సాధించినా.. కొందరు నేతలు పార్టీని వీడటం, ఎంపీలు కూడా పార్టీని వీడి ఇతర పార్టీల తరఫున లోక్‌సభ అభ్యర్థులుగా బరిలోకి దిగడంతో పార్టీ శ్రేణుల్లో కొంత నిరుత్సాహం కనిపించిందని అంటున్నాయి. కానీ కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర, తన ప్రసంగాల్లో కాంగ్రెస్, బీజేపీలపై సంధిస్తున్న విమర్శనా్రస్తాలు.. ఉద్యమకాలం నాటి సభలను తలపిస్తున్నాయని నేతలు చెప్తున్నారు. కేసీఆర్ ఎక్కడికి వెళ్లినా, ఎవరితో మాట్లాడినా.. మళ్లీ మీరే సీఎంగా రావాలని ప్రజలు కోరుకుంటున్నారని అంటున్నారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ గణనీయమైన స్థాయిలోనే లోక్‌సభ స్థానాలను గెలుచుకుంటుందన్న నమ్మకం వస్తోందని కార్యకర్తలు ఆశావహంగా ఉన్నారు. జనం నుంచి మంచి స్పందనతో.. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భారీ బహిరంగ సభలకు బదులు క్షేత్రస్థాయి కార్యక్రమాలకే కేసీఆర్ మొగ్గుచూపారు. ఈ మేరకు ఏప్రిల్ 24 నుంచి మే 10 వరకు 17 రోజులపాటు బస్సుయాత్ర, రోడ్ షోలకు ప్రణాళిక రూపొందించారు. కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్రకు ప్రజల్లో మంచి స్పందన కనిపించడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపింది.కేసీఆర్‌కు మహిళలు మంగళ హారతులు, డప్పులు, బతుకమ్మలు, బోనాలతో స్వాగతం పలుకుతున్నారని.. బస్సుయాత్ర సాగే మార్గంలో రైతులు, యువకులు కేసీఆర్‌ను చూసేందుకు, కలిసేందుకు ఆసక్తి చూపుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌ల కోసం పార్టీపరంగా జన సమీకరణ చేస్తున్నా.. అంచనాలకు మించి జనం కూడా వస్తున్నారని అంటున్నాయి. స్థానికులతో మమేకం.. రాత్రి బసతోనూ.. బస్సుయాత్రలో భాగంగా మార్గమధ్యలో రైతులతో, వివిధ వర్గాలతో కేసీఆర్ భేటీ అవుతున్నారు. రోడ్డు పక్కన హోటళ్ల వద్ద ఆగి చాయ్ తాగుతూ, స్థానికులతో మాట్లాడుతున్నారు. స్థానిక సమస్యలపై ఆరా తీస్తున్నారు. రైతులతో ముచ్చటిస్తూ, వారి సమస్యలను తెలుసుకుంటూ.. తాను చేస్తున్న పోరాటంలో కలసి రావాలని పిలుపునిస్తున్నారు. మరోవైపు రోడ్ షోలు ముగిసిన తర్వాత కేసీఆర్ స్థానికంగా బస చేస్తున్నారు.ఆ సమయంలో, మరుసటి రోజు ఉదయం.. స్థానిక నేతలు, న్యాయవాదులు, వైద్యులు, వివిధ రంగాలకు చెందిన వారితో మాట్లాడుతున్నారు. స్థానికంగా ముఖ్య నేతల నివాసానికి వెళ్లి కలుస్తున్నారు. ఇలాంటివన్నీ ప్రజలను మరింతగా ఆకట్టుకుంటున్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు. పార్టీలో సమన్వయం.. ప్రచార వ్యూహాలు కూడారాత్రి బస వద్ద సంబంధిత లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు, ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అవుతున్నారు. ప్రచార తీరుతెన్నులపై సమీక్షిస్తున్నారు. బూత్ స్థాయి వరకు ప్రచారంతోపాటు గెలుపు వ్యూహాలపై దిశానిర్దేశం చేస్తున్నారు. కేసీఆర్ నేరుగా కలసి చేస్తున్న సూచనలతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహకం కనిపిస్తోందని అంటున్నారు.ఈ క్రమంలోనే బస్సుయాత్ర, రోడ్ షోలను విజయవంతం చేసేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారని.. నియోజకవర్గాల్లో తమ సత్తా చూపాలని ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు భావిస్తున్నారని చెప్తున్నారు. కాంగ్రెస్, బీజేపీపై విమర్శనా్రస్తాలతో.. జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలను లక్ష్యంగా చేసుకుని కేసీఆర్ విమర్శనాస్త్రాలు సంధిస్తుండటం.. తన ప్రసంగాల్లో వ్యవసాయం, రైతుల సమస్యలను ప్రస్తావిస్తుండటం ఆకట్టుకుంటోందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. రుణమాఫీ, రైతుబంధు, వరికి రూ.500 బోనస్, విద్యుత్, తాగునీరు, సాగునీటి సమస్యలను ఎత్తిచూపుతూ.. బీఆర్ఎస్ హయాంలో తాము చేపట్టిన చర్యలను వివరిస్తూ.. కేసీఆర్ చేస్తున్న ప్రసంగాలు జోష్ నింపుతున్నాయని అంటున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్కు ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే.. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు మెడలు వంచి హామీలు అమలు చేయిస్తామని చెప్పడం ప్రభావం చూపుతోందని చెప్తున్నాయి. ఎక్కువ ఎంపీ సీట్లు సాధిస్తామనే ధీమా! లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదంటూ కాంగ్రెస్, బీజేపీ రెండూ కూడా ప్రచార ఆరంభంలో విమర్శలు చేశాయి. కానీ కేసీఆర్ బస్సుయాత్ర, ప్రజా స్పందనతో ఆ అభిప్రాయాన్ని మార్చేశారన్న వాదన వినిపిస్తోంది. మొదట్లో బీఆర్ఎస్కు 8 సీట్లలో సానుకూలత ఉందని చెప్పిన కేసీఆర్.. ఇప్పుడు 12 సీట్ల వరకు వస్తాయని చెప్తుండటం గమనార్హం. ఈసారి కేంద్రంలో ఏ కూటమికీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశం లేదని, బీఆర్ఎస్కు ఎక్కువ ఎంపీ సీట్లు ఇస్తే సంకీర్ణ ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తామని కూడా అంటున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మొదలైన వ్యతిరేకత తమకు అనుకూలిస్తుందని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కొన్ని సర్వే సంస్థలు బీఆర్ఎస్కు 8 నుంచి 12 సీట్లు వస్తాయని చెప్తున్నాయని ఉదహరిస్తున్నారు. ఈసీ నిషేధంతో కాస్త లాభమే! కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ విధించిన 48 గంటల నిషేధం కూడా బీఆర్ఎస్కు కాస్త అనుకూల పరిస్థితిని సృష్టించిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని ఈ చర్య కలిగించిందని అంటున్నాయి. దీనిపై ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల పెద్ద ఎత్తున సానుకూల చర్చ జరిగిందని.. పార్టీ శ్రేణుల్లోనూ పట్టుదలను పెంచిందని వివరిస్తున్నాయి. ఈసీ నిషేధంతో కాస్త లాభమే! కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఎన్నికల కమిషన్ విధించిన 48 గంటల నిషేధం కూడా బీఆర్ఎస్కు కాస్త అనుకూల పరిస్థితిని సృష్టించిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బీఆర్ఎస్ పట్ల, కేసీఆర్ పట్ల కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాన్ని ఈ చర్య కలిగించిందని అంటున్నాయి. దీనిపై ప్రజల్లో బీఆర్ఎస్ పట్ల పెద్ద ఎత్తున సానుకూల చర్చ జరిగిందని.. పార్టీ శ్రేణుల్లోనూ పట్టుదలను పెంచిందని వివరిస్తున్నాయి. -
ప్రశ్నిస్తే.. గొంతు నొక్కారు!
సాక్షి, పెద్దపల్లి: చేనేత కార్మికులకు అన్యాయం చేస్తున్నారని తాను మాట్లాడితే, ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తే.. తన గొంతు నొక్కేశారని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు కుమ్మక్కై తన ప్రచారంపై నిషేధం పెట్టించారని ఆరోపించారు. అదే ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, సీఎం రేవంత్ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి మాట్లాడుతున్నా ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదేమని నిలదీశారు.బీజేపీ, కాంగ్రెస్‌లలో ఎవరికి ఓటేసినా.. సింగరేణిని ముంచేసి, కార్మికుల నోట్లో మట్టికొడతాయని వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ చేపట్టిన బస్సుయాత్ర.. ఈసీ పెట్టిన 48 గంటల నిషేధం అనంతరం శుక్రవారం రాత్రి రామగుండం పట్టణంలో తిరిగి మొదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన రోడ్ షోలో కేసీఆర్ ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘నిషేధించిన నా గొంతు 48 గంటల తర్వాత మాట్లాడుతోంది. నేను ఏం చేశానని నా గొంతును నొక్కేశారు. చేనేత కార్మికులకు ఆర్డర్స్ ఇవ్వడం లేదని, గత ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ల బిల్లులు రూ.375 కోట్లు విడుదల చేయడం లేదని, ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మా పార్టీ నేతలు ప్రశ్నిస్తే.. ఓ కాంగ్రెస్ నాయకుడు.. ‘ఇన్ని రోజులు దొబ్బితిన్నది చాలలేదా? పొయి నిరో«ద్లు, పాపడాలు అమ్ముకోండి’ అన్నడు. మీకు చేనేత కార్మికులు అంత చులకనగా కనపడుతున్నారా? అధికారంలో ఉన్న మీరు ఇలా మాట్లాడొచ్చా.. అని కోపంలో ఒక్కమాట మాట్లాడిన. వాళ్ల మాటలు ఈసీకి కనిపించవు కేసీఆర్ బస్సుయాత్ర చేపడితే కాంగ్రెస్, బీజేపీలకు గుండెలు వణుకుతున్నాయి. వాళ్లు కుమ్మకై నన్ను ఆగబట్టేందుకు నాపై నిషేధం పెట్టారు. రాజకీయాల్లో మతం గురించి మాట్లాడటం చాలా పెద్ద తప్పు. ఎన్నికల నిబంధనలకు విరుద్ధం. కేంద్ర మంత్రి అమిత్ షా రోజూ దేవుడి బొమ్మను చేతిలో, నెత్తిన పెట్టుకుని మాట్లాడితే ఎన్నికల సంఘానికి కనిపించదు. డైరెక్టుగానే హిందువులు, ముస్లింలని దేశ ప్రధాని మోదీ మాట్లాడినా కనిపించదు.రాష్ట్ర సీఎంని ప్రజ లకు ఇచ్చిన వాగ్ధానాల అమలు ఏదని మేం అడిగితే.. గుడ్లు పీకి గోళీలు ఆడుతం, పేగులు తీసి మెడలో వేసుకుంటం, పండబెట్టి తొక్కుతం అంటే సభ్యతగా ఉందా? కానీ చేనేత కార్మికులకు అన్యాయం చేస్తున్నారని నేను మాట్లాడితే.. నా గొంతు నొక్కేశారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించారు. పంటలు ఎందుకు ఎండాయి? ఐదు నెలల కింద రాష్ట్రం ఎట్లా ఉండే.. ఇప్పుడు ఎట్లా ఉంది? ఎవరి చేతకానితనం దీనికి కారణం? ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే 50వేల ఎకరాలకుపైగా పంటలు ఎండిపోయాయి. గత పదేళ్లలో ఎప్పుడైనా పంటలు ఎండాయా? గత తొమ్మిదేళ్లు కడుపు నిండా కరెంటు ఉండేది. ఇప్పుడు కరెంట్ కోతలు మొదలయ్యాయి.ఈ కోతలు ఎవరు పెట్టారో ప్రజలు ఆలోచించాలి. గతంలో గోదావరిలో పైసలు వేయాలంటే నీళ్లు వెతికేలా ఉండేది. అలాంటి గోదావరిని సజీవంగా చేశా. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చినం. ఇప్పుడు ఎందుకు రోజు తప్పి రోజు నీళ్లు వస్తున్నాయో ప్రజలు ఆలోచించాలి. హామీల అమలు ఏది? కాంగ్రెస్ హామీలు అమలు చేయకుండా తప్పించుకుంటోంది. రైతు రుణమాఫీ అయిందా? రైతు కూలీలకు రూ.15 వేలు ఎక్కడ? కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఎక్కడ? మహిళలకు నెలకు రూ.2,500 వస్తున్నాయా? మహిళలకు ఫ్రీ బస్ పెట్టారు. సంతోషమే. మరి ఆటో కార్మికులు నష్టపో యి ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. ఆదుకోరా? ఆటోకార్మికులకు న్యాయం జరగాల్సిందే. వారి తరఫున బీఆర్ఎస్ పో రాడుతుంది. సీఎం ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడి మీద ఒ ట్టేస్తున్నారు. పనిచేసేటోడు ఎవడైనా ఒట్టు పెట్టుకుంటడా? పెద్ద ప్రమాదం రాబోతున్నా.. సీఎం మాట్లాడట్లేదు.. ఇప్పుడున్న సీఎం కృష్ణా నదిని తీసుకెళ్లి కేఆర్ఎంబీకి అప్పజెప్పిండు. గోదావరి నీళ్లు ఎత్తుకుపోతా, తమిళనాడు, కర్ణాటకలకు ఇస్తానని ప్రధాని మోదీ అంటుంటే.. చప్పుడు చేయడం లేదు. నేను సీఎంగా ఉన్నప్పుడు ఇదే ప్రతిపాదన తెస్తే.. నా ప్రాణం ఉన్నంత వరకు నీళ్లు తీసుకుపోనివ్వనని చెప్పిన. మరి ఈ ముఖ్యమంత్రి మౌనం వెనుక మతలబేంటో ప్రజలు ఆలోచించాలి. కేంద్రంలో వచ్చేది సంకీర్ణమే.. దేశం అప్పుల పాలైంది. రూపాయి విలువ పడిపోయింది. మోదీ కంటే ముందున్న 14 మంది ప్రధానుల కాలంలో ఎన్నడూ ఇంత తక్కువకు పడిపోలేదు. పబ్లిక్ సెక్టార్ నాశనమైంది. అన్నీ ప్రైవేటీకరణ చేస్తున్నారు. కార్మికులు రోడ్డున పడుతున్నారు. కేంద్రంలో బీజేపీకి 200 సీట్లు కూడా వచ్చేలా లేవు. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే. తెలంగాణలో 14 మంది బీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే.. మన హక్కులను, మన సింగరేణిని కాపాడుకోవచ్చు.అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌కు కర్రువాల్చి వాత పెట్టాలి..’’ అని కేసీఆర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, జడ్పీ చైర్మన్ పుట్ట మధు, మాజీ ఎమ్మెల్యేలు కోరుకంటి చందర్, దాసరి మనోహర్‌రెడ్డి, బాల్క సుమన్, ఎమ్మెల్సీ భానుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణిని ముంచిందే కాంగ్రెస్ సింగరేణి కార్మికులు ఆలోచించాలి. మంచిగా ఉన్న సింగరేణిని ఒకప్పుడు నిండా ముంచిందే కాంగ్రెస్ పార్టీ. వాస్తవానికి సింగరేణి 100శాతం మన దగ్గరే ఉండే. కేంద్రం దగ్గర అప్పులు తెచ్చి, అది తీర్చలేక 49శాతం వాటాను అప్పజెప్పింది ఈ కాంగ్రెస్ పార్టీయే. మేం సింగరేణికి లాభాలు తేవడానికి, కార్మికుల కోసం ఎన్నో మంచి పనులు చేశాం. సీపీఐ, సీపీఎం నాయకులను ఒక్కటే ప్రశ్న అడుగుతున్నా.. ధైర్యముంటే సమాధానం చెప్పాలి, సీఎంతో సమాధానం చెప్పించాలి.నాడు నష్టాల్లో ఉన్న సింగరేణిని లాభాల్లోకి తెచ్చింది మేం కాదా? తెలంగాణ ప్రభుత్వం వచ్చాక 19వేల మంది కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చాం. మెడికల్ కాలేజీ పెట్టి కార్మికుల పిల్లలకు 5శాతం రిజర్వేషన్ కలి్పంచాం. సింగరేణిని లాభాల్లోకి తెచ్చేందుకు డైరెక్టర్లను ఆ్రస్టేలియా, ఇండోనేషియాలకు పంపి.. అక్కడ బొగ్గు గనులు తీసుకుని వెలికితీయాలనే ప్రయత్నం చేశాం. కానీ కేంద్ర ప్రభుత్వం సింగరేణిని అదానీకి అప్పజెప్పి మన కార్మికుల నోట్లో మట్టి కొట్టాలని చూస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌లలో ఎవరిని గెలిపించినా సింగరేణి ప్రాంతాలు బొగ్గు అయ్యే పరిస్థితి. మీరు లేని లోటు కనిపిస్తోందిసారూ మీరు సీఎంగా ఉన్నప్పుడు మంచిగుండె. ఇప్పుడు మీరు లేని లోటు కనిపిస్తోంది. పచ్చగా ఉండే పల్లెలు మళ్లీ ఎండిపోతున్నాయి. మాకు దిక్కు, దిశ మీరే.. మీరు మళ్లీ వస్తేనే మా బతుకులు మారుతాయి. – రేణుక, గృహిణిమళ్లీ కరువు వచ్చిందిమీ పాలనలో పచ్చని పొలాలు చూసినం. ఇప్పుడు ఎండిపోయిన పంటలు కనిపిస్తు న్నాయి. మీ పాలన లేని లోటు కనిపిస్తోంది. రైతుబంధు రాలే దు. నీళ్ల కరువు వచ్చింది. మీరు రావాలె. మునుపటిలా కావాలె.. – బొల్లెడ సడవలి, భూపాలజిల్లామాకు అండగా నిలవాలికొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో నేడు కరువు ప్రారంభమైంది. మీ పాలనలో కల్యాణలక్ష్మి, దళి త బంధు పథకాలు వచ్చినయి. ఇప్పుడు వాటిని నిలిపివేశారు. మీ పాలనలో అందరికీ న్యాయం జరి గింది. ఇప్పుడు కష్టాలు మొదలయ్యాయి. మాకు అండగా ఉండాలి.– కృష్ణప్రసాద్, యువకుడు -
నేటి నుంచి మళ్లీ కేసీఆర్ ప్రచారం..
సాక్షి, హైదరాబాద్: భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు ఎన్నికల ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధం శుక్రవారం రాత్రి 8 గంటలకు ముగియనుంది. ఆ తర్వాత వెంటనే బస్సుయాత్ర తిరిగి ప్రారంభించాలని కేసీఆర్ నిర్ణయించారు. గతంలో బీఆర్ఎస్ రూపొందించిన షెడ్యూల్ మేరకు శుక్రవారం రాత్రి రామగుండంలో రోడ్ షోకు కేసీఆర్ హాజరవుతారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు బుధవారం రాత్రి 8 గంటలకు ప్రచారం నిలిపివేసిన కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలోని తన నివాసానికి చేరుకున్న విషయం తెలిసిందే. కాగా ఎన్నికల ప్రచారాన్ని తిరిగి ప్రారంభించేందుకు గాను శుక్రవారం మధ్యాహ్నం బయలుదేరనున్న కేసీఆర్ రాత్రికి రామగుండం చేరుకుని రోడ్ షోలో పాల్గొంటారు. రాత్రికి అక్కడే బస చేసి శనివారం సాయంత్రం మంచిర్యాలలో, ఆదివారం జగిత్యాలలో జరిగే రోడ్ షోల్లో పాల్గొంటారు. ఈ నెల 10వ తేదీ వరకు గతంలో నిర్ణయించిన షెడ్యూలుకు అనుగుణంగానే కేసీఆర్ బస్సు యాత్ర కొనసాగుతుందని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 10న సిరిసిల్లలో రోడ్‌షో, సిద్దిపేటలో బహిరంగ సభతో కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల ప్రచారం ముగుస్తుంది. గురువారం జమ్మికుంట, వీణవంకలో రోడ్ షోలు నిర్వహించాల్సి ఉండగా, ఈసీ ఆదేశాలతో నిలిపివేసిన విషయం తెలిసిందే. ప్రజా స్పందన ఎలా ఉంది? బుధవారం రాత్రి ఫామ్‌హౌస్‌కు చేరుకున్న కేసీఆర్ గురువారం పార్టీ అభ్యర్థులు, నేతలతో ఫోన్ ద్వారా మాట్లాడి పార్టీ ఎన్నికల ప్రచార సరళిని సమీక్షించారు. ఇప్పటివరకు బస్సుయాత్ర, రోడ్ షోలు జరిగిన ప్రాంతాల్లో ప్రజల నుంచి వస్తున్న స్పందనపై ఆరా తీశారు. రాబోయే వారం రోజుల పాటు చేయాల్సిన ప్రచారంపై దిశా నిర్దేశం చేశారు. ప్రచార లోపాలను సరిదిద్దుకుని పార్టీ యంత్రాంగంతో మరింత సమన్వయం చేసుకోవాలని సూచించారు. తాజా సర్వేల ప్రకారం బీఆర్ఎస్కు 10 నుంచి 12 సీట్లు వచ్చే అవకాశముందని వెల్లడించారు. పార్టీ కేడర్‌లో ఉత్సాహం నింపాలని, కాంగ్రెస్, బీజేపీ విధానాలతో జరిగే నష్టాన్ని మరింత లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. -
కాంగ్రెస్, బీజేపీలకు ఓటేస్తే గోదాట్లో వేసినట్లే: కేసీఆర్
సాక్షి, భద్రాద్రికొత్తగూడెంజిల్లా: ప్రాణమున్నంత వరకు తెలంగాణ హక్కుల కోసం పోరాడతానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కొత్తగూడెంలో(ఏప్రిల్30) నిర్వహించిన లోక్‌సభ ఎన్నికల ప్రచార రోడ్‌షోలో కేసీఆర్ మాట్లాడారు. ఫ్రీ బస్సు పెట్టి ఈ ప్రభుత్వం ఆటో కార్మికులను ఆగం చేసిందని మండిపడ్డారు. మోదీ, రేవంత్ ఒక్కటేనని వారికి ఓటేస్తే గోదావరిలో వేసినట్లేనన్నారు. ‘కొత్తగూడెంను జిల్లా చేయడానికి కారణం మారుమూల గిరిజన, ఆదివాసీలకు న్యాయం జరగాలని, పాలన అందాలని జిల్లా చేశాం. కొత్తగూడెంలో మెడికల్ కాలేజ్, ఇంజినీరింగ్ కాలేజ్‌తో పాటు పట్టణాన్ని అభివృద్ధి చేసుకున్నాం. రేవంత్ రెడ్డి కొత్తగూడెం జిల్లాను రద్దు చేయాలని చూస్తున్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి, దొంగ పథకాలతో ప్రజలను మోసం చేశారు.రైతు బంధు 15వేలు ఇస్తామని అన్నారు, కానీ ఇప్పుడు ఒక్క రూపాయి అయిన ఇచ్చాడా. కళ్యాణ లక్ష్మి తులం బంగారం, మహిళలకు నెలకు రూ. 2,500, రూ. 2 లక్షల రుణమాఫీ ఇలాంటి హామీలు అటకెక్కాయి. బీఆర్ఎస్ పాలనలో ఒక్క క్షణము కరెంట్ కోత లేదు. ఇప్పుడు కరెంట్ లేనే లేదు. పినపాక లాంటి నియోజకవర్గ పరిధిలోని ఆదివాసీ, గిరిజన గూడేలకు మిషన్ భగీరథ రావట్లేదు. వేల మందికి పోడు పట్టాలు ఇచ్చినం.గిరిజనులకు, మైనారిటీలకు గురుకులాలు పెట్టి విద్యలో సమూల మార్పు తెచ్చాం. ఓవర్సీస్ స్కాలర్ షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్లు నిలిచిపోయాయి. గిరిజన బిడ్డల కోసం కోట్ల రూపాయల ఖర్చుతో గిరిజన భవనాలు కట్టించాం. సింగరేణి బిడ్డలకు స్పెషల్ ఇంక్రిమెంట్లు, బోనస్‌లు ఇచ్చాం. సింగరేణిని ముంచే పనిలో చోటే భాయ్ రేవంత్ రెడ్డి, బడే భాయ్ నరేంద్ర మోదీ ఉన్నారు. పదేళ్ల క్రితం గద్దెనెక్కిన మోదీ భేటి పడావ్ భేటి బచావ్ ఏమైంది. నరేంద్రమోదీ దుర్మార్గ పాలన, మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. గోదావరి నదిని ఇచ్చంపల్లి నుంచి వేరే రాష్ట్రాలకు తరలించే కుట్ర చేస్తున్నారు. విద్యావంతులు, యువకులు ఆలోచించాలి. ఇప్పుడు రాష్ట్రంలో జీవన్మరణ సమస్య ఏర్పడింది. తెలంగాణను నాశనం చేసే పని మోదీ చేస్తున్నా రేవంత్ ఎందుకు మాట్లాడట్లేదు. తెలంగాణలో మోటర్లకు మీటర్లు పెట్టాలి అని చెప్తే నేను ఒప్పుకోలేదు. ఫ్రీ బస్సు పెట్టి ఆటో కార్మికులను రోడ్డున పడేశారు. గురుకులంలో కరీంనగర్లో బాలిక చనిపోతే రేవంత్ నోరు మెదపడం లేదు. కేంద్రం, రాష్ట్రం మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రాణాలు పణంగా పెట్టి తెలంగాణ తెచ్చిన, హిందు ముస్లిం గొడవలు లేకుండా శాంతిభద్రతలతో రాష్ట్రాన్ని పరిపాలించాం. కాంగ్రెస్- బీజేపీ రెండు ఒక్కటే అని ముస్లిం సోదరులు గమనించాలి. బీఆర్ఎస్ ఒక్కటే మతసామరస్యం కాపాడుతుంది’ అని కేసీఆర్ అన్నారు. -
ఎన్టీఆర్ మించి సంక్షేమ పథకాలు అమలు చేశాం: కేసీఆర్
-
బీఆర్ఎస్ గెలిచే ఎంపీ సీట్లు అవే: కేసీఆర్
ఖమ్మం,సాక్షి: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ పని గోవిందా అని బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. బీజేపీకి 200 సీట్లు కూడా రావని సర్వేలు చెబుతున్నాయన్నారు. బీజేపీకి ఓటు వేస్తే గోదావరిలో వేసినట్లేనన్నారు. ఖమ్మంలో సోమవారం(ఏప్రిల్29) రోడ్‌షోలో కేసీఆర్ మాట్లాడారు.‘తల లేని బీజేపీ కేంద్ర మంత్రి ఒకరు తెలంగాణ ప్రజల్ని నూకలు తినమన్నాడు. తెలంగాణలో బీజేపీ నుంచి కేంద్ర మంత్రి,ముగ్గురు ఎంపీలు ఉండి వృథా. మోదీ గోదావరి నీళ్లను ఎత్తుకు పోతా అంటుంటే తెలంగాణ బీజేపీ నోరు మెదపడం లేదు. వరిలో పంజాబ్‌ను తలదన్నే స్థాయిలోకి తెలంగాణను తీసుకెళ్లా. నేను గోదావరిలో మన వాటా ఇచ్చే వరకు చుక్క నీరు తీసుకెళ్లనివ్వనన్నాను.బీఆర్ఎస్ 12 పార్లమెంటు స్థానాలు గెలవబోతోంది. గోదావరి,కృష్ణా జలాలతో పాటు అనేక హక్కులు సాధించడం కోసం బీఆర్ఎస్ అవసరం.ఆమరణ నిరహర దీక్ష చేసిన సమయంలో ఖమ్మం ప్రజలు,న్యూ డెమోక్రసీ నేతలు ఉద్యమానికి మద్దతుగా నిలిచారు.మేం దళారి వ్యవస్థ లేకుండా ధాన్యం కొనుగోలు చేశాం. రేవంత్ రెడ్డి నోటికి మొక్కాలి..అడ్డగోలు హామీలు ఇస్తున్నాడు.దళిత బంధు,రైతు బంధు అడిగితే కాంగ్రెస్ చెప్పుతో కొడతా అంటుంది.నేటి ప్రభుత్వంలో కరెంట్ కోతలున్నాయి.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కాదు వట్టి విక్రమార్క.ఉస్మానియా హస్టల్లో కనీస సదుపాయాలు లేకుండా చేశాడు.డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తానని సీఎం మాట తప్పాడు. భద్రాచలం రామయ్య మీద,యాదాద్రి నర్సన్న మీద ఒట్లు వేయడం తప్ప సీఎం ఏమి చేయడం లేదు. నన్ను రకరకాలుగా దుర్భాషలాడుతున్న ముఖ్యమంత్రి నీ భాష ఇదేనా.జైళ్లకు,తోక మట్టలకు కేసిఆర్ భయపడడు. బీజేపీ వాళ్లే చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తెల్లారి ముఖ్యమంత్రి బీజేపీలోకి జంప్ కొడతాడని అంటున్నారు.వారి మాటలకు రేవంత్ ఖండన ఇవ్వకపోవడం వెనుక ఆంతర్యం ఏంటో తెలియదు.పదేళ్లలో ఒక్క ఎకరా ఎండనివ్వలేదు. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకు వచ్చాను. ఖమ్మం పట్టణంలో మూడు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయి.దేశం,రాష్ట్రం యువతది.ఖమ్మం చైతన్యవంతమైన జిల్లా.ఇక్కడి నుంచే పోరాటం మొదలవ్వాలి.గత ప్రభుత్వ హయాంలో ఒక్క మెడికల్ కాలేజీ రాలేదు. బీఆర్ఎస్ హయాంలో ఇక్కడ మెడికల్ కాలేజి వచ్చింది’అని కేసీఆర్ అన్నారు. -
భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్‌షోలో సునీతా కేజ్రీవాల్
ఢిల్లీ: ఆప్ పార్టీ తరపున ఏప్రిల్ 27 నుంచి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ ప్రచారం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ రోజు (ఆదివారం) పశ్చిమ ఢిల్లీ నియోజక వర్గంలో ఆప్ అభ్యర్థి మహాబల్ మిశ్రాకు మద్దతు కోరుతూ క్యాంపెయిన్ నిర్వహించారు.ఢిల్లీ రోడ్‌షోలో సునీతా కేజ్రీవాల్ మాట్లాడుతూ.. భారతమాత కుమార్తెగా.. నియంతృత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తన భర్త సింహం అని, ఆయన్ను ఎవరూ పడగొట్టలేరని అన్నారు. కారు సన్‌రూఫ్‌లోంచి నిల్చుని ఓటర్లకు అభివాదం చేశారు.పాఠశాలలు కట్టడం, ఉచిత విద్యుత్ అందించడం, మొహల్లా క్లినిక్‌లు ప్రారంభించి ప్రజలకు మంచి పనులు చేసినందుకే జైలుకెళ్లారని సునీతా కేజ్రీవాల్ అన్నారు. ఆయన (కేజ్రీవాల్) భరతమాత పుత్రుడు, నియంతృత్వానికి వ్యతిరేఖంగా ఓటు వేసి ప్రజాస్వామ్యం కాపాడుకోవడం మీ బాధ్యత. దయచేసి దీని విలువ అర్థం చేసుకోండి అని ఆమె అన్నారు.లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఢిల్లీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసింది. ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న 'ఆప్' తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ స్థానాల్లో తమ అభ్యర్థులను నిలబెట్టింది. ఇక ఈశాన్య ఢిల్లీ, వాయువ్య ఢిల్లీ, చాందినీ చౌక్ స్థానాల్లో కాంగ్రెస్ తన అభ్యర్థులను నిలబెట్టింది.जनता के इस सैलाब के आगे,कोई तानाशाह टिक नहीं सकता 🔥अपने बेटे, अपने भाई केजरीवाल को आशीर्वाद देने सड़कों पर उमड़ी पश्चिमी दिल्ली की जनता 💯#KejriwalKoAshirwad pic.twitter.com/ZTPl8LrsaS— AAP (@AamAadmiParty) April 28, 2024 -
బీజేపీకి వచ్చే సీట్లు అవే: కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి,హైదరాబాద్: బీజేపీ కి రెండు వందల సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని, కేంద్రంలో హంగ్ వస్తే.. పార్లమెంట్లో బీఆర్ఎస్ కీలకం అవుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. బస్సు యాత్రలో భాగంగా హన్మకొండలో ఆదివారం( ఏప్రిల్ 28) జరిగిన రోడ్‌షోలో కేసీఆర్ మాట్లాడారు.‘ఓరుగల్లు చైతన్యం ఉన్న జిల్లా. చరిత్ర వైభవానికి ప్రతీక వరంగల్ జిల్లా. ఓరుగల్లు మట్టితో నాది విడదీయరాని బంధం. ఐదు మెడికల్ కాలేజీలు వరంగల్ ఉమ్మడి జిల్లాకు తెచ్చుకున్నాం. ఈ ముఖ్యమంత్రి విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నాడు. ఈ ముఖ్యమంత్రికి తెలంగాణ చరిత్ర తెలియదు. భూగోళం తెలియదు. ఏరి కోరి మొగుణ్ణి తెచ్చుకుంటే ఎగిరిఎగిరి తన్నట్లుంది తెలంగాణ పరిస్థితి. రాష్ట్రంలో ఏం జరుగుతోంది. ఈ ప్రభుత్వ పాలనలో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దివాలా తీసింది. తెలంగాణ గొంతుకోసి మోదీ గోదావరి జలాలను తమిళనాడు కు తరలించే కుట్రలు చేస్తున్నాడు.మోదీ గోదావరిని ఎత్తుకు పోతా అంటుంటే ఈ ముఖ్యమంత్రి మూతి ముడుచుకొని కూర్చున్నాడు. . బీజేపీ చాలా ప్రమాద కరమైన పార్టీ. ప్రజల మధ్య పంచాయితీలు పెట్టడం తప్ప మరో ప్రణాళిక లేదు. బీజేపీ ఎజెండాలో ప్రజల కష్టసుఖాలు ఉండవు. అచ్చే దిన్ రాలేదు కానీ సచ్చేదిన్ వచ్చింది. రూపాయి విలువ పడిపోయింది. కడియం శ్రీహరి బీఆర్ఎస్కు చేసిన మోసానికి శాశ్వతంగా ఆయన రాజకీయ జీవితం సమాధి చేసుకున్నాడు. మూడు నెలల్లో స్టేషన్ ఘన్‌పూర్‌కు ఉప ఎన్నికలు రాబోతున్నాయి. రాజయ్య ఎమ్మెల్యే కాబోతున్నాడు. రాజయ్య చేతిలో కడియం ఓటమి ఖాయం.గోదావరి, కృష్ణా నదులను కాపాడుకోవాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవాలి. రేవంత్ రెడ్డి నా గుడ్లు పీకి గోలీలు ఆడుకుంటాడట.. నా లాగు కూడా ఊడ తీస్తాడట. నన్ను చర్లపల్లి జైలులో వేస్తాడట. నీ జైళ్ళు, తోకమట్ట దెబ్బలకు కేసీఆర్ భయపడడు. ఇంకా చేయాల్సిన అభివృద్ధి చాలా ఉంది. అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో వరంగల్‌లో కట్టిన 24 అంతస్తుల ఆస్పత్రే నిదర్శనం’ అని కేసీఆర్ అన్నారు -
‘‘కేజ్రీవాల్‌ను చంపుతారా..?’’
న్యూఢిల్లీ: లిక్కర్‌స్కామ్ కేసులో జైలు పాలైన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బాధ్యతలను ఆయన భార్య సునీత కేజ్రీవాల్ భుజానికెత్తుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి తానే స్టార్ క్యాంపెయినర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆదివారం(ఏప్రిల్28) పశ్చిమ ఢిల్లీ లోక్‌సభ నియోజకవర్గంలో ఆప్ అభ్యర్థి తరపున సునీత రోడ్‌షోలో పాల్గొన్నారు. దేశంలో నియంతృత్వాన్ని పారద్రోలి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ఆలోచించి ఓటు వేయాలని రోడ్‌షోలో సునీత కోరారు. ప్రజల కోసం పనిచేసినందుకే తన భర్త కేజ్రీవాల్‌ను జైలుకు పంపించారన్నారు. తీహార్ జైలులో ఆయన సుగర్ వ్యాధికి సరైన చికిత్స అందించడం లేదన్నారు. అరవింద్ కేజ్రీవాల్‌ను చంపాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. కేజ్రీవాల్ ఒక సింహం ఆయనను ఎవరూ ఏం చేయలేరన్నారు. సునీతా కేజ్రీవాల్‌కు ఇది రెండో షో. శనివామే సునీత తన రోడ్‌షోలు ప్రారంభించారు. తొలి రోడ్‌షో తూర్పు ఢిల్లీ నియోజకవర్గంలోని కోండ్లిలో నిర్వహించారు. ఢిల్లీలో మే 25న లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. -
భగభగల్లోనూ బ్రహ్మరథం
సీఎం జగన్ తెచ్చిన వ్యవసాయ సంస్కరణలు రైతును తిరిగి బతికించాయి. గతంలో వ్యవసాయం చేసి పండించిన పంటను దళారులకు అమ్ముకోవాల్సి వచ్చేది. వారు చెప్పిందే ధర. ఆరుగాలం కష్టపడితే లాభం రాకపోగా, నష్టమే కనిపించేది. ఎవరికీ చెప్పుకోవడానికి లేదు. ఇప్పుడు మా గ్రామంలోనే రైతుభరోసా కేంద్రం వచ్చింది. రైతుకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు ఇక్కడే ఇస్తున్నారు. పంట నష్టపోతే బీమా అందిస్తున్నారు. నేను 18 ఎకరాలు సాగుచేస్తున్నాను. వివిధ ప్రభుత్వ పథకాల ద్వారా రూ.4 లక్షల వరకు లబ్ధిపొందాను. ఇన్నేళ్ల నా జీవితంలో రైతు ఆనందంగా ఉన్నది ఇప్పుడే చూస్తున్నాను. ఇలాంటి నాయకుడే మళ్లీ సీఎం కావాలి. – సత్యనారాయణ, రైతు, రంగంపేట గ్రామం, అనపర్తి నియోజకవర్గం (‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : మేళతాళాలు, డప్పు వాయిద్యాలు, అభిమానుల కోలాహలం మధ్య సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ‘మేమంతా సిద్ధం’ బస్సుయాత్ర 18వ రోజు శుక్రవారం కాకినాడ జిల్లాలో కోలాహలంగా సాగింది. అనపర్తి మండలం రంగంపేటకు సమీపంలోని ఎస్టీ రాజపురం వద్ద ఏర్పాటుచేసిన నైట్ స్టే పాయింట్ నుంచి ఉదయం రంగంపేట, పెద్దాపురం బైపాస్, సామర్లకోట బైపాస్, ఉండూరు మీదుగా కాకినాడకు చేరుకుంది. మార్గమధ్యంలో మహిళలు హారతులు పట్టి సీఎం జగన్‌కు జేజేలు పలికారు. తమ అభిమాన నేతను చూసేందుకు వృద్ధులు.. రైతులు.. అక్కచెల్లెమ్మలు పల్లెల నుంచి పరుగుపరుగున రంగంపేటకు చేరుకున్నారు. సూరంపాలెం వరకు 8 కి.మీ. మేర తమ అభిమాన నేత వెంట నడిచారు. సూరంపాలెంలోని ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ వద్ద విద్యార్థులు ‘థ్యాంక్యూ సీఎం సర్’ అంటూ భారీ బ్యానర్‌తో స్వాగతం పలికారు. మీవల్లే మేం ఉన్నత చదువులు చదువుకోగలుగుతున్నాం. ‘అన్నా.. నువ్వు జాగ్రత్త, క్షేమంగా వెళ్లి.. సీఎంగా తిరిగి రా’ అంటూ ఒకరు.. ‘మొనగాడిలా ఒక్కడే వస్తాడు.. చరిత్ర సృష్టిస్తాడు’ అని ఇంకొకరు.. ‘పేదవాడి ఇంట్లో కష్టం లేకుండా ఉండాలంటే మళ్లీమళ్లీ నువ్వే సీఎంగా రావాలన్నా’ అంటూ మరో విద్యార్థి, ‘అన్నా నువ్వు జాగ్రత్త.. నీ ఆరోగ్యం జాగ్రత్త..’ ‘వైనాట్ 175.. వన్స్‌మోర్ సీఎం జగనన్న..’ వంటి ప్లకార్డులతో విద్యార్థులు తమ ఆనందాన్ని, అభిమానాన్ని చాటారు. జగన్నినాదాలతో హోరెత్తిన రంగంపేట.. ఉదయం ఎస్టీ రాజపురం వద్ద ప్రారంభమైన యాత్రకు గ్రామాల నుంచి భారీగా తరలివచ్చిన ప్రజలతో రంగంపేట కిక్కిరిసిపోయింది. దారిపొడవునా జనం జగన్ నినాదాలతో హోరెత్తించారు. సామర్లకోట సెంటర్ వద్ద మహిళలు జగన్ కాన్వాయ్కి హారతులిచ్చారు. జానపద నృత్యాలు, తీన్మార్ నృత్యాలతో జననేతకు స్వాగతం పలికారు. అచ్చంపేట ఫ్లైఓవర్ వద్ద ఓ పాత ఫొటోతో ఎదురువస్తున్న వృద్ధురాలిని చూసిన జగన్ తన వాహనాన్ని ఆపి ఆమెను పలకరించగా.. తన పేరు మోర్త కుమారి అని, గతంలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఈ మార్గంలో వచ్చినప్పుడు తాను జున్ను పెట్టిన విషయాన్ని గుర్తుచేశారు. అప్పుడు ఆయన వచ్చారు, ఇన్నేళ్లకు మీరు వచ్చారంటూ ఆమె తెగ సంబరపడింది. అలాగే, కాకినాడ జిల్లా నాయకంపల్లి వద్ద సీఎం కాన్వాయ్ వెళ్తున్న సమయంలో కృష్ణవేణి అనే రోగిని తీసుకుని ఆమె బంధువులు జగన్ కోసం ఎదురుచూస్తూ రోడ్డుపై వేచివున్నారు. వీరిని చూసి జగన్ తన వాహనాన్ని ఆపి వారి వద్దకు నడుచుకుంటూ వెళ్లారు. వారి సమస్యను అడిగి తెలుసుకున్నారు. చికిత్స నిమిత్తం ఖర్చుచేసిన బిల్లులను జాగ్రత్తచేయాలని పేషెంట్ బంధువులకు సూచించారు. కృష్ణవేణికి అవసరమైన వైద్య సహాయాన్ని అందించే చర్యలను తక్షణమే చేపట్టాలని ఆరోగ్యశ్రీ అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. మనసున్న మారాజు అని, ప్రజా సమస్యలపట్ల జగన్ స్పందిస్తున్న తీరును చూసి మళ్లీ సీఎంగా ఆయనే రావాలని అక్కడున్న వారంతా బలంగా కోరుకున్నారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం ఉండూరు క్రాస్ నుంచి బయల్దేరి కాకినాడ రూరల్ అచ్చంపేట జంక్షన్ వద్ద బహిరంగసభకు చేరుకున్నారు. అభిమానం ముందు ఎండ ఎంత? ఓ పక్క భానుడు భగభగలతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు బయటకు రావడానికి భయపడుతుంటే.. కాకినాడలో మాత్రం జనం ఎండను సైతం లెక్కచేయకుండా అచ్చంపేట జంక్షన్‌కు తండోపతండాలుగా తరలివచ్చారు. తమకు మేలు చేసిన ప్రజా నాయకుడు సీఎం జగన్ తమ ప్రాంతానికి వచ్చాడని చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. మా అభిమానం ముందు ఈ ఎండ తీవ్రత ఎంత.. అంటూ జగన్‌పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఇక సభా ప్రాంగణమైతే జనంతో కిక్కిరిసిపోయింది. సభ అనంతరం యాత్ర పిఠాపురం, గొల్లప్రోలు, చేబ్రోలు, కత్తిపూడి, బెండపూడి, అన్నవరం, తుని మీదుగా యాత్ర సాగింది. కత్తిపూడి కూడలి నుంచి ప్రజలు ప్లకార్డులు పట్టుకుని మానవహారం నిర్వహించారు. లోవ సెంటర్లో అమ్మవారి ఆశీర్వాదం పొందారు. తునిలో రోడ్ షో హైలెట్ తునిలో నిర్వహించిన రోడ్డు షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. లేజర్ లైటింగ్, యువత డ్యాన్సులతో సీఎం జగన్‌కు ఘనంగా స్వాగతం పలికారు. జాతీయ రహదారికి ఇరువైపులా అభిమానులు నిలబడి తమ అభిమాన నేతకు స్వాగతం పలికారు. జగన్ సాయంత్రం తుని వస్తారని తెలిసి చుట్టుపక్కల గ్రామాల ప్రజలు మధ్యాహ్నం నుంచే జాతీయ రహదారి పైకి భారీగా తరలివచ్చారు. కానీ ఆయన రాత్రి 8.25కు తుని చేరుకున్నారు. మహిళలు గుమ్మడికాయలతో హారతి ఇచ్చి దిష్టితీశారు. జగన్ బస్సుపై నుంచి వారికి అభివాదం చేస్తూ రాత్రి పాయకరావుపేటకు చేరుకున్నారు. జాతీయ రహదారిపై ఉన్న అభిమానులకు అభివాదం చేస్తూ రాత్రి 9.15 గంటలకు వడిచర్ల వద్ద నైట్ స్టే క్యాంపునకు జగన్ చేరుకున్నారు. సామాన్యులకు ‘కార్పొరేట్’ చదువులు జగన్ సర్ వచ్చాకే సామాన్యుల పిల్లలకు నాణ్యమైన చదువులు అందుతున్నాయి. మాది అనంతపురం జిల్లా గంగవరం గ్రామం. ఇంజినీరింగ్‌లో ర్యాంక్ రావడంతో కాకినాడ జిల్లాలో సీటు వచ్చింది. సీఎస్ఈ (డేటా సైన్స్)లో ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ స్కూల్లోనే చదువుకున్నాను. జగన్ రాకముందు.. వచ్చాక రాష్ట్రంలో చదువులెలా ఉన్నాయో చాలా దగ్గర నుంచి గమనించాను. మా స్కూల్లోనే జగన్ సీఎం కాకముందు పరిస్థితి దారుణంగా ఉండేది. ఇప్పుడు కార్పొరేట్ స్థాయిలో సదుపాయాలు వచ్చాయి. స్కూల్లో ఉన్నప్పుడు అమ్మఒడి వచ్చింది. ఇప్పుడు జగనన్న విద్యాదీవెన పథకంతో ఇంజినీరింగ్ చేస్తున్నాను. మా అన్నయ్యకు కూడా విద్యాదీవెన అందుతోంది. మా నాన్నకు రైతుభరోసా వచ్చింది. ఇలాంటి సీఎంను నేను చూడలేదు. – చైతన్యరెడ్డి, విద్యార్థిని, అనంతపురం జిల్లా జగన్ సర్ రుణం తీర్చుకోలేనిది.. గతంలో ప్రభుత్వ స్కూళ్లలో చదువు అంటే భయమేసేది. టీచర్లు ఉండేవారు కాదు. టాయిలెట్లు ఉండేవి కావు. వర్షం వస్తే క్లాస్రూంలు కారిపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వ స్కూళ్లు కార్పొరేట్ స్థాయిలో ఉన్నాయి. చదువులు బాగున్నాయి. గతంలో ఇంజినీరింగ్ చేసినా ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీలేదు. నా పాలిటెక్నిక్ చదువు పూర్తిగా ప్రభుత్వ సాయంతోనే పూర్తయింది. మా చెల్లి, తమ్ముడు (కజిన్స్)కి అమ్మఒడి వస్తోంది. నా డిప్లొమా అవుతుండగానే జాబ్ వచ్చింది, కానీ, జగనన్న విద్యాదీవెన ఇస్తుండడంతో ఇంజనీరింగ్ చదవగలుగుతున్నాను. జగన్ సర్ గ్రేట్. హత్యాయత్నం జరిగినా లెక్కచేయలేదు, నవ్వుతూనే ప్రజల్లో ఉన్నారు. ఆయన రుణం ఎప్పటికీ తీర్చుకోలేనిది. – తనూజ, బీటెక్ (ఈసీఈ సెకండియర్), కాకినాడ జగనన్న వచ్చాకే మేలు జరిగింది.. నాకు ఇద్దరు పిల్లలు, నా భర్త పాల వ్యాపారం చేస్తాడు. గతంలో రేషన్ కార్డు కోసం జన్మభూమి కమిటీలో ఎన్నోసార్లు అప్లై చేసినా ఇవ్వలేదు. కారణం కూడా చెప్పలేదు. జగనన్న సీఎం అయ్యాక ఇంటికి వలంటీర్ వచ్చి మరీ కార్డు ఇచ్చారు. మా పాపకి రెండుసార్లు అమ్మఒడి ఇచ్చారు. ఇంటి స్థలం కూడా ఇచ్చారు. ఇంత మేలు చేసిన అన్న మా ఊరికి వస్తే చూడకుండా ఉండలేం కదా.. అందుకే నా బిడ్డను తీసుకుని వచ్చాను. – ఈ. శ్రీలత, గాంధీనగర్, కాకినాడ చేబ్రోలు పట్టు రైతులకు సీఎం హామీ ముఖ్యమంత్రి తీరుతో పట్టు రైతుల హర్షాతిరేకాలు పిఠాపురం: చేబ్రోలు పట్టు రైతుల సమస్యలు పరిష్కరిస్తానని సీఎం వైఎస్ జగన్ వారికి హామీ ఇచ్చారు. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సందర్భంగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు ఆదర్శ ఇంజినీరింగ్ కళాశాల వద్ద చేబ్రోలు పట్టు పరిశ్రమకు చెందిన పట్టు రైతులు తమ సమస్యలు సీఎంకు వినతిపత్రం ద్వారా తెలియజేయాలని ప్లకార్డులు ప్రదర్శించారు. అయితే, బస్సుయాత్ర చేబ్రోలులో ఎక్కడా ఆగకుండా వెళ్లిపోయింది. తమ సమస్యలు చెప్పుకుందామని వస్తే.. బస్సుయాత్ర ఆగకుండా వెళ్లిపోయిందని రైతులు నిరాశకు గురయ్యారు. ఇంతలో బస్సులో నుంచి రైతులు ప్రదర్శించిన ప్లకార్డులను చూసిన సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తనతో ఉన్న వారి ద్వారా వివరాలు తెలుసుకున్నారు. వెంటనే స్పందించిన ఆయన.. రైతుల వద్దకు వెళ్లి, వారి వినతిపత్రం తీసుకుని, వారి సమస్యను క్షుణ్ణంగా విని, తగిన పరిష్కారం చూపిస్తామని తన మాటగా చెప్పి రావాల్సిందిగా సీఎంఓ కార్యాలయ గ్రీవెన్స్ అధికారి ప్రదీప్‌ను ఆదేశించారు. దీంతో ఆ అధికారి రైతుల వద్దకు చేరుకుని, ముఖ్యమంత్రి తనను పంపించారని చెప్పారు. రైతులతో మాట్లాడి వారి సమస్యను ఆలకించి, వారి వినతిపత్రాన్ని స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని సీఎం చెప్పారని రైతులకు వివరించారు. దీంతో.. సమయాభావంవల్ల సీఎం ఆగకుండా వెళ్లిపోయినా, రైతులను గుర్తించి.. వెంటనే స్పందించి అధికారిని పంపించడంపై పట్టు రైతులు ఆనందం వ్యక్తంచేశారు. -
అది రాయి దాడి కాదు.. పవన్ అభిమానినే చితకబాదిన జనసైనికులు
తెనాలి రూరల్: జనసేన అధినే పవన్‌కళ్యాణ్ పర్యటనలో జన సైనికులు అత్యుత్సాహం ప్రదర్శించారు. పవన్ అభిమాని అయిన ఓ కాపు యువకుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పవన్ కల్యాణ్‌పై రాళ్లు విసిరాడని పుకారు చెలరేగడంతో అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. బాధితుడు, పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పొన్నూరు మండలం మామిళ్లపల్లికి చెందిన సరిగిరి దిలీప్‌నాయుడు తెనాలిలో ఆదివారం సాయంత్రం జరిగిన పవన్‌కళ్యాణ్ రోడ్ షో, బహిరంగ సభలో పాల్గొనేందుకు వచ్చాడు. ఇక్కడి సుల్తానాబాద్‌లోని హెలీప్యాడ్ నుండి పవన్ కల్యాణ్ కొంత దూరం కారు నుండి అభిమానులకు అభివాదం చేస్తూ వచ్చి వారాహి వాహనంలోకి మారారు. ఈ మార్గంలోనే ఉషోదయ కళ్యాణమండపం వద్ద దిలీప్ పవన్ రాక కోసం వేచి ఉన్నాడు. పవన్ కల్యాణ్ అటుగా వెళ్లగానే ఓ యువతితో దిలీప్ అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆమె తండ్రి అతనిపై దాడి చేశాడు. పక్కనే ఉన్న జన సైనికులు కలుగజేసుకుని దాడి చేస్తుండడంతో సమీపంలోని చెట్టు ఎక్కాడు. అయినా జనసైనికులు కిందకు లాగడంతో తనను రక్షించుకునేందుకు అందుబాటులో ఉన్న రాయి తీసుకున్నాడు. రాళ్లతో దాడి చేస్తున్నాడని జనసైనికులు కేకలు వేయడంతో అక్కడే ఉన్న మరి కొందరు పవన్ కల్యాణ్‌పై రాళ్లు వేశాడని కేకలు మొదలు పెట్టారు. యువకులు పెద్ద ఎత్తున గుమికూడి దిలీప్‌పై దాడి చేస్తున్న క్రమంలో కల్యాణమండపం ఆవరణలోకి పరుగెత్తాడు. వెంబడించిన జనసైనికులు అతనిపై విచక్షణారహితంగా దాడి చేశారు. కళ్యాణ మండపం సమీపంలోనే విధుల్లో ఉన్న గుంటూరు స్పెషల్‌బ్రాంచి ఇన్స్పెక్టర్ ఎస్ వెంకట్రావు, మరో మహిళా ఎస్ఐ, తెనాలి రూరల్, త్రీ టౌన్ స్పెషల్ బ్రాంచ్ హెడ్ కానిస్టేబుళ్లు శివ, తిరుమలరావు, ఇతర సిబ్బంది హుటాహుటిన దాడి జరిగిన ప్రదేశానికి వెళ్లారు. బాధితుడు దిలీప్‌ను పొలీసులు చుట్టముట్టి అతని ప్రాణాలను రక్షించారు. పవన్ కల్యాణ్ అభిమానినైన నేను ఆయనపై రాళ్లు ఎందుకు వేస్తానంటూ బాధితుడు వాపోయాడు. ప్రస్తుతం అతను పోలీసుల అదుపులో ఉన్నాడు. వివాదానికి కారణమేంటన్నదీ విచారిస్తున్నారు. -
షర్మిల రోడ్‌షోకు అద్దె మనుషులే దిక్కు
సాక్షి ప్రతినిధి, కడప: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, కడప వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డికి మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య మరకలు అంటేలా దుష్ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్న ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలకు ప్రజల మద్దతు కరవైంది. కాంగ్రెస్ పార్టీ కడప ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆమె రోడ్‌షోల పేరిట నియోజకవర్గంలో తిరుగుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అండతో, టీడీపీ స్క్రిప్టుతో సీఎం జగన్‌పై బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్న షర్మిల వైపు ప్రజలు కన్నెత్తి చూడటంలేదు. దీంతో ఆమె సభలు, రోడ్ షోలు అట్టర్ ఫ్లాపవుతున్నాయి. దీంతో టీడీపీ పంపుతున్న అద్దె మనుషులే దిక్కయ్యారు. స్థానిక టీడీపీ నాయకుల సహకారంతో డబ్బులిచ్చి మరీ మనుషులను తరలించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇలా తరలించిన వారిలో అధికశాతం బీహార్, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీలు కూడా ఉన్నారు. షర్మిల శుక్రవారం వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో ప్రచారం చేశారు. వేంపల్లె కేంద్రంగా తొలుత నిర్వహించిన సమావేశానికి చక్రాయపేట మండలం నుంచి టీడీపీ నాయకులు జనసమీకరణ చేపట్టారు. ఒక్కొక్కరికి రూ.500 ఇచ్చి వాహనాల్లో తరలించారు. సిద్ధారెడ్డిగారిపల్లెకు చెందిన టీడీపీ నేత భాస్కరరెడ్డి జనసమీకరణ బాధ్యతను తీసుకున్నారు. ఆ తర్వాత రోడ్‌షోలకు వేంపల్లెలోని బిడాలమిట్ట, చింతరాంపల్లె ప్రాంతాల నుంచి స్థానిక కాపువీధికి చెందిన టీడీపీ నేత మునిరెడ్డి అద్దె మనుషులను తరలించారు. ముద్దనూరు, కడప ప్రాంతాలను నుంచి జనాన్ని తరలించారు. పులివెందులలో సాయంత్రం జరిగిన సభకు కడప నుంచి జనాన్ని సమీకరించారు. చెన్నూరు, ఐటీఐ సర్కిల్, ఆజాద్‌నగర్ తదితర ప్రాంతాల నుంచి జనాన్ని తీసుకొచ్చారు. వీరికి కూడా ఒక్కొక్కరికి రూ.500 చొప్పున ఇచ్చారు. డబ్బులు తీసుకొని మధ్యలో జారుకోకుండా ముందుగా టోకెన్లు ఇచ్చారు. తిరుగు ప్రయాణంలో టోకెన్ ఉన్న వారికి రూ.500 చొప్పున కాంగ్రెస్ నేత తులసిరెడ్డి సన్నిహితుడు చెల్లించినట్లు సమాచారం. సమావేశానికి రావాలని శివప్రకాష్ రెడ్డి బెదిరింపులు! మరోవైపు షర్మిల సమావేశానికి హాజరు కావాలంటూ వైఎస్ వివేకా పెద్ద బాçవమరిది నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి స్థానికులకు ఫోన్లు చేసి బెదిరింపులకు దిగారు. వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, కాంగ్రెస్ టీడీపీ రెండు ఒక్కటేనని, స్థానిక నాయకత్వం తమ చేతుల్లోనే ఉంటుందని ఆయన హెచ్చరించినట్లు సమాచారం. తొలి విడత ప్రచారంలోనూ.. తొలి విడత ప్రచారంలో షర్మిల బద్వేల్, కడప, మైదుకూరు, కమలాపురం నియోజకవర్గాల్లో పర్యటించిన సందర్భంలోనూ ఇలాగే తుఫాన్ వాహనాల ద్వారా కడప నుంచి జనాల్ని తరలించారు. 20 వాహనాలకు సరిపడా జనానికి కడప జయరాజ్ గార్డెన్లో బస ఏర్పాటు చేసి, నాలుగు రోజుల పాటు షర్మిల పర్యటనలకు తిప్పుకున్నారు. వీరంతా హందీలో మాట్లాడుతుండటంతో పలువురు వాకబు చేయగా, బిహార్ నుంచి వచ్చిన వలసకూలీలని, రోజు కూలీకి ఒప్పందం చేసుకున్నట్లు తేలింది. -
మిమ్మల్నే గెలిపించుకుంటాం
ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం పరిధిలోని కొనకనమిట్ల వద్ద ఏప్రిల్ 7న 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. షెడ్యూలు ప్రకారం అక్కడ మధ్యాహ్నం 3.30 గంటలకు సభ ప్రారంభమవుతుందని నిర్వాహకులు చెప్పడంతో మధ్యాహ్నం 12 గంటలకే సభా ప్రాంగణంలోకి జనప్రవాహం ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటలకే సభా ప్రాంగణం ఇసుకేస్తే రాలనంతగా జనంతో కిక్కిరిసిపోయింది. ఓ వైపు మండుతున్న ఎండ.. మరో వైపు ఉక్కపోత.. అయినా సభా ప్రాంగణం నుంచి లక్షలాది మంది అక్కడి నుంచి కాలు కదపలేదు. బస్సు యాత్రకు జనం అడుగడుగునా నీరాజనం పలకడంతో సభా ప్రాంగణానికి సీఎం వైఎస్ జగన్ కాస్త ఆలస్యంగా సాయంత్రం 5 గంటలకు చేరుకున్నారు. జననేతను చూడగానే అప్పటిదాకా పడిన ఇబ్బందిని జనం మరిచిపోయి ఆనందంతో హర్షధ్వానాలు చేశారు. ‘ఇంత మేలు చేసిన మీకు కాకుండా ఎవరికి ఓటు వేస్తాం.. మిమ్మల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మాదే’నంటూ నినాదాలు చేశారు. ఇలా ఎక్కడికక్కడ సీఎం జగన్ పట్ల పెరుగుతున్న ఆదరణ సరికొత్త చారిత్రక విజయానికి బాటలు వేస్తోంది. సాక్షి, అమరావతి: పేదంటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చడానికి.. చంద్రబాబు వంటి మోసగాళ్ల నుంచి రాష్ట్ర భవిష్యత్తును కాపాడేందుకు ‘నేను సిద్ధం.. మీరంతా సిద్ధమా?’ అని సీఎం వైఎస్ జగన్ పిలుపునిస్తే.. సెల్ ఫోన్ టార్చ్‌లైట్ వెలిగించి ‘మేమంతా సిద్ధం’ అంటూ లక్షల గళాలు దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నాయి. మేమెంతా మీ వెంటేనంటూ అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదమ్ములు అడుగులో అడుగు వేస్తున్నారు. ఎక్కడికక్కడ అభిమానం అడ్డుపడుతుండటంతో సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర షెడ్యూల్ సమయం కంటే రెండు గంటలు ఆలస్యంగా సాగుతోంది. ఈ నెల ఒకటవ తేదీన శ్రీసత్యసాయి జిల్లా కదిరిలోకి షెడ్యూలు సమయం కంటే మూడు గంటలు ఆలస్యంగా సాయంత్రం 5.45 గంటలకు సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర ప్రవేశించింది. మధ్యాహ్నం 2 గంటలకే నేల ఈనిందా అన్నట్లుగా జనంతో కదిరి కిక్కిరిసిపోయింది. అనంతపురం–మదనపల్లె రహదారిపై సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన రోడ్ షోకు అడగడుగునా జనం నీరాజనాలు పలకడంతో కుంభమేళాను తలపించింది. రోడ్ షో సాగినంత దూరం సెల్‌ఫోన్ టార్చ్లైట్లను వెలిగించి జనం సీఎం వైఎస్ జగన్‌కు సంఘీభావం తెలిపారు. రెండు కిలోమీటర్ల పొడవున రోడ్ షో నిర్వహించడానికి 2.10 గంటల సమయం పట్టిందంటే జనం ఏ స్థాయిలో పోటెత్తారన్నది అర్థం చేసుకోవచ్చు. అందరి అభిమతం అదే.. వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని ఇడుపులపాయ నుంచి పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం గంటావారిపాలెం వరకు ఇప్పటిదాకా సాగిన బస్సు యాత్రలో అడగడుగునా ఇలాంటి దృశ్యాలు సాక్షాత్కారించాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో మీకు ఫలాన మేలు చేస్తాం.. మాకు ఓటేయండి.. అని ప్రజలకు నాయకులు హామీలు ఇస్తుంటారు. కానీ.. బస్సు యాత్రలో జనంతో సీఎం వైఎస్ జగన్ మమేకమైనప్పుడు ‘మీ పాలనలో మాకు మంచి జరిగింది. మళ్లీ మీరే రావాలి. మిమ్మిల్నే గెలిపించుకుంటాం’ అంటూ యువతీ యువకుల నుంచి వృద్ధుల వరకు హామీలు ఇస్తుండటం రాజకీయ విశ్లేషకులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దేశ రాజకీయ చరిత్రలో ఇలాంటి మహోజ్వల ఘట్టాలను తామెన్నడూ చూడలేదని.. సీఎం వైఎస్ జగన్ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం బలంగా నాటుకుపోయిందనడానికి ఇవే తార్కాణమని విశ్లేషిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరో చారిత్రక విజయం సాధించడం ఖాయమనడానికి బస్సు యాత్రలో అడుగడుగునా కన్పిస్తున్న దృశ్యాలే నిదర్శనమని తేల్చి చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టైమ్స్ నౌ–ఈటీజీ, జీన్యూస్ వంటి ప్రతిష్ఠాత్మక జాతీయ మీడియా సంస్థలు డజనుకు పైగా నిర్వహించిన సర్వేల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించడం ఖాయమని తెగేసి చెబుతుండటం గమనార్హం. జైత్ర యాత్రలా బస్సు యాత్ర సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా గత నెల 27న వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ వద్ద మహానేత వైఎస్సార్ ఘాట్ నుంచి సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్రను ప్రారంభించారు. వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల మీదుగా ఇప్పటిదాకా బస్సు యాత్ర సాగింది. మండుటెండను లెక్క చేయకుండా స్కూలు విద్యార్థుల దగ్గర నుంచి అవ్వాతాతల వరకు పోటీపడి సీఎం జగన్‌కు సంఘీభావం తెలుపుతున్నారు. బిడ్డలను చంకనేసుకుని సీఎం జగన్‌ను చూసేందుకు బస్సు వెంట యువతీ యువకులతో పోటీపడుతూ మహిళలు పరుగులు తీస్తున్న దృశ్యాలు అడుగడుగునా కన్పిస్తున్నాయి. స్కూలు విద్యార్థులైతే సీఎం జగన్‌ను చూసేందుకు తల్లితండ్రులతోపాటు వస్తున్నారు. సీఎం జగన్‌ను చూడగానే ‘అదుగో జగన్ మామయ్య’ అంటూ చూపుతున్నారు. ఆ పిల్లలను సీఎం జగన్ అక్కున చేర్చుకుంటుండటంతో పిల్లలు ఆనందపరవశులవుతున్నారు. సీఎం వైఎస్ జగన్‌ను దగ్గర నుంచి చూసేందుకు.. మాట కలిపేందుకు.. వీలైతే సెల్ఫీ దిగేందుకు జనం పోటీ పడుతున్నారు. యువత, మహిళలు, రైతులు, వృద్దులు ఇలా అన్ని వర్గాల వారితో సీఎం మేమకమవుతున్నారు. బస్సు యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరు, మదనపల్లె, పూతలపట్టు, నాయుడుపేట, కావలి, కొనకనమిట్లలో నిర్వహించిన బహిరంగ సభలకు జనం పోటెత్తడంతో ఒకదానికి మించి మరొకటి సూపర్ హిట్టయ్యాయి. ఏ సమయం అయినా సీఎం వైఎస్ జగన్ నిర్వహించే రోడ్ షోల్లో అభిమాన సంద్రం ఉప్పొంగుతోంది. రాత్రి పొద్దుపోయినా దర్శి జన సంద్రాన్ని తలపించింది. ప్రజల్లో విశ్వసనీయతకు ప్రతీక ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం సీఎం వైఎస్ జగన్ అమలు చేశారు. గత 58 నెలల్లో అర్హతే ప్రామాణికంగా.. ఎలాంటి వివక్షకు తావు లేకుండా.. అత్యంత పారదర్శకంగా నవరత్నాలు, సంక్షేమ పథకాల ద్వారా డీబీటీ రూపంలో 87 శాతం కుటుంబాల ఖాతాల్లో రూ.2.70 లక్షల కోట్లు జమ చేశారు. నాన్ డీబీటీ రూపంలో మరో రూ.1.79 కోట్ల ప్రయోజనం చేకూర్చారు. డీబీటీ, నాన్ డీబీటీ కలిపి రూ.4.49 లక్షల కోట్ల ప్రయోజనం కలిగించారు. దేశ చరిత్రలో ఇదో రికార్డు. వాటిని సద్వినియోగం చేసుకున్న ప్రజలు పేదరికం నుంచి గట్టెక్కుతున్నారు. రాష్ట్రంలో పేదరికం 2015–16లో 11.77 శాతం ఉంటే.. 2022–23 నాటికి 4.19 శాతానికి తగ్గడమే అందుకు నిదర్శనం. విద్య, వ్యవసాయ, పారిశ్రామిక, వైద్య రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చిన సీఎం వైఎస్ జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారు. కేబినెట్ నుంచి నామినేటెడ్ వరకు పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు పెద్దపీట వేసి ఆ వర్గాల సామాజిక సాధికారతకు బాటలు వేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా ప్రభుత్వ సేవలను ఇంటి గుమ్మం వద్దే ప్రజలకు అందిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కరోనా కష్టకాలంలోనూ సంక్షేమ పథకాలు కొనసాగించి.. సుపరిపాలన అందిస్తున్న సీఎం వైఎస్ జగన్ నాయకత్వంపై ప్రజల్లో రోజు రోజుకు విశ్వసనీయత పెరుగుతోంది. ఇదే బస్సు యాత్రలో సీఎం వైఎస్ జగన్‌కు బ్రహ్మరథం పట్టడానికి దారితీస్తోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాబోయేది వైఎస్సార్సీపీ సునామీయే సార్వత్రిక ఎన్నికలకు వైఎస్సార్సీపీ శ్రేణులను సన్నద్ధం చేయడానికి భీమిలి (ఉత్తరాంధ్ర), దెందులూరు (ఉత్తర కోస్తా), రాప్తాడు (రాయలసీమ), మేదరమెట్ల (దక్షిణ కోస్తా)లలో నిర్వహించిన సిద్ధం సభలకు జనం పోటెత్తడంతో ఒకదానికి మించి మరొకటి గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఉమ్మడి రాష్ట్రం, తెలుగు రాష్ట్రాల చరిత్రలో రాప్తాడు, మేదరమెట్ల సిద్ధం సభలు అతి పెద్ద ప్రజాసభలుగా నిలిచాయి. ఇదే సమయంలో ఎన్నికల తొలి విడత ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్వహిస్తున్న బస్సు యాత్ర జైత్ర యాత్రలా కొనసాగుతోంది. ప్రజాక్షేత్రంలో సీఎం వైఎస్ జగన్‌ను ఒంటరిగా ఎదుర్కోవడానికి భయపడిన చంద్రబాబు.. జనసేనతో జట్టుకట్టి తాడేపల్లిగూడెంలో ఉమ్మడిగా నిర్వహించిన సభ జనం లేక అట్టర్ ప్లాప్ అయ్యింది. దాంతో బీజేపీతో జట్టుకట్టిన టీడీపీ–జనసేన.. సాక్షాత్తు ప్రధానిని రప్పించి చిలకలూరిపేటలో ప్రజాగళం పేరుతో నిర్వహించిన సభకు జనం మొహం చాటేయడంతో కూటమిలో నైతిక స్థైర్యం దెబ్బతింది. పొత్తులో సీట్ల లెక్క తేలాక.. అభ్యర్థుల ఎంపిక పూర్తయ్యాక, ఆపార్టీలో చెలరేగిన అసమ్మతి కూటమిని చావు దెబ్బతీసింది. కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చి వృద్ధులకు ఇంటి వద్ద పెన్షన్ అందించకుండా వలంటీర్లను చంద్రబాబు అడ్డుకోవడంతో కూటమిపై అన్ని వర్గాల్లోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓ వైపు సీఎం బస్సు యాత్రకు జనం బ్రహ్మరథం పడుతుండటం.. మరో వైపు చంద్రబాబు ప్రజాగళం పేరుతో, పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలకు ప్రజలు మొహం చాటేస్తుండటంతో కూటమి అభ్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ 21–22 లోక్‌సభ స్థానాలు చేజిక్కించుకుని ఘన విజయం సాధిస్తుందని పలు జాతీయ మీడియా సంస్థల సర్వేల్లో వెల్లడైంది. ఈ దృష్ట్యా రాబోయేది వైఎస్సార్సీపీ సునామీయేనని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. -
మీ రాజీనామాలతో బాబు గుండెల్లో రైళ్లు
కావలి/నెల్లూరు(దర్గామిట్ట)/అల్లూరు/కావలి: రాష్ట్రవ్యాప్తంగా వలంటీర్ల రాజీనామాలతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని సీఎం వైఎస్ జగన్అన్నారు. మేమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా శనివారం మధ్యాహ్నం ముసునూరు టోల్‌ప్లాజా సమీపంలో ఉన్న ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు వచ్చిన ఆయన్ను కావలికి చెందిన పలువురు వలంటీర్లు కలిశారు. ఈ సందర్భంగా సీఎం వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ‘రెండోసారి మిమ్మల్ని సీఎంగా చేసుకునేందుకు కావలి పట్టణానికి సంబంధించిన వలంటీర్లందరం రాజీనామా చేశాం’ అని తెలపగా.. పైవిధంగా సీఎం జగన్ స్పందించారు. తాను రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే వలంటీర్లకు సంబంధించిన ఫైలుపైనే తొలి సంతకం చేస్తానని, సేవామిత్ర, సేవారత్న, సేవావజ్ర పురస్కారాలను కొనసాగిస్తామని చెప్పారు. జిల్లాలో క్లీన్ స్వీప్ ఖాయం జిల్లాలోని ఒక పార్లమెంట్, 8 అసెంబ్లీ స్థానాల్లో క్లీన్‌స్వీప్ చేయడం తథ్యమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఇందుకు గుర్తుగా నెల్లూరు జిల్లా చింతారెడ్డిపాలెం స్టే పాయింట్ వద్ద టీషర్టుల మీద 8 బై 8 వైఎస్సార్సీపీ స్టాంప్‌ను వేసి అందరికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు, నెల్లూరు లోక్‌సభ అభ్యర్థి వి.విజయసాయిరెడ్డి, ఉదయగిరి వైఎస్సార్సీపీ అభ్యర్థి మేకపాటి రాజగోపాల్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
నేనున్నానంటూ భరోసా
ఆత్మకూరు/నెల్లూరు(దర్గామిట్టా)/కావలి/కోవూరు: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ శనివారం నెల్లూరు జిల్లాలో తనను కలిసిన పలువురు బాధితులకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. వారి సమస్యలను సావధానంగా విని.. ‘బాధపడకండమ్మా.. ఆదుకుంటానంటూ’ వారి కన్నీళ్లు తుడిచారు. అప్పటికప్పుడు తగిన సాయమందించాలంటూ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి.. అండగా నిలిచారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వల్లిపేడుకు చెందిన గడ్డం పెద సుబ్బయ్య ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. సీఎం జగన్‌ను కలిసి తన బాధను చెప్పుకునేందుకు శనివారం నెల్లూరు సింహపురి ఆస్పత్రి సెంటర్‌కు చేరుకున్నాడు. బస్సు యాత్రలో భాగంగా అక్కడికి చేరుకున్న సీఎం జగన్ అంతమంది జనంలోనూ వీల్‌చైర్‌లో ఉన్న పెద సుబ్బయ్యను చూసి.. పరిస్థితిని ఆరా తీశారు. వెంటనే సుబ్బయ్యకు మెరుగైన చికిత్స అందించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. నా బిడ్డను బతికించన్నా.. నెల్లూరు జిల్లా సింగపేటకు చెందిన వ్యవసాయ కూలీ రవిచంద్ర తన నాలుగేళ్ల కుమార్తె బ్లెస్సీతో కలిసి సీఎం జగన్‌ను కలిసేందుకు ఉలవపాళ్ల కూడలి వద్దకు వచ్చాడు. ‘నా కుమార్తె పుట్టినప్పటి నుంచే జన్యు సంబంధిత సమస్యలతో బధిరత్వం, ఫిట్స్‌తో బాధపడుతోంది. రెండేళ్ల కిందట నా భార్య కూడా చనిపోయింది. చికిత్స కోసం నా కుమార్తెను చెన్నైలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లా.. అనంతరం అక్కడి వైద్యుల సలహా మేరకు రాయవెల్లూర్లో చూపిస్తున్నా. నా బిడ్డను బతికించుకునేందుకు.. చికిత్సకు తగిన సాయం కోసం సీఎం జగన్‌ను కలిసేందుకు వచ్చా’అని రవిచంద్ర చెప్పాడు. వీరి పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి వ్యక్తిగత సిబ్బంది వివరాలన్నీ నమోదు చేసుకున్నారు. అవ్వా.. పింఛన్ వస్తోందా? బస్సు యాత్ర చేస్తున్న సీఎం జగన్ నెల్లూరు జిల్లా నార్త్రాజుపాలేనికి చెందిన పుల్లా లక్ష్మమ్మను ‘అవ్వా, పింఛన్ వస్తోందా’ అంటూ ఆరా తీశారు. ప్రతి నెలా ఒకటో∙తేదీనే వలంటీర్ తమ ఇంటికే వచ్చి పింఛన్ డబ్బులు ఇచ్చేవారని.. చంద్రబాబు నిర్వాకం వల్ల ఈనెల అష్టకష్టాలు పడ్డామని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ‘మళ్లీ నువ్వే రావాలి.. మాలాంటి వృద్ధులను కంటికి రెప్పలా కాపాడాలి’ అని సీఎం జగన్‌ను కోరింది. ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ‘మరో రెండు నెలల్లో నీ మనవడి ప్రభుత్వం మళ్లీ రాబోతోంది. మీ సమస్యలు తీరుస్తా’ అని భరోసా ఇచ్చారు. కాలు దెబ్బతిన్న బాధితుడికి అండ అల్లూరు మండలం తూర్పు గోగులపల్లికి చెందిన సత్యనారాయణకు 20 రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కాలు పూర్తిగా దెబ్బతింది. మెరుగైన వైద్యం కోసం సీఎం జగన్ సాయం కోరేందుకు నెల్లూరుకు వచ్చాడు. సత్యనారాయణను పరామర్శించిన ముఖ్యమంత్రి.. ఆయనకు ఆరోగ్యశ్రీ ద్వారా మెరుగైన వైద్య సేవలందించాలని సిబ్బందిని ఆదేశించారు. ఆ దేవుడికి సమస్యలు చెప్పుకున్నాం.. బుజబుజనెల్లూరుకు చెందిన చల్లా కృష్ణ దంపతులు సీఎం జగన్‌ను కలిసేందుకు జాతీయ రహదారిపైకి వచ్చారు. వారిని చూసిన సీఎం జగన్ బస్సులో నుంచి దిగివచ్చి.. చల్లా కృష్ణ దంపతులతో మాట్లాడారు. తాము అనారోగ్యంతో బాధపడుతున్నామని.. తనకు రెండుసార్లు వైద్యులు ఆపరేషన్ చేశారని చల్లా కృష్ణ సీఎం జగన్‌కు తెలిపారు. తన భార్య ఆరోగ్య పరిస్థితి కూడా సరిగ్గా లేదని.. ముగ్గురు సంతానం ఉన్నారని వివరించారు. వారి సమస్యను విన్న సీఎం జగన్ ‘బాధపడకండి.. ఆదుకుంటా’నంటూ భరోసా ఇచ్చారు. పేదల పాలిట దేవుడైన సీఎం జగన్‌కు తమ సమస్యలు చెప్పుకున్నామని మీడియాకు చల్లా కృష్ణ తెలిపారు. -
నువ్వే కావాలి జగన్
(మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి)సాక్షి ప్రత్యేక ప్రతినిధి: కుల మతాలకు అతీతంగా తమకు మేలు చేసిన సీఎం వైఎస్ జగన్‌ను దగ్గరి నుంచి చూడాలని, వీలైతే మాట్లాడాలని ఊరూ వాడల్లోని చిన్నా, పెద్దా తరలివచ్చి శనివారం 9వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు బ్రహ్మరథం పట్టారు. ‘మళ్లీ నువ్వే కావాలి జగన్’ అంటూ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దిక్కులు పిక్కటిల్లేలా నినదించారు. కావలి బహిరంగ సభ జన సంద్రాన్ని తలపించింది. చింతారెడ్డిపాలెంలోని రాత్రి బస నుంచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ యాత్ర ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. అంతకు ముందు తనను కలిసిన నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కావలి, సర్వేపల్లి, ఆత్మకూరు, ఉదయగిరి, కందుకూరు నియోజకవర్గాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎన్నికల కార్యాచరణపై సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. ఈ క్రమంలో చింతారెడ్డిపాలెం రోడ్‌షోలో ఓ మహిళ తన బిడ్డ అనారోగ్య బాధను చెప్పుకునేందుకు ఎదురు చూస్తుండడాన్ని గమనించిన సీఎం.. దగ్గరకు పిలిపించుకుని మాట్లాడారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భగత్‌సింగ్ కాలనీకి చేరుకునే సరికి జాతీయ రహదారిపై భారీగా హాజరైన మహిళలు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా ఘన స్వాగతం కోవూరు నియోజకవర్గం పడుగుపాడులో పలువురు మహిళలు గుమ్మడికాయలతో దిష్టితీసి సీఎం విజయాన్ని కాంక్షించారు. బుల్లితెర నటుడు రియాజ్ సైతం సీఎంను కలిసి బస్సు యాత్రకు సంఘీభావం తెలిపారు. అనంతరం సున్నబట్టి, తిప్ప మీదుగా సీఎం రోడ్ షో నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటలకు రాజుపాళ్యంలో మండుటెండను సైతం లెక్కచేయకుండా ఎదురు చూస్తున్న అక్కచెల్లెమ్మలను ఆప్యాయంగా పలకరించి సంక్షేమ పథకాల అమలు తీరును అడిగి తెలుసుకున్నారు. చింతరెడ్డిపాలెం నుంచి సింగరాయకొండ వరకు చెన్నై–కోల్‌కతా జాతీయ రహదారిపై ప్రజాభిమానం వెల్లువెత్తింది. బస్సు దిగి సీఎం జగన్ మహిళలు, వృద్ధులను పలుకరించారు. ఎండను లెక్క చేయని అభిమానం ఐదేళ్ల పాలనలో తాము ఆర్థికంగా నిలదొక్కుకుని, ఆత్మగౌరవంతో జీవించడానికి చేదోడుగా నిలిచిన సీఎం జగన్‌ను ఒక్కసారైనా చూడాలన్న ప్రజల కోరిక ముందు భగభగమండే సూరీడు సైతం చిన్నబోయాడు. మిట్ట మధ్యాహ్నం 41 డిగ్రీలకు పైగా ఉన్న ఎండను సైతం లెక్క చేయకుండా తిప్ప, గౌరవరం, కావలి బైపాస్‌లో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, చంటిబిడ్డ తల్లులు రోడ్లపై బారులు తీరి జననేతను చూడటానికి పోటీపడ్డారు. మార్గం మధ్యలో భారీ గజమాలతో సత్కరించారు. సీఎం జగన్ 4.30 గంటలకు రోడ్‌షో ద్వారా కావలిలోని సభా స్థలికి చేరుకున్నారు. సభ అనంతరం సీఎం బస్సు యాత్ర ఏలూరుపాడు, ఉలవపాడు మీదుగా 7 గంటలకు సింగరాయకొండ క్రాస్‌కు చేరుకుంది. ఉదయం నుంచి సీఎం రాక కోసం ఎదురు చూస్తున్న ప్రజలు గజమాలతో స్వాగతం పలికారు. అనంతరం ఓగురు మీదుగా 8 గంటలకు కందుకూరుకు చేరుకున్న సీఎం జగన్ బస్సు యాత్రపై బంతిపూల వర్షం కురిసింది.పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా ప్రకాశం జిల్లాలోని జువ్విగుంట క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి సీఎం జగన్ చేరుకున్నారు. జనసంద్రమైన కావలి పెద్ద ఎత్తున కదలివచ్చిన జనం వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మద్దతుగా కావలిలో నినాదాలు హోరెత్తించారు. జాతీయ రహదారి జనాలతో కిక్కిరిసిపోయింది. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో విశ్వాసానికి జనసంద్రమే ప్రతీక అని పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ఆ బిడ్డను చూడకపోతే ఎలా? సూరీడు నడినెత్తిపైకి వచ్చాడు.. ఎండ వేడికి రోడ్డు సెగలు పుట్టిస్తోంది.. చెట్టు నీడలోనూ చెమట చుక్క ఆరట్లేదు.. ఇంతలో నెత్తిపై తుండు గుడ్డతో బక్కపల్చని శరీరంతో 70 ఏళ్ల వృద్ధురాలు కావలి పట్టణ శివారులో కనిపించింది. ఎవరి కోసమో ఎదురు చూస్తోంది. ‘ఏం అవ్వా.. మండుటెండలో ఇక్కడేం చేస్తున్నావు’ అని అడిగితే.. ‘జగన్ బాబు ఇంకా రాలేదా.. ఎంత దూరంలో ఉన్నాడు..’ అని ఎదురు ప్రశ్నించింది. ‘ఈ వయసులో ఒక పక్క గస పోస్తూ ఎందుకీ తిప్పలు’ అంటే.. ఒకింత కోపంతో చూసింది. నాలాంటోళ్లు ఎందరికో ఆయన ఎంతో మేలు చేశాడు. ‘అలాంటి బిడ్డ మా ఊరికి వచ్చినప్పుడు చూడకపోతే ఎలా? నా పేరు శాంతమ్మ. నాకు ముగ్గురు ఆడ బిడ్డలు. పెళ్లిళ్లు చేసుకుని వెళ్లిపోయారు. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తుంటారు. కానీ.. జగన్ బాబు నా బాగు కోసం ప్రతి నెలా 1వ తేదీనే ఇంటికి పింఛన్ పంపించాడు. అది ఇప్పుడు ఇంటికి రాకుండా వాళ్లు (టీడీపీ)ఆపేశారు. అందుకే జగన్‌బాబు ఏం చేబితే అది చేద్దామని ఇక్కడికి వచ్చాను’ అని చెప్పింది. ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో శాంతమ్మలాంటి ఎంతో మంది అవ్వాతాతలు కనిపించారు. -
నేడు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ఇలా...
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధ్యక్షులు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 9వ రోజు శనివారం (ఏప్రిల్ 6వ తేదీ) షెడ్యూల్‌ను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం శుక్రవారం విడుదల చేశారు. సీఎం వైఎస్ జగన్ శుక్రవారం రాత్రి బస చేసిన చింతరెడ్డిపాలెం ప్రాంతం నుంచి శనివారం ఉదయం 9 గంటలకు బయలుదేరుతారు. కొవ్వూరు క్రాస్, సున్నబట్టి, తిప్ప, గౌరవరం మీదుగా ఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం కావలి క్రాస్ మీదుగా కావలి జాతీయ రహదారి వద్దకు చేరుకుని సాయంత్రం 3గంటలకు బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. సభ అనంతరం ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగూరు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద ఏర్పాటుచేసిన రాత్రి బస శిబిరం వద్దకు చేరుకుంటారు. -
మా కోసం వచ్చాడు మా నాయకుడు
రామగోపాల్ ఆలమూరు – సాక్షి, అమరావతి : ఏప్రిల్ ఒకటో తేదీ మధ్యాహ్నం 12 గంటలు... శ్రీసత్యసాయి జిల్లా బత్తపల్లి మండల కేంద్రానికి సమీపంలో అనంతపురం–కదిరి రోడ్డుపై సీఎం జగన్ బస్సు యాత్ర సాగుతోంది. పొలంలో వేరుశెనగ తొలగిస్తున్న మహిళలు మండుటెండలో పరుగులు తీస్తూ రావటాన్ని గమనించిన సీఎం జగన్ బస్సు ఆపి కిందకు దిగారు. ‘అక్కా బాగున్నారా... పథకాలు అన్నీ అందుతున్నాయా? ఏమైనా ఇబ్బందులున్నాయా?’ అంటూ ఆత్మీయంగా పలకరించారు. ‘అన్ని పథకాలు అందుతున్నాయి.. సంతోషంగా ఉన్నాం.. మళ్లీ నువ్వే రావాలి జగనన్నా’ అంటూ మహిళలు ముక్తకంఠంతో సీఎం జగన్‌ను దీవించారు. ‘మీరు ఇచ్చిన స్ప్రింక్లర్ల వల్ల, ఆసరా, చేయూత, రైతు భరోసా ద్వారా అందించిన ఆర్థిక సాయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేరుశెనగ సాగు చేశాం.. మంచి దిగుబడి వచ్చింది.. ఇదిగో పండిన వేరుశెనగ కాయలు’ అంటూ నాగేంద్రమ్మ అనే మహిళ విరగకాసిన వేరుశెనగ చెట్లను సీఎం జగన్‌కు ఆప్యాయంగా అందించింది. వాటిని సీఎం జగన్ సంతోషంగా తీసుకోవడంతో మురిసిపోయింది. ఏప్రిల్ మూడో తేదీ.. ఉదయం 11.45 గంటలు.. చిత్తూరు జిల్లా సదుం మండలం మతకువారిపల్లెకు సీఎం జగన్ చేసుకునేసరికి రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరారు. అందరినీ పలకరిస్తూ.. అభివాదం చేస్తూ ముందుకు సాగుతుండగా ‘జగనన్నా.. జగనన్నా’ అంటూ ఓ మహిళ ఏడుస్తూ బిగ్గరగా పిలిచింది. అది చూసి బస్సు ఆపి కిందకు దిగిన సీఎం జగన్ ఆమె వద్దకు చేరుకుని ఏమైంది తల్లీ అంటూ పలుకరించారు. ‘అన్నా.. నా కొడుకు ముఖేష్ పక్షవాతంతో బాధపడుతున్నాడు.. వైద్యానికి రూ.15 లక్షల ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు.. నువ్వే నా బిడ్డను రక్షించాలి...’ అంటూ రోదిస్తున్న ఆ మహిళ కన్నీళ్లను తుడిచిన సీఎం జగన్.. ‘తల్లీ నేనున్నా.. నీ బిడ్డకు ఎంత ఖర్చనా వైద్యం చేయిస్తా. బాధపడొద్దు తల్లీ’ అంటూ భరోసా ఇచ్చారు. తన ప్రత్యేక కార్యదర్శి డాక్టర్ హరికృష్ణకు ఆ బాధ్యతలు అప్పగించారు. జగనన్న ఇచ్చిన భరోసాతో ఆ తల్లి గుండె కుదుటపడింది. ఏప్రిల్ మూడో తేదీ సాయంత్రం 4 గంటలు.. చిత్తూరు జిల్లా కల్లూరులో సీఎం జగన్ రోడ్ షో సందర్భంగా ఓ వ్యక్తి బిడ్డను భుజాన ఎత్తుకుని బస్సు వెంట పరుగులు తీస్తున్నాడు. ఆ చిన్నారి ‘జగన్ మామా.. జగన్ మామా’ అంటూ బిగ్గరగా పిలుస్తోంది. అది చూసిన సీఎం జగన్ బస్సు ఆపి డోర్ తీసి నిలబడ్డారు. సీఎం జగన్ వద్దకు చేరుకున్న ఆ చిన్నారి... మామా అంటూ ముద్దు పెట్టి మురిసిపోయింది. చిన్నారిని అక్కున చేర్చుకున్న సీఎం జగన్.. ‘బాగా చదువుకో తల్లీ’ అంటూ దీవించడంతో పట్టలేని ఆనందంతో కేరింతలు కొట్టింది. ఏప్రిల్ నాలుగో తేదీ.. మధ్యాహ్నం 12.30 గంటలు.. తిరుపతి జిల్లా ఏర్పేడులో రోడ్ షో ముగించుకుని ముందుకెళ్తున్న సీఎం జగన్ బస్సు వెంట ఓ యువకుడు రొప్పుతూ పరుగెత్తుతున్నాడు.. చెప్పులు తెగిపోవడంతో వాటిని వదిలేసి కాళ్లు కాలిపోతున్నా లెక్క చేయకుండా ఒక్క ఫోటో ప్లీజ్ జగనన్నా అంటూ పరుగులు తీస్తూ వస్తున్నాడు. ఇది గమనించిన సీఎం జగన్ బస్సు ఆపి ఆ యువకుడిని దగ్గరకు పిలవడంతో సెల్ఫీ తీసుకుని జై జగన్ అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ఏప్రిల్ నాలుగో తేదీ.. మధ్యాహ్నం 2 గంటలకు తిరుపతి జిల్లా చిన్న సింగమలలో టాక్సీ, ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ సమావేశమయ్యారు. ‘జగనన్నా.. శ్రీకాళహస్తిలో ఏడేళ్లుగా ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నా. నాకు అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయి. నాకు ముగ్గురు పిల్లలు.. మీరు ఇస్తున్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో ఇద్దరు పిల్లలను నర్సింగ్, ఒకరిని బీటెక్ చదివించుకోగలుగుతున్నా. నాలాంటి పేదల బతుకులు గొప్పగా మారాలంటే మళ్లీ నువ్వే రావాలి జగనన్నా.. నిన్నే తెచ్చుకుంటాం జగనన్నా’ అంటూ జ్యోతి అనే టాక్సీ డ్రైవర్ ఆనందంగా చెప్పింది. తనకు సొంత ఆటో లేదని, రుణం సమకూర్చి ఆటో కొనివ్వాలని జ్యోతి కోరడంతో ‘అక్కా.. బ్యాంకులతో టైఅప్ ద్వారా నీలాంటి వారికి పావలా వడ్డీకే రుణం ఇప్పించి సొంత ఆటో, టాక్సీ కొనిచ్చే ఏర్పాటు చేస్తాం’ అంటూ సీఎం భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర సందర్భంగా కనిపించిన దృశ్యాల్లో ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. బస్సు యాత్రలో అడుగడుగునా ఇలాంటి ఆత్మీయ దృశ్యాలే సాక్షాత్కారిస్తున్నాయి. అందుకే బస్సు యాత్రను ఆత్మీయానుబంధాల సంగమంగా అభివర్ణిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల తొలి విడత ప్రచారానికి శ్రీకారం చుడుతూ వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని మహానేత వైఎస్సార్ ఘాట్ వద్ద నుంచి సీఎం జగన్ గత నెల 27న ప్రారంభించిన బస్సు యాత్ర రాయలసీమ (వైఎస్సార్, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి) జిల్లాల్లో పూర్తి చేసుకుని నెల్లూరు జిల్లాకు చేరుకుంది. శనివారం నెల్లూరు జిల్లాలో బస్సు యాత్రను సీఎం జగన్ కొనసాగించనున్నారు. రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టమిది సీఎం జగన్‌కు జనం అడుగడుగునా నీరాజనాలు పలుకుతుండటంతో బస్సు యాత్ర రోజూ షెడ్యూలు సమయం కంటే రెండు గంటలు ఆలస్యంగా సాగుతోంది. సూరీడు నిప్పులు చిమ్ముతుండటంతో ఎండలు మండిపోతున్నా.. వడగాలులు ఇబ్బంది పెడుతున్నా.. రాత్రి పొద్దుపోయినా ప్రజలు లెక్క చేయకుండా సీఎం జగన్‌ను చూసేందుకు గంటల కొద్దీ రోడ్డుపై నిరీక్షిస్తున్నారు. తమ వద్దకు సీఎం జగన్ చేరుకోగానే ఆ అలసటను మరచిపోయి సంతోషంగా స్వాగతం పలుకుతున్నారు. సీఎం జగన్ ఆత్మీయ పలకరింపులతో జనం పులకించిపోతున్నారు. ‘అవ్వాతాతా బాగున్నారా.. అక్కాచెల్లెమ్మా బాగున్నారా.. అన్నా బాగున్నారా’ అంటూ పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. వైద్యపరంగా ఏవైనా సమస్యలుంటే వెంటనే సహాయం అందిస్తానని భరోసా ఇస్తూ అక్కడికక్కడే తన సహాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. చిన్నారులను ఎత్తుకుని.. నుదిటిపై ముద్దులు పెడుతూ ఆశీర్వదిస్తుండటంతో సంబరపడుతున్నారు. రాజకీయాల్లో ఓ నాయకుడికి, ప్రజలకు మధ్య ఇలాంటి ఆత్మీయ అనుబంధాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. అందుకే సీఎం జగన్ బస్సు యాత్ర రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టంగా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. విశ్వసనీయతను చాటుకోవడం వల్లే ప్రతిపక్షంలో ఉన్నా.. అధికారంలో ఉన్నా వైఎస్ జగన్ అనుక్షణం ప్రజల పక్షానే నిలబడ్డారు. ఇచ్చిన మాటపై నిలబడి నిబద్ధతతో, నిజాయితీతో పని చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 99 శాతం అమలు చేశారు. కరోనా కష్టకాలంలోనూ ఏ ఒక్క పథకాన్ని నిలుపుదల చేయలేదు. విద్య, వైద్య, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు తెచ్చి రాష్ట్రాన్ని ప్రగతిపథాన నిలిపారు. గ్రామ, వార్డు సచివాలయాలు–వలంటీర్ల వ్యవస్థ, జిల్లాలను పునర్ వ్యవస్థీకరించి పరిపాలనను వికేంద్రీకరించి ఇంటి గుమ్మం వద్దే ప్రభుత్వ సేవలను అందిస్తున్నారు. సుపరిపాలనతో ప్రతి ఇంట్లో.. ప్రతి గ్రామంలో.. ప్రతి నియోజకవర్గంలో విప్లవాత్మక మార్పులు తెచ్చారు. ఐదేళ్లు తమకు కాపు కాచిన సీఎం జగన్ కోసం జనం ఆరాటపడుతున్నారు. తమ కోసం నిలబడ్డ నాయకుడిని కళ్లారా చూసేందుకు పరితపిస్తున్నారు. రాష్ట్రం, తమ భవిష్యత్తు మరింత గొప్పగా ఉండాలంటే జగనే మళ్లీ సీఎం కావాలని నినదిస్తున్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అందరికీ మంచి చేసిన సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో నమ్మకం బలంగా నాటుకుపోయింది. బస్సు యాత్ర పొడవునా ఆత్మీయానుబంధాలను చాటిచెప్పే దృశ్యాలే దానికి నిదర్శనమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఎన్నికలకు ముందే కనిపిస్తున్న ప్రభంజనం.. బస్సు యాత్రలో భాగంగా సీఎం వైఎస్ జగన్ నిర్వహిస్తున్న రోడ్ షోలకు జనం పోటెత్తుతున్నారు. రాత్రి పొద్దుపోయినా పెద్ద ఎత్తున కదిలిస్తున్నారు. వైఎస్సార్ కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో రాత్రి పొద్దుపోయాక దువ్వూరు, చాగలమర్రి, ఆలూరు, ఆస్పరి, అనంతపురం బైపాస్ తపోవనం, రాప్తాడు, కదిరి, సోమల, చంద్రగిరి క్రాస్, చావలిలో నిర్వహించిన రోడ్‌షోలకు ఇసుకేస్తే రాలనంత స్థాయిలో జనం కిక్కిరిసిపోయారు. మా నమ్మకం నువ్వే జగన్.. జగనన్నే మా భవిష్యత్తు అనే నినాదాలతో బస్సు యాత్ర మారుమోగుతోంది. యాత్రలో భాగంగా ప్రొద్దుటూరు, నంద్యాల, ఎమ్మిగనూరు, మదనపల్లె, పూతలపట్టు, నాయుడుపేటలో నిర్వహించిన సభలు జనసంద్రాలను తలపించాయి. పేదింటి భవిష్యత్తు.. రాష్ట్ర భవిష్యత్తును మరింత గొప్పగా మార్చేందుకు నేను సిద్ధం.. మీరు సిద్ధమా..? అంటూ సీఎం జగన్ పిలుపునివ్వడంతో సెల్ఫోన్లో టార్చ్‌లైట్ వెలిగించి చేతులు పైకెత్తి మేమంతా సిద్ధం అంటూ జనం నినదిస్తుండటంతో సభా ప్రాంగణం ఆకాశంలో చుక్కలను తలపించింది. వీటిని పరిశీలిస్తే సిద్ధం సభలతోపాటు పోటీపడుతూ మేమంతా సిద్ధం బస్సు యాత్రకు నీరాజనాలు పలుకుతున్నట్లు స్పష్టమవుతోంది. బస్సు యాత్రను చూస్తుంటే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మరోసారి ప్రభంజనం సృష్టించడం ఖాయమని తేలిపోయిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మానవత్వపు పరిమళాలు.. బస్సు యాత్ర సాగుతున్న రోడ్డుకు ఇరువైపులా చిన్నారులు, అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదమ్ములు కిలోమీటర్ల కొద్దీ బారులు తీరుతున్నారు. పాలనకు మానవీయతను జోడించి సుపరిపాలన అందిస్తున్న సీఎం జగన్ తమ వద్దకు చేరుకోగానే బంతిపూల వర్షం కురిపిస్తూ ఆత్మీయ స్వాగతం పలుకుతూ అభిమానాన్ని చాటుకుంటున్నారు. అక్కచెల్లెమ్మలు సొంత అన్న తమ కోసం వచ్చినట్లుగా భావిస్తూ హారతులు ఇచ్చి నీరాజనాలు పలుకుతున్నారు. అవ్వాతాతలు సీఎం జగన్‌ను సొంత మనవడిలా భావిస్తూ దీవిస్తున్నారు. అన్నదమ్ములైతే జగన్నినాదాలతో హోరెత్తిస్తున్నారు. సీఎం జగన్‌ను దగ్గరగా చూడాలని.. కరచాలనం చేయాలని.. మాట కలపాలని.. చిన్నారుల దగ్గర నుంచి అవ్వాతాతల వరకూ ఆరాటపడుతున్నారు. సీఎం జగన్ వారిని అక్కున చేర్చుకుని యోగక్షేమాలు తెలుసుకుంటూ ఆత్మీయంగా పలకరించడంతో ఆనందపరవశులవుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా జనం బారులు తీరుతుండటంతో సీఎం జగన్ కిలోమీటర్ పరిధిలోనే నాలుగైదు సార్లు బస్సు దిగి అందరినీ పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. మధ్యాహ్నం భోజనం సైతం చేయకుండా ఉదయం 9 నుంచి రాత్రి 11 గంటల వరకూ ప్రజలతో మమేకం అవుతూ ప్రజల మధ్యే గడుపుతున్నారు. -
జన సంద్రం.. సర్వం జగనన్న మంత్రం
ఆ సామిని ఓసారి చూద్దామని.. ఉదయం 11:30 గంటలు.. దాదాపు 40 డిగ్రీల ఉష్ణోగ్రత.. పైన భానుడి భగభగ, కింద రోడ్డు సెగ.. వీటన్నింటినీ లెక్క చేయకుండా ఇద్దరు అవ్వలు అనంతపురం – చెన్నై జాతీయ రహదారిపై మొలకలచెరువు నుంచి మదనపల్లెకు వచ్చే వాహనాలను ఆపి.. ‘మా పెద్ద కొడుకు ఎంత వరకు వచ్చారు?’ అంటూ ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో ‘ఏం అవ్వా.. ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు’ అని అడగ్గా.. ‘మాది ఇక్కడికి కిలోమీటర్ దూరంలో ఉండే ఆవులవారిపల్లె. ఈ రోడ్డులో సీఎం వైఎస్ జగన్ వస్తున్నారని ఉదయం తొమ్మిది గంటల నుంచి ఎదురు చూస్తున్నాం’ అని బదులిచ్చారు. ఇంత ఎండలో మీరెందుకు ఎదురు చూస్తున్నారని ప్రశ్నించగా.. ‘రూ. మూడు వేల పెన్షన్ ఒకటో తేదీ ఉదయాన్నే మా గుమ్మం దగ్గరకు పంపాడు. కడుపున పుట్టిన బిడ్డలే తల్లిదండ్రుల యోగక్షేమాలు పట్టించుకోని ఈ రోజుల్లో మాలాంటి పండుటాకుల కష్టాలను గుర్తెరిగి వలంటీర్ల ద్వారా పెన్షన్ ఇంటికి పంపి అండగా ఉన్నాడు. కంటివెలుగు పథకంతో మా కళ్లకు మసకలు తొలగించాడు. మా ఆరోగ్యానికి అండగా నిలుస్తున్నాడు. ఇంత చేసిన ఆ సామిని ఓ సారి చూద్దామని ఎదురు చూస్తున్నాం’ అని బదులిచ్చారు. (మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) సీఎం వైఎస్ జగన్ ద్వారా లబ్ధి పొందిన వారితో అనంతపురం – చెన్నై జాతీయ రహదారి మంగళవారం కిక్కిరిసింది. తమకు మేలు చేసిన సీఎం వైఎస్ జగన్‌ను ఓ సారి చూద్దామని.. వీలైతే ఆయనను కలుద్దామని.. కుదిరితే మాట్లాడదామని ఆరో రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో అన్నమయ్య జిల్లా ప్రజలు పోటెత్తారు. మదనపల్లె జనసంద్రాన్ని తలపించింది. తంబళ్లపల్లి నియోజకవర్గం ప్రజలు వైఎస్ జగన్‌కు జై కొట్టారు. శ్రీ సత్యసాయి జిల్లా చీకటిమానిపల్లెలో ఏర్పాటు చేసిన బస కేంద్రం నుంచి ఉదయం 10:25 గంటలకు సీఎం జగన్ రోడ్‌షో ప్రారంభించారు. కూత వేటు దూరంలోనే అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశిస్తున్న సీఎం జగన్‌కు ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ములకలచెరువులో భారీ గజమాలతో సీఎంను ప్రజలు సత్కరించారు. రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనానికి అభివాదం చేస్తూ సీఎం ముందుకు కదిలారు. పెద్దపాళ్యం గ్రామంలో హారతులు పట్టి మహిళలు స్వాగతం పలికారు. బస్సు దిగి సీఎం జగన్ మహిళలు, వృద్ధులను పలుకరించి, వారికి ఏమైనా సమస్యలున్నాయోమోనని ఆరా తీశారు. మదనపల్లెకు వెళ్లే మార్గమధ్యలో వేపూరికోట, తుమ్మనంగుట్టల్లో రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనంతో బస్సు దిగి మరీ సీఎం మాట్లాడారు. పెద్దపల్లి క్రాస్ వద్ద రోడ్డంతా బంతిపూలు చల్లి ప్రజలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. అక్కున చేర్చుకున్న ‘అంగళ్లు’ 58 నెలల పాలనలో తాము ఆర్థికంగా నిలదొక్కుకుని, ఆత్మ గౌరవంతో జీవించడానికి చేదోడుగా నిలిచిన సీఎం జగన్‌ను ఒక్కసారైనా చూడాలన్న ప్రజల కోరిక ముందు భగభగమండే సూరీడు సైతం చిన్నబోయాడు. మిట్ట మధ్యాహ్నం 35 డిగ్రీలకు పైగా ఎండను లెక్క చేయకుండా అంగళ్లులో మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, చంటిబిడ్డ తల్లులు రోడ్లపై బారులు తీరి జననేతనను చూడటానికి పోటీపడ్డారు. అంగళ్లు గ్రామంలోకి ప్రవేశిస్తున్న సీఎం జగన్‌కు హారతులు పట్టి పూల వర్షం కురిపించారు. భారీ గజమాలతో సత్కరించారు. భారీ జనసందోహం మధ్య అంగళ్లులో బస్సుపైకి ఎక్కి సీఎం రోడ్‌షో నిర్వహించారు. మధ్యాహ్నం 1.40 గంటల నుంచి అరగంటకుపైగానే సీఎం అంగళ్లులో రోడ్‌షో నిర్వహించారు. అనంతరం అంగళ్లు శివారులోని విశ్వం కాలేజీ వద్ద భోజన విరామ శిబిరానికి చేరుకున్నారు. భోజన విరామ శిబిరం నుంచి సాయంత్రం 4.10 గంటలకు సీఎం జగన్ మదనపల్లె వైపు బయలుదేరారు. అమ్మచెరువుమిట్ట వద్ద మదనపల్లె నాయకులు సీఎం జగన్‌కు ఎదురేగి ఘనస్వాగతం పలికారు. పోటెత్తిన జన సందోహం మధ్య అక్కడి నుంచి రోడ్‌షో మదనపల్లె వైపునకు సాగింది. పెద్ద ఎత్తున కదలివచ్చిన జనం వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి మద్దతుగా చేసిన నినాదాలు హోరెత్తించాయి. టిప్పు సుల్తాన్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ వద్దకు 5 కి.మీ మేర దూరంలో రోడ్‌షో ముగియడానికి 1.30 గంటలకు పైగా సమయం పట్టింది. మదనపల్లె టిప్పు సుల్తాన్ మైదానంలో నిర్వహించిన ‘మేమంతా సిద్ధం’ సభ సూపర్ సక్సెస్ అయింది. మధ్యాహ్నం 3.30 గంటలకు సభ ప్రారంభం అవ్వాల్సి ఉండగా, మధ్యాహ్నం 12 గంటల నుంచే ప్రజలు గ్యాలరీల్లోకి చేరుకున్నారు. షెడ్యూల్ ప్రకారం సీఎం సభ ప్రాంగణానికి చేరుకునేలోపే మైదానం మొత్తం నిండిపోయి, బయట రోడ్డుపైనాజనాలు పోటెత్తారు. మంగళవారం రాత్రి అన్నమయ్య జిల్లాలో బస్సు యాత్ర ముగించుకుని పుంగనూరు మండలం కృష్ణాపురం వద్ద చిత్తూరు జిల్లాలోకి సీఎం జగన్ ప్రవేశించారు. ఈ క్రమంలో జిల్లా ప్రజలు, నాయకులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. అక్కడ నుంచి బోయకొండ క్రాస్‌కు వెళ్లే మార్గంలో ప్రజలు చీకట్లో కూడా రహదారిపైకి చేరుకుని సీఎంను కలిశారు. మహిళలు, చిన్నారులు, వృద్దులు పూలు చల్లుతూ అపూర్వ స్వాగతం పలికారు. ఇక్కడ బస్ పైకి ఎక్కి ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం ముందుకు సాగారు. అనంతరం చౌడేపల్లిలో సీఎం రోడ్ షో నిర్వహించారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో సోమాల మండలం అమ్మగారిపల్లె శివారులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు. -
కదం తొక్కిన స్టార్ క్యాంపెయినర్లు
4 వ రోజు స్టార్ క్యాంపెయినర్లతోసీఎం వైఎస్ జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో భాగంగా నాలుగో రోజైన శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో పర్యటించిన సీఎం వైఎస్ జగన్ పలు ఫొటోలను ట్వీట్ చేశారు. ‘నాలుగో రోజు మేమంతా సిద్ధం యాత్రలో నా స్టార్ క్యాంపెయినర్లతో..’ అంటూ పేదలతో మమేకమైన ఫొటోలను ముఖ్యమంత్రి విడుదల చేశారు. ఈ ఫొటోలు అందర్నీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. – సాక్షి, అమరావతి (మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ‘వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో మీకు మంచి జరిగి ఉంటే మీ బిడ్డనైన నాకు అండగా నిలవండి. మీరే నా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాలి. జరిగిన మంచిని ఇంటింటా వివరించాలి’ అని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపునకు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. గత ఐదేళ్ల పాలనలో ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన ప్రజలందరూ స్టార్ క్యాంపెయినర్లుగా మారి ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో కదం తొక్కుతున్నారు. నాలుగో రోజు శనివారం కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొనసాగిన బస్సు యాత్రలోని సన్నివేశాలే ఇందుకు నిదర్శనం. యాత్రలో ఆద్యంతం ప్రజల నుంచి ఘన స్వాగతం లభించడంతో పాటు, మండుటెండను సైతం లెక్క చేయకుండా ముసలిముతక, మహిళలు, యువత.. ఇలా అన్ని వర్గాల వారు బ్రహ్మరథం పట్టారు. శనివారం ఉదయం కర్నూలు జిల్లా రాతన వద్ద బస శిబిరంలో పత్తికొండ, ఆలూరు, మంత్రాలయం, కళ్యాణదుర్గం, కర్నూలు జిల్లా ముఖ్యనేతలు సీఎం జగన్‌ను కలిశారు. సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారికి సీఎం జగన్ దిశా నిర్దేశం చేశారు. అనంతరం 10.30 గంటల ప్రాంతంలో శిబిరం నుంచి యాత్రను ప్రారంభించారు. రాతన గ్రామంలో భారీ గజమాలతో, ఆనందోత్సాహాలతో సీఎంకు స్వాగతం పలికారు. ఊరంతా∙రోడ్డుకు ఇరువైపులా పెద్ద ఎత్తున బారులు తీరి వైఎసార్సీపీ ప్రభుత్వానికి తమ మద్దతు తెలియజేశారు. అనంతరం ఇదే జిల్లా తుగ్గలికి చేరుకున్న సీఎం జగన్ గ్రామస్తులతో ముఖాముఖి నిర్వహించారు. గ్రామంలో గడిచిన ఐదేళ్లలో అన్ని వర్గాల వారికి ప్రభుత్వం చేసిన మంచిని సీఎం వివరించారు. అనంతరం పలువురు గ్రామస్తులతో మాట్లాడారు. జాతీయ రహదారి పొడవునా జనమే జనం గుత్తి పట్టణంలో రోడ్‌షో తర్వాత బెంగళూరు జాతీయ రహదారి(ఎన్‌హెచ్44)పై మిడుతూరు, పామిడి, కల్లూరు, గార్లదిన్నె మీదుగా సీఎం అనంతపురం చేరుకున్నారు. గుత్తి నుంచి అనంతపురం వరకూ జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న గుత్తి, పామిడి, గార్లదిన్నె, రాప్తాడు మండలాల గ్రామాల్లోని ప్రజలు రోడ్డు మీదకు చేరుకున్నారు. దీంతో ప్రతి పాయింట్ వద్ద సీఎం జగన్ బస్సు ఆపి ప్రజలకు అభివాదం చేశారు. పామిడిలో వేల మంది జనం జాతీయ రహదారి మీదకు చేరుకుని సీఎం జగన్‌కు తమ మద్దతు తెలియజేశారు. శింగనమల నియోజకవర్గ ప్రజలు కల్లూరులో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతపురం పట్టణంలోని రాజీవ్‌కాలనీ, తపోవనం ప్రజలు, నాయకులు అతిపెద్ద గజమాలలతో సీఎం జగన్‌కు ఘన స్వాగతం పలికారు. షెడ్యూల్ ప్రకారం రాత్రి 7 గంటలకు అనంతపురం చేరుకోవాల్సి ఉండగా 9 గంటలు దాటాక చేరుకున్నారు. ప్రతి గ్రామంలో పెద్ద ఎత్తున జనాలు కదిలి వచ్చి రోడ్లపై బారులు తీరడంతో ఉదయం నుంచే నిర్దేశించిన షెడ్యూల్ కంటే చాలా ఆలస్యంగా యాత్ర కొనసాగింది. అయినపటగ్పటికీ ప్రజలు ఏ మాత్రం విసిగి పోకుండా అభిమాన నేతను కలవడానికి ఓపికతో వేచిచూశారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అవినీతికి తావులేకుండా సంక్షేమ ఫలాలను తమ దరిచేర్చడంతో పాటు, వైఎస్సార్ ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి, జగనన్న విద్యా కానుక, వైఎస్సార్ పెన్షన్ కానుక వంటి వివిధ విప్లవాత్మక పథకాలను అమలు చేస్తూ తమకు అండగా నిలిచిన సీఎం జగన్‌ను చూసి ప్రజలు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. అనంతపురంలో రోడ్‌షో అనంతరం రాప్తాడు, ఎస్కేయూ మీదుగా శ్రీసత్యసాయి జిల్లా సంజీవపురం వరకు యాత్ర చేరుకుంది. రాత్రి 10.30 గంటలకు రాప్తాడు చేరుకుంది. అప్పటికే రోడ్డుపై ఉన్న వేల మంది జనాలు జై జగన్ నినాదాలతో సీఎంపై అభిమానాన్ని చాటుకున్నారు. కర్నూలు జిల్లాలోని పత్తికొండ, అనంతపురం జిల్లా గుంతకల్లు, తాడిపత్రి, శింగనమల, అనంతపురం, రాప్తాడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో నాలుగో రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతంగా కొనసాగింది. నాలుగోరోజుబస్సు యాత్రకు అపూర్వ స్పందన కర్నూలు (సెంట్రల్)/తుగ్గలి: ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రకు అభిమానం పోటెత్తింది. పల్లె పల్లెలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళలు, వృద్ధులు, యువతీ యువకులు, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకుల నుంచి అపూర్వ స్పందన లభించింది. అడుగడుగునా పూల స్వాగతంతో అభిమానం చాటుకున్నారు. భారీ క్రేన్లతో గజమాలలు వేసి ఉప్పొంగిపోయారు. నాలుగో రోజు బస్సు యాత్ర పత్తికొండ నుంచి అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. ఉదయం 10.32 గంటలకు సీఎం వైఎస్ జగన్ రాత్రి బస చేసిన శిబిరం నుంచి యాత్ర ప్రారంభమైంది. మధ్యాహ్నం 2.25 గంటలకు అనంతపురం జిల్లా గుత్తి మండలం బసినేపల్లె పొలిమేర్లలోకి చేరుకోవడంతో కర్నూలు జిల్లాలో యాత్ర ముగిసింది. తుగ్గలిలో ఏర్పాటు చేసిన ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ప్రజల సమస్యలు విన్నారు. సలహాలు స్వీకరించారు. బస్సు యాత్ర సాగిందిలా.. ♦ ఉదయం 10 గంటలకు అనంతపురం జిల్లా కల్యాణదుర్గం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఉమా మహేశ్వర నాయుడు, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మడివరం జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పితాని బాలకృష్ణ, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సానబోయిన మల్లికార్జున్‌తోపాటు పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీలో చేరారు. వీరికి సీఎం వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ♦ ఉదయం 10.32 గంటలకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర నాలుగో రోజు పత్తికొండలో ప్రారంభం. ♦ 10.50 గంటలకు రాతనలో అపూర్వ స్పందన. భారీ క్రేన్ ద్వారా సీఎంకు గజమాల వేసి పూల బాట పరిచారు. ♦ 11.20 గంటలకు మాజీ ఎమ్మెల్యే, దివంగత తమ్మారెడ్డి కుటుంబాన్ని సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. తమ్మారెడ్డి పెద్ద కుమారుడు ప్రతాపరెడ్డి, సోదరుని కుమారుడు ప్రహ్లాదరెడ్డి చిత్రపటాల వద్ద నివాళులర్పించారు. ఇటీవల కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కోలుకున్న తమ్మారెడ్డి చిన్న కుమారుడు శ్రీనివాసరెడ్డి, కోడళ్లు రంగమ్మ, విజయలక్ష్మి, అరుణమ్మలను పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులు రమణారెడ్డి, శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, మోహన్‌రెడ్డి, చంద్రశేఖరరెడ్డితో మాట్లాడారు. ♦ 11.46 గంటలకు తుగ్గలి సమీపంలో ప్రజలతో ముఖాముఖి. ♦ మధ్యాహ్నం 1.29 గంటలకు గిరిగెట్లలో ప్రజల ఘన స్వాగతం. ♦ 1.49 గంటలకు జొన్నగిరిలో పూల వర్షం. తమ గ్రామ సమీపంలోని చెరువును హెచ్ఎన్ఎస్ఎస్ నీటితో నింపాలని విన్నపం. ♦ 2 గంటలకు ఎర్రగుడిలో సీఎం జగన్ కాన్వాయ్‌పై పూల వర్షం. ♦ 2.25 గంటలకు అనంతపురం జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశం. ♦ రాత్రి 11 గంటలకు బస శిబిరానికి చేరుకున్న సీఎం జగన్ గుత్తిలో జన సునామీ తుగ్గలిలో ముఖాముఖి అనంతరం తిరిగి బస్సు యాత్ర ప్రారంభమై జొన్నగిరి, ఎర్రగుడి మీదుగా అనంతపురం జిల్లాలోకి ప్రవేశించింది. మిట్ట మధ్యాహ్నం భానుడి ప్రతాపాన్ని ఏ మాత్రం లెక్క చేయకుండా రోడ్లపై బారులు తీరి తమ అభిమాన నాయకుడికి ప్రజలు సంఘీభావం తెలిపారు. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోకి ప్రవేశించిన యాత్ర బసినేపల్లి, గుత్తి ఆర్‌ఎస్‌ల మీదుగా గుత్తి పట్టణానికి చేరుకుంది. బసినేపల్లి నుంచి గుత్తి పట్టణం వరకూ ఇసుకేస్తే రాలనంతగా జనం యాత్రలో మమేకం అయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే శనివారం సాయంత్రం గుత్తి పట్టణం జన సునామీని తలపించింది. అశేషమైన జనం కదలి రావడంతో సీఎం జగన్ రోడ్ షో కాన్వాయ్ ముందుకు చాలా నెమ్మదిగా కదిలింది. గుత్తి రైల్వే బ్రిడ్జ్ నుంచి ఎన్‌హెచ్ 44 మధ్య 7 కి.మీ దూరం రెండు గంటలకు పైగానే రోడ్‌షో కొనసాగింది. బస్సుపై నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ ముందుకు సాగారు. -
Lok Sabha Elections 2024: మండిలో కంగన రోడ్ షో
సిమ్లా: బాలీవుడ్ నటి, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తాను తొలిసారి ఎన్నికల బరిలో దిగుతున్న హిమాచల్‌ప్రదేశ్‌లోని మండిలో శుక్రవారం రోడ్ షో చేశారు. కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేత్ ఇటీవల తనపై చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా తీవ్రంగా దుయ్యబట్టారు. ‘‘మీ అక్కాచెల్లెళ్లకు, కూతుళ్లకు వెల కట్టేవాళ్లు ఎప్పటికీ మీవాళ్లు కాలేరు. ఇక్కడ తపస్సు చేసిన మాండవ రుషి నుంచి ఈ పట్టణానికి మండి అని పేరొచి్చంది. అలాంటి పేరును కూడా కించపరుస్తున్నారు’ అని రోడ్ షోకు పోటెత్తిన జనాన్ని ఉద్దేశించి అన్నారు. ‘మండిలో ఇప్పుడు ఏ రేటు పలుకుతోంది’ అని కంగనాపై సుప్రియ ఇన్‌స్ట్రాగాంలో పెట్టిన పోస్టు దుమారం రేపడం తెలిసిందే. -
#MemanthaSiddham : జైత్రయాత్ర ఆరంభం
మేమంతా సిద్ధం బస్సు యాత్ర నుంచి సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: మండుటెండనూ లెక్క చేయకుండా కి.మీ. కొద్దీ రోడ్డుకు ఇరువైపులా బారులు తీరిన జనం.. నిప్పులు చిమ్ముతున్న సూరీడుతో పోటీపడుతూ చంటిబిడ్డలను చంకనేసుకుని బస్సు వెనుక పరుగులు తీసిన ఆడబిడ్డలు.. రోడ్డుకు ఇరువైపులా గ్రామాల్లో టెంట్లు వేసి వంటలు వండుకుని, సామూహికంగా భోజనాలు చేసి గంటల తరబడి నిరీక్షించిన ప్రజానీకం..! వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్ ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్రలో తొలిరోజు కనిపించిన దృశ్యాలు ఇవి. సీఎం జగన్ నాయకత్వంపై ప్రజల్లో బలంగా నాటుకుపోయిన నమ్మకానికి ఈ దృశ్యాలు ప్రతీకగా నిలిచాయి. వైఎస్సార్ జిల్లాలోని ఇడుపులపాయ నుంచి వైఎస్సార్సీపీ ఎన్నికల ప్రచార భేరిని సీఎం జగన్ బుధవారం మోగించారు. తాడేపల్లి నివాసం నుంచి ఉదయం 11.50 గంటలకు బయలుదేరిన సీఎం జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు మధ్యాహ్నం ఒంటి గంటకు చేరుకున్నారు. తన మాతృమూర్తి వైఎస్ విజయమ్మతో కలిసి వైఎస్సార్‌కు నివాళులు అర్పించారు. అనంతరం తల్లి విజయమ్మ ఆశీస్సులు తీసుకున్నారు. సర్వమత ప్రార్థనలు నిర్వహించి భారీ ఎత్తున తరలివచ్చిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానుల నినాదాల నడుమ బస్సు యాత్రను సీఎం జగన్ ప్రారంభించారు. ఇడుపులపాయ నుంచి కుమారునిపల్లి వద్దకు బస్సు యాత్ర చేరుకునే సరికి రోడ్డుకు ఇరువైపులా భారీ ఎత్తున జనం బారులు తీరారు. భారీ క్రేన్‌తో గజమాల వేసి సీఎం జగన్‌కు ఆత్మీయ స్వాగతం పలికారు. జనసంద్రమైన వేంపల్లి.. ప్రజలు భారీ ఎత్తున తరలిరావడంతో వేంపల్లి జనసంద్రంగా మారింది. వేంపల్లి అడ్డ రోడ్డు నుంచి హనుమాన్ సర్కిల్ వరకూ సీఎం జగన్ రోడ్ షో నిర్వహించారు. సీఎం జగన్‌ను చూడగానే అవ్వాతాతల నుంచి చిన్న పిల్లల వరకూ హర్షద్వానాలతో ఘనస్వాగతం పలికారు. హనుమాన్ సర్కిల్ వరకూ కి.మీ. కొద్దీ ఇసుకేస్తే రాలనంత స్థాయిలో రోడ్డుపై కిక్కిరిసిన జనం సీఎం జగన్ బస్సు యాత్రకు నీరాజనాలు పలికారు. మండటెండను కూడా లెక్క చేయకుండా చంటిబిడ్డలను ఎత్తుకుని బస్సు వెంట నడుస్తూ సీఎం జగన్‌ను చూసేందుకు పోటీపడ్డారు. బస్సు యాత్ర సాగుతున్న రహదారికి ఇరువైపులా మారుమూల గ్రామాల ప్రజలు భారీ ఎత్తున రోడ్డుపైకి తరలివచ్చి టెంట్లు వేసుకుని, వంటలు వండుకుని, సామూహికంగా భోజనాలు చేస్తూ సీఎం జగన్ రాక కోసం గంటల కొద్దీ నిరీక్షించారు. బస్సు యాత్ర తమ వద్దకు చేరుకోగానే సీఎం జగన్‌పై బంతిపూల వర్షం కురిపిస్తూ అడుగడుగునా నీరాజనాలు పలకడంతో యాత్ర ఆలస్యంగా ముందుకు సాగింది. అమ్మ భావోద్వేగం... పులివెందుల: ఇడుపులపాయ నుంచి బస్సు యాత్ర ప్రారంభం సందర్భంగా వైఎస్సార్ ఘాట్ వద్ద ప్రార్థన నిర్వహించిన వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా బిడ్డను నీకే అప్పజెబుతున్నా దేవుడా..! నా బిడ్డ కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా ఉన్నావు..! ప్రతి బాధలోనూ తోడుగా ఉన్నావు..! నా బిడ్డ తలపెట్టిన కార్యక్రమాలను జయప్రదం చేయాలి..! నా బిడ్డను మళ్లీ సీఎంగా చేయాలని కోరుకుంటున్నా..!’ అంటూ ప్రార్థన చేసిన అనంతరం సీఎం జగన్‌ను ఆప్యాయంగా ముద్దాడగా.. ఆయన భావోద్వేగంతో తన తల్లిని ఆలింగనం చేసుకున్నారు. వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించిన వారిలో డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యులు గొల్ల బాబురావు, మేడా రఘునాథరెడ్డి, ఎంపీలు వైఎస్ అవినాష్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, చింతా అనూరాధ, ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, శ్రీకాంత్‌రెడ్డి, సుధాకర్‌బాబు, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు రమేష్‌యాదవ్, రామచంద్రారెడ్డి, ప్రభాకర్, తలశిల రఘురాం, జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు, జడ్పీ ఛైర్మన్ అమర్నాథరెడ్డి, చల్లా మధుసూదన్‌రెడ్డి, దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డి, సీఎం కార్యాలయ కోఆర్డినేటర్ జనార్దన్‌రెడ్డి, ఎన్ఆర్ఐ రత్నాకర్ తదితరులున్నారు. జిల్లా చరిత్రలో అతి పెద్ద ప్రజాసభ.. ప్రొద్దుటూరులో బహిరంగ సభ షెడ్యూలు ప్రకారం సాయంత్రం 4.30 గంటలకు ప్రారంభం కావాలి. కానీ.. రహదారి పొడవునా జనం బారులు తీరి స్వాగతం పలకడంతో బైపాస్ రోడ్డు సమీపంలోని సభా ప్రాంగణానికి సాయంత్రం 6.30 గంటలకు సీఎం చేరుకున్నారు. అప్పటికే 30 ఎకరాల్లో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం జనంతో కిక్కిరిసిపోయింది. సీఎం జగన్ వేదికపైకి చేరుకుని ర్యాంప్ వాక్ చేస్తూ అభివాదం చేస్తున్నంత సేపు ప్రాంగణం ప్రజల హర్షధ్వానాలతో మారుమోగిపోయింది. గత 58 నెలలుగా సంక్షేమాభివృద్ధి పథకాలు, సుపరిపాలనతో చేసిన మంచిని వివరిస్తూ.. టీడీపీ– జనసేన–బీజేపీ కూటమి సర్కార్ 2014–19 మధ్య చేసిన మోసాలను ఎండగడుతూ సీఎం జగన్ చేసిన ప్రసంగానికి విశేష స్పందన లభించింది. ప్రొద్దుటూరులో సీఎం జగన్ నిర్వహించిన సభ వైఎస్సార్ కడప జిల్లా చరిత్రలో అతి పెద్ద ప్రజాసభగా నిలిచింది. ప్రచండ భానుడితో పోటీపడుతూ.. నిప్పులు గక్కుతున్న సూరీడుతో పోటీపడుతూ సీఎం జగన్ కోసం రహదారిపై భారీ ఎత్తున జనం గంటల కొద్దీ నిలబడ్డారు. కమలాపురం నియోజకవర్గంలో వీరపునాయునిపల్లె, గంగిరెడ్డిపల్లి, సంగాలపల్లిలో బస్సు యాత్రకు నీరాజనాలు పలికారు. మండల కేంద్రమైన వీరపునాయునిపల్లిలో సీఎం జగన్ నిర్వహించిన రోడ్ షోకు విశేష స్పందన లభించింది. జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్లలోని మెయిన్ రోడ్డు జనసంద్రంగా మారింది. ఎర్రగుంట్లలో సీఎం జగన్ నిర్వహించిన రోడ్ షో సూపర్ హిట్ అయ్యింది. రాత్రి పూట జన నీరాజనం.. ప్రొద్దుటూరు సభ రాత్రి 8 గంటలకు ముగిసింది. అనంతరం బస్సు యాత్ర మైదుకూరు నియోజకవర్గం దువ్వూరుకు చేరుకునే సమయంలో దారిలో రాత్రి పూట కూడా జనం భారీ ఎత్తున రహదారిపై గంటల తరబడి నిరీక్షించారు. సీఎం జగన్‌పై బంతి పూలవర్షం కురిపించి అభిమానాన్ని చాటుకున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో బస్సు యాత్ర ముగిసి బుధవారం రాత్రి 9.20 గంటలకు నంద్యాల జిల్లా చాగలమర్రిలో ప్రవేశించింది. చాగలమర్రిలో జనం సీఎం జగన్‌కు నీరాజనాలు పలికారు. దారి పొడవునా ఘనస్వాగతాల నడుమ ఆళ్లగడ్డ క్రాస్‌లో బస చేసేందుకు ఏర్పాటు చేసిన శిబిరానికి రాత్రి 10 గంటలకు చేరుకున్నారు. బస్సు యాత్ర తొలి రోజు గ్రాండ్ సక్సెస్ కావడంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నయా జోష్ నెలకొంది. నేడు నంద్యాలలో సీఎం జగన్ సభ ఆళ్లగడ్డ నుంచి రెండో రోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభం సాక్షి, అమరావతి: మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజైన గురువారం నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో సీఎం జగన్మోహన్రెడ్డి నైట్ హాల్ట్ ప్రాంతం నుంచి ప్రారంభంకానుంది. యాత్ర గురు వారం షెడ్యూల్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం వెల్లడించారు. ఆ వివరాల ప్రకారం.. ఉదయం 9 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బయలుదేరి నల్లగట్ల, బత్తలూరు, ఎర్రగుంట్ల చేరుకొని గ్రామ స్థులతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొంటారు. అనంతరం గోవిందపల్లి మీదుగా ప్రయాణించి చాబోలు శివారులో భోజన విరామం తీసుకుంటారు. తర్వాత నూనేపల్లి మీదుగా నంద్యాల చేరుకుని గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పాణ్యం, సుగాలిమిట్ట, హుస్సేనాపురం, ఓర్వకల్, నన్నూర్, పెద్దటేకూరు, చిన్నకొట్టాల, కె.మార్కాపురం క్రాస్, నాగలాపురంలో ప్రజలతో మమేకమవుతూ పెంచికలపాడులో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు. -
Lok Sabha elections 2024: కోయంబత్తూర్ రోడ్ షోకు హైకోర్టు ఓకే
చెన్నై: ఈ నెల 18వ తేదీన తమిళనాడులోని కోయంబత్తూర్ నగరంలో నాలుగు కిలోమీటర్ల మేర సాగాల్సిన ప్రధాని మోదీ రోడ్ షోకు మద్రాస్ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. మతపరంగా సున్నితమైన ప్రాంతం అనే కారణంతో కోయంబత్తూర్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ రోడ్ షోకు అనుమతి నిరాకరించడం సహేతుకంగా లేదని హైకోర్టు పేర్కొంది. ప్రధానమంత్రికి నిరంతరం స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ భద్రత ఉంటుందని గుర్తు చేసింది. ‘ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వంటి ఉన్నత హోదా కలిగిన నాయకులను ప్రజలు ఎన్నుకున్నారు. కాబట్టి, తమను ఎన్నుకున్న వారిని కలవకుండా నేతలను ఆపడం సరికాదు’అని అభిప్రాయపడింది. కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటల తర్వాత రోడ్ షో జరగనున్నందున పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందీ ఉండదన్నారు. రోడ్ షోకు అనుమతి నిరాకరిస్తూ పోలీస్ కమిషనర్ పురమ్ రంగే తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రమేశ్ కుమార్ వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్.ఆనంద్ వెంకటేశ్ శుక్రవారం విచారణ జరిపారు. రోడ్ షోకు షరతులతో కూడిన అనుమతివ్వాలని కమిషనర్‌ను ఆదేశించారు. -
మల్కాజిగిరిలో ప్రధాని మోదీ రోడ్‌షో
సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటిస్తున్నారు. మల్కాజిగిరి రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. మల్కాజిగిరి, హైదరాబాద్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలను దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసిన రోడ్‌షోకి భారీ ఎత్తున అభిమానులు తరలివచ్చారు. ప్రధాని మోదీ రోడ్ షో మీర్జాలగూడ చౌరస్తా నుంచి ప్రారంభమైంది. సుమారు 1.3 కి.మీ. దూరంలో ఉన్న మల్కాజిగిరి చౌరస్తా వరకు రోడ్‌షో జరుగుతుంది. దారి పొడవునా సుమారు 60 స్వాగత వేదికలు ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు రోజుల(నేడు, రేపు) నగర పర్యటన దృష్ట్యా భద్రతను కట్టుదిట్టం చేశారు. మోదీ విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోనున్న నేపథ్యంలో దానిని కేంద్ర బలగాలు తమ ఆధీనంలోకి తీసుకు న్నాయి. ఎయిర్పోర్ట్ పరిసరాలను అణువణువూ జాగిలాలతో జల్లెడ పట్టాయి. నేడు మోదీ రోడ్ షో పూర్తిచేసుకుని తిరిగి రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. శనివారం ఉద యం 10.40 నుంచి 11.15 మధ్య రాజ్‌భవన్ నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. -
ప్రధాని రోడ్ షోకు అనుమతి నిరాకరణ
చెన్నై: లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ప్రచారాలను ముమ్మరం చేశాయి. బీజేపీ, కాంగ్రెస్‌తో సహా ప్రాంతీయ పార్టీలు సైతం అభ్యర్ధుల ప్రకటన, ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. శుక్రవారం తమిళనాడు, కేరళ, తెలంగాణ రాష్ట్రాల పర్యటన చేపట్టిన మోదీ.. వచ్చేవారం మరోసారి తమిళనాడులో పర్యటించనున్నారు. మార్చి 18న ప్రధాని కోయంబత్తూర్‌లో 3.6 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ ర్యాలీలో దాదాపు లక్షమంది పాల్గొనే అవకాశముందని తెలిపింది. అయితే కోయంబత్తూర్‌లో నిర్వహించే ప్రధాని రోడ్‌షోకు రాష్ట్ర పోలీసులు అనుమతివ్వలేదు. భద్రతాపరమైన కారణాలు, ప్రజలకు అసౌకర్యం, ముఖ్యంగా విద్యార్ధులకు ఇబ్బంది తదితర కారణాల దృష్ట్రా జిల్లా పోలీసు అధికారులు అనుమతి నిరాకరించారు. అలాగే రోడ్‌షో కోసం బీజేపీ ఎంచుకున్న మార్గం మత ఘర్షణలు చెలరేగేందుకు అవకాశాలున్న ప్రాంతమని పోలీసులు పేర్కొన్నారు. కాగా మోదీ రోడ్ షో చేసే కోయంబత్తూరులోని ఆర్ఎస్ పురంలో 1998లో వరస పేలుళ్లు జరిగాయి. అప్పటి నుంచి ఈ ప్రాంతంపై పోలీసులు ప్రత్యేక దృష్టిపెట్టారు. అక్కడ మతపరమైన ఘర్షణలు జరిగే అవకాశం ఉన్నందున ఏ రాజకీయ పార్టీలు, సంఘాలకు రోడ్‌షోలకు అనుమతి ఇవ్వడం లేదు. చదవండి: కేరళలో కమలం వికసిస్తుంది: ప్రధాని మోదీ -
ప్రసాదం తెచ్చిన తంటా!.. రోడ్డుపైనే సెలైన్లు పెట్టి..
వందలాది మంది రోగులు నడి రోడ్డు మీదే చికిత్స అందించారు వైద్యులు. పైగా చెట్లకు తాళ్లు కట్టి..వాటికి సైలెన్స్ బాటిళ్లను వేలాడదీశారు. ఈ షాకింగ్ ఘటన మహారాష్ట్రాలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..మహారాష్ట్రాలోని బుల్దానాలో వారం రోజుల పాటు జరిగిన మత కార్యక్రమంలో అపసృతి చోటు చేసుకుంది. ఆఖరి రోజున ప్రసాదంగా తీసుకున్న ఆహారం కారణంగా వందలాది మంది ప్రజలు అస్వస్థతకు గురయ్యారు. అయితే అంతమందిని ఆస్పత్రికి తీసుకువెళ్లగా, అక్కడ బెడ్ల కొరత కారణంగా చాలామందిని రోడ్డుమీదే పడుకోబెట్టి చికిత్స అందించారు. వారందరికి చెట్లకు కట్టివేసిని తాళ్ల సాయంతో సైలెన్ వేలాడదీసి ఇవ్వడం జరిగిది. అయితే దాదాపు 300 మంది అస్వస్థకు గురవ్వగా, వారిలో30 మంది పరిస్థితి విషమంగా ఉదని అధికారులు చెబుతున్నారు. దాదాపు 300 మంది అస్వస్థకు గురైనట్లు తెలిపారు. ఈ మేరకు బాధితులు మాట్లాడుతూ..సమయానికి ఆస్పత్రిలో వెద్యులు ఎవరూ లేరని వాపోయారు. రోగులకు వైద్యం చేయించేందుకు ప్రైవేట్ వైద్యులను పిలిపించల్సి వచ్చిందని అన్నారు. కాగా ఆ జిల్లా కలెక్టర్ కిరణ్ పాటిల్ మాట్లాడుతూ..మెడికల్ ఎమర్జెన్సీ తలెత్తడంతో ఇతర అవసరమైన వైద్య పరికరాలతో సహ వైద్యుల బృందాలతో సత్వరమే చికిత్స అందిస్తున్నామని అన్నారు. అలాగే ప్రసాదం నమునాలు ల్యాబ్‌కి పంపించి పరీక్షలు నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. (చదవండి: ఈ షర్ట్ చాలా కాస్ట్లీ గురూ!) -
Yatra 2 మూవీ : అమెరికాలో రోడ్‌షో
అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘యాత్ర 2’ మూవీ ఫిబ్రవరి 8న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలో వినూత్నంగా ప్రమోషన్స్ చేపట్టింది మూవీ టీమ్. అమెరికాలో ఈ మూవీ రిలీజ్‌కు ముందే యాత్ర జెండా రెపరెపలాడింది. అమెరికాలో నివసిస్తున్న వైఎస్సార్, సీఎం జగన్మోహన్ రెడ్డి అభిమానులు భారీ ర్యాలీ నిర్వహించారు. కొన్ని వందల కార్లు, బైకులతో యాత్ర పోస్టర్స్ పట్టుకుని రోడ్ షో నిర్వహించారు. ముందుగా కార్టర్ బ్లడ్కేర్లో బ్లడ్ డ్రైవ్ చేపట్టారు. వైస్సార్సీపీ మద్దతుదారులు, సినీ అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ రక్తదానంలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు. బ్లడ్ డ్రైవ్‌లో పాల్గొన్న అభిమానులు, యాత్ర టీమ్‌ని పలువురు కొనియాడారు. ఈ మూవీ ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం ఇర్వింగ్‌లోని థామస్ జెఫెర్సన్ పార్క్ నుంచి గాంధీ మెమోరియల్ ప్లాజా వరకు భారీ కారు ర్యాలీ చేపట్టారు. డల్లాస్‌లోని YSRCP అభిమానుల మద్దతుతో యాత్ర టీమ్ ఈ కార్యక్రమం చేపట్టింది. డజన్ల కొద్దీ ఎస్కార్ట్‌లు, 5 వందలకు పైగా కార్ల కాన్వాయ్‌తో ర్యాలీ అద్భుతంగా జరిగింది. ఇక మూడు హెలికాప్టర్లతో నిర్వహించిన ఎయిర్ షో విపరీతంగా ఆకట్టుకుంది. అలాగే యాత్ర 2 ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేడుక కూడా గ్రాండ్‌గా జరిగింది. వెయ్యి మందికి పైగా హాజరై ఈ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ని విజయవంతం చేశారు. ఇది డల్లాస్ చరిత్రలో ఒక అపూర్వమైన సంఘటన నిలిచింది. నిర్మాత శివ మేకతో పాటు మూవీ టీమ్ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. మమ్ముట్టి, జీవా, కేతకి వంటి ప్రముఖ నటులతో, సంతోష్ నారాయణ్, మధి వంటి గొప్ప సాంకేతిక బృందంతో దర్శకుడు మహి వి రాఘవ్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారని కొనియాడారు. USAలోని నిర్వాణ డిస్ట్రిబ్యూటర్స్‌తో పాటు సహాయ సహాకారాలు అందించిన ప్రతిఒక్కరికీ మూవీ టీమ్ ధన్యవాదాలు తెలిపింది. వైస్సార్సీపీ మద్దతుదారులు, నాటతో పాటు పలు తెలుగు సంఘాల నాయకులు, సినీ అభిమానులు ఈ వేడుకల్లో పాల్గొని.. అభినందనలు తెలిపారు. ఇచ్చిన మాట కోసం నిలబడ్డ తండ్రికి తగ్గ తనయుడి కథగా 'యాత్ర 2' తెరకెక్కించారు. 2009 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన రాజకీయ ఘటనల ఆధారంగా 'యాత్ర 2' సినిమాని రూపొందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, టైలర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు బుధవారం రిలీజైన ఈ మూవీ హిట్ టాక్ సొంతం చేసుకుంది. -
ఏక్ 'మసాలా చాయ్'తో భారత్ డెవలప్‌మెంట్‌ని చూపించిన ప్రదాని మోదీ!
జనవరి 26న ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ హాజరైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రెండు రోజుల భారతదేశ పర్యటనలో ఉన్నారు. ముందుగా జైపూర్ రోడ్ షోలో పాల్గొని కొండపై ఉన్న అంబర్ ప్యాలెస్, జంతర్ మంతర్ అబ్జర్వేటరీ హవా మహల్‌లను కూడా సందర్శించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ గురువారం పింక్ సిటీ రోడ్‌షోలో నరేంద్రమో మోదీతో కలిసి ఓపెన్ టాప్ వాహనంలో వెళ్లారు. నగరం నడిబొడ్డున చిన్న మార్గం గుండా పయనమవ్వుతూ ..తొలుత జంతర్‌మంతర్ నుంచి పప్రారంభమయ్యి అలా 18వ శతాబ్దపు ఖగోళ అబ్జర్వేటరీ వరకు సాగింది. వారిద్దరూ వాహనంలో నిలబడి కబుర్లు చెప్పుకుంటూ..ఆ మార్గంలో కనిపించేవారికి అభివాదం చెబుతూ సాగిపోయారు. ఇక మోదీ కూడా రాజస్థాన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి భజన్‌లాల్ శర్మ ప్రమాణ స్వీకారం తదనంతరం జైపూర్‌లో చేసిన తొలి పర్యటన ఇది. ఇక ఆయ ప్రసిద్ధ ప్రదేశాలను సందరర్శించిన తదనంతరం ఇరువురు నాయకులు ఆ హవా మహల్ ముందు ఉన్న దుకాళంలో మసాల్ చాయ్ సిప్ చేస్తూ కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. అక్కడ ఆ షాపు యజమానికి డిజటల్ చెల్లింపు చేసి భారత్‌లో ఇది ఎంత సర్వసాధారణం అన్న విషయాన్ని పరోక్షంగా తెలియజేశారు. అంతేగాదు ఇక్కడకు వచ్చే సందర్శకులు ఇలా డిజిటల్ చెల్లింపులే చేస్తారని ప్రధాని మోదీ మాక్రాన్‌కు తెలియజేశారు. అంతేగాదు మోదీ మాక్రాన్ కోసం అక్కడే ఉన్న ఒక దుకాణంలో అయోధ్య రామ మందిరానికి సంబంధించిన ఓ ప్రతిమను కూడా కొనుగోలు చేశారు. ఇక మోదీ గ్లోబల్ ఫోరమ్‌లలో నగదు రహిత ఆర్థిక వ్యవస్థలో భారత్ అగ్రగామీగా ఉందని పదేపదే నొక్కి చెబుతుండేవారు. పైగా భారత్ డిజిటల్ పరివర్తన గురించి తన ప్రశంగంలో ప్రశంసిస్తుండేవారు కూడా. కాగా, మాక్రాస్ తిరుగు ప్రయాణంలో జైపూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుని, అక్కడ కొండపై పర్యాటక ప్రదేశంగా అలరారుతున్న అంబర్ కోటను కూడా సందర్శించారు. అందుకు సంబంధించిన వీడియో తెగ నెట్టింట వైరల్ అవుతోంది. #WATCH | Rajasthan: Prime Minister Narendra Modi and French President Emmanuel Macron visited a tea stall and interacted with each other over a cup of tea, in Jaipur. French President Emmanuel Macron used UPI to make a payment. pic.twitter.com/KxBNiLPFdg — ANI (@ANI) January 25, 2024 (చదవండి: ఇలా రోటీలు ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ టెక్నిక్ ఫాలో అయితే త్వరగా చేసేయొచ్చు!) -
Republic Day 2024: జైపూర్‌లో మోదీ, మేక్రాన్ రోడ్ షో
జైపూర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ గురువారం జైపూర్‌లో రోడ్ షోలో పాల్గొ న్నారు. మోదీ ఆయనకు అయోధ్య రామాల యం ప్రతిమను కానుకగా అందజేశా రు. ఇద్దరు నేతలు జైపూర్‌లో మసాలా చాయ్ రుచిని ఆస్వాదించారు. ఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకలకు ప్రధాన అతిథిగా హాజరు కానున్న ఫ్రాన్సు అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ భారత్‌లో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం జైపూర్‌కు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద గవర్నర్ కల్రాజ్ మిశ్రా, ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ ఫ్రాన్సు అధ్యక్షుడికి రెడ్ కార్పెట్ పరిచి, అందంగా అలంకరించిన గజరాజులతో స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్టు నుంచి మేక్రాన్ అంబర్ కోటకు వెళ్లారు. జంతర్‌మంతర్ వద్ద ప్రధాని మోదీ ఆయన్ను కలిశారు. పరస్పర కరచా లనం, ఆత్మీయ ఆలింగనాల అనంతరం ఓపెన్ టాప్ కారులో జంతర్‌మంతర్ నుంచి రోడ్ షోకు బయలుదేరారు. ప్రజలకు అభివాదం తెలుపుతూ హవా మహల్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి తాజ్ రామ్‌బాగ్ ప్యాలెస్‌కు చేరుకుని, ద్వైపాక్షిక చర్చలు జరిపారు. -
అయోధ్యలో ప్రధాని మోదీ రోడ్ షో
-
పెనుబల్లి మండలంలో సండ్ర, ఎంపీ పార్థసారథిరెడ్డీ ప్రచారం
-
తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూర్ లో ఎమ్మెల్యే గాదరి ఎన్నికల ప్రచారం
-
గెలిపిస్తే ‘నిజాం షుగర్స్’ తెరిపిస్తాం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్/సాక్షి, కామారెడ్డి/ జగిత్యాల/రాయికల్: తెలంగాణలో బీజేపీని గెలిపిస్తే తక్షణమే నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని... ముఖ్యమంత్రి పీఠాన్ని బీసీకే కట్టబెడతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హామీ ఇచ్చారు. సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్, కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్ట ణం, జుక్కల్ నియోజకవర్గంలోని మేనూర్‌లో నిర్వహించిన సభలతోపాటు జగిత్యాల రోడ్ షోలో ఆయన పాల్గొన్నారు. రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ఇప్పటికే తెరిపించామన్న నడ్డా... తెలంగాణకు పసుపు బోర్డు ఇచ్చిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. ధరణి రద్దు చేసి మీభూమి పోర్టల్ తెస్తాం బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు అవినీతి, కుంభకోణాలకు మారుపేర్లని, ప్రజల సంపదను దోచు కుంటున్న ఆ రెండు పార్టీలకు చరమగీతం పాడాలని ప్రజలకు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అంటే భ్రష్టాచార్ రాక్షసుల సమితి అని దుయ్యబట్టారు. బీఆర్ఎస్ బడాబాబులకు మాత్రమే ఉపయోగపడిందని, డబుల్ బెడ్రూం పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయట్లేదని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సక్రమంగా అందడంలేదని మండిపడ్డారు. ధరణి పోర్టల్ కారణంగా అవినీతి పెరిగిపోయిందని... బీజేపీని గెలిపిస్తే ధరణి పోర్టల్‌ను రద్దు చేస్తామని, లోపాలను సరిదిద్ది మీ భూమి పోర్టల్ తీసుకొస్తామని నడ్డా చెప్పారు. కాంగ్రెస్ వస్తే అవినీతి రాజ్యమే... గతంలో కేంద్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నింగి, నేల, నీరు అనే తేడా లేకుండా అన్నింటిలోనూ అవినీతికి పాల్పడిందని... అలాంటి పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే అవినీతి రాజ్యమేలుతుందని జేపీ నడ్డా ఆరోపించారు. బీజేపీ మాత్రమే అవినీతిరహిత పాలన అందిస్తుందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రెండున్నర లక్షల ఉద్యోగాలు ఇస్తామని... అన్ని వర్గాలకు న్యాయం చేస్తామని నడ్డా హామీ ఇచ్చారు. మోదీ అంటేనే అభివృద్ధి అన్నారు. రోడ్లు, రైల్వే అభివృద్ధి చేశామన్నారు. తెలంగాణ అభివృద్ధికి సైతం బీజేపీ కట్టుబడి ఉందన్నారు. ఇప్పటికే బీబీ నగర్లో ఎయిమ్స్ కడుతున్నామని... అధికారంలోకి వస్తే రైతులకు ఎరువుల సబ్సిడీ, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే బీఆర్ఎస్ అవినీతిపై విచారణ చేపట్టి బాధ్యులను జైలుకు పంపిస్తామన్నారు. -
హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్ షో
సాక్షి, హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్రమోదీ హైదరాబాద్ రోడ్డు షోలో పాల్గొన్నారు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుంచి కాచిగూడ వరకు ప్రధాని రోడ్ షోలో పాల్గొన్నారు. ప్రధాని వెంట వాహనంపై కిషన్‌రెడ్డి, కె. లక్ష్మణ్‌లు ఉన్నారు. వారితో ర్యాలీలో 24మంది ఎమ్మెల్యే అభ్యర్థులు పాల్గొన్నారు.చిక్కడపల్లి నారాయణగూడ మీదుగా ప్రధాని మోదీ రోడ్ షో సాగింది. రోడ్ షోలో ప్రజాలకు అభివాదం చేస్తూ మోదీ ముందుకు సాగారు. ప్రధాని మోదీపై పూల వర్షం కురిపిస్తూ అభిమానులు, కార్యకర్తలు తమ అభిమానాన్ని చాటుకున్నారు. రోడ్ షో అనంతరం అమీర్‌పేట్ గురుద్వార్‌ను మోదీ సందర్శించారు. ఆపై కోటి దీపోత్సవం కార్యక్రమానికి మోదీ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ప్రధాని మోదీ రోడ్ షో నేపథ్యంలో భద్రతాపరమైన చర్యల్లో భాగంగా రెండు మెట్రో స్టేషన్లను ఈ రోజు( సోమవారం ) సాయంత్రం మూసివేశారు. రోడ్డు షో జరగనున్న చిక్కడపల్లి, నారాయణగూడ మెట్రో స్టేషన్లను సాయంత్రం 4.30 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా నగరంలో భారీగా బలగాలను మోహరించారు. 5వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. 🚨 Important Update, Hyderabad! 🚨 For security reasons, in light of PM Shri Narendra Modi's Roadshow today (27/11/2023), Chikkadpally and Narayanaguda stations will be closed 15 minutes before and after the event, tentatively from 16:30 to 18:30 hrs. Arm-B of RTC X Roads… pic.twitter.com/3dps74NQvC — L&T Hyderabad Metro Rail (@ltmhyd) November 27, 2023 హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు.. సాయంత్రం 5గంటలకు ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుండి రోడ్ షో.. 2 కి.మీ మేర రోడ్ షో.. కాచిగూడలో ప్రధాని ప్రసంగం.. ర్యాలీలో పాల్గొననున్న గ్రేటర్ లోని 24మంది ఎమ్మెల్యే అభ్యర్థులు బేగంపేట్ ఎయిర్‌పోర్టు నుంచి బేగంపేట్, గ్రీన్లాండ్స్, పంజగుట్ట, మొనప్ప ఐలాండ్, రాజ్‌భవన్, వీవీ విగ్రహం, నిరంకారీ భవన్.. ఖైరతాబాద్ ఫ్లైఓవర్, నెక్లెస్ రోటరీ, తెలుగు తల్లి జంక్షన్, కట్టమైసమ్మ ఆలయం, ఇందిరా పార్కు, అశోక్‌నగర్ ఆర్టీసి క్రాస్‌రోడ్స్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నుంచి చిక్కడపల్లి, నారాయణగూడ, కాచిగూడ క్రాస్ రోడ్స్ వరకు రోడ్ షో ఉంటుంది. -
ఢిల్లీ లీడర్లకు కేసీఆర్ భయం
సాక్షి, కామారెడ్డి/అబిడ్స్/మలక్‌పేట: ‘కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కాంగనే ఉత్తిగ ఊకుండడు... ఢిల్లీలోనూ తెలంగాణ జెండా పాతుతడని ఢిల్లీ లీడర్లు మోదీ, రాహుల్ గాం«దీకి భయం పట్టుకుంది. అందుకే కామారెడ్డిలో కేసీఆర్‌ను ఖతంజెయ్యాలని (ఓడగొట్టాలని) ఇద్దరూ కలసి కుట్రలుజేస్తున్నరు. అడ్డగోలుగా పైసలు గుమ్మరించి లీడర్లను కొంటున్నరు. ఎందరిని కొంటరో కొననీ.. మిమ్మల్ని (ప్రజలను) మాత్రం కొనలేరు. ప్రజల మద్దతుతో కేసీఆర్ భారీ విజయం సాధిస్తడు’అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు జోస్యం చెప్పారు. మతవిద్వేషాలను రెచ్చగొట్టే బీజేపీకి గుణపాఠం చెప్పాలని... సుస్థిర ప్రభుత్వం కోసం మరోసారి బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు. శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రంతోపాటు హైదరాబాద్‌లోని గోషామహల్, మలక్‌పేట నియోజకవర్గాల పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్ షోలలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు. గల్ఫ్ వలసపోయినోళ్లకు ప్రత్యేక ప్యాకేజీ... బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారి కోసం ప్రత్యేక ప్యాకేజీ అమలు చేసి ఆదుకుంటామని కేటీఆర్ హామీ ఇచ్చారు. డిసెంబర్ 3 తరువాత మూడోసారి అధికారం చేపట్టగానే కొత్త పథకాలు, కొత్త రేషన్ కార్డులు, కొత్త పింఛన్లు అందిస్తామని చెప్పారు. రూ. 400కే గ్యాస్ సిలిండర్ అందిస్తామని, అసైన్డ్ భూములపై పూర్తి హక్కులు పట్టాదారులకే ఇస్తామని స్పష్టం చేశారు. రేవంత్ కొడంగల్‌లో చెల్లని రూపాయి... ‘2018 ఎన్నికల్లో కొడంగల్ ప్రజలు రేవంత్‌రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించిండ్రు. అసుంటి రేవంత్‌రెడ్డి కామారెడ్డికి వచ్చి సీఎం కేసీఆర్‌పై పోటీ చేస్తే ఇక్కడి ప్రజలు ఊకుంటరా.. తుక్కుతుక్కు ఓడగొడుతరు. అక్కడ చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతదా? అని కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో కరువు, కర్ఫ్యూ లేదు.. హైదరాబాద్ పాతబస్తీలో గతంలో కర్ఫ్యూలతో బంద్‌లు జరిగేవని... కానీ కేసీఆర్ పాలనలో కరువు, కర్ఫ్యూలు లేవని మంత్రి కేటీఆర్ గుర్తుచేశారు. హిందూ, ముస్లింలు అన్నదన్నముల మాదిరిగా కలసి జీవిస్తున్నారన్నారు. అభివృద్ధే కులం, సంక్షేమమే మతంగా బీఆర్ఎస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. మలక్‌పేట అంటే ఒకప్పుడు టీవీ టవర్ గుర్తుకు వచ్చేదని... ఇప్పుడు ఐటీ టవర్ ఐకాన్‌గా నిలుస్తోందన్నారు. ధూల్‌పేట కళాకారులను చైనాకు పంపి అంతర్జాతీయ స్థాయిలో శిక్షణ ఇచ్చి ఉపాది కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు. బీజేపీ కేవలం మతాల పేరుతోనే రాజకీయాలు చేస్తుంది తప్ప అభివృద్ధి చేయడం ఆ పారీ్టకి సాధ్యంకాదన్నారు. ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి రాజ్యం.. ‘కాంగ్రెసోళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తమంటున్నరు. నాకు తెలిసి ఇందిరమ్మ రాజ్యమంటే ఆకలి రాజ్యం.గంజినీళ్లు దొరకని రాజ్యం. అసుంటి దరిద్రపుగొట్టు, దుర్మార్గపు పాలన మనకు అవసరమా’అని కేటీఆర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలనలో 29 లక్షల మందికి రూ. 200 చొప్పున పింఛన్ ఇచ్చేవారని, తాము అధికారంలోకి వచ్చాక 46 లక్షల మందికి రూ. 2 వేల చొప్పున ఇస్తున్నామని, మూడోసారి అధికారంలోకి రాగానే పింఛన్ మొత్తాన్ని రూ. 5 వేలకు పెంచుకుంటూ వెళ్తామని చెప్పారు. 16 రాష్ట్రాల్లో బీడీ కారి్మకులు ఉన్నా, ఎక్కడా జీవనభృతి ఇవ్వలేదని, మనం మాత్రమే ఇస్తున్నామని, బీడీ కార్మికుల పింఛన్ అర్హత కటాఫ్ తేదీని 2023కు పెంచి మిగిలిపోయిన వారందరికీ ఇస్తామని తెలిపారు. సన్నబియ్యం అందించడంతోపాటు 18 ఏళ్లు నిండిన మహిళలకు రూ. 3 వేల సాయం అందిస్తామని తెలిపారు. -
అది పార్టీ సభా..లేక కుల సభా..
అసలే ఎన్నికల సమయం. ప్రజలతో భారీ బహిరంగసభలు, రోడ్ షోలు నిర్వహించడం ద్వారా ప్రజలంతా తమవైపు ఉన్నారన్న సంకేతాలు పంపించడమే వాటి ఉద్దేశం. ఇందుకోసం కోట్లాది రూపాయల వ్యయం అవుతుంది. అయినా ఫర్వాలేదు. పార్టీ ప్రతిష్ట ముఖ్యం. రాష్ట్రంలో అధికారంలోకి రావడమే పరమావధి. అలాంటిదే పరేడ్ గ్రౌండ్లో ప్రతిష్టాత్మకంగా భారీ బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయించింది. అయితే సదరు సభ నిర్వహణకు పార్టీ పేరుమీద కాకుండా.. ఓ సంఘం పేరిట బహిరంగసభ నిర్వహణకు రంగం సిద్ధం చేసుకుంది. ఈ బహిరంగసభకు కీలక నేత ముఖ్య ప్రసంగం ఉంటుందని, తద్వారా ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడేలా సర్వం సిద్ధం చేసుకున్నారు. కానీ ఇక్కడే తిరకాసు వచ్చిపడింది. అనుమతి తీసుకున్నది ఓ కులసంఘం. ఎన్నికల రిటర్నింగ్ అధికారి సభకు అనుమతినిచ్చారు. అయితే సభలో ఎక్కడా పార్టీ జెండాలు ఉండరాదని మౌఖికంగా ఆదేశించారట. లేదు.. కూడదు.. బహిరంగసభలో పార్టీ జెండాలు పెడితే.. సంబంధిత ఖర్చులో సగం వరకు స్థానిక అభ్యర్థి లెక్కలో వేస్తామని హెచ్చరించారట... ఏమి చేయాలో పాలుపోని నాయకులకు ఎన్నికల బహిరంగసభ రద్దుకు నిర్ణయం తీసుకున్నారట. అయితే అదే సమయానికి వాతావరణశాఖ కూడా వర్షాలు పడే సూచనలున్నాయంటూ ఇచ్చిన హెచ్చరిక కూడా వీరికి కలిసి వచ్చిందంటున్నారు. గతంలో ఇదే ప్రాంతంలో ఓ జాతీయ పార్టీ కూడా ఓ కులసంఘానికి సంబంధించిన బహిరంగసభ నిర్వహించింది. అది కూడా ఇంచుమించుగా రాజకీయ వేదికగానే ఉపయోగించుకుంది. కానీ అక్కడ ఎక్కడా తన పార్టీ జెండాలు ఏర్పాటు చేయకుండా జాగ్రత్త పడింది. ఆ సభ ద్వారా కావాల్సినంత ప్రయోజనాన్ని ఎన్నికల్లో పొందడానికి ప్రయత్నం చేసింది. ఆ కుల సంఘం కూడా ఎన్నికల ప్రచారంలో ఆ జాతీయ పార్టీకి పూర్తి మద్దతుగా రంగంలోకి దిగింది. ఇది ఎన్నికల కాలం మహిమ. -
మమ్మల్ని ఎవరు గిల్లినా ఊరుకోం
వేములవాడ/సాక్షి, ఆసిఫాబాద్/రాంగోపాల్‌పేట్/అబిడ్స్: ‘మమ్మల్ని ఎవరు గిల్లినా ఊరుకొనేది లేదు’అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పష్టం చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో 2017కు ముందు యూపీలోనూ అలానే ఉండేవని... మాఫియా, గూండాగిరీ, దాదాగిరీ, కబ్జాలు కొనసాగేవని చెప్పారు. అయితే యూపీ ప్రజలు కుటుంబ పాలనకు తెరదించి బీజేపీకి పట్టం కట్టడంతో ఇప్పుడు అవన్నీ బంద్ అయ్యాయన్నారు. ఇప్పుడు తమ రాష్ట్రంలో ఎవరైనా గూండాగిరీ, మాఫియా నడిపిస్తే బుల్డోజర్లతో బుద్ది చెబుతున్నామని పేర్కొన్నారు. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్‌తో ఇప్పటివరకు తమ రాష్ట్రంలో ఒక్క రోజూ కర్ఫ్యూ పెట్టలేదని చెప్పారు. అలాగే అభివృద్ధి, ఆదాయంలోనూ యూపీ సర్‌ప్లస్‌లో కొనసాగుతోందన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ, కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లలో రామరాజ్య స్థాపన విజయ సంకల్ప సభలతోపాటు హైదరాబాద్‌లోని సనత్‌నగర్, గోషామహల్ నియోజకవర్గాల పరిధిలో నిర్వహించిన రోడ్ షోలలో యోగి ఆదిత్యనాథ్ ప్రసంగించారు. హైదరాబాద్ పేరు మారుస్తాం... యూపీలో ఐదేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు కల్పించామని, మరో 4 లక్షలు కల్పించబోతున్నామని యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. తెలంగాణలోనూ డబుల్ ఇంజిన్ సర్కారు కోసం బీజేపీని గెలిపిస్తే ప్రజలకు అన్ని విధాలా రక్షణ కల్పించి రాష్ట్రాన్ని వేగంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ భాగ్యనగరాన్ని హైదరాబాద్‌గా మార్చిందని... తాము అధికారంలోకి వస్తే చార్మినార్‌లోని భాగ్యలక్ష్మీ మాత పేరుపై హైదరాబాద్ పేరును భాగ్యనగరంగా మారుస్తామని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ చెట్టపట్టాలేసుకొని అభివృద్ధిని విస్మరిస్తున్నాయని... ఈ మూడు పార్టీల్లో ఎవరికి ఓటు వేసినా మిగతా ఇద్దరికీ చెందుతుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్ బంధువులు మాత్రమే రాజ్యాధికారం చెలాయిస్తున్నారని దుయ్యబట్టారు. నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్‌తో ఏర్పడిన రాష్ట్రంలో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ఆ డిమాండ్లేవీ నెరవేర్చలేకపోయిందని విమర్శించారు. అధికారికంగా ‘విమోచనం’.. బీజేపీని గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేసి ఆ ఫలాలను వెనకబడిన వర్గాలకు అందేలా చర్యలు తీసుకుంటామని యోగీ ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. ఎంఐఎంకు భయపడే సీఎం కేసీఆర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాగానే ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. యూపీలో బీఎస్పీ ఒక్క సీటే గెలుచుకుందని... ఇక్కడ ఆ పార్టీని ప్రజలు నమ్మొద్దన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉంటే రామమందిరం కట్టించేదా? కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేదా? అని ఆయన ప్రశ్నించారు. తమ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. -
సుస్థిరతకే ఓటు!
సాక్షి, హైదరాబాద్ సిటీ నెట్వర్క్ : వచ్చే గురువారం అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరగనుంది. సరిగ్గా వారం రోజులుందనగా నగర ప్రజల పల్స్ పట్టుకునేందుకు ‘సాక్షి’ రోడ్ షో నిర్వహించింది. గ్రేటర్ హైదరాబాద్ నగరాన్ని ఎనిమిది కారిడార్లుగా వర్గీకరించి ప్రజాభిప్రాయాన్ని సేకరించింది. ఎనిమిది దిక్కుల్లోని ప్రజలనూ కలిసిన విలేకరులకు విభిన్న స్వరాలు వినిపించాయి. నగర అభివృద్ధికి కృషి చేస్తోందంటూ బీఆర్ఎస్ సర్కారుకే పెద్దపీట వేస్తామనేవారితోపాటు వానలొస్తే ముంపు ఇబ్బందులు అంతగా తప్పించలేని ప్రభుత్వాన్ని ప్రస్నిస్తున్న వారూ లేకపోలేదు. రోజురోజుకూ విస్తరిస్తున్న నగరం మరింతగా అభివృద్ధి చెందాలని, తిరిగి ఇదే ప్రభుత్వం వస్తే అభివృద్ధి మరింత వేగంగా కొనసాగే అవకాశముందని కొందరు ప్రత్యేకించి చెప్పడం గమనార్హం. ఫ్లై ఓవర్లతో నగర రూపురేఖలే మారాయని, ఐటీని మేటిగా నిలుపుతున్న ప్రభుత్వాన్నే తిరిగి ఎన్నుకుంటామన్న వారితో పాటు ప్రజారవాణా వ్యవస్థలో భాగంగా మెట్రో, ఎంఎంటీఎస్, ఆర్టీసీ తదితర రంగాల్లో నగరం ఎంతో పురోగతి సాధించిందని, కాకపోతే ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదని, ఇందుకు ప్రత్యేక ప్రణాళిక అవసరమని ధిక్కార స్వరాన్ని వినిపించిన వారూ ఉన్నారు.. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి కొనసాగాలంటే ఇదే ప్రభుత్వం బెటరనే అభిప్రాయాల్ని ఎక్కువమంది వ్యక్తం చేశారు. కొత్త వారొస్తే.. మళ్లీ మొదటికొస్తుందని వారు అభిప్రాయపడ్డారు. దినసరి కూలీల నుంచి ఐటీ ఉద్యోగుల దాకా, ఆర్టీసీ బస్సుల్లో వెళ్తున్న వారి నుంచి చిరువ్యాపారుల దాకా, ఇరవయ్యేళ్ల నవయువ ఓటర్ల నుంచి అరవయ్యేళ్లు పైబడిన వారిదాకా, మహిళల్లో గృహిణుల నుంచి వ్యాపారాలు నిర్వహిస్తున్నవారి దాకా విభిన్న వర్గాల ప్రజల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయగా అత్యధికులు సుస్థిర ప్రభుత్వం మేలని అభిప్రాయపడగా.. మిగతా వారు మార్పు కోరుకుంటూ అంతరంగం వెలిబుచ్చారు. కారిడార్ 1 పోచారం, నారపల్లి, బోడుప్పల్, ఉప్పల్ శివార్లకు ప్రాణం పోయండి పదేళ్లుగా తెలంగాణలో బాగా అభివృద్ధి జరిగిందని ఎక్కువమంది అభిప్రాయపడగా, పెరిగిన నిత్యావసరాలతో సామాన్యులు బతకలేని పరిస్థితులేర్పడ్డాయని, డబ్బున్న వారు మరింత సంపన్నులు కాగా, పేదలు మరింత నిరుపేదలయ్యారని వాపోయిన వారూ ఉన్నారు. భారతీయ సంస్కృతిని పరిరక్షించడంతోపాటు ప్రపంచ దేశాల్లో భారత్ గౌరవాన్ని పెంపొందించే నాయకత్వం కావాలన్న వారు సైతం ఉన్నారు. శివారు ప్రాంతాల్లో సౌకర్యాల కల్పనలో మరింత దృష్టి పెట్టాలని, కనీస వసతులు, రవాణాను రాబోయే ప్రభుత్వాలు ప్రధాన అంశాలుగా తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు కోర్సిటీపైనే దృష్టి పెట్టారు, ఈ దశలో శివార్ల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలని ఆశిస్తున్నారు. అభివృద్ధి బాగుంది పదేళ్లుగా తెలంగాణలో అభివృద్ధి జరిగింది. సాఫ్ట్వేర్ రంగంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయి. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ఈ అభివృద్ధిని ఇలాగే కొనసాగించాలంటే మరోసారి అధికారపార్టీని గెలిపించవలసిన అవసరం ఉంది. – జశ్రామ్, వ్యాపారి, నారపల్లి ఈ విడతలోనే అభివృద్ధి కేసీఆర్ నాయకత్వంతోనే రాష్ట్రం మరింత అభివృద్ధిని సాధించగలదు. అందరికీ తాగునీరు, సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుంది. ఈసారి కాంగ్రెస్‌కు అవకాశమిద్దాం అనే అలోచన కంటే అభివృద్ధిని చూసి ఓటేద్దామని ఆలోచించడం మంచిది. – అరుణ, వాటర్ ప్లాంట్ నిర్వాహకురాలు, జోడిమెట్ల. మార్పు కావాలి బీఆర్ఎస్ వల్ల పేదలకు చాలా అన్యాయం జరిగింది. డబ్బున్నవాళ్లే మరింత ధనవంతులయ్యారు. పేదవాళ్లు ఇంకా నిరుపేదలయ్యారు. కాంగ్రెస్ మొదటి నుంచీ పేదల పార్టీ. ఆ పార్టీయే అధికారంలోకి రావాలి. –విజయ్, టిఫిన్ బండి నిర్వాహకుడు, ఉప్పల్ కారిడార్ 2 రామంతాపూర్, అంబర్‌పేట, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, లిబర్టీ, ఖైరతాబాద్ సంక్షేమానికి మొగ్గు అభివృద్ధికి ఎక్కువ మంది ఓటర్లు మొగ్గు చూపారు. సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పాలన సాగిస్తున్న ప్రస్తుత సర్కారుకు మరో అవకాశం ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. సంక్షేమ పథకాలు అందుకుంటున్న వర్గాలు అధికంగా ఉండడం,ప్రభుత్వం అందిస్తున్న పథకాలకు జై కొట్టడం గమనార్హం. మరోవైపు స్థానిక అభ్యర్థులపై అభిమానంతో కాంగ్రెస్‌వైపు మొగ్గుచూపుతున్న వారూ ఉన్నారు. ఆరు గ్యారంటీలపై చర్చ జరుగుతున్నా అంతిమంగా ఓటర్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టంగా అర్థమైంది. ఇక్కడ బీజేపీకి కొంత అనుకూలత కనిపించింది. సమస్యలపై అవగాహన ఉంది కాంగ్రెస్ పార్టీపై అభిమానం ఉంది. స్థానిక అభ్యర్థికి సమస్యలపై అవగాహన ఉంది. రాష్ట్రంలో మార్పు రావాలని కోరుకుంటున్నా. –రంగనాథ్, వ్యాపారి, వెంకటేశ్వరనగర్ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందాం తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం అందజేసిన వివిధ సంక్షేమ పథకాలతో లబ్ధి పొందాం. ఇంకా మేలు జరుగుతుందేమోనని ఎదురుచూస్తున్నాం. కొత్తవారైతే ఎక్కువేమైనా చేస్తారేమోననే ఆశ ఉంది. ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. – నోముల రాములు, మార్బుల్ మేస్త్రీ అంబర్‌పేట బీఆర్ఎస్తోనే నగరాభివృద్ధి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే హైదరాబాద్ నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది. ఐటీ మంత్రి కేటీఆర్ అంటే నాకెంతో అభిమానం ,ప్రేమ. ఆయన వల్లనే నగరం అన్నిరంగాల్లో ముందుకెళ్లింది. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే హైదరాబాద్‌కు మంచి భవిష్యత్ ఉంటుంది. –రాజేందర్, విద్యార్థి, ఖైరతాబాద్ కారిడార్ 3 అమీర్‌పేట, ఎస్సార్‌నగర్, ఎర్రగడ్డ, జూబ్లీహిల్స్ మెట్రో విస్తరణ ప్రథమ ఎజెండా కావాలి ప్రస్తుత ప్రభుత్వంలో చాలా పనులు జరిగాయని, మార్చాల్సిన అవసరమైతే కనిపించడం లేదని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పరంగా లోపాల్లేకున్నా, స్థానికంగా ఉండే నేతలు సైతం ప్రజల సమస్యలు తెలుసుకొని పరిష్కరించాలని కోరుకున్నారు. నిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతాల్లో ఓటర్లు బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా మెట్రోపై తమ అభిప్రాయాలను వివరించారు. మెట్రో రాకతో రవాణా ఇబ్బందులు తొలగిపోయాయని , విస్తరణను నగర ప్రథమ ఎజెండాగా బీఆర్ఎస్ తీసుకోవాలని మెజార్టీ ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇక్కడ ఆంధ్రా ప్రాంత ఓటర్లు ఉండడం, వారు అధికార పార్టీకి మద్దతు ప్రకటించడం విశేషం. కాంగ్రెస్ పార్టీకి అవకాశం వస్తే బావుంటుంది కానీ, వారి వర్గ పోరుతోనే సమస్య అన్న వాళ్లు ఉన్నారు. ప్రభుత్వంలో లోపాల్లేవు కేసీఆర్ పాలనలో నాకు ఏ లోపాలు కనిపించడం లేదు. ఈ ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం లేదు. సుస్థిర ప్రభుత్వం కొనసాగాలంటే. తిరిగి కేసీఆర్‌కు జై కొట్టాలి. – ఉత్తేజ్, సినీనటుడు, జూబ్లీహిల్స్ వేరే ఆప్షన్ లేదు ఎక్కడైనా ఏ ప్రభుత్వంలోనైనా కొన్ని లోటుపాట్లు ఉంటాయి. అంతమాత్రాన ప్రభుత్వాన్నే మార్చాలనుకోవడం తగదు. స్థానికంగా కొన్ని సమస్యలున్నా, బీఆర్ఎస్ కంటే మంచి ఆప్షన్ కనిపించడం లేదు. – ఆకుల ప్రవీణ్‌కుమార్, ఐస్‌క్రీమ్ మెషిన్ల వ్యాపారి ఎప్పుడూ ప్రజల్లో ఉండాలి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఇంటింటికీ తిరుగుతూ ఓట్లేయమంటున్నారు. గెలిచాక కూడా అలాగే ప్రజల్లో తిరగాలి. వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తే ప్రజలు ఎప్పుడూ వారివెంటే ఉంటారు. –మహేష్ చౌదరి, అమీర్‌పేట కారిడార్ 4 కొంపల్లి, బాలానగర్, కేపీహెచ్‌బీ, హైటెక్‌సిటీ ఐటీలో మేటి.. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధతోనే ఐటీలో మెరుగ్గా నిలిచామన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. గతంలో విదేశాల్లో మాత్రమే కనిపించే భారీ అంతస్తుల భవనాలు, కేబుల్‌బ్రిడ్జి వంటివి నగరంలోనూ కనిపిస్తున్నాయని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఐటీ రంగం అంచలంచెలుగా ఎదుగుతోందని, పేరొందిçన కంపెనీలు రావడం కేవలం కేటీఆర్ కృషి వల్లేనని చెప్పారు. ఐటీ కంపెనీల రాకతో ఈ ప్రాంతం ఫైనాన్షియల్ డి్రస్టిక్ట్గా మారిపోయిందని, మున్ముందు మరింత ఖ్యాతి పొందే అవకాశం ఉందన్నారు. కొందరు మాత్రం తాము దరఖాస్తు చేసుకున్నా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పథకం కొందరికే చుట్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐటీ అభివృద్ధి చెందింది నగరంలో ఐటీ బాగా అభివృద్ధి చెందింది. లింక్రోడ్లతో ప్రయాణం సాఫీగా మారింది. సీఎం కేసీఆర్ కులవృత్తిదారులకు ఆర్థికంగా చేయూతనిస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెందింది. – మహే ష్ చారి, చందానగర్ గుణగణాలను చూసే ఓటేస్తా తెలంగాణ ప్రభుత్వం అందించే పింఛన్ వస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇంటికి దరఖాస్తు చేసుకున్నాం. కానీ రాలేదు. వచ్చే ఎన్నికలలో అభ్యర్థి గుణగణాలను చూసి ఓటేస్తాం. –రమ, పాన్‌షాపు, లింగంపల్లి పేదలకు న్యాయం జరగాలి నాకు అరవయ్యేళ్లు దాటాయి. వృద్ధాప్య పెన్షన్ రావడం లేదు. మూడుసార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. డబుల్ బెడ్రూమ్ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే అదీ రాలేదు. – వెంకటేశ్వర్లు, చిరువ్యాపారి, హఫీజ్‌పేట కారిడార్ 5 సాగర్‌రింగ్‌రోడ్, బాలాపూర్, ఆర్సీఐ, శంషాబాద్ ఒకవైపే కాదు.... రెండో వైపు చూడండి గతంతో పోలిస్తే గడచిన తొమ్మిదిన్నరేళ్లలో అభివృద్ధి జరగడాన్ని అంగీకరిస్తూనే, వివిధ రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అభివృద్ధితోపాటు పేదల సంక్షేమం కూడా పట్టించుకోవాలని ఎక్కువ మంది అభిప్రాయపడ్డారు. ఆయా ఎమ్మెల్యేలు కేవలం తమ సన్నిహితులు, తమ అనుచరులు, కార్యకర్తలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తూ పేదలను విస్మరిస్తున్నారన్న వాదనలను వ్యక్తం చేశారు. అన్ని పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను సమన్యాయంతో అమలు చేయాలని కోరేవారు ఇక్కడ ఎక్కువ సంఖ్యలో కనిపించారు. పదేళ్లలో తమను పట్టించుకోలేదని, పేదలందరికీ న్యాయం జరిగేలా అవసరమైన చర్యలు చేపడితే బావుండేదని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ గురించి మౌత్ పబ్లిసిటీ పెద్ద ఎత్తున ఉన్నా ఇక్కడ స్థానిక నాయకత్వం యాక్టివ్‌గా ఉన్నట్టుగా కనిపించడంలేదు. బీజేపీ కాస్త మెరుగ్గా ఉన్నా ప్రచారంలో దూసుకెళ్లడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఎల్బీనగర్ చౌరస్తా రూపురేఖలే మారిపోయాయని, ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపిన బీఆర్ఎస్కు అక్కడ కొంత మెరుగ్గా ఉన్నట్టు కనిపిస్తోంది. అర్హులకు నిరాశే మిగిలింది నేను పక్కా తెలంగాణవాదిని. ఒకే పార్టీకి రెండుసార్లకంటే ఎక్కువ పాలనాధికారాలు అందిస్తే నిరంకుశత్వంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం రాష్ట్రంలో అదే జరుగుతోంది. సంక్షేమ పథకాలన్నీ అధికారపార్టీ ప్రతినిధులు, వారికి అనుకూలమైన వారి జేబుల్లోకే వెళుతున్నాయి. అర్హులకు ఎదురుచూపులే మిగులుతున్నాయి. – కాకి నవీన్‌గౌడ్, ప్రైవేట్ ఉద్యోగి, కర్మన్‌ఘాట్ చౌరస్తా ఉచితాలు కాదు ఉపాధి కావాలి నేను నిరుపేద కుటుంబంలో జన్మించాను. చదివితే కొలువు సాధించవచ్చని ఇంట్లో కొట్లాడి హాస్టల్లో ఉంటూ డిగ్రీ వరకు చదివాను. పోలీసు ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకున్నాను. ఉద్యోగం రాలేదు. గత్యంతరం లేక ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా. నిరుద్యోగ యువతకు ఉచితాలు వద్దు. ఉపాధి కావాలి. – బెయిన సుధాకర్, నిరుద్యోగి, సాయిరాంనగర్‌కాలనీ చౌరస్తా పెద్దకొడుకు మా కేసీఆర్ రాష్ట్ర సొంతింటి పెద్ద కొడుకు మా సీఎం కేసీఆర్. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా పెన్షన్లు, షాదీముబారక్, కల్యాణలక్ష్మి, దళిత, బీసీ, రైతు బంధు వంటి సంక్షేమ పథకాలు అమలు చేసి నేనున్నానని∙భరోసా ఇస్తున్నాడు. మాకు ఇంకేం కావాలి. కాంగ్రెస్‌కు పాలన అందిస్తే సాగు, తాగునీటి కష్టాలు తప్పవు. రోజుకు మూడు గంటలే కరెంట్ ఇచ్చి చీకటి చేస్తరు. బీజేపీకి అధికారం ఇస్తే స్థానిక సమస్యలను గాలికి వదిలేస్తారు. –పోతురాజు జంగయ్య, దుర్గానగర్, అడ్డాకూలీ కారిడార్ 6 నాగోల్, కొత్తపేట, నల్లగొండ చౌరస్తా, నాంపల్లి పబ్లిక్‌గార్డెన్ స్వచ్ఛ మూసీ ఎక్కడ? ట్రాఫికర్ తీరేదెలా? ఈ ప్రాంతాల్లో మిశ్రమ స్పందన కనిపించింది. వ్యాపారులు, ప్రైవేట్ ఉద్యోగులు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. కొన్ని ప్రాంతాల్లో బీజేపీకి మొగ్గు చూపినవారూ ఉన్నారు. కొత్త రేషన్‌కార్డులు, డబుల్బెడ్రూమ్ ఇళ్ల ప్రయోజనాలు అందలేదని కొందరు ప్రభుత్వంపై వ్యతిరేకత వ్యక్తం చేశారు. కేంద్రంలో మోదీ విధానాలకు ఆకర్షితులైన వారు బీజేపీకి పట్టం కడతామంటున్నారు. స్వచ్ఛ మూసీ విషయంలో బీఆర్ఎస్ అశ్రద్ధ చేసిందనే వాదనలు కొంతమంది వ్యక్తం చేయగా, ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ రద్దీ అత్యంత ఇబ్బందులకు గురిచేస్తోందని ఈ సమస్యకు తక్షణమే పరిష్కారం కావాలన్నవారు చాలామందే ఉన్నారు. నిత్యం ట్రాఫిక్ జాం, భారీ సంఖ్యలో వాహనాలతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. పేదలకు న్యాయం జరగలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు చేసింది ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ వస్తే అన్ని వర్గాల ప్రజలు బతకవచ్చు. పెరిగిన నిత్యావసరాల ధరలతో పేద ప్రజలు బతకలేని పరిస్థితి ఏర్పడింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇస్తాం. – నర్సింహ, ఆటోడ్రైవర్, మోహన్‌నగర్ సుస్థిర ప్రభుత్వం ఉండాలి రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షం లేదు. ఎలాంటి ఆటంకాల్లేకుండా ఐటీ సెక్టార్ హైదరాబాద్‌లో బాగా అభివృద్ధి చెందింది. రాష్ట్రంలోని జిల్లాలకు ఈ సెక్టార్‌ను విస్తరించడం మంచి పరిణామం. ఇంకా అభివృద్ధి జరగాలి. అందుకు సుస్థిర ప్రభుత్వం ఉండాలి. – సాయిసుమంత్, ఐఐఎం గ్రాడ్యుయేట్, దిల్సుఖ్నగర్ కారిడార్ 7 సికింద్రాబాద్, జేబీఎస్, బోయిన్పల్లి, అల్వాల్ ఆచరణ సాధ్యమేనా... మాస్ ఓటర్లు, మధ్యతరగతి ఓటర్లకు నెలవైన ఈ ప్రాంతంలో అధికార బీఆర్ఎస్కు పెద్ద ఎత్తున తమ మద్దతు వ్యక్తం చేశారు. పదిమందిలో సగం మంది కారుకే వేస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలైన ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలు పొందామన్నారు. ఇవే హామీలు కాంగ్రెస్ కూడా ఇస్తుందని ‘సాక్షి’ ప్రశ్నించగా కాంగ్రెస్ గ్యారంటీలమీద తమకు నమ్మకం లేదని, ఆచరణ సాధ్యం కాదని పలువురు చెప్పారు. ఒకవేళ ఇవ్వగలిగితే కేసీఆర్ ఇచ్చేవాడు కదా? అవి సాధ్యం కాలేనివి కాబట్టే బీఆర్ఎస్ చెప్పలేదన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు అభ్యర్థులు పెద్దగా ప్రభావం చూపేవారు కాదని, వారి ప్రచారం కూడా అంతంతే ఉందని పలువురు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మళ్లీ కేసీఆరే రావాలి రాష్ట్రంలో పేదలకు అన్ని రకాల సంక్షేమ పథకాలు అందిస్తూ అంతే స్థాయిలో అభివృద్ధి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వమే మళ్లీ గెలవాలి. కంటోన్మెంట్లో సాయన్న చొరవతో నిరుపేదలకు ఎన్నో సంక్షేమ ఫలాలు అందాయి. పెన్షన్లు, షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి ఇలా అన్ని రకాల ప్రయోజనాలు దక్కాయి. కంటోన్మెంట్లో మరోసారి ఆ పార్టీకే అవకాశాలున్నాయి. – నారాయణముదిరాజ్, అంబేడ్కర్‌నగర్ బీసీబంధు బీజేపీకే ఓటు బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించిన బీజేపీకే మా మద్దతు. నియో జకవర్గంలోని బీసీలంతా బీజేపీకే ఓటు వేస్తారని ఆశిస్తున్నా. కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే కంటోన్మెంట్లో బీజేపీ గెలిస్తేనే ఎంతో అభివృద్ధి జరుగుతుంది. – సురేశ్, మారేడుపల్లి కారిడార్ 8 చార్మినార్, అఫ్జల్‌గంజ్, ఎంజే మార్కెట్, గాందీభవన్ ప్రశాంతతకే పట్టం కడతాం పాతబస్తీ ప్రజలతోపాటు ఈ కారిడార్‌లోని పలువురు వ్యాపారులు ఎంఐఎంనే కోరుకుంటున్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నారు. గోషామహల్ ప్రాంతంలో మిశ్రమ స్పందన కనిపించింది. కొందరు బీజేపీ, మరి కొందరు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థుల పట్ల మొగ్గు చూపారు. రాష్ట్రంలో మాత్రం కేసీఆర్ నాయకత్వం పట్లనే అసక్తి కనబర్చారు. ప్రధానంగా మైనార్టీల సంక్షేమం పట్ల బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోందని, షాదీముబారక్, రంజాన్ తోఫా, విద్య, వైద్యం విషయంలో బీఆర్ఎస్ కృషిని మరిచిపోలేమన్నారు. మైనార్టీలంతా ఎంఐఎం వైపు ఉంటామని తెలంగాణవ్యాప్తంగా బీఆర్ఎస్కు మద్దతు తెలుపుతామని స్పష్టం చేశారు. ఇదే పాలన కొనసాగాలి తొమ్మిదేళ్లుగా పర్యాటక కేంద్రం చార్మినార్ ప్రశాంతంగా ఉంది. చిరువ్యాపారాలపై ఒత్తిడి లేదు. శాంతి భద్రతల విఘాతం సమస్యలేదు. పరస్పర సహకారం బాగుంది. పాతబస్తీలో అసెంబ్లీ స్థానాలతోపాటు రాష్ట్రంలో కూడా ఇదే పాలనా కొనసాగాలి. – షేక్ చాంద్, చిరువ్యాపారి, చార్మినార్ బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తేనే బాగుంటుంది రాష్ట్రంలో మళ్లీ ఇదే ప్రభుత్వం రావాలి. ముస్లిం సంక్షేమం, చేయూ త బాగుంది. విద్యారంగానికి పెద్దపీట వేశారు. ఉచితంగా పేదపిల్లలకు చదువు లభిస్తోంది. చిరు వ్యాపారులకు ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తే బాగుటుంది. –ముజాహిద్, అత్తర్ వ్యాపారి. యాకుత్‌పురా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు గత పదేళ్ల పాటు బీఆర్ఎస్ పార్టీ పాలించింది. ప్రస్తుతం మార్పు అవసరం. కాంగ్రెస్ అధికారంలోకి రావాలి – మహ్మద్ ఖలీల్, వ్యాపారి, ఓల్డ్‌సిటీ -
కామారెడ్డి భూములపై కేసీఆర్ కన్ను
సాక్షి, కామారెడ్డి: ‘ఓటుకు రూ.10 వేల చొప్పున రూ.200 కోట్లు ఖర్చుచేసి రెండు లక్షల ఓట్లు కొని, రూ.2 వేల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టాలని సీఎం కేసీఆర్ చూస్తున్నాడు. మీ అండతో భూములు మింగే అనకొండల భరతం పడతా. తెలంగాణను దోచుకున్న కేసీఆర్‌ను ఎన్నికల్లో ఓడించాలి..’ అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. శనివారం కామారెడ్డి జిల్లా భిక్కనూరు, రాజంపేట మండల కేంద్రాల్లో నిర్వహించిన రోడ్ షోల్లో ఆయన మాట్లాడారు. ‘గజ్వేల్‌లో భూములను కొల్లగొట్టి అక్కడి రైతులను రోడ్డు పాలు జేసిండ్రు. ఇప్పుడు వాళ్ల కన్ను కామారెడ్డి మీద పడ్డది. పచ్చని పంటలు పండే భూములను కొల్లగొట్టేందుకే వస్తుండ్రు. పాము పాలుపోసి పెంచినోళ్లను కూడా వదలదు. అందుకే మీ భూములను కొల్లగొట్టడానికి వస్తున్న కేసీఆర్‌ను ఓటుతో బండకేసి కొట్టాలి. మన భూములు మన చేతిలో ఉండాలంటే కేసీఆర్‌ను ఓడించాల్సిందే. బీరయ్య అనే రైతు వడ్ల కుప్పమీద చనిపోయినపుడు, వడగండ్ల వానలతో పంటలు దెబ్బతిన్నపుడు గుర్తుకు రాని అమ్మమ్మ ఊరు, అమ్మ పుట్టిన ఊరు.. కేసీఆర్‌కు ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తోందో ఆలోచించాలి. 40 ఏళ్లు పదవుల్లో ఉన్నపుడు ఏ ఒక్కనాడూ కోనాపూర్ గుర్తుకు రాలేదు. ఇప్పుడు ఓట్లు కావాలనే అమ్మ ఊరు అంటున్నాడు. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే సిద్దిపేటకో, సిరిసిల్లకో పోవచ్చు. లేదంటే అంత మంచిగ జేసిన అంటున్న గజ్వేల్‌లోనే ఉండొచ్చు. కానీ కామారెడ్డికి రావడంలోనే పెద్ద ప్లాన్ ఉంది. ఇక్కడి భూముల మీద కేసీఆర్, ఆయన కుటుంబం, బంధువులు కన్నేశారు..’ అని రేవంత్ ఆరోపించారు. నిరుద్యోగుల ఉసురుపోసుకుండు... ‘తెలంగాణ వస్తే ఉద్యోగాలొస్తాయని చెప్పిన ముఖ్యమంత్రి లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్నాడు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు. కేసీఆర్ కుటుంబంలో కేసీఆర్‌కు, కొడుక్కు, అల్లుడికి, బిడ్డకు, తోడల్లుడి కొడుక్కు ఉద్యోగాలు వచ్చాయి గానీ నిరుద్యోగులకు మాత్రం రాలేదు. మూడోసారి గెలిపించండి అంటూ కొడుకును ముఖ్యమంత్రిని జేసేందుకు కేసీఆర్ తాపత్రయపడుతున్నాడు. మందు తాగించి, పైసలు పంచి ఓట్లు దండుకోవాలని జూస్తున్న కేసీఆర్ పట్ల నిరుద్యోగులు అప్రమత్తంగా ఉండాలి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఖాళీలను భర్తీ చేస్తాం..’ అని చెప్పారు. అయ్య వీధికుక్క.. కొడుకు పిచ్చి కుక్క.. ‘నేను ఇరవై ఏళ్లుగా ప్రతిపక్షంలో ప్రజల పక్షాన పోరాడి, ప్రజల గొంతుకగా పనిచేశా. కేసీఆర్‌ను నిలదీసినందుకే నన్ను జైళ్లకు పంపిండు. అయినా వెరవకుండా కొట్లాడుతూనే ఉన్నా. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్‌లకు ఓటమి భయం పట్టుకుని నన్ను కుక్కతో పోల్చారు. తెలంగాణ రాగానే దళితున్ని ముఖ్యమంత్రిని జేసి, తాను కాపలా కుక్కలాగా ఉంటానన్న కేసీఆర్.. దళితున్ని ముఖ్యమంత్రిని చేయకుండా మోసం జేశాడు. కాపలా కుక్కలా ఉండకుండా వీధికుక్కలా కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఆఖరుకు పంజాబ్‌కు వెళ్లి మన పైసలు పంచాడు. కొడుకు కేటీఆర్ పిచ్చికుక్కలా ఎవరిని పడితే వాళ్లను కరుస్తున్నాడు. వీధికుక్కను, పిచ్చి కుక్కను పొలిమెరలు దాటేదాకా తరమాల్సిన బాధ్యత కామారెడ్డి ఓటర్లపై ఉంది..’ అని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం హెలికాప్టర్ రాకుండా కుట్ర చేసినా, తన కోసం వేలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారని, తాను రోడ్డు మార్గాన వచ్చానని చెప్పారు. మూడు గంటలు ఆలస్యంగా వచ్చి నా, తన కోసం ఎదురుచూసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సభలో మాజీ మంత్రి షబ్బీర్ అలీ, పార్టీ నేతలు యూసుఫ్‌అలీ, ఈరవత్రి అనిల్, అరికెల నర్సారెడ్డి, నేరెళ్ల శారద, కైలాస్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగం కావొద్దు
చిట్యాల: కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేసే బలమైన నాయకత్వం కలిగిన బీఆర్ఎస్కు మద్దతివ్వాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఎన్నికలు వచ్చాయంటే జనంలో లేని వాళ్లు, ఇతర రాష్ట్రాల నుంచి ప్రచారానికి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను చూసి ఓటర్లు ఆగమాగం కావొద్దన్నారు. కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల నుంచి విపక్షాల నాయకులు వచ్చి బక్కపల్చగా ఉండే సీఎం కేసీఆర్‌పై దండయాత్ర చేస్తున్నారని పేర్కొన్నారు. మంగళవారం నల్లగొండ జిల్లా చిట్యాలలో పార్టీ నకిరేకల్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యతో కలిసి నిర్వహించిన రోడ్ షోలో కేటీఆర్ ప్రసంగించారు. బీఆర్ఎస్ విజయం సాధిస్తే కేసీఆర్ మూడోసారి సీఎంగా పనిచేస్తారని, కాంగ్రెస్‌లో మాత్రం కౌన్ బనేగా సీఎం అన్నట్లుగా జిల్లాకో నలుగురు సీఎం అభ్యర్థులున్నారని, వారికి ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్లో సీఎం పేరు వస్తుందని ఎద్దేవా చేశారు. ఒకాయన పిల్లే లేదు కానీ పెళ్లి ముహూర్తం పెట్టుకున్నట్లు పార్టీలో సీఎం సీటు కోసం ముహూర్తం కూడా పెట్టుకున్నాడన్నారు. ప్రజలకు ఏం చేశారని కాంగ్రెస్‌కు ఓటెయ్యాలో ఆ పార్టీ నాయకులను ప్రశ్నించాలన్నారు. మరోసారి గెలిపిస్తే తెల్లరేషన్ కార్డుదారులకు సన్నబియ్యం, కేసీఆర్ రూ.5 లక్షల బీమా సౌకర్యం, పద్దెనిమిదేళ్లు నిండిన మహిళలకు సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా నెలకు రూ.3వేల నగదు అందిస్తామని, ఆసరా పింఛన్లను పెంచుతామని కేటీఆర్ హామీ ఇచ్చారు. డబ్బు పొగరుతో కోమటిరెడ్డి బ్రదర్స్ పోటీ నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ డబ్బు పొగరుతో పోటీచేస్తున్నారని, వారు ఓడిపోవడం ఖాయమని కేటీఆర్ పేర్కొన్నారు. నల్లగొండలో కంచర్ల భూపాల్‌రెడ్డి, మునుగోడులో కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి వారిద్దరిని ఓడిస్తారని జోస్యం చెప్పారు. రిజర్వుడు నియోజకవర్గమైన నకిరేకల్ బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యపై మీ పెత్తనం ఏందని కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ప్రశ్నించారు. పేదింటి బిడ్డ చిరుమర్తి లింగయ్యను ఈ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. రోడ్ షోలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, చెరుకు సుధాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. (బాక్స్) సంపద పెంచాలి.. పేదలకు పంచాలి నాగోలు: రాష్ట్రంలో అన్ని వర్గాలను, అన్ని రంగాలను అన్ని విధాలా ఆదుకున్న ఏకైక ప్రభుత్వం తమదే అని మంత్రి కేటీఆర్ అన్నారు. సంపద పెంచాలి.. పేదలకు పంచాలి అనేది తమ నినాదమన్నారు. మంగళవారం నాగోల్‌లో రాష్ట్ర హ్యాండ్లూమ్, టెక్స్టైల్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆతీ్మయ సమ్మేళనంలో కేటీఆర్ మాట్లాడారు. మునుగోడులో గతంలో ఫ్లోరోసిస్‌తో ఎంతోమంది ఇబ్బందులు పడ్డారని, కేసీఆర్ మిషన్ భగీరథ పథకానికి రూపకల్పన ఫ్లోరోసిస్‌కు శాశ్వత పరిష్కారం చూపారని తెలిపారు. రానున్న రోజుల్లో మరిన్ని టెక్స్టైల్ పార్కులు పెట్టుకుందామని చెప్పారు. నేతన్నల బాగు కోసం ఇంకా ఏమైనా చేయాలనే ఆలోచన చేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీ ఎల్.రమణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం అనేక చేనేత కార్మికుల పథకాలు రద్దు చేసిందన్నారు. కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ పద్మశాలీల ఇంట్లో ఉండి చదువుకున్నందున, మన సమస్యలు తెలుసని చెప్పారు. వందకు వంద శాతం పద్మశాలీలు బీఆర్ఎస్ వైపు ఉన్నారని పేర్కొన్నారు. -
సభలకు బదులు రోడ్ షోలు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీ బహిరంగ సభల నిర్వహణకు బదులు ప్రస్తుతానికి కార్నర్ మీటింగ్‌లు, రోడ్ షోలకే పరిమితం కావాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తోంది. కొత్తగా ఏర్పాటైన జిల్లా కేంద్రాలన్నింటిలో ఇతర రాష్ట్రాలకు చెందిన జాతీయ స్థాయి నాయకులతో ప్రచారం నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం మినహా ఇతర రాష్ట్రాల నేతలతో రోడ్‌షోల నిర్వహణ కోసం ప్లాన్ వేస్తోంది. భారీ బహిరంగ సభలు నిర్వహించి ప్రజలను సభకు తీసుకువచ్చే దాని కంటే ప్రజల్లోకి తామే వెళ్లడం మేలన్న ఆలోచనతో కార్యాచరణ రూపొందిస్తున్నట్టు గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. రోడ్ షోలలో భాగంగా ఉదయం పార్టీ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి వారికి దిశానిర్దేశం చేయాలని.. సాయంత్రం రోడ్ షోలు నిర్వహించాలని భావిస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దీని ద్వారా పార్టీ శ్రేణుల్లోనూ కొత్త జోష్ వస్తుందని అంటున్నారు. నేటి బస్సు యాత్ర వాయిదా సోమవారం భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జనగామ, ఆలేరు, భువనగిరి నియోజకవర్గాల్లో నిర్వహించతలపెట్టిన రెండో విడత బస్సు యాత్ర అనివార్య కారణాల వల్ల వాయిదా పడినట్టు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఆయా నియోజకవర్గాల్లో తిరిగి యాత్ర ఎప్పుడు నిర్వహించేదీ త్వరలోనే తెలియజేస్తామని టీపీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. అగ్రనేతలతో పెద్ద సభలు ఈ నెల 31న కొల్లాపూర్‌లో ప్రియాంకా గాంధీ బహిరంగ సభ జరగనుంది. దీనితోపాటు అగ్రనేతలతో మరో రెండు, మూడు పెద్ద సభ లు నిర్వహించాలని పీసీసీ నేతలు యోచిస్తు న్నారు. ఈ సభల్లో పార్టీ అతిరథ మహారథు లతో హామీలు ఇప్పించాలని భావిస్తున్నారు. అవి మినహా చాలా వరకు రోడ్ షోలు, కార్నర్ మీటింగ్‌లు, బస్సుయాత్రతో ఎన్నికల ప్రచారా న్ని కొనసాగించాలని నిర్ణయించారు. -
వచ్చే నెల మొదటివారంలో రాష్ట్రానికి మోదీ?
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల మొదటివారంలో తెలంగాణ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో ఏదో ఒకరోజు ఈ పర్యటన ఉండొచ్చంటున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో చేపట్టే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు ప్రారంభోత్సవంతో పాటు నిజామాబాద్‌లో రోడ్‌షో నిర్వహించాలని, లేని పక్షంలో మహబూబ్‌నగర్‌లో గానీ, నిజామాబాద్‌లో గానీ బహిరంగసభ ఏర్పాటు చేయాలని బీజేపీ యోచిస్తోంది. -
రోడ్డుకు అడ్డంగా చంద్రబాబు ప్రచార రథం..అంబులెన్స్ వచ్చినా దారివ్వని చంద్రబాబు
-
జల రవాణాపై ఏపీతో చర్చలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌లో జల రవాణా మార్గాలను అభివృద్ధి చేసే అంశంపై రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (డీసీఐ) ఎండీ కెప్టెన్ ఎస్.దివాకర్ చెప్పారు. అక్టోబర్ 17 నుంచి 19వ తేదీ వరకూ న్యూఢిల్లీలో జరిగే గ్లోబల్ మారిటైమ్ ఇండియా సమ్మిట్–2023కి అనుబంధంగా డీసీఐలో ఈ నెల 28న రోడ్ షో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాట్లను ఎండీ దివాకర్ పరిశీలించారు. డీసీఐ పురోగతికి తీసుకుంటున్న చర్యలు, సమ్మిట్‌కు సంబంధించిన విషయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే.. జలరవాణాపై సంప్రదింపులు ప్రస్తుతం జీడీపీ విలువలో 80 శాతం వరకూ మారి టైమ్ ట్రేడ్ జరుగుతోంది. డ్రెడ్జింగ్ చేయకుండా ఏ పోర్టు అభివృద్ధి జరగదు. అందుకే ప్రధాని కూడా దేశీయ జలమార్గాల (ఇన్లాండ్ వాటర్ వేస్)పై దృష్టి సారించారు. ప్రస్తుతం 110 నదులుండగా కేవలం 4 నదుల్లో జల రవాణాకు సంబంధించి డ్రెడ్జింగ్ పనుల కోసం ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆంధ్రప్రదేశ్‌లో పూడికతో నిండిపోయిన డ్యామ్‌లు, రిజర్వాయర్లలోనూ డ్రెడ్జ్ చేయాల్సి ఉంది. ఇందుకోసం చిన్నచిన్న డ్రెడ్జర్లు అవసరం అవుతాయి. దీనిపైనా సమాలోచనలు చేస్తున్నాం. డ్రెడ్జ్ చేస్తే.. వాటర్ క్యాచ్మెంట్ ఏరియా పెరుగుతుందని ఇందుకు అవకాశం ఇవ్వాలని ఏపీ చీఫ్ సెక్రటరీకి లేఖ రాశాం. ఏపీతో పాటు కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలతోనూ సంప్రదింపులు జరిపాం. ఏ ప్రభుత్వమైనా డ్యామ్‌లు, రిజర్వాయర్ల డ్రెడ్జింగ్ పనుల్ని 8 నుంచి 10 ఏళ్ల పాటు కాంట్రాక్ట్ అప్పగిస్తే కొత్త డ్రెడ్జర్లు తీసుకుంటాం. దేశంలో డ్రెడ్జింగ్ కోసం 120 మిలియన్ క్యూబిక్ మీటర్ల వరకూ డిమాండ్ ఉంది. కానీ.. డీసీఐలో ప్రస్తుతం 59 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉన్న10 టీఎస్‌హెచ్ డ్రెడ్జర్లు, 6 వేల క్యూబిక్ మీటర్ల సామర్థ్యం ఉన్న 2 కట్టర్ సీఎస్ డ్రెడ్జర్లు, ఒక బీహెచ్వో డ్రెడ్జర్ ఉన్నాయి. 12 వేల టన్నుల హోపర్ కెపాసిటీ డ్రెడ్జర్ కోసం ఆర్డర్ చేశాం. 2025 డిసెంబర్ నాటికి ఇది రానుంది. రూ.12 వేల కోట్ల వరకూ ఎంవోయూలు 2021లో జరిగిన గ్లోబల్ సమ్మిట్‌లో రూ.14 వేల కోట్ల విలువైన ఎంవోయూలు చేసుకున్నాం. ఈ ఏడాది రూ.12 వేల కోట్ల వరకూ వస్తాయని భావి స్తున్నాం. ఇందుకోసం 28న డీసీఐలో నిర్వహించే రోడ్‌షోలో షిప్ బిల్డర్స్, షిప్ ఆపరేటర్స్,పోర్టులు, రెగ్యులేటరీస్, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు చేస్తాం. ఏపీలో 4 పోర్టుల రాకతో అపార అవకాశాలు ఏపీ ప్రభుత్వం పోర్టుల నిర్మాణాన్ని చురుగ్గా నిర్వహిస్తోంది. కొత్తగా రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలలో నిర్మిస్తున్న పోర్టుల ద్వారా అపారమైన అవకాశాలు కలగనున్నాయి. ఈ నాలుగు పోర్టుల్లో కనీసం 150 మిలియన్ క్యూబిక్ మీటర్ల డ్రెడ్జింగ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే మచిలీపట్నంలో పనులు చేపడుతున్నాం. మిగిలిన పోర్టుల్లోనూ పనుల కోసం మరిన్ని డ్రెడ్జర్లను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. -
బాబూ.. నీ వెనుక తగలబడుతోంది చూడు!
సాక్షి, జమ్మలమడుగు: ఒకవైపు అగ్ని ప్రమాదం చోటు చేసుకుని తగలబడిపోతుంటే చంద్రబాబు నాయుడు కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించాడనే చందంగా వ్యవహరించారు చంద్రబాబు. తాను సభ కోసమే మాత్రమే వచ్చాను.. పక్కన ఏమి జరిగితే తనకెందుకు అనే విధంగా చంద్రబాబు రోడ్ షో సాగింది. చంద్రబాబు బుధవారం చేపట్టిన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు రోడ్ షోలో భాగంగా అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. తెలుగు తమ్ముళ్ల ఓవరాక్షన్ చేసి తోపుడు బండి హోటల్ పై టపాకుల వర్షం కురిపించారు. దాంతో తోపుడు బండి హోటల్ పూర్తిగా దగ్ధమైంది. చంద్రబాబు స్పీచ్ ఇస్తుండగానే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒకవైపు చంద్రబాబు ప్రసంగ ఇస్తుంటే ఆ వెనుకే అగ్ని ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన దృశ్యాలు ఒకవైపు, చంద్రబాబు ప్రసంగం మరొకవైపు కనిపించడంతో ఇది చూసిన వారు ముక్కన వేలేసుకుంటున్నారు. మీ సభలకు జనాలు రావడం లేదు కాబట్టి మీరే ఇలాంటి ప్రమాదాలు డిజైన్ చేసి ఉంటారేమో... లేదా మీ దరిద్రపు పాదం దెబ్బకు అప్పట్లో గోదావరి పుష్కరాల సమయంలో ఒక ప్రమాదం..మొన్న గుంటూరులో చీరల పంపిణీలో ఇంకోటి.. ఇంకా కందుకూరు లో మీ పాద మహిమకు నలిగిపోయిన ప్రాణాలు మాదిరి ఇది నిజంగానే ఇంకో ప్రమాదమా ?… https://t.co/OvGJCSnd6V — YSR Congress Party (@YSRCParty) August 2, 2023 చదవండి: అదీ బాబు గ్యాంగ్ అంటే.. ఆ విధంగా తుస్సుమన్నారు -
జమ్మలమడుగు చంద్రబాబు రోడ్ షోలో అగ్ని ప్రమాదం
-
నంద్యాల మీదుగా జమ్మలమడుగు కు వెళ్తూ నంద్యాల లో రోడ్ షో చేసిన నారా చంద్రబాబు నాయుడు...
-
బాబు సభ నుంచి సొంత పార్టీ లీడర్లే వెళ్లిపోతున్నారు..
-
గంగ పుత్రులకు భరోసా
-
బైక్‌లే ఉన్నాయ్.. జనాలేరీ?.. బీజేపీ శ్రేణులపై అమిత్‌షా సీరియస్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెళగావిలో అమిత్ షా రోడ్ షో నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమంలో కార్యకర్తల కంటే ఎక్కువగా బైక్‌లే దర్శనమిచ్చాయి. దీంతో అమిత్‌షా బీజేపీ శ్రేణులపై అసహనం వ్యక్తం చేశారు. జనాల కంటే బైక్‌లే ఎక్కువగా కన్పిస్తున్నాయి.. ఏంటిది? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. కాగా.. బెంగళూరులో ప్రధాని నరేంద్రమోదీ రెండో రోజు(ఆదివారం) నిర్వహించిన రోడ్‌షోకు విశేష స్పందన లభించింది. అభిమానులు బీజేపీ శ్రేణులు భారీగా తరిలివచ్చారు. మోదీపై పూలవర్షం కురిపించారు. ఈలలు, కేరింతలతో హోరెత్తించారు. 224 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు మే 10న ఒకే విడతలో జరగనున్నాయి. మే 13న కౌంటింగ్, ఫలితాలు ప్రకటిస్తారు. కాంగ్రెస్, బీజేపీ ఇప్పటికే పోటాపోటీగా ప్రచారాలు నిర్వహించాయి. చదవండి: బీజేపీది చీకటి పాలన: సోనియా -
ప్రధాని మోదీ రోడ్ షో, ట్రాఫిక్‌లో ఇరుక్కున్న అంబులెన్స్? కాంగ్రెస్ విమర్శలు
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ఓటర్లను ఆకర్షించడానికి నేతలు అన్ని రకాల ప్రయత్నాలను చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం మెగా రోడ్‌షో నిర్వహించిన విషయం తెలిసిందే. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ఈ రోడ్డు షో ఏకంగా 13 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 26 కిలోమీటర్ల మేర సాగింది. మోదీ ప్రచారానికి బీజేపీ కార్యకర్తలు భారీగా తరలి రావడంతో రోడ్లన్నీ కాషాయమయంగా మారిపోయాయి. బెంగళూరు సౌత్‌లోని సోమేశ్వర్ భవన్ ఆర్బీఐ గ్రౌండ్ నుంచి మల్లేశ్వరం సాంకీ ట్యాంక్ వరకు రోడ్‌షో కొనసాగింది. ఓపెన్ వాహనంలో కార్యకర్తలకు, అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. కాగా ప్రధాని రోడ్డు షో సందర్భంగా బెంగుళూరు ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్ చిక్కుంది. ట్రాఫిక్‌లో అంబులెన్స్ ఇరుక్కున్న ఫోటోలను కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. బెంగుళూరులో ప్రధాని మోదీ రోడ్ షో ప్రజలకు అసౌకర్యం కలిగించడమే కాకుండా ఈ కార్యక్రమానికి మోస్తరు స్పందన వచ్చినట్లు కనిపిస్తోందని సెటైర్లు వేశారు. రోడ్ షో కారణంగా రహదారిపై గందరగోళం నెలకొందని, రోడ్డుపై అంబులెన్స్ చిక్కుకుపోయిందని తెలిపారు. బెంగళూరు ప్రజల పట్ల ప్రధానమంత్రికి కొంచెమైనా బాధ్యత ఉంటే ఆదివారం నిర్వహించబోయే రెండో రోడ్ షోను రద్దు చేసుకోవాలని డిమాండ్ చేశారు. కాగా, అంతకుముందు మే 6న 10 కిలోమీటర్లు, 7న 26 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించాలని బీజేపీ నేతలు భావించారు. అయితే ఆదివారం నీట్ పరీక్ష ఉన్నందున మోదీ రోడ్ షో షెడ్యూల్లో పలు మార్పులు చేశారు. శనివారమే 26 కిలోమీటర్ల రోడ్ షో నిర్వహిస్తుండగా.. ఆదివారం తిప్పసంద్రలోని కెంపె గౌడ విగ్రహం నుంచి ట్రినిటీ సర్కిల్ వరకు 10 కిలోమీటర్ల మేర రోడ్ షో నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 11.30 గంటలకు పూర్తి చెయ్యనున్నారు. మరోవైపు ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ బెంగళూరు దక్షిణ ప్రాంతాలు, శివాజీనగర్ ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం చెయ్యనున్నారు. చదవండి: అట్టహాసంగా బ్రిటన్ రాజు చార్లెస్-3 పట్టాభిషేకం Ambulances stuck, chaos on road! If the PM has any shame left or even an iota of concern for the people of Bengaluru, he would immediately cancel part 2 of the #40km40percent roadshow tomorrow. But we all know that all he cares for is his Grand Tamasha! pic.twitter.com/XjUi2VK8yA — Jairam Ramesh (@Jairam_Ramesh) May 6, 2023 -
బెంగళూరులో ప్రధాని మోదీ మెగా రోడ్‌షో
-
రాజధానిలో వేడెక్కిన ప్రచారం
శివాజీనగర: రాజధాని బెంగళూరు నగరంలో వివిధ రాజకీయ పార్టీల అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. రోడ్‌షోలు, పాదయాత్రలతో ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. బుధవారం వివిధ ప్రాంతాల్లో వివిధ పార్టీల అభ్యర్థులు ప్రచారం చేశారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలసి ఓట్లను అభ్యర్థించారు. సీ.వీ.రామన్‌నగరలో అణ్ణామలై రోడ్‌షోకు విశేష స్పందన తమిళనాడు బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు అణ్ణామలై సీవీ రామన్నగర నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఎస్.రఘు తరపున బుధవారం మర్ఫీటౌన్‌లో నిర్వహించిన రోడ్‌షోకు విశేష స్పందన లభించింది. వేలాది మంది ఈ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి ఎస్.రఘు మాట్లాడుతూ... మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించటంతో ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం కలిగింది. అందుచేత మరోసారి తనకు ఓటు వేసి గెలిపించాలని ఆయన ఓటర్లను అభ్యర్థించారు. అదే విధంగానే నగరంలోని శాంతినగర నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఎన్.ఏ.హ్యారిస్ నీలసంద్ర వార్డులో ఎల్ఆర్ నగర, సమతానగర, మారేనహళ్లి, అంబేడ్కర్‌నగర, పంప్ హౌస్, రోజ్ గార్డెన్, ఎంసీ గార్డెన్ తదితర ప్రాంతాల్లో ముమ్మర ప్రచారం చేపట్టారు. సర్వజ నగర కాంగ్రెస్ అభ్యర్థి కే.జే.జార్జ్ నియోజకవర్గ పరిధిలోని బాణసవాడిలో రోడ్ షో నిర్వహించి విస్తృత ప్రచారం చేపట్టారు. తనయుడు రాణా జార్జ్, స్థానిక కాంగ్రెస్ నాయకులు రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్నారులతో ప్రధాని మోదీ ముచ్చట్లు: వీడియో వైరల్
కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల ప్రచార ర్యాలీలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని కలబురిగిలో మెగారోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోకు ముందకు ప్రధాని మోదీ తన కోసం ఉత్సాహంగా వేచి ఉన్న పిల్లలను చూసి వారి వద్దకు వెళ్లి కాసేపు ముచ్చటించారు. ఆ చిన్నారులంతా చదవుకుంటున్నారో లేదో అని ఆరా తీశారు. ఈ సందర్భంగా మోదీ.. మీరంతా పెద్దయ్యాక ఏం కావాలనుకుంటున్నారు అని ప్రశ్నించారు. అందులో ఓ చిన్నారి డాక్టర్, మరొకరు పోలీస్ అని చెబుతుండటంతో..మోదీ ప్రధాని కావాలనుకోవడం లేదా అని అడిగారు. అందుకు ఓ చిన్నారి వెంటనే తాను కూడా మోదీలానే అవ్వాలనుకుంటున్నట్లు బదులిచ్చాడు. మోదీ రోడ్డు షో సందర్భంగా ప్రధాని అశ్విక దళం వెళ్లే రహదారికి ఇరువైపుల ప్రజలు క్యూలో నిలబడి ఆయనకు స్వాగతం పలికారు. మోదీ కూడా చేతులు ఊపుతూ ప్రజలకు అభివాదం పలికారు. ఇదిలా ఉండగా, కర్ణాటలక ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ గెలుపు లక్ష్యంగా ప్రచార ర్యాలీలు, రోడు షోలు నిర్వహించింది. ఈ క్రమంలోనే మోదీ కర్ణాటకలో భారీగా రోడ్డు షోలు, బహిరంగ సభలు నిర్వహించారు. ఇక్కడ అధికారాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా పార్టీ అధ్యక్షుడు జెపి నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు కూడా భారీగా ప్రచారాలు చేస్తున్నారు. దక్షిణాదిలో బీజేపీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. అదీగాక కర్ణాటక ఎన్నికలను కూడా 2024 లోక్‌సభ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా చూస్తోంది బీజేపీ. అందుకే ఇతర రాష్ట్రల కంటే కర్ణాటకపైనే ఎక్కువగా దృష్టి పెడుతోంది. ఇక్కడే రెండోసారి అధికారాన్ని చేజిక్కించకోవాని చూస్తోంది బీజేపీ. పైగా పూర్తి మెజారిటీతో అధికారంలో రాగాలని ధీమా వ్యక్తం చేస్తోంది కూడా. కాగా, మే 10న కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. #WATCH | Karnataka: Prime Minister Narendra Modi had a light-hearted interaction with children in Kalaburagi earlier today, before the roadshow here. pic.twitter.com/HYOoei56xf — ANI (@ANI) May 2, 2023 (చదవండి: సీఎం బొమ్మైకు పరీక్ష..వరుణలో సిద్దుకు తేలికేనా?) -
PM Modi: ప్రధాని మోదీకి ఇదేం భద్రత?!
బెంగళూరు: ప్రధాని మోదీ భద్రతా ఏర్పాట్లలో లోపం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మరోసారి బయటపడింది. ఎస్పీజీ స్థాయి భద్రత ఉన్న ఓ ప్రధాని స్థాయి వ్యక్తి కాన్వాయ్‌లోకి ఇతర వాహనాలు రావడం, తరచూ కొందరు అతిసమీపంగా రావడం గతంలో చూశాం. ఆయా ఘటనలపై విమర్శలు రావడం తెలిసిందే. తాజాగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలోనూ అలాంటి సీన్ రిపీట్ అయ్యింది. ఆదివారం మైసూర్ ప్రధాని మోదీ రోడ్‌షోలో పాల్గొన్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం పైకి ఓ మొబైల్ వచ్చి పడింది. రోడ్‌షోకు హాజరైన ప్రజలకు ప్రధాని మోదీ అభివాదం చేస్తున్న టైంలో ఇది జరిగింది. మోదీకి అతి సమీపంగా వెళ్లి.. వాహనం బొనెట్పై మొబైల్ పడింది. ఈ విషయాన్ని ఎస్పీజీ సిబ్బంది గమనించినా.. వాహనం ఆగకుండా ముందుకు పోయింది. అయితే.. ఈ ఘటనపై ప్రధాని మోదీ సెక్యూరిటీ బృందం దర్యాప్తు చేపట్టింది. విచారణలో.. ఆ మొబైల్ బీజేపీ మహిళా కార్యకర్తదేనని తేలింది.మోదీపై పూలు వేసే క్రమంలో, అత్యుత్సాహంతో ఆ మహిళ మొబైల్ సైతం విసిరారని భద్రతా సిబ్బంది గుర్తించారు. దీంతో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(SPG) అధికారులు ఆమెను వదిలేశారు. #WATCH | Security breach seen during Prime Minister Narendra Modi’s roadshow, a mobile phone was thrown on PM’s vehicle. More details awaited. pic.twitter.com/rnoPXeQZgB — ANI (@ANI) April 30, 2023 ఇదిలా ఉంటే.. తాజా కేరళ పర్యటనలోనూ ఇలాంటి ఘటనే జరిగింది. ప్రజలకు అభివాదం చేసుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఓ మొబైల్ ఆయన కాళ్ల దగ్గర పడింది. వెంటనే.. పక్కనున్న సిబ్బంది దానిని పక్కకు తన్నేశారు. ఎస్పీజీ స్థాయి భద్రతా సిబ్బంది ఉన్న ప్రధానికి.. స్థానిక పోలీసుల భద్రతా భారీగా కల్పిస్తున్నప్పటికీ పెద్దగా ఆంక్షలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయనే విమర్శ వినిపిస్తోంది ఇప్పుడు. Amazing reflex of PM Modi's SPG. Today during his roadshow at Kochi, someone threw a mobile along with flowers by mistake and see how the SPG personal reacted. pic.twitter.com/s4YhxJycEi — നചികേതസ് (@nach1keta) April 24, 2023 #WATCH | Karnataka: Security breach during PM Modi's roadshow in Davanagere, earlier today, when a man tried to run towards his convoy. He was later detained by police. (Visuals confirmed by police) pic.twitter.com/nibVxzgekz — ANI (@ANI) March 25, 2023 #WATCH | Karnataka: A young man breaches security cover of PM Modi to give him a garland, pulled away by security personnel, during his roadshow in Hubballi. (Source: DD) pic.twitter.com/NRK22vn23S — ANI (@ANI) January 12, 2023 ఇదీ చదవండి: బుల్లి పట్టణాల్లోనూ బిలియనీర్లు -
నేడు బెంగళూరులో ప్రధాని రోడ్ షో
బనశంకరి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు 29వ తేదీ ప్రధాని నరేంద్రమోదీ బెంగళూరులో పర్యటించి భారీ రోడ్ షో నిర్వహిస్తారు, ఇందులో ప్రధాని ప్రయాణించడానికి బులెట్ ప్రూఫ్ వాహనం సిద్ధమైంది. ఢిల్లీ నుంచి ప్రధాని భద్రతా విభాగం ఈ వాహనాన్ని రాష్ట్రానికి తరలించింది. మైసూరు, కలబురిగి జిల్లాల్లో కూడా ఇదే వాహనంలో రోడ్ షోలలో పాల్గొంటారు. ప్రధాని రోడ్ షో నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి మాగడి రోడ్డును బంద్ చేస్తారు. మోదీ బెళగావి నుంచి సాయంత్రం 4.30 గంటలకు బెంగళూరు హెచ్ఏఎల్ విమానాశ్రయంలో దిగతారు. అక్కడి నుంచి తుమకూరు రోడ్డు బీఐఈసీ హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. నైస్‌రోడ్డు ద్వారా మాగడి రోడ్డులో ప్రయాణిస్తారు. మాగడి రోడ్డు నుంచి సుమనహళ్లి వరకు రోడ్‌షో సాగుతుంది. మోదీ వచ్చే గంట ముందు నుంచి నైస్‌రోడ్డులో ట్రాఫిక్ని నిలిపేస్తారు. రేపు మైసూరులో మోదీ సభ మైసూరు: ప్రధాని మోదీ ఈ నెల 30వ తేదీన మైసూరులో బహిరంగ సభలో పాల్గొంటారని ఎమ్మెల్యే రామదాసు తెలిపారు. శుక్రవారం ఆయన పార్టీ ఆఫీసులో మాట్లాడుతూ మహారాణి కాలేజీ మైదానంలో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. ఆదివారం రామనగర, కోలారులో దొడ్డబళ్లాపురం: ప్రధాని మోదీ ఈ నెల 30న రామనగరలో ఎన్నికల ప్రచారానికి వస్తున్నందున పోలీసులు, అధికారులు భద్రతను ముమ్మరంచేశారు. బెంగళూరు–మైసూరు ఎక్స్‌ప్రెస్‌వే పై వాహనాల సంచారంలో మార్పులు చేశారు. ఆరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ చెన్నపట్టణ నుంచి మద్దూరుకు రహదారిని మూసివేస్తారు. ఈ సమయంలో బెంగళూరు నుంచి మైసూరుకు వెళ్లే వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలి. అలాగే ఆదివారం కోలారు జిల్లాలో జరిగే ఎన్నికల బహిరంగ సభలో మోదీ పాల్గొంటారు. శుక్రవారం హెలికాప్టర్ రిహార్సల్స్‌ను నిర్వహించారు. భారీ సభాస్థలి సిద్ధమవుతోంది. -
చంద్రబాబు రోడ్ షోలకు జనం కరువు
-
Kerala: చంపేస్తామన్న బెదిరింపు లేఖకి ఝలక్ ఇచ్చేలా..మోదీ రోడ్ షో
రెండు రోజుల కేరళ పర్యటనకు ముందు ప్రధాని నరేంద్ర మోదీని ఆత్మహుతి దాడి చేసి చంపేస్తామని వచ్చిన బెదిరింపు లేఖ తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఆ లేఖ నేపథ్యంలో..మోదీ తన రోడ్‌షోలకు విభిన్నంగా కొచ్చిలో మెగా రోడ్ షో నిర్వహించారు. ఆయన కారుదిగి స్వయంగా కాలినడకన రోడ్ షో ప్రారంభించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆ బెదిరింపు లేఖకి ఝలక్ ఇచ్చేలా రోడ్ షో చేశారు. ఈ మేరకు ఆయన కేరళ సంప్రదాయ దుస్తులు, కసావు ముండు, శాలువా, కుర్తా ధరించి రహదారికి ఇరువైపులా ఉన్న ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేర కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ భద్రత కోసం వేలాది మంది పోలీసులు మోహరించారు. ఇదిలా ఉండగా మళయాళంలో కొచ్చి నివాసి రాసినట్లు వచ్చిన లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ కార్యాలయం అందుకున్నారు. ఆయనే పోలీసు చీఫ్‌కు ఈ లేఖను అందజేసినట్లు చెప్పారు కూడా. ఐతే పోలీసుల నుంచి లీక్ అయిన ఇంటిలిజెన్స్ రిపోర్ట్‌ని ఘోర తప్పిదమని మండిపడ్డారు. దీన్ని కేంద్ర సహాయం మంతి మురళీధరన్ కూడా తీవ్రంగా ఖండించారు. ప్రధాని భద్రతా వివరాలు ఎలా వాట్సాప్‌లో లీక్ అయ్యి వైరల్ అయ్యిందనేది ముఖ్యమంత్రి వివరించాలన్నారు. దీని అర్థం హోం శాఖ కుదేలైందనే కదా అంటూ ఫైర్ అయ్యారు. కాగా, మోదీ కేరళ పర్యటలనో దాదాపు రూ. 3 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రారంభించనున్నారు. ఈ మేరకు మోదీ కేరళలో బుధవారం తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభిస్తారు. అలాగే బ్యాటరీతో నడిచే ఎలక్ట్రిక్ హైబ్రిడ్ బోట్ల ద్వారా కొచ్చి చుట్టుపక్కల ఉన్న 10 ద్వీపాలను కలిపే ఒక రకమైన ప్రాజెక్ట్ అయిన కొచ్చి వాటర్ మెట్రోను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. Thank you Kochi! pic.twitter.com/hbuY9FRivM — Narendra Modi (@narendramodi) April 24, 2023 (చదవండి: 'బీజేపీ జీరో కావాలన్నదే నా కోరిక’) -
‘చంద్రబాబు యర్రగొండపాలెం రోడ్ షోపై మూడు కేసులు నమోదు’
సాక్షి, ప్రకాశం జిల్లా : జిల్లాలోని చంద్రబాబు నాయుడు నిర్వహించిన రోడ్ షోలకు సంబంధించి మూడుకేసులు నమోదయ్యాయి. యర్రగొండపాలెంలో అనుమతి లేని చోట సభ ఏర్పాటు చేయటంపై నిర్వహకులపై కేసులు నమోదు చేసినట్లు డీఎస్పీ కిషోర్ కుమార్ స్పష్టం చేశారు. ఈరోజు(శనివారం) మీడియా సమావేశంలో డీఎస్పీ కిషోర్ కుమార్ మాట్టాడుతూ.. ‘అనుమతి లేని చోట సభ ఏర్పాటు చేయటం పై నిర్వాహకులపై కేసు నమోదు చేశాం. మంత్రి క్యాంప్ కార్యాలయం వద్ద రాళ్ల దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేశాం. మంత్రి క్యాంప్ కార్యాలయం పై దాడి చేసిన టీడిపీ కార్యకర్తలను వీడియో ఫుటేజ్ ద్వారా గుర్తించాం. నిన్నటి(శుక్రవారం) చంద్రబాబు సభలో గొడవ పై విచారణ జరువుతున్నాం. ముందుగా అనుమతి పొందిన స్థలంలో కాకుండా వేరే చోట సభ నిర్వహించడం పై కేసు నమోదు చేసాం. విచారణ తర్వాత ఎవరెవరిని కేసులో పెట్టాలో నిర్ణయిస్తాం. యర్రగొండ పాలెం ఘటనలో పోలీసుల వైఫల్యం లేదు.’ అని తెలిపారు. -
తప్పు చేసిన పోలీసులను బొక్కలో వేస్తాం
సాక్షి ప్రతినిధి, ఏలూరు/నూజివీడు/ హనుమాన్ జంక్షన్ రూరల్: ‘పోలీసులకు సంస్కారం నేనే నేర్పించా.. మీపై సైకో ఆఫీసర్ల పెత్తనం ఎక్కువగా ఉంది. కొంత మంది తప్పులు చేస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ప్రతి కేసునూ సమీక్షించి తప్పు చేసిన పోలీసులను బొక్కలో వేస్తాం’ అని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు హెచ్చరించారు. శుక్రవారం రాత్రి ‘ఇదేమి కర్మ – మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా నూజివీడులో రోడ్‌షో నిర్వహించి అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి అంతా తాను చేసిందేనని చెప్పుకొచ్చారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్ర గురించి మాట్లాడుతూ.. నోట్లో వేలు పెడితే కొరకడం కూడా చేతగాని అమాయకుడు కొల్లు రవీంద్ర అని అన్నారు. అలాంటి రవీంద్ర అత్యాచారం చేశాడంటా.. ఎవరినో చంపేశాడంట.. అని వ్యాఖ్యానించడంతో పక్కడే ఉన్న కొల్లు రవీంద్ర అవాక్కయ్యారు. ‘మనుషుల కంటే కుక్కలే చాలా తెలివైనవి. అందుకే నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలీస్ శాఖలో డాగ్ స్క్వాడ్‌ను తీసుకువచ్చాను. తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు నాయకత్వం ఇచ్చింది. డ్వాక్రాకు శ్రీకారం చుట్టి పొదుపు ఉద్యమం తెచ్చింది నేనే. ఆడబిడ్డలను కండక్టర్లుగా కూడా చేసిన ఘనత నాదే’ అని అన్నారు. రామోజీరావుకు చెందిన మార్గదర్శిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. 2004లో ముఖ్యమంత్రి ఆస్తి రూ.1.70 కోట్లు అయితే ఇప్పుడు రూ.510 కోట్లని, ఇదంతా షెల్ కంపెనీలు, హవాలా డబ్బుల ద్వారానే వచ్చిందన్నారు. గీతం యూనివర్సిటీపై కబ్జా కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం.. సీతారామపురానికి చెందిన దాదాపు 30 మంది టాటా ఏస్ వాహనంలో టీడీపీ జెండాలతో నూజివీడు సభకు వచ్చారు. జంక్షన్ రోడ్డులోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ పక్కనే ఉన్న పెట్రోలు బంకు వద్ద వారు ఒక్కసారిగా జెండాలను పైకి ఎత్తారు. జెండా పైపులకు పైన ఉన్న విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో సీతారామపురానికి చెందిన దుడ్డి సువార్త (60)కు తీవ్ర గాయాలయ్యాయి. మరో తొమ్మిది మంది స్వల్పంగా గాయపడ్డారు. చంద్రబాబు సభ అట్టర్ ఫ్లాప్ చంద్రబాబు నూజివీడు బహిరంగ సభ అట్టర్ ఫ్లాప్ అయింది. ఆయన వేదిక వద్దకు రాత్రి 8.50 గంటలకు వచ్చారు. అప్పటికే వచ్చిన వారిలో అత్యధికులు ఇంటిదారి పట్టారు. కొందరు కార్యకర్తలు ‘నెక్టŠస్ సీఎం జూనియర్ ఎన్టీఆర్’ అంటూ ఫ్లెక్సీని ప్రదర్శించారు. చంద్రబాబు గుడివాడ నుంచి నూజివీడు వచ్చే మార్గంలో తుక్కులూరు వద్ద వైఎస్సార్సీపీ నాయకులు బాబును ప్రశ్నిస్తూ ఫ్లెక్సీలు పెట్టారు. చంద్రబాబుకు గానీ, దత్తపుత్రుడికి గానీ 175 స్థానాల్లో ఒంటరిగా పోటీ చేసే ధైర్యముందా అని ప్రశ్నించారు. హనుమాన్ జంక్షన్ వద్ద కూడా బాబుకు చేదు అనుభవం ఎదురైంది. ‘అయ్యా చంద్రబాబూ.. మాకెందుకీ కర్మ.. మీకెందుకు ఘన స్వాగతం’ ‘బైబై బాబు’ అనే ఫ్లెక్సీలు కట్టారు. ఇలా అడుగడునా ఫెక్సీలు దర్శనమివ్వడంతో చంద్రబాబు నొచ్చుకున్నట్లు సమాచారం. కాగా, బాపులపాడు మండలం ఆరుగొలను వద్ద టీడీపీ నేతలు.. అంబేడ్కర్ జయంతి నిర్వహిస్తున్న దళితులపై దాడి చేశారు. -
కేసులకు భయపడితే పోరాటం చేయలేం
పటమట (విజయవాడ తూర్పు)/మచిలీపట్నం టౌన్: కేసులకు భయపడితే సీఎం వైఎస్ జగన్‌పై పోరాడలేమని, కేసులతో ఏం పీకుతారని టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నూరిపోశారు. ఉమ్మడి కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం ఆయన వివిధ ప్రాంతాల్లో మాట్లాడారు. అన్నిచోట్లా వైఎస్సార్ సీపీని దుర్భాషలాడటం, సీఎం వైఎస్ జగన్‌ను వ్యక్తిగతంగా విమర్శించటం పరుష పదజాలంతోనే సాగింది. 10 రూపాయలు ఇస్తూ.. 100 రూపాయలు లాక్కుంటున్న జగన్, వైసీపీ నేతల దుర్మార్గాలు, దోపిడీ, కబ్జాలు చూశాక కూడా వైఎస్సార్సీపీ జెండా పట్టుకుంటారా అంటూ దూషించారు. బిడ్డల భవిష్యత్ బాగుండాలంటే, జీవితాలు సంతోషంగా ఉండాలంటే తక్షణమే వైఎస్సార్సీపీ జెండాను కృష్ణా నదిలో పడేసి, టీడీపీ జెండా పట్టుకోండన్నారు. టీడీపీ కార్యాలయంపై దాడిచేసి.. విజయవాడలో గూండాయిజం, రౌడీయిజం చేస్తున్న వారి తోకలు కత్తిరిస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఈ మధ్య ఇంటింటికీ జగన్ స్టిక్కర్లు అతికిస్తున్నారని, ఇళ్ల గోడలపై రాయాలన్నా, ఎలాంటి కరపత్రాలు, బొమ్మలు అతికించాలన్నా ఇంటి యజమానుల అనుమతి తప్పనిసరి అన్నారు. ఎలాంటి అనుమతి తీసుకుని వలంటీర్లు జగన్ స్టిక్కర్లు ప్రజల ఇళ్ల గోడలపై అతికిస్తున్నారని ప్రశ్నించారు. పీక్కుంటూనే ఉండండి ‘ప్రశ్నించే వారిపై కేసులు పెట్టి వేధిస్తున్న సీఎం వైఎస్ జగన్ ఏం పీక్కుంటారు. నాపైన కూడా చాలా కేసులు పెట్టారు. ఇంకా పెడుతున్నారు. ఎన్ని కేసులు పెడితే పెట్టుకోమంటున్నా.. పీక్కుంటూనే ఉండమంటున్నా. నాకు సభ్యత ఉంది కాబట్టే హద్దులు మీరి వ్యక్తిగతంగా పోవడం లేదు’ అని చంద్రబాబు పేర్కొన్నారు. విజయవాడలో ఫ్యాక్షన్ రాజకీయాలు సాగనివ్వమని, రమేశ్ యాదవ్ టీడీపీలో చేరడం ద్వారా ఒక స్ఫూర్తి ఇచ్చాడని అన్నారు. వైఎస్సార్సీపీ వల్ల రాష్ట్రానికి నష్టమని, సమాజానికి చేటని ముందే పసిగట్టి తెలుగుదేశం జెండా కప్పుకున్నాడన్నారు. ఎమ్యెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలిస్తే, వైసీపీ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టామని నోటి కొచ్చినట్టు మాట్లాడారని చంద్రబాబు విమర్శించారు. జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలొద్దు మచిలీపట్నంలో రోడ్ షోకు వస్తున్న ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలతో నగరంలోని పలు ప్రాంతాలకు నుంచి అభిమానులు తరలివచ్చారు. రాత్రి 7.30 గంటల సమయంలో మూడు స్తంబాల సెంటర్ వద్ద డీజే పాటలకు జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలతో అభిమానులు రాగా, అక్కడే ఉన్న మాజీ మంత్రి కొల్లు రవీంద్ర జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటాలను ప్రదర్శించవద్దని అడ్డుకున్నారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్రపటాలను ప్రదర్శిస్తే తప్పేంటని యువకులు ప్రశ్నించినా.. లెక్క చేయకుండా లాక్కుని పక్కన పడేశారు. కొల్లు రవీంద్ర ఆదేశాలతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులందరినీ పార్టీ కార్యకర్తలు పక్కకు తోసుకువెళ్లారు. తమ అభిమాన నటుడు చిత్రపటాన్ని లాక్కోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన అభిమానులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
నన్నెవరూ ఆపలేరు.. ‘సత్యమేవ జయతే’ రోడ్డు షోలో రాహుల్..
తిరువనంతపురం: భయభ్రాంతులకు గురి చేసినా, ఎంపీ పదవి నుంచి తొలగించినా వయనాడ్ లోక్‌సభ స్థానం ప్రజలకు ప్రాతినిధ్యం వహించకుండా తననెవరూ అడ్డుకోలేరని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తేలి్చచెప్పారు. అనర్హత వేటు తర్వాత తొలిసారిగా కేరళలోని వయనాడ్ జిల్లాలో ఆయన మంగళవారం పర్యటించారు. కల్పెట్టాలో ‘సత్యమేవ జయతే’ పేరిట రోడ్డు షో నిర్వహించారు. తనను జైలులో పెట్టినప్పటికీ వయనాడ్ ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటానన్నారు. 'నాపైకి పోలీసులను పంపిస్తే, నా ఇంటిని లాక్కుంటే భయపడే ప్రసక్తే లేదు. అదానీ గురించి, ఆయనతో ప్రధాని మోదీకి సంబంధాల గురించి నా ప్రశ్నలను తట్టుకోలేకే లోక్‌సభ నుంచి పంపించారు' అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించినందుకు రాహుల్‌పై బీజేపీ ప్రభుత్వం క్రూరంగా మాటల దాడికి పాల్పడిందని ఆయన సోదరి ప్రియాంకాగాంధీ వాద్రా ఆరోపించారు. అబద్ధాలు చెప్పేవారికి, దు్రష్పచారం చేసేవారికి నిజాలు చేదుగానే ఉంటాయని ఎద్దేవా చేశారు. చదవండి: 300 పైగా సీట్లతో బీజేపీ గెలుపు.. మోదీనే మూడోసారి ప్రధాని: అమిత్ షా -
రోడ్లపై సభలు, రోడ్‌షోల నియంత్రణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
సాక్షి, అమరావతి: రోడ్లపై సభలు, రోడ్‌షోలను నియంత్రించడం, పౌరుల ప్రాథమిక హక్కులను కాపాడటం మధ్య ప్రభుత్వం సమతుల్యతతో వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. నెల్లూరు జిల్లా కందుకూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించిన రోడ్‌షోలో తొక్కిసలాట కారణంగా పలువురు మరణించిన నేపథ్యంలో.. రాజకీయ పార్టీలు నిర్వహించే సభలు, రోడ్‌షోలకు అనుమతివ్వకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ పాత్రికేయుడు కొట్టి బాలగంగాధర్ తిలక్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. రోడ్లు, రోడ్ మార్జిన్లలో సభలు, రోడ్‌షోలను నియంత్రిస్తూ జారీ చేసిన జీవో 1 విషయంలో ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో ఈ వ్యాజ్యంపై తదుపరి విచారణను ఫిబ్రవరి మొదటి వారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. తిలక్ ఇటీవల హైకోర్టులో దాఖలు చేసిన పిల్‌పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి వాదనలు వినిపిస్తూ.. కందుకూరులో మానవ తప్పిదం కారణంగా అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారన్నారు. నిర్వాహకులు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం, సన్నని వీధుల్లో రోడ్‌షోలు నిర్వహిస్తున్నా పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందన్నారు. చదవండి: (Fact Check: రామోజీ వలంటీర్లంటే వణుకేల?.. వాస్తవాలివిగో..) ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, రోడ్లపై జరిగే ప్రతి కార్యక్రమాన్ని నిషేధించాలని కోరలేరని తెలిపింది. సభలు, రోడ్‌షోలను నియంత్రించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1పై ఓ వ్యాజ్యం పెండింగ్‌లో ఉందని గుర్తు చేసింది. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపిస్తూ.. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయంలో భాగంగానే జీవో 1 జారీ చేసిందన్నారు. జీవో 1 అమలును నిలిపివేస్తూ హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశామన్నారు. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరపనుందని వివరించారు. -
ప్రధాని భద్రతలో వైఫల్యం.. మోదీ వద్దకు దూసుకొచ్చిన యువకుడు
బెంగళూరు: ప్రధానమంత్రి నరేంద్రమోదీ కర్ణాటక పర్యటనలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. జాతీయ యువజనోత్సవాలను ప్రారంభించేందుకు గురువారం సాయంత్రం హుబ్బళి చేరుకున్న మోదీ.. విమానాశ్రయం నుంచి జాతీయ యూత్ ఫెస్టివల్ జరిగే వేదిక వరకు రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కారు ఫుట్‌బోర్డుపై నిలబడి రోడ్డుకు ఇరువైపులా జనాలకు అభివాదం చేస్తూ వెళ్తున్నారు. ఇంతలో మోదీ కాన్వాయ్ వద్దకు ఓ యువకుడు ఆకస్మాత్తుగా దూసుకొచ్చాడు. జనాల మధ్య నుంచి పరుగుత్తుకొచ్చిన వ్యక్తి సెక్యూరిటీ బారికేడ్‌ను దాటుకొని ప్రధానికి పూలదండ వేసేందుకు ప్రయత్నించాడు. భద్రతా సిబ్బందిని తోసుకుంటూ రావడంతో స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్(ఎస్పీజీ) అప్రమత్తమైంది. మోదీకి అత్యంత సమీపానికి వచ్చిన యువకుడిని చివరి నిమిషంలో అడ్డుకొని వెనక్కి లాగేశారు. అనంతరం ప్రధాని యథావిధిగా రోడ్డు షో కొనసాగించారు. అయితే బాలుడి వద్ద నుంచి పూల దండను తీసుకొని తన కారు బానెట్‌పై ఉంచినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోల ద్వారా తెలుస్తోంది. మరోవైపు హుబ్బలిలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్‌షో సందర్భంగా ఎలాంటి భద్రతా ఉల్లంఘన జరగలేదని పోలీసులు తెలిపారు. కాగా ప్రధాని మోదీ గురువారం కర్ణాటకలో పర్యటిస్తున్నారు. హుబ్బళ్లిలోని రైల్వే స్పోర్ట్స్ గ్రౌండ్లో 26 వ జాతీయ యువజనోత్సవాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్, కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ జోషి, అనురాగ్ సింగ్ ఠాకూర్.. దాదాపు 30 వేల మంది యువతీ, యువకులు హాజరయ్యారు. జనవరి 12 స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా ఏటా నిర్వహించే ఈ ఉత్సవాలు అయిదు రోజులపాటు (జనవరి 16 వరకు) కొనసాగనున్నాయి. గతేడాది పుదుచ్చేరి జరగ్గా లకు తొలిసారి కర్ణాటక రాష్ట్రం ఆతిథ్యం ఇచ్చింది. చదవండి: PM Modi Mumbai Visit: ఈ నెల 19న ముంబైకి ప్రధాని రాక.. బీఎంసీ ఎన్నికల కోసమేనా? #WATCH | Karnataka: A young man breaches security cover of PM Modi to give him a garland, pulled away by security personnel, during his roadshow in Hubballi. (Source: DD) pic.twitter.com/NRK22vn23S — ANI (@ANI) January 12, 2023 -
ప్రజల పట్ల అందరూ బాధ్యతగా ఉండాల్సిందే: మంత్రి బొత్స
సాక్షి, అమరావతి: జీవో నంబర్ వన్‌పై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు ముందు దాన్ని క్షుణ్ణంగా చదువుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. పదేపదే విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలు అసలు ఆ జీవోను ఇప్పటిదాకా చదివాయా అంటూ ప్రశ్నించారు. అందులో రోడ్‌షోలు, ర్యాలీలు నిషేధమని ఎక్కడుందో చెప్పాలని కోరారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. రోడ్లపై బహిరంగ సభలు పెట్టొద్దని మాత్రమే చెప్పాం. అవసరమైతే అనుమతి తీసుకొని బహిరంగ సభలు పెట్టుకోవచ్చు. జోవో నంబర్ వన్ అన్ని పార్టీలకు వర్తిస్తుంది. వైఎస్సార్, జగన్ పాదయాత్రల్లో ఎంతో జాగ్రత్త తీసుకున్నాం. కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాం. ప్రజల పట్ల అందరూ బాధ్యతగా ఉండాలి అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. చదవండి: (20 కోట్ల ఆఫర్‌ని కాదన్నాడు.. రూ.100కోట్లు ఇచ్చినా కూడా..) -
KA Paul: పిల్ కాకుండా రిట్ ఏంటండి?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో రోడ్‌షోలు, బహిరంగ సభలపై నిషేధం విధించాలని కోరుతూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై హైకోర్టు రిజిస్ట్రీ అభ్యంతరం లేవనెత్తింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) రూపంలో కాకుండా రిట్ పిటిషన్ రూపంలో పిటిషన్ దాఖలు చేయడంపై అభ్యంతరం తెలిపింది. దీనిపై.. తగిన నిర్ణయం తీసుకునేందుకు ఈ వ్యాజ్యాన్ని న్యాయమూర్తి ముందుంచింది. రోస్టర్ ప్రకారం ఈ వ్యాజ్యం గురువారం న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్‌రావు వద్దకు వచ్చింది. ఇది ప్రజల విస్తృత ప్రయోజనాల కోసం కదా. అలాంటప్పుడు ఈ వ్యాజ్యాన్ని పిల్ రూపంలో దాఖలు చేయాలి కదా! అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అయినా పిటిషనర్ గతంలో తన క్లయింట్ అయినందువల్ల ఈ వ్యాజ్యాన్ని తాను విచారించలేనని స్పష్టం చేశారు. ఈ వ్యాజ్యం శుక్రవారం విచారణకు వచ్చేలా రిజిస్ట్రీకి ఆదేశాలివ్వాలని పాల్ న్యాయవాది ఎంవీ రాజారాం కోరగా.. ఆ పని తాను చేయలేనని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అత్యవసరం ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది చెబుతున్నారంటూ ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. -
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చంద్రబాబు
తాడికొండ: చంద్రబాబుకు మతిభ్రమించి రోడ్లపై సభలు పెడుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ధ్వజమెత్తారు. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు బుధవారం నాటికి 829వ రోజుకు చేరాయి. పలువురు మాట్లాడుతూ పేద ప్రజల మాన ప్రాణాలు పోతుంటే చంద్రబాబు ఇంకా రోడ్‌షోలు అంటూ రోడ్లపై సంచారం చేయడం సిగ్గుచేటని, ప్రజలను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని చూస్తున్న బాబును ప్రజలు నమ్మే పరిస్థితి ఎప్పటికీ ఉండదన్నారు. ప్రజల ప్రాణాలపై స్పందించని ప్యాకేజీ పార్టీలు, ఎల్లో మీడియాలో లేనిది ఉన్నట్లు ప్రచారం చేసేందుకు డిబేట్లలో గగ్గోలు పెడుతుండడం దేనికి నిదర్శనమో చెప్పాలని డిమాండ్ చేశారు. బహుజనుల హక్కుల కోసం 829 రోజులుగా ఆకలి దప్పులతో పోరాటం చేస్తుంటే కనీసం తొంగి చూడని ఎల్లో మీడియా, కులవాదులు, కులగజ్జి పార్టీలు, బాబు కోసం బారులు తీరడం వెనుక ఆంతర్యమేమిటో అందరికీ అర్థమవుతుందని తెలిపారు. నేడు రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల అభివృద్ధికి అన్ని విధాలా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాటుపడుతున్నారనడంలో సందేహం లేదన్నారు. నాయకులు మాదిగాని గురునాథం, పెరికే వరప్రసాద్, నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, పులి దాసు, ఈపూరి ఆదాం తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: రోడ్లపై సభలు వద్దంటే రభసా?